బలవంతపు భూ సేకరణ రాజ్యాంగ విరుద్ధం | Forced land acquisition unconstitutional | Sakshi
Sakshi News home page

బలవంతపు భూ సేకరణ రాజ్యాంగ విరుద్ధం

Published Sun, Sep 11 2016 11:42 PM | Last Updated on Tue, Oct 2 2018 8:44 PM

పరిశ్రమల పేరుతో రైతుల నుం చి వ్యవసాయ భూములను సేకరిం చడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంతల చంద్రారెడ్డి అన్నా రు.

గీసుకొండ : పరిశ్రమల పేరుతో రైతుల నుం చి వ్యవసాయ భూములను సేకరిం చడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంతల చంద్రారెడ్డి అన్నా రు. పరిశ్రమల కోసం చేపడుతున్న భూ సేకరణ సర్వేను ఆపాలని కోరు తూ బాధిత రైతులు మండలంలోని ఊకల్‌ క్రాస్‌ రోడ్డు వద్ద చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారంతో 5వ రోజుకు చేరుకున్నాయి. ఈసందర్భంగా దీక్షలకు చంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడు తూ.. నిరుపేద దళితులకు భూమిని పంపిణీ చేయడానికి సేకరించే ఎకరం భూమికి సర్కారు రూ. 7 లక్షల ధర నిర్ణయిస్తోందని, అయితే రైతుల నుం చి పరిశ్రమల కోసం సేకరించే భూమి కి ఎకరానికి రూ.7 లక్షల కంటే తక్కు వ ధర నిర్ణయిస్తోందన్నారు. ఇదేం న్యాయమని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం బలవంతపు భూ సర్వే, సేకరణ ప్రక్రియను నిలిపివేసి రైతుల అభిప్రాయాలను సేకరించాలన్నారు. దీక్షలో పాల్గొన్న వారిలో రైతు జేఏసీ రాష్ట్ర కోకన్వీనర్‌ మోర్తాల చందర్‌రావు, భూ నిర్వాసితుల పోరాట కమిటీ జిల్లా కన్వీనర్‌ రంగయ్య, ఐద్వా జిల్లా కార్యదర్శి నలిగంటి రత్నమాల, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేశ్, జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్, భూ సంరక్షణ కమిటీ అధ్యక్షుడు బేతినేని సర్పింగరావు, తీగల రవీందర్‌గౌడ్, ఎడ్ల  శ్రీనివాస్, పుచ్చ రాజన్న, దుడ్డె వంకటలక్ష్మి, తీగల వీరలక్ష్మి, సరోజ, స్వరూప, రవీందర్‌ తదితరులు ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement