మంత్రి పదవి నుంచి తలసానిని బర్తరఫ్ చేయాలి: ఎర్రబెల్లి | Errabelli dayakar rao takes on Talasani srinivasa yadav | Sakshi
Sakshi News home page

మంత్రి పదవి నుంచి తలసానిని బర్తరఫ్ చేయాలి: ఎర్రబెల్లి

Published Tue, Dec 30 2014 1:55 PM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM

మంత్రి పదవి నుంచి తలసానిని బర్తరఫ్ చేయాలి: ఎర్రబెల్లి

మంత్రి పదవి నుంచి తలసానిని బర్తరఫ్ చేయాలి: ఎర్రబెల్లి

హైదరాబాద్: మంత్రి పదవి నుంచి తలసాని శ్రీ నివాసయాదవ్ను బర్తరఫ్ చేయాలని గవర్నర్ నరసింహన్కు విజ్ఞప్తి చేసినట్లు టీటీడీపీ నేత ఎర్రబెల్లి వెల్లడించారు. మంగళవారం రాజభవన్ వద్ద ఎర్రబెల్లి మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల చట్టం పరిశీలనలో ఉండగానే మంత్రిగా ప్రమాణం చేయడం అనైతికమని ఆయన తెలిపారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఈ మేరకు గవర్నర్కు లేఖ ఇచ్చినట్లు ఎర్రబెల్లి వివరించారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో సనత్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి తలసాని శ్రీనివాసయాదవ్ టీడీపీ టిక్కెట్పై గెలుపొందారు. అయితే ఇటీవల ఆయన టీఆర్ఎస్లో చేరారు. టీడీపీలోని అన్ని పదవులకు రాజీనామా చేసిన ఆయన కేసీఆర్ మంత్రి వర్గంలో వాణిజ్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement