Amethi
-
Uttar Pradesh: ట్రక్కును 100 మీటర్లు లాక్కుపోయిన గూడ్సు
అమేథి: ఉత్తరప్రదేశ్‌లోని అమేథి జిల్లాలో గూడ్స్ రైలు(Goods train), కంటైనర్ ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. లక్నో-వారణాసి రైలు విభాగంలో రైల్వే క్రాసింగ్ వద్ద కంటైనర్ ట్రక్కు, గూడ్స్ రైలు ఢీ కొన్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ సంఘటనలో ట్రక్కు డ్రైవర్ సోను చౌదరి(28) తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. జగదీష్పూర్(Jagdishpur) పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. రైల్వే గేట్ తెరిచివున్న సమయంలో ఒక ట్రక్కు గేటు దాటుతూ, ట్రాక్‌పై నిలిచిపోయింది. ఈ నేపధ్యంలో అటుగా వచ్చిన గూడ్సు రైలు కంటైనర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కంటైనర్‌ను గూడ్సు దాదాపు 100 మీటర్ల వరకు ఈడ్చుకుపోయింది. దీంతో కంటెయినర్ పూర్తిగా ధ్వంసమైందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.గాయపడిన డ్రైవర్ సోను చౌదరిని తొలుత జగదీష్పూర్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(Community Health Center)కు చికిత్స కోసం తీసుకువెళ్లామని, అయితే అతని పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో విద్యుత్ లైన్లతో పాటు రైల్వే ట్రాక్‌లకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. ట్రాక్‌లు, విద్యుత్ లైన్లను మరమ్మతు చేసిన తర్వాత, రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని లక్నో డివిజన్ రైల్వే మేనేజర్ సచీంద్ర మోహన్ శర్మ తెలిపారు.ఇది కూడా చదవండి: లాలూ, రబ్రీ, తేజ్ ప్రతాప్‌లకు ఈడీ సమన్లు -
20 ఏళ్లకే గ్రేడ్ వన్ అధికారిగా.. ఉత్కర్ష్ శుక్లా సక్సెస్ స్టోరీ
జీవితంపై కోటి ఆశలతో కలలుగనేవారు వాటిని సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమిస్తుంటారు. అలాంటివారే విజయాలను అందుకుంటారు. దీనిని పలువురు రుజువు చేశారు. ఆ కోవలోకే వస్తాడు యూపీలోని అమేథీకి చెందిన ఉత్కర్ష్ శుక్లా. ఒకనాడు తనకు చదువుకునే పరిస్థితి లేకపోయినా పట్టుదలతో అనుకున్నది సాధించి చూపాడు.యూపీలోని అమేథీలో గల రాజీవ్ గాంధీ పెట్రోలియం ఇనిస్టిట్యూట్‌లో ఉత్కర్ష్ శుక్లా బీటెక్ కోర్సు పూర్తి చేశాడు. చదువులో అత్యుత్తమ ప్రతిభ చూపినందుకు ఉత్కర్ష్ శుక్లా డిగ్రీతోపాటు రాష్ట్రపతి బంగారు పతకం కూడా అందుకున్నాడు. చిన్నప్పటి నుండి ఉత్కర్ష్‌కు చదువులో ఘన విజయం సాధించాలనే తపనతో ఉండేవాడు. ఉత్కర్ష్ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి.బీటెక్ పూర్తి చేసిన ఉత్కర్ష్ ప్రస్తుతం భారత్ పెట్రోలియం కార్పొరేట్ లిమిటెడ్‌లో గ్రేడ్ వన్ అధికారిగా ఎంపికయ్యారు. 20 ఏళ్ల వయసులో ఉత్కర్ష్ ఇంతటి గొప్ప విజయాన్ని సాధించాడు. ఉత్కర్ష్ మీడియాతో మాట్లాడుతూ తాను సాధించిన విజయం తనకు ఎంతో ఆనందమిస్తున్నదని చెబుతూ, తాను గతంలో ఎదుర్కొన్న అనుభవాలను తెలిపాడు. కరోనా సమయంలో పుస్తకాలు దొరక్క చదువుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని, పోటీ పరీక్షల ప్రపరేషన్కు అనేక ఆటంకాలు ఎదురయ్యాయని తెలిపాడు. అయితే పట్టువదలక పోటీ పరీక్షల్లో ఘన విజయం సాధించానని అన్నాడు. ఇది కూడా చదవండి: ఎంఏ చాయ్‌వాలా.. ఏటా లక్షల సంపాదన -
పెళ్లి కొడుక్కి ‘సినిమా చూపించిన మావా!’
మరికొద్ది గంటల్లో అక్కడ వివాహ మహోత్సవం జరగాల్సి ఉంది. పెళ్లి బాజాలతో అక్కడంతా కోలాహలం నెలకొంటుందని అనుకునేరు. బదులుగా.. పెండ్లి కొడుకు వీపు విమానం మోత మోగింది. అయితే.. అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు.. ఆ దాడిని ఆపారు. తన్నులు తిన్న ఆ యువకుడికి కడుపు నిండా కమ్మటి భోజనం పెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ కథనం చదివి తెలుసుకోండి..సోహన్‌లాల్ యాదవ్‌కు మరో మూడు రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. అయితే సడన్‌గా అతను కనిపించకుండా పోయాడు. దీంతో అతని కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. మిస్సింగ్ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈలోపు.. ఇదేం తెలియని పెళ్లి కూతురు తరఫువాళ్లు తమ ఏర్పాట్లు చేసుకుంటూ పోతున్నారు. పెండ్లి టైం దగ్గర పడడంతో బాజాభజంత్రీలతో స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. కానీ, అక్కడి నుంచి సీన్ పీఎస్‌కు మారింది.పెళ్లి కొడుకు తరఫు వాళ్లు రాకపోవడంతో.. పెళ్లి కూతురు వాళ్లంతా దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసుల జోక్యంతో.. అబ్బాయి తరఫు వాళ్లంతా వచ్చారు. చివరకు ఆ అమ్మాయితో వివాహానికి అబ్బాయి ఒప్పుకున్నాడు. అయితే.. అదేరోజు మరో ముహూర్తానికి వివాహం జరగాల్సి ఉంది. కానీ, ఇంతలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మూడు రోజులపాటు కనిపించకుండా పోయిన ఆ యువకుడు.. మరో ఊరిలో ఇంకో అమ్మాయితో కలిసి ఉన్నాడని అమ్మాయి తరఫు వాళ్లకు తెలిసింది. దీంతో ఆగ్రహంతో గ్రామస్తులంతా అతన్ని చితకబాదారు. ఈలోపు అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు ఆ దాడిని ఆపారు. ఆ యువకుడికి భోజనం పెట్టి మరీ పెళ్లి క్యాన్సిల్ చేసుకందామని చెప్పారు. అయితే.. ఇక్కడే ఆ యువకుడికి ఊహించని షాక్ తగిలింది.పెళ్లి కోసం తాము ఎంతో ఖర్చు చేశామని, ఆ డబ్బంతా ఇచ్చి కదలమని కండిషన్ పెట్టారు. దీంతో ఖంగుతినడం అతని వంతు అయ్యింది. ‘‘మేం ఇక్కడికి ఆలస్యంగా వచ్చాం. ఆ మాత్రం దానికే పెండ్లి రద్దు చేసుకున్నారు. పైగా పరిహారం ఇవ్వమని అడుగుతున్నారు. అది ఇచ్చేదాకా నన్ను కదలనివ్వమంటున్నారు. అంతా చెప్తున్నట్లు నేనేం అదృశ్యం కాలేదు. పని మీద ఊరెళ్లా. నా ఫోన్ పని చేయకుండా పోయింది. బాగు చేసుకునేసరికి పోలీసులు రమ్మని పిలిచారు. పెళ్లికి నేను రెడీ, కానీ వాళ్లు సిద్ధంగా లేరు’’ అని పారిపోయే ప్రయత్నం చేసిన పెళ్లి కొడుకు మొబైల్ వీడియో సందేశం ఒకటి వైరల్ అయ్యింది. ఇక అమ్మాయి తండ్రి మాట్లాడుతూ.. 10 నెలల కిందట నా కూతురికి వివాహం నిశ్చయించా. పెండ్లి కొడుకుగా చేశాక.. అతను నాకు కారు కావాలనే డిమాండ్ చేశాడు. ఇవ్వడానికి మేం సిద్ధంగానే ఉన్నాం. ఆపై కారు వద్దు.. క్యాష్ కావాలన్నాడు. దానికీ మేం ఒప్పుకున్నాం. ఆ తర్వాతే అన్ని ఏర్పాట్లు చేశాం. పెండ్లి రోజు బంధువులంతా వచ్చినా.. పెండ్లి కొడుకు రాలేదు. చివరకు.. మా దగ్గరి బంధువును అక్కడికి పంపిస్తే అతను ఊర్లోనే లేడని సమాచారం ఇచ్చాడు. అందుకే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాం. తీరా అక్కడికి వెళ్లే సరికి పీఎస్‌లో ఆ యువకుడు కూడా ఉన్నాడు. వరకట్నం కేసు పెడతామని వాళ్లు హెచ్చరించారు. అందుకే పెళ్లికి ఒప్పుకున్నాడు. కానీ, మాకీ పెళ్లి ఇష్టం లేదు. అతను చేసిన మోసం ఇప్పుడే బయటపడింది. ఒకవేళ పెండ్లి తర్వాత బయటపడి ఉంటే నా కూతురి జీవితం నాశనం అయ్యేది. అందుకే పరిహారం చెల్లించమని కూర్చున్నాం. ఉత్తర ప్రదేశ్ అమేథీ పోలీసులు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. अमेठी : दूल्हे राजा के इंतजार में दुल्हन के हाथों की मेहंदी हो गई फीकीकाफी इंतजार के बाद पुलिस के हस्तक्षेप पर सुबह पहुंची बारातसुबह बारात पहुंचने पर दुल्हन के घरवालों ने दूल्हे को बनाया बंधकशादी में हुए खर्च को लेकर अड़े दुल्हन के घर वाले@amethipolice @Uppolice #Amethi pic.twitter.com/VxYSFPcSUQ— Tasleem choudhary (JOURNALIST) (@tasleem7573) December 3, 2024 -
అమేథీ హత్యలు.. ఆమె వివాహేతర సంబంధమే కొంప ముంచింది!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అమేథీలో కుటుంబమంతా తుపాకీ కాల్పుల్లో మరణించడం తీవ్ర కలకలం రేపింది. ఒకే కుటుంబంలో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలను ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశాడు. మృతులను టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సునీల్ కుమార్, ఆయన భార్య పూనమ్ భారతి, ఆరేళ్లు-ఏడాది వయసున్న ఇద్దరు కూతుర్లుగా గుర్తించారు. ఈ ఘటన గురువారం వెలుగుచూడగా.. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు నిందితుడు చందన్ వర్మను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడి విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.నిందితుడు విచారణలో చేసిన నేరాన్ని అంగీకరించినట్లు అమేథీ ఎస్పీ అనూప్ సింగ్ వెల్లడించారు. ఈ హత్యల వెనక వివాహేతర సంబంధమే కారణమని తేలిందన్నారు. నిందితుడికి, మహిళకు గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు తెలిపారు. ఒకటిన్నర సంవత్సరంగా పూనమ్‌తో అక్రమంగా సంబంధం కలిగి ఉన్నాడని అయితే ఇటీవల ఇద్దరి మధ్య రిలేషన్షిప్ దెబ్బతినడంతో అతడు ఒత్తిడికి గురైనట్లు తెలిపారు. ఆ కారణంగానే ఆవేశంలో.. ఇంట్లోకి చొరబడి నలుగురిని కాల్చిచంపినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. అతడు ఒక్కడే ఈ ఘోరాలకు పాల్పడ్డాడని, ఘటనాస్థలంలో లభించిన బుల్లెట్లన్నీ ఒకే పిస్టల్ నుంచి రావడం వల్లే తాము ఆ అంచనాకు వచ్చినట్లు తెలిపారు. కాగా సునీల్ కుమార్, అతని భార్య పూనమ్, వారి ఇద్దరు కుమార్తెలు గురువారం అమేథీలోని భవానీ నగర్‌లోని వారి ఇంటిలో కాల్పుల్లో హత్యకు గురయ్యారు. నిందితుడు చందన్ వర్మ తుపాకీతో 10 రౌండ్ల కాల్పులు జరిపాడు. కుటుంబంలోని అందరినీ చంపిన తర్వాత తనను తాను కాల్చుకోవాలని ప్రయత్నించాడు. కానీ బుల్లెట్ మిస్ అయింది. మళ్లీ కాల్చుకునే ధైర్యం చేయలేక అక్కడి నుంచి పారిపోయాడు. ఇక తీవ్రగాయాలైన బాధితులను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.ఈ ఘటన జరిగిన మరుసటి రోజు ఢిల్లీకి పారిపోతున్న నిందితుడిని నోయిడాలోని టోల్ ప్లాజా వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ పోలీస్ అధికారి తుపాకీని లాక్కొని తప్పించుకునే ప్రయత్నంలో అతను కాల్పుల్లో గాయపడ్డాడు. తాజాగా ఆ ఘటన సమయంలో వాడిన ద్విచక్ర వాహనం, పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు.అయితే ఈ హత్యల నేపథ్యంలో కొన్ని నెలల క్రితం పూనమ్ పెట్టిన పోలీసు కేసు విషయం వెలుగులోకి వచ్చింది. వర్మ తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆమె అందులో ఫిర్యాదు చేశారు. దీని గురించి ఫిర్యాదు చేస్తే.. చంపేస్తానని బెదిరించాడని, తమ కుటుంబానికి ఏదైనా హాని తలపెడితే అందుకు అతడే కారణమని పేర్కొంది. అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. -
లండన్‌కు స్మృతి ఇరానీ.. ‘మోదీ 3.0’ విజయోత్సవాలకు హాజరు
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. వారిలో స్మృతి ఇరానీ ఒకరు. ఓటమి తర్వాత ఆమె చాలా అరుదుగా బహిరంగంగా కనిపించారు. ఈ నేపధ్యంలో స్మృతి ఇరానీ ప్రస్తుతం ఎక్కడున్నారని చాలామంది ప్రశ్నిస్తున్నారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం బీజేపీ సీనియర్ నేత స్మృతి ఇరానీ ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్నారు. అక్కడ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ‘మోడీ 3.0’ విజయోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్మృతీ ఇరానీ లండన్ చేరుకున్నారు. అక్కడి అభిమానులు ఆమెకు ఘస స్వాగతం పలికారు. ఈ సమయంలో పలు దేశభక్తి నినాదాలు చేశారు.స్మృతి ఇరానీ సభలో మాట్లాడుతూ తనకు ఇక్కడ బెంగాలీ, గుజరాతీ స్నేహితులు ఉన్నారని తెలిపారు. తరువాత మలయాళంలో మాట్లాడుతూ కేరళకు చెందినవారిని పలుకరించారు. అలాగే మహారాష్ట్ర ప్రజలను మరాఠీలో పలకరించారు. ఈ సమయంలో అక్కడున్న వారిలో కొందరు జై మహారాష్ట్ర, జై శివాజీ మహారాజ్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం స్మృతి మాట్లాడుతూ భారతదేశం విభిన్న భాషలు, సంస్కృతుల మిళితం అని, తాను భారతీయురాలిని అయినందుకు గర్వపడుతున్నానని అన్నారు. #WATCH लंदन, ब्रिटेन: भाजपा नेता स्मृति ईरानी ने कहा, "...विभिन्न आवाजों और संस्कृतियों के इस सम्मिश्रण के बावजूद, एक आवाज ही आवाज गूंज रही है, 'मैं भारतीय हूं'..." https://t.co/U6IBYD822w pic.twitter.com/P9ZCATcHJx— ANI_HindiNews (@AHindinews) June 23, 2024 -
కిశోరీ భయ్యా మీరు గెలుస్తారని తెలుసు: ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ.. రెండు నియోజర్గాలో పార్టీ విజయ ఢంకా మోగించింది. రాయ్‌బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మూడున్నర లక్షల మేజార్టీతో గెలుపొందారు. ఇటు అమేథీలోనూ కాంగ్రెస్ అభ్యర్థి కిషోరి లాల్ శర్మ ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించిన కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఈసారి బొల్తా కొట్టారు. దాదాపు 1.50 లక్షల ఓట్ల తేడాతో కిషోర్ లాల్ శర్మ చేతిలో చిత్తుగా ఓడారు. దీంతో కాంగ్రెస్ కంచుకోట అయిన అమేథీని తిరిగి చేజిక్కించుకుంది.కిషోరీ లాల్ గెలుపుతో తరఫున విస్తృత ప్రచారం సాగించిన కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. పార్టీ గెలుపుపై ఆనందం వ్యక్తం చేశారు. ఆమె సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టారు. ‘కిశోరీ లాల్ భయ్యా మీరు గెలుస్తారని నాకు తెలుసు. మీ గెలుపు విషయంలో నేనెప్పుడూ సందేహించలేదు. మీకు, అమేథీ నియోజకవర్గంలోని నా ప్రియమైన సోదర, సోదరీమణులకు అభినందనలు’ అని రాసుకొచ్చారు.किशोरी भैया, मुझे कभी कोई शक नहीं था, मुझे शुरू से यक़ीन था कि आप जीतोगे। आपको और अमेठी के मेरे प्यारे भाइयों और बहनों को हार्दिक बधाई ! pic.twitter.com/JzH5Gr3z30— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 4, 2024 -
ఓటమి దిశగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
కాంగ్రెస్ కంచుకోట అమేథీ నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. 2024 ఎన్నికల్లో ప్రతిష్టాత్మక పోరుగా భావిస్తున్న అమేధీ నుంచి ఆమె వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమిదిశగా పయనిస్తున్నారు.. కి కాంగ్రెస్ అభ్యర్థి, గాంధీ కుటుంబ విధేయుడు కేఎల్ శర్మ 28వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నువ్వే నేనా అన్నట్టుగా సాగుతున్న ఈ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో ఉత్కంఠగా మారింది.శర్మకు గత 40 సంవత్సరాలుగా అమేథీతో అనుబంధం ఉంది. అమేథీలో ప్రియాంక గాంధీ వాద్రా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అమేథీకి మూడు పర్యాయాలు ఎంపీగా గెలిచిన రాహుల్ 2019లో ఇరానీ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అటు దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి ఫలితాలు ఆశాజనకంగా లేవు. ఇండియా కూటమి దాదాపు226పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు 2019లో భారీ మెజార్జీసాధించిన బీజేపీ గతంతో పోలిస్తే 61 సీట్లతో నష్టంతో కేవలం 291 సీట్లలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారం పీఠం ఎవరికి దక్కనుంది అనేదానిపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమేథీ చరిత్ర ఇదీ1980లో సంజయ్ గాంధీ విజయంతో వారసత్వం ప్రారంభమైంది. అతని ఆకస్మిక మరణం తరువాత, అతని సోదరుడు రాజీవ్ గాంధీ 1981 ఉప ఎన్నికలలో విజయం సాధించారు మరియు 1984, 1989 , 1991లో విజయం సాధించారు. రాజీవ్ హత్య తర్వాత, కుటుంబ విధేయుడైన సతీష్ శర్మ 1991 ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 1999లో సోనియాగాంధీ, 2004, 2009, 2014లో రాహుల్‌గాంధీ అమేథీ ఎంపీ స్థానాన్ని గెలుచుకున్నారు. -
రాయ్‌బరేలీలో పోటీ చేయకపోడంపై ప్రియాంక తొలి స్పందన
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలు కాంగ్రెస్‌కు ఎంతో కీలకం. గాంధీ కుటుంబానికి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ స్థానాల్లో గెలుపు ప్రస్తుతం ఆ పార్టీకి అత్యంత అవసరం. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తుండగా.. అమేథీ నుంచి పార్టీకి విధేయుడు కిషోరిలాల్ శర్మ బరిలో నిలిచారు. లోక్‌సభ అయిదో విడతలో భాగంగా ఈ రెండు స్థానాలతోపాటు యూపీలో 14 సీట్లకు మే 20న పోలింగ్ జరగనుంది.కాంగ్రెస్ కంచుకోటగా పేరొందిన రాయ్‌బరేలీలో సోనియా గాంధీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే ఇటీవల ఆమె రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆమె తనయురాలు ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ ఆమె పోటీ నుంచి తప్పుకొని అందరినీ షాక్‌కు గురిచేశారు. ప్రస్తుతం ప్రియాంక ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలను తన భూజాన వేసుకున్నారు. గత ఎన్నికల్లో కోల్పోయిన అమేథీని తిరిగి దక్కించుకోవడం.. సోదరుడు పోటీ చేస్తున్న రాయ్‌బరేలీలో మరోసారి విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు.తాజాగా లోక్‌సభలో పోటీ చేయడకపోవడంపై ప్రియాంక గాంధీ స్పందించారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తరపున దేశ వ్యాప్తంగా ప్రచారంపై దృష్టి సారించేందుకే తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పేర్కొన్నారు. తాను, రాహుల్ ఈ ఎన్నికల్ల పోటీ చేస్తే.. ఈ అంశాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంటుందని చెప్పారు.‘నేను గత 15 రోజులుగా రాయ్‌బరేలిలో ప్రచారం చేస్తున్నాను. గాంధీ కుటుంబానికి రాయబరేలీతో విడదీయరాని బంధం ఉంది. కాబట్టి, మేము ఇక్కడికి వచ్చి వారిని కలిసి వారితో సంభాషిస్తారని ప్రజలు భావిస్తున్నారు. రిమోట్ కంట్రోల్ ద్వారా ఇక్కడ ఎన్నికలను గెలవలేం’ అని అన్నారు.తోబుట్టువులిద్దరూ(రాహుల్, ప్రియాంక) ఎన్నికల్లో పోటీ చేస్తే.. కనీసం 15 రోజులు తమ నియోజకవర్గాల్లోనే ఉండాల్సి వచ్చేదని అన్నారు. ఆ సమయంలో దేశమంతా ప్రచారం చేయడం కూదరదని తెలిపారు. అయితే భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగిన ప్రశ్నకు ప్రియాంక సమాధానం దాటవేశారు.పార్లమెంట్ సభ్యురాలు కావాలని, ఎన్నికల్లో పోటీ చేయాలనీ తానెప్పుడూ అనుకోలేదని అన్నారు. ఏ బాధ్యతలు అప్పజెప్పిన పార్టీ కోసం నిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. నేను ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రజలు భావిస్తే పోటీ చేస్తానని తెలిపారు.ఓడిపోతామనే భయంతో ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదిన్న బీజేపీ ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. బీజేపీ వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ నడవడం లేదని ఆమె అన్నారు. తాను, సోదరుడు పోటీ చేస్తే అది బీజేపీకి లాభదాయకంగా మారుతుందని, ప్రచారానికి ఎవరూ అందుబాటులో ఉండరని తెలిపారు. అదే విధంగా అమేథీ నుంచి రాహుల్ ఓటమి భయంతో పారిపోయారంటూ ప్రధాని మోదీ సహా బీజేపీ చేస్తున్న ప్రచారంపై ప్రియాంక మండిపడ్డారు. ‘కాంగ్రెస్ పార్టీ అమేథీ, రాయ్‌బరేలీలను ఎప్పటికీ వదిలిపెట్టదు. కాంగ్రెస్‌కు, ఈ రెండు నియోజకవర్గాల మధ్య అపూ ర్వ బంధం ఉంది. గుజరాత్‌లోని వడోదర ఎన్నికల్లో ప్రధాని మోదీ ఎందుకు పోటీ చేయడం లేదు? ప్రధాని భయపడుతున్నారా? 2014 తర్వాత వడోదర ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? గుజరాత్ నుంచి పారిపోయారా?’ అని ప్రియాంక ప్రశ్నించారు. -
అమేథీలో బీజేపీకి ఎదురుగాలి?
యూపీలోని అమేథీలో బీజేపీ మహిళానేత స్మృతి ఇరానీపై వివిధ వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయా? అంటే అవుననే సమాధానమే విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. అమేథీలో స్మృతి ఇరానీకి వ్యతిరేకంగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు ఇటీవల పలు చోట్ల ఆందోళనలు చేపట్టారు. ఈసారి బీజేపీకి ఓటేయబోమని ప్రతిజ్ఞ కూడా చేశారు. ఇంతకీ వీరు స్మృతీ ఇరానీపై ఎందుకు ఆగ్రహంతో ఉన్నారు?కొంతకాలం క్రితం కాంగ్రెస్ నేత దీపక్ సింగ్‌పై అక్రమంగా కేసు పెట్టడంపై వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బీజేపీలో తమ సామాజికవర్గానికి ప్రాధాన్యత తగ్గుతున్నదని వారు వాపోతున్నారు. మహిళలను గౌరవించని ఏ పార్టీనైనా వ్యతిరేకిస్తామని కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు మహిపాల్ సింగ్ పేర్కొన్నారు. దీనికి ఉదాహరణగా ఆయన మహాభారత కాలంలో ద్రౌపది అపహరణను ఉదహరిస్తూ.. ద్రౌపదిని అవమానించనప్పుడు కొంతమంది మౌనంగా కూర్చున్నారని, వారంతా ఆ తరువాత బాధ పడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈసారి దేశవ్యాప్తంగా రాజ్‌పుత్ సమాజానికి చెందినవారెవరూ బీజేపీకి ఓటు వేయరని తెలిపారు.స్మృతి ఇరానీని ఉద్దేశించి మహిపాల్ సింగ్ మాట్లాడుతూ మహిళా ఎంపీగా ఆమె మహిళల గౌరవం గురించి ఎప్పుడూ మాట్లాడలేదని, ఆమె పార్లమెంట్లో మహిళల సమస్యలను లేవనెత్తలేదని, అలాంటప్పుడు మహిళల గౌరవం కోసం పోరాడుతున్నామని చెప్పే హక్కు ఆమెకు లేదన్నారు. యోగి ఆదిత్యనాథ్‌ను కట్టడి చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, వసుంధర రాజేను తొలగించారని, మధ్యప్రదేశ్ సీఎం పదవి నుంచి శివరాజ్సింగ్ను కూడా తొలగించారని, హర్యానాలో మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కూడా తొలగించారని, రమణ్‌సింగ్ పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందేనని అన్నారు.బీజేపీలో క్షత్రియ సామాజికవర్గం స్థాయి తగ్గుతోందని, బీజేపీకి మంచి చేసిన రాజ్‌నాథ్‌సింగ్‌ను ఆ పార్టీ పక్కన పెట్టిందని అన్నారు. బీజేపీలో క్షత్రియ సామాజికవర్గం స్థాయి తగ్గుతోందనడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయని అన్నారు. అందుకే కర్ణిసేన సామాజిక వర్గం వారంతా బీజేపీని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. -
Kishori Lal Sharma: ఆమె నాకు పోటీయే కాదు!
కిశోరీ లాల్ శర్మ.. అమేథీలో కాంగ్రెస్ తురుపు ముక్క. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఊహించని ప్రత్యరి్థ. రాజీవ్‌గాంధీ నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్‌కు నమ్మిన బంటు ఈ 63 ఏళ్ల కేఎల్ శర్మ. ఇన్నాళ్లు తెరవెనుక చక్రం తిప్పిన శర్మ ఇప్పుడు నేరుగా బరిలోకి దిగి బీజేపీతో అమీతుమీ తేల్చుకోనున్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన బలం. గాం«దీలతో మైత్రి సహా.. పలు అంశాలపై ఆయన పంచుకున్న ముచ్చట్లివి.. ఇన్నాళ్లు తెర వెనుక ఉన్నారు. ఇప్పుడు తెరమీదకు వచ్చారు. ఈ మార్పు ఎలా ఉంది? ఎన్నికలకు సంబంధించి పెద్దగా మార్పు లేదు. నేనెప్పుడూ ఒంటరిగా ఏమీ చేయలేదు. 25–30 ఏళ్లుగా నాతో కలిసి పనిచేస్తున్నవారున్నారు. కాలం మారింది.. కొత్తగా చేయాలి. టీమ్ అదే.. పని తీరే మారింది. ఐదేళ్ల కిందట రాహుల్ ఓడిపోయిన చోట నుంచి పోటీని ఎలా చూస్తున్నారు? గతంలో పొరపాట్లు జరిగాయి. దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు? ఎలా? అన్న అంతర్మథనం జరిగింది. రెండు విషయాలు బలంగా పనిచేశాయి. బీజేపీ ప్రభుత్వం నుంచి ఎదురైన ఒత్తిడితోపాటు మా వైపు నుంచి కూడా లోపాలు జరిగాయి. ఆ ఎన్నికల్లో దిశా నిర్దేశం చేసే నాథుడు లేరని కార్యకర్తలు వాపోయారు. బీజేపీ గెలిచింది 55,000 ఓట్ల తేడాతోనే. అది పెద్ద నంబర్ కాదు. ఓటమికి కారణమైన వారినే అభ్యరి్థగా నిలబెట్టారని బీజేపీ ఆరోపణ కదా! 2019 ఎన్నికల్లో నేను అమేథీలో లేను. రాయ్‌బరేలీలో పోలింగ్, ఎన్నికల నిర్వహణ చూస్తున్నాను. ఇప్పుడు నేను, నా ప్రత్యేక బృందం ఇక్కడ పనిచేస్తోంది. తేడా అదే! ‘గాంధీ కుటుంబ చప్రాసి’ వ్యాఖ్యలను ఎలా ఎదుర్కొంటారు? నేనెవరినో అమేథీ, రాయ్‌బరేలీ ప్రజలందరికీ తెలుసు. 1980లో యువజన కాంగ్రెస్ కార్యకర్తగా నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1983లో రాజీవ్ గాంధీ జీ 20 ప్రోగ్రామ్‌ను పర్యవేక్షించడానికి కొంతమంది యువ నాయకులను ఎంపిక చేశారు. వారిలో నేను ఒకడిని. ఒకటిన్నర బ్లాకులు చూసుకోవాల్సిన బాధ్యత నాకు అప్పచెప్పారు. ‘అమేథీ మే దిల్ లగ్ గయా’ (అమేథీ మీద మనసు పారేసుకున్నా). ఇక్కడే ఉండిపోయాను. కొందరు నన్ను సోనియాగాం«దీకి పీఏ అంటారు. ఎవరేమనుకున్నా.. నేను ప్రజాప్రతినిధిని. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిని. స్టార్ క్యాంపెయినర్ని. 2013లో ఏఐసీసీ కార్యదర్శిగా, సీపీ జోషితో కలిసి బిహార్‌కు కో–ఇన్చార్జ్గా ఉన్నాను. బిహార్‌లో కూటమి ఏర్పాటు చేసినప్పుడు 27 స్థానాల్లో విజయం సాధించాం. ఏం తెలియకుండా మాట్లాడేవారికి నేనేం చెప్పగలను? మీ కుటుంబం? భార్య. ఇద్దరు కూతుళ్లు. ఒకరు ఎంబీఏ చేసి మార్కెటింగ్‌లో ఉద్యోగం చేస్తున్నారు. రెండో కూతురు వ్యాపారవేత్త. మీ పోటీతో పారీ్టలో అంతర్గత విభేదాలు పెరిగాయని భావిస్తున్నారా? పారీ్టలో అంతర్గత పోరు ఉంది. కానీ నా విషయానికి వస్తే అది లెక్కలోకి రాదు. నేను వాళ్ళ అన్నయ్య లాంటివాడిని. తిట్టగలను, ప్రేమగా మాట్లాడగలను. వాళ్లూ నాతో అలాగే ఉంటారు. పోటీకి గ్రూపులు మంచివే. కానీ పార్టీని దెబ్బతీసే గ్రూపులు ఉండొద్దని చెబుతుంటా. ఎన్నికల్లో పోటీ చేయమని మిమ్మల్ని ఎవరు అడిగారు? అమేథీలోని ఇతర కార్యకర్తలు కోరుకున్నట్లే నేను కూడా రాహుల్జీ పోటీ చేయాలని కోరుకున్నా. కానీ నామినేషన్లకు ముందు ప్రియాంక ‘కిషోరీ జీ మా కుటుంబం కోసం మీరు ఎన్నో ఎన్నికల్లో పోరాడారు. ఈ ఎన్నికల్లో మేం మీకోసం పోరాడాలనుకుంటున్నాం’ అని చెప్పారు. నేను అంగీకరించాను. మీ ప్రచారానికి చాలా తక్కువ సమయం ఉంది! స్మృతి ఇరానీ ఎంత ప్రచారమైనా చేసుకోనీ. ఆమె అసలు నాకు పోటీయే కాదు. కష్టపడి పని చేయడమే నాకు తెలుసు. ఇక నిర్ణయం ప్రజలది. స్మృతి ఇరానీ చేస్తున్న ఆరోపణల విషయానికొస్తే, ఆమెను కించపరిచేలా నేనెప్పుడూ మాట్లాడలేదు. నాపై నోరు పారేసుకోవడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘అమేథీలో నా ప్రత్యర్థి ప్రియాంకానే’
లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో తన ప్రత్యర్థి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా అని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. తనకు చిన్న పిల్లల వలే రాజకీయాలు చేయటం ఇష్టం లేదని తెలిపారు. స్మృతి ఇరానీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంకా గాంధీపై విమర్శలు చేశారు.‘ఈ ఎన్నికల్లో అమేథీలో నా ప్రత్యర్థి.. ప్రియాంకా గాంధీ వాద్రా. నాపై ఆమె తెర వెనక నుంచి పోరాటం చేస్తున్నారు. కనీసం ఆమె సోదరుడు రాహుల్ గాంధీ నయం. ఆయన ప్రత్యక్షంగా పోటీలో ఉన్నారు. 2014లో రాహుల్ 1.07 లక్షల మెజార్టీతో గెలుపొందారు’ అని ప్రియాంకా గాంధీని ఎద్దేవా చేశారు.ఇక.. కాంగ్రెస్ పార్టీ అమేథీ పార్లమెంట్ స్థానంలో గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిషోరి లాల్ శర్మను బరిలో నిలిపిన విషయం తెలిసిందే. అదేవిధంగా కాంగ్రెస్ కంచుకోట స్థానమైన రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ కేరళలోని వాయ్‌నాడ్‌లో సైతం పోటీ చేసిన విషయం తెలిసిందే.ఇక.. అమేథీ, రాయ్ బరేలీ స్థానాలు ప్రియాంకా గాంధీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ రెండు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఆమె కృషి చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలో అన్ని తానై నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రచారంలో దుసూకువెళ్తున్నారు.అమేథీ, రాయ్‌బరేలీ సెగ్మెంట్లలో ఐదో విడత మే 20న పోలింగ్ జరగనుంది. ఇక.. గతంలో రాయ్‌బరేలీలో సోనియా గాంధీ చేతీలో ఓడిపోయిన దినేష్ ప్రతాప్ సింగ్‌ను మళ్లీ బీజేపీ బరిలోకి దించింది. -
అమేథీలో గెలుపెవరిది..?
-
Amethi: స్మృతి వర్సెస్ కిశోరీ
అమేథీ. ఉత్తరప్రదేశ్‌లోని ఈ లోక్‌సభ స్థానం గాంధీ కుటుంబానికి పెట్టని కోట.. కాంగ్రెస్‌కు కంచుకోట. అలాంటి దీర్ఘకాల రాజకీయ వారసత్వానికి 2019లో బీజేపీ గట్టి షాకే ఇచి్చంది. ఏకంగా గాంధీ కుటుంబ వారసుడు రాహుల్‌గాంధీనే ఓడించి కాంగ్రెస్ కుంభస్థలం మీద కొట్టింది. పార్టీ తరఫున నెగ్గి జెయింట్ కిల్లర్‌గా అవతరించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈసారి కూడా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రాహుల్‌కు బదులు గాంధీ కుటుంబ విధేయుడు కిశోరీలాల్ శర్మ బరిలోకి దిగారు. ఓటమి భయంతోనే అమేథీని వదిలి రాయ్‌బరేలీకి మారారంటూ సోషల్ మీడియాలో రాహుల్ ఒక రేంజ్లో ట్రోలింగ్‌కు గురయ్యారు. ఈ నెల 20న ఐదో విడతలో పోలింగ్ జరగనున్న అమేథీపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.గాందీల అనుబంధం అమేథీ లోక్‌సభ నియోజకవర్గం 1967లో ఏర్పడింది. నాటినుంచీ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. 1977 ఎన్నికల్లో మాత్రం ఎమర్జెన్సీ ప్రభావంతో జనతా పారీ్టకి చెందిన రవీంద్ర ప్రతాప్ సింగ్ గెలుపొందారు. ఇందిరాగాంధీ రెండో కుమారుడు సంజయ్ గాం«దీని 75,000కు పైగా ఓట్లతో ఓడించారు. 1980 ఎన్నికల్లో సంజయ్ పుంజుకుని రవీంద్ర ప్రతాప్ సింగ్‌ను 1,28,545 తేడాతో ఓడించారు. అదే ఏడాది జూన్‌లో సంజయ్ విమాన ప్రమాదంలో మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో రాజీవ్ గాంధీ 2,37,696 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో రాజీవ్‌పై సంజయ్ భార్య మేనకా గాంధీ స్వతంత్ర అభ్యరి్థగా బరిలో దిగారు. రాజీవ్ దేశవ్యాప్త ప్రచారంలో బిజీగా ఉండటంతో ఆయన తరపున భార్య సోనియాగాంధీ తొలిసారి ఎన్నికల ప్రచార బరిలో దిగారు. తలపై చీరకొంగు, నుదుటన బొట్టు, చేతికి ఎర్రటి గాజులు, స్వచ్ఛమైన హిందీతో సామాన్యులను బాగానే ఆకట్టుకున్నారు. పెద్ద పెద్ద ప్రసంగాలు చేయకున్నా ఇటు పార్టీ నాయకులకు, అటు ప్రజలకు చేరువయ్యారు. ప్రధానిగా రాజీవ్ అసలు నియోజకవర్గాన్ని పట్టించుకోరన్న ప్రచారం జరిగినా అమేథీ ప్రజలు ఆయనవైపే నిలిచారు. మేనకపై ఏకంగా 3.14 లక్షల మెజారిటీతో రాజీవ్ ఘనవిజయం సాధించారు. అమేథీలో నేటికీ అదే రికార్డు మెజారిటీ. రాజీవ్ మరణించేదాకా అమేథీ నుంచే ప్రాతినిధ్యం వహించారు. తరవాత ఆయన స్థానంలో గాంధీ కుటుంబ సన్నిహితుడు సతీశ్ శర్మ విజయం సాధించి పీవీ కేబినెట్లో పెట్రోలియం మంత్రిగా కూడా చేశారు. బీజేపీ ఎంట్రీ... 1998లోనే బీజేపీ అమేథీలో పాగా వేసింది. సతీశ్ శర్మ రెండుసార్లు గెలిచిన తర్వాత 1998లో బీజేపీ అభ్యర్థి సంజయ్ సింగ్ చేతిలో ఓటమి చవిచూశారు. 1999లో సోనియా అమేథీ నుంచే గెలిచి ఎన్నికల అరంగేట్రం చేశారు. తర్వాత 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ రాహుల్ గెలిచారు. 2019 దాకా దశాబ్దన్నర పాటు ఆయన హవాయే సాగింది. 2014 ఎన్నికల్లో రాహుల్ చేతిలో ఓడిన స్మృతి వ్యూహాత్మకంగా నియోజకవర్గంపై బాగా దృష్టి పెట్టారు. దీనికి మోదీ మేనియా తోడై 2019లో రాహుల్‌ను స్మృతీ ఓడించగలిగారు. ఎస్పీ పూర్తి మద్దతు అమేథీలో కాంగ్రెస్ నుంచి రాహుల్ బరిలో దిగుతారా, లేదా అన్నదానిపై చిట్టచివరి నిమిషం దాకా ఉత్కంఠే కొనసాగింది. ఒకానొక దశలో అమేథీ నుంచి రాహుల్, రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక బరిలోకి దిగుతారన్న ప్రచారమూ జరిగింది. ఎట్టకేలకు నామినేషన్ల దాఖలుకు చివరి రోజున రాహుల్ రాయ్‌బరేలీ నుంచి బరిలో దిగడం ఖాయమైంది. అ మేథీ నుంచి పార్టీ సీనియర్ నేత, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కిశోరీ లాల్ శర్మను కాంగ్రెస్ పోటీకి దింపింది. 40 ఏళ్లుగా నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న శర్మ అందరికీ సుపరిచితుడు. దీనికి తోడు ఇండియా కూటమి భాగస్వామి సమాజ్‌వాదీ ఈసారి కాంగ్రెస్‌కు అన్నివిధాలా దన్నుగా నిలుస్తోంది. అమేథీ, రాయ్‌బరేలీల్లో కాంగ్రెస్ విజయం కోసం రెండు పారీ్టల కార్యకర్తలు కలసికట్టుగా పని చేస్తున్నారు. కుల సమీకరణాలు కూడా పని చేస్తున్నాయి. ఈ సారి యాదవులంతా ఒక్కతా టిపైకి వచ్చారు. అఖిలేశ్ చెప్పినవైపే తమ ఓటంటున్నారు. ఈ సానుకూలత సాయంతో కాంగ్రెస్ తన కంచు కోటను తిరిగి కైవసం చేసుకుంటుందా, స్మృతీయే మళ్లీ గెలుస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.ఓటర్లు.. ఓట్ల శాతం..అమేథీ లోక్‌సభ స్థానం పరిధిలో జిల్లాలోని అమేథీ, తిలోయి, జగదీశ్‌పూర్, గౌరీగంజ్, రాయ్‌బరేలి జిల్లాలోని సలోన్ అసెంబ్లీ స్థానాలున్నాయి. నియెజకవర్గ జనాభా 20 లక్షల పై చిలుకు. 1999, 2004, 2009ల్లో కాంగ్రెస్ అత్యధిక ఓట్ల శాతంతో గెలిచింది. 2014లో బొటా»ొటిగా గట్టెక్కింది. 2019లో 49.7 శాతం ఓట్లతో బీజేపీ గెలిచింది. స్మృతి ఇరానీ 55,000 ఓట్ల మెజారిటీతో రాహుల్‌ను ఓడించారు. అమేథీలో ఏకంగా 96 శాతం ఓటర్లు గ్రామీణులే!స్మృతి టెంపుల్ రన్...ఇక ఈసారి స్మృతి ఇరానీ ఆరునెలల ముందునుంచే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. అమేథీలో అత్యధిక సంఖ్యాకులైన గ్రామీణ ఓటర్లను ఆకట్టుకునేందుకు నవరాత్రి సందర్భంగా ఆలయాలు సందర్శించారు. అమేథీలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్న ప్రముఖ దేవాలయాలన్నీ దర్శించుకున్నారు. నియోజకవర్గంలోని దాదాపు 42 దేవాలయాలకు తన ఫొటోతో కూడిన బహుమతి ప్యాక్‌లను పంపి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో ఉంటూ అమేథీకి ప్రాతినిధ్యం వహించబోనంటూ గతంలో చేసిన ప్రకటనకు అనుగుణంగా ఇటీవలే అమేథీలో ఇల్లు కొని గృహ ప్రవేశం చేశారు. నియోజకవర్గంలో శాశ్వత చిరునామా ఏర్పాటు చేసుకున్నారు. నెహ్రూ–గాంధీ కుటుంబం వల్లే నియోజకవర్గం ఇంతకాలం వెనుకబడి ఉందంటూ ప్రత్యరి్థపై మాటల దాడి తీవ్రతరం చేశారు. బీజేపీ అయితే రాహుల్ తమకు భయపడే అమేథీ వదిలి రాయబరేలీ పారిపోయారంటూ ప్రచారం చేస్తోంది. -
Kishori Lal Sharma: నేను గెలిస్తే గాంధీలు గెలిచినట్లే
అమేథీలో కాంగ్రెస్ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందంటూ బీజేపీ వ్యాఖ్యానించడం ఆ పార్టీ దురహంకారానికి ప్రతీక అని అమేథీ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ వ్యాఖ్యానించారు. గురువారం పీటీఐతో ప్రత్యేక ముఖాముఖి సందర్భంగా ఆయన ప్రస్తావించిన అంశాలు, వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..నేను సైతం సతీశ్ శర్మలా‘‘ 1990 దశకంలో గాంధీల సన్నిహితుడు, కాంగ్రెస్ నేత సతీశ్ శర్మ ఇదే అమేథీలో ఎంపీగా గెలిచారు. గాంధీల విజయపరంపరను కొనసాగించారు. తర్వాత తప్పుకుని సోనియాగాంధీ పోటీకి మార్గం సుగమం చేశారు. నేను భవిష్యత్తులో అలాగే చేస్తా. ఇక్కడ గెలిచి పార్టీ తరఫున ప్రాతినిథ్య బాధ్యతలు స్వీకరిస్తా. భవిష్యత్తులో గాంధీలు ఇక్కడి నుంచి పోటీ చేయాల్సి వస్తే అప్పుడు ఇవే ప్రాతినిథ్య బాధ్యతలను వారికి అప్పగిస్తా. అమేథీ నుంచి పోటీచేయకుండా రాహుల్ పారిపోయారని బీజేపీ వ్యాఖ్యానించడం చూస్తుంటే ఆ పార్టీకి గాంధీల చరిత్ర తెలియదని అర్థమవుతోంది. బ్రిటిషర్ల కాలం నుంచీ నెహ్రూ–గాంధీల కుటుంబం బ్రిటిషర్లను ఎదిరించిందేగానీ ఎక్కడికీ పారి పోలేదు. ఇప్పుడూ అంతే. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా యాత్రచేశారు. బీజేపీని తరి మేయడమే ఆయన ధ్యేయం’’ అని అన్నారు.ఫ్యూన్, క్లర్క్ వ్యాఖ్యలపై..‘‘గాంధీల కుటుంబానికి ఫ్యూన్, ప్రియాంక గాంధీకి క్లర్క్ అంటూ నాపై బీజేపీ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు వింటూనే ఉన్నా. బీజేపీ నాయకులకు వారి కుటుంబం నేర్పిన విలువలే అబ్బుతాయి. మా నాన్న నిరక్షరాస్యుడు. అయినా నాకు చక్కటి విద్యాబుద్దులు, నడవడిక, విలువలు నేర్పించారు. కుటుంబం ఏం నేర్పిస్తే అవే ఆ కుటుంబసభ్యులకు వస్తాయి. నాపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు నా స్పందన, సమాధానం పొందే స్థాయి, అర్హత వారికి లేవు’’ అని వ్యాఖ్యానించారు.నమ్మకాన్ని నిలబెడతా..‘ నాపై నమ్మకంతో అమేథీ బాధ్యతలను గాంధీలు నాకు అప్పగించారు. అమేథీపై గాంధీల చెరగని ముద్ర ఉంది. ఆ ముద్ర చెరిగిపోకుండా, శాశ్వతంగా ఉండేందుకు ఇకమీదటా కృషిచేస్తా. 41 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గం బాధ్యతల్ని చూసుకుంటున్నా. గెలిచి గాంధీల నమ్మకాన్ని నిలబెడతా’’ అని అన్నారు.కొన్ని పొరపాట్లతో ఓడారు‘‘కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో యోగి ప్రభుత్వాలు అమేథీలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేశాయి. ప్రభుత్వ అధికారులు, పాలనాయంత్రాంగాన్ని ఈ నియోజకవర్గంలో దుర్వినియోగం చేశాయి. కాంగ్రెస్ సైతం కొన్ని పొరపాట్లు చేసింది. అందుకే గత ఎన్నికల్లో రాహుల్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. వాస్తవానికి గత ఎన్నికల్లో ప్రజలు రాహుల్‌ను ఓడించలేదు. ఓడించాలనుకుంటే 3 లక్షల ఓట్ల తేడాతో ఓడించాలి. కానీ రాహుల్‌కు నాలుగు లక్షలకుపైగా ఓట్లు పడ్డాయి. గెలుపునకు కొంత దూరంలో ఆగిపోయారు. ఆయన ఓడిపోయారని అమేథీ ప్రజలపై నేను నిందారోపణలు మోపట్లేను’’ అని అన్నారు.స్మృతి హామీలు తీర్చారా?‘‘ ఐదేళ్ల క్రితం స్మృతి ఇరానీ అమేథీ ఓటర్లకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చారా? నిరుద్యోగం, ధరలు, వీధి ఆవుల మాటేంటి? సమస్యలు అలాగే ఉన్నాయి కదా? ఎవరు గెలుస్తారని చెప్పట్లేను. ఎవరు గెలవాలో ప్రజలే నిర్ణయించుకోవాలి. నేను గెలిస్తే ఈ విజయం నిస్సందేహంగా గాంధీలదే’’ అని అన్నారు. – అమేథీ -
‘ డిబేట్‌కి ఎక్కడైనా రెడీ’.. ప్రియాంకా గాంధీకి స్మృతి ఇరానీ సవాల్
లక్నో: కేంద్రమంత్రి, బీజేపీ అమేథీ అభ్యర్థిని స్మృతి ఇరానీ.. కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీకి సవాల్ విసిరారు. ఏ ఛానెల్ అయినా, హోస్ట్ ఎవరైనా, టైం, ప్రదేశం, అంశం ఏదైనా తాను డిబేట్లో మాట్లాడటానికి బీజేపీ సిద్ధంగా ఉందని స్మృతి ఇరాని ప్రియాంకా గాంధీకి ఛాలెంజ్ చేశారు.‘‘నేను ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరికీ ఛాలెంజ్ చేస్తున్నా. ఛానెల్, యాంకర్, ప్రదేశం, టైం విషయం ఏదైనా డిబేట్ చేయడానికి బీజేపీ సిద్ధం. ఒకవైపు.. సోదరుడు, సోదరీ. మరోవైపు.. బీజేపీ అధికార ప్రతినిధి ఉంటారు. మా పార్టీ నుంచి అయితే సుధాంశు త్రివేది చాలు. వాళ్లకు అన్ని సమాధానాలు చెబుతారు’’అని స్మృతి ఇరానీ బుధవారం అమేథీలో సవాల్ చేశారు.దేశంలోని ముఖ్యమన అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెదవి విప్పరని ప్రియాంకా గాంధీ చేసిన ఆరోపణల నేపథ్యంలో స్మృతి ఇరానీ పైవిధంగా ఛాలెంజ్ విసిరారు. 2019లో స్మృతి ఇరానీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని 55 వేల మేజార్టీతో ఓడించారు. మరోసారి బీజేపీ స్మృతి ఇరానీకి అమేథీ టికెట్ కేటాయించింది. ఇప్పటికే స్మృతి ఇరానీ అమేథీ పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం తిరిగి ప్రచాం చేశారు. మరోవైపు.. కాంగ్రెస్‌కు కంచుకోట స్థానమైన అమేథీలో నామినేషన్ల చివరి రోజు గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిషోరి లాల్ సింగ్‌ను బరిలోకి దిపింది. ఇక.. అమేథీ, రాయ్ బరేలీలో గెలుపే లక్ష్యంగా ప్రియాంకా గాంధీ శరవేంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. -
బీజేపీ ‘ప్యూన్’ వ్యాఖ్యలు.. స్పందించిన అమేథీ అభ్యర్థి
లక్నో: కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రచార స్పీడ్‌ను పెంచింది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట స్థానమైన అమేథీ స్థానంలో పోటీ చేస్తున్న కిషోరి లాల్ శర్మ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అమేథీలో రాహుల్ గాంధీ గెలవాలనుకుంటే? కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబానికి చెందిన ‘ప్యూన్’ను బరిలోకి దించిందని కిషోరి లాల్‌ను ఉద్దేశించి బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై మరోసారి కిశోరి లాల్ శర్మ స్పందించారు.‘ఇటువంటి వ్యాఖ్యలు వారి నీచమైన విలువకు నిదర్శనం, నా తండ్రి నిరక్షరాస్యుడు. అయినా నా తండ్రి ఎన్నో విలువు నేర్పుతూ పెంచారు. వారి మాటలను నేను ఎక్కువగా స్పందించలేను. ఆ వాఖ్యలను వారికే వదిలేస్తున్నా’అని కిషోరి లాల్ అన్నారు.‘ఈసారి కాంగ్రెస్ నాయకత్వం నాకు ఇచ్చిన బాధత్య చాలా భిన్నమైంది. నేను గతంలో లాగానే ఉన్నా. అయితే పార్టీ అధిష్టానం నిర్ణయాల మేరకు పనిచేస్తా. అమేథీ సెగ్మెంట్ గాంధీ కుటుంబానికి కంచుకోట స్థానం. ఇప్పటీకి ఏదైనా అవకాశం ఉంటే.. ఇక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పోటీ చేయాలి కోరుకుంటా’అని కిషోరి లాల్ తెలిపారు.కాంగ్రెస్‌కు కంచుకోట స్థానాలైన అమేథీ, రాయ్‌బరేలీ స్థానాల్లో గెలుపు కోసం ప్రియాంకా గాంధీ అన్నీ ప్రచారం చేస్తోంది. మారథాన్ సమావేశాలు నిర్వహించి.. పార్టీ నేతలు, కార్యకర్తలను ఒక్కతాటిపైకి తీసుకువస్తోంది. పోలింగ్ సమయం వరకు ఈ రెండు స్థానాల్లో ప్రచారాన్ని ఉధృతం చేయాలని ప్రియాంకా గాంధీ సోమవారం నుంచి కార్యకర్తలతో సమావేశాల్లో పాల్గొంటూ దిశా నిర్దేశం చేస్తున్నారు.అమేథి స్థానంలో 3 సార్లు గెలిచిన రాహుల్ గాంధీ 2019లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. మరోస్థానం కేరళలోని వాయ్‌నాడ్‌లో గెలుపొందారు. ఈసారి వాయ్నాడ్తో పాటు బార్బరేలీ స్థానంలో రాహుల్ గాంధీ బరిలోకి దిగారు. వాయ్‌నాడ్ పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. -
పాక్‌తో రాహుల్‌కు సంబంధం ఏంటి: స్మృతి ఇరానీ
లక్నో: పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్ ప్రశంసల అంశంపై స్పందిసస్తూ.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. మంగళవారం ఓ ర్యాలీలో పాల్గొన్న స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. అమెథీలో ప్రస్తుతం ఏకే 203 రైఫిల్స్ ఫ్యాక్టరీ ఉందని అన్నారు. వాటిని ఉపయోంగించి దేశ సరిహద్దుల వద్ద పాకిస్తాన్ ఉగ్రవాదలను అంతం చేస్తామని తెలిపారు.‘‘పాక్ మాజీ మంత్రి ఆయన దేశం గురించి ఆందోళన పడాలి కానీ, అమేథీ కోసం కాదు. లోక్‌సభ ఎన్నికల్లో నేను కాంగ్రెస్ నేతతో పోటీ పడుతుంటే.. పాకిస్తాన్ నేత మాత్రం నన్ను ఓడించాలంటున్నారు. పాకిస్తాన్‌ను పాలించటం చేతకాని వాళ్లు.. అమేథీ గురించి ఆందోళన పడుతున్నారు.నా మాటలు పాక్ మంత్రికి చేరితే.. నేను ఒక్కటి చెప్పదల్చుకున్నా. అమేథీలో ప్రధాని మోదీ ఏకే 203 రైఫిల్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. వాటితో హరిహద్దుల్లో పాక్ ఉగ్రవాదులను అంతం చేస్తాం’’ అని స్మృతి ఇరానీ అన్నారు. పాకిస్తాన్ మాజీ మంత్రి వ్యాఖ్యల రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పాకిస్తాన్‌తో రాహుల్ గాంధీకి ఉన్న సంబంధం ఏంటని నిలిదీశారు. భారత్‌లో ఎన్నికలు జరుగుతుంటే కాంగ్రెస్ నేతలు పొరుగు దేశాల మద్దతు కోరుతున్నారని విమర్శించారు. అమేథీలో స్మృతి ఇరానీకి పోటీగా కాంగ్రెస్ పార్టీ కిషోరి లాల్ సింగ్‌ను బరిలోకి దించిన విషయం తెలిసిందే. -
అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
ఉత్తర్ ప్రదేశ్ అమోథీ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్ధి కిషోరి లాల్ శర్మ (కేఎల్ శర్మ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమోథీ నియోజక వర్గం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల వారసత్వమని అభివర్ణించారు. ముసాఫిర్ఖానాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కిషోరి లాల్ శర్మ తనని తాను రాహుల్ గాంధీ కుటుంబానికి సేవకునిగా పేర్కొన్న ఆయన.. అమోథీ.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అమానత్ (సందర్భాన్ని బట్టి ఆస్తి, సందప) అని, వారు ఎప్పుడు అడిగితే అప్పుడు దానిని తిరిగి ఇచ్చేస్తానని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని అమోథీ నియోజకర్గం కాంగ్రెస్ కంచుకోట. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి కిషోరి లాల్ శర్మ.. బీజేపీ సిట్టింగ్ ఎంపీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై పోటీ చేస్తున్నారు. ఈ తరుణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కిషోరి లాల్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కుటుంబం అమోథీని రాజకీయాల పరంగా చూడలేదు. వారు తమ సొంత ఇల్లులా, కుటుంబంగా భావించారు. 1983 నుండి ఈ కుటుంబంతో అనుబంధం కలిగి ఉన్నాను. చివరి నిమిషంలో పార్టీ టిక్కెట్టు ఇచ్చింది. అందుకే నేను గాంధీ కుటుంబానికి సేవకుడిగా, అమోథీ నియోజవర్గానికి సేవకునికిగా భావిస్తున్నారు. అందుకే నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అని పేర్కొన్నారు. -
అమేథీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌పై దుండగుల దాడి, కార్ల ధ్వంసం
లక్నో: లోక్‌సభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌లోని కీలకమైన అమేథీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై ఆదివారం అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. పార్టీ కార్యాయంలో బయట పార్కింగ్ చేసిన పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడి ఘటన సమాచారం అందుకున్న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.यूपी के अमेठी में स्मृति ईरानी और BJP के कार्यकर्ता बुरी तरह डरे हुए हैं।सामने दिख रही हार से बौखलाए BJP के गुंडे लाठी-डंडों से लैस होकर अमेठी में कांग्रेस कार्यालय के बाहर पहुंचे और वहां खड़ी गाड़ियों में तोड़फोड़ की। कांग्रेस के कार्यकर्ताओं और अमेठी के लोगों पर भी जानलेवा… pic.twitter.com/Knv7BBN8bk— Congress (@INCIndia) May 5, 2024పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని దాడికి వ్యతిరేకంగా నిసన తలిపారు. దీంతో కార్యకర్తలను నిరసనను పోలీసులు శాంతింపచేశారు. ఈ దాడిపై దర్యాప్తు చేస్తామని, ఈ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుంటామని పోలీసులు తెలపారు.మరోవైపు.. ఈ దాడిని బీజేపీ చేయించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ‘‘స్మృతి ఇరానీ, బీజేపీ కార్యకర్తలు భయపడుతున్నారు. ఓడిపోతామనే భయంతో బీజేపీ కార్యకర్తలు గూండాల్లా కాంగ్రెస్ పార్టీపై దాడి చేశారు. కార్లను ధ్వసం చేశారు. అక్కడితో కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానికులపై కూడా బీజేపీ రౌడీలు దాడి చేశారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనతో బీజేపీ అమేథీలో దారుణంగా ఓడిపోతుందని అర్థమవుతోంది’’అని కాంగ్రెస్ పార్టీ ‘ఎక్స్’ వేదికగా బీజేపీపై మండిపడింది. బీజేపీ కార్యకర్తల దాడి చేస్తున్నా.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని కాంగ్రెస్ నేత సుప్రీయా శ్రీనతే మండిపడ్డారు. -
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కీలకమైన ఆమేథీ పార్లమెంట్ స్థానంలో సస్పెన్స్‌కు తెరదించుతూ గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిషోరి లాల్ శర్మను బరిలోకి దించింది. ఆయన ఎంపికపై బీజేపీ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించింది. ఆమేథీలో కాంగ్రెస్ పార్టీ ఒక ‘ప్యూన్’ను పోటీకి దింపిందని ఎద్దేవా చేసింది. అయితే బీజేపీ విమర్శలకు ఆమేథీ కాంగ్రెస్ అభ్యర్థి కిషోరి లాల్ శర్మ కౌంటర్ ఇచ్చారు. తాను గాంధీ కుటుంబానికి ‘సర్వెంట్’ను కాదు.. చాలా అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిని అని బీజేనీ విమర్శలను తిప్పికొట్టారు.‘ఆమేథి నియోజకవర్గంలో నా ఎంపిక నిర్ణయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ తీసుకుంది. నాకు టికెట్ ఇచ్చేవరకు ఇక్కడి అభ్యర్థి ఎవరనేది ఖరారు చేయలేదు. టికెట్ రాకముందే నేను సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీని ఓడిస్తానని ఎలా విశ్వాసం వ్యక్తం చేస్తాను. ఇక్కడ పోటీ చేస్తున్న నేను గాంధీ కుటుంబానికి సర్వెంట్‌ను కాదు.. నేను చాలా ఏళ్ల అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిని. నాకు ఇక్కడ కాంగ్రెస్‌తో 1983 నుంచి అనుబంధం ఉంది. కాంగ్రెస్ పార్టీలో నేను వేతనం తీసుకునే ఉద్యోగి కాదు.. నేను ఒక స్వచ్ఛమైన రాజకీయ నాయకుడిని’ అని కిషోరి లాల్ శర్మ అన్నారు.ఆమేథీలో మూడుసార్లు గెలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2019లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అప్పుడు కేరళలోని వాయ్‌నాడ్ సెగ్మెంట్ గెలిచారు రాహుల్ గాంధీ. అదే విధంగా ఈసారి కూడా రాహుల్ గాంధీ వాయ్‌నాడ్ బరిలో దిగగా.. అక్కడ పోలింగ్ పూర్తైంది. ఇక.. కాంగ్రెస్ పార్టీకి కీలమైన ఆమేథీ, రాయ్‌బరేలీలో కాంగ్రెస్ అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించింది. ఆమేథీలో కిషోరి లాల్ శర్మ, రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీని బరిలోకి దించిన విషయం తెలిసిందే. ఇక.. ఈ రెండు స్థానాలో మే 20న పోలింగ్ జరగనుంది. -
స్మృతి ఇరానీని ఓడించడం ఖాయం: కిశోరీ లాల్ శర్మ
కాంగ్రెస్ పార్టీ అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ బరిలోకి దిగారు, అమేథీ నుంచి కిశోరీ లాల్ శర్మ పోటీ చేస్తున్నారు.అమేథీ నుంచి బరిలోకి దిగిన కేఎల్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో స్మృతి ఇరానీని ఓడిస్తానని అన్నారు. అమేథీ నుంచి పోటీ చేయడమనేది అధిష్టానం నిర్ణయం. నేను స్మృతి ఇరానీని ఓడించడం ఖాయం. ఇది నేను చేస్తున్న పెద్ద ప్రకటన అని శర్మ అన్నారు.1983లో యూత్ కాంగ్రెస్ ద్వారా నేను ఇక్కడకు వచ్చాను, నేను స్వచ్ఛమైన రాజకీయ నాయకుడినని కేఎల్ శర్మ అన్నారు. లూథియానాకు చెందిన శర్మ 1983లో రాజీవ్ గాంధీతో కలిసి పనిచేయడంతో రాజకీయాల్లోకి వచ్చారు. 1991లో రాజీవ్ గాంధీ తర్వాత, అతను కెప్టెన్ సతీష్ శర్మతో కలిసి అమేథీలో పనిచేశారు. ఆ తరువాత సోనియాగాంధీ 1999లో అమేథీ నుంచి తొలిసారి ఎన్నికలలో పోటీ చేసినప్పుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. కొంతకాలం తర్వాత, అతను రాయ్‌బరేలీ, అమేథీ రెండు స్థానాలకు ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు.గాంధీయేతర కుటుంబ సభ్యుడు అమేథీ నుంచి పోటీకి దిగడం బహుశా ఇది రెండోసారి అని తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ.. సీనియర్ నాయకుడు కెప్టెన్ సతీష్ శర్మను ఆ స్థానానికి నియమించింది. 1970 మరియు 1990లలో కొన్నేళ్లు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి 2019లో రాహుల్ గాంధీ ఓడిపోయే వరకు అమేథీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. ఈ సారి జరగబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది జూన్ 4న తెలుస్తుంది.#WATCH | Amethi, Uttar Pradesh: On his candidature from Amethi, Congress leader KL Sharma says, "It was the decision of the party leadership because earlier it was not finalized who will contest from here... The thing is that now I will defeat Smriti Irani. This is a big… pic.twitter.com/GQ1GG4LP4v— ANI (@ANI) May 5, 2024 -
‘‘అమేథీ నుంచి పోటీలో రాహుల్ బంట్రోతు’’
లక్నో: అమేథీ నుంచి పోటీకి రాహుల్‌గాంధీ తన బంట్రోతును పంపించాడని బీజేపీ నేత దినేష్ ప్రతాప్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీ అమేథీ సీటును నిజంగా గెలవాలనుకుంటే అక్కడి నుంచి పోటీకి తన బంట్రోతును ఎందుకు పంపిస్తారని సింగ్ ప్రశ్నించారు. దినేష్‌సింగ్ రాయ్‌బరేలిలో రాహుల్‌తో తలపడుతున్నారు. ఈ ఎన్నికల్లో రాయ్‌బరేలి, అమేథీ సీట్లలో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని సింగ్ స్పష్టం చేశారు. అమేథీ నుంచి రాహుల్ పారిపోయాడని ఎద్దేవా చేశారు. అమేథీ, రాయ్‌బరేలీలో గాంధీ కుటుంబ సభ్యులు ఎప్పుడు పర్యటించినా వారి చుట్టూ పోలీసులు తాళ్లు పట్టుకుని నిల్చొని ఉంటారన్నారు. దూరం నుంచి చేతులు ఊపి వెళ్లిపోవడమే గాంధీ కుటుంబానికి తెలుసన్నారు. కానీ స్మృతి ఇరానీని అమేథీ ప్రజలు తమ కుటుంబ సభ్యురాలిగా చూస్తున్నారన్నారు. కాగా, రాయ్‌బరేలి నుంచి రాహుల్‌గాంధీ, అమేథీ నుంచి కేఎల్ శర్మ కాంగ్రెస్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగారు. వీరిరువురు తమ నామినేషన్లను ఇప్పటికే దాఖలు చేశారు. -
PM Narendra Modi: డరో మత్.. భాగో మత్
బర్ధమాన్/కృష్ణనగర్/చైబాసా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతుండడంపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యా ్రస్తాలు విసిరారు. డరో మత్.. భాగో మత్(భయపడొద్దు.. దూరంగా పారిపోవద్దు) అంటూ రాహుల్‌కు సూచించారు. కేరళలోని వయనాడ్‌లో పోలింగ్ పూర్తికాగానే కాంగ్రెస్ యువరాజు అక్కడి నుంచి పారిపోయి మరో స్థానం వెతుక్కుంటాడని ఇంతకుముందే చెప్పానని, తాను చెప్పినట్లే జరిగిందని అన్నారు. కాంగ్రెస్ యువరాజు వయనాడ్‌లో ఓటమి తప్పదని గ్రహించి రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్నాడని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో అమేథీలో ఓడిపోయిన రాహుల్ గాంధీ వయనాడ్‌కు పారిపోయాడని, ఇప్పుడు అక్కడినుంచి రాయ్‌బరేలీకి వచ్చాడని పేర్కొన్నారు. ఈసారి అమేథీలో పోటీ చేసే ధైర్యం లేక రాయ్‌బరేలీని ఎంచుకున్నాడని ఎద్దేవా చేశారు. భయపడొద్దు అంటూ కాంగ్రెస్ నాయకులు తరచుగా ప్రజలకు చెబుతుంటారని, తాను అదే మాట ఇప్పుడు వారికి చెబుతున్నానని అన్నారు. ఇకనైనా భయపడడం, దూరంగా పారిపోవడం ఆపేయాలని రాహుల్ గాం«దీకి హితవు పలికారు. శుక్రవారం పశి్చమ బెంగాల్‌లోని బర్ధమాన్–దుర్గాపూర్, కృష్ణనగర్, బీర్భుమ్, బోల్పూర్ లోక్‌సభ స్థానాల పరిధిలో ఎన్నికల ప్రచార సభల్లో, జార్ఖండ్‌లోని చైబాసాలో ‘మహా విజయ్ సంకల్ప సభ’లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశంలో కాంగ్రెస్ ప్రభ మసకబారుతోందని, ప్రజాదరణ కోల్పోతోందని, ఈ ఎన్నికల్లో ఆ పారీ్టకి చరిత్రలోనే అత్యంత తక్కువ స్థానాలు లభిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కనీసం 50 సీట్లయినా గెలుచుకోవడం కష్టమేనని చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోతుందని చెప్పడానికి ఒపీనియన్ పోల్స్ గానీ, ఎగ్జిట్ పోల్స్ గానీ అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ ఓటమి గురించి తాను గతంలోనే పార్లమెంట్లో స్పష్టంగా చెప్పానని గుర్తుచేశారు. ఆ పార్టీ సీనియర్ నాయకురాలు(సోనియా గాం«దీ) లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పదని ముందే గుర్తించి, రాజస్తాన్ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టారని వెల్లడించారు. కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్న నమ్మకం ఆ పార్టీ నేతలకే లేదన్నారు. ఎన్నికల సభల్లో ప్రధాని మోదీ ఇంకా మాట్టాడారంటే.. దశాబ్దాలుగా నిశ్శబ్దంగా ‘ఓటు జిహాద్’ దేశంలో ఓటు జిహాద్ ఆట గత కొన్ని దశాబ్దాలుగా నిశ్శబ్దంగా కొనసాగుతూనే ఉంది. మోదీకి వ్యతిరేకంగా ఓటు జిహాద్ చేయాలని కొందరు పిలుపునిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రతిపక్షాలు నోరెత్తడం లేదు. అంటే ఈ పిలుపును ప్రతిపక్షాలు అంగీకరిస్తున్నట్లే లెక్క. ఓటు జిహాద్లో పాలుపంచుకున్నవారికి ప్రజల ఆస్తులను దోచిపెట్టాలని కాంగ్రెస్ కుట్రలు పన్నుతోంది. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి బుజ్జగింపు తప్ప మరో విధానం లేదు. మతం ఆధారంగా ఇప్పటికే మన దేశాన్ని ముక్కలు చేశారు. సిక్కులు, క్రైస్తవులు, పార్శీలు అవతలి గట్టుపై చిక్కుకొని నానా కష్టాలూ పడుతున్నారు. వారికి న్యాయం చేకూర్చడానికి పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చాం. కానీ, విపక్షాలు మాత్రం ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దేశంలో వనరులపై, సందపపై ముమ్మాటికీ పేదలకే మొదటి హక్కు ఉంది. ఈ భూగోళంపై ఏ శక్తి కూడా మన రాజ్యాంగాన్ని మార్చేయలేదు. 15 సీట్లు కూడా నెగ్గలేని తృణమూల్ కాంగ్రెస్, 50 సీట్లయినా దక్కించుకోలేని కాంగ్రెస్ కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు. ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి స్థిరమైన, బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మాత్రమే ఉంది. పశి్చమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హిందువులను రెండో తరగతి పౌరులుగా మార్చేసింది. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతోంది. ఎన్నికల్లో ఆ పారీ్టకి బుద్ధి చెప్పాలి. చిత్తుచిత్తుగా ఓడించాలి. ప్రజలను లూటీ చేసినవారిని శిక్షించకుండా వదిలిపెట్టబోమని గ్యారంటీ ఇస్తున్నా’’ అని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. మూడు సవాళ్లపై సమాధానమేదీ? దేశంలో దళితులు, గిరిజనులు, ఓబీసీలు బీజేపీకి మద్దతుగా నిలుస్తుండడం చూసి కాంగ్రెస్ భరించలేకపోతోంది. అందుకే వారి రిజర్వేషన్లు లాక్కొని మైనారీ్టలకు కట్టబెట్టాలని పథకం వేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ‘జిహాదీ ఓటు బ్యాంక్’ కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు లాక్కోవడం తథ్యం. కాంగ్రెస్‌తోపాట విపక్ష కూటమికి నేను 3 సవాళ్లు విసురుతున్నా. మొదటిది.. అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చబోమని లేదా మతం ఆధారం రిజర్వేషన్లు ఇవ్వబోమని దేశ ప్రజలకు లిఖితపూర్వకంగా గ్యారంటీ ఇవ్వాలి. రెండోది.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను కాజేయబోమని, మతం ఆధారంగా ఆయా వర్గాల ప్రజలను విభజించబోమని రాతపూర్వకంగా హామీ ఇవ్వాలి. మూడోది.. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లింలను ఓబీసీ కోటాలో చేర్చి రిజర్వేషన్లు కలి్పంచబోమని లిఖితపూర్వకంగా గ్యారంటీ ఇవ్వాలి. ఈ మూడు సవాళ్లపై ప్రతిపక్షాలు నోరుమెదపడం లేదు. నాకు సమాధానం ఇవ్వడం లేదు. -
రాయ్‌బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
రాయ్‌బరేలీ, అమేథీ.. ప్రస్తుతం ఈ రెండు ఈ స్థానాలపైనే అందరి దృష్టి నెలకొంది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా నిలిచిన స్థానాల్లో నేడు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించడమే ఇందుకు కారణం..రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తుండగా.. అమేథీ నుంచి పార్టీ సినియర్ నేత కేఎల్ శర్మ బరిలో దిపింది కాంగ్రెస్ అధిష్టానం. తొలుత రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకగాంధీ పోటీలో నిలుస్తారని వార్తలు వచ్చాయి. తన సిటింగ్ స్థానం వయనాడ్ నుంచి పోటీకి దిగిన రాహుల్.. అమేథీ నుంచి కూడా బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు దీంతో ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంట్రీపై సస్పెన్స్ నెలకొంది. కాగా ప్రియాంకను రాయ్‌బరేలీ లేదా అమేథీ నుంచి పోటీ చేయాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కోరినట్లు సమాచారం. కానీ అందుకు ఆమె అయిష్టత చూపినట్లు తెలుస్తోంది. అయితే ప్రియాంక నో చెప్పడానికి ఆమె సోదరుడు రాహుల్, తల్లి సోనియా గాంధే కారణంగా సంబంధిత వర్గాలు తెలిపాయి. గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు పార్లమెంటులో అడుగుపెట్టడం వల్ల.. వారసత్వ రాజకీయాల పేరుతో బీజేపీ చేస్తున్న ఆరోపణలు బలోపేతం చేసినట్లు అవుతుందని ప్రియాంక భావించినట్లు పార్టీ వర్గాల సమాచారం.చదవండి:Amethi: స్మృతి ఇరానీపై కేఎల్ శర్మ పోటీ.. ఎవరీయన?మరోవైపు ప్రియాంక నిర్ణయంపై ఓటర్లలో ప్రతికూల అభిప్రాయం ఏర్పడుతుందని పార్టీకి చెందిన నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఆమె లోక్‌సభ ఎన్నికలకు విస్త్రృత ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్‌పై చేస్తున్న విమర్శలను ఆమె గట్టిగా తిప్పికొడుతున్నారు. ముఖ్యంగా మోదీ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తే కాంగ్రెస్‌కు లాభం చేకూరేదని భావిస్తున్నారు.వరుసగా మూడుసార్లు అమేథీ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన రాహుల్.. 2019 ఎన్నికల్లో మాత్రం బీజేపీ నుంచి స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చెందారు. కేరళలోని వయనాడు నుంచి ఎంపీగా గెలవడంతో పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఈసారి కూడా వయనాడ్ నుంచి మళ్లీ బరిలోకి దిగారు. దీంతోపాటు అమేథీ నుంచి పోటీ చేస్తారని అనుకుంటే రయ్బరేలీ నుంచి రంగంలోకి దిగి ట్విస్ట్ ఇచ్చారు.అమేథీ నుంచి గాంధీ కుటుంబానికి విధేయుడైన కిషోరీలాల్శర్మను ఎంపిక చేసింది పార్టీ. ఇంతకుముందు రాయ్‌బరేలీలో సోనియా గాంధీ ప్రతినిధిగా పనిచేసిన శర్మ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. నేడు రాహుల్, శర్మ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మే 20న అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్ జరగనుంది.రాయ్‌బరేలీలో బీజేపీకి చెందిన దినేష్ ప్రతాప్ సింగ్‌తో గాంధీ తలపడనున్నారు. అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో శర్మ పోటీపడనున్నారు. రాయ్‌బరేలీలో రాహుల్ అఖండ విజయం సాధిస్తారని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అమేథీలోమ అట్టడుగు వర్గాలకు చెందిన శర్మ తప్పక గెలుస్తారని చెబుతున్నారు. -
Amethi: స్మృతి ఇరానీపై కేఎల్ శర్మ పోటీ.. ఎవరీయన?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలపై సస్పెన్స్‌కు కాంగ్రెస్ తెరదించింది. అందరి ఊహలు పటాపంచల్ చేస్తూ లోక్‌సభ ఎన్నికలకు రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ బరిలోకి దిగుతున్నారు. ఇక హై ఓల్టేజ్ స్థానం అమేథీ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత కిషోరీలాల్ శర్మ పోటీ చేస్తున్నారు. ఈయన గాంధీ, నెహ్రూ కుటుంబానికి చిరకాల విధేయుడు.కాగా రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ తాజా ప్రకటనతో ఆమె ప్రత్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నట్లే తెలుస్తోంది. ఇప్పటికే వయనాడ్ నుంచి మరోసారి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్.. అమేథీలో పోటీకి ఆయన ముందు నుంచి నిరాసక్తి చూపుతూ వస్తున్నారు. కానీ రాహుల్‌ను రాయ్‌బరేలీలో రంగంలోకి దింపి కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. అయితే అమేథీలో 2019 ఎన్నికల్లో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఘోర ఓటమిని చవిచూశారు.2004 నుంచి 2014 వరకు రాయ్‌బరేలీలో ఆయన తల్లి సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహించారు. కానీ ఈసారి ఆమె రాజ్యసభకు వెళ్లడంతో అక్కడ పోటీకి మరో వ్యక్తి అవసరం వచ్చింది. దీంతో ప్రతిష్టాత్మకమైన ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు రాహుల్ సిద్ధమయ్యారు. బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్‌తో పోటీ పడుతున్నారు. ఇక ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉండగా..కాంగ్రెస్ 17 చోట్ల పోటీ చేస్తోంది. మిగతా 63 స్థానాల్లో ఇండియా కూటమిలో మిత్రపక్షమైన సమాజ్‌వాదీపార్టీ, ఇతర ప్రాంతీయ పార్టీలో పోటీ చేస్తున్నాయి.ఎవరీ కిషోరీలాల్ శర్మకిషోరీలాల్ శర్మీ 1939 సెప్టెంబర్ 25న జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 84 సంవత్సరాలు.పంజాబ్‌లోని లుధియానాకు చెందిన ఆయనకు గత 40 ఏళ్లుగా కాంగ్రెస్‌తో అనుబంధం ఉంది. 1983లో తొలిసారి అమేథీకి వచ్చి అప్పటి నుంచి నియోజకవర్గంలో పార్టీ తరపున పనిచేస్తూ వస్తున్నారు. కిషోరి లాల్ శర్మ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత గాంధీ కుటుంబంతో అతని బంధం మరింత బలపడింది.సోనియా గాంధీ 1999లో అమేథీ నుంచి తొలిసారి గెలుపొందడంలో కేఎల్ శర్మ కీలక పాత్ర పోషించారు.రాహుల్ కోసం సోనియా గాంధీ సీటు వదులుకున్న తర్వాత అమేథీ, రాయ్‌బరేలీలో శర్మ పార్టీ వ్యవహారాలను నిర్వహిస్తున్నారు.25 ఏళ్లలో తొలిసారిగత 25 ఏళ్లలో నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి అమేథీ ఎన్నికల బరిలో కనిపించకపోవడం ఇదే తొలిసారి. చివరిసారి 1998లో గాంధీయేతర కుటుంబ సభ్యుడిని అమేథీ నుంచి పోటీకి దింపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కెప్టెన్ సతీష్ శర్మను పోటీచేశారు. అయితేబీ జేపీ అభ్యర్థి సంజయ సిన్హ చేతిలో ఆయన ఓడిపోయారు. అంతకు ముందు 1996 ఎన్నికలలో శర్మ భారతీయ జనతా పార్టీకి చెందిన రాజా మోహన్ సింగ్‌పై విజయం సాధించారు. -
రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ
ఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ ట్విస్ట్ ఇచ్చారు. అమేథీ నుంచి పోటీకి మొదటి నిరాసక్తి కనబరుస్తూ వస్తున్న ఆయన.. చివరకు రాయ్‌బరేలీ నుంచి పోటీకి సిద్ధం అయ్యారు. కాసేపటి కిందట కాంగ్రెస్ పార్టీ రాయ్‌బరేలీ కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును అధికారికంగా ప్రకటించింది. ఇక అమేథీ నుంచి కిషోరీలాల్ శర్మను బరిలో దించనుంది. సోనియా గాంధీ రాయ్‌బరేలీ ఎంపీగా ఉన్న టైంలో కేఎల్ శర్మ అన్ని వ్యవహరాలను చూసుకునేవారు. రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తుండడంతో.. సోనియా గాంధీ తనయ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దాదాపు దూరం అయ్యారనే చెప్పాలి.రాయ్‌బరేలీ కాంగ్రెస్‌కు కంచుకోటే1952లో రాయ్ బరేలీ లోక్‌సభ స్థానానికి జరిగిన తొలి ఎన్నికల్లో, 1957లో జరిగిన ఎన్నికల్లోనూ ఫిరోజ్ గాంధీ(రాజీవ్ గాంధీ తండ్రి) ఎంపీగా నెగ్గారు. దాదాపు దశాబ్దం గ్యాప్ తర్వాత ఆయన సతీమణి, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వరుసగా రెండు పర్యాయాలు నెగ్గారు. 1977లో జనతా పార్టీ తరఫున రాజ్ నారాయణ్ గెలుపొందారు. 1980లో మరోసారి కూడా ఆమె గెలిచారు. ఆ తర్వాత అరుణ్ నెహ్రూ, షీలా కౌల్ కాంగ్రెస్ తరఫునే చెరో రెండుసార్లు ఎంపీగా నెగ్గారు. 1996-98 టైంలో బీజేపీ అశోక్ సింగ్ ఎంపీగా గెలిచి కాంగ్రెస్ గెలుపు రికార్డుకు బ్రేకులు వేశారు. ఆ తర్వాత 1999లో కాంగ్రెస్ అభ్యర్థి సతీష్ శర్మ విజయం సాధించారు. 2004 నుంచి ఐదు పర్యాయాలు(2006 ఉప ఎన్నికతో సహా) సోనియా గాంధీ రాయ్‌బరేలీలో విజయం సాధిస్తూ వచ్చారు. ఇంకోవైపు ఈ రెండు లోక్‌సభ స్థానాల విషయంలో కాంగ్రెస్‌లో పెద్ద హైడ్రామానే నడిచింది. లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇప్పటికే వయనాడ్(కేరళ) నుంచి పోటీ చేస్తున్నారు. అమేథీ, రాయ్ బరేలీ ఈ రెండు లోక్‌సభ స్థానాల్లో ఆయన దేని నుంచి పోటీ చేస్తారు?.. అసలు ఆయన ఈ సెగ్మెంట్ల నుంచి పోటీ చేస్తారా? లేదా? అనే సస్పెన్స్ కొనసాగింది.ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేథీలకు కాంగ్రెస్ కంచుకోటలుగా పేరుండేది. అమేథీలో రాహుల్ గాంధీ 2004 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు. కానీ, 2019 ఎన్నికల్లో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే అదే ఎన్నికలో కేరళ వయనాడ్ నుంచి కూడా పోటీ చేయడం, అక్కడ నెగ్గడంతో కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకుంది. ఇక ఈసారి కూడా ఆయన అమేథీ నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే..క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా పోటీకి ఆయన దూరం జరిగారు. కేవలం వయనాడ్ నుంచి మాత్రమే ఆయన నామినేషన్ వేశారు. ఇదే అదనుగా.. పోటీ చేయడానికి రాహుల్ జంకుతున్నారంటూ బీజేపీ ఎద్దేవా చేయడం మొదలుపెట్టింది. దీంతో బీజేపీ విమర్శలను సవాల్‌గా తీసుకున్న కాంగ్రెస్ శ్రేణులు.. రాహుల్ పోటీ చేయాల్సిందేనని నిరసనలు చేపట్టేదాకా పరిస్థితి చేరుకుంది.మరోవైపు కాంగ్రెస్ పెద్దలు రాహుల్ గాంధీతో ఎడతెరిపి లేకుండా చర్చలు జరిపారు. పోటీకి దూరంగా ఉండడం దేశం మొత్తం తప్పుడు సంకేతాలు పంపిస్తుందని వివరించే యత్నం చేస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే.. ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని సోనియా గాంధీ నిర్ణయించుకోవడంతో.. అక్కడి కాంగ్రెస్ అభ్యర్థిపైనా ఉత్కంఠ నెలకొంది. ఉప ఎన్నిక సహా ఐదుసార్లు ఆమె రాయ్‌బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లిన నేపథ్యంలో ఆ స్థానంలో ఆమె తనయ, ఏఐసీసీ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయొచ్చనే ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి.ఈ రెండు స్థానాల అభ్యర్థిత్వం కోసం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ అన్నాచెల్లెళ్లతో వరుసగా చర్చలు జరుపుతూ వచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను పోటీకి ఒప్పించేందుకు ఆయన తీవ్రంగా యత్నించారు. అయితే గురువారం అర్ధరాత్రి దాకా జరిగిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. అమేథీ నుంచి కాకుండా రాయ్ బరేలీ నుంచి పోటీకి రాహుల్ ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ప్రియాంక గాంధీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ రెండు స్థానాల నామినేషన్ల దాఖలుకు ఇవాళే ఆఖరు తేదీ. దీంతో భారీ ర్యాలీగా రాహుల్ గాంధీ నామినేషన్ వేయబోతున్నారు. తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు రాహుల్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరవుతారని సమాచారం. ఐదో ఫేజ్‌లో అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలకు మే 20వ తేదీన పోలింగ్ జరగనుంది. -
రాయ్‌బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
కాంగ్రెస్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్తర్ ప్రదేశ్ రాయబరేలీ, అమోథీ లోక్‌సభ స్థానాల అభ్యర్ధుల ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠతకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటి (సీఈసీ) తెరదించింది.24 గంటల్లోగా ఆ రెండో స్థానాల అభ్యర్ధుల్ని ప్రకటిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లి కార్జున్ ఖర్గే, పార్టీ సీనియర్ నాయకుడు జైరామ్ రమేష్ స్పష్టం చేశారు.అయితే నామినేషన్ల తుది గడువు మే 3 వరకు ఉండగా..మే 20న ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆయా లోక్‌సభ స్థానాల అభ్యర్ధులు ఖరారు చేయకపోవడంపై కాంగ్రెస్ అధిష్టానంపై రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ తరుణంలో అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ పెద్దలు స్పష్టత ఇచ్చారు -
ఓపిక నశించింది.. అమేథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ కంచుకోట అమేథీ లోక్‌సభ అభ్యర్ధి ఎవరనేది స్పష్టత రాలేదు. అయితే అభ్యర్థి ప్రకటన కోసం ఎదురు చూసి విసిగిపోయిన కార్యకర్తలు అమేథీ నియోజకవర్గంలో ఆందోళన చేపట్టారు. నియోజకవర్గంలో పార్టీ కార్యలయం బయట అభ్యర్ధిని ప్రకటించాలని ప్లకార్డ్‌లతో నిరసన చేపట్టారు. అమేథీ నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన రాహుల్ గాంధీ 2019లో బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ 55,120 ఓట్ల తేడాతో విజయం సాధించారు. స్మృతి ఇరానీ 4,68,514 ఓట్లు సాధించగా, రాహుల్ గాంధీ 4,13,394 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. ఈ సారి ఎన్నికల్లో మరోసారి తాను గెలుస్తామంటూ స్మృతి ఇరానీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిన్ననే ఆమె తన నామినేషన్ దాఖలు చేశారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఆ స్థానానికి అభ్యర్ధిని ఎంపిక చేయలేదు. అమోథీ, వయనాడ్ ఈ రెండు స్థానాల్లో ఒకచోటే గాంధీ కుటుంబ సభ్యులు పోటీ చేస్తారని, ఇద్దరూ పోటీ చేస్తారని, అమేఠీ నుంచి రాహుల్, రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతారని ఇలా రకరకాలుగా కాంగ్రెస్ వర్గాల నుంచి లీకులు కొనసాగుతున్నాయి.మరో రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ వర్గాలు చెబుతుండగా.. సహనం కోల్పోయిన కార్యకర్తలు తమ లోక్‌సభ స్థానానికి అభ్యర్ధిని ప్రకటించాలని ఆందోళన చేపట్టడం ఆసక్తికరంగా మారింది. -
అమేథీపై తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్?
జాతీయ కాంగ్రెస్‌లో అమేథీ అభ్యర్థిత్వంపై గందరగోళం నెలకొంది. యూపీలోని అమేథీ నుంచి ఎవరిని ఎన్నికల బరిలో నిలపాలనేదానిపై ఢిల్లీ కాంగ్రెస్ దర్బార్‌లో సమావేశం జరిగి 72 గంటలు గడిచినా, ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. అయితే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే.. త్వరలోనే అమేథీ అభ్యర్థిని తెలియజేస్తామని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.అమేథీని గాంధీ కుటుంబానికి కంచుకోటగా పరిగణిస్తారు. అయితే 2019లో ఈ మ్యాజిక్‌ను స్మృతి ఇరానీ బద్దలు కొట్టారు. అమేథీ లోక్‌సభ స్థానం నుంచి ఇప్పటి వరకు ముగ్గురు కాంగ్రెసేతర ఎంపీలు మాత్రమే ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓడిపోయిన తర్వాత పార్టీ ఆలోచనలో పడింది. ఇప్పుడు నామినేషన్‌కు నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండడంతో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తెలియక స్థానిక పార్టీ నేతలు అయోమయంలో కూరుకుపోయారు. అమేథీ అభ్యర్థిని ప్రకటించనప్పటికీ కాంగ్రెస్, ఎస్పీల సమన్వయ కమిటీ సమాలోచనలు చేస్తోంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ దీపక్ సింగ్ మాట్లాడుతూ అతి త్వరలోనే అమేథీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది వెల్లడవుతుందన్నారు. మే 3న రాష్ట్ర ఇన్చార్జి వస్తారని తెలిపారు. అప్పుడు ఇక్కడి అభ్యర్థి ఎవరనేది తెలుస్తుందని ఆయన అన్నారు.వయనాడ్ ఎన్నికల తర్వాత రాహుల్ అమేథీకి వచ్చే అవకాశం ఉందని గతంలో చర్చ జరిగింది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఇంకా నిశ్శబ్ధం కొనసాగుతోంది. ఇదేసమయంలో ఖర్గే చేసిన ప్రకటన ఇంకేదో సూచిస్తోందని రాజకీయ నిపుణులు అంటున్నారు. మరోవైపు బీజేపీపై ఆగ్రహంతో ఉన్న వరుణ్.. అమేథీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. -
రాయ్‌బరేలీ నుంచి రాహుల్? ప్రియాంకపై వీడని ఉత్కంఠ?
