ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. మే 20న ఐదవ దశలో అమేథీ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే కాంగ్రెస్ ఇక్కడి అభ్యర్థి ఎవరనేది వెల్లడించకముందే స్థానికంగా వెలసిన పోస్టర్లు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తెలియజేస్తున్నాయి.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా.. అమేథీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేస్తూ పలు చోట్ల పోస్టర్లు వెలిశాయి. ‘అమేథీ ప్రజలు ఈసారి రాబర్ట్ వాద్రాను ఆహ్వానించాలి’ అని పోస్టర్‌పై రాశారు.
రాబర్ట్ వాద్రా అమేథీ నుంచి పోటీ చేయాలనే డిమాండ్ గత కొంతకాలంగా వినిపిస్తోంది. అమేథీ, గౌరీగంజ్‌లలోని కాంగ్రెస్ కార్యాలయాలు, హనుమాన్ తిరహా, రైల్వే స్టేషన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఈ తరహా పోస్టర్లను గోడలపై అతికించారు.
ఈ పోస్టర్ గురించి స్థానిక కాంగ్రెస్ నేత సోను సింగ్ రఘువంశీ మాట్లాడుతూ రాబర్ట్ వాద్రా ఈసారి అమేథీ నుండి ఎన్నికల్లో పోటీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రియాంక గాంధీ రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తారు. అందుకే రాబర్ట్ వాద్రా ఇక్కడి నుంచి పోటీచేయాలని స్థానిక కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment