rahul gandhi tour
-
ఇక ‘ప్రజల్లోకి’
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ ధరల పెంపుతో పాటు యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న దోబూచులాటలను ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఈనెల 15 నుంచి 20 వరకు ఆరు రోజుల పాటు గ్రామాలకు బృందాలుగా వెళ్లనున్నారు. పంటపొలాలతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులతో మాట్లాడి అన్ని విషయాలను వారికి వివరించాలని కాంగ్రెస్ నేతలు, శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోళ్లను వెంటనే చేపట్టాలని కోరుతూ ఈనెల 12న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేపట్టనున్నారు. అదే రోజున టీపీసీసీ ప్రతినిధి బృందం రాష్ట్ర గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. కాగా, ఈ నెలాఖరులో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ రెండు రోజుల తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఇక ఏప్రిల్ మొదటి వారమంతా ఢిల్లీ పర్యటనలు, పార్లమెంటు సమావేశాలు, రాహుల్‌తో 40 మంది నాయకుల భేటీ, విద్యుత్‌సౌధ ముట్టడి లాంటి కార్యక్రమాలను నిర్వహించిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తాజా షెడ్యూల్‌తో ఈ నెలంతా బిజీబిజీగా గడపనున్నారు. ఓవైపు ప్రజల పక్షాన ఆందోళనలు, మరోవైపు పార్టీ అంతర్గత సర్దుబాట్లలో మమేకం కానున్నారు. -
అమేథీని వీడను: రాహుల్ గాంధీ
అమేథీ/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తాను ఓడిపోయినా, నియోజకవర్గాన్ని విడిచిపెట్టనని కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్‌గాంధీ అన్నారు. అమేథీ నుంచి ఓటమి పాలైన తర్వాత బుధవారం తొలిసారి అక్కడ పర్యటించారు. జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలు, బూత్ అధ్యక్షులతో ఆయన సమాశమయ్యారు. అమేథీలో తాను ఓడిపోవడానికి కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులే కారణమని, వారు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్లే తాను ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అదే సమయంలో అమేథీలో తన విజయం కోసం శ్రమించిన పార్టీ శ్రేణులకు రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. కోటికి చేరిన రాహుల్ ట్విట్టర్ ఫాలోవర్స్ రాహుల్ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య ఒక కోటికి చేరింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఫాలోవర్స్‌కు బుధవారం ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అలాగే అమేథీలో జరిగే కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులతో జరిగే సమావేశంలో దీనిని సెలబ్రేట్ చేసుకుందామని పేర్కొన్నారు. -
నేడు అమేథీకి రాహుల్
అమేథీ (యూపీ)/అహ్మదాబాద్: తాజా సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీచేసి ఓడిన అమేథీ నియోజకవర్గంలో నేడు రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చెందిన ప్రత్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఆయన ఓడారు. తన పర్యటన సందర్భంగా రాహుల్ పార్టీ ప్రతినిధులను కలుస్తారు. సలోన్, అమేథీ, గౌరిగంజ్, జగదీశ్‌పూర్, తిలోయి అసెంబ్లీ నియోజకవర్గ బూత్ అధ్యక్షులను కలుసుకుంటారు. అలాగే కొన్ని గ్రామాలను సందర్శించే అవకాశం ఉందని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తెలిపారు. రాహుల్ 1999 నుంచి అమేథీ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచారు. రాహుల్‌కి గుజరాత్ కోర్ట్ సమన్లు హోంమంత్రి అమిత్ షాను హత్య కేసులో నిందితుడిగా పేర్కొని ఆయన పరువుకు నష్టం కలిగించారన్న కేసులో రాహుల్‌కు గుజరాత్ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. స్థానిక బీజేపీ నేత ఒకరు రాహుల్‌పై ఈ కేసువేశారు. ఈ కేసులో ఆగస్టు 9న హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో మే 1న ఇదే కేసులో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాహుల్‌కి సమన్లు జారీ చేసినప్పటికీ ఆయన లోక్‌సభ సభ్యుడు కావడంతో లోక్‌సభ స్పీకర్ నోటీసును తిరస్కరించారు. దీంతో ఆగస్టు 9న హాజరు కావాలంటూ తాజాగా సమన్లు జారీ చేశారు. ఈ నోటీసును రాహుల్ నివాసంలో నేరుగా అందించనున్నారు. ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ అమిత్ షాపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆరోపించారు. సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్కౌంటర్ కేసులో అమిత్‌ను సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. -
వయనాడ్‌లో రాహుల్ మానియా
మలప్పురం(కేరళ): లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు చెప్పేందుకు శుక్రవారం కాంగ్రెస్ చీఫ్ రాహుల్ మలప్పురం జిల్లా కలికావుకు వచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోకు భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వయనాడ్ నియోజకవర్గం వ్యాపించి ఉన్న వయనాడ్, మలప్పురం, కోజికోడ్ జిల్లాల్లో పర్యటనకు రాహుల్ శుక్రవారం కోజికోడ్‌కు చేరుకున్నారు. ముందుగా కలికావు పట్టణంలో ఓపెన్ టాప్ జీపులో చేపట్టిన రోడ్ షోకు భారీ స్పందన లభించింది. జోరువానలోనూ ప్రజలు రోడ్డుకు రెండు వైపులా నిలబడి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. యూడీఎఫ్ కూటమికి చెందిన ఐయూఎంఎల్ కార్యకర్తలు కూడా ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో రాహుల్‌కు భారీగా భద్రత కల్పించారు. రాహుల్ వెంట రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఉన్నారు. రాహుల్ పర్యటనతో ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం కలిగిస్తుందని నేతలు అంటున్నారు. బీజేపీ విద్వేషాన్ని ప్రేమతో జయిస్తా ఈ సందర్భంగా రాహుల్ ప్రసంగిస్తూ..‘వయనాడ్ ఎంపీగా రాష్ట్ర ప్రజలందరి తరఫున పార్లమెంట్లో మాట్లాడతా. రాజకీయాలతో పని లేకుండా ఇక్కడి సమస్యలపై పార్లమెంట్ లోపలా వెలుపలా పోరాడుతా. నియోజక వర్గం కోసం మీ తరఫున పనిచేస్తా. మీ సమస్యలు వింటా. నాపై ఇంతటి అభిమానం చూపుతున్న మీ అందరికీ కృతజ్ఞతలు’ అని అన్నారు. దేశంలో బీజేపీ వ్యాపింప జేస్తున్న విద్వేషాన్ని, అసహనాన్ని ప్రేమ, ఆప్యాయతలతో ఎదుర్కొంటానని తెలిపారు. ‘మోదీకి డబ్బు, మీడియా, ధనవంతులైన స్నేహితులు ఉండి ఉండవచ్చు. కానీ, బీజేపీ సృష్టించిన అసహనాన్ని కాంగ్రెస్ ప్రేమతో ఎదిరించి పోరాడుతుంది’ అని తెలిపారు. రాహుల్ వయనాడ్ నుంచి 4.30 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. -
‘భరోసా’ ఇచ్చేందుకేనా..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన అనూహ్యంగా ఎందుకు ఖరారైంది? కర్ణాటక నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన రాహుల్ అధికారిక షెడ్యూల్ హైదరాబాద్ వైపు ఎందుకు మళ్లింది? ఈ ప్రశ్నలన్నింటికీ ఒక్కటే సమాధానం వినిపిస్తోంది. అదే ‘భరోసా’. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో అధిష్టానం నుంచి స్పష్టమైన భరోసా ఇప్పించేందుకే రాహుల్ పర్యటన ఖరారయిందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఇద్దరు ఆదివాసీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించాక మరింత మంది ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకే రాహుల్ ఈ పర్యటన నిర్వహిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంకా ఉన్నారా? రాష్ట్రంలో రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కాంగ్రెస్ తరఫున గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో కొందరు చేజారిపోతారనే చర్చ జరుగుతోంది. ఎప్పుడు, ఎవరు వెళ్తారనే దానిపై కాంగ్రెస్‌లోనే పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఎనిమిది మంది వరకు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతారనే వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. పార్టీ మారుతారని మొదటి నుంచీ వినిపిస్తున్న పేర్లలో ఈ ఇద్దరు కూడా ఉన్నారు. దీంతో పార్టీ వీడుతారన్న ప్రచారంలో ఉన్న మిగిలిన ఎమ్మెల్యేలూ చేజారిపోతారేమో అనే ఆందోళన టీపీసీసీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీనికి తోడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్లిపోవడంపై పార్టీ అధిష్టానం కూడా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ల నుంచి నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. ఈ నివేదికతో పాటు తమకున్న సమాచారం ఆధారంగా మరింత మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడకుండా ఉండాలంటే వారితో నేరుగా మాట్లాడాల్సిందేనని నిర్ణయించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలను ఢిల్లీకి పిలిపించే కన్నా ఎలాగూ కర్ణాటకకు వస్తున్నందున అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లి ఎమ్మెల్యేలతో భేటీ కావాలని, వారికి పార్టీ పరంగా స్పష్టమైన భరోసా ఇవ్వాలని రాహుల్ కార్యాలయం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ నెల 9వ తేదీన రంగారెడ్డి జిల్లా పరిధిలో సమావేశం నిర్వహించాలని టీపీసీసీ యోచిస్తోంది. తొలుత పహాడీషరీఫ్ దర్గా సమీపంలో బహిరంగ సభ అనుకున్నా.. ఆ తర్వాత దాన్ని మార్చి శంషాబాద్‌లోని క్లాసిక్ కన్వెన్షన్‌లో రాష్ట్రంలోని బూత్‌కమిటీల ముఖ్యులతో సమావేశం నిర్వహించే యోచనలో ఉంది. రాహుల్ వచ్చినప్పటి నుంచి ఢిల్లీ వెళ్లేలోపు అందరు ఎమ్మెల్యేలు కలిపించేలా ఏర్పాట్లు చేస్తోంది. రాహుల్ టూర్ ఖరారవుతుందిలా ఏఐసీసీ అధ్యక్షుడి హోదాలో రాహుల్ టూర్ ఖరారు ప్రక్రియకు పెద్ద కసరత్తే ఉంది. ఆయన ఏ రాష్ట్రంలో పర్యటించాలన్నా తొలుత ఆయా రాష్ట్ర పీసీసీ నేతలు ఢిల్లీ వెళ్లి ఆయన మౌఖిక అంగీకారం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 2 లేదా 3 టూర్ షెడ్యూళ్లను రాహుల్ కార్యాలయానికి పంపితే సమయాన్ని బట్టి ఏదో ఒక షెడ్యూల్‌ను రాహుల్ సిబ్బంది ఖరారు చేస్తారు. ఆ సమాచారాన్ని రాహుల్‌కు పంపి ఆయన అధికారికంగా ఓకే చెప్పాక పీసీసీలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తారు. ఎంత హడావుడిలో అయినా ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం వారం, పది రోజులు పడుతుంది. కానీ ఈసారి ఉన్నట్టుండి రాహుల్ రాష్ట్ర పర్యటన ఖరారు కావడం గమనార్హం. కొన్ని సందర్భాల్లో అధిష్టానమే నేరుగా రాహుల్ సభల గురించి సమాచారమిస్తుందని, ముందు ఖరారు చేశాక సమాచారం ఇచ్చి ఏర్పాట్లు చేయాలని సూచిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కనీస ఆదాయ వాగ్దాన పథకాన్ని వివరించేందుకు రాహుల్ రాష్ట్రానికి వస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ పథకం ఓట్లు రాలుస్తుందనే అంచనాలో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలున్నారు. ఈ పథకాన్ని వివరించే సభకు అన్నీ సానుకూలంగా ఉన్న రాష్ట్రాన్ని ఎంచుకుంటారే తప్ప ఇటీవలే పరాజయం ఎదురైన రాష్ట్రాన్ని, రాష్ట్రం ఇచ్చినా వరుసగా రెండోసారి ఖంగుతిన్న రాష్ట్రాన్ని ఎందుకు ఎంచుకుంటారనేది కాంగ్రెస్ వర్గాల్లో సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. -
కాంగ్రెస్‌లో ‘రాహుల్’ పర్యటన చిచ్చు !
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటన తర్వాత జిల్లా కాంగ్రెస్‌లో ఊపు రావాల్సింది పోయి, శ్రేణులు ఉసూరు మంటున్నాయి. పార్టీ పరంగా ఏ కార్యక్రమం జరిగినా తమదైన ముద్ర వేసే కోమటిరెడ్డి సోదరులు అధినేత బహిరంగ సభకు దూరంగా ఉండడం చర్చనీయాంశం అయ్యింది. పీసీసీ నాయకత్వం వీరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇవ్వక పోవడం వల్లే దూరంగా ఉన్నారా? మరేదైనా బలమైన కారణం ఉందా ? అన్న చర్చ జరుగుతోంది. రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటనలో తొలిరోజు కనిపించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ మరుసటి రోజు జరిగిన బహిరంగ స¿భకు హాజరు కాలేదు. వీరు ఆ కార్యక్రమానికి దూరంగా ఉండడంతో సహజంగానే కోమటిరెడ్డి అనుచర వర్గమంతా దూరంగా ఉందని చెబుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఎలాంటి కార్యక్రమం జరిగినా జన సమీకరణ చేయాల్సిన జిల్లాల్లో నల్లగొండ కచ్చితంగా ఉంటుంది. హైదరాబాద్‌కు సమీంలో ఉండడం, ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు బలంగా ఉండడం ఓ కారణంగా చెబుతారు. కానీ, రాహుల్‌గాంధీ పర్యటనలో మాత్రం దీనికి విరుద్ధంగా జరిగింది. ఈ అంశమే ఇప్పుడు జిల్లా కాంగ్రెస్‌లో చిచ్చు రేపిందన్న అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది. గైర్హాజరీపై సర్వత్రా చర్చ ! కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఆశించిన కోమటిరెడ్డి సోదరులు ఆ దిశలో ప్రయత్నమూ తక్కువేం చేయలేదు. కారణాలు ఏవైనా వీరికి పీసీసీ సారథ్యం దక్కలేదు. ఈ కారణంగానే ఒక విధంగా రాష్ట్ర నాయకత్వానికి సమాంతరంగా కార్యక్రమాల్లో పాల్గొంటూ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. ఉమ్మడి జిల్లాలో సైతం దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలో ఏఐసీసీ నాయకత్వం పాల్గొనగా జరిగిన నల్లగొండ పార్లమెంటరీ స్థాయి సమీక్షా సమావేశన్ని విజయవంతం చేశారు. ఇదే నేపథ్యంలో జరిగిన జాతీయ అధ్యక్షుడి కార్యక్రమంలో ఒకరోజు పాల్గొని ఆ తర్వాత దూరంగా ఉండడంపై భిన్నాభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీ వర్గాల సమాచారం మేరకు ఆ బహిరంగ సభకు వీరికి సరైన ఆహ్వానం లేదని అంటున్నారు. అంతే కాకుండా జన సమీకరణ చేయాలని కూడా కోరలేదని చెబుతున్నారు. రాష్ట్ర నాయకత్వం తీరుతోనే.. ఇలా.. గుర్తింపు ఇచ్చే విషయంలో పీసీసీ నాయకత్వం అవలంబించిన తీరుపై ఆగ్రహంతోనే వీరు సభకు, రాహుల్ పర్యటనకు దూరంగా ఉన్నారని విశ్లేషిస్తున్నారు. తమ నేతలే కార్యక్రమానికి దూరంగా ఉండడంతో, అనుచర వర్గం కూడా దూరంగా ఉన్నారని అంటున్నారు. బయటకు కనిపించని బలమైన కారణం లేకుండా జాతీయ అధ్యక్షుడి కార్యక్రమానికి ఎందుకు దూరంగా ఉంటారన్న భిన్నమైన చర్చ జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో ఉన్న నేతలంతా సీనియర్లు, రాష్ట్ర కాంగ్రెస్‌లో ముఖ్యులు కావడం, సమ ఉజ్జీలుగా ఉన్న ఈ నేతలంతా కలిసి పనిచేయడంలో సమస్యలు ఉన్నాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. సరైన ఆహ్వానం, బాధ్యతల అప్పగింతలో పట్టించుకోకపోవడం, తదితర కారణాలతో కోమటిరెడ్డి సోదరులు కినుక వహించారని, ఈ కారణంగానే దూరంగా ఉండి ఉంటారని అంటున్నారు. ఈ ఉదంత మరోసారి జిల్లా కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపులు, నేతల మధ్యన ఉన్న దూరాన్ని పట్టి చూపిందని పేర్కొంటున్నారు. మొత్తంగా జాతీయ అధ్యక్షుడి సభకు హాజరు కాకుండా కోమటిరెడ్డి వార్తల్లో నిలిచారన్న అభిప్రాయం వినిపిస్తోంది. -
అమేథీలో రాహుల్‌కు నిరసనల సెగ
అమేథీ: సొంత నియోజకవర్గం అమేథీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన రెండో రోజు బీజేపీ కార్యకర్తల నిరసనల మధ్యనే సాగింది. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఆయన అమేథీలో పర్యటించటం ఇదే ప్రథమం. పర్యటనలో భాగంగా రెండో రోజు ముసాఫిర్ఖానా నుంచి గౌరిగంజ్ ఏరియాకు రావల్సి ఉంది. అయితే, బీజేపీ కార్యకర్తలు ముసాఫిర్ఖానా–గౌరీగంజ్ రోడ్డుపై ‘మిస్సింగ్ ఎంపీ’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. రైతుల భూములను ట్రస్ట్‌లకు అప్పగిస్తున్నారని, అమేథీ అభివృద్ధిని విస్మరించారని నినాదాలు చేశారు. -
రాహుల్ పరిస్థితి ఏంటో ఎన్నికలే నిరూపించాయి: తలసాని
జాతీయ పార్టీల నేతలు తెలంగాణలో పర్యటించినంత మాత్రాన రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటో దేశంలో ఇటీవల జరిగిన ఎన్నికలే నిరూపించాయని ఆయన చెప్పారు. పనికిరాకుండా తుడిచిపెట్టుకుపోయిన పార్టీ కాంగ్రెస్సేనని మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాలకు కేసీఆర్ దేవుడిలాంటి వారని, మిర్చి రైతుల విషయంలో కేంద్రమే దోషి అని తలసాని అన్నారు. కుల సంఘాలను గత పాలకులు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని, కానీ తాము మాత్రం ఆ సంఘాలు ఆర్థికంగా లాభసాటిగా మారాలని కోరుకుంటున్నామని చెప్పారు. అసెంబ్లీ వేదికగా ఒక పనికిమాలిన గ్యాంగ్ తయారైందని, ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ మాట్లాడలేదనే వాదనే తప్పని ఆయన అన్నారు. ఎన్నికల సందర్భంగా తాము ప్రకటించిన మేనిఫెస్టోను నూరు శాతం అమలు చేస్తున్నామని, కాదని ఎవరైనా చెప్పగలరా అని తలసాని ప్రశ్నించారు. -
'చంద్ర దండు' సభ్యుల అరెస్ట్
హిందూపురం (అనంతపురం): ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని అడ్డుకునేందుకు వచ్చిన చంద్రదండు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, రాహుల్‌గాంధీని అడ్డుకునేందుకు చంద్రదండు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్సార్ అహ్మద్ ఆధ్వర్యంలో మొత్తం 20 మంది చిలమత్తూరు చెక్‌పోస్ట్ వద్దకు తరలి వచ్చారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. రాహుల్ గాంధీ పర్యటన శుక్రవారం ఉదయం బెంగళూరు నుంచి సరిహద్దు ప్రాంతమైన కొడికొండ చేరుకున్నారు. ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితర నేతలు ఆయనకు స్వాగతం పలికారు. రాహుల్ గాంధీ ఓబుల దేవర చెరువుకు చేరుకుని పాదయాత్ర ప్రారంభిస్తారు. -
రాహుల్ పర్యటనను అడ్డుకుంటాం: జేసీ
తాడిపత్రి: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనంతపురం జిల్లాలో 600 మంది రైతులు చనిపోయారని, మొదట వారికి పరిహారం చెల్లించాలని, అలాకాని పక్షంలో ఈ నెల 24న జిల్లాలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకుంటామని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. ఆయన ఆదివారం అనంతపురం జిల్లా తాడిపత్రిలో మీడియాతో మాట్లాడారు. రాహుల్ మొదట కాంగ్రెస్ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించి.. పరిహారం అందజేయాలన్నారు. ఆ తర్వాతే టీడీపీ ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చిన తర్వాత చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించాలన్నారు. అలాకాని పక్షంలో 300 వాహనాల్లో మృతుల కుటుంబ సభ్యులతో కలిసి అడ్డుకుంటామన్నారు. -
