ఢిల్లీ: ఇటీవల ముంబై వేదికగా జరిగిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన చేసిన ‘శక్తి’(అధికారం)వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోదీతో సహా బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శించారు. బుధవారం బీజేపీ.. రాహుల్ గాంధీపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ చేసిన శక్తి వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు బీజేపీ తెలిపింది. రాహుల్ గాంధీ మత విద్వేషాలు రెచ్చగొట్టారని బీజేపీ ఆరోపణలు చేసింది.
ఆదివారం ముంబైలోని భారత్‌జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘మోదీపై మా పోరాటం వ్యక్తిగతం కాదు. శక్తి(అధికారం)పై వ్యతిరేకంగా మేం పోరాటం చేస్తున్నాం. మోదీకి ఈవీఎంలు, ఈడీ, సీబీఏ, ఐటీ సంస్థలు ఆత్మ.. అవి లేకుండా మోదీ ఎన్నికల్లో గెలవలేరు’ అని ప్రధానిమోదీపై విమర్శలు గుప్పించారు రాహుల్ గాంధీ.
Comments
Please login to add a commentAdd a comment