యూపీలోని అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాల నుంచి కాంగ్రెస్ ఎవరిని ఎన్నికల బరిలోకి దింపుతున్నదనే విషయం ఇంకా వెల్లడి కాలేదు. అయితే రాహుల్ గాంధీ అమేథీ నుండి కాకుండా రాయ్‌బరేలీ నుండి ఎన్నికల్లో పోటీ చేయవచ్చనే వార్త తాజాగా వినిపిస్తోంది. అదేవిధంగా ప్రియాంక గాంధీని ఎన్నికల పోరులో నిలబెట్టే ఆలోచన కాంగ్రెస్‌కు లేదని కూడా అంటున్నారు.ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. కాగా రాహుల్ గాంధీ అమేథీ నుంచి, ప్రియాంక గాంధీ వాద్రా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ అవినాష్ పాండే, లెజిస్లేచర్ పార్టీ నాయకుడు ఆరాధన మిశ్రా అధినాయకత్వాన్ని కోరినట్లు సమాచారం.రాహుల్ గాంధీ 2004 నుంచి 2019 వరకు అమేథీ లోక్‌సభ సభ్యునిగా ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు.కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈసారి రాయ్‌బరేలీ నుండి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఆమె రాజస్థాన్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. సోనియా రెండు దశాబ్దాల పాటు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంక గాంధీ ఈ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే మాట కూడా వినిపిస్తోంది. కొద్దిసేపటిలో కాంగ్రెస్ అమెథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాలు అభ్యర్థుల పేర్లను వెల్లడించనుంది. దీంతో ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది. -
స్కూటర్‌పై తిరుగుతూ.. స్మృతీ ఇరానీ సందడి!
ఉత్తరప్రదేశ్‌లోని తన లోక్‌సభ నియోజకవర్గం అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్కూటర్‌పై తిరుగుతూ ప్రజలను కలుసుకున్నారు. అలాగే పలువురితో సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ మీడియాకు కనిపించారు. బీజేపీ కార్యకర్తలతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు.స్మృతి ఇరానీ ఈరోజు (సోమవారం) అమేథీ నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. 2019లో ఆమె కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఓడించి, ఈ సీటును సొంతం చేసుకున్నారు. స్మృతి ఇరానీ ఆదివారం నాడు అయోధ్యలోని రామ్‌లల్లాను దర్శించుకున్నారు. కాగా అమేథీ నుంచి కాంగ్రెస్ తరపున ఎవరు పోటీ చేయనున్నారనే విషయాన్ని కాంగ్రెస్ ఇంతవరకూ వెల్లడించలేదు. అమేథీ.. కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరొందింది. మే 20న అమేథీలో ఐదో దశలో ఓటింగ్ జరగనుంది. -
అమేథీలో కాంగ్రెస్ 1981 ఫార్ములా?
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ నుంచి పోటీ చేయనున్నారని ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు అంటున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయమై నోరు మెదపలేదు. అయితే పార్టీ 1981 నాటి ఉప ఎన్నికల ఫార్ములాను ఇప్పుడు అనుసరించనున్నదనే మాట వినిపిస్తోంది.1981లో కాంగ్రెస్ నామినేషన్ల పర్వం ప్రారంభమైన తర్వాతనే అభ్యర్థులను రంగంలోకి దించింది. రాజీవ్ గాంధీని యూపీలోని అమేథీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన రోజునే రాజీవ్ గాంధీ తన నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఇదే విధానాన్ని కాంగ్రెస్ అనుసరించనున్నదని కొందరు పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.మరోవైపు అమేథీలో బీజేపీ మినహా ఏ పార్టీ కూడా అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఎస్పీ-కాంగ్రెస్ పొత్తులో అభ్యర్థి ఎవరనేదానిపై బీఎస్పీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అదేసమయంలో బీఎస్పీ అభ్యర్థి ఖరారైనట్లు కూడా ప్రచారం జరుగుతోంది.ఇప్పటి వరకు రాహుల్ గాంధీ తాను అమేథీ నుంచి పోటీ చేస్తానని చెప్పలేదు. అమేథీ నుంచి బీజేపీ తరుపున స్మృతి ఇరానీ ఎన్నికల రంగంలోకి దిగారు. కాగా రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయనున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ సింఘాల్ ప్రకటించారు. -
నేడు అమేథీలో స్మృతి ఇరానీ నామినేషన్
ఈరోజు (ఆదివారం) భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మహిళా నేత స్మృతి ఇరానీ యూపీలోని అమేథీ లోక్‌సభ స్థానానికి తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి ముందు ఆమె అయోధ్యలోని రామ్‌లల్లాను దర్శించుకోనున్నారు. అనంతరం ఆమె తన లోక్‌సభ నియోజకవర్గానికి వెళ్లి నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. మే 20న అమేథీలో ఐదో దశలో ఓటింగ్ జరగనుంది. అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం (ఏప్రిల్ 26) ప్రారంభమైంది. ఐదో దశలో మొత్తం 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది.అమేథీలో నామినేషన్‌కు చివరి తేదీ మే 3. దీంతో కాంగ్రెస్‌కు ఈ సీటు నుంచి పోటీచేయబోయే అభ్యర్థిని ప్రకటించడానికి ఎక్కువ సమయం లేదు. కాంగ్రెస్ పార్టీ అమేథీలో తన అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదు. అయితే రాహుల్ గాంధీ ఈ స్థానం నుండి మరోసారి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమేథీ నియోజకవర్గం చాలాకాలంపాటు గాంధీ కుటుంబం ఆధీనంలో ఉంది. అయితే 2019లో రాహుల్‌ను ఓడించడం ద్వారా స్మృతి ఇరానీ ఇక్కడ కాంగ్రెస్ ఆధిపత్యానికి స్వస్తి పలికారు. అయితే ఇప్పుడు స్మృతిని ఓడించి, కాంగ్రెస్ కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందేందుకు రాహుల్ ప్రయత్నించనున్నారని సమాచారం.అమేథీతో పాటు రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానానికి కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ ఎవరికీ టిక్కెట్ కేటాయించలేదు. ఈ సీటు కూడా కాంగ్రెస్ సంప్రదాయ సీటు. 2019లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు ఇదే. సోనియాగాంధీ ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆమె ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీటు నుంచి సోనియా కుమార్తె ప్రియాంక ఎన్నికల బరిలో దిగవచ్చని తెలుస్తోంది. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలుస్తున్నప్పటికీ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
‘నేను రాజకీయాల్లోకి రావాలని దేశమంతా కోరుకుంటుంది’
డెహ్రాడూన్: దేశం మొత్తం తాను క్రీయాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని కోరుకుంటుందని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రా అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ కంచుకోట ఆమేథీ నుంచి పోటీచేస్తారని గత కొన్నిరోజులుగా ఉహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. తాజాగా రాబర్ట్ వాద్రా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘దేశం మొత్తం నుంచి ఒకటే అభిప్రాయం వినిపిస్తోంది. దేశ ప్రజలంతా తాను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. ప్రజలు తనను వారి ప్రాంతాల్లో ఉండాలని ఆశిస్తున్నారు. నేను 1999లోనే ఆమెథి ప్రచారంలో పాల్గొన్నాను. ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న స్మృతి ఇరానీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చలేదు. గడిచిన రెండు విడతల్లోను కాంగ్రెస్ పార్టీ ముందజలోనే కొనాసాగుతోందని పేర్కొన్నారు. ‘దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. బీజేపీతో ప్రజలు తీవ్రంగా విసిగిపోయారు. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ శ్రమను దేశ ప్రజలు చూస్తున్నారు. గాంధీ కుటుంబం వెంటే దేశ ప్రజల ఉన్నారు’ అని రాబర్ట్ వాద్రా అన్నారు. ఆయన తనకు రాజకీయాల్లోకి రావాలని, ఎంపీగా పోటీ చేయాలన్న కోరికను ఉన్నట్లు ఇలా పరోక్షంగా వెల్లడిస్తున్నారని పార్టీ శ్రేణులో తీవ్ర చర్చ జరుగుతోంది.అమెథిలో గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన స్మృతి ఇరానీ సమీప కాంగ్రెస్ అభ్యర్థి అయిన రాహుల్ గాంధీని ఓడించిన విషయం తెలిసిందే. మళ్లీ ఈసారి కూడా బీజేపీ అమెథి సెగ్మెంట్ నుంచి స్మృతి ఇరానీకి టికెట్ కేటాయించింది. -
అమేథీ నుంచి రాహుల్.. రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక? నామినేషన్లకు సన్నాహాలు?
దేశంలో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలల్లో తమ నామినేషన్లు వేసేముందు వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాలు అయోధ్యలోని రామ్ లల్లాను దర్శించుకోనున్నారని సమాచారం. కాంగ్రెస్ వర్గాల నుంచి మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఏప్రిల్ 26న కేరళలోని వయనాడ్‌కు పోలింగ్ పూర్తయిన తర్వాత గాంధీ కుటుంబం అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గాలపై దృష్టి పెట్టనున్నదని సమాచారం. అమేథీలో రాహుల్ గాంధీ, రాయ్‌బరేలీలో ప్రియాంక గాంధీ వాద్రా నామినేషన్ వేయనున్నారని, దీనికి ముందు వారు అయోధ్యలో కొలువైన రామ్‌లల్లాను దర్శించుకోనున్నారని సమాచారం. వయనాడ్‌లో ఓటింగ్ ఏప్రిల్ 26న ముగియనుంది. అదే రోజున రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ మొదలు కానుంది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం అమేథీ, రాయ్‌బరేలీలలో పోటీ విషయమై ఏప్రిల్ 30లోపు కాంగ్రెస్ అధికారిక ప్రకటన చేయనున్నదని సమాచారం. ఈ స్థానాల అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ మౌనం వహిస్తూ వస్తోంది. అయితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు.. అమేథీ, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న పక్షంలో మే ఒకటి నుంచి మూడవ తేదీలోపు నామినేషన్లు దాఖలు చేసే అవకాశముంది. ఈ రెండు నియోజకవర్గాల్లో నామినేషన్లకు మే 3 చివరి రోజు. మే 20న ఐదవ విడతలో ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.రాహుల్, ప్రియాంకలు యూపీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని కాంగ్రెస్ కమ్యూనికేషన్ సెల్ ఇన్చార్జి జైరాం రమేష్‌తో పాటు పలువురు నేతలు గతంలోనే సూచన ప్రాయంగా తెలియజేశారు. తాజాగా అమేథీలోని రాహుల్ నివసించే బంగ్లాను శుభ్రం చేసి, పెయింటింగ్ వేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఈ నేపధ్యంలో రాహుల్ అమేథీ నుంచి, ప్రియాంక రాయ్‌బరేలీ నుంచి పోటీచేయవచ్చని స్పష్టమవుతోంది. -
అమేథీ కాంగ్రెస్ అభ్యర్థి రాబర్ట్ వాద్రా?
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. మే 20న ఐదవ దశలో అమేథీ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే కాంగ్రెస్ ఇక్కడి అభ్యర్థి ఎవరనేది వెల్లడించకముందే స్థానికంగా వెలసిన పోస్టర్లు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తెలియజేస్తున్నాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా.. అమేథీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేస్తూ పలు చోట్ల పోస్టర్లు వెలిశాయి. ‘అమేథీ ప్రజలు ఈసారి రాబర్ట్ వాద్రాను ఆహ్వానించాలి’ అని పోస్టర్‌పై రాశారు. రాబర్ట్ వాద్రా అమేథీ నుంచి పోటీ చేయాలనే డిమాండ్ గత కొంతకాలంగా వినిపిస్తోంది. అమేథీ, గౌరీగంజ్లలోని కాంగ్రెస్ కార్యాలయాలు, హనుమాన్ తిరహా, రైల్వే స్టేషన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఈ తరహా పోస్టర్లను గోడలపై అతికించారు. ఈ పోస్టర్ గురించి స్థానిక కాంగ్రెస్ నేత సోను సింగ్ రఘువంశీ మాట్లాడుతూ రాబర్ట్ వాద్రా ఈసారి అమేథీ నుండి ఎన్నికల్లో పోటీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రియాంక గాంధీ రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తారు. అందుకే రాబర్ట్ వాద్రా ఇక్కడి నుంచి పోటీచేయాలని స్థానిక కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారన్నారు. -
Lok sabha elections 2024: ‘అమేథీ నుంచి పోటీ చేసే ధైర్యం లేదు’
పత్తనంతిట్ట(కేరళ): 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి ఓటమి పాలైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఈ దఫా మళ్లీ అక్కడి నుంచి పోటీ చేసే ధైర్యం లేదని బీజేపీ నేత రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. యూపీలోని అమేథీలో పరాజయం పాలైన రాహుల్ అక్కడ్నుంచి కేరళలోని వయనాడ్‌కు వలసవచ్చారని ఎద్దేవా చేశారు. అయితే, మరోసారి ఆయన్ను ఎంపీగా చేయరాదని ఇప్పటికే వయనాడ్ ప్రజలు నిర్ణయించుకున్నట్లు తెలిసిందన్నారు. కేరళలోని పత్తనంతిట్ట లోక్‌సభ నియోజకవర్గంలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రాజ్‌నాథ్ ప్రసంగించారు. -
లోక్‌సభ ఎన్నికలపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
-
అమేథీ నుంచి బరిలోకి.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే!
దేశంలో ప్రస్తుతం ఎన్నికల సందడి నెలకొంది. లోక్‌సభ ఎన్నికలతోపాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో రాజకీయ వేడి నెలకొంది. నువ్వా-నేనా అన్నట్లు అధికార ప్రతిపక్షాలు పోటీపడుతున్నాయి. అభ్యర్ధుల ప్రకటన, ప్రచారాలో పార్టీలో హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ స్థానం నుంచి పోటీపై తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ కంచుకోట అయిన అమేథీలోక్సభ స్థానానికి హస్తం పార్టీ ఇంకా అభ్యర్ధిని ప్రకటించలేదు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో అమేథీ నుంచి రాహుల్ మీళ్లీ పోటీ చేస్తారా లేదా అనేది సస్పెన్స్ నెలకొంది. ఈ సందర్భంగా ఓ మీడియా సమావేశంలో అమేథీలో బీజేపీ నుంచి బరిలో దిగిన స్మృతి ఇరానీపై పోటీకి కాంగ్రెస్ నుంచి ఎవరూ నిలబడుతున్నారనే ప్రశ్న రాహుల్‌కు ఎదురైంది. దీనిపై ఆయన మాట్లాడుతూ... తాను పార్టీలో ఓ సైనికుడు మాత్రమేనని తెలిపారు. ఎన్నికల్లో పోటీ నిర్ణయాలు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ తీసుకుంటుందని అన్నారు. ‘ఇది బీజేపీ ప్రశ్న. చాలా బాగుంది. పార్టీ అధిష్టానం నుంచి వచ్చినా ఏ ఆదేశాన్ని అయినా నేను అనుసరిస్తాను. మా పార్టీలో అభ్యర్థుల ఎంపిక నిర్ణయాలు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ తీసుకుంటుంది’ అని తెలిపారు. కాగా ఒకప్పుడు అమేథీ గాంధీ కుటుంబానికి కంచుకోట. గతంలో రాహుల్ చిన్నాన్న సంజయ్ గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ, ఆ తర్వాత తల్లి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో రాహుల్ హాట్రిక్ విజయం సాధించారు అయితే 2019 ఎన్నికల్లో ఫలితాలు తారుమరయ్యాయి. కాంగ్రెస్ నుంచి పోటీకి దిగిన రాహుల్‌పై బీజేపీ నుంచి స్మృతి ఇరానీ గెలుపొందారు. అయితే కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ అక్కడ గెలిచి.. పార్లమెంట్లో అడుగుపెట్టారు. ప్రస్తుత ఎన్నికల్లో వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ.. అమేథీ నుంచి కూడా పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.మరోవైపు దమ్ముంటే అమేథీ నుంచి పోటీ చేయాలంటూ రాహుల్‌కు స్మృతి ఇరానీ సవాల్ విసురుతున్నారు.ఇక కాంగ్రెస్ కంచుకోటలో ఎవరూ బరిలో దిగుతారో? మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. -
Smriti Zubin Irani: క్యోం కి స్మృతీ భీ కభీ అభినేత్రీ థీ
స్మృతి జుబిన్ ఇరానీ. ఇప్పుడు కేంద్ర మంత్రిగా సుపరిచితులు. ఒకప్పుడు హిందీ టీవీ సీరియల్ వీక్షకుల అభిమాన నటి. సంప్రదాయ కుటుంబం నుంచి వచి్చనా మోడల్‌గా, నటిగా రాణించారు. రాజకీయాల్లో స్వయంకృషితో ఎదిగారు. కాంగ్రెస్ కంచుకోట అమేథీలో రాహుల్‌గాందీనే మట్టికరిపించారు. ఈసారి కూడా అమేథీలో కాంగ్రెస్‌కు సవాల్ విసురుతున్నారు... రాజకీయ ప్రయాణం.. నటనతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న స్మృతీ 2003లో బీజేపీలో చేరారు. మహారాష్ట్ర బీజేపీ యువజన విభాగం ఉపాధ్యక్షురాలిగా చేశారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత కపిల్ సిబల్పై ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి పోటీ చేసి ఓడారు. 2011లో గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014లో యూపీలోని అమేథీ నుంచి రాహుల్ గాం«దీపై పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2017లో రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అమేథీపై బాగా దృష్టి పెట్టారు. నిత్యం స్థానికంగా ప్రజల్లో ఉన్నారు. కాంగ్రెస్‌పై, రాహుల్‌పై విమర్శలతో హోరెత్తించారు. 2019లో అమేథీలో రాహుల్‌ను ఓడించి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. అమేథీలో స్థిర నివాసం ఏర్పరుచుకుని అక్కడే ఉంటానని ప్రకటించారు. 2021లో మావాయి గ్రామంలో ఇల్లు కట్టుకున్నారు. ఇటీవలే గృహప్రవేశం చేశారు. ‘దమ్ముంటే అమేథీ నుంచి పోటీ చేయండి’ అంటూ మళ్లీ రాహుల్‌కు సవాలు విసురుతున్నారు. కేంద్రంలో మానవ వనరులు, సమాచార–ప్రసార, జౌళి శాఖ మంత్రిగా చేశారు. ప్రస్తుతం మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి, మైనారిటీ వ్యవహారాల మంత్రి. బహుభాషా ప్రావీణ్యం... స్మృతి 1976 మార్చి 23న ఢిల్లీలోని పంజాబీ కుటుంబంలో జని్మంచారు. తండ్రి అజయ్ కుమార్ మల్హోత్రా వ్యాపారి. తల్లి శిబానీ నే బాగ్చీ బెంగాలీ. ఢిల్లీలోని హోలీ చైల్డ్ ఆగ్జీలియమ్ స్కూల్లో చదివారు. తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా పాఠశాల విద్య కాగానే మోడలింగ్ వైపు వెళ్లారు. తర్వాత నటనలో అదృష్టం పరీక్షించుకునేందుకు ముంబైలో అడుగుపెట్టారు. పలు ఉత్పత్తులకు మోడల్‌గా చేస్తూనే నటిగా ప్రయతి్నంచారు. ఆ క్రమంలో సినిమా కష్టాలు పడ్డారు. పెద్ద కూతురుగా ఇంటి బాధ్యతలను తలకెత్తుకున్నారు. పలు సీరియళ్లలో నటించారు. క్యోం కీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్‌తో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఒక టీవీ సీరియల్‌కు సహదర్శకత్వంతో పాటు పలు టీవీ షోలకు హోస్ట్‌గా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ‘జై బోలో తెలంగాణ’ సినిమాతో తెలుగు ప్రజలకూ పరిచయమయ్యారు. 2001లో జుబిన్ ఇరానీని పెళ్లాడారు. వీరికి కొడుకు జోహార్, కూతురు జోయిష్ ఉన్నారు. వైవిధ్యమైన కుటుంబ, సినీ నేపథ్యం కారణంగా ఆమె హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ భాషల్లో అనర్గళంగా మాట్లాడతారు. వివాదాలకు కేరాఫ్ రకరకాల కారణాలతో స్మృతి తరచూ వివాదాల్లో పడుతుంటారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో చాందినీచౌక్ నుంచి పోటీ చేసినప్పుడు ఎన్నికల అఫిడవిట్లో ఢిల్లీ యూనివర్సిటీ (స్కూల్ ఆఫ్ కరస్పాండెన్స్)లో 1996లో బీఏ చదివానని పేర్కొన్నారు. 2014, 2019ల్లో అమేథీ నుంచి పోటీ చేసినప్పుడేమో 1994లో ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్‌లో చేరినట్టు వెల్లడించారు. దాంతో ఆమె డిగ్రీలో చేరింది 1994లోనా, 1996లోనా, చదివింది బీఏనా, కామర్సా అనే విమర్శలొచ్చాయి. 2014లో మానవ వనరుల మంత్రి కావడంతో కనీసం డిగ్రీ లేని వ్యక్తి దేశానికి విద్యా మంత్రా అంటూ నిరసనలు వ్యక్తమయ్యాయి. సమస్య కోర్టు దాకా వెళ్లింది. ఈ వివాదాల నేపథ్యంలో ఆమె మానవ వనరుల నుంచి జౌళి శాఖకు మారారు. -
స్మృతి ఇరానీ Vs ప్రియాంక.. యూపీలో ఆసక్తికర సమరం!
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు అంశంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల నుంచి ఎవరు పోటీ చేస్తారనేది తేలియాల్సి ఉంది. కాగా, ముందు నుంచి ఈ స్థానంలో రాబర్ట్ వాద్రా పోటీ ఉంటారనే వార్తలు వినిపించినప్పటికీ అది జరగపోవచ్చు అని సమాచారం. కాగా, గాంధీ కుటుంబంతో విడదీయరాని బంధం ఉన్న అమేథీ, రాయబరేలీ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనే అంశం కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని ఈ విషయంలో ఒక హింట్ ఇచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి గాంధీ కుటుంబ సభ్యులు బరిలో ఉంటారని వెల్లడించారు. కాగా, ఆంటోని బుధవారం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమేథీ, రాయబరేలీ సీట్లపై ఎలాంటి ఊహాగానాలు వద్దు. యూపీ నుంచి గాంధీ కుటుంబమే పోటీ చేస్తారు. రాబర్ట్ వాద్రా అక్కడ పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చు అని కామెంట్స్ చేశారు. దీంతో, ప్రియాంక లేదా రాహుల్ గాంధీ యూపీ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. రాహుల్ ఇప్పటికే కేరళలోని వయనాడ్ నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఇక, అమేథీలో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీని ఢీకొట్టేందుకు ప్రియాంకు బరిలోకి దింపుతారా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ప్రియాంక కనుక అమేథీ నుంచి పోటీలో నిలిస్తే రాజకీయం ఆసక్తికరంగా మారే అవకాశం ఉంటుంది. మరోవైపు.. ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా అమేథీ స్థానం కాంగ్రెస్‌కు దక్కిన విషయం తెలిసిందే. -
‘అమేథీ’లోనూ రాహుల్ పోటీ..!
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ నియోజకవర్గంలో ఇప్పటికే ఆయన నామినేషన్ కూడా వేశారు. అయితే ఆయన ఉత్తరప్రదేశ్‌లోని తన పాత నియోజకవర్గం అమేథీ నుంచి కూడా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. వయనాడ్‌లో పోలింగ్ ముగిశాక అమేథీ నుంచి పోటీ చేయాలా వద్దా అనే దానిపై రాహుల్ నిర్ణయించుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌తో పాటు అమేథీ నుంచి కూడా రాహుల్ పోటీ చేశారు. అయితే వయనాడ్‌లో విజయం సాధించిన రాహుల్ గాంధీ అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై ఓడిపోయారు. ఈసారి రాహుల్ అమేథీ నుంచి పోటీ చేస్తారా అనే విషయంలో పార్టీ క్యాడర్‌తో పాటు అభిమానుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర భారత దేశంలోనూ పార్టీకి ఊపు తీసుకురావాలంటే రాహుల్ అమేథీ నుంచి పోటీ చేయాలని పార్టీ శ్రేణులు గట్టిగా కోరుతున్నట్లు సమాచారం. ఇదీ చదవండి.. అగ్నిపథ్‌ను రద్దు చేస్తాం.. రాహుల్ గాంధీ -
Lok sabha elections 2024: అమేధీ నుంచి రాబర్ట్ వాద్రా..?
సాక్షి, న్యూఢిల్లీ: గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేధీ నియోజకవర్గం నుంచి అగ్రనేత ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా రాజకీయ అరంగేట్రం చేసే అవకాశాలున్నాయని ఏఐసీసీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్టుగా అమేధీ ప్రజలు తనను కోరుకుంటే ఎంపీగా ప్రాతినిధ్యం వహించేందుకు సిధ్దమని ఆయన ఇటీవల చేసిన ప్రకటన ఈ తరహా ప్రచారానికి బలాన్నిస్తోంది. దీనికి తోడు ప్రస్తుతం అమేధీ ఎంపీగా ఉన్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీని ఉద్దేశించి, ‘ఆమె వల్ల అమేధీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆమెను ఎన్నుకోవడం ద్వారా తప్పుచేశామని నమ్ముతున్నారు’ అంటూ విమర్శలు సంధించడంతో వాద్రా పోటీ ఖాయమని ఏఐసీసీ వర్గాలంటున్నాయి. -
అమేథీ బరిలో 'రాబర్ట్ వాద్రా'?
కాంగ్రెస్ అగ్ర నేత 'రాహుల్ గాంధీ' అమేథీ నుంచి పోటీ చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. అయితే ఈయన వయనాడ్ నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేశారు. ప్రశ్నార్థకంగా మారిన అమేథీ నుంచి ప్రియాంక గాంధీ భర్త 'రాబర్ట్ వాద్రా' పోటీ చేయనున్నట్లు సమాచారం. అమేథీ ప్రజలు నేను ఎంపీ కావాలని నిర్ణయించుకుంటే.. తప్పకుండా ప్రాతినిధ్యం వహిస్తానని రాబర్ట్ వాద్రా ప్రకటించారు. ప్రస్తుత ఎంపీ 'స్మృతీ ఇరానీ' ప్రజలకు ఏమీ చేయలేదని, వారందరూ నిరాశ చెందుతున్నారని అన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీని నిందించడానికి మాత్రమే ఆమె ఉన్నారని పేర్కొన్నారు. స్మృతీ ఇరానీని గెలిపించి తప్పు చేశామని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలు భావిస్తున్నట్లు వాద్రా పేర్కొన్నారు. అమేథీ నుంచి బరిలోకి దిగి.. ప్రజల అభివృద్ధికి దోహదపడతానని ఆయన అన్నారు. రాజకీయ రంగప్రవేశం గురించి వాద్రా మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. ఏప్రిల్ 2022లో కూడా ప్రజలు కోరుకుంటే ఎన్నికల్లో నిలబడటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే ఇప్పుడు మరోసారి ఎన్నికల బరిలో నిలబడటానికి సన్నద్ధమవుతున్నారు. మున్ముందు ఏం జరుగుతుందో.. ఎలాంటి రాజకీయ పరిణామాలు జరుగుతాయనేది తెలియాల్సి ఉంది. Delhi | On UP's Amethi Lok Sabha constituency, Robert Vadra says, "...The people of Amethi expect me to represent their constituency if I decide to become a member of Parliament...For years, the Gandhi family worked hard in Rae Bareli, Amethi and Sultanpur...The people of Amethi… pic.twitter.com/2kdmgQtrvv — ANI (@ANI) April 4, 2024 -
ఇల్లు.. ఓటు.. మాట నిలబెట్టుకున్న స్మృతి ఇరానీ!
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో ఇల్లు కట్టుకుని స్థానిక ఓటరుగా మారారు. ఎంపీ ప్రతినిధి విజయ్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. గౌరీగంజ్‌లోని మెదన్ మావాయి గ్రామంలో ఇల్లు కట్టుకున్న స్మృతి ఇరానీ అక్కడ ఓటరు కావడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడామె ఆ గ్రామంలో ఓటరుగా మారారని విజయ్ గుప్తా తెలిపారు. స్మృతి ఇరానీ అమేథీని తన కుటుంబంగా భావిస్తారు. అమేథీ కుటుంబం మధ్య నివసించేందుకు ఆమె ఇక్కడే తన నివాసాన్ని నిర్మించుకున్నారని తెలిపారు. ఇంటి నిర్మాణంతో ఆమె అమేథీ నుంచి ఓటరుగా నిలిచే ప్రక్రియను ప్రారంభించారు. ప్రస్తుతం లాంఛనాలు పూర్తయ్యాయని గుప్తా తెలిపారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ అమేథీ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని గౌరీగంజ్ అసెంబ్లీ స్థానంలోని మెదన్ మావాయి గ్రామంలోని బూత్ నంబర్ 347లో ఓటరుగా మారారు. గ్రామంలో కొత్తగా నిర్మించిన ఇంట్లోకి స్మృతి ఇరానీ గత ఫిబ్రవరి 22న గృహ ప్రవేశం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి స్మృతి ఇరానీని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. 2019లో ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని సుమారు 55,000 ఓట్ల తేడాతో ఓడించి సంచలనం సృష్టించారు. కాగా కాంగ్రెస్ ఇప్పటి వరకు ఇక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు. రాహుల్ గాంధీ ఈ స్థానం నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. మే 20న అమేథీలో ఐదో దశలో పోలింగ్ జరగనుంది. -
అమేథీ, రాయ్‌బరేలీపై కాంగ్రెస్ వీడని మౌనం!
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీలలో కాంగ్రెస్ ఇంకా లోక్‌సభ అభ్యర్థులను నిలబెట్టలేదు. ఈ రెండు స్థానాల్లో గాంధీ కుటుంబం పోటీ చేస్తుందా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది. ఈ రెండు లోకసభ నియోజకవర్గాలపై కాంగ్రెస్ ఇంకా మౌనం వీడలేదు. పార్టీ అధిష్టానం తాజాగా యూపీ అభ్యర్థుల నూతన జాబితాను విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో అమేథీ, రాయ్‌బరేలీ పేర్లు కనిపించలేదు. కాంగ్రెస్ తన కంచుకోట స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అమేథీ, రాయ్‌బరేలీకి చెందిన కాంగ్రెస్ నేతలు గాంధీ కుటుంబ సభ్యులను ఇక్కడి నుంచి పోటీచేయించేందుకు ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. ఇందుకోసం వారు కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి లేఖలు పంపుతున్నారని సమాచారం. అయితే నామినేషన్ల చివరి రోజున ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని పలువురు భావిస్తున్నారు. రాయ్‌బరేలీ సీటును గాంధీ కుటుంబం నుంచి వేరొకరికి వెళ్లేందుకు అనుమతించబోమని స్థానిక కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఈ రెండు స్థానాల్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీకి చెందిన ఇద్దరు మహిళా నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం. వీరిలో ఒకరు జాతీయ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తుండగా, మరొకరు రాష్ట్ర పార్టీలో కీలక పదవిలో ఉన్నారట. -
రోడ్డు వేయకపోతే ఓట్లు వేయమంతే! వీవీఐపీ సీట్లో ఓ విలేజ్ నిరసన
సాధారణంగా ప్రజలు ఓట్లు వేసి ప్రజా ప్రతినిధులను ఎన్నుకుని వారి ద్వారా తమ సమస్యలు పరిష్కరించుకుంటారు. కానీ ప్రజాప్రతినిధులు, అధికారులు తమ సమస్యలు పట్టించుకోకపోతే విసిగిపోయిన ప్రజలు ఎన్నికలే అదనుగా నిరసనకు దిగుతున్నారు. తమ సమస్యలు పరిష్కరిస్తేనే ఓట్లు వేస్తామని భీష్మిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎక్కడో చోట ఇలాంటి నిరసనల గురించి వింటుంటాం. అలాంటిదే ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ అమేథీ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఇంకొన్ని రోజుల్లో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలోని జామో బ్లాక్ పరిధిలోని పురే అల్పి తివారీ అనే కుగ్రామం ప్రజలు తమ గ్రామానికి రోడ్డు వేయాలని నిరసనకు దిగారు. గ్రామం వెలుపల స్థానికులు నినాదాలు చేస్తూ వచ్చే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తూ రోడ్డు వేయకపోతే ఓట్లు వేయబోమని బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. వీవీఐపీ నియోజకవర్గంగా పరిగణించే అమేథీ.. 2019లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గెలిచే వరకు నెహ్రూ-గాంధీ కుటుంబం ప్రాతినిధ్యం వహించింది. గ్రామస్తుల నిరసన గురించి సమాచారం అందిందని తదుపరి విచారణ తర్వాత సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామని గౌరీగంజ్ ఎస్డీఎం దిగ్విజయ్ సింగ్ వెల్లడించినట్లు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. ఆ కుగ్రామానికి చెందిన ఓంప్రకాష్ ఓఝా అనే వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్) ద్వారా తమ గ్రామ దుస్థతిని తెలియజేశారు. గ్రామాన్ని సమీప ప్రాంతాలకు కలుపుతున్న ఏడు చిన్న అస్తవ్యస్తమైన రోడ్లు ఉన్నప్పటికీ సరైన రోడ్లు లేకపోవడాన్ని ఎత్తిచూపారు. గ్రామానికి సరైన రోడ్డు లేకపోవటంతో గ్రామానికి చెందిన యువతీయువకుల వివాహాలు వేరే చోట చేయాల్సి వస్తోందని, వర్షం పడితే బైక్‌లు కదిలే పరిస్థితి ఉండదని వాపోయాడు. @myogiadityanath @PMOIndia @DmAmethi @CMOfficeUP @smritiirani No Road No Vote pure alpi Tiwari Sarme Jamon Amethi ke samast gram vasi isbaar vote ka vahiskar karege aaj bhi aadiwasiyon ki zindagi jeene ko majboor no road no nali no drinking water pure Alpi Tiwari Sarme Jamon pic.twitter.com/RHQj0bQXHA — Op Ojha (@opojha156070323) March 18, 2024 -
రాహుల్ ఉత్తరప్రదేశ్‌ను విడిచిపెట్టారా?
లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ తాజాగా అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అసోం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు చెందిన 43 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అయితే ఈ రెండో జాబితాలో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీల ఊసే ఎత్తలేదు. దీంతో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా అనేది సస్పెన్స్‌గానే మిగిలింది. మరోవైపు రాహుల్ గాంధీ అమేథీ నుంచి, ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాంటూ యూపీ కాంగ్రెస్ నేతలు తీర్మానం చేశారు. ఇంత జరుగుతున్నా పార్టీ హైకమాండ్ ఈ రెండు సీట్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రియాంక గాంధీ ఆసక్తి చూపడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనేందుకు ఆమె బరేలీకి రాలేదు. అయితే ఆ సమయంలో ఆమె ఆరోగ్యం బాగాలేదని, అందుకే యాత్రలో పాల్గొనలేకపోయారని పార్టీ నేతలు తెలిపారు. ప్రియాంక ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని కూడా వారు అంటున్నారు. మరోవైపు 2019 ఎన్నికల్లో అమేథీలో కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టిన బీజేపీ ఈసారి రాయ్‌బరేలీపై కన్నేసింది. రాయ్‌బరేలీ రాజకీయాలలో కీలకంగా ఉంటున్న ప్రముఖ నేతలు దినేష్ సింగ్, అఖిలేష్ సింగ్, మనోజ్ పాండేలు బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచారు. ఇది కాంగ్రెస్‌కు గట్టిపోటీ నిచ్చేలా ఉంది. రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తారా? లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. అయితే రాహుల్ గాంధీ వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీ నుంచి కూడా పోటీ చేయవచ్చని కొందరు విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ విషయంలో రాహుల్ తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. -
అమేథీ నుంచి రాహుల్ పోటీ?
అమేథీ: గతంలో పలుమార్లు తాను ప్రాతినిధ్యం వహించిన అమేథీ లోక్‌సభ స్థానం నుంచే ఈసారి కూడా రాహుల్ గాంధీ బరిలో దిగుతారని కాంగ్రెస్ పార్టీ అమేథీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రదీప్ సింఘాల్ చెప్పారు. ఢిల్లీలో సమావేశం తర్వాత అమేథీకి తిరిగొచి్చన సింఘాల్ మీడియాతో మాట్లాడారు. ‘‘ అమేథీ నుంచి ఈసారి కూడా పార్టీ అభ్యర్ధి రాహుల్ గాంధీయే. త్వరలోనే ఆయన పేరును ప్రకటిస్తారు’’ అని అన్నారు. అయితే దీనిపై పార్టీ అధిష్టానం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఇంకా జరగలేదు. ఆలోపే అభ్యర్థుల ఎంపికపై ఎలాంటి ప్రకటన వెలువడే అవకాశం లేదు. 2002 నుంచి 2019 దాకా అమేథీ నుంచి రాహుల్ గాంధీయే ప్రాతినిధ్యంవహిస్తూ వస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ అమేథీతోపాటు కేరళలోని వయనాడ్‌లోనూ పోటీకి దిగారు. అమేథీలో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే వయనాడ్‌లో విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు. -
హ్యాట్రిక్ నేతకు చుక్కలు చూపించిన మిస్ ఇండియా ఫైనలిస్ట్!
ఉత్తరప్రదేశ్ దేశంలో రాజకీయంగా చాలా కీలకమైన రాష్ట్రం. ఇక్కడి లోక్‌సభ స్థానాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతలు పోటీ చేస్తున్న సీట్లు ఇక్కడే ఉన్నాయి. గాంధీ-నెహ్రూ కుటుంబానికి కంచుకోటగా భావించే అమేథీ స్థానం నుంచి 2024 ఎన్నికల్లో మరోసారి లోక్‌సభకు ఎన్నికయ్యేందుకు పోటీలో నిలిచారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani). 2019 ఎన్నికల్లో స్మృతి ఇరానీ తీవ్ర ఎన్నికల పోరులో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు, వరుసగా మూడుసార్లు గెలిచిన రాహుల్ గాంధీని (Rahul Gandhi) ఓడించి సంచలనం సృష్టించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్‌పై ఇరానీ 55,120 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో వాయనాడ్ నియోజకవర్గంలో కూడా పోటీ చేసిన రాహుల్ గాంధీ అక్కడ నుంచి గెలిచి లోక్‌సభలోకి అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో రాహుల్ గాంధీ చేతిలో స్మృతి ఇరానీ ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత ఐదేళ్లలో తన పాపులారిటీని పెంచుకున్నారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించి చారిత్రాత్మక విజయంతో కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మరోసారి అమేథీ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే గత చారిత్రక పోరు మరోసారి పునరావృతం కానుంది. స్మృతి ఇరానీ గురించి.. 1976 మార్చి 23న జన్మించిన స్మృతి ఇరానీ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. 1998 మిస్ ఇండియా అందాల పోటీలో ఫైనలిస్టులలో ఒకరైన ఆమె.. ఏక్తా కపూర్ ప్రముఖ డైలీ సీరియల్ ‘క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ’లో తులసి విరానీ పాత్రతో ప్రత్యేక గుర్తింపు పొందారు. దీంతో మరిన్ని టీవీ షోలలోకూ ఆమె కనిపించారు. టెలివిజన్‌లో విజయవంతమైన నటనా జీవితం తర్వాత స్మృతి ఇరానీ 2003లో క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించారు. బీజేపీలో చేరిన ఆమె 2004లో పార్టీ మహారాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 2004 సాధారణ ఎన్నికల్లో ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కపిల్ సిబల్ చేతిలో ఓడిపోయారు. 2010లో బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. ఏడాది తర్వాత గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అమేథీ లోక్‌సభ నుండి అప్పటికే రెండుసార్లు గెలిచిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై 2014 ఎన్నికల్లో స్మృతి ఇరానీ బీజేపీ నుంచి పోటీ చేశారు. గాంధీ-నెహ్రూ కుటుంబానికి కంచుకోటగా భావించే ఆ స్థానంలో పోటీ చేసి ఆసక్తి రేకెత్తించగలిగారు. రాహుల్ గాంధీ గెలుపు మార్జిన్‌ను 1 లక్ష ఓట్లకు తగ్గించారు. ఓటమి పాలైనప్పటికీ ఆమె మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా నరేంద్ర మోదీ మొదటి మంత్రివర్గంలో చేరారు. 38 ఏళ్ల వయసులో ప్రధాని మోదీ తొలి క్యాబినెట్లో ఆమె అత్యంత పిన్న వయస్కురాలు. 2014 నుండి 2019 వరకు స్మృతి ఇరానీ హెచ్ఆర్డీ, టెక్స్టైల్స్, ఇన్ఫర్మేషన్ & బ్రాడ్‌కాస్టింగ్ పోర్ట్‌ఫోలియోలను నిర్వహించారు. 2019లో అమేథీ నుంచి రాహుల్ గాంధీని ఓడించి సంచలనం సృష్టించారు. ఈ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ కూటమి అభ్యర్థులను నిలబెట్టకుండా రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చినప్పకీ, స్మృతి ఇరానీ 50,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులయ్యారు. 2022 జూలై నుండి ఆమె మైనారిటీ వ్యవహారాల శాఖను కూడా నిర్వహిస్తున్నారు. స్మృతి ఇరానీ పార్సీ వ్యాపారవేత్త జుబిన్ ఇరానీని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
రాహుల్ కాదు వరుణ్.. అమేథీ ఓటర్ల యూటర్న్?
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అమేథీ(యూపీ) లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపడంతో, గాంధీ కుటుంబానికి పట్టంకట్టే స్థానికులు ఇప్పుడు వరుణ్ గాంధీవైపు చూస్తున్నారు. రాహుల్ 2019లో అమేథీ నుండి బీజేపీకి చెందిన స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయినప్పటి నుంచి తన ‘కుటుంబ నియోజకవర్గాన్ని’ తిరిగి దక్కించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. రాహుల్ ప్రస్తుతం కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. అలాగే రాహుల్ తిరిగి వయనాడ్ నుండి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తే.. రాయ్‌బరేలీని ఎంపిక చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల సోనియా గాంధీ అమేథీ నియోజకవర్గ ప్రజలకు రాసిన లేఖలో భవిష్యత్తులో ఇక్కడి ప్రజలు తన కుటుంబానికి మద్దతు ఇస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా దివంగత సంజయ్ గాంధీతోపాటు తన రాజకీయ అరంగేట్రం చేసిన ప్రముఖ కాంగ్రెస్ నేత రామ్ కరణ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. 1980లో సంజయ్ గాంధీ అమేథీ సీటును గెలుచుకోవడంతో గాంధీ కుటుంబానికి అమేథీతో అనుబంధం ఏర్పడిందని అన్నారు. రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయడానికి అంగీకరించకపోతే వరుణ్ గాంధీ అమేథీ నుండి పోటీ చేసే అవకాశం ఉందన్నారు. ఇదేగానీ జరిగితే, తామంతా వరుణ్‌కు మద్దతుగా నిలుస్తామని తెలిపారు. అయితే పార్టీ విధానాలను తీవ్రంగా విమర్శించే వరుణ్ గాంధీకి బీజేపీ టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో వరుణ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ అతనికి మద్దతు ఇచ్చే అవకాశాలున్నయనే వార్తలు వినిపిస్తున్నాయి. -
Smriti Irani నూతన గృహప్రవేశ వేడుక: సాంప్రదాయ లుక్‌లో కేంద్ర మంత్రి
# Smriti Irani Performs Griha Pravesh కేంద్ర మంత్రి ,అమేథీ ఎంపీ స్మృతి ఇరానీ కొత్త ఇంట్లోకి ప్రవేశించారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో 'గృహ ప్రవేశ' వేడుకలు సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. స్మృతి, జుబిన్ ఇరానీతో కలిసి గురువారం అమేథీలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉజ్జయని పూజారి ఆశిశ్ మహరాజ్ ఆధ్వర్యంలో గృహ ప్రవేశ వేడుకను నిర్వహించారు. విజయవంతమైన నటిగా , పార్లమెంటేరియన్‌గా మాత్రమేకాకుండా సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉంటారు. ఈ నేపథ్యంలోనూ ఆమె తన భర్త జుబిన్ ఇరానీతో కలిసి నిర్వహించిన వేడుక ఫోటోలను షేర్ చేశారు. అందమైన మెరూన్ , పసుపు రంగు చీరలో, క్రీమ్-హ్యూడ్ కుర్తాలో జుబిన్ హుందాగా కనిపించారు. ‘‘దుర్గామాత కృప, మహదేవుడి ఆశీర్వాదంతోపాటు, పెద్దోళ్ల ఆదరణ, చిన్నోళ్ల ప్రేమ, స్నేహంతో అమేథీలో కట్టుకున్న కొత్త ఇంట్లోకి ప్రవేశించా’’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీ, స్మృతి మధ్య పోటీ పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. #WATCH | Union Minister Smriti Irani and her husband Zubin Irani perform rituals at the 'Griha Pravesh' ceremony at their residence in Amethi, Uttar Pradesh. pic.twitter.com/dN4EoBXZkX — ANI (@ANI) February 22, 2024 సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అమేథీలో ఆమె గృహ ప్రవేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల్లో తాను గెలిస్తే అమేథీని శాశ్వత ఇంటి అడ్రస్‌గా మార్చుకుంటానని స్మృతి ఇరానీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కంచుకోట అమేథీలో తొలిసారి రాహుల్ గాంధీని ఓడించారు. అంతేకాదు ఈ వారం ప్రారంభంలో, రాబోయే ఎన్నికల్లో అమేథీ నుండి తనపై పోటీ చేయాలని స్మృతి, రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. బీజేపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన స్మృతి 2014లో రాహుల్ గాంధీతో పోటీపడి ఓటమి పాలయ్యారు. కానీ 2004 నుంచి వరుసగా మూడు సార్లు గెలుపొందిన రాహుల్‌ని ఓడించి 2019లో సంచలన విజయం సాధించారు. 2019 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా 2021లో అమేథీ గౌరీగంజ్ తహసీల్‌లోని మావాయి గ్రామంలో 15వేల చదరపు అడుగుల స్థలం కొనుగోలు చేశారామె. 2023లో ‘కిచ్డీ భోజ్’ కార్యక్రమం నిర్వహించి స్మృతి తాజాగా గృహ ప్రవేశం నిర్వహించారు. -
స్మృతి ఇరానీ ఇంట శుభకార్యం.. 20 వేల అతిథులు!
