రిలయన్స్ గ్యాస్ అక్రమాలపై హర్షకుమార్ ఫిర్యాదు
కాకినాడ: రిలయన్స్, D6 చమురు సంస్థలు గ్యాస్ను అక్రమంగా తరలిస్తున్నాయని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ మంగళవారం మెరైన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2009 నుంచి 2015 వరకు దాదాపు 1112 కోట్ల ఘనపు మీటర్ల గ్యాస్ను రిలయన్స్ సంస్థ అక్రమంగా తరలించిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. బాధ్యత గల పౌరుడిగా మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఈ విషయాన్ని ప్రభుత్వంతో పాటు పోలీసులకు తెలియచేయడం తన బాధ్యత అన్నారు. ఈ గ్యాస్ చౌర్యంపై కేసు నమోదు చేసి దొంగతనం, అక్రమం, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ మిసోప్రోప్రియేషన్ తదితర నేరాలపఐ దర్యాప్తు చేసి వెంటనే రిలయన్స్ కంపెనీ యాజమాన్యం, బాధ్యలను అరెస్ట్ చేసి దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోతే న్యాయస్థానం, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆశ్రయిస్తానని ఆయన తెలిపారు.