trs minister
-
రెండో రోజూ ఐటీ వేట: మంత్రి మల్లారెడ్డి ఇళ్లలో కొనసాగిన దాడులు
సాక్షి, హైదరాబాద్/కుత్బుల్లాపూర్/రసూల్‌పుర/మేడ్చల్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, బంధువులు, భాగస్వాముల ఇళ్లలో, విద్యా సంస్థల్లో ఐటీ అధికారుల దాడులు బుధవారం రెండోరోజు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. భారీగా నగదుతో పాటు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. పెద్ద మొత్తంలో పన్ను ఎగవేతకు సంబంధించిన కీలక సమాచారం లభించింది. వైద్య కళాశాలల్లో సీట్లకు నిర్దేశిత ఫీజు కంటే అధిక మొత్తాన్ని నగదు రూపంలో తీసుకుని రియల్ ఎస్టేట్‌కు, సూరారం ఆసుపత్రికి తరలించినట్లు బయటపడింది. మరోవైపు మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డికి ఛాతీలో నొప్పి రావడం, ఆస్పత్రిలో చేరడం, ఈ విషయం తెలిసి ఐటీ అధికారులను, సీఆర్పీఎఫ్ జవాన్లను నెట్టేసి మంత్రి ఆస్పత్రికి వెళ్లడం, కుమారుడిని చూడనీయలేదంటూ అక్కడ ధర్నాకు దిగడం, మహేందర్‌రెడ్డిని జవాన్లు చిత్రహింసలు పెట్టారని ఆరోపించడం, ఆయన కోడలు ప్రీతిరెడ్డిని ఐటీ అధికారులు మంత్రి ఇంటికి తీసుకురావడం.. తదితర పరిణామాలతో బుధవారం రోజంతా హైడ్రామా నడిచింది. బుధవారం రాత్రివరకు తనిఖీలు కొనసాగుతుండగా, గురువారం కూడా ఇవి కొనసాగే అవకాశం ఉందని తెలిసింది. ఐటీ అధికారులకు సహకరిస్తున్నామని, ఆస్తులు, కాలేజీల వివరాలన్నీ ఇచ్చామని మంత్రి వెల్లడించారు. సోదాలు గురువారం ముగిసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఆస్పత్రిలో చేరిన మహేందర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి ఐటీ దాడులు కొనసాగుతుండగా.. మంత్రి కుమారుడు మహేందర్ రెడ్డికి ఛాతీలో నొప్పిరావడంతో బుధవారం సూరారంలోని మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో చేరారు. మరో బంధువు ప్రవీణ్‌రెడ్డి కూడా ఆసుపత్రిలో చేరి సాయంత్రానికి డిశ్చార్జి అయ్యారు. మంత్రి ఇంట్లో పనిచేసే పనిమనిషి ఫిట్స్‌తో అనారోగ్యానికి గురయ్యారు. కుమారుడు ఆసుపత్రిలో చేరారని టీవీల ద్వారా తెలుసుకున్న మంత్రి తన నివాసం నుంచి.. సోదాలు చేస్తున్న ఐటీ అధికారులను, సీఆర్పీఎఫ్ జవాన్లను నెట్టేసుకుంటూ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన వెంట ఐటీ అధికారులు కూడా ఆసుపత్రికి వెళ్లారు. మహేందర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి వద్దకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు రావడం, పెద్ద ఎత్తున కార్యకర్తలు గుమిగూడటం, సీఆర్పీఎఫ్ జవాన్లు..కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలను చెదరగొట్టేందుకు జవాన్లు లాఠీలు ఝళిపించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి ఐటీ అధికారులు, కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నన్నూ, సీఎంను బద్నాం చేయాలని చూస్తున్నారు.. ‘మేము దొంగలమా..దొంగ వ్యాపారం చేస్తున్నామా..? కేసినో నడిపిస్తున్నామా.? హవాలా దందా చేస్తున్నామా..? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామా.? తక్కువ మొత్తంతో పేద పిల్లలకు ఎంబీఏ, ఇంజనీరింగ్ విద్య అందిస్తున్నాం. మేము ఏమైనా అవినీతికి పాల్పడితే.. కేసులు పెట్టుకోండి. మా ఇళ్లు వేలం వేయండి.. స్వాధీనం చేసుకోండి..? కానీ మమ్మల్నెందుకు క్షోభకు గురి చేస్తున్నారు? కాలేజీలు, హాస్టళ్లకు సంబంధించిన ఫీజుల చెల్లింపులు మొత్తం ఆన్లైన్లోనే జరుగుతాయి. ఎవరి దగ్గరో డబ్బు దొరికితే దానిని నాతో ముడిపెట్టడం ఏమిటి? నన్ను, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూస్తున్నారు. నేను టీఆర్ఎస్ మంత్రిని కావడం వల్లనే దాడులు చేస్తున్నారు. వందల మంది అధికారులతో దాడులు చేయడం ఏమిటి? నా కొడుకు ఛాతీపై కొట్టారు. వాడు తీవ్రంగా భయపడుతున్నాడు. వాడికి ఏమైతుందోనని భయంగా ఉంది. సోదాల్లో ఏమీ దొరకకపోయినా ప్రధాని నరేంద్రమోదీ మాపై కక్షతో వ్యవహరిస్తున్నారు..’ అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడినుంచి మల్లారెడ్డి బోయిన్‌పల్లిలోని ఇంటికి వచ్చిన తరువాత ఆయన కోడలు ప్రీతిరెడ్డిని కూడా ఐటీ అధికారులు తీసుకొచ్చారు. మెడికల్ కాలేజీల వ్యవహారం ఆమె చూస్తారని చెబుతున్నారు. ఇలావుండగా మల్లారెడ్డి ఆర్థిక వ్యవహారాలను చూసే సంతోష్‌రెడ్డి కొంపల్లి నివాసంలో ఐటీ అధికారులు దాదాపు రూ.4 కోట్లు స్వాధీనం చేసుకుని ఐటీ కార్యాలయానికి తరలించినట్లు తెలిసింది. సంతోష్‌రెడ్డి డిలీట్ చేసిన కంప్యూటర్ డేటాను రిట్రీవ్ చేసినట్లు సమాచారం. కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలి కక్ష సాధింపులు మంచివి కాదని, వ్యవస్థలపై పూర్తి నమ్మకం ఉంది కాబట్టే ఓపికతో ఉన్నామని, కానీ ఐటీ అధికారుల తీరు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసేలా ఉందని ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్‌రాజు, ఎల్.రమణలు విమర్శించారు. సూరారం ఆస్పత్రి వద్ద మాట్లాడుతూ.. బహిరంగంగా వ్యాపారాలు చేస్తున్న మంత్రి మల్లారెడ్డిని టార్గెట్ చేసి, ఇలా దాడులతో భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇకనైనా కక్ష పూరిత రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం మర్రి రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలను నిరసిస్తూ కంటోన్మెంట్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటి ముందు ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు పలు కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మల్లారెడ్డి నివాసం వద్ద నిరసన చేపట్టారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మర్రి రాజశేఖర్‌రెడ్డి లాకర్లపై దృష్టి.. మంత్రి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన లాకర్లపై ఐటీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆయనకు ఎనిమిది బ్యాంకుల్లో 12 లాకర్లు ఉన్నట్టు గుర్తించారు. రాజశేఖర్‌రెడ్డి ప్రస్తుతం టర్కీలో ఉండటంతో మంత్రి కూతురు శ్రేయారెడ్డిని తీసుకెళ్లి లాకర్లను తెరవడానికి ప్రయత్నించారు. అందులో నాలుగు లాకర్లను తెరిచినట్లు ఐటీ అధికార వర్గాల సమాచారం. కాగా లాకర్లలో పెద్దయెత్తున నోట్ల కట్టలు కనుగొన్నట్లు తెలిసింది. రూ.4 కోట్ల నగదు, పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రాజశేఖర్‌రెడ్డి గురువారం నగరానికి చేరుకుంటారని తెలుస్తోంది. ఇదీ చదవండి: తెలంగాణలో సోదాలు, దాడుల కాలమిది! -
టీఆర్ఎస్కు షాక్.. బీజేపీలోకి మంత్రి సోదరుడు!
సాక్షి, వరంగల్: పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు, టీఆర్ఎస్ పార్టీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. ఇటీవల హుజూరాబాద్‌లో బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో భేటీ అయ్యాక.. వరంగల్ తూర్పు బీజేపీ నేతలతోనూ ఫోన్లో మాట్లాడినట్టు తెలిసింది. ఈ విషయాన్ని బీజేపీ నేతలు కూడా ధ్రువీకరించడంతో ఎర్రబెల్లి ప్రదీప్‌రావు చేరిక ఇక లాంఛనమేనని తెలుస్తోంది. రెండు వారాలుగా ఆయన అనుచరులు ‘అన్న బీజేపీలోకి వెళ్తున్నాడని’ వాట్సాప్ స్టేటస్లు పెట్టుకోవడంతోపాటు కలిసిన వారితో చర్చించడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. దీనిపై ప్రదీప్‌రావు బుధవారం వరంగల్‌లో తన అనుచరులతో సమావేశం కానున్నారని సమాచారం. కాగా, పార్టీ మారడంపై ఆయన ఎక్కడా అధికారికంగా మాట్లాడలేదు. చదవండి: కేటీఆర్ కోసం సీనియర్లను కేసీఆర్ తొక్కేస్తుండు.. టీఆర్ఎస్కు రాజయ్య గుడ్‌బై -
గిరిజనుల మనోభావాలను కేద్రం దెబ్బ తీసింది: మంత్రి హరీష్ రావు
-
ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియ వేగవంతం
-
కాంగ్రెస్ మాత్రమే అసంతృప్తితో ఉంది
-
క్యాన్సర్ కేంద్రంతో మెరుగైన సేవలు
పాలమూరు : మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన క్యాన్సర్ పాలియేటివ్ కేంద్రం ద్వారా రోగులకు మె రుగైన చికిత్స అందుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వె ల్లడించారు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఏడు పడకల క్యాన్సర్ పాలియేటివ్ కేంద్రాన్ని సోమవారం ఆయన ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడు, కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ దేశంలోనే రెండో పాలియేటివ్ కేంద్రం ఇక్కడ ప్రారంభించినట్లు తెలిపారు. అత్యంత ఆధునిక సదుపాయాలు ఈ కేంద్రంలో ఉంటాయన్నారు. ఈ కేంద్రం ద్వారా క్యాన్సర్ తో బాధపడుతూ చివరి దశలో ఉన్న రోగులకు అండగా ఉంటూ అవసరమైన వైద్యం లభిస్తుందని తెలిపారు. త్వరలో జనరల్ ఆస్పత్రి వెనుక భాగం గా పాలియేటివ్ కేంద్రానికి శాశ్వత భవనం నిర్మించడంతో పాటు పది పడకలకు పెంచనున్నట్లు పేర్కొన్నారు. కాగా, జిల్లాలోని ఆస్పత్రుల్లో ఆధునిక సౌకర్యాలతో కూడిన లేబర్ రూంలు ఏర్పాటుచేసి, గర్భిణులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా ఎరుగైన వైద్యం అందజేస్తున్నామని తెలిపారు. జనరల్ ఆస్పత్రిలో ఉన్న ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ఇక్కడే నిపుణులు ఉమ్మడి జిల్లా నుంచి ఎవరు కూడా వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిపుణులను నియమించి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిల్లాకు మెడికల్ కళాశాల వచ్చిన తర్వాత నిపుణులైన వైద్యులు అందుబాటులోకి వచ్చారని.. దీంతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. ఇప్పుడు ఉన్న ఆస్పత్రి సరిపోవడం లేదనందున పక్కనే ఉన్న స్థలంలో మరో భవన నిర్మాణానికి కూడా శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధ, డీఎంహెచ్ఓ రజని, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్, డాక్టర్ మీనాక్షి, మల్లికార్జున్, మాస్ మీడియా అధికారి వేణుగోపాల్‌రెడ్డి, సునీల్, శ్రీనివాసరాజు, డాక్టర్ రాధ, చక్రధర్‌గౌడ్, పరంజ్యోతి, సునందిని, సత్యనారాయణరెడ్డి, భీంరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ జీవన్, అధికారులు పాల్గొన్నారు. 45మంది ఏఎన్ఎంలకు వాహనాలు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యాన అమలవుతున్న ‘ప్రాజెక్టు రెక్కలు’ పథకంలో భాగంగా 45మంది ఏఎన్ఎంలకు ద్విచక్ర వాహనాలను మంత్రి లక్ష్మారెడ్డితో పాటు ఎమ్మెల్యే, కలెక్టర్ అందజేశారు. నర్మద హోండ, అశ్విని హీరో షోరూం నుంచి ఏఎన్ఎంలకు వాటిని అందజేశారు. జిల్లాలో మొత్తం 270మంది ఏఎన్ఎంలకు మొదటి విడతలో 45మందికి వాహనాలు ఇచ్చారు. ఆనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ వాహనాల ద్వారా ఏఎన్ఎంలు క్షేత్రస్థాయిలో పర్యటించి వైద్యం అందించడానికి సలువుగా ఉంటుందన్నారు. ఎన్హెచ్ఎం కింద రూ.10వేలు, కలెక్టర్ నిధుల కింద రూ.5వేలు, షోరూం వాళ్లు రూ.3వేలు తగ్గింపు చేసి ఇస్తున్నట్లు తెలిపారు. -
వర్షాల కోసం ఎదురుచూపులుండవ్..!
జమ్మికుంట(హుజూరాబాద్): రబీ, ఖరీఫ్ పంటలకు డిసెంబ ర్, జూన్‌లో సాగునీరు అందించేలా ప్రభుత్వం అడుగులు వేస్తుందని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్లో హూజూరాబాద్, మానకొండూర్ డివిజన్ పరిధిలోని మండలాల్లోని రైతులకు ఈపాస్‌పై గురువారం అవగహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. కడగండ్లు, వడగండ్ల వానలతో పంటలు ఎండి పోతాయా..? పంటలు దెబ్బతింటాయా అనే భయం లేకుండా వానల కోసం రైతులు ఎదురుచూడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. మార్చి, అక్టోబర్ మాసంలోనే రైతులు పండించిన పంటలు ఇంటికి చేరుతా యని అన్నారు. కాలువల్లోకి ఎప్పుడు నీళ్లు ఇవ్వాలో అలో చించామన్నారు. స్వాతంత్రం ఏర్పడినప్పటి నుంచి పార్లమెంట్, అసెంబ్లీల్లో రైతుల కోసం మాట్లాడని సభలు లేవ ని.. అయినా ఇప్పటి వరకు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితిలో రైతులు బాగుం డాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పాలన సాగి స్తోందన్నారు. అందుకే రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నామనన్నారు. వర్షాలతో సంబంధం లేకుండా రైతులకు కాలువల ద్వారా నీరందించేందుకు నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. గోదావరి అంటేనే రాజమహేంద్రవరం.. కృష్ణ అంటేనే బెజవాడ కనుకదుర్గమ్మ... అక్కడే పుష్కారాలు జరిగేవని అన్నారు. తెలంగాణ లో వందల కిలోమీటర్లు నీరు సాగినా చుక్క నీరు ఇవ్వలేని పాలకులు తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే వర్షాకాలంలో కరీంనగర్ జిల్లా కరువంటే ఏమిటో ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి రాబోతుందన్నారు. రైతులు పంటలకు అప్పులు చేయకుండా వచ్చె మేలో రైతులకు పంట పెట్టుబడుల కోసం ఎకరానికి రూ.8 వేలు అందించబోతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను ముట్టుకునే పార్టీలను ప్రజలే పాతరేస్తారని అన్నారు. తమ పథకాలను తీసే దమ్ముంటుందా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, నగర పంచాయతీ చైర్మన్ పోడేటి రామస్వామి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పింగిళి రమేశ్, సహకార సంఘాల రాష్ట్ర చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, ఎంపీపీ గిన్నారపు లత, ఏడీఏ దామోదర్‌రెడ్డి, వైస్ చైర్మన్ బచ్చు శివశంకర్, ఎడవేళ్లి కొండాల్‌రెడ్డి, బండ శ్రీనివాస్, మొలుగూరి ప్రభాకర్, రాజిరెడ్డి, రాజజేశ్వర్‌రావు, ఏఈవోలు, ఏవోలు రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ క్యాలెండర్, డైరీ ఆవిష్కరించిన మంత్రి జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్లో (ఏఈవో)తెలంగాణ వ్యవసాయ విస్తర్ణ అధికారుల సంఘం సెంట్రల్ ఫోరం డైరీ, క్యాలెండర్‌ను మంత్రి ఈటల రాజేందర్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ వ్యవసాయ సాగులో రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ రైతులను సేవలందిస్తున్న ఏఈవోలు సంఘం ఏర్పాటు