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ పరిధిలో గల మెదన్ మావాయి గ్రామంలో కేంద్ర మంత్రి, అమేథీ ఎంపీ స్మృతి ఇరానీ నూతనంగా ఇంటిని నిర్మించుకున్నారు. నేటి (గురువారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎంపీ స్మృతి ఇరానీ కుటుంబ సభ్యులు నూతన గృహంలో పూజలు నిర్వహించనున్నారు. సొంత ఇంటి గృహప్రవేశం సందర్భంగా స్మృతి ఇరానీ తన పార్లమెంటరీ నియోజకవర్గంలోని 20 వేల మందికి గురువారం మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. ఎంపీ స్మృతి ఇరానీ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ కొత్త ఇంటిలోకి అడుగుపెట్టనున్నారు. ఈ గృహ ప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి, అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా, మంత్రి ధరంపాల్ సైనీ, స్వతంత్ర దేవ్ సింగ్, అమేథీ ఇన్ఛార్జ్ మంత్రి గిరీష్ చంద్ర యాదవ్, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి మయాంకేశ్వర్ శరణ్ సింగ్ తదితరులు పాల్గొంటున్నారు. స్మృతి ఇరానీ నూతన నివాసంలో సేవకులు, అతిథులకు పత్యేక గదులతో పాటు విలేకరుల సమావేశ గది కూడా ఉంది. ఎంపీ స్మృతి ఇరానీ నూతన గృహం సిద్ధమైన తరుణంలో గ్రామాభివృద్ధి కూడా జరుగుతుందని స్థానికులు అంటున్నారు. -
రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సవాల్
లక్నో: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడమే కాకుండా సవాల్ల పర్వం మొదలైంది. తాజాగా కేంద్ర మంతి స్మృతి ఇరానీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర నేడు (సోమవారం) ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో అమేథీ లోకసభ నియోజకవర్గం నుంచి మళ్లీ రాహుల్ గాంధీ తనపై పోటీ చేయాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చాలెంజ్ చేశారు. ‘2019 పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఆయన అమేథీలో ఓడిపోతారు. ఆయనకు అమేథీలో గెలుస్తాననే విశ్వాసం ఉంటే మళ్లీ కేరళలోని వయ్‌నాడ్ లోక్‌సభ నియోజకవగర్గంలో పోటీ చేయకుండా ఆమేథీలో నాతో పోటీపడాలి’ అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సవాల్ విసిరారు. ఇక్కడి ప్రజలు రాహుల్ గాంధీ గురించి ఏం అలోచిస్తునన్నారో? అమేథీలోని ఖాళీ రోడ్లను చూస్తే స్పష్టంగా అర్థమవుతోందని స్మృతి ఇరానీ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆమె జన సంవాద్ కార్యక్రమంలో భాగంగా నాలుగు రోజుల పర్యటనలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో కంచుకోటగా ఉన్న అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో 2019లో రాహుల్ గాంధీ.. అనూహ్యంగా 55,000 ఓట్ల తేడాతో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. 80 లోక్‌సభ స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశో గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకే స్థానంలో గెలుపొందింది. కాంగ్రెస్ తరుఫున రాయ్‌బరేలీ సెగ్మెంట్లో సోనియాగాంధీ విజయం సాధించారు. రెండు స్థానాల్లో పోటీ చేసిన రాహుల్ గాంధీ.. అమేథీలో ఓడిపోయి కేరళలోని వయ్‌నాడ్‌లో గెలుపొందారు. అయితే ఇటీవల సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ పెద్దల సభ(రాజ్యసభ)కు నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రాహుల్ రాయ్‌బరేలీ ప్రజలు తమ కుటుంబంతోనే ఉంటారని అన్నారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కూడా స్మృతి ఇరానీ స్పందిస్తూ.. గాంధీ కుటుంబంలో ఎవరు? రాయ్‌బరేలీ ప్రజలతో ఉంటారని ప్రశ్నించారు. గాంధీ కుటుంబం రామ్‌బరేలీ స్థానాన్ని వదిలి వెళ్తారని ఎవరూ ఊహించలేదని అన్నారు. ఇక.. అమేథీ సెగ్మెంట్ నుంచి మళ్లీ రాహుల్ గాంధీ పోటీ చేస్తారా? లేదా? అనే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టత లేదు. ‘కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ.. అమేథీలో ఎవరు? పోటీ చేస్తారనే విసషంపై నిర్ణయం తీసుకోలేదు. రాహుల్ గాంధీ ఇక్కడ ఇప్పటీకే మూడుసార్లు గెలిపొందారు. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ కూడా అమేథీ సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీకి అమేథీ నియోజకవర్గం చాలా ముఖ్యమైంది’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ వెల్లడించారు. రాహుల్ గాంధీ యాత్ర రేపు(మంగళవారం) యూపీలోని రాయ్‌బరేలీకి చేరుకోనుంది. -
Parliament elections 2024: రాయ్‌బరేలీ, అమేథీల్లో సమరమే!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి వారి కంచుకోటలుగా పేరొందిన లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సమాజ్‌వాదీ పారీ్ట(ఎస్పీ) సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య పొత్తు విఫలమైంది. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలోకి బీఎస్పీని ఆహా్వనించాలన్న ప్రతిపాదనను సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాంతో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి, అఖిలేశ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. యూపీలోని 80 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీలను నియమించింది. ప్రస్తుతం యూపీలో రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ), అప్నాదళ్ (కమేరావాదీ)తో సమాజ్‌వాదీ పార్టీ పొత్తు కొనసాగిస్తోంది. సర్వశక్తులూ ఒడ్డుతాం: అఖిలేశ్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడానికి సర్వశక్తులూ ఒడ్డుతామని, సంక్రాంతి తర్వాత పొత్తులపై మాట్లాడుతామని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. కాంగ్రెస్ పారీ్టతో స్నేహాన్ని వదులుకొని, తమ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవలి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తమను బాగా అవమానించిందన్న భావన ఆయనలో ఉందంటున్నారు. యూపీలో కాంగ్రెస్ కంచుకోటలుగా పేరొందిన రాయ్‌బరేలీ, అమేథీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ నుంచి అభ్యర్థులను బరిలో దింపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ రెండు నియోజకవర్గాల్లో సమాజ్‌వాదీ పారీ్టకి బలమైన క్యాడర్ ఉంది. అమేథీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఎస్పీకి ఇద్దరు, బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్ పారీ్టకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. రాయ్‌బరేలీ పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఎస్పీకి నలుగురు, బీజేపీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత, సిట్టింగ్ ఎంపీ సోనియా గాంధీ ఇక్కడి నుంచి ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేకపోయారు. రాయ్‌బరేలీ నుంచి ఉంచాహర్ ఎమ్మెల్యే మనోజ్ పాండేను, అమేథీ నుంచి గౌరీగంజ్ ఎమ్మెల్యే రాకేశ్ ప్రతాప్‌సింగ్‌ను బరిలో దింపే యోచనలో అఖిలేశ్ ఉన్నట్లు సమాచారం. నిజానికి కాంగ్రెస్, ఎస్పీ మధ్య పొత్తు లేనప్పుడు రాయ్‌బరేలీ, ఆమేథీ నుంచి సమాజ్‌వాదీ పార్టీ తమ అభ్యర్థులను పోటీ చేయించలేదు. ఈసారి మాత్రం పోటీకి సై అంటుండడం ఆసక్తికరంగా మారింది. సమాజ్‌వాదీ అభ్యర్థులు పోటీ చేస్తే రెండు కీలక నియోజకవర్గాల్లో ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చెమటోడ్చక తప్పదు. -
అమేథీలో మళ్లీ రాహుల్ Vs స్మృతి?
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని తన మునుపటి అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని యూపీ కాంగ్రెస్ అధ్యక్షులు అజయ్ రాయ్ మరోమారు స్పష్టం చేశారు. తరతరాలుగా గాంధీ కుటుంబం అమేథీ ప్రజల కోసం ఎంతో కష్టపడి పనిచేస్తోందని, 2024 ఎన్నికల్లో రాహుల్ ఈ స్థానం నుంచే పోటీ చేస్తారని యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ పునరుద్ఘాటించారు. కాగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్.. అమేథీలో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ అమేథీ స్థానంలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో 55 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే అదేసమయంలో రాహుల్ కేరళలోని వయనాడ్ సీటులో 4.31 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. మొదటిసారిగా దక్షిణ భారతదేశంతో కాంగ్రెస్ సత్తాను చాటారు. రాహుల్ గాంధీ తన పాత కంచుకోట అమేథీకి తిరిగి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అజయ్ రాయ్ తన అభిప్రాయం తెలియజేయడం ఇది రెండోసారి. గతంలో లక్నోలో కూడా ఆయన ఇదే తరహా ప్రకటన చేశారు. ఇదిలా ఉండగా రామ మందిర ప్రారంభోత్సవాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చడం ద్వారా లబ్ధిపొందాలని బీజేపీ చూస్తున్నదని ఆయన విమర్శించారు. రామ మందిర నిర్మాణం అనేది మతవిశ్వాసాలకు సంబంధించిన అంశమని, దానిని భారీ కార్యక్రమంగా చేయకూడదని అన్నారు. ఎన్నికల సంవత్సరంలో జనాన్ని వంచించేందుకు బీజేపీ ఇలాంటి పనులను చేస్తున్నదన్నారు. రాముడు అందరివాడని, బీజేపీకే పరిమితం కాడని అజయ్ రాయ్ అన్నారు. కాగా అమెథీ లోక్‌సభ బరిలో బీజేపీ తిరిగి స్మృతి ఇరానీని రాహుల్‌తో పోటీకి దించనున్నదని సమాచారం. ఇది కూడా చదవండి: సొరంగ బాధితులకు భారీ ఉపశమనం.. -
అమేథీతో గాంధీ- నెహ్రూ కుటుంబానికున్న సంబంధం ఏమిటి?
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కొత్త చీఫ్ అజయ్ రాయ్ ప్రకటించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇదే స్థానంలో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. 1967లో ఏర్పడిన అమేథీ.. నాటి నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. గత నాలుగు సంవత్సరాలుగా 1970-1990వ దశకాల ప్రారంభంలో మినహా, నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారు లేదా వారి విధేయులు ఈ నియోజకవర్గంలో గెలుపొందుతూ వస్తున్నారు. అమేథీతో నెహ్రూ-గాంధీ కుటుంబానికి గల దశాబ్దాల నాటి సంబంధం గురించి ఇప్పుడు తెలుకుందాం. సంజయ్ గాంధీ (1980–81) గాంధీ-నెహ్రూ కుటుంబంలో అమేథీ లోక్‌సభ నుంచి పోటీ చేసిన తొలి వ్యక్తి సంజయ్ గాంధీ. ఎమర్జెన్సీ ముగిసిన వెంటనే జరిగిన 1977 లోక్‌సభ ఎన్నికల్లో సంజయ్ అమేథీ నుంచి పోటీ చేశారు. అయితే జనాభా నియంత్రణ కోసం సంజయ్ చేపట్టిన బలవంతపు స్టెరిలైజేషన్ కార్యక్రమం కారణంగా అతను ఘోరమైన ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. నాటి ఎన్నికల్లో జనతా పార్టీకి చెందిన రవీంద్ర ప్రతాప్ సింగ్ విజయం సాధించారు. సంజయ్ గాంధీ తిరిగి 1980 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసి, ఎంపీ అయ్యారు. అయితే 1981లో జరిగిన విమాన ప్రమాదంలో సంజయ్ మరణించారు. అమేథీ ఎంపీగా స్వల్పకాలమే పనిచేశారు. రాజీవ్ గాంధీ (1981–1991) సంజయ్ మరణంతో రాజీవ్ గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1981 మే 4న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఇందిరా గాంధీ తన చిన్న కుమారుని పేరును అమేథీ అభ్యర్థిగా ప్రతిపాదించారు. సమావేశానికి హాజరైన కాంగ్రెస్ సభ్యులందరూ ఈ సూచనను ఆమోదించారు. అనంతరం రాజీవ్ అమేథీ నుంచి తన అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశారు. రాజీవ్ నాటి ఉప ఎన్నికలో అఖండ విజయాన్ని సాధించారు. లోక్‌దళ్ అభ్యర్థి శరద్ యాదవ్‌పై 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాజీవ్ 1981 ఆగస్టు 17న అమేథీ నుంచి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. దీని తరువాత కూడా రాజీవ్ 1984, 1989,1991లో అమేథీ నుండి గెలిచారు. దాదాపు దశాబ్దం పాటు ఈ సీటును నిలబెట్టుకున్నారు. 1991లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం రాజీవ్ గాంధీని హత్య చేసిన తర్వాత అమేథీలో తిరిగి ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి సతీష్ శర్మ విజయం సాధించారు. 1996 ఎన్నికల్లోనూ ఆయన తన విజయాన్ని పునరావృతం చేశారు. ఇది కూడా చదవండి: నకిలీ టీచర్లకు ప్రమోషన్లు.. దర్జాగా విద్యార్థులకు పాఠాలు.. 14 ఏళ్ల ముసుగు తొలగిందిలా! సోనియా గాంధీ (1999–2004) 1999లో రాజీవ్ గాంధీ సతీమణి సోనియా గాంధీ అమెథీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు ఇక్కడి జనం నెహ్రూ-గాంధీ కుటుంబానికిచెందిన చెందిన నేతకు మరోసారి ఓటు వేశారు. అయితే అదే స్థానం నుంచి ఆమె మరోమారు ఎన్నికల బరిలోకి దిగలేదు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో సోనియా స్వయంగా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయగా, రాహుల్ గాంధీ అమేథీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ (2004-2019) రాహుల్ తన తొలి ప్రయత్నం(2004)లోనే అమేథీ నుంచి గెలుపొందారు. 2009లో 3.70 లక్షల ఓట్ల భారీ తేడాతో తిరిగి ఎన్నికయ్యారు. 2014లో కూడా రాహుల్ ఇక్కడి నుంచే గెలిచారు. అయితే నాడు అతని ప్రత్యర్థి స్మృతి ఇరానీ అతనికి గట్టి పోటీనిచ్చారు. అయితే స్మృతి ఇరానీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ను ఓడించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ మళ్లీ అమేథీలో సత్తా చాటుతారని కాంగ్రెస్ భావిస్తోంది. రాహుల్ ఇటీవల చేపట్టిన భారత్ జోడో యాత్ర, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం ఇందుకు కలసివస్తాయనే అంచనాలున్నాయి. ఇది కూడా చదవండి: కళలతో కోట్లు.. వీరి టర్నోవర్ చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..! -
రాహుల్ గాంధీ విషయంలో ప్రజలు తమ తప్పు తెలుసుకున్నారు..
లక్నో: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మళ్ళీ అమేధీ లోక్ సభ స్థానం నుంచే పోటీ చేస్తారని కరాఖండిగా చెబుతున్నారు యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్. అమేధీ ప్రజలు గత ఎన్నికల్లో ఆయనను ఓడించి తాము చేసిన తప్పును సరిచేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బ్రీజ్ లాల్ ఖబ్రీ స్థానంలో నియమితులైన అజయ్ రాయ్ బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల వ్యవధిలోనే కీలక ప్రకటన చేసి సంచలనానికి తెర తీశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమేధీ నుంచే పోటీ చేస్తారని ప్రకటన చేశారు. మొదట కచ్చితంగా పోటీ చేస్తారని చెప్పిన ఆయన తర్వాత విలేఖరులు నొక్కి మరీ ప్రశ్నించడంతో కాస్త తటపటాయించి.. క్లాంగ్రెస్ కార్యకర్తలతో పాటు అమేధీ ప్రజలు కూడా గత ఎన్నికల్లో తాము చేసిన పొరపాటుని సరిచేసుకుని ఈసారి ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇదే పార్లమెంటు స్థానంలో గెలిచిన స్మృతి ఇరానీ కిలో పంచదార కేవలం రూ.15 కే అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ పంచదార ఎటు పోయిందంటూ ప్రశ్నించారు. గత రెండు పర్యాయాల్లో వారణాసి నుండి ప్రధాని నరేంద్ర మోదీపై పొటీ చేసిన అజయ్ రాయ్ ఈసారి ప్రియాంక గాంధీ ఇక్కడ నుండి పోటీ చేస్తానంటే తనతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. . గత సార్వత్రిక ఎన్నికల్లో అమేధీ నుండి పోటీ చేసిన రాహుల్ గాంధీని బీజేపీ అభ్యర్థి ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓడించారు. 2004 నుండి ఇదే పార్లమెంటు స్థానం నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన రాహుల్ గాంధీ గత పర్యాయం 2019లో మాత్రం ఓటమిని చవిచూశారు. అయినా కూడా ఆయన కేరళలోని వాయనాడ్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచి చట్టసభలో అడుగుపెట్టారు. ఇది కూడా చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఎన్నికల కమిటీలు -
పరాభవం పాలైన చోటు నుంచే రాహుల్ గాంధీ పోటీ
లక్నో: దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో దేశ రాజకీయాలు కూడా మెల్లమెల్లగా వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేధీ నుంచే మళ్లీ పోటీ చెయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు యూపీ కాంగ్రెస్‌కు చెందిన ఓ సీనియర్ నాయకుడు స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేశారు. ఒకటి యూపీలోని అమేధీ కాగా.. రెండోది కేరళలోని వయనాడ్. అయితే.. అమేధీలో ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో దాదాపు 55 వేల ఓట్లతో ఓడిపోయిన రాహుల్ గాంధీ.. వయనాడ్‌లో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. అయితే.. గత ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని యూపీ కాంగ్రెస్ దృఢ నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. మోదీ ఇంటిపేరు వ్యాఖ్యల కేసులో తన పదవిని కోల్పోయిన రాహుల్ గాంధీ.. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఇటీవలే మళ్లీ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారు. ప్రధాని మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణంలోనూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రెండోసారి భారత్ జోడో యాత్రతో దేశ ప్రజలను ఆకట్టుకోవాలని సంకల్పంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అమేథీ నుంచే రాహుల్ గాంధీ మళ్లీ పోటీ చేయనున్నారనే వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదీ చదవండి: మణిపూర్‌లో రెండు వారాల తర్వాత మళ్లీ చెలరేగిన హింస.. కాల్పుల్లో ముగ్గురి మృతి -
వీడియో: బీజేపీ నేతపై ఎస్పీ ఎమ్మెల్యే దాడి.. కారణం ఇదే..
అమేథి: ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేతపై సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే దాడికి చేశారు. పోలీసు స్టేషన్ వద్ద పోలీసుల ఎదుటే ఆయన దాడి చేయడం గమనార్హం. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్ సింగ్ బుధవారం గౌరిగంజ్ కోత్వాలి పోలీసు స్టేషన్ వద్ద ధర్నాలో పాల్గొన్నారు. బీజేపీ నేత దీపక్ సింగ్ తన మద్దతుదారులపై దాడి చేశారని ఆరోపిస్తూ ప్రతాప్ సింగ్ నిన్న రాత్రి గౌరీగంజ్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్బంగా బీజేపీ నేత దీపక్ సింగ్ అక్కడికి వచ్చారు. అయితే, కారు దిగిన వెంటనే దీపక్ సింగ్.. ఎమ్మెల్యే ప్రతాప్ సింగ్, అతడి అనుచరులను దూషించారు. దీంతో, ఆగ్రహానికి లోనైన రాకేష్ ప్రతాప్ సింగ్ ఒక్కసారిగా దీపక్ సింగ్‌పై దాడికి పాల్పడ్డారు. అతడి అనుచరులు కూడా దీపక్ సింగ్‌పై ఎగబడ్డారు. అయితే, ఇంతలో తేరుకున్న పోలీసులు.. వారికి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ.. ఎమ్మెల్యే, అతడి అనుచరులు మాత్రం బీజేపీ నేతలను తీవ్రంగా కొట్టారు. Warning: Disturbing video, abusive content Inside Gauriganj Kotwali police station in UP's Amethi district. Samajwadi Party MLA Rakesh Pratap Singh and his supporters attack Deepak Singh, husband of Nagar Palika chairman BJP candidate Rashmi Singh. pic.twitter.com/BcJGQEMzGY — Piyush Rai (@Benarasiyaa) May 10, 2023 అనంతరం, ఎమ్మెల్యే రాకేష్ మాట్లాడుతూ.. మేము ప్రశాంతంగా ధర్నా చేస్తుంటే దీపక్ సింగ్ అక్కడికి వచ్చి అసభ్యకరంగా మాట్లాడారు. అతను బూతులు తిడుతున్నా పోలీసులు మాత్రం దీపక్ సింగ్‌ను వారించలేదు. నాపై, మా పార్టీ కార్యకర్తలను దూషించిన కారణంగానే దాడి చేశామని చెప్పుకొచ్చారు. ఇక, ఈ ఘటనలో ఇరు వర్గాలపై కేసుల నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్ సింగ్ పోలీసుల ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. In UP's Amethi, another video of Samajwadi Party MLA Rakesh Pratap Singh threatening to kill self in front of policemen has surfaced. Accusing BJP leader Deepak Singh of assaulting his supporters, MLA Rakesh Pratap Singh had sat on dharna at Gauriganj police station last night. pic.twitter.com/oG2nZssGSU — Piyush Rai (@Benarasiyaa) May 10, 2023 ఇది కూడా చదవండి: కర్ణాటక ఎన్నికలు.. దుఃఖాన్ని దిగమింగి బందోబస్తు విధులకు -
2024లో అమేథీ నుంచి పోటీ చేస్తాం!
లక్నో: 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తామని సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది. అక్కడ పేద మహిళల పరిస్థితి దారుణంగా మారిందని పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కణ్నుంచి ఎంతోమంది ప్రముఖులు లోక్‌సభకు ఎన్నికవుతున్నప్పటికీ పేదల బతుకులు మాత్రం మారడం లేదని వాపోయారు. ఇక యూపీలోని ఇతర ప్రాంతాల్లో ప్రజల జీవితాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. ‘‘అందుకే, వచ్చే ఎన్నికల్లో అమేథీలో బడా నాయకులు కాకుండా మంచి మనసున్న వ్యక్తులు గెలుస్తారు’’ అంటూ సోమవారం ఆయన ట్వీట్ చేశారు. అమేథీలో పేదరికాన్ని నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు. ఆ స్థానాన్ని సమాజ్‌వాదీ ప్రతిసారీ కాంగ్రెస్‌కు వదిలేస్తోంది. అక్కడ ప్రస్తుతం కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఎంపీగా ఉన్నారు. ఆమె 2019లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఓడించారు. -
కేంద్ర మంత్రిని గుర్తుపట్టని అధికారి.. ఉద్యోగానికి ఎసరు?
లక్నో: పైఅధికారులు ఫోన్ చేస్తేనే ఎంతో హడావిడి చేస్తారు అధికారులు. అలాంటిది కేంద్ర మంత్రి ఫోన్ అంటే మరి ఎలా ఉంటుంది? కానీ, ఫోన్ చేసిన కేంద్రమంత్రి గొంతును గుర్తుపట్టకపోవడం వల్ల ఓ అధికారి ఉద్యోగానికే ఎసరు తెచ్చింది. కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి, ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గ ఎంపీ స్మృతి ఇరానీ ఫోన్ చేయగా ఓ శాఖలో పని చేస్తున్న క్లర్క్ గుర్తించకపోవటంతో ఆయనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఏం జరిగింది? అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆగస్టు 27న పర్యటించారు. అదే సమయంలో ముసఫిర్ఖానా తహసిల్‌లోని పూరే పహల్వాన్ గ్రామానికి చెందిన కరుణేశ్(27) అనే వ్యక్తి తన తల్లికి పెన్షన్ మంజూరు కాలేదనే విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అందుకు స్థానిక కార్యాలయంలో క్లర్క్ దీపక్ కారణమని పేర్కొన్నారు. పెన్షన్ దరఖాస్తును ఇంకా అతడు ధ్రువీకరించలేదని తన గోడు వెల్లబోసుకున్నాడు. వెంటనే స్పందించిన స్మృతి ఇరానీ.. ఆ అధికారికి ఫోన్ చేశారు. కానీ, ఆ వ్యక్తి మాత్రం కేంద్ర మంత్రి గొంతును గుర్తు పట్టలేకపోయారు. దీంతో ఆమె పక్కనే ఉన్న జిల్లా ఉన్నతాధికారి ఆ ఫోన్ తీసుకొని క్లర్క్‌తో మాట్లాడారు. వెంటనే కార్యాలయానికి రావాలని స్పష్టం చేశారు. ఈ విషయంపై విచారణ జరపాలని జిల్లా అధికారులకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సూచించారు. కరుణేశ్ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన అధికారులు.. క్లర్క్ నిర్లక్ష్యం వహించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై ముసఫిర్ఖానా సబ్‌డివిజినల్ మేజిస్ట్రేట్ విచారణ జరుపుతారని.. నివేదిక ప్రకారం నిర్లక్ష్యం వహించిన అధికారిపై చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: మోదీ రోజుకు ఏడు సార్లు నమాజ్ చేసేవారు.. కాంగ్రెస్ మహిళా నేత వ్యాఖ్యలపై దుమారం.. -
పుట్టింటికి నడిచొచ్చిన పుస్తకం
మనకు కల ఒకటుంటుంది మన పని మరొకటుంటుంది బాధ్యతల బరువుంటుంది. తప్పక చేయాల్సిన విధి ఇంకొకటుంటుంది. ఇన్నింటి మధ్య కలను బతికించుకుంటూ వెళ్లాలనే తపన ఉంటే అది మమతా సింగ్ అవుతుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ వాసి మమత. అగ్రసర్ అనే గ్రామంలో పుట్టింది. చదువు, పెళ్లి రీత్యా ఏళ్ల క్రితమే ఊరు వదిలి నగరానికి చేరుకుంది. చదువు పూర్తయ్యింది. పెళ్లి అయ్యింది. ఉద్యోగం వచ్చింది. అప్పుడు మొదలయ్యింది. పుట్టిన ఊరుకు ఏదైనా చేయాలి. ఏం చేయాలి.. ?! ఆలోచనలు తెగలేదు. పుస్తకాలంటే తనకు ఇష్టం. పుస్తకం ఇచ్చిన జ్ఞానం అన్నింటినుంచి మనల్ని ప్రత్యేకంగా ఉంచుతుంది అనిపించింది. ఆ పుస్తకాన్ని పుట్టిన ఊళ్లోని ప్రజలకు చేరువ చేయాలనుకుంది. ‘పుస్తకాల పురుగు’ అని స్నేహితులు అంటుంటే విని నవ్వి ఊరుకునేది. ఇప్పుడు ఆ పుస్తకాన్ని పట్టుకుని తను పుట్టి పెరిగిన ఊరికి టీచర్‌గా వెళ్లడమే కాదు, అక్కడివాళ్లకు లైబ్రరీని కానుకగా ఇచ్చింది. వీటి గురించి మమతను కదిలిస్తే పుస్తకం తనకిచ్చిన గొప్ప జీవితం గురించి చెబుతారామె... ‘‘నా చిన్నతనంలో అమ్మ పుస్తకాలను పరిచయం చేసింది. పుస్తకాల మీద నాకున్న మక్కువ వల్ల చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా పుస్తకాలు సేకరించాను. నా దగ్గర ఉన్న పుస్తకాలన్నీ చూసి, లైబ్రరీని ఏర్పాటు చేయచ్చు కదా అని నా ఫ్రెండ్ అన్నప్పుడు ఆ సలహా నచ్చింది. అది ఊళ్లో అయితే బాగుంటుందనిపించింది. నా దగ్గరున్న 1200 పుస్తకాలతో ఊళ్లో చిన్న లైబ్రరీని ప్రారంభించాను. సిగరెట్, మద్యం కోసం డబ్బు ఖర్చుపెట్టే జనం రెండు రూపాయలు పుస్తకాల కోసం ఖర్చు పెట్టడానికి వెనకాడతారని నాకు తెలుసు. అందుకే ఉచితంగా పుస్తకాలను అందుబాటులో ఉంచాలనుకున్నాను. ఇప్పుడు 4,000 కంటే ఎక్కువ పుస్తకాలు ఈ లైబ్రరీ లో ఏర్పాటు చేశాను. వీటిలో కొన్ని పుస్తకాలు స్నేహితులు ఇచ్చారు. కంప్యూటర్ వంటి పరికరాలు మా కుటుంబ సభ్యులు ఇచ్చారు. అయితే, ముందు ఈ ప్రక్రియ అంత సులభం కాలేదు. అడ్డుగా నిలిచిన ఇనుపగోడ కుల, లింగ వివక్షత అనేవి ప్రజల మనసుల్లో బలంగా ఉండిపోయాయి. మరోవైపు అట్టడుగు వర్గాల వాళ్లు గ్రంథాలయానికి రావడానికి వెనుకాడుతున్నారు. లైబ్రరీకి ‘సావిత్రీబాయి పూలే’ పేరు పెట్టడంతో జనం రావడమే లేదు. నేను ఆ ఊరి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయదలుచుకో లేదు, ఇందులో నాకేవిధమైన వ్యక్తిగత ప్రయోజనం లేదు, ఊళ్లో జనాల్ని పుస్తకాలతో అనుసంధానించాలనుకున్నాను. కానీ, ఊళ్లో కొందరు పెద్దలకు ఇది నచ్చలేదు. నా కుటుంబంలో నా సోదరుడు, అతని భార్యనే నాకు ఇనుపగోడగా అడ్డు నిలిచారు. దీనిని పడగొట్టడానికి నేను పెద్ద ప్రయత్నమే చేశాను. ఈ పనిలో నా పిల్లల నుండి కూడా నాకు మద్దతు లభించింది. ఇప్పుడు దగ్గరలోని మరో రెండు గ్రామాల్లోనూ గ్రంథాలయ శాఖలు ఏర్పడ్డాయి. పెరిగిన మహిళల సంఖ్య ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగనియామకానికి నేను పుట్టిపెరిగిన ఊరిని ఎంచుకున్నాను. దీనికి అమ్మనాన్నలు, అత్తమామలు ఇద్దరి మద్దతు లభించింది. లైబ్రరీ ఏర్పాటుకు కూడా! కానీ, గ్రామస్థులకు సమస్య అయ్యింది. కూర్చొని పుస్తకాలు చదవగలిగే లైబ్రరీ లాంటి ప్రదేశం ఒకటుంటుందని వారికి తెలియదు. మొదట్లో పుస్తకాల దుకాణం అనుకున్నారు. పోటీ పరీక్షల పుస్తకాల నుంచి నోట్‌బుక్స్ వరకు కావాలని వారు అడుగుతున్నప్పుడు ‘ఇది స్టేషనరీ దుకాణం కాదు, లైబ్రరీ అని, ఇక్కడ చదవడానికి పుస్తకాలు అందుబాటులో అదీ ఉచితంగా ఉంటాయని చెప్పాను. మెల్లగా ఒక్కొక్కరు రావడం మొదలయ్యింది. పాత టైరుతో అటూ ఇటూ పరిగెత్తే పిల్లలు, గొడవపడే పిల్లలు అప్పుడప్పుడు రావడం మొదలయ్యింది. ఇప్పుడు పిల్లలే కాదు మహిళలు కూడా లైబ్రరీలో చదువుకోవడానికి వస్తుంటారు. ఈ లైబ్రరీలో అన్ని వయసుల వారికీ పుస్తకాలు ఉన్నాయి. లాక్డౌన్ సమయంలో చిన్నపిల్లలే కాదు టీనేజర్లు కూడా లైబ్రరీలో కూర్చొని పుస్తకాల గురించి చర్చించుకునేవారు. ఈ పుస్తకాలు సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం నేర్పడమే కాకుండా వారి హృదయాలను సున్నితంగా మార్చుతున్నాయి. నేర్పిన ఒంటరి ప్రయాణం పద్దెనిమిదేళ్ల వరకు నేను ఒంటరిగా ఇంటి నుంచి బయటకు వెళ్లలేదు. ఒంటరిగా రోడ్డు దాటింది లేదు. ‘తక్కువ మాట్లాడు, సున్నితంగా మాట్లాడు, అందరి మాటల్ని విను, దుపట్టాను పక్కకు జరగనీకు’ ఇలా చాలా మంది పెద్దవాళ్లు చెప్పిన సలహా ప్రకారం మంచి అమ్మాయి చేసేదంతా నేను చేశాను. కానీ, బంధువులందరిలోనూ ఏదో ఒక లోపం కనిపించడం నేను చూశాను. సమాజం ఇచ్చిన మంచి అమ్మాయి స్లాట్‌లో నన్ను నేను సరిపెట్టుకోవడంలో విసిగిపోయాను. జ్ఞానానికి ప్రత్యామ్నాయం లేదని పుస్తకాల ద్వారా తెలుసుకున్నా, అన్నదమ్ముల కారణంగా వ్యక్తిత్వం బలపడింది. నా భర్త ప్రోత్సాహం వల్ల నా భయాలన్నింటినీ జయించి తొలిసారి ఒంటరి యాత్రకు వెళ్లాను. అండమాన్ నికోబార్ వరకు ఒంటరిగా నడిచాను. పుస్తకాలు సంతోషపరుస్తాయి. ప్రయాణం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని ఈ పర్యటన నాకు నేర్పింది. జీవితంలో చాలాసార్లు నిర్ణయాలు తీసుకుంటాం. కానీ, వాటితో దృఢంగా నిలబడే ఓపిక మనకు ఉండదు. అటువంటి పరిస్థితిలో ఇతరులు చెప్పేదానికంటే మీ హృదయ స్వరం వినడం, మీరు నిర్ణయించుకున్న మార్గంలో నడవడం చాలా ముఖ్యం అని అర్థం చేసుకోవాలి. నేను అదే చేశాను. నా పుస్తకాల ప్రపంచంలో నా గ్రామాన్ని మొత్తం చేర్చాను. ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. నా కల సంపూర్ణమైందన్న భావన నాకు కలిగింది’’ అంటారు మమతాసింగ్. -
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు.. నామినేషన్లో రెండో భార్య పేరు, దాంతో
అమేథీ: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. అమేథీ బీజేపీ అభ్యర్థి సంజయ్ సింగ్‌పై ఆయన మొదటి భార్య, ఆ పార్టికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే గరిమా సింగ్ బుధవారం రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు! ఏమనో తెలుసా? ఎన్నికల అఫిడవిట్లో భార్యగా తన పేరు రాయలేదని! రెండో భార్య అమితా సింగ్ పేరు రాశారని! దీనిపై ఆర్వోకు రాతపూర్వకంగా అభ్యంతరం వెలిబుచ్చినట్టు చెప్పారామె. తన హక్కు కోసం పోరాడేందుకే భర్తపై ఫిర్యాదు చేశానన్నారు. ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తారా అని అడగ్గా, ‘‘ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కానీ పార్టీ ఆదేశానుసారం నడుచుకుంటా’’ అని చెప్పారు. సంజయ్‌సింగ్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. అమేథీ టికెట్ కోసం ఆయన భార్యలిద్దరూ పోటీ పడగా వారిని కాదని సంజయ్‌కి పార్టీ అవకాశమిచ్చింది. -
దళిత బాలికపై అమానుషం.. కాళ్లు కట్టేసి.. కర్రతో కొట్టి
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. దొంగతనం పేరుతో ఓ దళిత బాలికను చిత్రహింసలు పెట్టారు. కాళ్లు చేతులు కట్టేసి, తీవ్ర వేధింపులకు గురిచేశారు. యూపీలోని అమేథీ జిల్లాలోని రాయ్‌పూర్ పుల్వారీ పట్టణంలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొందరు వ్యక్తులు 16ఏళ్ల దళిత బాలికను బంధించి చితకబాదారు. దొంగతనం పేరుతో కాళ్లు చేతులు కట్టేసి దాడి చేశారు. ఇద్దరు వ్యక్తులు బాలికను కింద పడేయగా.. మరో వ్యక్తి ఆమె రెండు కాళ్ల కళ్ల మధ్య కర్రను ఉంచి మరో కర్రతో కొడుతూ క్రూరంగా ప్రవర్తించాడు. అక్కడే ఉన్న ముగ్గురు మహిళలు సైతం దాడిని అడ్డుకోకుండా నిందితులకు సహకరించారు. బాలిక నొప్పి పుడుతుందని చెబుతున్నా కూడా ఎలాంటి కనికరం లేకుండా వ్యక్తి ఆమెను నేల మీద జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ యూపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ అమానవీయ చర్యకు పాల్పడిన నేరస్థులను 24 గంటల్లో పట్టుకోకపోతే, తీవ్ర ఆందోళనలతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ కృషి చేస్తోందని ట్వీట్ చేశారు. ‘అమేథీలో దళిత బాలికపై నిర్దాక్షిణ్యంగా కొట్టిన ఘటనను ఖండిస్తున్నాం. యోగీ ఆదిత్యానాథ్ పాలనలో ప్రతిరోజూ సగటున 34 దళితులపై, మహిళలపై 135 నేరాలు జరుగుతున్నాయి, అయినా మీ శాంతిభద్రతలు నిద్రపోతున్నాయి.’ అంటూ చురకలంటించారు. చదవండి: వివాహితకు మరో వ్యక్తితో పరిచయం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి अमेठी में दलित बच्ची को निर्ममता से पीटने वाली ये घटना निंदनीय है। @myogiadityanath जी आपके राज में हर रोज दलितों के खिलाफ औसतन 34 अपराध की घटनाएं होती हैं, और 135 महिलाओं के ख़िलाफ़, फिर भी आपकी कानून व्यवस्था सो रही है।…1/2 pic.twitter.com/mv1muAMxkr — Priyanka Gandhi Vadra (@priyankagandhi) December 29, 2021 అదే విధంగా అమేథీ ఎంపీ, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ సైతం ఈ ఘటనపై స్పందిస్తూ.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇక అమేథీ ఎస్పీ స్పందిస్తూ.. ముగ్గురు నిందితులు శుభ గుప్తా, రాహుల్ సోని, సూరజ్ సోనిని అరెస్ట్ చేశామని తెలిపారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తన కూతురికి మతిస్థిమితం సరిగా లేదని, దారి మరిచిపోవడం వల్ల ఆ ఇంట్లోకి పొరపాటున వెళ్లిందని బాధితురాలి తండ్రి తెలిపారు. దీంతో దొంగతనం చేసిందనన్న నెపంతో కూతురిపై ఇలా దాడి చేశారని ఆరోపించారు. చదవండి: బాలిక హత్యాచార కేసు: జడ్జికి చేదు అనుభవం! -
దేశంలో ఇక్కట్లకు హిందుత్వే కారణం
అమేథి: దేశంలో ధరల పెరుగుదల, బాధలు, విచారాలన్నింటికీ హిందుత్వే ప్రత్యక్ష కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. 2019లో ఓటమి అనంతరం శనివారం ఆయన రెండో మారు అమేథిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఒక ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. భారత్‌లో హిందుత్వవాదుల వల్లే అనేక సమస్యలు వస్తున్నాయని దుయ్యబట్టారు. ‘హిందువులు, హిందుత్వవాదులకు మధ్య పోరు నడుస్తోంది. హిందువులు సత్యాగ్రహంపై నమ్మకం ఉంచగా, హిందుత్వవాదులు సత్తాగ్రహ్(రాజకీయ దురాశ)ను నమ్ముతున్నారు’ అని అన్నారు. పార్టీ నేత ప్రియాంక గాంధీతో కలిసి అమేథిలో ఆయన ఆరు కి.మీ.ల పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. నిరుద్యోగితపై మోదీ మాట్లాడరని, గంగలో మునకలు మాత్రం వేస్తారని ఎద్దేవా చేశారు. ‘హిందువులు కోట్లాదిమంది తోటివారితో కలిసి గంగలో స్నానాలు చేస్తుంటే, హిందుత్వ మాత్రం ఒంటరిగా గంగలో మునుగుతోంది’ అన్నారు. కనీసం తోటి నాయకులకు తనతో కలిసి గంగాస్నానం ఆచరించే అవకాశాన్ని మోదీ ఇవ్వలేదన్నారు. కీలక అంశాల పైనుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం మార్కెటింగ్ వ్యూహాలు అవలంబిస్తోందని విమర్శించారు. గాంధీ హిందూ కాగా, గాడ్సే హిందుత్వ వాది అని విమర్శించారు. మోదీకి వ్యాపారవర్గాలపై ప్రేమ అని, నోట్ల రద్దు, సాగు చట్టాలు, జీఎస్టీ వంటివన్నీ వారి ప్రయోజనాల కోసమే తెచ్చారని దుయ్యబట్టారు. 2004 నుంచి అమేథిలో గెలుస్తూ వస్తున్న రాహుల్‌ను 2019లో స్మృతీ ఇరానీ ఓడించారు. నాటి ఎన్నికల్లో రెండు చోట్ల పోటీచేసిన రాహుల్ కేరళలోని వయనాడ్‌లో గెలుపొందారు. -
ఏకే–203 రైఫిళ్ల తయారీ అమేథీలో
న్యూఢిల్లీ: అత్యాధునిక ఏకే–203 రకం రైఫిళ్లను భారత్‌లో తయారుచేసేందుకు మార్గం సుగమం అయింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ పరిధిలోని కోర్వాలో రైఫిళ్లను తయారుచేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. రక్షణ ఉత్పత్తుల తయారీ రంగంలో ఆత్మనిర్భర్ సాధించడానికి తాజా నిర్ణయం బాటలుపరుస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రూ.5వేలకోట్ల ప్రాజెక్ట్‌లో భాగంగా ఐదు లక్షలకుపైగా రైఫిళ్లను అక్కడ ఫ్యాక్టరీలో తయారుచేస్తారు. ‘ ఈ కొత్త ప్రాజెక్టు కారణంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అవకాశాలు మెరుగుపడతాయి’ అని సంబంధిత వర్గాలు చెప్పాయి. మూడు దశాబ్దాల క్రితం నుంచి భారత సాయుధ బలగాల కోసం వినియోగిస్తున్న ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో ఈ అధునాతన ఏకే–203 రైఫిళ్లను తెచ్చారు. ఈ తేలికైన 7.62 ్ఠ 39 మిల్లీమీటర్ల కాలిబర్ రైఫిల్ 300 మీటర్ల దూరంలోని లక్ష్యాలనూ చేధించగలదు. ఈ నెల ఆరున రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశముంది. చాలా సంవత్సరాల క్రితమే ఈ ఒప్పందంపై రెండు దేశాలూ ఏకాభిప్రాయానికి వచ్చాయి. అయితే, రైఫిళ్ల సాంకేతికత రష్యా నుంచి భారత్‌కు బదిలీచేసే అంశం కొలిక్కి రాలేదు. ఇంతకాలానికి ఇది సాధ్యమైంది. పుతిన్ పర్యటనలో పలు ఒప్పందాలు.. సోమవారం ఢిల్లీకి రానున్న పుతిన్ సమక్షంలో భారత్ రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంథనం, సాంకేతిక రంగాలకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకోనుంది. సోమవారం సాయంత్రం 5.30గంటలకు కీలక వ్యూహాత్మక అంశాలపై మోదీ, పుతిన్ చర్చించనున్నారు. ఇరు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల 2+2 భేటీల్లో తూర్పు లద్దాఖ్ సరిహద్దు ఉద్రిక్తత, తాలిబాన్ పాలనలో అఫ్గాన్ నుంచి భారత్‌కు పెరగనున్న ఉగ్ర ముప్పు అంశాలూ చర్చించనున్నారు. రెండు ఇంజన్ల కమోవ్–226టీ తేలికపాటి 200 హెలికాప్టర్ల సంయుక్త తయారీ అంశం ఓ కొలిక్కిరానుంది. వచ్చే మూడేళ్లలో ఇరుదేశాల పెట్టుబడుల ఒప్పందాలు 50బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చడంపైనా దృష్టిపెట్టనున్నారు. -
ఏకే203 @ అమేథి
అమేథి అనగానే ఉత్తరప్రదేశ్‌లోని కాంగ్రెస్ కంచుకోట గుర్తుకొస్తుంది ఎవరికైనా! ఆఫ్కోర్స్ ఇప్పుడు కాదనుకోండి... కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీని 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఫైర్‌బ్రాండ్ స్మృతి ఇరానీ అక్కడ ఓడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అమేథి రక్షణ ఉత్పత్తుల్లో సరికొత్త కేంద్రంగా అవతరించనుంది. అమేథిలో ఏర్పాటు చేయనున్న ఆయుధ కర్మాగారంలో ఏకంగా 6 లక్షల ఏకే203 అసల్ట్ రైఫిల్స్‌ను ఉత్పత్తి చేయడానికి సంబంధించి రష్యాతో ఒప్పందానికి భారత రక్షణ శాఖ మంగళవారం పచ్చజెండా ఊపింది. భారత సాయుధ బలగాలు ప్రస్తుతం వాడుతున్న ఇన్సాస్ రైఫిల్స్ స్థానంలో దశలవారీగా ఈ అధునాతన కలష్నికోవ్ శ్రేణి రైఫిల్స్ వచ్చి చేరనున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చేనెల ఆరో తేదీన భారత పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలో దీనికి సంబంధించి భారత్– రష్యాల మధ్య కీలక ఒప్పందం కుదరనున్నట్లు తెలుస్తోంది. భారత్ నినాదమైన ‘మేకిన్ ఇండియా’లో భాగంగా ఇరుదేశాల సంయుక్త భాగస్వామ్యంలో ఏకే203 రైఫిల్స్ ఉత్పత్తి జరుగుతుంది. మొదటి 70 వేల రైఫిల్స్‌కు సంబంధించినంత వరకు రష్యా తయారీ విడిభాగాలను వాడతారు. తర్వాత ఇరుదేశాల మధ్య ఈ రైఫిల్స్ తయారీకి సంబంధించి సాంకేతికత బదిలీ పూర్తయి... భారత్‌లోనే తయారైన విడిభాగాలతో ఉత్పత్తి మొదలవుతుంది. మొదటి 70 వేల రైఫిల్స్ వచ్చే ఏడాది భారత సైనిక బలగాలకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. మొత్తం రూ. 5,000 కోట్ల విలువైన ఒప్పందానికి మంగళవారం డిఫెన్స్ అక్విజేషన్ కౌన్సిల్ (డీఏసీ) తుది ఆమోదముద్ర వేసిందని రక్షణవర్గాల విశ్వసనీయ సమాచారం. ఐఏఎఫ్‌కు జీశాట్–7సీ శాటిలైట్ భారత వాయుసేనకు జీశాట్– 7సీ శాటిలైట్, దాని సంబంధిత ఉపకరణాల కొనుగోలు నిమిత్తం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన డిఫెన్స్ అక్విజేషన్ కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. రూ.2,236 కోట్ల నిధులను ఇందుకోసం కేటాయించింది. భారత వాయుసేన సాంకేతిక, సమాచార వ్యవస్థల ఆధునికీరణకు సంబంధించిన అవసరాల కోసం ‘మేకిన్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద ఈ ప్రతిపాదనను ఆమోదించినట్లు రక్షణశాఖ వెల్లడించింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
వైరల్: వరుడి చెంప పగలగొట్టిన వధువు
లక్నో: ఘనంగా పెళ్లి జరిగింది. రిసెప్షన్‌కు అంతా సిద్ధమైంది. కొద్దిసేపట్లో ఫంక్షన్ ప్రారంభమవుతుందనగా వరుడు ఓ మెలిక పెట్టాడు. దానికి వధువు కుటుంబసభ్యులు ససేమిరా అన్నారు. అయినా కూడా వరుడు పట్టుబట్టడంతో విసుగు చెందిన పెళ్లికూతురు పెళ్లి మండపంపైనే అతడి చెంప ఛల్లుమనిపించింది. ఈ ఘటనతో వివాహానికి హాజరైన అతిథులు, బంధుమిత్రులు షాక్‌కు గురయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అమేథి జిల్లా సలీమ్‌పూర్ గ్రామానికి చెందిన నాసిమ్ అహ్మద్ కుమార్తెకు మహమ్మద్ ఇమ్రాన్ సాజ్‌తో మే 17వ తేదీన వివాహమైంది. బరాత్ అనంతరం విందు ఏర్పాటు చేశారు. అందంగా ముస్తాబై వేదికపై పెళ్లి కుమారుడు ఇమ్రాన్ సాజ్ కూర్చున్నాడు. అయితే ఈ సమయంలో వరకట్నం కింద తనకు బుల్లెట్ వాహనం ఇవ్వాలని వరుడు డిమాండ్ చేశాడు. అల్లుడి విజ్ఞప్తిని వధువు కుటుంబసభ్యులు తమకు కుదరదు.. అంత స్తోమత లేదని బతిమిలాడారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య వివాదం రాజుకుంది. ఇదంతా గమనిస్తున్న వధువు తీవ్ర ఆవేశానికి గురయ్యింది. వెంటనే వరుడి వద్దకు వెళ్లి చెంపపై కొట్టింది. రెండు, మూడుసార్లు చేయి చేసుకుంది. ఆమె చర్యను అభినందించిన గ్రామస్తులు వరుడి కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇరువర్గాలను సర్ది చెప్పేందుకు ప్రయత్నించగా వినిపించుకోలేదు. మనస్తాపానికి గురైన వరుడు విడాకులు కావాలని పట్టుబట్టారు. పంచాయతీ ఎటూ తేలకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: బైక్ దొంగ చేసిన పనికి డ్రైనేజీలోకి పోలీసులు చదవండి: జనం చస్తుంటే.. జాతర చేస్తారా.. -
ఆక్సిజన్ కోసం అర్థిస్తే.. అరెస్ట్ చేశారు
లక్నో: దేశప్రజలంతా కోవిడ్ బారిన అల్లాడుతున్నారు. ముఖ్యంగా సెకండ్ వేవ్‌లో మహమ్మారి విజృంభణ ఉధృతంగా ఉంది. ఈ సారి ఆక్సిజన్, బెడ్ల కొరత అధికంగా ఉంది. ఏ హాస్పిటల్ ముంద చూసినా ప్రాణవాయువు కోసం అర్థిస్తూ.. ఆస్పత్రుల్లో చేర్చుకోమంటూ వేడుకునే జనాలకు సంబంధించిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు సోషల్ మీడియా వేదికగా తమ సమస్యను తెలియజేస్తూ.. సాయం అర్దిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ కోరుతూ ట్వీట్ చేసినా ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ లోపు సదరు వ్యక్తి కుటుంబ సభ్యుడు మరణించాడు. ఆ వివరాలు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శశాంక్ యాదవ్ అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా.. తన తాత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.. తనకు ఆక్సిజన్ సిలిండర్ అత్యవసరం అంటూ ట్వీట్ చేస్తూ నటుడు సోనూ సూద్‌ని ట్యాగ్ చేసి సాయం చేయాల్సిందిగా కోరాడు. శశాంక్ స్నేహితుడు అంకిత్ ఈ మెసేజ్‌ను ఓ జర్నలిస్ట్‌కు సెండ్ చేసి తన ఫ్రెండ్‌కి సాయం చేయాల్సిందిగా అభ్యర్థించాడు. సదరు రిపోర్టర్ ఈ మెసేజ్‌ను షేర్ చేస్తూ స్మృతి ఇరానీని ట్యాగ్ చేశారు. అయితే ఈ మెసేజ్‌లలో ఎక్కడా కూడా శశాంక్ తాత కోవిడ్‌తో బాధపడుతన్నట్లు వెల్లడించలేదు. ఈ మెసేజ్ చూసిన స్మృతి ఇరానీ శశాంక్‌కు సాయం చేద్దామని భావించి అతడికి 3 సార్లు కాల్ చేసినప్పటికి.. ఎలాంటి స్పందన లేదని తెలిసింది. దాంతో స్మృతి ఇరానీ ఈ మెసేజ్‌ను అమేథీ జిల్లా మెజిస్ట్రేట్, పోలీసు ఉన్నతాధికారికి సెండ్ చేసి.. వివరాలు కనుక్కోమని ఆదేశించారు. ఇదిలా ఉండగానే శశాంక్ తాత చనిపోయినట్లు తెలిసింది. దాంతో స్మృతి ఇరానీ సంతాపం తెలిపారు. ‘‘శశాంక్ తన ట్వీట్లో షేర్ చేసిన నంబర్‌కు మూడు సార్లు కాల్ చేశాను. కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. దాంతో అమేథీ డిస్ట్రిక్ మెజిస్ట్రేట్, పోలీసులకు అతడి గురించి కనుక్కోని సాయం చేయాల్సిందిగా ఆదేశించాను’’ అంటూ స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. Called Shashank thrice .. no response on the number shared by you in your tweet. Have alerted office of @DmAmethi & @amethipolice to find and help the person in need. https://t.co/4D3Nfe2Nue — Smriti Z Irani (@smritiirani) April 26, 2021 ఈ క్రమంలో అమేథీ పోలీసులు శశాంక్ వివరాలు తెలుసుకుని అతడిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే శశాంక్ తాత కోవిడ్ బారిన పడలేదు. ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ‘‘అతడి తాత కోవిడ్ బారిన పడలేదు. అసలే బయట జనాలు ఆక్సిజన్ కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో శశాంక్ తన సోషల్ మీడియాలో జనాలను భయపెట్టేలా ఇలా ట్వీట్ చేయడం సరైంది కాదు. పైగా అతను బయట ఎక్కడా ఆక్సిజన్ సిలిండర్ కోసం ప్రయత్నించలేదు. డైరెక్ట్‌గా యాక్టర్ సోనూ సూద్‌నే తనకు సాయం చేయమని కోరాడు. తప్పుడు సమాచారం షేర్ చేసినందుకు అతడిని అరెస్ట్ చేశాం’’ అన్నారు. कोविड-19 के समय में शशांक यादव द्वारा किये गये ट्वीट तथा सोशल मीडिया प्लेटफॉर्म पर भ्रामक तथ्य व अफवाह न फैलाने के संबंध में #SP_अमेठी श्री दिनेश सिंह द्वारा की गई अपील @Uppolice @dgpup @adgzonelucknow @igrangeayodhya @PrashantK_IPS90 @CMOfficeUP @ChiefSecyUP pic.twitter.com/6pYsj7MVIi — AMETHI POLICE (@amethipolice) April 28, 2021 చదవండి: వైరల్: భర్తకు కోవిడ్.. నోటి ద్వారా శ్వాస అందించిన భార్య ఢిల్లీ సర్కార్ ఆక్సిజన్ ‘యాక్షన్ ప్లాన్ ’ -
రాహుల్ ఇలాఖా.. ఇక స్మృతీ ఇరానీ అడ్డా
ఆమేఠి: లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నెరవేర్చనున్నారు. ఈ మేరకు పనులు మొదలుపెట్టారు. ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇలాఖాగా ఉన్న ఆమేఠీని స్మృతి చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక ఆమేఠిలో తాను స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నట్లు స్మృతి ఇరానీ తెలిపారు. త్వరలోనే ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుని స్థానికులకు పూర్తిగా అందుబాటులో ఉంటానని చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమేఠిలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ మరోసారి పోటీ చేశారు. అయితే రాహుల్‌ను ఓడిస్తానని సవాల్‌గా తీసుకుని స్మృతి ఇరానీ మొదటిసారి ఆమేఠి నుంచి లోక్‌సభకు పోటీ చేశారు. హోరాహోరి ప్రచారం చేసి చివరకు రాహుల్‌గాంధీని ఓడించి స్మృతి ఇరానీ సంచలనం సృష్టించారు. అయితే స్మృతి ఇరానీ పోటీతో భయపడి కేరళలోని వయనాడ్‌లో రాహుల్ గాంధీ పోటీ చేశారని రాజకీయాల్లో టాక్ ఉంది. అందుకే రాహుల్ ఆమేఠిలో ఓటమి పాలవగా వయనాడ్‌లో గెలిచాడు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ స్థానికంగా ఉండడని, ఢిల్లీలో తిష్టవేసి ఆమేఠిని పట్టించుకోవట్లేదని చెప్పి స్థానిక ఓటర్లకు గాలం వేశారు. తాను గెలిస్తే ఆమేఠిలో ఇంటి నిర్మాణం చేసుకుని అభివృద్ధి చేస్తానని ఎన్నికల్లో స్మృతి ఇరానీ ప్రకటించారు. దీంతో స్థానికులు స్మృతి ఇరానీకి భారీగా ఓట్లు గుద్దేశారు. దీంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్మృతి ఇరానీ ఇంటి నిర్మాణం పనులు మొదలుపెట్టారు. సోమవారం ఇంటికి సంబంధించిన స్థలం రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. త్వరలోనే ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేస్తానని.. దీనికి ఆమేఠి నియోజకవర్గ ప్రజలందరూ ఆహ్వానితులేనని పేర్కొన్నారు. ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఆమేఠిలో స్మృతి ఇంటిని అద్దెకు తీసుకుని నివసించారు. ఇప్పుడు సొంతంగా ఇల్లు నిర్మించుకుని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. ఈ సందర్భంగా పరోక్షంగా రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. लोकसभा चुनाव के दौरान अमेठी में अपनों के साथ, अपनों के बीच रहने का जो वादा किया था उस वादे के अनुसार अपना घर बनाने के लिए आज भूमि निबंधन प्रक्रिया को सम्पन्न किया। निरंतर प्रेम, स्नेह एवं आशीर्वाद देने के लिए अमेठी का हृदय से धन्यवाद। pic.twitter.com/9dKof3A6L2 — Smriti Z Irani (@smritiirani) February 22, 2021 -
అప్పు తీర్చలేదని సర్పంచ్ భర్త సజీవ దహనం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. అప్పు తీర్చలేదనే నేపంతో కొందరు వ్యక్తులు దళితుడిని సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మరణించాడు. మృతుడి భార్య గ్రామ్ ప్రధాన్(సర్పంచ్) కావడం గమనార్హం. ఈ ఘటన శుక్రవారం అమేథీలోని మున్షిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బందోయియా గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన అర్జున్ కోరి(40)కి.. మరి కొందరికి మధ్య డబ్బుకు సంబంధించి వివాదం తలెత్తింది. ఈ క్రమంలో గురువారం 5-6గురు వ్యక్తులు కలిసి అర్జున్ కోరిని చంపేందుకు ప్రయత్నించారు. బతికి ఉండగానే అతడిని సజీవ దహనం చేయాలని భావించి నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలో రాత్రి 10:30 గంటల ప్రాంతంలో బాధితుడి ఇంటి సరిహద్దు ప్రాంతంలో కాలిపోయిన స్థితిలో ఉన్న అర్జున్‌ని కుటుంబ సభ్యులు గుర్తించారు. తక్షణమే అతడిని చికిత్స కోసం నౌగిర్వాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు అతడిని సుల్తాన్పూర్ జిల్లా ఆస్పత్రికి అక్కడి నుంచి లక్నో ట్రామా సెంటర్‌కు తరలించారు. కానీ దురదృష్టవషాత్తు ఆస్పత్రికి చేరేలోపే అతడు మరణించాడు. (బర్త్‌డే పార్టీలో ఓవరాక్షన్ : సింగర్‌పై కాల్పులు) ఈ సందర్భంగా గ్రామ పెద్ద(సర్పంచ్), బాధితుడి భార్య ప్రత్యర్థులే ఈ హత్య చేశారని తెలిపింది. ఐదురుగిరి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామ పంచాయతీ సభ్యులు మాత్రం డబ్బుల కోసమే అర్జున్ కోరిని హత్య చేశారని తెలిపారు. ఇక ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంగటనలు చోటు చేసుకోకుండా చూసేందుకు గ్రామంలో భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. ఈ సందర్భంగా పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘విషయం తెలిసిన వెంటనే మేం సంఘటన స్థలానికి చేరుకుని గ్రామ్ ప్రధాన్ భర్తను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాము. ఈ రోజు ఉదయం లక్నో ట్రామా సెంటర్‌కు తీసుకెళ్తుండగా.. అతడు మరణించాడు’ అని తెలిపారు. బాధితుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురిలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. -
‘ఎంత మార్పు.. థ్యాంక్స్ పీయూష్ జీ’
లక్నో: కాంగ్రెస్‌కు కంచుకోటలాంటి అమేథి నియోజకవర్గంలో ఈ సారి బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీద కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ భారీ విజయం సాధించారు. ఈ క్రమంలో అమేథిలోని గౌరిగంజ్ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన ఫోటోలను ట్విటర్ ద్వారా షేర్ చేశారు స్మృతి ఇరానీ. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. 2019కి ముందు.. ప్రస్తుతం రైల్వే స్టేషన్ రూపురేఖలు ఎలా మారాయో ఈ ఫోటోలు తెలుపుతున్నాయి. ఈ క్రమంలో ‘ఏళ్లుగా నిర్లక్ష్యం చేయబడిన అమేథి గౌరిగంజ్ రైల్వే స్టేషన్‌ను నూతనంగా మార్చడానికి సాయం చేసిన పియూష్ గోయల్‌కు కృతజ్ఞతలు’ అంటూ స్మృతి ఇరానీ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన ఫోటోలను అప్పుడు.. ఇప్పుడు పేరుతో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. రైల్వే స్టేషన్ అభివృద్ధికి కృషి చేసినందుకు స్మృతి ఇరానీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు నెటిజనులు. वर्षों से जर्जर स्थिति और नागरिक सुविधाओं के अभाव में जूझ रहे अमेठी के गौरीगंज स्टेशन का कायाकल्प करने हेतु रेल मंत्री @PiyushGoyal जी का हार्दिक धन्यवाद। स्टेशन पर यात्रियों के लिए Wi-Fi, कोच जानकारी प्रणाली जैसी सुविधाओं के सफल कार्यान्वयन हेतु @drmlko25 जी के प्रति भी आभार। pic.twitter.com/ewzUPooRWz — Smriti Z Irani (@smritiirani) July 9, 2020 ఎన్నికల ప్రచారం నాటి నుంచే స్మృతి ఇరానీ అమేథిలో మౌలిక సదుపాయాల కొరత గురించి తీవ్రంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నియోజకవర్గ అభివృద్ధి కొరకు పలు కార్యక్రమాలు ప్రారంభించారు. నియోజకవర్గాన్ని పలుమార్లు సందర్శించారు. స్థానిక దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నారు. అంతేకాక రాజీవ్‌గాంధీ హాయాంలో రాయ్‌బరేలీ నుంచి అన్చహర్ వరకు తలపెట్టిన రైల్వే ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లుందుకు కూడా స్మృతి ప్రయతిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాహుల్ గాంధీ అమేథిలో 12 వేల శానిటైజర్ల బాటిళ్లు, 20 వేల ఫేస్ మాస్క్‌లు, 10 వేల సబ్బులు పంపిణీ చేశారు. -
స్మృతి ఇరానీ కనిపించడం లేదు!
అమేథి: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కనిపించడం లేదంటూ అమేథీలో మిస్సింగ్ పోస్టర్లు వెలిశాయి. "ఏడాది కాలంలో ఎంపీ స్మృతి ఇరానీ కేవలం రెండు సార్లే అమేథీకి వచ్చారు. అప్పుడు కూడా కొద్ది గంటలు మాత్రమే ఉన్నారు. నేడు అమేథీ ప్రజలు కరోనాతో విలవిల్లాడుతున్నారు. ఈ కష్టకాలంలో ఆమె నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటారని ఆశించాము, కానీ అది జరగడం లేదు" అని ఆ పోస్టర్లలో రాసి ఉంది. దీంతో ఎంపీ ఆచూకీ తెలపాల్సిందిగా కోరుతూ అఖిల భారత మహిళా కాంగ్రెస్ ఈ పోస్టర్లను ట్విటర్లో పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన స్మృతి ఇరానీ గత ఎనిమిది నెలల్లో తన నియోజకవర్గానికి పదిసార్లు వెళ్లి పద్నాలుగు రోజులు అక్కడే ఉన్నానని తెలిపారు. (వారి ఆవేదన ప్రభుత్వానికి పట్టదు!) మరి సోనియా గాంధీ తన సొంత నియోజకవర్గమైన రాయ్‌బరేలిలో ఎన్నిసార్లు పర్యటించారు? అంటూ ప్రశ్నించారు. ఇప్పటివరకు బస్సుల్లో 22,150 మంది వలస కార్మికులు అమేథీకి రాగా 8,322 మంది రైళ్ల ద్వారా చేరుకున్నారు. మరి ఈ కష్ట కాలంలో సోనియా గాంధీ తన నియోజకవర్గానికి ఏం చేశారని విమర్శించారు. కాగా అమేథీలో ఇప్పటివరకు 148 కరోనా కేసులు నమోదవగా 29 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా వుండగా గ్వాలియర్‌లో జ్యోతిరాధిత్య సింధియా, భోపాల్ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కనిపించడం లేదంటూ మిస్సింగ్ పోస్టర్లు ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. (ప్రగ్యా ఠాకూర్ కనిపించడం లేదంటూ పోస్టర్లు) -
ఆ వీడియో అతని ఉద్యోగానికి ఎసరు పెట్టింది
-
ఆ వీడియో అతని ఉద్యోగానికి ఎసరు పెట్టింది
అమేథి : జిల్లా కలెక్టర్‌గా ప్రజా సమస్యను పరిష్కరించాల్సిన వ్యక్తి తన బాధ్యతను విస్మరించిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రశాంత్ కుమార్ శర్మ అమేథి జిల్లా మెజిస్ట్రేట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్‌కుమార్ సింగ్ అలియాస్ సోనుసింగ్ అనే వ్యక్తి మంగళవారం రాత్రి గుర్తు తెలియని యువకుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. కాగా, సోనుసింగ్ మృతదేహానికి ఇంకా పోస్టుమార్టం ఎందుకు నిర్వహించలేదో తెలుసుకుందామని అతని బంధువు, ట్రైనీ పీసీఎస్ ఆఫీసర్ సునీల్ సింగ్ బుధవారం ప్రశాంత్‌కుమార్‌ను కలిసేందుకు వచ్చారు. 'సోనూసింగ్ మృతదేహానికి పోస్టుమార్టమ్ ఎందుకు నిర్వహించలేదని, తన కజిన్‌ను చంపిన వ్యక్తులను ఎందుకు పట్టుకులేదో చెప్పాలని' సునీల్ సింగ్ ప్రశ్నించారు. ఈ విషయం తన పరిధిలో లేదని, అయినా అది అడగానికి నువ్వెవరు అంటూ ప్రశాంత్ కుమార్ సునీల్ కాలర్ పట్టుకొని దౌర్జన్యంగా బయటికి ఈడ్చుకువచ్చాడు. అయితే ఈ ఘటన మొత్తం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఈ వీడియోను సునీల్ సింగ్ సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందిస్తూ ..' ప్రశాంత్ కుమార్ ! నీవు ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్నావన్న విషయాన్ని మరిచిపోయావు. న్యాయం అడగడానికి వచ్చిన వ్యక్తి పట్ల నువ్వు ప్రదర్శించిన తీరు ఆగ్రహం తెప్పించింది. మనం ప్రజలకు సేవకులగా పని చేయాలే తప్ప నియంతలా వ్యవహరించకూడదంటూ' ట్వీట్ చేశారు. కాగా, ఉన్నతస్థాయి అధికారి పదవిలో ఉంటూ ప్రశాంత్ వ్యవహరించిన తీరును పలువురు నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. మొరాదాబాద్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న అరుణ్‌కుమార్‌ను ప్రశాంత్ కుమార్ స్థానంలో అమేథి జిల్లా మెజిస్ట్రేట్‌గా నియమించారు. 'మంగళవారం రాత్రి హత్యకు గురైన సోనూసింగ్ స్థానికంగా ఇటుక బట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతని తండ్రి శివనాయక్ సింగ్ స్థానిక బీజేపీ నేతగా ఉన్నారు. కాగా, మంగళవారం రాత్రి కొంతమంది దుండగులు అతన్ని అడ్డగించి రూ. 2లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించారు. ఈ నేపథ్యంలో వారి మధ్య గొడవ జరిగి జిల్లా ఎస్పీ కార్యాలయానికి 500 మీటర్ల దూరంలో సోనూసింగ్ను హత్య చేసి పారిపోయారు. అయితే సోనూను హత్య చేసిన ఐదుగురిపై ఎప్ఐఆర్ నమోదు చేశామని' పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సోనూ హత్యకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు వచ్చిన సునీల్‌కుమార్‌పై జిల్లా మెజిస్ట్రేట్ ప్రశాంత్ కుమార్ దౌర్జన్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. विनय शील एवं संवेदनशील बने हम यही प्रयास होना चाहिए । जनता के हम सेवक है , शासक नहीं @DmAmethi 🙏 — Smriti Z Irani (@smritiirani) November 13, 2019 -
అమేథీని వీడను: రాహుల్ గాంధీ
అమేథీ/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తాను ఓడిపోయినా, నియోజకవర్గాన్ని విడిచిపెట్టనని కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్‌గాంధీ అన్నారు. అమేథీ నుంచి ఓటమి పాలైన తర్వాత బుధవారం తొలిసారి అక్కడ పర్యటించారు. జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలు, బూత్ అధ్యక్షులతో ఆయన సమాశమయ్యారు. అమేథీలో తాను ఓడిపోవడానికి కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులే కారణమని, వారు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్లే తాను ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అదే సమయంలో అమేథీలో తన విజయం కోసం శ్రమించిన పార్టీ శ్రేణులకు రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. కోటికి చేరిన రాహుల్ ట్విట్టర్ ఫాలోవర్స్ రాహుల్ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య ఒక కోటికి చేరింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఫాలోవర్స్‌కు బుధవారం ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అలాగే అమేథీలో జరిగే కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులతో జరిగే సమావేశంలో దీనిని సెలబ్రేట్ చేసుకుందామని పేర్కొన్నారు. -
అమేథీ కోసం ఢిల్లీలో కొట్లాడతాను
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తొలిసారి రాహుల్ గాంధీ అమేథీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అమేథీకి రావడం అంటే సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్. ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషకరం. ప్రస్తుతం నేను వయనాడ్ నుంచి గెలిచి ఉండవచ్చు. కానీ మూడు దశబ్దాలుగా అమేథీతో నాకు అనుబంధం ఉంది. అమేథీ అభివృద్ధి కోసం ఢిల్లీలో పొరాడతాను’ అన్నారు. తన పర్యటన సందర్భంగా రాహుల్ పార్టీ ప్రతినిధులను కలిశారు. సలోన్, అమేథీ, గౌరిగంజ్, జగదీశ్‌పూర్, తిలోయి అసెంబ్లీ నియోజకవర్గ బూత్ అధ్యక్షులను కలుసుకున్నారు. తన ఓటమి గురించి చర్చించారు. స్థానిక నాయకులు ప్రజలకు దూరంగా ఉండటం వల్లే తాను ఓడిపోయానన్నారు. అయితే నియోజకవర్గానికి, ఇక్కడ జరిగే కార్యక్రమాలకు తాను హాజరవుతానని రాహుల్ స్పష్టం చేశారు. अमेठी आकर बहुत खुश हूँ। अमेठी आना घर आने जैसा लगता है। pic.twitter.com/B6YW2f7aLg — Rahul Gandhi (@RahulGandhi) July 10, 2019 -
నేడు అమేథీకి రాహుల్
అమేథీ (యూపీ)/అహ్మదాబాద్: తాజా సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీచేసి ఓడిన అమేథీ నియోజకవర్గంలో నేడు రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చెందిన ప్రత్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఆయన ఓడారు. తన పర్యటన సందర్భంగా రాహుల్ పార్టీ ప్రతినిధులను కలుస్తారు. సలోన్, అమేథీ, గౌరిగంజ్, జగదీశ్‌పూర్, తిలోయి అసెంబ్లీ నియోజకవర్గ బూత్ అధ్యక్షులను కలుసుకుంటారు. అలాగే కొన్ని గ్రామాలను సందర్శించే అవకాశం ఉందని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తెలిపారు. రాహుల్ 1999 నుంచి అమేథీ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచారు. రాహుల్‌కి గుజరాత్ కోర్ట్ సమన్లు హోంమంత్రి అమిత్ షాను హత్య కేసులో నిందితుడిగా పేర్కొని ఆయన పరువుకు నష్టం కలిగించారన్న కేసులో రాహుల్‌కు గుజరాత్ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. స్థానిక బీజేపీ నేత ఒకరు రాహుల్‌పై ఈ కేసువేశారు. ఈ కేసులో ఆగస్టు 9న హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో మే 1న ఇదే కేసులో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాహుల్‌కి సమన్లు జారీ చేసినప్పటికీ ఆయన లోక్‌సభ సభ్యుడు కావడంతో లోక్‌సభ స్పీకర్ నోటీసును తిరస్కరించారు. దీంతో ఆగస్టు 9న హాజరు కావాలంటూ తాజాగా సమన్లు జారీ చేశారు. ఈ నోటీసును రాహుల్ నివాసంలో నేరుగా అందించనున్నారు. ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ అమిత్ షాపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆరోపించారు. సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్కౌంటర్ కేసులో అమిత్‌ను సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. -
10న రాహుల్ గాంధీ అమేథీ పర్యటన
సాక్షి, న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ అమేథీ పర్యటన ఖరారైంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తరువాత రాహుల్ మొదటిసారిగా జూలై 10న అమేథీలో పర్యటించనున్నారు. ముందుగా లక్నోకు చేరుకుని గౌరీగంజ్‌లో అక్కడి పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ చతికిలపడటానికి గల కారణాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆ తర్వాత శివమహేశ్ మెడికల్ కళాశాల వేడుకకు హాజరు కానున్నారు. 15 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ కుటుంబీకులు అమేథీలో విజయబావుటా ఎగురవేస్తూ వస్తున్నారు. కానీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్‌గాంధీ పరాజయం పాలయ్యారు. కేరళలోని వయనాడ్ నుంచి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. దేశమంతటా కాంగ్రెస్ తక్కువ స్థానాలకు పరిమితం కావటంతో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. 2017లో కాంగ్రెస్ అధ్యక్షుడుగా రాహుల్ బాధ్యతలు చేపట్టారు. -
మానవత్వం చాటుకున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ
-
స్మృతీ ఇరానీ అనుచరుడి హత్య
అమేథీ: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో బీజేపీ కార్యకర్తపై కాల్పులు కలకలం రేపాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది. అమేథీ నుంచి ఎంపీగా ఎంపికైన స్మృతీ ఇరానీ అనుచరుడు, బరూలియా గ్రామ మాజీ సర్పంచ్ సురేంద్ర సింగ్ (50)పై శనివారం అర్థరాత్రి ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. సురేంద్ర అతని స్వగృహంలో నిద్రిస్తున్న సమయంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. తీవ్రగాయాలపాలైన సురేంద్రను లక్నో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సురేంద్ర కన్నుమూశాడని పోలీసులు వెల్లడించారు. పాత కక్షలు, రాజకీయ శత్రుత్వం వల్లే హత్య జరిగినట్లు భావిస్తున్నామని చెప్పారు. ఘటనకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని.. వీరిని విచారిస్తున్న క్రమంలో పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయని పేర్కొన్నారు. పాడె మోసిన స్మృతీ ఇరానీ సురేంద్ర మృతి విషయం తెలియగానే స్మృతి ఇరానీ హుటాహుటిన అమేథీకి చేరుకున్నారు. సురేంద్ర కుటుంబాన్ని పరామర్శించి.. వారిని ఓదార్చారు. రాష్ట్ర మంత్రి మోసిన్ రజా కూడా సురేంద్ర కుటుంబాన్ని పరామర్శించారు. అంత్యక్రియల్లో భాగంగా స్మృతి, రజాలు సురేంద్ర పాడె మోశారు. సురేంద్ర మృతిపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య విచారం వ్యక్తం చేశారు. -
కార్యకర్త పాడె మోసిన స్మృతి ఇరానీ
-
వీడియో : కార్యకర్త పాడె మోసిన స్మృతి ఇరానీ
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ కార్యకర్త, బరూలియా గ్రామ మాజీ సర్పంచ్ సరేంద్రసింగ్ అంతిమయాత్రలో అమేథీ లోక్ సభ స్థానం నుంచి ఎన్నికైన బీజేపీ నేత స్మృతి ఇరానీ పాల్గొన్నారు. సురేంద్ర సింగ్ భౌతికకాయాన్ని స్మృతి ఇరానీ స్వయంగా తన భుజాలపై మోశారు. భారత్ మాతా కీ జై..సురేంద్రసింగ్ అమర్ రహే అంటూ గ్రామస్థులు, బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. (చదవండి : స్మృతి ఇరానీ అనుచరుడి కాల్చివేత) బరూలియా గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన సురేంద్ర సింగ్‌ను శనివారం రాత్రి ఆయన నివాసంలోనే గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. లక్నో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సరేంద్ర సింగ్ మరణించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
స్మృతి ఇరానీ అనుచరుడి కాల్చివేత
సాక్షి, న్యూఢిల్లీ : అమేథిలో బీజేపీ నేత స్మృతి ఇరానీ సహచరుడు సురేంద్ర సింగ్‌ను బరూలియ గ్రామంలో శనివారం రాత్రి దుండగలు కాల్చిచంపారు. అమేథి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ గెలుపొందిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. బరూలియా గ్రామ మాజీ సర్పంచ్‌గా పనిచేసిన సురేంద్ర సింగ్‌ను ఆయన నివాసంలోనే గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. లక్నో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సరేంద్ర సింగ్ మరణించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పాతకక్షలు, రాజకీయ వివాదాలే హత్యకు కారణంగా భావిస్తున్నామని అమేథి ఎస్పీ తెలిపారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. కాగా సురేంద్ర సింగ్ స్మృతి ఇరానీకి సన్నిహితులని గ్రామస్తులు చెప్పారు. కాగా స్మృతి ఇరానీ ఆదేశాల మేరకు ఆమె తరపున స్ధానికులకు సింగ్ చెప్పులు పంపిణీ చేశారని చెబుతున్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై 55,120 ఓట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా..!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టిన అనంతరం ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లోనే ఆ పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. రాహుల్‌తో పాటు సోనియా గాంధీ, కాంగ్రెస్ నేతలంతా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో బీజేపీ సునామీ ధాటికి హస్తం అభ్యర్థులు కొట్టుకుపోయారు. రాహుల్ నాయకత్వ పటిమకు పరీక్షగా నిలిచిన తొలి సార్వత్రిక ఎన్నికల్లోనే ఆయన పూర్తిగా తేలిపోయారు. కనీసం ప్రత్యర్థికి పోటీ ఇవ్వకుండా బీజేపీ చరిత్రలోనే అత్యధిక స్థానాలకు ఆ పార్టీకి కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ దారుణమైన ఓటమి చవిచూడడం మరోవైపు ఆ పార్టీకి కంచుకోట వంటి అమేథిలో రాహుల్ ఓడిపోవడం అధిష్టానం జీర్ణించుకోలేని అంశం. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై విశ్లేషించుకునేందుకు ఢిల్లీలో రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ కానుంది. ఈ సమావేశంలోనే రాహుల్ రాజీనామా చేస్తారని తెలుస్తోంది. సమావేశంలో ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం రాజీనామాపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. కాగా రాహుల్ నాయకత్వంపై విమర్శలు రాకముందే.. పార్టీ పదవి నుంచి వైదొలగాలని రాహుల్, సోనియా వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీనికి సోనియా గాంధీ విముకత వ్యక్తం చేశారని, పదవికి రాజీనామా చేయవద్దని సూచించినట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా రాహుల్ రాజీనామా వార్తలను ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా తీవ్రంగా ఖండించారు. కాగా యూపీలో ఆపార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రాజ్‌బబ్బర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
రౌండు రౌండుకు ఉత్కంఠ: మళ్లీ ఆధిక్యంలోకి వచ్చిన స్మృతి
అమేథి: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీచేస్తున్న అమేథిలో హోరాహోరీ పోటీ నడుస్తోంది. గాంధీ-నెహ్రూ కుటుంబం కంచుకోట అయిన అమేథిలో కౌంటింగ్ ప్రారంభం నుంచి రాహుల్ గాంధీ, బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది. రౌండ్.. రౌండ్‌కు ఆధిక్యాలు మారుతున్నాయి. మొదటి రౌండ్లో స్మృతి ఇరానీ ఆధిక్యం కనబర్చగా.. ఆ తర్వాత రాహుల్‌గాంధీ స్వల్ప ఆధిక్యాన్ని కనబర్చారు. ఇప్పుడు మళ్లీ స్మృతి ఇరానీ ఆధిక్యంలోకి వచ్చారు. 4300 ఓట్లతో ఆమె రాహుల్ గాంధీపై ఆధిక్యం కనబరుస్తున్నారు. ఇక్కడ రౌండ్.. రౌండ్‌కు ఆధిక్యాలు మారుతుండటంతో ఎవరు గెలుస్తారనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. 2014 ఎన్నికల్లో అమేథిలో రాహుల్‌కు గట్టి పోటీ ఇచ్చిన కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఈసారి కూడా ఆయనకు చుక్కలు చూపించే పరిస్థితి కనిపిస్తోంది. ఆరంభ ఆధిక్యాలను చూసుకుంటే స్మృతీ రాహుల్‌పై స్వల్ప లీడింగ్‌లో ఉండటం కాంగ్రెస్ శ్రేణులను కలవర పరుస్తోంది. ఇక్కడ రౌండ్‌రౌండ్‌కు ఆధిక్యాలు మారుతూ.. హోరాహోరీ పోటీ నెలకొని పరిస్థితి కనిపిస్తోంది. -
‘అమేథీలో నమాజ్.. ఉజ్జయినిలో పూజలు’
లక్నో : కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం అమేథీలో నమాజ్ చేస్తారు.. ఉజ్జయినిలో పూజలు నిర్వహిస్తారంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మీద ఆమె విమర్శల వర్షం కురపించారు. ఈ సందర్భంగా స్మృతి మాట్లాడుతూ.. ‘అమేథీలో కాంగ్రెస్ చాలా తొందరపాటుతనాన్ని ప్రదర్శిస్తుంది. ముఖ్యంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి. ఓట్ల కోసం ఆమె పడే పాట్లు చూస్తే.. చాలా జాలేస్తుంది. ఓట్ల కోసం అమేథీలో నమాజ్ చేస్తారు.. వెంటనే ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహిస్తారు’ అంటూ ప్రియాంక గాంధీ పేరు ప్రస్తావించకుండా పరోక్ష విమర్శలు చేశారు స్మృతి ఇరానీ. ఇక ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీ లోక్‌సభ ఎన్నికల్లో ముఖాముఖి తలపడుతున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో భారీ తేడాతో రాహుల్ చేతిలో ఓడిన స్మృతి ఇరానీ.. ఈ దఫా గెలిచి తీరాలనే కసితో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వయనాడ్‌లో పోటీ చేయడం ద్వారా రాహుల్ తనను గెలిపించిన అమేథీ ప్రజలను అవమానించారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. -
స్మృతి ఇరానీ ఆరోపణలపై తేల్చేసిన ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అమేథిలో బూత్ ఆక్రమణలకు పాల్పడ్డారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన ఆరోపణలను యూపీ ఎన్నికల ప్రదానాధికారి తోసిపుచ్చారు. కాగా సోమవారం లోక్‌సభ ఎన్నికల అయిదో విడత పోలింగ్ సందర్భంగా ఓ వృద్ధురాలు తాను బీజేపీకి ఓటు వేయాలని చెప్పినా బలవంతంగా ఆమెచే పోలింగ్ అధికారి కాంగ్రెస్ బటన్‌ను నొక్కించారని చెబుతున్న వీడియోను స్మృతి ఇరానీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఈసీ స్పందించి రాహుల్‌పై చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. కాగా, బూత్‌ల ఆక్రమణలకు పాల్పడుతున్న రాహుల్‌ను శిక్షించాలా లేదా అనేది అమేథి ప్రజలు తేల్చుకోవాలని ఆమె వ్యాఖ్యానించారు. స్మృతి ఇరానీ ఆరోపణలపై ఈసీ అధికారులు, పరిశీలకులు సంబంధిత పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఘటనపై ఆరా తీయగా వీడియో క్లిప్‌లో పేర్కొన్న ఆరోపణలు కట్టుకథగా వెల్లడైంది. కేంద్ర మంత్రి ఆరోపణలపై తొలుత ప్రిసైడింగ్ అధికారిని పోలింగ్ విధుల నుంచి తప్పించి విచారణ చేపట్టామని యూపీ ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. మరోవైపు అమేథిలో ఓటమి తప్పదని గ్రహించిన బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ తిప్పికొట్టింది. అమేథిలో స్మృతి ఇరానీ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో తలపడుతున్న సంగతి తెలిసిందే. -
‘ఆయన ప్రోద్బలంతోనే బూత్‌ల ఆక్రమణ’
సాక్షి, న్యూఢిల్లీ : అమేథి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు పోలింగ్ బూత్‌లను ఆక్రమించి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రోద్భలంతోనే కాంగ్రెస్ శ్రేణులు చెలరేగాయని ఆమె వ్యాఖ్యానించారు. అమేథిలో బూత్‌ల ఆక్రమణపై తాను ఈసీతో పాటు యూపీ అధికారులకు సమాచారం అందించానని, అధికార యంత్రాగం తగిన చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఇక రాహుల్ దుశ్చర్యలను గమనించి అమేథి ఓటర్లు ఆయనను శిక్షించాలా లేదా అనేది తేల్చుకోవాలని సృతి ఇరానీ కోరారు. కాంగ్రెస్ చీఫ్ రాహల్ గాంధీతో అమేథిలో కేంద్ర మంత్రి స్మతి ఇరానీ బీజేపీ నుంచి తలపడుతున్న సంగతి తెలిసిందే. కాగా లోక్‌సభ ఎన్నికల అయిదో విడత పోలింగ్ దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోని 51 స్ధానాల్లో కొనసాగుతోంది. -
ఓటర్లకు రాహుల్ గాంధీ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: తన కుటుంబ సభ్యులతో సమానమైన అమేథి నియోజకవర్గ ప్రజలు తమ అమూల్యమైన ఓటువేసి తనను గెలిపించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, అమేథి లోక్‌సభ అభ్యర్థి రాహుల్ గాంధీ అక్కడి ప్రజలకు లేఖ రాశారు. ‘మేరా అమేథి పరివార్’ అంటూ సంబోధిస్తూ రాసిన ఈ లేఖలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. బీజేపీ అబద్ధాల కర్మాగారమని, ఓటర్లకు ప్రవాహంలా డబ్బును పంచిపెడుతూ మభ్యపెడుతున్నారని లేఖలో ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పథకాలు ఇక్కడి ప్రజలకు చేరకుండా అమేథిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టారని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాటన్నింటిన ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటానని లేఖలో రాహుల్ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వంలో అంబానీ వంటి ఇరవై మంది పారిశ్రామికవేత్తలు ప్రభుత్వానికి యజమానిగా వ్యవహిరిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలే యజమానులని రాహుల్ స్పష్టం చేశారు. నిజాయితీ, సమగ్ర అనే అంశాలే అమేథీ నియోజకవర్గ బలాలని రాహుల్ ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా ఇప్పటికే మూడు సార్లు ఇక్కడి నుంచి విజయం సాధించిన రాహుల్.. నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీనే బీజేపీ ఈసారి బరిలో నిలిపింది. రాహుల్ తరపున ఆయన చెల్లెలు, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇప్పటికే అమేథిలో పలుమార్లు పర్యటించారు. ఈనెల ఆరున అమేథి స్థానానికి ఎన్నిక జరుగునున్న విషయం తెలిసిందే. -
మంచి పిల్లలు ప్రధానిని తిట్టవద్దు : ప్రియాంక గాంధీ
లక్నో : కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, తూర్పు ఉత్తరప్రదేశ్ ఇన్చార్జి ప్రియాంకా గాంధీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. సోదరుడు కాంగ్రెస్‌పార్టీ అధినేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేథీలో ప్రచారం నిర్వహిస్తుండగా.. కొంత మంది చిన్నారులు ఆమె చుట్టూ చేరి రాహుల్ గాంధీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దీనికి ఆమె ఎంతో పులికించి పోయారు. దీంతో ఆ చిన్నారులు శృతి మించి ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ ‘చౌకీదార్ చోర్’ అనే నినాదాలతో పాటు.. అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో వారి నినాదాలను ప్రియాంకా అడ్డుకున్నారు. ‘యే వాలా నహీ... అచ్చా నహీ లగేగా. అచ్చే బచ్చే బనో ( అలా అనవద్దు. ఇది బాలేదు.. మంచి పిల్లలు ఇలా చేయరు) అంటూ పిల్లలను అడ్డుకోవడంతో వారు రాహుల్ జిందాబాద్ అంటూ నినదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. చాలా మంది ఈ విషయంలో ప్రియాంకా గాంధీని కొనియాడుతుండగా.. బీజేపీ నేతలు మాత్రం ప్రచారంలో భాగమేనని కొట్టిపారేస్తున్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఈ వీడియోను షేర్ చేస్తూ ప్రియాంక గాంధీపై మండిపడింది. ప్రియాంకా గాంధీ పిల్లలను అడ్డుకుంటున్నది మాత్రమే వీడియోలో ఉందని పేర్కొంది. -
మంచి పిల్లలు ప్రధానిని తిట్టొద్దు
-
‘రాహుల్ అఫిడవిట్లో పొంతన లేని సమాచారం’
ఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ నియోజకవర్గ ఎన్నికల అఫిడవిట్లో పొంతన లేని సమాచారం ఇచ్చారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహారావు మండిపడ్డారు. రాహుల్ విద్యార్హతలు, పౌరసత్వంపై చాలాకాలంగా వివాదాలున్నాయన్నారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ తరఫున రిటర్నింగ్ ఆఫీసర్ వివరణ కోరారని, అయితే రాహుల్ గాంధీ తరఫు వివరణ ఇచ్చే న్యాయవాది వద్ద తగిన సమాచారం లేదన్నారు. అందుకే సోమవారం వరకు గడువు కావాలని కోరారని తెలిపారు. జీవీఎల్ మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీ 94లో డిగ్రీ చేసి, 95లో ఎమ్‌ఫిల్ చేసినట్టు అఫిడవిట్లలో పేర్కొన్నారు. డిగ్రీ తర్వాత పీజీ చేయకుండా ఎమ్‌ఫిల్ ఎలా చేస్తారో ఆయనకే తెలియాలి. పైగా డెవలప్మెంట్ ఎకనామిక్స్‌లో ఎమ్‌ఫిల్ చేసినట్టు ఓసారి, డెవలప్మెంట్ స్టడీస్‌లో చేసినట్టు మరోసారి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బ్రిటీష్ కంపెనీలో డైరక్టర్‌గా ఉన్నట్టు కూడా ఓసారి పేర్కొన్నారు. ఆ కంపెనీ ఇచ్చిన వివరాల్లో రాహుల్ గాంధీని బ్రిటీష్ పౌరుడిగా వెల్లడించారు. దీనిపై రాహుల్ గాంధీ నుంచి ఎటువంటి వివరణ లేదు. ఇప్పుడు రాజ్యాంగబద్ధ సంస్థ వివరణ అడిగింది. రాహుల్ సరైన వివరణ ఇస్తారా లేక తప్పించుకుని పారిపోతారా చూడాలి. ఇతర దేశ పౌరసత్వం కలిగి ఉంటే భారతదేశ పౌరసత్వం కోల్పోవాల్సి ఉంటుంది. ఆ లెక్కన భారతదేశంలో ఎన్నికల్లో పోటీచేయడానికి రాహుల్‌కి అర్హత ఉండదు. ఒకవేళ పౌరసత్వం లేకుండా అక్కడి కంపెనీకి తప్పుడు సమాచారం ఇచ్చినట్టయితే అక్కడి చట్టాల ప్రకారం శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని తెలిపారు. -
రాహుల్‌గాంధీ... దక్షిణాది కథేంది?
