reliance company
-
కంపాకోలాతో కోకాకోలా,పెప్సికోకు గట్టి సవాల్ విసిరిన రిలయన్స్
-
మనీశ్ మల్హోత్రాతో రిలయన్స్ భారీ డీల్
Reliance Buys Manish Malhotra Stakes: వస్త్ర ప్రపంచంలో తన బ్రాండ్‌తో దూసుకుపోతున్న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్.. భారీ ఒప్పందం దిశగా అడుగులు వేసింది. ప్రముఖ డిజైనర్ లేబుల్ ‘మనీశ్ మల్హోత్రా’లో 40 శాతం వాటా చేజిక్కించుకోబోతోంది. పదహారేళ్లుగా దేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా పేరు విస్తరించుకున్న మనీశ్ మల్హోత్రా బ్రాండ్‌లో రిలయన్స్ మెజార్టీ వాటా కొనుగోలు చేయనుంది. మనీశ్ మల్హోత్రా బయటి కంపెనీతో ఒప్పందం చేసుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ మేరకు మనీశ్‌తో ఒప్పందాన్ని గౌరవంగా భావిస్తున్నామని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇక ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్ లాంటి ప్రముఖ నగరాల్లో స్టోర్లను నడిపిస్తున్న మనీశ్ మల్హోత్రా.. దేశంలోనే మొదటి వర్చువల్ స్టోర్ తెరిచిన ఫీట్ సైతం సాధించారు. ‘భారత సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా దుస్తుల్ని రూపొందించడం ఈ లేబుల్ ప్రత్యేకత. రియలన్స్తో ఒప్పందం ద్వారా దేశ, విదేశాలకు సేవలను విస్తరిస్తామ’ని ఈ సందర్భంగా మనీశ్ మల్హోత్రా(54) తెలిపారు. చదవండి: 14 ఏళ్లుగా ఆ జాబితాలో అగ్రస్థానంలో ముఖేష్ అంబానీ -
రిలయన్స్ గ్యాస్ అక్రమాలపై హర్షకుమార్ ఫిర్యాదు
కాకినాడ: రిలయన్స్, D6 చమురు సంస్థలు గ్యాస్‌ను అక్రమంగా తరలిస్తున్నాయని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ మంగళవారం మెరైన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2009 నుంచి 2015 వరకు దాదాపు 1112 కోట్ల ఘనపు మీటర్ల గ్యాస్‌ను రిలయన్స్ సంస్థ అక్రమంగా తరలించిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. బాధ్యత గల పౌరుడిగా మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఈ విషయాన్ని ప్రభుత్వంతో పాటు పోలీసులకు తెలియచేయడం తన బాధ్యత అన్నారు. ఈ గ్యాస్ చౌర్యంపై కేసు నమోదు చేసి దొంగతనం, అక్రమం, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ మిసోప్రోప్రియేషన్ తదితర నేరాలపఐ దర్యాప్తు చేసి వెంటనే రిలయన్స్ కంపెనీ యాజమాన్యం, బాధ్యలను అరెస్ట్ చేసి దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోతే న్యాయస్థానం, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆశ్రయిస్తానని ఆయన తెలిపారు. -
అభివృద్ధిలో ఆదర్శం ‘లింగంపల్లి’
సదాశివనగర్ : ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. ఎదు రు చూస్తూ కూర్చోలేదు లింగంపల్లి వాసులు. చేయి చేయి కలిపి.. కలిసి కట్టుగా పనులు చేసుకుంటూ అభివృద్ధి వైపు పయనిస్తున్నారు. గ్రామాభివృద్ధే ధ్యేయంగా నడుంబిగించిన వా ళ్లు మొదట చేయి చేయి కలిపారు. వారంతా కలిసి ఓ సంఘంగా మారారు. గ్రామంలో 301 కుటుంబాలు ఉన్నాయి. అందులో 114 కుటుం బాలు ‘శ్రీ గోపాల మిత్ర గ్రామ రైతు సం ఘం’లో రూ.250 చెల్లించి సభ్యత్వం తీసుకున్నారు. ఈ సంఘాన్ని 2010లో ప్రారంభిం చారు. మొదటగా 20 మంది సంఘ సభ్యులుం డగా, ప్రస్తుతం 114 కుటుంబాలు చేరాయి. రిలయన్స్ సహకారం.. లింగపల్లి గ్రామస్తులు చేపడుతున్న అభివృద్ధి పనులకు రిలయన్స్ సంస్థ సహకారం అందించింది. వెనుకబడిన గ్రామాల అభివృద్ధిలో భాగంగా ఆ సంస్థ గోపాలమిత్ర గ్రామ రైతు సంఘానికి సహకారం అందిస్తోంది. వారి కష్టానికి రిలయన్స్, పంచాయతీ సహకారం తోడు కావడంతో అభివృద్ధి వేగవంతమవుతోంది. సేంద్రియ ఎరువులతో సాగు గ్రామంలోని 114 కుటుంబాల ఇళ్ల వద్ద సేంద్రియ ఎరువులతో కూరగాయలు పండిస్తున్నారు. ప్రతీరోజు ఒక్కోరకం కూరగాయలు వాడుకుంటున్నారు. గ్రామంలో బయోగ్యాస్‌ను వినియోగించుకుంటున్నారు. పంటలకు ఎరువుగా వర్మికంపోస్టు తయారు చేసుకుని ఉపయోగిస్తున్నారు. తాగునీటికి ఊటబావి తవ్వారు. మినీవాటర్ ట్యాంక్‌ల నిర్మాణం, పంట పొలాలకు వెళ్లేందుకు దారులు, చెట్లు నాటడం.. ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామానికి వెళ్లే రహదారి ఇరుకుగా ఉండటంతో తరచు ప్రమాదాలు జరిగేవి. దీంతో గ్రామస్తులు సంఘం ఆధ్వర్యంలో రహదారికి ఇరువైపుల మట్టి వేయడంతో ప్రమాదాలు తప్పాయి. ఇలా తమకు తాము అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న లింగంపల్లి గ్రామస్తులు ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ఇక 4-జి విశాఖ
రిలయన్స్ సంస్థకు జీవీఎంసీ అనుమతి జీవీఎంసీకి రూ.14.32 కోట్లు ఆదాయం తొలి విడతలో 120 కి.మీ. మేర కేబుళ్లు ఏడాదిలో 4 జి సేవలు! సాక్షి, విశాఖపట్నం : 2-జి సేవలతో విసిగి వేసారినవారికి 3 జి సేవలు ఊరటనిచ్చాయి. కాస్త ఖర్చెక్కువైనా.. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి తామెప్పుడూ ముందంజలోనే ఉంటామని నగరవాసుల్లో 3జి కనెక్షన్ల వైపు మొగ్గుచూపుతోన్న సంఖ్యే చెప్తోంది. ఇపుడు 4-జి సేవల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వారి ఆశల్ని నెరవేర్చేందుకు రిలయన్స్ జియో ఇన్ఫోకాం లి. సంస్థ ముందుకొచ్చింది. 4 జి సేవల్లో భాగంగా ఆప్టికల్ ఫైబర్ లైన్లు వేసేందుకు అనుమతి కోరుతూ ఈ సంస్థ గత నెల్లో జీవీఎంసీకి దరఖాస్తు చేసుకుంది. దీనికి జీవీఎంసీ నుంచి తాజాగా ఆమోదం దక్కింది. ఆదాయం రూ.14.32 కోట్లు తొలి విడతలో భాగంగా నగరంలో సుమారు 120 కిలోమీటర్ల మేర 4 జి సేవలందించేందుకు వీలుగా కేబుళ్లు, టవర్లు, స్తంభాలు వేసేందుకు అనుమతులు కోరుతూ ‘రిలయన్స్’ సంస్థ జీవీఎంసీని ఆశ్రయించింది. ఇందుకు రోడ్లు, ఫుట్‌పాత్‌లు, డక్ట్లు తదితర జీవీఎంసీ ఆస్తుల్ని వినియోగించుకోనున్నారు. సీసీ రోడ్డు తవ్వితే మీటర్‌కు రూ.1569, బీటీ రోడ్డయితే రూ.1998, ఫుట్‌పాత్ తవ్వితే మీటర్‌కు రూ.670 చొప్పున చెల్లించేందుకు సంస్థ అంగీకారం తెలిపింది. తొలి విడతగా ‘రిలయన్స్’రూ.8.83 కోట్లు మంగళవారం జీవీఎంసీకి చెల్లించింది. దీంతో నగరంలోని 1, 2, 3, 4 జోన్లలో సుమారు 62 కిలోమీటర్ల మేర 4 జి వ్యవస్థ ఏర్పాటుకు జీవీఎంసీ ఆమోదం తెలిపింది. మిగిలిన పరిధిలో కూడా కేబుళ్లు, టవర్లు ఏర్పాటుకు త్వరలోనే రిలయన్స్ సంస్థ చెల్లింపులు చేయనున్నట్టు తెలిసింది. విశాఖతోపాటు గుంటూరు, విజయవాడ, తిరుపతి తదితర నగరాల్లో 4 జి సేవల విస్తరణకు ‘రిలయన్స్’ సంస్థ ముందుకొచ్చింది. జీవీఎంసీకే తొలుత వివిధ ఫీజుల రూపంలో డబ్బులు చెల్లించింది. మిగిలిన నగరాల్లో ఇంకా డిమాండ్ నోటీసుల స్థాయిలోనే ఉన్నట్టు తెలిసింది. -
ఆర్టీసీ ‘ప్రైవేటు’యోచనలో ఏపీ సర్కారు!
రిలయన్స్ ప్రతిపాదనలు మళ్లీ తెరపైకి! సాక్షి, హైదరాబాద్: నష్టాల ఊబిలో ఉన్న ఆర్టీసీని వదిలించుకునే యోచనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఆర్టీసీని తీసుకోవడానికి గతంలో రిలయన్స్ సంస్థ చేసిన ప్రతిపాదనలపై మళ్లీ ప్రభుత్వవర్గాల్లో చర్చ మొదలైంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని సర్కారు స్వాధీనం చేసుకోవడం లేదా ప్రైవేటు పరం చేయడమే ప్రభుత్వం ముందున్న ప్రతిపాదనలని, వాటిలో ఏదో ఒకటి అనుసరించక తప్పదని అధికారవర్గాలు చెబుతున్నాయి. నష్టాల్లో ఉన్న సంస్థను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదని, అందువల్ల ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతోందని ఆ వర్గాలు తెలిపాయి. అధికారవర్గాల కథనం ప్రకారం.. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్టీసీని తీసుకోవడానికి రిలయన్స్ సంస్థ షరతులతో కూడిన ప్రతిపాదనలు చేసింది. కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లను మాత్రమే తీసుకుంటామని, మిగతా పైస్థాయిలో ఉద్యోగుల అవసరం లేదని చెప్పింది. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లకు మరింత మెరుగైన వేతనాలిచ్చేందుకు ప్రతిపాదించిది. ఆర్టీసీలో మొత్తం 65 వేల మంది ఉద్యోగులున్నారు. వీరిలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు 30 వేల మంది ఉంటారు. మిగతా 35 వేల మంది పైస్థాయిలో ఉద్యోగులే. పైస్థాయి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే వీఆర్ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ) ఇవ్వాలని ఆ సంస్థ సూచించింది. వీరికి రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఎస్ ఇవ్వాలంటే రూ. 400 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలే ఉన్నందున ఉద్యోగుల సంఖ్య కూడా తగ్గుతుంది. ఆమేరకు వీఆర్ఎస్ ఖర్చూ తగ్గుతుంది. ప్రస్తుతం ఆర్టీసీ నష్టాల్లో ఉన్నందున, రిలయన్స్ ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు పరిశీలించే అవకాశముంది. ఆర్టీసీకి రెండు నెలల క్రితం రోజుకు రూ.2.5 కోట్లు నష్టం వచ్చేదని, ఇప్పుడది రోజుకు రూ. 3 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం ఆర్టీసీ నష్టాలు రూ. 2,600 కోట్లకు చేరాయని అధికారవర్గాలు తెలిపాయి. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలోనే ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేసిన విషయాన్ని అధికారులు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో చంద్రబాబు ప్రపంచ బ్యాంకు సంస్కరణల జాబితాలో ఆర్టీసీని, సింగరేణిని కూడా చేర్చారని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఇప్పుడు మళ్లీ ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు చేసి మరీ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు చంద్రబాబు వెనుకాడరని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
భారీగా విద్యుత్ వినియోగం
సాక్షి, ముంబై: ఈ వేసవిలో ముంబైకర్లు రికార్డుస్థాయిలో విద్యుత్‌ను వినియోగించారు. పగలూ రాత్రి ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండడంతో 3,365 మెగావాట్ల విద్యుత్ వినియోగించారు. గత సంవత్సరం వేసవిలో 3,212 మెగావాట్ల విద్యుత్ వినియోగించారు. ఇది రికార్డుస్థాయి వినియోగమని అప్పుడు అధికారులు ప్రకటించారు. ఈ రికార్డును కూడా 2014 తిరగరాసిందని విద్యుత్ సరఫరాశాఖ అధికారులు ప్రకటించారు. ఈసారి వేసవి ప్రారంభంకాకముందే ఎండలు మండిపోవడం మొదలయ్యాయి. ఏప్రిల్, మేలో పరిస్థితి దారుణంగా మారింది. ఉక్కపోత భరించలేక నిరంతరం కూలర్లు, ఫ్యాన్లు, ఏసీ వినియోగించారు. జూన్ మొదటి వారంలో వర్షాలు పడతాయని, ఉక్కపోత నుంచి కొంతమేర ఉపశమనం లభిస్తుందని ముంబైకర్లు భావించారు. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. వర్షాలు ఆలస్యం కావడం, దీనికి తోడు ఉక్కపోత మరింత పెరిగిపోవడంతో అంతా ఉక్కిరిబిక్కిరయ్యారు. దీని ఫలితంగా విద్యుత్ వినియోగం ఒక్కసారిగా రికార్డుస్థాయిలో పెరిగిపోయింది. ముంబైకి రిలయన్స్ ఇన్ఫ్రా, టాటా పవర్, బెస్ట్, మహావితరణ్ సంస్థలు విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. ఈ ఏడాది మే 10 నుంచి జూన్ 10 వరకు నాలుగు కంపెనీలు వినియోగదారులకు 3,365 మెగావాట్ల కరెంటును సరఫరా చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే ఐదు శాతం ఎక్కువ విద్యుత్ వాడినట్టు వెల్లడయింది. ఇందులో అత్యధిక శాతం అంటే 1,771 మెగావాట్ల విద్యుత్ రిలయన్స్ కంపెనీ శివారు ప్రాంతాలకు సరాఫరా చేసింది. ఆ తరువాత స్థానంలో టాటా, బెస్ట్, మహావితరణ్ ఉన్నాయి. ముంబైకర్లకు విద్యుత్ సరఫరాచేసే హైటెన్షన్ వైర్లను ఇటీవల మార్చివేశారు. దీంతో డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా చేసేందుకు మార్గం సుగమమయింది. -
గ్యాస్ ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధం
హైకోర్టులో పాలెం శ్రీకాంత్‌రెడ్డి పిల్ సాక్షి, హైదరాబాద్: కేజీ(కృష్ణా-గోదా వరి) బేసిన్లో రిలయన్స్ కంపెనీ వెలికి తీసిన గ్యాస్‌ను రాష్ట్రానికి కేటాయించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ జనపాలన పార్టీ అధ్యక్షుడు పాలెం శ్రీకాంత్‌రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కేజీ బేసిన్ గ్యాస్‌ను రాష్ట్రానికి కేటాయించేలా తగిన చర్యలు తీసుకునేటట్లు కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు. ఇం దులో కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి, పెట్రోలియం మంత్రిత్వశాఖ కార్యదర్శి, హైడ్రోకార్బన్స్ డెరైక్టర్ జనరల్, రిల యన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఏపీజెన్కో, ట్రాన్స్‌కో, కేంద్ర ఎన్నికల సంఘం, సీబీఐలతో పాటు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. -
అమ్ముడుపోయారా? : ఆప్
సాక్షి, హైదరాబాద్: కేజీ బేసిన్ గ్యాస్ ధరలపై రిలయన్స్ కంపెనీ వ్యవహరిస్తున్న తీరు వల్ల ప్రజలపై పెనుభారం పడుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను రిలయన్స్ అధినేతలైన అంబానీలు గుప్పిట్లో పెట్టుకొన్నారని ఆ పార్టీ ఆరోపించింది. గురువారమిక్కడ ఆప్ నేతలు కిరణ్‌కుమార్, చక్రిలతో కలిసి రాష్ట్రశాఖ కన్వీనర్ బి. రామకృష్ణంరాజు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలపై రూ. 4 వేల కోట్ల భారం పడే గ్యాస్ ధర పెంపుదలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. అంబానీకి అమ్ముడుపోయారా అంటూ ప్రశ్నించారు.