అభినందనీయమన్నారు. రైతులకు ఉపయోగపడేలా డైరీ, క్యాలెండర్ రూపొందించడం సంతోషకరమన్నారు. రైతులకు సేవలందించడంలో ఏఈవోలు నిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ సలహాలు, సూచనలు అందించాలని సూచించారు. మారుతున్న సాంకేతిక అధునీకరణ వ్యవసాయంపై రైతులను చైతన్యం చేయాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, ఏడీఏ దామోదర్‌రెడ్డి, సంఘం జిల్లా అధ్యక్షుడు నీల తిరుపతి, కార్యదర్శి రాము, కోశాధికారి సతీశ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు మహేందర్, సెంట్రల్ ఫోరం రాష్ట్ర ప్రచార కార్యదర్శి శివరాం, ఏఈవోలు మౌనిక, షబానా, రజిత పాల్గొన్నారు. -
రాహుల్ పరిస్థితి ఏంటో ఎన్నికలే నిరూపించాయి: తలసాని
జాతీయ పార్టీల నేతలు తెలంగాణలో పర్యటించినంత మాత్రాన రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటో దేశంలో ఇటీవల జరిగిన ఎన్నికలే నిరూపించాయని ఆయన చెప్పారు. పనికిరాకుండా తుడిచిపెట్టుకుపోయిన పార్టీ కాంగ్రెస్సేనని మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాలకు కేసీఆర్ దేవుడిలాంటి వారని, మిర్చి రైతుల విషయంలో కేంద్రమే దోషి అని తలసాని అన్నారు. కుల సంఘాలను గత పాలకులు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని, కానీ తాము మాత్రం ఆ సంఘాలు ఆర్థికంగా లాభసాటిగా మారాలని కోరుకుంటున్నామని చెప్పారు. అసెంబ్లీ వేదికగా ఒక పనికిమాలిన గ్యాంగ్ తయారైందని, ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ మాట్లాడలేదనే వాదనే తప్పని ఆయన అన్నారు. ఎన్నికల సందర్భంగా తాము ప్రకటించిన మేనిఫెస్టోను నూరు శాతం అమలు చేస్తున్నామని, కాదని ఎవరైనా చెప్పగలరా అని తలసాని ప్రశ్నించారు. -
మిర్చిధరల పై కేంద్రం స్పందన పెద్ద జోక్
-
మిర్చిధరలపై కేంద్రం స్పందన పెద్ద జోక్: హరీశ్ రావు
మిర్చి ధరలపై కేంద్రం స్పందించిన తీరు మిలీనియం జోక్ అని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో మొత్తం 7 లక్షల టన్నుల మిర్చి పండితే, కేకవలం 33 వేల టన్నులే కొంటారా అని ఆయన ప్రశ్నించారు. మిర్చికి మద్దతు ధర ప్రకటించాలన్న సోయి కేంద్రానికి లేదని ఆయన అన్నారు. బీజేపీ నేతలు మార్కెట్లలో తిరుగుతూ క్వింటాలుకు రూ. 10 వేల ధర చెల్లించాలని అంటారని, కానీ కేంద్రం మాత్రం రూ. 5వేలకే కొంటామని చెబుతోందని హరీశ్ గుర్తుచేశారు. వాస్తవానికి మంచి నాణ్యత ఉన్న మిర్చికి అంతకంటే ఎక్కువ ధరే వస్తోందని, కానీ అన్ని రకాలకు చెందినది ఉండటంతో ధర తగ్గుతోందని ఆయన తెలిపారు. మిర్చి కొనుగోళ్లపై స్పష్టత లేనిది తమకు కాదు.. బీజేపీకేనని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఇతర బీజేపీ నేతలు రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతున్నారని, రైతులకు న్యాయం జరిగేందుకు కేంద్రానికి మరోసారి లేఖ రాస్తామని హరీశ్ రావు తెలిపారు. -
ఆలోచించి ఓటేయాలి: హరీష్‌రావు
వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించే బాధ్యతను తీసుకున్న మంత్రి హరీష్‌రావు.. నగర ప్రజలను ఆలోచించి ఓటేయాలని కోరారు. వరంగల్ జిల్లాను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. అలాగే అతిపెద్ద టెక్స్టైల్ పార్కును సైతం వరంగల్‌లో ఏర్పాటు చేయనున్నట్లు హరీష్‌రావు ఆదివారం వెల్లడించారు. మార్చి 6వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. నగర పాలక సంస్థ పరిధిలోని 58 డివిజన్ల నుంచి మొత్తం 398 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. -
విపక్షాల పై విరుచుకుపడ్డ తలసాని
-
హాట్ టాపిక్‌గా మారిన టీఆర్ఎస్ నేతల కాల్పులు
-
తలసాని భూకబ్జాలను ఆపాలి..
హైదరాబాద్: సనత్‌నగర్ జెక్ కాలనీలో ఓ వర్గానికి చెందిన వక్ఫ్ బోర్డు భూమిని కబ్జా చేసుకోమని సదరు కాలనీ వాసులకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సూచించారని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లో మర్రి శశిధర్‌రెడ్డి విలేకర్ల తో మాట్లాడుతూ... మంత్రిగా ఉండి వక్ఫ్ భూమిని కబ్జా చేసుకోమనడం చట్ట విరుద్దమన్నారు. తలసానిని మంత్రి పదవి నుంచి తొలగించాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. తలసాని చర్యలకు కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. భూ కబ్జా చేసినట్లైతే హిందూ, ముస్లింల మధ్య గొడవలు జరిగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తలసాని భూ కబ్జాను ఆపాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాశానని మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. -
'దమ్ముంటే రాజీనామా చేసినట్లు ప్రకటించాలి'
హైదరాబాద్: తెలంగాణలో టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి చేపట్టిన తలసాని శ్రీనివాస యాదవ్‌కి టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బహిరంగ సవాల్ విసిరారు. శుక్రవారం హైదరాబాద్ సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ... దమ్ముంటే రాజీనామా చేసినట్లు సభలో ప్రకటించాలని ఆయన తలసానికి సవాల్ విసిరారు. ఎన్నికలకు తలసాని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే రాజీనామాను ఆమోదింప చేసుకోవట్లేదని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టేందుకే తలసాని రాజీనామా డ్రామా ఆడుతున్నారని సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి తలసాని టీడీపీ టిక్కెట్‌పై గెలుపొందారు. అనంతరం టీడీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వంలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన ఇప్పటి వరకు తన రాజీనామాను ఆమోదించుకోలేకపోయారు. దీంతో తలసాని వైఖరిపై పలు రాజకీయ పార్టీల వారు ఆరోపణలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. -
మంత్రి పదవి నుంచి తలసానిని బర్తరఫ్ చేయాలి: ఎర్రబెల్లి
హైదరాబాద్: మంత్రి పదవి నుంచి తలసాని శ్రీ నివాసయాదవ్ను బర్తరఫ్ చేయాలని గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేసినట్లు టీటీడీపీ నేత ఎర్రబెల్లి వెల్లడించారు. మంగళవారం రాజభవన్ వద్ద ఎర్రబెల్లి మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల చట్టం పరిశీలనలో ఉండగానే మంత్రిగా ప్రమాణం చేయడం అనైతికమని ఆయన తెలిపారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ ఇచ్చినట్లు ఎర్రబెల్లి వివరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సనత్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి తలసాని శ్రీనివాసయాదవ్ టీడీపీ టిక్కెట్‌పై గెలుపొందారు. అయితే ఇటీవల ఆయన టీఆర్ఎస్లో చేరారు. టీడీపీలోని అన్ని పదవులకు రాజీనామా చేసిన ఆయన కేసీఆర్ మంత్రి వర్గంలో వాణిజ్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.