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన సొంత నియోజకవర్గం అమేథీ నుంచి కాక, ఈసారి దక్షిణాదిలోని కేరళకు చెందిన వయనాడ్ నుంచి కూడా పోటీకి దిగారు. ఒకవేళ రాహుల్‌కి అన్నీ అనుకూలంగా మారి అటు అమేథీలోనూ, ఇటు వయనాడ్‌లోనూ రెండుచోట్లా గెలిస్తే ఏం చేయాలి? ఇదే ప్రశ్న ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రియాంక ప్రజలతో మమేకమవుతోన్న తీరూ, యూపీలో ప్రియాంకకు వస్తోన్న ఆదరణా, ప్రియాంకలో ఇందిరను చూసుకొంటోన్న జనం ఆశలూ ఆ పార్టీని గట్టెక్కించి, కాంగ్రెస్‌కి పూర్వ వైభవం కట్టబెడుతుందన్న ఆశలు కాంగ్రెస్‌కి కొత్త ఊపుని తెచ్చిపెట్టాయి. పెట్టని కోటను వదిలిందెందుకు? కాంగ్రెస్‌కి పెట్టని కోటలాంటి అమేథీని వదిలి రాహుల్ వయనాడ్‌ని ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నకి రకరకాల సమాధానాలు వస్తున్నాయి. అమేథీలో ఓటమి భయంతోనే రాహుల్ దక్షిణాది వెళ్లారని బీజేపీ వాదిస్తోంటే దక్షిణాది రాష్ట్రాల కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతోనే రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్ చెబుతోంది. ఏది ఏమైనప్పటికీ రాహుల్ వయనాడ్ ఆలోచన దక్షిణాదిలో పట్టు సాధించేందుకేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే నిజమైతే ఒకవేళ రాహుల్ అటు అమేథీ, ఇటు వయనాడ్ రెండింటా విజయం సాధిస్తే ఏం చేయాలి అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. రాహుల్ వయనాడ్‌ని నిలుపుకుంటే పార్టీకి మంచిదన్న భావన ఇటు దక్షిణాదిలోని కాంగ్రెస్ వర్గాల్లోనూ, అటు రాజకీయ నిపుణుల్లోనూ ఉంది. అయితే దక్షిణాదిలో కాంగ్రెస్ పునాదులను బలోపేతం చేసుకోవాలని కాంగ్రెస్ భావించడానికి మరో ప్రధానమైన కారణం కూడా లేకపోలేదంటున్నారు పలువురు. ఉత్తర భారతంలో మాదిరిగా హిందూత్వవాదం, జాతీయతా నినాదం దక్షిణ భారతంలో పెద్దగా చెల్లుబాటు కాదన్న భావన కూడా అందుకు కారణమని వారు భావిస్తున్నారు. దక్షిణాదిలో పట్టుకోసమేనా? 25 పార్లమెంటు సీట్లున్న ఆంధ్రప్రదేశ్, 17 సీట్లున్న తెలంగాణ, 28 సీట్లున్న కర్ణాటక, 20 సీట్లున్న కేరళ, 39 పార్లమెంటు సీట్లున్న తమిళనాడుతో కలిపి మొత్తం ఐదు ప్రధాన రాష్ట్రాలకీ కలిపి దక్షిణ భారతంలో 129 సీట్లున్నాయి. ఇలాంటి నేపథ్యంలో 2014లో దక్షిణ భారతంలోని ఐదు ప్రధాన రాష్ట్రాల్లోని మొత్తం 129 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ 19 స్థానాల్లో మాత్రమే గెలవగలిగింది. అయితే అప్పుడు దేశమంతా మోదీ గాలి వీచింది. అంత మోదీ హవాలోనూ 19 స్థానాలు గెలవడం అంత తేలిక కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. అందుకే దక్షిణాదిలో రాహుల్ సారథ్యంలో కాంగ్రెస్‌ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెబుతున్నారు. ఉత్తరాదిలో రాహుల్ ఫెయిల్? ఉత్తరప్రదేశ్ గురించి చెప్పుకోవాలంటే రాహుల్ గాంధీ నాయకత్వం ఉత్తరప్రదేశ్‌లో ఫెయిల్ అయ్యిందని అంతా భావిస్తున్నారు. ఒకవేళ అమేథీలో, వయనాడ్‌లోనూ రెండు స్థానాలూ రాహుల్ కైవసం చేసుకున్నా, అమేథీని వదులుకొని వయనాడ్‌నే రాహుల్ ఎంచుకోవడం మంచిదన్న అభిప్రాయం కాంగ్రెస్ అనుయాయుల్లో బలంగా వినిపిస్తోంది. ఉత్తరాదిలో ఉన్నా రాహుల్ పెద్దగా చేయగలిగేది లేదని కూడా వారు వాదిస్తున్నారు. దీనికి తోడు ఉత్తరాదిలో బీజేపీ ప్రాభవం తగ్గకపోగా పెరుగుతోండడం దక్షిణాదిలో కాంగ్రెస్ బలపడాల్సిన ఆవశ్యకతను చెప్పకనే చెబుతోంది. అందుకే కేరళలో కాంగ్రెస్ అధ్యక్షుడి పోటీ తమిళనాడు, కర్ణాటకలో సైతం కాంగ్రెస్ పార్టీకి ప్రోత్సాహకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఉత్తరాదిలో ప్రజాదరణ ప్రియాంకకేనా? నాయనమ్మ పోలికలూ, జనంలో ఉన్నప్పుడు ప్రియాంక చూపుతోన్న చొరవ, సామాజిక అవగాహనలో ఆమె పరిణితి ప్రియాంకకు ఉత్తరాది ప్రజల్లో ఆదరణని తెచ్చిపెట్టాయి. అంతేకాకుండా ఆ పార్టీ వర్గాలు సైతం ప్రియాంకా గాంధీని సాదరంగా ఆహ్వానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా గాంధీ కుటుంబం పోటీ చేస్తోన్న, కాంగ్రెస్‌కి కంచుకోటలాంటి అమేథీ స్థానంలో రాహుల్ తన సొంత సీటునే కోల్పోయి, ఓటమి బాటలో పయనిస్తున్న సందర్భంలో ప్రియాంకాగాంధీ యూపీలో పూర్తి బాధ్యతలు తీసుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే నిజమవ్వాలని పార్టీ వర్గాలు సైతం భావిస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాట నాయకత్వ శూన్యత కాంగ్రెస్‌కి అనుకూలిస్తుందా? ఏఐఏడీఎంకే నాయకురాలు జయలలిత మరణానంతరం ఆ రాష్ట్రం నాయకత్వ సంక్షోభంతో సతమతమవుతోంది. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ సరిగ్గా ఉపయోగించుకోగలిగితే తమిళనాట ఏర్పడిన నాయకత్వ శూన్యతను కాంగ్రెస్ పూరించే అవకాశం మెండుగా ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ తన పూర్వ వైభవాన్ని తిరిగి సంపాదించాలనుకుంటే ప్రజాదరణ ఉన్న ప్రియాంకా గాంధీకి ఉత్తర భారత బాధ్యతలు పూర్తిగా అప్పగించి రాహుల్ దక్షిణాదిపై దృష్టి కేంద్రీకరిస్తే మంచిదని రాజకీయ నిపుణుల అభిప్రాయం. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దక్షిణాదికి ఇంకా ఎక్కువ సమయాన్ని వెచ్చించి, మరింత శక్తివంతంగా పనిచేయాల్సి ఉంటుందని రాజకీయ నిపుణుల అంచనా. గాంధీ కుటుంబానికి దక్షిణాదే సురక్షితం! గాంధీ కుటుంబం దక్షిణ భారతం నుంచి పోటీ చేయడం ఇది మొదటిసారి మాత్రం కాదన్న విషయం గుర్తుచేసుకోవాలి. 1978లో ఇందిరాగాంధీ కర్ణాటకలోని చిక్‌మగళూరు నుంచీ, ఆ తరువాత 1980లో ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్ నుంచి పోటీ చేశారు. రాహుల్ తల్లి సోనియాగాంధీ కూడా కర్ణాటకలోని రాయబరేలీ నుంచి 1999లో పోటీ చేశారు. భారత చరిత్రలోనే చీకటి రోజులుగా భావించే ఎమర్జెన్సీ అనంతరం 1977లో జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ రాయబరేలీలో జనతా అభ్యర్థి రాజ్‌నారాయణ్ చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఆ తరువాత ఆమె లోక్‌సభలోకి ప్రవేశించడానికి కర్ణాటకలోని చిక్మగళూరుని సురక్షితమైన సీటుగా భావించి 1978లో అక్కడి నుంచి పోటీచేశారు. ఈ సందర్భంగా ఇందిర ఇచ్చిన నినాదం అప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. అదే ‘ఏక్ షేర్నీ, సౌ లంగూర్, చిక్‌మగళూరు, చిక్‌మగళూరు’ నినాదం. అయితే ఆ తరువాత కూడా మళ్లీ 1980లో లోక్‌సభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తిరిగి ఇందిరాగాంధీ దక్షిణ భారతానికి ప్రాతినిధ్యం వహిస్తూ రాయబరేలీతో పాటు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్ నుంచి కూడా పోటీ చేశారు. ఈ రెండు స్థానాల్లోనూ గెలిచాక ఇందిరాగాంధీ రాయబరేలీని వదులుకొని మెదక్ నుంచి లోక్‌సభలోకి ప్రవేశించారు. అప్పటి నుంచి ఇందిరాగాంధీ 1984లో చనిపోయే వరకూ అదే నియోజకవర్గం నుంచి పార్లమెంటుకి ప్రాతిని«ధ్యం వహించారు. -
స్మృతి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేదు!
అమేథీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతల విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అమేథీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో నిలుస్తున్న స్మృతి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆ ఆఫిడవిట్లో తాను గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేదని స్పష్టం చేశారు. అయితే చాలా కాలంగా స్మృతి గ్రాడ్యుయేషన్ అంశం వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేయకపోయినప్పటికీ 2004 ఎన్నికల సమయంలో బీఏ పట్టా పొందినట్టు తప్పుడు వివరాలు పొందుపర్చారని విపక్షాలు ఆరోపిస్తు వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే.. 2004 ఎన్నికల సమయంలో ఢిల్లీ చాందినీ చౌక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్మృతి ఇరానీ తాను 1996లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా పొందినట్టు పేర్కొన్నారు. తీరా 2014లో అమేథీ నుంచి బరిలో నిలిచిన సమయంలో బీకామ్ కోసం 1994లో ఢిల్లీ యూనివర్సిటీ దూర్య విద్యలో ప్రవేశం పొందినట్టు తెలిపారు. దీంతో విపక్షాలు స్మృతిపై తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగాయి. అయితే తాజా ఆఫిడవిట్లో మాత్రం 2014లో మాదిరి తాను దూరవిద్యలో బీకామ్‌కు కోర్సుకు నమోదు చేసుకున్నట్టు తెలిపిన స్మృతి.. తాను అది పూర్తి చేయలేదని ప్రత్యేకంగా పేర్కొన్నారు. దీని బట్టి స్మృతి 2004లో సమర్పించిన ఆఫిడవిట్లో పేర్కొన్న విద్యర్హతలు తప్పడువని అర్థమవుతోంది. 2014 ఆగస్టులో జరిగిన ఓ మీడియా సమావేశంలో స్మృతి మాట్లాడుతూ.. తాను ప్రతిష్టాత్మక యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందినట్టు చెప్పుకొచ్చారు. అయితే అప్పుడు ఆ డిగ్రీ వివరాలు ఎందుకు ఆఫిడవిట్లో పొందుపర్చలేదని ప్రతిపక్షాలు స్మృతిని ప్రశ్నించాయి. స్మృతి ఇరానీ తన విద్యార్హత విషయంలో తప్పుదారి పట్టించిందని ఢిల్లీ హైకోర్టులో కేసు కూడా నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే తాజా ఆఫిడవిట్లో స్మృతి డిగ్రీ పూర్తి చేయలేదని పేర్కొనడంపై విపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. స్మృతి ఇరానీ ఆస్తులు రూ.4.71 కోట్లు తనకు రూ.4.71 కోట్ల ఆస్తి ఉన్నట్లుగా స్మృతి ఇరానీ ప్రకటించారు. గురువారం నామినేషన్ పత్రాల్లో ఆమె ఈ విషయం వెల్లడించారు. రూ.1.75 కోట్ల విలువగల చరాస్తులు, రూ.2.96 కోట్ల విలువగల స్థిరాస్తులు ఉన్నట్లుగా ఆమె వెల్లడించారు. ఇందులో రూ.1.45 కోట్ల విలువగల వ్యవసాయ భూమి, ఇంటి విలువ కోటిన్నరగా ప్రకటించారు. తనపేరు మీద బ్యాంకులో రూ.89 లక్షలు ఉన్నాయని, తపాలా ఖాతాలో 18 లక్షలు, ఇతర పెట్టుబడులు రూ. 1.05 కోట్లు ఉన్నట్లుగా తెలిపారు. రూ.13.14 లక్షల విలువగల వాహనాలు, 21 లక్షల రూపాయల విలువగల బంగారం ఉన్నాయని వెల్లడించారు. -
మోదీ ఓడిపోతారు.. రాహుల్ జోస్యం
రాయ్‌బరేలీ: రఫేల్ రివ్యూ పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణకు అంగీకరించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శల పదును పెంచారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని ఓడిపోతారని ఆయన జోస్యం చెప్పారు. మోదీ అజేయుడు కాదన్న తన మాటలు ఎన్నికల తర్వాత రుజువు అవుతాయని పేర్కొన్నారు. గురువారం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానానికి రాహుల్ తల్లి, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం రాహుల్ మాట్లాడారు. గత ఐదేళ్లలో మోదీ ఏమీ చేయలేదని ఆరోపించారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై రివ్యూ పిటిషన్లపై విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించడం కేంద్రానికి చెంపపెట్టులాంటిదని ఆయన పేర్కొన్నారు. రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు విషయంలో బహిరంగ చర్చకు రావాలని, లేదంటే తానే ప్రధాని నివాసానికి వచ్చి చర్చలో పాల్గొంటానని ప్రధాని మోదీకి మరోసారి సవాల్ విసిరారు. ఒకవేళ చర్చ జరిగితే మోదీ.. ఎవరి కళ్లలోకి కూడా నేరుగా చూడలేరని ఎద్దేవా చేశారు. ఫ్రాన్స్‌కు చెందిన డసో కంపెనీకి దక్కాల్సిన రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందం అనిల్ అంబానీకి ఎలా వెళ్లిందని ఆయన ప్రశ్నించారు. వివేకంతో ఓటేయండి దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓటేయాలని ఓటర్లకు రాహుల్ విజ్ఞప్తి చేశారు. మోదీ అధికారంలోకి రాకముందు రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక వాటికి బదులు నిరుద్యోగం, అపనమ్మకం, హింస, ద్వేషం, భయాలను దేశ ప్రజలకు ఇచ్చారని ఓటర్లకు ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘ఉద్యోగాల్లేవు. రూ.15 లక్షలు లేవు. దీనికి బదులు నోట్ల రద్దు, గబ్బర్ సింగ్ ట్యాక్స్, రైతులకు బాధలు, సూటు బూటు సర్కారు, రఫేల్.. అబద్ధాలు.. అబద్ధాలు.. అపనమ్మకం, హింస, ద్వేషం, భయం ఇచ్చారు’అని ట్వీట్ చేశారు. -
రాహుల్‌పై హత్యాయత్నమా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హత్యకు ఎవరైనా కుట్ర పన్నారా? అమేథీలో నామినేషన్ దాఖలుచేసిన అనంతరం ఆయన్ను స్నైపర్ తుపాకీతో చంపేందుకు ప్రయత్నించారా? అంటే కాంగ్రెస్ వర్గాలు అవుననే జవాబు ఇస్తున్నాయి. బుధవారం యూపీలోని అమేథీలో రాహుల్ తలపై కనీసం ఏడుసార్లు ఆకుపచ్చ రంగు లేజర్ లైట్ తాకిందనీ, ఇలాంటి లేజర్‌ను స్నైపర్ తుపాకుల్లోనే వాడతారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాసింది. కణతపై గురిపెట్టారు.. కాంగ్రెస్ నేతలు అహ్మద్‌పటేల్, జైరాం రమేశ్, రణ్‌దీప్ సూర్జేవాలా సంతకం చేసిన ఈ లేఖలో కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. ‘యూపీలోని అమేథీలో నామినేషన్ అనంతరం రోడ్‌షో, మీడియా సమావేశం నేపథ్యంలో రాహుల్ తలపై ఏడుసార్లు లేజర్ లైట్ పడింది. వీటిలో రెండు సార్లు రాహుల్ కణతపైనే గురిపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను పరిశీలించిన మాజీ భద్రతాధికారులు.. ఇలాంటి లేజర్ లైట్లు కేవలం స్నైపర్ గన్‌లాంటి అత్యాధునిక ఆయుధాల్లోనే ఉంటాయని తేల్చారు. ఇలాంటి ఘటన జరగడం రాహుల్ గాంధీ భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. రాహుల్ గాంధీ ప్రస్తుతం హైరిస్క్ టార్గెట్‌గా ఉన్నారు. ఆయన కుటుంబంలో ఇప్పటికే ఇద్దరిని (ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ) ఉగ్రశక్తులు హత్యచేశాయి. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని హోంశాఖను కోరుతున్నాం. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో రాహుల్ భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అని తెలిపింది. గతేడాది కర్ణాటక ఎన్నికల సందర్భంగా రాహుల్ ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కిందకు జారిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన డీజీసీఏ ఆటో–పైలట్ వ్యవస్థలో లోపం కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లు గుర్తించింది. అది తుపాకీ కాదు: హోంశాఖ రాహుల్ గాంధీపై హత్యాయత్నానికి గుర్తుతెలియని దుండగులు ప్రయత్నించారన్న కాంగ్రెస్ పార్టీ వాదనను కేంద్ర హోంశాఖ ఖండించింది. ఆయన ప్రాణానికి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది. ఈ విషయమై హోంశాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘రాహుల్‌పై లేజర్ లైట్ పడిందన్న వార్తలు మీడియాలో రాగానే ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ప్రత్యేక భద్రతా దళం(ఎస్పీజీ) డైరెక్టర్‌ను హోంశాఖ ఆదేశించింది. ఈ వీడియోను క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీజీ నిపుణుల బృందం.. అందులోని ఆకుపచ్చ రంగు లేజర్ లైట్ ఏఐసీసీ ఫొటోగ్రాఫర్ ఫోన్ నుంచి వచ్చినట్లు గుర్తించింది. రాహుల్ రోడ్ షోతో పాటు మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో ఫొటోగ్రాఫర్ రాహుల్ వీడియోలను ఫోన్ ద్వారా చిత్రీకరించారు. ఈ విషయాన్ని ఎస్పీజీ డైరెక్టర్ హోంశాఖతో పాటు రాహుల్ వ్యక్తిగత సిబ్బందికి చెప్పారు’ అని అన్నారు. రాహుల్ భద్రతపై కాంగ్రెస్ లేఖ రాయలేదన్నారు. -
స్మృతీ e-‘రాణి’!
సీరియల్ రాణిగానూ, సినీ నటిగానూ తన పాత్రలో ఇట్టే ఒదిగిపోయే స్మృతీ ఇరానీ రాజకీయ పాత్రని సైతం ఓటమిలోనూ సమర్థవంతంగా నిర్వహించారన్న ప్రశంసలు సామాజిక మాధ్యమాల్లో తరచూ కని, వినిపిస్తున్నాయి. గాంధీ కుటుంబానికి దశాబ్దాలుగా ఆతిథ్యం ఇస్తోన్న అమేథీ లో అదే కుటుంబం నుంచి వచ్చిన రాహుల్‌గాంధీకి 2014 లోక్‌సభ ఎన్నికల్లో స్మృతీ గట్టి పోటీ ఇచ్చారు. కాంగ్రెస్‌కి కంచుకోట లాంటి అమేథీలో ఆ పార్టీ కంగుతినేలా మూడు లక్షలకుపైగా ఓట్లు సాధించి ఇటు పార్టీలోనూ, ఆటు పార్టీ విమర్శకుల్లోనూ తన సత్తా చాటుకోగలిగారు. బహుశా అదే ఈసారి కోటలోని యువరాజు రాహుల్‌లో భయం రాజేసి, కోట దాటి బయటకు వచ్చేలా చేసి ఉంటుందన్న వాదన కూడా ఉంది. అదే రాహుల్‌ని అమేథీ నుంచి వయనాడ్‌కి పరుగులు పెట్టించిందన్న ప్రచారమూ జరుగుతోంది. ఈ అంశంపై సామాజిక మాధ్యమాలే వేదికగా విస్తృత చర్చలు నడుస్తున్నాయి. గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగానే ‘కాంగ్రెస్ కంచుకోటలాంటి అమేథీలో స్మృతీ ఇరానీ మళ్లీ పోటీ చేస్తే, రాహుల్‌గాంధీ తన స్థానాన్ని మార్చుకునే అవకాశం ఉంది’ అని ట్విట్టర్లో ఆమె అనుచరులు చేసిన ఊహాగానాలూ, కామెంట్లూ సైతం స్మృతీ ఇరానీపై వారికి ఉన్న విశ్వాసాన్ని చాటి చెబుతున్నాయి. రాహుల్‌తో పోటీ పడగల గ్లామర్‌కి గ్లామర్, స్థానికంగా కాంగ్రెస్‌కు గల పట్టుని ఎలాగైనా దెబ్బతీయాలనే బీజేపీ వ్యూహం వెరసి స్మృతీ ఇరానీకి గత ఎన్నికలు ఓటమిని మిగిల్చినా ఓట్ల శాతంలో మంచి తృప్తినే మిగిల్చాయి. అదే విషయాన్ని స్మృతీ ఇరానీ అనుచరులూ, పార్టీ వర్గాలూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేసుకోగలిగాయి. 2014లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం కారణంగా అమేథీలో లక్షకుపైగా మెజారిటీతో రాహుల్ విజయాన్ని చేజిక్కించుకోగలిగారు. అయితే 2004లోనూ, 2009లోనూ ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీల కన్నా 2014లో స్మృతీ ఇరానీకి వచ్చిన ఓట్లు చాలా ఎక్కువ. రాహుల్ సంప్రదాయ ఓటుబ్యాంకుని కొల్లగొట్టిన ఘనత స్మృతీ ఇరానీకి దక్కడంతో స్థానిక బీజేపీ నాయకత్వానికి భవిష్యత్‌పై ఆశలు రేకెత్తాయని చెప్పొచ్చు. అదే మళ్లీ రాహుల్‌తో తలపడే అవకాశాన్ని ఆమెకు ఇచ్చిందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. రాహుల్‌పై పంచ్‌లే పంచ్‌లు స్మృతీ ఇరానీ సామాజిక మాధ్యమాల్లో రాహుల్‌గాంధీపై వేస్తున్న పంచ్ డైలాగులు సైతం బాగానే పేలుతున్నాయి. గత నెలలో రాహుల్‌పై స్మృతీ ఇరానీ ‘‘భాగ్ రాహుల్ భాగ్..’’ అని ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. దక్షిణాదికి చెందిన కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతోనే రాహుల్ వయనాడ్‌లో నామినేషన్ వేసారన్న వాదనని సైతం ఆమె దీటుగానే ఎదుర్కొన్నారు. రాహుల్ గాంధీ అమేథీ ప్రజలను అవమానించారంటూ స్మృతి నిప్పులు చెరిగారు. 2014 ఎన్నికల్లో ఓటమి తరువాత సైతం ఆమె ఈ నియోజకవర్గంపై పెట్టిన శ్రద్ధ భవిష్యత్ కార్యాచరణకి అద్దం పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2014 నుంచి, ఇప్పటి వరకు రాహుల్ గాంధీ, ఈ నియోజకవర్గాన్ని 17 సార్లు సందర్శించగా, స్మృతీ ఇరానీ 21 సార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించి వందకు పైగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజకీయ నాయకులు ట్విట్టర్ వేదికగానే ఓటర్లను ఆకర్షించడానికీ, గెలవటానికీ ప్రయత్నించి ఉంటే, స్మృతీ ఇరానీ కచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉన్నదని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. అభ్యర్థిగా కాదు పెద్దక్కగా ఆదరించారు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అమేథీలో నామినేషన్ దాఖలు చేసిన ఒకరోజు తరువాత ఆయన ప్రత్యర్థి స్మృతీ ఇరానీ గురువారం వేలాది మంది పార్టీ కార్యకర్తలూ, అభిమానుల మధ్య నామినేషన్ దాఖలు చేశారు. ‘మై భీ చౌకీదార్’ నినాదం రాసి వున్న టీ షర్టులను ధరించిన వందలాది బీజేపీ కార్యకర్తల నృత్యాలూ, నినాదాల మధ్య గౌరీగంజ్ వైపు సాగిన ఊరేగింపు బీజేపీలో నూతనోత్తేజాన్ని నింపింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా స్మృతీ ఇరానీ ఊరేగింపులో ఆమె భర్త జుబిన్ కూడా పాల్గొన్నారు. జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయడానికి ముందు స్మృతీ దంపతులు పూజలు చేశారు. నిజానికి స్మృతీ ఇరానీ 17న నామినేషన్ వేయాలని భావించారు. ఆ రోజు సెలవు కావడంతో ముందుగానే నామినేషన్ వేయాల్సి వచ్చింది. భయంతోనే రాహుల్ వయనాడ్‌కు.. అమేథీ ప్రజలు ఓట్లతో బుద్ధి చెబుతారని భయపడడంతోనే రాహుల్‌గాంధీ కేరళలోని వయనాడ్‌లో పోటీ చేస్తున్నారని స్మృతీ ఇరానీ తన నామినేషన్ సందర్భంగా అన్నారు. దేశ విభజనకూ, సమాజ విచ్ఛిన్నానికీ పాల్పడుతోన్న వారిని ఎన్నుకోవద్దనీ, అది దేశాన్ని బలహీనపరుస్తుందనీ వ్యాఖ్యానించారు. అమేథీ తనను ఒక అభ్యర్థిగా కాకుండా పెద్దక్కగా గౌరవించిందనీ, అందుకే అమేథీ ప్రజలకు సేవ చేయడం తన పరమ ధర్మమనీ చెబుతూనే, కాంగ్రెస్ అధ్యక్షడు రాహుల్ గాంధీ నామినేషన్ సందర్భంగా తన బావ రాబర్ట్ వాధ్రాని వెంటబెట్టుకోవడాన్ని ఆమె గుర్తు చేశారు. ‘అల్లుడు గారు అడుగుపెట్టారంటే అమేథీ రైతులంతా తమ పంటపొలాలను కాపాడుకునే పనిలో పడాలి’ అని స్మృతీ రైతాంగాన్ని హెచ్చరించారు. అవినీతిలో కూరుకుపోయి, బెయిల్‌పై బయటకు వచ్చిన వ్యక్తిని వెంటబెట్టుకొని తిరుగుతున్న వాళ్లు బాలాకోట్ దాడిలో చనిపోయిన వారి లెక్కలు అడగడం ఆశ్చర్యంగా ఉందని అంటూ, రానున్న రోజుల్లో తన ప్రచారం ఏ అంశాలపై సాగుతుందో ముందుగానే చెప్పారు. ఓటమి నుంచే గెలుపు బాటలు ఐదు దశాబ్దాలుగా రెండుసార్లు మినహా అమేథీ ప్రజలు కాంగ్రెస్‌కే పట్టంగట్టారు. 2014 ఎన్నికల్లో ఓటమి పాలైనందుకు స్మృతీ ఇరానీ కుంగిపోలేదు. ఆ నియోజకవర్గానికి మొహం చాటేయనూ లేదు. ఓటమి గెలుపునకు తొలిమెట్టని భావించారు. నిత్యం ప్రజల్లో తన పేరు నిలిచిపోయేందుకు ఆమె చాలానే కృషి చేశారు. ఓడిపోయిన తరువాత రాహుల్‌ని ఉద్దేశించి ‘మళ్లీ అక్కడే కలుసుకుందాం’ అంటూ అమేథీ గురించి ట్విట్టర్లో వ్యాఖ్యానించడం ఆమె ఆత్మవిశ్వాసానికి ప్రతీక. అది మొదలు స్మృతీ ఇరానీ అమేథీ ప్రజల్లో తన పేరు నిలిచిపోయేలా చాలా పనులు చేశారు. పేదలకు ఈ–రిక్షాలు పంపిణీ చేశారు. అక్కడి ఉక్కు పరిశ్రమని సందర్శించారు. యువతకి చేరువయ్యేందుకు వైఫై సౌకర్యం కల్పించారు. నియోజకవర్గానికి చెందిన పేద కార్మికుడిని విదేశం నుంచి రప్పించినందుకు సుష్మాస్వరాజ్‌కి ధన్యవాదాలు తెలపడం కానీ, పేద మహిళలకు చీరలు పంచడం కానీ, ఒక పచ్చళ్ల బ్రాండ్‌ని ఈ ప్రాంతంలో ప్రోత్సహించడం కానీ అమేథీ ప్రజల్లో ఆమె పేరుని మర్చిపోకుండా చేశాయనీ, అవే ఈ ఎన్నికల్లో ఆమెకు కలిసొచ్చే విషయాలని విశ్లేషకులు భావిస్తున్నారు. వాటికి తోడు దేశభక్తి ప్రాధాన్యంగా తీసిన ‘యూరీ– ది సర్జికల్ స్ట్రయిక్’ సినిమాని జనంలో విస్తృతంగా ప్రదర్శించడం కూడా ఆమెకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. -
అమేథీలో రాహుల్ నామినేషన్
అమేథీ (ఉత్తరప్రదేశ్): కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం అమేథీ లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన భారీ రోడ్‌షోలో సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, వారి ఇద్దరు పిల్లలు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింథియా రాహుల్ వెంట ఉన్నారు. దాదాపు మూడు కిలోమీటర్ల మేర సాగిన ఈ రోడ్‌షోలో తల్లి సోనియాగాంధీ పాల్గొనలేదు. అనంతరం అమేథీ కలెక్టరేట్లో నామినేషన్ పత్రాల దాఖలు సమయంలో తనయుడు రాహుల్ వెంట ఆమె ఉన్నారు. నామినేషన్ సందర్భంగా అమేథీ పట్టణం కాంగ్రెస్ జెండాలు, బ్యానర్లు, రాహుల్, ప్రియాంక కటౌట్లతో నిండిపోయింది. ఎండను సైతం లేక్కచేయని కార్యకర్తలు అమేథీలో రాహుల్, ఆయన కుటుంబసభ్యులకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. రహదారికి రెండు వైపులా ఎదురు చూస్తున్న అభిమానులకు రాహుల్ అభివాదం చేసుకుంటూ ముందుకు సాగగా అభిమానులు ఓపెన్ టాప్ వాహనంలో ఉన్న రాహుల్ తదితరులపై పూలవర్షం కురిపించారు. అమేథీ మాకు పవిత్ర భూమి అమేథీ నియోజకవర్గం తమ తండ్రి(రాజీవ్‌గాంధీ) కర్మభూమి, తమ కుటుంబానికి పవిత్రమైన చోటు అని ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు. రాహుల్ నామినేషన్ అనంతరం ఆమె ట్విట్టర్లో..‘ కొన్ని అనుబంధాలు హృదయపూర్వకమైనవి. మా సోదరుని నామినేషన్ దాఖలు సందర్భంగా మా కుటుంబం మొత్తం హాజరయింది. ఇది మా తండ్రి కర్మభూమి, మాకు పవిత్రమైన ప్రాంతం’ అని తెలిపారు. అమేథీలో ద్విముఖ పోరు ఎస్పీ–బీఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి అమేథీలో తమ అభ్యర్థిని నిలపకపోవడంతో రాహుల్‌కు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది. అమేథీతోపాటు కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ బరిలోఉన్నారు. బీజేపీ తరఫున స్మృతి ఇరానీ గురువారం నామినేషన్ వేయనున్నారు. పొరుగునే ఉన్న రాయ్‌బరేలీ సీటుకు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గురువారం నామినేషన్ వేయనున్నారు. -
అమేథీ లోక్‌సభ స్థానానికి రాహుల్‌గాంధీ నామినేషన్
-
అమేధిలో రాహుల్ నామినేషన్
లక్నో : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బుధవారం అమేధి నుంచి తన నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ తన తల్లి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ, బావ రాబర్ట్ వాద్రాలు వెంటరాగా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ వేసే ముందు రాహుల్ మున్షిగంజ్-దరిపూర్ మీదుగా గౌరిగంజ్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక నామినేషన్ కార్యక్రమం ముగిసిన వెంటనే బిహార్, పశ్చిమ బెంగాల్లో ప్రచార ర్యాలీల్లో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. కాగా గాంధీల కుటుంబానికి కంచుకోట అమేధిలో రాహుల్ ఇప్పటికి మూడుసార్లు గెలుపొందారు. మరోవైపు అమేధితో పాటు కేరళలోని వయనాడ్‌లోనూ పోటీచేస్తున్న రాహుల్ ఇప్పటికే అక్కడ నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అమేధిలో రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో తలపడనున్నారు. గత ఎన్నికల్లోనూ రాహుల్ పై స్మృతి ఇరానీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. -
అమేధిలో నేడు రాహుల్ నామినేషన్
లక్నో : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అమేధి లోక్‌సభ స్ధానానికి బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. గాంధీల కుటుంబానికి కంచుకోట అమేధిలో రాహుల్ ఇప్పటికి మూడుసార్లు గెలుపొందారు. కాగా రాహుల్ నామినేషన్ సందర్భంగా పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టారు. రాహుల్ నామినేషన్ సందర్భంగా ఆయన వెంట యూపీఏ చీఫ్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కాంగ్రెస్ ప్రతినిధి అనిల్ సింగ్ వెల్లడించారు. కాగా,నామినేషన్ వేసేముందు రాహుల్ 3 కిమీ పరిధిలో సాగే రోడ్‌షోలో పాల్గొంటారని సింగ్ తెలిపారు. మరోవైపు అమేధితో పాటు కేరళలోని వయనాడ్‌లోనూ పోటీచేస్తున్న రాహుల్ ఇప్పటికే అక్కడ నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అమేధిలో రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో తలపడనున్నారు. గత ఎన్నికల్లోనూ రాహుల్ పై స్మృతి ఇరానీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. -
అమేథీ పరాఠా.. వయనాడ్ బట్టర్
ఈ లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించినప్పటి నుంచీ ఈ విషయం రాజకీయవేత్తల్లోనూ, నెటిజన్లలోనూ చర్చనీయాంశమైంది. రాహుల్ ప్రకటన చుట్టూ అల్లుకుంటోన్న చర్చల్లో కొత్తగా అమూల్ కూడా జత కలిసింది. దేశంలోని ప్రతిచోటా రాహుల్ పోటీపై తలెత్తిన చర్చకి వ్యంగ్యాన్నీ, హాస్యాన్నీ జోడిస్తూ తన వ్యాపార ప్రకటనలో రాహుల్‌పై వేసిన క్యారికేచర్‌తో పాటు ‘వై నాట్ హావ్ ఇట్ విత్ బటర్’ అనే క్యాప్షన్‌ను కొద్దిగా మార్చి అందర్నీ ఆకట్టుకుంటోంది. రాహుల్ వయనాడ్, అమేథీ నుంచి పోటీ చేస్తుండడాన్ని ప్రస్తావిస్తూ అమూల్ ‘‘ వైనాడ్ హావ్ ఇట్ విత్ బట్టర్–అమేథీ కా పరాఠా’’ (అమేథీ పరాఠాని వెన్నతో ఎందుకు తినకూడదు? అనే అర్థం వచ్చేట్టుగా) రెండు చేతుల్లో రెండు బ్రెడ్ స్లైసెస్ పట్టుకొని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వేదికపై నుంచి ఉపన్యసిస్తున్నట్టు వేసిన క్యారికేచర్‌తో కూడిన అమూల్ కంపెనీ ప్రకటనని మంగళవారం ట్విట్టర్లో పెట్టింది. అమూల్ తాజాగా పెట్టిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఒక్కరోజులోనే దీనికి 5,200 లైక్స్ వచ్చాయి. -
10న అమేధిలో రాహుల్ నామినేషన్
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ యూపీలోని అమేధి లోక్‌సభ నియోజకవర్గంలో ఈనెల 10న నామినేషన్ దాఖలు చేయనున్నారు. కేరళలోని వయనాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కూడా పోటీలో ఉన్న రాహుల్ గురువారం ఆ నియోజకవర్గంలో నామినేషన్ పత్రాలు సమర్పించిన సంగతి తెలిసిందే. అమేధిలో బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో ఆయన తలపడనున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ రాహుల్‌పై పోటీ చేసిన స్మృతి ఇరానీ లక్ష పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కాగా, 2004 నుంచి రాహుల్ గాంధీ అమేధి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు యూపీలోని రాయ్‌బరేలి నుంచి పోటీ చేస్తున్న యూపీఏ చీఫ్ సోనియా గాంధీ ఈనెల 11న నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోనియాపై మాజీ కాంగ్రెస్ నేత దినేష్ ప్రతాప్ సింగ్‌ను బీజేపీ బరిలో దింపింది. మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ, రాయ్‌బరేలికి చెందిన సింగ్ గత ఏడాది బీజేపీలో చేరారు. మరోవైపు రాహుల్ వయనాడ్ నుంచి పోటీ చేయడం అమేధికి అవమానకరమని బీజేపీ నేత స్మృతి ఇరానీ ఆరోపించారు. -
‘అమితాబ్ కాదు.. విలన్ అవుతారు’
న్యూఢిల్లీ : అమేథీ ప్రజల ఆశీర్వాదంతో కేంద్రమంత్రి స్మృతి ఇరానీని ఓడించినా.. రాజకీయ ప్రత్యర్థిగా ఎప్పటికీ ఆమెను గౌరవిస్తామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. అమేథీ సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వయనాడ్‌లో కూడా పోటీ చేయడం ఇక్కడి ప్రజలను అవమానించడమంటూ స్మృతి ఇరానీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె వ్యాఖ్యలపై స్పందించిన రణ్‌దీప్ సుర్జేవాలా గురువారం మాట్లాడుతూ.. ఆమె(స్మృతి) అమితాబ్ బచ్చన్‌ను కాపీ కొట్టాలని చూస్తున్నారు గానీ ఆఖరికి ఓ విలన్లా మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. స్మృతి సిద్ధంగా ఉన్నారు.. ‘స్మృతి ఇరానీ ఇలా మాట్లాడటం వెనుక ఆమెకున్న ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆఖరికి ఓ విలన్లా మిగిలిపోతారు. అమేథీ ప్రజల ఆశీర్వాదంతో ఆమెను ఓడించి తీరతాం. వరుసగా మూడో పరాజయానికి స్మృతి సిద్ధంగా ఉన్నారు. రాహుల్ చేతిలో ఓడిపోతే ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు రాజ్యసభ సీటు ఇచ్చి ఎంపీని చేయగలరు. కాబట్టి చింతించాల్సిందేమీ లేదు గానీ.. స్మృతి తన మొత్తం జీవిత కాలంలో పంచాయతీ ఎన్నికల్లో కూడా గెలవలేరనే విషయాన్ని గమనించాలి’ అంటూ రణ్‌దీప్ చురకలు అంటించారు. కాగా గత లోక్‌సభ ఎన్నికల్లో అమేథీలో రాహుల్ గాంధీకి పోటీగా బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన స్మృతి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి ఇక్కడే తన అదృష్టాన్ని పరీక్షించుకునేందకు ఆమె సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రాహుల్ అమేథీతో పాటుగా కేరళలోని వయనాడ్‌లో కూడా పోటీ చేస్తుండటంతో స్మృతి ఆయనపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. తానేమో అమేథీ ప్రజల ఆశీర్వాదం కోసం వస్తే.. రాహుల్ మాత్రం తనను దీవించిన ప్రజలను మోసం చేస్తున్నారు అంటూ స్మృతి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
ఈ మోసాన్ని ప్రజలు క్షమించరు..
లక్నో : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 15 ఏళ్ల పాటు ఇక్కడ అధికారాన్ని ఎంజాయ్ చేసి.. ఇప్పుడు మరో లోక్‌సభస్థానం కోసం అమేథీని విడిచి వెళ్లిపోయారు. ఈ మోసాన్ని ప్రజలు క్షమించరు.. తప్పక బదులు తీర్చుకుంటారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. బీజేపీ తరఫున అమేథీ నుంచి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి సారి ఆమె నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ.. ‘మా పార్టీ అమేథీని అభివృద్ధి చేయడం కోసం నన్ను ఇక్కడుకు పంపింది. ఎందుకంటే గత 15 ఏళ్లుగా ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచిన వ్యక్తి అమేథీని నాశనం చేశాడు. ఆయన ఇక్కడ పదిహేనేళ్ల పాటు అధికారాన్ని ఎంజాయ్ చేసి.. ఇప్పుడు అర్థాంతరంగా వదిలి వెళ్లి పోయాడు. ఇన్నేళ్ల పాటు అమేథీలో తనను నమ్ముకుని ఉన్న కార్యకర్తలను మోసం చేశారు. ఈ మోసాన్ని, అవమానాన్ని, అన్యాయాన్ని అమేథీ సహించదు. తగిన సమాధానం చెప్తుంద’ని తెలిపారు. అంతేకాక ‘వయనాడ్‌లో రాహుల్ గాంధీకి ఓటు వేయాలనుకునేవారు ఒక్కసారి అమేథీలో పర్యటించండి. అభివృద్ధిలో ఈ నియోజకవర్గం ఎంత వెనకడి ఉందో మీకే తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోండి’ అని పిలుపునిచ్చారు. మోదీ కూడా ఓ ర్యాలీలో ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ... హిందువుల కోపాన్ని తప్పించుకోవడానికే రాహుల్ గాంధీ మైనార్టీలు అధికంగా ఉండే నియోజకవర్గానికి పారిపోయారని ఎద్దేవా చేశారు. స్మృతి ఇరానీ అమేథీ నుంచి పోటీ చేయడం ఇది రెండో సారి. తొలుత 2014 ఎన్నికల్లో అమేథీ నుంచి బీజేపీ తరఫున రాహుల్‌కు వ్యతిరేకంగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే సారి మాత్రం తాను తప్పక గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు స్మృతి ఇరానీ -
‘నేను క్వింటాల్ కంటే ఎక్కువ బరువుంటానా?’
లక్నో : ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత ప్రియాంక గాంధీ చాలా కలుపుగోలుగా వ్యవహరిస్తూ.. సామాన్యులతో కలిసి పోతున్నారు. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి బుధవారం చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంతో బిజీగా ఉన్న ప్రియాంక గాంధీ గత రాత్రి అమేథీ నుంచి రాయ్‌బరేలీకి వెళ్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీకి లడ్డూలతో తులాభారం నిర్వహించాలనుకున్నారు. అందుకు కోసం టెంట్ వేసి కాంటాను తెచ్చి అలంకరించి.. లడ్డూల ప్యాకెట్లతో సిద్ధంగా ఉన్నారు. ఇంతలో ఆ మార్గంలో ప్రియాంక వాహనం రావడం గమనించి అక్కడకు వెళ్లి ఆమెను ఆహ్వానించారు. టెంట్ వద్దకు వచ్చాక ప్రియాంక గాంధీని కాంటాలో కూర్చోమని.. లడ్డూలతో తులాభారం వేస్తామని కోరారు. అందుకు ప్రియాంక ‘నేను ఒక క్వింటాల్ కన్నా ఎక్కువ బరువుంటానని అనుకుంటున్నారా ఏంటి’ అంటూ నవ్వుతూ ప్రశ్నించారు. ఆ తర్వాత వారి అభ్యర్థనను సున్నితంగా తోసి పుచ్చారు. అంతేకాక పక్కనే ఉన్న మరో వ్యక్తిని ఉద్దేశిస్తూ.. ‘మీరు వెళ్లి కూర్చొండి’ అని చెప్పారు. దాంతో ప్రియాంక కోసం తెచ్చిన లడ్డూలతో సదరు వ్యక్తికి తులాభారం వేశారు. అనంతరం ఆ లడ్డూలను కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు.. అక్కడికి వచ్చిన జనాలకు పంచి పెట్టారు. ఇకపోతే పార్టీ ఆదేశిస్తే తాను జాతీయ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమేనని ప్రియాంక గాంధీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. బుధవారం అమేథీలో పర్యటించిన ప్రియాంక, 2022 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారా? ఈ ఎన్నికలు కాదు. 2022 ఎన్నికలకు (యూపీ అసెంబ్లీ ఎన్నికలు) ఆ ఎన్నికలకు మీరు తీవ్రంగా కష్టపడాలంటూ ఆమె పార్టీ శ్రేణులను కోరారు. -
పోటీపై ప్రియాంక గాంధీ క్లారిటీ
సాక్షి, లక్నో: కాంగ్రెస్ పార్టీ ఆశాదీపం ప్రియాంక గాంధీ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పార్టీ ఆదేశిస్తే తాను జాతీయ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమేనని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వెల్లడించారు. హైకమాండ్ కోరితే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమేనంటూ క్లారిటీ ఇచ్చేశారు. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. గత జనవరిలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక గాంధీ అభిమానులకు శుభవార్త అందించారు. అలాగే ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి అరంగేట్రంపై ఎన్నో సంవత్సరాలుగా వేచి చూస్తున్న కాంగ్రెస్ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్నిందించారు. మరోవైపు ఎక్కడ నుంచి ఆమెను బరిలోకి దింపాలన్న సమాలోచనల్లో సీనియర్ నేతలు మునిగిపోయారు. ప్రత్యక్ష ఎన్నికల్లో తనకు బరిలోకి దిగాలని లేదని, పార్టీ కోసం పని చేయాలనే ఆశిస్తున్నాననీ.. కానీ పార్టీ ఆదేశిస్తే తప్పకుండా పోటీ చేస్తానని ప్రియాంక వెల్లడించారు. బుధవారం అమేథిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రియాంక ఈ వివరణ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తన సోదరుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేథీలో పర్యటించిన ప్రియాంక, 2022 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారా? ఈ ఎన్నికలు కాదు. 2022 ఎన్నికలకు (యూపీ అసెంబ్లీ ఎన్నికలు) ఆ ఎన్నికలకు మీరు తీవ్రంగా కష్టపడాలంటూ ఆమె పార్టీ శ్రేణులను కోరారు. మరోవైపు ఈ సందర్భంగా ఆమె బీజేపీపై తన దాడిని ఎక్కు పెట్టారు. వేలాదిమంది రైతులు తీవ్ర సంక్షోభంలో మునిగిపోయారని, కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి సహాయం అందడం లేదని విమర్శించారు. ఉద్యోగాల కల్పనలో కేంద్రం దారుణంగా విఫలమైందన్నారు. కనీస ఆదాయ పథకంపై వస్తున్న విమర్శలను ఆమె తోసి పుచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎపుడూ ద్రోహం చేయదనీ, ఏం చెప్తుందో అదే చేస్తుందన్నారు. కాగా యూపీ కాంగ్రెస్ ఇన్చార్జ్గా ప్రియాంక గాంధీ నియమితులైన వెంటనే, ప్రియాంక తల్లి, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్థానంలో రాయబరేలి నుంచి ఆమె పోటీ చేయనున్నారనే వార్తలు హల్చల్ చేసాయి. అయితే తొలి జాబితాలోనే సోనియా గాంధీ పేరు చేర్చి ఈ వార్తలకు ఫుల్స్టాప్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. దీంతో ప్రియాంక ఎక్కడినుంచి బరిలో వుంటారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. -
ప్రియాంక ఫ్రాడ్ అంటూ పోస్టర్లు
లక్నో : లోక్‌సభ ఎన్నికల ప్రచార నిమిత్తం ప్రియాంక గాంధీ అమేధి నియోజకవర్గంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆమెకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి. ప్రియాంకను మోసకారిగా పేర్కొంటూ అమేధిలో వెలిసిన పోస్టర్లపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. కాగా, అమేధికి కేవలం ఐదేళ్ల తర్వాత వస్తూ మీరు మమ్మల్ని ఎందుకు ఫూల్స్‌ను చేస్తున్నారని ఈ పోస్టర్లలో ప్రస్తావించారు. 2014 ఎన్నికల్లో ఎన్నో హామీలు గుప్పించిన మీరు మళ్లీ ఐదేళ్ల తర్వాత మమ్మల్ని మోసగించేందుకు వస్తున్నారని మరో పోస్టర్ వెలిసింది. ఎన్నికల సందర్భంగా ప్రజల్ని బురిడీ కొట్టించేందుకు మీరు చీరలు ధరించి వస్తుంటారు..అయితే ఇలాంటి ఎత్తుగడలు ఇక ఫలించవని మరో పోస్టర్ దర్శనిమిచ్చింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రియాంక ప్రస్తుతం అమేధిలో ఉన్నారు. పార్టీ చీఫ్ రాహుల్ తరపున ప్రచారం నిర్వహిస్తున్న ప్రియాంక గురువారం తన తల్లి సోనియా గాంధీ నియోజకవర్గంలో గురువారం ప్రచారం చేపట్టనున్నారు. ఢిల్లీకి తిరుగుముఖం పట్టే ముందు ఆమె అయోధ్యను సందర్శించనున్నారు. -
అమేథీలో రాహుల్‌కి మరో ఝలక్!
అమేథీలో రాహుల్‌కు రాంగ్ సిగ్నల్ పడింది. గాంధీ కుటుంబానికి నాలుగు దశాబ్దాలుగా ఆశ్రయమిస్తోన్న అమేథీలో, ఆ కుటుంబానికి అతి సన్నిహితుడైన వ్యక్తి నుంచే పోటీ ఎదురైంది. అక్కడ రాహుల్ గాంధీపై, కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడి కొడుకు పోటీ చేస్తానని ప్రకటించి రాహుల్‌కి ఝలక్ ఇచ్చాడు. రాహుల్ తండ్రి రాజీవ్‌గాంధీకీ, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీకీ నామినేషన్ల అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై సంతకం చేసిన వ్యక్తి కొడుకే నేరుగా రాహుల్‌పైన పోటీకి దిగుతుండడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మాజీ కాంగ్రెస్ నాయకుడు çహజీ సుల్తాన్‌ఖాన్, ఆయన కుమారుడు హజీ హరూన్ రషీద్ కాంగ్రెస్ నుంచి పూర్తిగా వైదొలిగినట్టు ప్రకటించారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రశ్నించగా.. చాలాకాలంగా స్థానిక కాంగ్రెస్ నాయకత్వం తమపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనీ, అలాగే ఈ ప్రాంత అభివృద్ధినీ, తమ సామాజిక వర్గాన్నీ నిర్లక్ష్యం చేసిన కారణంగానే తాము పార్టీని వీడినట్టు రషీద్ వివరించారు. అయితే కాంగ్రెస్‌ని ఢీకొట్టి ఎలా నెగ్గుకొస్తారన్న మీడియా ప్రశ్నకు సమాధానమిస్తూ అమేథీలో 6.5 లక్షల ముస్లింల ఓట్లున్నాయనీ, కాంగ్రెస్ వ్యతిరేకంగానే ఈ ఓట్లన్నీ పడతాయనీ రషీద్ అంటున్నారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీకి, సోనియాగాంధీకి సన్నిహితులుగా మెలిగిన ఈ తండ్రీ కొడుకులు రాజీవ్, సోనియా, ప్రియాంకతో తమ ఇంట్లో దిగిన ఫొటోలను సైతం రషీద్ చూపించారు. ఇప్పటికే అమేథీ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోన్న రాహుల్‌గాంధీకి రషీద్ ఇచ్చిన షాక్ చిన్నదేమీ కాదని నిపుణులు భావిస్తున్నారు. -
అమేథీలో రాహుల్‌కు షాక్..
లక్నో : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. రాహుల్ గాంధీ పోటీ చేయబోయే అమేథీ నియోజకవర్గం నుంచి ఆయనకు పోటీగా కాంగ్రెస్ నేత కుమారుడు బరిలోకి దిగనున్నారు. యూపీకి చెందిన హజీ సుల్తాన్ ఖాన్ గత 70 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎంతో విధేయుడిగా ఉన్నారు. 1991పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాజీవ్ గాంధీ, 1999లో సోనియాగాంధీ పార్లమెంట్‌కు పోటీ చేసినప్పుడు వీరిద్దరిని బలపరుస్తూ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశాడు. కానీ ఆయన కుమారుడు హజీ హరూన్ రషీద్ మాత్రం కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేశారు.రాహుల్‌పై పోటీగా అమేథీ నియోజకవర్గం బరిలోకి దిగుతానని రషీద్ ప్రకటించాడు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న విషయం చెప్పలేదు. ఈ సందర్భంగా రషీద్ మీడియాతో మాట్లాడుతూ.. గత 70 ఏళ్ల నుంచి అమేథీలో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. పార్టీ అధిష్టానం స్థానిక నేతలను పట్టించుకోలేదని ఆరోపించారు. అమేథి నియోజకవర్గంలో 6.5 లక్షల ముస్లిం ఓట్లు ఉన్నాయని.. అవన్నీ కాంగ్రెస్‌కు వ్యతిరేకమే అని పేర్కొన్నారు. అమేథి నియోజకవర్గంలో అభివృధ్ది జరగలేదన్నారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో తిరిగితే వాస్తవాలుతెలుస్తాయన్నారు. 2004 సాధారణ ఎన్నికల సమయంలో అమేథి నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. అప్పట్నుంచి సోనియా రాయ్‌బరేలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అమేథి నియోజకవర్గంలో మే 6న ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23న జరుగుతాయి. -
కేరళ నుంచీ రాహుల్ ?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం యూపీలోని అమేథీతోపాటు కేరళలోని వయనాడ్ స్థానం నుంచి, ప్రధాని మోదీ వారణాసితోపాటు కర్ణాటకలోని బెంగళూరు(దక్షిణ) నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు మూడు పర్యాయాలు అమేథీ నుంచి గెలిచినందున ఇకపై ఆ సీటుపై ఆధారపడటం అంత సురక్షితం కాదని భావిస్తున్న రాహుల్.. ఈ దఫా మరో స్థానం నుంచీ పోటీ చేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘జాతీయ స్థాయి నేతగా రాహుల్ గుర్తింపు పొందాలంటే దక్షిణాది నుంచీ పోటీ చేయడం అవసరం. గెలిచిన ప్రతీ సీటు పార్టీకి చాలా కీలకం’ అని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతోపాటు వయనాడ్ స్థానం కాంగ్రెస్‌కు కంచుకోట. ఇక్కడ కాంగ్రెస్‌కు ఓటమి అన్నదే లేదు. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ షానవాజ్ ఇటీవలే మృతి చెందారు. దీంతో సిద్ధిఖి అనే నేతకు టికెట్ ఇచ్చినా పోటీకి ఆయన నిరాకరించారు. వయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేయాలంటూ కేరళ పీసీసీ గట్టిగా కోరుతోందని పార్టీ ప్రతినిధి సూర్జేవాలా చెప్పారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఊమెన్ చాందీ తిరునవంతపురంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ను వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగాలని కేరళ పీసీసీ కోరింది. కర్ణాటక, తమిళనాడు పార్టీ విభాగాలు కూడా తమ రాష్ట్రాల నుంచి పోటీ చేయాలంటూ ఇప్పటికే ఆయన్ను ఆహ్వానించాయి’ అని చెప్పారు. కర్ణాటక నుంచి మోదీ ప్రధాని మోదీని కర్ణాటక దక్షిణ నియోజకవర్గం నుంచి బరిలో ఉంచాలని కమలనాథులు యోచిస్తున్నట్లు సమాచారం. దక్షిణాదితోపాటు ఆ రాష్ట్రంలో పార్టీ విజయావకాశాలను మరింత మెరుగు పర్చేందుకు ఈ వ్యూహం పని చేస్తుందని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కర్ణాటక బీజేపీ విభాగం పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు పలుమార్లు ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. ఆ పార్టీ రాష్ట్రంలోని 28 సీట్లకు గాను 21 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. ప్రకటించాల్సిన స్థానాల్లో బెంగళూరు(దక్షిణ) కూడా ఉంది. ఇక్కడ కేంద్ర మాజీ మంత్రి అనంత్‌కుమార్ భార్య తేజస్వినికి టికెట్ ఇచ్చేందుకు మార్గం సుగమం అయింది. అనంత్‌కుమార్ ఇక్కడి నుంచి వరుసగా ఆరు పర్యాయాలు గెలుపొందారు. అయితే, ప్రధాని మోదీ ఇక్కడి నుంచి బరిలోకి దిగే అవకాశాలున్నందునే తేజస్వినికి ఆఖరి నిమిషంలో టికెట్ ప్రకటించకుండా నిలిపివేసినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. మోదీ 2014 ఎన్నికల్లో వారణాసితోపాటు వడోదర నుంచి పోటీ చేశారు. యూపీలోని అమేథీ నుంచి పోటీలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌కు ఓటమి భయం పట్టుకుందని బీజేపీ, సీపీఎం ఎద్దేవా చేశాయి. అమేథీలో ఓటమి భయం ఉన్నందునే రాహుల్‌ను వాయనాడ్ నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ భావిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్ విమర్శించారు. కాగా, కేరళలోని 20 ఎంపీ స్థానాలకు గాను 16 చోట్ల కాంగ్రెస్ పోటీచేస్తోంది. భాగ్ రాహుల్ భాగ్ కేరళ నుంచి రాహుల్ పోటీ వార్తలపై అమేధీ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ట్విట్టర్లో ‘భాగ్ రాహుల్ భాగ్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో స్పందించారు. ‘రాహుల్‌ను అమేథీ ప్రజలు తిరస్కరించారు. ఇతర రాష్ట్రాల ప్రజలు తమ వద్ద పోటీ చేయాలని కోరుకుంటున్నారంటూ అక్కడి నుంచి రాహుల్‌తో పోటీ చేయించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది’ అని ఆమె అన్నారు. ‘చాంద్‌నీచౌక్, అమేథీల్లో ఓడిపోయారు. మళ్లీ మళ్లీ ప్రజల తిరస్కరణకు గురైన ఆమె దొడ్డిదారిన రాజ్యసభ ద్వారా పార్లమెంట్లో అడుగుపెడుతున్నారు. మరోసారి అమేథీలో ఆమె ఓటమికి రంగం సిద్ధమైంది’ అంటూ స్మృతికి స్పందనగా కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా ట్విట్టర్లో పోస్ట్‌పెట్టారు. -
ప్రధాని మోదీగారూ మీకు సిగ్గనిపించడం లేదా?
న్యూఢిల్లీ: అమేథి పర్యటనలో తనపై విమర్శలు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. అమేథిలోనూ మోదీ యథాలాపంగా అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ‘2010లో నేనే స్వయంగా అమేథిలో ఆయుధాల ఫ్యాక్టరికి శంకుస్థాపన చేశాను. గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ చిన్న చిన్న ఆయుధాలు తయారవుతున్నాయి. నిన్న మీరు అమేథి వెళ్లి మీకు అలవాటైన రీతిలో యథాలాపంగా అబద్ధాలు చెప్పారు. మీకు కొంచెం కూడా సిగ్గనిపించదా? (క్యా ఆప్కో బిల్కుల్ షరమ్ నహీ ఆథి)’ అంటూ రాహుల్ ట్విటర్లో ప్రశ్నించారు. 2004 నుంచి అమేథి నియోజకవర్గానికి రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు రాహుల్ తల్లి సోనియాగాంధీ ఈ నియోజకవర్గంలో ఒక పర్యాయం పోటీ చేసి గెలుపొందారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గాంధీ-నెహ్రూ కుటుంబానికి కంచుకోట అయిన అమేథిలో ప్రధాని మోదీ ఆదివారం సుడిగాలి పర్యటన చేసి.. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. భారత్-రష్యా జాయింట్ వెంచర్ అయిన ఏకే 203 కలాషినికోవ్ అసాల్ట్ రైఫిల్ తయారీ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘2007లో ఆయుధాల తయారీ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి.. 2010లో ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉండగా.. అలాంటిదేమీ జరగలేదు. స్థానిక ఎంపీ ఈ ఫ్యాక్టరీ ద్వారా 1500 మందికి ఉద్యోగాలు వస్తాయని ఊదరగొట్టారు. కానీ కేవలం 200 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. అమేథిలో ఉద్యోగాలు కల్పించలేని వారు.. దేశంలో ఉద్యోగాల కల్పన గురించి లెక్చర్లు దంచుతున్నారు’ అని విమర్శించారు. -
గాంధీ కోటకు ప్రధాని మోదీ
-
గాంధీ కోటకు ప్రధాని మోదీ
లక్నో: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రోజుకో రాష్ట్రం చొప్పున దేశమంతా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కీలకంగా మారిన ఉత్తరప్రదేశ్‌పై మోదీ ప్రత్యేక దృష్టిసారించారు. ఇటీవల వారణాసిలో పర్యటించిన మోదీ ఆదివారం అమేథిలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథిలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ తరువాత తొలిసారి అడుగుపెట్టనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం.. కుహ్వారా ప్రాంతంలో జరిగే బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. మోదీ సభకు ఏర్పాట్లను యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ పరిశీలించారు. సభకు లక్షకు పైగా కార్యకర్తలు హాజరవుతారని బీజేపీ వర్గాలు ప్రకటించాయి. దశాబ్దాలుగా గాంధీ కుటుంబమే ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథిపై బీజేపీ ప్రత్యేక దృష్టిని సారించింది. దానిలో భాగంగానే బీజేపీ ఫైర్ బ్రాండ్ స్మృతి ఇరానీని గత ఎన్నికల్లో రాహుల్‌పై పోటీకి నిలిపింది. స్వల్ప ఓట్ల తేడాతో ఆమెపై రాహుల్ విజయం సాధించారు. ఈసారి ఎలానైనా విజయం సాధించాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. యూపీలో ఎక్కువ సీట్లు సాధించాలన్న లక్ష్యంతో గత ఎన్నికల్లో ఓటమి చెందిన స్థానాలపై బీజేపీ మరింత దృష్టి సారించింది. దానిలో భాగంగానే యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రామబరేలిలో గత ఏడాది మోదీ పర్యటించారు. మోదీ చివరిసారిగా 2014 మే 4న ఆమేథిలో పర్యటించిన విషయం తెలిసిందే. -
‘ఆయన ప్రవర్తనతో విసిగిపోయాం.. ఇటలీకి వెళ్లిపోవాలి’
లక్నో : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సొంత నియోజకవర్గం అమేథీలో చేదు అనుభవం ఎదురైంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ బుధవారం అమేథీలో పర్యటించారు. ఈ క్రమంలో.. ‘రాహుల్ గో బ్యాక్ టు ఇటలీ’ అంటూ రైతులు నిరసన చేపట్టారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కోసం తీసుకున్న తమ భూములను వెనక్కి ఇచ్చేయాలి లేదా భూసేకరణకు బదులుగా ఉద్యోగం కల్పించాలంటూ ఆందోళనకు దిగారు. ఈ విషయం గురించి సంజయ్ సింగ్ అనే నిరసనకారుడు మీడియాతో మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీ విధానాలతో విసిగిపోయాం. ఆయన ఇటలీకి వెళ్లిపోవాల్సిందే. భారత్‌లో ఉండటానికి ఆయన అర్హులు కారు. మా భూములు లాక్కుని ఇబ్బందులకు గురిచేస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా 1980లో సామ్రాట్ సైకిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు నిమిత్తం వ్యాపారవేత్తలు కౌసర్ సమీపంలో గల 65.57 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఈ ఫ్యాక్టరీని ప్రారంభించారు. అయితే నిర్వాహకులు అప్పుల పాలైన నేపథ్యంలో లీజు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో 20.10 కోట్ల రూపాయల బాకీని వసూలు చేసేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ(యూపీఎస్ఐడీసీ) 2014లో ఈ భూమిని వేలం వేసింది. కాగా రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్టు 1,50,000 రూపాయల స్టాంపు డ్యూటీ చెల్లించి ఈ భూమిని కొనుగోలు చేసింది. అయితే ఈ విషయంలో యూపీఎస్ఐడీసీ, రాజీవ్ గాంధీ ట్రస్టు తీరును తప్పుబట్టిన గౌరీగంజ్ కోర్టు భూమిని సామ్రాట్ సైకిల్ ఫ్యాక్టరీకి అప్పగించాలంటూ ఆదేశించింది. దీంతో ఈ వేలాన్ని రద్దు చేస్తున్నట్లు యూపీఎస్ఐడీసీ ప్రకటించింది. కానీ ఆ భూమి ఇప్పటికీ రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్టు చేతిలోనే ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
రాహుల్ ‘మిషన్ టెంపుల్’
సాక్షి, న్యూఢిల్లీ : మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో జోష్ మీదున్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సార్వత్రిక ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నారు. ఆలయ సందర్శనలు, హిందుత్వ పట్ల అనుసరిస్తున్న మెతక వైఖరి ఆయా ఎన్నికల్లో సానుకూల ఫలితాలు ఇవ్వడంతో ఇదే ఒరవడి కొనసాగించాలని రాహుల్ భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ హిందూ ఓటు బ్యాంక్‌ను ఆకర్షించేందుకు మిషన్ టెంపుల్ వ్యూహానికి పదునుపెడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కీలక రాష్ట్రమైన యూపీ నుంచే ఈ కసరత్తును ముమ్మరం చేయాలని భావిస్తున్నారు. ఎంపీ నిధుల నుంచి అమేథి నియోజకవర్గంలోని ఆలయాల పునర్నిర్మాణం, మరమ్మత్తులను చేపట్టాలని రాహుల్ నిర్ణయించారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలోని 13 ఆలయాల్లో హైమాస్ట్ సోలార్ లైట్లను అమర్చాలని పార్టీ చీఫ్ నిర్ణయించారని కాంగ్రెస్ నేత అనిల్ సింగ్ తెలిపారు. అమేథి సంగ్రామ్‌పూర్‌లోని కాళీ దేవి, గౌరీ గంజ్‌లోని దుర్గా ఆలయం, సహఘర్‌లోని భవానీ ఆలయాలు వంటి పురాతన ఆలయాలూ ఈ జాబితాలో ఉన్నాయి. ఆయా ఆలయాల సుందరీకరణతో పాటు వాటిలో హార్మోనియం, డోలు, మజీర వంటి పరికరాలను అందుబాటులో ఉంచుతారు. ఆయా దేవాలయాల్లో తాగునీటి వసతినీ కల్పించనున్నట్టు స్ధానిక కాంగ్రెస్ నేత చంద్రకాంత్ దూబే వెల్లడించారు. కాగా రాహుల్ తన నియోజకవర్గంలోని ఆలయాలపై దృష్టిసారించడం పట్ల బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉమాశంకర్ పాండే స్పందించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోరుతూ దేశవ్యాప్తంగా ధర్మ సభలు జరుగుతుండటంతో రాహుల్ కంగారు పడుతున్నారని, అందుకే అమేథిలో ఆలయాల మరమ్మత్తులపై ఆయన దృష్టిపెట్టారని వ్యాఖ్యానించారు. రాహుల్ నిర్ణయం మంచిదే అయినా రాజకీయ ప్రయోజనం పొందడమే ఆయన ఉద్దేశమని ఆరోపించారు. కాగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్‌పై పోటీ చేసిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సైతం రాహుల్ కోటలో బీజేపీని బలోపేతం చేసేందుకు తరచూ అమేథిని సందర్శిస్తున్నారు. -
రాహుల్ సవాల్‌కు ఇరానీ కౌంటర్!
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ కుంభకోణంపై ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విసిరిన సవాల్‌పై కేంద్ర జౌళీ శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. రాఫెల్‌తో పాటు దేశానికి సంబంధించిన అంశాలపై చర్చకు తాము సిద్ధమని, కానీ రాహుల్ చర్చకు వచ్చేముందు చేతిలో ఎలాంటి పేపర్లు (స్క్రిప్ట్) లేకుండా చర్చించగల సత్తా ఆయనకు ఉందా అని ఆమె ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో ఇటీవల రాహుల్ మాట్లాడుతూ.. రాఫెల్‌పై తనతో చర్చకు ప్రధాని మోదీ సిద్ధమేనా? అని సవాలు విసిరిన విషయం తెలిసిందే. దీనిపై ఇరానీ సోమవారం ఓ సమావేశంలో మాట్లాడుతూ.. గత 15 ఏళ్లుగా అమేథిలో రాహుల్ ఎంపీగా విజయం సాధిస్తూ వస్తున్నారని.. తన సొంత నియోజకవర్గంలోని కొన్ని గ్రామపంచాయతీల పేర్లు కూడా రాహుల్ చెప్పలేరని ఆమె ఎద్దేవా చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నుంచి రాహుల్ వరకు అమేథిని పాలించింది వారి కుటుంబమేనని.. అక్కడ అభివృద్ది ఏమేరకు జరిగిందో ప్రజలందరికీ తెలుసని మండిపడ్డారు. కాగా గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ పోటీ చేసిన ఇరానీ స్వల్ప తేడాతో ఓటమి చెందిన విషయం తెలిసిందే. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అమేథి లోక్‌సభ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో మూడింటిని బీజేపీ గెలుపొందగా, ఒక స్థానంలో ఎస్పీ విజయం సాధించింది. -
‘ఇక్కడ అరటి పండ్లు కూడా దొరకడం లేదా?’
అమేథి, ఉత్తరప్రదేశ్ : రాహుల్ గాంధీ అమేథి రైతులకు అరటి మొక్కలు పంచారు. కానీ కేవలం అరటి చెట్లు పెంచడం వల్లే దేశంలో పేదరికం సమసిపోదు అంటూ కేంద్ర జౌళీ శాఖ మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ నియోజకవర్గం అమేథిలో దాదాపు రూ. 77 కోట్ల విలువైన పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క కుటుంబానికే అంకితమైన పార్టీ. అలాంటి పార్టీ దేశాభివృద్ధికి, అమేథి అభివృద్ధి కోసం పని చేయదు అంటూ ఆరోపించారు. రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ సిద్దాంతాలను, ప్రధాని మోదీని విమర్శిస్తారు. కానీ తిరిగి ఆర్ఎస్ఎస్ మార్గంలోనే నడుస్తూ.. అమేథి రైతులకు అరటి మొక్కలు పంచారు. దీని గురించి నాకొక ఆసక్తికరమైన విషయం తెలిసింది. అది ఏంటంటే ఈ అరటి మొక్కలను కూడా విదేశాల నుంచే తెప్పించారని విన్నాను. అంటే రాహుల్ గాంధీకి భారతదేశంలో కనీసం అరటి మొక్కలు కూడా దొరక లేదా అంటూ ఎద్దేవా చేశారు. కేవలం అరటి మొక్కలు నాటడం వల్లే దేశంలో పేదరికం తగ్గదు అంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో చేయని అభివృద్ధిని.. బీజేపీ పార్టీ కేవలం నాలుగేళ్లలోనే సాధించిందంటూ వివరించారు. రాహుల్ గాంధీ 15 ఏళ్ల నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వస్తున్నారు. కానీ ఇన్నేళ్లలో ఆయన ఒక్కసారి కూడా ‘రోజ్‌గార్ మేలా’ నిర్వహించలేదని మండిపడ్డారు. కానీ బీజేపీ ప్రభుత్వం దాదాపు 7,500 మందికి ఉపాధి కల్పించినట్లు తెలిపారు. 2022 నాటికి అమేథిలోని ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. -
రాహుల్‌కు అరుదైన స్వాగతం
అమేథీ: ఇటీవల కైలాస మానస సరోవర యాత్ర ముగించుకుని భారత్‌కు తిరిగొచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి తన సొంత నియోజకవర్గం అమేథీలో కార్యకర్తలు అరుదైన స్వాగతం పలికారు. ‘శివ్భక్త్ రాహుల్ గాంధీ’ పోస్టర్లు అంటించారు. వందలాది మంది కాంగ్రెస్ అభిమానులు కాషాయవస్త్రాల్లో శివభక్తులైన ‘కన్వరీ’ల వేషధారణలో స్మరణలు చేస్తూ రాహుల్‌ను ఆహ్వానించారు. వందలాది కార్యకర్తల నడుమ రాహుల్ నుదుటిపై చందనం, కుంకుమ ధరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. -
స్త్రీలోక సంచారం
రెండో పెళ్లి (బిగమీ) కోసం హిందువులలో కొందరు ముస్లిం మతం స్వీకరిస్తున్న ధోరణì కి అడ్డుకట్ట వేసేందుకు చట్టపరమైన గట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించిన ‘లా’ కమిషన్.. ఈ విధమైన పెళ్లిళ్లను చెల్లుబాటు కానివిగా పరిగణించాలని 2015లో మహిళా శిశు, అభివృద్ధి శాఖ ఒక నివేదికలో సూచించడాన్ని గుర్తు చేసింది. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 494 ప్రకారం.. జీవిత భాగస్వామికి తెలియకుండా ఇంకో పెళ్లి చేసుకున్నవారికి ఏడేళ్ల వరకు, సెక్షన్ 495 ప్రకారం.. పెళ్లయిన సంగతిని దాచి పెట్టి ఇంకో పెళ్లి చేసుకున్నవారికి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉండగా, శిక్షను తప్పించుకోవడానికి హిందువులు కొందరు.. ముస్లిం మతంలోకి మారుతున్నారని సామాజిక జీవన విధానాల పరిశీలకులు కొంతకాలంగా చెబుతున్న మాటను కూడా లా కమిషన్ తన సూచనల్లో ప్రస్తావించింది. దత్తత తీసుకున్న తల్లిదండ్రులు వదిలేయడంతో ప్రస్తుతం స్పెయిన్‌లోని జర్గోజా ప్రభుత్వ శరణాలయంలో ఉన్న పదమూడేళ్ల బాలికను తక్షణం భారతదేశానికి తెప్పించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను జాప్యం లేకుండా పూర్తి చెయ్యాలని కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మనేకా గాంధీ స్పెయిన్‌లోని భారత రాయబారి డి.బి.వెంకటేశ్ వర్మకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది ఆరంభంలో ఇండియా వచ్చిన స్పెయిన్ దంపతులు భోపాల్‌లోని ‘ఉడాన్’ అనే అడాప్షన్ ఏజెన్సీ నుంచి ఆ బాలికను దత్తత తీసుకునే సమయంలో ఆమె వయసు ఏడేళ్లని అబద్ధం చెప్పి ఏజెన్సీ తమను మోసం చేసిందని స్పెయిన్ తిరిగి వెళ్లాక తెలియడం తో వారు ఆమెను వదిలేశారని పత్రికలో వచ్చిన వార్తతో కలత చెందిన మనేకా.. ‘ఏది ఏమైనా’ ఆ చిన్నారిని మన దేశానికి సురక్షితంగా తెప్పించి, తగిన సంరక్ష కల్పించాలన్న కృతనిశ్చయానికి వచ్చా0తరు. మయన్మార్‌లోని రొహింగ్యా ముస్లింల ఊచకోతపై కథనాలు రాసిన వా లోన్, కా సో ఓ అనే ఇద్దరు జర్నలిస్టులను అధికార రహస్యాలు బట్టబయలు చేశారన్న నేరారోపణలపై అరెస్టు చేసిన అనంతరం, అక్కడి న్యాయస్థానం వారికి ఏడేళ్ల జైలు శిక్ష విధించడంతో.. ఆ దేశ సమరయోధురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ప్రస్తుత మయన్మార్ ‘స్టేట్ కౌన్సిలర్’ ఆంగ్ సాన్ సూచీకి హక్కుల పరిరక్షణ ఉద్యమకారిణిగా ఇంతవరకు ఉన్న పేరు ప్రతిష్టలన్నీ నీరుగారిపోయాయి. జైల్లో ఆ జర్నలిస్టుల పరిస్థితి ఏమిటన్న విషయమై సూచీని తను అడిగినప్పుడు వారిపై ఆమె ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారనీ, వారిని ఆమె దేశ విద్రోహులుగా అభివర్ణించడాన్ని బట్టి చూస్తే ఆ ఇద్దరి ప్రాణాలూ ప్రమాదంలో ఉన్నట్లు అర్థమౌతోందని మయన్మార్‌లోని యు.ఎస్. దౌత్య అధికారి బిల్ రిచర్డ్సన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్ట్రిప్ క్లబ్బులలో ‘ల్యాప్ డ్యాన్స్’ నిషేధానికి ఉన్న న్యాయపరమైన అవరోధాలను తొలగించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం నిపుణులతో కలిసి కూర్చొని చర్చలు జరుపుతోంది. స్ట్రిప్ క్లబ్లో బార్ డ్యాన్సర్లు ఒక్కో వస్త్రాన్నీ తొలగిస్తూ నృత్యం చేయడం అన్నది ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. ఇటీవల ‘స్ట్రిప్’ (బట్టలు తొలగించడం)తో పాటు ‘ల్యాప్’ (ఒడిలో కూర్చోవడం) డ్యాన్స్ కూడా తోడయిన కారణంగా ఆగ్రహించిన ఆ దేశ మహిళలు.. క్లబ్బుల బయట నిరసన ప్రదర్శనలు జరుపుతుండటంతో దిగివచ్చిన ప్రభుత్వం, ‘ల్యాప్ డ్యాన్స్’ను ‘వ్యభిచారం’గా పరిగణిస్తూ శిక్షను విధించే చట్టాన్ని తేవాలన్న ఆలోచనలో ఉంది. భారతీయ రచయిత్రులు రాసిన 13 పుస్తకాలు ఈ నెలలో విడుదల అవుతున్నాయి! ఫెమినిస్ట్ రాణి (శైలీచోప్రా, మేఘనా పంత్), 54 రీజన్స్ వై పేరెంట్స్ సక్ అండ్ ఫ్యూ (డాక్టర్ స్వాతీ లోథా, స్వరా లోథా), బికాజ్ హి ఈజ్ (మేఘనా గుల్జార్), హౌ ఇండియా వర్క్స్ : మేకింగ్ సెన్స్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ కార్పొరేట్ కల్చర్ (ఆర్తి కెల్షికార్), యాంబిగ్యుయిటీ మెషీన్స్, అండ్ అదర్ స్టోరీస్ (వందనా సింగ్), మహుల్దిహా డేస్ (అనితా అగ్నిహోత్రి), ది ఉమెన్స్ కోర్ట్‌యార్డ్ (ఖదీజా మసూర్), నాట్ క్వైట్ నాట్ వైట్ (షర్మిలా సేన్), ఎ షూటింగ్ స్టార్ : ఎ గర్ల్, హర్ బ్యాక్ పెయిన్ అండ్ ది వరల్డ్ (శివ్యానాథ్), ఎంప్రెస్ : ది ఆస్టానిషింగ్ రీన్ ఆఫ్ నూర్జహాన్ (రూబీ లాల్), సెర్చింగ్ ఫర్ హోమ్ : స్టోరీస్ ఆఫ్ ఇండియన్స్ లివింగ్ అబ్రాడ్ (శిమ్రాన్ చావ్లా), శ్రీదేవి (లలితా అయ్యర్), రెమ్నెంట్ ఆఫ్ ఎ సెపరేషన్ : ఎ హిస్టరీ ఆఫ్ ది పార్టిషన్ త్రూ మెటీరియల్ మెమరీ (ఆంచల్ మల్హోత్రా).. అనే ఈ పుస్తకాలను ప్రచురణకర్తల నుంచే కాకుండా, అమెజాన్ నుంచీ తెప్పించుకోవచ్చు. చెన్నై నుంచి సోమవారం మధ్యాహ్నం తూత్తుకుడి వెళుతున్న విమానంలో ఉన్న లూయిస్ సోఫియా (28) అనే రీసెర్చ్ స్కాలర్.. అదే విమానంలో ఉన్న బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షురాలు తమిళ్సై సౌందరరాజన్ మీదకు దూసుMðళుతూ బీజేపీ ప్రభుత్వ ‘నియంతృత్వ’ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారన్న నేరారోపణపై అరెస్ట్ అయ్యారు. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్లో చదువుతున్న సోఫియా ఇలా నినాదాలు చేయడాన్ని తేలిగ్గా తీసుకోవాలని పోలీసులు తమిళ్సైకి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆమె వినకపోవడంతో సోఫియాపై సెక్షన్ 505 (1)బి (భయం కలిగించేలా అరవడం), సెక్షన్ 290 (పబ్లిక్ న్యూసెన్స్), సెక్షన్ 75(1)సి (ప్రజాప్రతినిధికి అవినమ్రంగా సమాధానం చెప్పడం) కింద కేసులు నమోదు చేసి పుదుక్కొటై్ట మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం 12 రోజుల కైలాశ్ మానస సరోవర్ యాత్రలో ఉండగా, ఆయన నియోజకవర్గమైన అమేథీలోని అన్ని గ్రామ పంచాయతీలను 2018 చివరి నాటికి డిజిటలైజ్ చేసే ప్రాజెక్టులో కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ తలమునకలై ఉన్నారు. 2014లో రాహుల్ గాంధీ మీద అమేథీ నుండి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, తరచు ఆ నియోజకవర్గంలో పర్యటిస్తూ వస్తున్న స్మృతి.. సెప్టెంబర్ 1న అమేథీలోని పిండారా ఠాకూర్ గ్రామంలో ‘డిజిటల్ గ్రామ్’ ప్రాజెక్టును ప్రారంభించారు. ఒక బిడ్డకు జన్మనిచ్చాక కూడా కొంత విరామంతో తిరిగి బరిలోకి వచ్చి, ఉత్సాహంగా తన ప్రతిభను కనబరిచే ప్రయత్నం చేస్తున్న టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తొలిసారిగా తన ఫిట్‌నెస్‌పై పెదవి విప్పారు. గర్భం దాల్చాక మునుపటి ఫిట్నెస్ను కాపాడుకోవడం అనుకున్నంత తేలిక కాదని.. ప్రస్తుతం యు.ఎస్. ఓపెన్‌లో ఆడుతున్న సెరెనా అన్నారు. -
అమేథిలో రాహుల్ జనతా దర్బార్
లక్నో : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గురువారం తన నియోజకవర్గం అమేథిలో జనతా దర్బార్ నిర్వహించారు. జిల్లా కేంద్రం గౌరీగంజ్‌లోని పార్టీ కార్యాలయంలో పలు వర్గాల ప్రజల సమస్యలను రాహుల్ ఆలకిస్తూ..వారి నుంచి వినతులు స్వీకరించారు. మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ సంజయ్ సింగ్ ఆయన భార్య అమితా సింగ్ రాహుల్‌తో పార్టీ, నియోజకవర్గ వ్యవహారాలను చర్చించారు. యూపీలో పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై రాహుల్‌తో చర్చించామని సంజయ్ సింగ్ తెలిపారు. ఇక పార్టీ కార్యకర్తలు, విద్యార్ధులు, వ్యాపార వర్గాలకు చెందిన ప్రతినిధులు పెద్దసంఖ్యలో రాహుల్‌ను కలిశారు. యూపీ మాజీ మంత్రి, సంగీతా ఆనంద్ సీనియర్ బీజేపీ నేత రామ్ లఖన్ పాసి కూడా రాహుల్‌తో సమావేశమయ్యారు. రాహుల్ గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
‘బుల్లెట్ ట్రైన్ కాదు.. మ్యాజిక్ ట్రైన్’
అమేథీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం విమర్శల వర్షం కురిపించారు. అమేథీ పర్యటనలో ఉన్న రాహుల్ మాట్లాడుతూ.. మోదీ చేపట్టింది బుల్లెట్ ట్రైన్ కాదు.. మ్యాజిక్ ట్రైన్ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటికి పూర్తి కాదని ఆరోపించారు. ఆహ్మద్బాద్, ముంబైల మధ్య నిర్మించ తలపెట్టిన బుల్లెట్ ట్రైన్ మ్యాజిక్‌గానే మిగులుతుందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే బుల్లెట్ ట్రైన్ కల సాకారమవుతుందని ఆయన పేర్కొన్నారు. భారీ వ్యయంతో మోదీ ప్రభుత్వం చేపట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌పై తొలి నుంచి విపక్షాలు ఎదురుదాడి చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ప్రాజెక్టుపై రాహుల్ మాట్లాడుతూ..‘మోదీ జీ స్నేహితులైన ధనికులు ప్రయాణించడానికే బుల్లెట్ ట్రైన్ ఉపకరిస్తుంది. ఇది భారత్‌కు ఇప్పుడు అనవసరం. 2016లో దేశంలో చోటుచేసుకున్న వేర్వేరు రైలు ప్రమాదాల్లో 200మంది మరణించారు. బుల్లెట్ ట్రైన్‌కు వెచ్చించే భారీ మొత్తాన్ని రైల్వే భద్రతకు మళ్లిస్తే.. రైలు ప్రమాదాలో ఒక్కరు కూడా మృతిచెందకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చ’ని పేర్కొన్న సంగతి తెలిసిందే. -
మోదీ ఎప్పుడూ గతాన్ని తవ్వుకుంటూ...
అమేథీ : సొంత నియోజక వర్గంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. మంగళవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ‘సాధారణంగా నాయకులు దేశ భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తారు. మాజీ ప్రధానులు నెహ్రూ, వాజ్‌పేయిలను గమనించండి. వారు ఎల్లప్పుడూ భవిష్యత్తు గురించే ఆలోచించేవారు. కానీ ప్రస్తుతం ఉన్న ప్రధాని ఎప్పుడూ గతాన్ని తవ్వుకుంటూ ద్వేషాన్ని పెంపొందించాలని ప్రయత్నిస్తున్నారంటూ’ విమర్శించారు. ట్రిపుల్ ఐటీ, మెగా ఫుడ్ పార్క్, పేపర్ మిల్ వంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు అమేథీ నుంచి తరలి వెళ్లడానికి కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే కారణమని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీంతో వేలాది మంది యువత ఉపాధి అవకాశాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులను తిరిగి అమేథీకి రప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యువతకు ఉపాధి అవకాశాలు లభించినపుడే దేశం అభివృద్ధి చెందుతుందని రాహుల్ వ్యాఖ్యానించారు. రానున్న పది, పదిహేనేళ్లలో అమేథీ వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఇప్పుడు సింగపూర్, కాలిఫోర్నియాల గురించి ప్రజలు ఎలా మాట్లాడుకుంటున్నారో అమేథీ గురించి కూడా అలాగే మాట్లాడతారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
రాహుల్ సమాధానాలకు విద్యార్థుల ఆశ్చర్యం
-
విద్యార్థుల ప్రశ్నలు : రాహుల్ వింత సమాధానాలు
అమేథి : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వింత వింత సమాధానాలు చెప్పారు. తన సొంత ఎంపీ నియోజకవర్గం అమేథిలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన రాహుల్, అక్కడి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు తలాతోక లేని సమాధానాలు చెప్పారు. రాహుల్ చెప్పిన సమాధానాలకు విద్యార్థులే ఆశ్చర్యపోయారు. విద్యార్థులతో జరిగిన సంభాషణలో రాహుల్‌కు ఎదురైన ప్రశ్నలు.... ప్రభుత్వం చాలా చట్టాలను రూపొందిస్తుంది కానీ ఎందుకు వాటిని గ్రామాల్లో సరిగ్గా అమలు చేయదు అని ఓ విద్యార్థిని అడిగింది. అయితే ఈ ప్రశ్నను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అడగాలని, అక్కడ తమ ప్రభుత్వం లేదని, ఒకవేళ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమల్ని ఈ ప్రశ్న వేయొచ్చంటూ రాహుల్ సమాధానం చెప్పారు. కానీ రాహుల్ చెప్పిన ఈ సమాధానం అక్కడంతా నవ్వులు పవ్వులు పూయించింది. రాహుల్ తెలిసి చెప్పారో లేదా తెలియక చెప్పారో తెలియదు కాదు కానీ... చట్టాలను పార్లమెంట్ చేస్తుందని, వాటిల్లో చాలా వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే అమలు చేయాల్సి ఉంటుందని, కానీ కేంద్ర ప్రభుత్వం వాటిని అమలు చేయదని కొందరు విద్యార్థులన్నారు. అమేథి గురించి అడగగా కూడా.. ఎంపీగా తన బాధ్యతలను తాను పొగుడుకుని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను తప్పుబట్టారు. ‘నో.. నో.. అమేథిని యోగి పాలిస్తున్నారు. నేను అమేథి నుంచి ఎంపీని మాత్రమే. నా బాధ్యత లోక్‌సభలో చట్టాలు చేయడం. యూపీని పాలించాల్సిన బాధ్యత యోగిదే. కానీ ఆయన మరో పనుల్లో బిజీగా ఉన్నారు. విద్యుత్, నీరు, విద్యపై కూడా ఆయన పనిచేయడం లేదు’ అని రాహుల్ సమాధానమిచ్చారు. రాహుల్ మరిన్ని ప్రశ్నలు వేయబోయే సరికి, ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే పార్లమెంట్లో ఎంపీల పాత్రను పక్కనబెడితే, సొంత రాష్ట్రం లేదా నియోజకవర్గాలలో ఎంపీలు కీలక పాత్ర పోషించాలి. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ కింద ఏడాదికి వారు తమ నియోజకవర్గాల్లో రూ.5 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఎంపీలను స్థానిక బాడీలకు బాధ్యతగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ స్కీమ్‌లను వారి నియోజకవర్గాల్లో అమలు చేయాల్సిన బాధ్యత వారిదే. కానీ రాహుల్ గాంధీ మాత్రం ఈ బాధ్యతలకు విరుద్ధంగా, తన నియోజకవర్గం గురించి తనకేమీ పట్టదన్నంటూ సమాధానం చెప్పి, విద్యార్థులను సైతం ఆశ్చర్యపరిచారు. నేటి నుంచి మూడు రోజుల పాటు అమేథి, రాయబరేలీల్లో రాహుల్ పర్యటన కొనసాగనుంది. రాయబరేలికి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎంపీగా వ్యవహరిస్తున్నారు. -
రాహుల్ గాంధీ వస్తే అడ్డుకుంటాం
అమేథి: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తన సొంత నియోజకవర్గం అమేథిలో ఊహించని పరిణామం ఎదురైంది. ప్రధాన మంత్రి సడక్ యోజన ద్వారా రూ. 3.5 కోట్లతో తావూరి, కొట్వా గ్రామాల మధ్య 5.5 కిలోమీటర్ల దూరం గల రోడ్డును ప్రారంభించడానికి రాహుల్ సిద్దమైన నేపథ్యంలో స్థానిక బీజేపీ నేతలు ఆయన పర్యటనను వ్యతిరేకిస్తున్నారు. రోడ్డును రాహుల్ ప్రారంభించడానికి వీల్లేదని, ఆయన వస్తే అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, రాహుల్ ఎలా ప్రారంభిస్తారని స్థానిక నేతలు ప్రశ్నిస్తున్నారు. రోడ్డును ప్రారంభించి రాహుల్ క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉమా శంకర్ పాండే విమర్శించారు. కాగా రోడ్డు పనులు పూర్తికాకముందే రాహుల్ ఎలా ప్రారంభిస్తారని, పూర్తయ్యే వరకు వేచి ఉండాలని సీడీఎం అభయ్ పాండే తెలిపారు. కాగా దీనిపై స్పందించిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు యోగేంద్ర మిశ్రా.. ఇది ప్రారంభోత్సవం కాదని కేవలం పనులను పర్యవేక్షించం కోసమే రెండు రోజులు పర్యటనలో భాగంగా రాహుల్ వస్తున్నారని తెలిపారు. -
‘సోనియా, రాహుల్ సీట్లు గల్లంతు’
సాక్షి, న్యూఢిల్లీ : 2019 సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీకి భంగపాటు తప్పదన్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ దీటుగా బదులిచ్చింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌తో పాటు సోనియా గాంధీ వారి నియోజకవర్గాల్లో ఓటమి పాలవుతారని పేర్కొంది. రాహుల్, సోనియాలపై వారి నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని వ్యాఖ్యానించింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్, ఆయన తల్లి సోనియా గాంధీ వరుసగా అమేథి, రాయ్‌బరేలి స్ధానాల నుంచి ఓడిపోతారని బీజేపీ ప్రతినిధి అనిల్ బలూనీ అన్నారు. వారు తమ నియోజకవర్గాల అభివృద్ధికి చేసిందేమీ లేదని ఆరోపించారు. కాగా, విపక్షాలు ఏకమవుతున్న క్రమంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు ఎదురవడమే కాకుండా, స్వయంగా ప్రధాని మోదీ వారణాసిలో ఓటమిపాలవుతారని రాహుల్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకమవుతున్నాయని రాహుల్ చెప్పుకొచ్చారు. -
మోదీజీ.. పకోడా బిజినెస్‌కు లోన్ ఇవ్వండి
సాక్షి, లక్నో : పకోడా వ్యాపారం చేసుకునేందుకు తనకు సహకరించాలని అమేథికి చెందిన ఓ నిరుద్యోగ యువకుడు అశ్విన్ మిశ్రా కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి లేఖ రాశారు. తాను పకోడా బిజినెస్‌ను చేపట్టేందుకు ముద్రా రుణం మంజూరయ్యేలా తన తరపున ప్రధానిని కోరాలని ఆ యువకుడు కోరారు. పకోడా యూనిట్ ఏర్పాటు గురించి ప్రధాని ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పినప్పటి నుంచి తాను ఉద్యోగ ప్రయత్నాలు విరమించానని పకోడా జాయింట్ ప్రారంభించాలని నిర్ణయించకున్నానని అశ్విన్ మిశ్రా లేఖలో పేర్కొన్నారు. పకోడీలు అమ్ముకోవడంపై ప్రధాని సూచన తనను అమితంగా ఆకట్టుకుందని.. ఇది తాను బతకడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించేందుకు ఉపయోగపడుతుందని భావించానన్నారు. అయితే పకోడీ వ్యాపారాన్ని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నించగా నిధుల కొరతతో ముందుకెళ్లలేకపోయానన్నారు. దీంతో లోన్ కోసం బ్యాంకులను ఆశ్రయించగా...తనకు రుణం లభించలేదన్నారు. ముద్రా యోజన ద్వారా పది కోట్ల మంది లబ్ధిపొందారని ప్రధాని చెబుతున్నా తనకు రుణం ఇచ్చేందుకు బ్యాంకులు తిరస్కరించాయని అమేథి బీజేపీ సోషల్ మీడియా మాజీ చీఫ్‌గా వ్యవహరించిన అశ్విన్ మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మాటలు అవాస్తవాలని తాను భావించడంలేదని, బ్యాంకుల తీరుతోనే తాను ఈ లేఖ రాస్తున్నానని తన తరపున ప్రధానికి విజ్ఞప్తి చేసి పకోడా వ్యాపారం ప్రారంభించేలా తనకు రుణం మంజూరయ్యేలా చూడాలని మంత్రిని కోరారు. మరోవైపు ఈ లేఖ బీజేపీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసేందుకు విపక్షానికి అవకాశం ఇచ్చినట్టైంది. బీజేపీ ప్రభుత్వ నిర్వాకాలు ప్రతిరోజూ వెలుగుచూస్తున్నాయని.. ఇది కేవలం వాటికి ఓ ఉదాహరణేనని స్ధానిక కాంగ్రెస్ నేత అచ్ఛే లాల్ వ్యాఖ్యానించారు. -
యూపీలో మళ్లీ ఘర్షణలు.. సీఎం యోగి ఘాటు వార్నింగ్!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్లో మతఘర్షణలకు సంబంధించిన ఉద్రిక్తతలు చల్లారముందే అమేథిలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఒకరు చనిపోగా.. ఐదుగురు గాయపడ్డారు. అయితే, ఇవి మతఘర్షణలు కాదని, కుటుంబ వైరం వల్లే రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయని పోలీసులు తెలిపారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకొని పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. ఇక, ఒకరి ప్రాణాలు బలితీసుకున్న కాస్గంజ్ మతఘర్షణలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీరియస్‌గా స్పందించారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ‘ప్రతి ఒక్క పౌరునికి భద్రత కల్పించేందుకు మా ప్రభుత్వం నిబద్ధతతో ఉంది. అరాచకాలకు దిగే వాళ్లను సహించే ప్రసక్తే లేదు. హింసకు బాధ్యులైన వాళ్ల పట్ల కఠిన చర్యలు తీసుకుంటాం’ అని యోగి మీడియాతో పేర్కొన్నారు. మరోవైపు కాస్గంజ్ అల్లర్లపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ నివేదిక కోరింది. -
అమేథీలో రాహుల్‌కు నిరసనల సెగ
అమేథీ: సొంత నియోజకవర్గం అమేథీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన రెండో రోజు బీజేపీ కార్యకర్తల నిరసనల మధ్యనే సాగింది. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఆయన అమేథీలో పర్యటించటం ఇదే ప్రథమం. పర్యటనలో భాగంగా రెండో రోజు ముసాఫిర్ఖానా నుంచి గౌరిగంజ్ ఏరియాకు రావల్సి ఉంది. అయితే, బీజేపీ కార్యకర్తలు ముసాఫిర్ఖానా–గౌరీగంజ్ రోడ్డుపై ‘మిస్సింగ్ ఎంపీ’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. రైతుల భూములను ట్రస్ట్‌లకు అప్పగిస్తున్నారని, అమేథీ అభివృద్ధిని విస్మరించారని నినాదాలు చేశారు. -
అమేథీలో కలకలం
లక్నో: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన నియోజకవర్గం అమేథీలో పర్యటిస్తున్న నేపథ్యంలో పోస్టర్ల యుద్ధానికి తెర లేచింది. రాహుల్‌ను రాముడిగా, ప్రధాని నరేంద్ర మోదీని రావణుడిగా పేర్కొంటూ ముద్రించిన పోస్టర్లు కలకలం రేపాయి. రావణుడు(మోదీ)పై రాముడు(రాహుల్) బాణాలు ఎక్కుపెట్టినట్టుగా పోస్టర్లో చూపించారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు అభయ్ శుక్లా ఈ పోస్టర్లు పెట్టారు. ‘భారతీయ జనతా పార్టీ చేస్తున్న అరాచక పాలనకు ముగింపు పలికి 2019లో రాహుల్ గాంధీ దేశంలో రాహుల్ రాజ్యం(రామ రాజ్యం) తీసుకొస్తార’ని పోస్టర్లపై ముద్రించారు. మరోచోట రాహుల్‌ను కృష్ణుడి అవతారంలో చూపిస్తూ పోస్టర్లు పెట్టారు. యోధుడు ప్రయాణం మొదలు పెట్టాడని ఈ పోస్టర్లపై రాశారు. కాంగ్రెస్ పోస్టర్లపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అమేథీ ఎంపీ మిస్సింగ్ మరోవైపు అమేథీ ఎంపీ కనిపించడం లేదంటూ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. విద్య, ఆరోగ్యాలను విస్మరించారని.. అమేథీ నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేశారని పోస్టర్లపై ముద్రించారు. అభివృద్ధికి దూరమైన అమేథీ ప్రజలు ఈ పోస్టర్లు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. సలోన్‌లో ఉద్రిక్తత రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో సలోన్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కాంగ్రెస్ కార్యకర్తలు తమపై దాడి చేశారని బీజేపీ ఎమ్మెల్యే దాల్ బహదుర్ కోరి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు అమేథీ ఎమ్మెల్సీ దీపక్ సింగ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాలను శాంతింపజేసేందుకు పోలీసులు కష్టపడాల్సివచ్చింది. -
రాహుల్‌కు షాక్: అమేథిలో బీజేపీ విజయం
సాక్షి,లక్నో: కాంగ్రెస్ చీఫ్ పగ్గాలు చేపట్టనున్న రాహుల్ గాంధీకి యూపీ స్ధానిక ఎన్నికలు గట్టి షాక్ ఇచ్చాయి. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథి నగర పంచాయితీలో బీజేపీ చేతిలో కాంగ్రెస్ పరాజయం పాలైంది. వేయికి పైగా ఓట్ల తేడాతో బీజేపీ అమేథిలో గెలుపొందింది. అమేథి లోక్‌సభ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ ఎన్నికైన విషయం తెలసిందే. దశాబ్ధాలుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఈ నియోజకవర్గానికి పేరుంది. ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అమేథి పరిధిలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లనూ ఆ పార్టీ కోల్పోయింది. అమేథితో పాటు సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్ బరేలీలోనూ బీజేపీ స్ధానిక పోరులో ఘనవిజయం సాధించింది. అమేథి నగర్ పంచాయితీలో బీజేపీ అభ్యర్థి చంద్రమా దేవి 1035 ఓట్ల తేడాతో విజయం సాధించారు. యూపీ స్ధానిక ఎన్నికల్లో అత్యధిక మేయర్ స్ధానాలను, నగర పంచాయితీలను బీజేపీ కైవసం చేసుకుంది. -
అమేథీ.. ఎందుకంత ముఖ్యం
ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చేజారి దశాబ్దాలవుతున్నా.. అమెథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గాలు మాత్రం గాంధీ-నెహ్రూ వారసుల కంచుకోటలుగా మిగిలాయి. ప్రధానంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథీలో.. నెహ్రూ రాజకీయ వారసులకు తిరుగులేదు. మొట్టమొదటి లోక్‌సభ ఎన్నికనుంచి 2014 ఎన్నికల వరకూ ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరేస్తూ వస్తోంది. మధ్యలో కేవలం రెండు సార్లు మాత్రమే జనతాపార్టీ నుంచి రవీంద్ర ప్రతాప్ సింగ్ (1977), భారతీయ జనతాపార్టీ (1998) డాక్టర్ సంజయ్ సింగ్‌లు విజయం సాధించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ సీటును ఎలాగైనా కైవసం చేసుకోవాలని భారతీయ జనతాపార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇంతకూ అమేథీలో గెలుపు సాధిస్తుందా? రాహుల్ గాంధీకి ముచ్చెమటలు పట్టించే అవకాశాలున్నాయా? అమేథీ నియోజకవర్గం గురించి కొన్ని ముఖ్యాంశాలు మీకోసం అమేథీ నియోజకవర్గాన్ని 1967లో ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. అప్పటినుంచి ఈ నియోజకవర్గం నెహ్రూ-గాంధీ కుటుంబానికి కంచుకోటలా నిలిచింది. మొత్తం 15 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం రెండుసార్లు మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఎమర్జెన్సీ తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకతతో 1977లో ఒకసారి. అటల్ బిహారీ వాజ్‌పేయి మీదున్న సానుభూతితో.. మరోసారి కాంగ్రెస్ ఇక్కడ ఓటమి పాలైంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకూ 9 సార్లు నెహ్రూ-గాంధీ వారసులు విజయం సాధించారు. ఇక్కడ నుంచి సంజయ్ గాంధీ 1980లో తొలిసారి గెలిచారు. తరువాత రాజీవ్ గాంధీ వరుసగా 1981, 1984, 1989, 1991లో గెలుపొందారు. తరువాత 1999లో సోనియా గాంధీ విజయం సాధించారు. రాహుల్ గాంధీ 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా హ్యాట్రిక్ సాధించారు. అమేథీలో నెహ్రూ వారసులు భారీ ఓట్ల తేడాతో గతంలో విజయాలు సాధించారు. ప్రధానంగా.. 1980లో 1.29, 1081లో 2.38, 1984లో 3.15, 1999లో 3 లక్షల ఓట్ల తేడాతో భారీ విజయాలను నమోదు చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గట్టి పోటీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేవలం 1.08 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. నెహ్రూ వారసుల్లో అతి తక్కువ ఓట్లతో విజయం సాధించడం ఇదే ప్రథమం. ఇక రాయ్‌బరేలీ విషయానికి వస్తే.. ఇది కూడా కాంగ్రెస్ కంచుకోట అనే చెప్పాలి. 1951లో ఏర్పడ్డ ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకూ 19 లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఇందులో కేవలం 3 సార్లు మాత్రమే కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఇక్కడ నుంచి ఫిరోజ్ గాంధీ 1951, 1957 ఎన్నికల్లో విజయం సాధించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1967, 1971, 1980 ఎన్నికల్లో గెలుపొందారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ కుటుంబానికి చెందిన అరుణ్ నెహ్రూ వరుసగా 1980, 1984 ఎన్నికల్ల గెలిచారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధినేత్ని సోనియా గాంధీ ఇక్కడ నుంచి 2004, 2006, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్ నుంచి గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లు అమేథీ, రాయ్‌బరేలీ మాత్రమే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండింటిలో దేన్నయినా సాధించాలన్న లక్ష్యంతో భారతీయ జనతాపార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అమేథీ, రాయ్బరేల్లో ఒక్కసీటును సాధించినా దేశంలో నెహ్రూ-గాంధీ కుటుంబపాలనకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం చేయవచ్చన్న ఆలోచనలో బీజేపీ ఉంది. -
రాహుల్... రైతుల భూములు మీకెందుకు..?
సాక్షి,అమేథి: కాంగ్రెస్ ఉపాథ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక్కడి రైతుల నుంచి రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ తీసుకున్న భూమిని తిరిగి వారికి అప్పగించలేదని ఆమె ఆరోపించారు.అమేథి నియోజకవర్గంలో బీజేపీ చీఫ్ అమిత్ షాతో కలిసి బహిరంగసభలో ప్రసంగించారు. రైతు సంక్షేమం గురించి నిత్యం మాట్లాడే రాహుల్ ఇక్కడి రైతుల నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ తీసుకున్న భూములను ఇంతవరకూ వారికి తిరిగి ఇవ్వలేదని అన్నారు. అమేథి ప్రజలను కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంక్‌గానే పరిగణిస్తుందని విమర్శించారు. అమేథిలో కలెక్టర్ కార్యాలయం లేదని ఎద్దేవా చేశారు. అమేథి ఎంపీ రాహుల్ గాంధీ దేశంలో అభివృద్ధిపై విదేశీ వేదికలపైనా ప్రసంగిస్తారు కానీ తన నియోజకవర్గాన్ని మాత్రం పట్టించుకోరని ఆరోపించారు. 2019లో అమేథి పార్లమెంట్ స్దానంలో బీజేపీ గెలుపొందుతుందని స్మృతీ ఇరానీ ధీమా వ్యక్తం చేశారు. ఇక రైతుల నుంచి సేకరించిన భూమిలో రాహుల్ నేతృత్వంలోని రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టకపోవడంతో ఆ భూములను వారికి తిరిగి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. సామ్రాట్ సైకిల్ పేరుతో మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం రైతుల నుంచి దాదాపు 65 ఎకరాలను రాజీవ్ గాంధీ ఫౌండేషన్ సేకరించింది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చకపోవడంతో రైతుల భూములను తిరిగి వారికి అప్పగించాలని స్మృతీ ఇరానీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. -
గుజరాత్ కాదు ఇక్కడ దృష్టిపెట్టు
సాక్షి : అమేథీలో మూడు తరాలుగా గాంధీ కుటుంబం చేసింది ఏమీ లేదని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నాడు. మంగళవారం అమేథీలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఏకీపడేశారు. ’మాట్లాడితే మోదీ ప్రభుత్వంపై రాహుల్ బాబా విరుచుకుపడుతున్నాడు. నువ్వు ఇక్కడ ఎంపీగా ఉన్నావ్. కానీ, ఇప్పటిదాకా కలెక్టర్ కార్యాలయం, ఆకాశవాణి కేంద్రం కూడా లేవు. అంటే నువ్వు నీ నియోజక వర్గం గురించి ఎంత ఆలోచిస్తున్నావో అర్థమౌతోంది. గుజరాత్లో పర్యటించటం కాదు. ముందు అమేథీని పట్టించుకో. అమేథీలో ఉన్న ఐదు నియోజకవర్గాల్లో నాలిగింటిని బీజేపీ కైవసం చేసుకుంది. ఇక్కడ రెండు మోడల్‌లు పని చేశాయి. ఒకటి నెహ్రూ-గాంధీ మోడల్, రెండోది మోదీ మోడల్. ప్రజలు రెండోదానిపైనే నమ్మకంతో ఉన్నారు. యోగి జీ-మోదీ జీలు(ఆదిత్యానాథ్-నరేంద్ర మోదీలను) ఉద్దేశించి కలిస్తే యూపీ అభివృద్ధి సులభతరం అవుతుంది అని షా ప్రసంగించారు. ఈ మూడేళ్లలో మోదీ నేతృత్వంలోని తమ ప్రభుత్వం 116 పథకాలు ప్రవేశ పెట్టిందని.. రాహుల్‌కు లెక్కలు కూడా రావని ఆయన ఎద్దేవా చేశారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా 2022 నాటికి యూపీ అభివృద్ధి జరిగి తీరుతుందని షా స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు దేశమంటే ప్రేమ లేదని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ పేర్కొన్నారు. ఇవాళ ఇక్కడ పలు కార్యక్రమాలకు చేసిన శంకుస్థాపన అభివృద్ధికి సూచనలని ఆయన చెప్పారు. నోబెల్ బహుమతి విజేత రిచర్డ్ థాలెర్ నోట్ల రద్దును స్వాగతించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆదిత్యానాథ్ ప్రస్తావించారు. ఇక తాను అమేథీ బిడ్డనని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. మూడున్నరేళ్ల క్రితం ఇక్కడి వచ్చిన సమయంలో ఇక్కడి అభివృద్ధి గురించి జనాలు తన దగ్గర వాపోయారని ఆమె చెప్పారు. తమ పిల్లలకుఉద్యోగాలు వస్తాయన్న ఉద్దేశ్యంతో ఎంతో మంది రైతులు తమ భూములు అప్పటి ప్రభుత్వానికి(కాంగ్రెస్) అప్పజెప్పారు. కానీ, వారు దారుణంగా మోసం చేశారు.. భూ కబ్జాలకు పాల్పడ్డారు అని రాహుల్ పై స్మృతి మండిపడ్డారు. యూపీఏ హయాంలో రాష్ట్రం ఏ రకంగానూ అభివృద్ధి చెందలేకపోయిందని ఆమె చెప్పుకొచ్చారు. మొత్తానికి యూపీపై కేంద్ర ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తుందన్న విమర్శలకు 21 అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనతో బీజేపీ చెక్ పెట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఆ ఏడింటిపై బీజేపీ ఫోకస్
సాక్షి,లక్నో: రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ సొంతంగా మెజారిటీ సాధించాలని భావిస్తున్న బీజేపీ ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో జయభేరి మోగించేందుకు యూపీ కీలకం కావడంతో ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిసారించింది. 2014 ఎన్నికల్లో యూపీలోని ఏడు లోక్‌సభ సెగ్మెంట్లలో బీజేపీ పరాజయం పాలైంది. వీటిలో అయిదు ఎస్పీ గెలుచుకోగా, కాంగ్రెస్ కేవలం రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో గెలుపొందింది. అమేథి, రాయ్‌బరేలి నుంచి రాహుల్, సోనియాలు విజయం సాధించారు. ఈ ఏడు నియోజకవర్గాలపై ఇప్పుడు బీజేపీ ఫోకస్ పెట్టింది. వీటిలో వీలైనన్ని ఎక్కువ స్ధానాలను గెలుపొందాలని పార్టీ భావిస్తున్నట్టు యూపీ బీజేపీ ప్రతనిధి రాకేష్ త్రిపాఠి చెప్పారు. గత ఎన్నికల్లో యూపీలోని 80 ఎంపీ సీట్లకు గాను బీజేపీ 73 స్ధానాల్లో జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గాలకు పార్టీ తరపున ఇన్చార్జిలను నియమించడంతో పాటు బూత్ స్థాయిలో పలు కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నట్టు త్రిపాఠి తెలిపారు. అభివృద్ధికి కట్టుబడ్డ బీజేపీకి అండగా నిలవాలని ఈ నియోజకవర్గాల్లో ఓటర్లకు బీజేపీ నేతలు గట్టి సందేశం పంపుతారని చెప్పారు. -
రాహుల్ టూర్ ఆగలేదు
సాక్షి,అమేథి: రాహుల్ పర్యటనను వాయిదా వేసుకోమని కోరినందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమైన క్రమంలో ఆయన టూర్‌కు అమేథి జిల్లా యంత్రాంగం అనుమతి ఇచ్చింది. బుధవారం నుంచి మూడు రోజుల పాటు సాగే రాహుల్ అమేథి పర్యటన కోసం తాము సంసిద్ధంగా ఉన్నామని అమేథి జిల్లా మేజిస్ర్టేట్ యోగేష్ కుమార్ చెప్పారు. ఈనెల 4-6 తేదీల్లో రాహుల్ నియోజకవర్గ పర్యటనకు అధికారులు అనుమతి నిరాకరించలేదని, కేవలం ఆయన భద్రత పట్ల ఆందోళనతోనే వాయిదా వేసుకోవాలని కోరారని తెలిపారు. దుర్గా విగ్రహాల నిమజ్జనం, మొహర్రం సందర్భంగా భద్రతా సిబ్బంది బిజీగా ఉంటారనే కారణంతోనే రాహుల్ పర్యటనను రెండు రోజులు వాయిదా వేసుకోవాలని జిల్లా కాంగ్రెస్ చీఫ్‌కు అధికారులు లేఖ రాశారని వివరణ ఇచ్చారు.అయితే రాహుల్ గతంలో ఇచ్చిన షెడ్యూల్ మేరకే పర్యటిస్తానని పేర్కొనడంతో ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. అయితే రాహుల్ టూర్ వాయిదా వేయాలని అధికారులు కోరడాన్ని యూపీసీసీ చీఫ్ రాజ్ బబ్బర్ తప్పుపట్టారు. -
రాజుగారి పెద్ద భార్యదే పైచేయి
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన అమేథి అసెంబ్లీ ఎన్నికల్లో రేపిస్టు మంత్రి గాయత్రి ప్రజాపతిని, తోటికోడలు అమితా సింగ్‌ను కూడా వెనక్కి నెట్టి.. పెద్ద భార్య గరిమాసింగ్ ఆధిక్యంలో ఉన్నారు. అమేథి మహారాజాగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ నాయకుడు సంజయ్ సింగ్ ఇద్దరు భార్యలే గరిమా సింగ్, అమితా సింగ్. వీళ్లలో అమితాసింగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున అమేథి నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ, తన మంత్రివర్గంలో సభ్యుడైన గాయత్రి ప్రజాపతికి తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వాల్సి రావడంతో ఆయన పేరును అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. ఇక గరిమా సింగ్ బీజేపీ తరఫున పోటీ చేశారు. ఆమె సంజయ్‌సింగ్ నుంచి ఎప్పుడో విడిపోయారు. ఇక అమేథిలో మూడు సార్లు గెలిచిన అమితాసింగ్.. ఓసారి మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీ హవాకు తోడు తోటికోడలు కూడా కావడం, మరోవైపు బలమైన మంత్రి గాయత్రి ప్రజాపతి పోటీలో ఉండటంతో ఓట్లు బాగా చీలిపోయాయి. ఒక దశలో గాయత్రి ప్రజాపతి ఆధిక్యంలో ఉన్నా.. ఆ తర్వాత మళ్లీ గరిమాసింగ్ పుంజుకుని ముందుకొచ్చారు. అత్యాచారం కేసులో ఆయనను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశించినప్పటి నుంచి గాయత్రి ప్రజాపతి పరారీలో ఉన్నారు. ఆయన లక్నోలోని తన సొంతింట్లో గానీ, అమేథీలో గానీ ఎక్కడా కనిపించలేదని పోలీసులు చెప్పారు. -
మాజీ భార్య తన భార్యను ఓడిస్తుందని బెంగతో..
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిష్ఠాత్మకమైన అమేథి సీటుకు విచిత్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మాజీ భార్య గరిమా సింగ్, ప్రస్తుతం ఉన్న భార్య అమితా సింగ్ మధ్య రసవత్తర పోటీ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అమితా సింగ్ పోటీ చేయగా బీజేపీ తరుపున సంజయ్ సింగ్ మాజీ భార్య గరిమా బరిలోకి దిగింది. తొలుత మాజీ భార్యతో పరోక్షంగా సంప్రదింపులు జరపాలనే యోచన చేసినప్పటికీ ఆ పనిని విరమించుకున్న సంజయ్ సింగ్ తానే స్వయంగా ఎన్నికల ప్రచార భారాన్ని మీద వేసుకున్నారంట. ఎట్టి పరిస్థితుల్లో తన ఇల్లాలిని ఓడిపోనివ్వకూడదని, సరిగ్గా ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మాదిరిగానే ప్రతి ఇల్లు తిరిగి తలుపుకొట్టి మరి ప్రచారం చేసి ఓట్లు అడిగారంట. ఓ పక్క మాజీ భార్య, తన ప్రస్తుత భార్య మధ్య రాయల్ కుటుంబానికి చెందిన ఆయన పరిస్థితి చూసి ఓట్లర్లంతా అయ్యోపాపం అనుకున్నారట. ప్రచారంలో ఎంతసేపటికి బీజేపీపైనే విమర్శలు చేసిన ఆయన తన మాజీ భార్యపై దురుసుగా ఒక్క కామెంట్ కూడా చేయలేదని, కేవలం తన ప్రస్తుత భార్యకు ఓటు వేయాలని మాత్రమే కోరారని తెలుస్తోంది. అయితే, ఈ నియోజకవర్గానికి సోమవారం ఎన్నికలు ముగిశాయి. దీంతో ప్రస్తుతం గెలుపు ఓటములపై సమానమైన ఆలోచనను కలిగి ఉన్నారంట. ఎవరు విజయం సాధిస్తారని అనుకుంటున్నారని సంజయ్ సింగ్‌ను ప్రశ్నించగా.. ‘నేను నా వైపు గెలవాలని కోరుకుంటున్నాను.. ఒక వేళ ఏం జరిగినా సరే నన్ను నేను సముదాయించుకుంటాను’ అంటూ ఆయన వేదాంత ధోరణిలో సమాధానం ఇవ్వడం చూసి విలేకర్లు కూడా అహా.. అని అంటున్నారు. సంబంధిత మరిన్ని వార్తా కథనాలకూ చదవండి అమేథిలో మొదటి భార్య vs రెండో భార్య -
‘చే’జారుతున్న అమేథీ!
గాంధీల వారసత్వానికి అగ్నిపరీక్ష అమేథి: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ ఎన్నికలు గాంధీల కుటుంబానికి ప్రతిష్టాత్మకంగా మారాయి. ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉండటంతో అందరి దృష్టి అమేథీపైనే ఉంది. గాంధీల కంచుకోటగా పేరుపడ్డ ఈ నియోజకవర్గ పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. మొదటి నుంచి ఆ ప్రాంత ప్రజలు గాంధీ వారసులకే పట్టం కడుతున్నారు. గత దశాబ్దకాలం అమేథీపై కాంగ్రెస్ పట్టు తగ్గుతూ వస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం రాహుల్‌గాంధీకి బీజేపీ నేత స్మృతి ఇరానీ చెమటలు పట్టించారు. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు అసెంబ్లీ సీట్లకు కాంగ్రెస్ మూడింటినే గెలుచుకుంది. సమాజ్‌వాదీ, బీఎస్పీలు చెరో సీటు దక్కించుకున్నాయి. ఇక 2012 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ రెండు స్థానాలకే పరిమితమైంది. ఎస్పీ మూడు స్థానాలు గెలుచుకుని ఆధిక్యం చాటుకుంది. ఈసారి పోటీ మరింత తీవ్రంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఎస్పీతో పొత్తు పెట్టుకున్నా కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా లేదు. అమేథీ అసెంబ్లీ స్థానం నుంచి ఎస్పీ, కాంగ్రెస్‌లు పొత్తు ధర్మం మరచి తమ అభ్యర్థుల్ని నిలబెట్టడంతో బీజేపీకి కలిసొస్తుందని భావిస్తున్నారు. బీజేపీ నుంచి సీనియర్ కాంగ్రెస్ నేత, రాజకుటుంబీకుడు సంజయ్ సిన్హా మొదటి భార్య గరీమా సింగ్ పోటీలో ఉండగా... కాంగ్రెస్ తరఫున రెండో భార్య అమితా సిన్హా బరిలో ఉన్నారు. ఇక సమాజ్‌వాదీ నుంచి వివాదాస్పద మంత్రి గాయత్రీ ప్రజాపతి బరిలో నిలబడ్డారు. అమితా సిన్హా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రిగా కూడా పనిచేశారు. నియోజకవర్గంలో రోడ్లు, విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉండడంతో పాటు నేరాలు పెరగడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఆ నేపథ్యంలో అమితా గెలుపు కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ప్రజాపతిపై వరుస కేసులు నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటు న్నారు. అయినా సొంత బలం, బలగంతో గెలుపుపై ధీమాగా ఉన్నారు. -
కొత్త మిత్రులకు పరీక్ష
► రేపు యూపీ ఐదో దశ ఎన్నికలు ► అమేథీ సహా 51 స్థానాల్లో పోలింగ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఐదో దశ ఎన్నికలు కొత్త మిత్రులైన యువనేతలు రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్‌లకు పరీక్షగా నిలవనుంది. రాహుల్ సొంత ప్రాంతమైన అమేథీ సహా 11 జిల్లాల్లోని 51 స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. షెడ్యూలు ప్రకారం మొత్తం 52 స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, అలాపూర్‌లో ఎస్పీ అభ్యర్థి మృతితో 51 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 2012 ఎన్నికల్లో ఈ 52 స్థానాల్లో వేర్వేరుగా పోటీచేసిన సమాజ్‌వాదీ పార్టీ 37 సీట్లలో, కాంగ్రెస్ ఐదు సీట్లలో గెలిచాయి. తాజా ఎన్నికల్లో పొత్తుపెట్టుకున్న ఈ పార్టీలు నాటి విజయాన్ని పునరావృతం చేయడం రాహుల్, అఖిలేశ్‌ల ముందున్న సవాల్. గత అసెంబ్లీ ఎన్నికల్లో శ్రావస్తి, బలరాంపూర్, సుల్తాన్ పూర్, అంబేడ్కర్‌నగర్ జిల్లాల్లో ఎస్పీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి పరిస్థితి ఏకపక్షంగా లేకున్నా... త్రిముఖ పోరులో పొత్తు లాభంతో మెజారిటీ స్థానాలు దక్కించుకుంటామని ఎస్పీ ధీమాతో ఉంది. ఐదో దశ బరిలో ఉన్న 9 మంది మంత్రులు గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. దోస్తీమే సవాల్.. ఎస్పీ, కాంగ్రెస్‌లు పొత్తు ధర్మానికి తిలోదకాలిచ్చి రాహుల్ ప్రతిష్టతో ముడిపడి ఉన్న అమేథి లో తమ అభ్యర్థులను నిలిపాయి. కాంగ్రెస్ నుంచి రాజ్యసభ ఎంపీ, రాజవంశీకుడు సంజయ్ సింగ్ రెండో భార్య అమితా సింగ్, బీజేపీ నుంచి సంజయ్ మొదటి భార్య గరిమా పోటీపడుతున్నారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గాయత్రి ప్రసాద్ ప్రజాపతి ఎస్పీ టికెట్‌పై బరిలో ఉన్నారు. అమేథి జిల్లాలోని మరో స్థానం గౌరిగంజ్‌లోననూ ఎస్పీ, కాంగ్రెస్‌లు పోటాపోటీగా అభ్యర్థులను నిలిపాయి. బీఎస్పీ ఆశలు తమ ముస్లిం– దళిత ఫార్ములాపై బీఎస్పీ చీఫ్ మాయావతి ఐదోదశలో పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ఎన్నికలు జరిగే స్థానాల్లో చాలాచోట్ల ముస్లిం, దళితులు కలిసి మొత్తం జనాభాలో 50 శాతానికి పైగా ఉన్నారు. బలరాంపూర్ జిల్లాలో 38 శాతం, బహ్రాయిచ్ జిల్లాలో 36 శాతం, సిద్ధార్థ్‌నగర్ జిల్లాలో 30 శాతం ముస్లింలే. అందుకే ఈ దశలో 18 మంది ముస్లింలకు బీఎస్పీ టిక్కెట్లు ఇచ్చింది. బీజేపీని ఓడించగల స్థితిలో ఉన్న అభ్యర్థివైపు ముస్లింలు మొగ్గుతారని బీఎస్పీ ఆశిస్తోంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ ఎన్నికలు జరిగే స్థానాలు: 51 బరిలో ఉన్న అభ్యర్థులు: 608 జిల్లాలు: 11 మొత్తం ఓటర్లు: 1.84 కోట్లు పోలింగ్ బూత్‌లు: 19,167 గమనిక: 52 స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఎస్పీ అభ్యర్థి మృతితో అలాపూర్ ఎన్నిక మార్చి 9న జరగనుంది. 2012లో ఎవరికెన్ని స్థానాలు ఎస్పీ 37 కాంగ్రెస్ 5 బీజేపీ 5 బీఎస్పీ 3 పీస్ పార్టీ 2 మొత్తం 52 -
‘ప్రియాంక రాలేరు.. ప్రచారం చేయలేరు’
కాన్పూర్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక గాంధీపై బీజేపీ నేత, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అమేథీలో ప్రియాంక ప్రచారం చేయలేరని, ఎందుకంటే అక్కడి ప్రజలు వేసే ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పలేరని విమర్శించారు. ప్రస్తుతం పార్టీ తరపున ప్రచార కార్యక్రమాల్లో ఉన్న స్మృతి ఉత్తరప్రదేశ్ రాజకీయాల గురించి ప్రత్యేకంగా అమేథి గురించి మాట్లాడుతూ.. ప్రజలు అడిగే ప్రశ్నకు ప్రియాంక నేరుగా సమాధానం చెప్పలేరని, ఇప్పటి వరకు కూడా యూపీలో అధికారంలోకి వస్తే మీరు సీఎం అవుతారా అని పలుమార్లు చాలామంది ప్రశ్నించినా ఆమె సమాధానం చెప్పలేకపోయారని అన్నారు. అమేథిలో రాహుల్‌గాంధీపై 2014లో మీరు ఓడిపోయారు కదా అని ప్రశ్నించగా అలాంటివి సహజం అని, అయితే, ప్రజలకోసం మాత్రం ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటానని స్మృతి తెలిపారు. ప్రియాంక మాత్రం తనలాగా జనాల్లోకి వెళ్లరని, వాళ్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేరని, అసంబంద్ధమైన, అమలుచేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలిచి నేడు వాటిని తీర్చలేకపోయారు కాబట్టే ప్రియాంక జనాలకు దూరంగా ఉంటారని విమర్శించారు. -
రాయ్‌బరేలీ, అమేథీలకే ప్రియాంక పరిమితం
పణజీ: ప్రియాంకా గాంధీ తన రాజకీయ జీవితాన్ని ప్రస్తుతానికి అమేథీ, రాయ్‌బరేలీల వరకే పరిమితం చేసుకున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా చెప్పారు. రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ స్థానాలకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రాతినిధ్యం వహిస్తుండటం తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో ఆమె ఎలాంటి పాత్ర పోషిస్తారనే దానిపై కొన్ని రోజులుగా ఊహాగానాలు నెలకొన్నాయి. -
ఆ 10 చోట్ల కాంగ్రెస్ పోటీ
అమేథీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ, అమేథీ (వరుసగా) లోక్‌సభ స్థానాల పరిధిలోని 10 అసెంబ్లీ సీట్లలోనూ పోటీ చేస్తామని కాంగ్రెస్ శనివారం ప్రకటించింది. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)–కాంగ్రెస్‌ల మధ్య పొత్తు విషయంలో ఈ సీట్లే వివాదాస్పదం అయ్యాయి. చివరికి ఈ సీట్లను కాంగ్రెస్‌కే కేటాయిస్తామని ఎస్పీ హామీనిచ్చినట్లు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ సంజయ్ సింగ్ తెలిపారు. -
అమేథిలో మొదటి భార్య vs రెండో భార్య
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిష్ఠాత్మకమైన అమేథి సీటుకు రసవత్తర పోటీ జరుగనుంది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అమితా సింగ్ పోటీ చేస్తారని ముందుగా రాజకీయవర్గాలు భావించాయి. అయితే ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్–సమాజ్‌వాదీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా సమాజ్‌వాదీ పార్టీకి చెందిన గాయత్రి ప్రజాపతి పోటీచేస్తారని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. దీంతో తాను తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తానని అమితా సింగ్ ప్రకటించారు. గాయత్రి ప్రజాపతి సిట్టింగ్ సభ్యుడే కాకుండా అఖిలేష్ క్యాబినెట్లో మంత్రి కూడా. ఇక అమితా సింగ్ అమేథి మహారాజాగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ నాయకుడు సంజయ్ సింగ్‌కు రెండో భార్య. ఈ పరిస్థితుల్లో బీజేపీ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు గరిమా సింగ్‌ను ఎంపిక చేసింది. ఆమె సంజయ్ సింగ్ నుంచి విడిపోయిన మొదటి భార్య కావడం విశేషం. అమేథి నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తానని అమితా సింగ్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అయితే అమేథి, సమీపంలోని రాయ్‌బరేలి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని పదేసి స్థానాలను చెరిసగం పంచుకోవాలని రాహుల్, అఖిలేష్ నిర్ణయించడంతో అమితా సింగ్‌కు అభ్యర్థిత్వం దక్కలేదు. ‘అమేథి నా కుటుంబం, నా ఇల్లు, దీన్ని నేను వదిలిపెట్టలేను. ఈ నియోజకవర్గం అభివృద్ధికి నేను ఎంతో కృషి చేశాను’ అని అమితా సింగ్ తెలిపారు. ఈ విషయంలో పార్టీ సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నానని, ఒకవేళ టిక్కెట్ లభించకపోతే తిరుగుబాటు అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని ఆమె ప్రకటించారు. ఈ సీటు నుంచి మూడు సార్లు గెలిచిన ఆమె ఓ సారి మంత్రిగా కూడా పనిచేశారు. తన భర్త మాజీ భార్య అయిన గరిమా సింగ్‌ను అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ఆమె విమర్శించారు. ప్రజలకు ఆమె ఎవరో తెలియదని, వారు కనీసం ఆమెను చూసి కూడా ఉండరని, ప్రజాజీవితంతో ఎలాంటి సంబంధం లేని ఆమెను ఎంపిక చేయడమేమిటని విమర్శించారు. -
10 మంది కుటుంబసభ్యులను చంపేశాడు..
-
10 మంది కుటుంబసభ్యులను చంపేశాడు..
- అనంతరం ఆత్మహత్య చేసుకున్న నిందితుడు - మృతుల్లో ఆరుగురు చిన్నపిల్లలు.. యూపీలోని అమేథీలో ఘోరం అమేథీ: తెల్లారేసరికి ఆ ఇల్లు శవాల గుట్టలా మారింది. చెల్లా చెదురుగా పడిఉన్న మృతదేహాలు, అందులో ఆరుగురు చిన్నపిల్లలు.. ఊహించడానికే భయం గొలిపే దృశ్యాలను చూసి చుట్టుపక్కలవాళ్లు షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని సుల్తాన్పూర్ జిల్లా సుకుల్‌బాజార్ గ్రామంలో బుధవారం ఉదయం వెలుగుచూసిన ఈ ఘోరంపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. ప్రాథమిక సమాచారాన్ని బట్టి.. స్థానికంగా బ్యాటరీల షాపులో పనిచేసే జమాలుద్దీన్ అనే వ్యక్తి తన కుటుంబానికే చెందిన 10 మందిని దారుణంగా హతమార్చి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంటికి వచ్చిన జమాలుద్దీన్.. కత్తితో భార్యా, పిల్లలు, బంధువులపై దాడిచేశాడు. చప్పుడు కాకుండా ఒకరితర్వాత మరొకరిని చంపి, చివరికి ఇంట్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు విడిచాడు. తెల్లవారిన తర్వాతగానీ చుట్టుపక్కలవారు ఈ ఘోరాన్ని గుర్తించారు. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో.. జమాలుద్దీన్ ఇంట్లో జరిగిన ఘోరానికి సజీవసాక్షి అతని భార్య. గొంతు తెగిపోయి కొనప్రాణాలతొ కొట్టుమిట్టాడుతోన్న ఆమెను పోలీసులు గుర్తించి, హుటాహుటిన సుల్తాన్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. -
రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ విమర్శలు..
అమేథీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు. అమేథీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన ప్రతినిధి(రాహుల్ గాంధీ) ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తీవ్రంగా విఫలమయ్యారని ఆరోపించారు. ఆదివారం అమేథీ నియోజకవర్గంలో పర్యటించిన ఆమె.. స్థానిక ప్రజాప్రతినిధి విఫలమైనా మీకు కేంద్రమంత్రిగా నేను సహకారం అందిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. గోమతి నది వరదలతో నష్టపోతున్న అమేథీ నియోజకవర్గంలోని పిప్రి గ్రామంలో కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న గట్టు నిర్మాణ ప్రాజెక్టును స్మృతి ఇరానీ ప్రారంభించారు. 2014 ఎన్నికల్లో గ్రామస్తులు లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించారని.. వరద నివారణకు గట్టు నిర్మించే ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపడుతుందన్నారు. అలాగే.. జగదీశ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరోగ్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.