న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంపై కాంగ్రెస్ ఎంపీ. లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. వాయు కాలుష్యం పెరగడంపై అటు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్న వేళ.. ఈ సంక్షోభాన్నిపరిష్కరించడానికి అందరూ ఐక్యంగా స్పందించాలని రాహుల్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో కాలుష్య పరిస్థితులను జాతీయ అత్యవసర స్థితిగా అభివర్ణించారు.
ఈ మేరకు ఇండియా గేట్ వద్ద పర్యావరణవేత్త ఝాతో కలిసి మాట్లాడారు. ఉత్తర భారతదేశంలో నమోదవుతున్న గాలి కాలుష్యంపై రాజకీయ విమర్శలు, నిందలు వేసుకోవడానికి ఇది సమయం కాదని అన్నారు. కాలుష్య నివారణకు తక్షణ, సామూహిక చర్యలు అవసరమని పేర్కొన్నారు. కాలుష్యం కారణంగా తన కళ్ళు కూడా మండుతున్నాయంటూ వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. వాయు కాలుష్యానికి సామాన్య ప్రజలే ఎక్కువగా ప్రభావితులవుతున్నారని తెలిపారు.
‘సమాజంలోని అత్యంత బలహీన వర్గాలు, పేదలు వాయు కాలుష్యం వినాశకరమైన ప్రభావాన్ని చూపుతోంది. ఈ విషపూరితమైన గాలిని తప్పించుకోలేక అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. వృద్ధులు బాధలు పడుతున్నారు. చాలా మంది చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఉత్తరభారతంలో నెలకొన్న తాజా పరిస్థితుల వల్ల పర్యాటకం బాగా పడిపోయింది. ప్రపంచంలో దేశ ఖ్యాతి పడిపోతుంది.
కాలుష్య మేఘాలు వందలాది కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి. వాటిని తొలగించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వాలు, కంపెనీలు, నిపుణులు, పౌరుల నుంచి జాతీయ స్థాయిలో సమిష్టి ప్రతిస్పందన అవసరం. రాజకీయ నిందలు కాదు. విషపూరితంగా మారుతున్న వాతావరణాన్ని శుభ్రం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని తెలిపారు.
మరికొద్ది రోజుల్లో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై కూలంకషంగా చర్చించి పరిష్కార మార్గాలను కనుగొనాలని సహచర ఎంపీలకు పిలుపునిచ్చారు. వాయు కాలుష్య రూపంలో ముంచుకొస్తన్ను ముప్పును అరికట్టడానికి కలిసి కట్టుగా చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మన అందరి బాధ్యత అని తెలిపారు.
Air pollution in North India is a national emergency—a public health crisis that is stealing our children’s future and suffocating the elderly, and an environmental and economic disaster that is ruining countless lives.
The poorest among us suffer the most, unable to escape the… pic.twitter.com/s5qx79E2xc— Rahul Gandhi (@RahulGandhi) November 22, 2024
Comments
Please login to add a commentAdd a comment