ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబం ధించి అతి త్వరలోనే రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడనున్నాయని టీఆర్‌ఎస్ ఎంపీలకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ హామీనిచ్చారు. హైకోర్టు విభజన వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పూర్తయ్యే అవకాశముందని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశా రు. ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్ తదితరు లు గురువారం హైకోర్టు విభజన ఆలస్యం వార్తల నేపథ్యంలో మరోసారి రవిశంకర్‌ను ఢిల్లీలో కలిశారు.