'దమ్ముంటే రాహుల్ పర్యటన అడ్డుకొండి' | shabbir ali takes on kcr and bjp | Sakshi
Sakshi News home page

'దమ్ముంటే రాహుల్ పర్యటన అడ్డుకొండి'

Published Sat, May 2 2015 2:01 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

'దమ్ముంటే రాహుల్ పర్యటన అడ్డుకొండి' - Sakshi

'దమ్ముంటే రాహుల్ పర్యటన అడ్డుకొండి'

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పాలన కంటే తుగ్లక్ పాలనే నయమని శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. శనివారం హైదరాబాద్లో కేసీఆర్ పాలనపై షబ్బీర్ అలీ నిప్పులు చెరిగారు. కేసీఆర్కు పాలన గురించే తెలియదని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులకు భరోసా కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన ఉంటుందన్నారు. దమ్ముంటే రాహుల్ పర్యటన అడ్డుకొండంటూ ఆయన బీజేపీ, టీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. 

కేసీఆర్ 10 నెలల పాలనలో హైకోర్టు నుంచి 11 తీర్పులు వ్యతిరేకంగా వచ్చాయన్న సంగతని షబ్బీర్ అలీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. అందుకే తెలంగాణలో రాహుల్ పర్యటన ఎందుకని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారన్నారు. 11 నెలల మోదీ పాలనలో రైతులకు భరోసా లేకుండా పోయిందని షబ్బీర్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు.  అచ్చేదిన్ మెదీకి, బీజేపీకే అని వ్యంగంగా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement