
అమేథీ: సొంత నియోజకవర్గం అమేథీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన రెండో రోజు బీజేపీ కార్యకర్తల నిరసనల మధ్యనే సాగింది. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఆయన అమేథీలో పర్యటించటం ఇదే ప్రథమం. పర్యటనలో భాగంగా రెండో రోజు ముసాఫిర్‌ఖానా నుంచి గౌరిగంజ్ ఏరియాకు రావల్సి ఉంది. అయితే, బీజేపీ కార్యకర్తలు ముసాఫిర్‌ఖానా–గౌరీగంజ్ రోడ్డుపై ‘మిస్సింగ్ ఎంపీ’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. రైతుల భూములను ట్రస్ట్‌లకు అప్పగిస్తున్నారని, అమేథీ అభివృద్ధిని విస్మరించారని నినాదాలు చేశారు.