మేడిపల్లి: పోలీసులను కించపరిచేలా పుష్ప–2 చలన చిత్రంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని అందుకు బాధ్యులైన సినిమా దర్శకుడు, హీరో, నిర్మాతలపై కేసు నమోదు చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సోమవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప–2 చిత్రంలో పోలీసులను అవమానించేలా కొన్ని దృశ్యాలను చిత్రీకరించడం దారుణమని ఇందుకు బాధ్యులపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ గోవింద రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment