జమిలి ఎన్నికలపై ఎర్రబెల్లి ఆసక్తికర కామెంట్స్‌ | Former Minister Errabelli Dayakarrao Interesting Comments On Jamili Elections | Sakshi
Sakshi News home page

జమిలి ఎన్నికలపై మాజీమంత్రి ఎర్రబెల్లి ఆసక్తికర కామెంట్స్‌

Published Fri, Nov 29 2024 1:29 PM | Last Updated on Fri, Nov 29 2024 3:04 PM

Former Minister Errabelli Dayakarrao Interesting Comments On Jamili Elections

సాక్షి,వరంగల్: బీఆర్‌ఎస్‌ దీక్షాదివస్‌ సందర్భంగా వరంగల్‌లో శుక్రవారం(నవంబర్‌ 29) జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయని,కేసీఆర్‌ మళ్లీ సీఎం కాబోతున్నారని ఎర్రబెల్లి అనడం చర్చనీయాంశమైంది. 

‘కేసిఆర్ మళ్ళీ సీఎం కాబోతున్నారు.పార్టీ శ్రేణులు,ప్రజలు అధైర్య పడొద్దు.వెయ్యి మంది తెలంగాణ బిడ్డలను బలి తీసుకున్న బలి దేవత సోనియాగాంధీ. రేవంత్ రెడ్డికి సిగ్గులేదు. సోనియాగాంధీని నాడు బలి దేవత అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు దేవత అంటున్నాడు.

రేవంత్ రెడ్డి నీకు తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలుసా?తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ చేసిన ఘనత కేసిఆర్‌ది. కాంగ్రెస్‌కు ఓటువేసిన ప్రజలంతా తప్పు చేశామని భావిస్తున్నారు’అని ఎర్రబెల్లి అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement