కట్జూ తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : లోధా కమిటీ సిఫారసులు అమలు చేయడంలో తర్జనభర్జనలకు లోనవుతున్న బీసీసీఐకి వారి సలహాదారు మార్కండేయ కట్జూ అండగా నిలిచారు. తమకు సహకారం అందించేందుకు బోర్డు ప్రత్యేకంగా నియమించుకున్న మాజీ న్యాయమూర్తి కట్జూ ఆదివారం లోధా కమిటీపై, దానికి అండగా నిలిచిన సుప్రీం కోర్టుపై తీవ్ర విమర్శలు చేశారు. ‘బీసీసీఐ విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధం, అక్రమం. బలవంతంగా నిబంధనలు బీసీసీఐపై రుద్దే హక్కు సుప్రీం కోర్టుకు కూడా లేదు. దీనిపై రివ్యూ పిటిషన్ వేయమని బోర్డుకు సలహా ఇచ్చా’ అని కట్జూ వెల్లడించారు. లోధా కమిటీ తీర్పుపై అభ్యంతరాలు ఉంటే బోర్డు మంగళవారం ఉదయం లోపే రివ్యూ పిటిషన్ వేసి స్టే తెచ్చుకోవాలి.