jamili elections
-
‘జమిలి’ జేపీసీ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏకకాలంలో పార్లమెంట్ దిగువ సభ, రాష్ట్రాల్లో శాసనసభకు ఎన్నికలు నిర్వహించడానికి ఉద్దేశించిన లోక్‌సభలో ప్రవేశపెట్టిన రెండు బిల్లులపై అధ్యయనానికి ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) గడువును లోక్‌సభ మంగళవారం పొడిగించింది. ఈ కమిటీ కాల పరిమితిని పెంచేందుకు లోక్‌సభ తన అంగీకారం తెలిపింది. బీజేపీ పార్లమెంట్ సభ్యుడు, జేపీసీ ఛైర్మన్ అయిన పీపీ చౌదరి ప్రతిపాదించిన సంబంధిత తీర్మానానికి లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోద ముద్ర వేసింది. వర్షాకాల సమావేశాల చివరివారంలో తొలి రోజు వరకు కాలపరిమితిని పొడిగించింది. ఏకకాల ఎన్నికల నిర్వహణకు తీసుకొచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం గతంలో లోక్‌సభలో ప్రవేశపెట్టింది.అయితే ఈ బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూప, స్వభావాలను మార్చేలా ఉందని విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేయడంతో కేంద్రప్రభుత్వం ఆ బిల్లును పరిశీలన నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపింది. ఇందుకోసం కొత్తగా 39 మంది ఎంపీలతో కమిటీని ఏర్పాటుచేయడం తెల్సిందే. లోక్‌సభ నుంచి 27, రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులతో కమిటీ కొలువుతీరింది. అయితే రాజ్యసభ నుంచి కొత్త వ్యక్తి జేపీలో సభ్యునిగా ఉంటారని లోక్‌సభ ప్రధాన కార్యదర్శి మంగళవారం ప్రకటించారు. వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో జేపీసీలో ఒక ఖాళీ ఏర్పడింది. వాస్తవానికి ఈ కమిటీ కాలపరిమితి ఈ సెషన్ చివరి వారం తొలిరోజుతో ముగుస్తుంది. అంటే ఏప్రిల్ నాలుగోతేదీతో ముగియనుంది. అయినప్పటికీ ఈ బిల్లుకు సంబంధించిన పని ఇంకా పూర్తికాలేదని, అందుకే కాలపరిమితి పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని అధికార వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఈ అంశంపై ఇప్పటికే పలువురు న్యాయనిపుణులతో సంప్రదింపుల ప్రక్రియ కొనసాగించింది. రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత వర్గాలతో ఇంకా సంప్రదింపులు జరపాల్సి ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ రంజన్ గొగోయ్, సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏపీ షా జేపీసీ కమిటీ ఎదుట హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. -
జమిలిపై చర్చ...చాలా కీలకం
న్యూఢిల్లీ: ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ భారత ప్రజాస్వామ్య ప్రస్థానానికి చాలా కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వలెంటీర్లు, యువత అందులో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇది వారి భవిష్యత్తుతో నేరుగా ముడిపడ్డ అంశమని గుర్తుంచుకోవాలన్నారు. సోమవారం ఇక్కడ ఎన్సీసీ ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘మన దేశంలో పదేపదే ఎన్నికలు జరుగుతున్నాయి. నిత్యం ఏదో ఒక మూల ఎన్నికల వాతావరణం నెలకొని ఉంటోంది. దాంతో పాలన, అభివృద్ధి పనుల వేగం మందగిస్తోంది. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలూ ఒకేసారి జరిగితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మొదట్లో దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరిగేవి. తర్వాతి కాలంలో ఆ ప్రక్రియకు విఘాతం కలిగింది. అమెరికా వంటి అగ్ర రాజ్యాల్లో ఎన్నికలు నిరీ్ణత కాలావధిలోనే జరుగుతాయి’’ అని గుర్తు చేశారు. కనీసం లక్షమంది యువతీ యువకులు రాజకీయాల్లోకి రావాలని పునరుద్ఘాటించారు. ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలోనూ ఇదే మాట చెప్పానని గుర్తు చేశారు. -
నేడు జమిలి ఎన్నికలపై జేపీసీ తొలి సమావేశం
-
మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే: వైఎస్ జగన్
జమిలి ఎన్నికలు 2027లో అంటున్నారు. నెలలు గడిచేకొద్దీ చంద్రబాబులో భయం పెరిగిపోతోంది. మనంరెట్టించిన ఉత్సాహంతో ముందుకెళుతున్నాం. మన ప్రభుత్వం మళ్లీ రాగానే నాతో పాటు ఈ కష్టాల్లో ఉన్న వారందరికీ మంచి రోజులు వస్తాయి. ఇబ్బందులు కొంత కాలం ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదు. కొంత ఓపిక పట్టండి. మీ అందరి ప్రేమ ఎప్పటికీ మరిచిపోను. మనందరం కలిసికట్టుగా పని చేయాలి. – వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, కడప : ‘ఎన్నికల ముందు అలవి గాని హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదు. అన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. 2027 చివర్లో జమిలి ఎన్నికలు రానున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం ఇడుపులపాయలో కడప కార్పొరేటర్లు, ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ప్రజలకిచ్చిన మాట మీద నిలబడి, ప్రజల కష్టాలను నా కష్టాలుగా భావించి, ప్రజలకు మంచి చేశాం. ఈ రోజు కూడా ప్రతి ఇంటికీ మనం కాలర్ ఎగరేసుకుని వెళ్లగలుగుతాం. మనం చెప్పింది చేశామనే మాట ప్రతి ఇంట్లో నుంచి వినిపిస్తోంది. ప్రజలు సంతోషంగా మీరు చేశారంటున్నారు. అదే టీడీపీ నాయకులు ఎవరైనా ప్రజల దగ్గరకు వెళ్లి ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ అమలు చేశామని వెళ్లగలుగుతారా? వాళ్లు ప్రజల దగ్గరకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఏ ఇంటికి వెళ్లినా చిన్న పిల్లలతో నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని, వారి తల్లులైతే నీకు రూ.18 వేలు, ఆ అమ్మలకు తల్లులు, అత్తలు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, 20 ఏళ్లు దాటిన పిల్లవాడు కనిపిస్తే రూ.36 వేలు అని, కండువా వేసుకుని ఇంట్లోంచి రైతు బయటకు వస్తే నీకు రూ.20 వేలు అని.. ఇలా ఇంట్లో ఎవరినీ వదిలి పెట్టకుండా ఆశ పెట్టారు. ఇప్పుడు వారంతా మా డబ్బులు ఏమయ్యాయని అడుగుతున్నారు. అందుకే ఏ టీడీపీ కార్యకర్త ఎవరి ఇంటికి వెళ్లే పరిస్థితి లేదు’ అని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. కలిసికట్టుగా పని చేద్దాం జమిలి ఎన్నికలు 2027లో అంటున్నారు. నెలలు గడిచేకొద్దీ చంద్రబాబులో భయం పెరిగిపోతోంది. మనం రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళుతున్నాం. మన ప్రభుత్వం మళ్లీ రాగానే నాతో పాటు ఈ కష్టాల్లో ఉన్న వారికి మంచి రోజులు వస్తాయి. ఇబ్బందులు కొంత కాలం ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదు. మనందరం కలిసికట్టుగా పని చేయాలి. దేశ చరిత్రలో ఏ ఒక్కరు చేయని మంచి పనులు చేశాం. అబద్ధాలు చెప్పలేకపోవడంతోనే ప్రతిపక్షంలో ఉన్నాం. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మనం మార్చాం. కోవిడ్ సమయంలో కూడా సంక్షేమాన్ని ఆపలేదు. మోసపూరిత హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. మనల్ని ప్రలోభాలకు గురిచేసినా.. ఇబ్బందులు పెట్టినా, కొంత ఓపిక పట్టండి. మీకు నా తమ్ముడు అవినాష్ అందుబాటులో ఉంటారు. మీకు ఏ అవసరం వచ్చినా తనను కలవండి. తప్పకుండా సాయం చేస్తారు. నేను కడప బిడ్డను కాబట్టే మీరంటే నాకు ప్రత్యేకమైన అనుబంధం. మీ అందరి ప్రేమ ఎప్పటికీ మరిచిపోను. మేము జిల్లాలో చూసుకుంటాం.. మీరు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించండంటూ మీరంతా నాకు అండగా ఒక్కతాటిపై నిలవాలి. ప్రజాపక్షమై గళమెత్తుదాం మనం ఇంత త్వరగా ప్రజల్లోకి వెళ్లాల్సి వస్తుందనుకోలేదు. చంద్రబాబు బాదుడే బాదుడులా పాలన సాగిస్తున్నారు. సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్లేదు.. అందుకే మనం పోరుబాట పట్టాల్సి వస్తోంది. హామీలు, సమస్యలపై ప్రజాపక్షమై గళమెత్తుదాం. ఇప్పటికే రైతు ధర్నా చేశాం. ఈ నెల 27న కరెంట్ బిల్లులపై మరో నిరసన కార్యక్రమం చేయనున్నాం. జనవరి 3న ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థుల తరుఫున మరో కార్యక్రమం చేయాల్సి ఉంది. మీ అందరి సహాయ సహకారాలు కావాలి. మీ అందరినీ నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నా. ప్రజల కోసం ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలి. సంక్రాంతి తర్వాత ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్తాను. అన్ని జిల్లాల్లో పర్యటిస్తాను. వైఎస్సార్‌కు నివాళులు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి.. మంగళవారం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అరి్పంచారు. అనంతరం వైఎస్ కుటుంబ సభ్యులు.. ఓపెన్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్ జగన్, భారతి దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతమ్మ, వైఎస్ ఆనందరెడ్డి, వైఎస్ రవీంద్రనాథరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఇతర కుటుంబీకులు.. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, రమేష్ యాదవ్, మేయర్ సురేష్ బాబు, మాజీ మంత్రి ఎస్బీ అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు శెట్టిపల్లె రఘురామిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, గంగుల బిజేంద్రనాథరెడ్డి, సుదీర్‌రెడ్డి.. వైఎస్ అనిల్‌రెడ్డి, వైఎస్ సునీల్‌రెడ్డి, ఆర్టీసీ మాజీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఒక దేశం ఒక ఎన్నికపై... ఒక మాట!
‘భిన్నత్వంలో ఏకత్వం’ భారత లక్షణమే కాదు, విలక్షణ సంపద అని పలుమార్లు రుజువైంది. ఉద్వేగ నినాదంగా బాగున్నంత, ‘ఒక దేశం ఒక ఎన్నిక’ ఆచరణ గొప్పగా ఉంటుందనే నమ్మకం లేదు. ఇందులో పలు సమస్యలున్నాయి. దేశంలో రావాల్సిన ఎన్నికల సంస్కరణల్లో ఇదంత ప్రాధాన్యతాంశ మేమీ కాదు! అంతకన్నా ప్రాధాన్య అంశాలెన్నిటికో దిక్కూదివాణం లేక ప్రజాస్వామ్యమే వెనుకడుగులోకి జారుతోంది. ముందు ఆ సంస్కరణలు ముఖ్యం. జమిలితో... అభివృద్ధికి ఉండే ఆటంకాలు తొలగిపోతాయి. సమయం, ఆర్థికమానవ వనరుల దుబారా తగ్గుతుందనేది ఓ ఆశ! కానీ,ప్రాంతీయ అస్తిత్వాలకు అదొక గొడ్డలిపెట్టు. సమాఖ్య స్ఫూర్తికి భంగకరం. కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్నట్టుగానే... దేశ మంతటా ఒకేసారి (జమిలి) ఎన్నికలు జరిపించే విషయంలో సమగ్ర చర్చ జరగాలి. శాసనసభల స్పీకర్లతో పాటు మేధావులు, సమాజంలోని విభిన్నవర్గాల ప్రతినిధుల్ని భాగం చేసి చర్చించాలి. మాజీ రాష్ట్రపతి రావ్‌ునాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ సంప్రదింపుల్లో 32 పార్టీలు సానుకూలంగా మాట్లాడి, మద్దతు ప్రకటిస్తే 15 పార్టీలు పూర్తిగా వ్యతిరేకించాయి. వ్యతిరేకిస్తున్న పార్టీల్లో కాంగ్రెస్ ఉండటంతో... 1952 నుంచి 1967 వరకు, వరుస నాలుగు ఎన్నికల్లో కేంద్రం రాష్ట్రాల ఎన్నికల్ని కలిపి (జమిలి) నిర్వహించి నపుడు, మరిప్పుడెందుకు సాధ్యపడదు? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అనే ప్రశ్న పాలకపక్షాలు లేవనెత్తుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చాక జరిగిన తొలి సభలు కావడంతో అది సాధ్యమైంది. తర్వాత ఎన్నో మార్పులొచ్చాయి. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన జరిగింది. అవిశ్వాసాల్లో కొన్ని సభలు అర్ధంతరంగా ముగిశాయి. కొన్ని ప్రభుత్వాలు కూలిపోయో, రాష్ట్రపతి పాలన విధింపుతోనో ఎన్నికల ద్వారా కొత్త సభలు ఏర్పడ్డాయి. ఇలా వేర్వేరు పరిణామాల వల్ల లోక్‌సభకు, వివిధ శాసనసభలకు ఎన్నికల గడువు కాలాలు మారుతూ వచ్చాయి. భారత ఎన్నికల సంఘానికున్న విచక్షణాధికార పరిధి, వెసులుబాటు వల్ల... అప్పటికి రద్దయిన, రాష్ట్రపతి పాలనలో ఉన్న రాష్ట్రాల సభల ఎన్నికల కాలాలు స్వల్పంగా అటిటు అవుతూ వచ్చాయి. అందుకే, 1970ల తర్వాత జమిలి సాధ్య పడలేదు. ‘జమిలి కొత్తేం కాదు, ఇదివరకు జరిగిందే’ అని అమిత్ షా అంటున్నా, ఇవాళ్టి పరిస్థితి వేరు. అదంత సాధారణమే అయితే, ఇపుడు చట్టాలనూ, రాజ్యాంగాన్నీ మార్చడమెందుకు?ఎలా సమానం చేస్తారు?అన్ని ఎన్నికల్ని ఒక తేదీకి లాగే క్రమంలో... ఎన్నో మార్పులు చేయాల్సి ఉంటుంది. మొదట, పొట్టికాలం నిడివి సభలు, పొడుగు కాలం నిడివి సభలు అనివార్యమవుతాయి. బలవంతపు రాష్ట్రపతి పాలనలూ ఉంటాయేమో? ఇప్పుడు ప్రతిపాదిస్తున్నట్టు 2027లోనో, మరెపుడో జమిలి ఎన్నికల్ని నిర్వహించాక కూడా... ఏ కారణం చేతైనా ఒక రాష్ట్ర అసెంబ్లీ రద్దయితే, తిరిగి ఎన్నికల ద్వారా ఏర్పడే కొత్త సభను ఆ మిగిలిపోయిన కాలానికే పరిమితం చేస్తారు. సభ రద్దయిన సమయాన్ని (నాలుగేళ్లకో, మూడేళ్లకో రద్దయింది అనుకుంటే) బట్టి కొత్త సభకు ఏడాదో, రెండేళ్లో మిగలవచ్చు. సాధారణ ఎన్నికల్లో జరిగినట్టే అన్ని నియోజకవర్గాల, అందరు ఓటర్ల నిర్ణయంతో జరిగే మధ్యంతర ఎన్నికలో గెలిచిన సభ్యుల కొత్తసభ అలా ఆరు మాసాలకో, ఏడాదికో పరిమితం కావాల్సి రావడం ఏ రాజ్యాంగ ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతీక? అది డబ్బు, మానవ వనరుల దుబారా కాదా? అనే ప్రశ్న సహజం. దీనికి రాజకీయ పార్టీలు ఎలా అంగీ కరిస్తాయో చూడాలి. చాలా దేశాల్లో దేశవ్యాప్త ఎన్నికలు, ప్రాదేశిక ఎన్నికలు వేటికవిగానే జరుగుతాయి. జమిలి జరిపే ఏడెనిమిది దేశాల్లో అధ్యక్ష తరహా పాలనకిది సానుకూలమే! జమిలి ఎన్నికల నిర్వహణా ఒక సంక్లిష్టమే! మొన్నటి హరియాణా ఎన్నికలతో, గడువు సమీపించిన మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్ని ఎందుకు కలపటం లేదని అడిగితే, ‘... శాంతి భద్రతలు, నిర్వహణ పరంగా ఇబ్బందులుంటా య’ని ఎన్నికల సంఘం పేర్కొంది. నాలుగైదు రాష్ట్రాల్లోనే ఒకేసారి ఎన్నికలు నిర్వహించలేని వారు మొత్తం దేశవ్యాప్తంగా లోక్‌సభకు దాదాపు 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్ని కలిపి, రేపెప్పుడో స్థానిక సంస్థల ఎన్నికల్నీ కలిపి ‘మహా జమిలి’ ఎలా నిర్వహిస్తారు? అనే ప్రశ్న సహజం. సంస్కరణల సవాళ్లెన్నో...భారీ ఓటర్ల భాగస్వామ్యంతో భారత ఎన్నికల నిర్వహణ ప్రపంచంలోనే ఒక అబ్బురం! బ్యాలెట్ నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా (ఈవీఎం) లకు మారిన తర్వాత కూడా, అభివృద్ధి చెందిన దేశాలు విస్మయం చెందే స్థాయిలో మన ‘మహా ఎన్నికలు’ జరుగుతున్నాయి. విడతలుగా జరిగిన ఎన్నికల సంస్కరణలు ప్రక్రియను చాలా వరకు పారదర్శకం చేశాయి. స్వేచ్ఛగా స్వతంత్రంగా ఓటర్లు తమ నిర్ణ యాన్ని ప్రకటిస్తున్నప్పటికీ... ఎన్నికల్లో ధన ప్రవాహం, ప్రక్రియలో లోపిస్తున్న జవాబుదారీతనం ఆందోళన కలిగిస్తున్నాయి. ‘దేశ ఎన్ని కల ప్రక్రియలో ముదురుతున్న ‘క్యాష్ క్యాన్సర్’ను నియంత్రించే సంస్కరణ అత్యవసరంగా రావాలి’ అని సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయి ఇటీవల హైదరాబాద్‌లో చేసిన వ్యాఖ్య కీలకమైంది. ‘మునుగోడు’ అసెంబ్లీ ఉప ఎన్నికలో మనం కళ్లారా చూశాం. సరిగ్గా పోలింగ్‌కు ముందు లక్షల ఓట్లు గల్లంతయినా, నిన్న మహారాష్ట్రలో జరిగినట్టు ఒకటి, రెండు నెలల్లోనే లక్షలాది కొత్త ఓట్లు నమోదైనా... ఎన్నికల సంఘం నుంచి సరైన వివరణ, జవాబుదారీతనం లేక పోవడం దారుణం. ఈ సంస్కరణలు చేపట్టకుండా ‘జమిలి’కి పట్టుబట్టడం సరికాదనే అభిప్రాయం కొన్ని పార్టీల వారు, మేధావులు వ్యక్తంచేస్తున్నారు. విడిగా ప్రజాప్రతినిధులు గానీ, స్థూలంగా పార్టీలు గానీ, ప్రభుత్వాలు గానీ ఆశించిన/నిర్దేశించిన స్థాయిలో పనిచేయకుంటే వారిని వెనక్కి రప్పించే (కాల్ బ్యాక్) పద్ధతి ఉండాలనే డిమాండ్ పెరుగుతున్న తరుణంలో... అయిదేళ్ల కొకమారు అన్ని ఎన్నికలూ జరిపేయాలి, మధ్యలో ఏ ఎన్నికలూ ఉండొద్దనే నిర్బంధ మేమిటనే వాదన ఒకటుంది. మధ్యలో వేర్వేరు ఎన్నికలుంటేనే నాయకులైనా, పార్టీలైనా, ప్రభుత్వాలైనా కొద్దో గొప్పో భయంతో ఉంటాయనేది సాధారణ అభిప్రాయం. అందుకు, ఎన్నో సాక్ష్యాలు, తార్కాణాలు మన కళ్లముందే ఉన్నాయి. కాన్షీరావ్‌ు అన్నట్టు ‘ఏటా ఎన్నికలుండాలి’ అనే వాదనను బలపరచకపోయినా... ఎన్నికల భయం ఉన్నపుడే ప్రభుత్వాలు ప్రజానుకూలంగా నడుచుకోవడం తరచూ జరిగేదే! అలా కాకుండా, ఒకసారి ‘జమిలి’ జరిగితే, ఇక అయిదేళ్లూ ఏ ఎన్నికలుండవంటే... ప్రభుత్వాల ఏకస్వామ్యమే సాగుతుందనే భయాలున్నాయి. పైగా, భిన్నత్వ ప్రతీక అయిన దేశంలోని ప్రాంతీయ అస్తిత్వాలు, భావనలు, వాదనలు... ‘జమిలి’లో ఆధిపత్యం వహించే జాతీయ ప్రవాహంలో కొట్టుకుపోతాయనే ఆందోళన కూడా ఉంది. అందుకే, పలు ప్రాంతీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.ఒక పార్టీ ఒక నాయకుడు అంటారేమో!ఉభయ సభల్లో ఎన్డీయేకున్నది బొటాబొటీ మెజారిటీ! మూడింట రెండొంతుల మెజారిటీ ఉంటే తప్ప సాధ్యపడని రాజ్యాంగ సవ రణలకు ఎలా సాహసిస్తున్నారనేది ప్రశ్న! రాజ్యసభలో 164/243 అవసరమైనచోట 122 (42 తక్కువ) సంఖ్యాబలమే ఉంది. లోక్ సభలో 361/542 (ఒక ఖాళీ) అవసరం కాగా ఉన్నది 293 (63 కొరత) మాత్రమే! ఆ రోజు సభకు హాజరైన వారిలో మూడింట రెండొంతులు చాలు కనుక... ప్రత్యర్థి పార్టీల నుంచి క్రాస్ ఓటింగ్, గైర్హాజరీలను ప్రోత్సహిస్తారా? అని విపక్షంలో భయ సందేహాలున్నాయి. తరచూ ఎన్నికల వల్ల కోడ్ అమలు అభివృద్ధికి ఆటంకమనే భావనే తప్పని, ఓట్ల యావతో ఎన్నికలకు నెలల ముందే అభివృద్ధి పనులు చేయడం కాకుండా అయిదేళ్లపాటు జరిపితే కోడ్‌కు వెరవా ల్సిన భయమేమిటని ప్రశ్నిస్తున్నారు. ‘జమిలి’పై ఎందుకీ పంతం?’ ఇదే పంథాలో సాగి, రేపు ‘ఒక పార్టీ, ఒకే నాయకుడ’నే నినాదంతో ప్రజాస్వామ్యాన్ని అధ్యక్షతరహా పాలనవైపు నడిపే ప్రమాదాన్ని మొగ్గలోనే తుంచేయాలన్నది వ్యతిరేకవాదన వినిపించే వారి మాట!దిలీప్ రెడ్డి వ్యాసకర్త ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
జేపీసీలో YSRCP ఎంపీ విజయసాయిరెడ్డికి చోటు
-
జేపీసీలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
ఢిల్లీ : జమిలి బిల్లుల కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)లో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చోటు దక్కింది. జమిలి బిల్లుల కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. ఈ జేపీసీ కమిటీలో రాజ్యసభ నుంచి 12మందికి చోటు కల్పించింది. ఆ 12మందిలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా నియమిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు తీసుకువచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు(జమిలి ఎన్నిక బిల్లును)ను లోక్‌సభ శుక్రవారం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపింది. ఇప్పటికే మంగళవారం దిగువ సభలో కేంద్రం ఈ బిల్లును ప్రవేశ పెట్టగా.. ఈ బిల్లు భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉందని విపక్షాలు ఆరోపించాయి. సంయుక్త పార్లమెంటరీ కమిటీకి (జేపీసీ) పంపాలని డిమాండ్ చేయడంతో లోక్‌సభ జేపీసీకి పంపింది. మరోవైపు లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది.. మొత్తం 31 మందితో కూడిన జేపీసీ జాబితాను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. పీపీ చౌధరిని ఈ కమిటీకి చైర్మన్‌గా నియమించారు.కమిటీలో అనురాగ్ ఠాకూర్, అనిల్ బలూనీ, సంబిత్ పాత్రా, శ్రీకాంత్ ఏక్‌నాథ్‌షిండే, సుప్రియా సూలే, ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ, సెల్వ గణపతి తదితరులకు చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (రాజ్యసభ నుంచి), బాలశౌరి(జనసేన), హరీష్ బాలయోగి(టీడీపీ), సీఎం రమేష్(రాజ్యసభ నుంచి)లకు జేపీసీలకు అవకాశం ఇచ్చారు. -
‘జమిలి’ కోసం జేపీసీ ప్రకటన, చైర్మన్ ఎవరంటే..
న్యూఢిల్లీ, సాక్షి: జమిలి బిల్లుల కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది.. మొత్తం 31 మందితో కూడిన జేపీసీ జాబితాను బుధవారం ప్రకటించారు. పీపీ చౌధరిని ఈ కమిటీకి చైర్మన్‌గా నియమించారు. కమిటీలో అనురాగ్ ఠాకూర్, అనిల్ బలూనీ, సంబిత్ పాత్రా, శ్రీకాంత్ ఏక్‌నాథ్‌షిండే, సుప్రియా సూలే, ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ, సెల్వ గణపతి తదితరులకు చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి బాలశౌరి(జనసేన), హరీష్ బాలయోగి(టీడీపీ), సీఎం రమేష్(రాజ్యసభ నుంచి)లకు జేపీసీలకు అవకాశం ఇచ్చారు. పీపీ చౌధరి రాజస్థాన్ పాలి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో కేంద్రమంత్రిగానూ ఆయన పని చేశారు. జమిలి జేపీసీ ఏర్పాటు ప్రతిపాదలను రేపు(గురువారం, డిసెంబర్ 19) లోక్‌సభలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తెలియజేయనున్నారు.జమిలి బిల్లులపై ఈ జేపీసీ సంప్రదింపులు, అధ్యయనం చేసి తదుపరి సమావేశాల్లోగా నివేదిక సమర్పించనుంది. అవసరమైతే.. జేపీసీ గడువును లోక్‌సభ స్పీకర్ పొడిగిస్తారు.21 members from Lok Sabha; 10 from Rajya Sabha in Joint Parliamentary Committee (JPC) for 'One Nation One Election'Priyanka Gandhi Vadra, Manish Tewari, Dharmendra Yadav, Kalyan Banerjee, Supriya Sule, Shrikant Eknath Shinde, Sambit Patra, Anil Baluni, Anurag Singh Thakur named… pic.twitter.com/P678d7c9tl— ANI (@ANI) December 18, 2024 -
‘జమిలి’ బిల్లులపై ఉత్కంఠ
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల బిల్లుల అంశంపై ఏర్పాటు చేసే జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)పై ఉత్కంఠ నెలకొంది. గురువారం(డిసెంబర్ 19) లోక్‌సభలో స్పీకర్ ఓంబిర్లా జేపీసీని ఏర్పాటు చేస్తు ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారంతో పార్లమెంట్ సెషన్ ముగుస్తుండడంతో ఈలోపే జేపీసీపై స్పీకర్ ప్రకటన చేయాల్సి ఉంటుంది. లేదంటే జమిలిపై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రెండు రాజ్యాంగ సవరణ బిల్లులు వృథా అయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వం ఈ బిల్లులపై ధృడ నిశ్చయంతో ఉన్నందున జేపీసీపై గురువారం ప్రకటన వస్తుందనే అంతా భావిస్తున్నారు.అధికారపక్ష సభ్యులే కాకుండా ప్రతిపక్ష సభ్యులకూ జేపీసీలో స్థానం ఉంటుంది. జేపీసీలోకి గరిష్టంగా 31 మందిని తీసుకోవచ్చు. ఇందులో లోక్‌సభ నుంచే 21 మంది ఉంటారు.ఇందుకు సంబంధించి తమ సభ్యుల పేర్లను ప్రతిపాదించాలని ఇప్పటికే పార్టీలకు స్పీకర్ ఛాంబర్ నుంచి ఆదేశాలు వెళ్లాయి.అయితే బీజేపీ లార్జెస్ట్ పార్టీ కావడంతో ఆ పార్టీకే కమిటీ చైర్మన్ పదవి వెళ్లే అవకాశాలెక్కువగా ఉన్నాయి. ఒకవేళ జేపీసీ ఏర్పాటు గనుక అనుకున్న టైంకి జరగకుంటే.. ప్రక్రియ మళ్లీ మొదటికి చేరుతుంది. అంటే.. వచ్చే సెషన్లో బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. -
జమిలి బిల్లుకు మా మద్దతు అందుకే...
-
విపక్షాల వ్యతిరేకత మధ్యే జమిలి బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం
-
మద్దతిచ్చిన వైఎస్సార్సీపీ, టీడీపీ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన రాజ్యాంగ (129 సవరణ) బిల్లు–2024, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు–2024లను ప్రవేశ పెట్టడానికి జరిగిన ఓటింగ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు మద్దతివ్వగా ఎంఐఎం పార్టీ ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించింది. ఒకే దేశం–ఒకే ఎన్నికలకు సంబంధించి తెచ్చిన బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ తీసుకొచ్చిన తీర్మానంపై ఓటింగ్‌లో టీడీపీ, వైఎస్సార్సీపీ పార్టీలకు చెందిన ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. ఈ సందర్భంగా టీడీపీ తరఫున కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ‘దేశమంతా ఒకే దశలో అసెంబ్లీ, లోక్‌సభకు ఎన్నికలను నిర్వహించాలనుకుంటోన్న కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అని అన్నారు. జాతీయ మీడియాతో మాట్లాడిన వైఎస్సార్సీపీ ఎంపీ మిధున్‌రెడ్డి ‘ఏకకాల ఎన్నికలతో పార్టీకి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ రాష్ట్రానికి కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తున్నందున మాకు పెద్దగా సమస్యలు లేవు’ అన్నారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తుంది: ఒవైసీజమిలి ఎన్నికల బిల్లును ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘ఇది స్వయం పాలన హక్కును, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోంది. ఫెడరలిజం సూత్రాలను ఉల్లంఘిస్తోంది. ఈ తరహా చట్టంతో రాష్ట్రాల అసెంబ్లీలకు మధ్యంతర ఎన్నికలకు వస్తాయి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం. దీనిని ఆమోదించే సామర్థ్యం పార్లమెంటుకు లేదు. రాష్ట్రపతి తరహా ప్రజాస్వామ్యం కోసం నేరుగా ఈ బిల్లు తీసుకొచ్చారు. ఈ బిల్లు దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల ఉనికిని దెబ్బతీస్తుంది. చివరగా ఈ బిల్లును కేవలం అత్యున్నత నాయకుడి అహాన్ని సంతృప్తి పరచడానికే తీసుకొచ్చారు’ అని పేర్కొన్నారు. -
‘జమిలి’కి వేళయిందా?!
మొత్తానికి బీజేపీ చిరకాల వాంఛ నెరవేరటంలో తొలి అడుగుపడింది. దేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు ముసాయిదా బిల్లులు మంగళవారం లోక్‌సభలో ప్రవేశించాయి. అందరూ అనుకున్నట్టే ఈ బిల్లులకు విపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. వచ్చినంత వేగంగా రెండు బిల్లులూ జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు వెళ్లబోతున్నాయి. తరచు జరిగే ఎన్నికల వల్ల పాలనా నిర్వహణలో అస్థిరత నెలకొంటున్నదని, కీలకమైన ప్రాజెక్టుల సాకారంలో అంతులేని జాప్యం చోటుచేసుకుంటున్నదని, ఎన్నికలకు తడిసి మోపెడు వ్యయం అవుతున్నదని ప్రభుత్వ పెద్దలు చాన్నాళ్లుగా వాదిస్తున్నారు. ఎన్నికల నిర్వహణపై స్పష్టత వుంటే పాలన కుంటు పడదని, అధికార యంత్రాంగంపైనా, ఖజానాపైనా భారం తగ్గుతుందని, వోటింగ్ శాతం పెరుగు తుందని వారి వాదన. ఈ విషయమై కేంద్రం మాజీ రాష్ట్రపతి రావ్‌ునాథ్ కోవింద్ నేతృత్వంలో నియమించిన బృందం సైతం పాలకుల వాదనకు అనుకూలంగా సిఫార్సులు చేసింది. జమిలి ఎన్నికల వల్ల సుస్థిరత ఏర్పడి పెట్టుబడులు పెరుగుతాయని, ఆర్థికాభివృద్ధికి వీలవుతుందని, వనరుల కేటాయింపు సమర్థంగా చేయొచ్చని వివరించింది. మతపరమైన ఉద్రిక్తతలు తగ్గి భద్రతా బలగాల వినియోగం పెద్దగా ఉండబోదన్నది ఆ బృందం అభిప్రాయం. జమిలి ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలోని 83, 172, 324 అధికరణాలను సవరించాల్సి వుంటుంది. అందుకోసమే ఈ బిల్లుల్ని ప్రవేశపెట్టారు. వోటర్ల జాబితాకు సంబంధించి రాజ్యాంగంలోని 325 అధికరణను సవరించే మరో బిల్లు అవసరమవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆధ్వర్యంలో లోపరహితమైన జాబితా రూపొంది లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలు ఏకకాలంలో జరుగుతాయని ప్రభుత్వం చెబుతోంది. అంటే జమిలి కేవలం ఈ రెండు సభలకు సంబంధించిందే. ఈ ఎన్నికలు పూర్తయిన వందరోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలుంటాయి.మొత్తానికి ఎన్నికల జాతర అయిదేళ్లకోసారి మాత్రమే ఉంటుంది. మధ్యలో ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం కుప్పకూలి అసెంబ్లీ ఎన్నికలు తప్పనిసరైతే వాటిని జరుపుతారట. కానీ ఆ కొత్త ప్రభుత్వాల ఆయుష్షు ఆ మిగి లిన సంవత్సరాలకు మాత్రమే పరిమితమవుతుందట. అంటే అయిదేళ్ల కాలానికి ఎన్నికైన ప్రభుత్వం మూడేళ్లకే పతనమైతే... కొత్తగా ఎన్నికలై వచ్చే పాలకులకు కేవలం రెండేళ్లు మాత్రమే పదవీయోగం దక్కుతుందన్నమాట! సారాంశంలో ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ ఆదర్శం కాస్తా అట కెక్కినట్టే అవుతుంది. మరి ఈ బిల్లులు సాధించదల్చుకున్నదేమిటి? ఈ బిల్లులు గట్టెక్కటం అంత సులభమేమీ కాదు. ఏ రాజ్యాంగ సవరణ బిల్లుకైనా మూడింట రెండువంతుల మెజారిటీ తప్పనిసరి. ఆ రకంగా చూస్తే 543 మంది సభ్యులున్న సభలో ఈ బిల్లు లకు మద్దతుగా కనీసం 362 మంది వోటేయాలి. కానీ ఎన్డీయే బలం 293. అంటే మరో 69 మంది మద్దతు అవసరమవుతుంది. రాజ్యసభ వరకూ చూస్తే 163 మంది బిల్లులకు అనుకూలంగా వోటే యాలి. కానీ ఎన్డీయే బలం 121. ఆ తర్వాత రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం కూడా తప్పనిసరి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన చట్టాలు మార్చాలంటే కనీసం సగం అసెంబ్లీలు అందుకు అంగీ కరించాలి. కోవింద్ కమిటీ ముందు 47 రాజకీయ పక్షాలు తమ అభిప్రాయాలు వినిపించాయి. 32 పార్టీలు అనుకూలం కాగా, 15 పార్టీలు ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’కు వ్యతిరేకమని తేలింది. ప్రజాస్వామ్యమంటే కేవలం అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికలు మాత్రమే కాదన్న సంగతి పాలకులు మరిచిపోయి చాన్నాళ్లయింది. ఎన్నికల్లో చెప్పేది ఒకటైతే, గెలిచాక చేసేది మరొకటి.కేంద్రంలో మాత్రమే కాదు... ఏపీలోని ఎన్డీయే పాలన చూసినా ఈ సంగతి ఇట్టే అర్థమవుతుంది. ఏపీలో నదురూ బెదురూ లేకుండా ఇచ్చిన వాగ్దానాలన్నిటికీ ఎగనామం పెట్టారు. ఇక ఎక్కడ ఎన్ని కలు జరిగినా ఈవీఎంలపై అనుమానాలు మొదలవుతున్నాయి. ఏపీలో ఎన్నికలు పూర్తయినవెంటనే ఈసీ ప్రకటించిన ఓట్లకు లెక్కించినప్పుడు అదనంగా మరో పన్నెండున్నర శాతం ఓట్లు వచ్చిచేరాయి. దేశంలో అత్యధిక నియోజకవర్గాల్లో సగటున వెయ్యి ఓట్లు ఇలా అదనంగా చేరినట్టు బయటపడింది. దీనిపై సంజాయిషీ ఇవ్వాలన్న కనీస సంస్కారం ఈసీకి లేకపోగా... ఈవీఎంలలో పోలైన ఓట్లనూ, వీవీ ప్యాట్ స్లిప్‌లనూ సరిపోల్చాలన్న వినతుల్ని బుట్టదాఖలా చేసింది. పైగా అతి తెలివి ప్రదర్శించి డమ్మీ పోలింగ్ నిర్వహణకు దిగింది! ఏపీకి సంబంధించినంతవరకూ అయితే గడువుకు ముందే వీవీ ప్యాట్ స్లిప్‌లను ధ్వంసం చేశారు. ఈవీఎంల డేటా తొలగించారు. ఈ వైపరీ త్యాలపై తామేం చేయాలన్న స్పృహ, వివేకం కేంద్ర పాలకులకు లేకపోగా... ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ లోనే దేశ భవిష్యత్తు సర్వం ఆధారపడి వున్నట్టు భూమ్యాకాశాలు ఏకం చేస్తున్నారు.పైగా ఈ మాదిరి ఎన్నికలు ప్రాంతీయ ఆకాంక్షలనూ, అవసరాలనూ పాతరపెడతాయన్న ఆరోపణలకు సరైన జవాబు లేదు. ఈ విధానం దేశ ఫెడరల్ స్వభావాన్ని దెబ్బతీస్తుందన్న విమ ర్శను బేఖాతరు చేస్తున్నారు. అసలు 140 కోట్ల జనాభా... 30 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతా లున్న దేశాన్నీ... లెక్కకు మిక్కిలివున్న పార్టీలనూ ‘జమిలి’ చట్రంలో బిగించి ఒక్క వోటుకి కుదించాలన్న ప్రతిపాదనే వింతై నది. దానిపై బిల్లులు పెట్టేముందు విస్తృతంగా చర్చించి ఏకాభిప్రాయం సాధించాలన్న కనీస ఇంగితజ్ఞానం కొరవడితే ఎలా? అగ్రరాజ్యమైన అమెరికాలోనే నాలుగేళ్లకోసారి అధ్యక్ష ఎన్నికలు జరుపుతూ, రాష్ట్రాల సెనేట్లకూ, స్థానిక సంస్థలకూ, ప్రతినిధుల సభకూ నిర్ణీత కాలంలో విడివిడిగా ఎన్నికలు నిర్వహిస్తుండగా దాదాపు 97 కోట్లమంది వోటర్లున్న ఈ అతి పెద్ద దేశంలో జమిలికి తహతహలాడటంలోని మర్మమేమిటి? -
ON-OP: అదే జరిగితే మళ్లీ కథ మొదటికే!
దేశం మొత్తం ఒకేసారి ఎన్నిక నిర్వహించాలన్న ‘జమిలి బిల్లు’ తొలి గండం గట్టెక్కింది. ఇవాళ లోక్‌సభలో బిల్లుల కోసం 269-198తో ఆమోదం లభించింది. దీంతో విస్తృత సంప్రదింపులు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు ఈ బిల్లులు వెళ్లనున్నాయి. అయితే అంతకంటే ముందే నిర్దిష్ట గడువులోగా జేపీసీ ఏర్పాటు కావాల్సి ఉంది.శుక్రవారంతో పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి. అంటే ఈలోపే జేపీసీని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ గడువు ఆయనకు ఎంతో కీలకం. ఆయన కమిటీని ఏర్పాటు చేసి.. త్వరగతిన పనిని అప్పగించాల్సి ఉంటుంది. జేపీసీలో రాజ్యసభ ఎంపీలు కూడా ఉంటారు. అధికార సభ్యులే కాకుండా ప్రతిపక్ష సభ్యులకూ జేపీసీలో స్థానం ఉంటుంది. గరిష్టంగా 31 మందిని తీసుకోవచ్చు. ఇందులో లోక్‌సభ నుంచే 21 మంది ఉంటారు. ఇందుకు సంబంధించి తమ సభ్యుల పేర్లను ప్రతిపాదించాలని ఇప్పటికే పార్టీలకు స్పీకర్ ఛాంబర్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. అయితే బీజేపీ లార్జెస్ట్ పార్టీ కావడంతో ఆ పార్టీకే కమిటీ చైర్మన్ పదవి వెళ్లే అవకాశాలెక్కువగా ఉన్నాయి. ఒకవేళ జేపీసీ ఏర్పాటు గనుక అనుకున్న టైంకి జరగకుంటే.. ప్రక్రియ మళ్లీ మొదటికి చేరుతుంది. అంటే.. మళ్లీ వచ్చే సెషన్లో మళ్లీ బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.కాంగ్రెస్ తిరస్కరణమంగళవారం మధ్యాహ్నాం లోక్‌సభ ముందు జమిలి ఎన్నికల బిల్లులు వచ్చాయి. రాజ్యాంగ సవరణ బిల్లు (ఆర్టికల్ 129), కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024ను న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రవేశపెట్టారు. అయితే బిల్లు ప్రవేశపెట్టడానికి అవసరమైన డివిజన్ ఓటింగ్ కంటే ముందు.. సభలో వాడివేడిగా చర్చ నడిచింది. కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలు ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఎన్డీయే సభ్య పార్టీలు మాత్రం మద్దతు ప్రకటించాయి. ఆపై విపకక్షాల అభ్యంతరాల నడుమ.. డివిజన్ ఓటింగ్ అనివార్యమైంది. ఈ ఓటింగ్‌లో బిల్లు ప్రవేశపెట్టడానికే ఆమోదం లభించింది. అయితే ఈ పరిణామం తర్వాత కాంగగ్రెస్ మరోసారి స్పందించింది. ‘ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ విరుద్ధం. ఈ బిల్లును మేము ఏ మాత్రం ఆమోదించం’’ అని స్పష్టం చేసింది.జేపీసీకి డెడ్‌లైన్ ఉంటుందా?జమిలి ఎన్నికల నిర్వహణపై జేపీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోదు. కేవలం విస్తృత సంప్రదింపుల ద్వారా నివేదికను మాత్రమే రూపొందిస్తుంది. ఇందుకోసం అన్ని వర్గాలతో సంప్రదింపులు జరుపుతుంది. కమిటీలో సభ్యులుకానీ ఎంపీలతో అలాగే రాజ్యాంగపరమైన మేధావులు, న్యాయ కోవిదులతో చర్చిస్తుంది. ఎన్నికల సంఘంలో మాజీ అధికారులతోనూ సంప్రదింపులు జరుపుతుంది. అసెంబ్లీ స్పీకర్లతోనూ చర్చలు జరపొచ్చని తెలుస్తోంది. ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ మాత్రం చేపడుతుంది. ఆపై తుది నివేదికను సమర్పిస్తుంది.జేపీసీకి 90 రోజుల గడువు ఇస్తారు. అవసరమైతే ఆ గడువును పొడిగించే అవకాశమూ ఉంటుంది. ఆపై అవసరమైన రాజ్యాంగ సవరణల కోసం పార్లమెంట్లో బిల్లులపై చర్చ నడుస్తుంది. ప్రధానంగా ఆర్టికల్ 83, ఆర్టికల్ 85, ఆర్టికల్ 172, ఆర్టికల్ 174, ఆర్టికల్ 356లకు సవరణ తప్పనిసరిగా జరగాలి.ఇదీ చదవండి: జమిలి ఎన్నికలు.. వచ్చే ఏడాదే ఓటింగ్ !! -
లోక్‌సభలో ‘జమిలి ఎన్నికల’ బిల్లు.. సొంత పార్టీ ఎంపీలకు బీజేపీ నోటీసులు
ఢిల్లీ : సొంత పార్టీ ఎంపీలపై బీజేపీ అధిష్టానం ఫైరయ్యింది. సుమారు 20మంది ఎంపీలకు బాధ్యతారాహిత్యం కింద నోటీసులు జారీ చేసింది.లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రణాళిక ఎట్టకేలకు పార్లమెంట్ ముందుకొచ్చింది. ఎన్డీయే నేత్వంలోని కేంద్రం ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో అత్యంత కీలకమైన జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశ పెట్టింది. అయితే, లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లుపై చర్చ జరిగే సమయంలో 20మంది బీజేపీ ఎంపీలు గైర్హాజరయ్యారు.గతంలోనే, జమిలి ఎన్నికల బిల్లుపై చర్చ జరిగే సమయంలో లోక్‌సభ సభ్యులు సభకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఎంపీలు చర్చలో పాల్గొనలేదు. BIG BREAKING NEWS 🚨 One Nation One Election Bill accepted in Lok Sabha despite MASSIVE opposition by Opposition Parties.269 votes in favour and 198 votes against it.According to the bill, the “appointed date” will be after the next Lok Sabha elections in 2029, with… pic.twitter.com/xRBHnXGEBA— Times Algebra (@TimesAlgebraIND) December 17, 2024రాజ్యాంగాన్ని సవరించి ఏకకాలంలో పార్లమెంటరీ, రాష్ట్రాల ఎన్నికలను అనుమతించడానికి ఉద్దేశించిన రెండు బిల్లులకు ఎంపీల గైర్హాజరు అడ్డంకి కాదు. కానీ, ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా మార్చుకున్నాయి. జమిలి ఎన్నికలు సొంత పార్టీ నేతల నుంచి మద్దతు లేదని, అందుకు ఆ 20 మంది బీజేపీ ఎంపీల తీరేనని ఆరోపిస్తోంది. నియమావళి ప్రకారం బిల్లులు సాధారణ మెజారిటీతో ఆమోదం లభించింది. 269 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేయగా, 198 మంది వ్యతిరేకించారు. అయితే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు -
జేపీసీకి జమిలి బిల్లు..
-
బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించిన 149 మంది సభ్యులు
-
జమిలి ఎన్నికల బిల్లును వ్యతిరేకించిన సమాజ్ వాదీ పార్టీ
-
జమిలి బిల్లుకు వేళాయే..వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ
-
జమిలి బిల్లు ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ ఆమోదం
Lok Sabha Session Updatesలోక్‌సభ రేపటికి వాయిదాతిరిగి ప్రారంభమైన లోక్‌సభ లంచ్‌కు ముందు జమిలి బిల్లు ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ ఆమోదంఇక.. జేపీసీ ముందుకు జమిలి బిల్లులు!లోక్‌సభలో జమిలి ప్రవేశపెట్టడానికి ఆమోదంపార్లమెంటరీ సంయుక్త కమిటీ(జేపీసీ) ముందుకు బిల్లులువన్ నేషన్.. వన్ ఎలక్షన్లో భాగంగా 129 రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన బిల్లు కూడాజేపీసీ ద్వారా విస్తృస్థాయి చర్చకు అవకాశంఅతిత్వరలో జేపీసీ ఏర్పాటుజేపీసీ చైర్మన్‌ను ఎంపిక చేయనున్న లోక్‌సభ స్పీకర్సంఖ్యా బలం దృష్ట్యా బీజేపీ నుంచే జేపీసీకి చైర్మన్జేపీసీలో విపక్ష సభ్యులకు కూడా స్థానంసభ్యుల పేర్లను ప్రతిపాదించని తరుణంలో.. సభ్యత్వం కోల్పోయే అవకాశంజమిలి బిల్లు కాపీ కోసం క్లిక్ చేయండి వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదంతీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలుబిల్లు ప్రవేశపెట్టడంపై ఓటింగ్ నిర్వహించిన స్పీకర్ ఓం బిర్లాకొత్త పార్లమెంట్లో ఫస్ట్ డిజిటల్ ఓటింగ్అనుమానాలున్నవాళ్లకు స్లిప్పులు పంచిన సిబ్బందిఅనుకూలంగా 269 ఓట్లు.. వ్యతిరేకంగా 198 ఓట్లులోక్సభ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా‘జమిలి’ బిల్లుపై ఓటింగ్ అనంతరం 3 గంటలకు వాయిదాపడ్డ లోక్‌సభ ‘జమిలి’ బిల్లు ‘జేపీసీ’కి.. సాధారణ మెజారిటీతో ఓకే అన్న లోక్‌సభ కొత్త పార్లమెంట్ భవనంలో జమిలి బిల్లుపై తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్విపక్షాలు డివిజన్ కోరడంతో ఓటింగ్‌కు అనుమతిచ్చిన స్పీకర్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి, జేపీసీలో చర్చకు పంపేందుకు అనుకూలంగా 269 ఓట్లు బిల్లు ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా 198 ఓట్లు #WATCH | In a first, E-voting on 'One Nation One Election' Bill underway in Lok Sabha. (Source: Sansad TV) pic.twitter.com/dMRk6UEjeO— ANI (@ANI) December 17, 2024జేపీసీకి జమిలి బిల్లు పంపేందుకు సిద్ధం: అమిత్ షా జమిలి ఎన్నికల బిల్లును జేపీసీ కి పంపేందుకు సిద్ధంఈ బిల్లును జేపీసీకి పంపి విస్తృతంగా చర్చించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారుజేపీసీ నివేదిక తర్వాత మళ్లీ బిల్లు తీసుకువస్తాం లోక్‌సభలోకి జమిలి ఎన్నికల బిల్లు లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టిన న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మేఘ్వాల్ తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసే చర్య అని మండిపాటు రాజ్యాంగ సవరణకు సంబంధించిన రెండు బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలి రాష్ట్రాల అసెంబ్లీల కాలపరమితి కుదించడం రాజ్యాంగ విరుద్ధం కాంగ్రెస్ ఎంపీ మనీష్‌తివారీ డిమాండ్ జమిలి ఎన్నికల బిల్లుపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఫైర్ జమిలి ఎన్నికలు నియంతృత్వ పాలనకు నాంది అని వ్యాఖ్యబిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటన బిల్లును ఉపసంహరించుకోవాలని టీఎంసీ, డీఎంకే డిమాండ్జమిలి ఎన్నికలు ఎన్నికల సంస్కరణ కాదన్న టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీఈ బిల్లు ఆమోదం పొందితే ఎన్నికల కమిషన్‌కు సర్వాధికారాలు వస్తాయిజమిలి ఎన్నికల బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లేనపుడు బిల్లు ఎలా తెస్తారని ప్రశ్నించిన డీఎంకే జమిలి బిల్లు రాజ్యాంగ విరుద్ధం: ఎంఐఎం అధినేత అసదుద్దీన్జమిలి ఎన్నికలు ఒక లీడర్ ఈగో కోసమే వచ్చిన ఆలోచనరాష్ట్రాల హక్కులను హరిస్తున్నారుబిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాంజమిలి ఎన్నికలకు వైఎస్సార్సీపీ మద్దతులోక్సభలో జమిలి బిల్లులకు టీడీపీ మద్దతుజమిలి ఎన్నికల బిల్లుపై దేశమంతా చర్చ జరగాలి: ఎంపీ రఘునందన్‌రావు గతంలో కూడా నాలుగు సార్లు జమిలి ఎన్నికలు జరిగాయిజమిలి ఎన్నికలతో అధ్యక్ష తరహా పాలన జరగదుఈ బిల్లుకు 31 పార్టీలు మద్దతిస్తున్నాయిఇంకా 15 పార్టీలు మద్దతు ఇవ్వాల్సి ఉందిఏ పార్టీని మేము బుల్డోజ్ చేయంజమిలి ఎన్నికలు దేశ ప్రజల ఆకాంక్షప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాలికాంగ్రెస్ పార్టీ ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలిఇండియా కూటమిలో ఇప్పటికే లుకలుకలు ఉన్నాయివన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు తప్పనిసరిగా పాస్ అవుతుందని నమ్మకం ఉందిఎంపీలకు విప్ జారీ చేసిన కాంగ్రెస్..జమిలి ఎన్నికల బిల్లును లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టనున్నారుఈ సందర్భంగా కాంగ్రెస్ తన ఎంపీలకు విప్ జారీ చేసిందిఎంపీలంతా సభకు హాజరుకావాలని కోరింది సభలోకి వెళ్లేముందే జమిలి ఎన్నికల బిల్లుపై చర్చించే అవకాశం ఉందిసభలోకి రెండు బిల్లులు..జమిలి ఎన్నికల 129వ రాజ్యాంగ (సవరణ) బిల్లు–2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు–2024ను కేంద్రం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు వాటిని ఇవాళ లోక్‌సభ బిజినెస్ జాబితాలో చేర్చారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు సంబంధించిన ఈ బిల్లులను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ లోక్‌సభలో ప్రవేశ పెడతారని ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి. అనంతరం విస్తృత సంప్రదింపులకు వీలుగా బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపాల్సిందిగా స్పీకర్‌ను మంత్రి అభ్యర్థించవచ్చని వివరించాయి. ఇందుకు వీలుగా కమిటీకి చైర్మన్, సభ్యులను స్పీకర్ నియమిస్తారు. సంఖ్యాబలం ఆధారంగా పార్టీలకు అందులో స్థానం కల్పిస్తారు. బీజేపీ ఎంపీల్లో ఒకరిని చైర్మన్‌గా ఎంపిక చేయనున్నారు. భాగస్వామ్య పక్షాలందరితో చర్చించిన మీదట కమిటీ 90 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే గడువు పొడిగిస్తారు.20వ తేదీతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నందున జమిలి బిల్లులను మంగళవారమే ప్రవేశపెట్టనున్నట్టు జాతీయ మీడియా కూడా పేర్కొంది.జమిలి ఎన్నికలకు 32 పార్టీలు మద్దతివ్వగా 15 పార్టీలు వ్యతిరేకించినట్టు రామ్‌నాథ్ కోవింద్ కమిటీ వెల్లడించింది. -
నేడు లోక్‌సభలో జమిలి బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలకు సంబంధించిన 129వ రాజ్యాంగ (సవరణ) బిల్లు–2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు–2024ను కేంద్రం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు వాటిని లోక్‌సభ బిజినెస్ జాబితాలో చేర్చారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు సంబంధించిన ఈ బిల్లులను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ లోక్‌సభలో ప్రవేశ పెడతారని ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి. అనంతరం విస్తృత సంప్రదింపులకు వీలుగా బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపాల్సిందిగా స్పీకర్‌ను మంత్రి అభ్యర్థించవచ్చని వివరించాయి. ఇందుకు వీలుగా కమిటీకి చైర్మన్, సభ్యులను స్పీకర్ నియమిస్తారు. సంఖ్యాబలం ఆధారంగా పార్టీలకు అందులో స్థానం కల్పిస్తారు. బీజేపీ ఎంపీల్లో ఒకరిని చైర్మన్‌గా ఎంపిక చేయనున్నారు. భాగస్వామ్య పక్షాలందరితో చర్చించిన మీదట కమిటీ 90 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే గడువు పొడిగిస్తారు. 20వ తేదీతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నందున జమిలి బిల్లులను మంగళవారమే ప్రవేశపెట్టనున్నట్టు జాతీయ మీడియా కూడా పేర్కొంది. జమిలి ఎన్నికలకు 32 పార్టీలు మద్దతివ్వగా 15 పార్టీలు వ్యతిరేకించినట్టు రామ్‌నాథ్ కోవింద్ కమిటీ వెల్లడించింది.ఆ సదుపాయమూ ఉందిజమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఏదైనా రాష్ట్ర శాసనసభకు లోక్‌సభతో పాటుగా ఎన్నికలు జరపలేని పరిస్థితి ఎదురైతే ఎలా అన్న సందేహాలూ తలెత్తుతున్నాయి. అలాంటప్పుడు ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు సదరు అసెంబ్లీకి లోక్‌సభ అనంతరం ఎన్నికలు నిర్వహించేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారు. ఇందుకు వీలు కల్పిస్తూ బిల్లులో సెక్షన్ 2, సబ్ క్లాజ్ 5లో నిబంధన పొందుపరిచారు. -
లోక్‌సభకు ‘జమిలి’ బిల్లు? బీజేపీ ఎంపీలకు విప్!
సాక్షి, న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే విషయంలో కేంద్ర ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. మంగళవారం(డిసెంబర్17) లోక్‌సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లోక్‌సభలోని తమ పార్టీ ఎంపీలందరికి బీజేపీ విప్ జారీ చేసింది. జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ(129వ సవరణ) బిల్లు–2024, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల(సవరణ) బిల్లు–2024ను లోక్‌సభలో సోమవారమే ప్రవేశపెట్టాలని తొలుత నిర్ణయించారు. ఈ మేరకు లోక్‌సభ బిజినెస్ జాబితాలో సైతం వీటిని చేర్చారు. కానీ, తర్వాత బిజినెస్ నుంచి తొలగించారు.ఇప్పటికే జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. దీంతో బిల్లును పార్లమెంట్ ఉభయసభల్లో ప్రవేశపెట్టేందుకు లైన్ క్లియరైంది. దీంతో బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టగానే చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి రిఫర్ చేయాల్సిందిగా విపక్షాలు పట్టుపట్టే అవకాశం ఉంది. దీంతో స్పీకర్ జమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి పంపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.జమిలి ఎన్నికల బిల్లు గనుక పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందితే లోక్‌సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. దీనికి ఉభయసభల్లోని మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర క్యాబినెట్ గతంలోనే ఆమోదించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఇది ముమ్మాటికీ పాన్ ఇండియా సమస్యే -
జమిలి ఎన్నికల బిల్లు వాయిదా!
-
జమిలి ఎన్నికల బిల్లులు వాయిదా
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ బిల్లు సోమవారం లోక్‌సభ ముందుకు రావడం లేదు. జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ(129వ సవరణ) బిల్లు–2024, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల(సవరణ) బిల్లు–2024ను పార్లమెంట్ దిగువ సభలో నేడు ప్రవేశపెట్టాలని తొలుత నిర్ణయించారు. ఈ మేరకు లోక్‌సభ బిజినెస్ జాబితాలో సైతం వీటిని చేర్చారు. కానీ, కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఆదివారం సవరించిన బిజినెస్ జాబితా నుంచి ఈ రెండు బిల్లులను తొలగించారు. సోమవారం నాటి లోక్‌సభ అజెండాలో వీటిని చేర్చలేదు. అయితే, రెండు బిల్లులను ఈ వారమే సభలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 20న ముగియనున్నాయి. ఆలోగానే బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ప్రవేశపెట్టాలనుకుంటున్న బిల్లులను లోక్‌సభ స్పీకర్ అనుమతితో చివరి నిమిషంలోనైనా సప్లిమెంటరీ లిస్టు ఆఫ్ బిజినెస్ జాబితాలో చేర్చే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంది. నిధుల కేటాయింపులకు సంబంధించిన కొన్ని డిమాండ్లపై సోమవారం లోక్‌సభలో చర్చించాల్సి ఉందని, అందుకే జమిలి ఎన్నికల బిల్లులను వాయిదా వేసినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. లోక్‌సభతోపాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి ఉద్దేశించిన రెండు బిల్లుల వివరాలను నిబంధనల ప్రకారం గత వారమే లోక్‌సభ సభ్యులకు అందజేశారు. రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల(సవరణ) బిల్లుకు కేంద్ర కేబినెట్ ఈ నెల 12న ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. జమిలి బిల్లులకు మద్దతివ్వండిలక్నో: ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’విధానాన్ని బీఎస్పీ అధినేత మాయావతి సమర్థించారు. ఎన్నికల ఖర్చు తగ్గుతుందని, సంక్షేమ కార్యక్రమాలు అంతరాయం లేకుండా కొనసాగుతాయని ఆమె చెప్పారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టే జమిలి బిల్లుకు మద్దతు పలకాలని ఇతర రాజకీయ పార్టీలను మాయావతి కోరారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ ఆలోచించాలన్నారు. -
నేను చెప్పిందే నిజమైంది.. జమిలి ఎన్నికలకు సిద్ధమవ్వండి
-
జమిలి వచ్చినా 2029లోనే ఎన్నికలు
సాక్షి, అమరావతి/గుడ్లవల్లేరు: దేశవ్యాప్తంగా జమిలి అమల్లోకి వచి్చనా ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే అని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వచి్చన ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఒక దేశం– ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామని చెప్పారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. వైఎస్సార్సీపీ మాత్రం తమ పబ్బం గడుపుకోవడానికి ఏదిపడితే అది మాట్లాడుతోందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నేతలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారన్నారు. స్వర్ణాంధ్ర–విజన్ 2047 డాక్యుమెంట్ ఒక రోజు పెట్టి వదిలేసేది కాదని, దానిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, యూనివర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలతోపాటు ప్రతిచోటా చర్చ జరగాలన్నారు. విజన్–2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలన్నారు. 2047లోనూ ఇదే పునరావృతం అవుతుందన్నారు. సాగునీటి సంఘాలు, సహకార, ఇతర అన్ని రకాల ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈసారి కలెక్టర్ల సదస్సులో ఎన్నో మార్పులు తీసుకొస్తామని, సుదీర్ఘ సమీక్షలకు తావులేకుండా ప్రశ్న–సమాధానాల రూపంలో నిర్వహిస్తామని చెప్పారు. ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు చర్చకు సంబంధించిన అంశాలు పంపి సమాధానాలు కోరుతామని తెలిపారు. ఆస్పత్రిలో చేరిన బీజేపీ నేత అద్వానీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. కాగా, మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ సభ్యత్వ నమోదుపై ఆయన సమీక్ష నిర్వహించారు. టీడీపీ సభ్యత్వం 73 లక్షలకు చేరుకుంటుందని చెప్పారు. డోకిపర్రు వేంకటేశ్వరుని సన్నిధిలో సీఎం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు శ్రీ భూసమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవస్థాన బ్రహ్మోత్సవాలకు శనివారం సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఆయనకు మంగళ వాయిద్యాలు, పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(మెయిల్) అధినేత, దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు పురిటిపాటి వెంకటకృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతులు స్వాగతం పలికారు. అంతరాలయంలో ఆయన పేరిట వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత స్వామివార్లకు బాబు పట్టు వస్త్రాలను సమరి్పంచారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా తదితరులు పాల్గొన్నారు. -
జమిలి ఎన్నికల బిల్లు... రేపే లోక్‌సభ ముందుకు
న్యూఢిల్లీ: ఒకే దేశం–ఒకే ఎన్నిక విధానానికి సంబంధించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం ముహూర్తం ఖరారు చేసింది. జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. 129వ రాజ్యాంగ సవరణ, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లులను కేంద్ర న్యాయ శాఖ మంత్రి మేఘ్వాల్ సభ ముందు ఉంచనున్నారు. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన ఈ బిల్లులకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోద ముద్ర వేయడం తెలిసిందే. -
జమిలి ఎన్నికలంటే బాబుకు భయం మొదలైందా?
-
ఏపీపై జమిలి ఎన్నికల ఎఫెక్ట్
-
పార్లమెంటులో జమిలి ఎన్నికల బిల్లు పెట్టనున్న కేంద్రం
-
జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
-
జమిలి బిల్లుకు సై
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల దిశగా నరేంద్ర మోదీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ గురువారం సమావేశమైంది. జమిలి ఎన్నికల నిర్వహణకు వీలుగా రాజ్యాంగ సవరణకు ఉద్దేశించిన ‘రాజ్యాంగ 129 (సవరణ) బిల్లు’ను సైతం ఆమోదించింది. కేంద్ర న్యాయశాఖ రూపొందించిన ఈ రెండు బిల్లులను ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభకు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి ముసాయిదా బిల్లును కేబినెట్ ఆమోదించినట్లు తెలియజేశాయి. బిల్లుకు సంబంధించిన సాంకేతిక అంశాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంత్రివర్గ సహచరులకు వివరించారు. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కలి్పంచాలని, వారిని చైతన్యపర్చాలని ప్రధాని మోదీ సూచించారు. నిజానికి లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు దేశవ్యాప్తంగా మున్సిపాలీ్టలు, పంచాయతీలకు సైతం ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను కేంద్ర కేబినెట్ గతంలోనే ఆమోదించింది. కానీ, జమిలి ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రస్తుతానికి చేర్చకూడదని కేంద్రం నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రాజ్యాంగ సవరణ బిల్లు రూపొందించారు. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్‌సభ, రాజ్యసభలో మూడింట రెండొంతుల మెజారిటీతోపాటు కనీసం 50 శాతం రాష్ట్రాల అసెంబ్లీలు అంగీకారం తెలియజేయాలి. కేబినెట్ భేటీ అజెండాలో ‘రాజ్యాంగ 129 (సవరణ) బిల్లు’ తొలుత లేదని అమిత్ షా చెప్పారు. అయినప్పటికీ దానిపై చర్చించి, ఆమోదించామని అన్నారు. వచ్చే ఏడాదే ఓటింగ్ లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీతోపాటు శాసనసభలు ఉన్న మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు పుదుచ్చేరి, ఢిల్లీ, జమ్మూకశీ్మర్‌లో జమిలి ఎన్నికల నిర్వహణకు మూడు చట్టాల్లో సవరణలు చేయాల్సి ఉంది. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్–1991, గవర్నమెంట్ ఆఫ్ యూనియట్ టెరిటరీస్ యాక్ట్–1963, జమ్మూకశీ్మర్ రీఆర్గనైజేషన్ యాక్ట్–2019లో సవరణ చేయడానికి బిల్లు సిద్ధం చేశారు. ఈ మూడు చట్టాలను సవరించే బిల్లు సాధారణమైందే . దీనికి రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు. లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదిస్తే సరిపోతుంది. మరోవైపు జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిశీలనకు పంపించనున్నారు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్ల అభిప్రాయాలను ఈ కమిటీ ద్వారా స్వీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. మేధావులు, నిపుణులు, పౌర సమాజ సభ్యులతోపాటు సాధారణ ప్రజల అభిప్రాయాలు సైతం తెలుసుకోవాలని నిర్ణయానికొచి్చనట్లు సమాచారం. బిల్లుపై భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరగాలన్నదే ప్రభుత్వ యోచన. అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత బిల్లుపై వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. బిల్లు ఆమోదం పొందాలంటే? జమిలి ఎన్నికల బిల్లు ప్రత్యేకమైంది. ఇది రాజ్యాంగ సవరణలతో ముడిపడిన వ్యవహారం. బిల్లు నెగ్గాలంటే పార్లమెంట్ ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. రాజ్యసభలో మొత్తం ఎంపీల సంఖ్య 243. ప్రస్తుతం కొన్ని స్థానాలు ఖాళీగా ఉన్నాయి. బిల్లు ఆమోదం పొందాలంటే 164 మంది సభ్యులు మద్దతు పలకాలి. ఎన్డీయేకు 122 మంది సభ్యులున్నారు. ఎగువ సభలో ఖాళీల భర్తీ తర్వాత ఎన్డీయే బలం పెరుగనుంది. లోక్‌సభలో ప్రస్తుతం 542 మంది ఎంపీలున్నారు. ఒక స్థానం ఖాళీగా ఉంది. బిల్లుకు అనుకూలంగా కనీసం 361 ఓట్లు రావాలి. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సాధారణ మెజారిటీతోనే మనుగడ సాగిస్తోంది. ఎన్డీయేకు 293 మంది ఎంపీలున్నారు. విపక్ష ఇండియా కూటమికి 235 మంది ఎంపీలున్నారు. బిల్లు ఆమోదం పొందడానికి బీజేపీ కూటమి మరో 68 మంది ఎంపీల మద్దతు కూడగట్టాల్సి ఉంది. అది అంత కష్టం కాకపోవచ్చు. జమిలి ఎన్నికల విషయంలో రామ్‌నాథ్ కోవింద్ కమిటీ 47 రాజకీయ పార్టీల అభిప్రాయాలు స్వీకరించగా, 32 పారీ్టలు మద్దతిచ్చాయి. 15 పార్టీలు వ్యతిరేకించాయి. కోవింద్ కమిటీ కీలక సిఫార్సులు కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రామ్‌నాథ్ కోవింద్ కమిటీ 2023 సెపె్టంబర్ 2న తమ కార్యాచరణ ప్రారంభించింది. రాజకీయ పార్టీలు, భాగస్వామ్యపక్షాలతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపింది. అందరి అభిప్రాయాలు సేకరించింది. 191 రోజుల కసరత్తు అనంతరం నివేదికను సిద్ధం చేసింది. 18,626 పేజీల ఈ నివేదికను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఈ ఏడాది మార్చి నెలలో సమర్పించింది. కోవింద్ కమిటీ సిఫార్సులను ఈ ఏడాది సెప్టెంబర్‌లో కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ సిఫార్సులు ఏమిటంటే.. → దేశంలో గతంలో అమలైన జమిలి ఎన్నికలను పునరుద్ధరించడానికి ప్రభుత్వం చట్టపరమైన కట్టుదిట్టాలు చేయాలి. పటిష్టమైన చట్టం తీసుకురావాలి. → జమిలి ఎన్నికల్లో భాగంగా తొలి అంచెలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి. → రెండో అంచెలో మున్సిపాల్టీలు, పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలి. లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలు పూర్తయిన తర్వాత 100 రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి. → జమిలి ఎన్నికలు పూర్తయ్యాక లోక్‌సభ మొదటి సమావేశానికి తేదీని(అపాయింటెడ్ డే) రాష్ట్రపతి నోటిఫై చేయాలి. ఆ రోజు నుంచే లోక్‌సభ గడువు మొదలవుతుంది. → అపాయింటెడ్ డే ప్రకారమే రాష్ట్రాల అసెంబ్లీలు కొలువుదీరుతాయి. ఆ రోజు నుంచి వాటి గడువు ప్రారంభమవుతుంది. లోక్‌సభ గడువుతోపాటే అసెంబ్లీల గడువు కొనసాగుతుంది. గడువు ముగిసిన తర్వాత మళ్లీ జమిలి ఎన్నికలు చేపట్టాలి. → లోక్‌సభలో హంగ్ లేదా అవిశ్వాస తీర్మానం వల్ల ప్రభుత్వం పడిపోతే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి. కొత్త లోక్‌సభను ఎన్నుకోవాలి. → ఈ కొత్త సభ పూర్తి ఐదేళ్లు మనుగడలో ఉండదు. దీని కంటే ముందున్న సభ కాలపరిమితి ముగిసే తేదీ వరకే కొత్త సభ గడువు కొనసాగుతుంది. అంటే పాత సభ గడువే కొత్త సభకు సైతం వర్తిస్తుంది. → రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మధ్యలోనే కూలిపోతే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి. కొత్తగా కొలువుదీరిన శాసనసభ కాలపరిమితి ఆ సమయంలో ఉన్న లోక్‌సభ గడువు ముగిసే వరకే కొనసాగుతుంది. అనంతరం లోక్‌సభతోపాటే ఆ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలి. → జమిలి ఎన్నికలకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల ఎన్నికల సంఘాలతో సంప్రదింపులు జరిపి ఒకే ఓటర్ల జాబితా రూపొందించాలి. → వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. పటిష్టమైన ప్రణాళిక రూపొందించుకోవాలి. తగిన సంఖ్యలో ఈవీఎంలు, వీవీప్యాట్లు సమకూర్చుకోవాలి. ఎప్పుడు జరగొచ్చు? ప్రస్తుత 18వ లోక్‌సభ గడువు 2029 దాకా ఉంది. 2029 కంటే ముందు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో శాసనసభల గడువు ముగియనుంది. 2027లో గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ తదితర కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అదే సమయంలో జమిలి ఎన్నికలు నిర్వహించడానికి మోదీ సర్కారు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. → 2025లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు ఢిల్లీ, బిహార్ → 2026లో.. అస్సాం, పశి్చమ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ → 2027లో.. గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ → 2028లో.. త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్, కర్ణాటక, మిజోరాం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ → 2029లో.. అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జమ్మూకశీ్మర్, హరియాణా, జార్ఖండ్, మహారాష్ట్రఇదీ చదవండి: శరవేగంగా ‘జమిలి’ అడుగులు! బిల్లు ఆమోదం పొందాలంటే..ప్రజాధనం ఆదా: బీజేపీఒకే దేశం.. ఒకే ఎన్నికను ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ప్రతిఏటా దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండడంతో అభివృద్ధికి విఘాతం కలుగుతోందని ఆయన చెబుతున్నారు. ఎన్నికల కోడ్‌తో అభివృద్ధి పనులు ఆపేయాల్సి వస్తోందని, ఇది మంచి పరిణామం కాదని అంటున్నారు. దేశమంతటా ఒకేసారి ఎన్నికలు ముగించేస్తే పరిపాలనపై దృష్టి పెట్టడానికి, అభివృద్ధిని పరుగులు పెట్టించడానికి ఎలాంటి అవరోధాలు ఉండవని అభిప్రాయపడుతున్నారు. జమిలి ప్రతిపాదనను మోదీ 2016 డిసెంబర్లో తొలిసారిగా తెరపైకి తెచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రత్యేకంగా హామీ ఇచ్చారు. బీజేపీ మిత్రపక్షాలు జమిలికి మద్దతు ఇస్తున్నాయి. ఒకేసారి ఎన్నికలతో ఎన్నికల నిర్వహణ ఖర్చు భారీగా తగ్గుతుందని, ప్రజాధనం ఆదా అవుతుందని బీజేపీ వర్గాలు వాదిస్తున్నాయి.జనం దృష్టిని మళ్లించడానికే జమిలి జపం: కాంగ్రెస్ జమిలి ఎన్నికల ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ మరోసారి వ్యతిరేకించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో నేడు ఎన్నికల సమగ్రతపై తలెత్తుతున్న ప్రశ్నల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే మోదీ సర్కారు జమిలి జపం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఆరోపించారు. జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంట్లో చర్చకు వచ్చినప్పుడు జేపీసీ పరిశీలనకు పంపించాలని కోరుతామని అన్నారు. జమిలి ఎన్నికలు దేశ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తాయని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ స్పష్టంచేశారు. కనీసం మూడు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించలేని ప్రభుత్వం జమిలి ఎన్నికలు ఎలా నిర్వహించగలదని ప్రశ్నించారు. జమిలి బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్, పశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ తదితరులు తప్పుపట్టారు. బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం, సమాఖ్య వ్యతిరేకమని తేలి్చచెప్పారు. క్రూరమైన ఈ బిల్లును పార్లమెంట్లో కచ్చితంగా వ్యతిరేకిస్తామని స్పష్టంచేశారు. ఏయే ఆరి్టకల్స్ సవరించాలి? దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు, మార్గదర్శకాలకు ఉద్దేశించిన 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుంది. దీనితోపాటు పలు కీలక రాజ్యాంగ సవరణలకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికలకు ప్రధానంగా కొన్ని రాజ్యాంగ సవరణలు అవసరం. → లోక్‌సభ, రాజ్యసభల కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83కు సవరణ → రాష్ట్రాల అసెంబ్లీలకు ఐదేళ్ల గడువును నిర్దేశించే ఆర్టికల్ 172(1)కు సవరణ → అత్యయిక పరిస్థితుల సమయంలో సభకాల పరిమితిని ఏడాదికి మించకుండా పార్లమెంటు చట్టం ద్వారా వీలు కల్పించే ఆరి్టకల్ 83(2)కు సవరణ → రాష్ట్రపతికి లోక్‌సభను రద్దు చేసే అధికారాలిచ్చే ఆరి్టకల్ 85(2)(బి)కు సవరణ. → రాష్ట్ర అసెంబ్లీల రద్దు అధికారం గవర్నర్‌కు దఖలు పరిచే ఆరి్టకల్ 174(2)(బి)కు సవరణ → రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కలి్పంచే ఆర్టికల్ 356కి సవరణ → ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన ఆర్టికల్ 324కి సవరణ నేపథ్యం పార్లమెంట్‌తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం మన దేశంలో కొత్తేమీ కాదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక.. 1951 నుంచి 1967 దాకా దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరిగాయి. తర్వాత వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలడం వల్ల మధ్యంతర ఎన్నికలొచ్చాయి. ఆయా రాష్ట్రాల అసెంబ్లీల గడువులు మారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు చేపట్టాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును పెంచడం, మరికొన్నింటిని తగ్గించడం చేయాలి. లోక్‌సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఈ మార్పులు తప్పవు. ఏయే దేశాల్లో జమిలి? జమిలి ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అమల్లో ఉన్నాయి. దక్షిణాఫ్రికా, స్వీడన్, బెల్జియం, జర్మనీ, జపాన్, ఇండోనేసియా, ఫిలిప్పైన్స్ తదితర దేశాల్లో జమిలి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆయా దేశాల్లో ఎన్నికల తీరును రామ్‌నాథ్ కోవింద్ కమిటీ అధ్యయనం చేసింది. జమిలితో మంచి ఫలితాలు వస్తున్నట్లు గుర్తించింది. -
శరవేగంగా ‘జమిలి’ అడుగులు! బిల్లు ఆమోదం పొందాలంటే..
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని.. అందుకోసం ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ను తీసుకురావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర కేబినెట్ ఇవాళ న్యూఢిల్లీలో సమావేశం కానుంది. ఈ సమావేశం ముందుకు జమిలి ఎన్నికల బిల్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ శీతాకాల సమావేశాల్లోనే గనుక చర్చకు వస్తే.. అసలు ఓటింగ్ ఎలా జరుగుతుంది? జమిలి ఎన్నికల బిల్లును ఆమోదింపజేసుకోగలిగే ‘బలం’ ఎన్డీయేకు ఉందా?..రాబోయే సాధారణ ఎన్నికలు.. జమిలిగానే జరపాలని ప్రధాని నరేంద్ర మోదీ కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకోసం వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నారు. కానీ, పార్లమెంటులో రాజ్యాంగ సవరణలకు కూటమికి అవసరమైన సంఖ్యా బలం లేదు. అయినా ఈ బిల్లు ఆమోదించుకునేందుకు ముందుకెళ్లాలని మోదీ భావిస్తున్నారు.ముందుగా పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెడతారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దానిని రిఫర్ చేసే అవకాశం ఉండొచ్చు. అవసరం అనుకుంటే జేపీసీ.. వివిధ పార్టీలతో పాటు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టొచ్చు.మెజారిటీ ఎంత ఉండాలంటే.. ఒకే దేశం-ఒకే ఎన్నిక విధానం కోసం రూపొందించిన బిల్లు.. రాజ్యాంగ సవరణలతో ముడిపడిన అంశం. కాబట్టి.. ఉభయ సభల్లోనూ మూడింట రెండో వంతు మెజారిటీ కచ్చితంగా అవసరం.👉రాజ్యసభలో 245 మంది సభ్యులంటే.. కనీసం 164 ఓట్లు పడాలి👉అలాగే.. లోక్‌సభలో 545 మంది సభ్యులుంటే.. 364 ఓట్లు రావాలి.ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం సాధారణ మెజారిటీతోనే నడుస్తోంది. కాబట్టి.. ఓటింగ్ సమయానికల్లా మూడింట రెండో వంతు మెజారిటీ మద్దతు సంపాదించుకోవాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికలకు మొత్తం 47 పార్టీల్లో 32 పార్టీలు జై కొట్టిన సంగతి తెలిసిందే. అంటే 13 రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి.ఒకే దేశం.. ఒకే ఎన్నికకు సంబంధించిన ముసాయిదా బిల్లును రూపకల్పన చేసే పని.. కేంద్ర న్యాయ శాఖ చూసుకుంటోంది. ఇక ఈ బిల్లు బుధవారం జరిగే కేంద్ర కేబినెట్ సమావేశం ముందుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ అది కుదరకుంటే.. వచ్చే బుధవారం జరగబోయే కేబినెట్ సమావేశానికి ముందైనా రావొచ్చు. సంబంధిత ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం గనుక పొందితే.. పార్లమెంటు ముందుకు ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు రానుంది.ప్రస్తుత లోక్‌సభ గడువు 2029 దాకా ఉంది. కానీ, ఈ మధ్యలోనే దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ వేగంగా పావులు కదుపుతోంది.వచ్చే ఏడాది అంటే 2025లో.. ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 2026లో..అసోం(పూర్వపు అస్సాం)పశ్చిమ బెంగాల్పుదుచ్చేరితమిళనాడుకేరళ2027లో..గోవాఉత్తరాఖండ్పంజాబ్మణిపూర్ఉత్తర ప్రదేశ్హిమాచల్ ప్రదేశ్గుజరాత్ఈ స్టేట్స్ ఎన్నికల టైంలోనే.. జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంలోని మోదీ సర్కార్ భావిస్తోంది. 2028లో..త్రిపురమేఘాలయానాగాలాండ్కర్ణాటకమిజోరాంఛత్తీస్గఢ్మధ్యప్రదేశ్రాజస్థాన్తెలంగాణ2029లో..అరుణాచల్ ప్రదేశ్సిక్కింఆంధ్రప్రదేశ్ఒడిషాజమ్ము కశ్మీర్హర్యానాజార్ఖండ్మహారాష్ట్రకోవింద్ కమిటీ సిఫార్సులుజమిలి ఎన్నికల కోసం.. భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కొన్ని నెలల పాటు చర్చలు, సూచనలు, సలహాలు తీసుకుని ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికకు గతంలోనే కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన విషయం విదితమే. కోవింద్ నివేదిక ఆధారంగా.. అందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర న్యాయ శాఖ రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ముసాయిదా బిల్లును కేబినెట్ భేటీలో ఓకే చేసి .. ఆపై బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి.. ఆమోదం కల్పించాలని మోదీ సర్కార్ యోచిస్తోంది.ఇప్పుడు కాకుంటే..జమిలి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బిల్లు రూపొందినట్లు బీజేపీ వర్గాల పేర్కొంటున్నాయి. ఈ బిల్లును ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఆ తర్వాత ఈ జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ సమావేశాల్లో వీలు కాని పక్షంలో వచ్చే సమావేశాల్లో అయినా.. దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. -
జమిలికి జై!.. 2027 లోనే ఎన్నికలు
-
2027లో జమిలి ఎన్నికలు..?
సాక్షి,న్యూఢిల్లీ:జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 2027లోనే దేశంలో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు బీజేపీ సిద్ధపడిందన్న ప్రచారం జరుగుతోంది. జమిలి ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్లో ఆమోదించాల్సిన బిల్లు కూడా ఇప్పటికే సిద్ధమైందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదించింది. కాగా,ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు సహా పలు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని, జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టబోరని ప్రచారం జరగడం గమనార్హం. -
జమిలి ఎన్నికలు వస్తే కూటమి ప్రభుత్వం ఇంటికే
-
జమిలి ఎన్నికలపై ఎర్రబెల్లి ఆసక్తికర కామెంట్స్
సాక్షి,వరంగల్: బీఆర్ఎస్ దీక్షాదివస్ సందర్భంగా వరంగల్‌లో శుక్రవారం(నవంబర్ 29) జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయని,కేసీఆర్ మళ్లీ సీఎం కాబోతున్నారని ఎర్రబెల్లి అనడం చర్చనీయాంశమైంది. ‘కేసిఆర్ మళ్ళీ సీఎం కాబోతున్నారు.పార్టీ శ్రేణులు,ప్రజలు అధైర్య పడొద్దు.వెయ్యి మంది తెలంగాణ బిడ్డలను బలి తీసుకున్న బలి దేవత సోనియాగాంధీ. రేవంత్ రెడ్డికి సిగ్గులేదు. సోనియాగాంధీని నాడు బలి దేవత అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు దేవత అంటున్నాడు.రేవంత్ రెడ్డి నీకు తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలుసా?తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ చేసిన ఘనత కేసిఆర్‌ది. కాంగ్రెస్‌కు ఓటువేసిన ప్రజలంతా తప్పు చేశామని భావిస్తున్నారు’అని ఎర్రబెల్లి అన్నారు. -
నేటి నుంచే పార్లమెంట్ సమరం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 20వ తేదీ వరకు జరిగే ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో అత్యంత ముఖ్యమైన వక్ఫ్ సవరణ బిల్లును జాబితాలో చేర్చారు. జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును మాత్రం పక్కనపెట్టారు. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరుగనున్న శీతాకాల సమావేశాలకు అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. ఈసారి సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే పార్లమెంట్లో సమావేశాల్లో ముందుగా ఇటీవల మరణించిన ఎంపీలకు సంతాపం తెలియజేశారు. తర్వాత కార్యకలాపాలు మొదలవుతాయి. వక్ఫ్ సవరణ బిల్లుపై జగదాంబికా పాల్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తన నివేదికను ఈవారం సమావేశాల చివరి రోజున పార్లమెంట్‌కు సమర్పించాల్సి ఉంది. దానిని పార్లమెంట్ పరిగణనలోకి తీసుకుని ఆమోదించే అవకాశాలున్నాయి. 26న పాత పార్లమెంట్ భవనంలోప్రత్యేక కార్యక్రమం భారతæ రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 26న పార్లమెంట్ ఉభయ సభలు కొనసాగవు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాత పార్లమెంట్ భవనం సంవిధాన్ సదన్‌లోని చారిత్రక సెంట్రల్ హాల్లో ఉభయ సభల ఎంపీలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ «ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదితరులు హాజరవుతారు. ఈ సందర్భంగా స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్‌తోపాటు సంస్కృతం, మైథిలీ బాషలతో కూడిన భారత రాజ్యాంగ ప్రతులను విడుదల చేస్తారు. ‘అదానీ, మణిపూర్’పై చర్చించాలి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డాతోపాటు 30 పారీ్టల నేతలు పాల్గొన్నారు. అదానీపై గ్రూప్‌పై ఆరోపణలు, మణిపూర్ సంక్షోభం, వాయుకాలుష్యం, రైలు ప్రమాదాలపై విస్తృతంగా చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. భేటీ అనంతరం రిజిజు మీడియాతో మాట్లాడారు. అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఉభయ సభలు సజావుగా సాగేందుకు విపక్షాలన్నీ సహకరించాలని కోరారు. -
జమిలి ఎన్నికలంటూ.. దోచుకోవడానికి టీడీపీ సిద్ధమైందా?: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,తాడేపల్లి : కూటమి నేతల దారుణాల్ని చూసి తాము టీడీపీకి ఎందుకు ఓటు వేశామా? అని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. జమిలి ఎన్నికలపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో కూటమి ప్రభుత్వ పాలనపై ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.ఎక్స్ వేదికపై ఎంపీ విజయసాయిరెడ్డి ఏమన్నారంటే.. ‘టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగు తమ్ముళ్ల, దందాలు, దోపిడీలు, మోసాలు, హత్యలు చూసి టీడీపీకి ఎందుకు వేశామా అని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా..? ఏపీలో ఏదో రకంగా నాలుగున్నర సంవత్సరాలు బతికి బట్టకట్టాలని, టీడీపీ తాపత్రయమా..? ఏపీలో ఏదో రకంగా నాలుగున్నర సంవత్సరాలు బతికి బట్టకట్టాలని, టీడీపీ తాపత్రయమా..?జమిలి....జమిలి.. 2027లో ఎన్నికలంటూ సమాచారం వస్తున్న నేపథ్యంలో ఈ మూడు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దోచుకోవడంలో టీడీపీ నిమగ్నమైందా ? టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగు తమ్ముళ్ల, దందాలు, దోపిడీలు,…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 4, 2024 జమిలి.. జమిలి.. 2027లో ఎన్నికలంటూ సమాచారం వస్తున్న నేపథ్యంలో ఈ మూడు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దోచుకోవడంలో టీడీపీ నిమగ్నమైందా ? టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగు తమ్ముళ్ల, దందాలు, దోపిడీలు, మోసాలు, హత్యలు చూసి టీడీపీకి ఎందుకు వేశామా అని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా..?కూటమి పార్టీల ముఖ్యనాయకులు, కార్యకర్తల మధ్య సయోధ్య లేక అవినీతి దొంగసొమ్ము వాటాలు పంచుకోవడంలో అంతర్గత కుమ్ములాటలతో ఐదునెలల పాలనలోనే ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో మతిమరుపు వ్యాధితో చంద్రబాబు సతమతమౌతూ లోకేష్‌ని ముఖ్యమంత్రిని చేసే ప్రయత్నంలో ఉన్నారా ?అరాచకాలకు పాల్పడుతున్న క్యాడర్, క్రమశిక్షణ లేని ఎమ్మెల్యేలు మంత్రులు, నిద్రాణవస్థలోకి చేజారిన అధికార యంత్రాంగం వల్ల చంద్రబాబు కేంద్రానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారా? ’ అని ట్వీట్లో పేర్కొన్నారు. -
YS Jagan: ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు..
-
అధికారులు జాగ్రత్త .. జమిలి ఎన్నికలు వస్తాయ్ ..
-
జమిలి ఎన్నికలపై కాకాణి కీలక వ్యాఖ్యలు
సాక్షి, నెల్లూరు జిల్లా: జమిలి ఎన్నికలపై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2027లో జమిలి ఎన్నికలు వస్తే రెండేళ్లు మాత్రమే టీడీపీ అధికారంలోకి ఉంటుందన్నారు. టీడీపీ నేతల మాటలు వింటే అధికారులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.చంద్రబాబు లిక్కర్ మాఫియాపై కాకాణి మాట్లాడుతూ.. లాటరీ విధానంలో వైన్‌షాప్‌ల కేటాయింపులో 90 శాతం మద్యం దుకాణాలు టీడీపీ నేతలకే దక్కాయని, ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే లాటరీ ప్రక్రియ కొనసాగిందని, అంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని మండిపడ్డారు. వైన్‌షాప్‌ల్లో మొత్తం ఎల్లో సిండికేట్‌దే దందా అని, రాష్ట్రంలో ఇప్పటికే ఇసుక, గ్రావెల్, విద్య, వైద్యంలో సిండికేట్స్‌దే రాజ్యం కొనసాగుతోందని, యథేచ్ఛగా దోపిడి జరుగుతోందని ఆయన తెలిపారు.ముందస్తు ప్రణాళికలతో దోచుకోవడంతో బాబు నేర్పరి అన్న కాకాణి, చంద్రబాబు, ఎల్లో బ్యాచ్ బాగు కోసమే మద్యం పాలసీ ప్రకటించారని, ఇప్పుడు వైన్ షాప్‌ల కేటాయింపు తర్వాత అదే తేటతెల్లం అయిందని చెప్పారు. డిస్టిల్లరీలన్నీ టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే ఉన్నాయన్న మాజీ మంత్రి, చీప్ లిక్కర్‌ను తక్కువ ధరకు ఇస్తూ, ఇతర మద్యాన్ని ఎక్కువ ధరకు అమ్ముతారని.. నాసిరకం, పనికిరాని మద్యాన్నే తక్కువ ధరకు సరఫరా చేస్తారని చెప్పారు. బెల్ట్ షాప్స్ కూడా పుట్టగొడుగుల్లా రాబోతున్నాయన్న ఆయన, భవిష్యత్తులో మద్యాన్ని డోర్ డెలివరి కూడా చేస్తారని అభిప్రాయపడ్డారు. లిక్కర్ పాలసీతో సీఎం చంద్రబాబుకు, కూటమి నాయకులకు కిక్కెక్కుతుందేమో కానీ, తాగేవాడికి మాత్రం కక్కు రావడం ఖాయమని స్పష్టం చేశారు. వైన్‌షాప్‌లు దక్కించుకున్నవారు సిండికేట్లుగా మారి 60–40 లెక్కల్లో వాటాలు పంచుకుంటున్నారని ఆక్షేపించారు.లిక్కర్ షాప్‌ల కేటాయింపుల్లో సీఎం చంద్రబాబు మూడంచెల దోపిడీ విధానాన్ని అమలు చేస్తున్నారని కాకాణి దుయ్యబట్టారు. రాష్ట్ర స్థాయిలో సీఎం, నియోజకవర్గ స్థాయిల్లో ఎమ్మెల్యేలు, గ్రామ స్థాయిలో బెల్ట్ షాపులతో కిందిస్థాయి నాయకులు దోచుకుంటారని ఆరోపించారు. అందుకే వైన్‌షాప్‌ల డ్రా కు అవి ఎక్కడ ఉండాలనేది ప్రకటించలేదని గుర్తు చేశారు. ఇకపై మద్యం రేట్లతో పాటు, విక్రయ వేళల్ని కూడా నాయకులే నిర్ణయిస్తారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ ద్వారా వచ్చిన ప్రతి రూపాయి ప్రభుత్వ ఖజానాకే చేరిందన్న మాజీ మంత్రి, ఇప్పుడు టీడీపీ కూటమి పాలనలో లిక్కర్ సిండికేట్లు ఆ ఆదాయాన్ని పంచుకుంటున్నారని ఆరోపించారు.ఇదీ చదవండి: ‘ముఖ్య’ నేత మాటే ఫైనల్.. మాఫియాదే రాజ్యం -
జమిలి ఎన్నికల ఆలోచనను విరమించుకోండి: కేరళ తీర్మానం
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించటంపై ఆలోచనను విరమించుకోవాలని కేరళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం కేరళ అసెంబ్లీలో సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం తీర్మానం చేసింది. ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం అప్రజాస్వామికం, దేశ సమాఖ్య నిర్మాణానికి హానికరమని తీర్మానంలో పేర్కొన్నారు.Kerala Legislative Assembly passed a resolution urging the central government to withdraw its proposed 'One Nation, One Election' reform, describing it as undemocratic and detrimental to the nation's federal structure.— ANI (@ANI) October 10, 2024కొన్నేళ్ళుగా చెబుతూ వస్తున్న ‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’ ప్రతిపాదనపై కేంద్రంలోని అధికార బీజేపీ ఇటీవల మరో అడుగు ముందుకు వేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని కమిటీ ఈ ప్రతిపాదనపై ఇచ్చిన నివేదికను ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం లాంఛనంగా ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనపై ఓ బిల్లును రానున్న పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు భోగట్టా.ఈ ప్రతిపాదనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీతో రాజ్యాంగ సవరణలు అవసరం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతిపాదనను కేంద్రంతో పాటు రాష్ట్రాలూ ఆమోదించాల్సి ఉంటుంది. వెరసి, రాజ్యాంగపరంగానూ, ఆచరణలోనూ అనేక అవరోధాలున్న ఈ ప్రతిపాదనపై రాగల నెలల్లో పెద్దయెత్తున రచ్చ రేగడం ఖాయం. -
జమిలి ఎన్నికలకు మద్దతివ్వాలి
సాక్షి, అమరావతి: జమిలి ఎన్నికలకు దేశం మొత్తం మద్దతు తెలపాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానం వల్ల ప్రజలకు, రాష్ట్రాలకు మేలు జరుగుతుందని చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో మీడియాతో బుధవారం మాట్లాడుతూ.. హరియాణాలో మూడోసారి బీజేపీ గెలవడం కేంద్ర సుపరిపాలనకు నిదర్శనమన్నారు. జమ్మూకశ్మీర్‌లో బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందన్నారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే గత ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన నష్టం ఎక్కువని చెప్పారు. రాబోయే రోజుల్లో ఒక్క ఏపీలోనే రూ.75 వేల కోట్లను ఒక్క రైల్వే మౌలిక సదుపాయాల కోసమే ఖర్చు చేస్తున్నారని తెలిపారు. బెంగళూరు–చెన్నయ్–అమరావతి–హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలను కలిపేలా బుల్లెట్ రైలు తెచ్చే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. కేంద్ర మంత్రుల్ని కలిసి చర్చిస్తా విశాఖ రైల్వే జోన్, 90–95 రైల్వే బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిలతోపాటు అమరావతి అవుటర్ రింగ్‌రోడ్డు, విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణంపై కేంద్ర మంత్రులతో చర్చించానని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదన్నారు. బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ కోసం రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాలను పరిశీలిస్తున్నారని, దాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. వరద సాయం చాలామందికి వెళ్లలేదు వరద సాయం చాలామందికి వెళ్లలేదని చంద్రబాబు అన్నారు. చివరివరకూ సాయాన్ని అందించలేకపోయామని ఒప్పుకున్నారు. కచ్చితంగా 5,10 శాతం వేస్ట్ అవుతుందని, దానికి ఎవరూ ఏమీ చేయలేరని తెలిపారు. అగ్గిపెట్టెలు ఇవ్వలేదనడం సిగ్గుచేటన్నారు. ప్రకాశం బ్యారేజీని బోట్లతో గుద్దించి ధ్వంసం చేయాలనుకున్న వాళ్లు తమను విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. తిరుమల బ్రహ్మోత్సవాలు, దసరా ఉత్సవాలు ఎంతో కన్నుల పండువగా జరుగుతున్నాయని, గత ఐదేళ్లలో ఎప్పుడైనా ఇలా జరిగాయా అని ప్రశ్నించారు. -
సమాఖ్యకు ‘జమిలి’ సవాళ్లు!
జమిలి ఎన్నికల వల్ల దేశానికీ, ప్రజాస్వామ్యానికీ ఎంతవరకు ఉపయుక్తం అనే దానిపై చర్చ జరుగుతోంది. లోక్‌సభ నుంచి అన్ని రాష్ట్రాల శాసనసభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు అనుకూలంగా ఎన్ని వాదనలున్నాయో, వ్యతిరేకంగా అన్ని వాదనలున్నాయి. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలకు అయ్యే ఖర్చు, వేర్వేరు సమయాల్లో జరిగే అనేక ఎన్నికల ఖర్చు కంటే తక్కువగా ఉంటుంది. కానీ అలా పొదుపు చేసే మొత్తం భారత్ లాంటి పెద్ద దేశానికి ఒక లెక్కలోకే వస్తుందా? అలాంటి ఎన్నికల వల్ల స్థానిక సమస్యల కంటే జాతీయ సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యం లభించదా? బహుళ పార్టీ వ్యవస్థను ఒకే పార్టీ గల దేశం వైపు నెట్టదా? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు.నాకు తెలిసిన చాలామంది లాగే మీరు కూడా ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ను అర్థం చేసుకోవటానికి తన్నుకులాడుతుంటే కనుక మీకు సహాయం చేయటానికి నన్ను ప్రయత్నించనివ్వండి. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అనే భావనను ప్రతిపాదించినవారు, దానిని వ్యతిరేకిస్తున్నవారు తమ అనుకూల, ప్రతికూల వాదనలతో మనల్ని ముంచెత్తారు. కానీ లాభ నష్టాల నడుమ దీనిపై మనమెలా ఒక తీర్పుకు రాగలం? ఈ వాదోపవాదాలన్నీ సముచితమైనవేనా? లేదా కొన్ని మాత్రమే మిగతా వాటి కంటే ప్రాముఖ్యమైనవా? ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే ఈ భావనకు మద్దతు లభించటానికి గల కారణాలతో విషయాన్ని ప్రారంభిద్దాం. మొదటిది – డబ్బు ఖర్చు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలకు అయ్యే ఖర్చు, వేర్వేరు సమయాల్లో జరిగే అనేక ఎన్నికలకు అయ్యే ఖర్చు కంటే తక్కువగా ఉంటుందనటంలో సందేహం లేదు. అయితే అలా పొదుపు చేసే మొత్తం ఏడాదికి రూ. 5000 కోట్ల కన్నా తక్కువేనన్నది శశి థరూర్, ప్రవీణ్ చక్రవర్తిల వాదన. ఇండియా వంటి భారీ ఆర్థిక వ్యవస్థకు ఇదేమంత తేడా చూపే మొత్తం అవుతుందని?రెండవ కారణం – ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఆంక్షలు పరిమిత కాలానికి మాత్రమే వర్తింపులో ఉంటాయి కనుక రాజకీయ నాయకులు తమను తాము పాలనా వ్యవహారాలలో నిమగ్నం చేసు కోవచ్చు. అయితే ప్రవర్తనా నియమావళి అన్నది జాతీయ స్థాయిలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే అమలులో ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో అదొక పెద్ద విషయమే అవదు. మళ్లీ ప్రశ్న, ఇదేమంత ముఖ్యమైన కారణం అవుతుందని?నిజమేమిటంటే, పై రెండూ కూడా చెప్పుకోదగిన కారణాలు కావు. ప్రజాస్వామ్యపు అత్యంత ముఖ్యమైన వ్యక్తీకరణ... ఎన్నికలు. వాటి నిర్వహణకు అయ్యే వ్యయాన్ని బట్టి, లేదా అవి సజావుగా జరిగేందుకు అవసరమైన నియమావళిని బట్టి ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే భావనలోని లాభనష్టాలను చర్చించకూడదు. ఇప్పుడు మనం వ్యతిరేక వాదనల్లోకి వద్దాం. మొదటిది – ఇది మన దేశ విలక్షణతకు విరుద్ధం అవుతుందా? మనది ఒకే దేశం–ఒకే మతం కాదు. ఒకే దేశం–ఒకే భాష కాదు. ఒకే దేశం–ఒకే సంస్కృతి కాదు. ఒకే దేశం–ఒకే విధమైన మరేదీ కాదు. మన వ్యత్యాసాలనే మన సంపదలుగా మలుచుకున్న రాష్ట్రాల సమాఖ్య మన దేశం. ఆ వ్యత్యాసాలు, సంపదలే మనల్ని ప్రత్యేకంగా ఉంచుతాయి. మనకు ప్రాముఖ్యం కల్పిస్తాయి. మరి ఒకే దేశం–ఒకే ఎన్నిక అన్నది ఆ ప్రత్యేకతలు, ప్రాముఖ్యాల నుంచి మన దేశాన్ని దూరం చేయదా? దీని గురించి జాగ్రత్తగా ఆలోచించండి. రెండవది – ఒకే దేశం–ఒకే ఎన్నిక వల్ల స్థానిక సమస్యల కంటే జాతీయ సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యం లభించే ప్రమాదంఉంటుందా? అలా జరిగితే – జరుగుతుందనే నా అనుమానం – అది దేశ సమాఖ్య నిర్మాణాన్ని ఏకీకృత వ్యవస్థగా మార్చే ధోరణి కలిగి ఉండదా? వెంటనే కాకపోయినా, కాలక్రమేణా అలా జరిగే అవకాశం అయితే ఉంటుంది. దీనివల్ల చిన్న రాష్ట్రాల ప్రాంతీయ ఆందోళనలు కేంద్రస్థాయి జాతీయ డిమాండ్లలో కొట్టుకుని పోతాయి. గోవా, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్, పుదుచ్చేరి, ఈశాన్య రాష్ట్రాల నిరసన గళాలు ఢిల్లీ రణగొణ ధ్వనుల్లో తేలిపోతాయి. మూడవది – పార్లమెంటరీ ఎన్నికలు క్రమంగా అధ్యక్ష తరహా ఎన్నికలుగా మారినప్పుడు ఒకే దేశం–ఒకే ఎన్నిక అన్నది ఆ ధోరణిని మరింత తీవ్రతరం చేసే ప్రమాదం లేదా? అదే జరిగితే, అది మన బహుళ పార్టీ వ్యవస్థను ఒకే పార్టీ గల దేశం వైపు నెట్టదా? ఇది అర్థవంతమైన భయమే అయితే దీనిని తేలిగ్గా తీసుకోవలసిన అవసరం లేదు. ఇదంతా కూడా మన రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘనకు గురి చేయగలిగినదే. ఇది ఎంతవరకు జరుగుతుంది అనేది ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే భావనలోని పర్యవసానాలపై ఆధారపడి ఉంది. అయితే మరొక విషయం కూడా ఉంది. మనం మన ప్రజాస్వామ్యాన్ని మరింత విస్తృతంగా, వేళ్లూను కునేలా చేసుకోవలసిన అవసరం అది. నిజానికి 50 ఏళ్ల క్రితమే అటల్ బిహారి వాజ్‌పేయి ‘రైట్ టు రీకాల్’ (పదవుల్లో ఉన్నవారిని తొలగించే హక్కు)ను కోరు కున్నారు. దానికి పూర్తి భిన్నమైనది ఈ ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’. ఓటు వేసే అవకాశాన్ని పరిమితం చేయటం ద్వారా మన ప్రజాస్వామ్యాన్ని ఇది కురచబారుస్తుంది. ఇంకోలా చెప్పాలంటే, వెళ్లవలసిన మార్గాన్ని వెనక్కి తిప్పుతుంది.ఇంకొక సమస్య ఉంది. వాస్తవంలో ఎదురుకాగల సమస్య అది. ఒకవేళ ప్రభుత్వం ఐదేళ్ల కాల పరిమితి కంటే ముందు గానే తన మెజారిటీని కోల్పోతే ఏం జరుగుతుంది? మిగిలిన కాలానికి మాత్రమే ఎన్నికలను నిర్వహించాలని రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సూచిస్తోంది. కానీ అది ఐదేళ్ల కాలానికి ఓటరు ఇచ్చిన తీర్పును పలుచబార్చదా? కొన్నిసార్లు వాళ్లు ఐదేళ్ల ప్రభుత్వానికి ఓటు వేస్తారు. మరికొన్ని సార్లు ఒకటీ లేదా రెండేళ్ల ప్రభుత్వానికి ఓటేస్తారు. ఈ విధంగా మనం ఓటు విలువను యథేచ్ఛగా తగ్గించటం లేదా?ఉప ఎన్నిక అవసరమైన ప్రతిసారీ నిస్సందేహంగా ఇలాగే జరుగుతుంది కానీ... వ్యక్తికి ఓటేయటానికి, మొత్తం అసెంబ్లీకో, పార్లమెంటుకో ఓటేయటానికి తేడా లేదా? ఆలోచించదగిన ప్రశ్నే ఇది. నిజానికి, మధ్యంతర ఎన్నికలకు కారణమయ్యేవి ఏవీ లేకుండా పోవు. ఇంకా అనేక కారణాల వల్ల కూడా ముందస్తు ఎన్నికలు రావచ్చు. ఈ విధంగా ఎన్నికైన ప్రభుత్వాలు ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు వీలుగా తక్కువ కాల పరిమితిని కలిగి ఉంటాయి. ఈ కోణంలోంచి చూస్తే ‘ఒకే దేశం–ఒకే’ ఎన్నిక వల్ల ఏం తేడా కనిపిస్తున్నట్లు? చెప్పాలంటే మనం మరిన్ని ఎన్నికలకు వెళ్లటం అవుతుంది తప్ప, తక్కువ ఎన్నికలకేం కాదు. కనుక, అంతిమంగా నేను చెబుతున్నదేమిటి? అది మీతో చెప్ప టానికి సంకోచిస్తున్నాను. ఏమైనా, నా అభ్యంతరాలన్నీ ఇక్కడ స్పష్టంగానే వ్యక్తం అయ్యాయి. మీరు నా మార్గదర్శకత్వాన్ని కోరుకుంటే కనుక అందుకు చాలినంతగానే రాసేశాను. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అస్థిరమైనా ప్రజాస్వామ్యమే మేలు!
జమిలి ఎన్నికల గురించిన చర్చ నేడు దేశంలో వాడిగా, వేడిగా జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. ఆ మేరకు కేంద్ర క్యాబినెట్ కూడా జమిలి ఎన్నికలకు ఆమోద ముద్ర వేసింది. అయితే ఇటు ప్రజలలోనూ, అటు అనేక రాజకీయ పక్షాలలోనూ అనేక ప్రశ్నలు ఉన్నాయి. జమిలి ఎన్నికల ప్రక్రియ అనేది ఎన్నికల వ్యయాలు, రాజకీయ సుస్థిరతలకు సంబంధించిన అంశం కానే కాదు. ప్రజా తీర్పుల భయం లేకుండా ఐదేళ్లు పాలించడానికి మాత్రమే ఈ ప్రక్రియ ఉపయోగపడగలదు. రాజకీయ పక్షాలను అదుపు చేసేందుకు ప్రజలకు ఉన్న కాస్తంత అవకాశాన్ని కూడా లేకుండా చేయగలదు.జమిలి ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగ పరమైన లోతుపాతులూ, సాధ్యా సాధ్యాలూ వంటి అంశాలను కాసేపు పక్కన పెడదాం. జమిలి ఎన్ని కల అనుకూల వాదనలకు ప్రాతిపదికగా వున్న కొన్ని అంశాలను చూద్దాం. జమిలి ఎన్నికల వలన పదే పదే ఎన్నికలు జరిగే పరిస్థితి పోయి, ఆ మేరకు నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి అనేది ఒక వాదన. దేశంలో రాజకీయ సుస్థిరత నెలకొంటుందనేది మరో వాదన. 2019 పార్లమెంటరీ ఎన్నికలకు గాను, దేశ వ్యాప్తంగా అయిన మొత్తం ఖర్చును సుమారుగా 50 వేల కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. 2024ల ఎన్నికల ఖర్చు, 2019 నాటి కంటే రెట్టింపై అది సుమారుగా 1–1.35 లక్షల కోట్ల రూపాయల మేరకు ఉంది. ఈ ఖర్చులను పైపైన చూస్తే , ఎన్నికల పేరిట చాలా పెద్ద మొత్తంలోనే డబ్బు ఖర్చయిపోతోందని అనిపించక మానదు. కానీ, దీన్ని ప్రభుత్వ లేదా ఎన్నికల కమిషన్ వ్యయాలు... పార్టీలు, అభ్యర్థుల వ్యయాలుగా విడగొట్టి చూస్తే వాస్తవం మెరుగ్గా అర్థం అవుతుంది. 2019లోని ఎన్నికల ఖర్చులో, ఎన్నికల కమిషన్ వాటా కేవలం 15% అనేది గమనార్హం. అంటే, 7,500 కోట్ల రూపాయలు మాత్రమే. ఇదే లెక్క ప్రకారం, 2024లో ఎన్నికల మొత్తం వ్యయంలో 15 వేల కోట్ల రూపా యలు మాత్రమే ఎన్నికల కమిషన్ ప్రభుత్వ వ్యయంగా ఉంది. ఎన్నికల వ్యయాలలో సింహభాగం నిజానికి ప్రైవేటు అభ్యర్థులది. దీని వలన, అటు దేశ ఖజానాకో, ప్రజల పన్ను డబ్బుకో వచ్చి పడిన ముప్పేమీ లేదు.సమస్య నాయకులకే!నిజానికి, రాజకీయాలు వ్యాపారంగా మారిన నేటి కాలంలో, అభ్యర్థులు చేసే ఈ ఖర్చులు, జనం డబ్బును తిరిగి జనానికి చేరుస్తు న్నాయి. ఈ కోణం నుంచి ఆలోచిస్తే, పదే పదే ఎన్నికలు రావడం వలన జనానికి వచ్చిపడే నష్టం ఏమీ లేదు. అది కేవలం రాజకీయ నాయకుల సమస్య. 2024 ఏప్రిల్– జూన్ కాలంలో (2024–25 ఆర్థిక సంవత్సరం తాలూకు తొలి త్రైమాసికం) దేశ ఆర్థిక వ్యవస్థ, సుమారు 21 నెలల మందగమనం తర్వాత, కొంత కోలుకోవడాన్ని గమనించొచ్చు. ఆ కాలంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు, దాని తాలూకు ఖర్చులు ఒక రకంగా దేశ ఆర్థిక వ్యవస్థకూ, ప్రజల కొనుగోలు శక్తికీ ఉద్దీపనలుగా పని చేశాయి. బాడుగ కార్లు మొదలుకొని, బ్యానర్లు, పోస్టర్లు, పబ్లిక్ మీటింగ్‌ల ఖర్చులు, సోషల్ మీడియా ప్రచార ఖర్చులు... వీటితో పాటుగా ఎటుకూడి ‘ఓటుకు నోటు’ను జనానికి అలవాటు చేశారు కాబట్టి, ఆ వ్యయాలు కూడా కలగలిపి దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఉద్దీపన కావడంలో ఆశ్చర్యం లేదు.ఎన్నికలలో ఓట్లను కొనుగోలు చేసిన అనేక మంది రాజకీయ నేతలు గెలిచాక ప్రజలకు అందుబాటులో లేకుండా పోయే పరిస్థితులు దాపురించాయి. కాబట్టి, జమిలి ఎన్నికల రూపంలో ఐదు సంవత్స రాల సుస్థిర పాలనను హామీ చేసుకోవడం అనేది అటు అభ్యర్థులకూ, ఇటు పాలక పార్టీలకూ వెసులుబాటుగానే కనపడినా... అది ప్రజలకు మాత్రం సుదీర్ఘకాల సాధికారత లేని స్థితినీ, పరిపాలన బాగా లేకున్నా భరించక తప్పని స్థితినీ తెచ్చిపెడుతుంది. ఇక్కడి ప్రశ్న రాజకీయ నాయకులకూ, పాలక పార్టీలకూ వాటి పాలనా అధికార వ్యవధిని గ్యారెంటీ చేసే జమిలి ఎన్నికలు మెరుగా? లేదా... ప్రజలకు ఎంతో కొంత నేతల అందుబాటునూ, సాధికారతనూ హామీ చేసే సజీవమైన అస్థిరతే మెరుగా అన్నది!కాలవ్యవధికి గ్యారెంటీయా?మన దేశంలో ఉన్నది ప్రధానంగా పార్లమెంటరీ వ్యవస్థ. మన లోక్ సభ, రాజ్య సభలకు తరచుగా మధ్యంతర ఎన్నికలు వస్తూనే ఉండటం తెలిసిందే. గెలిచిన అభ్యర్థుల మరణాలు, వారి రాజీనా మాలు తదితర అనేక కారణాల వలన కూడా మధ్యంతర ఎన్నికలు వస్తూ ఉంటాయి. కాబట్టి, జమిలి ఎన్నికల పేరిట ఐదేళ్ల పాటు నికరంగా, సుస్థిరంగా పాలించి తీరగలమన్న ఆశ అంత వాస్తవికమై నదేమీ కాదు. పదే పదే ఎన్నికలు రాకుండా నివారించగలిగితే, పాలక పక్షాలు అనేక విధాన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోగలుగుతాయన్న వాదన కూడా ఉన్నది. ఇది కేవలం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకోవడంలో పాలక పక్షాలకు కావలసిన సుస్థిర పాలనను హామీ చేసే వాదన మాత్రమే. నిజానికి, గతం నుంచి ఇటువంటి వాదన వేరొక రూపంలో ఉంది. ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పక్షాలు ఏ విధంగా పరస్పరం ఆరోపణలూ, ప్రత్యారోపణలూ చేసుకున్నా, ఎన్నికల అనంతరం అటు పాలక పక్షం... ఇటు ప్రతిపక్షమూ రెండూ కలగలిసి దేశ అభ్యున్నతికి పాటు పడాలి అన్నది. ఈ వాదన పూర్తిగా అసంబద్ధమైనది. అధికార పక్షం తాను ప్రాతినిధ్యం వహించే వర్గాల, సమూహాల ప్రయోజనాల కోసం పని చేస్తూ పోతుంటే... మరో పక్కన, భిన్నమైన ప్రయోజనాలు వున్న సామాజిక వర్గాలు, సమూ హాలకు ప్రాతినిధ్యం వహించే ప్రతిపక్షాలు అనివార్యంగా పాలక పక్షంతో తలపడక తప్పని స్థితి ఉంటుంది. ఉదాహరణకు, ఒక ప్రభుత్వం కార్మిక చట్టాలను సంస్కరించటం పేరిట, యజమానులు లేదా పెట్టు బడిదారులకు అనుకూలమైన విధానాలను తెచ్చే ప్రయత్నం చేస్తే, అది సహజంగానే కార్మికులకు ప్రాతినిధ్యం వహించే పక్షాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. సుస్థిరత పేరిట ప్రభు త్వాలకు ఆ ఐదు సంవత్సరాల కాల వ్యవధిని గ్యారెంటీ చేయడం ఆ ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించని ఇతరేతర వర్గాలకు నియంతృత్వంగానే పరిణమించగలదు. సుస్థిర నియంతృత్వమా? అస్థిర ప్రజాస్వామ్యమా?నేడు సంస్కరణల పేరిట అమలు జరుగుతోన్న విధానాల క్రమంలో, పేద ప్రజలకూ, సామాన్య జనానికీ ఇచ్చే సబ్సిడీలు లేదా రాయితీలపై నిరంతరంగా కోతలు పడుతున్నాయి. ప్రధాని మోదీనే స్వయంగా ‘రేవడి సంస్కృతి’ (ఉచితాల సంస్కృతి)పై చర్చ జరగా లంటూ చెప్పడాన్ని గమనించవచ్చు. ఈ సంక్షేమ వ్యయాలు లేదా ‘ఉచితాల’ గురించిన చర్చ అంతిమంగా అనేక దేశాలలో పొదుపు చర్యల రూపంలో ఆర్థిక మాంద్య స్థితికీ, అస్థిరతకూ కారణం కావడాన్ని కళ్ళ ముందే చూస్తున్నాం. గతంలో, అనేక లాటిన్ అమెరికా దేశాలలోనూ... యూరోప్‌లోని గ్రీస్‌లోనూ... ఈ మధ్య కాలంలోనే ఆసియా ఖండంలోని శ్రీలంక, పాకిస్తాన్ వంటి దేశాలలోనూ సామాన్య జనానికి కల్పించే రాయితీలను పొదుపు చర్యల పేరిట తగ్గించి వేయడం ఏ విధంగా సామాజిక విస్పోటనాలకూ, పోరా టాలకూ దారి తీసిందో చూశాం. ఇటువంటి, ప్రజా వ్యతిరేక, సంక్షేమ వ్యతిరేక నిర్ణయాలను మధ్య మధ్యలో వచ్చి పడే ఎన్నికల లేదా ప్రజా తీర్పుల భయం లేకుండా ఐదేళ్ల పాటు నిరాఘాటంగా తీసుకోగలిగే టందుకు మాత్రమే ఈ జమిలి ఎన్నికల ప్రక్రియ ఉపయోగపడ గలదు. కాబట్టి, ఇప్పటికే ప్రజలకు దూరమైన రాజకీయ వ్యవస్థలో రాజకీయ పక్షాలు, రాజకీయ నేతలను అదుపు చేయగలిగేటందుకు ప్రజలకు ఉన్న కాస్తంత అవకాశాన్ని కూడా, ఈ జమిలి ఎన్నికలు లేకుండా చేసేయగలవు. జమిలి ఎన్నికల ప్రక్రియ అనేది కేవలం ఎన్నికల వ్యయాలు లేదా రాజకీయ సుస్థిరతలకు సంబంధించిన అంశం కానే కాదు. అది, దేశ రాజకీయాలపై సామాన్య జనానికి పట్టు వుండాలా... లేదా కార్పొ రేట్లు, ధనవంతులు లేదా వారి అనుకూల రాజకీయ పక్షాలకు పట్టు ఉండాలా అనే అంశానికి సంబంధించింది అనేది సుస్పష్టం. సుస్థిర ప్రజా వ్యతిరేక పాలన కంటే, నిరంతరంగా ప్రజలకు లోబడిన, వారికి లొంగి వుండే అస్థిర రాజకీయ వ్యవస్థే మేలు.డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులుమొబైల్: 98661 79615 -
జమిలి ముసుగులో దేశాన్ని కబళించే కుట్ర
సాక్షి, హైదరాబాద్: జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబళించాలనే కుట్ర జరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల హక్కులను కాలరాసే విధంగా జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం నిర్ణ యించడం దారుణమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పోరాడాల్సిన అవసరం ఉత్పన్నమైందని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో సీపీఎం రాష్ట్ర శాఖ నిర్వహించిన సీతారాం ఏచూ రి సంస్మరణ సభలో సీఎం రేవంత్ పాల్గొని మా ట్లాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస వరకు పోరాడిన గొప్ప వ్యక్తి సీతారాం ఏచూరి అని.. ప్రజల సంక్షేమం కోసం పోరాటాలు, ఉద్యమాలు చేసిన ఆయన ప్రస్తుతం తరానికి ఎంతో ఆదర్శమని రేవంత్ పేర్కొన్నారు. ఆధిపత్యం చలాయించే దిశగా.. ‘‘దేశంలో ఇప్పుడు అత్యంత కీలక సమయం ఆసన్నమైంది. జమిలి ఎన్నికలు నిర్వహించాలని ఎన్డీఏ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. జమిలి ఎన్నికల ద్వారా దేశంపై ఆధిపత్యం చలాయించాలనే దిశగా కుట్ర జరుగుతోంది. ఇలాంటి కీలక సమయంలో సీతారాం ఏచూరి మనమధ్య లేకపోవడం తీరని లోటు. దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తిని రగిలించిన ఆయన ఉండి ఉంటే జమిలి ఎన్నికలపై తీవ్ర పోరాటం నడిపేవారు.ఏచూరితో మాట్లాడినప్పుడు కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి గుర్తుకు వచ్చేవారు. దేశ రాజకీయాల్లో ప్రభావం చూపిన అత్యంత తక్కువ మంది తెలుగు వాళ్లలో ఏచూరి, జైపాల్‌రెడ్డి కీలకమైనవారు..’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. యూపీ ఏ పదేళ్ల పాలన సమయంలో సీతారాం ఏచూరి క్రియాశీలకంగా వ్యవహరించారని.. పేదలకు ఉపాధి కలి్పంచే ఉపాధి హామీ, సమాచార హక్కు, విద్యాహక్కు చట్టం వంటివి ఏచూరి మద్దతుతోనే ముందుకు సాగాయని చెప్పారు. కనీస విలువలు లేని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కనీస విలువలు లేకుండా వ్యవహరిస్తోందని రేవంత్ ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న నేత పట్ల చవకబారు భాషలో మాట్లాడుతున్నా ప్రధాని మోదీ స్పందించకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీపై కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తి అభ్యంతరకరంగా మాట్లాడటం బీజేపీ ఫాసిస్టు విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు. సీతారాం ఏచూరిపై రాసిన పుస్తకాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు.ఉద్యమ నేత ఏచూరి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి: కేటీఆర్ప్రజా ఉద్యమాలను నడిపిన గొప్ప వ్యక్తి సీతారాం ఏచూరి అని.. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటులో భిన్నాభిప్రాయంతో ఉన్నా, ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డగా తమతో రక్త సంబంధం ఉందన్నారు. సీతారాం ఏచూరి నమ్మిన సిద్దాంతం కోసం జీవితాంతం పోరాడారని కొనియాడారు. ఫిరాయింపుల కాలంలో పదవుల కోసం కాకుండా, ప్రజా సమస్యలపైనే పోరాటం చేసిన గొప్ప నాయకుడని చెప్పారు. తి ట్లు, బూతులు చలామణీ అవుతున్న ప్రస్తుత రాజకీయాల్లో ఏచూరి ప్రసంగాలు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు.అసలు సిసలైన హైదరాబాద్ బిడ్డ ఆయన అని.. ఓట్ల రాజకీయంలో వెనుకబడినా, ప్రజల కోసం పోరాటంలో ముందున్నామని చాటిన గొప్ప వ్యక్తి అని చెప్పారు. ఎమర్జెన్సీ తర్వాత ఇందిరా గాం«దీని జేఎన్‌యూ వీసీ పదవి నుంచి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఏచూరి గుండె ధైర్యం ఏంటో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ ఐఏ ఎస్ అధికారి మోహన్‌కందా, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్యేలు మా గంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
జమిలి ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం సీతారాం ఏచూరి సంస్మరణ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన రేవంత్ మాట్లాడుతూ.. జమిలి ఎన్నికల ముసుగులో కొందరు దేశాన్ని కబలించాలనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏచూరి లేకపోవడం తీరని లోటు. ఏచూరి చూపిన మార్గంలో జమిలి ఎన్నికలను అడ్డుకుంటాం.. పోరాడతాం అని అన్నారాయన. జమిలి ఎన్నికలతో అధికారం కాపాడుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. రాజ్యాంగ మార్పులు, సవరణల విషయంలో ఆ పార్టీ ఎలా వ్యవహరిస్తుందో చూస్తున్నాం. దేశ ఐక్యతను బీజేపీ దెబ్బ తీయాలని చూస్తోంది. దీనికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలి’’ అని రేవంత్ పిలుపుచ్చారు. ‘‘దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తికి సీతారాం ఏచూరి కృషి చేశారు. పేదల కోసం పాటు పడ్డారు. జీవితకాలం నమ్మిన సిద్దాంతం కోసం కట్టుబడి ఉండే వ్యక్తులు అరుదు. రాహుల్‌గాంధీతో సీతారాం ఏచూరికి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. దశబ్దాలపాటు పేదల సమస్యలపై సీతారాం ఏచూరి కృషి చేశారు’’ అని రేవంత్ గుర్తు చేశారు. అంతకు ముందు.. సీతారాం ఏచూరి చిత్రపటానికి కేటీఆర్, తమ్మినేని నివాళులర్పించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజల కోసం పనిచేసి సీతారాం ఏచూరి చిరస్థాయిగా నిలిచారు. ప్రస్తుతం నేతలు పదవుల చుట్టూ పరిభ్రమిస్తున్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరివరకు సీతారాం ఏచూరి నిలబడ్డారు అన్నారు. రేవంత్ రాకముందే కేటీఆర్ ఎగ్జిట్ఒకేవేదికపై రేవంత్, కేటీఆర్ ఉంటారని తొలుత చర్చ నడిచింది. అయితే సభ ప్రారంభ సమయంలోనే కేటీఆర్ మాట్లాడి వెళ్లిపోయారు. కేటీఆర్ వెళ్లిపోయాకే సభకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. అంతకు ముందు.. కోదండరాం పక్కనే కూర్చున్న కేటీఆర్ మాట కూడా మాట్లడలేదు. కేటీఆర్ తన ప్రసంగం ముగిశాక.. అప్పుడు కోదండరాం పలకరించారు. -
జమిలి ఎన్నికల నిర్వహణకు కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం çపనిచేస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. జమిలి ఎన్నికలు నిర్వహించాల ని నిర్ణయించడం స్వాగతించదగిన పరిణామమన్నారు. జమిలి ఎన్నికల విషయంలో కేబినెట్ నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చకు ప్రోత్సహించడం, జమిలి ఎన్నికల నిర్వహణ అమలు కోసం కేంద్రం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేస్తుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్న పార్టీలు కూడా త్వరలోనే దీనికి సహకరిస్తాయనే విశ్వాసం తనకుందని తెలిపారు.దేశవ్యాప్తంగా ఐదేళ్లపాటు ఏదో ఒకచోట ఎన్నికలు జరుగుతున్నందున.. కోడ్ అమల్లో ఉండటం తద్వారా విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేక ప్రభుత్వ నిర్ణయాలకు ఆటంకంగా మారాయన్నారు. కొన్నిసార్లు ప్రభుత్వాలు సాధారణ నిర్ణయాలు కూడా తీసుకోలేని పరిస్థితి ఉందని గుర్తు చేశారు. ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభల కారణంగా.. ధ్వని కాలుష్యం, ట్రాఫిక్ జామ్‌ల కారణంగా ప్రజ లకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడం కారణంగా అవుతున్న ఖర్చు రూ.4,500 కోట్ల పైమాటేనన్నారు. జమి లి ఎన్నికల ద్వారా జాతీయ అంశాలతోపాటుగా, ప్రాంతీయ సమస్యలపైనా సమానస్థాయిలో చర్చ జరుగుతుందని తెలిపారు. వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడంతో ఓటర్లలో ఎన్నికల ప్రక్రియ పట్ల నిరాసక్తత పెరిగి.. ఓటరుశాతం తగ్గటం స్పష్టంగా కనబడుతోందన్నారు. దీనికి జమిలి ఎన్నికలు ఓ పరిష్కారాన్ని చూపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జమిలి ఎన్నికల కారణంగా, దేశంలో ద్రవ్యోల్బణంలో 1.1% తగ్గుతుందని రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ పేర్కొందన్నారు. -
ఒకే ఎన్నిక... అనేక కోణాలు!
కొన్నేళ్ళుగా చెబుతూ వస్తున్న ‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’ ప్రతిపాదనపై కేంద్రంలోని అధికార బీజేపీ మరో అడుగు ముందుకు వేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని కమిటీ ఈ ప్రతిపాదనపై ఇచ్చిన నివేదికను ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం లాంఛనంగా ఆమోదం తెలపడంతో రథం కదిలింది. ఈ ప్రతిపాదనపై ఓ బిల్లును రానున్న పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు భోగట్టా. దేశంలో లోక్‌సభకూ, అన్ని రాష్ట్రాల శాసనసభలకూ కలిపి ఒకేసారి ఎన్నికలు జరపడానికి ఉద్దేశించిన ఈ సంక్లిష్ట ప్రతిపాదనపై మొదటి నుంచి భిన్నాభిప్రాయాలు ఉన్నందున తాజా పరిణామాలతో మరోమారు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పైగా ఈ ప్రతిపాదనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీతో రాజ్యాంగ సవరణలు అవసరం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతిపాదనను కేంద్రంతో పాటు రాష్ట్రాలూ ఆమోదించాల్సి ఉంటుంది. వెరసి, రాజ్యాంగపరంగానూ, ఆచరణలోనూ అనేక అవరోధాలున్న ఈ ప్రతిపాదనపై రాగల నెలల్లో పెద్దయెత్తున రచ్చ రేగడం ఖాయం.నిజానికి, ఏకకాలంలో ఎన్నికలనేవి కొత్త ఏమీ కావు. గతంలో ప్రత్యేకంగా నియమం, చట్టం లాంటివేమీ లేకున్నా, 1951 – 52లో మొదటి జనరల్ ఎలక్షన్స్ నాటి నుంచి మన దేశంలో లోక్ సభ, రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు కలిసే జరుగుతుండేవి. అయితే, కాలవ్యవధి పూర్తి కాకుండానే రాష్ట్ర అసెంబ్లీలు రద్దవడం ఎప్పుడైతే మొదలైందో, అప్పుడు 1967 తర్వాత నుంచి కథ మారింది. ఏకకాల ఎన్నికల క్యాలెండర్ మారిపోయింది. పదేళ్ళ క్రితం తొలిసారి అధికారంలోకి వచ్చే ముందే బీజేపీ తన మేనిఫెస్టోలో ‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’ను లక్ష్యంగా పేర్కొంది. అంతకు ముందు సన్నాయినొక్కులు నొక్కినా, బీజేపీ గద్దెనెక్కాక సహజంగానే భారత ఎన్నికల సంఘం ఈ ఆలోచనను సమర్థించింది. అలాగే, లా కమిషన్లు సైతం 1999లో, 2018లో ఈ ఏకకాలపు ఎన్నికల విధానాన్ని పునరుద్ధరించాలన్నాయి. 2015 నాటి పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందు పలు పార్టీలు ఈ ప్రతిపాదనకు మద్దతు నివ్వగా, కొన్ని పార్టీలు మాత్రం వ్యతిరేకించాయి. భిన్నాభిప్రాయాలున్న దీనిపై ఏకాభిప్రాయ సాధన అవసరమని మొదట్లో చెబుతూ వచ్చిన మోదీ సర్కార్, ఆ సంగతి పక్కనపెట్టి ఇటీవల తన అజెండాను ముందుకు నెట్టే ప్రయత్నం చేయడం గమనార్హం. కోవింద్ కమిటీ వేయడం, ఆ కమిటీ ఈ ఏడాది మార్చిలో నివేదిక సమర్పించడం చకచకా జరిగాయి. తొలి దశలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు, ఆ వెంటనే రెండో దశలో 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు – ఇలా రెండు దశలుగా 2029 నుంచి ‘ఒకే ఎన్నిక’ ప్రతిపాదనను అమలు చేయవచ్చని కమిటీ సిఫార్సు చేసింది. ఇప్పుడు కమిటీ నివేదికను క్యాబినెట్ ఆమోదించి, పార్లమెంట్లో చట్టం చేయడానికి సిద్ధమవుతోంది. లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు కేంద్రానికి రూ. 4 వేల కోట్లు ఖర్చవుతుందని లెక్క. ఆ యా రాష్ట్రాల పరిమాణాన్ని బట్టి అసెంబ్లీ ఎన్నికలకు అయ్యే ఖర్చు వేరు. ఈ ప్రభుత్వ అధికారిక ఖర్చు కాక, వివిధ పార్టీలు, అభ్యర్థులు చేసే ఖర్చు అనేక రెట్లు. ఏక కాలపు ఎన్నికల వల్ల ఖర్చులు తగ్గుతాయనీ, తరచూ ఎన్నికలతో పాలన కుంటుపడుతున్నందున దాన్ని నివారించవచ్చనీ, ఒకేసారి ఎన్నికలతో ఓటింగ్ శాతం హెచ్చవుతుందనీ సమర్థకుల వాదన. అయితే, ఏకకాలపు ఎన్నికల కోసం పలు రాష్ట్ర అసెంబ్లీలను ముందుగానే రద్దు చేయాల్సి వస్తుంది. రేపు పొద్దున ఒకేసారి ఎన్నికలు పెట్టినా... ఒకవేళ ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం పడిపోయి మధ్యంతర ఎన్నికలు వస్తే, కేవలం మిగిలిన కాలవ్యవధికే ఎన్నికల ద్వారా కొత్త ప్రభుత్వాన్ని ఎన్ను కోవాలట. ఇలాంటి ప్రతిపాదనలు వట్టి అర్థరహితం. పైగా, ఇది మరింత ఖర్చుకు దారి తీయడమే కాక, అసలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం. అలాగే ఏకకాలపు ఎన్నికల వల్ల స్థానిక, ప్రాంతీయ అంశాలు పక్కకుపోయి, జాతీయ అంశాలదే పైచేయి అవుతుందనీ, చివరకు స్థానిక, చిన్నపార్టీలు కనుమరుగై పోతాయనీ భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవల ఏకకాలంలో హర్యానా, జమ్మూ– కశ్మీర్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు చేయలేమని చేతులె త్తేసిన ఎన్నికల సంఘం రేపు దేశమంతటా ఒకేసారి ఎన్నికలు ఎలా చేయగలుగుతుంది? కొన్ని కోట్ల ఈవీఎంలు, వీవీప్యాట్లు, వేల సంఖ్యలో భద్రతా సిబ్బందిని ఏకకాలంలో సమకూర్చుకోవడం సాధ్యమా? దానికయ్యే ఖర్చుతో పోలిస్తే, ‘ఒకే ఎన్నిక’ వల్ల ఆదా అయ్యేది ఏపాటి? అసలింతకీ కేంద్రంలోని కమలనాథులు ఇప్పుడీ పనిని ఎందుకు భుజాన వేసుకున్నట్టు? అధికార పక్షం సొంత మెజారిటీ ఉన్నప్పుడు ఇట్టే చేయగల పనిని మిత్రపక్షాలపై ఆధారపడిన ప్రభుత్వ హయాంలో తలకెత్తుకున్నదేమిటి? 2015 నాటి ఓ సర్వే ప్రకారం... ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 77 శాతం ఓటర్లు రెండింటా ఒకే పార్టీకి ఓటు వేస్తారట. అదే గనక ఆరు నెలల విరామం తర్వాత జరిగితే 61 శాతం మందే ఒకే పార్టీకి ఓటు వేస్తారట. దేశమంతటా ‘డబుల్ ఇంజన్ సర్కార్’కై తహతహలాడుతున్న బీజేపీ ఓటర్ల తాలూకు ఈ ఏకకాలపు ఎన్నికల మనస్తత్వం కలిసొస్తుందని భావిస్తూ ఉండవచ్చు. కానీ, వైవిధ్యానికి నెలవైన సమాఖ్య వ్యవస్థలో కృత్రిమంగా ఏకకేంద్రక స్వభావాన్ని జొప్పించడమే ఇదంతా అని విమర్శ. ఎవరి రాజకీయ, సైద్ధాంతిక వైఖరులు ఏమైనా అనేక అంశాలపై ప్రభావం చూపే ఈ ప్రతిపాదనకు తొందరపడితే సరిపోదు. కాగితంపై అందంగా కనిపించే ఆలోచనకు సైతం ఆచరణలో ఉండే ఇబ్బందులను గమనించాలి. వ్యతిరేకుల వాదన వినాలి. సహేతుకమైన వారి సందేహాల్ని తీర్చాలి. లేదంటే ప్రజాస్వామ్యానికే అర్థం లేదు. -
18 సవరణలు చేయాలి
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలంటే 18 రాజ్యాంగ, చట్ట సవరణలు అవసరమవుతాయి. కమిటీ ఈ విషయాన్ని తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్లతో సంప్రదించి భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ఓటర్ల జాబితాను రూపొందించాల్సి ఉంటుంది. దానికోసం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 325ని సవరించాల్సి ఉంటుంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటే మున్సిపాలిటీలు, పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటే ‘ఆరి్టకల్ 324ఏ’కు సవరణ అవసరం. ఈ రెండు అంశాలు రాష్ట్రాల పరిధిలోకి వచ్చేవి కాబట్టి రాజ్యాంగ సవరణలు చేయాలంటే ఆర్టికల్ 368(2) ప్రకారం దేశంలోని సగం రాష్ట్రాలు సమ్మతి తెలపాల్సి ఉంటుందని కోవింద్ కమిటీ తెలిపింది. -
జమిలి ఇలా రెండు దశలుగా అమలు
కోవింద్ కమిటీ లోక్‌సభ ఎన్నికలకు ముందు గత మార్చిలో జమిలి ఎన్నికలపై నివేదిక సమరి్పంచింది. ’ఒక దేశం, ఒకే ఎన్నిక’ను రెండు దశల్లో అమలు చేయాలని సూచించింది. ఏం చెప్పిందంటే... → జమిలి ఎన్నికలను అమల్లోకి తెచ్చేందుకు చట్టపరంగా చెల్లుబాటయ్యే వ్యవస్థను కేంద్రం అభివృద్ధి చేయాలి. → తొలి దశలో లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలి. → అనంతరం 100 రోజుల్లోపు రెండో దశలో పంచాయతీలు, మున్సిపాలిటీల వంటి స్థానిక సంస్థలన్నింటికీ ఎన్నికలు జరపేలా వ్యవస్థలను రూపొందించాలి. → సార్వత్రిక ఎన్నికలు జరిగి, కొత్తగా కొలువుదీరే లోక్‌సభ తొలిసారి సమావేశమయ్యే తేదీని ‘అపాయింటెడ్ డే’గా రాష్ట్రపతి నోటిఫై చేయాలి. దాంతో లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు నాంది పడుతుంది. → అపాయింటెడ్ డే తర్వాత ఏర్పడే అన్ని అసెంబ్లీల గడువూ లోక్‌సభతో పాటే ముగుస్తుంది. తదనంతరం లోక్‌సభ, అన్నీ అసెంబ్లీల ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. → లోక్‌సభలో ఏ పారీ్టకీ మెజారిటీ రాకుండా హంగ్ ఏర్పడి, లేదా అవిశ్వాస తీర్మానం వంటివి నెగ్గి సభ రద్దయినా మళ్లీ ఎన్నికలు జరపాలి. → అలాంటి సందర్భంలో కొత్త సభ గడువు.. రద్దయిన సభలో మిగిలిన కాలావధి వరకు మాత్రమే ఉంటుంది. → అసెంబ్లీలకు కూడా ఇదే వర్తిస్తుంది. అంటే హంగ్ తదితర కారణాలతో ఎన్నికలు జరిగి మధ్యలో కొత్తగా ఏర్పడే అసెంబ్లీలు ఐదేళ్లు కొనసాగకుండా లోక్‌సభతో పాటే రద్దవుతాయి. → అన్ని ఎన్నికలకూ ఉమ్మడిగా ఒకే ఎలక్టోరల్ రోల్, ఓటర్ల ఫోటో గుర్తింపు కార్డు (ఎపిక్) ఉపయోగించాలి. ఆమోదం ఈజీ కాదు జమిలి ఎన్నికలకు పార్లమెంటు ఆమోదముద్ర పొందడం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారుకు అంతా ఈజీ కాబోదు. నవంబర్ గేమ్ అధికార కూటమికి అంత అనుకూలంగా లేదు. జమిలికి సంబంధించి కోవింద్ కమిటీ పలు రాజ్యాంగ సవరణలు సూచించింది. వాటికి ఆమోదం లభించాలంటే ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మంది ఎంపీల మద్దతు తప్పనిసరి. అందుకు 543 మంది ఎంపీలున్న లోక్‌సభలో 362 మంది; 245 మంది ఎంపీలుండే రాజ్యసభలో 164 మంది మద్దతు అవసరం. కానీ ఎన్డీయే కూటమికి లోక్‌సభలో 293 మంది, రాజ్యసభలో 113 మంది ఎంపీలే అన్నారు. అయితే కోవింద్ కమిటీ ముందు జమిలిని సమరి్థంచిన పారీ్టలకున్న లోక్‌సభ సభ్యుల సంఖ్య 271 మాత్రమే. దాన్ని వ్యతిరేకించిన 15 పారీ్టలకు 205 మంది లోక్‌సభ సభ్యులున్నారు. విపక్ష ఇండియా కూటమికి రాజ్యసభలో 85 మంది సభ్యుల బలముంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
One Nation One Election: ఆచరణ సాధ్యమేనా?
జమిలి. ప్రస్తుతం దేశమంతటా ప్రతిధ్వనిస్తున్న పదం. అయితే లోక్‌సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఏ మేరకు ఆచరణ సాధ్యమన్న దానిపై భిన్నాప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వంటి నాలుగైదు అసెంబ్లీలకు మాత్రమే లోక్‌సభతో పాటు ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా అసెంబ్లీలకు విడిగా, వేర్వేరుగానే ఎన్నికలొస్తున్నాయి. వీటన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అందుకు పలు అసెంబ్లీలను గడువుకు ముందే రద్దు చేయడం, కొన్నింటిని పొడిగించడమో, లేదంటే గడువు తీరాక సుప్త చేతనావస్థలో ఉంచడం వంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టేనన్న అభిప్రాయముంది. లేదంటే లోక్‌సభ కొత్తగా తొలిసారి కొలువుదీరిన తేదీని ‘అపాయింటెడ్ డే’గా ప్రకటించి, ఆ తర్వాత ఏర్పాటయ్యే అసెంబ్లీల అన్నింటి గడువూ.. వాటి ఐదేళ్ల కాలపరిమితితో సంబంధం లేకుండా.. లోక్‌సభతో పాటే ముగిసే ప్రతిపాదనను అమలు చేయాలి. ఇలా ఒకసారి చేస్తే సరిపోతుందని, ఇక అప్పటి నుంచి జమిలి ఎన్నికలే ఉంటాయని కోవింద్ కమిటీ పేర్కొంది. ఇందులో ఆచరణపరంగా ఎన్నో ఇబ్బందులున్నాయన్నది నిపుణుల మాట. అంతేగాక అసలు ఈ ప్రతిపాదన రాష్ట్రాల అధికారాల్లో అవాంఛిత జోక్యమే తప్ప మరోటి కాదని పలు పార్టీలు వాదిస్తున్నాయి. పైగా లోక్‌సభతో పాటే అసెంబ్లీలకు ఎన్నికలు జరిగితే జాతీయాంశాలే తెరపైకి వస్తాయని, రాష్ట్రాల్లోని స్థానికాంశాలు పక్కకు పోతాయని ప్రాంతీయ పారీ్టలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ కారణంగా డీఎంకే వంటి పలు పారీ్టలు జమిలిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ మేరకు అసెంబ్లీల్లో తీర్మానం కూడా చేశాయి. పైగా హంగ్, అవిశ్వాస తీర్మానం నెగ్గడం వంటి ఏ కారణంతో అయినా గడువుకు ముందే చట్టసభ రద్దయితే ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త సభ ఐదేళ్లు కాకుండా రద్దయిన సభలో మిగిలిన కాలావధి పాటు మాత్రమే కొనసాగాలని కోవింద్ కమిటీ సూచించింది. అలాగైతే జమిలి ప్రక్రియకు భంగం కలగకుండా ఉంటుందని పేర్కొంది. కానీ దీనిపైనా పలు పారీ్టలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి. ప్రజాతీర్పు కోరి అత్యంత వ్యయ ప్రయాసలకు ఓర్చి అధికారంలోకి వచ్చాక ఐదేళ్లు కొనసాగరాదనడం అప్రజాస్వామికమని, రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్ధమని వాదిస్తున్నాయి. రాజ్యాంగ వ్యతిరేకం: ఖర్గే ‘‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక మన దేశంలో ఆచరణ సాధ్యం కాదు. ఇలాంటి ఎన్నికలు రాజ్యాంగం, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం. దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కొత్తకొత్త ఎత్తుగడలు వేయడం బీజేపీకి అలవాటే. ప్రజాస్వామ్య విరుద్ధమైన జమిలి ఎన్నికలను దేశ ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోరు’’ అది సంఘ్ పరివార్ రహస్య అజెండా ‘‘ఒకే దేశం–ఒకే ఎన్నిక అనేది దేశ సమాఖ్య నిర్మాణాన్ని బలహీనపరుస్తుంది. ఇది సంఘ్ పరివార్ రహస్య అజెండాలో ఒక భాగమే. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్నికల వ్యవస్థను మార్చేసి అధ్యక్ష తరహా పాలనా విధానాన్ని తీసుకురావాలన్నదే సంఘ్ పరివార్ అసలు కుట్ర. భారత పార్లమెంటరీ వ్యవస్థను దెబ్బతీయాలన్న ఆలోచనను మానుకోవాలి’’. – పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి ప్రజలంతా వ్యతిరేకించాలి సమాఖ్య వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ నిర్మాణాన్ని దెబ్బతీసే జమిలి ఎన్నికలను ప్రజలంతా వ్యతిరేకించాలి. ఒకే దేశం–ఒకే ఎన్నిక ద్వారా ప్రాంతీయ పార్టీలను బలహీనపర్చేందుకు బీజేపీ కుతంత్రాలు సాగిస్తోంది. ప్రభుత్వం మధ్యలోనే కూలిపోతే ఏం చేస్తారు? – అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
జమిలికి జై
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలు ఈ టర్మ్‌లోనే ఉంటాయని కొద్ది రోజులుగా స్పష్టమైన సంకేతాలిస్తూ వస్తున్న మోదీ సర్కారు ఆ దిశగా కీలక ముందడుగు వేసింది. దేశమంతటా అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన ’ఒక దేశం ఒకే ఎన్నిక’ ప్రతిపాదనకు జై కొట్టింది. ఈ మేరకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫార్సులకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దాంతో మన దేశంలో ఎన్నికల నిర్వహణ తీరుతెన్నుల్లో భారీ సంస్కరణలకు రంగం సిద్ధమైంది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు అన్ని స్థానిక సంస్థలకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేయడం తెలిసిందే. తొలుత దీనికి జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం సాధించాలని, ఆ మీదట దశలవారీగా నిర్ణయాన్ని అమలు చేయాలని సూచించింది. ‘కమిటీ సిఫార్సుల మేరకు అన్ని వర్గాలతోనూ సంప్రదింపుల ప్రక్రియ చేపట్టిన అనంతరం కేంద్ర న్యాయ శాఖ బిల్లు ప్రతిని రూపొందించి కేబినెట్ ముందు పెడుతుంది. అనంతరం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడతాం‘ అని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. వచ్చే శీతాకాల సమావేశాలే ఇందుకు వేదిక కావచ్చని చెబుతున్నారు. ఈ మేరకు ఒకే బిల్లు గానీ, అవసరమైతే పలు బిల్లులు గానీ ప్రవేశపెట్టే అవకాశముందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు లా కమిషన్ కూడా జమిలిపై త్వరలో నివేదిక సమర్పించనుంది. 2029 నుంచి ఒకేసారి అన్ని ఎన్నికల నిర్వహణ, హంగ్ వచ్చే పక్షంలో ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటు తదితర సిఫార్సులను కమిషన్ చేయవచ్చని సమాచారం. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో జమిలి ఎన్నికలు కీలక వాగ్దానంగా ఉంటూ వస్తోంది. కేబినెట్ నిర్ణయాన్ని బీజేపీ, ఎన్డీయే పక్షాలు స్వాగతించగా కాంగ్రెస్, ఇతర విపక్షాలు మాత్రం ఇది ఆచరణసాధ్యం కాదంటూ పెదవి విరిచాయి. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మోదీ సర్కారు ఆడుతున్న డ్రామాగా దీన్ని అభివర్ణించాయి. త్వరలో అమలు కమిటీ జమిలి ఎన్నికలకు ఇప్పటికే చాలా రాజకీయ పక్షాలు సమ్మతి తెలిపాయని కేంద్రం పేర్కొంది. ఇప్పుడు వ్యతిరేకిస్తున్న పారీ్టలు కూడా వైఖరి మార్చుకుంటాయని ఆశాభావం వెలిబుచ్చింది. దేశ ప్రజల్లో అత్యధికులు ఈ ప్రతిపాదనను సమర్థించిన నేపథ్యంలో ఆ దిశగా వాటిపై అంతర్గత ఒత్తిళ్లు వస్తున్నాయని వైష్ణవ్ అభిప్రాయపడ్డారు. కేబినెట్ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. కోవింద్ కమిటీ సిఫార్సులను ముందుకు తీసుకెళ్లేందుకు త్వరలో ఒక అమలు కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.‘ఈ అంశంపై రానున్న కొద్ది నెలల పాటు ప్రజలు, పార్టీలు, మేధావులు... ఇలా అన్ని రకాల వేదికల్లోనూ లోతుగా చర్చలు జరుగుతాయి. జమిలి ఎన్నికలకు విస్తృత ఏకాభిప్రాయం సాధించేందుకు కృషి చేస్తాం. దీర్ఘకాలంలో దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేసే ఇలాంటి కీలక అంశాలపై ఏకాభిప్రాయం కావాలన్నది మా ప్రభుత్వ విశ్వాసం. ఇది మన దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే చర్య‘ అని చెప్పుకొచ్చారు. కమిటీ చేపట్టిన సంప్రదింపుల సందర్భంగా ఏకంగా 80 శాతం మందికి పైగా జమిలికి మద్దతిచ్చారని ఆయన చెప్పారు. ముఖ్యంగా యువత దీన్ని పూర్తిస్థాయిలో సమర్థించిందన్నారు. కాబట్టే జమిలికి ప్రస్తుతం విపక్షాల వ్యతిరేకంగా ఉన్నా.. విపక్షాలపై కూడా వైఖరి మార్చుకుందామంటూ అంతర్గతంగా ఒత్తిడి వస్తోందని ఒక ప్రశ్నకు బదులుగా మంత్రి అభిప్రాయపడ్డారు. వచ్చే శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో జమిలి బిల్లు పెడతారా అన్న ప్రశ్నకు ఆయన సూటిగా బదులివ్వలేదు. మోడీ 3.0 హయాంలోని దీన్ని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే చెప్పారని గుర్తు చేశారు. 1967 దాకా జమిలి ఎన్నికలే స్వాతంత్య్రం వచ్చాక 1951 నుంచి 1967 దాకా దేశమంతటా లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత మధ్యంతరాలు తదితర కారణాలతో జమిలికి తెర పడింది. ఈ నేపథ్యంలో జమిలి కోసం భారీ కసరత్తే చేయాల్సి ఉంటుంది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ముందుకు జరపడం, కొన్నింటిని ఆలస్యం చేయడం వంటి చర్యలు అవసరం అవుతాయి. రెండు దశల్లో అమలు కోవింద్ కమిటీ సిఫార్సుకోవింద్ కమిటీ లోక్‌సభ ఎన్నికలకు ముందు గత మార్చిలో జమిలి ఎన్నికలపై నివేదిక సమర్పించింది. ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ను రెండు దశల్లో అమలు చేయాలని సూచించింది. ‘తొలి దశలో లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలి. 100 రోజు ల్లోపు రెండో దశలో పంచాయతీలు, మున్సిపాలిటీల వంటి స్థానిక సంస్థలన్నింటికీ ఎన్నికలు జరపాలి‘ అని పేర్కొంది. అన్ని ఎన్నికలకూ ఉమ్మ డిగా ఒకే ఎలక్టోరల్ రోల్ ఉపయోగించాలని పేర్కొంది. ఇందుకు కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల సంఘాల మధ్య సమన్వయం అవసరం. ఎందుకంటే ప్రస్తుతం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను సీఈసీ, స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్రాల ఎన్నికల సంఘాలు నిర్వహిస్తున్నాయి. -
ఈ టర్మ్‌లోనే ఎన్నికలు..
-
జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్
ఢిల్లీ: జమిలి ఎన్నికలకు మరో ముందడుగు పడింది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒకే దేశం ఒకే ఎన్నికపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుత ప్రభుత్వ పాలనా కాలంలోనే జమిలి(ఒకేసారి దేశవ్యాప్త) ఎన్నికలు నిర్వహిస్తామని నిన్ననే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది. కాగా, వన్ నేషన్-వన్ ఎలక్షన్‌ను వ్యతిరేకిస్తున్నామని.. పార్లమెంట్లో బిల్లు పెడితే ఓడిస్తామంటూ కాంగ్రెస్ చెబుతోంది. గత నెల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో జమిలి ఎన్నికలను ప్రస్తావించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: ఈ టర్మ్‌లోనే జమిలి ఎన్నికలుదేశవ్యాప్తంగా ఏడాది ఏవో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని, వీటి ప్రభావం దేశ అభివృద్ధిపై పడుతుందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి జమిలి ఎన్నికలే పరిష్కారమని తేల్చి చెబూతూ.. ఈ దిశగా అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోలోనూ ‘ఒక దేశం.. ఒకే ఎన్నిక’ అంశం ఉన్నందున మళ్లీ మూడోసారి మోదీ సారధ్యంలో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం వంద రోజులు పూర్తిచేసుకున్న తరుణంలో జమిలి ఎన్నికల దిశగా అడుగులు పడ్డాయి.దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు, లోక్ సభకు ఏక కాలంలో ఎన్నికలు జరపాలన మొదటి నుంచీ జమిలి ఎన్నికల నిర్వహణపై పట్టుదలగా ఉన్న ప్రధాని మోదీ ఈ అంశంపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతిరామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసే దిశగా కమిటీ పనిచేసింది. ప్రజల నుంచి సూచనలు, సలహాలను ఆహ్వానించింది. స్పందన కూడా విశేషంగా వచ్చింది. వేల సంఖ్యలో ఈ-మెయిల్స్ వచ్చినట్లు సమాచారం. పూర్తి సాధ్యాసాధ్యాలను అధ్యయనంర చేసిన రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇటీవలే కేంద్రానికి నివేదికను సమర్పించింది. -
ఈ టర్మ్‌లోనే జమిలి ఎన్నికలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ప్రభుత్వ పాలనా కాలంలోనే జమిలి(ఒకేసారి దేశవ్యాప్త) ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి 100 రోజుల పాలనలో సాధించిన విజయాలపై మంగళవారం పత్రికాసమావేశంలో మంత్రి అశ్వనీవైష్ణవ్‌తో కలిసి అమిత్ సుదీర్ఘంగా మాట్లాడారు. జనగణన ఎప్పుడో త్వరలో చెప్తాం జనగణన ఎప్పుడు జరపబోయేది త్వరలోనే వెల్లడిస్తామని, ప్రకటన చేశాక సంబంధిత వివరాలను తెలియజేస్తామని అమిత్ చెప్పా రు. జనగణన, కులగణన తక్షణం జరపాలంటూ విపక్షాల నుంచి విపరీతమైన డిమాండ్లు వెల్లువెత్తుతున్న తరుణంలో అమిత్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. రైతుల కోసం రూ.15 లక్షల కోట్ల పథకాలు ‘‘రైతాంగం బాగు కోసం సాగురంగంలో 14 విభాగాల్లో రూ.15 లక్షల కోట్ల విలువైన పథకాలను ఈ 100 రోజుల్లో అమల్లోకి తెచ్చాం. వ్యవసాయంలో మౌలిక వసతుల కల్పనకు మౌలిక సాగు నిధి ఏర్పాటుచేశాం. మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక తొలి నిర్ణయం రైతుల కోసమే తీసుకున్నారు. మెరుగైన మౌలిక వసతులకు రూ.3 లక్షల కోట్లు కేటాయించాం.25వేలకు పైగా కుగ్రామాలకు రోడ్ల అనుసంధానం పెంచుతున్నాం. ఉల్లి, బాస్మతి బియ్యంపై కనీస ఎగుమతి ధరను తొలగించాం. వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు కట్టుబడ్డాం. ఆస్తుల దురి్వనియోగాన్నీ వక్ఫ్ (సవరణ) బిల్లు అడ్డుకుంటుంది. గత నెలలో లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టాం. సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు బిల్లును పంపాం. త్వరలోనే పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందుతుంది’’ అని షా అన్నారు. -
ఇది ఏకగ్రీవ సి‘ఫార్సు’
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని ఉన్నత స్థాయి కమిటీ ఊహించినట్టుగానే జమిలి ఎన్నికలకు జైకొట్టింది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో, ఆ తర్వాత వంద రోజుల్లో మునిసిపాలిటీలు, పంచాయతీల ఎన్నికలు జరపాలని ఏకగ్రీవంగా సిఫార్సు చేస్తూ, సదరు కమిటీ గత వారం నివేదిక సమర్పించింది. సిఫార్సులు ఊహించినవే అయినప్పటికీ, నిర్ణీత కాలవ్యవధి ఏమీ లేకపోయినా 2024 సార్వత్రిక ఎన్నికలకు కొద్దిగా ముందుగా కమిటీ ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ (ఓఎన్ఓఈ) ప్రతిపాదనను తెర మీదకు తేవడం అనుమానాలు రేపింది. రాజ్యాంగ సవరణ, ఒకే ఎన్నికల జాబితా – ఎన్నికల గుర్తింపు కార్డు, త్రిశంకు సభ – అవిశ్వాస తీర్మాన పరిస్థితులు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు – పోలింగ్ సిబ్బంది – పోలీసు బలగాల ఏర్పాట్ల లాంటి పలు అంశాలపై కమిటీ కీలక సిఫార్సులు ఇప్పుడు చర్చ రేపుతున్నాయి. మన ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలనూ, సమాఖ్య చట్రాన్నే మార్చేసే సత్తా ఈ ప్రతిపాదనకు ఉండడమే అందుకు కారణం. కోవింద్ సారథ్యంలో 2023 సెప్టెంబర్‌లో ఈ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి కమిటీలో భాగం కావడానికి నిరాకరించారు. మొత్తం 8 మంది సభ్యుల కమిటీ 65 సమావేశాలు జరిపి, అనుకున్నట్టుగానే ప్రభుత్వ వైఖరికి అనుకూలంగా నివేదిక ఇచ్చింది. జాతీయ, రాష్ట్ర పార్టీల అభిప్రాయాల్ని తెలుసుకున్నామనీ, న్యాయకోవిదుల మొదలు ఆర్థికవేత్తల దాకా పలువురి సూచనలు కోరామనీ కమిటీ తెలిపింది. అయితే, నివేదికను గమనిస్తే అవసరమైన లోతైన అధ్యయనం, విశ్లేషణ సాగినట్టు తోచదు. అన్ని వర్గాలనూ ఈ అధ్యయన ప్రక్రియలో భాగం చేసినట్టు అనిపించదు. తూతూ మంత్రపు తతంగం చివరకు 21 సంపుటాల్లో, 18,626 పేజీల్లో, మొత్తం 11 అధ్యాయాలు, అనేక అనుబంధాల బృహన్నివేదిక రూపం మాత్రం సంతరించుకుంది. రాష్ట్రపతికి మార్చి 14న కమిటీ తన నివేదికను అందించడంతో ప్రధాన ఘట్టం ముగిసింది. త్వర లోనే లా కమిషన్ సైతం తన నివేదికను ఇవ్వనుంది. ఇక, వచ్చే 2029 ఎన్నికల్లోగా దాన్ని ఎలా ఆచ రణలోకి తేవాలన్నది కేంద్రం చేతిలో ఉంది. కమిటీ ఏకగ్రీవ సిఫార్సు గనక అది ముగిసిన కథ అన కుండా, వ్యతిరేకిస్తున్న వారి సముచితమైన భయాందోళనల్ని విని, సమాధానపరచడం అవసరం. నిజానికి, ఒకేసారి లోక్‌సభ, శాసనసభలకు ఎన్నికలు జరగడం కనివిని ఎరుగనిదేమీ కాదు. చట్టం ఏమీ లేకపోయినా స్వతంత్ర భారతావనిలో ఎన్నికలు మొదలయ్యాక తొలి రోజుల్లో ఏకకాలంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. అయితే, అయిదేళ్ళ కాలవ్యవధి పూర్తికాక ముందే రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేసే ధోరణి మొదలయ్యాక, 1967 తర్వాత నుంచి ఈ ఏకకాల విధానానికి తెర పడింది. తరువాత కూడా మధ్య మధ్యలో ఈ జమిలి ఎన్నికల ఆలోచన తొంగిచూసినా, వడివడిగా అడుగులు పడింది మాత్రం ఇప్పుడే. మోదీ సారథ్యంలోని బీజేపీ ఆది నుంచి జమిలి ఎన్నికల నిర్వహణ జపం చేస్తోంది. అందుకు తగ్గట్టే ఇప్పుడు కోవింద్ కమిటీ జమిలి ఎన్నికలకు సిఫార్సు చేసింది. జమిలి ఎన్నికలను 15 పార్టీలు వ్యతిరేకించాయని కమిటీ పేర్కొంది కానీ, వ్యతిరేకిస్తున్నవారిని ఒప్పించడానికీ, సద్విమర్శలను తీసుకొని సరిదిద్దుకోవడానికీ చేసిందేమిటో తెలియదు. అలాగే, ఒకే దశలో ఎన్నికలు చేయలేక 7 విడతల్లో, 40 రోజులపైగా ఎన్నికలు జరుపుతున్న పాలకులు ఒకేసారి ఎన్నికలు ఎలా చేయగలరన్నదీ సందేహమే! ఒకరకంగా, ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ వల్ల అటు ప్రభుత్వానికీ, ఇటు పార్టీలకూ ఎన్నికల ఖర్చు తగ్గుతుందనే మాట నిజమే. అలాగే, కాస్తంత వ్యవధి తేడాతో మునిసిపల్, పంచాయతీ సహా అన్ని ఎన్నికలూ ఒకేసారి జరగడం వల్ల పాలనకు తరచూ అంతరాయాలు ఏర్పడవు. అయితే, ఈ విధానం మన సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందనేదీ అంతే వాస్తవం. ఇక, ఈ పద్ధతిలో రాష్ట్ర అసెంబ్లీలకు నిర్ణీత కాలవ్యవధి కన్నా ముందే మంగళం పాడి, ఆనక ప్రతి ప్రభుత్వానికీ నిర్ణీత వ్యవధిని నిర్ణయించడం ప్రజాస్వామ్య సిద్ధాంతాలకే విరుద్ధం. ఒకవేళ గనక ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అర్ధంతరంగా కూలిపోతే, ఆ తర్వాత ఎన్నికైన ప్రభుత్వం ఆ వర్తమాన లోక్‌సభా కాలం ఉన్నంత వరకే అధికారంలో కొనసాగాలనడం మరో తిరకాసు. అన్నిటి కన్నా పెద్ద భయం మరొకటుంది. ఏకకాలంలో కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల వల్ల ప్రాంతీయ, స్థానిక అంశాలను మింగేసి, జాతీయ అంశాలే పైకొచ్చే ప్రమాదం ఉంది. ఎన్నికల వ్యూహంలో, వ్యయంలో జాతీయ పార్టీలతో రాష్ట్ర స్థాయి పార్టీలు దీటుగా నిలబడడమూ కష్టమే. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా చిన్న పార్టీలు కనిపించకుండా పోతాయని సమాజ్‌వాదీ పార్టీ లాంటివి బాహాటంగానే చెబుతున్నాయి. నిజానికి, ఏకకాలపు ఎన్నికల వల్ల ఓటర్లలో 77 శాతం మంది కేంద్రంలో, రాష్ట్రంలో – రెండు చోట్లా ఒకే పార్టీకి ఓటేస్తారని 2015 నాటి ఓ సర్వే తేల్చింది. రెండు ఎన్నికల మధ్య ఆరు నెలల విరామం ఉంటే, 61 శాతమే అలా ఓటేస్తారట. అంటే ఒక రకంగా ఈ జమిలి ఎన్నిక కేంద్రంలో చక్రం తిప్పుతున్న పార్టీలకే వాటంగా మారవచ్చు. అసలు ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ అనే ఈ ఆలోచన వెనుక అసలు మతలబు... దేశంలో అధ్యక్ష తరహా పాలన తీసుకు రావాలన్న బీజేపీ ఆలోచన అని మరికొందరి వాదన. అందుకు రాజ్యాంగ సవరణలు సహా అనేకం అవసరం. దానికి తగ్గట్టే దీర్ఘకాలిక వ్యూహంతో బీజేపీ 400 పైచిలుకు సీట్లతో సంపూర్ణ మెజారిటీని కోరుతోందని విశ్లేషణ. అవతలి వారివి ‘అనవసర భయాందోళనలు’ అని కొట్టిపారేస్తే సరిపోదు. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొనే ముందు మరింత విస్తృత స్థాయి సంప్రతింపులు జరపడం అవసరం. అంతేకానీ, డబ్బు ఆదా పేరిట ప్రజాస్వామ్య స్ఫూర్తినీ, సమాఖ్య స్వభావాన్నీ నీరు గార్చడం సమర్థనీయం కానే కాదు. -
ONOE: హంగ్ వస్తే?
ఎప్పటి నుంచో వినిపిస్తున్నట్లుగానే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ జమిలి ఎన్నికలకు జైకొట్టింది. ఈ కమిటీ తను నివేదించిన నివేదికలో పలు అంశాలకు సిఫార్సు చేసింది. హంగ్ వచ్చినా, అవిశ్వాస తీర్మానం వంటి పరిస్థితులు నెలకొన్నా,మళ్ళీ ఎన్నికలు నిర్వహించి కొత్త సభను ఏర్పాటుచేయాలని సూచించింది. ఒకప్పటి ఏకకాల ఎన్నికలను పునరుద్ధరించాలన్నది ప్రధాన సిఫార్సు.దేశానికి స్వాతంత్ర్య లభించిన తొలిరోజుల్లో ఈ వ్యవస్థ ఉండేది. ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడంతో పాటు దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేయడానికి జమిలి ఎన్నికలు ఉపయోగపడతాయని బిజెపి ప్రభుత్వం చెబుతున్న మరోమాట. అసెంబ్లీ,లోక్ సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం తొలిదశ కాగా,ఈ ఎన్నికలు జరిగిన 100రోజుల లోపే మున్సిపాలిటీలు, పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించడం రెండో దశలో జరగాల్సిన కార్యాచరణగా ఉండాలని ఈ కమిటీ బలంగా చెబుతోంది. కాకపోతే,దీనికోసం ఆర్టికల్ 325ను సవరించాలి. ఈ సవరణకు రాష్ట్రాల సహకారం అవసరం. రేపటి ఎన్నికల ఫలితాల తర్వాత కానీ,ఆ యా పార్టీల బలాబలాలు తెలియరావు. 'ఒకే దేశం - ఒకే ఎన్నిక' అంశంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆ మధ్య వివరణ ఇచ్చారు.జమిలి ఎన్నికల నిర్వహణలో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటుచేసిన అత్యున్నత కమిటీ తుది నివేదిక అందించడానికి నిర్దిష్టమైన గడువేమీలేదని ఆయన స్పష్టం చేశారు. దీనిని బట్టి చూస్తే,ఇప్పుడప్పుడే ఈ వ్యవహారం తేలదని అర్థం చేసుకోవచ్చు.2024 లోపే జమిలి ఎన్నికలు జరుగవచ్చని గతంలో కొందరు జోస్యం చెప్పారు. దానికి తెరపడిందన్నది సత్యం. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సివుంది. ఆ తర్వాత భవిష్యత్తులో జరుగబోయే ఎన్నికల నాటికి ఏదైనా స్పష్టత వస్తుందేమో! చూడాలి. దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు,లోక్ సభకు ఏక కాలంలో ఎన్నికలు జరపాలనే నినాదాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదే పదే వినిపిస్తూనే వున్నారు. మొదటి నుంచీ జమిలి ఎన్నికల నిర్వహణపై ఆయన పట్టుదలగానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే, ఈ అంశంపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో గత సంవత్సరం సెప్టెంబర్ లో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసే దిశగా కమిటీ పనిచేయడం కూడా ప్రారంభించింది. ప్రజల నుంచి సూచనలు, సలహాలను ఆహ్వానించింది. స్పందన కూడా విశేషంగా వచ్చింది. వేలాదిగా ఈ -మెయిల్స్ వచ్చాయి. కేంద్రం మొన్నామధ్యనే 6 జాతీయ పార్టీలు, 33 ప్రాంతీయ పార్టీల నుంచి అభిప్రాయాలు కోరింది. ఇప్పటివరకూ 35 పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు తెలుస్తోంది.జమిలి ఎన్నికలకు సంబంధించి న్యాయ కమిషన్ నుంచి కూడా సలహాలు తీసుకుంది. మరి కొన్ని నెలల వ్యవధిలోనే సాధారణ ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో,ప్రతిపక్ష పార్టీల వ్యాఖ్యల వేడి పెరుగుతోంది. ముఖ్యంగా తృణమూల్ పార్టీ అధినేత్రి,పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జమిలి ఎన్నికలకు ససేమిరా అంటున్నారు.అదే విషయాన్ని స్పష్టం చేస్తూ రామ్ నాథ్ కోవింద్ కమిటీకి ఉత్తరం కూడా రాశారు. ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వాన్ని అనుమతించే వ్యవస్థగా మారుతుందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలకు తాము దూరంగానే ఉంటామని స్పష్టం చేశారు. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలువివిధ కారణాలతో తమ ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయలేకపోవచ్చని గత చరిత్రను గుర్తుచేస్తున్నారు. అనేకసార్లు లోక్ సభ రద్దయిందని, భవిష్యత్తులో కూడా అటువంటి పరిస్థితులు తలెత్తుతాయనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఓటర్ల ఎన్నికల విశ్వాసాన్ని ఉల్లంఘించడం న్యాయమా? అని ఆమె ప్రశ్నిస్తున్నారు.తృణమూల్ పాటు మిగిలిన ప్రతిపక్ష పార్టీలకు అనేక భయాలు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. 'జమిలి' అంటే రాష్ట్రాలపై దాడి చేయడమేనని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శనా బాణాలు సంధిస్తునే వున్నారు.ఈ ఎన్నికల వల్ల సామాన్యులకు ఒరిగేదేంటని కేజ్రీవాల్ ప్రశ్నిస్తున్నారు. 2029 నుంచి లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేలా లా కమిషన్ ఓ ఫార్ములా రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. లా కమిషన్ ఇంకా తుది నివేదికను తయారుచేయాల్సివుంది. పంచాయతీల నుంచి పార్లమెంట్ దాకా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్నది బిజెపి ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ముఖ్యంగా,దీనివల్ల డబ్బు ఆదా అవుతుందని,ఆ ధనాన్ని అభివృద్ధి పనుల కోసం కేటాయించవచ్చని మోదీ సర్కార్ వాదిస్తోంది.ఈ చర్చ ఈనాటిది కాదు.2019లో రెండవసారి అధికారంలోకి వచ్చిన వెనువెంటనే అన్ని పార్టీలను ఆహ్వానించి దీనిపై చర్చ కూడా జరిపారు.అప్పట్లో దేశ వ్యాప్తంగా మొత్తం నలబై రాజకీయ పార్టీలను ఈ సమాలోచనకు ఆహ్వానించారు. 21పార్టీలు మాత్రమే హాజరయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలు అప్పట్లో జమిలి ఎన్నికలకు జై కొట్టాయి. వచ్చిన మిగిలిన పార్టీలు విభిన్న స్వరాలను వినిపించాయి. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగానే ఉంది. లోక్ సభకు,శాసనసభలకు సమాంతరంగా ఏకకాలంలో జరపడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ప్రధానంగా ఖర్చు కలిసివస్తుందన్నది వాస్తవమే. వివిధ ఎన్నికల కోడ్ పేరుతో జరగాల్సిన కార్యక్రమాలు జరగకుండా పనులు ఆగిపోవడం, సమయం వృధా అవ్వడం మొదలైన వాటికి అడ్డుగోడ పడుతుంది.తద్వారా పనిరోజులు పెరుగుతాయి. ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. కనీసం రెండు,మూడు రాష్ట్రాలలో ఎన్నికలు తప్పనిసరిగా వస్తుంటాయి.ఈ నేపథ్యంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోడానికి వెనుకాడే పరిస్థితి వస్తుంది.అదే అన్ని చోట్ల సమాంతర ఎన్నికల విధానం అందుబాటులో ఉంటే,కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మరింతగా పరిపాలనపై దృష్టి సారించే వెసులుబాటు ఉంటుంది. ఐదేళ్లకొకసారి అన్ని వ్యవస్థలకు ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల రాజకీయ సుస్థిరత నెలకొనే అవకాశం ఉంది.బిజెపి ప్రతిపాదిస్తున్న జమిలి ఎన్నికలపై కొందరు అనేక అనుమానాలు, సందేహాలు,అభ్యంతరాలు వ్యక్తం చేశారు.ఈ ప్రతిపాదన వల్ల ఎటుచూసినా,కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికే ఎక్కువ మేలుజరుగుతుందనీ,అందుకే, దీనిపై బలంగా ప్రచారం చేస్తోందనే భావంలో ప్రతిపక్షాలు ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీకి సంపూర్ణమైన బలం లేకపోతే, వివిధ ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితి వస్తుందనీ, దీని వల్ల కేంద్రంలో పాలనకు అవరోధాలు ఏర్పడతాయనే అనుమానాలు బిజెపికి ఉన్నాయి. ప్రస్తుతం,దేశంలో బిజెపి బలంగానే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం బలహీనంగా వుంది. ఆంధ్రప్రదేశ్‌లో చాలా బలహీనంగా ఉంది. తమిళనాడు,కేరళలో కూడా అదే తీరు. తెలంగాణలో కాస్త బలిపడినట్లు తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో మాత్రం బిజెపి బలంగా కనిపిస్తోంది. కొన్ని రోజుల వ్యవధిలో దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సివుంది. ఫలితాలు ఎలా ఉండబోతాయో ఇంకా స్పష్టత రావాల్సివుంది. జమిలి ఎన్నికలు జరిగితే, ఐదేళ్లపాటు యథేచ్ఛగా తమ విధానాలను అమలుపరిచే స్వేచ్ఛ మరింత బలంగా ఉంటుందనే అభిప్రాయంలోనే బిజెపి మొదటి నుంచి వుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సహజంగా ఆధిక్యత వస్తుందనీ,దాని వల్ల ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుందనే భయంలో కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.దీని వల్ల వారు అనుసరించే విధానాల వల్ల దేశ సమగ్రతకు జమిలి ఎన్నికల వల్ల భంగం కలిగే ప్రమాదం ఉందనీ కొందరు విమర్శిస్తున్నారు.పరోక్షంగా అధ్యక్ష వ్యవస్థకు నిర్మాణం చేపట్టే ప్రతిపాదనలు దీని వెనకాల దాగి ఉన్నాయనే భయాలు కొందరిలో లేకపోలేదు.ఈ భయాలన్నీ ప్రధాన జాతీయ పార్టీ కాంగ్రెస్ కు, ఆ పార్టీని అనుసరిస్తున్న కొన్ని పార్టీలకు ఉన్నాయి. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే, కొన్ని శాసనసభల పదవీకాలాన్ని కుదించాలి,కొన్నింటిని పొడిగించాలి.ఇటువంటి కీలకమైన చర్యలకు రాజ్యాంగ సవరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీనికి సరిపడా బలం ఉభయ సభల్లోనూ బిజెపికి ఉంది. 'సమాంతర ఎన్నికల'పై, 2018 ఆగస్టులో లా కమీషన్ ఒక ముసాయిదా నివేదిక సమర్పించింది. చట్ట సవరణ జరిగిన తర్వాత, దేశంలోని సగం రాష్ట్రాల శాసనసభలు ఆమోదం తెలపాల్సిన అవసరం కూడా ఉంది.ఇక్కడ కూడా బిజెపికి వాతావరణం అనుకూలంగానే ఉంది.లోక్ సభ, శాసనసభలకు ఎన్నికలు జరిగినప్పుడు కొన్నిచోట్ల క్రాస్ ఓటింగ్ జరుగుతూ ఉంటుంది. శాసనసభకు స్థానిక పార్టీకి వేసి, లోక్ సభకు జాతీయ పార్టీకి వేసే మైండ్ సెట్ కొందరు ఓటర్లలో ఉంటుంది.ఫలితాలు తదనుగుణంగా వచ్చిన అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఎల్లవేళలా,అధికారంలో ఉండే పార్టీలకు సంపూర్ణమైన మెజారిటీ ఉండకపోవచ్చు.సంకీర్ణంగా ప్రభుత్వాలు నడిపే క్రమంలో, విభేదాల వల్ల ప్రభుత్వం పడిపోయినప్పుడు,ఎన్నికలు మళ్ళీ నిర్వహించాల్సి వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ఏమి చేయాలి? అనే సందేహాలు ఉన్నాయి. ఇలా జమిలి ఎన్నికల అంశంలో అనేక అనుకూల, ప్రతికూల అంశాలు,సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. వీటన్నింటిపై దేశ వ్యాప్తంగా సమగ్రమైన చర్చ జరగాలి. ప్రజామోదాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.చర్చలో అన్ని పార్టీలు పాల్గొనాలి.మంచిచెడు, లాభనష్టాలు బేరీజువేసుకోవాలి. "కేవలం ఇది చర్చించే విషయం కాదని,భారత్ కు ఎంతో అవసరం", అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనేకమార్లు ఉద్ఘాటించారు. పార్టీల రాజకీయ స్వార్ధాలు ఎట్లా ఉన్నా,దేశ ప్రజల మంచికి,దేశ ప్రగతికి పట్టంకట్టే విధానాలను స్వాగతించవచ్చు. 2029 లో నైనా జరుగుతాయా? అన్నది వచ్చే ఎన్నికల్లో ఫలితాలను బట్టి కొంత అంచనా వెయ్యవచ్చు.ఈసారి ఎన్నికల్లో 400 స్థానాల లక్ష్యంతో బిజెపి కదనరంగంలో దిగుతోంది.కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా చాలా బలంగా వున్నాయి. ఇండియా కూటమి మధ్య ఐక్యత ఆశించిన స్థాయిలో లేదన్నది నేటి మాట.జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే? ప్రణాళిక చాలా అవసరం.ఈవిఎంలు, వీవీప్యాట్ లు,భద్రతా సిబ్బంది మొదలైన అనేక అంశాలలో పకడ్బందీ ప్రణాళికలు రచించుకోవాల్సివుంటుంది. :::మాశర్మ -
రెండు దశల్లో ‘జమిలి’ ఎన్నికలు
న్యూఢిల్లీ: ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’పై అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమరి్పంచింది. రామ్‌నాథ్ కోవింద్‌తోపాటు కమిటీ సభ్యులైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ ఎన్.కె.సింగ్, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాష్ కాశ్యప్, లోక్‌సభలో మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ముర్మును నివేదిక అందజేశారు. జమిలి ఎన్నికలపై 18,629 పేజీల ఈ నివేదికలో ఉన్నత స్థాయి కమిటీ కీలక సిఫార్సులు చేసింది. రెండంచెల విధానాన్ని సూచించింది. తొలుత లోక్‌సభ, అన్ని రాష్ట్రాల శాసనసభలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత 100 రోజుల్లోగా అన్ని రకాల స్థానిక సంస్థలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంది. జమిలి ఎన్నికలతో అభివృద్ధి వేగవంతం అవతుందని, దేశానికి మేలు జరుగుతుందని ఉద్ఘాటించింది. ఈ ఎన్నికల కోసం కోవింద్ కమిటీ రాజ్యాంగానికి మొత్తం 18 సవరణలు సూచించింది. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే.... రామ్‌నాథ్ కోవింద్ కమిటీని 2023 సెప్టెంబర్ 23న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ 191 రోజులపాటు విస్తృత పరిశోధన సాగించింది. భాగస్వామ్యపక్షాలు, నిపుణులతో సంప్రదింపులు జరిపింది. దక్షిణాఫ్రికా, స్వీడన్, బెల్జియం, జర్మనీ, జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, బెల్జియం తదితర దేశాల్లో అమల్లో ఉన్న జమిలి ఎన్నికల ప్రక్రియలను అధ్యయనం చేసింది. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే కోవింద్ కమిటీ సిఫార్సుల చేసిందని అధికార వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఈ సిఫార్సుల ప్రకారం రాజ్యాంగానికి కనిష్ట సవరణలతో జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చని పేర్కొన్నాయి. 32 పార్టీల మద్దతు జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోవింద్ కమిటీ సేకరించింది. అభిప్రాయం చెప్పాలంటూ 62 పార్టీలకు సూచించగా, 47 పార్టీలు స్పందించాయి. ఇందులో 32 పార్టీలు జమిలికి జైకొట్టాయి. 15 పార్టీలు వ్యతిరేకించాయి. మిగిలిన 15 పార్టీలు స్పందించలేదు. బీజేపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఏఐఏడీఎంకే, బిజూ జనతాదళ్, మిజో నేషనల్ ఫ్రంట్, శివసేన, జనతాదళ్(యూ), శిరోమణి అకాలీదళ్ తదితర పార్టీలు మద్దతు ప్రకటించగా, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, సీపీఎం, సీపీఐ, ఎంఐఎం, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, నాగా పీపుల్స్ ఫ్రంట్, సమాజ్‌వాదీ పార్టీ వంటివి వ్యతిరేకించాయి. త్వరలో లా కమిషన్ నివేదిక ఏకకాలంలో ఎన్నికలపై లా కమిషన్ త్వరలో తన నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది. 2029 నుంచి జమిలి ఎన్నికలు ప్రారంభించాని లా కమిషన్ సిఫార్సు చేయబోతున్నట్లు సమాచారం. లోక్‌సభ, శాసనసభలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్ సూచించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కోవింద్ కమిటీ సిఫార్సులు ► లోక్‌సభలో హంగ్, అవిశ్వాస తీర్మానం వంటి సందర్భాలు ఎదురైనప్పుడు మళ్లీ తాజాగా ఎన్నికలు నిర్వహించాలి. కొత్త సభను ఏర్పాటు చేయాలి. ► ఎన్నికలు జరిగి కొత్తగా కొలువుదీరిన లోక్‌సభ ఐదేళ్లు కొనసాగదు. అంతకంటే ముందున్న సభ గడువు ఎన్నాళ్లు మిగిలి ఉంటుందో అప్పటివరకు మాత్రమే కొత్త సభ మనుగడ సాగిస్తుంది. ► రాష్ట్రాల శాసనసభలు లోక్‌సభ కాల వ్యవధి ముగిసేవరకు(ముందుగా రద్దయితే తప్ప) పనిచేస్తాయి. ► జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 83(పార్లమెంట్ కాల వ్యవధి), ఆర్టికల్ 172(శాసనసభ కాల వ్యవధి)కు సవరణ చేయాలి. ► ఆర్టికల్ 83, ఆర్టికల్ 172కు సవరణ చేయడానికి రాష్ట్రాల అమోదం అవసరం లేదు. ► జమిలి ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల ఎన్నికల సంఘాలతో సంప్రదించి ఒక ఉమ్మడి ఓటరు జాబితా, ఓటరు గుర్తింపు కార్డులు రూపొందించాలి. ఇందుకోసం ఆర్టికల్ 325కి సవరణ చేయాల్సి ఉంటుంది. ► స్థానిక సంస్థలతో ఏకకాలంలో ఎన్నికల కోసం ఆర్టికల్ 324ఏను సవరించాలి. ► ఆర్టికల్ 325, ఆర్టికల్ 324ఏకు సవరణ చేయాలంటే రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి. ► ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతిఏటా ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడుతోంది. విలువైన సమయం వృథా అవుతోంది. జమిలి ఎన్నికలతో ఇలాంటి సమస్యలు పరిష్కరించవచ్చు. ► జమిలి ఎన్నికల కోసం ప్రభుత్వం ఒక పటిష్టమైన చట్టబద్ధ యంత్రాంగాన్ని రూపొందించాలి. -
దేశ ప్రజాస్వామ్యానికి విఘాతం: ఆప్
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల విధానం దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విఘాతం కలిగిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన ఆప్ ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక విధానం దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ మౌలిక స్వరూపం, సమాఖ్య విధానాలను దెబ్బతీస్తుంది. పార్లమెంట్, శాసనసభల్లో హంగ్ ఏర్పడిన సందర్భాల్లో ఈ విధానంలో పరిష్కారం లేదు. పైపెచ్చు పార్టీ ఫిరాయింపులను, ఎమ్మెల్యేలు, ఎంపీలను బహిరంగంగానే కొనుగోలు చేసేందుకు దారులు చూపుతుంది. జమిలి ఎన్నికల నిర్వహణతో ఆదా అయ్యే ప్రజాధనం కేంద్ర వార్షిక బడ్జెట్లో కేవలం 0.1 శాతం మాత్రమే. సంకుచిత ఆర్థిక లాభాలు, పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాంగం, ప్రజాస్వామ్య సిద్ధాంతాలను త్యాగం చేయజాలం’అని ఆప్ పేర్కొంది. -
Election Commission of India: ప్రతి 15 ఏళ్లకు రూ.10 వేల కోట్లు కావాలి
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు అవసరమైన వనరులపై కేంద్ర ఎన్నికల సంఘం అంచనాలు వేస్తోంది. ఒకే విడతలో లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరపాల్సి వస్తే కొత్త ఈవీఎంల కొనుగోలుకు ప్రతి 15 ఏళ్లకు రూ.10 వేల కోట్లు అవసరమవుతాయని లెక్కలు కట్టింది. ఒక్కో ఈవీఎం జీవిత కాలం 15 ఏళ్లు కాగా, ఒక్కో మెషీన్‌ను మూడు సార్లు వాడుకోవచ్చని తెలిపింది. ఏకకాలంలో జరిపే ఎన్నికలకు దేశవ్యాప్తంగా 11.80 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక్కో పోలింగ్ బూత్‌లో జత ఈవీఎంలు.. ఒకటి లోక్‌సభకు, మరోటి శాసనసభ నియోజకవర్గానికి అవసరమవుతాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బ్యాలెట్ యూనిట్(బీయూ)లు 46,75,100, కంట్రోల్ యూనిట్(సీయూ)లు 33,62,300, వీవీప్యాట్లు 36,62,600 అవసరమవుతాయని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే తెలిపింది. కనీసం ఒక బీయూ, ఒక సీయూ, ఒక వీవీప్యాట్లను కలిపి ఒక ఈవీఎంగా పరిగణిస్తారు. ఒక బీయూ ఖరీదు రూ.7,900, ఒక సీయూ ఖరీదు రూ.9,800, ఒక వీవీప్యాట్ ఖరీదు రూ.16,000గా తాజాగా నిర్ణయించింది. అదనంగా పోలింగ్, భద్రతా సిబ్బంది, ఈవీఎంల నిర్వహణ కేంద్రాలు, మరిన్ని వాహనాలు అవసరమవుతాయని కూడా ఎన్నికల సంఘం పేర్కొంది. కొత్తగా ఈవీఎల తయారీ, ఇతర సౌకర్యాలను సమకూర్చుకున్నాక 2029లో మాత్రమే మొదటి జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు అవకాశం ఉందని స్పష్టం చేసింది. -
జమిలి ఎన్నికలు అప్రజాస్వామికం
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల యోచనను కాంగ్రెస్ గట్టిగా వ్యతిరేకించింది. ఈ విధానం సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి విరుద్ధమని పేర్కొంది. ఒకే దేశం–ఒకే ఎన్నికల ఆలోచనను పూర్తిగా పక్కనబెట్టాలని, దీనిపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో ఏర్పాటైన కమిటీని రద్దు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. కమిటీ కార్యదర్శి నితేన్ చంద్రకు ఈ మేరకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. ఒకే విడతలో ఎన్నికల కోసం సగం పదవీ కాలం కూడా పూర్తవని అసెంబ్లీలను రద్దు చేస్తే ఓటర్ల హక్కులను కాలరాయడమేనన్నారు. -
జమిలి అమలుకు అవరోధాలు
ఒక దేశ రాజకీయ నిర్మాణంలో వివిధ స్థాయులలో ఏకకాల ఎన్నికల కంటే అసెంబ్లీలకు, పార్లమెంట్ ఎన్నికలకు వేర్వేరు నిర్ణీత తేదీలు ఉండటం సర్వ సాధారణం. అయితే, భారత్‌లో ఆసక్తికరంగా లోక్‌సభ, అసెంబ్లీలకు జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయాన్ని రూపొందించడానికి పెద్ద ఎత్తున ప్రయ త్నాలు జరుగుతున్నాయి. కానీ, పార్లమెంటరీ కమిటీ నిశ్చితాభిప్రాయం ఏమిటంటే, రెండు దశల్లో ఎన్నికలు జరగాలన్నదే! కొన్ని రాష్ట్రాలకు లోక్‌సభ పదవీ కాలం మధ్యలోనూ, మరికొన్నింటికి లోక్‌సభతోపాటు ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, పదేపదే జరిగే ఎన్నికల ద్వారా అనవ సరంగా సమయం, ఖర్చు చేయకూడదనే ఆలోచన నుంచి వచ్చిన ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానం అనేది దాని అమలు సాధ్యతపైనే ఆధారపడి ఉంది. ఒక దేశం, ఒకే ఎన్నిక’ విధానం అమలుకు రాజ్యాంగ సవరణలు, ఇతర పరిశీలనల విషయమై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ... దీనికి సంబంధించి ప్రజల సూచనలను కోరింది. ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ అనే ఆలోచనకు ప్రధాన కారణం సమయం, ఖర్చు, ఆదా చేయడం. ఈ రెండు అంశాలు ప్రపంచవ్యాప్తంగా వర్తిస్తాయి. కానీ, సమాఖ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాలలో దాదాపు ఎక్కడా సమాఖ్య స్థాయిలో, ప్రాంతీయ (రాష్ట్ర) స్థాయులలో ఏకకాల ఎన్నికలు జరగడం లేదు. నిజానికి సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం– న్యాయంపై ఏర్పర్చిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, ఏకకాల ఎన్నికల అంశాన్ని పరిశీలించిన 79వ నివేదిక... ప్రపంచవ్యాప్తంగా దక్షిణాఫ్రికా, స్వీడన్ దేశాల్లోని రెండు కేసులను మాత్రమే ఉదాహరించింది. సార్వత్రిక వయోజన ఓటు హక్కును ప్రతి పాదిస్తున్న దక్షిణాఫ్రికాలో ఎన్నికలు 1994లో మాత్రమే ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్ర పోరా టానికి నాయకత్వం వహించిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్... సమాఖ్య, ప్రాంతీయ స్థాయులలో (వెస్ట్రన్ కేప్ మినహా) దేశమంతటా విజయం సాధించడం కొనసాగించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి 25 ఏళ్లలో, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా గెలుస్తూ వచ్చిన భారతదేశ పరి స్థితికి ఇది భిన్నమైనది కాదు. భారతదేశంలో మరింత స్పర్థాత్మక రాజకీయ దృశ్యం కారణంగా, ఆ తర్వాత హంగ్ అసెంబ్లీలు (హంగ్ పార్లమెంటు కూడా), పార్టీని మొత్తంగా ఖాళీ చేసి వేరే పార్టీలోకి గెంతేయడం (ఫ్లోర్ క్రాసింగ్) మొదలైనవి కనిపించడం ప్రారంభమైంది. ఫలితంగా చట్టసభల రద్దు, ఎన్నికలు, వివిధ సమయాల్లో పార్లమెంటుకు, రాష్ట్రాలకు (శాసనసభ లేకుండా) ఆరు నెలల కంటే ఎక్కువ విరామం ఏర్పడుతూ వచ్చింది. కేంద్రంలో, రాష్ట్రాలలో ఇలాంటి స్థితి ప్రజాస్వా మ్యానికి ఆమోదయోగ్యం కాదు. పైగా భారత రాజ్యాంగం దీనికి అనుమతించదు. స్వీడన్ విషయానికి వస్తే ఆ దేశం మునిసి పాలిటీలు, రీజియన్లలో ఏకీకృత ప్రభుత్వాన్ని కలిగి ఉంది, కానీ రీజియన్లలో మాత్రం ఫెడరల్ వ్యవస్థలోని ప్రావిన్సుల వలె ఉండదు. పైగా వాటి మధ్యన క్రమానుగత సంబంధం లేదు. ముఖ్యంగా, రెండూ వేర్వేరు రకాల పనులను చేపట్టే స్థానిక ప్రభుత్వ రూపాలు. స్వీడిష్ రాజ్యాంగం ముందస్తు ఎన్నికలను అనుమతిస్తుంది. అయితే ఇవి రద్దు అయిన కాలం నుండి మిగిలి ఉన్న కాలానికి మాత్రమే పరిమిత మవుతాయి. ఒక దేశంలోని రాజకీయ నిర్మాణంలో వివిధ స్థాయులలో ఏకకాల ఎన్నికల కంటే అసెంబ్లీలు, సమాఖ్య పార్లమెంట్ల ఎన్నికలకు నిర్ణీత తేదీలు ఉండటం చాలా సాధారణ లక్షణం. పార్లమెంటరీ ప్రభుత్వ రూపాన్ని కలిగి ఉన్న కెనడా సమాఖ్య వ్యవస్థ ఫెడరల్ స్థాయిలోనూ, దాని ప్రావిన్సు లలోనూ రెండు చట్టాలను రూపొందించింది. ఎన్నికల నిర్వహణకు ఒక నిర్ణీత తేదీని ప్రతి పాదిస్తుంది, ఆ తేదీ ప్రావిన్స్ నుండి ప్రావిన్స్‌కు మారుతూ ఉంటుంది. ఫెడరల్ ఎన్నికల షెడ్యూల్ వేరొక దానిని అనుసరిస్తుంది. ఆస్ట్రేలియాలో ఫెడ రల్ పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల (వాటిలో చాలా వరకు) కాలావధులు వరుసగా మూడు, నాలుగు సంవత్సరాలు ఉంటాయి. తద్వారా అక్కడ జమిలి ఎన్నికలను మినహాయించారు. ‘నిర్దిష్ట తేదీ, పదవీకాలం’ ఎన్నికల నమూనా తక్షణమే అమెరికాను గుర్తు చేస్తుంది. అక్కడ అధ్యక్ష, గవర్నర్ ఎన్నికలు ప్రతి నాలుగు సంవ త్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతాయి. అధ్యక్షుడు లేదా గవర్నర్ పని చేయనట్లయితే వారి స్థానంలోకి రాగల యోగ్యత ఉన్నవారి కోసం ఒక వ్యవస్థ అమలులో ఉంది. ఆ ప్రక్రియ ద్వారా పూర్తి కాలాన్ని కొనసాగించడం సాధ్యమవుతుంది, అయితే ఇది కొన్నిసార్లు ‘ప్రజల స్థాయిలో’ ఎన్ని కల్లో పోటీ చేయకుండానే 1974లో గెరాల్డ్ ఫోర్డ్ అధ్యక్షుడిగా మారడం వంటి క్రమరాహిత్యాలకు దారి తీస్తుంది. అంతేకాకుండా, ప్రతి రెండు సంవ త్సరాలకు ఒకసారి అమెరికా కాంగ్రెస్‌లో, రాష్ట్రాల అసెంబ్లీలలో ప్రతినిధుల సభకు ఎన్నికలు జరుగు తాయి. ప్రైమరీలకు సంబంధించి అమెరికన్ సంప్ర దాయం ప్రకారం, దేశం ఆచరణాత్మకంగా ప్రతి సంవత్సరం ఎన్నికల మోడ్‌లో ఉంటుంది. భారత్‌లో ఆసక్తికరంగా లోక్‌సభ, అసెంబ్లీలకు జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయాన్ని రూపొందించడానికి పెద్ద ప్రయత్నాలు జరిగినప్పటికీ, పార్లమెంటరీ కమిటీ నిశ్చితాభిప్రాయం ఏమి టంటే – రెండు దశల్లో ఎన్నికలు జరగాలన్నదే! కొన్ని రాష్ట్రాలకు లోక్‌సభ పదవీకాలం మధ్య లోనూ, మరి కొన్నింటికి లోక్‌సభతోపాటు ఎన్ని కలు జరపాల్సి ఉంటుంది. సమాఖ్య, ప్రాదేశిక ఎన్నికలను వేరు చేయడం వల్ల ఓటర్లు తమ రాష్ట్రం లేదా ప్రావిన్స్‌లో ఉన్న నాయకులు లేదా జాతీయ ఎన్నికల సమస్యల కారణంగా ఇటూ అటూ అవగల సంభావ్యతకు గురికాకుండా ఉంటారని నమ్మకం. పోరులో ఉన్న ప్రాంతీయ పార్టీలకు (లేదా పార్టీలకు) ప్రత్యేక గుర్తింపు లేనప్పుడు అలాగే ఓటర్లు సులభంగా గుర్తించగలిగేలా పార్లమెంటరీ, అసెంబ్లీ ఎన్నికలకు మధ్య తేడాను సూచించే కారణం లేనప్పుడు ఇది జరిగే అవకాశం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ, పదేపదే జరిగే ఎన్నికల ద్వారా అనవసరంగా సమయం, డబ్బులు ఖర్చు చేయకూడదనే ఆలోచన ఆమోదయోగ్యమైనదే. జర్మనీలో ఇటీవల నేపాల్ అనుభవాల నుండి, ఎక్కువ రాజకీయ సుస్థిరతను అందించే రాజ్యాంగపరమైన నిబంధనలు సాధ్యమయ్యే అవకాశం కనిపించింది. ఉదాహరణకు, జర్మన్ బేసిక్ లా, 2015 నేపాలీ రాజ్యాంగం అవిశ్వాసంలో సాను కూల ఓట్లను మాత్రమే అనుమతిస్తాయి. అటువంటి తీర్మానంతో పాటు తదుపరి నాయకుడి పేరు కూడా ఉండాలి. బ్రిటన్ లో, కెనడాలో కూడా పార్లమెంటు నిబంధనలను పరిష్కరించే ప్రయత్నాలు... కామన్వెల్త్ సంప్రదాయం ద్వారా సభను రద్దు చేసి, తాజా తీర్పును కోరే హక్కును ప్రధానమంత్రి కలిగి ఉండటం ద్వారా విఫలమయ్యాయి. నేపాల్‌లో అదే సంప్రదాయాన్ని అమలు చేయాలని కోరినప్పుడు, దానిని సుప్రీంకోర్టు 2021లో రెండు సందర్భాల్లో అనుమతించకపోగా, కొత్త నాయకుడిని ఎన్నుకో మని సభను కోరింది. మధ్యంతర ఎన్నికలపై ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా 2017లో ఎన్ని కైన సభ పూర్తి ఐదేళ్ల కాల వ్యవధిలో పాలన సాగించేలా అది దోహదపడింది. మంజీవ్ సింగ్ పురి వ్యాసకర్త భారత మాజీ రాయబారి -
జమిలి ఎన్నికలు ఎన్నడు?
'ఒకే దేశం - ఒకే ఎన్నిక' అంశం మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సి వుంది. ఈ లోపు నిర్ణయం వెలువడి ఎన్నికలు జమిలిగా జరుగతాయని అనుకోవడం సత్యదూరమనే చెప్పాలి.ఆ తర్వాత భవిష్యత్తులో జరుగబోయే ఎన్నికల నాటికి ఏదైనా స్పష్టత వస్తుందేమో! చూడాలి. దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు,లోక్ సభకు ఏక కాలంలో ఎన్నికలు జరపాలనే నినాదాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదే పదే వినిపిస్తూనే వున్నారు.మొదటి నుంచీ జమిలి ఎన్నికల నిర్వహణపై ఆయన పట్టుదలగానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే, ఈ అంశంపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతిరామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో గత సంవత్సరం సెప్టెంబర్ లో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసే దిశగా కమిటీ పనిచేయడం కూడా ప్రారంభించింది. ప్రజల నుంచి సూచనలు, సలహాలను ఆహ్వానించింది. స్పందన కూడా విశేషంగా వచ్చింది. ఇప్పటివరకూ సుమారు 5వేలకు పైగా ఈ - మెయిల్స్ వచ్చినట్లు సమాచారం. ఈ జనవరి 15లోపు పంపాలని ఇప్పటికే తెలియజేసారు. ఇప్పటి వరకూ రెండు సార్లు సమావేశాలు జరిగాయి. కేంద్రం ఇటీవలే 6 జాతీయ పార్టీలు, 33 ప్రాంతీయ పార్టీల నుంచి అభిప్రాయాలు కోరింది. జమిలి ఎన్నికలకు సంబంధించి న్యాయ కమిషన్ నుంచి కూడా సలహాలు తీసుకుంది. మరి కొన్ని నెలల వ్యవధిలోనే సాధారణ ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో,ప్రతిపక్ష పార్టీల వ్యాఖ్యల వేడి పెరుగుతోంది. ముఖ్యంగా తృణమూల్ పార్టీ అధినేత్రి,పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జమిలి ఎన్నికలకు ససేమిరా అంటున్నారు. అదే విషయాన్ని స్పష్టం చేస్తూ రామ్ నాథ్ కోవింద్ కమిటీకి ఉత్తరం కూడా రాశారు. ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వాన్ని అనుమతించే వ్యవస్థగా మారుతుందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.జమిలి ఎన్నికలకు తాము దూరంగానే ఉంటామని స్పష్టం చేశారు. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కారణాలతో తమ ఇదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయలేకపోవచ్చని గత చరిత్రను గుర్తుచేస్తున్నారు. అనేకసార్లు లోక్ సభ రద్దయిందని, భవిష్యత్తులో కూడా అటువంటి పరిస్థితులు తలెత్తుతాయనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓటర్ల ఎన్నికల విశ్వాసాన్ని ఉల్లంఘించడం న్యాయమా? అని ఆమె ప్రశ్నిస్తున్నారు. తృణమూల్ పాటు మిగిలిన ప్రతిపక్ష పార్టీలకు అనేక భయాలు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. 'జమిలి' అంటే రాష్ట్రాలపై దాడి చేయడమేనని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శనా బాణాలు సంధిస్తున్నారు. ఈ ఎన్నికల వల్ల సామాన్యులకు ఒరిగేదేంటని కేజ్రీవాల్ ప్రశ్నిస్తున్నారు. 2024లో జమిలి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని లా కమిషన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2029 నుంచి లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేలా లా కమిషన్ ఓ ఫార్ములా రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. లా కమిషన్ ఇంకా తుది నివేదికను తయారుచేయాల్సివుంది. పంచాయతీల నుంచి పార్లమెంట్ దాకా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్నది బిజెపి ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ముఖ్యంగా,దీనివల్ల డబ్బు ఆదా అవుతుందని,ఆ ధనాన్ని అభివృద్ధి పనుల కోసం కేటాయించవచ్చని మోదీ సర్కార్ వాదిస్తోంది.ఈ చర్చ ఈనాటిది కాదు.2019లో రెండవసారి అధికారంలోకి వచ్చిన వెనువెంటనే అన్ని పార్టీలను ఆహ్వానించి దీనిపై చర్చ కూడా జరిపారు. అప్పట్లో దేశ వ్యాప్తంగా మొత్తం నలబై రాజకీయ పార్టీలను ఈ సమాలోచనకు ఆహ్వానించారు. 21పార్టీలు మాత్రమే హాజరయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలు అప్పట్లో జమిలి ఎన్నికలకు జై కొట్టాయి.వచ్చిన మిగిలిన పార్టీలు విభిన్న స్వరాలను వినిపించాయి.కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగానే ఉంది. లోక్ సభకు,శాసనసభలకు సమాంతరంగా ఏకకాలంలో జరపడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ప్రధానంగా ఖర్చు కలిసివస్తుందన్నది వాస్తవమే. వివిధ ఎన్నికల కోడ్ పేరుతో జరగాల్సిన కార్యక్రమాలు జరగకుండా పనులు ఆగిపోవడం, సమయం వృధా అవ్వడం మొదలైన వాటికి అడ్డుగోడ పడుతుంది.తద్వారా పనిరోజులు పెరుగుతాయి.ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. కనీసం రెండు,మూడు రాష్ట్రాలలో ఎన్నికలు తప్పనిసరిగా వస్తుంటాయి.ఈ నేపథ్యంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోడానికి వెనుకాడే పరిస్థితి వస్తుంది. అదే అన్ని చోట్ల సమాంతర ఎన్నికల విధానం అందుబాటులో ఉంటే,కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మరింతగా పరిపాలనపై దృష్టి సారించే వెసులుబాటు ఉంటుంది. ఐదేళ్లకొకసారి అన్ని వ్యవస్థలకు ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల రాజకీయ సుస్థిరత నెలకొనే అవకాశం ఉంది.బిజెపి ప్రతిపాదిస్తున్న జమిలి ఎన్నికలపై కొందరు అనేక అనుమానాలు, సందేహాలు,అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదన వల్ల ఎటుచూసినా,కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికే ఎక్కువ మేలుజరుగుతుందనీ,అందుకే, దీనిపై బలంగా ప్రచారం చేస్తోందనే భావంలో ప్రతిపక్షాలు ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీకి సంపూర్ణమైన బలం లేకపోతే, వివిధ ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితి వస్తుందనీ, దీని వల్ల కేంద్రంలో పాలనకు అవరోధాలు ఏర్పడతాయనే అనుమానాలు బిజెపికి ఉన్నాయి. ప్రస్తుతం,దేశంలో బిజెపి బలంగానే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం బలహీనంగా వుంది. ఆంధ్రప్రదేశ్ లో చాలా బలహీనంగా ఉంది.తమిళనాడు,కేరళలో కూడా అదే తీరు. తెలంగాణలో కాస్త బలిపడినట్లు తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి.ముఖ్యంగా ఉత్తరాదిలో మాత్రం బిజెపి బలంగా కనిపిస్తోంది.కొన్ని నెలల వ్యవధిలో దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సివుంది. ఫలితాలు ఎలా ఉండబోతాయో ఇంకా స్పష్టత రావాల్సివుంది. జమిలి ఎన్నికలు జరిగితే, ఐదేళ్లపాటు యథేచ్ఛగా తమ విధానాలను అమలుపరిచే స్వేచ్ఛ మరింత బలంగా ఉంటుందనే అభిప్రాయంలోనే బిజెపి మొదటి నుంచి వుంది.కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సహజంగా ఆధిక్యత వస్తుందనీ,దాని వల్ల ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుందనే భయంలో కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. దీని వల్ల వారు అనుసరించే విధానాల వల్ల దేశ సమగ్రతకు జమిలి ఎన్నికల వల్ల భంగం కలిగే ప్రమాదం ఉందనీ కొందరు విమర్శిస్తున్నారు.పరోక్షంగా అధ్యక్ష వ్యవస్థకు నిర్మాణం చేపట్టే ప్రతిపాదనలు దీని వెనకాల దాగి ఉన్నాయనే భయాలు కొందరిలో లేకపోలేదు.ఈ భయాలన్నీ ప్రధాన జాతీయ పార్టీ కాంగ్రెస్ కు, ఆ పార్టీని అనుసరిస్తున్న కొన్ని పార్టీలకు ఉన్నాయి. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే, కొన్ని శాసనసభల పదవీకాలాన్ని కుదించాలి,కొన్నింటిని పొడిగించాలి. ఇటువంటి కీలకమైన చర్యలకు రాజ్యాంగ సవరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీనికి సరిపడా బలం ఉభయ సభల్లోనూ బిజెపికి ఉంది. 'సమాంతర ఎన్నికల'పై, 2018 ఆగస్టులో లా కమీషన్ ఒక ముసాయిదా నివేదిక సమర్పించింది. చట్ట సవరణ జరిగిన తర్వాత, దేశంలోని సగం రాష్ట్రాల శాసనసభలు ఆమోదం తెలపాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ కూడా బిజెపికి వాతావరణం అనుకూలంగానే ఉంది.లోక్ సభ, శాసనసభలకు ఎన్నికలు జరిగినప్పుడు కొన్నిచోట్ల క్రాస్ ఓటింగ్ జరుగుతూ ఉంటుంది. శాసనసభకు స్థానిక పార్టీకి వేసి, లోక్ సభకు జాతీయ పార్టీకి వేసే మైండ్ సెట్ కొందరు ఓటర్లలో ఉంటుంది.ఫలితాలు తదనుగుణంగా వచ్చిన అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఎల్లవేళలా,అధికారంలో ఉండే పార్టీలకు సంపూర్ణమైన మెజారిటీ ఉండకపోవచ్చు. సంకీర్ణంగా ప్రభుత్వాలు నడిపే క్రమంలో, విభేదాల వల్ల ప్రభుత్వం పడిపోయినప్పుడు,ఎన్నికలు మళ్ళీ నిర్వహించాల్సి వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ఏమి చేయాలి? అనే సందేహాలు ఉన్నాయి.ఇలా జమిలి ఎన్నికల అంశంలో అనేక అనుకూల, ప్రతికూల అంశాలు,సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. వీటన్నింటిపై దేశ వ్యాప్తంగా సమగ్రమైన చర్చ జరగాలి. ప్రజామోదాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. చర్చలో అన్ని పార్టీలు పాల్గొనాలి.మంచిచెడు, లాభనష్టాలు బేరీజువేసుకోవాలి. "కేవలం ఇది చర్చించే విషయం కాదని,భారత్ కు ఎంతో అవసరం", అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనేకమార్లు ఉద్ఘాటించారు. పార్టీల రాజకీయ స్వార్ధాలు ఎట్లా ఉన్నా,దేశ ప్రజల మంచికి,దేశ ప్రగతికి పట్టంకట్టే విధానాలను స్వాగతించవచ్చు. 2029 లో నైనా జరుగుతాయా? అన్నది వచ్చే ఎన్నికల్లో ఫలితాలను బట్టి కొంత అంచనా వెయ్యవచ్చు. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
జమిలి ఎన్నికలు... కోవింద్ కమిటీకి 5,000 సూచనలు
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో ఏర్పాటైన ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ కమిటీకి ప్రజల నుంచి ఇప్పటిదాకా 5,000 పై చిలుకు సలహాలు, సూచనలు అందినట్టు సమాచారం. కమిటీ దీనిపై గతవారం సలహాలను ఆహా్వనించడం తెలిసిందే. జనవరి 15 దాకా అందే సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. గత సెపె్టంబర్లో ఏర్పాటైన కోవింద్ కమిటీ ఇప్పటిదాకా రెండుసార్లు సమావేశమైంది. జమిలి ఎన్నికలపై సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ ఆరు జాతీయ, 33 గుర్తింపు పొందిన పారీ్టలకు లేఖలు రాసింది. లా కమిషన్‌తో సమావేశమై అభిప్రాయాలను తెలుసుకుంది. జమిలి ప్రతిపాదనను, కోవింద్ కమిటీ ఏర్పాటును కాంగ్రెస్, పలు ఇతర విపక్షాలు ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకించడం తెలిసిందే. -
One Nation, One Election: జమిలి ఎన్నికలపై సూచనలివ్వండి
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి సూచనలివ్వాలంటూ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ కమిటీ ప్రజలను కోరింది. దేశంలో లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరపడానికి చట్ట పరమైన పరిపాలనా ఫ్రేమ్‌వర్క్‌లో చేపట్టాల్సిన మార్పులను తెలపాలని పిలుపునిచ్చింది. జనవరి 15వ తేదీలోగా అందిన సూచనలను పరిశీలనకు పరిగణిస్తామని ఒక నోటీసులో తెలిపింది. సూచనలను onoe.gov.in వెబ్సైట్లో పోస్టు చేయాలని సూచించింది. లేదా sc& hlc@gov.in కి మెయిల్ చేయవచ్చని వివరించింది. ఈ నోటీసును ఆరు జాతీయ పార్టీలకు, 33 రాష్ట్ర పార్టీలు, ఏడు గుర్తింపు పొందని రిజిస్టర్డ్ పార్టీలకు పంపినట్లు తెలిపింది. ఇదే అంశంపై లా కమిషన్ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటామంది. -
One Nation One Election: జమిలి ఎన్నికలకు 30 లక్షల ఈవీఎంలు కావాలి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలంటే 30 లక్షల ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎంలు) అవసరమని అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే జమిలి ఎన్నికలకు సన్నాహాలు పూర్తిచేయడానికి దాదాపు ఏడాదిన్నర సమయం కావాలని పేర్కొన్నాయి. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై దేశంలో చర్చ జరుగుతోంది. లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. కేంద్ర లా కమిషన్ ప్రస్తుతం జమిలి ఎన్నికల అంశంపై కసరత్తు చేస్తోంది. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే ఈవీఎంలు ఎన్నికావాలి? ఎంత సమయం అవసరం? అన్నదానిపై ఎన్నికల సంఘం అధికారులు లా కమిషన్‌కు కొన్ని నెలల క్రితం సమాచారం ఇచి్చనట్లు తెలుస్తోంది. ఒక్కో ఈవీఎంలో భాగంగా ఒక కంట్రోల్ యూనిట్, ఒక బ్యాలెట్ యూనిట్, ఒక వీవీప్యాట్ ఉంటాయి. జమిలి ఎన్నికలకు 30 లక్షల కంట్రోల్ యూనిట్లు, 43 లక్షల బ్యాలెట్ యూనిట్లు, 32 లక్షల వీవీప్యాట్లు కావాలని చెబుతున్నారు. కొన్ని బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లను రిజర్వ్‌లో ఉంచాల్సి ఉంటుంది కాబట్టి అదనంగా అవసరమని పేర్కొంటున్నారు. ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహిస్తే కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లు కలిపి దాదాపు 35 లక్షల ఓటింగ్ యూనిట్లను కొత్తగా సమకూర్చుకోవాల్సి ఉంటుందని సమాచారం. 12.50 లక్షల పోలింగ్ కేంద్రాలు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగినప్పటికీ రెండు ఓట్లు వేర్వేరుగా వేయాల్సి ఉంటుంది. అందుకు రెండు ఈవీఎంలు కావాలి. జమిలి ఎన్నికల్లో ఓటింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను భద్రపర్చడానికి తగిన వసతులు ఉండాలని ఎన్నికల సంఘం పేర్కొంది. గత లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 12.50 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 15 లక్షల కంట్రోల్ యూనిట్లు, 15 లక్షల వీవీప్యాట్లు, 18 లక్షల బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించారు. అన్నీ కలిపి కోటి యూనిట్లు కొనుగోలు చేయాలంటే రూ.15,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అంచనా. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలతోపాటు మున్సిపాల్టీలు, పంచాయతీల ఎన్నికలు నిర్వహించడంపై(ఒక దేశం, ఒకే ఎన్నిక) మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం కొనసాగిస్తోంది. -
Law Commission: 2029 నుంచే జమిలి ఎన్నికలు!
న్యూఢిల్లీ: లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. జమిలి ఎన్నికలు వచ్చే ఏడాది సాధ్యం కాదని లా కమిషన్ తేలి్చచెప్పినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై జస్టిస్ రితూరాజ్ అవస్థీ నేతృత్వంలోని లా కమిషన్ అధ్యయనం చేస్తోంది. 2029 నుంచి లోక్‌సభతోపాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా కమిషన్ ఓ ఫార్ములాను ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది. దాని ప్రకారం.. కొన్ని రాష్ట్రాల శాసనసభల కాలపరిమితిని పొడిగించాలి. మరికొన్ని రాష్ట్రాల శాసనసభల కాలపరిమితిని తగ్గించాలి. ఈ ఫార్ములాతోజమిలి ఎన్నికలు నిర్వహించడం సులువేనని లా కమిషన్ నిర్ణయానికి వచి్చనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జమిలి ఎన్నికలపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని సైతం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఓటర్ల జాబితాతో మేలు ఓటర్ల జాబితా విషయంలోనూ లా కమిషన్ కీలక సిఫార్సును తెరపైకి తీసుకొస్తోంది. లోక్‌సభ, శాసనసభలు, స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రస్తుతం వేర్వేరు ఓటర్ల జాబితాలను ఉపయోగిస్తున్నారు. వీటిని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రాల ఎన్నికల సంఘాలు రూపొందిస్తున్నాయి. అన్ని రకాల ఎన్నిలకు ఒక ఉమ్మడి ఓటర్ల జాబితా ఉండాలన్నదే లా కమిషన్ ఉద్దేశమని సమాచారం. దీనివల్ల ఖర్చు, మానవ వనరుల వినియోగం గణనీయంగా తగ్గుతాయని అభిప్రాయపడుతోంది. ఉమ్మడి ఎన్నికల జాబితా కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని చెబుతోంది. జమిలి ఎన్నికల ప్రక్రియలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్లు పోలింగ్ బూత్‌కు కేవలం ఒకే ఒక్కసారి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని లా కమిషన్ సూచిస్తోంది. అంటే ఒకే పోలింగ్ బూత్‌లో ఒకేసారి రెండు ఎన్నికల్లో ఓట్లు వేసేలా ఏర్పాట్లు ఉండాలని చెబుతోంది. జమిలి ఎన్నికలపై లా కమిషన్ సిఫార్సులు కొన్ని అనధికారికంగా బయటకు వచి్చనప్పటికీ తుది నివేదిక ఇంకా సిద్ధం కాలేదు. ఇంకా కొన్ని అంశాలపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఏడాది వ్యవధిలో రెండు దశలు లోక్‌సభ, శాసనసభలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధ్యయనం బాధ్యతను రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీకి కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. లా కమిషన్ మాత్రం ఏకకాలంలో లోక్‌సభ, శాసనసభల ఎన్నికలు నిర్వహించడంపై అధ్యయనం చేస్తోంది. కోవింద్ కమిటీ ఏర్పాటు నేపథ్యంలో లా కమిషన్ కూడా మూడు రకాల ఎన్నికలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. లోక్‌సభ, శాసనసభల ఎన్నికలను ఒక దశలో, స్థానిక సంస్థల ఎన్నికలను రెండో దశలో నిర్వహించాలని లా కమిషన్ అభిప్రాయపడుతోంది. -
2024లోగా జమిలి ఎన్నికలు సాధ్యం కాదు: లా కమిషన్
-
జమిలి ఎన్నికల కమిటీ కీలక నిర్ణయం
సాక్షి, ఢిల్లీ: వన్ నేషన్.. వన్ ఎలక్షన్ (ఒక దేశం, ఒకే ఎన్నికలు) అధ్యయనం కోసం ఏర్పాటు కమిటీ తొలి భేటీ ముగిసింది. శనివారం ఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. జమిలిపై అభిప్రాయాల సేకరణ చేపట్టడంతో పాటు సూచనలను తీసుకోవాలనుకుంటోంది. జమిలి కమిటీ తొలి భేటీలో సభ్యులకు సమావేశం అజెండా వివరించారు జమిలి కమిటీ చైర్మన్ కోవింద్. ఈ సమావేశంలో సభ్యులతో పాటు హోం మంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి మేఘ్‌వాలా పాల్గొన్నారు. భేటీ అంతిమంగా జమిలి ఎన్నికలపై అభిప్రాయాల కోసం.. గుర్తింపు పొందిన జాతీయ పార్టీలను ఆహ్వానించాలని ప్యానెల్ నిర్ణయించింది. జాతీయ పార్టీలతో పాటు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను సైతం ఆహ్వానించనున్నట్లు సమాచారం. వీళ్లతో పాటు పార్లమెంట్లో ప్రతినిధులుగా ఉన్న రాజకీయ పార్టీలకూ ఆహ్వానం అందించనుంది. ఇక.. లా కమిషన్ నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేపట్టాలని కోవింద్ కమిటీ నిర్ణయించింది. -
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
-
ఒకేసారి ఓటు ప్రజాస్వామ్యానికి చేటు
‘ఒకే దేశం– ఒకే ఎన్నిక’ను సమర్థించే వారి దగ్గర రెండు వాదనలు ఉన్నాయి. మొదటిది – ఖర్చు తగ్గుతుంది. రెండవది – ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల నియమావళి ఆంక్షలు దేశవ్యాప్తంగా ఒకే కాలానికి వర్తింపులో ఉంటాయి. దాని వల్ల అభివృద్ధి కుంటుపడదు. ఇక వ్యతిరేక వాదనలు వివేచన, వాస్తవికతల్లోంచి జనించినవి. ఓటు హక్కును ‘ప్రజాస్వామ్యంలోని అత్యంత ప్రాథమికమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ’ అని చెబుతారు. ఆ హక్కుకు ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానం పరిమితులను విధిస్తుంది. పార్లమెంటరీ ఎన్నికలు ఇప్పటికే అధ్యక్ష తరహా ఎన్నికలుగా మారుతున్న పరిస్థితుల్లో, ఈ ఏకకాల ఎన్నికలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మొత్తంగానే నాశనం చేసే ప్రమాదం ఉంది. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ వల్ల ప్రయోజ నాలు, నిష్ప్రయోజనాలను నేను సరిగ్గా, సరళంగా, సమతులంగా చెప్పగలనేమో చూద్దాం! ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ అనే భావన పైన, ఆ ఆవశ్యకత పైన అవగాహన కోసం ఇది మీకు సహాయకారిగా ఉండవచ్చు. ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ను సమర్థించే వారి దగ్గర రెండు వాదనలు ఉన్నాయి. మొదటిది, ఖర్చు తగ్గుతుంది. కదా మరి, దేశ వ్యాప్తంగా ఒకేసారి ఐదేళ్లకు జరిగే ఎన్నికల ఖర్చు... వివిధ సమయా లలో అనేకసార్లు జరిగే పలు ఎన్నికల మొత్తానికీ అయ్యే ఖర్చు కంటే తక్కువగానే ఉంటుంది. అయితే థరూర్, చక్రవర్తి అదేమంత చెప్పు కోదగిన పొదుపు కాదని అంటున్నారు. ఏడాదికి రూ. 5,000 కోట్ల లోపే ఉండే ఆ పొదుపు మొత్తం లేకున్నా కూడా భారత్ వంటి ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థలో అది ఏమంత నిర్ణయాత్మకమైన ఆందోళన కారకం కాదనేది వారి వాదన. రెండవ అనుకూల వాదన ఏమిటంటే, దేశం మొత్తానికీ ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల నియమావళి ఆంక్షలు దేశవ్యాప్తంగా ఒకే కాలానికి వర్తింపులో ఉంటాయి. దాని వల్ల ఎప్పుడూ ఏదో ఒకచోట అమలులో ఉండే ఎన్నికల ఆంక్షల కారణంగా అభివృద్ధి కుంటుపడటం అనే సమస్య ఉండదు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నియమావళి అన్నది దేశవ్యాప్తంగా అమలుకావలసి ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో ఆ నియమావళి అమలు పెద్ద విషయంగా ఉండటం లేదు. అసలు అమలవుతోందా అన్నది కూడా ముఖ్యమైన ప్రశ్న. అక్కడ ఆంక్షల్ని అతిక్రమిస్తున్నది అధికార పార్టీకి చెందినవారైతే నియమావళి నిస్సందేహంగా అమలు కానట్లే! ఇక వ్యతిరేక వాదనలు వివేచన, వాస్తవికతల్లోంచి జనించే ప్రాథమికమైన స్వభావం కలిగి ఉన్నవి. ఓటు హక్కును ‘‘ప్రజాస్వా మ్యంలోని అత్యంత ప్రాథమికమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ’’ అని చెబుతారు. ఆ హక్కుకు ‘ఒకే దేశం– ఒకే ఎన్నిక’ పరిమితులను విధిస్తుంది. ఉదాహరణకు, ప్రభుత్వం తన మెజారిటీ కోల్పోయి నప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటర్లకు ఉన్న హక్కును హరించేలా పార్లమెంటును కొనసాగించే మార్గాల అన్వేషణ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అనే ఈ భావన మనం కోరుకుంటున్న ప్రజాస్వామ్య ప్రయాణ మార్గాన్ని విఘాత పరచనూవచ్చు. ఆ మార్గాన్ని మనం విస్తృతపరచుకోవడానికి, మరింత లోతుకు తీసుకు వెళ్లడానికి ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానం అడ్డుపడుతుంది. ఉదా హరణకు, ఓటు వేసి ఎన్నుకున్న నాయకులను తిరిగి వెనక్కు పంపే హక్కు మనకు ఉండాలి. 50 ఏళ్ల క్రితమే 1974లో వాజ్‌పేయి ఈ ‘రీకాల్’ హక్కు అవసరాన్ని గుర్తించారు. అయితే ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ ఈ హక్కుకు విరుద్ధమైనది. ఐదేళ్లకోసారి ఎన్నికలు అనే విధానం... ఓటు వేసి, ప్రభుత్వాలను ఎన్నుకునేందుకు పౌరులకున్న అవకాశాన్ని కుదించడం ద్వారా మన ప్రజాస్వామ్యాన్ని ఇరుకైనదిగా మార్చేస్తుంది. ఇప్పుడిక ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానం అమలుకు అవసర మైన రాజ్యాంగ సవరణల చిక్కుల దగ్గరికి వద్దాం. మొదటిది–ఎన్నికల ఏకకాలీనత కోసం సవరణలు! ఆ సవరణల వల్ల కొన్ని రాష్ట్రాల్లో శాసనసభలు పొడిగింపును పొందుతాయి. మరికొన్ని చోట్ల శాసనసభల కాలపరిమితిని కుదించాల్సి వస్తుంది. అప్పుడది కచ్చితంగా ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా ఆడుతున్న ఆట అవదా? ఓటర్లు ఇచ్చిన ఐదేళ్ల కాలాన్ని ఏకపక్షంగా తగ్గించడమో, పెంచడమో చేసినట్లే కదా! ఐదేళ్ల కన్నా ముందే ప్రభుత్వం పడిపోతే అప్పుడు రెండో రకం సవరణలు అవసరం అవుతాయి. మిగిలిన కాలానికి రాష్ట్రపతి పాలన రాష్ట్ర స్థాయిలో అవాంఛనీయమైనదీ, కేంద్రస్థాయిలో అసాధ్యమైనదీ. ఇందుకు ఒక పరిష్కారం– జర్మనీ తరహా నిర్మాణాత్మక అవిశ్వాస తీర్మానం. ఎలాగంటే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం ఉంటే తప్ప అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి లేదక్కడ. పడగొట్టినవాళ్లే ప్రభుత్వాన్ని నిలబెట్టాలి. వినడానికి బాగుంది కానీ, ఆచరణలో ఎల్లవేళలా ఇది సాధ్యమా? ఉదాహరణకు, పాలకపక్షం నుంచి చీలిపోయిన పక్షం, ప్రతిపక్షం వైపు మొగ్గు చూపడానికి నిరా కరిస్తే అప్పుడేం జరుగుతుంది? ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం తన మెజా రిటీని కోల్పోతుంది, కానీ ఆ స్థానంలోకి వచ్చేవారెవరూ లేకపోవడం వల్ల అలాగే కుంటుతూ నడుస్తుంది. లేదా ఒకవేళ సంకీర్ణ కూటమిలోని భేదాభిప్రాయాల వల్ల బడ్జెట్‌కు పార్లమెంటులో ఆమోదం లభించలేదనే అనుకుందాం? అప్పుడిక పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అటువంటి ప్రభుత్వం తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిందే. కానీ çసభ్యుల బలం ఉన్న కారణంగా బడ్జెట్‌కు ఆమోదం పొందలేని ఆ ప్రభుత్వం ఏమీ కుప్పకూలి పోదు. ఇలాంటి సందర్భాలలో ఐదేళ్ల కాల వ్యవధిలో మిగిలి ఉన్న కాలానికి మాత్రమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఎన్నికల సంఘం సూచించింది. అయితే అది ఓటు అనే వనరును నిర్లక్ష్యంగా ఉపయో గించుకున్నట్టు అవదా? ఓటు విలువ కొన్నిసార్లు ఐదేళ్ల కాలానికీ, మరి కొన్నిసార్లు ఐదేళ్లలో మిగిలిన భాగానికీ ఉంటుందా? ప్రజాస్వామ్యంలో రెండు రకాల ఓట్లు ఉండొచ్చా? ఇవీ ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ భావనకు సంబంధించి పైపైన ఆలో చిస్తేనే ఉత్పన్నమయ్యే ప్రాథమిక ఆందోళనలు. భారతదేశ ప్రజాస్వా మ్యానికి సంబంధించి మరొక మూడు ఆందోళనకరమైన ప్రశ్నలు కూడా ఉన్నాయి. మొదటిది – పార్లమెంటరీ ఎన్నికలు ఇప్పటికే అధ్యక్ష తరహా ఎన్నికలుగా మారుతున్న పరిస్థితుల్లో, ఈ ఏకకాల ఎన్నికలనేవి ఆ ధోరణిని తీవ్రతరం చేసి మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మొత్తంగానే నాశనం చేసే ప్రమాదం లేదా? రెండవది – ఒక జాతీయ పార్టీ మంచి ఊపులో ఉన్నప్పుడు, ఏక కాల ఎన్నికలు బహుళ పార్టీ వ్యవస్థను ఒకే పార్టీ ఉన్న దేశంగా మార్చకుండా ఉంటాయా? మూడవది – ఎన్నికలు మన ప్రజా శాసన సభ్యులను ప్రతిస్పందించే వారిగా, జవాబుదారీగా ఉండేవారిగా చేస్తాయని మనకొక నమ్మకం. అయితే ఐదేళ్లకోసారి మాత్రమే ఎన్నికలను నిర్వహిస్తే మధ్యలో ఏం జరిగినా వారు తమకు పట్టనట్లుగా, అహంకారంగా ఉండిపోయే అవకాశం లేదా? ఈ సమస్యల గురించి జాగ్రత్తగా ఆలోచించండి. మరీ ముఖ్యంగా మూడు అంశాలపై మీరు దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది: ఏకకాల ఎన్నికల ఆవశ్యకత, వాటిని అమలు చేయడంలో వచ్చే చిక్కులు, అనంతరం వచ్చే పర్యవసానాలు. ఆ తర్వాత ‘ఇది సరైనదేనా?’ అనే ప్రశ్నకు జవాబు ఇచ్చుకోండి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కూటమిగా... దీటుగా
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన ఇండియా కూటమిని మరింత బలోపేతం చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయించింది. ఈ కూటమిలో కీలకపాత్ర వహించడం ద్వారా దేశ ప్రజానీకానికి బాధ్యతాయుతమైన పారదర్శక ప్రభుత్వాన్ని అందించాలని తీర్మానించింది. ఇండియా కూటమిని సిద్ధాంతపరంగా, ఎన్నికల విజయ సూచికగా నిలబెట్టడం ద్వారా విభజన, విద్వేష రాజకీయాలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చింది. శనివారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్లో సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు దేశం అనేక రంగాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, చైనా దురాక్రమణ, కొత్త రాజ్యాంగ రూపకల్పన, జమిలి ఎన్నికలు, భారత్ జోడో యాత్ర, మణిపూర్ హింస, కశ్మీర్లో ఉగ్ర కాల్పులు తదితర 14 అంశాలపై చర్చించి తీర్మానాలు చేసింది. సీడబ్ల్యూసీ నిర్ణయాలివీ... 1. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన ఆర్మీ, పోలీసు అధికారులకు సీడబ్ల్యూసీ తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. ఇలాంటి విషాద సమయంలో జాతి మొత్తం మౌనం పాటిస్తున్న తరుణంలో బీజేపీ, ప్రధానమంత్రి జీ–20 సమావేశాల విజయవంతం పేరుతో సంబురాలు చేసుకుని వారిని వారే అభినందించుకోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఇది సహించరానిదని, అమర వీరులకు అవమానమని దుయ్యబట్టింది. 2. ఏడాది కాలంగా సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సీడబ్ల్యూసీ అభినందించింది. ఆయన స్ఫూర్తివంతమైన నాయకుడని, సామాజిక న్యాయం కోసం రాజీలేని గొంతుకను వినిపిస్తున్నారని కొనియాడింది. 3. దేశ ప్రజలను ఐక్యం చేసి జాతీయ రాజకీయాల్లో మార్పు తెచ్చేలా రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రారంభమై ఏడాది గడుస్తున్న సందర్భంగా సీడబ్ల్యూసీ హర్షం వ్యక్తం చేసింది. భారత్‌జోడో యాత్ర స్ఫూర్తిని పార్టీలోని అన్ని స్థాయిల్లో కొనసాగించాలని, యాత్ర ఉద్దేశాన్ని ప్రజల్లో కొనసాగించాలని తీర్మానించింది. రాహుల్ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం ప్రధాని చేపట్టిన రాజకీయ కక్షసాధింపు చర్య అని, మళ్లీ ఆయన సభ్యత్వం పునరుద్ధరణతో న్యాయం, ధర్మం గెలిచాయని పేర్కొంది. 4. మణిపూర్‌లో అధికార యంత్రాంగం కుప్పకూలి హింస కొనసాగడంపై సీడబ్ల్యూసీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాని మౌనం, నిర్లక్ష్యం, హోంమంత్రి వైఫల్యం, ముఖ్యమంత్రి మొండితనమే ఇంతటి దారుణానికి తెరతీసిందని ధ్వజమెత్తింది. త్వరగా మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు చేపట్టాలని సూచించింది. 5. కుల, మత, ప్రాంతీయ తత్వాలపై పదేళ్ల మారటోరియం ప్రకటించాలని ప్రధాని తన మొదటి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చెప్పినప్పటికీ సమాజంలో ఈ మూడు దురాచారాలు పేట్రేగిపోతున్నాయని సీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. సహకార సమాఖ్య వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం విధ్వంసం చేసిందని ఆక్షేపించింది. 6. పంటలకు మద్దతు ధరతోపాటు ఇతర అంశాలపై రైతులు, రైతుసంఘాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రధానికి సీడబ్ల్యూసీ మరోమారు గుర్తు చేసింది. 7. పెరుగుతున్న నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పట్ల సీడబ్ల్యూసీ ఆందోళన వ్యక్తం చేసింది. పదేళ్లకోసారి చేపట్టే జనగణనను 2021లో నిర్వహించకపోవడం సిగ్గుచేటని పేర్కొంది. కులగణన చేపట్టకుండా ఆ ప్రతిపాదనను తిరస్కరించడం దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల ప్రజల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని నిరూపిస్తోందని ఆక్షేపించింది. వెంటనే కులగణన చేపట్టి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ల గరిష్ట పరిమితిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. 8. కొత్త రాజ్యాంగ రూపకల్పన ప్రతిపాదనను సీడబ్ల్యూసీ తిరస్కరించింది. రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చాలనే ప్రయత్నాన్ని రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించింది. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను కాపాడేందుకు ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చింది. 9. ప్రజాస్వామ్య దేశంలో చట్టాలు రూపొందించే సమయంలో జరగాల్సిన చర్చ పార్లమెంటు సాక్షిగా కనుమరుగైందని సీడబ్ల్యూసీ మండిపడింది. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిపేందుకు ఎన్నికల సంఘానికి ఉండాల్సిన స్వయంప్రతిపత్తి కోల్పోయేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన, ఇతర కమిషనర్ల నియామక బిల్లు ఉందని మండిపడింది. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టడాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని, ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేసింది. 10. ప్రధానికి సన్నిహితుడైన ఆదానీ గ్రూపుపై వస్తున్న ఆరోపణలపై విచారించేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. 11. ఒకే దేశం–ఒకే ఎన్నిక (జమిలి ఎన్నికలు) విధానం దేశ సమాఖ్య వ్యవస్థపై తీవ్రమైన దాడిగా సీడబ్ల్యూసీ అభివర్ణించింది. రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని, విపత్తు సహాయ నిధులివ్వడంలోనూ వివక్ష పాటిస్తోందని ఆక్షేపించింది. 12. చైనాతో ఉన్న సరిహద్దు వివాదాలను వెంటనే పరిష్కరించుకోవాలని, దేశ భౌగోళిక సమగ్రతను దెబ్బతీసే ధోరణిలో ఎదురయ్యే అన్ని సవాళ్లను దీటుగా ఎదుర్కోవాలని కేంద్రానికి సూచించింది. 13. మతసామరస్యం, సామాజిక, ఆర్థిక సమానత్వం సాధించే, యువత ఆకాంక్షలను నెరవేర్చి అంతర్జాతీయ సమాజం గర్వించేలా దేశాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉన్నట్టు సీడబ్ల్యూసీ ప్రకటించింది. కులం–మతం, ధనిక–పేద, యువకులు–వృద్ధులు లాంటి భేదాల్లేని జాతి నిర్మాణానికి కృషి చేస్తామని తీర్మానించింది. 14. ఇండియా కూటమి ఏర్పాటును సీడబ్ల్యూసీ స్వాగతించింది. ఈ కూటమి ఏర్పాటు ప్రధానితోపాటు బీజేపీకి భయాందోళనలు కలిగించిందని ఎద్దేవా చేసింది. ఇండియా కూటమిని ఒక సైద్ధాంతిక, ఎన్నికల విజయంగా తీర్చిదిద్దడం ద్వారా దేశంలో విభజన, విద్వేష రాజకీయాలకు చరమగీతం పాడాలని పేర్కొంది. సామాజిక అసమానతలను రూపుమాపి న్యాయాన్ని బలోపేతం చేయడంలో కూటమి కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించింది. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి... ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ పతాకాన్ని ఆవిష్కరించడంతో తొలిరోజు సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో ఖర్గేతోపాటు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ప్రసంగించారు. ఈ సమావేశాలకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు పలువురు సభ్యులు హాజరయ్యారు. ఖర్గే అధ్యక్షతన భారత్‌జోడో ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాందీ, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాందీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్‌రంజన్ చౌదరి, సీడబ్ల్యూసీ సభ్యులు ఏకే ఆంటోని, పి.చిదంబరం, కేసీ వేణుగోపాల్, అంబికా సోని, దిగ్విజయ్‌సింగ్, జైరాంరమేశ్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అశోక్‌గహ్లోత్, సిద్ధరామయ్య, భూపేశ్భగేల్తోపాటు సుఖి్వందర్సింగ్ సుఖు, రాజీవ్‌శుక్లా, దామోదర రాజనర్సింహ, రఘువీరారెడ్డి యాదవ్, వంశీచందర్‌రెడ్డి, సుబ్బిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశాలకు ఆతిథ్యమిస్తున్న తెలంగాణ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కాగా, త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో పార్టీ స్థితిగతులకు సంబంధించిన నివేదికలను ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు సీడబ్ల్యూసీ సమావేశంలో అందజేశారు. ఈ నివేదికలపై ఆదివారం కమిటీ చర్చించనుందని సమాచారం. -
'ఒకే దేశం ఒకే ఎన్నికలు' కమిటీ మొదటి సమావేశానికి డేట్ ఫిక్స్!
న్యూఢిల్లీ: ఒకే దేశం ఒకే ఎన్నికలు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన వేసిన కమిటీ తొలిసారి అధికారికంగా సమావేశం కానుంది. ఈ సమావేశానికి సెప్టెంబర్ 23న ముహూర్తం ఖరారైంది. ముహూర్తం ఫిక్స్.. కొద్ది రోజుల క్రితం ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్న ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చిన కేంద్రం అనుకుందే తడవు హుటాహుటిన ఈ జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాయాలు గురించి అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీలోని కీలక సభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, న్యాయశాఖ కార్యదర్శి నితిన్ చంద్ర సహా ఇతర ముఖ్య నేతలు సెప్టెంబర్ 6న సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి అధికారిక సమావేశాన్ని సెప్టెంబర్ 23న నిర్వహించాలని నిర్ణయించింది కమిటీ. కమిటీ కర్తవ్యం ఏమిటి? అయితే ఈ నెల 23న జరిగే సమావేశంలో లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే విషయమై ప్రాధమిక కార్యాచరణ గురించి చర్చించనున్నారు. దీని కోసం రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా ఒకవేళ ఉంటే వాటి గురించి పూర్తిస్థాయి అధ్యయనం చేసి కేంద్రానికి నివేదించనున్నారు. రాజ్యాంగంతో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం లేదా ఇతర చట్టాల సవరణలు చేయాల్సి ఉందా అన్న అంశాలపై కూడా గురించి చర్చించనున్నారు. ఉన్నతస్థాయి కమిటీ.. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షత వహించనున్న ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ లోక్‌సభ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి, మాజీ రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్, మాజీ లోక్‌సభ సెక్రెటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి సభ్యులుగా ఉన్నారు. కేంద్ర న్యాయ శాఖా మంత్రి అర్జున్ మేఘవాల్ ప్రత్యేక ఆహ్వానితులుగా సమావేశాలకు హాజరు కానుండగా న్యాయ శాఖ కార్యదర్శి నితిన్ చంద్ర ఈ ప్యానెల్‌కు సెక్రెటరీగా వ్యవహరించనున్నారు. పార్లమెంట్ సెషన్ ముగిసిన వెంటనే! ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 18-22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు పూర్తైన మరుసటి రోజునే ఈ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏకకాలంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించడంపైనే ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో చర్చ జరగనుందని పుకార్లు చక్కెర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ కమిటీ సమావేశాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. #WATCH | On the 'One Nation, One Election' committee, former President and chairman of the committee, Ram Nath Kovind says "The First meeting will take place on 23rd September" pic.twitter.com/FU1gvzMi7j — ANI (@ANI) September 16, 2023 ఇది కూడా చదవండి: ఆ నగరం మన దేశానికి ఒక్కరోజు రాజధాని ఎందుకయ్యింది? -
బీజేపీ జమిలిని.. కేసీఆర్ జనాన్నినమ్ముకున్నారు
సాక్షి, సిద్దిపేట: ‘రాష్ట్రంలో బీజేపీ బిచాణా ఎత్తేసింది.. ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో ఓటమి భయంతోనే జమిలి ఎన్నికలంటోంది’అని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. బీజేపీ జమిలిని నమ్ము కుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ జనాలను నమ్ముకు న్నారని పేర్కొన్నారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తలతో జరిగిన సభలో మాట్లాడారు. ఇండియా–పాకిస్తాన్, హిందూ – ముస్లింల మధ్య కొట్లాట పెట్టి బీజేపీ ఎన్నికల్లో గెలవాలనుకుంటోందని విమర్శించారు. నల్లాలు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా? నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీ కావాలా? అని ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ తిట్లలో పోటీపడితే.. తెలంగాణ ప్రభుత్వం కిట్లతో పోటీ పడుతోందని హరీశ్‌రావు పేర్కొన్నారు. తిట్లు కావా లంటే కాంగ్రెస్‌కు ఓటేయాలని, కిట్లు కావాలంటే బీఆర్ఎస్కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ‘సీడబ్ల్యూసీ సమావేశాన్ని హైదరాబా ద్లో నిర్వహి స్తున్నందుకు స్వాగతిస్తున్నాం.. తెలంగాణలో అమ లవుతున్న పథకాలను మీ ప్రాంతాల్లో ప్రవేశపెట్టి అమలు చేయండి’అని కాంగ్రెస్‌కు హితవు పలి కారు. ఇక్కడ జరిగిన అభివృద్ధిని చూసి నేర్చుకోవాలని సీడబ్ల్యూసీ సమావేశానికి వచ్చే కాంగ్రెస్ నేత లకు సూచించారు. కాంగ్రెస్ ప్రకటించే డిక్లరేషన్లను ఆ పార్టీ అ«ధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీకి వణుకు పుట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీ చీప్ ట్రిక్కులకు, మాయమాటలకు ప్రజలు మోసపోవ ద్దన్నారు. తెలంగాణ సమాజం మూడోసారి కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని ట్రిక్కులు చేసినా కేసీఆర్ మూడోసారి సీఎంగా హ్యాట్రిక్ కొట్ట డం ఖాయం అని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీశ్ కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా శర్మ పాల్గొన్నారు. -
‘జమిలి’ ఎన్నికలు రాజ్యాంగ ఉల్లంఘన
దశాబ్దాలుగా రాజ్యాంగ మౌలిక స్వరూపం చెదరకుండా ప్రజలు కాపాడుకుంటూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో ‘ఒకే దేశం – ఒకే ప్రజ’ వంటి ఆకర్షణీయ నినాదాలతో దేశ సమాఖ్య తత్వాన్నీ, లౌకిక స్వభావాన్నీ దెబ్బతీసే ప్రతిపాదనలను కేంద్రపాలకులు ముందుకు తెస్తున్నారు. మెజారిటీ వాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. అలాగే రాజకీయ పార్టీల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ధోరణి పెరిగిపోతోంది. ఫలితంగా రాజకీయాలు నేరమయం, ధనమయం అయిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం ‘జమిలి ఎన్నికలు’ అంశాన్ని మరోసారి ముందుకు తెచ్చింది. కేంద్ర, రాష్ట్ర చట్ట సభలకు ఒకేసారి ఎన్నికలు జరిపించాలనే ఆలోచన ఏ మాత్రం ఆచరణ సాధ్యం కాదు. దీనివల్ల రాజ్యాంగ పరమైన సమస్యలు తలెత్తుతాయి. ‘ఒక దేశం, ఒక ఎన్నిక’ అన్న ఎజెండా ద్వారా, ‘ఒకే పన్ను, ఒకే రేషన్ కార్డు’ ఇత్యాది నినాదాలూ, విధానాల ద్వారా దేశంలో ఐక్యతను కాపాడగలమన్న సరికొత్త భావనను ప్రవేశపెట్టడానికి కేంద్ర పాలకులు ప్రయత్నిస్తు న్నారు. తద్వారా కేంద్ర పాలకులు తమ చేతుల్లో పరిపాలనా, రాజకీయ అధికారాన్ని బహుముఖంగా కేంద్రీకరించుకుని, రాష్ట్రాల అధికారాలను బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ తతంగం 2014 నుంచే ప్రారంభమైందని మరవరాదు. ఈ తంతులో భాగంగానే పార్లమెంటును పాలకులు విస్పష్ట నిర్ణయాలు తీసుకోకుండా తటస్థపరిచారు. ఇక మీడియా దాదాపు పాలకుల సేవికగా మారింది. న్యాయ వ్యవస్థను చాలావరకు మెడలు వంచారు, పౌర సమాజాన్ని నిర్వీర్యపరిచారు.’’ – సీనియర్ జర్నలిస్టు సి. రాం మనోహర్ రెడ్డి (11.9.2023) దేశ తొలి అధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్, ఆయన ఆధ్వర్యంలో నియమితులైన నాటి రాష్ట్రాల గవర్నర్లు వ్యవహరించిన తీరుతో ఇటీవలి కాలంలో మన దేశ అధ్యక్షులు, గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరుతెన్నులను పోల్చి చూస్తే రాజ్యాంగం ఏ విధంగా అతిక్రమణకు గురవుతోందో అర్థమవుతుంది. రాజ్యాంగ ప్రవేశికలో ‘భారత ప్రజలమైన మేము రూపొందించుకొని, అంకితమిచ్చుకున్న ప్రజా రాజ్యాంగం’ అని సగర్వంగా ప్రకటించుకున్న మనం ఇప్పుడు రాజ్యాంగ ఉల్లంఘనలను చూసి తల దించుకోవలసి వస్తోంది. ఆ తొల్లింటి రాజ్యాంగ హామీలు, ఇంకా ఇప్పుడు అమలు జరుగు తున్నా యనుకోవడం ప్రజల భ్రమ అవుతుంది. ఎందుకంటే ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని, విధానాలను మనసారా అభిలషించి ‘దేశంలో కొలది మంది మోతుబరుల చేతుల్లో దేశ సంపద, అధికారాలు కేంద్రీకృతం కారాదని’ శాసించిన జాతిపిత గాంధీజీని ప్రేమించినట్టు నటించి ఆయనను హతమార్చినవాళ్లే గాంధీ బొమ్మలు పెట్టుకుని ఊరేగు తున్నారు. దేశ స్వాతంత్య్ర తొలి సంవత్సరాల్లో కేంద్రంలోనూ, రాష్ట్రాల లోనూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించేవారు. కానీ 1960లలో కేంద్ర (కాంగ్రెస్) పాలకులు రాజ్యాంగంలోని 356వ నిబంధనను తమ స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకుని రాష్ట్రాలలో తమకు ఇష్టం లేని ప్రభుత్వాలను కూల్చడానికి జంకలేదు. శాసనసభ విశ్వాసాన్ని చూరగొన్న రాష్ట్ర ప్రభుత్వాలే పాలనలో ఉండాలి. ఆ విశ్వాసం సడలి నప్పుడు అవి దిగిపోయి, తిరిగి ప్రజల విశ్వాసం చూరగొనేందుకు ఎన్నికలకు వెళ్లాలి. ఈ పద్ధతిని తారుమారు చేసి, కేంద్ర పాలనను (రాష్ట్రపతి పాలన) రుద్దడానికి పాలకులు అలవాటు పడటం ద్వారా అటు ఫెడరల్ వ్యవస్థ లక్ష్యాలనూ, ఇటు ప్రజాస్వామ్య విలువల్నీ ఏకకాలంలో ధ్వంసం చేయడానికి తెగబడ్డారు. అదే సమయంలో రాష్ట్రాలూ, కేంద్రానికీ ఎన్నికలు వేరు వేరు సమయాల్లో జరప వలసిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు కేంద్రం ‘జమిలి ఎన్నికలు’ అంశాన్ని మరోసారి ముందుకు తెచ్చింది. కేంద్ర, రాష్ట్ర చట్ట సభలకు ఒకేసారి ఎన్నికలు జరిపించాలనే ఆలోచన ఏమాత్రం ఆచరణ సాధ్యం కాదు. దీనివల్ల అనేక రాజ్యాంగ పరమైన సమస్యలు తలెత్తుతాయి. తొలినాటి ప్రజాస్వామిక విలువలు మచ్చుకు కూడా కానరాకుండా పోవడం నేటి రాజకీయాల్లో మనం చూస్తున్న విషాదం. ఎవరు ఎంత డబ్బు ఖర్చుపెడితే అంతగా ఎన్నికల్లో గెలవవచ్చు అనే నమ్మికతో రాజకీయపార్టీలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ధనవంతులూ, నేరప్రవృత్తి కలిగినవారూ రాజకీయాల్లో అత్యధికంగా పాల్గొనడం కళ్లెదుట కనిపిస్తున్న రాజకీయ చిత్రం. తాజా ఏడీఆర్ రిపోర్ట్‌ను గమనిస్తే మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత ‘నిఖార్సు’గా పరిఢవిల్లుతోందో అర్థమవుతుంది. రాజ్యాంగం ప్రకారం ఏమాత్రం మన రాజకీయపార్టీలు నడుచుకోవడం లేదనీ, అవి కేవలం ఏదో విధంగా అధికారంలోకి రావడానికే ప్రయత్నిస్తున్నాయనీ... పైకి మాత్రం రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లు నటిస్తున్నాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు రాజ్యాంగ సూత్రా లనూ, సమాఖ్య తత్వాన్నీ, లౌకికత్వాన్నీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ అనేక ప్రతిపాదనలు బహిరంగంగానే ముందుకొస్తున్నాయి. ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే వ్యక్తి పాలన’ అటువంటిదే. చైతన్యశీలి, ప్రజాస్వామ్యవాది అయిన నేటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పదవీ స్వీకారం చేసిన తర్వాత అడుగ డుగునా కేంద్ర పాలకుల దుందుడుకు విధానాలను వ్యతిరేకిస్తూండటంతో కొంతలో కొంత వారు దూకుడు తగ్గించుకుంటున్నారు. అయితే మళ్లీ అధికారం చేజిక్కించుకోవడానికి ఎప్పటిలాగే తమ పాత విధానాన్ని అనుసరించి కుల, మత, వర్గ సంఘర్షణలకు ప్రజల మధ్య ‘చిచ్చు’ రగిలిస్తున్నారు. ఇదేమాత్రం వారికి అమానవీయం అనీ, రాజ్యాంగ విరుద్ధమనీ అనిపించడంలేదు. మెజారిటీ వాదాన్ని ముందుకు తెచ్చి తమ చర్యలను ప్రతిభావంతంగా సమర్థించుకుంటున్నారు. బహుశా అందుకే మహాకవి దాశరధి కృష్ణమాచార్యులు ఒక పాత్ర ద్వారా చెప్పించిన మాటలు ఈ సందర్భంగా గుర్తుకొస్తున్నాయి: ‘నేను చేసిన పాపాలు అనేకమయినా, నా జిహ్వకు మాత్రం అవి పానకాలే!’ అందుకే, అలాంటి ‘పానకాల రాయుళ్ల’ను పాలకులుగా పెరగనివ్వకుండా ఉంచడానికే నేటి చైతన్యశీలమైన సుప్రీంకోర్టు విశ్వ ప్రయత్నం! దాని కృషికి చేదోడు వాదోడుగా నిలవడం – బాధ్యతగల భారత పౌర సమాజ ధర్మం! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
జమిలి.. చీప్ జిమ్మిక్కు
సాక్షి, హైదరాబాద్: ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న చీప్ జిమ్మిక్కు. ప్రజల అటెన్షన్‌ను పక్కదారి పట్టించే కుట్ర. గతంలోనూ ఈ తరహా జిమ్మిక్కులు చూశాం. గతంలో మోదీ ఇచ్చిన హామీలేవీ నెరవేరనందునే బీజేపీ ఇలాంటి అంశాలను తెరమీదకు తెస్తోంది. త్వరలో ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి ఖాయంగా కనిపిస్తున్నందున తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఇప్పట్లో జరగకుండా ఆపే కుట్ర జరుగుతోంది. ఆయా రాష్ట్రాల్లో ఓటమి పాలైతే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపుతుందనే భయంతో ప్రజలను గందరగోళ పరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జమిలి ఎన్నికల పేరిట ప్రజల దృష్టిని మళ్లించడంలో బీజేపీ కొంతమేర సక్సెస్ అయ్యింది..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు అన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టి నిర్వహించారు. ఆ శక్తి ఎవరికీ లేదు: ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను ఆపే శక్తి కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా ఎవరికీ లేదు. మోదీ లాంటి వ్యక్తి ఏదో ఎజెండా లేకుండా దీనిని తెరమీదకు తెస్తారని అనుకోవడం లేదు. 17 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నందున ఈ విధానాన్ని అమలు చేస్తారనే అనుమానం ఉంది. అయితే ఈ నెల 18న ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో ఏం జరుగుతుందో మోదీ, అమిత్ షా మినహా ఎవరికీ తెలియదు. రామ మందిరం ప్రారంభం తర్వాతే మోదీ ఎన్నికలకు వెళితే ఏప్రిల్, మే నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. ఈలోగా ఎన్నికలు జరిగే తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు సెపరేట్‌గా పోలింగ్ నిర్వహించే ఉద్దేశం మోదీకి లేదు. ఎలాగైనా ఐదు రాష్ట్రాల ఎన్నికలను ఎత్తగొట్టాలనే జమిలి ఎన్నికలను తెరమీదకు తెస్తున్నారు. అయితే దీనికి అనుసరించే విధానం ఏంటి? పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగ సవరణ చేసి ఐదు రాష్ట్రాల ప్రస్తుత అసెంబ్లీ గడువు పెంచుతారా? లేక రాష్ట్రపతి పాలన విధిస్తారా? వంటి అంశాలపై స్పష్టత లేదు. రాష్ట్రపతి పాలన విధిస్తే కేంద్రం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మోదీ ఒక్కరోజు కూడా అధికారం వదులుకునే రకం కాదు కాబట్టి మమ్మల్ని కూడా అటు వైపు గుంజుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. మామూలుగా అయితే వచ్చే నెల 5 లేదా 10 తేదీ లోపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావాలి..’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ, మహారాష్ట్రలోనే పోటీ ‘పార్లమెంటులో ప్రస్తావనకు వచ్చే అంశాలను చూసిన తర్వాతే బీఆర్ఎస్ వైఖరి వెల్లడిస్తాం. అయితే జమిలి ఎన్నికలు వచ్చినా మాకు ఎలాంటి నష్టం లేదు. ఈసారి తెలంగాణ ప్రజలు అటు లోక్‌సభ, ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఏకపక్షంగా అనుకూల తీర్పును ఇస్తారు. జమిలి ఎన్నికలు వస్తే మోదీ, షా దేశమంతటా ఫోకస్ చేయాల్సి వస్తుంది. మేము తెలంగాణ, మహారాష్ట్రలోనే పోటీ చేస్తాం. ఒకవేళ ఎన్నికలు వాయిదా పడితే ‘పాలమూరు– రంగారెడ్డి’, ‘సీతారామ’ వంటి ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటాం. పార్టీలో అంతర్గత అంశాలు సరి చేసుకోవడానికి మాకు మరింత సమయం దొరుకుతుంది. అయితే తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ వంటి ఒకటి రెండు రాష్ట్రాల కోసం ఎన్నికలు వాయిదా వేసి మోదీ బదనాం అవుతాడని అనుకోవడం లేదు..’ అని మంత్రి అన్నారు. 90కి పైగా సీట్లలో బీఆర్ఎస్ గెలుపు ‘కమ్యూనిస్టుల ఐడియాలజీ, విచ్ఛిన్నకర శక్తుల పట్ల వారి వైఖరి, భావ సారూప్యతతో మాకు ఏకీభావం ఉంది. కానీ సీట్ల లెక్కలు కుదరకపోవడంతోనే వారితో పొత్తు సాధ్యం కాలేదు. మాకు 105 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండటంతో వారు అడిగిన సీట్లు ఇవ్వడం సాధ్యం కాలేదు. 115 మంది అభ్యర్థులను ఏకకాలంలో ప్రకటించడంతో విపక్షాలు కకావికలం అయ్యాయి. కేసీఆర్‌ను ఎదుర్కోవడంలో గందరగోళంలో పడ్డాయి. మరోవైపు బీఆర్ఎస్లో టికెట్ రాని వారు తమ పార్టీల్లోకి వస్తారనే కాంగ్రెస్, బీజేపీల ఆశలు అడియాశలయ్యాయి. సర్వేలు, వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 90కి పైగా సీట్లలో బీఆర్ఎస్ గెలుస్తుంది. హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరిస్తారు. మేము 99 శాతం టికెట్లు ప్రకటించాం. ప్రతిపక్షాలు అప్లికేషన్లు అమ్ముకుంటూ రేపు టికెట్లు కూడా అమ్ముకునే పరిస్థితిలో ఉన్నాయి..’ అని ఆరోపించారు. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు ‘మేము బీజేపీతో కుమ్మక్కయ్యామనడం అర్ధరహితం. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి. కేసీఆర్‌తో సరిపోయే నాయకులెవరూ తెలంగాణలో లేరు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణలో రాజకీయ అస్థిరత లేదు. మా సీఎం అభ్యర్థి కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీల సీఎం అభ్యర్థులెవరో చెప్పగలరా? ఢిల్లీ నుంచి వచ్చే సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులు కావాలా.. ప్రజా నాయకుడు కేసీఆర్ కావాలో ప్రజలే తేలుస్తారు..’ అని కేటీఆర్ అన్నారు. జీ 20 సమావేశాలకంటే టీ 20 మ్యాచ్‌లపై ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపారని, రొటేషన్‌లో వచ్చిన అవకాశానికి బాకా కొట్టుకునే ప్రయత్నం బెడిసి కొట్టిందని విమర్శించారు. ఆంధ్ర పరిణామాలపై ఆసక్తి లేదు ‘ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై మేమెందుకు కామెంట్ చేయాలి. ఆంధ్రా రాజకీయాలు, అక్కడి పరిణామాలతో మాకు సంబంధం లేదు. వాటిపై మాకు ఆసక్తి లేదు. అది వారి తలనొప్పి. ఏపీ పరిస్థితులు, కేసు పూర్వాపరాలు తెలియకుండా తీర్పులు ఇవ్వలేం. మేం తెలంగాణ పాలనపై మాత్రమే దృష్టి కేంద్రీకరించాం. మాకు ఇక్కడ ఇతర తలనొప్పులు ఉన్నాయి. ఇక్కడ యూ ట్యూబ్ చానెళ్లు పెట్టి సీఎంను రోజూ తిడుతున్నారు. రన్నింగ్ కామెంటరీ చేయడం జాతీయ పార్టీ పనికాదు. జాతీయ అంశాలపై మాట్లాడాలి..’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
రామ్‌నాథ్ కోవింద్ కమిటీ మొదటి సమావేశంలో కీలకాంశాలు
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నివాసంలో జమిలీ ఎన్నికలపై జరుగుతున్న తొలి సమావేశం సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, న్యాయశాఖ కార్యదర్శి ఇతర నేతలు హాజరయ్యారు. 'వన్ నేషన్ వన్ ఎలెక్షన్'పై అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ ఈరోజు మొదటిసరి అధికారికంగా సమావేశమయ్యింది. ఈ హైలెవెల్ కమిటీ సమావేశంలో ఏడు కీలక అంశాలపై చర్చించి సిఫారసులు చేయనుంది. రాజ్యాంగ సవరణలు: ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలించి.. అందుకు ఏయే రాజ్యాంగ అధికారణల సవరణలు చెయ్యాలో, ఏయే చట్టాల సవరణ చెయ్యాలో కమిటీ అధ్యయనం చేస్తుంది. రాష్ట్రాల అనుమతి: ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహించడానికి ఏవైనా రాజ్యాంగ సవరణలు చేయాల్సి వస్తే వాటి సవరణకు రాష్ట్రాల ఆమోదం తప్పనిసరా? లేక కేంద్రమే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళవచ్చా అన్నదానిపై కూడా స్పష్టతనివ్వాలి. సంకీర్ణాలైతే : ఇక ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను కూడా అధ్యయనం చేసి హంగ్ అసెంబ్లీ, అవిశ్వాస తీర్మానం, ఫిరాయింపుల సమయంలో ఏం చేయాలనే దానిపై కూడా ఈ కమిటీ సూచనలు తెలియజేయాలి. సాధ్యం కాకపోతే: ఒకేసారి దేశమంతా ఎన్నికలు సాధ్యం కాని పక్షంలో, విడతలవారీగా ఎన్నికలను జరిపి సమ్మిళితం చేసే అవకాశం ఉందా లేదా అన్నదానిపై కమిటీ పూర్తి వివరాలను తెలియజేయాలి. భవిష్యత్తు : ఒకసారి పరిస్థితులు అనుకూలించి ఒకేసారి ఎన్నికల వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత, మళ్లీ ఇది దెబ్బ తినకుండా తదనంతరం కూడా కొనసాగడానికి అవసరమైన చర్యలపై కూడా సిఫారసులు చెయ్యాలి. సిబ్బంది: ఒకేసారి ఎన్నికలకు ఈవీఎంలు, వివి ప్యాట్ల అవసరం ఎంత? వాటితో పాటు మానవ వనరుల అవసరమెంతో కూడా స్పష్టమైన నివేదిక సమర్పించాలి. ఒక్కటే ఓటర్ కార్డు: లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఒకటే ఓటరు జాబితా ఉండేలా చర్యలు తీసుకునే అంశమై ఎటువంటి కార్యాచరణను సిద్ధం చేసుకోవాలో తెలియజేయాలి. ఇది కూడా చదవండి: ఇండియా కంటే 'భారత్' మేలు: లాలూ ప్రసాద్ యాదవ్ -
జమిలి ఎన్నికలు ఎవరికి లాభం?
-
జమిలి అయినా ఓకే!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించి ప్రచార సన్నద్ధతను ప్రారంభించిన భారత్ రాష్ట్ర సమితి, తాజాగా జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న రాజకీయాలను కూడా నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నెల 18 నుంచి పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ పేరిట జమిలి ఎన్నికల అంశం తెరమీదకు వస్తుందని పార్టీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు వస్తే అనుసరించాల్సిన వ్యూహంపై స్పష్టతతో ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలతోనే లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపాయి. అయితే గతంలో జమిలి ఎన్నికలకు సానుకూలంగా స్పందించిన బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఆచితూచి వ్యవహరించాలని భావిస్తోంది. ఈ అంశంపై అప్పుడే ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయకుండా, సరైన సమయంలో స్పందించాలని నిర్ణయించినట్లు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం ఏర్పాటైన కమిటీలో దక్షిణాది నుంచి ఒక్కరికి కూడా చోటు కల్పించకపోవడాన్ని పార్టీ తప్పు పడుతోంది. జమిలి ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం అయ్యే పని కాదని భావిస్తున్న బీఆర్ఎస్.. ఒకవేళ లోక్‌సభ ఎన్నికలు జరిగినా డిసెంబర్‌లోపే పోలింగ్ ఉంటుందని అంచనా వేస్తోంది. విపక్షాలను గందరగోళంలోకి నెట్టేందుకేనా! తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో విపక్షాలను గందరగోళంలోకి నెట్టడంతో పాటు తన ఎత్తుగడలతో ఆ పార్టీలను కకావికలం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ జమిలి ఎన్నికలను శరవేగంగా తెరమీదకు తెచ్చినా సంసిద్ధంగా ఉండేలా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కార్యాచరణ రూపొందిస్తున్నారు. కేంద్రం లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు నిర్వహించినా, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో ఫలితం తమకే అనుకూలంగా ఉంటుందని కేసీఆర్ లెక్కలు వేస్తున్నారు. అయితే లోక్‌సభకు ముందుగా ఎన్నికలు జరిగితే అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో స్వల్ప మార్పులు ఉంటాయని సమాచారం. తెలంగాణతో పాటు పొరుగునే ఉన్న మహారాష్ట్రను కూడా కలుపుకొని 65 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి, గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్, లోక్‌సభ ఎన్నికల్లో పొరుగునే ఉన్న మహారాష్ట్ర నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకు అవసరమైన వ్యూహం, కార్యాచరణపై వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. నియోజకవర్గాల్లో పరిస్థితిపై దృష్టి అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించి పక్షం రోజులు కావస్తుండగా, సుమారు 40కి పైగా నియోజకవర్గాల్లో నేతల మధ్య అంతర్గత విభేదాలు కొలిక్కి రావడం లేదని కేసీఆర్ అంచనాకు వచ్చారు. వివిధ సర్వే సంస్థలు, నిఘా వర్గాల నుంచి అందిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిని మదింపు చేస్తున్నారు. మూడోవంతు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రచారం ఆశించిన స్థాయిలో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అధినేత.. ఈ నెల రెండో వారం నుంచి బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై వరుస సమీక్షలకు సిద్ధమవుతున్నారు. తాను పోటీ చేయాలని భావిస్తున్న కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు, కేడర్‌తో ఈ నెల 7న భేటీ కానున్నారు. -
‘జమిలి’తో సామాన్యులకు లాభమేంటి?
చండీగఢ్: ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నామని ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కనీ్వనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చెప్పారు. జమిలి ఎన్నికల వల్ల సామాన్య ప్రజలకు ఉపయోగం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం హరియాణాలోని భివానీలో ఎన్నికల ప్రచార సభలో కేజ్రివాల్ ప్రసంగించారు. ఏదో ఒక రోజు బీజేపీని ఆమ్ ఆద్మీ పార్టీ దేశం నుంచి తుడిచిపెట్టేస్తుందని అన్నారు. ఒకే దేశం–ఒకే ఎన్నిక అవసరం లేదని, ఒకే దేశం–ఒకే విద్య కావాలని ఆకాంక్షించారు. ధనవంతులకు, పేదలకు ఒకేరకరమైన విద్య అందించాలన్నారు. ఒకే దేశం–100 ఎన్నికలు, ఒకే దేశం–1,000 ఎన్నికలు అయినా సామాన్య ప్రజలకు పెద్దగా తేడా ఏమీ ఉండదని స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలు అవసరం లేదని తేలి్చచెప్పారు. ఉచిత పథకాలు అంటూ కొందరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పేదలకు నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించడం నేరమా? పాపమా? అని ప్రశ్నించారు. హరియాణాలో బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కేజ్రివాల్ మండిపడ్డారు. -
రామ్‌నాథ్ కోవింద్‌తో న్యాయ శాఖ ఉన్నతాధికారుల భేటీ
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ చీఫ్, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం న్యాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. కమిటీ ఎజెండాపై చర్చించారు. న్యాయ శాఖ కార్యదర్శి నితిన్ చంద్ర, శాసన కార్యదర్శి రీటా వశిష్ట తదితరులు కోవింద్‌ను కలిశారు. జమిలి ఎన్నికల విషయంలో అధ్యయనం చేయాల్సిన అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. చట్టపరమైన విషయాలపై చర్చించుకున్నారు. ఉన్నత స్థాయి కమిటీకి నితిన్ చంద్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’పై అధ్యయనం కోసం 8 మంది సభ్యులతో హైలెవెల్ కమిటీని నియమిస్తూ కేంద్రం శనివారం ఉత్తర్వు జారీ చేసిన సంగతి తెలిసిందే. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలను సైతం ఒకేసారి నిర్వహించాలనికేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. -
జమిలి ఎన్నికలపై బీఆర్ఎస్ విధానమేంటి?
సాక్షి, హైదరాబాద్: జమిలి ఎన్నికల నిర్వహణపై తన విధానమేంటో బీఆర్ఎస్ స్పష్టం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. అప్పట్లో బీజేపీతో ఉన్న సంబంధాల దృష్ట్యా జమిలి ఎన్నికలకు తాము అనుకూలమని 2018లో సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారని, ఇప్పుడు బీజేపీతో తమకు ఎలాంటి సంబంధం లేదంటున్న కేసీఆర్ తాజాగా తన పార్టీ వైఖరి ఏంటో వెల్లడించాలని కోరారు. ఆదివారం గాంధీభవన్‌లో రేవంత్ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏ కూటమికి అవమానకర పరిస్థితి వస్తుందనే వన్ నేషన్–వన్ ఎలక్షన్ తెరమీదకు తెచ్చారని విమర్శించారు. ఈ విధానానికి ఇండియా కూటమి వ్యతిరేకమని, అందుకే కమిటీ నుంచి అధీర్ రంజన్ చౌదరి వైదొలిగారని చెప్పారు. ఆ కమిటీ చైర్మన్‌గా మాజీ రాష్ట్రపతినా? జమిలి ఎన్నికల బిల్లు పాస్ కావాలంటే పార్లమెంటులో 2/3 వంతుల మెజారీటీ కావాలని, ఈ విధానంతో రాష్ట్రాల స్వయంప్రతిపత్తికి భంగం కలుగుతుందని రేవంత్ పేర్కొన్నారు. ఒక పార్టీ చేతిలో అధికారం పెట్టుకునేందుకే బీజేపీ ఈ కుట్రకు పాల్పడుతోందని, ఈ కుట్ర వెనుక అధ్యక్ష తరహా విధానాన్ని తీసుకు రావాలన్న ఆలోచన బీజేపీకి ఉందని ఆరోపించారు. అధ్యక్ష తరహా ఎన్నికలు జరిగితే దక్షిణ భారతదేశ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని, ఇంత జరుగుతున్నా కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే ఆయన బీజేపీకి అనుకూలమని అనుకోవాలా అని ప్రశ్నించారు. దేశంలో అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి హోదాలో పనిచేసిన వ్యక్తిని జమిలి ఎన్నికల కమిటీకి చైర్మన్‌గా నియమించి ఆ పదవికే కళంకం తెచ్చారని విమర్శించారు. బోయలకు కేసీఆర్ మోసం.. మేం న్యాయం చేస్తాంః రేవంత్ బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తానని చెప్పి సీఎం కేసీఆర్ మాట తప్పారని, అధికారంలోకి వచ్చి పదేళ్లవుతున్నా ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టు కోలేకపోయారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వాల్మికి బోయలు ఆదివారం గాందీభవన్‌లో రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలను కలిశారు. తమను ఎస్టీల్లో చేర్చాలని, ఈ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని కోరుతూ వారికి వినతిపత్రం సమరి్పంచారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ 2014లోనే బోయ వర్గానికి చెందిన భీముడిని ఎమ్మెల్సీ చేస్తానని చెప్పిన కేసీఆర్ ఆ మాట కూడా నిలబెట్టుకోలేదన్నారు. గద్వాల బంగళా రాజకీయాలకు స్వస్తి పలికేలా బోయలు కదలాలని, అవకాశం ఉంటే బోయలకు ఎమ్మెల్యే లేదంటే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీనిచ్చారు. ఖానాపూర్, కొడంగల్ నుంచి చేరికలు నియోజకవర్గం బొమ్రాస్పేట మండలానికి చెందిన పలువురు నేతలు, ఖానాపూర్ నియోజకవర్గం జన్నారం, కడెం, ఉట్నూరు, ఇంద్రవెల్లికి చెందిన పలువురు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి గాందీభవన్‌లో కండువాలు కప్పి రేవంత్ పార్టీలోకి ఆహ్వానించారు. -
జమిలీతో అన్నాడీఎంకే బలి
సాక్షి, చైన్నె: కేంద్ర అసంబద్ధ విధానాల వల్ల దేశం అధోగతి పాలవుతోందని సీఎం స్టాలిన్ విమర్శించారు. ఆదివారం చైన్నెలో డీఎంకే నేత మనోహర్ ఇంటి శుభ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఆయన హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ఈ వేడుకకు హాజరు అయ్యే గొప్ప అవకాశం లభించినందుకు సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. మనోహర్ ఇంటి ప్రతి వేడుక తన చేతుల మీదుగా జరిగినట్టు గుర్తు చేశారు. తనకు రక్షకుడు లాంటి వాడు మనోహరన్ అని కొనియాడారు. సమాజమే కుటుంబం, కుటుంబమే సమాజం అని వ్యాఖ్యలు చేస్తూ, ఈ రోజు దేశ పరిస్థితులు ఏ మేరకు అధ్వానంగా మారుతున్నాయో వివరించారు. నాడు వ్యతిరేకత...నేడు మద్దతా..? ఒకే దేశం – ఒకే ఎన్నికల అమలు కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఉన్నారని, దీనికి చైర్మన్‌గా భారత ప్రథమ పౌరుడిగా ఇది వరకు ఉన్న రామ్‌నాథ్ కోవింద్‌ను నియమించి, ఆయనతో రాజకీయ కార్యక్రమాలు చేపట్టడంపై మండి పడ్డారు. దేశంలో అంతా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, పరిస్థితులు చక్క దిద్దేందుకు ఇండియా కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తోందన్నారు. అయితే, జమిలీ ఎన్నికలతో దేశంలోకి నియంత పాలన, నియంత్రత్వానికి ప్రధాని నరేంద్రమోదీ కుట్ర పన్నారని, దీనిని భగ్నంచేసే వరకు డీఎంకే విశ్రమించబోదన్నారు. తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకే, జమిలీ ఎన్నికలకు మద్దతు ఇవ్వడం శోచనీయమన్నారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఈ ఎన్నికలను వ్యతిరేకించిన అన్నాడీఎంకే, ఇప్పుడు మద్దతు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టుగా కేంద్రాన్ని అన్నాడీఎంకే నమ్ముకుంటోందని, తొలి బలి పశువు అన్నాడీఎంకే కావడం తథ్యమని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల కారణంగా డీఎంకే మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలన్నీ మనుగడ సాధించడ కష్టతరం అన్నారు. దేశంలో ఏకాధిపతి పాలన వైపుగా ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని గుర్తు చేస్తూ, తాము అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతోందన్నారు. మరో రెండున్నరేళ్లు తమకు అవకాశం ఉందని, అలాంటప్పుడు ఈ పాలనను రద్దు చేస్తారా..? కర్ణాటకలో పరిస్థితులు బీజేపీకి పునరావృతం కాబోతోందని హెచ్చరించారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించిన పక్షంలో, రాష్ట్రాలలో ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ తగ్గితే, ఆ రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధిస్తారా..? అని ప్రశ్నించారు. అందుకే నీచాతినీచమైన ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నారని ధ్వజమెత్తారు. ఈ రోజు నుంచే భారతదేశాన్ని రక్షించ కోవడం లక్ష్యంగా, అందరూ సిద్ధం అయ్యే విధంగా ప్రతిజ్ఞ చేయాలని స్టాలిన్ పిలుపు నిచ్చారు. జమిలీ ఎన్నికల కారణంగా దేశంలో తొలి బలి పశువు అయ్యే పార్టీ అన్నాడీఎంకే అని సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు రాష్ట్రంలోని ఈ పార్టీ కేంద్రంలోని బీజేపీని నమ్ముకోవడం శోచనీయమని విమర్శించారు. ఒకే దేశం..ఒకే ఎన్నికలతో దేశంలో నియంతృత్వానికి ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జమిలీని అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా? దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ప్రస్తుతం ప్రతి పౌరుడి మీద ఉందన్నారు. ఎవరు ప్రధాని అవ్వాలో..? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఎవరు ప్రధాని కాకూడదో అన్నది ముఖ్యం అని అభిప్రాయపడ్డారు. ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలనే ప్రయత్నాలలో బీజేపీ తీవ్ర కుట్రలు చేస్తోందని, వ్యూహాలకు పదును పెడుతోందని వివరించారు. వీటిని అడ్డుకునేందుకే ఇండియా కూటమి ఏర్పడిందని, ఈ కూట మిని చూసిన ప్రధాని నరేంద్ర మోదీలో వణుకు మొదలైందని ఎద్దేవా చేశారు. ఈ కూటమి నేతృత్వంలో క్షేత్రస్థాయిలో కార్యక్రమా లు విస్తృతం కాబోతున్నాయన్నారు. ఇండియా కూటమికి వస్తున్న ఆదరణను చూసి భయంతో కొత్త కుట్రలపై కేంద్రం దృష్టి పెట్టిందని ధ్వజ మెత్తారు. ఒకే దేశం..ఒకే ఎన్నిక పేరుతో రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వాన్ని అర్ధాంతరంగా రద్దు చేస్తారా? అదీచూద్దాం.. అంటూ సవాల్ విసిరారు. -
ప్రజలకు మంచి చేయడానికి ముందుకు రారు: అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ: సెప్టెంబర్ 18-22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు కోసం కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఎగిరి గంతేయాల్సింది పోయి ప్రతిపక్షాలన్నీ అనవసర విమర్శలు చేస్తున్నాయని.. ఒకేసారి అసెంబ్లీ స్థానాలకు, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే బోలెడంత డబ్బును, సమయాన్ని ఆదా చేసుకోవచ్చు కదా అని సమాచార, ప్రచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. మా ప్రభుత్వం ఎప్పటినుంచో ఒకే దేశం ఒకే ఎన్నికలు గురించి చెబుతూనే ఉంది. మా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా దీన్ని ఆమోదించారు. ఇదే క్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒకకమిటీని కూడా వేశాము. ప్రతిపక్షాల అభిప్రాయాలను కూడా పరిగణన తీసుకోవాలన్న ఉదేశ్యంతో కమిటీలో వారికి కూడా స్థానం కల్పించాం. కానీ అధిర్ రంజాన్ చౌదరి ఈ కమిటీ నుంచి తప్పుకున్నారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో కూడా దీనిపై చర్చ ఉంటుంది. దీనికి కమిటీ సభ్యులు కూడా హాజరవుతారని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే విషయంలో మాట్లాడటానికి వారు ఎప్పుడూ ముందుకు రారు. విలువైన పార్లమెంట్ సమీవేశాల సమయాన్ని వృధా చేయడమే వారికున్న ఏకైక లక్ష్యం. మీరే చూశారు మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో వారు సమయాన్ని ఎలా వృధా చేశారో. అంతెందుకు గతంలో ఒకే దేశం.. ఒకే పన్ను విధానాన్ని తెరపైకి తీసుకొస్తూ జీఎస్టీ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినప్పుడు కూడా వారు ఇదే విధంగా గొడవ చేశారు. కానీ ఈరోజు ఒకే పన్ను విధానం వలన రూ.90,000 వచ్చే చోట రూ.1,60,000 ప్రభుత్వానికి ఆదాయం వస్తోందని అన్నారు. అదే విధంగా ఒకే దేశంలో ఒకే ఎన్నికల నిర్వహిస్తే మరింత డబ్బు ఆదా చేయవచ్చని.. బోలెడంత సమయం కలిసొస్తుందని అన్నారు. ఆ డబ్బును ప్రజల సంక్షేమానికి వినియోగించవచ్చని అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయకుండా సమాలోచన చేయాలని కోరుతున్నానన్నారు. ఇది కూడా చదవండి: చూస్తూ ఉండండి..సనాతన ధర్మమే గెలుస్తుంది : అమిత్ షా -
జమిలి ఎన్నికలపై.. హైలెవెల్ కమిటీ
న్యూఢిల్లీ: అధికార బీజేపీ ఎంతోకాలంగా తెరపైకి తెస్తున్న జమిలి ఎన్నికల ప్రతిపాదనపై మరో కీలక ముందడుగు పడింది. లోక్ సభతో పాటు, అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల దాకా అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరిపే అంశంపై లోతుగా అధ్యయనం జరిపి సిఫార్సులు చేసేందుకు ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యం వహిస్తారు. అధికార బీజేపీతో పాటు కాంగ్రెస్ సహా విపక్షాలకు కూడా కమిటీలో చోటు దక్కడం విశేషం. కేంద్రం తరఫున హోం మంత్రి అమిత్ షా, ప్రధాన విపక్షం కాంగ్రెస్ నుంచి లోక్ సభలో ఆ పక్ష నేత అదీర్ రంజన్ చౌధరి కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కమిటీ తక్షణం రంగంలో దిగి పని చేయడం ప్రారంభిస్తుంది. సాధ్యమైనంత త్వరగా సిఫార్సులు చేస్తుంది. కాగా ఈ కమిటీలో చేరేందుకు అ«దీర్ రంజన్‌తిరస్కరించడం గమనార్హం. కమిటీ ఏమేం చేస్తుందంటే... ► జమిలి ఎన్నికలు సాధ్యపడాలంటే ఏం చేయాలో సిఫార్సులు చేస్తుంది. ► దీనికి రాజ్యాంగంలో, ప్రజా ప్రాతినిధ్య చట్టం తదితర చట్టాలు, నిబంధనలకు చేయాల్సిన సవరణలు, మార్పులను సూచిస్తుంది. ► రాజ్యాంగంలోని సంబంధిత అధికరణలకు చేయాల్సిన సవరణలను రాష్ట్రాలు కూడా ఆమోదించాల్సిన ఆవశ్యకత ఉందో లేదో పరిశీలిస్తుంది. ► జమిలి ఎన్నికలు సాధ్యపడాలంటే అందుకు అడ్డంకిగా మారగల హంగ్ సభ, అవిశ్వాస తీర్మానాలు, పార్టీ ఫిరాయింపులు తదితర సమస్యలు, వాటిని అధిగమించాల్సిన విధానాలను పరిశీలిస్తుంది. ► తమ పరిశీలన, అధ్యయనానికి తోడ్పడేలా, తుది సిఫార్సుల రూపకల్పనలో ఉపకరించేలా ఎవరు ఎలాంటి సలహాలు, సూచనలు చేసినా, విజ్ఞాపనలు చేసినా కమిటీ స్వీకరిస్తుంది. -
జమిలి ఎన్నికలు వస్తే ఎలా..!
సాక్షి,ఆదిలాబాద్: జమిలి ఎన్నికలు వస్తే ఎలా..! శాసనసభ ఎన్నికలు ఈ ఏడాదిలోనే ఉంటాయని రాజకీయ పార్టీల్లో ఇప్పటికే సందడి మొదలైంది. ఈ పరిస్థితుల్లో లోకసభ ఎన్నికలు కూడా కలిసి రావచ్చనే సంకేతాలు వస్తుండటంతో నాయకుల్లో చర్చ షురూ అయింది. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీల్లోనూ ఇదే పరిస్థితి. ఈ రెండు ఎన్నికలు కలిసి వస్తే పార్టీల సమీకరణాలు ఎలా ఉంటాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. వారిలో అనిశ్చితి.. బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ప్రకటించడం పూర్తయింది. ఆదిలాబాద్ నుంచి జోగు రామన్న, బోథ్ నుంచి అనిల్‌జాదవ్, ఖానాపూర్ నుంచి భుక్యా జాన్సన్ నాయక్, ఆసిఫాబాద్ కోవ లక్ష్మిలను ఆపార్టీ ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, రేఖానాయక్, ఆత్రం సక్కులకు చుక్కెదురైంది. దీంతో తమ భవిష్యత్తు కోసం పార్టీ మార్పా, లేని పక్షంలో కలిసి నడవడమా అనే విషయంలో తర్జనభర్జనలో ఉన్నారు. ఈ క్రమంలో జమిలి ఎన్నికలు రావచ్చనే సాంకేతాలు రావడంతో వీరు నిర్ణయం తీసుకునే విషయంలో కొంత అనిశ్చితి కనబడుతుంది. ఇప్పటికిప్పుడే పార్టీ మారే విషయంలో కొంత వేచిచూసే దోరణి కనిపిస్తుంది. సమీకరణలు ఎలా ఉంటాయో.. కాంగ్రెస్‌లో ఇప్పటికే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరణ పూర్తయింది. ఆదిలాబాద్ నుంచి ఎనిమిది మంది, బోథ్ నుంచి 18 మంది, ఖానాపూర్ నుంచి 15 మంది, ఆసిఫాబాద్ నుంచి 10 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలన ప్రక్రియ మొదలు పెట్టగా ప్రస్తుతం జమిలి ఎన్నికల ప్రస్థావన రావడంతో పార్టీ సమీకరణలు ఎలా ఉంటాయనేది ఆసక్తి కలిగిస్తుంది. ప్రధానంగా లోక సభకు, శాసనసభకు పోటీ చేసే నాయకుల ఎంపికలో జమిలి ఎన్నికల పరంగా పార్టీ పరిశీలన ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరం. ఇదిలా ఉంటే బీజేపీలో సోమవారం నుంచి నియోజకవర్గం వారీగా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. ఈ నెల 10 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. తాజాగా జమిలి ప్రస్తావనతో ఆయన నిర్ణయంలో మార్పు ఉంటుందా.. లేని పక్షంలో లోకసభకే పోటీ చేయాలని ఆసక్తి కనబరుస్తారా అనేది దరఖాస్తు ప్రక్రియ ద్వారా స్పష్టమయ్యే అవకాశం ఉంది. మరో పక్క ఆయా నియోజకవర్గాల నుంచి పలువురు నేతలు బీజేపీ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తుకు సిద్ధం అవుతున్నారు. గత ఎన్నికల కంటే ముందు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం 2014లో రాష్ట్రంలో అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు ఒకే మారు జరిగాయి. అప్పట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా గోడం నగేశ్, పెద్దపల్లి ఎంపీగా బాల్క సుమన్ గెలుపొందారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే అప్పట్లో ముథోల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విఠల్‌రెడ్డి, బీఎస్పీ పార్టీ పరంగా పోటీ చేసిన నిర్మల్ నుంచి ఐకేరెడ్డి, సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి కోనప్ప మినహా మిగతా అన్ని స్థానాలు బీఆర్ఎస్ గెలుపొందింది. 2018లో కేసీఆర్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో లోకసభ ఎన్నికల కంటే ముందే శాసన సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఆసిఫాబాద్ కాంగ్రెస్ పరంగా పోటీ చేసిన ఆత్రం సక్కు మినహా అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. 2019లో జరిగిన లోకసభ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు గెలుపొందగా, పెద్దపల్లి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేశ్ నేతకాని గెలుపొందారు. తాజాగా జమిలి ఎన్నికల అంశం తెరపైకి వస్తుండటంతో మళ్లీ ఆయా పార్టీల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. -
జమీలి ఎన్నికలపై సీఎం జగన్‌దే తుది నిర్ణయం: మంత్రి అమర్నాథ్
విశాఖపట్నం: రాష్ట్రంలో జమీలి ఎన్నికలు జరగాల్సి వస్తే వైఎస్సార్సీపీకి అభ్యంతరం లేదని.. తుది నిర్ణయం మాత్రం సీఎం జగన్‌దేనని స్పష్టం చేశారాయన. విశాఖ ఎండాడలో ఇవాళ వైఎస్సార్సీపీ నూతన కార్యాలయాన్ని అమర్నాథ్ ప్రారంభించారు. వైఎస్సార్సీపీ నూతన కార్యాలయం ప్రారంభించి మంత్రి అమర్నాథ్ మాట్లాడారు. ‘‘అసెంబ్లీకి ఆరేడు నెలల సమయం ఉంది. ఒకవేళ జమిలీ వల్ల రెండు మూడు నెలలు ముందుకు వచ్చిన వైఎస్సార్సీపీకి అభ్యంతరం లేదు. జమీలి ఎన్నికలపై పార్టీలో చర్చించి సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకుంటారు’’ అని తెలిపారాయన. ఇక.. ఏపీలో 26 జిల్లాల్లో 26 పార్టీ కార్యాలయాలు నిర్మించాలని సీఎం జగన్ సంకల్పించారు. అందుకు తగ్గట్లు మొదటి కార్యాలయం విశాఖలో ప్రారంభించాం. అవసరాన్ని బట్టి ఈ వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని సెంట్రల్ పార్టీ కార్యాలయంగా(విశాఖ పాలన రాజధాని నేపథ్యంలో..) కూడా ఉపయోగిస్తాం అని తెలిపారాయన. ఈ కార్యక్రమంలో.. కోలా గురువులు, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ వంశీ, తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్ కుమార్, పసుపులేటి బాలరాజు, కేకే రాజు, ఎంపీ ఎంవీవీ, మేయర్ హరి వెంకట కుమారి తదితరులు పాల్గొన్నారు. -
Jamili Elections: 'జమిలి'పై కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగిపోయింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలపై ఓవైపు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి కార్యాచరణ సిద్ధం చేస్తుండగా, మరోవైపు ముందస్తు ఎన్నికల ప్రణాళికలకు కేంద్ర ప్రభుత్వం పదును పెడుతోంది. ఈ నెల 18 నుంచి 5 రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించి ముందస్తు ఎన్నికల అంశాన్ని కేంద్రం ఇప్పటికే తెరపైకి తీసుకొచ్చింది. దానికి మరింత బలం చేకూర్చేలా ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. జమిలి ఎన్నికల అంశాన్ని తేల్చడానికి 16 మంది సభ్యులతో ఈ కమిటీని నియమించింది. కమిటీ విధివిధానాలు, గడువుపై కేంద్రం త్వరలోనే స్పష్టమైన ప్రకటన చేయనుందని సమాచారం. ఈ పరిణామాలన్నీ చూస్తే ముందస్తు ఎన్నికల హడావుడి మొదలైనట్లే కనిపిస్తోంది. జమిలి ఎన్నికలపై ఇప్పటికే పార్లమెంటరీ స్థాయీ సంఘం, లా కమిషన్ అధ్యయనం చేసి, తమ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాయి. జమిలి ఎన్నికల పట్ల అవి సానుకూలంగా స్పందించాయి. భాగస్వామ్యపక్షాల అభిప్రాయాలు తెలుసుకోనున్న కమిటీ ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’పై తొలిసారిగా 2019 జూన్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. అప్పట్లో సమాజ్‌వాదీ పార్టీ, టీఆర్ఎస్(ఇప్పటి బీఆర్ఎస్), శిరోమణి అకాలీదళ్ వంటి పార్టీలు ఆ ఆలోచనకు మద్దతు ప్రకటించాయి. ఆ తర్వాత 2020 నవంబర్‌లో 80వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ సదస్సులో ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దాదాపు 3 సంవత్సరాల అనంతరం కేంద్ర ప్రభుత్వం దీనిపై కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. జమిలి ఎన్నికలకు సంబంధించిన చట్టపరమైన అంశాలను కమిటీ పరిశీలిస్తుంది. నిపుణులు, రాజకీయ పార్టీల నేతలతోపాటు సామాన్య ప్రజల అభిప్రాయాలను సైతం స్వీకరిస్తుంది. భాగస్వామ్యపక్షాల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత తన నివేదికను కేంద్ర పభుత్వానికి సమర్పిస్తుంది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలతోపాటే మొత్తం 12 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తారన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. కోవింద్‌తో జేపీ నడ్డా భేటీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమయ్యారు. కోవింద్ నేతృత్వంలో కమిటీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొద్దిసేపటి తర్వాత ఈ భేటీ జరిగింది. కమిటీ కూర్పుపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. కమిటీలో సభ్యులుగా ఎవరెవరు ఉండాలన్న దానిపై అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం. ప్రత్యేక సమావేశాల అజెండా త్వరలోనే: ప్రహ్లాద్ జోషీ ఈ నెల 18వ తేదీ నుంచి జరుగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా రూపకల్పన తుది దశలో ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు. అజెండాలో పొందుపరిచే అంశాలపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. అతి త్వరలోనే అజెండాను బహిర్గతం చేస్తామన్నారు. ప్రత్యేక సమావేశాలకు కావాల్సినంత సమయం ఉందన్నారు. ఇదిలా ఉండగా, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల చివరి రోజైన ఈ నెల 22న పార్లమెంట్ సభ్యుల గ్రూప్ ఫొటోల చిత్రీకరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా ఇలాంటి ఫొటోలను పార్లమెంట్ టర్మ్ మొదలైన తొలి రోజు లేదా చివరి రోజు చిత్రీకరిస్తుంటారు. తరచూ ఎన్నికలతో నష్టమే.. దేశంలో ‘ఒకే దేశం– ఒకే ఎన్నిక’ నిర్వహించాల్సిన అవసరం ఉందని రామ్‌నాథ్ కోవింద్ గతంలో పలు సందర్భాల్లో చెప్పారు. ‘‘తరచూ దేశంలో ఏదో ఒకచోట ఎన్నికలు జరుగుతుండడంతో మానవ వనరులపై భారం పడుతోంది. ఎన్నికల వ్యయం పెరిగిపోతోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది’’ అని 2018లో పార్లమెంట్లో చేసిన ప్రసంగంలో కోవింద్ చెప్పారు. 2014 మేలో కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకే దేశం–ఒకే ఎన్నికపై చర్చ ప్రారంభమైంది. దేశంలో లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతాయని లా కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. దీంతోపాటు అభివృద్ధి పనులకు ఆటంకాలు ఉండవని వెల్లడించింది. దేశంలో 1967 దాకా లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. మోదీ ప్రభుత్వ పదవీ కాలం మరికొన్ని నెలల్లో ముగియనుంది. జమిలి ఎన్నికల వ్యవహారాన్ని ఇంకా సాగదీయకుండా ఏదో ఒకటి తేల్చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ‘సమాఖ్య’కు విఘాతం: విపక్షాలు ‘జమిలి’పై రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటుపై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి స్పందించింది. కేంద్ర ప్రభుత్వ ఆలోచనను తప్పుపట్టింది. లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. సమాఖ్య వ్యవస్థను దెబ్బతీయొద్దని డిమాండ్ చేసింది. రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ అనేది ప్రజల దృష్టిని మళ్లించే ఎత్తుగడ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఇది కూడా చదవండి: దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు షాక్.. -
Jamili Elections: ‘జమిలి’ సర్వరోగ నివారిణా?
జమిలి ఎన్నికలపై చర్చ సద్దుమణిగిందని అనుకున్నప్పుడల్లా అది మళ్లీ మళ్లీ రాజుకోవటం ఏడెనిమిదేళ్లుగా రివాజైంది. కానీ ఈసారి ఉన్నట్టుండి అందుకు సంబంధించి తొలి అడుగుపడింది. మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కమిటీ విధివిధానాలు, అందులో ఉండే నిపుణుల వివరాలు ఇంకా తెలియాల్సేవున్నా ఇండియా కూటమి సమావేశాల్లో తీరిక లేకుండా వున్న విపక్షాలకు ఇది ఊహించని పరిణామం. పార్లమెంటుకూ, అసెంబ్లీలకూ ఏకకాలంలో ఎన్నికలు జరగాలనీ, అందువల్ల ఎంతో ప్రజాధనం ఆదా అవుతుందనీ ఆ విధానాన్ని సమర్థిస్తున్నవారు చెబుతున్నారు. అంతేకాదు, తరచు ఎన్నికలవల్ల అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతున్నదని కూడా వారి వాదన. కానీ ఈ రకమైన వాదనలను కొట్టి పారేస్తున్నవారు కూడా గణనీయంగానే ఉన్నారు. అభివృద్ధి పనులకు ఎక్కడ ఆటంకం ఏర్పడిందో చూపాలని సవాలు చేస్తున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలోనో, మరే అత్యవసర సందర్భాల్లోనో ప్రభుత్వాలను ఎన్నికల సంఘం నిరోధించిన దాఖలాలు లేవు. కాకపోతే ఓటర్లను ప్రలోభపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందటానికి ఉద్దేశించే పథకాలను మాత్రం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ప్రకటించకుండా ఆపుతున్నారు. అందువల్ల జనం నష్టపోయారని చెప్పడానికి ఎటువంటి దాఖలాలూ లేవు. దేశంలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీల ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మిగతా రాష్ట్రాలను కూడా ఈ చట్రంలోకి తీసుకు రావటమే కేంద్రం ఉద్దేశం. ‘ఒకే దేశం–ఒకే ఎన్నికలు’ అన్న నినాదం కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచీ వినిపిస్తోంది. అంతక్రితం 2003లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి ఈ విషయంలో కొంత ప్రయత్నం చేశారు. అప్పటి కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీతో ఆయన చర్చించారు. కానీ ఎందుకనో తదుపరి చర్యలేమీ లేవు. జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలోని లా కమిషన్ సమర్పించిన 170వ నివేదిక సైతం చట్టసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇంకా వెనక్కు వెళ్తే 1983లో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈమాటే చెప్పింది. అయితే రాజ్యాంగ సవరణ, ప్రజాప్రాతినిధ్య చట్టం సవరణ, చట్టసభల నియమనిబంధనల సవరణ వగైరాలు చేయకుండా జమిలి ఎన్నికలు సాధ్యంకాదని 2018లో జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని లా కమిషన్ తన ముసాయిదా నివేదికలో అభిప్రాయపడింది. ఒక ఏడాది వేర్వేరు నెలల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలన్నిటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం ఉత్తమమని సూచించింది. దేశంలో జమిలి ఎన్నికలు 1952 నుంచి 1967 వరకూ జరిగాయి. కానీ దానికి తూట్లు పొడిచింది కేంద్రంలోని పాలకులే. అప్పటి నెహ్రూ సర్కారు 1959 జూలైలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలోని తొలి కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాన్ని 356వ అధికరణ ప్రయోగించి బర్తరఫ్ చేసింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని చక్కదిద్దేవరకూ ఆ అధికరణ దశాబ్దాలపాటు దుర్వినియోగం చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించే ధోరణి వెర్రితలలు వేసి ప్రభుత్వాలు కుప్పకూలాయి. అసెంబ్లీలు రద్దయ్యాయి. ఈ కారణాలన్నిటివల్లా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలది తలోదారీ అయింది. పాలక పార్టీలను చీల్చటం, చీలికవర్గంతో కొత్త ప్రభుత్వాలను ప్రతిష్టించటం రివాజైంది. తరచు ఎన్నికల వల్ల ఖజానాకు తడిసిమోపెడు ఖర్చు అవుతున్నదన్నది వాస్తవం. దీనికితోడు రాజమార్గాల్లో, దొంగదారుల్లో ఎన్నికల జాతరకు వచ్చిపడే వేల కోట్ల రూపాయలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నాయి. ఉదాహరణకు 2009 సార్వత్రిక ఎన్నికలకు ఖజానాకు రూ.1,115 కోట్లు ఖర్చ యితే, 2014 నాటికి ఇది రూ.3,870 కోట్లకు పడగలెత్తింది. ఇదంతా సర్కారుకయ్యే వ్యయం. పార్టీలూ, అభ్యర్థులూ చేసే ఖర్చు ఇందుకు ఎన్నో రెట్లు ఎక్కువుంటుంది. కానీ రోగం ఒకటైతే మందు మరొకటన్నట్టు ఈ సమస్యలకు జమిలి ఎన్నికలే పరిష్కారమని పాలకులు చేస్తున్న వాదన సరికాదు. ఎన్నికల్లో ధనప్రభావం అరికట్టడానికి ఎన్నికల సంస్కరణలు అవసరం. ఎన్నికల విశ్వసనీయత పెంచటానికి దొంగ ఓట్లను అరికట్టడం అవసరం. అలవిమాలిన వాగ్దానాలతో ప్రజలను ఆకర్షించి, అధికారంలోకొచ్చాక వంచించే పార్టీలపై చర్యలు తీసుకోవటం అవసరం. కానీ జరిగిందేమిటి? అసలే పార్టీలు వెచ్చించే కోట్లాది రూపాయల సొమ్ము ఎక్కడిదో తెలిసే అవకాశంలేని ప్రస్తుత పరిస్థితిని మరింత జటిలం చేసేలా ఎన్నికల బాండ్ల విధానానికి తెరలేపారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్ని కలు’ గొప్ప ఆదర్శంగా కనిపించవచ్చు. చూడదల్చుకున్నవారికి ఇందులో జాతీయతా భావన కూడా దర్శనమీయొచ్చు. కానీ ఎన్నికల ప్రక్షాళనకు ఇది దోహదపడేదెంత? ఇంతకూ జమిలి ఎన్నికల విధానం అమలు చేయటం మొదలెట్టాక రాష్ట్రాల్లో గడువుకు ముందే అసెంబ్లీలు రద్దు చేయాల్సివస్తే ఏం చేస్తారు? 90వ దశకంలో మాదిరే కేంద్రంలోనే అస్థిరత ఏర్పడి లోక్‌సభ రద్దు చేయాల్సివస్తే మార్గం ఏమిటి? ఇవన్నీ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఎటూ పరిశీలిస్తుంది. ఇక రెండు చట్టసభలకూ ముడివేయటంవల్ల ఫెడరలిజం దెబ్బతింటుందనేవారూ... జాతీయ అంశాల ప్రాముఖ్యత పెరిగి స్థానిక అవసరాలు, ఆకాంక్షలు మరుగునపడతాయనేవారూ ఉన్నారు. అయితే 2019లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీల ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు వెలువడిన ఫలితాలు గమనిస్తే ఇది అర్ధసత్యమే అనిపిస్తుంది. ఏదేమైనా జమిలి ఎన్నికల విధానంపై విస్తృతమైన చర్చకు చోటిచ్చి, అందులో వ్యక్తమయ్యే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి అడుగులు వేయాలి. తొందరపాటు పనికిరాదు. ఇది కూడా చదవండి: Arunachal Pradesh: మ్యాపులతో మడతపేచీ -
జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు..
ఢిల్లీ: జమిలి ఎన్నికలు అనే అంశం ప్రస్తుతం లా కమిషన్ పరిశీలనలో ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తెలిపారు. లోక్ సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపే అంశంపై సాధ్యాసాధ్యాలను లా కమిషన్ పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. జమిలీ ఎన్నికల కోసం ఆచరణాత్మక రోడ్ మ్యాప్, ఫ్రేమ్ వర్క్‌ను తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు జమిలి ఎన్నికల అంశంపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ సమాధానమిచ్చారు. న్యాయ శాఖ స్టాండింగ్ కమిటీ కూడా జమిలి ఎన్నికల అంశంపై పరిశీలన చేసిందని అర్జున్ రామ్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం సహా వివిధ భాగస్వాములతో చర్చలు జరిపిందని పేర్కొన్నారు. జమిలీ ఎన్నికలు అనే అంశం దేశాన్ని భాజపా నేతృత్వంలోని కేంద్రం తెరమీదకు తీసుకువచ్చింది. ఎన్నికలను దేశమంతా ఒకేసారి జరపాలనే ప్రతిపాదన ఎంత వరకు సాధ్యమవుతుంది? అనే అంశంపై పరిశీలన చేస్తున్నారు. అయితే.. ఈ అంశం గతంలోనూ రాజకీయ వివాదానికి తెరతీసింది. ఒకేసారి ఎన్నికలు జరిపితే.. పలు ప్రాంతీయ పార్టీల భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుందని మేధావులు గతంలో అభిప్రాయపడ్డారు. ఇదీ చదవండి: శుభకార్యాల్లో సినిమా పాటలు.. కాపీ రైట్ కిందకు వస్తుందా..? కేంద్రం ఏం చెప్పింది..? -
...అడగాల్సింది మనల్ని!
...అడగాల్సింది మనల్ని! -
జమిలి ఎన్నికలతో ప్రజాధనం ఆదా
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికలు అనేవి భారీ బడ్జెట్ వ్యవహారంగా మారిపోయాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు అన్నారు. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ఒకేసారి(జమిలి) నిర్వహిస్తే ఎంతో ప్రజాధనం ఆదా అవుతుందని చెప్పారు. ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా రాజ్యసభలో కిరెణ్ చెప్పారు. ఎన్నికలు ఖరీదైన అంశంగా మారిన నేపథ్యంలో జమిలి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల చట్టాల్లో సంస్కరణల కోసం లా కమిషన్ సమర్పించిన నివేదిక జమిలి ఎన్నికల ఆవశ్యకతను గుర్తుచేసిందన్నారు. పరిపాలనలో స్థిరత్వం కోసం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. జమిలి ఎలక్షన్స్‌తో ప్రజలకే కాదు, పార్టీలకు, అభ్యర్థులకు కూడా లాభమేనని తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా నిర్వహించడం వల్ల ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి’ని రెండుసార్లు అమలు చేయాల్సి వస్తోందని, దీనివల్ల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతోందని కిరణ్ రిజిజు వెల్లడించారు. దేశంలో 1951–52, 1957, 1962, 1967లో జమిలి ఎన్నికలు జరిగాయి. అయితే, 1968, 1969లో కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రద్దయ్యాయి. దాంతో జమిలి ఎన్నికల గొలుసు తెగిపోయింది. -
జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న అంశం లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు లోక్‌సభలో ఎంపీ భగీరథ చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సమాధానం ఇచ్చారు. జమిలి ఎన్నికల అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల సంఘం సహా అనేక భాగస్వామ్య పక్షాలతో చర్చించినట్లు తెలిపారు. ‘స్టాండింగ్ కమిటీ నివేదికలో కొన్ని ప్రతిపాదనలు, సిఫార్సులు చేసింది. ఆ నివేదిక ఆధారంగా లా కమిషన్ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తూ ఒక ప్రణాళిక తయారుచేసే పనిలో నిమగ్నమైంది. తరచుగా వచ్చే ఎన్నికలు నిత్యావసర సేవలు సహా ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయని స్టాండింగ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. పార్లమెంటుకు రాష్ట్ర అసెంబ్లీలకు వేరువేరుగా జరిగే ఎన్నికల కారణంగా భారీగా ప్రజాధనం ఖర్చవుతుందని పేర్కొంది. 2014-22 మధ్యకాలంలో 50 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎనిమిదేళ్లలో రూ. 7వేల కోట్లకు పైగా ఎన్నికల నిర్వహణపై ఖర్చు పెట్టాల్సి వచ్చింది’ అని కేంద్ర న్యాయశాఖ కిరణ్ రిజిజుపేర్కొన్నారు. చదవండి: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల -
జమిలి ఎన్నికలకు సిద్ధం కండి..
సాక్షి, హైదరాబాద్: ‘లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలను (జమిలి) నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’ అని పార్టీ నేతలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మంత్రులు, పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలతో ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. గ్రేటర్ ఓటమిపై నిరాశ వద్దు.. ‘జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామనే నిరాశలో ఉండొద్దు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. గ్రేటర్ ఎన్నికలను మనం అనుభవంలా మాత్రమే చూడాలి. ఓటమి పాలైన వారి పట్ల చులకన భావంతో ఉండకండి. ఆయా డివిజన్లలో ఓటమి పాలైన అభ్యర్థులే మన పార్టీకి అత్యంత ముఖ్యమనే విషయాన్ని గుర్తించండి. సిట్టింగ్ కార్పొరేటర్లకు టికెట్లు ఇచ్చే విషయంలో మనం కొంత ఆలోచించి ఉండాల్సింది’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటి నుంచే శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికపై దృష్టి పెట్టాల్సిందిగా ఆదేశించారు. ఢిల్లీ పెద్దల దిమ్మతిరిగేలా బంద్... రైతులకు సంఘీభావంగా ఈ నెల 8న జరిగే భారత్ బంద్‌కు మద్దతుగా హైదరాబాద్‌లోనూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్ ఆదేశించారు. ఈ భేటీలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, గ్రేటర్ పరిధిలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కేటీఆర్‌తో కార్పొరేటర్ల భేటీ గ్రేటర్లో కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆదివా రం తెలంగాణ భవన్లో కేటీఆర్‌తో భేటీ అయ్యారు. నగర పరిధిలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన కార్పొరేటర్లతోపాటు, ఓడిన అభ్యర్థులను కూడా వెంటబెట్టుకుని వచ్చా రు. గెలిచిన కార్పొరేటర్లను అభినందించిన కేటీఆర్... ఓటమిపాలైన వారు నిరాశ చెందవద్దని చెప్పారు. -
‘జమిలి’తో సమస్యలెన్నో!
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జమిలి ఎన్నికల ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ఆ అంశంపై అందరూ అధ్యయనం చేయాలని కోరారు. న్యూఢిల్లీలో రెండ్రోజులపాటు జరిగిన స్పీకర్ల సదస్సు ముగింపు సందర్భంగా చేసిన ప్రసంగంలో చట్టసభలన్నిటికీ ఒకేసారి ఎన్నికలు జరగడం మన దేశానికి ఎంతో అవసరమని పిలుపునిచ్చారు. ఇప్పుడే కాదు... అధికారంలో లేనప్పుడు కూడా బీజేపీ జమిలి ఎన్నికలుండాలని కోరుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత ఎల్.కె. అడ్వాణీ ఈ అంశంపై 2012లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. ఎక్కడో ఒకచోట కొన్ని నెలల వ్యవధిలో ఎన్నికలు జరుగుతుంటే వాటి ప్రభావం అభివృద్ధి కార్యకలాపాలపై పడుతున్నదని, వేర్వేరు ఓటర్ల జాబితాల వల్ల వృధా వ్యయం తప్ప ఉపయోగంలేదని మోదీ భావన. మన దేశంలో కేవలం నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే ప్రస్తుతం చట్టసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో ఈ విధానంవుంది. ఆ రాష్ట్రాల్లో కూడా పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలు తీరు వేర్వేరుగా వుంటోంది. వాస్తవానికి 1952 తొలి సార్వత్రిక ఎన్నికలతో మొద లుపెడితే 1967 వరకూ చట్టసభలకు జమిలి ఎన్నికలే జరిగాయి. అయితే 1972లో ముగియాల్సిన లోక్‌సభను నాటి ప్రధాని ఇందిరాగాంధీ సంవత్సరకాలం ముందే రద్దు చేయడంతో 1971లోనే ఎన్నికలు వచ్చాయి. 1984లో రాజీవ్ గాంధీ కూడా ఆ పనే చేశారు. గడువుకు ముందే లోక్‌సభను రద్దు చేశారు. అనంతరకాలంలో ఏర్పడిన ప్రభుత్వాలు మూన్నాళ్ల ముచ్చటగా ముగిశాయి. (చదవండి: ఒకే దేశం.. ఒకే ఎన్నిక) 1989, 1999ల్లో ఏర్పడ్డ ప్రభుత్వాలు రెండేళ్ల వ్యవధిలోనే కుప్పకూలడంతో మధ్యంతర ఎన్నికలు తప్పలేదు. మధ్యలో 1991 ఎన్నికల అనంతరం అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు అయిదేళ్లూ పాలించారు. తిరిగి 1996 ఎన్నికల తర్వాత 1998 వరకూ రెండేళ్లలోనే ఏబీ వాజపేయి, హెచ్డీ దేవెగౌడ, ఐకె గుజ్రాల్ వరసగా ప్రధానులయ్యారు. ఆ తర్వాత మళ్లీ మధ్యంతర ఎన్నికలు తప్పలేదు. ఆ తర్వాత నుంచి సుస్థిర ప్రభుత్వాల యుగం వచ్చింది. అసెంబ్లీలు సైతం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాయి. తగినంత మెజారిటీ లేక రాజీనామా చేయాల్సిరావడం, కేంద్రంలో అధికారం చలాయించే పాల కులకు ఆగ్రహం కలిగినప్పుడు ప్రభుత్వాలు బర్తరఫ్ అయి, ఎన్నికలు రావడం... ఇదంతా మన కళ్ల ముందే సాగిన చరిత్ర. ఇప్పుడు ప్రధాని చేస్తున్న ప్రతిపాదన తీరుతెన్నులేమిటో ఎవరికీ తెలియదు. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే అనంతరకాలంలో అర్ధాంతరంగా ఏర్పడే రాజకీయ సంక్షోభాలకూ, అనిశ్చితికీ ఆ ప్రతిపాదనలో ఎటువంటి పరిష్కారం చూపదల్చుకున్నారో తెలియదు. ఇవి తెలిస్తే తప్ప జమిలి ఎన్నికలపై ఎవరూ సానుకూలంగా స్పందించలేరు. ఉదాహరణకు ఒక రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వం ఏదో కారణంతో అసెంబ్లీని రద్దు చేస్తే ఏం చేస్తారు? ఒకవేళ అధికారంలో వున్నవారు మెజారిటీ కోల్పోయి, ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడితే అక్కడి అసెంబ్లీ ఏమవుతుంది? అక్కడ ఎలాంటి పాలన వుంటుంది? మరో నాలుగేళ్లు లేదా మూడేళ్లు ఎన్నుకున్న ప్రభుత్వం లేకుండా రాష్ట్రపతి పాలనలో ఆ రాష్ట్రం మనుగడ సాగించాలా? అలాగైతే అది ప్రజా స్వామ్యం అవుతుందా? అసలు కేంద్రంలోనే అనిశ్చితి ఏర్పడితే ప్రత్యామ్నాయం ఏమిటి? ఈ సందేహాలకు స్పష్టమైన సమాధానాలుండాలి. అన్నిటికీ అమెరికాతో పోలిక తెచ్చుకోవడం మనకున్న అలవాటు. అది చిరకాలంగా ప్రజాస్వామ్యం వర్థిల్లుతున్న దేశమైతే...మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. అక్కడ జమిలి ఎన్నికలు లేకపోయినా మనతో పోలిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ మెరుగ్గా వుంది. నాలుగేళ్లకొకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. మధ్యలో రెండేళ్లకోమారు ప్రతి నిధుల సభకు ఎన్నికలుంటాయి. రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా ఆ మాదిరే వుంటాయి. పైగా రాష్ట్రానికీ, రాష్ట్రానికీ మధ్య ఎన్నికల నిబంధనల్లో, నిర్వహణలో ఎన్నో వ్యత్యాసాలుంటాయి. అయితే అధ్యక్ష ఎన్నికల కోసం అన్ని రాష్ట్రాలూ ఏకమవుతాయి. మన దగ్గర ఫెడరల్ వ్యవస్థ నానాటికీ కుంచించుకుపోతుంటే అక్కడ అది నిరంతరాయంగా వర్థిల్లుతోంది. భిన్న సమయాల్లో ఎన్నికల వల్ల అభివృద్ధి కార్యకలాపాలకు అక్కడ కలగని విఘాతం మన దేశంలో ఎందుకు కలుగుతోంది? పాలకులు ఒప్పుకోరుగానీ... నిరంతర ఎన్నికల వల్ల విధాన సంబంధమైన కఠిన నిర్ణయాలు తీసుకోవడం వారికి సమస్యగా పరిణమిస్తోంది. ఒక రాష్ట్రంలో ఎన్నికలయ్యాక తీసుకునే విధాన నిర్ణయం మరో రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు గుదిబండగా మారుతోంది. అయితే ప్రజలెదుర్కొంటున్న సమస్య వేరు. ఎప్పుడూ జరిగే ఎన్నికల వల్ల అనవసర ఉద్రిక్తతలు పెరగుతున్నాయి. నేతలు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకోవడం, వ్యక్తిగత దూషణలకు దిగడం, పర్యవసానంగా శాంతిభద్రతల సమస్య తలెత్తడం సాధారణ ప్రజానీకానికి సమస్యగా మారుతోంది. అలాగే ఆచరణసాధ్యంకాని వాగ్దానాలతో మేనిఫెస్టోలు నిండిపోవడం వారికి ఎబ్బెట్టుగా అనిపి స్తోంది, డబ్బు, మద్యం పంపిణీ వంటివి సరేసరి. ఇవన్నీ ఎన్నికలను జాతరగా మారుస్తుంటే... ఆ తర్వాత ఏర్పడే చట్టసభలు సైతం కర్తవ్య నిర్వహణలో విఫలమవుతున్నాయి. ఎంతో కీలకమైన బిల్లులనుకున్నవి కూడా అరకొర చర్చలతో ఆమోదం పొందుతున్నాయి. కొన్నిసార్లు గిలెటిన్లతో ముగుస్తున్నాయి. వాగ్దానాలు నెరవేర్చని పాలకులపై ఏవిధమైన చర్యలూ వుండవు. ఈ దుస్థితిని మార్చడానికి పాలకులు ముందుగా ప్రయత్నించాలి. జాతీయ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చే లోక్ సభ ఎన్నికలతో అసెంబ్లీలను జోడిస్తే స్థానిక ఆకాంక్షలు, సమస్యలు మరుగున పడతాయి. ఇందువల్ల ఫెడరల్ స్ఫూర్తి అటకెక్కుతుంది. జమిలి ఎన్నికల్లో ఒకే పార్టీకి ఓటేసే అవకాశాలు 77 శాతం వరకూ వున్నాయని 1999 తర్వాత జరిగిన ఎన్నికలను డేటా పరిశీలించిన విశ్లేషకులు సైతం తేల్చారు. కనుక ఈ విషయంలో అన్ని కోణాల్లోనూ లోతైన చర్చ జరగాలి. -
‘చంద్రబాబువి పగటి కలలు’
సాక్షి, తాడేపల్లి: జమిలి ఎన్నికలు వస్తాయని ప్రతిపక్ష నేత చంద్రబాబు పగటి కలలు కంటున్నారని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘టీడీపీ నాయకులను కాపాడుకొనేందుకే చంద్రబాబు జమిలి ఎన్నికలు అంటున్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆయన జమిలి ఎన్నికలంటూ ప్రచారం చేస్తున్నారని’’ దుయ్యబట్టారు. (చదవండి: రైతులపై కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుది) జమిలి ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదని, 2024 షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. ఒక వేళ జమిలి ఎన్నికలు వచ్చిన తాము సిద్ధమని, జమిలి ఎన్నికలు వస్తే టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతుందన్నారు. ఇప్పుడున్న 23 సీట్లలో ఒకటి కూడా టీడీపీకి రాదన్నారు. కుప్పంలో చంద్రబాబుకు డిపాజిట్ కూడా రాదని, 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.(చదవండి: ‘విద్యుత్’పై పేటెంట్ వైఎస్సార్‌దే) -
జమిలి ఎన్నికలు: చంద్రబాబు ఎమ్మెల్యే మాత్రమే
సాక్షి, విజయవాడ : మూడేళ్లలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశముందంటూ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. జమిలి ఎన్నికలపై మాట్లాడే స్థాయిలో చంద్రబాబు లేరని, ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని సుజనా పేర్కొన్నారు. జమిలి ఎన్నికలపై తనకు సమాచారం లేదని తెలిపారు. పోలవరంపై కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని, ఆ తర్వాత టీడీపీ హయాంలోనూ కాలయాపన జరగడం వల్ల ట్రాక్ తప్పిందని సుజనా పేర్కొన్నారు. -
జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికే హానికరం
సాక్షి, ఒంగోలు టౌన్: ‘దేశమంతా ఒకేసారి ఎన్నికల నిర్వహణకై తెరపైకి వచ్చిన జమిలి విధానం ప్రజాస్వామ్యానికి హానీకరం. జమిలి ఎన్నికల కారణంగా ఫెడరల్ వ్యవస్థ దెబ్బతింటోంది. దేశవ్యాప్తంగా అన్నిచోట్ల అధికారాన్ని కేంద్రీకృతం చేసుకునేందుకు బీజేపీ కుట్ర పన్నింది. కార్పొరేట్ శక్తుల కోసం చివరకు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు సిద్ధమైందని’ సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం స్థానిక ఫ్యాన్సీ గూడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ హాలులో ‘జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ముప్పు, కేంద్ర బడ్జెట్ ఉద్యోగులు, ప్రజలపై దుష్ప్రభావాలు’ అంశంపై జరిగిన సెమినార్లో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ఏకకాలంలో పార్లమెంట్‌కు, అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చు తగ్గుతుందన్న అంశాన్ని బీజేపీ తెలివిగా తెరపైకి తీసుకువచ్చి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. విడివిడిగా ఎన్నికలు నిర్వహిస్తే ప్రతి ట్రిప్పుకు పదివేల కోట్ల రూపాయలు ఖర్చవుతోందని, ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఖర్చు తగ్గుతుందన్న భావనను ప్రజల్లోకి తీసుకువెళుతోందని, అయితే కొంతమంది ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఉన్నప్పటికీ పర్యవసానం మాత్రం ఇంకోలా ఉంటోందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జమిలి ఎన్నికలకు ముందుకు వెళితే, దాని ప్రభావం రాష్ట్రాలపై కూడా పడుతోందన్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే రాష్ట్రాల్లో కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. అగ్రరాజ్యమైన అమెరికాలో నాలుగైదు దశల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటాయని, ఇటలీ, బ్రిటన్, స్విట్జర్లాండ్‌లో కూడా తక్కువ కాలపరిమితిలోనే ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ రూ. 30 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిందని, ఆ సమయంలో ఖర్చు గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. ఆ విధానం అత్యంత ప్రమాదకరం అతి చిన్న ప్రభుత్వం – అత్యంత ఎక్కువ పరిపాలన అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో చేసిన ప్రకటన అత్యంత ప్రమాదకరంగా ఉందని బీవీ రాఘవులు విమర్శించారు. అతి చిన్న ప్రభుత్వం అంటే అన్నీ చేయమని, అత్యంత ఎక్కువ పరిపాలన పేరుతో ప్రభుత్వ వ్యవస్థను ప్రైవేట్‌పరం చేయబోతోందని ముందస్తు సంకేతాలు ఇచ్చిందన్నారు. ప్రజలకు అందించే సేవల నుండి తప్పుకొని ప్రైవేట్‌పరం చేయడమే కేంద్ర ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శించారు. విద్యారంగం, వ్యవసాయ రంగం, ఆరోగ్య రంగం, రవాణా రంగం, చివరకు రక్షణ రంగం నుంచి తప్పుకొని ప్రైవేట్ వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. రెగ్యులేటరీ కమీషన్ల పేరుతో కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పించుకుంటుందన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ. 7 లక్షల కోట్ల లోటు చూపించారని, దానిని భర్తీ చేసేందుకు ప్రజలపై అదనపు భారాలు మోపనుందన్నారు. ఐఎంఎఫ్ సంస్థ దేశంలో అభివృద్ధి పడిపోతోందని హెచ్చరించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. 235 సంస్థలను అమ్మివేయాలంటూ నీతి అయోగ్ ఇటీవల సూచించిందన్నారు. వేలాది మంది పనిచేసే సంస్థలను మూసివేస్తూ, పదిమందికి ఉపాధి కల్పించే వాటిని ఏర్పాటుచేస్తూ కేంద్రం నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తోందని విమర్శించారు. పీపీపీ ద్వారా రూ. 50 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, ఈ విధానం వల్ల చివరకు ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తూ ప్రైవేట్ వారికి పెత్తనం అప్పగిస్తోందన్నారు. దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం కార్యదర్శి కే శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సెమినార్లో మాదాల వెంకట్రావు, ఎన్ రంగారావు పాల్గొన్నారు. రాష్ట్రానికి బీజేపీ మళ్లీ ద్రోహం చేసింది ఒంగోలు టౌన్: రాష్ట్రానికి బీజేపీ మళ్లీ ద్రోహం చేసిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. విభజన చట్టంలోని హామీల అమలులో, రాజధాని నిర్మాణంలో సహకరించకపోగా, ప్రపంచ బ్యాంకు నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులకు కూడా అడ్డుపడుతోందని విమర్శించారు. శుక్రవారం రాత్రి ప్రకాశం జిల్లా ఒంగోలులో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఇక్కడి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. గత ఎన్నికల సమయంలో బీజేపీపై కారాలు, మిరియాలు నూరిన చంద్రబాబు, ఇప్పుడు పల్లెత్తు మాట అనకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై పార్టీలకు అతీతంగా ఉమ్మడిగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. గోదావరి జలాలు కృష్ణా నదికి తీసుకువచ్చే విషయమై ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయని, అంతకంటే ముందుగా ఈ విషయమై అందరి అభిప్రాయాలు తీసుకొని ఉంటే బాగుండేదన్నారు. అసెంబ్లీలో తెలుగుదేశం ధూషణ, భూషణలకే పరిమితమైందన్నారు. కీలకమైన విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని సూచించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న అన్యాయంపై అన్ని పార్టీలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావలసిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఇసుక విధానంపై ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఎంత ఆలస్యం జరిగితే అంత బ్లాక్ మార్కెట్లోకి తరలిపోయే ప్రమాదం ఉందన్నారు. ఎదురు దెబ్బలు తాత్కాలికమే.. గత సార్వత్రిక ఎన్నికల్లో వామపక్షాలు బలం కలిగినచోట దానిని నిలుపుకోవడంలో విఫలమైనాయని బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. తమకు గట్టి పట్టు ఉన్న పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో ఓటమి చెందడం వెనుక బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలతోపాటు తమ క్యాడర్‌ను, సానుభూతిపరులను భయభ్రాంతులకు గురిచేయడం ఓటింగ్‌పై ప్రభావం చూపాయన్నారు. తమ పార్టీకి తగిలిన ఎదురు దెబ్బలు తాత్కాలికమేనని, తిరిగి పుంజుకుంటామని ఆయన స్పష్టం చేశారు. బీవీ రాఘవులు వెంట సీపీఎం తూర్పు ప్రకాశం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు ఉన్నారు. -
‘జమిలి’ ఆలోచనకు 20 ఏళ్లు
కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన బీజేపీ ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనను మళ్లీ తెరపైకి తెచ్చింది. లోక్‌సభకు, శాసన సభలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించే విషయం చర్చించడానికి మోదీ గత వారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. 40 పార్టీలను ఆహ్వానిస్తే, 21 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. మెజారీటీ పార్టీలు జమిలి ఎన్నికలకు సానుకూలత వ్యక్తం చేసినా కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలనీ ఆ సమావేశం నిర్ణయించింది. నిజానికి జమిలి ఎన్నికల ఆలోచన ఇప్పటిది కాదు. 20 ఏళ్ల క్రితమే బీజేపీ–ఆరెస్సెస్‌లు ఒకే దేశం ఒకే ఎన్నిక ఆలోచన చేశాయి. అటల్ బిహారీ వాజపేయి హయాంలో దీనిపై విస్తృత చర్చ జరిగింది. అప్పటి లా కమిషన్ కూడా ఇందుకు సానుకూలత వ్యక్తం చేసింది. 70వ దశకం వరకు .... మన దేశంలో 1951 నుంచి 1967 వరకు లోక్‌సభ, శాసన సభలకు ఇంచుమించు ఒకేసారి ఎన్నికలు జరిగేవి. రాష్ట్రాల పునర్విభజన జరగడం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గడువు కంటే ముందే రద్దవడం వంటి కారణాల వల్ల లోక్‌సభతో పాటు ఎన్నికలు జరిగే రాష్ట్రాల శాతం తగ్గుతూ వచ్చింది.1970వ దశకం నుంచి జమిలి ఎన్నికలు దాదాపుగా జరగలేదనే చెప్పాలి. అయితే, 1990లలో బీజేపీ ఎన్నికల్లో బలం పుంజుకోవడంతో జమిలి ఎన్నికల ప్రతిపాదన బలపడుతూ వచ్చింది. అన్నాడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,టీఆర్ఎస్ జమిలి ఎన్నికలను సమర్థిస్తోంటే, సీపీఐ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నాయి. 2017 నుంచి మోదీ జమిలి ఎన్నికల గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. జమిలి ఎన్నికలపై అధ్యయనం జరగాలని ఈ ఏడాది జనవరిలో మోదీ సూచించారు. ఇవీ అవరోధాలు జమిలి ఎన్నికలు అమల్లోకి రావాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. దానికి పార్లమెంటులో మూడొంతుల మెజారిటీ, సగం రాష్ట్రాల ఆమోదం అవసరం. ప్రస్తుతం లోక్‌సభలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది. రాజ్యసభలో కూడా త్వరలో మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం జమిలి ఎన్నికలు అమల్లోకి వస్తే ఉప ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలు ఉండవని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏ కారణం చేతనయినా ఎంపీ లేదా ఎమ్మెల్యే పదవి ఖాళీ అయినా, ప్రభుత్వం కూలిపోయినా గడువు వరకు వాటికి ఎన్నికలు జరిపే అవకాశం ఉండదంటున్నారు. ఈ విధానంతో ఖర్చు తగ్గుతుందని, రాజకీయ కక్షలు తగ్గుతాయని, సంక్షేమ పథకాలు కొనసాగుతాయంటున్నారు. -
జాతి వైవిధ్యతకు ‘జమిలి’ ప్రమాదం
దేశంలో భారీస్థాయికి చేరుకున్న ఎన్నికల ఖర్చును తగ్గించే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏకకాలంలో అసెంబ్లీలకు, పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించడం పేరిట జమిలి ఎన్నికల ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. దీనిలో సాధ్యాసాధ్యాలు, జాతీయ–స్థానిక రాష్ట్రస్థాయి సమస్యల మధ్య వ్యత్యాసం వంటి ఆచరణాత్మక అంశాలను పక్కనబెట్టి చూస్తే, ఈ ప్రతిపాదనలో అంతకు మించిన ప్రమాదం పొంచి ఉందన్నది వాస్తవం. వివిధజాతుల సమ్మిళత సంస్కృతిగా మన రాజ్యాంగం ఘనంగా ప్రవచించిన భారతీయ బహుముఖ వైవిధ్యతను నిర్మూలించి దేశం మొత్తాన్ని ఏకజాతీయ చట్రంలో ఇరికించే స్వబావంతో జమిలి ఎన్నికల భావన ముందుకొస్తోంది. అధికార పార్టీకి తిరుగులేని బలం చేకూర్చే ఆ ప్రతిపాదన అమలైతే దేశం, పౌరులు చెల్లించాల్సిన మూల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక దేశం ఒకే పోల్ పేరిట దేశంలో ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం అవుతున్న జమిలి ఎన్నికల నినాదం అతి ప్రమాదకర సంకేతాలను వెలువరిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే జమిలి ఎన్నికల భావన వివిధజాతుల సమ్మిళిత సంస్కృతిగా మనం ఘనంగా చెప్పుకునే భారతీయ వైవిధ్యతను నిర్మూలించి దేశం మొత్తాన్ని ఏకజాతీయ చట్రంలో ఇరికించే స్వబావంతో ముందుకొస్తోంది. సజాతీయత ముసుగులో ఎన్నికలు గెల్చుకోవడం అనే ప్రక్రియను విజయవంతంగా ముగించిన కేంద్రంలోని పాలకపార్టీకి జమిలి ఎన్నికలు వరంగా మారటం ఖాయం. కానీ అతిపెద్ద దేశంగా ఉంటూ తనే ఒక ఖండంగా భాసిల్లుతున్న భారతదేశంలో ఎన్నికల కమిషన్ సన్నద్ధత తీరుతెన్నులను పరిశీలించే వారికి ఒక విషయం సుబోధకమే. ప్రధాని నరేంద్రమోదీ, ఆయన సహాయకులు ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి చేయవలసిన ప్రధాన కర్తవ్యం ఏమిటంటే, ఒకే రోజు దేశవ్యాప్తంగా పోలింగ్ నిర్వహించి ఫలితాలను నాలుగురోజుల్లోపే ప్రకటించాలని ఎన్నికల కమిషన్ని కోరడమే. దేశం మొత్తంలో ఎన్నికలను ఒకేరోజు ముగించడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు సిద్ధిస్తాయి. వీటిలో మొట్టమొదటిది ఏమిటంటే ఎగ్జిట్ పోల్స్ ప్రాతిపదికన పార్టీల గెలుపోటములపై విచ్చలవిడిగా సాగుతున్న అంచనాలను అరికట్టవచ్చు. ఎగ్జిట్ పోల్స్ తనకు తానుగా ఒక దందా లాగా మారిపోయి మార్కెట్లోని దళారీలకు ఫలితాల అంచనాల పేరిట కోట్లాదిరూపాయలు కొల్లగొట్టే అవకాశాలు కల్పిస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల కేంపెయిన్ మార్చి 10న మొదలై మే 19న చివరి దశ ప్రచారంతో ముగిసింది. మే 23న ఫలితాల లెక్కింపు జరి గింది. ఇంత సుదీర్ఘకాలం జరిగే ఎన్నికల ప్రక్రియ వల్ల అనేక పుకార్లు వ్యాప్తి చెందుతూ, అంచనాలు పెరుగుతూ పోవడమే కాదు.. ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికతపై, భారత ఎన్నికల సంఘం పనితీరుపైనే సందేహాలను రేకెత్తిస్తోంది. కాబట్టి, మోదీ జమిలి ఎన్నికలను కోరుకుంటున్నట్లయితే, దేశమంతా ఒకేరోజు పోలింగ్ పూర్తి చేసి తదుపరి నాలుగైదు రోజుల్లోనే ఫలితాలను వెల్లడించేలా తగిన ఏర్పాట్లను సిద్ధం చేయాలి. అవసరమైన చోట రీపోల్స్ జరిపించడం, ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు తరలించడానికి ఈ అయిదు రోజుల వ్యవధి సరిపోతుంది. ఇక రెండో విషయం.. ఒకే దేశం ఒకే పోల్ విధానంలో ఎన్నికల నిధులను ప్రభుత్వమే సమకూర్చడం. పోలింగ్ జరగడానికి రెండు నెలల ముందే రాజకీయ పరమైన ప్రకటనలను, ఒపీనియన్ పోల్స్‌ని నిషేధించాల్సి ఉంటుంది. మూడోది.. రాష్ట్ర అసెంబ్లీలు వివిధ కాలాల్లో ఏర్పడుతుంటాయి. ఇది ఎల్లప్పుడూ సంభవించే ప్రక్రియ. శాసనసభలకు కూడా ఏకకాలంలో ఎన్నికలు 1950 మొదట్లో మాత్రమే జరిగేవి. కానీ ఆ తర్వాత వివిధ రాష్ట్రాల అసెంబ్లీల కాల వ్యవధి మారుతూ వచ్చింది. ప్రభుత్వాలు కుప్పగూలిపోవడం, రాష్ట్రపతి పాలన వంటి పలు పరిణామాలు దీనికి కారణం. ఇలాంటివి పదే పదే జరగటం సహజం. సార్వత్రిక ఎన్నికలు జరిగేవరకు రాష్ట్రాల అసెంబ్లీలను అనిశ్చితంగా ఉంచలేరు. అలా ఉంచితే అది పూర్తి సమస్యాత్మకంగా మారుతుంది. అంతకుమించి జాతీయ సమస్యలకు, స్థానిక రాష్ట్ర స్థాయి సమస్యలకు మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఉంటుంది. ఇవి రెండు ఎన్నటికీ ఒకటిగా ఉండలేవు. ప్రస్తుతం ఎన్నికల కోసం జరుగుతున్న భారీ స్థాయి ఖర్చును తగ్గించాలని ప్రధానమంత్రి భావించడంలో తప్పులేదు. మనం అర్థం చేసుకోగలం కూడా. కానీ వాస్తవమేమిటంటే స్వయంగా ఆయన పార్టీనే ఈ దఫా ఎన్నికల్లో విపరీతంగా ఖర్చుపెట్టింది. బీజేపీ మినహా ఇతర పార్టీలన్నీ కలిపి కూడా బీజేపీ పెట్టిన ఖర్చులో కనీసం 50 శాతం కూడా వెచ్చించలేకపోయాయి. కాబట్టి భారీస్థాయిలో డబ్బులు వెదజల్లి అధికారంలోకి వచ్చిన పార్టీ తనతో సమాన స్థాయిని కలిగి ఉండే పార్టీల ఉనికిని ఎన్నడూ అంగీకరించదు. అందుకే ప్రస్తుత కేంద్రప్రభుత్వం శాశ్వతంగా అధికారంలో ఉండటంకోసం దూకుడుగా తన ఆధిపత్యాన్ని చలాయించడానికి ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. ప్రజాస్వామ్యం నిజంగా బలోపేతం కావాలంటే అమెరికా అధ్యక్షపాలనా వ్యవస్థ తరహాలో మన దేశంలోనూ రెండు దఫాలకు మించి ఎవరూ ప్రధాని పదవిని చేపట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఇది ప్రజాస్వామీకరణ ప్రక్రియను సంఘటితం చేస్తుంది. అదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా అంతర్గతంగా ప్రజాస్వామీకరణ ప్రక్రియకు అనుమతించాలి. అప్పుడు మాత్రమే మనదేశంలోని రాజకీయ పార్టీలు వివిధ రాజకీయ కుటుంబాల వారసత్వపు హక్కుగా మారలేవు. పైగా ఒకే జాతి, ఒకే పోల్ అనేది ఏరకంగా చూసినా ఆచరణ సాధ్యమయ్యే భావన కాదు. ఒక అసెంబ్లీలే ఎందుకు, పార్లమెంటే ఎందుకు, పంచాయతీలు, పట్టణ స్థానిక పాలనా సంస్థలు, జిల్లా పరిషత్‌లు అన్నిం టికీ ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే పోలా? ఇది ఎంత అనాలోచితమైన, అవాస్తవికమైన ప్రతిపాదనో అర్థం చేసుకోవచ్చు. ప్రధాని మోదీ తలంపులోంచి పుట్టుకొచ్చిన ఈ జమిలి ఎన్నికల భావనలో కొత్తదనం అన్నది లేదు. చరిత్రలో శక్తిమంతుడైన ప్రతి వ్యక్తీ, నియంతా తిరుగులేని అధికారాన్నే కోరుకున్నాడు కానీ అది ఆచరణాత్మకం కాదు. వాస్తవం అంతకంటే కాదు. రాష్ట్ర ప్రభుత్వాల పదవీకాలాన్ని బట్టి వివిధ రాష్ట్రాల శాసనసభలు వివిధ కాలాల్లో ఎన్నికలకు వెళ్తుంటాయి. శాసనసభల పదవీకాలాన్ని ఒకసారి నిర్ణయించిన తర్వాత దాదాపు అదేసమయంలో అవి ఎన్నికలకు వెళ్తుంటాయి. ఈ చట్రానికి అవతల ఎవరూ ఎలాంటి ప్రయోజనమూ పొందలేరు. ఒక రాజకీయ పార్టీగా బీజేపీ తన చరిత్రలోనే ఎన్నడూ లేనంత ఉజ్వల దశను ఇప్పుడు అనుభవిస్తోంది. పైగా ప్రతి దేశంలోని ప్రతి పాలనా వ్యవస్థా ఇప్పుడు దాని చేతుల్లో ఉన్నాయి. ఈ దన్ను, దమ్ముతోనే అది దేశవ్యాప్తంగా సమస్త ప్రతిపక్షాలను దిగ్బంధించాలని ప్రయత్నిస్తోంది. కానీ బీజేపీ ప్రయత్నాలకు దేశం చెల్లించే మూల్యం అసాధారణంగానే ఉంటుంది. ఒకేదేశం, ఒకే ఎన్నిక అంటూ మోదీ చేసిన ప్రతిపాదనను లా కమిషన్ కూడా తర్కించి ఈ అంశంపై తమ అభిప్రాయాలను తెలుపాల్సిం దిగా వివిధ రాజకీయపార్టీలను కోరింది. అయితే భారతీయ ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు ఒక భాగం మాత్రమే. ఎన్నికలకు సంబంధించిన ఈ మొత్తం ప్రక్రియలో ఎన్నికల సంఘానికి, న్యాయవ్యవస్థకు, అందరికంటే మించి భారతీయ ఓటరు లేదా పౌరుడికి కూడా భాగముంది. అందుకే ఈ కీలకమైన అంశంపై ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు అన్ని వర్గాల అభిప్రాయాలను లెక్కలోకి తీసుకోవాలి. భారత్ ఇప్పటికీ పరిణితి చెందుతూ ఉన్న ప్రజాస్వామ్యంగా, అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంటోంది. ఎదుగుతున్న దేశం అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. వీటిలో అతిపెద్ద సవాలు చక్కటి, పారదర్శకమైన, సమర్థ పాలనను అందివ్వడం. కానీ మనదేశంలో రాజకీయ నేతలు అధికారంలోకి రావడానికి ముందు హామీలను గుప్పించి ఎన్నికై అధికారంలోకి వచ్చింతర్వాత వాటిని అవలీలగా మర్చిపోతూ, పక్కనబెడుతూ మరో అయిదేళ్లవరకు అధికారం చలాయిస్తూ ఉంటారు. చివరకి మరో దఫా ఎన్నికలకు సమయం సమీపిస్తున్నప్పుడు మాత్రమే వీరికి తాము గతంలో చేసిన హామీలు గుర్తుకొస్తాయి. అభివృద్ధి చెందిన దేశాల వలే కాకుండా భారత్ వంటి వర్ధమాన దేశాల్లో రాజకీయనేతలు, బ్యూరోక్రాట్లు చట్టాలను పదేపదే ఉల్లంఘిస్తూ, చట్టపాలన అమలుకాని పరిస్థితిని అందిపుచ్చుకుని శిక్షలనుంచి తప్పించుకుంటుంటారు. అందువల్లే అధికారం కైవసం చేసుకున్న నేతలు, వారి అధికారులు, ప్రభుత్వ సేవకులు అధికారాన్ని తరచుగా దుర్వినియోగ పరుస్తూనే ఉంటారు. రాజ కీయ నేతలు తామిచ్చిన హామీలకు కట్టుబడకపోతే వారిని తిరస్కరించే అవకాశం ఓటర్లకు అయిదేళ్లకుగానీ రాదు. ఈ స్థితిలో మార్పులు తీసుకొచ్చేంత వరకు, అపసవ్య పాలన అమలవుతున్న వ్యవస్థలో ఎన్నికలను ఇప్పుడున్న రీతిలో యధాతథంగా కొనసాగించడమే ఉత్తమం. దేశవ్యాప్తంగా ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడంలో ఉండే పరిహాసాన్ని, అభాసను ఒకసారి చూడండి. ఈ ఎన్నికల సమయంలో అమిత్ షా, స్మృతి ఇరానీ గుజరాత్ నుంచి తమ రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేశారు. రెండు విభిన్న తేదీల్లో వీరు రాజీనామా చేయడం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎన్నికల కమిషన్ ఒక అసాధారణ ఆదేశాన్నిచ్చి, ఆ రెండు రాజ్యసభ స్థానాలకు విభిన్న తేదీల్లో పోలింగ్ నిర్వహించింది. ఆ రెండు స్థానాలను బీజేపీకే దక్కనివ్వాలనే ఈసీ తలంపు వెనుక ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. పాలక పక్షం ఇష్టాయిష్టాలకు అనుగుణంగా తోలుబొమ్మలాగా మారి ఎన్నికల సంఘం తన ప్రతిష్టను తానే ఈ రకంగా దిగజార్చుకోవచ్చా? ఒకే దేశం, ఒకే ఎన్నిక అంటూ చర్చ లేవనెత్తుతున్న అధికార పార్టీకి గుజరాత్లో రెండు రాజ్యసభ స్థానాలకు ఏకకాలంలో, ఒకే తేదీన ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాలేకపోయిందా? ఎంత కపటత్వమో ఇది. జమిలి ఎన్నికల పేరిట అధికార పార్టీ భవిష్యత్తులో చేసే చేష్టలు ఇలాగే కొనసాగుతాయి. రాజ్యంగం ప్రవచించిన భారతీయ బహుముఖీన వైవిధ్యాన్ని నిర్మూలిస్తూ ఏక సంస్కృతి, ఏకజాతితత్వాన్ని ముందుపీఠికి తీసుకువస్తున్న క్రమంలో పాలకపక్షం తొండాట ప్రారంభంలోనే ఈ స్థాయిలో రుజువవుతోంది మరి! వ్యాసకర్త : విద్యా భూషణ్ రావత్, సామాజిక, మానవ హక్కుల కార్యకర్త -
జమిలి పరీక్ష
‘ఒక దేశం–ఒకే ఎన్నిక’ పేరుతో వచ్చిన జమిలి ఎన్నికల ప్రతిపాదనపైన భిన్నాభిప్రాయాలు వెల్లడి కావడం సహజం. రెండవ విడత ప్రధానిగా ప్రమాణం స్వీకరించిన వెంటనే నరేంద్రమోదీ ప్రదర్శిం చిన పూనికలలో అత్యంత కీలకమైనది ఈ అంశం. మొత్తం నలభై రాజకీయ పార్టీలను సమాలోచ నకు ఆహ్వానిస్తే దాదాపు సగం పార్టీల (21) ప్రతినిధులు ఢిల్లీలో బుధవారం జరిగిన అఖిలపక్ష సమా వేశంలో పాల్గొన్నారు. లోక్‌సభకూ, శాసనసభలకూ ఏకకాలంలో సమాంతరంగా ఎన్నికలు నిర్వహిం చాలన్న ఆలోచన మోదీ మదిలో కొంతకాలంగా మెదులుతున్నదే. ఒ కేసారి ఎన్నికలు జరిగితే ఖర్చు కలసి వస్తుందనీ, ఎన్నికల నియమావళి పేరుతో నిష్క్రియాపరత్వం పాటించవలసిన రోజుల సంఖ్య తగ్గుతుందనీ, ప్రతి సంవత్సరం రెండు, మూడు రాష్ట్రాలలో ఎన్నికలు జరగడం వల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సైతం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి సంకోచిస్తుందనీ, ఒకేసారి అన్ని ఎన్నికలు జరిగితే ప్రభుత్వాలన్నీ పరిపాలనపైన దృష్టి పెట్టవచ్చుననీ ఈ ప్రతిపాదనకు అను కూలంగా చెప్పుకోదగిన అంశాలు. 1967 ఎన్నికలలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏక ఛత్రాధి పత్యం అంతమైంది. ప్రాంతీయపార్టీల ప్రాభవం పెరిగింది. సంకీర్ణయుగం మొదలయింది. ఈ కారణాల వల్ల అస్థిరత చోటు చేసుకున్నది. పరిపాలనకు గండి పడింది. అతుకుల బొంతల సంకీ ర్ణాలు ప్రభుత్వాలు ఏర్పరచడం, పార్లమెంటులో అడుగుపెట్టకుండానే ప్రధాని రాజీనామా సమ ర్పించిన సందర్భం కూడా చూశాం. ఐదేళ్ళకు ఒకసారి అన్ని శాసన వ్యవస్థలకూ ఎన్నికలు జర గడం వల్ల దేశంలో రాజకీయ సుస్థిరత నెలకొనడానికి ఆస్కారం ఉన్నది. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలకు నష్టం వాటిల్లుతుందనీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సహజమైన ఆధిక్యం ఉంటుం దనీ, భిన్నత్వంలో ఏకత్వం సూత్రం దెబ్బతింటుందనీ, దేశ సమగ్రతకు జమిలి ఎన్నికలు భంగం కలిగిస్తాయనే వాదనలు ఉన్నాయి. పరోక్షంగా అధ్యక్ష వ్యవస్థకు దారితీసే ప్రమాదం ఈ ప్రతిపాద నలో ఉన్నదనే భయాలు వ్యక్తం అవుతున్నాయి. సందేహాలు ఉన్నంత మాత్రాన చర్చకు వెనకాడనక్క రలేదు. ప్రధాని అఖిలపక్షం ఏర్పాటు చేసినప్పుడు హాజరు కాకపోవడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. సమావేశానికి వెళ్ళి తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడమే విజ్ఞత. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే కొన్ని శాసనసభల పదవీ కాలాన్ని పొడిగించాలి. మరి కొన్ని శాసనసభల గడువును కుదించవలసి రావచ్చు. ఇటువంటి పని ఏది చేయాలన్నా రాజ్యాంగ సవరణ అవసరం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందాలంటే ఉభయ సభలూ మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించాలి. నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (ఎన్డీఏ)కి లోక్‌సభలో మూడింట రెండు వంతుల ఆధిక్యం ఉన్నది కానీ రాజ్యసభలో లేదు. అందుకే ప్రాంతీయ పార్టీలను ప్రసన్నం చేసుకోవడానికీ లేదా చీల్చడానికీ మోదీ ప్రభృతులు ప్రయత్నిస్తున్నారు. తె లుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీని చీల్చడం, బీజేపీలో విలీనం కావడం ఇందుకు తాజా నిదర్శనం. రాజ్యసభలో మూడింట రెండు వంతుల మెజారిటీ ఎన్డీఏకి దక్కితే ఎన్నికల సంస్కరణలతో సరిపెట్టుకోదనీ, కశ్మీర్‌పైన ప్రభావం చూపించే 370వ అధికరణను సవరించే ప్రయత్నం చేయవచ్చుననీ ప్రజాస్వామ్యవాదులు కొందరు భయపడుతున్నారు. వారి భయాలు నిర్హేతుకమైననవి విశ్వాసం కలిగించే బాధ్యత కేంద్ర ప్రభుత్వా నికి ఉంది. సమాంతర ఎన్నికలపైన 2018 ఆగస్టులో లా కమిషన్ ఒక ముసాయిదా నివేదిక సమర్పించింది. దాని ప్రకారం చట్టానికి సవరణ చేసిన తర్వాత దానిని దేశంలోని సగం రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాలి. బీజేపీ సగానికి పైగా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కారణంగా అది తేలికే. మోదీ వంటి ప్రతిభావంతుడైన నాయకుడు ఎన్నికల ప్రచారం చేసిన తర్వాత ప్రజలు లోక్ సభకీ, శాసనసభలకీ ఒకే విధంగా ఓటు చేసే అవకాశం ఉన్నది. 2019లో ఒడిశా ప్రజలు లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి పట్టం కట్టి శాసనసభ ఎన్నికలలో నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజూ జనతాదళ్‌ను అయిదో విడత గెలిపించి విచక్షణాజ్ఞానం ప్రదర్శించారు. నిరుడు రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని ఓడించిన ఓటర్లు మొన్నటి లోక్‌సభ ఎన్నికలలో అదే పార్టీకి ఘనవిజయం కట్టబెట్టారు. కానీ అసెంబ్లీ ఎన్నికలూ, లోక్‌సభ ఎన్నికలూ ఒకేసారి జరిగి ఉంటే అసెంబ్లీ ఎన్నికలలో కూడా బీజేపీ గెలిచి ఉండేదేమో. కేంద్రంలో ప్రభుత్వం గడువు కంటే ముందు పడిపోయినా, రాష్ట్రాలలోని ప్రభుత్వాలు పార్టీ ఫిరాయింపుల కారణంగా కుప్పకూలినా కష్టమే. కేంద్ర ప్రభుత్వం పడిపోతే లోక్‌సభకు మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి. దానితో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకూ ఎన్నికలు నిర్వహిస్తారా? కేంద్రంలో కూడా రాష్ట్రపతి పాలన విధించాలంటూ కొత్త చట్టం తెస్తారా? ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోయి, ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేకపోతే సార్వత్రిక ఎన్నికలు జరిగే వరకూ రాష్ట్రపతి పాలన విధించాలి. ఎటుచూసినా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలమే. ఎవరైనా లోక్‌సభ సభ్యుడు కానీ శాసనసభ్యుడు కానీ మృతి చెందితే ఆ స్థానం మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు జరిగే వరకూ ఖాళీగా ఉండాల్సిందే. జమిలి ఎన్నికల ప్రతిపాదనను సమర్థిస్తూ చెప్పే కారణాలు ఎంత బలమైనవో, వ్యతిరేకిస్తూ చెప్పే కారణాలు సైతం అంతే బలమైనవి. అందుకే కూలంకషంగా చర్చించి రాజ్యాంగస్ఫూర్తికీ, సమాఖ్య స్వభావానికీ, ప్రజా స్వామ్య స్పృహకూ అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సకల రాజకీయ పక్షాల నాయకులూ చర్చలో పాల్గొనాలి. విధివిధానాలు చర్చించడానికి ఒక కమిటీని నియమిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అన్ని కోణాల నుంచీ పరిశీలించి మౌలి కమైన రాజ్యాంగ విలువలకు విఘాతం కలగకుండా సంయమనమే ప్రధానంగా భవిష్యత్ కార్యా చరణ ఉంటుందని ఆకాంక్ష. -
ప్రతి ఒక్కరికీ సాధికారతే లక్ష్యం
న్యూఢిల్లీ: రెండోసారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వ రోడ్‌మ్యాప్‌ను రాష్ట్రపతి కోవింద్ ఆవిష్కరించారు. 2014లో ప్రారంభమైన నిరంతర, నిరాటంక అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగించేందుకు వీలుగా ప్రజలు గట్టి తీర్పునిచ్చారని చెప్పారు. భారత ప్రజాస్వామ్య విశ్వసనీయతను ఈ సాధారణ ఎన్నికలు పెంపొందించాయన్నారు. రికార్డు స్థాయిలో 61 కోట్ల మంది ప్రజలు ఓటేశారని, వీరిలో మహిళలే ఎక్కువ శాతం ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో 2022 నాటికి నవభారతాన్ని నిర్మించేలా ప్రతి ఒక్కరికీ సాధికారతను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రజలకు సాధికారత కల్పించడం ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం పేదలకు నివాస, ఆరోగ్యపరమైన సౌకర్యాలు కల్పిస్తోందని చెప్పారు. గురువారం పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి కోవింద్ సుమారు గంటసేపు ప్రసంగించారు. మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను, ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుతం దేశానికి జమిలి ఎన్నికలు అవసరమని అన్నారు. ఎప్పుడూ దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికలు జరుగుతుండటం అభివృద్ధి కార్యక్రమాల వేగం, కొనసాగింపుపై ప్రభావం చూపిస్తోందన్నారు. అందువల్ల ఎంపీలందరూ ‘ఒకే దేశం – ఒకే ఎన్నికలు’అనే అభివృద్ధి కాముక ప్రతిపాదనపై గట్టిగా దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నానన్నారు. లోక్‌సభలో సగం మంది ఎంపీలు కొత్తగా ఎన్నికైన వారు కావడం, మునుపెన్నడూ లేనివిధంగా 78 మంది మహిళా ఎంపీలుండటం నవభారత దృశ్యాన్ని మన ముందు ఉంచుతోందన్నారు. భారత్‌కు ప్రపంచ దేశాల మద్దతు దేశ భద్రతకు ప్రభుత్వం అత్యంత అధిక ప్రాధాన్యతను ఇస్తోందంటూ మెరుపు దాడులను, పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడులను రాష్ట్రపతి ప్రస్తావించారు. తొలుత మెరుపుదాడులతో, ఆ తర్వాత పుల్వామా దాడి నేపథ్యంలో సరిహద్దు పొడవునా ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడుల ద్వారా ప్రభుత్వం ఈ విషయంలో తన ఉద్దేశాన్ని, సామర్థ్యాన్ని చాటి చెప్పిందన్నారు. ఉగ్రవాదంపై భారత్ వైఖరికి ప్రపంచ దేశాలు మద్దతు పలుకుతున్నాయన్నారు. జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం ఇందుకు నిదర్శనమన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రజలకు సురక్షితమైన, ప్రశాంత వాతావరణం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందన్నారు. రైతు సంక్షేమానికి చర్యలు నవభారత నిర్మాణం సాధన దిశగా 21 రోజుల్లోనే ప్రభుత్వం.. రైతులు, సైనికులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, మహిళలు, సమాజంలోని ఇతర వర్గాలు లక్ష్యంగా ఎన్నో నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. రైతులు, చిరు వ్యాపారులకు పింఛను పథకాలు ప్రారంభించేందుకు, రైతులందరికీ రూ.6 వేల ఇన్పుట్ సబ్సిడీ వర్తింపజేసేందుకు తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు రానున్న సంవత్సరాల్లో రూ.25 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడం జరుగుతుందని తెలిపారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా గత ఐదేళ్లలో పలు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సాంఘిక దురాచారాల నిర్మూలన మహిళలకు సమాన హక్కులు కల్పించేలా ట్రిపుల్ తలాక్, నికా హలాల వంటి సాంఘిక దురాచారాల నిర్మూలనలో ప్రభుత్వం చిత్తశుద్ధిని రాష్ట్రపతి నొక్కి చెప్పారు. అవినీతిపై ఉక్కుపాదం మోపే విధానాన్ని మరింత పటిష్టం చేసేందుకు నల్లధన వ్యతిరేక కార్యాచరణను వేగంగా ముందుకు తీసుకువెళతామన్నారు. గత రెండేళ్లలో 4 లక్షల 25 వేల కంపెనీ డైరెక్టరపై అనర్హత వేటు వేశామని, 3 లక్షల 50 వేల అనుమానాస్పద కంపెనీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. విదేశాల్లో నల్లధనం దాచుకున్న వారి వివరాలన్నీ ప్రస్తుతం దేశానికి అందుతున్నాయని చెప్పారు. అభివృద్ధిని ప్రోత్సహించడం, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం త్వరలోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తుందన్నారు. సహకార సమాఖ్య వ్యవస్థ విధానాన్ని, స్ఫూర్తిని బలోపేతం చేసేలా దేశ ప్రయోజనాల సాధనకు తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కలుపుకుని పోతోందని చెప్పారు. ప్రసంగం సైడ్‌లైట్స్ ► ప్రసంగ సమయంలో కావేరీ జలాల సమస్యను తీర్చాలంటూ డీఎంకే పార్టీ సభ్యులు ప్లకార్డులతో నినాదాలు చేశారు. ► రాష్ట్రపతి ప్రసంగంలో మోదీ ప్రభుత్వాన్ని సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ను, రఫేల్ అంశం గురించి ప్రసంగిస్తున్నపుడు ఎన్డీయే సభ్యులు చప్పట్లు చరిచారు. ► ప్రసంగసమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌సహా పలువురు ఎంపీలు మొబైల్ ఉపయోగించడం కెమెరాల కంటపడింది. ► రాష్ట్రపతి వెళ్లిపోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీల సభ్యులు పలువురు రాహుల్‌గాంధీని కలిశారు. సెంట్రల్ హాల్ నుంచి బయటకు వస్తూ సోనియా గాంధీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పలకరించుకున్నారు. కోవింద్ ఏడాదిలో ఇది రెండోసారి రాష్ట్రపతి కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. క్రీమ్ కలర్ జోధ్‌పురి సూట్ (బంద్గలా) ధరించిన కోవింద్ అశ్విక దళం ముందూ వెనుకా నడుస్తుండగా బగ్గీలో కాకుండా కార్లో పార్లమెంటు ఆవరణకు చేరుకున్నారు. అంతకుముందు తన వ్యక్తిగత అంగరక్షకుల (పీబీజీ) గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రపతి భవనం వెలుపల అశ్విక దళం (పీబీజీ) రాష్ట్రపతి వెంట ఉండటం అరుదుగా కన్పిస్తుంది. సాధారణంగా ఏడాదిలో మూడుసార్లు రాజధాని వాసులకు ఈ దృశ్యం కనువిందు చేస్తుంది. ఈ ఏడాది ఇలా జరగడం నాల్గోసారి. -
జమిలి ఎన్నికలపై కమిటీ
న్యూఢిల్లీ: ఒకే దేశం, ఒకే ఎన్నిక అంశంపై నిర్ణీత గడువులోగా సూచనలు ఇచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం నాడిక్కడ ప్రకటించారు. నిర్దిష్ట కాలవ్యవధిలోగా భాగస్వామ్యపక్షాలతో ఈ కమిటీ చర్చలు జరుపుతుందని తెలిపారు. జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయ సాధన కోసం అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో సమావేశం నిర్వహించాలని భావించిన మోదీ ఆ మేరకు 40 మందికి ఆహ్వానం పలికారు. అయితే 21 పార్టీలు మాత్రమే బుధవారం నాటి ఈ భేటీకి హాజరుకాగా మరో మూడు పార్టీలు ఈ అంశంపై తమ అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేశాయి. అఖిలపక్ష నేతలతో సమావేశానంతరం రాజ్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. జమిలి ఎన్నికలనేవి ప్రభుత్వ ఎజెండా కాదని, ఇది జాతి ఎజెండాగా ప్రధాని ఈ సమావేశంలో స్పష్టం చేశారన్నారు. ఈ విషయంలో ఎలాంటి భిన్నాభిప్రాయాన్ని అయినా స్వాగతిస్తామని మోదీ చెప్పారన్నారు. లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనకు చాలా పార్టీలు మద్దతు పలికాయని చెప్పారు. ఉమ్మడి ఎన్నికల కసరత్తు ఎలా జరుగుతుందనే దానిపై సీపీఐ, సీపీఎం వంటి పార్టీలకు భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ, ఈ ఆలోచనను వారు నేరుగా వ్యతిరేకించలేదని తెలిపారు. పార్లమెంటు ఉత్పాదకత పెంచాలనే అంశంలో పార్టీలన్నీ ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయన్నారు. చర్చకు, సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు వీలుగా సభలో సుహృద్భావ వాతావరణం ఉండాలని అఖిల పక్షానికి హాజరైన నేతలు అభిప్రాయపడినట్లు తెలిపారు. కాగా కమిటీ కూర్పుపై ప్రధాని నిర్ణయం తీసుకుంటారని రాజ్‌నాథ్ చెప్పారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. ఇది రాజకీయ కమిటీ. వివిధ రాజకీయ పార్టీల నేతలు ఇందులో సభ్యులుగా ఉంటారు. హాజరైన ఏపీ సీఎం వైఎస్ జగన్ ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’తో పాటు దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అయ్యే సందర్భంగా 2022లో ఉత్సవాలు నిర్వహించడం, అలాగే ఈ ఏడాది మహాత్మాగాంధీ 150 జయంతి ఉత్సవాలు నిర్వహించడం తదితర అంశాలపై చర్చించేందుకు నిర్వహించిన ఈ సమావేశానికి ఎన్డీయే మిత్రపక్షం శివసేనతో పాటు పలు విపక్ష పార్టీలు హాజరుకాలేదు. గైర్హాజరైన ప్రముఖుల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, డీఎంకే నేత ఎంకే స్టాలిన్, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ , బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉన్నారు. హాజరైన వారిలో ఎన్సీపీ నేత శరద్‌పవార్, సీతారాం ఏచూరి (సీపీఎం), సురవరం సుధాకర్‌రెడ్డి (సీపీఐ), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్‌కుమార్, ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ నేత నవీన్ పట్నాయక్, సుఖ్బీర్ సింగ్ బాదల్ (శిరోమణి అకాలీదళ్), కోనార్డ్ సంగ్మా (నేషనల్ పీపుల్స్ పార్టీ) ఉన్నారు. పార్లమెంటు హౌస్ లైబ్రరీ భవనంలో జరిగిన ఈ భేటీలో పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా కూడా పాల్గొన్నారు. టీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హాజరయ్యారు. మోదీ, రాజ్‌నాథ్‌లతో పాటు ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ జోషి, బీజేపీ కొత్త కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నారు. ప్రజాస్వామ్య విరుద్ధం: ఏచూరి అయితే జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి, సమాఖ్యవాదానికి విరుద్ధమని, ఆ విధంగా అవి రాజ్యాంగ విరుద్ధమని సీపీఎం పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో సీతారాం ఏచూరి మాట్లాడారు. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దొడ్డిదారిన తొలగించడమేనని ఏచూరి పేర్కొన్నారు. అంతకుముందు సమావేశంలో జమిలి ఎన్నికల కోసం ప్రభుత్వం చేస్తున్న కృత్రిమ ప్రయత్నాన్ని సీపీఎం ఎందుకు వ్యతిరేకిస్తోందీ తెలియజేసే ఒక పత్రాన్ని పార్టీల ప్రతినిధులకు అందజేశారు. శాసనవ్యవస్థకు ప్రభుత్వాన్ని జవాబుదారీని చేసే రాజ్యాంగ ప్రక్రియను ఇది తారుమారు చేస్తుందని పేర్కొన్నారు. నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ తిరోగమనం, డేటా విశ్వసనీయత తదితర అంశాలను కూడా ఆ పత్రంలో ప్రస్తావించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి మద్దతు పలికిన బీజేడీ నేత నవీన్ పట్నాయక్.. రాజ్యాంగ ప్రవేశికలో శాంతి, అహింస అనే పదాలను చేర్చాలని డిమాండ్ చేశారు. ఇది ప్రస్తుత ప్రాధాన్య అంశం కాదు: మాయావతి భారత్ వంటి అతిపెద్ద దేశానికి జమిలి ఎన్నికలనేవి అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధ ఆలోచనగా కనబడుతోందని మాయావతి పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం దేశం ముందున్న అంశం కాదని విమర్శించారు. ఈవీఎంలపై అఖిలపక్షం ఏర్పాటు చేసి ఉంటే హాజరయ్యేదాన్నంటూ అంతకుముందు ట్వీట్ చేశారు. ఈ అంశంపై ఇతర పార్టీలతో సంప్రదింపుల అనంతరం అఖిలపక్షానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. తాను హాజరు కాబోనని మమతా బెనర్జీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అఖిల పక్షానికి బదులుగా దీనిపై చర్చలకు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె కేంద్రాన్ని కోరారు. ప్రజా ధనాన్ని పొదుపు చేసేందుకు జమిలి ఎన్నికలు నిర్వహించాలని గత ఏడాది ఆగస్టులో లా కమిషన్ సిఫారసు చేసింది. అయితే ప్రస్తుత రాజ్యాంగ నిబంధనల ప్రకారమైతే ఇది సాధ్యం కాదని న్యాయశాఖకు సమర్పించిన ముసాయిదాలో హెచ్చరించింది. ఒకేసారి ఎన్నికలు జరపాలంటే రాజ్యాంగానికి, ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. రాజ్యాంగంలోని కనీసం రెండు నిబంధనలను సవరించడంతో పాటు, మెజారిటీ రాష్ట్రాలు కనుక ఆమోదించిన పక్షంలో జమిలి ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించవచ్చని లా కమిషన్ తన సిఫారసుల్లో పేర్కొంది. లా కమిషన్ సిఫారసులతో మాజీ ప్రధాన ఎన్నికల అధికారి టీఎస్ కృష్ణమూర్తి ఏకీభవించారు. జమిలి ఎన్నికలు సాధ్యమేనని చెప్పారు. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని, కానీ అవిశ్వాస తీర్మానం, దానితో ముడిపడిన అంశాలకు సంబంధించిన రాజ్యాంగ నిబంధన దీని అమలుకు పెద్ద అవరోధమని తెలిపారు. దీనికి పరిష్కారమార్గం రాజ్యాంగ సవరణ ఒక్కటేనని పేర్కొన్నారు. అలాగే ఈ విధంగా ఎన్నికలు నిర్వహించాలంటే ఎన్నికల విధులకు అవసరమైన పారా మిలటరీ బలగాల సంఖ్యను పెంచడం సహా చాలా పాలనాపరమైన ఏర్పాట్లు అవసరమని చెప్పారు. భిన్నాభిప్రాయాలు స్వాగతిస్తాం : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ జమిలి ఎన్నికలనేవి ప్రభుత్వ ఎజెండా కాదు.. ఇది జాతి ఎజెండా అని ప్రధాని ఈ సమావేశంలో స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి భిన్నాభిప్రాయాన్ని అయినా స్వాగతిస్తామని మోదీ చెప్పారు. లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనకు చాలా పార్టీలు మద్దతు పలికాయి. ఉమ్మడి ఎన్నికల కసరత్తు ఎలా జరుగుతుందనే దానిపై సీపీఐ, సీపీఎం వంటి పార్టీలకు భిన్నాభిప్రాయం ఉన్నా, ఈ ఆలోచనను వారు నేరుగా వ్యతిరేకించలేదు. బుధవారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీకి హాజరైన ప్రధాని నరేంద్రమోదీ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో ఒడిశా, బిహార్ ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, నితీశ్‌కుమార్, కేంద్ర మంత్రులు నడ్డా, రాజ్‌నాథ్, అమిత్ షా, గడ్కరీ తదితరులు -
జమిలి ఎన్నికలకు నవీన్ పట్నాయక్ సమర్ధన
సాక్షి, న్యూఢిల్లీ : జమిలి ఎన్నికలను తాము సమర్ధిస్తామని ఒడిసా సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ తేల్చిచెప్పారు. ఒక దేశం..ఒకే ఎన్నికలు అనే నినాదానికి తమ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఏకకాల ఎన్నికలు సహా పలు కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాగా ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జేడీయూకు చెందిన నితీష్ కుమార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్ధుల్లా, పీడీపీ చీఫ్ మెహబుబా ముఫ్తీ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ తదితరులు హాజరయ్యారు. జమిలి ఎన్నికలతో పాటు, 2022లో దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు, మహాత్మ గాంధీ 150వ జయంతోత్సవాల నిర్వహణ సహా పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. -
అఖిలపక్షానికి డుమ్మా.. దానికి వ్యతిరేకమేనా?
సాక్షి, న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల నిర్వహణను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకేదేశం.. ఒకేసారి ఎన్నికలు నినాదంతో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి ఎన్డీయే పక్షాలతో పాటు, బీజేడీ, వైఎస్సార్సీపీ, వామపక్ష పార్టీల అధ్యక్షులు కూడా హాజరయ్యారు. అయితే ఈ భేటీకి తాము హాజరుకావడం లేదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. దీంతో ఆ పార్టీ జమిలి ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో పాటు టీడీపీ, ఆమ్ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, బీఎస్పీ కూడా గైర్హాజరు అయ్యాయి. తాము జమిలికి వ్యతిరేకమని బహిరంగంగా చెప్పనప్పటికీ ఆ పార్టీ వ్యవహార తీరుతో వారి అభిప్రాయం స్పష్టమవుతోంది. దేశవ్యాప్తంగా లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలన్నదే జమిలి విధానం. 2014లో బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన్పటి నుంచి జమిలి కోసం విశ్వప్రయత్నాలు చేసింది. అయితే విపక్షాల నుంచి సరైన సహాకారం లేకపోవడంతో వెనుకడుగేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుపొందడంతో బలమైన ప్రభుత్వంగా బీజేపీ ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో మరోసారి జమిలి విధానం తెరపైకి వచ్చింది. ఆ విధానాన్ని తీసుకురావాలని దేశ వ్యాప్తంగా కొన్ని పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ఇవాళ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. లోక్‌సభ, రాజ్యసభల్లో ఎంపీలు ఉన్న ప్రతి పార్టీ నేతను మోదీ ఆ సమావేశానికి ఆహ్వానించారు. 2022లో భారత్ 75వ స్వతంత్ర దినోత్సవ సంబరాలను జరుపుకోనున్నది. అదే సంవత్సరం 150 గాంధీ జయంతి ఉత్సవాలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో వన్ నేషన్.. వన్ ఎలక్షన్ విధానాన్ని అమలు చేయాలని మోదీ భావిస్తున్నారు. కానీ విపక్షలు జమిలి ఎన్నికలపై ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాయన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియదు. -
నేడు అన్ని పార్టీల అధినేతలతో మోదీ సమావేశం
-
‘జమిలి’పై భేటీకి మమత డుమ్మా
న్యూఢిల్లీ/కోల్‌కతా: జమిలి ఎన్నికల నిర్వహణ అంశంపై జరిగే 19వ తేదీన జరిగే సమావేశానికి పంపిన ఆహ్వానాన్ని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తిరస్కరించగా కాంగ్రెస్, మిగతా ప్రతిపక్ష పార్టీలు ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఏక కాలంలో ఎన్నికలతోపాటు కీలకమైన అంశాలపై చర్చించేందుకు జరిగే ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభల్లో కనీసం ఒక సభ్యుడున్న అన్ని రాజకీయ పార్టీలను ప్రధాని మోదీ ఆహ్వానించారు. మహాత్మాగాంధీ 150వ వర్థంతి, 2022లో జరిగే 75వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలపైనా ఈ భేటీలో చర్చించనున్నారు.హడావుడిగా ఇలా సమావేశం జరపడం కంటే ఏకకాలంలో ఎన్నికలపై ముందుగా శ్వేతపత్రం విడుదల చేసి, పార్టీలు, నిపుణులతో సంప్రదింపులు జరపాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ప్రహ్లాద్ జోషికి మంగళవారం మమత లేఖ రాశారు. అలా చేసినప్పుడే చాలా కీలకమైన ఈ అంశంపై తాము నిర్దిష్టమైన సలహాలు ఇవ్వగలుగుతామన్నారు. సాధారణ ఎన్నికల అనంతరం అధికార టీఎంసీని వీడి బీజేపీలో చేరిన నేతలపై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. పార్టీ మారిన వారంతా అత్యాశపరులు, అవినీతిపరులని, ఆ చెత్తను బీజేపీ ఏరుకుంటోందని వ్యాఖ్యానించారు. ఇంకా ఎవరైనా వెళ్లాలనే ఆలోచనలో ఉంటే అలాంటి వారు తొందరగా వెళ్లిపోవాలని కోరారు.. కాగా, ఈ సమావేశంలో పాల్గొనే అంశంపై చర్చించేందుకు బుధవారం ఉదయం సమావేశం కావాలని కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల నేతలు నిర్ణయించారు. ప్రజాధనం ఆదా చేసేందుకు, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించేందుకు లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల ఎన్నికలను ఒకేసారి జరపడం మేలంటూ గత ఆగస్టులో లా కమిషన్ సిఫారసు చేసింది. కాగా, ఎన్నికల్లో బీజేపీ 303 ఎంపీలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా వరుసగా కాంగ్రెస్ (52), డీఎంకే (23), వైఎస్ఆర్ కాంగ్రెస్(22), టీఎంసీ(22) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
జమిలి ఎన్నికలపై 19న అఖిలపక్ష భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో రెండోసారి అధికారాన్ని చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వం మరోసారి జమిలి ఎన్నికలపై చర్చకు తెరలేపింది. ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ (జమిలి ఎన్నికలు (లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం) అంశంతో పాటు ఇతర ముఖ్యాంశాలపై చర్చించేందుకు ఈ నెల 19న ఢిల్లీలో అఖిలపక్ష భేటీకి హాజరుకావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. ఆదివారం నాటి అఖిలపక్ష సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించారు. ప్రస్తుత లోక్‌సభలో చాలామంది కొత్త వారున్నారంటూ.. పార్లమెంటు దిగువ సభ మొదటి సమావేశాలు నూతనోత్సాహం, కొత్త ఆలోచనలతో ప్రారంభం కావాలని మోదీ ఆకాంక్షించారు. కాగా 19న భేటీకి హాజరుకావాల్సిందిగా కోరుతూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులకు ఆదివారం లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కె.చంద్రశేఖరరావు, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కూడా లేఖలు రాశారు. అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంటు ఉభయ సభలూ సాఫీగా సాగేందుకు సహకరించాల్సిందిగా అన్ని పార్టీలను ముఖ్యంగా విపక్షాన్ని ప్రభుత్వం కోరిందన్నారు. జమిలి ఎన్నికలతో పాటు దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 2022లో 75 ఏళ్లు పూర్తయ్యే సందర్భంగా వేడుకలు, ఈ ఏడాది మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల నిర్వహణ, పార్లమెంటు పనితీరు మెరుగుపరచడం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై చర్చించేందుకు అఖిలపక్ష భేటీ నిర్వహిస్తున్నట్టు జోషి తెలిపారు. కాగా ఉభయ సభల ఎంపీలు ప్రభుత్వంతో స్వేచ్ఛగా మాట్లాడేందుకు, అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకునేందుకు వీలుగా ఈ నెల 20న రాత్రి విందు సమావేశం జరుగుతుందని చెప్పారు. -
లోక్‌సభ ఎన్నికలా.. అయితే మాకేంటి?
’సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లో టీఆర్ఎస్ అధినేత బహిరంగ సభ నిర్వహిస్తే జనం విరగబడ్డారు.. కానీ అభ్యర్థులు ర్యాలీలు చేపడితే ఇంటి బయటకు వచ్చి చూసేందుకు కూడా జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ సదస్సు నిర్వహిస్తే ప్రాంగణంలో కుర్చీలు సరిపోక జనం వెలుపలి వరకు నిలబడి మైకు ద్వారా ఆమె మాటలు విన్నారు. ఇక్కడే అభ్యర్థులు పాదయాత్ర చేస్తే 50 మంది కూడా గుమికూడటం గగనంగా మారింది. హైదరాబాద్‌లో అభ్యర్థులు ప్రచార రథాల్లో తిరుగుతుంటే వెంట కార్యకర్తలు తప్ప సాధారణ జనం పోగవట్లేదు. ఫలితాలను ప్రభావితం చేస్తుందా?: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు 6 రోజుల సమయమే మిగిలి ఉన్న తరుణంలో నెలకొన్న పరిస్థితి ఇది. ప్రచారానికి 4 రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో సామాన్య ప్రజలు అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. అసలు ఎన్నికల ప్రచారాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా చూసీ చూడనట్లు పోతుండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇదే తీరు పోలింగ్ రోజు చూపితే ఓట్లు రాక.. ఆశించిన ఫలితాలు తారుమారయ్యే ప్రమాదముందని భయపడుతున్నారు. పార్టీల ముఖ్య నేతలు, అధినాయకులు ప్రచారానికి వచ్చినప్పుడు స్పందన ఉన్నా.. అభ్యర్థులు పాదయాత్రకో, బైక్ ర్యాలీకో, ఇంటింటి ప్రచారానికో వస్తే ఏమాత్రం పట్టించుకోవట్లేదు. కొన్ని చోట్ల అభ్యర్థులు అభివాదం చేసేందుకు కూడా సాధారణ జనం లేని దుస్థితి కనిపిస్తోంది. ఎందుకీ నిర్లిప్తత.. మన రాష్ట్రంలో చాలాకాలంగా జమిలి ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకేసారి అసెంబ్లీ అభ్యర్థికి, లోక్‌సభ అభ్యర్థికి ఓటేసే పద్ధతి నడిచింది. ఈసారి అందుకు భిన్నంగా రెండు ఎన్నికలు విడివిడిగా వచ్చాయి. గత డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆ ఎన్నికలు ముగిసిన మూడు నెలల తర్వాత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. సాధారణంగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటును నిర్దేశించే అసెంబ్లీ ఎన్నికలంటే జనంలో తీవ్ర ఆసక్తి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసినందున లోక్‌సభ ఎన్నికలు అనేసరికి ప్రజల్లో పెద్దగా ఆసక్తి లేకుండా పోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొన్ననే కదా ఎన్నికల హడావుడి ముగిసింది.. మళ్లీ గోలేంటనే భావన వారిలో ఉందని పేర్కొంటున్నారు. స్థానిక అంశాలకు ప్రచారంలో ప్రాధాన్యం లేని పార్లమెంటు ఎన్నికలంటే జనంలో అంతగా ఆసక్తి కనిపించట్లేదు. అభ్యర్థుల్లో ఆందోళన.. జనంలో ఉన్న ఈ నిర్లిప్తత 11న జరగబోయే పోలింగ్‌పై ఉంటుందేమోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా భారీగానే పోలింగ్ నమోదైంది. కొన్ని జిల్లాల్లో 90 శాతం మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారీ పోలింగ్ వల్ల ప్రధాన అభ్యర్థులందరిలో ఫలితాలపై ఆశలు నెలకొన్నాయి. ఈసారి ప్రచారానికి జనం స్పందించని తీరు చూస్తే పోలింగ్ తక్కువగా నమోదయ్యే ప్రమాదముందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల విజయంపై తమకున్న ఆశలకు గండిపడుతుందన్నది భయపడుతున్నారు. ‘చాలా ప్రాంతాల్లో జనం సరిగా రావట్లేదు. అలాంటప్పుడు నాకు ఓటేస్తే ప్రయోజనమేంటో వారికి ఎలా చేరుతుంది. వారు వచ్చి ఉంటే సానుకూల దృక్పథం వచ్చేది. రాకుంటే ఆ ప్రాంతంలో నాకు ఓటింగ్ తగ్గే ప్రమాదం ఉంది కదా’అని హైదరాబాద్ శివారులోని ఓ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జాతీయ పార్టీ అభ్యర్థి ఆవేదన చెందారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో మా మాటలను కొందరు పట్టించుకోలేదు. అప్పుడు మా హామీలు వారికి చేరలేదు. ఆ ఎన్నికల్లో మా అభ్యర్థి ఓడిపోయాడు. పోలింగ్ బాగా తక్కువగా నమోదవటమే దీనికి కారణమని అంతర్గత విశ్లేషణలో తేలింది. ఈసారి మా అభ్యర్థి జనంలోకి వెళ్తున్నాడు, కానీ జనం తక్కువగా వస్తున్నారు. మళ్లీ ఫలితం సానుకూలంగా వస్తుందో.. రాదో?’ఇదీ హైదరాబాద్‌లో పోటీ చేస్తున్న ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ముఖ్య అనుచరుడి ఆవేదన. దీంతో గత నాలుగైదు రోజులుగా కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ఓటింగ్‌లో పాల్గొనాల్సిందిగా కోరుతుండటం విశేషం. జనం డిసైడ్ అయ్యారా.. లోక్‌సభ ఎన్నికల్లో స్థానిక అంశాలకు అంత గా ప్రాధాన్యం ఉండదు. ఇది ముఖ్యమంత్రిని నిర్దేశించే ఎన్నికలు కావు. ప్రధాని ఎవరుండాలనే విషయాన్ని తేల్చే ఎన్నికలు. ఈ విషయంలో ఇప్పటికే విద్యాధికులు, రాజకీయంగా అవగాహన ఉన్నవారు ఓ నిర్ణయానికి వచ్చారన్నది విశ్లేషకుల మాట. ‘ప్రధానిగా మోదీ పనితీరు చూశారు. రాహుల్ గాంధీ వస్తే ఎలా ఉంటుందనే విషయంలో కొంత అంచనాకు వచ్చి ఉంటారు. కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ అధికారంలో ఉంటే ఎలా ఉంటుందనే విషయంలో చర్చలు విని ఉంటారు. వెరసి ఎవరికి ఓటేయాలనే విషయంలో ఓ నిర్ణయానికి వచ్చి ఉంటారు. వారికి ఈ ప్రచారంతో సంబంధం లేదు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో మంచి పోలింగ్ నమోదు కావొచ్చు’అని ఓ రాజకీయ విశ్లేషకుడు పేర్కొంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క హైదరాబాద్, దాని చుట్టు పక్కల మాత్రమే తక్కువగా పోలింగ్ నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో మంచి పోలింగే నమోదైంది. కానీ ఈసారి హైదరాబాద్ సహా దాదాపు అన్ని చోట్లా ప్రచారంలో జనం స్పందన ఒకే రకంగా ఉంటుండటం ఆశ్చర్యపరుస్తోంది. నిర్లిప్తంగా వ్యవహరించే తీరు ఎక్కువగా నగరాల్లో చూస్తుంటాం. ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రచారానికి జనం పెద్దగా స్పందించకపోవడం విశేషం. -
ఎన్నికలపై జోక్యం చేసుకోలేం
సాక్షి, హైదరాబాద్: హడావుడిగా తెలంగాణ అసెం బ్లీకి ఎన్నికలు వద్దని.. పార్లమెంటుతో పాటే శాసనసభకు ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘా న్ని ఆదేశించాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడంలో జరిగిన చట్ట ఉల్లంఘనలు ఏమిటో చెప్పకుండా ఎన్నికలను నిర్వహించరాదంటే ఎలా అంటూ పిటిషనర్‌ను ధర్మాసనం నిలదీసింది. ఇతర రాష్ట్రాలతో కలిపి ఎన్నికలు నిర్వహించాలో లేక జమిలి ఎన్నికలు నిర్వహించాలో అన్నది కోర్టులు నిర్ణయించలేవని తేల్చి చెప్పింది. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైనదని, దాని విధుల్లో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. చట్ట ఉల్లంఘన జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు చూపకుండా దాఖలు చేసే వ్యాజ్యాలను తాము అనుమతించలేమంటూ పిటిషన్‌ను కొట్టేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సందేహాల నివృత్తికి కోర్టును వేదికగా చేసుకుని ఈ వ్యాజ్యం దాఖలు చేసినట్లు అనిపిస్తోందని.. దీని వెనుక రాజకీయ ఎజెండా ఏమైనా ఉందా అంటూ ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. శాసనసభ రద్దయిన నేపథ్యంలో హడావుడిగా అసెంబ్లీకి ఎన్నికలు వద్దని, పార్లమెంటుతో పాటే అసెంబ్లీ ఎన్నికలు (జమిలి) కలిపి నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీనివాసరెడ్డి వాదనలు వినిపించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. శాసనసభ రద్దు, ముందస్తు ఎన్నికలకు వెళ్లడంలో జరిగిన చట్ట ఉల్లం ఘనలు ఏమిటని ప్రశ్నించింది. ప్రభుత్వ ముం దస్తు ఎన్నికల నిర్ణయం, గవర్నర్ అసెంబ్లీ రద్దు ఉత్తర్వులు గానీ, ఈసీ పనితీరులో గానీ ఎక్కడైనా చట్ట ఉల్లంఘనలు జరిగినట్లు ఆధారాలుంటే చూపాలని కోరింది. కీలక అంశం కాబట్టే ఈసీకి నోటీసులిచ్చాం.. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్ని ఏపీలో విలీనం చేసిన తర్వాత లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పునర్వ్యస్థీకరణ చేయలేదని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో కీలక అంశం ముడిపడి ఉందని, అందుకే తాము స్పందించి కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేశామని హైకోర్టు గుర్తు చేసింది. చట్ట ఉల్లంఘనలకు సంబంధించి ఆధారాలుంటే తప్ప ఈసీ విధుల్లో జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు పలు తీర్పులిచ్చిందని తెలిపింది. -
‘జమిలి’కి లా కమిషన్ ఓకే
న్యూఢిల్లీ: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న ఎన్డీయే ప్రభుత్వ ప్రతిపాదనకు న్యాయ కమిషన్ మద్దతు తెలిపింది. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలని సూచించింది. దేశంలో ఏడాది పొడవునా నెలకొంటున్న ఎన్నికల వాతావరణాన్ని నిరోధించాలంటే జమిలియే మార్గమని అభిప్రాయపడింది. లా కమిషన్ మూడేళ్ల గడువు శుక్రవారం ముగియనున్న నేపథ్యంలో ఒకరోజు ముందు జమిలి ఎన్నికలపై ముసాయిదా నివేదికను ప్రజాక్షేత్రంలోకి విడుదల చేసింది. ప్రభుత్వానికి కూడా ఒక ప్రతిని సమర్పించింది. ప్రస్తుత రాజ్యాంగ నిబంధనల ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని, కొన్ని సవరణలు అవసరమవుతాయని పేర్కొంది. ‘జమిలి ఎన్నికలతో ప్రజా ధనం ఆదా అవుతుంది. పాలనా, భద్రతా అధికారులపై భారం తగ్గుతుంది. ప్రభుత్వ విధానాలను మెరుగ్గా అమలుచేయడానికి వీలవుతుంది’ అని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. లోక్‌సభ, అసెంబ్లీ(జమ్మూ కశ్మీర్ మినహా) ఎన్నికలను ఒకేసారి నిర్వహించడంపై అభిప్రాయాలు చెప్పాలని ప్రజలను కోరింది. జమిలి ఎన్నికల నిర్వహణకు ఉన్న మూడు అవకాశాలను సూచించింది. మొదటి అవకాశం.. ► కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ గడువును కుదించి, మరికొన్నింటి గడువును పొడిగిస్తే 2019లో లోక్‌సభతో పాటు 12 రాష్ట్రాల(తెలంగాణ, ఏపీ సహా) అసెంబ్లీలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించొచ్చు. ఇందుకోసం రాజ్యాంగంలోని నిబంధన 172కు సవరణ చేయాల్సి ఉంటుంది. ► ఇక మిగిలిన పదహారు రాష్ట్రాలకు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి 2019లో ఎన్నికలు జరపడం సాధ్యం కాదు. వాటన్నింటికి 2021 సంవత్సరంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలవుతుంది. ► అది సాకారం కావాలంటే బిహార్ అసెంబ్లీ గడువును 13 నెలలు పెంచాలి. కర్ణాటక అసెంబ్లీ కాలపరిమితిని 17 నెలలు కుదించాల్సి వస్తుంది. ► 2021 ఎన్నికల్లో కొలువుదీరే అసెంబ్లీల గడువు 30 నెలలు లేదా జూన్ 2024 వరకు(ఏది ముందైతే అది) ఉంటుంది. ఇలా అయితేనే 2024లో అన్ని అసెంబ్లీలు, లోక్‌సభకు ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు వీలవుతుంది. రెండో అవకాశం.. 2019లో లోక్‌సభ, 12 అసెంబ్లీలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి, 2021లో మిగిలిన 16 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఒకేసారి ఎన్నికలు చేపట్టాలి. దీంతో ఐదేళ్లకోసారి రెండుసార్లు ఎన్నికలు జరుగుతాయి. మూడో అవకాశం.. పై రెండు మార్గాల్లో జమిలి సాధ్యంకాని పక్షంలో ఒక ఏడాదిలో జరగాల్సిన ఎన్నికలన్నింటిని(అసెంబ్లీ, లోక్‌సభ) ఒకేసారి నిర్వహించాలి. -
జమిలి ఎన్నికలపై లా కమిషన్ ముసాయిదా నివేదిక
-
ముందస్తు గుబులు !
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: అన్ని పార్టీల్లోని నాయకుల్లో ఎన్నికల గుబులు మొదలైంది. ముందుస్తుగా సార్వత్రిక ఎన్నికల ను నిర్వహించనున్నట్లు అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి సంకేతాలు వెలువడుతుండడంతో ఆ పార్టీ నేతలతో పాటు విపక్ష పార్టీల నేతలు సైతం అలర్ట్ అయ్యాయి. సెప్టెంబర్‌లో ప్రభుత్వాన్ని రద్దు చేసి డిసెంబర్లోనే ఎన్నికలు నిర్వహించే అవకాశమున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహులంతా ఒక్కసారిగా అ ప్రమత్తమయ్యారు. ఎన్నికలకు అతి తక్కువ సమ యం ఉండడంతో వారిలో ఆందోళన నెలకొంది. మరోవైపు సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభ ని ర్వహణను టీఆర్ఎస్ పార్టీ సీరియస్‌గా తీసుకుంటూ ప్రతీ నియోజకవర్గం నుంచి కనీసం 50వే లకు పైగా జనసమీకరణ చేసేలా ప్రణాళిక రూ పొందిస్తున్నారు. అధికార పార్టీ చేస్తున్న హడావిడి ని దృష్టిలో పెట్టుకుని విపక్ష పార్టీల్లోని నేతలు ఎన్నికలకు వెళ్లేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సిట్టింగ్‌ల్లో టెన్షన్ సార్వత్రిక ఎన్నికలకు అత్యంత వేగంగా సీఎం మిగతా కేసీఆర్ ఒక వైపు పావులు కదుపుతుండగా.. మరోవైపు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో మరో టెన్షన్ పట్టుకుంది. ఇన్నాళ్లు సిట్టింగ్‌లందరికీ టిక్కెట్ల హామీ ఇచ్చిన సీఎం... తాజాగా సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయించనున్నట్లు చెబుతున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని సిట్టింగ్‌ల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం పాలమూరు ప్రాంతం నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తరఫున ఉన్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు గాను సగం స్థానాలనే అధికార పార్టీ కైవసం చేసుకుంది. ఏడుగురు ఎమ్మెల్యేలు కారు గుర్తుతో గెలవగా... మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి కారెక్కారు. దీంతో టీఆర్ఎస్ తరఫున ప్రాతినిధ్యం వహించే వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా అందరూ మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని యోచిస్తున్నారు. కానీ గతంలో చేసిన పలు సర్వేల్లో కొందరు సిట్టింగ్‌లపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని సీఎం కేసీఆర్ అంతర్గత సమావేశాల్లో వెల్లడించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పాలమూరు ప్రాంతానికి చెందిన కొంత మంది సిట్టింగ్‌లకు టికెట్లు నిరాకరించే అవకాశముందని రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది. జనసమీకరణపై ఫోకస్ సెప్టెంబర్ 2న హైదరాబాద్‌లో జరగనున్న ప్రగతి నివేదన సభపై అందరి దృష్టి నెలకొంది. ఈ సభ ద్వారా నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు నేరుగా వివరించడంతో పాటు ఎన్నికలకు శంఖారావం పూరించే అవకాశం ఉన్న ట్లు రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. అందుకు అనుగుణంగా ప్రగతి నివేదన సభ ద్వారా విపక్షాలకు గట్టి సంకేతం పంపించాలని అధికార పక్షం యోచిస్తోంది. అలాగే ఈ సభా వేదిక ద్వారా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థు ల పేర్లతో ప్రకటించడమే కాకుండా ప్రభుత్వాన్ని రద్దు చేసే విషయమై నిర్ణయాన్ని వెలువరిస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో కొంగరకలాన్‌లో నిర్వహించనున్న సభకు జిల్లా నుంచి భారీగా జనాలను తరలించాలని ఇక్కడి నేతలు గట్టి పట్టుదలతో ఉన్నారు. అంతేకాదు సభాస్థలం ఉమ్మడి పాలమూరు ప్రాంతానికి అతి చేరువగా ఉండడంతో జనసమీకరణ భారం ఎక్కువగా జిల్లా మీదే ఉంది. ప్రతీ నియోజకవర్గం నుంచి కనీసం 50వేలకు తక్కువ కాకుండా జనసమీకరణ చేయాలని యోచిస్తున్నారు. అందుకోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల నుంచి భారీగా జనాలను తరలించాలనే భావనలో ఉన్నారు. అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే నేతలంతా జనసమీకరణపై దృష్టి సారించారు. విపక్షాల అలర్ట్ అధికార టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న హడావిడితో విపక్ష పార్టీల నాయకులు సైతం అలర్ట్ అయ్యా రు. వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీని ఇచ్చి తమ వాణి వినిపించేందుకు విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్సీపీ, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తామని చెప్పుకుంటున్న అభ్యర్థులు ఇప్పటికే నియోజకవర్గాల్లో మకాం వేశారు. పార్టీల నుంచి ఇన్‌చార్జీలుగా ఉన్న వారు కార్యకర్తలతో మమేకమవుతున్నారు. నియోజకవర్గ సమస్యల పై పోరుబాట చేపట్టారు. అంతేకాదు గత ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ ఇచ్చిన హామీలపై విపక్షాలు దృష్టి సారించాయి. ఎక్కడెక్కడ ఎలాంటి హామీలు నెరవేర్చలేదనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ చేపట్టారు. అలాగే ఓ పార్టీ నుంచి మరో పార్టీలో చేరాలని భావిస్తున్న నేతలు తమ యత్నాల్లో వేగం పెం చారు. ఇలా మొత్తం మీద అన్ని పార్టీలు, నేతలు కూడా ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించడంతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. చిగురిస్తున్న స్నేహం మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీల నడుమ కొత్త స్నేహాలు చిగురిసస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ నడుమ దోస్తీ కుదిరే అవకాశముందనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో దోస్తీ కుదిరితే జిల్లా లో నెలకొనే పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాజకీయ పునరేకీకరణలో భాగంగా టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది. ఒకప్పుడు పాలమూరు ప్రాంతంలో బలంగా ఉన్న టీడీపీ.. టీఆర్ఎస్ ధాటికి కకావికలమైంది. అయినప్పటికీ టీడీపీలో కొందరు నేతలు పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలు ఎర్ర శేఖర్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డి, సీతమ్మ టీడీపీలో బలమైన నేతలుగా కొనసాగుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్‌తో స్నేహం చిగురిస్తే జిల్లాలో టీడీపీ మూడు సీట్ల కోసం కచ్చితంగా పట్టుబడుతున్నట్లు చర్చ సాగుతోంది. ఇందులో జడ్చర్ల, మహబూబ్‌నగర్, మక్తల్ సీట్లను తమకు కేటాయించాలని వారు కోరుతుండగా.. ఏవైనా రెండు సీట్ల కేటాయింపునకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఓటమి భయంతోనే ముందస్తు జపం
సాక్షి, కామారెడ్డి/నిజామాబాద్: ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని, దీంతో ప్రజలు తనను ఓడిస్తారన్న భయంతోనే ముందస్తు జపం చేస్తున్నారని బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలు నెరవేర్చని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ‘బహుజనులకు రాజ్యాధికారం–రాజకీయ పార్టీల వైఖరి’ అంశంపై శుక్రవారం జుక్కల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దళితుడిని సీఎం చేస్తానని సీఎం కేసీఆర్ మోసం చేశాడని, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగమని చెప్పిన హామీలేమి నెరవేరలేదన్నారు. ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రికి ఓటమి భయం పట్టుకునే.. ముందస్తు ఎన్నికలు అంటున్నాడని విమర్శించారు. రాజ్యాధికారం సాధించకపోవడం వల్లే దశాబ్దాలుగా బడుగు బలహీనవర్గాలు అణచివేతకు గురయ్యాయని, రాజ్యాధికారం ద్వారానే సామాజిక న్యాయం దక్కుతుందని తమ్మినేని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అనేక త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్గాలకు ఎలాంటి న్యాయం జరుగలేదన్నారు. కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అందిస్తామన్న ప్రభుత్వం ఆ మాటను మర్చిపోయి కార్పొరేట్ విద్యావ్యవస్థను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. భూమిని దున్నుకుని బతుకుతున్న రైతులకు ఎకరానికి రూ.4 వేల సాయం అందించడం లేదని, అదే వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు రూ.లక్షల కొద్దీ దార పోసిందన్నారు. బీఎల్ఎఫ్ అధికారంలోకి రాగానే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని, కార్పొరేట్ విద్యను రద్దు చేసి, పూర్తిగా ఉచిత విద్య అందిస్తామన్నారు. బీఎల్ఎఫ్ ప్రభంజనం సృష్టిస్తోందని, మెజారిటీ సీట్లు సాధిస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి: గద్దర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని, దళితులకు మూడెకరల భూ పంపిణీ, పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తానని మోసం చేసిన సీఎం కేసీఆర్‌కు ఓటు అనే ఆ యుధంతో బుద్ధి చెప్పాలని ప్రజాగాయకుడు గద్దర్ పిలుపునిచ్చారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి, రంజాన్‌కు మురిగిపోయిన బి ర్యానీ తినిపిస్తున్నాడని విమర్శించారు. రూ. వెయ్యి పింఛన్ ఇస్తానని భార్యాభర్తల మధ్య ఖ య్యం పెట్టిండన్నారు. దళితులకు భూమి లేదు. యువకులకు ఉద్యోగాలు లేవని విమర్శించారు. మహిళల మీద హింస పెరిగి పోయిందని, మంత్రివర్గంలో వారికి స్థానం లేకపోవడం సిగ్గుచేటన్నా రు. 52 శాతం ఉన్న బీసీలు, 12 శాతం ముస్లింలు, 15 శాతం దళితులు, అగ్రవర్ణాల్లోని 6 శాతం పేదలంతా ఏకమై టీఆర్ఎస్ సర్కారును కూల్చాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు భూమికి పచ్చా ని రంగేసినట్లు, సిరిమల్లె చెట్టుకింద లచ్చుమ మ్మో, దొర నీ టైం అయింది, సాల్ దొర నీ పాలన తదితర పాటలతో గద్దర్ అలరించారు. పలు తీర్మానాలు.. జుక్కల్ సభలో పలు తీర్మానాలు చేశారు. నియోజకవర్గంలోని 4 వేల మంది రైతులకు సంబంధించి 16 వేల ఎకరాల భూములకు పట్టాలు, పాసుబుక్కులతో పాటు పెట్టుబడి సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ తీర్మానించారు. బిజ్జల్వాడి ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే చేపట్టాలని సభలో తీర్మానించారు. మద్నూర్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, లెండి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని కౌలాస్ కాలువల మరమ్మతులు చేయాలని సభలో తీర్మానించారు. వైఎస్సార్ సీపీ నాయకులు సాయిలు, బీఎల్ఎఫ్, సీపీఎం వెంకట్రాములు, చంద్రశేఖర్, జడ్గె రవీందర్, సురేష్‌గొండ, విఠల్, బాల్‌రాజ్, మనోజ్, రాములు, భరత్ వాగ్మారే, శ్రీనివాస్, బాలు తదితరులు పాల్గొన్నారు. -
అక్టోబర్‌లోనే ఎన్నికల షెడ్యూల్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్ మరింత కీలకం కానున్నారు. ప్రభుత్వ పాలన, పార్టీ సంస్థాగత నిర్మాణం విషయాల్లో ఇప్పటికే బిజీ బిజీగా ఉన్న వారు.. ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో పార్టీ అధినేత వారికే మరిన్ని కీలక బాధ్యతలు కట్టబెట్టే అవకాశం ఉందన్న చర్చ పార్టీవర్గాల్లో సాగుతోంది. ‘ఎప్పుడెన్నికలొచ్చినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి. నలుగురైదుగురు మినహా ‘సిట్టింగ్’లకే టిక్కెట్లు ఇస్తాం. ఆయా జిల్లాల్లో మంత్రులు మరింత కీలకంగా వ్యవహరించాలి’ అంటూ సీఎం కేసీఆర్ ఇటీవలే అప్రమత్తం చేశారు. దీంతో ముందస్తు ఎన్నికలు దాదాపుగా ఖాయమన్న చర్చ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ వర్గాల్లో జోరందుకుంది. శుక్రవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ, శాసనసభాపక్ష సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశం అత్యంత గోప్యంగా జరిగినప్పటికీ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలపైనా చర్చ జరిగినట్లు సమాచారం. ప్రధానంగా ముందస్తు ఎన్నికలు వస్తే ఆచరించే వ్యూహం, సెప్టెంబర్‌లో ప్రగతి నివేదన సభ, అభ్యర్థుల ప్రకటనపైనే చర్చ జరిగినట్లు సమాచారం. అయితే.. ఈ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి సుమారు రెండు లక్షల మందిని తరలించాలన్నది లక్ష్యం. ఈ మేరకు సీఎం కేసీఆర్‌తో సమావేశం ముగిసిన అనంతరం జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు మంత్రి ఈటల రాజేందర్ ఇంట్లో సమావేశమయ్యారు. అక్టోబర్‌లో షెడ్యూల్..? సెప్టెంబర్‌లోనే అభ్యర్థులు.. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలపై ఈ సమావేశంలో ఎలాంటి స్పష్టత ఇవ్వనప్పటికీ సెప్టెంబరు నెలాఖరు, అక్టోబర్ మొదటి వారంలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న ప్రచారం సోషల్ మీడియాలో సాగుతున్న విషయం విదితమే. అక్టోబర్ మొదటి వారంలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండగా, వాటితో పాటే తెలంగాణకు కూడా ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. దీనికితోడు పది రోజుల కిత్రం సీఎం కేసీఆర్ సెప్టెంబర్‌లోనే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని మీడియా సమావేశంలో వెల్లడించారు కూడా. ఇదే సమయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన పలు సూచనలు పార్టీ కేడర్‌లో చర్చనీయాంశాలుగా మారాయి. ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టిక్కెట్లు ఇస్తామంటూనే, అవసరమైతే నలుగురైదుగురిని మార్చుతామని కూడా పేర్కొన్నారు. ఈ విషయంలో ఆయా జిల్లాల మంత్రు లే కీలకంగా వ్యవహరించాలని, ఎక్కడైనా పోటీ అధికంగా ఉంటే అక్కడ ప్రత్యామ్నాయ పదవులు, అవకాశాలు కల్పించే విషయమై చర్చించాలని కూడా ఆయన సూచించారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అభ్యర్థుల ఎంపిక విషయంలో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్ కీలకం కానున్నారు. కాగా.. ప్రగతి నివేదన సభకు భారీగా జనం తరలించే బాధ్యతలను తీసుకున్న మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో భేటీ అయినట్లు చెప్తున్నారు. టార్గెట్ ‘ప్రగతి నివేదన’ సభ.. నేడో రేపో ఉమ్మడి జిల్లాలో సమీక్షలు.. ముందస్తు ఎన్నికలు, అభ్యర్థుల ప్రకటన ఒక ఎత్తైతే సెప్టెంబర్ 2న నిర్వహించే ప్రగతి నివేదన సభ నిర్వహణ ఇప్పుడు కీలకంగా మారింది. ఎన్నికలు తాము అనుకున్నంత దూరంలో లేకపోవడం, ప్రగతి నివేదిక సమర్పించే సమయానికి తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, పార్టీ పరిస్థితిపై అధిష్టానం అంచనాలు ఎలా ఉండబోతున్నాయోననే ఆందోళ న అధికార ఎమ్మెల్యేలకు పట్టుకుంది. ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాలుండగా, అందులో 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా.. ఉమ్మడి జిల్లా బాధ్యతలను మంత్రులకే అప్పగించడంతో మొదటగా ప్రగతి నివేదన సభకు జన సమీకరణపై దృష్టి పెట్టారు. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్ నుంచి 2.50 లక్షల మందిని సమీకరించాలనేది లక్ష్యం కాగా, మంత్రి ఈటల రాజేందర్ అధ్యక్షతన ఆయన ఇంట్లో జరిగిన సమావేశంలో జనసమీకరణ, తరలింపుపై చర్చించారు. ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులతోపాటు ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులకు కూడా ఈ జన సమీకరణ బాధ్యతలు అప్పగించారు. అధిష్టానం ఆదేశాల మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాల నుంచి జనసమీకరణ కోసం నేడో రేపో మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. కాగా.. శుక్రవారం మంత్రి నివాసంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు ఒడితెల సతీష్‌బాబు, రసమయి బాలకిషన్, రమేశ్‌బాబు, దాసరి మనోహర్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, బొడిగె శోభ, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అక్బర్‌హుస్సేన్, పోలీస్ హౌజింగ్‌బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ తదితరులు పాల్గొన్నారు. -
ముందస్తు ఉత్కంఠ
రాష్ట్ర శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే సంకేతాల నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణుల్లో కదలిక మొదలైంది. వచ్చే నెలలోనే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటన ఉత్కంఠ రేపుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో జహీరాబాద్ మినహా మిగతా అన్ని స్థానాల్లోనూ టీఆర్ఎస్ నేతలే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగులను పక్కన పెట్టి తమకు టికెట్ దక్కుతుందనే ఆశ కొందరు అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ‘ముందస్తు’ హడావుడితో అధికార పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను చుట్టి వస్తున్నారు. ప్రధాన విపక్ష పార్టీల్లో మాత్రం అలాంటి సందడి ఎక్కడా కనిపించడం లేదు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర శాసనసభను వచ్చే నెలలో రద్దు చేసి అధికార టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్తుందనే సంకేతాలు వస్తున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలో జరిగే ‘ప్రగతి నివేదన’ సభ అనంతరం ముందస్తు ఎన్నికల దిశగా పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ప్రగతి నివేదన సభ తర్వాత పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామనే సీఎం ప్రకటన నేపథ్యంలో పూర్వపు మెదక్ జిల్లా పరిధిలో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. జహీరాబాద్ అసెంబ్లీ స్థానం మినహా మిగతా అన్ని అసెంబ్లీ స్థానాలతో పాటు మెదక్, జహీరాబాద్ ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ నేతలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలవడం ద్వారా ‘క్లీన్ స్వీప్’ చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కొంతకాలంగా కొత్త జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సమీక్షల పేరిట రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. అదే సమయంలో అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల వారీగా పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తితో దూరంగా ఉంటున్న నేతలు పార్టీ వీడకుండా ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ద్వితీయ శ్రేణి నాయకులు, క్రియాశీల నేతలతో నేరుగా సంబంధాలు నెరుపుతున్నారు. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైనా ఎన్నికల నాటికి అందరినీ సమన్వయం చేసి ఫలితం రాబట్టాలనేది మంత్రి వ్యూహంగా కనిపిస్తోంది. టికెట్ల వేటలో ఔత్సాహికులు జహీరాబాద్ అసెంబ్లీ స్థానం మినహా మిగతా అన్ని చోట్లా టీఆర్ఎస్ పార్టీ నేతలే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిట్టింగులందరికీ వచ్చే ఎన్నికల్లో తిరిగి టికెట్ కేటాయిస్తామని గతంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. తాజాగా మాత్రం అంతర్గత సర్వేలు, ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా టికెట్ల కేటాయింపు ఉంటుందని వ్యాఖ్యానించడంతో కొత్త సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేని చోట తమకు అవకాశం దక్కుతుందని భావిస్తున్న ఔత్సాహిక నేతలు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. జహీరాబాద్ అసెంబ్లీ నియోజవర్గం పరిధిలో కొత్త అభ్యర్థిని టీఆర్ఎస్ తెరమీదకు తెస్తుందనే ప్రచారం జరుగుతోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మాణిక్‌రావు కాంగ్రెస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చినా, వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని మార్చుతారని భావిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ జహీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అందోలు, నర్సాపూర్, నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పార్టీ అభ్యర్థిని మార్చుతారనే ప్రచారం సాగుతోంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య, జర్నలిస్టు యూనియన్ నేత క్రాంతి కిరణ్ టికెట్ ఆశిస్తూ తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ నడుమ పొత్తు కుదిరితే నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలు పెనుమార్పులకు లోనవుతాయని టీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది. నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మురళీ యాదవ్, ఆయన సతీమణి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి యాదవ్ టికెట్ ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ ఈ నెల మొదటి వారంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడంతో సంగారెడ్డి టీఆర్ఎస్ రాజకీయాలు చర్చనీయాంశమయ్యాయి. ఇతర పార్టీల్లో కానరాని సందడి ముందస్తు ఎన్నికల నిర్వహణపై సీఎం సంకేతాల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో సందడి మొదలైంది. విపక్ష పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీల్లో మాత్రం రాజకీయ కార్యకలాపాలు పెద్దగా ఊపందుకున్న దాఖలాలు కనిపించడం లేదు. విపక్ష పార్టీలకు చెందిన కొందరు బడా నేతలు టీఆర్ఎస్ గూటికి చేరుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకరిద్దరు నేతలు మాత్రం చాప కింద నీరులా అసెంబ్లీ ఎన్నికల దిశగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అరడజనుకు పైగా నియోజకవర్గాల్లో బహుళ, బలహీన నాయకత్వం కాంగ్రెస్‌కు ఆటంకంగా మారేలా ఉంది. నారాయణఖేడ్, పటాన్చెరులో కొంత మేర టీడీపీ ఓటు బ్యాంకును కలిగి ఉన్నా, ఇతర నియోజకవర్గాల్లో నామమాత్ర కేడర్ కూడా లేదు. కార్మిక వర్గం ఓట్లపై ఆధారపడి సీపీఎం, తెలంగాణ వాదంపై తెలంగాణ జన సమితి ఎన్నికల దిశగా అభ్యర్థుల కోసం వేట సాగిస్తోంది. -
టీఆర్ఎస్ అభ్యర్థులకు ‘సెప్టెంబర్’ ఫీవర్ !
సాక్షిప్రతినిధి, కరీంనగర్: చరిత్రలో సెప్టెంబర్ మాసానికి ఓ ప్రత్యేకత ఉంది. నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడింది ఈ మాసంలోనే.. ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కూడా సెప్టెంబర్‌నే కీలక మాసంగా ప్రకటించారు. ‘ముందస్తు’ ఎన్నికలు డిసెంబర్లో వస్తాయంటూ ఈనెల 13న కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన, సెప్టెంబర్‌లోనే పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇదే సమయంలో దాదాపుగా ‘సిట్టింగ్’లకే అవకాశం కల్పిస్తామన్న గులాబీ దళనేత, సర్వే నివేదికలు, స్క్రీనింగ్ కమిటీల సిఫారసులను కూడా ప్రామాణికంగా తీసుకోనున్నామన్నారు. ఇదివరకే నాలుగున్నరేళ్లలో ఐదు సర్వేలు చేయించిన ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నలుగురైదుగురు ఎమ్మెల్యేలకు పాస్ మార్కులు రాలేదని చెప్పారు. మూడు నెలల కిందట కూడా ఆయన ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా జిల్లాలో నలుగురైదుగురు ‘డేంజర్‌జోన్’లో ఉన్నట్లు కూడా హెచ్చరించారు. ఇదే సమయంలో ఈనెల 13న టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన జిల్లా అధికార పార్టీలో గుబులు పుట్టిస్తోంది. ఇన్నాళ్లు సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తామని పదేపదే చెప్పిన కేసీఆర్ ఈసారీ అదే ప్రకటన చేసినా.. సర్వే ఫలితాలు, స్క్రీనింగ్ కమి టీల రిపోర్టులు ఆధారంగానే అభ్యర్థుల ఖరారు ఉంటుందని మెలిక పెట్టడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. సెప్టెంబర్‌లో అభ్యర్థుల ప్రకటన..? పార్టీ నేతలు అప్రమత్తం.. అనుకున్నట్లుగానే ఎన్నికలు వస్తే సెప్టెంబర్‌లోనే తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్ 2న హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించే భారీ బహిరంగ సభలోనే అభ్యర్థుల ప్రకటనపై స్పష్టత ఉంటుందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ముఖ్యమంత్రి స్ప ష్టం చేయడంతో ఇక పొత్తుల బెడద తప్పినట్లేనని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ‘ముందస్తు’ ప్రకటన నేపథ్యంలో జిల్లాలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలను అంచనా వేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో ఏ పార్టీ జత కట్టే అవకాశం ఉంది? అది తమకు ఎలా కలిసి వస్తుంది? అనే అంశాలను బేరీజు వేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాలకు స్క్రీనింగ్ కమిటీలు వేసి అభ్యర్థుల ఎంపికలో వారి పాత్రను కీలకం చేయనున్నట్లు కూడా అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లా గులాబీ నేతలు అప్రమత్తం అవుతున్నారు. తమ తమ నియోజకవర్గాల్లోని తాజా పరిస్థితులను అంచనా వేసుకుంటున్నారు. కులాలు, సామాజికవర్గాల వారీగా ఓటర్ల జాబితాపై ఆరా తీస్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని తొమ్మిది స్థానాల నుంచి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో సిట్టింగ్‌లు ప్రజల్లో తమ బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నాలు చేస్తూనే అధినేత ఆశీస్సుల కోసం ఆరాటపడుతున్నారు. ఆశావహుల్లో సర్వేలు, స్క్రీనింగ్‌ల దడ.. మంత్రి కేటీఆర్ ప్రకటనతో ఊరట.. టీఆర్ఎస్ శాసనసభ్యులుగా ఎన్నికైన తరువాత 2015–16 సంవత్సరంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ మొదట సర్వే జరిపించారు. ఆ తర్వాత ఈ ఏడాది మార్చి వరకు మరో రెండు విడతల సర్వే నిర్వహించారు. మొదటి, రెండో విడతల ఫలితాలు ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్.. ఆ సమావేశంలోనే ర్యాంకులు, మార్కులను ప్రకటించారు. తొలి సర్వేలో మంచి మార్కులు కొట్టిన్న వారు కూడా రెండో, మూడో సర్వే నాటికి వెనుకబడిపోగా, మరికొందరు మెరుగుపర్చుకున్నట్లు తేల్చారు. ఆ తర్వాత నాలుగో విడత, ఇంటెలిజెన్స్‌ల ద్వారా కూడా జరిగినప్పటికీ గోప్యంగా వ్యవహరించిన అధినేత.. సర్వే ఫలితాలను ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా వివరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై నిర్వహించిన తొలి, రెండో సర్వేలో హుజూరాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ప్రజలు ఫస్ట్ ర్యాంకు ఇచ్చారు. తొలి సర్వేలో మంత్రి 73.50 శాతంగా ఉంటే.. రెండో సర్వే నాటికి ఆయన పనితీరు 89.90 శాతానికి పెరిగింది. ఆ తర్వాత ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ తొలి సర్వేలో 42.60 శాతం మార్కులు రాగా, రెండో సర్వేలో 47.30 శాతానికి పెరిగింది. సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ 70.60 శాతం నుంచి 60.40 శాతానికి తగ్గి, ఆ తర్వాత భారీగా పెరిగినట్లు అధినేత వెల్లడించారు. తొలి, రెండో, మూడో సర్వేలకు పోలిస్తే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నాలుగు శాతం పెరగగా, మూడు, నాలుగో విడతలకు మిగతా ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేష్, సోమారపు సత్యనారాయణ, పుట్ట మధు, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, రసమయి బాలకిషన్, వొడితెల సతీష్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే శోభ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి గ్రాఫ్ మొదటి, రెండు సర్వేలకంటే పెరిగినట్లు ప్రకటించారు. చివరకు మొత్తంగా 13 మందిలో ఇద్దరు, ముగ్గురు ఇంకా డేంజర్‌జోన్‌లో ఉన్నారని పేర్కొనడం అప్పట్లో పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. ఇదే సమయంలో ‘ముందస్తు’ నేపథ్యంలో సెప్టెంబర్‌లో అభ్యర్థులను ప్రకటిస్తామని కేసీఆర్ ప్రకటించడం పలువురిలో ‘సెప్టెంబర్’ ఫీవర్ పట్టుకుంది. ఇదిలా వుంటే ఇటీవల కరీంనగర్లో ప్రకటించిన మంత్రి కేటీఆర్ ‘నాకంటే, మంత్రి ఈటల రాజేందరన్న కంటే, చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ కంటే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అత్యధిక మెజార్టీతో గెలుస్తారు’ అంటూ చెప్పకనే చెప్పారు. ‘మళ్లీ ఈ జిల్లాలో ఇప్పుడున్న మేమే పోటీ చేస్తాం.. మేమే గెలుస్తాం’ అని మాట్లాడటం ‘సిట్టింగ్’లకు ఊరట కలిగించింది. అసెంబ్లీ స్థానాల రేసులో ఎంపీల పేర్లు.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు జి.వివేక్ సిట్టింగ్ ఎంపీగా ఉండి 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా ఆయనే పోటీ చేస్తారని అందరూ ఆశించారు. కానీ.. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో వివేక్ అనూహ్యంగా మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేశారు. ఈ నేపథ్యంలో అప్పటివరకు చొప్పదండి అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న బాల్క సుమన్ పెద్దపల్లి అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బాల్క సుమన్ విజయం సాధించా రు. కాగా.. గతేడాది మాజీ ఎంపీ జి.వివేక్ మళ్లీ టీఆర్ఎస్లో చేరడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు. వివేక్ తిరిగి టీఆర్ఎస్లోకి రావడంతోనే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పెద్దపల్లి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో బాల్క సుమన్ ఇటు ఉమ్మడి కరీంనగర్, అటు ఉమ్మడి అదిలాబాద్‌లోని ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ స్థానాలపై దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలోనూ నిజామాబాద్ ఎంపీ, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా జగిత్యాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరగ్గా, ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. అక్కడి నుంచి డాక్టర్ సంజయ్‌కుమార్ పేరు ఖాయంగా చెప్తున్నారు. రోజురోజుకూ మారుతున్న రాజకీయ పరిణమాలు, సమీకరణల నేపథ్యంలో ఏ మార్పులైనా సంభవించవచ్చన్న చర్చ కూడా రాజకీయవర్గాల్లో సాగుతోంది. -
జమిలి ఎన్నికలు సాధ్యమే!
2014లో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. కేంద్రంలో ప్రభుత్వం కొలువుదీరింది. మళ్లీ లోక్‌సభకు 2019లో ఎన్నికలు. కానీ ఈ మధ్యకాలంలో దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికల హడావుడి, సందడి. 2014లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత హరియాణా జమ్మూకశ్మీర్ రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించారు. 2015లో ఒక రాష్ట్రంలో, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు జరిగాయి. 2016లో ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి. 2017లో 7 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగగా, 2018లో మరొక ఎని మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి.. జరగనున్నాయి. ఇకపోతే, 2019లో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. 1967 వరకు చాలావరకు జమిలి ఎన్నికలు నిర్వహించారు. 1971 తర్వాత అప్పటిదాకా జమిలిగా జరుగుతున్న ఈ ఎన్నికలను వేరువేరుగా నిర్వహిం చడం మొదలైంది. దీనికితోడు 1970 దశకం నుంచి మొదలైన ఆయారాం గయారాం విధానాలు చాలా రాష్ట్రాలలో రాజకీయ అనిశ్చితికి దారి తీశాయి. క్రమంగా లోక్‌సభ స్థాయిలోనూ ఆయారాం గయారాం విధానం మొదలవటంతో అక్కడ కూడా అని శ్చిత పరిస్థితులు నెలకొని ఐదేళ్ల కాలపరిమితి కన్నా ముందే కొన్నిసార్లు లోక్‌సభ రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో రెండు సార్వత్రిక ఎన్నికల మధ్యకాలంలో ప్రతి ఏడాది ఎన్నికలు ఉండే విధానం తయారైంది. ఎన్నికల సంఘం ప్రకారం మన దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చు రూ.3,870 కోట్లు. లోక్‌సభతో పాటు ఎన్నికలు నిర్వహించే రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుమారు రూ. 900 కోట్ల దాకా ఖర్చవుతోంది. ఇక రెండు సార్వత్రిక ఎన్నికలకు మధ్యకాలంలో నిర్వహించే వివిధ రాష్ట్రాల ఎన్నికల ఖర్చు రూ.2,970 కోట్లు. లోక్‌సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాల ఎన్నికలు కూడా నిర్వహిస్తే అయ్యే ఖర్చును 50:50 దామాషాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిం చటం జరుగుతుంది. అలా కాక రాష్ట్ర శాసనసభకు ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహిస్తే ఆ ఖర్చునంతా రాష్ట్రప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఎన్నికల ఖర్చు దృష్టితో చూస్తే జమిలి ఎన్నికల విధానం రాష్ట్రాలకు కొంత ఆర్థిక వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది. కానీ రాష్ట్రాల ఎన్నికలు ప్రత్యేకంగా నిర్వహిం చడం వలన ప్రయోజనం ఉన్నట్టయితే ఆర్థికంగా కొంత ఎక్కువ ఖర్చైనా ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించడంలో ఎటువంటి ఆటంకం ఉండకూడదు. ఈనాడు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు చేసే దుబారా ఖర్చుతో పోల్చుకుంటే ఈ రూ. 2,970 కోట్ల ఖర్చు ఎక్కువగా అనిపించకపోవచ్చు. కానీ ఎటువంటి ప్రయోజనం ఒనగూరనప్పుడు ప్రత్యేక ఎన్నికలకు పోవడం వృథా శ్రమే అవుతుంది. జమిలి ఎన్నికల నిర్వహణకు అనుకూలమైన కారణాలు ప్రధానంగా రెండు. ప్రతి ఎన్నికకు ముందు వాటి తీవ్రతను బట్టి ఒక నెల ముందుగానో రెండు నెలల ముందుగానో ఎన్నికల సంఘం ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తుంది. ఇక అప్పటి నుంచి ప్రధానమంత్రి, వారి మంత్రివర్గ సహచరులు ఎన్నికల ప్రచారంలో నిమగ్నులవుతారు. దేశ పరిపాలన యంత్రాంగం ఒకరకంగా స్తబ్దతలోకి వెళ్ళిపోతుంది. 2014–19 మధ్య జరిగిన ఎన్నికల ప్రచార సమయాన్ని పరిశీలిస్తే మొత్తం ఐదేళ్లలో 1/3 సమయం కేవలం ఎన్నికల ప్రచారానికి సరిపోయింది. సార్వత్రిక ఎన్నికల తరువాత కొలువుతీరిన ఏ ప్రభుత్వం అయినా కానీ ఆ ఐదేళ్లు పూర్తిగా మధ్యలో ఏ చికాకులు లేకుండా పరిపాలన పైన దృష్టి పెట్టడానికి అవకాశం ఉండాలి. జమిలి ఎన్నికలు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించగలవు. కానీ అన్ని అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరపటం ఇప్పుడు ఏ విధంగా సాధ్యమనేది ప్రధానాంశం. దీనికి మనకు కొంత వెసులుబాటు 74, 75 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు నగరపాలిత ప్రాంతాలకు ఏర్పాటుచేసిన విధి విధానాలు కలుగజేస్తున్నాయి. పై రెండు రాజ్యాంగ సవరణలలో పొందుపరిచిన 343(ఇ)4, 343(యు) 4 ప్రకరణల ద్వారా ఐదేళ్ల మధ్యకాలంలో ఏదైనా పంచాయతీలో కానీ నగరపాలిత ప్రాంతంలో కానీ మళ్లీ ఎన్నికలు జరిగితే, ఎన్నికైనవారు ఆ శేష సమయానికి మాత్రమే తమ విధులను నిర్వహిస్తారు. అలా ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఆయా సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే విధానాన్ని ఏర్పాటు చేసుకోవడమైంది. ఈ విధానాన్ని అనుసరించడం ద్వారా కొన్ని శాసనసభల కాలపరిమితిని కుదించి జమిలి ఎన్నికలకు రంగాన్ని సిద్ధం చేయవచ్చు. కానీ దీనికి రాజ్యాంగ సవరణ అవసరం. అయితే అపోహలతో, పరస్పర అపనమ్మకాలతో సాగుతున్న నేటి రాజకీయ వ్యవస్థలో ఇది సాధ్యపడుతుందా అనేది సందేహాస్పదమైన అంశం. ఐవైఆర్ కృష్ణారావు (వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, iyrk45@gmail.com) -
జమిలికి లా కమిషన్ జై..
సాక్షి, న్యూఢిల్లీ : దేశమంతటా ఏకకాల ఎన్నికలకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదనకు లా కమిషన్ సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. ఆగస్ట్ 31లోగా కమిషన్ సమర్పించే తుది నివేదికలో జమిలి ఎన్నికలకు అనుకూలంగా కీలక సిఫార్సులు ఉంటాయని భావిస్తున్నారు. జమిలిపై పలు రాజకీయ పార్టీల అభిప్రాయాలను కమిషన్ కూలంకషంగా చర్చించిన లా కమిషన్ దీని అమలుకు రాజ్యాంగ సవరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని భావిస్తోంది. రెండు దశల్లో రాష్ట్ర అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలను నిర్వహించాలని ప్రతిపాదిస్తోంది. మరోవైపు అవిశ్వాస తీర్మానం సందర్భంగా సానుకూల ఓటును కూడా పరిగణనలోకి తీసుకోవడం ద్వారా వీగిపోయిన ప్రభుత్వం స్ధానంలో కొత్త సర్కార్ కొలువయ్యే జర్మనీ మోడల్‌ను కూడా లా కమిషన్ అథ్యయనంచేసిందని అధికారులు చెబుతున్నారు. జమిలి ఎన్నికల కోసం ఫిరాయింపు నిరోధక చట్టంలోనూ సవరణలు అవసరమని, పార్లమెంటరీ పద్ధతులు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోనూ కొన్ని సవరణలు చేపట్టాల్సి ఉంటుందని, వీటికి సంబంధించిన వివరాలను కూడా తుది నివేదికలో లా కమిషన్ పొందుపరచనుందని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి.మరోవైపు తుది నివేదిక ముసాయిదాను లా కమిషన్ పది రోజుల ముందు సభ్యులందరికీ అందించి వారి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా నివేదికకు తుదిమెరుగులు దిద్దనుంది. -
జమిలి జగడం
-
సెప్టెంబర్ 2న అభ్యర్థుల ప్రకటన: కేసీఆర్
అధికార టీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఓ వైపు ముందస్తు, మరోవైపు జమిలి ఎన్నికల ప్రచారం జరుగుతుండగా, సెప్టెంబర్‌లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ చేసిన సంచలన ప్రకటన కలకలం రేపుతోంది. సోమవారం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం కేసీఆర్ మీడియా సమావేశంలో చేసిన కీలక ప్రకటనలు పార్టీలో ఎన్నికల వాతావరణానికి తెర తీశాయి. ఇదే సమయంలో సెప్టెంబర్ 2న హైదరాబాద్ శివారు ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ‘ప్రగతి నివేదిన సభ’ పేరిట భారీ బహిరంగసభ.. అదే రోజు అభ్యర్థులను ప్రకటిస్తా మని పేర్కొనడం పార్టీలో హీట్‌ను పెంచింది. అభ్యర్థుల ప్రకటనకు సర్వేలే ప్రాతిపదకని చెప్పిన కేసీఆర్.. సెప్టెంబర్ 2న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని కీలక ప్రకటన చేయడం కలకలం రేపుతోంది. టికెట్ ఆశిస్తున్న వారిలో ‘ఏం జరుగుతుంది’ అన్న ఆందోళన మొదలైంది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: సీఎం, టీఆర్ఎస్ అధినేత ప్రకటన మేరకు అభ్యర్థుల ప్రకటనలో తాను స్వయంగా చేయించిన సర్వేలే కీలకం కానున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే విషయాన్ని కేసీఆర్ కూడా మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. చాలా వరకు సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తామని పలుమార్లు చెప్తున్న ఆయన.. గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అంతేగాకుండా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా గతంలో కేసీఆర్ నియోజకవర్గం, జిల్లా బాధ్యులను నియమించారు. పార్టీ రాష్ట్ర కమిటీలో కార్యదర్శి, సహాయ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి హోదాలలో ఉన్న పలువురు సీనియర్లకు అవకాశం కల్పించారు. జిల్లాకు చెందిన సీనియర్లు ఒక్కొక్కరికి మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించిన కేసీఆర్, పొరుగు జిల్లాకు చెందిన సీనియర్‌ను జిల్లా ఇన్చార్జి జనరల్ సెక్రెటరీగా నియమించారు. మాజీ మంత్రి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బస్వరాజు సారయ్యను పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి జనరల్ సెక్రెటరీగా నియమించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాలకు నలుగురు బాధ్యులను నియమించారు. మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్‌తోపాటు హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాల ఇన్చార్జి బాధ్యతలను పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తకు అప్పగించారు. ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్‌రావుకు సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, కోరుట్ల, సిరిసిల్ల అర్బన్ బ్యాంకు మాజీ అధ్యక్షుడు గూడూరి ప్రవీణ్‌కు కరీంనగర్, చొప్పదండి, ధర్మపురి, కర్ర శ్రీహరికి పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల ఇన్‌చార్జీలుగా నియమించారు. సెప్టెంబర్ 2న ప్రకటించే అభ్యర్థుల జాబితాలో సర్వేలతోపాటు ఈ కమిటీలు, కొత్తగా వేసే మూడు నియోజకవర్గాలకో ‘స్క్రీనింగ్’ కమిటీలు కూడా కీలకం కానున్నాయని చెప్తున్నారు. ఒంటరిపోరుకు కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్.. నేతల్లో మొదలైన టిక్కెట్ల టెన్షన్.. సోమవారం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన కేసీఆర్ చాలా విషయాల్లో క్లారిటీ ఇచ్చారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లో సెప్టెంబర్ 2న భారీ ఎత్తున ప్రగతి నివేదన సభ నిర్వహణ, అభ్యర్థుల ప్రకటనపై కూడా స్పష్టత ఇచ్చారు. ఇదే సమయంలో ‘ఈ మధ్య పేపర్లలో ఊహాగానాలు ఎక్కువవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పొత్తులు ఉండవు. ఇది పార్టీ ఏకగ్రీవ నిర్ణయం’ అంటూ కుండబద్దలు కొట్టారు. సెప్టెంబరులోనే ఎన్నికల అభ్యర్థులను ప్రకటిస్తామని, మూడు నియోజకవర్గాలకు ఒకటి చొప్పున స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటు చేస్తామని కూడా సీఎం తెలిపారు. నాలుగేళ్లలో ఐదారు సర్వేలు నిర్వహించిన ఆయన చాలా మంది పనితీరును మార్చుకోవాలని పలువురు ఎమ్మెల్యేలకు సూచించారు. ఎమ్మెల్యేల పనితీరుకు మార్కులు, గ్రేడింగ్ కూడా ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చాలావరకు అవకాశం ఇస్తామన్న ఆయన సర్వేలను కూడా ప్రామాణికంగానే తీసుకుంటామని కూడా పలుమార్లు పార్టీ కీలక భేటీల్లో వెల్లడించారు. ఇదే సమయంలో సోమవారం సెప్టెంబర్‌లో అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తామని కీలక ప్రకటన చేయడంపై పలువురు ఎమ్మెల్యేలు, ఆశావహుల్లో టిక్కెట్ల టెన్షన్ మొదలైంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్‌లకు ఎంతమందికి మళ్లీ టిక్కెట్లు దక్కుతాయి? కొత్తగా ఎంతమంది చాన్స్ దొరుకుతుంది? ఒకవేళ పాతవారిని మార్చాల్సి వచ్చినా, కొత్తవారికి అవకాశం ఇవ్వాల్సి వచ్చినా వారిని అధినేత ఏ విధంగా సంతృప్తి పరుస్తారు? అన్న పలు కోణాల్లో రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఇక ప్రజా క్షేత్రంలోకే!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ గడువుకు ముందే శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళుతుందన్న సంకేతాలను కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులకు ఇచ్చేశారు. వచ్చే డిసెంబర్లో జరిగే నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటే దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరపాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ యోచిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఒకవైపు పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేసుకుంటూనే మరోవైపు ప్రజల్లోకి వెళ్లి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అన్ని ప్రధాన పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార టీఆర్ఎస్ ఇప్పటికే ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోగా, వర్గపోరుతో ఉక్కిరిబిక్కిరవుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటన తరువాత కార్యక్షేత్రంలోకి దూకాలని నిర్ణయించుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఈనెల 17 నుంచి 26 వరకు గ్రామ గ్రామాన బైక్‌ర్యాలీలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. వైఎస్సార్సీపీ నాయకులు సింగరేణి కార్మి కులు, నిరుద్యోగులు లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ ఎన్నికల హామీలపై పోరుబాట పట్టింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఉనికినే కోల్పోయిన తెలుగుదేశం పార్టీ పొత్తు కోసం కాంగ్రెస్ వైపు ఆశగా చూస్తోంది. ప్రొఫెసర్ కోదండరాం పార్టీ టీజేఎస్, పవన్‌కల్యాణ్ జనసేనతో పాటు సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా జాతీయజెండా ఆవిష్కరణల్లో పాల్గొని పార్టీ పతాకాలను కూడా ప్రజలకు చేరువ చేయాలనే సంకల్పంతో ఆయా రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వ పథకాలే ప్రచారాస్త్రాలుగా... ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల అధికార యంత్రాంగం చేస్తున్న హ డావుడితో ఇప్పటికే గ్రామాల్లో చర్చ మొదలైనప్పటికీ... ఎమ్మెల్యేలు మాత్రం ప్రజలకు చేరువగా వెళ్లడం లేదు. ఈ పరిస్థితుల్లో ఆగస్టు 15న జాతీ య జెండాల ఆవిష్కరణ కార్యక్రమాలతో ఎంపిక చేసుకొన్న గ్రామాల్లో పర్యటించేందుకు పది ని యోజకవర్గాల శాసనసభ్యులు సిద్ధమవుతున్నా రు. కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు, ఈనెలలోనే మిషన్ భగీరథ నీటి సరఫరా, రైతుబంధు, రైతుబీమా పథకాలు, గొర్రెలు, బర్రెల పంపిణీ వంటి పథకాల గురించి తామే ప్రజలకు వివరించాలనే ప్రయత్నంలో ఉన్నారు. మంత్రులు అల్లోళ్ల ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న ఉమ్మడి జిల్లా కార్యక్రమాల్లో పాల్గొంటూనే తమ నియోజకవర్గంలో పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు చొరవ చూపుతున్నారు. ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు నియోజకవర్గానికే పరి మితమయ్యారు. కాగజ్‌నగర్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన తరువాత సిర్పూర్, ఆసిఫాబాద్‌లలో ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, కోవ లక్ష్మి జోష్ పెం చారు. మంచిర్యాల ఎమ్మెల్యే ఎన్.దివాకర్‌రావు తనకు పట్టున్న గ్రామాలతో పాటు పట్టణంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గమనార్హం. బోథ్‌లో బాపూరావు, ము ధోల్లో విఠల్‌రెడ్డి, ఖానాపూర్‌లో రేఖానాయక్ సైతం ఎక్కువగా నియోజకవర్గ పరిధిలోనే సమయాన్ని కేటాయిస్తూ, వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. రాహుల్‌గాంధీ పర్యటన తరువాత కాంగ్రెస్.. ఈనెల 13, 14 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్న రాహుల్‌గాంధీకి ప్రజాదరణ లభిస్తుందని భావి స్తున్న కాంగ్రెస్ నాయకులు ఆ మైలేజీని ఉపయోగించుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కె.ప్రేంసాగర్‌రావు గ్రూపులుగా విడిపోయిన నియోజకవర్గ నేతలు ఇప్పట్లో కలిసి పనిచేసే పరిస్థితి కనిపించడం లే దు. కానీ ఎన్నికల సమయంలో టిక్కెట్లకు ప్రజ ల్లో ఉన్న ఆదరణను కొలమానంగా పరిగణిస్తామ ని రాహుల్‌గాంధీ చెపుతున్న మాటలతో క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నియోజకవర్గంలో ఎన్ని గ్రూపులున్నా... విడివిడిగానైనా ప్రజల్లోకి వెళ్తే తప్ప భవిష్యత్తులో మంచి ఫలితాలు లభించవనే నిర్ణయానికి వచ్చిన నాయకులు ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మహేశ్వర్‌రెడ్డి ఈ మేరకు తన వర్గం నాయకులకు కచ్చితమైన సూచనలు చేసినట్లు సమాచారం. మంచిర్యాల, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, బోథ్, చె న్నూర్, సిర్పూర్లపై ప్రేంసాగర్‌రావు వర్గం ప్రధానంగా దృష్టి పెట్టి కార్యక్షేత్రంలోకి దిగాలని భావి స్తోంది. అదే సమయంలో శక్తియాప్నకు విస్తృత ప్రచారం తీసుకువచ్చేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు. యాప్ ద్వారా పార్టీ సభ్యత్వం ఇ ప్పించే ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తున్నా రు. మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు వర్గాలు విడివిడిగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నా యి. ఇదే పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉంది. 17 నుంచి బైక్యాత్రలతో బీజేపీ.. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ, పట్టణాల్లో పార్టీ సానుభూతిపరులకు కొదువ లేకున్నా... ప్రజాదరణ పొందలేకపోతున్న బీజేపీ సైతం గ్రా మాల బాట పట్టాలని నిర్ణయించుకుంది. ఈనెల 17 నుంచి 26వ తేదీ వరకు గ్రామ గ్రామాన బైక్ ర్యాలీలతో కేంద్ర ప్రభుత్వ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మంచిర్యాల, భైంసా, నిర్మల్, ఆదిలాబాద్ పట్టణాల్లో తమకున్న బలాన్ని పెంచుకోవడంతో పాటు గ్రామాల్లో కూడా పార్టీని పరిపుష్టం చేయాలనే ఆలోచనతో జిల్లా పార్టీల అధ్యక్షులు ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర నాయకత్వం నుంచి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు అందాయి. అలాగే మోదీ పిలుపు మేరకు ఆన్లైన్ ద్వారా పార్టీ సభ్యత్వాలు తీసుకున్న వారి వివరాల ఆధారంగా వారి ఇళ్లకు వెళ్లి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నారు. బైక్‌ర్యాలీ తరువాత ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం చేపడుతున్నట్లు మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. మంచిర్యాలలోనే 26వేల సభ్యత్వం ఆన్లైన్ ద్వారా తీసుకున్నట్లు తెలిపారు. ఉద్యోగాల కోసం వైఎస్సార్సీపీ ఉద్యమాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్‌తో వైఎస్సార్సీపీ పోరుబాట పట్టింది. సింగరేణి ఎన్నికల సమయంలో వారసత్వ ఉద్యోగాల కోసం ఉద్యమించిన ఈ పార్టీ నాయకులు ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాడాలని నిర్ణయించారు. మంచిర్యాలలో శనివారం చేపట్టిన నిరుద్యోగుల సంతకాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం జిల్లాల్లో కూడా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలపై ప్రజలను చైతన్యవంతులను చేసే కార్యక్రమం చేపడుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజ్జంకి అనిల్ ‘సాక్షి’కి తెలిపారు. పొత్తు కోసం ‘తమ్ముళ్ల’ ఆరాటం తెలంగాణ ఉద్యమంతో మసకబారి రాష్ట్ర ఆవి ర్భావం తరువాత కనుమరుగయ్యే స్థితికి చేరిన తెలుగుదేశం పార్టీ కొత్తగా కాంగ్రెస్ పొత్తు కోసం ఎదురుచూస్తోంది. ఈ పార్టీలో మిగిలిన కొద్దిపాటి నాయకులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పొత్తులో రెండు సీట్లు అయినా సాధించుకొని పోటీ చేయాలనే యోచనతో ఉన్నారు. మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఒకటి లేదా రెండు సీట్లపైన నాయకులు ఆశగా ఉన్నట్లు సమాచారం. ప్రజాదరణకు దూరంగా టీజేఎస్.. ప్రొఫెసర్ కోదండరాం ఏర్పాటు చేసిన తెలంగాణ జన సమితి ఉమ్మడి జిల్లాలో జనంలోకి వెళ్లలేకపోతోంది. టీజేఎస్ మీద నమ్మకంతో అధికార పార్టీని కాదని వచ్చిన కాసిపేట ఎంపీపీ శంకరమ్మ అవిశ్వాసం నుంచి తప్పించుకొని ఇటీవలే కాంగ్రెస్ గూటికి చేరారు. చెన్నూర్, బెల్లంపల్లిలో పార్టీ సానుభూతిపరులు ఉన్నప్పటికీ, ఎలాంటి కార్యక్రమాలు లేక ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో పొత్తు కారణంగా ఉమ్మడి జిల్లాలో ఒకటో అరో సీట్లు లభించకపోతాయా అనే ఆలోచనతో నాయకులున్నారు. సీపీఐ పరిస్థితి కూడా అదే. బెల్లంపల్లిలో గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన గుండా మల్లేష్‌కు పొత్తులో మరోసారి టిక్కెట్టు లభిస్తుందని ఆపార్టీ నాయకులు భావిస్తున్నారు. సీపీఎం ఇప్పటివరకు పోటీ, పొత్తుల విషయంలో స్పష్టత ఇవ్వలేదు. కాగా ప్రజా సమస్యలపై ఈ రెండు కమ్యూనిస్టు పార్టీలకు తోడు సీపీఐఎంఎల్ (న్యూ డెమోక్రసీ) కూడా ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. సినీహీరో పవన్‌కల్యాణ్ జనసేన పార్టీ ఇప్పటివరకు సామాజిక మాధ్యమాలకే పరిమితమవడం గమనార్హం. -
ముందస్తుకు మేము సిద్ధమే
-
జమిలికి జై
సాక్షి, న్యూఢిల్లీ : జమిలి ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏకాభి ప్రాయం వ్యక్తంచేశారు. దేశంలో పలు దఫాలుగా ఎన్నికలు జరుగుతుండటంతో ఇబ్బందులు వస్తున్నాయని, అలాకాకుండా పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అన్ని రాజకీయ పక్షాలు సానుకూల దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మూడ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా కేసీఆర్ శనివారం మోదీని ఆయన నివాసంలో కలిసి రాష్ట్రానికి సంబంధించిన 11 అంశాలపై 17 పేజీల వినతిపత్రాన్ని అందజేశారు. హైకోర్టు విభజన, కొత్త జోనల్ వ్యవస్థ, రిజర్వేషన్ల పెంపు, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థిక సాయం, పెండింగ్‌లోని రైల్వే ప్రాజెక్టులు తదితర అంశాలను ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం తరఫున రూ.20 వేల కోట్ల సాయం అందజేయాలని కోరారు. అలాగే హైకోర్టు విభజన ఆవశ్యకతను మరోసారి గట్టిగా వినిపించారు. హైకోర్టు విభజన జరగనిదే రాష్ట్ర విభజన సంపూర్ణం కాదని స్పష్టంచేశారు. దాదాపు గంటపాటు ఇరువురు నేతలు వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా దేశంలో ఏకకాల ఎన్నికలపైనా చర్చించినట్టు తెలిసింది. మీరు వెళ్తే.. మేమూ వస్తాం.. డిసెంబర్ లేదా జనవరిలో జరగనున్న 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే లోక్‌సభకూ ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచన కేంద్రానికి ఉంటే తామూ అదే దారిలో ఉంటామని కేసీఆర్ ప్రధానికి చెప్పినట్టు తెలిసింది. కేంద్రం ముందస్తుకు సిద్ధమవుతున్నట్లు వస్తున్న వార్తలను సీఎం ప్రస్తావించినట్లు సమాచారం. దీనిపై ప్రధాని తన అభిప్రాయాన్ని నేరుగా చెప్పకపోయినా... ‘‘4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటే కేంద్రం కూడా ముందస్తుకు వెళ్తే బాగుంటుం దని అనుకుంటున్నారా..’’అని కేసీఆర్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ సమయంలో ఐదేళ్లకోసారి డిసెంబర్ లేదా జనవరిలో లోక్‌సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని కేసీఆర్ అభిప్రాయపడినట్లు సమాచారం. దీనికి మోదీ స్పందిస్తూ ‘వన్ నేషన్– వన్ ఎలక్షన్’ అన్న తమ విధానంలో మార్పు లేదన్నట్లు తెలిసింది. అందుకు తామూ సిద్ధమేనని, ఇదే అభిప్రాయాన్ని ఇటీవల లా కమిషన్ ముందు వ్యక్తపరిచినట్టు కేసీఆర్ వివరించారు. దేశంలో పలు దఫాలుగా ఎన్నికలు జరగడంతో ఇబ్బందులు వస్తున్నాయని ఇరువురు అభిప్రాయపడ్డారు. బీజేపీయేతర నేతలతో జనవరి 19న కోల్‌కతాలో ఫెడరల్ ఫ్రంట్ ర్యాలీ చేపడతామని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల ప్రకటించారు. దీనికి కాంగ్రెస్‌తోపాటు వివిధ ప్రాంతీయ పార్టీల ముఖ్య నేతలు హాజరవుతారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపైనా ప్రధాని, సీఎం చర్చించినట్టు సమాచారం. -
గెలుపు గుర్రాల వేట
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీలో గెలుపు గుర్రాల వేట మొదలైంది. మూడు నెలల ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు అధిష్టానం నడుం బిగించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక స్థానాల సాధనే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు సిద్ధమైంది. చాలా స్థానాల నుంచి నలుగురు నుంచి 10 మంది వరకు పార్టీ టిక్కెట్ కోసం ఏడాది నుంచే పోటీ పడుతున్నారు. రోజురోజుకూ ఆశావహుల సంఖ్య పెరుగుతుండటతో సర్వేల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలన్న నిర్ణయానికి ఆ పార్టీ నాయకత్వం వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఏఐసీసీ, టీపీసీసీలు వేర్వేరుగా ఉమ్మడి కరీంనగర్‌లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. కాగా ఏఐసీసీ కార్యదర్శి, కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ల ఇన్చార్జి శ్రీనివాసన్ కృష్ణన్ కూడా పార్టీ నేతలు, శ్రేణులు, ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ టికెట్ ఆశిస్తున్న పలువురిలో సర్వేలు గుబులు రేపుతున్నాయి. రంగంలోకీ ఏఐసీసీ, టీపీసీసీ ప్రతినిధులు సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండగా.. ఆ పార్టీ హైకమాండ్ గెలుపు గుర్రాల వేట చర్చనీయాంశంగా మారింది. రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితులుగా చేప్తున్న ఉ.తెలంగాణ ఇన్చార్జి, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్ కృష్ణన్ ఇటీవల కరీంనగర్ ఉమ్మడి జిల్లా నేతలతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఆయన 13 నియోజకవర్గాలకు చెందిన ఆశావహులు, ముఖ్య నాయకులతో మాట్లాడారు. ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థుల ఎంపికపైనా ఆ పార్టీలో కసరత్తు జోరందుకుంది. ఇదే సమయంలో ఏఐసీసీ, టీపీసీసీలు అభ్యర్థుల ఎంపికపై వారం రోజులుగా సర్వేలు నిర్వహిస్తుండటం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే వారు కరీంనగర్, హుజూరాబాద్, హుస్నాబాద్, మానకొండూరు, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో పలువురిని కలిసినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏఐసీసీ, టీపీసీసీల వేసిన ఈ రెండు కమిటీల ప్రతినిధులు సైతం వేర్వేరుగానే పర్యటిస్తూ నివేదికలు తయారు చేస్తుండటం కూడా చర్చనీయాంశం అవుతోంది. ఈ రెండు నివేదికలతోపాటు జిల్లా, రాష్ట్ర కమిటీలు, పార్టీ సీనియర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక కోసం రాహుల్‌గాంధీకి సిఫారసు చేస్తారని చెప్తున్నారు. కాగా.. కాంగ్రెస్ పార్టీలో ఏడాది ముందు నుంచే టిక్కెట్ల పోరు ఊపందుకోవడం.. మొత్తం 13 అసెంబ్లీ స్థానాలకు గాను ప్రధానంగా తొమ్మిది చోట్ల ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం.. ఇదే సమయంలో కీలకమైన సర్వేలు జరుగుతుండటం పార్టీలో హీట్ పెరిగింది. టిక్కెట్ రేసులో ఎవరెవరు..పరిశీలనలో పలువురి పేర్లు.. జగిత్యాల, మంథని నుంచి టి.జీవన్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు పేర్లే ఖాయం కాగా, మిగతా స్థానాల నుంచి ఆశావహుల సంఖ్య పెరిగింది. కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం, అధికార ప్రతినిధి రేగులపాటి రమ్యారావు, అంజనీప్రసాద్, గందె మాధవి తదితరులు పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం ఉంది. కోరుట్ల నుంచి కొమిరెడ్డి రాములుతోపాటు డాక్టర్ జేఎన్ వెంకట్, డాక్టర్ రఘు ప్రయత్నం చేస్తున్నారు. రామగుండం నుంచి టికెట్ రేసులో మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, మున్సిపల్ మాజీ చైర్మన్ బడికెల రాజలింగం, గుమ్మడి కుమారస్వామి, హర్కర వేణుగోపాల్ కూడా ఆశిస్తున్న వారిలో ఉన్నారు. సిరిసిల్ల నుంచి కేకే మహేందర్‌రెడ్డి పేరు వినిపిస్తుండగా, ఇక్కడి నుంచి కటకం మృత్యుంజయం, దరువు ఎల్లయ్య కూడా ఆశిస్తున్నారంటున్నారు. వేములవాడ నుంచి ఏనుగు మనోహర్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, బొమ్మ వెంకటేశ్వర్లు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. హుస్నాబాద్‌కు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేరు దాదాపు ఖాయమైనట్లేనంటున్నా సర్వే సందర్భంగా బొమ్మ వెంకటేశ్వర్, బొమ్మ శ్రీరాం పేర్లను కూడా ఇక్కడి నుంచే తీసుకుంటున్నారంటున్నారు. ధర్మపురి నుంచి లక్ష్మణ్‌కుమార్ పేరు ఖాయమంటున్నా ఇతర నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశిస్తున్న ఆ పార్టీ సీనియర్లు మరో ఇద్దరి పేర్లు తాజాగా తెరపైకి వచ్చాయంటున్నారు. చొప్పదండి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సుద్దాల దేవయ్యతోపాటు మేడిపల్లి సత్యం, గజ్జెల కాంతం, బి.శంకర్ టికెట్ ఆశిస్తున్నారు. పెద్దపల్లి నుంచి ఈర్ల కొంరయ్య, డాక్టర్ గీట్ల సవితరెడ్డి, సీహెచ్ విజయరమణారావు, జి.సురేష్ రెడ్డి టికెట్ కోసం పోటీ పడుతుండగా, మానకొండూరు నుంచి మాజీ విప్, ఎస్సీ సెల్ రాష్ట్ర నేత ఆరెపల్లి మోహన్, కవ్వంపెల్లి సత్యనారాయణ పేర్లున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ప్యాట రమేష్, పరిపాటి రవీందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, స్వర్గం రవి పేర్లు వినిపిస్తున్నాయి. ఏడాది ముందు నుంచే ఎన్నికల వేడి.. కాంగ్రెస్ పార్టీ ఆశావహుల్లో ఏడాది ముందు నుంచే ఎన్నికల వేడి కనిపిస్తోంది. ఓ వైపు ‘ముందస్తు’, మరోవైపు జమిలి ఎన్నికల ప్రచారం జరుగుతుండగా, సమయం ప్రకారమే సార్వత్రిక ఎన్నికలు ఉంటాయనే ప్రచారం కూడా పోటీకి కారణం అవుతోంది. ఇదే సమయంలో తమకు అనుకూలురైన నాయకులను రంగంలోకి దింపేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేతలు పావులు కదపడంలో కూడా వేగం పెంచారు. గ్రూపులు నడుపుతున్న నేతలు ఎవరికి వారుగా తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు సమీకరణలపై దృష్టి సారించారు. నియోజకవర్గాలపై పట్టు బిగించేందుకు కూడికలు, తీసివేతలలో పడ్డారు. ఉమ్మడి కరీంనగర్లో చాలా మంది సీనియర్ నేతల మధ్య సఖ్యత అంతగా లేకపోగా, ఆ పార్టీ కార్యకలాపాలు ప్రధానంగా రెండు, మూడు గ్రూపులుగా సాగుతున్నాయి. జిల్లా నుంచి ప్రస్తుతం సీనియర్లుగా సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్, కటకం మృత్యుంజయం, మాజీ విప్ ఆరెపెల్లి మోహన్, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, కొమిరెడ్డి రామ్‌లు, బొమ్మ వెంకటేశ్వర్ తదితరులు ఉన్నారు. దీంతో సీనియర్లుగా ఉన్న పలువురికి ఏదో ఒక గ్రూపు ముద్ర పడటం.. సమస్యల వారిగా విభేదించి విడిపోవడం, సమర్దించి కలిసి పోవడంలాంటివి జరుగుతున్నా గ్రూపుల విభేదాలు సమసి పోలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణలు కూడా చర్చనీయాంశంగా మారాయి. -
‘జమిలి’పై కుదేలైన బీజేపీ భ్రమలు!
జమిలి ఎన్నికలకు ఇంతగా ఉవ్విళ్లూరిన బీజేపీ నాయకత్వం తక్షణమే చేపట్టవలసిన ఎన్నికల సంస్కరణల గురించి మాట్లాడటం లేదు. ఎన్నికల్లో అభ్యర్థులు, రాజకీయపక్షాలు ఎన్ని నిబంధనలున్నా అడ్డూ అదుపూ లేకుండా చేస్తున్న ప్రచార వ్యయం, ఎన్నిక ఖర్చు పేరిట సాగుతున్న అవినీతి, ధన ప్రవాహం గురించి అనేక సంవత్సరాలుగా ఎన్నికల సంఘం మొత్తుకుంటున్నా ప్రభుత్వాలు తీసుకుం టున్న చర్యలేవీ లేవు. క్షమించరాని ఉల్లంఘనలను, లొసుగుల్ని నాయకులు తొలగించకుండా ‘జమిలి’ ఎన్నికల ‘సత్ఫలితాల’పై మాట్లాడటం కూడా ప్రజల్లో భ్రమలు కల్పించడానికేనని గుర్తించాలి. ఎన్నికల నిర్వహణ షెడ్యూల్‌ను నిర్ణయించే కేంద్ర ఎన్నికల సంఘం అధి కారాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష పార్టీలకు లేదు. ఒక దేశం, ఒకే ఎన్నిక ఉండాలి. పార్లమెంటు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరగాలి. – ప్రధాని నరేంద్ర మోదీ (22–10–17) భారతదేశం ఫెడరల్ ప్రజాస్వామ్య దేశం. ఇది రాజ్యాంగ నిబంధన. దేశ లోక్‌సభకు ఐదేళ్ల పదవీకాల పరిమితి ఉన్నా ఆ పరిమితి ముగియక ముందు కూడా సభను రద్దు చేయవచ్చన్న విషయాన్ని ఎన్నికల కమి షన్గాని, పాలకపక్షమైన బీజేపీ నాయకత్వంగానీ, కమిషన్ ప్రతిపాదించిన కార్యాచరణ పత్రంగానీ దాన్ని పరిగణనలోకి తీసుకోవలేదు. అలాంటప్పుడు కాలపరిమితి ముగియని రాష్ట్ర శాసనసభల గతి ఏమిటి? ఫెడరల్ వ్యవస్థలో పార్లమెంటు, అసెంబ్లీలకు ఏక కాలంలో జమిలిగా ఎన్నికలు జరపడం అనర్థ దాయకం. – జమిలి ఎన్నికల ప్రతిపాదనకు 9 పార్టీలు మద్దతివ్వగా బీజేపీ సహా 4 పార్టీలు మాత్రమే వ్యతిరేకించాయి. పుట్టని బిడ్డ బారెడన్న సామెత బీజేపీ ఎన్నికల రహస్య తంత్రం. జమిలి ఎన్నికల అస్త్రం బెడిసి కొట్టింది. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడగట్టుకుని బీజేపీ నాయకత్వం (మోదీ–అమిత్ షా ద్వయం) 2017లోనే, రెండేళ్లు ముందుగానే పన్నిన మధ్యంతర వ్యూహం భగ్నమైంది. 2019 సాధారణ ఎన్నికల్లో తిరిగి తమకు మెజారిటీ సీట్లు రావనే అనుమానం బీజేపీని పీడిస్తోంది. ఆచరణలో తన విధానాలు అమలు జరుగుతున్న తీరును, పద్ధతులను ప్రజలు ఆమోదించడం లేదనే అభిప్రాయంతో బీజేపీ నాయ కత్వం జమిలి ఎన్నికల ప్రతిపాదన జనం ముందుకు తెచ్చింది. ఇది దాచినా దాగని సత్యం. ఇటీవల అనేక రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ పార్టీ ఓటమిపా లైంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తప్పనిసరిగా గెలవాలనే లక్ష్యంతో జమిలి ఎన్నికల ప్రతిపాదనను పాలకపక్షం ముందుకు తెచ్చిందని ప్రజలు గ్రహిం చారనే విషయాన్ని కూడా మోదీ–షా ద్వయం పసి గట్టింది. అందుకే 2017లోనే అటు మోదీ, ఇటు ఆరెస్సెస్, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ‘జమిలి’ వ్యూహాన్ని ముందస్తుగానే వదిలి చూశారు. అసలీ ‘జమిలి’ ప్రతిపాదనకు కీలకం ఎక్కడుందో వర్ధ మాన సమాజాల అధ్యయన కేంద్రం (సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్–సీఎస్డీఎస్) డైరె క్టర్ సంజయ్ కుమార్, ఏడీఆర్‌కు చెందిన జగదీప్ ఛోకర్ 1989–2014 మధ్య కాలంలో సుమారు 13 రాష్ట్రాల్లో అసెంబ్లీలకు, లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో ఓటర్ల నిర్ణయం విభిన్నంగా ఉందని తేల్చారు. ఈ వ్యత్యాసం లోక్‌సభ, అసెం బ్లీలకు వివిధ సమయాల్లో వేర్వేరుగా నిర్వహించి నప్పుడు మరింత ప్రస్ఫుటంగా వెల్లడయిందని ఈ పరిశోధకులు నిర్ధారణ చేశారు. భారత రాజ్య పాలనా నిర్వహణలో ఫెడరల్ ప్రజాస్వామ్య వ్యవ స్థకు జమిలి ఎన్నికలు నష్టదాయకమని, హానికర మని అనేక సర్వేల ఫలితాలు నిరూపించాయి. ప్రాంతీయపక్షాలకు కీడు! జమిలి ఎన్నికలు ప్రాంతీయ పార్టీలను బలిపెట్టి, జాతీయ స్థాయి పెద్ద పార్టీల ప్రయోజనాలు కాపా డటానికి మాత్రమే దోహదం చేస్తాయని గతంలో నిరూపించాయని ఈ సర్వేలు పేర్కొన్నాయి. ఎందు కంటే, రాష్ట్రాల ప్రజల స్థానిక సాధకబాధకాలను, ప్రాంతీయ సమస్యలను, వారి తక్షణ కోర్కెలను ప్రతిబింబించడానికి ప్రయత్నించే ప్రాంతీయ పార్టీల కున్న అవకాశాలను దెబ్బదీయడం ద్వారా జనం గొంతును అణచడానికి జమిలి ఎన్నికలు ఉపయోగ పడతాయని సంజయ్‌కుమార్ తన అధ్యయనంలో వివరించారు. తద్వారా జన జీవనంలో వేళ్లూనుకో వలసిన ప్రజాస్వామ్య క్రమాన్ని తిప్పికొట్టడానికి ‘జమిలి’ దోహదం చేస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ శాసన సభల పదవీకాలం 2018 జనవరిలో వరుసగా 7, 22 తేదీల్లో ముగిస్తున్నాగాని మోదీ ప్రభుత్వం బీజేపీ పాలనలోని గుజరాత్ ఎన్నికలను వరద సహాయ కార్యక్రమాలకు సమయం కావాలనే కారణంతో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తర్వాత జరిపించింది. హిమాచల్‌లో 2017 నవంబర్ 9న, గుజరాత్లో డిసెంబర్ 9, 14 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిం చారు. ఈ విషయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏకే జ్యోతీ కేంద్రంలోని బీజేపీ సర్కారు కోరుకున్నట్టే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఆలస్యంగా ప్రకటించారనే విమర్శలు వచ్చాయి. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను మాత్రం బీజేపీ చెప్పినట్టే డిసెంబర్ 18న ఎన్నికల కమిషన్ ప్రకటించింది. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిపించడానికి తాము సిద్ధమని ప్రధాన ఎన్నికల కమిషనర్ అంతకు ముందు ప్రకటించిన కొద్ది రోజులకే జమిలి ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా లేమని మరో ప్రకటన విడుదల చేశారు. ముఖ్య ఎన్నికల సంస్కరణల ఊసే లేదు! జమిలి ఎన్నికలకు ఇంతగా ఉవ్విళ్లూరిన బీజేపీ నాయకత్వం తక్షణమే చేపట్టవలసిన ఎన్నికల సంస్కరణల గురించి మాట్లాడటం లేదు. ఎన్నికల్లో అభ్యర్థులు, రాజకీయపక్షాలు ఎన్ని నిబంధనలున్నా అడ్డూ అదుపూ లేకుండా చేస్తున్న ప్రచార వ్యయం, ఎన్నిక ఖర్చు పేరిట సాగుతున్న అవినీతి, ధన ప్రవాహం గురించి అనేక సంవత్సరాలుగా ఎన్నికల సంఘం మొత్తుకుంటున్నా ప్రభుత్వాలు తీసుకుం టున్న చర్యలేవీ లేవు. పార్లమెంటు, అసెంబ్లీలకు పోటీచేసే అభ్యర్థులు పెట్టే ఖర్చు, వారి అవినీతిపై ఎన్నో సర్వేల ద్వారా ప్రజాతంత్ర సంస్కరణల సంఘం వంటి అనధికార సంస్థలెన్నో వెల్లడించిన దిగ్భ్రాంతికరమైన విషయాలపై చర్యలు తీసుకో కుండా తప్పించుకుంటున్నారు. ప్రజల ఓటుతో సీటె క్కిన వ్యక్తులే కాటేస్తున్నప్పుడు ఏ ప్రజా ప్రతినిధిని నమ్మాలో, మరెవరిని ‘కుమ్మా’లో తెలియని పరి స్థితుల్ని ఓటర్లు ఎదుర్కొంటున్నారు. ఇక ఫిరాయిం పుల నిషేధ చట్టం అపహాస్యంగా తయారైంది. భ్రమలు కల్పించడానికే ‘జమిలి’ ప్రతిపాదన! ఈ క్షమించరాని ఉల్లంఘనలను, లొసుగుల్ని పాలనా పగ్గాలు చేపట్టిన నాయకులు తొలగించకుండా ‘జమిలి’ ఎన్నికల ‘సత్ఫలితాల’పై మాట్లాడటం కూడా ప్రజల్లో భ్రమలు కల్పించడానికేనని గుర్తించాలి. ఎన్ని కల్లో నల్లధనం ప్రవాహానికి అడ్డుకట్ట వేయకుండా స్వతంత్ర భారతాన్ని ఆదర్శశక్తిగా చెప్పుకోలేము. ఈ అప్రజాస్వామిక, నిరంకుశ పోకడలన్నీ కిందిస్థాయి లోని మునిసిపల్, పంచాయతీ రాజ్ ఎన్నికల దాకా దశాబ్దాల నాటి నుంచే విస్తరించాయి. ఇవన్నీ ప్రజా స్వామ్య పునాదుల్ని కుదిపేస్తున్నాయి. ప్రజా ప్రాతి నిధ్య చట్టం(1951)లో ఎన్ని సవరణలు తెచ్చుకున్నా పాలకులు, పెక్కు ప్రజా ప్రతినిధుల ప్రవర్తన మార లేదు. పైగా బీజేపీ పాలకుల్ని పీడిస్తున్న ‘కొత్త జబ్బు’ సెక్యులర్ రాజ్యాంగాన్ని మూలమట్టుగా ఎలా మార్చాలా అన్నదే. దానికితోడు కొత్త ఆలోచన ఈ జమిలి ఎన్నికలు. 1951–52లో పార్ల మెంటు, రాష్ట్రాల శాసన సభలకు జమిలి ఎన్నికలు, ఆ తర్వాత 1957/ 1962/1967లో వరుసగా మూడుసార్లు జమిలి ఎన్ని కలు జరిగిన విషయాన్ని బీజేపీ నాయకత్వం తన ప్రతిపాదనకు అనుకూలంగా మలుచుకునే ప్రయ త్నం చేస్తోంది. రాజ్యాంగం అమలులోకి వచ్చాక వరుసగా మొదటి నాలుగు సాధారణ ఎన్నికలు లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి జరప డం వల్ల ప్రభుత్వాలకు ఎన్నికల నిర్వహణ వ్యయం తగ్గిందనే వాదన ముందుకు తెచ్చింది. అయితే, ఎన్నికల ఖర్చును తగ్గించడం కోసం ఇక నుంచి ‘జమిలి’ ఎన్నికలు జరిపితే తప్పేమిటన్నది దేశ ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తిని కాస్తా పాతిపెట్టి నిరంకుశ పాలనకు పునాదులు వేయడానికి చేసే ఆలోచనగా మాత్రమే పరిగణించాలి. ప్రొఫెసర్ అశోక్ ప్రసన్న కుమార్ చెప్పినట్టుగా– పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను తోసి రాజనడానికి దేశ రాజ్యాంగాన్నే మూలమట్టుగా మార్చేయకుండా అమెరికాలో మాదిరి ‘చాపకింద నీరులా’గా ప్రెసిడెన్షియల్ పాలనా నమూనాలో ఏకకాలంలో జమిలి ఎన్నికల న్నవి భారతదేశంలోని ఫెడరల్ వ్యవస్థలో చెల్లవు. పైగా సుప్రీంకోర్టు పరిశీలనకు ఈ పద్ధతి (జమిలి) నిలబడదని నిపుణుల అంచనా. ఇదిలా ఉండగా, ఈ సందర్భంగా సుప్రసిద్ధ ‘మీడియా హౌస్’ ఆధ్వ ర్యంలో నరేంద్ర మోదీ ప్రధానిగా గత నాలుగేళ్లలో సాగిన పరిపాలనా ఫలితాలను ‘ఇండియాను భ్రష్టు పట్టించిన పాలన’గా పేర్కొంటూ ఒక ప్రత్యేక నివే దికను బృహత్ గ్రంథంగా ఈనెల 14న జరిగిన పెద్ద ఆవిష్కరణ సభలో (ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో) విడుదల చేశారు. జాతీయ జీవనంలో అనేక రంగాల్లో సుప్రసిద్ధులైన వారి రచనలు ఇందులో ఉన్నాయి. నాలుగేళ్ల ప్రజావ్యతిరేక పాలనలో వివిధ రంగాల్లో జరిగిన రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు, అమలైన ఆశాస్త్రీయ విధానాలు, పరిణామాల గురిం చిన వివరాలున్నాయి. ప్రముఖ మేధావులు, రాజ కీయ వ్యాఖ్యాతలు రాసిన 24 వ్యాసాలతోపాటు, వాటికి దన్నుగా పెక్కు నిజనిర్ధారణ పట్టికలను ఈ నివేదికలో పొందుపరిచారు. మోదీ సర్కారు ప్రవేశ పెట్టిన పథకాల్లోని డొల్లతనాన్నీ దీనిలో బహిర్గతం చేశారు. (అందులోని మరిన్ని వివరాలు వచ్చేవారం) ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@ahoo.co.in -
ఎన్నికలకు టీఆర్ఎస్ సై!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలెప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలను స్వాగతిస్తామని పేర్కొన్నారు. డిసెంబర్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయా అని ట్విట్టర్లో ఓ అభిమాని ప్రశ్నించగా ఈ మేరకు బదులిచ్చారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ నెటిజన్లతో సంభాషించారు. వారడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాలు, పథకాలు, వ్యక్తిగత ఇష్టాయిష్టాలు తదితర అంశాలపై సూటిగా, చతురతతో సమాధానాలిచ్చి ఆకట్టుకున్నారు. పలు ప్రశ్నలకు సమాధానాలిలా ఉన్నాయి. నచ్చిన నాయకుడు కేసీఆర్ నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరని ఒకరు ప్రశ్నించగా సీఎం కేసీఆర్ అంటూ కేటీఆర్ బదులిచ్చారు. ప్రపంచ స్థాయిలో బరాక్ ఒబామా ఇష్టమైన నాయకుడని పేర్కొన్నారు. తెలంగాణకు తదుపరి సీఎం కేసీఆరేనని చెప్పారు. ‘ 2024లో జరిగే ఎన్నికల్లో మీరు ఏపీ నుంచి పోటీ చేయాలని నాలాంటి చాలా మంది యువకులు కోరుకుంటున్నారు. మీరేమం టారు?’అని ఒకరు ప్రశ్నించగా.. ‘భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు’అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఎన్ని సీట్లు వస్తా యని అని ఓ నెటిజన్ ప్రశ్నించగా... ‘ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సీట్ల కంటే ఎక్కువ ఏం కావాలి? ఎన్నిక ల్లో అద్భుత విజయమే మా లక్ష్యం’ అని అన్నారు. ప్రజలు వామపక్ష పార్టీలను ఎప్పుడో వదిలేశారని మరో ప్రశ్నకు బదులిచ్చారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలుస్తా మన్నారు. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని, దేశానికి మీ లాంటి వారి సేవలు అవసర మని ఓ అభిమాని కోరగా ప్రణాళికలు వేసుకుని వెళ్లడం కుదరదన్నారు. కేసీఆర్, వైఎస్సార్లలో ఎవరు ఉత్తమ సీఎం అని ప్రశ్నించగా ప్రశ్నలోనే సమాధానముందన్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదంటూ తాజాగా పోలీసులు చేసిన నగర బహిష్కరణలను కేటీఆర్ సమర్థించారు. త్వరలో నిజామాబాద్, కరీంనగర్లో ఐటీ టవర్లు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన వెంటనే బుద్వేల్‌లో ఐటీ క్లస్టర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరుపుతా మని కేటీఆర్ చెప్పారు. నిజామాబాద్, కరీంనగర్ల లో ఐటీ టవర్ల నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. ప్రైవేటు బడుల్లో ఫీజుల వసూళ్లపై కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. సులభతర వాణిజ్యం (ఈఓడీబీ)లో తెలంగాణ కేవలం 0.09 శాతం స్కోరుతో వెనుకబడి తొలి ర్యాంకును కోల్పోయిందంటూ తొలి ర్యాంకు సాధించిన ఏపీకి అభినందనలు తెలిపారు. గత నాలుగేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలన విధానాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా మారాయని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి రైతుబంధు లాంటి కార్యక్రమాన్ని ఎన్నడూ అమలు చేయలేదన్నారు. హైదరాబాద్‌లోని రోడ్ల పరిస్థితిపై తనకూ ఆందోళనగా ఉందని, ఇంతకంటే మెరుగ్గా రోడ్లను తీర్చిదిద్దగలిగితే బాగుండేదని అనిపిస్తోందని పేర్కొన్నారు. నగర రోడ్లను బాగు చేయడం అంతులేని ప్రయత్నంగా మారిందని వ్యాఖ్యానించారు. నిజాం కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు కదా.. ఎలా అనిపిస్తోందని ఒకరు అడగ్గా.. అది అద్భుతమైన కాలేజీ అని కొనియాడారు. దేశానికి బలమంతా యువతేనని తెలిపారు. జూలై 24న తన పుట్టిన రోజు సందర్భంగా కేకులు, పోస్టర్లు కాకుండా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇష్టమైన బీరా.. చెప్పను! ఇష్టమైన క్రికెటర్ ఎవరు.. ధోనీనా, కోహ్లీనా.. అని ఓ నెటిజన్ ప్రశ్నించగా రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండుల్కర్ అని కేటీఆర్ బదులిచ్చారు. తాను వారి తరానికి చెందిన వాడినని పేర్కొన్నారు. ఇష్టమైన ఫుట్‌బాల్ క్రీడాకారుడు లయోనెల్ మెస్సీ, ఇష్టమైన టెన్నిస్ ప్లేయర్ ఫెదరర్ అని చెప్పారు. ఏ బీరు అంటే ఇష్టమని ఓ అభిమాని ప్రశ్నించగా.. ‘చెప్పను..’ అని కేటీఆర్ చమత్కరించారు. రోడ్ సైడ్ లభించే ఆహారంలో చైనీస్ ఫుడ్ ఇష్టమన్నారు. అదివారం ఫ్రాన్స్, క్రొయేషియా మధ్య జరుగుతున్న ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ఫైనల్‌ను ప్రస్తావిస్తూ.. క్రొయేషియాకే ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని కేటీఆర్ అన్నారు. -
ఒకే దేశం ఒకే ఎన్నికలు మంచి నిర్ణయమే
-
జమిలి ఎన్నికలు మంచి నిర్ణయమే
సాక్షి, చెన్నై: ఒకే దేశం ఒకే ఎన్నికలు మంచి నిర్ణయమేనని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. దీని వలన సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయని తెలిపారు. జమిలీ ఎన్నికలకు అన్ని పార్టీలు ఆమోదం తెలపాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల సమయం నాటికి తమ పార్టీ కార్యాచరణను ప్రకటిస్తామని అన్నారు. ఇప్పటివరకు తమిళనాట విద్యావిధానం చాలా బాగుందని రజనీ కాంత్ గుర్తుచేశారు. ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వాన్ని నమ్ముకున్న ప్రజలకు మంచి చేయాలని ఆశిద్దామని పేర్కొన్నారు. 8 వేస్ గ్రీన్ కారిడార్ అభివృద్ధికి మంచి మార్గమని తెలిపారు. అయితే రైతులకు, భూమి కోల్పొయే వారికి పూర్తిస్థాయి పరిహారం ఇవ్వాలని కోరారు. తనను స్ఫూర్తిగా తీసుకొని దొరికిన యాభై వేల రూపాయలను పోలీసులకు అందించిన మహ్మద్ యాసిన్‌ను రజనీ అభినందించారు. అదేవిధంగా ఏడేళ్ల యాసిన్‌కు అతను చదువుకునేంత వరకు విద్యాబ్యాసం చేయిస్తానని హామీ ఇచ్చారు. -
చూశారు.. విన్నారు
సమీక్ష సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి ఆదిలాబాద్, పెద్దపెల్లి పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్చార్జి శ్రీనివాసన్ కృష్ణన్ మాట్లాడుతూ ప్రస్తుతం అభ్యర్థులను గుర్తించేందుకు తాము రాలేదని కార్యకర్తలకు తెలిపారు. పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ఈ సమీక్ష నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పార్టీలో గ్రూపులు ఉండొద్దని హెచ్చరించారు. టీఆర్ఎస్ మెనిఫెస్టోలో చెప్పిన విధంగా హామీలను అమలుచేయడం లేదని, దానిపై తాలుకా, మండల, గ్రామస్థాయిలో ప్రజలకు వివరించడంలో కాంగ్రెస్ శ్రేణులు ముందుండాలని సూచించారు. అదే సమయంలో ఎన్నికలకు ఒకట్రెండు నెలల ముందు అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుందన్నారు. మళ్లీ నియోజకవర్గాలకే వచ్చి అభ్యర్థులను గుర్తిస్తామన్నారు. సీనియర్ నాయకులు విభేదాలను పక్కనబెట్టి కూర్చొని మాట్లాడాలని, పార్టీ అభ్యున్నతికి పాటుపడాలని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని కార్యకర్తల్లో ధైర్యం నూరిపోశారు. అదే సమయంలో టికెట్ల పంపిణీలో కార్యకర్తల అభిష్టానికే ప్రాధాన్యత ఉంటుందని, నేతల సిఫార్సులను పట్టించుకునేది లేదని పేర్కొన్నారు. సాక్షి,ఆదిలాబాద్: టికెట్ ఆశావహులు బలప్రదర్శనతో వచ్చారు.. నియోజకవర్గంలో తమకున్న పట్టును పరిశీలకుల దృష్టికి తీసుకెళ్లాలని చూశారు.. నేత వెంట వచ్చిన కార్యకర్తల్లోనూ మంచి జోష్.. నాయకుడికి జిందాబాద్ కొట్టాలన్న ఉత్సాహం.. ఇంకేముంది సమావేశంలో నినాదాలే మార్మోగుతాయని అంతా భావించారు. అయితే పరిశీలకులు మాత్రం మెలిక పెట్టారు. నియోజకవర్గ సమీక్షలో అభ్యర్థి ప్రస్తావన చేయద్దన్నారు. అలా చేస్తే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపైనే చర్చించాలని చెప్పారు. దీంతో కాంగ్రెస్ నియోజకవర్గ సమీక్ష సమావేశం తీరుతెన్నే మారిపోయింది. కార్యకర్తలు నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. మరోవైపు టికెట్ ఆశవాహులు తాము చేస్తున్న సేవా కార్యక్రమాలను పరిశీలకుని దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం మీద కాంగ్రెస్ సమీక్ష సమావేశంలో ఇది కొత్తకోణం. వర్గపోరు, గ్రూపు విభేదాలను ముందే ఊహించిన పరిశీలకులు అభ్యర్థి ప్రస్తావన లేకుండా పార్టీ సంస్థాగత నిర్మాణంపైనే దృష్టి అంటూ అటు నియోకవర్గ పరిస్థితిని చూశారు.. కార్యకర్తలు, నేతల సమస్యలు, అభిప్రాయాలను విన్నారు. పరిశీలకులకు ఘన స్వాగతం.. ఏఐసీసీ కార్యదర్శి, ఆదిలాబాద్, పెద్దపెల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాసన్ కృష్ణన్ బుధవారం మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఆయనతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు మహేష్‌కుమార్‌గౌడ్, ప్రేమ్ లత అగర్వాల్, నమిల్ల శ్రీనివాస్, డీసీసీ జిల్లా అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వచ్చారు. ఆదిలాబాద్ శివారులో కాంగ్రెస్ నేతలు పరిశీలకులకు ఘన స్వాగతం పలికారు. బైక్ ర్యాలీ నిర్వహించి సమీక్ష సమావేశం నిర్వహించే పంచవటి హోటల్‌కు మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకున్నారు. గందరగోళం.. జిల్లా కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశమని పేర్కొనడంతో సుమారు 150 మంది వరకు రావచ్చని పార్టీ వర్గాలు అంచనా వేశారు. అయితే ముఖ్యనేతలు పెద్ద ఎత్తున కార్యకర్తలతో తరలిరావడంతో సమావేశం గది పూర్తిగా నిండిపోయింది. మంచిర్యాల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. మొత్తం వారితోనే గది నిండిపోగా, పరిశీలకులతో పాటు మిగతా నియోజకవర్గ నాయకులు అక్కడికి చేరుకునే సరికి గందరగోళ పరిస్థితులు కనిపించాయి. పలువురికి కుర్చీలు కూడా లేకపోవడంతో నిల్చొని ఉన్నారు. మరోపక్క తమ నేతలకు అనుకూలంగా నినాదాలు చేస్తుండడంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. టికెట్ ఆశావహులు బలప్రదర్శన చేయాలనే ప్రయత్నాలు కనిపించాయి. ఈ క్రమంలో పరిశీలకులు శ్రీనివాసన్ కృష్ణన్ జోక్యం చేసుకొని నియోజకవర్గం వారీగా విడివిడిగా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. దీంతో నియోజకవర్గ కార్యకర్తలు మినహా ఇతర నియోజకవర్గ కార్యకర్తలు బయటకు వెళ్లిపోవడంతో సమీక్ష ప్రారంభించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు.. కాంగ్రెస్ పార్టీ నియోకవర్గాల సమీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి వరకు కొనసాగింది. వేదికపై పరిశీలకులు శ్రీనివాసన్ కృష్ణన్, మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రేమ్‌లత అగర్వాల్, నమిల్ల శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఏఐసీసీ సభ్యులు నరేష్‌జాదవ్ కూర్చున్నారు. మొదట సిర్పూర్కాగజ్నగర్ నుంచి సమీక్ష ప్రారంభించారు. ఆతర్వాత చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ముథోల్, ఖానాపూర్, నిర్మల్, బోథ్, ఆదిలాబాద్ నియోజకవర్గాల వారీగా సమీక్ష జరిపారు. ∙ సిర్పూర్కాగజ్నగర్ నుంచి గోసుల శ్రీనివాస్‌యాదవ్, రావి శ్రీనివాస్, సిడాం గణపతి పాల్గొన్నారు. కొంతమంది కార్యకర్తలు నియోజకవర్గానికి ఇన్చార్జీలను ప్రకటించాలని పరిశీలకులను కోరారు. ∙ చెన్నూర్ నుంచి మాజీ ఎమ్మెల్యే సంజీవ్‌రావు, బోడ జనార్దన్, దుర్గం అశోక్, బెల్లంపల్లి నుంచి చిలుమూరి శంకర్, దుర్గాభవానితో పాటు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గాల సమీక్ష సుమారు అరగంట నుంచి 45 నిమిషాల పాటు సాగింది. ∙ మంచిర్యాల నియోజకవర్గం సమీక్ష సమావేశం గంటకు పైగా కొనసాగింది. ఇందులో ప్రేమ్‌సాగర్‌రావు, అరవింద్రెడ్డిలతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధానంగా ముఖ్యనేతలు తాము నియోజకవర్గంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలపై ప్రస్తావించారు. ∙ ఆసిఫాబాద్ సమీక్షలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ముథోల్ సమీక్షలో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ పాల్గొనగా, మరో ముఖ్యనేత రామారావుపటేల్ సమావేశానికి గైర్హాజరయ్యారు. ∙ ఖానాపూర్ నుంచి హరినాయక్, భరత్‌చౌహాన్, నిర్మల్ నుంచి మహేశ్వర్‌రెడ్డి, ఆదిలాబాద్ నుంచి సి.రాంచంద్రారెడ్డి, గండ్రత్ సుజాత, భార్గవ్‌దేశ్‌పాండేలు పాల్గొన్నారు. ∙ రాత్రి వరకు ఈ సమీక్ష కొనసాగింది. మధ్యాహ్నం నుంచి ఆదిలాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు. సోయం బాపూరావు గైర్హాజరు.. ఆదివాసీకే టికెట్ ఇవ్వాలి బోథ్ నియోజకవర్గం నుంచి నరేష్‌జాదవ్, అనిల్‌జాదవ్ పాల్గొనగా సోయంబాపూరావు గైర్హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా ఆదివాసీ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న సోయం బాపూరావు బోథ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా, లేనిపక్షంలో ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేస్తారా అనే మీమాంస పార్టీలో ఉండగా, సమీక్ష సమావేశానికి గైర్హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా సమీక్ష సమావేశానికి గైర్హాజరు వెనుక ఏదైనా అసంతృప్తి ఉందా అన్న చర్చ సాగుతోంది. స్థానికంగానే ఉన్నప్పటికీ ఆయన ఈ సమావేశానికి రాలేదు. అయితే వేదికపై లంబాడా నాయకులు ఉండడంతోనే ఆయన ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్లు కొంతమంది కార్యకర్తలతో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా బోథ్ సమీక్ష సమావేశంలో కొంతమంది కార్యకర్తలు బోథ్ నియోజకవర్గం నుంచి ఆదివాసీకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ ఎంపీ స్థానం నుంచి కూడా ఆదివాసీకే అవకాశం కల్పించాలని కోరినట్లు సమాచారం. -
చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారు
-
వారసుల కోసమే రాజకీయ సన్యాసం
కాంగ్రెస్ పార్టీలో ముందస్తు ఎన్నికలవేడి రాజుకుంటోంది. మంగళవారం కరీంనగర్లో నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసికట్టుగా పనిచేస్తా మని.. కొంతమంది నాకే టికెట్ వస్తుందంటూ, అధిష్టానం సమ్మతించిందంటూ గందరగోళం సృష్టిస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. – సాక్షిప్రతినిధి, కరీంనగర్ సాక్షిప్రతినిధి, కరీంనగర్: ‘పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం.. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా పార్టీని, కార్యకర్తలను కాపాడుకుంటున్నాం.. కాంగ్రెస్‌కు మంచి రోజులు వస్తున్నాయని తెలిసి వలస నేతలు హల్చల్ చేస్తున్నారు.. సీనియర్ల ముందు వారి పెత్తనం ఏందీ.. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేస్తాం.. కానీ కొంతమంది నాకే టికెట్ వస్తుందంటూ, అధిష్టానం సమ్మతించిందంటూ లేనిపోని గందరగోళం సృష్టిస్తున్నారు.. కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.. ఈ పద్ధతికి స్వస్తి పలకాలి’ అంటూ హుజూ రాబాద్, వేములవాడ, పెద్దపల్లి నియోజకవర్గాలకు చెందిన సీనియర్ నేతలు ఏఐసీసీ పరిశీలకుని ఎదుటే వాగ్వాదానికి దిగారు. దీంతో సమావేశం వాడివేడిగా సాగింది. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేయడంతో రచ్చరచ్చగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికలు దగ్గరపడుతున్నాయనే ఉద్దేశంతో అప్పుడే హడావిడి మొదలైంది. టికెట్లు దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ప్రత్యర్థులపై మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. బలాలు, బలహీనతలను బేరీజు వేస్తూ తమకే టికెట్ ఇవ్వాలంటూ ఏఐసీసీ పరిశీలకుడు శ్రీనివాసన్‌కృష్ణన్ ఎదుటే బలప్రదర్శనకు దిగడం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. వాగ్వాదాలు, అలకలు, బుజ్జగింపులతో మంగళవారం కరీంనగర్ జిల్లా డీసీసీ కార్యాలయంలో జరిగిన ఉమ్మడిజిల్లా నియోజకవర్గ ఇన్చార్జీలు, మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్యకార్యకర్తల సమావేశం వాడివేడిగా సాగింది. హుజూరాబాద్ నేతలు బాహాబాహీకి దిగారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన కొందరు అధికార పార్టీకి కోవర్టుగా మారారంటూ సీనియర్ నేతలు తుమ్మేటి సమ్మిరెడ్డి, ప్యాట రమేశ్, పాడి కౌశిక్‌రెడ్డి, స్వర్గం రవి ఆరోపించారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ లేకపోతే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని తేల్చిచెప్పారు. ‘పాడి కౌశిక్‌రెడ్డి తనకు టికెట్ ఖరారైంది.. పీసీసీ అద్యక్షుడు తనకు సమీప బంధువేనని ప్రచారం చేసుకుంటున్నారని’ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. దీంతో ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగారు. హుజూరాబాద్ పరిస్థితిపై పది రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ పరిశీలకుడు సూచించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మ మహేశ్‌గౌడ్‌ను కోఆర్డినేటర్‌గా నియమించారు. నివేదిక ఆధారంగా ఎన్నికలకు రెండు నెలల ముందే హుజూరాబాద్ టికెట్‌ను ప్రకటిస్తామని పరిశీలకుడు స్పష్టం చేశారు. దీంతో అప్పటి వరకు ఉన్న ఉద్రిక్తత చల్లబడింది. ఆశావాహుల్లో టికెట్ల సందడి.. సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్నాయనే సంకేతాలు వెలువడుతుండడంతో ఆయా నియోజకవర్గాల్లోని ఆశావాహుల్లో టికెట్ల సందడి నెలకొంది. మంథనిలో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జగిత్యాలలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మానకొండూర్‌లో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ధర్మపురిలో జెడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు ఇబ్బందులు లేకపోవడంతో ఆయా నియోజవర్గాల సమావేశాలు సాదాసీదాగా నడిచాయి. హుస్నాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యేలు అల్గిరెడ్డి ప్రవీణ్‌కుమార్, బొమ్మ వెంకటేశ్వర్లు, కోరుట్ల నుంచి కొమొరెడ్డి రాములు, డాక్టర్ వెంకట్ సమావేశానికి హాజరయ్యారు. రామగుండం గందరగోళంగా ఉందని అక్కడి నేతలు తెలిపారు. అయితే.. టికెట్లు ఆశించేవారు ఓపికగా ఉండాలని పరిశీలకుడు స్పష్టం చేశారు. శ్రీధర్‌బాబు ఇంట్లో సమావేశం.. ఏఐసీసీ పరిశీలకుడు శ్రీనివాసన్‌కృష్ణన్‌ను కలవడానికి ముందే మాజీ మంత్రి శ్రీధర్‌బాబు ఇంట్లో పెద్దపల్లి జిల్లాకు చెందిన మంథని, రామగుండం, పెద్దపల్లి నియోజవర్గాలకు చెందిన ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడినట్లు తెలిసింది. అయితే పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో ఆశావహులు ఎక్కువగా ఉండడంతో అక్కడి పరిస్థితిపై చర్చించారు. అనంతరం డీసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. పరిశీలకుని వద్దకు ఏ నియోజకవర్గం నుంచి ఎవరు.. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కటకం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టిక్కెట్లు ఆశిస్తున్న నేతలుగా 13 నియోజకవర్గాల నుంచి ఆశావహులు హాజరయ్యారు. జగిత్యాల, మంథని నియోజకవర్గాల నుంచి సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. హుజూరాబాద్ నుంచి తుమ్మేటి సమ్మిరెడ్డి, ప్యాట రమేశ్, పాడికౌశిక్‌రెడ్డి, పారిపాటి రవీందర్‌రెడ్డి, స్వర్గం రవిలు, వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్, ఏనుగు మనోహర్‌రెడ్డి, కొణగాల మహేశ్ హాజరయ్యారు. చొప్పదండి సుద్దాల దేవయ్య, గజ్జెల కాంతం, మేడిపల్లి సత్యం, బండ శంకర్, నాగి శేఖర్, పెద్దపల్లి నుంచి గీట్ల సబితారెడ్డి, ఈర్ల కొమురయ్య, గొట్టెముక్కుల సురేష్‌రెడ్డి, చేతి ధర్మయ్య, సీహెచ్ విజయరమణారావు ఏఐసీసీ పరిశీలకులు శ్రీనివాసన్ కృష్ణన్‌తో భేటీ అయ్యారు. అలాగే హుస్నాబాద్ నుంచి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, బొమ్మ వెంకన్న, కరీంనగర్ నుంచి చల్మెడ లక్ష్మినర్సింహారావు, రేగులపాటి రమ్యరావు తదితరులు, కోరుట్ల నుంచి కొమిరెడ్డి రాములు, జీఎన్ వెంకట్, మానకొండూర్ నుంచి ఆరెపల్లి మోహన్, కవ్వంపల్లి సత్యనారాయణ, ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మద్దెల రవీందర్ పాల్గొన్నారు. రామగుండం నుంచి రాజ్‌ఠాగూర్ మక్కాన్‌సింగ్, జనక్‌ప్రసాద్ టిక్కెట్లు ఆశిస్తుండగా, సిరిసిల్ల నుంచి కె.కె మహేందర్‌రెడ్డి, చీటి ఉమేష్‌రావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జీలు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్, గడుగు గంగాధర్, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేములవాడ, పెద్దపల్లిలోనూ అదే పరిస్థితి.. కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు వస్తున్నాయంటూ వేములవాడ, పెద్దపల్లి, చొప్పదండి నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోందని, ఎన్నికలు రాకముందే టికెట్లు ఎలా కేటాయించారో స్పష్టం చేయాలని ఆది శ్రీనివాస్, విజయరమణారావు, కవ్వంపెల్లి సత్యంను ఉద్దేశించి సీనియర్ నేతలు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. వలస నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. కమిటీలు, ఇన్చార్జీలను నియమించే విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న లుకలుకలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఆయా నియోజకవర్గాలకు చెందిన ఏనుగు మనోహర్‌రెడ్డి, చేతి ధర్మయ్య, గీట్ల సబితారెడ్డి, సురేష్‌రెడ్డి, ఈర్ల కొమురయ్య, సుద్దాల దేవయ్య వలస నేతల పెత్తనంపై ధ్వజమెత్తారు. అయితే.. పనితీరును పరిశీలించాకే టికెట్లు ఇవ్వడం జరుగుతుందని పరిశీలకుడు తెలపడంతో సద్దుమణిగింది. -
అప్పుడు జమిలికి సై...ఇప్పుడు జమిలికి నై
-
జమిలి ఎన్నికలకు వైఎస్సార్ సీపీ మద్దతు
-
జమిలి ఎన్నికలపైనా చంద్రబాబు యూటర్న్
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకమంటూ లా కమిషన్‌కు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లేఖ మరోసారి ఆ పార్టీ నైజాన్ని తేటతెల్లం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అక్టోబర్ 5, 2017న ఒక జాతీయ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఇంటర్వ్యూలో తాను మొదటి నుంచి జమిలి ఎన్నికలనే కోరుకుంటున్నానని చెప్పిన చంద్రబాబు మాటలకు, తాజాగా జూలై 8న ఆ పార్టీ ఎంపీలు తోట నరసింహం, కనకమేడల రవీంద్రకుమార్ లా కమిషన్‌కు ఇచ్చిన లేఖ విరుద్ధంగా ఉండడం గమనార్హం. దీంతో సోషల్ మీడియా చంద్రబాబు యూటర్న్‌ను ఎండగడుతోంది. ఆ ఇంటర్వ్యూలో కేంద్ర ప్రభుత్వం 2018, సెప్టెంబర్ తర్వాత దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ఉందని, ఎన్డీయే భాగస్వామిగా మీ వైఖరి ఏంటని అడిగిన ప్రశ్నకు చంద్రబాబు ఇలా సమాధానం ఇచ్చారు.. ‘మొదటి నుంచి నేను ఒకేసారి ఎన్నికలు జరగడాన్నే కోరుకున్నాను. లోక్‌సభకు, అసెంబ్లీకి, స్థానిక సంస్థలకు కూడా ఒకేసారి ఎన్నికలు జరగాలి. ఆరు నెలల్లోపు, లేదా గరిష్టంగా 9 నెలల్లోపు ఈ ప్రక్రియ ముగియాలి. మిగిలిన సమయంలో పాలనపై దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఎన్నికల వ్యయం, అవినీతిని తగ్గించడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారా? అనే మరో ప్రశ్నకు జవాబుగా ‘మనం సమయం ఆదా చేయొచ్చు..అవినీతిని అరికట్టవచ్చు’ అని పేర్కొన్నారు. తాజాగా దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై లా కమిషన్ అన్ని పార్టీల అభిప్రాయాలు సేకరిస్తోంది. టీడీపీ కూడా లా కమిషన్‌కు తన అభిప్రాయాన్ని ఈ నెల 8న తెలిపింది. టీడీపీ ఎంపీలు లా కమిషన్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలను అస్థిరపరిచేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అందులో భాగమే జమిలి ఎన్నికల ఎత్తుగడ అని ఆరోపించారు. జమిలి ఎన్నికల యోచనను తాము వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణ ఖర్చు చూపి జమిలి ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. గత అక్టోబర్‌లో ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఒకరకంగా, ఇప్పుడు యూటర్న్ తీసుకుని మరో రకంగా టీడీపీ తన అభిప్రాయాలు వ్యక్తం చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ముందస్తు ఎన్నికలకు ఆ పార్టీ భయపడుతోందని నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనను నేను స్వాగతిస్తున్నాను. మూడు నెలలకు, ఆరు నెలలకు ఎన్నికలు ఏమిటి? ‘ఒక దేశం– ఒక ఎన్నిక ’ అంటూ ప్రధాని మోదీ చేసిన ప్రతిపాదనను నేను బలపరుస్తున్నాను. – 2017, ఏప్రిల్ 27న సచివాలయంలో మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నేను మొదటి నుంచి కోరుకుంటున్నాను. ఒకేసారి అన్ని ఎన్నికలు అయిపోతే మిగిలిన సమయమంతా ప్రభుత్వ విధానాల రూపకల్పన, వాటి అమలుపై పూర్తిగా దృష్టి సారించడానికి అవకాశం ఉంటుంది. అభివృద్ధికి ఇది మంచిది. – 2017 అక్టోబర్ 5న ఒక ఆంగ్ల టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు పార్లమెంటుకు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కుదరదు. రాష్ట్రాల అసెంబ్లీ కాలపరిమితి ముగియకముందే పార్లమెంటుతోపాటు శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహించాలనడం రాజ్యాంగ విరుద్ధం. దీనికి టీడీపీ వ్యతిరేకం. – చంద్రబాబు ఆదేశాలపై లా కమిషన్‌కు టీడీపీ ఎంపీలు ఇచ్చిన లేఖ సారాంశం -
జమిలి ఎన్నికలకు సిద్ధమే
సాక్షి, న్యూఢిల్లీ: దేశ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా లోక్‌సభ, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదనకు తాము మద్దతు ఇస్తున్నట్టు వైఎస్సార్ సీపీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మంగళవారం ఢిల్లీలో లా కమిషన్ చైర్మన్ జస్టిస్ బీఎస్ చౌహాన్‌ను కలసి జమిలి ఎన్నికలపై వైఎస్సార్ సీపీ అభిప్రాయాన్ని తెలియచేస్తూ 10 పేజీల లేఖను అందజేశారు. 1951 నుంచి 1967 వరకు దేశంలో జమిలి ఎన్నికలు జరిగాయని, మధ్యలో కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల అది కుదరలేదని అందులో పేర్కొన్నారు. జమిలి ఎన్నికలపై మళ్లీ ఇప్పుడు లా కమిషన్ అన్ని వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ ప్రారంభించడాన్ని వైఎస్సార్ సీపీ అభినందించింది. తరచూ ఎన్నికలతో అభివృద్ధికి ఆటంకాలు 2014లో సాధారణ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలతో పాటు జరగగా అనంతరం ఇప్పటి వరకు నాలుగేళ్లలో 15 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయన్నారు. ఇలా ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగడం వల్ల దేశాభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందని వైఎస్సార్ సీపీ పేర్కొంది. ఎన్నికల కోడ్ వల్ల సంక్షేమ పథకాల అమలుకు ఆటంకం కలగడంతోపాటు అధికార యంత్రాంగం అంతా పాలనాపరమైన అంశాలను పక్కనపెట్టి ఎన్నికల పనుల్లో నిమగ్నమవుతోందని, దీనివల్ల ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయలేకపోతున్నాయని పార్టీ వివరించింది. లోక్‌సభ, అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికల నిర్వహణ వల్ల వ్యయం భారీగా పెరుగుతోందని తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘానికి 2009 ఎన్నికల నిర్వహణకు రూ. 1,100 కోట్లు, 2014 ఎన్నికలకు రూ. 4 వేల కోట్లు ఖర్చు కాగా ఇక 2019 ఎన్నికలకు ఎంత ఖర్చు అవుతుందో ఊహించుకోవచ్చని లేఖలో పేర్కొంది. ఓటుకు కోట్లు కేసులు తగ్గుతాయి.. జమిలి ఎన్నికల వల్ల ఖర్చులు తగ్గిపోవడమే కాకుండా అవినీతి తగ్గుతుందని, ఓటుకు కోట్లు లాంటి కేసులు తగ్గిపోతాయని, సమాజాన్ని విడగొట్టే కుల సమీకరణాలు తగ్గిపోతాయని, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కీలక నేతల ఏటా ఎన్నికల ప్రచారాలకు రాష్ట్రాల్లో తిరగాల్సిన అవసరం లేకుండా అభివృద్ధి పనులపై దృష్టి పెట్టవచ్చని వైఎస్సార్ సీపీ లేఖలో పేర్కొంది. 1999లోనే జస్టిస్ జీవన్‌రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ తన 170వ రిపోర్టులో దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సిఫార్సు చేసిందని గుర్తు చేసింది. 2015లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చిందని పేర్కొంది. ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలి.. మరోవైపు జమిలి ఎన్నికల వల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయని వైఎస్సార్ సీపీ తెలిపింది. దీనివల్ల రాష్ట్రాల ఎన్నికలు, ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ఎన్నికల కమిషన్‌కు ఎన్నికల నిర్వహణ వ్యయం తగ్గినా రాజకీయ పార్టీల ఖర్చులు తగ్గుతాయన్న దానిపై హామీ లేదని, పార్టీలు ఒకేసారి మొత్తం నిధులు ఖర్చు పెట్టే అవకాశం ఉందని తెలిపింది. జమిలి విధానంలో ఐదేళ్లకు ఒకసారే ఎన్నికలు జరగడం వల్ల ప్రభుత్వాల పనితీరుపై ప్రజలు మధ్యలో తీర్పు చెప్పే అవకాశం తగ్గిపోతుందని పేర్కొంది. ఆర్టికల్ 83(2), 172 ప్రకారం ఏదైనా ప్రభుత్వానికి ఐదేళ్లు పాలించే అధికారం ఉంటుందని, కానీ జమిలి ఎన్నికల వల్ల ఆ విధానాన్ని విస్మరించే అవకాశం ఉందని, ఇంకా కాలపరిమితి ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను జమిలి ఎన్నికలకు ఎలా ఒప్పిస్తారు? జమిలి ఎన్నికల తరువాత ఒకవేళ అవిశ్వాసం వల్ల ఏదైనా ప్రభుత్వం రద్దై ఇతర పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేకపోతే రాజకీయ అనిశ్చితి తలెత్తకుండా ఎలాంటి ప్రత్యామ్నాయాలు తీసుకుంటారని ప్రశ్నించింది. ఈ విషయాల్లో రాజ్యాంగ సవరణ అవసరమని, అది అంత సులువైనది కాదని పేర్కొంది. దీనిపై లా కమిషన్ అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల వల్ల తలెత్తే సమస్యలన్నింటిని పరిష్కరించి ఈ విషయంలో ముందుకెళ్లాలని, లేకుంటే ప్రతికూల ఫలితాలు తప్పవని పేర్కొంది. ఏదైనా కారణాల వల్ల కేంద్రం, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రద్దు అయితే అప్పుడు పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా.. రాజ్యసభకు ఎలాగైతే ఆరేళ్ల కాలపరిమితితో మధ్యలో ఖాళీ అయితే మిగిలిన సమయానికి మాత్రమే ఏ రకంగా ఎన్నిక జరుగుతుందో అలాగే ఎన్నికలు జరిగేలా సిఫార్సు చేస్తామని లా కమిషన్ చెప్పినట్టు ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాకు తెలిపారు. 30 రోజుల్లో చర్యలు తీసుకోవాలి ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇతర పార్టీల్లోకి ఫిరాయించే సభ్యులపై 30 రోజుల్లోగా వారి సభ్యత్వాలు రద్దయ్యేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ కోరింది. ఈ అధికారాన్ని స్పీకర్లకు కాకుండా ఎన్నికల కమిషన్‌కే అప్పగించాలని సిఫార్సు చేసింది. ప్రస్తుతం అధికారాలు స్పీకర్ల వద్ద ఉండటంతో అధికార పార్టీల వల్ల అవి దుర్వినియోగం అవుతున్నాయని పేర్కొంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యాంగంలో ఈ సవరణలు అత్యవసరం అని వైఎస్సార్ సీపీ అభిప్రాయపడింది. -
జమిలి ఎన్నికలకు మద్దతు తెలిపిన వైఎస్ఆర్సీపీ
-
జమిలీ ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు
-
జమిలి ఎన్నికలకు టీఆర్ఎస్ మద్ధతు
-
ఏకకాల ఎన్నికలపై పార్టీల భిన్నాభిప్రాయాలు
-
జమిలికి టీఆర్‘ఎస్’
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని టీఆర్ఎస్ స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ అభిప్రాయాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు న్యాయ శాఖ కమిషన్ చైర్మన్ బీఎస్ చౌహాన్‌కు లేఖ రాశారు. ఎంపీ వినోద్‌కుమార్ ఆదివారం ఢిల్లీలో లా కమిషన్ సమావేశానికి హాజరై సీఎం రాసిన లేఖను ఆయనకు అందజేశారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు విడిగా ఎన్నికలు నిర్వహించడం వల్ల అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఆటంకం ఏర్పడుతుందని ఆ లేఖలో సీఎం పేర్కొన్నారు. లోక్‌సభ, అసెంబ్లీలకు విడిగా ఎన్నికల వల్ల ప్రతిసారీ 4 నుంచి 6 నెలల పాటు అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల పనుల్లో గడపాల్సి వస్తోందని, దీనివల్ల రాష్ట్రాల్లో ప్రజాధనం వృథా అవుతోందని వివరించారు. అంతేకాకుండా ఐదేళ్ల కాలంలో రాజకీయ పార్టీలు, అభ్య ర్థులు రెండుసార్లు ఎన్నికల వ్యయాన్ని భరించాల్సి వస్తోందన్నారు. అధికార యంత్రాంగం మొత్తం ఏడాది కాలంపాటు ఎన్నికల నిర్వహణ పనుల్లో నిమగ్నమవుతోందని, ఎన్నికల కోడ్ వల్ల ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని వివరించారు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దేశంలో లోక్‌సభ, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడమే ఉత్తమ మార్గం అని లేఖలో సీఎం వివరించారు. లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై అధ్యయనంలో భాగంగా లా కమిషన్ అన్ని రాజకీయ పక్షాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనే న్యాయశాఖ నివేదిక ఇచ్చింది: వినోద్ దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్నది ప్రధాని మోదీ, నీతి ఆయోగ్‌ల అజెండా కాదని, 1983లోనే దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్ నివేదిక ఇచ్చినట్లు సమావేశం అనంతరం ఎంపీ వినోద్‌కుమార్ మీడియాకు వివరించారు. ‘‘కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడ్డాక మళ్లీ లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవ్వాల్సిన పరిస్థితి. లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా కేంద్రంలోని ప్రభుత్వాలు మళ్లీ ఏటా ఇతర రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఎంతో సమయం, ప్రజాధనం వృథా అవుతోంది. దీన్ని అరికట్టేందుకు దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలి. ఇందుకు టీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది’’అని వినోద్ పేర్కొన్నారు. -
జమిలి ఎన్నికలకు టీడీపీ నో
-
జమిలి ఎన్నికలకే టీఆర్ఎస్ మొగ్గు
-
జమిలీ ఎన్నికలపై పార్టీలు భిన్నాభిప్రాయాలు
-
జమిలి ఎన్నికలపై లా కమిషన్ సంప్రదింపులు
-
జమిలి ఎన్నికలపై పావులు కదుపుతున్న ఎన్డీఏ
సాక్షి, న్యూఢిల్లీ : జమిలి ఎన్నికలపై ఎన్డీఏ ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం దేశంలోని 7 జాతీయ పార్టీలు, 59 ప్రాంతీయ పార్టీలతో ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించడానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల నిర్వహణ, అనుమానాలు, సలహాలు, సూచనలు, అభిప్రాయాలను తెలుసుకొనేందుకు లా కమీషన్ రాజకీయ పార్టీలతో చర్చించనుంది. అయితే జమిలి ఎన్నికల ప్రతిపాదనను ఇతర ప్రధాన విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. లా కమీషన్‌తో సమావేశానికి తాము హాజరు కాలేమంటూ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, సీపీఐలతో పాటు ఇతర పార్టీలు స్పష్టం చేశాయి. అయితే ప్రతికపక్షాలకు సర్ధిచెప్పి ఒప్పించేందుకు మోదీతో పాటు ఇతర ఎన్డీఏ నేతలు తీవ్ర కసరత్తలు చేస్తున్నారు. జమిలి ఎన్నికలతో వనరులు, సమయం ఆదా అవుతాయని, అభివృద్ధి వేగ వంతం అవుతందని ప్రధాని సూచించినట్లు తెలిసింది. 10న అభిప్రాయం చెప్పనున్న వైఎస్సార్సీపీ : దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరపడంపై తమ అభిప్రాయం చెప్ప వలసిందిగా లా కమీషన్ ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీని ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 10న వైఎస్సార్సీపీ లా కమీషన్ ఎదట తన అభిప్రాయాన్ని చెప్పనుంది. -
ఈసీ సూచనల్లో సమగ్రత ఏదీ?
ఎన్నికలకు విశ్వసనీయత కల్పించడం, రాజకీయ పక్షాలు వెలువరించే ఎన్నికల ప్రణాళికలు ఆచరణయోగ్యమైనవిగా లేనప్పుడు లేదా అధికారంలోకొచ్చాక ఆ ప్రణాళికలను బేఖాతరు చేసిన ప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టడం వంటి అంశాలపై కాక ఇప్పుడు జమిలి ఎన్నికలపైనే ప్రధానంగా చర్చ నడుస్తోంది. పార్లమెంటుకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వ హించడంలోని మంచిచెడ్డల సంగతలా ఉంచి తాజాగా ఎన్నికల సంఘం చేసిన ప్రతిపాదన సహజంగానే అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది. ఒక ఏడాది రద్దయ్యే అసెంబ్లీలన్నిటికీ ఒకేసారి ఎన్నికలు జరపడం ఆ ప్రతిపాదన సారాంశం. ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకొచ్చాక జమిలి ఎన్నికలపై అడపా దడపా చర్చ సాగుతూనే ఉంది. 1999లో వాజపేయి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న ప్పుడు లా కమిషన్ సమర్పించిన 170వ నివేదిక ఈ జమిలి ఎన్నికల గురించి మొదటగా ప్రస్తా వించింది. ఆ తర్వాత బీజేపీయే తరచు దీన్ని గురించి మాట్లాడింది. 2016లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒకేసారి ఎన్నికలపై రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి రావాలని కోరారు. ఆయన స్థానంలో వచ్చిన రాంనాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి చేసిన తొలి ప్రసంగంలో సైతం ఈ ప్రతిపాదన గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఇప్పుడు ఎన్నికల సంఘం(ఈసీ) చేసిన ప్రతిపాదన జమిలి ఎన్నికల ఆలోచనకు భిన్నమైనది. జమిలి ఎన్నికల ఉద్దేశం ‘ఒకే దేశం–ఒకేసారి ఎన్నికలు’ అయితే...ఈసీ చెబుతున్నది ‘ఒక ఏడాది– ఒకేసారి ఎన్నికలు’. అలాగని ఈసీ జమిలి ఎన్నికలకు వ్యతిరేకి కాదు. అది జరగాలంటే రాజ్యాం గంలోని వివిధ అధికరణలకు సవరణలు తీసుకురావడం పెద్ద పని గనుక తన ప్రతిపాదనను పరిశీలించాలని అది కోరుతోంది. నిజమే... జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగంలోని అధికరణలు– 83(పార్లమెంటు ఉభయ సభల పదవీకాలం), 85(లోక్‌సభ రద్దు), 172(రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం), 174(అసెంబ్లీల రద్దు), 356(రాష్ట్రపతి పాలన విధింపు)–వగైరాలను సవరించాల్సి ఉంటుంది. ఈసీ ప్రతిపాదనకైతే ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని 15వ సెక్షన్ సవరిస్తే సరి పోతుంది. ఆ సెక్షన్ ప్రకారం పదవీకాలం పూర్తవుతున్న అసెంబ్లీకి వ్యవధి ఆరు నెలలకు మించి ఉండగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయకూడదు. నిరుడు ఏడు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగ్గా అందులో అయిదు రాష్ట్రాలు–పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలకు ఒకసారి... గుజ రాత్, హిమాచల్‌ప్రదేశ్‌లకు మరోసారి రెండు దఫాలుగా ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఒక ఏడాదిలో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలన్నిటినీ ఒకేసారి జరపాలన్న ఈసీ తాజా ప్రతిపాదన సాకారం కావడానికి అడ్డంకులు పెద్దగా ఉండవు. అలాగే రెండు, మూడు నెలలు తప్ప ఎవరూ పెద్దగా నష్టపోయేది ఉండదు. అయితే జమిలి ఎన్నికల్లాగే దీనికి కూడా ఆచరణలో బోలెడు సమస్యలు ఎదురవుతాయి. ఒకేసారి ఎన్నికలు జరిగిన రాష్ట్రాలన్నిటా పాలకపార్టీలు ఒకే రకంగా నికరమైన మెజారిటీ తెచ్చుకోలేకపోవచ్చు. ఉదాహరణకు మొన్న జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ తగిన మెజారిటీ లేక చతికిలబడింది. దాని స్థానంలో వచ్చిన జేడీ(ఎస్)– కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఎన్నాళ్లు అధికారంలో నెట్టుకురాగలదో తెలియదు. ఆ రెండు పార్టీల మధ్యా అనేక అంశాల్లో భిన్నాభిప్రాయాలున్నందువల్ల అదెప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ఎవరూ సుస్థిర ప్రభుత్వాన్ని అందించే అవకాశం లేదని తేలినప్పుడు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకెళ్లడం మినహా మరో మార్గం ఉండదు. అలాంటి సందర్భాలు అరుదుగా తప్ప రావని అనుకోవడానికి లేదు. పైగా పటిష్టమైన మెజారిటీ ఉన్న ప్రభుత్వాలు సైతం కుప్పకూలిన ఉదం తాలు మన దేశంలో లేకపోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1994లో అఖండ మెజారిటీ సాధించి అధికారంలోకొచ్చిన ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని ఆయన కేబినెట్లో మంత్రిగా పనిచేసిన ఆయన అల్లుడు చంద్రబాబే కుప్పకూల్చారు. దీనికి విరుగుడుగా ఎన్టీఆర్ అసెంబ్లీ రద్దుకు విఫలయత్నం చేశారు. ఆయన అభీష్టం నెరవేరితే వెనువెంటనే మళ్లీ ఎన్నికలు వచ్చి ఉండేవి. అన్ని పార్టీల తీరుతెన్నులూ ఒకేవిధంగా ఉంటున్నాయన్న అభిప్రాయం ఓటర్లలో ఏర్పడి, అది నిర్లిప్తతకు దారితీసినప్పుడు సహజంగానే ఎన్నికల ఫలితాలు అనిశ్చితిని తీసుకొస్తాయి. అలాగే అధికార పక్షాలు ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్న వైనం కూడా ప్రజల్లో ఏవగింపు కలిగిస్తోంది. ఈ విషయంలో ఫిరాయింపుల వల్ల నష్టపోయే పార్టీ తప్ప మరెవరూ మాట్లాడరు. స్పీకర్లు కళ్లు మూసుకుంటారు. రాష్ట్రపతి, ప్రధాని మొదలుకొని గవర్నర్ వరకూ ఎవరూ అది తప్పని చెప్పరు. న్యాయస్థానాలు సైతం ఏళ్ల తరబడి నాన్చడం తప్ప త్వరగా తేల్చవు. అలాగే డబ్బులిచ్చి ఓట్లు కొనడం, ఇతరత్రా ప్రలోభపరచడం వంటి పనులు రాను రాను పెరుగుతున్నాయి. ఇలాంటి పరిణామలు ప్రజల్లో నైరాశ్యాన్ని మరింత పెంచుతున్నాయి. వీటిని పోగొట్టడానికి ఏం చేయాలన్న అంశంపై దృష్టి పెడితే...పరిష్కారాన్ని అన్వేషిస్తే ఎన్నికలకు విశ్వసనీయత కలుగుతుంది. హంగ్ అసెంబ్లీల బెడద తప్పుతుంది. అప్పుడు జమిలి ఎన్నికల విధానమైనా, మరొక విధానమైనా సత్ఫలితాలనిస్తుంది. ఒకేసారి ఎన్నికల గురించి మాత్రమే ఆలోచించి, ఇలాంటి సమస్యలను విస్మరించడం వల్ల అనుకున్న ప్రయోజనాన్ని సాధించడం సాధ్యం కాదు. తాము రూపొందించే ఎన్నికల ప్రణాళికల గురించి, వాటిల్లో చేసే వాగ్దానాల గురించి నిబంధనలు పెట్టాలని పార్టీలు ఎటూ కోరవు. కనీసం ఈసీ అయినా ఆ దిశగా ఆలోచించాలి. లా కమిషన్‌కు అది చేసిన సూచనలు ఇలాంటి అంశాలన్నిటితో మరింత సమగ్రంగా ఉంటే బాగుండేది. -
ఒక ఏడాదిలోని ఎన్నికలు ఒకేసారి!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికలు (జమిలి) జరగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలు వర్గాలు కోరుకుంటున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే ఐదు రాజ్యాంగ సవరణలు తీసుకరావాలని, వాటితోపాటు సామాజిక, ఆర్థిక అంశాలకు చెందిన మరో 15 ప్రశ్నలపై తమ అభిప్రాయాలేమిటని ఎన్నికల కమిషన్‌ను లా కమిషన్ ఇటీవల ఓ నివేదికలో కోరింది. పాతికేళ్ల క్రితం దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం మంచిదని సిఫార్సు చేసిన లా కమిషన్ ఇప్పుడు తాజాగా అదే అంశంపై ఎన్నికల కమిషన్ అభిప్రాయలను కోరింది. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడానికి బదులుగా ఓ సంవత్సరంలో జరగాల్సిన ఎన్నికలన్నింటిని కలిపి ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించడం సముచితమని, అందుకు రాజ్యాంగ సవరణలు కూడా అనవసరమని భావించినట్లు పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం దేశంలోని రాష్ట్ర అసెంబ్లీలకు ఎప్పుడు గడువు ముగిసి పోతే అప్పుడే ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తోంది. అందుకు కారణం అసెంబ్లీ గడువు ముగిసిపోవడానికి ఆరు నెలల ముందు ఎన్నికలు ప్రకటించరాదని ‘ప్రజా ప్రాతినిథ్యం చట్టం–1951’లోని 15వ సెక్షన్ తెలియజేస్తోంది. అందుకనే 2017లో పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించగా, ఓ ఏడాదిలో పలు రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్నా, అదే సమయంలో లోక్‌సభ ఎన్నికలను నిర్వహించాలన్నా ఆర్నెళ్లకు ముందుగా ఎన్నికలు నిర్వహించరాదన్న ప్రజాప్రాతినిథ్య చట్టంలోని నిబంధనను కనీసం తొమ్మిది నెలలకు మార్చాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ వర్గాలు భావించాయి.