రిపోర్టర్ ను పరామర్శించిన టీపీసీసీ చీఫ్
హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ టూర్ కవరేజ్ లో గాయపడి అపోలోలో చికిత్స పొందుతున్న మహిళా రిపోర్టర్ ను కలిసి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ కూడా ఆసుపత్రికి వెళ్లారు. చికిత్సకయ్యే ఖర్చును తమ పార్టీనే భరిస్తుందని నేతలు ఆమెకు భరోసా ఇచ్చారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలకు రూ. 10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీని పూర్తిగా ఒకే దఫాలో అమలు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. -
రైతు ఆత్మహత్యలపై రాహుల్‌వి మొసలి కన్నీళ్లు
ప్రాణహిత డిజైన్ మార్చొద్దు: టీడీపీ నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి హైదరాబాద్: రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మొసలి కన్నీరు కారుస్తున్నారని టీడీపీ విమర్శించింది. యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో విదర్భ రైతుల ఆత్మహత్యలపై పార్లమెంటులో కన్నీళ్లు పెట్టుకున్న రాహుల్ అధికారంలో ఉన్నప్పుడు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఏ ప్రయత్నం చే యలేదని ఆ పార్టీ నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. శుక్రవారం ఇక్కడ పార్టీ నేతలు చంద్రశేఖర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డిలతో కలసి మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఉమ్మడిరాష్ట్రంలో 24 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, 11 నెలల టీఆర్ఎస్ పాలనలో వెయ్యిమంది ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కనీసం కాంగ్రెస్‌వారికి కూడా భరోసా ఇవ్వలేదు రాహుల్‌గాంధీ పర్యటనపై కిషన్‌రెడ్డి ధ్వజం హైదరాబాద్: రైతుభరోసా యాత్ర పేరిట తెలంగాణకు వచ్చిన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కనీసం కాంగ్రె స్ కార్యకర్తలకు కూడా భ రోసా కల్పించలేకపోయారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ నేతలు సాంబమూర్తి, వి.దినేష్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డి, నాగూరావు నామోజీలతో కలసి కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు ప్రజాసమస్యలపై పోరాడుతానంటున్నా రాహుల్‌గాంధీ గత పదేళ్లు ఎక్కడ తొంగున్నారని ప్రశ్నించారు. మోదీ సూట్ గురించి అపరిపక్వతతో మాట్లాడారని ధ్వజమెత్తారు. ఇక్కడకు వచ్చి భూమి బంగారం అని మాట్లాడుతున్న రాహుల్ మరి తన బావ వాద్రాకు ఇచ్చిన భూమి, గతంలో యూపీఏ ప్రభుత్వం సేకరించిన భూమి ఇనుమా అని నిలదీశారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క గజం కూడా సేకరించలేదన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్‌ది.. పాపాల చరిత్ర : గట్టు హైదరాబాద్: కాంగ్రెస్‌ది పూర్తిగా పాపాల చరిత్ర అని, చేసిన పాపాలను కడిగేసుకునేందుకు చేపడుతున్న ఈ యాత్రకు ‘పశ్చాత్తాప యాత్ర’ అని పేరు పెట్టుకుంటే సరిపోయేదని టీఆర్ఎస్ నాయకుడు గట్టు రామచంద్రరావు విమర్శించారు. ఇది, రైతు భరోసా యాత్ర కాదని, ఫక్తు రాజకీయ, కాంగ్రెస్ భరోసా యాత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇవ్వాళే కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ మాదిరిగా యాత్ర చేపడుతుంటే, రాహుల్ గాంధీ మాటలను ఎలా నమ్మాలని ప్రశ్నించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో కరెంటు ఇవ్వలేదు, తాగడానికి నీరివ్వలేదు, ఎవరికీ ఏ సాయం చేయలేదు, కాబట్టే క్షమాపణ చెప్పడానికి వచ్చానని రాహుల్ అంటే కరెక్టుగా ఉంటుందని వ్యాఖ్యానించారు. పరిహారం ఇచ్చి.. పాపాలను కడి గేసుకోలేరు రాహుల్ పర్యటనపై ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హైదరాబాద్ : పదేళ్ల తమ పదవీ కాలంలో రైతు వ్యతిరేక విధానాలు అవలంభించి, వారి దుస్థితికి, ఆత్మహత్యలకు కారణమైన కాంగ్రెస్ రెండు లక్షల చొప్పున పరిహారం చెల్లించి తన పాపాలను కడిగేసుకోలేదని టీఆర్ఎస్ నాయకుడు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తమ పదేళ్ల కాలంలో కాంగ్రెస్ నివారించలేకపోయిన రైతు ఆత్మహత్యలను.. టీఆర్ఎస్ ప్రభుత్వం పదినెల్ల కాలంలో చేయలేక పోయిందంటూ విమర్శించడం విడ్డూరమన్నారు. రాహుల్‌ది కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌కు ఆక్సిజన్ ఇచ్చే ప్రయత్నమన్నారు. -
యూపీఏ ప్రభుత్వంలో రైతులు కనిపించలేదా?
