హైకోర్టులో పాలెం శ్రీకాంత్‌రెడ్డి పిల్
సాక్షి, హైదరాబాద్: కేజీ(కృష్ణా-గోదా వరి) బేసిన్‌లో రిలయన్స్ కంపెనీ వెలికి తీసిన గ్యాస్‌ను రాష్ట్రానికి కేటాయించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ జనపాలన పార్టీ అధ్యక్షుడు పాలెం శ్రీకాంత్‌రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కేజీ బేసిన్ గ్యాస్‌ను రాష్ట్రానికి కేటాయించేలా తగిన చర్యలు తీసుకునేటట్లు కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. ఇం దులో కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి, పెట్రోలియం మంత్రిత్వశాఖ కార్యదర్శి, హైడ్రోకార్బన్స్ డెరైక్టర్ జనరల్, రిల యన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఏపీజెన్‌కో, ట్రాన్స్‌కో, కేంద్ర ఎన్నికల సంఘం, సీబీఐలతో పాటు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
గ్యాస్ ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధం
Published Wed, Mar 5 2014 12:53 AM | Last Updated on Sat, Sep 2 2017 4:21 AM
Advertisement
Advertisement