Katju
-
లోధా ప్రతిపాదనలు రాజ్యాంగ విరుద్ధం!
కట్జూ తీవ్ర వ్యాఖ్యలు న్యూఢిల్లీ : లోధా కమిటీ సిఫారసులు అమలు చేయడంలో తర్జనభర్జనలకు లోనవుతున్న బీసీసీఐకి వారి సలహాదారు మార్కండేయ కట్జూ అండగా నిలిచారు. తమకు సహకారం అందించేందుకు బోర్డు ప్రత్యేకంగా నియమించుకున్న మాజీ న్యాయమూర్తి కట్జూ ఆదివారం లోధా కమిటీపై, దానికి అండగా నిలిచిన సుప్రీం కోర్టుపై తీవ్ర విమర్శలు చేశారు. ‘బీసీసీఐ విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధం, అక్రమం. బలవంతంగా నిబంధనలు బీసీసీఐపై రుద్దే హక్కు సుప్రీం కోర్టుకు కూడా లేదు. దీనిపై రివ్యూ పిటిషన్ వేయమని బోర్డుకు సలహా ఇచ్చా’ అని కట్జూ వెల్లడించారు. లోధా కమిటీ తీర్పుపై అభ్యంతరాలు ఉంటే బోర్డు మంగళవారం ఉదయం లోపే రివ్యూ పిటిషన్ వేసి స్టే తెచ్చుకోవాలి. -
హిందూ, ముస్లింల మైండ్సెట్ మారాలి: కట్జూ
న్యూఢిల్లీ: హిందువులు, ముస్లింలు నిజమైన భారతీయులు అనిపించుకోవాలంటే ముందువారి మైండ్సెట్ మారాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ ఆదివారం వ్యాఖ్యానించారు. ఎస్సీలను చిన్నచూపు చూడటం మానేసినప్పుడే హిందువులు నిజమైన భారతీయులు అనిపించుకుంటారని, ఎస్సీలు, ఎస్సీయేతరుల మధ్య పెద్ద సంఖ్యలో వివాహాలు జరగాలని చెప్పారు. ముస్లింలలోనూ అగ్రకులాలు-తక్కువ కులాలు అనే తారతమ్యం పోవాలని ఆకాంక్షించారు. మహిళలను తక్కువగా చూసే ముస్లిం పర్సనల్ లాను రద్దు చేయాలని ముస్లింలంతా డిమాండ్ చేయాలని కట్జూ తన బ్లాగ్లో సూచించారు. -
కట్జూ వ్యవహారం నిరర్థకం: మన్మోహన్
న్యూఢిల్లీ: తమిళనాడు జడ్జిని కొనసాగించే విషయంలో ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు రాజీ పడ్డారంటూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ రేపిన వివాదం నిరర్థకమైందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఈ వివాదంపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న మన్మోహన్ ఎట్టకేలకు స్పందించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీ ఇప్పటికే ఈ వివాదంపై మాట్లాడారని.. ఇక తాను కామెంట్ చేయటానికి ఏమీ లేదని స్పష్టం చేశారు. ‘జడ్జీల బిలు’లపై అభిప్రాయాలు కోరనున్న కేంద్రం జడ్జీలను జడ్జీలే నియమించే ప్రస్తుత కొలీజియం వ్యవస్థ స్థానంలో జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లుపై కేంద్ర ప్రభుత్వం న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకోనుంది. దీనిపై న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారమిక్కడ న్యాయ నిపుణులు, మాజీ జడ్జీలతో సమావేశమై అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. -
జస్టిస్ కట్జూ సంచలన వ్యాఖ్యలు