రాహుల్ పరిస్థితి ఏంటో ఎన్నికలే నిరూపించాయి: తలసాని | elections have proved what is rahul gandhi, says minister talasani srinivas yadav | Sakshi
Sakshi News home page

రాహుల్ పరిస్థితి ఏంటో ఎన్నికలే నిరూపించాయి: తలసాని

Published Thu, May 11 2017 3:20 PM | Last Updated on Tue, Sep 5 2017 10:56 AM

రాహుల్ పరిస్థితి ఏంటో ఎన్నికలే నిరూపించాయి: తలసాని

రాహుల్ పరిస్థితి ఏంటో ఎన్నికలే నిరూపించాయి: తలసాని

జాతీయ పార్టీల నేతలు తెలంగాణలో పర్యటించినంత మాత్రాన రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటో దేశంలో ఇటీవల జరిగిన ఎన్నికలే నిరూపించాయని ఆయన చెప్పారు. పనికిరాకుండా తుడిచిపెట్టుకుపోయిన పార్టీ కాంగ్రెస్సేనని మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాలకు కేసీఆర్ దేవుడిలాంటి వారని, మిర్చి రైతుల విషయంలో కేంద్రమే దోషి అని తలసాని అన్నారు.

కుల సంఘాలను గత పాలకులు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని, కానీ తాము మాత్రం ఆ సంఘాలు ఆర్థికంగా లాభసాటిగా మారాలని కోరుకుంటున్నామని చెప్పారు. అసెంబ్లీ వేదికగా ఒక పనికిమాలిన గ్యాంగ్ తయారైందని, ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ మాట్లాడలేదనే వాదనే తప్పని ఆయన అన్నారు. ఎన్నికల సందర్భంగా తాము ప్రకటించిన మేనిఫెస్టోను నూరు శాతం అమలు చేస్తున్నామని, కాదని ఎవరైనా చెప్పగలరా అని తలసాని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement