
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల యోచనను కాంగ్రెస్ గట్టిగా వ్యతిరేకించింది. ఈ విధానం సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి విరుద్ధమని పేర్కొంది. ఒకే దేశం–ఒకే ఎన్నికల ఆలోచనను పూర్తిగా పక్కనబెట్టాలని, దీనిపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో ఏర్పాటైన కమిటీని రద్దు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు.
కమిటీ కార్యదర్శి నితేన్ చంద్రకు ఈ మేరకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. ఒకే విడతలో ఎన్నికల కోసం సగం పదవీ కాలం కూడా పూర్తవని అసెంబ్లీలను రద్దు చేస్తే ఓటర్ల హక్కులను కాలరాయడమేనన్నారు.