కాంగ్రెస్ పాలనలో రైతులకు తీరని నష్టం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి జగిత్యాల అర్బన్ : కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూపీఏ పాలనలో అనేకమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వారందరూ రాహుల్‌గాంధీకి కనిపించలేదా? అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. పట్టణంలోని ఎస్సారెస్పీ గెస్ట్‌హౌస్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. యూపీఏ పదేళ్లపాలనలో ఏం చేశారో చెప్పాలన్నారు. రాహుల్‌గాంధీ పర్యటనపై కాంగ్రెస్ నాయకులే అయోమయంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఉనికి కోసమే రాహుల్ తెలంగాణలో పర్యటిస్తున్నారని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలపై యూపీఏ ప్రభుత్వం అనేక కమిటీలు వేసిందని, అవి నివేదికలు ఇచ్చినా... రైతుల ఆత్మహత్యలు ఎందుకు నిలువరించలేకపోయారని ప్రశ్నించారు. భూసేకరణ చట్టంలో ఎలాంటి మార్పులు లేవన్నారు. ప్రజాసంక్షేమం కోసం నరేంద్రమోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఆర్టీసీ సమ్మెతో రూ.100 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని, ఇందుకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. రాష్ట్రంలో కుటుంబపాలన సాగుతోందని, ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్, నాయకులు రాజన్న, లింగారెడ్డి, సీపెల్లి రవీందర్, కిశోర్‌సింగ్, రాజన్న తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో ఎందుకు పర్యటించరు?
హైదరాబాద్:రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో భరోసా యాత్ర చేపడుతున్నారని ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. రాహుల్ తెలంగాణ భరోసా యాత్రపై బాల్క సుమన్ పలు అనుమానాలను వ్యక్తం చేశారు. రాహుల్ యాత్ర తెలంగాణకు మాత్రమే పరిమితం కావడానికి కారణమేమిటని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఏపీలో రాహుల్ ఎందుకు పర్యటించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో అవసరం లేకున్నా వేలాది ఎకరాలు రైతుల నుంచి చంద్రబాబు రైతులను రాహుల్ ఎందుకు పరామర్శించడం లేదని ప్రశ్నించారు. రాహుల్ శైలిని చూస్తుంటే టీడీపీ-కాంగ్రెస్ లు కుమ్మక్కైనట్లు కనబడుతోందని ఎద్దేవా చేశారు. అసలు ఆందోళన చేసిన రైతులను కాల్చిచంపిన చరిత్ర కాంగ్రెస్ దేనని మండిపడ్డారు. సొంత నియోజకవర్గం అమేథీలో వడగళ్ల వర్షం వల్ల రైతులు నష్టపోతే రాహుల్ పర్యటించలేదని బాల్క సుమన్ పేర్కొన్నారు. -
ఆయన యాత్రతో బీజేపీ, టీఆర్ఎస్లలో భయం
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: రైతులకు భరోసా ఇచ్చి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలని రాహుల్‌గాంధీ పాదయాత్ర తలపెడితే అటు కేంద్రంలోని బీజేపీ, ఇటు రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీలు భయపడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క అన్నారు. గాంధీభవన్‌లో బుధవారం జరిగిన ఎన్ఎస్యూఐ సమావేశంలో, అంతకుముందు జరిగిన పాదయాత్ర సీడీ ఆవిష్కరణ కార్యక్రమంలో వారు మాట్లాడారు. వ్యవసాయం సంక్షోభంలో ఉన్నప్పుడు, రైతులను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వాల కళ్లు తెరిపించడమే రాహుల్ పాదయాత్ర లక్ష్యమని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. రాహుల్‌గాంధీ పాదయాత్రలో ఎన్ఎస్యూఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఉత్తమ్, భట్టి పిలునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు డి.శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణా రెడ్డి, కె.లక్ష్మారెడ్డి, కొనగల మహేశ్ తదితరులు పాల్గొన్నారు. పాదయాత్రకోసం ప్రత్యేకంగా రూపొందించిన సీడీలను భట్టివిక్రమార్క, మాజీమంత్రి డి.శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు. -
నేడు రాహుల్ ‘షో’.. కాంగ్రెస్ రెడీ
నర్సాపూర్ చౌరస్తాలో కార్యక్రమం కాళ్లకల్ వద్ద జిల్లాలో ప్రవేశం ఏర్పాట్లను పరిశీలించిన సునీత, గీతారెడ్డి తూప్రాన్ : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటనకు కాంగ్రెస్ శ్రేణులు భారీ స్వాగత సన్నాహాలు చేస్తున్నాయి. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తాలో రాహుల్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే గీతారెడ్డి బుధవారం పరిశీలించారు. రాహుల్ గురువారం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారని, అక్కడి నుంచి సాయంత్రం 6.30 గంటలకు తూప్రాన్ వస్తారన్నారు. తూప్రాన్‌లోని నర్సాపూర్ చౌరస్తా వద్ద స్టేజి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆయనకు ఆత్మహత్యలు చేసుకున్న రైతుల వివరాలతో పాటు రైతులు జిల్లాలో ఎదుర్కొంటున్న ఇబ్బందులతో కూడిన వినతిపత్రం అందజేస్తామన్నారు. పర్యటన ఇలా.. ► రాహుల్‌గాంధీ శంషాబాద్ విమానాశ్రయం నుంచి భారీ కాన్వాయ్‌తో రోడ్డు మార్గం మీదుగా రంగారెడ్డి జిల్లా బోయిన్పల్లి, మేడ్చల్ మీదుగా మెదక్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన కాళ్లకల్‌లో ప్రవేశిస్తారు. ► అక్కడ నుంచి ర్యాలీగా తూప్రాన్ చేరుకుంటారు. నర్సాపూర్ చౌరస్తా వద్ద రైతులనుద్దేశించి ప్రసంగిస్తారు. ► అనంతరం రోడ్డు మార్గంలో చేగుంట మీదుగా రామాయంపేట బైపాస్ మార్గంలో కామారెడ్డి చేరుకుంటారు. ► మెదక్ జిల్లాలో మొత్తంగా కాళ్లకల్ నుంచి రామాయంపేట వరకు 50 కిలోమీటర్ల మేర రాహుల్ పర్యటన సాగనుంది. భారీ ఏర్పాట్లు.. బందోబస్తు జిల్లాలో దాదాపు 50 కిలోమీటర్ల మేర సాగే రాహుల్ పర్యటనకు దారిపొడవునా ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. తూప్రాన్‌లోని నర్సాపూర్ చౌరస్తాలో గురువారం రాహుల్ రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని భారీ బ్యానర్లు, ఫ్లెక్సీలతో నింపేశారు. బుధవారం రాత్రి వరకు కార్యకర్తలు పార్టీ జెండాలు, బ్యానర్లు కట్టే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇక, పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. తూప్రాన్‌లోని నర్సాపూర్ చౌరస్తా ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, నలుగురు సీఐలు, 14 మంది ఎస్ఐలు, వంద మంది పోలీసులు, 50 మంది స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. రైతుల వెంటే కాంగ్రెస్ తూప్రాన్‌లోని నర్సాపూర్ చౌరస్తాలో ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో లేకున్నా రైతుల వెంట ఉంటుందన్నారు. -
స్వాగతానికి భారీ ఏర్పాట్లు
►సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాహుల్ ►ఘనస్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణుల సన్నాహాలు ►మేడ్చల్‌లో పార్టీ జెండా ఆవిష్కరణ..కార్యకర్తలతో మాటామంతీ ►యువనేత పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : యువనేత రాహుల్‌గాంధీ పర్యటనను జిల్లా కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమి తర్వాత తొలిసారి నగరానికి వస్తున్న ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు సన్నాహాలు చేసింది. తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు గురువారం రాష్ట్రానికి వస్తున్న రాహుల్ విమానాశ్రయంలో అడుగిడడం మొదలు జిల్లా సరిహద్దు దాటే వరకు వాహనశ్రేణితో ఊరేగింపుగా తరలాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకునే రాహుల్ అక్కడ దాదాపు గంట సేపు గడపనున్నారు. తొలుత రాష్ర్ట నాయకులతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు. ఆ తర్వాత కొద్దిసేపు జిల్లా ప్రతినిధులతో భేటీకానున్నారు. కేంద్ర సర్కారు భూసేకరణ చట్టానికి తీసుకువస్తున్న సవరణలతో రంగారెడ్డి జిల్లాకు జరిగే అన్యాయంపై ఈ సందర్భంగా రాహుల్‌కు వివరించనున్నట్లు కాంగ్రెస్ నేత కార్తీక్‌రెడ్డి తెలిపారు. యూపీఏ భూసేకరణ చట్టం రైతుల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని అమలు చేసిందని, ప్రస్తుతం కార్పొరేట్లకు దన్నుగా నిలిచేలా చట్టానికి సవరణలు చేస్తున్నదని, దీనివల్ల రంగారెడ్డి జిల్లాలోని రైతాంగానికి తీరని అన్యాయం జరగనుందని స్పష్టం చేయనున్నట్లు చెప్పారు. ఫార్మాసిటీ, ఫిలింసిటీ, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పేర అడ్డగోలుగా జరిగే భూసేకరణ రైతుల జీవనాధారాన్ని దెబ్బతీయనుందనే అంశంపై పార్లమెంటులో ప్రస్తావించాలని కోరనున్నట్లు కార్తీక్‌రెడ్డి తెలిపారు. మేడ్చల్‌లో జెండా ఆవిష్కరణ శంషాబాద్ నుంచి భారీ వాహనశ్రేణిలో అదిలాబాద్ పర్యటనకు బయలుదేరే రాహుల్‌గాంధీ మార్గమధ్యంలోని మేడ్చల్‌లో కాసేపు ఆగుతారని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ తెలిపారు. సాయంత్రం 6 గంటలకు మేడ్చల్‌లో పార్టీ జెండా ఆవిష్కరించి.. కొద్దిమంది కార్యకర్తలతో ముచ్చటిస్తారని చెప్పారు. ఇదిలావుండగా, రాహుల్ రాకను పురస్కరించుకొని పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. టీపీసీసీ నేతలు, మాజీమంత్రులు మూడు రోజులుగా ఆయన పర్యటన సాగే మార్గాల్లో పర్యటించి పార్టీ ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు ఏర్పాటుచేసే అంశంపై జిల్లా కమిటీకి పలు సూచనలు చేశారు. విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికేందుకు భారీగా జనసమీకరణ చేసే బాధ్యతను జిల్లా నేతలకు అప్పగించారు. -
రాహుల్ పర్యటన ఏర్పాట్లలో నేతలు బిజీ బిజీ
రంగారెడ్డి : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన ఏర్పాట్లలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈనెల 14 సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని ర్యాలీగా వెళుతుండడంతో కాంగ్రెస్ నేతలంతా ఎయిర్‌పోర్టులో వివిధ ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఎయిర్‌పోర్టులోని హజ్ టెర్మినల్‌లో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. రాహుల్‌గాంధీ స్వాగతం పలికేందుకు, మీడియాతో మాట్లాడేందుకు ఇప్పటివరకు నిర్ణయించిన స్థలాల్లో ఎస్పీజీ అధికారులు మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. మంగళవారం ఎయిర్‌పోర్టులో మాజీ మంత్రులు సబితారెడ్డి, డీకె.అరుణతోపాటు మల్లు రవి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. (శంషాబాద్) -
'దమ్ముంటే రాహుల్ పర్యటన అడ్డుకొండి'
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పాలన కంటే తుగ్లక్ పాలనే నయమని శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. శనివారం హైదరాబాద్‌లో కేసీఆర్ పాలనపై షబ్బీర్ అలీ నిప్పులు చెరిగారు. కేసీఆర్‌కు పాలన గురించే తెలియదని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులకు భరోసా కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన ఉంటుందన్నారు. దమ్ముంటే రాహుల్ పర్యటన అడ్డుకొండంటూ ఆయన బీజేపీ, టీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. కేసీఆర్ 10 నెలల పాలనలో హైకోర్టు నుంచి 11 తీర్పులు వ్యతిరేకంగా వచ్చాయన్న సంగతని షబ్బీర్ అలీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. అందుకే తెలంగాణలో రాహుల్ పర్యటన ఎందుకని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారన్నారు. 11 నెలల మోదీ పాలనలో రైతులకు భరోసా లేకుండా పోయిందని షబ్బీర్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. అచ్చేదిన్ మెదీకి, బీజేపీకే అని వ్యంగంగా అన్నారు. -
రాహుల్ పర్యటనను రైతులే అడ్డుకుంటారు
మెదక్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనను రైతులే అడ్డుకుంటారని ఆ రాష్ట్ర బిజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జి.కిషన్‌రెడ్డి మెదక్ జిల్లా సంగారెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మెదక్ జిల్లా పర్యటనపై కిషన్‌రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ హయాంలో లేని రైతు ఆత్మహత్యలు... బీజేపీ హయాంలోనే ఉన్నాయా అని ఎద్దేవా చేశారు. దేశంలో రైతుల దుస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీయే అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌లో రైతుల ఆత్మహత్యల సంఖ్య రోజురోజూకు పెరుగుతుంది. దీనిపై కేసీఆర్ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు ప్రవర్తిస్తుందని ప్రతిపక్షం కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అయితే రైతుల్లో భరోసా కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని మెదక్ జిల్లాలో పర్యటించేలా చేయాలని టీపీసీసీ భావించింది. అందుకోసం టీపీసీసీ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. వచ్చే నెలలో రాహుల్ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. రాహుల్ పర్యటన తేదీలు కూడా ఖరారైయ్యాయి. దీనిపై కిషన్‌రెడ్డిపై విధంగా స్పందించారు.