
న్యూఢిల్లీ: తమ మేనిఫెస్టోపై బీజేపీ అగ్రనేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు బీజేపీపై ఆ పార్టీ మంగళవారం(ఏప్రిల్23) ఎన్నికల కమిషన్(ఈసీ)కి ఫిర్యాదు చేసింది. మధ్యతరగతి వర్గాలు, ఉద్యోగాల్లో లేనిపోని గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సమానత్వ అభివృద్ధి అని రాహుల్‌గాంధీ చేసిన కామెంట్లకు తప్పుడు అర్థాలు చెబుతున్నారని తెలిపారు. ‘ఇది బీజేపీ కావాలని చేస్తోంది. మధ్య తరగతి వర్గాల్లో భయాందోళనలు కలిగిస్తున్నారు’అని కాంగ్రెస్ నేత ప్రవీణ్ చక్రవర్తి చెప్పారు. ఈ విషయంలో బీజేపీపై కఠినన చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment