ఢిల్లీ ఫలితాలు: ఇవేం మీమ్స్‌రా బాబూ.. నవ్వలేక చస్తున్నాం! | Funny Memes Made on Arvind Kejriwal and Rahul Gandhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ఫలితాలు: ఇవేం మీమ్స్‌రా బాబూ.. నవ్వలేక చస్తున్నాం!

Published Sun, Feb 9 2025 12:43 PM | Last Updated on Sun, Feb 9 2025 1:05 PM

Funny Memes Made on Arvind Kejriwal and Rahul Gandhi

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. రాజధానిలో 27 ఏళ్ల తరువాత అధికారం చేపట్టబోతోంది. అయితే ఈ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ, కంగ్రెస్‌ ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నాయి. ఈ ఓటమిపై పలువురు సోషల్‌ మీడియాలో మీమ్స్‌ క్రియేట్‌ చేసి, అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నారు. వీటిని చూసినవారు క్రియేటర్లను మెచ్చుకుంటూ.. ఈ మీమ్స్‌ను చూసి, నవ్వకుండా ఉండలేకపోతున్నామంటున్నారు. 
 

మళ్లీ జైలుకే..
వైరల్‌ అవుతున్న ఒక  మీమ్‌లో అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రజలతో మాట్లాడుతూ.. ‘ఒకవేళ మీరంతా కమలం బటన్‌ నొక్కితే నేను మరోమారు జైలుకు వెళ్లవలసి వస్తుంది. అప్పుడేమి జరుగుతుందో మీరే చూడండి’ అనడం కనిపిస్తుంది.

డబ్ల్యూడబ్ల్యూఈ రింగ్‌లో
ఈ మీమ్‌లో ఒక వ్యక్తి ఎంతో ఉత్సాహంతో డబ్ల్యూడబ్ల్యూఈ రింగ్‌లోకి దిగుతాడు. అయితే ఊహకందని విధంగా అత్యంత సులభంగా ఓటమి పాలవుతాడు. ఈ ఓడిన వ్యక్తిపై కేజ్రీవాల్‌ మాస్క్‌, గెలిచిన వ్యక్తిపై ప్రధాని మోదీ మాస్క్‌  ఉంటాయి.
 

వెనక్కి కాంగ్రెస్‌ పరుగు
ఈ మీమ్‌లో ఒక రేసులో పాల్గొన్నవారంతా ఒక దిశలో వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, కాంగ్రెస్‌ మాత్రం వెనక్కి తిరిగి పరిగెత్తేందుకు సిద్ధమవుతున్నట్లు చూడవచ్చు. దీనిని చూసినవారంతా తెగ నవ్వుతున్నారు.

జీరో చెక్‌ చేసుకోండి సార్‌
ఈ మీమ్‌లో పెట్రోల్‌ పంప్‌ దగ్గర పనిచేస్తున్న వ్యక్తికి రాహుల్‌గాంధీ​ మాస్క్‌ ఉంటుంది. ఈ ఫొటోపై ‘జీరో చెక్‌ చేసుకుని తీసుకోండి సార్‌’ అని ఉంటుంది.

రాజు ఎప్పటికీ ఒంటరిగా ఓడిపోడు
మరో మీమ్‌లో ఆప్‌ అభ్యర్థి ఓఝా ఫొటో ఉంటుంది. క్యాప్షన్‌లో ‘రాజు ఎప్పుడూ ఒంటరిగా ఎన్నికల్లో ఓడిపోడు. పార్టీనంతా ముంచుతాడు’ అని ఉంది.

 

ఇది కూడా చదవండి: ఈ ఏడుగురిలో ఢిల్లీ సీఎం ఎవరు?

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement