Unconstitutional
-
బలవంతపు ‘కుటుంబ నియంత్రణ’ బాధితులకు పరిహారం
జపాన్ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. దేశంలో ‘యూజెనిక్స్ ప్రొటెక్షన్ లా’ కింద బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. శారీరక వికలాంగులు పిల్లలను కనకుండా నిరోధించడానికి ప్రభుత్వం గతంలో ఈ చట్టం చేసింది. 1950- 1970 మధ్యకాలంలో పుట్టే పిల్లల్లో శారీరక లోపాలను నివారించడానికి ఈ చట్టం చేశారు. ఈ చట్టం కింద దేశంలోని సుమారు 25 వేల మందికి వారి అనుమతి లేకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు.‘యూజెనిక్స్ ప్రొటెక్షన్ లా’ను యుద్ధానంతర కాలంలో జరిగిన అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘనగా జపాన్ న్యాయవాదులు అభివర్ణించారు. ఈ నేపధ్యంలో 1948 నాటి ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. జపాన్‌లోని ఐదు దిగువ న్యాయస్థానాల నుంచి ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. న్యాయవాదుల వాదనలు విన్న సుప్రీం కోర్టు ఈ చట్టాన్ని రద్దు చేస్తూ, ‘కుటుంబ నియంత్రణ’ బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.తీర్పు అనంతరం కోర్టు బయట బాధితులు సుప్రీకోర్టు న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. టోక్యోలోని 81 ఏళ్ల వాది సబురో కితా మీడియాతో మాట్లాడుతూ ‘ఇప్పుడు నేను నా ఆనందాన్ని వ్యక్తపరచలేకపోతున్నాను. 1957లో 14 ఏళ్ల వయసులో ఉన్నప్పడు బలవంతంగా నాకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. అనాథాశ్రమంలో ఉన్నప్పుడు ఇది జరిగింది. ఈ విషయాన్ని నా భర్య చనిపోయే ముందు ఆమెకు తెలిపాను. తన వల్లే పిల్లలు పుట్టలేదని భార్య ముందు పశ్చాత్తాప పడ్డాను’ అని తెలిపారు. కాగా జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా బాధితులకు క్షమాపణలు తెలిపారు. బాధితులకు పరిహారాన్ని అందించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
Supreme Court of India: ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ లోక్‌సభ ఎన్నికల వేళ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగం కలి్పంచిన భావప్రకటన స్వేచ్ఛకు, సమాచార హక్కుకు విఘాతం కలిగిస్తోందంటూ కుండబద్దలు కొట్టింది. 2018లో నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. పారదర్శకత, నల్లధనం కట్టడి కోసమే పథకం తెచ్చామన్న కేంద్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. ఈ పథకం కింద ఇప్పటిదాకా కొనుగోలు చేసిన బాండ్ల మొత్తం, కొనుగోలుదారులు, స్వీకర్తల పేర్లు తదితరాల వివరాలన్నింటినీ వెల్లడించాల్సిందేనని ఆదేశించింది. సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ‘‘ఓటేసేందుకు పౌరులకు ఉన్న స్వేచ్ఛపై ఎలాంటి అవాంఛిత ఒత్తిళ్లూ ఉండరాదు. ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది చాలా ముఖ్యమైన విషయం. అంతేగాక ఎన్నికల ప్రక్రియలో విశ్వసనీయత ప్రభుత్వాల ప్రజాస్వామిక స్ఫూర్తికి అత్యంత కీలకం. అందుకే రాజ్యాంగం కూడా స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియకు ఎంతో ప్రాధాన్యమిచి్చంది. కార్పొరేట్ల నుంచి పారీ్టలకందే ఆర్థిక విరాళాలకు రెండు కారణాలుంటాయి. తద్వారా తమ మద్దతును వ్యక్తీకరించడం. లేదా సదరు విరాళాలు క్విడ్ ప్రొ కో తరహావి కావడం. పరిమిత స్థాయిలో ఉండే వ్యక్తిగత విరాళాలను, అపరిమితమైన కార్పొరేట్ విరాళాలను ఒకే గాటన కట్టలేం. కార్పొరేట్ విరాళాలు స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియకు విఘాతంగా మారాయి. కనుక సంస్థలు, కంపెనీల నుంచి పార్టీలకు అందే భారీ విరాళాలకు కారణాలను గోప్యంగా ఉంచడాన్ని అనుమతించరాదు’’అని స్పష్టం చేసింది. కేవలం ఎన్నికలే ప్రజాస్వామ్యానికి ఆది, అంతం కావంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా రెండు విడి తీర్పులు రాశారు. మోదీ సర్కారుకు భారీ ఎదురుదెబ్బగా భావిస్తున్న ఈ తీర్పుపై కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ హర్షం వెలిబుచ్చాయి. పలువురు మాజీ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్లు కూడా తీర్పును సమరి్థంచడం విశేషం. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా ఉన్నారు. తనతో పాటు జస్టిస్ గవాయ్ తరఫున సీజేఐ 152 పేజీల తీర్పు, తనతో పాటు న్యాయమూర్తులు జస్టిస్ పార్డీవాలా, జస్టిస్ మిశ్రాల తరఫున జస్టిస్ ఖన్నా 74 పేజీల తీర్పు వెలువరించారు. చాలా లోపాలున్నాయి... ఎన్నికల బాండ్ల పథకాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ నేత జయా ఠాకూర్ తదితరులు దాఖలు చేసిన నాలుగు పిటిషన్లపై ధర్మాసనం 2023 అక్టోబర్ నుంచి వాదనలు ఆలకిస్తూ వస్తోంది. ఈ పథకం రహస్య బ్యాలెట్ విధానం వంటిదేనని, విరాళాలిచ్చేవారి గోపనీయతను కాపాడుతుందని కేంద్రం చేసిన వాదన లోపభూయిష్టమని తాజా తీర్పులో ధర్మాసనం స్పష్టం చేసింది. బాండ్లను కొనుగోలు చేసేలా వ్యక్తులను, సంస్థలను ఈ పథకం ద్వారా ఒత్తిడి చేయవచ్చని పేర్కొంది. బాండ్‌పై దాత పేరుండదు గనుక అవి ఎవరి నుంచి వచ్చాయన్న ఆ విరాళాన్ని అందుకునే పారీ్టకి కూడా తెలిసే అవకాశం లేదన్న కేంద్రం వాదననూ తోసిపుచి్చంది. ‘‘ఈ పథకం లోపరహితం కాదు. విరాళాలు ఇచి్చందెవరో పార్టీలు తెలుసుకునేందుకు అవకాశం కలి్పంచే లోపాలెన్నో ఇందులో ఉన్నాయి’’అని స్పష్టం చేసింది. ‘‘పౌరులు రాజకీయ విశ్వాసాలు, అభిప్రాయాలు ఏర్పరచుకోవడం వారి రాజకీయ వ్యక్తీకరణలో తొలి దశ. అందుకే పౌరుల రాజకీయ విశ్వాసాలకు రాజ్యాంగంలోని ఆరి్టకల్ 19(1)(ఎ) రక్షణ కలి్పస్తోంది. కానీ ఈ పథకం నిబంధనల ప్రకారం బాండ్ల కొనుగోలుదారుల వివరాలను ఓటర్లకు తెలియకుండా గోప్యంగా ఉంచుతారు. ఇది కలి్పస్తున్న రాజ్యాంగం కలి్పస్తున్న భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘించడమే’’అంటూ తప్పుబట్టింది. అంతేగాక కార్పొరేట్ సంస్థలు పార్టీలకు అపరిమితంగా విరాళాలు అందజేసేందుకు వీలు కలి్పంచేలా కంపెనీల చట్టంలోని నిబంధనను తొలగించడం ఆరి్టకల్ 14 ద్వారా రాజ్యాంగం కలి్పస్తున్న సమానత్వపు హక్కుకు విరుద్ధమని పేర్కొంది. ఎన్నికల బాండ్ల పథకాన్ని వెంటనే రద్దు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. 2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటిదాకా దీనికింద కొనుగోలు చేసిన ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను మార్చి 6కల్లా కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేయాలని బాండ్ల జారీ అ«దీకృత సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. ప్రతి బాండ్ ముఖ విలువ, కొనుగోలు తేదీ, కొనుగోలుదారు పేరు, తద్వారా పారీ్టలవారీగా అందుకున్న విరాళాలు వంటి అన్ని వివరాలనూ పొందుపరచాలని పేర్కొంది. వాటన్నింటినీ మార్చి 13 కల్లా ఈసీ అధికారిక వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంచాలని నిర్దేశించింది. ఇంకా నగదుగా మార్చుకోని బాండ్లను సంబంధిత పారీ్టలు తిరిగి ఎస్బీఐలో జమ చేయాలని, సదరు మొత్తాలను కొనుగోలుదారు ఖాతాకు బ్యాంకు జమ చేయాలని ఆదేశించింది. పార్టీలు బాండ్ల ద్వారా తమకందిన విరాళాల పూర్తి వివరాలను ఈసీకి సీల్డ్ కవర్లో సమరి్పంచాలని 2019 ఏప్రిల్ 12న ధర్మాసనం మధ్యంతర తీర్పు వెలువరించడం తెలిసిందే. గోప్యత కీలకం: సీజేఐ రాజకీయ పారీ్టకి అందే విరాళాల గురించిన సమాచారం ఓటరుకు తెలియడం తప్పనిసరని సీజేఐ తన తీర్పులో పేర్కొన్నారు. అప్పుడే ఓటు హక్కును ప్రభావవంతంగా వినియోగించుకోగలడన్నారు. ‘‘ఎన్నికల వ్యయంలో నల్లధనం కట్టడికి బాండ్లే ఏకైక మార్గం కాదు. దీనితో పోలిస్తే సమాచార హక్కు స్ఫూర్తికి గండి కొట్టని మెరుగైన ఇతర మార్గాలెన్నో ఉన్నాయి. అయితే అన్ని రాజకీయ విరాళాలనూ విధాన నిర్ణయాలను ప్రభావితం చేసే ప్రయత్నాలుగా చూడలేం. చట్టసభల్లో పెద్దగా ప్రాతినిధ్యం లేని పారీ్టలకు కూడా విరాళాలందుతున్నాయి’’అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు, విధానాలను ప్రభావితం చేసేందుకు డబ్బు ఎంతో అవసరం. ఎన్నికల్లో ప్రజాస్వామికంగా పాల్గొనేందుకు కూడా డబ్బు కావాల్సిందే’’అన్నారు. అయితే, ‘‘వ్యక్తుల రాజకీయ విశ్వాసాలకు సంబంధించిన సమాచారాన్ని అసమ్మతిని అణచివేసేందుకు ప్రభుత్వం రాజకీయంగా వాడుకునే ఆస్కారముంది. అంతేగాక సదరు వ్యక్తులకు ఉద్యోగావకాశాల వంటివాటిని నిరాకరించే ప్రమాదం కూడా ఉంది. అంతేగాక అవి మెజారిటీ అభిప్రాయాలకు విరుద్ధంగా ఉండే పక్షంలో వారిపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. అందుకే పౌరులకు తమ రాజకీయ విశ్వాసాలను గోప్యంగా ఉంచుకునే హక్కు చాలా ముఖ్యం’’అని సీజేఐ అన్నారు. గోప్యత హక్కుకు రాజ్యంగపరమైన రక్షణ ఉంటుందంటూ 9 మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచి్చన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘‘ఓటు ఎవరికేస్తున్నదీ గోప్యంగా ఉంచే హక్కు లేకుంటే పరిణామాలు దారుణంగా ఉంటాయి. తమకు వ్యతిరేకంగా ఓటేసేవారి ఓట్లను తొలగించేందుకు వాడుకునే ప్రమాదమూ ఉంది. నియోజకవర్గాలను కూడా ఓటర్ల రాజకీయ మొగ్గుదల ఆధారంగా విభజించే ఆస్కారముంది. అప్పుడు ఎన్నికల వ్యవస్థకే అర్థం లేకుండా పోతుంది’’అని ఆందోళన వెలిబుచ్చారు. కాకపోతే ఈ గోప్యత హక్కును పారీ్టలకు అందే విరాళాలకు కూడా వర్తింపజేయవచ్చా అన్నదే ప్రశ్న అని సీజేఐ చెప్పారు. పారీ్టలకు ఆర్థిక విరాళాలకు కూడా రాజ్యంగపరమైన రక్షణ ఉందా అన్న అంశంపై విచారణ జరపాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. క్విడ్ ప్రొ కోకు ఆస్కారం పారీ్టలకు భారీగా ఆర్థిక విరాళాలిచ్చే వారి ఉద్దేశమేమిటన్నది బహిరంగ రహస్యమేనని సీజేఐ అన్నారు. సాధారణంగా కార్పొరేట్ విరాళాల ఉద్దేశం క్విడ్ ప్రొ కో ప్రయోజనాలేనన్న వాదనతో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా విభేదించలేదని గుర్తు చేశారు. రాజకీయ సమానత్వానికి మన దేశంలో రాజ్యాంగ రక్షణ ఉన్నా ఆ విషయంలో ఇప్పటికీ అసమానత కొనసాగుతూనే ఉందని సీజేఐ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేయడంలో వ్యక్తుల సామర్థ్యంలో అసమానతలున్నాయి. ఆర్థిక అసమానతలే అందుకు కారణం. పారీ్టలకందే ఆర్థిక సాయాన్ని కూడా ఈ అసమానతలు నియంత్రిస్తున్నాయి. సంపన్నులకు పారీ్టలకు భారీ ఆర్థిక విరాళమిచ్చే సామర్థ్యముంటుంది. తద్వారా ప్రజాప్రతినిధులకు దగ్గరయ్యేందుకు, ప్రభుత్వ విధాన నిర్ణయాలను ప్రభావితం చేసేందుకు కూడా అవకాశముంటుంది. ఇది వారికి కావాల్సిన లైసెన్సులివ్వడమో, వారికి అనుకూలమైన విధాన నిర్ణయాలు తీసుకోవడమో జరగే ఆస్కారముంది. ఇలా క్విడ్ ప్రొ కో జరిగే అవకాశముంది’’అన్నారు. రాజకీయ సమానత్వాన్ని పాటించే సమాజంలో పౌరులందరికీ రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేసే విషయంలో సమానంగా గళమెత్తే అవకాశం చాలా కీలకమని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేయడానికి జస్టిస్ ఖన్నా తన తీర్పులో పలు కారణాలను ఉటంకించారు. స్పందనలు ‘‘ఈ తీర్పు ద్వారా నల్లధన మారి్పడి వ్యవస్థను సుప్రీంకోర్టు రద్దు చేసింది. కేంద్రం ఇప్పటికైనా ఇలాంటి మతిలేని ఆలోచనలు కట్టిపెడుతుందని ఆశిస్తున్నా. ఎన్నికల బాండ్ల పథకం కింద 95 శాతం నిధులు ఒక్క బీజేపీకే అందాయి’’ – కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘‘మోదీ ప్రభుత్వ అవినీతి విధానాలకు ఇది మరో నిదర్శనం. ఎన్నికల బాండ్లను లంచాలు, కమిషన్లు తీసుకునే మార్గంగా బీజేపీ మార్చుకుంది. దీనికి సుప్రీంకోర్టు తెర దించింది’’ – కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ‘‘ఎన్నికల బాండ్లు సదుద్దేశంతో తెచి్చన పథకం. విపక్షాలు దీన్ని అవసరంగా రాజకీయం చేస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం’’ – బీజేపీ ‘‘తీర్పును స్వాగతిస్తున్నాం. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత తెచ్చేందుకు ఇదెంతగానో దోహదపడుతుంది’’ – ఆమ్ ఆద్మీ పార్టీ ‘‘పాలక పార్టీ లబ్ధి కోసం తీసుకొచి్చన అక్రమ పథకానికి సుప్రీంకోర్టు తీర్పు తెర దించింది’’ – సీపీఎం ‘‘తీర్పును స్వాగతిస్తున్నాం. ఎన్నికల బాండ్లు అప్రజాస్వామికం, రాజ్యాంగవిరుద్ధం’’ – సీపీఐ (ఎంఎల్) ‘‘ఇది గత ఆరేడేళ్లలో వెలువడ్డ అత్యంత చరిత్రాత్మక తీర్పు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని ఈ తీర్పు పునరుద్ధరిస్తుంది. – కేంద్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి ఎస్‌వై ఖురేషీ ‘‘తీర్పు స్వాగతించదగ్గదే. అయితే ఎన్నికల నిధుల వ్యవస్థ ప్రక్షాళనకు చేయాల్సింది చాలా ఉంది’’ – కేంద్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి ఎన్.గోపాలస్వామి. -
చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది
‘‘చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది’’ ఇది జనుల వాడకంలో ఉండి, అందరి నోళ్లలోనూ నానుతూ ఉన్న మాట. పాపం అంటే ఇతరులకు అపకారం చేసినందువల్ల వచ్చే ఫలితం. దీనిని మామూలు మాటల్లో చెప్పాలంటే తప్పు. అందరూ అంగీకరించనిది. మానవమాత్రులు తప్పు చేయకుండా ఉండటం అసంభవం. తెలిసి కాకపోయినా, తెలియకుండా అయినా ఏదో ఒక తప్పు చేసే ఉంటారు. తప్పు అంటే ఏదైనా ఇతరులకి బాధ కలిగించే పని కాని, ధర్మానికి విరుద్ధమైన పని కాని చేయటం. ఎదుటివారికి మంచి అనుకుని చేసినది వారికి హాని కలిగించవచ్చు. అనుకోకుండా చేసినట్టయితే దానిని ‘‘తప్పు అయి పోయింది’’ అని ఒప్పుకొని ఎవరికి హాని కలిగిందో వారిని క్షమించమని అడిగితే సరి చేసుకునే అవకాశం ఉంటుంది. పరిహారం సమర్పించో, మరొక విధంగానో సద్దుబాటు చేసుకునే వీలు ఉంటుంది. ధర్మానికి అపచారం జరిగితే? .. .. దానిని కూడా ఒప్పుకొని పరిహారానికి ప్రయత్నం చేయాలి. ఇవి చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అయితే పరిణామం వేరొక విధంగా ఉంటుంది. చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది అంటే తాను చెప్పుకోవటమే కాదు. ఈ పాపం గురించి పదిమంది చెప్పుకుంటే అని. ఏదైనా విషయం గురించి ఎంత మంది మాట్లాడుకుంటే దాని ఫలితాన్ని అంతమంది పంచుకుంటారు కదా! ఆ విధంగా తాను చేసిన పనికి సంబంధించిన ఫలితాన్ని ఎంతోమంది పంచుకోవటం కారణంగా కర్తకి ఆ పనివల్ల కలగవలసిన తీవ్ర నష్టం సద్దుబాటు చేయబడుతుంది. ‘‘కర్తా కారాయితా చైవ ప్రేరకశ్చానుమోదకః / సుకృతే దుష్కృతే చైవ చత్వారినః సమ భాగినః’’. కారయితలు (చేయించినవారు), ప్రేరకులు కాకపోయినా దాని గురించి మాట్లాడుకున్నవారికి కొంత ఫలితం చెందుతుంది. కనుక కర్తకి స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. కొన్ని పనుల వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాని, అది చేయకూడని పని అయితే చేయగలిగినది ఏమీ ఉండదు. తాను చేసిన తప్పుని చెప్పటానికి ఎంతో ధైర్యం కావాలి. అటువంటి ధైర్యం ధర్మమార్గంలో నడిచే వారికి మాత్రమే ఉంటుంది. ‘‘సత్యే ధర్మం ప్రతిష్ఠితా’’, ధర్మం సత్యంలోనే నిలిచి ఉంటుంది. కనుక ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు మాత్రమే ధర్మమార్గంలో ఉన్నట్టు. తన గొప్ప, ఘనతలు మాత్రమే కాక అపజయాలు, లోపాలు కూడా ఉన్నవి ఉన్నట్టుగా సందర్భం వచ్చినప్పుడు చెప్పగలగాలి. అప్పుడు అది ఎంతోమందికి మార్గదర్శక మౌతుంది. పొరపాట్లు ఎట్లా దొర్లుతాయి? వాటిని ఏ విధంగా అధిగమించ వచ్చు? అని అవగాహన చేసుకోవటానికి గుణపాఠం అవుతుంది. తాను చేసిన పాపం అందరికీ తెలిస్తే గౌరవం తగ్గిపోతుందనే భయం ఉంటుంది సాధారణంగా. వాస్తవానికి తాత్కాలికంగా అదే జరిగినా, రాను రాను గౌరవం పెరుగుతుంది. నిజాయితీపరులు, మంచి చెడు తెలిసిన వారు అని. ఒకరి ద్వారా తెలియటం కాక తామే చెప్పటం వల్ల ఒక ఉపయోగం ఉంది. ఇతరులకి తెలిసి, వారు గోరంత విషయాన్ని కొండంత చేసి, ప్రచారం చేసే అవకాశం ఉండదు. ఈ పారదర్శకత నాయకుడుగా ఉండేవారికి తప్పని సరి. చేసిన పాపం ఇతరులకి తెలిస్తే చులకన అయిపోతామేమో అనే ఆలోచనతో బయటికి చెప్పరు చాలమంది. చెప్పుకుంటే పరిహారం ఎట్లా చేయవచ్చో సూచనలు అందే అవకాశం ఉంటుంది. ఈ మాట అన్నంత మాత్రాన ప్రకటనలు చేయమని కాదు. శ్రేయోభిలాషుల వద్ద మనసులో ఉన్న బరువు దింపుకుంటే తేలిక అవుతుంది. లోలోపల కుమిలి పోవటం, బయట పడుతుందేమోననే భయం, ఆందోళన ఉండవు. అప్పుడు తరువాతి కర్తవ్యం గోచరిస్తుంది. ఇదంతా తప్పు చేశాననే భావన ఉన్న వారి విషయంలో. తప్పు అని ఒప్పుకోటానికే ఇష్టం లేనివారి గురించి చెప్పటానికి ఏమీ లేదు. – ఎన్.అనంతలక్ష్మి -
జమిలి ఎన్నికలు అప్రజాస్వామికం
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల యోచనను కాంగ్రెస్ గట్టిగా వ్యతిరేకించింది. ఈ విధానం సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి విరుద్ధమని పేర్కొంది. ఒకే దేశం–ఒకే ఎన్నికల ఆలోచనను పూర్తిగా పక్కనబెట్టాలని, దీనిపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో ఏర్పాటైన కమిటీని రద్దు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. కమిటీ కార్యదర్శి నితేన్ చంద్రకు ఈ మేరకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. ఒకే విడతలో ఎన్నికల కోసం సగం పదవీ కాలం కూడా పూర్తవని అసెంబ్లీలను రద్దు చేస్తే ఓటర్ల హక్కులను కాలరాయడమేనన్నారు. -
లోక్‌సభకు డిప్యూటీ స్పీకర్ లేరు.. ఇది రాజ్యాంగ విరుద్ధం: కాంగ్రెస్
న్యూఢిల్లీ: లోక్‌సభకు గత నాలుగేళ్లుగా డిప్యూటీ స్పీకర్ లేరని, ఇది రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ఆరోపించింది. లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల శాసనసభలకు డిప్యూటీ స్పీకర్లు లేకపోవడంపై దాఖలైన పిల్‌పై సుప్రీంకోర్టు గత నెలలో కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ప్రతిపక్ష నేతకు దక్కరాదనే ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. ‘1956లో ప్రధాని నెహ్రూ ప్రతిపక్ష నేత, తన విధానాలను తీవ్రంగా విమర్శించే అకాలీదళ్ ఎంపీని సర్దార్ హుకుం సింగ్ పేరును డిప్యూటీ స్పీకర్ పదవికి ప్రతిపాదించారు’అని అప్పటి ఘటనను జైరాం రమేశ్ ఉదహరించారు. -
తలాక్‌లపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: ఇస్లాంలో తలాక్–ఎ–కినయా, తలాక్–ఎ–బెయిన్తో పాటు అన్నిరకాల విడాకులనూ రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై స్పందన తెలపాల్సిందిగా కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు కేంద్ర న్యాయ, మైనారిటీ వ్యవహారాల శాఖలకు నోటీసులు జారీ చేసింది. కర్నాటకకు చెందిన సయేదా అంబ్రీన్ దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.ఎ.నజీర్, జస్టిస్ జె.బి.పార్డీవాలాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఇదీ చదవండి: కొలీజియంలో విభేదాలు! -
ఒక సెషన్‌కు మించి సస్పెన్షన్
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలను ఒక సెషన్ మించి సస్పెండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతేడాది వర్షాకాల సమావేశాల్లో సభాపతి పట్ల అమర్యాదగా ప్రవర్తించడంతోపాటు దూషణ చేశారంటూ ఆ స్థానంలో కూర్చొన భాస్కర్ జాదవ్ 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్యే ఆశిష్ షేలర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారించిన జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. అసెంబ్లీ నిర్ణయం చట్టం దృష్టిలో దురుద్దేశంతో కూడుకున్నదన్న ధర్మాసనం... బీజేపీ ఎమ్మెల్యేలను చట్టసభ ప్రయోజనాలకు అర్హులుగా ప్రకటించింది. శాసనసభ సభ్యులపై ఏడాదిపాటు సస్పెన్షన్ విధించడం ఆర్టికల్ 14 ఉల్లంఘించినట్లేనని ఎమ్మెల్యేల తరఫు సీనియర్ న్యాయవాదులు మహేశ్ జెఠ్మలానీ, ముకుల్ రోహత్గి, హరీశ్ సాల్వే, నీరజ్ కిషన్ కౌల్లు ఆరోపించారు. ఘటన పట్ల సభాపతికి క్షమాపణ తెలిపామని, అసభ్యకరమైన పదజాలం ఉపయోగించారడం సరికాదని తెలిపారు. తాము సీసీటీవీ ఫుటేజీ కోరినప్పటికీ డిప్యూటీ స్పీకర్ తిరస్కరించారని తెలిపారు. సదరు సస్పెన్షన్ ఆరు నెలల మించి పనిచేయదు కాబట్టి సభాపతి స్థానంలోని భాస్కర్ జాదవ్ తీసుకొన్న నిర్ణయం ప్రాథమికంగా రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి గైర్హాజరు కావడానికి గరిష్టపరిమితి 60 రోజులేనని ఆ తర్వాత ఆ స్థానం ఖాళీగా ప్రకటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గతేడాది వర్షాకాల సమావేశాల్లో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ తీసుకొన్న అసెంబ్లీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. జనవరి 19న తీర్పు రిజర్వు చేసిన ధర్మాసనం శుక్రవారం వెలువరించింది. పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ప్రమాణాలు నిర్దేశించలేం సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్ల కల్పనకు సంబంధించి తామెలాంటి ప్రమాణాలు నిర్దేశించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2006లో నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో విధంగా ఎస్సీఎస్టీల ప్రాతినిధ్యానికి సంబంధించి పరిమాణాత్మక డాటాను సేకరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పేర్కొంది. ఎస్సీ ఎస్టీ వర్గాలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ, సర్వీసులో తగిన ప్రాతినిధ్యం నిర్ణయించడానికి ఎలాంటి కొలమాలన్ని నిర్ణయించలేమని జర్నైల్ సింగ్ తదితరులు వర్సెస్ లచ్మి నారాయణ గుప్తా తదితరులు కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం మెరిట్స్‌పై ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడించబోవడం లేదని శుక్రవారం తీర్పు వెలువరిస్తూ తదుపరి విచారణ ఫిబ్రవరి 24కు వాయిదా వేసింది. ‘‘ఎస్సీఎస్టీ వర్గాలకు చెందిన వారి ప్రాతినిధ్యం తగినంతగా లేకపోవడం గుర్తించడానికి ఎలాంటి కొలమానం వేయలేం. వారి ప్రాతినిధ్యానికి సంబంధించిన గణాంకాలు సేకరించే బాధ్యత రాష్ట్రాలదే. ఈ అంశాన్ని మేం రాష్ట్రాలకే వదిలేస్తున్నాం. పూర్తి సర్వీసు కాకుండా క్యాడర్‌ను యూనిట్‌గా తీసుకొని గణాంకాలు సేకరించాలి. ఎం.నాగరాజు తీర్పుపై ఎలాంటి ప్రభావం చూపకూడదు. దామాషా ప్రకారం వారి ప్రాతినిధ్యం ఉందా లేదా అనే మెరిట్స్ జోలికి వెళ్లడం లేదు. దీన్ని రాష్ట్రాలకే వదిలేస్తున్నాం ’’ అని తీర్పులో వివరించింది. ‘రాజ్యాంగం ప్రకారం ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి గైర్హాజరయ్యేందుకు అనుమతించే గరిష్ట కాలపరిమితి 60 రోజులే. ఈ కాలావధి దాటితే సదరు నియోజకవర్గం ఖాళీ అయినట్లుగానే పరిగణించాలి. కాబట్టి ఏడాదిపాటు సస్పెండ్ చేయడం కుదరదు. అది రాజ్యాంగ విరుద్ధం. -
ఆ మూడు చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకం
(గుంటూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు, జాతి, రాజ్యాంగ వ్యతిరేకమైనవని ప్రముఖ జర్నలిస్టు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవసాయ మిషన్ సభ్యుడు పాలగుమ్మి సాయినాథ్ చెప్పారు. ఆ చట్టాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ఈ దేశంలోని ప్రతి పౌరుడిపైనా ఉందన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో 180 రోజులుగా జరుగుతున్న పోరాటం ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామిక నిరసన అని పేర్కొన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు – వ్యవసాయం, ప్రజలపై ప్రభావం అనే అంశంపై ఆదివారం గుంటూరులో ప్రారంభమైన రెండు రోజుల జాతీయ సదస్సులో ఆయన ప్రధాన వక్తగా ప్రసంగించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘రెట్టింపు ఆదాయం అటకెక్కిందా? 2017 జనవరిలో ప్రధాని, ఆర్థికమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం 2022 నాటికి అంటే మరో 4 నెలల్లో రైతుల ఆదాయం రెట్టింపు కావాలి. ఆ హామీ ఇచ్చిన పెద్దలు ఇప్పుడు దాని ఊసెత్తడం లేదు. రైతు ఆదాయం పెరక్కపోగా తగ్గిపోతోంది. 2013 నాటి జాతీయ నమూనా సర్వే ప్రకారం ఒక్కో రైతు కుటుంబ ఆదాయం నెలకు సగటున రూ.6,426. కరోనాతో ఆ ఆదాయం కూడా రావడం లేదు. ఈ పరిస్థితుల్లోనే మూడు వ్యవసాయ చట్టాలను తెచ్చి వ్యవసాయాన్ని పెద్ద కంపెనీల ఇష్టారాజ్యానికి వదిలేసేందుకు కుట్ర పన్నారు. అంటే ఈ ప్రభుత్వం, ఈ చట్టాలు రైతు వ్యతిరేకమైనవి. రాజ్యసభలో మూజువాణి ఓటుతో బిల్లుల్ని ఆమోదింపజేసుకున్నారు. అందువల్ల ఇది రాజ్యాంగ విరుద్ధం. ఈ వ్యవసాయ చట్టాలపై వివాదాలను కోర్టులకు బదులు కలెక్టర్లు, తహసీల్దార్లతో ఏర్పాటయ్యే అప్పిలేట్ ట్రిబ్యునల్స్‌లోనే తేల్చుకోవాలన్నారు. కనుక ఇది జాతి వ్యతిరేకం. అధికారులు తీసుకున్న చర్యల్లో, చేసిన సెటిల్మెంట్లలో సివిల్ కోర్టులు సహా ఇతరులు జోక్యం చేసుకునే అధికారం లేదంటున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత ప్రమాదకరమో ఊహించండి. ఈ చట్టాలు అమల్లోకి వస్తే కార్పొరేట్ లేదా కాంట్రాక్ట్ సేద్యం చేయించే సంస్థలు చెప్పింది చేయాలే తప్ప రైతుల ప్రమేయం ఏమీ ఉండదు. రైతు నిపుణులతో కిసాన్ కమిటీ వేసి సాగుదార్ల వాస్తవ స్థితిగతులను పరిశీలించాలి. సాగురంగ సమస్యల్ని చర్చించేందుకు ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశం నిర్వహించాలి. ఈ వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకునేంతవరకు కిసాన్ బచావో కమిటీలు వేసి ఊరూరా ప్రచారం, ఆందోళనలు నిర్వహించాలి. అప్పుడు మాత్రమే పాలకులు దిగివస్తారు..’ అని సాయినాథ్ పేర్కొన్నారు. ఏపీ కౌలురైతుల సంఘం ఉపాధ్యక్షుడు వి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, ఏపీ రైతు సంఘం నాయకుడు వి.కృష్ణయ్య, కౌలురైతు సంఘం ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య తదితరులు పాల్గొన్నారు. -
లాక్డౌన్ రాజ్యాంగ విరుద్ధం: ఒవైసీ
హైదరాబాద్: కరోనా మహమ్మారితో పోరాడటానికి ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌నే ఆయుధంగా భావిస్తున్న వేళ.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాత్రం విరుద్ధ వ్యాఖ్యలు చేశారు. లాక్డౌన్ రాజ్యాంగ విరుద్ధం అంటూ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వ చర్యలను రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించడం ఏంటని ఒవైసీ ప్రశ్నించారు. ఆన్లైన్ మీటింగ్‌లో పాల్గొన్న ఆయన కరోనాపై పోరాటం అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. దేశ విపత్తు నిర్వహణ చట్టం, అంటువ్యాధుల నిరోధక చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించడం చట్ట విరుద్ధమే కాక సమాఖ్య విధానానికి కూడా వ్యతిరేకం అన్నారు. లాక్డౌన్ అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉండటం ఆశ్చర్యంగా ఉందన్నారు ఒవైసీ. లాక్డౌన్ వల్ల వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒవైసీ తెలిపారు. కార్మికులు ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఔరంగబాద్‌లో 16 మంది వలస కూలీలు మృత్యువాత పడిన సంఘటనను ఆయన గుర్తు చేశారు. ప్రజలంతా ఇంట్లోనే క్షేమంగా ఉండాలని కోరారు. క్వారంటైన్ మన మంచికే అని దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా అనేది ఎవరికైనా రావచ్చని.. దానికి భయపడకుండా ఎవరికి వారే 8-10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండటం వల్ల తనతో పాటు.. తన కుటుంబ సభ్యులకు కూడా మేలు చేస్తుందని అన్నారు. మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం, అధికారులతో పాటు ప్రజలు కూడా సామాజిక దూరాన్ని పాటిస్తూ.. తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ రద్దు ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమే!
జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పర్చే అవకాశాన్ని రాజకీయపార్టీలకు ఇవ్వకుండా అసెంబ్లీని రద్దుపరచడం ద్వారా గవర్నర్ సత్పాల్ మాలిక్ వాస్తవానికి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారు. ప్రధానమంత్రి కార్యాలయం ఆ సమయంలో ఏం కోరుకుంటోందో దాన్ని మాత్రమే గవర్నర్ పాటించినట్లుంది. గవర్నర్ తన చర్యను సమర్థించుకోవడమే కాకుండా, పీడీపీ, ఎన్సీ, కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు పంపిన ఉత్తరాన్ని ఫ్యాక్స్ మిషన్ పనిచేయనందున స్వీకరించలేకపోయినట్లు ప్రకటించడం ఆవేదన కలిగించే విషయం. జమ్మూ కశ్మీర్ అనేది సైనిక సమస్య కాదు, పాలనాపరమైన సమస్య కాదు. అదొక రాజకీయ సమస్య. పరస్పర చర్చలద్వారానే దాన్ని పరిష్కరించాలి. జమ్మూ కశ్మీర్లో నూతన ప్రభుత్వాన్ని ఏర్పర్చడానికి రాజకీయ పార్టీలను అనుమతించకుండా ఆ రాష్ట్ర గవర్నర్ తీసుకున్న రాజ్యాంగ వ్యతిరేక చర్య కశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుగొనడంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వానికి ఆసక్తి లేదని స్పష్టం చేస్తోంది. దానికంటే ఎన్నికల్లో జాతీయవాద మనోభావాలను వాడుకోవడం పట్లే దానికి ఆసక్తి ఉన్నట్లుంది. ఇది ఒక రాష్ట్రంలో లేక ఒక నిర్దిష్ట సామాజిక బృందం అనుభవిస్తున్న చారిత్రక వేదన పట్ల దేశంలోని ఇతర ప్రాంతాల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతూ సమస్యకు మరిం తగా నిప్పు రాజేస్తున్నట్లుగా ఉంది. జమ్మూకశ్మీర్‌లో రాజకీయ పార్టీలను చర్చలబల్ల వద్దకు తీసుకొచ్చి ప్రభుత్వ ఏర్పాటు కోసం సాధ్యమైనన్ని ప్రయత్నాలు చేసివుండాలని మనలో చాలామంది భావన. జాతీయ ప్రయోజనాల రీత్యా జాతీయ పార్టీలని చెప్పుకుంటున్నవి ఆ రాష్ట్ర ప్రజల మనోభావాలను గౌరవించి ద్వితీయపాత్రకు మాత్రమే పరిమితం కావలసి ఉంది. కానీ బీజేపీ నేరుగా రాష్ట్రాన్ని పాలిం చడానికి రాజకీయ సంప్రదింపులు జరిపే ఉద్దేశంతోనే సత్పాల్ మాలిక్‌ని జమ్మూ కశ్మీర్‌కు గవర్నర్‌గా పంపించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆయన లక్ష్యం కశ్మీర్ రాజకీయ పార్టీలను హిందుత్వ రాజకీయ ప్రయోజనాల కోసం విభజించడమే. సాజిద్ లోనేని దాంట్లోభాగంగానే ప్రోత్సహించారు. ఆ రకంగా నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ వంటి స్థానిక రాజకీయ పార్టీల ఆధిపత్యానికి గండి కొట్టవచ్చని, లేదా తగ్గించవచ్చని భావించారు. తన ప్రజలపైనే యుద్ధం చేస్తూ, వ్యవస్థల విశ్వసనీయతనే విధ్వంసం చేయడానికి పూనుకున్న ప్రభుత్వాన్ని మనం ఎక్కడైనా చూశామా? హింసాత్మక ఘటనలు పెరిగాయి కాబట్టి కశ్మీరులో గత నాలుగేళ్లుగా పరిస్థితి దిగజారిపోలేదని, కశ్మీర్ సమస్య పరి ష్కారానికి కేంద్రం ఏరకమైన ఆసక్తీ చూపకపోవడమే అక్కడ అశాంతికి కారణమని మనందరికీ తెలుసు. కశ్మీర్ సమస్య పట్ల కఠిన పరిష్కారమే మార్గమని, అంటే సాయుధ బలగాలకు స్వేచ్ఛ ఇచ్చి వారెప్పుడు కోరుకుంటే అప్పుడు రాజకీయ ప్రక్రియను అనుమతించని విధంగా పరిష్కరించాలని ఆర్ఎస్ఎస్ మేధో బృందం చాలవరకు భావిస్తోంది. కశ్మీర్.. యుద్ధం ద్వారా గెలవాల్సిన ప్రాంతంగా సంఘ్ పరివార్ భావిస్తోంది. భారత్‌లో మన బానిసత్వానికి గుర్తుగా మిగిలిన ఇస్లామ్ చిహ్నాలను పూర్తిగా రద్దు చేయాలంటూ రాత్రింబవళ్లు మొత్తుకుంటున్న సంఘ్ భక్తపరివార్కి ఇలాంటి తరహా విజయం సంతృప్తినిస్తుం దని ఆర్ఎస్ఎస్ భావన. అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచిన తర్వాత ఉన్నట్లుండి గవర్నర్‌కు రాష్ట్రంలో ఇక సుస్థిర ప్రభుత్వం సాధ్యం కాదని స్ఫురించిందంటే కేంద్రం ఆజ్ఞలకు వెన్నెముక లేని గవర్నర్ పూర్తిగా లొంగిపోయినట్లే లెక్క. పైగా ఇతర ప్రతిపక్ష పార్టీలు పంపిన ఉత్తరాలను గవర్నర్ తిరస్కరించారు. వాస్తవానికి మునుపెన్నడూ లేనంత రాజకీయ ఐక్యతను ప్రదర్శించిన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు ఉమ్మడిగా వెళ్లి గవర్నర్‌ను కలవాలని నిర్ణయించాయి. కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి మరో ఆలోచన ఉన్నట్లుంది. కశ్మీర్ నుంచి ఈశాన్య భారత్ వరకు హిందుత్వ ప్రభుత్వాన్ని స్థాపించాలనే అమిత్‌షా, నరేంద్రమోదీల స్వప్న సాకారం చేయడానికి జమ్మూకశ్మీర్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం ఆశిం చింది. ప్రభుత్వాన్ని ఏర్పర్చే అవకాశాన్ని రాజకీయపార్టీలకు ఇవ్వకుండా అసెంబ్లీని రద్దుపరచడం ద్వారా మాలిక్ వాస్తవానికి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారు. ప్రధానమంత్రి కార్యాలయం ఆ సమయంలో ఏం కోరుకుంటోందో దాన్ని మాత్రమే గవర్నర్ పాటించినట్లుంది. గవర్నర్ తన చర్యను సమర్థించుకోవడమే కాకుండా, పీడీపీ, ఎన్సీ, కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు పంపిన ఉత్తరాన్ని ఫ్యాక్స్ మిషన్ పనిచేయనందున స్వీకరించలేకపోయినట్లు ప్రకటించడం ఆవేదన కలిగించే విషయం. పైగా ఆర్ఎస్ఎస్ నియమించిన రామ్ మాధవ్ సమస్యపట్ల ఏమాత్రం అవగాహన లేకుండానే మీడియా వద్దకు హుటాహుటిన పరుగెత్తుకెళ్లి, పాకిస్తాన్ ఆదేశాల ప్రకారమే ఆ మూడు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పర్చాలని కోరుకుంటున్నట్లుగా ఆరోపించి అభాసుపాలయ్యారు. రామ్‌మాధవ్ వ్యవహరించిన తీరు కశ్మీర్ సమస్య పట్ల బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధీ లేదన్న విషయాన్ని ప్రతిబింబిస్తోంది. సంవత్సరాలపాటు రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాన్ని, కొద్ది నెలలక్రితం వరకు భాగస్వామిగా అధికారం చలాయించిన పార్టీని జాతి వ్యతిరేకమైనదిగా ఎలా ముద్రవేస్తారు? జమ్మూకశ్మీర్ వ్యవహా రాల్లో వేలుపెట్టేందుకు రామ్ మాధవ్ లాంటి వ్యక్తిని నియమించినప్పుడే కేంద్రప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో మనం అర్థం చేసుకున్నాం. బీజేపీతో సమస్య ఏమిటంటే అది ప్రజాతీర్పుకు వెన్నుపోటు పొడిచింది. గుజరాత్ బుడగ పేలిపోయింది. అభివృద్ధి ఎజెండా గాల్లో కలిసింది. మన వ్యవస్థలు తమ స్వతంత్రప్రతిపత్తిని, బలాన్ని కోల్పోతున్నాయి. ప్రజలమీద యుద్ధం ప్రకటించి ప్రభుత్వమే వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అది జమ్మూ కశ్మీర్‌ను కోరుకుంటోంది కానీ కశ్మీర్ ప్రజలతో మాట్లాడాలని భావించదు. భారత్‌లోని సవర్ణులతో కశ్మీర్గురించి చర్చించాలని అనుకుంటోది తప్పితే కశ్మీర్ ప్రజలతో మాట్లాడాలని అనుకోవడం లేదు. ఇక ఆర్ఎస్ఎస్ జాతీయవాద నమూనా ప్రకారం, వారికి కశ్మీరీ ముస్లింలతో పని లేదు, అక్కడి ప్రజలతో పనిలేదు కానీ అఖండభారత్‌లో భాగంగా కశ్మీర్ భౌగోళిక ప్రాంతం మాత్రమే వారిక్కావాలి. ఒకవేళ వారు ప్రజల గురించి ఆలోచించినప్పటికీ జమ్మూలోని హిందువుల గురించే ఆలోచిస్తారు. ఇంతకంటే మించిన వంచన లేదు. ఇప్పుడు కశ్మీర్‌కి కావలసింది భారత్ నుంచి ఒక ప్రేమాస్పదమైన వెచ్చటి కౌగిలింత మాత్రమే. యువతకు ఉద్యోగం, అవకాశాలు అవసరం. రాజకీయ వాణిని వినాలి. రాజకీయ చర్చలపట్ల విశ్వాసం ప్రకటించినందుకే అక్కడ ఎంతోమంది సాహస జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కశ్మీర్ సైనిక సమస్య, పాలనాపరమైన సమస్య కాదు. అదొక రాజకీయ సమస్య. చర్చలద్వారానే దాన్ని పరిష్కరించాలి. రాజ్యాంగాన్ని, చట్టపాలనను విశ్వసిస్తున్న రాజకీయ పార్టీల ప్రతిష్టను మసకబార్చి మీరు చేసేదేమీ ఉండదు. ద్వేషానికి, హింసకు వ్యతిరేకంగా పోరాడుతూ అనేకమంది నేతలను కోల్పోయిన కశ్మీర్ రాజకీయపార్టీలపై మరకలువేయడానికి ప్రయత్నిస్తే తర్వాత మీరు మాట్లాడేందుకు మనిషి కూడా మిగలడు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కశ్మీర్లో ఇలాంటి అంగుష్టమాత్రపు రాజకీయాల్లో మునగకూడదు. -విద్యాభూషణ్ రావత్, మానవ హక్కుల కార్యకర్త, జర్నలిస్టు -
అమరుల స్తూపాలను కూల్చడం హేయం
వీణవంక(హుజూరాబాద్) : అమరవీరులకు కనీస మర్యాద ప్రభుత్వం ఇవ్వడం లేదని, అమరుల స్తూపాలను కూల్చడం హేయమైన చర్య అని తెలంగాణ జన సమితి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి గాదె ఇన్నయ్య అన్నారు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకోడానికే స్తూపాలను నిర్మిస్తారని, అలాంటి అమరుల స్తూపాలను ప్రభుత్వం కూల్చేస్తూ రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. వీణవంక మండలం అచ్చంపల్లి గ్రామంలో తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ జనసభ నేత అల్గివెల్లి రవీందర్‌రెడ్డి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు నిర్మిస్తున్న స్తూపాన్ని ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు కూల్చేశారు. మంగళవారం టీజేఎస్ నాయకులు అచ్చంపల్లి గ్రామాన్ని సందర్శించారు. రవీందర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కల్వల ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఆనాడు 33రోజులపాటు రవీందర్‌రెడ్డి నిరాహార దీక్షకు పూనుకున్నాడని, ఆయన ఎదుగుదలను జీర్ణించుకోలేని వ్యక్తులు రాజకీయ హత్య చేశారని పేర్కొన్నారు. జమ్మికుంటలో జరిగిన సభలో రవీందర్‌రెడ్డి తెలంగాణ కోసం అమరుడైనట్లు కేసీఆర్ ప్రకటించాడని, ఇప్పుడు ఆయన స్తూపాన్నే కూల్చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధన కోసం అమరుడైన రవీందర్‌రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వాలు ఆదుకోలేదని, ఆయన జ్ఞాపకార్థం గ్రామ పంచాయితీ అనుమతితో కుటుంబసభ్యులు స్తూపాన్ని నిర్మించుకుంటే కూల్చేయడం సరికాదని తెలంగాణ జనసమితి జిల్లా కన్వీనర్ ముక్కెర రాజు అన్నారు. మంత్రి ఈటల రాజేందర్‌కు అమరులు, ఉద్యమకారుల మీద గౌరవం ఉంటే సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ ఇన్చార్జి పత్తి వేణుగోపాల్‌రెడ్డి, పెరమండ్ల సంపత్‌గౌడ్, ఉడుగుల మహేందర్, నీల కుమారస్వామి, అంకూస్, శరత్, శ్రీనివాస్, అనిల్, నిరంజన్, మహేందర్, పరుశరాములు పాల్గొన్నారు. -
ఆ జీవితఖైదు రాజ్యాంగ విరుద్ధం
ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్: ప్రొఫెసర్ సాయిబాబాకు జీవిత ఖైదు విధించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. బుధవారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వరవరరావుతో కలసి ఆయ న మాట్లాడారు. ప్రభుత్వం ఏడుగురిని అరెస్ట్ చేసి బెయిల్ ఇవ్వకుండా 70 నుంచి 80 రోజులు జైల్లో పెట్టడం అప్రజాస్వామికమన్నారు. తెలం గాణ సీఎం కేసీఆర్ కార్యాలయానికి ప్రజా సంఘాల నేతలు వెళితే కలిసే పరిస్థితి లేదని.. ఇదెక్కడి ప్రజాస్వామ్యమని ఆయన ప్రశ్నించారు. ప్రొఫెసర్ సాయిబాబాకు జీవితఖైదు విధించడంతో షాక్‌కు గురయ్యామని.. దీనిపై న్యాయస్థానంలోనే కాక బయట సైతం పోరాటం చేస్తామన్నారు. ఈ జడ్జిమెంట్‌ను పునః పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు. విరసం నేత వరవరరావు మాట్లాడుతూ.. దుర్గప్రసాద్ లాంటి జర్నలిస్ట్, ప్రశాంత్‌రాహి లాంటి వారు ప్రజా ఉద్యమంలో పాల్గొంటే తప్పా అని ప్రశ్నించారు.సాయిబాబాకు క్రిమినల్ అఫెన్స్ లేదన్నారు. సాయిబాబా తీర్పు న్యాయమూర్తి రాసింది కాదని, ఎన్ఐఏ రాసిందని ఆరోపించారు. దీనిపై హైకోర్టులో అప్పీల్æ చేస్తామన్నారు. ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజాస్వామ్యవాదులను తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు నిర్బంధించి 75 రోజులుగా సుక్మాజైల్లో రాజ్య నిర్బంధం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అంతా పోరాటాలు చేయాలన్నారు. -
నోటీసులపై సమాధానం వినకుండానే..!
-
నోటీసులపై సమాధానం వినకుండానే..!
లక్నో: సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్.. కుమారడు అఖిలేష్ యాదవ్‌తో పాటు సోదరుడు రాంగోపాల్ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ నిర్ణయంపై రాంగోపాల్ యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. షోకాజ్ నోటీసులు జారీ చేసిన గంటల వ్యవధిలోనే సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం అన్యాయం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి : ములాయం కుటుంబంలో ఏం జరిగింది? ) పార్టీ నుంచి బహిష్కరిస్తూ తీసుకున్న చర్య పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని రాంగోపాల్ యాదవ్ పేర్కొన్నారు. మా ఇద్దరికీ షోకాజ్ నోటీసులు ఇచ్చాక సమాధానం వినకుండానే పార్టీ నుంచి ఎలా బహిష్కరిస్తారంటూ మీడియాతో మాట్లాడుతూ ఆయన ప్రశ్నించారు. పార్టీ అధినేతనే ఇలాంటి రాజ్యాంగ విరుద్దమైన చర్యకు పాల్పడితే ఎలా అని రాంగోపాల్ యాదవ్ వాపోయారు. తొందరలోనే ప్రజల్లో ఎవరికి ఎంత ఆదరణ ఉందో తెలుస్తుందన్న ఆయన.. జనవరి 1న రాంమనోహర్ లోహియా యూనిర్సిటీలో నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
కోర్టు తీర్పును గౌరవించాలి
-
మతాల కంటే కూడా రాజ్యాంగమే ఎక్కువ
-
'ఎవరో చేసిన పొరపాట్లకు వారికెందుకు శిక్ష?'
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ విధానం రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి తన స్వరాన్ని గట్టిగా వినిపించింది. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగానికి విరుద్ధమైనదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. దానికి తప్పక స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని చెప్పారు. మూడుసార్లు తలాక్ చెప్పడం ద్వారా ముస్లిం మహిళలకు విడాకులిచ్చినట్లుగా భావించే విధానాన్ని రద్దు చేయాలని, అది లింగ వివక్ష కిందికే వస్తుందని, రాజ్యాంగ నిబంధనలకు ఆ విధానం పూర్తిగా విరుద్ధమైనదని అన్నారు. 'లింగ వివక్షకు తప్పకుండా స్వస్తి పలకాలి. మనది పౌరులతో నిండిన సమాజం. మనది ప్రజాస్వామ్య దేశం. ఎందుకు లింగ వివక్ష ఉండాలి? ట్రిపుల్ తలాక్ అనేది లింగ వివక్షే. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమైనది. ఎవరో చేసిన పొరపాట్లకు నిస్సహాయ ఆడపడుచులు ఎందుకు శిక్షకు గురవ్వాలి. అందుకే, బీజేపీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ విధానం రద్దుకు గట్టి మద్దతుగా ఉంది. ప్రధాని నరేంద్రమోదీ కూడా ట్రిపుల్ తలాక్ విధానాన్ని గట్టిగా వ్యతిరేకించిన తర్వాత మరో బీజేపీ అగ్రనేత ఆ వ్యాఖ్యలు సమర్థిస్తూ మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. -
బలవంతపు భూ సేకరణ రాజ్యాంగ విరుద్ధం
గీసుకొండ : పరిశ్రమల పేరుతో రైతుల నుం చి వ్యవసాయ భూములను సేకరిం చడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంతల చంద్రారెడ్డి అన్నా రు. పరిశ్రమల కోసం చేపడుతున్న భూ సేకరణ సర్వేను ఆపాలని కోరు తూ బాధిత రైతులు మండలంలోని ఊకల్ క్రాస్ రోడ్డు వద్ద చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారంతో 5వ రోజుకు చేరుకున్నాయి. ఈసందర్భంగా దీక్షలకు చంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడు తూ.. నిరుపేద దళితులకు భూమిని పంపిణీ చేయడానికి సేకరించే ఎకరం భూమికి సర్కారు రూ. 7 లక్షల ధర నిర్ణయిస్తోందని, అయితే రైతుల నుం చి పరిశ్రమల కోసం సేకరించే భూమి కి ఎకరానికి రూ.7 లక్షల కంటే తక్కు వ ధర నిర్ణయిస్తోందన్నారు. ఇదేం న్యాయమని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం బలవంతపు భూ సర్వే, సేకరణ ప్రక్రియను నిలిపివేసి రైతుల అభిప్రాయాలను సేకరించాలన్నారు. దీక్షలో పాల్గొన్న వారిలో రైతు జేఏసీ రాష్ట్ర కోకన్వీనర్ మోర్తాల చందర్రావు, భూ నిర్వాసితుల పోరాట కమిటీ జిల్లా కన్వీనర్ రంగయ్య, ఐద్వా జిల్లా కార్యదర్శి నలిగంటి రత్నమాల, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేశ్, జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్, భూ సంరక్షణ కమిటీ అధ్యక్షుడు బేతినేని సర్పింగరావు, తీగల రవీందర్‌గౌడ్, ఎడ్ల శ్రీనివాస్, పుచ్చ రాజన్న, దుడ్డె వంకటలక్ష్మి, తీగల వీరలక్ష్మి, సరోజ, స్వరూప, రవీందర్ తదితరులు ఉన్నారు. -
లోధా ప్రతిపాదనలు రాజ్యాంగ విరుద్ధం!
కట్జూ తీవ్ర వ్యాఖ్యలు న్యూఢిల్లీ : లోధా కమిటీ సిఫారసులు అమలు చేయడంలో తర్జనభర్జనలకు లోనవుతున్న బీసీసీఐకి వారి సలహాదారు మార్కండేయ కట్జూ అండగా నిలిచారు. తమకు సహకారం అందించేందుకు బోర్డు ప్రత్యేకంగా నియమించుకున్న మాజీ న్యాయమూర్తి కట్జూ ఆదివారం లోధా కమిటీపై, దానికి అండగా నిలిచిన సుప్రీం కోర్టుపై తీవ్ర విమర్శలు చేశారు. ‘బీసీసీఐ విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధం, అక్రమం. బలవంతంగా నిబంధనలు బీసీసీఐపై రుద్దే హక్కు సుప్రీం కోర్టుకు కూడా లేదు. దీనిపై రివ్యూ పిటిషన్ వేయమని బోర్డుకు సలహా ఇచ్చా’ అని కట్జూ వెల్లడించారు. లోధా కమిటీ తీర్పుపై అభ్యంతరాలు ఉంటే బోర్డు మంగళవారం ఉదయం లోపే రివ్యూ పిటిషన్ వేసి స్టే తెచ్చుకోవాలి. -
జీవో-78 రాజ్యాంగ విరుద్ధం: కోదండరాం
రాజేంద్రనగర్: ఉద్యాన వర్సిటీలో ప్రొఫెసర్ల నియామకానికి సంబంధించి జీవో నంబర్ 78 రాజ్యాంగ విరుద్ధమని, దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వానికి సూచించారు. శనివారం రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ వర్సిటీల రిసెర్చ్ స్కాలర్స్ జేఏసీ ఆధ్వర్యంలో 'వర్సిటీలు-స్వయం ప్రతిపత్తి' అంశంపై జేఏసీ కన్వీనర్ కాటం శ్రీధర్ అధ్యక్షతన వెటర్నరీవర్సిటీ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ చేసిన చట్టం ద్వారా యూనివర్సిటీలు ఏర్పడ్డాయని తెలిపారు. వర్సిటీకి సంబంధించిన చట్టం ముందు ప్రభుత్వం ఇచ్చే జీవోలు చెల్లవని ఆయన తెలిపారు. యూనివర్సిటీ చట్టం ప్రకారమే అధ్యాపకుల నియామకాలు జరగాలని ఆయన స్పష్టం చేశారు. కేవలం సర్వీస్ కమిషనర్ ద్వారా అధ్యాపక నియామకాలు చేపడితే వర్సిటీలు బాగుపడతాయా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ... విశ్వవిద్యాలయాల నియామకాల్లో గతంలో ఏమైనా తప్పులు జరిగి ఉంటే ఓ కమిటీ వేసి అవి మరోసారి జరగకుండా చూడాలన్నారు. అంతేకానీ, అధ్యాపకుల నియామక బాధ్యతలను టీఎస్పీఎస్సీకి ఇవ్వడం ద్వారా సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ప్రైవేట్ విద్యాసంస్థల కన్వీనర్ ప్రభాకర్‌రెడ్డి, ప్రొఫెసర్లు జానయ్య, లక్ష్మణ్, విద్యాసాగర్, గోవర్థన్, హనుమాన్‌నాయక్, జేఏసీ నాయకులు సాయికుమార్, సంపత్, కిరణ్, శ్రావణ్, విద్యాసాగర్, రాజశేఖర్ తదితరులున్నారు. -
తెలంగాణ సర్వే చట్ట విరుద్ధం
నోటిఫికేషన్ ఇవ్వకుండానే చర్యలు హైకోర్టుకు నివేదించిన పిటిషనర్ అధికారికమే కానప్పుడు పిటిషన్ ఎలా వేస్తారని కోర్టు ప్రశ్న విచారణ నేటికి వాయిదా హైదరాబాద్: తెలంగాణ సర్కారు ఈ నెల 19న తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే చట్ట విరుద్ధమని, దాన్ని వెంటనే నిలిపేయాలని దాఖలైన పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు విచారించింది. హైదరాబాద్‌కు చెందిన గృహిణి సీతాలక్ష్మి దాఖలు చేసిన ఈ కేసులో ఆమె తరఫున న్యాయవాది ఎస్.రాజ్‌కుమార్ వాదనలు వినిపించారు. గణాంకాల సేకరణ చట్టం నిబంధనలకు విరుద్ధంగా రాష్ర్ట ప్రభుత్వం సర్వే నిర్వహణకు సిద్ధమైందని, ఇలాంటి సర్వే చేసే ముందు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయాలని, కానీ ప్రభుత్వం అలాంటిదేమీ జారీ చేయలేదని న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ దృష్టికి ఆయన తీసుకువచ్చారు. నోటిఫికేషన్ ఇవ్వకుండానే సర్వేకు నిధులు కేటాయిస్తూ జీవో 50ని జారీ చేసిందని పేర్కొన్నారు. ఆదాయపు పన్ను, బ్యాంకింగ్, బీమా, పౌరసత్వం తదితర విషయాలకు సంబంధించిన సమాచారాన్ని, గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించడానికి వీల్లేదని, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివని రాజ్‌కుమార్ వాదించారు. సర్వే సందర్భంగా 19వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, బ్యాంకులకు, ఇతర సంస్థలకు సెలవు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘నోటిఫికేషన్ జారీ చేయలేదని మీరే చెబుతున్నారు. మరి అలాంటప్పుడు సర్వే ప్రభుత్వ అధికారిక ప్రకటన కాదు కదా? మీరు చెబుతున్న జీవో 50 నిధుల కేటాయింపునకు సంబంధించింది మాత్రమే. పత్రికా కథనాల ఆధారంగా పిటిషన్ దాఖలు చేస్తే ఎలా?’ అని ప్రశ్నించారు. దీనికి రాజ్‌కుమార్ సమాధానమిస్తూ.. 19న సమగ్ర సర్వే చేయడం లేదని అడ్వొకేట్ జనరల్ చెబితే, తదుపరి విచారణ చేపట్టకుండానే ఈ వ్యాజ్యాన్ని కొట్టివేయొచ్చన్నారు. కోర్టు సమయం ముగియడంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది. -
ఇది రాజ్యాంగ ఉల్లంఘనే: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: పోలవరం ముంపు ప్రాంతాలను ఏపీలో కలుపుతూ తెచ్చిన సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర నిరసన తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని కేంద్రం పూర్తిగా ఉల్లంఘించిందని, ఎన్డీయే ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని శుక్రవారం ఆయన మండిపడ్డారు. భద్రాచలం డివిజన్లోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడాన్ని టీఆర్ఎస్ మొదటి నుంచీ వ్యతిరేకిస్తోందన్నారు. తాను స్వయంగా రాష్ర్టపతిని కలిసి పోలవరం డిజైన్‌ను మార్చాలని కోరినట్లు కేసీఆర్ గుర్తు చేశారు. కేంద్రాన్ని కూడా డిమాండ్ చేసినప్పటికీ ఈ విషయంలో మొండిగా వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, తెలుగుదేశం పార్టీలు విప్ జారీ చేసి పంతం నెగ్గించుకుంటుంటే తెలంగాణలోని ఆ పార్టీల ఎంపీలు అడ్డుకుని ఉండాల్సిందన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఎంత పోరాటం చేసినా కేంద్రం మందబలంతో వారి గొంతు నొక్కేసిందన్నారు. తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రజల మనోభావాలను పట్టించుకోలేదని, రాష్ట్రాల హక్కులను కాలరాసిందని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందినా కూడా ముంపు మండలాలను కాపాడుకునే విషయంలో అనుసరించాల్సిన కార్యాచరణపై ప్రభుత్వపరంగా ఆలోచిస్తున్నామని, న్యాయ, రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చితే ఈ సమస్య ఉండదనేది తన అభిప్రాయమని సీఎం పేర్కొన్నారు. -
తెలంగాణపై స్టే ఇవ్వలేం : సుప్రీం కోర్టు
-
విభజన వ్యతిరేక పిటిషన్లపై నేడు సుప్రీంలో విచారణ
-
విభజన వ్యతిరేక పిటిషన్లపై నేడు సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ మేరకు దాఖలైన 12 పిటిషన్లు దేశ అత్యున్నత న్యాయస్థానం నేడు విచారణకు స్వీకరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం రాజ్యాంగ విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా, బలవంతంగా విభజిస్తోందని.. ఆ బిల్లును అడ్డుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 19న పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే ఈ విభజనపై స్టే ఇవ్వాలని విన్నవిస్తూ కేంద్ర న్యాయశాఖ, కేబినెట్ సచివాలయం, హోంశాఖలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అలాగే మాజీ శాసనసభ్యుడు అడుసుమిల్లి జయప్రకాశ్, బీజేపీ నాయకుడు రఘురామకృష్ణంరాజులు కలిపి మరొక పిటిషన్ దాఖలు చేశారు. వీరితోపాటు మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, రాయపాటి సాంబశివరావు, సీఎం రమేశ్ తదితరులు కూడా విభజనపై పిటిషన్లు వేశారు. వీటిపై న్యాయమూర్తులు జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. -
విభజన పిటిషన్లపై నేడు సుప్రీంలో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన 12 పిటిషన్లు శుక్రవారం విచారణకు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం రాజ్యాంగ విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా, బలవంతంగా విభజిస్తోందని.. ఆ బిల్లును అడ్డుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 19న పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే ఈ విభజనపై స్టే ఇవ్వాలని విన్నవిస్తూ కేంద్ర న్యాయశాఖ, కేబినెట్ సచివాలయం, హోంశాఖలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అలాగే మాజీ శాసనసభ్యుడు అడుసుమిల్లి జయప్రకాశ్, బీజేపీ నాయకుడు రఘురామకృష్ణంరాజులు కలిపి మరొక పిటిషన్ దాఖలు చేశారు. వీరితోపాటు మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, రాయపాటి సాంబశివరావు, సీఎం రమేశ్ తదితరులు కూడా విభజనపై పిటిషన్లు వేశారు. వీటిపై న్యాయమూర్తులు జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. -
గ్యాస్ ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధం
హైకోర్టులో పాలెం శ్రీకాంత్‌రెడ్డి పిల్ సాక్షి, హైదరాబాద్: కేజీ(కృష్ణా-గోదా వరి) బేసిన్లో రిలయన్స్ కంపెనీ వెలికి తీసిన గ్యాస్‌ను రాష్ట్రానికి కేటాయించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ జనపాలన పార్టీ అధ్యక్షుడు పాలెం శ్రీకాంత్‌రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కేజీ బేసిన్ గ్యాస్‌ను రాష్ట్రానికి కేటాయించేలా తగిన చర్యలు తీసుకునేటట్లు కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు. ఇం దులో కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి, పెట్రోలియం మంత్రిత్వశాఖ కార్యదర్శి, హైడ్రోకార్బన్స్ డెరైక్టర్ జనరల్, రిల యన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఏపీజెన్కో, ట్రాన్స్‌కో, కేంద్ర ఎన్నికల సంఘం, సీబీఐలతో పాటు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. -
విభజన బిల్లు రాజ్యాంగ విరుద్ధం
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఏపీఎన్జీఓ, వివిధ రాజకీయ పక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో గురువారం చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంతో పాటు పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నాయకులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. విజయనగరంలో టీడీపీ నాయకులు రైల్‌రోకో చేపట్టారు. బంద్ ప్రభావంతో జిల్లా కేంద్రం బోసిపోయింది. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. వైద్య ఉద్యోగులు సోనియా గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. విభజనకు సహకరిస్తున్న పాలకులకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సమైక్యవాదులు పిలుపునిచ్చారు. విజయనగరం టౌన్, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నా విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం రాజ్యంగ విరుద్ధమని విశాలాంధ్ర మహాసభ జిల్లా అధ్యక్షుడు మా మిడి అప్పలనాయుడు అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకం గా గురువారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాహుల్ గాంధీ కోసం కేసీఆర్, కోదండరాంరెడ్డి తెలుగు ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. చిన్న రాష్ట్రాల వల్ల ఉగ్రవాదం పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటీష్ వారి విభజించు.. పాలించు పద్ధతిని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు బిల్లును అడ్డుకుని సోనియాగాంధీకి బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో మహా సభ జిల్లా కోకన్వీనర్ మద్దిల సోంబాబు, కార్యదర్శి కిశోర్, విద్యార్ధి సంఘ నాయకులు భరత్, శ్యామ్, పాల్గొన్నారు. చరిత్ర హీనులవుతారు.. విజయనగరం మున్సిపాలిటీ : పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రాష్ట్ర విభజన బిల్లును సీమాంధ్రకు చెందిన ఎంపీలందరూ పార్టీలకతీతంగా అడ్డుకోవాలని, లేనిపక్షంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు విమర్శించారు. బంద్‌లో భాగంగా టీడీపీ నాయకులు రైల్‌రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సోనియాగాంధీ దేశాన్ని నాశనం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం విడిపోతే తెలుగు ప్రజలందరూ నష్టపోతారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎస్.ఎన్.ఎం.రాజు, మన్యాల కృష్ణ, వి.వి.ప్రసాద్, కనకల మురళీమోహన్, ప్రసాదుల రామకృష్ణ, సైలాడ త్రినాథ్, మైలపల్లి పైడిరాజు, మోహనరావు, నైదాన శ్రీను, కోండ్రు శ్రీనువాసరావు, గెదేల ఆదిబాబు, మద్దాల ముత్యాలరావు, తదితరులు పాల్గొన్నారు. జాతి విద్రోహులను ప్రజలు క్షమించరు విజయనగరం టౌన్ :రాష్ట్ర పునర్విభజనకు పూనుకున్న కాంగ్రెస్, టీడీపీ జాతి విద్రోహులను ప్రజలు ఎప్పటికీ క్షమించరని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అవనాపు విజయ్ అన్నారు. ఏపీఎన్జీఓలు పిలుపునిచ్చిన బంద్‌కు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి సుమారు వంద బైక్‌లపై ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బాలాజీ రోడ్డు, కోట జంక్షన్, మూడులాంతర్లు, కన్యకాపరమేశ్వరీ కోవెల మీదుగా గూడ్స్‌షెడ్ , బాలాజీ మార్కెట్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, పార్లమెంటులో ప్రవేశపెట్టిన రాష్ట్ర విభజన బిల్లు పూర్తిగా తప్పుడు తడకలతో కూడుకున్నదన్నారు. చట్టాల పట్ల గౌరవం లేని యూపీఏ ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు అవనాపు విక్రమ్, కాళ్ల గౌరీశంకర్ మాట్లాడుతూ ఓట్లు, సీట్ల కోసం యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రాంబార్కి సత్యం, నామాల సర్వేశ్వరరావు, బొద్దూరు లక్ష్మణరావు, తొగరోతు నారాయణప్పడు, మొయిద ఆదిబాబు, వంకర గురుమూర్తి, వాజా మంగమ్మ, సియ్యాదుల శేఖర్, సతీష్‌రెడ్డి, పొట్నూరు శివ, సాధుకృష్ణ, భీమరశెట్టి ఉపేంద్ర, అలమండ గౌరి, పూల్‌బాగ్ నారాయణ, దేవి, పడగల శ్రీను అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ పోరాడాలి విజయనగరం లీగల్ : విభజన ప్రక్రియను అడ్డుకోవడానికి అందరూ పోరాడాలని రాష్ట్ర బార్ కౌన్సెల్ సభ్యుడు కేవీఎన్ తమ్మన్నశెట్టి, పట్టణ న్యాయవాదులు సంఘ అధ్యక్షుడు జి.రామ్మోహన్రావు, ఉపాధ్యక్షుడు కె. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సమైక్యాంధ్రకు మద్దతుగా స్థానిక కోర్టు ఎదుట న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విభజన బిల్లును అడ్డుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం తమ్మన్నశెట్టి మాట్లాడుతూ, ఈ నెల 17న ఢిల్లీలో చేపట్టనున్న ధర్నాకు న్యాయవాదులు భారీగా హాజరవుతారని చెప్పారు. విశాఖపట్నం నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో సంఘ కార్యదర్శి శివప్రసాద్, న్యాయవాదులు పాల్గొన్నారు. బిల్లును వ్యతిరేకించాలి విజయనగరం ఆరోగ్యం : సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు మూకుమ్మడిగా విభజన బిల్లును వ్యతిరేకించాలని వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి. ఇజ్రాయిల్ కోరారు. స్థానిక కేంద్రాస్పత్రి వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. అనంతరం సోనియా దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సోనియా డౌన్ డౌన్, యూపీఐ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇజ్రాయిల్ మాట్లాడుతూ, సోనియాగాంధీ తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైద్యులు సత్యశేఖర్, మధుకర్, సత్యశ్రీనివాస్, శ్రీకాంత్, వైద్య ఉద్యోగుల సంఘం నాయకులు ఆచారి, ఉమాపతి, భువనేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీ జన్‌లోక్‌పాల్..రాజ్యాంగ విరుద్ధం
పార్టీ ఏర్పాటు నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు దూకుడుగా వ్యవహరించి, అన్నింటా సఫలీకృతమైన కేజ్రీవాల్‌కు ఢిల్లీ జన్‌లోక్‌పాల్ బిల్లును అమల్లోకి తేవడంలో మాత్రం అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఓైవె పు ప్రభుత్వానికి మద్దతిస్తూనే బిల్లు విషయంలో కాంగ్రెస్ మోకాలడ్డుతుండగా, రాజ్యాంగపరమైన సమస్యలు కూడా కేజ్రీవాల్ సర్కారును ఇరకాటంలో పడేస్తున్నాయి. న్యూఢిల్లీ:ఆమ్ఆద్మీ పార్టీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జన్‌లోక్‌పాల్ బిల్లుకు ఇప్పట్లో మోక్షం లభించే అవకాశాలు కనిపించడంలేదు. కేంద్ర అనుమతి లేకుండా బిల్లును ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్ గురువారం నివేదించారు. దీంతో ఈ బిల్లు కథ మళ్లీ మొదటికొచ్చినట్లయ్యింది.. ఢిల్లీకి ప్రత్యేక జన్‌లోక్‌పాల్ బిల్లు తీసుకువస్తామని ఎన్నికల సమయంలో ఆమ్ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే బిల్లును అమలులోకి తీసుకువస్తామని అప్పట్లో ప్రకటించింది. కాగా, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అయితే ఈ బిల్లుపై కాంగ్రెస్ మొదటినుంచి మడతపేచీ పెడుతోంది. లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి తీసుకోనిదే బిల్లును కేబినెట్లో ప్రవేశపెట్టరాదని కాంగ్రెస్ ఇప్పటికే అల్టిమేటం జారీ చేసింది. ముందస్తు అనుమతి లేకుండా బిల్లును ప్రవేశపెడితే తాము వ్యతిరేకిస్తామని ఆ పార్టీ ముందే హెచ్చరించింది. కాగా, వచ్చే వారం బహిరంగ స్థలంలో జన్‌లోక్‌పాల్‌ను ప్రవేశపెడతామని ఆప్ భీష్మించుకుని కూర్చున్న విషయం తెలిసిందే. కాగా, కేంద్ర అనుమతి లేకుండానే బిల్లును ప్రవేశపెడతామన్న ఆప్ సర్కార్ ప్రతిపాదనలోని రాజ్యాంగబద్ధతపై ఎస్జీని సంప్రదించారు. కాగా, కేంద్ర అనుమతి లేకుండా ఆప్ సర్కార్ బిల్లును ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్ధమేనని సొలిసిటర్ జనరల్ స్పష్టం చేశారు. గత ఏడాది పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం లోక్‌పాల్, లోకాయుక్త చట్టాలను ఆమోదించిందని, అవి ప్రస్తుతం అమలులో ఉన్నందున ఢిల్లీ ప్రభుత్వం మళ్లీ జన్‌లోక్‌పాల్ చట్టం చేయడానికి యత్నిస్తే అది కేంద్ర చట్టాన్ని పరిహసించినట్లేనని వివరించారు. కాబట్టి దీనికి రాష్ట్రపతి అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని సొలిసిటర్ జనరల్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, జన్‌లోక్‌పాల్ బిల్లు ప్రతిపాదనను ఆదిలోనే వ్యతిరేకించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ప్రభుత్వ యోచన రాజ్యాంగ వ్యతిరేకమైనదని సొలిసిటర్ జనరల్ స్పష్టం చేసినందున ఆప్ సర్కార్‌ను బిల్లుపై ముందుకు పోకుండా నిలువరించాలని విజ్ఞప్తి చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలవాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు. ‘ఈ బిల్లు వ్యవహారంలో మేం తుదికంటా పోరాడతాం. కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ సర్కార్ రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేందుకు అంగీకరించం..’ అని డీపీసీసీ అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ అన్నారు. అయితే జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టే విషయంలో తాము వెనక్కి తగ్గేది లేదని ఆప్ సర్కార్ మరోసారి స్పష్టం చేసింది. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము వెరవబోమని, మద్దతు ఇవ్వాలా వద్దా అనేది ఆయా పార్టీల ఇష్టమని ఆప్ నాయకులు అంటున్నారు. తమది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని, ఎవరికీ భయపడబోమని వారు ఢంకా బజాయిస్తున్నారు. కాగా,ఈ నెల 13వ తేదీన బిల్లును ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. దానికి ముందు స్పోర్ట్స్ స్టేడియంలో రెండు రోజుల పాటు బిల్లుపై చర్చ జరిపాలని యోచిస్తోంది. కాగా, జన్‌లోక్‌పాల్ బిల్లు విషయంలో ఎల్జీకి సొలిసిటర్ జనరల్ నివేదికపై కేంద్ర మంత్రి మనీష్ తివారి స్పందిస్తూ.. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందేనన్నారు. ఆప్ సర్కార్ రాజ్యాంగబద్ధంగానే ఏర్పాటైంది కాబట్టి అది రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించాలనుకోవడం అనుచితమవుతుందన్నారు. రాష్ట్రపతి అనుమతి తీసుకున్న తర్వాతే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని సూచించారు. -
రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన
నరసరావుపేట వెస్ట్, న్యూస్‌లైన్: కేంద్రంలోని యుపీఏ ప్రభుత్వం, సోనియాగాంధీ రాజ్యాంగానికి, సంప్రదాయానికి, చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజనకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ కోడెల శివప్రసాదరావు విమర్శించారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకవైపు సీమాంధ్ర ప్రజలు, మరోవైపు తెలంగాణ లోని మెజార్టీ ప్రజలు రాష్ర్ట విభజనను వ్యతిరేకిస్తున్నారన్నారు. అయినప్పటికీ కేంద్రం రాష్ట్రాన్ని విభిజించేందుకు పూనుకుందన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ప్రతులను యుద్ధ విమానంలో రాష్ట్రానికి తీసుకురావాల్సినంత అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. రాష్ర్టంపై యుద్ధం చేసేందుకే వచ్చారా అంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఆరు కోట్లమంది ప్రజలు విభజనకు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. చట్టసభల్లో పోరాటం చేయకుండా సిగ్గులేకుండా విభజనకు పాల్పడుతున్నారన్నారు. ఇటువంటి విభజన గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. విభజన రాజ్యాంగంలోని 371(డి) ఆర్టికల్ 3ని ఉల్లంఘించి జరుగుతుం దన్నారు. విభజన అనేది అన్ని పక్షాల ఆమోదంతో జరగాల్సివుండగా ఎమ్మెల్యేల అభిప్రాయానికి వ్యతిరేకంగా రాష్ర్టపతి కూడా నిర్ణయం తీసుకున్నారన్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించినా ఇంకా విభజన చేయాలనే తలంపుతోనే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. భారత సంతతి కాని సోనియాగాంధీ ఇటలీ నుంచి వచ్చి ఇక్కడ ఒక మాఫి యాలా వ్యవహరిస్తోందని విమర్శించారు. రానున్న 20 ఏళ్ల వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనిపించదని డాక్టర్ కోడెల జోస్యం చెప్పారు. సొంత పార్టీ ఎంపీలే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస నోట్ ఇవ్వటంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధోగతిగా తయారైందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్లో చర్చలంటేనే భయపడే పరిస్థితికి చేరుకుందన్నారు. రాహూల్ గాంధీ పేరు చెబితే ఓట్లుకూడా పడని పరిస్థితి ఎదురైందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతమయ్యేవరకు సీమాంధ్రలో ఉద్యమం సాగుతుందని చెప్పారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు వేల్పుల సింహాద్రియాదవ్, జిల్లా ప్రచార కార్యదర్శి కొల్లి ఆంజనేయులు, మాజీ ఎంపీపీ కడియం కోటిసుబ్బారావులు పాల్గొన్నారు. -
సీబీఐ ఉనికి ప్రశ్నార్థకం?
గౌహతి హైకోర్టు తీర్పుతో ప్రకంపనలు కేంద్ర ప్రభుత్వం, న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చ తీర్పుపై నేడే సుప్రీంలో పిటిషన్ వేస్తామని కేంద్రం వెల్లడి ప్రధాని మన్మోహన్‌తో సమావేశమైన మంత్రి నారాయణస్వామి 2జీ కేసులో సీబీఐ విచారణ ఆపేయాలన్న న్యాయవాదులు సీబీఐ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమంటూ గౌహతి హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు సీబీఐని ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు తెరలేపింది. 2జీ కుంభకోణం వంటి కీలక కేసులపైనా ఈ తీర్పు ప్రభావం పడింది. సీబీఐ సంస్థే రాజ్యాంగ విరుద్ధమైనప్పుడు ఇక ఆ విభాగం చేస్తున్న దర్యాప్తునకు విలువ లేదంటూ కోర్టుల్లో న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ తీర్పుతో సీబీఐ ఉనికే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి తలెత్తడంతో కేంద్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద స్పందించింది. తీర్పుపై స్టే విధించాలంటూ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ పెద్దల్లో చర్చలే చర్చలు.. సీబీఐ తన మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఉండడంతో సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ మంత్రి వి.నారాయణస్వామి శుక్రవారం ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసి కోర్టు తీర్పుపై చర్చించారు. తర్వాత పలు శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇందులో సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హాతోపాటు న్యాయశాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ కూడా మంత్రి నారాయణస్వామితో సమావేశమై తీర్పు విషయంలో అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. సుప్రీంలో దాఖలు చేయబోయే పిటిషన్‌కు రూపకల్పన చేసిన అనంతరం రంజిత్ సిన్హా.. అటార్నీ జనరల్ జీఈ వాహనవతితో భేటీ అయ్యారు. కేంద్రం శనివారమే సుప్రీంలో పిటిషన్ దాఖలు చేస్తుందని, సోమవారం విచారణకు వస్తుందని సిన్హా విలేకరులకు వెల్లడించారు. గౌహతి హైకోర్టు తీర్పుపై ప్రశ్నించగా.. ‘‘మేం మా పనిని ఎప్పట్లాగే చేస్తున్నాం. సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసులపై ఆ తీర్పు ప్రభావం ఉండదు’’ అని ఆయన తెలిపారు. సీబీఐ కేసులు చెల్లవంటూ రాజా, సజ్జన్ కేసుల్లో న్యాయవాదుల వాదనలు.. గౌహతి హైకోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం కోర్టుల్లో ఆసక్తికర వాదనలు జరిగాయి. సీబీఐ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమైనందున 2జీ కేసు విచారణపై స్టే విధించాలని కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజాతోపాటు ఆ కేసులో పలువురు నిందితులు ఢిల్లీ కోర్టును కోరారు. కేసు విచారణను కొనసాగించినట్లయితే అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని వారి తరఫు న్యాయవాదులు జడ్జికి విన్నవించారు. అయితే వారి వాదనలను సీబీఐ ప్రత్యేక జడ్జి ఓపీ సైనీ తోసిపుచ్చారు. వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా నిర్ణయం తీసుకోలేనని చెప్పారు. దీంతో నిందితుల తరఫు న్యాయవాదులు అప్పటికప్పుడు కోర్టు తీర్పును జడ్జికి చూపించారు. ఈ కేసులో విచారణను నిలిపివేయాల్సిందిగా కోరుతూ సోమవారం పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. 1984 నాటి సిక్కుల అల్లర్ల కేసులో నిందితుడు, కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ కూడా ఇదే వాదనను వినిపించారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు చట్ట వ్యతిరేకమని ప్రకటించాల్సిందిగా కోర్టును అభ్యర్థించారు. తనపై దాఖలు చేసిన అభియోగాలన్నింటినీ కొట్టివేయాలని ఆయన కోరారు. -
'అభయ' కేసులో బార్ అసోసియేషన్ తీర్మానం రాజ్యాంగ విరుద్ధం
సుమారు ఏడాది క్రితం దేశ రాజధానిలో 'నిర్భయ' ఉదంతాన్ని పోలిన మరో దుర్ఘటన రాష్ట్ర రాజధానిలో జరగటం సభ్య సమాజాన్ని కలవరపాటుకి గురిచేసింది. 'అభయ 'గా పోలీసులు వ్యవహరిస్తున్న ఈ కేసులో నేర తీవ్రత విషయంలో తేడా ఉన్నప్పటికీ, ఆ అఘాయిత్యం జరిగిన తీరు ఆడపిల్లల భద్రతపై కొత్త భయాలు రేపింది. ఇదిలా ఉండగా, అభయ కేసు నిందితుల తరపున ఎవరూ వాదించకూడదని రంగారెడ్డి కోర్టు బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే కొన్ని తీవ్రమైన నేరాల విషయంలో ప్రజలు భావోద్రేకాలకి గురౌతారు. ఆ ఆవేశమే యాసిడ్ దాడి చేసిన నేరస్తుడిని ఎన్కౌంటర్ ద్వారా హతం చేయాలని, ఉగ్రవాద దుశ్చర్యలకి పాల్పడిన వ్యక్తిని విచారణ లేకుండా ఉరితీయాలని, రేప్ చేసిన వాడిని నపుంసకుడుగా మార్చాలని డిమాండ్లు చేయిస్తుంది. వ్యక్తులు లోనయ్యే ఇటువంటి ఆవేశకావేశాలకి వ్యవస్థలు లోను కాకూడదని సుప్రీం కోర్టు పలుసార్లు వ్యాఖ్యానించింది. తాజాగా, అభయ కేసు విషయానికి వస్తే, నిందితులైన డ్రైవర్లు సతీష్, వెంకటేశ్వర్లు తరపున ఎవరూ వాదించకూడదని రంగారెడ్డి కోర్టు బార్ అసోసియేషన్ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. సదరు బార్ అసోసియేషన్ ఈ నిర్ణయం ద్వారా బహుశా ఒక విషయాన్ని స్పష్టం చేయదలిచుకుంది: అభయ కేసులో నిందితుల తరఫున వాదించడమంటే అన్యాయానికి వకాల్తా పుచ్చుకున్నట్టే కాబట్టి, దానిని ఆ బార్ అసోసియేషన్‌లో సభ్యులైన న్యాయవాదులు అందరూ మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నారు. తద్వారా, తాము అప్పటి వరకీన్యాయం వైపే నిలబడ్డామని, అన్యాయం పక్షాన ఏనాడూ లేనేలేమని. ఒకవేళ న్యాయం పట్ల వారి నిబద్ధత నిజమే అని నమ్మాల్సి వచ్చినా, రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు తీసుకునే హక్కు మాత్రం బార్ అసోసియేషన్‌కు లేదనే చెప్పుకోవాలి. కోర్టులో న్యాయం పొందటం దేశంలోని ప్రతి పౌరుడికీ రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు. ఆ రాజ్యాంగ హక్కు కాలరాచే తీర్మానం చేయడానికి బార్ అసోసియేషన్‌కు హక్కు లేదని పలు సందర్భాలలో సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టింది. "మీ అంతట మీరే చట్టము, తీర్పు కాబోరని" దేశ అత్యున్నత న్యాయస్థానం గతంలో చేసిన హితవుల్ని బార్ అసోసియేషన్లు పెడచెవిన పెట్టడానికి కారణం- అటువంటి సంచలనాత్మక తీర్మానాల ద్వారా మీడియాలో వచ్చే ప్రచారమే. -
జగన్‌లా వేషం వేశారన్న అభిమాని పై దాడి చేసిన టీడీపీ