కేజీ బేసిన్ గ్యాస్ ధరలపై రిలయన్స్ కంపెనీ వ్యవహరిస్తున్న తీరు వల్ల ప్రజలపై పెనుభారం పడుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పేర్కొంది.
సాక్షి, హైదరాబాద్: కేజీ బేసిన్ గ్యాస్ ధరలపై రిలయన్స్ కంపెనీ వ్యవహరిస్తున్న తీరు వల్ల ప్రజలపై పెనుభారం పడుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను రిలయన్స్ అధినేతలైన అంబానీలు గుప్పిట్లో పెట్టుకొన్నారని ఆ పార్టీ ఆరోపించింది. గురువారమిక్కడ ఆప్ నేతలు కిరణ్‌కుమార్, చక్రిలతో కలిసి రాష్ట్రశాఖ కన్వీనర్ బి. రామకృష్ణంరాజు విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రజలపై రూ. 4 వేల కోట్ల భారం పడే గ్యాస్ ధర పెంపుదలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. అంబానీకి అమ్ముడుపోయారా అంటూ ప్రశ్నించారు.