Air pollution
-
స్కూళ్లల్లో ఎయిర్ ప్యూరిఫయర్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ వంటి నగరాల్లో వాయు కాలుష్యం నుంచి పిల్లలను రక్షించేందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఎయిర్ ప్యూరిఫయర్లను ఏర్పాటు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్, శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ సూచించారు. ప్రస్తుతం ఆరోగ్యశాఖ సలహాదారుగా ఉన్న ఆమె.. వాయు కాలుష్యంపై భారత్ తగినంత డేటాను సేకరించిందని, చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ‘పెద్దలకంటే పిల్లలు వేగంగా శ్వాస తీసుకుంటారు. అలాగే వారు చిన్నగా ఉండటం వల్ల నేలకు దగ్గరగా ఉండటంతో గాలిలోని దుమ్ము, ధూళి, కాలుష్యం వారిని తొందరగా చేరుతుంది. తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇంటి తరువాత పిల్లలు ఎక్కువసేపు గడిపేది పాఠశాలల్లోనే. కాబట్టి కచ్చితంగా ప్రభుత్వ, ప్రైవేట్పాఠశాల్లో ప్యూరిఫయర్లను ఏర్పాటు చేసి గాలి నాణ్యతను మెరుగుపరచాలి’ అని ఆమె సూచించారు. అయితే బయోమాస్ స్థానంలో ఎల్పీజీని తీసుకొచ్చి, ఇప్పటికే ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీలు కొంత మేర ప్రయోజనం చేకూరుస్తున్నాయని స్వామినాథన్ తెలిపారు. నగరాల్లో ప్రజారవాణాను విస్తరించాలని, మితిమీరిన కార్ల వినియోగంపై జరిమానాలు విధించాలని, పారిశ్రామిక కాలుష్య చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆమె పేర్కొన్నారు. చట్టాలు, నిబంధనలు తీసుకొస్తే సరిపోదని, వాటిని కఠినంగా అమలు చేయాలన్నారు.డబ్ల్యూహెచ్ఓ పరిమితుల కంటే అధికం.. ఢిల్లీలో గాలి నాణ్యత తరచూ దెబ్బతింటోంది. శీతాకాలంలో ఇది మరింత ప్రమాదకర స్థాయిలను చేరుతుంది. గాలి కాలుష్యం పిల్లల్లో అభ్యాస నైపుణ్యాన్ని ప్రభావితం చేస్తోంది, తద్వారా విద్యా వ్యవస్థకు నష్టం వాటిల్లుతోంది. దీనిపై సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఇక స్విస్ఎయిర్ టెక్నాలజీ సంస్థ ఐక్యూయిర్ మంగళవారం ప్రకటించిన నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని 10 అత్యంత కాలుష్య నగరాల్లో ఆరు భారత్‌లోనే ఉన్నాయి. ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరమని, భారత్ ఐదో అత్యంత కాలుష్య దేశమని వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ –2024 తెలిపింది. 2023తో పోలిస్తే ఢిల్లీలో వాయుకాలుష్యం 2024లో బాగా పెరిగింది. ఒక్క ఢిల్లీనే కాదు.. భారత్‌లోని 35 శాతం నగరాల్లో కాలుష్యం డబ్ల్యూహెచ్ఓ పరిమితుల కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంది. -
ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరం మనదే!
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధిక జనాభాతో కిటకిటలాడుతున్న మన దేశం కాలుష్య నగరాల జాబితాలోనూ టాప్‌లో ఉంది. ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన మొదటి 20 నగరాల్లో మనవి ఏకంగా 13 నగరాలున్నాయి. ఇందులో మొదటి స్థానంలో అస్సాంలోని బిర్నిహాట్ (Byrnihat) నిలిచింది. దేశ రాజధానుల్లో ప్రపంచంలోనే అత్యంత కలుషితమైందిగా ఢిల్లీ (Delhi) అగ్రస్థానంలో ఉంది.స్విట్జర్లాండ్ కంపెనీ ఐక్యూ ఎయిర్ మంగళవారం వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్–2024 పేరిట ఈ నివేదిక విడుదల చేసింది. ప్రపంచంలోనే అత్యంత కలుషిత దేశాల్లో భారత్ 2023లో మూడో ర్యాంకులో ఉండగా తాజాగా కాస్తంత మెరుగ్గా ఐదో స్థానానికి చేరింది. టాప్–20లోని అత్యంత కలుషితమైన నగరాల్లో పొరుగు దేశం పాకిస్తాన్లోనివి నాలుగు ఉండగా, చైనాకు చెందిన ఒక నగరముంది.టాప్–20లో.. బిర్నిహట్, ఢిల్లీ, ముల్లన్పూర్(పంజాబ్), ఫరీదాబాద్, లోని, గురుగ్రామ్, గంగానగర్, గ్రేటర్ నోయిడా, భివాడి, ముజఫర్‌నగర్, హనుమాన్‌గఢ్, నోయిడా (Noida) ఉన్నాయి. భారత్‌లోని 35 శాతం నగరాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన పరిమితికి మించి వార్షిక పీఎం 2.5 స్థాయిలు పది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక తెలిపింది.కాగా, అస్సాం– మేఘాలయ సరిహద్దుల్లోని బర్నిహట్‌లో డిస్టిలరీలు, ఐరన్, స్టీల్ ప్లాంట్ల కారణంగా ఎక్కువ కలుషిత ఉద్గారాలు ఉన్నట్లు నివేదిక వివరించింది. గాలి కాలుష్యం భారత్‌లో ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా పరిణమించిందని, ఆయుర్దాయం సగటున 5.2 ఏళ్లు తగ్గుతోందని తెలిపింది. భారత్ ఏటా 15 లక్షల మంది గాలి కాలుష్యం (Air Pollution) కారణంగా చనిపోతున్నట్లు లాన్సెట్ తెలిపింది. డేటా ఉంది.. చర్యలేవి?: సౌమ్య స్వామినాథన్ గాలి నాణ్యత డేటా సేకరణలో భారతదేశం పురోగతి సాధించిందని, అయితే కాలుష్య నియంత్రణకు తగినంత చర్యలు చేపట్టడం లేదని WHO మాజీ ప్రధాన శాస్త్రవేత్త, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహాదారు సౌమ్య స్వామినాథన్ (Soumya Swaminathan) అన్నారు. 'మన దగ్గర డేటా ఉంది కాబట్టి కాలుష్య నివారణ చర్యలు అవసరం. బయోమాస్‌ను LPGతో భర్తీ చేయడం వంటి కొన్ని పరిష్కారాలు సులభంగా చేయొచ్చు. భారతదేశంలో ఇప్పటికే దీని కోసం ఒక పథకం ఉంది, కానీ అదనపు సిలిండర్లకు ప్రభుత్వం మరింత సబ్సిడీ ఇవ్వాలి. మొదటి సిలిండర్ ఉచితం, కానీ పేద కుటుంబాలు, ముఖ్యంగా మహిళలు అధిక సబ్సిడీలు పొందాలి. ఇది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బహిరంగ వాయు కాలుష్యాన్ని తగ్గిస్తుంది. నగరాల్లో ప్రజా రవాణాను విస్తరించాలి, అలాగే వ్యక్తిగత వాహనాలపై నియంత్రణ అవసరం. ఉద్గార నివారణ చట్టాలను కఠినంగా అమలు చేయడం చాలా ముఖ్యం. పరిశ్రమలు, నిర్మాణ ప్రదేశాల ఉద్గారాలను తగ్గించడానికి గట్టిగా ప్రయత్నించాల'ని సౌమ్య స్వామినాథన్ అన్నారు. చదవండి: జట్కా మటన్ అంటే ఏంటి, ఎక్కడ దొరుకుతుంది? -
సిటీలో గాలి పీల్చడం అంటే సిగిరెట్ తాగడమే:ఏకీభవించిన హీరోయిన్
సగటు మనిషితో పోలిస్తే సెలబ్రిటీలకు మరింత సామాజిక బాధ్యత ఉంటుంది. లక్షలాది మందిని ప్రభావితం చేయగలిగిన సినిమా నటీనటులు ఆ సామాజిక బాధ్యతను గుర్తించి మసలుకోవడాన్ని దురదృష్టవశాత్తూ మనం అరుదుగానే చూస్తుంటాం. తరచుగా సోషల్ మీడియాను తమ సినిమాల ప్రచారానికో, మరోరకమైన సంపాదనకో వాడుకునే సెలబ్రిటీలు సామాజిక సమస్యలపై స్పందించడం తక్కువే. కాలుష్యం వంటి సమస్యలపై తాము స్పందిస్తే ప్రభుత్వాలకు తమ మీద కోపం వస్తుందనే భయపడేవారే ఎక్కువ. ఇలాంటి వారి మధ్య అరుదుగా కొందరు మాత్రం తమదైన శైలిని నిలబెట్టుకుంటారు.ప్రముఖ హిందీ నటుడు స్టాండ్–అప్ కమెడియన్‌గానూ పేరొందిన వీర్ దాస్(Vir Das ) ఇటీవల ముంబై నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై తరచుగా పోస్ట్‌ల ద్వారా తన ఆందోళన తెలియజేస్తున్నాడు. ఆ పోస్ట్స్ పలువురిని ఆకట్టుకుంటున్నాయి. ఆయన తాజాగా సోషల్ మీడియా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ముంబై నగరంలో శ్వాస పీల్చడం అంటే సిగరెట్ తాగడంతో సమానం అని అన్నారు.‘నేను సరదా కోసం లేదా సోషలైజింగ్‌లో భాగంగా సంవత్సరానికి కేవలం పదిహేను రోజులు మాత్రమే సిగరెట్ తాగుతాను. కానీ మిగిలిన రోజులు కూడా పొగ తాగుతున్నట్టే ఉంది ఎందుకంటే నేను శ్వాస పీల్చుకునేది ముంబైలో కదా. అదే రుచి. ఈ రోజు ముంబై ఒక మార్ల్బోరో లైట్‘ అని వీర్ ఇన్‌స్ట్రాగామ్‌లో రాశాడు. తాను పీల్చుకునే శ్వాస తాను తాగే సిగిరెట్ బ్రాండ్ మార్ల్‌బరో లైట్ ఒకేలా ఉన్నాయనే అర్ధం వచ్చేలా ఆయన ఈ పోస్ట్ చేశాడు.అయితే ముంబై మహానగరంలో కనుమరుగవుతున్న గాలి నాణ్యతపై వీర్ దాస్ ఆందోళన వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో, అతను ఇన్‌స్ట్రాగామ్‌లో కూడా విపులంగా పోస్ట్ పెట్టాడు, ‘ఇప్పుడు ఉదయం7:30 గంటలు... ఈ సమయంలో గాలి నాణ్యత ఎక్యుఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) 170. ఇది పిల్లలు పాఠశాలకు పెద్దవాళ్లు వాకింగ్‌లకు వెళుతున్న సమయం. ప్రభుత్వం ఏదైనా కఠినంగా చేయకపోతే, వారసత్వంగా కాలుష్యం మాత్రమే మన జీవితాల్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఇప్పుడే పుట్టిన తరంతో పాటు వృద్ధాప్యంలో ఉన్న వారిపై కూడా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తుందని మనం గ్రహించాలి. దీన్ని అడ్డుకోవడానికి ‘కొన్ని కఠినమైన విధాన నిర్ణయాలు జరగాలి. అలాంటి నిర్ణయాలు బహుశా స్వల్పకాలంపాటు మనల్ని తీవ్ర అసంతృప్తికి గురిచేయవచ్చు. కొత్త విమానాశ్రయాలు కొత్త వంతెనలు వచ్చేటప్పుడు కూడా మనం నసపెడతాం, కానీ చివరికి అది విలువైనదే అవుతుంది. గాలి మీ ఆదాయ స్థితిని పట్టించుకోదు, గాలి మతపరమైనది కాదు, గాలి దేశభక్తి కాదు, గాలి ఓటు వేయదు, కానీ సరిదిద్దాల్సింది ఏదైనా ఉందీ అంటే అది గాలి మాత్రమే’’ అంటూ ఆయన రాశారు. ఈ పోస్ట్ సాధారణ నెటిజన్స్‌తో పాటు పలువురు సహచర నటీనటులను కూడా ఆకర్షించింది. బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా(Sonakshi Sinha ) తదితరులు తన ఇన్‌స్ట్రాగామ్ పోస్ట్‌ను తన సోషల్ మీడియా ఖాతాలో రీపోస్ట్ చేస్తూ వీర్‌తో ఏకీభవించారు. -
మన నగరాల్లో కాలుష్యం తక్కువే
సాక్షి ప్రతినిధి, అనంతపురం : దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం తక్కువగా ఉన్న 50 నగరాలను ఎంపిక చేయగా.. అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి ఐదు ఉన్నాయి. అవి కడప–52 ఎంజీ (మిల్లీగ్రాములు/క్యూబిక్ మీటర్), అమరావతి 56 ఎంజీ, తిరుపతి 57 ఎంజీ, విజయవాడ 61 ఎంజీ, రాజమహేంద్రవరం 61 ఎంజీలుగా ఉన్నాయి. 2024 సంవత్సరానికి గాను సీఆర్ఈఏ (సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్) సంస్థ అధ్యయనంలో ఈ విషయం తేలింది. అలాగే, దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా కర్ణాటకలోని కొడగు జిల్లాలోని మడికేరి నగరం చోటు సంపాదించింది. ఇక్కడ వార్షిక సగటు కాలుష్యం కేవలం 32 ఎంజీ మాత్రమే. తమిళనాడులోని పాలలైపెరూర్, కర్ణాటకలోని కొప్పల్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అత్యంత క్లీనెస్ట్ జాబితాలో ఇంఫాల్, షిల్లాంగ్, అరియాలూర్, రామనగర, విజయపుర, రామనాథపురం ఉన్నాయి. ఇక అత్యంత కలుషిత నగరాల జాబితాలో రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ వార్షిక సగటు 236 ఎంజీగా నమోదైంది. 226 ఎంజీతో నోయిడా, 211తో ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అలాగే, దేశవ్యాప్తంగా 50 అత్యంత కలుషిత నగరాల్లో 15 నగరాలు రాజస్థాన్‌వే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో తొమ్మిది, బిహార్‌లో ఏడు ఉన్నాయి. ఇందులో ఏపీలోని ఏ నగరం కూడా లేనప్పటికీ విశాఖలో మాత్రం 108 ఎంజీగా నమోదైంది. గత ఏడాది గాలి నాణ్యతా ప్రమాణాల లెక్క వేసినప్పుడు విశాఖపట్నంలో 30 రోజుల వ్యవధిలో ఇలా ఆరుసార్లు కనిపించింది. గత ఏడాది సెప్టెంబరులో విజయవాడలో కూడా ఎక్కువగానే నమోదైంది. కానీ, ఆ తర్వాత గాలి నాణ్యత ప్రమాణాల్లో కాస్త మెరుగుపడింది.నిధుల వినియోగంలో ఏపీ వెరీపూర్..ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా కాలుష్య కారకాలను నియంత్రించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్సీఏపీ (నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం) కింద నిధులు కేటాయిస్తోంది. ఈ నిధులను వినియోగించుకోవడంలో ఏపీ చాలా వెనుకబడినట్లు సీఆర్ఈఏ అధ్యయనంలో వెల్లడైంది. కేటాయించిన నిధుల్లో 35 శాతం మాత్రమే వినియోగించారు. అదే మధ్యప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలు 90 శాతం నిధులను వినియోగించాయి. -
HYD: ఈ గాలి పీలిస్తే డేంజరే..!
సాక్షి, హైదరాబాద్: నగరంలో అంబరాన్నంటిన కొత్త సంవత్సరం వేడుకలు, సంక్రాంతి పండగకు స్వగ్రామాలకు ప్రయాణమైన లక్షలాది వాహనాలు వెరసి వాయు కాలుష్యంపై తీవ్రప్రభావాన్ని చూపిస్తున్నాయి. పండగకు వరుస సెలవులు తోడవడంతో హైదరాబాద్ నుంచి సుమారు 30 శాతం మంది ప్రజలు తమ సొంత గ్రామాలకు బయలుదేరారు. దీంతో నగరంలో నడిచే వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అంతా భావించారు. స్వచ్ఛమైన గాలి దొరుకుతుందని ఊహించారు. అయితే అవన్నీ ఊహలేనని చెబుతూ వాయు నాణ్యత ఇండెక్స్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ ఏడాది జనవరి 1న ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) 151గా నమోదు కాగా, 11న మరోమారు 150ని తాకింది. వార్షిక సరాసరి 136గా నమోదైంది. 2021లో వార్షిక ఏక్యూఐ 149గా నమోదు అయ్యింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం ఏక్యూఐ 50 లోపు ఉంటే స్వచ్ఛమైన గాలి ఉన్నట్లు లెక్క. 100 వరకు మోస్తరుగా ఉన్నట్లు. 100– 150 కి చేరితే మాత్రం నాణ్యత లోపించిందని లెక్క. ప్రస్తుతం నగరంలో గాలి నాణ్యత 122 నుంచి 151 మధ్య నమోదవుతోంది. ఏటా డిసెంబరు, జనవరి నెలల్లోనే గాలి నాణ్యత ఇలా తగ్గుముఖం పడుతోంది. గత ఏడాది జులైలో 53గా గాలి నాణ్యత ఉండగా, ఆరు నెలల్లోనే సుమారుగా రెండున్నర రెట్లు క్షీణించింది. ఈ వాయువులు పీలిస్తే ఆరోగ్యం చెడిపోతుందని, ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. మోత మోగిపోతోంది.. నగరంలో వాయు కాలుష్యానికి తోడు శబ్ద కాలుష్యం కూడా మోత మోగిస్తోంది. ఉదయం నుంచే సాధారణానికి మించి శబ్దాలు నమోదవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో శబ్ద కాలుష్యం 55 డెసిబెల్స్ కంటే తక్కువ ఉండాలి. హైదరాబాద్ నగరంలో సుమారుగా 80 డెసిబెల్స్ వరకు ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిమితికి మించి శబ్ద కాలుష్యం నమోదవుతోంది. రాత్రి పూట ప్రధాన రహదారులపై ప్రైవేటు వాహనాలు పెద్ద శబ్దాలతో హారన్లు మోగిస్తున్నాయి. -
వాయుకాలుష్యంతో రక్తం గడ్డకట్టే ముప్పు
న్యూఢిల్లీ: వాయు కాలుష్యం మానవుల ప్రాణాలకు అత్యంత హానికరమని మరోసారి రుజువైంది. దీర్ఘకాలంపాటు వాయుకాలుష్యం బారిన పడితే నరాల్లో రక్తం గడ్డకట్టే అవకాశాలు ఏకంగా 39 శాతం నుంచి 100 శాతందాకా పెరుగుతాయని అమెరికా అధ్యయనంలో వెల్లడైంది. దాదాపు 17 సంవత్సరాలపాటు అమెరికాలో 6,650 మంది యుక్తవ యస్కు లపై చేసిన పరిశోధనలో ఈ విషయం తేలింది. ‘‘వాయు కాలుష్యం కారణంగా కణజాలం, కండరాల కింద ఉండే ప్రధాన నరాల్లో రక్తం గడ్డ కట్టే అవకాశాలు పెరగొచ్చు. చికిత్స చేయకుండా అలాగే వదిలేస్తే రక్తప్రవాహానికి తీవ్ర అవరోధాలు ఏర్పడి ప్రసరణ ఆగిపోవచ్చు. అప్పుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి’’ అని పరిశోధకులు చెప్పారు. నరాల్లో రక్తం గడ్డ కట్టే పరిస్థితిని వేనస్ థ్రోంబోఎంబోలిజం’ అని పిలుస్తారు. ఈ సమస్య కారణంగా ఆస్పత్రిపాలైన రోగుల డేటాను మిన్నెసోటా విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం పరిశీలించింది. ఆయా రోగుల ఇళ్లలో వాయుకాలుష్యం తాలూకు శాంపిళ్లనూ తీసు కున్నారు. న్యూయార్క్, షికాగో, లాస్ ఏంజెలిస్ సహా ఆరు మెట్రోపాలిటన్ నగరాల్లో, ఆ నగరాల సమీపాల్లో నివసించే యుక్తవయసు రోగులపై ఈ పరిశోధన చేశారు. సూక్ష్మధూళి కణాలు(పీఎం 2.5) , నైట్రోజన్ ఆక్సైడ్ల బారిన పడి వాయు కాలుష్యాన్ని ఎదుర్కొంటున్న వారిలో 3.7 శాతం(248 మంది) జనాభాలో రక్తం గడ్డ కట్టే అవకాశాలు 39 శాతం నుంచి 100 శాతం వరకు ఉన్నాయి. సూక్ష్మధూళి కణాల గాఢత ఎంత ఎక్కువ ఉన్న గాలిని పీల్చితే అంత ఎక్కువగా రక్తం గడ్డ కట్టే అవకాశాలు పెరుగుతాయి. అత్యధిక స్థాయిలో నైట్రోజన్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ల బారిన పడితే ఈ రిస్క్ ఏకంగా 120–174 శాతానికి పెరుగుతుంది. వాయు కాలుష్యం ఎక్కువైతే శరీరంలో ఆ మేరకు వాపు పెరిగి రక్తం గడ్డకడుతుంది. చివరకు ఆ వ్యక్తులు హృదయ, శ్వాస సంబంధ వ్యాధుల బారిన పడతారు’’ అని పరిశోధకులు చెప్పారు. -
ఏక పంటల పొగలో ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వాయుకాలుష్యం ‘మరింత ప్రమాదకర’ పరిస్థితికి చేరింది. గాలిలో 2.5 పి.ఎం. (పార్టిక్యులేట్ మేటర్) ధూళి కణాలు ఎక్కువయ్యే కొద్దీ మానవ జీవనం దుర్భరంగా మారిపోతూ ఉంటుంది. ఈ ఇండెక్స్ 0–50 మధ్య ఉంటే మంచిది. 100 వరకు పర్వాలేదు. 200 వరకు పెరిగితే గాలి నాణ్యత ఒక మాదిరిగా ఉన్నట్లు. మార్చి – సెప్టెంబర్ మధ్యలో ఈ స్థాయిలో ఉంటుంది. అక్కడి నుంచే ప్రతి ఏటా ధూళి కణాల సాంద్రత వేగంగా పెరుగుతుంటుంది. 201–300కు పెరిగితే తీవ్రంగా ఉన్నట్లు. 400 వరకు వెళ్తే ఘోరం. 401–500కి చేరిందంటే అత్యంత ప్రమాకర స్థాయిగా చెబుతారు. 2024లో నవంబర్ 19న 494కు పెరిగింది. అన్ని వయసుల వారి ఆరోగ్యానికి హానికరంగా గాలి కాలుష్యం మారింది. ఇందుకు ముఖ్య కారణాలు: వాహన, పారిశ్రామిక కాలుష్యంతో పాటు వరి పొలాల్లో మోళ్లు, గడ్డిని తగులబెట్టటం. వరి కోతలయ్యాక నిప్పంటించి, ఆ వెంటనే గోధుమ విత్తుకోవటం ఢిల్లీ పరిసర రాష్ట్రాల రైతులకు అలవాటు. ఈ రెండు పంటలనే కనీస మద్దతు ధరకు ప్రభుత్వం సేకరిస్తున్నందు వల్ల ఈ విషవలయంలో రైతులు చిక్కుకుపోయారు. ‘హరిత విప్లవం’ మన పొలాల్లోకి వచ్చి ఇప్పటికి సరిగ్గా 65 ఏళ్లు. అప్పటి నుంచి పంట భూములను డొల్ల చేస్తున్న పర్యావరణ సంక్షోభమే ఇవాళ అతి సూక్ష్మ ధూళికణాల మహా పడగై రాజధానిని చుట్టుముట్టింది. దేశ రాజధానివాసులను మునుపెన్నడూ ఎరుగనంతగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. ‘హరిత విప్లవం’ వెంట తెచ్చిన ఏక పంటల (మోనోకల్చర్) దుష్ట సంస్కృతి వల్ల దాపురించడమే ఈ దుస్థితికి మూలకారణం. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల పొలాల్లో ఖరీఫ్‌లో వరి, రబీలో గోధుమ పంటల సాగు పద్ధతి రైతుల మనసుల్లో లోతుగా నాటుకుపోయింది. ఈ రెండు పంట దిగుబడులను మద్దతు ధరకు ప్రభుత్వం సేకరించడం వల్ల.. పప్పుధాన్యాలు, నూనెగింజల వంటి ఇతర పంటల వైపు రైతులు కన్నెత్తి చూడటం లేదు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని సారవంతమైన నేలల్లో రైతులు కేవలం వరి, గోధుమ పంటలనే ఏక పంటలుగా సాగు చేస్తున్నారు. యంత్రాలతో వరి కోతలైన కొద్ది రోజుల్లోనే గోధుమ విత్తుకోవాలంటే.. పొలాల్లో మిగిలిన మోకాలెత్తు వరి మోళ్లను తగుల బెట్టడానికి మించి మరొక సులువైన మార్గం రైతులకు తోచడం లేదు. పశువులకు వరి గడ్డి కన్నా గోధుమ గడ్డి మేపడమే మేలన్న భావన అక్కడి రైతుల్లో ఉంది. అందుకే వరిగడ్డికి డిమాండ్ లేదు. ప్రభుత్వం నిషేధించినప్పటికీ వరి మోళ్లకు రైతులు నిస్సంకోచంగా నిప్పంటిస్తూనే ఉన్నారు. భూమిలో అనేక అంగుళాల లోతు వరకూ సూక్ష్మజీవరాశి మాడిపోయి పొలం నిర్జీవంగా, నిస్సారంగా మారిపోతున్నా.. ఏటేటా రసాయనిక ఎరువుల మోతాదు పెంచుతున్నారే తప్ప.. ఏక పంటల సాగు విషవలయాన్ని రైతులు ఛేదించలేక΄ోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అగ్గి మీద గుగ్గిలంగా మండి΄ోతున్న లక్షలాది హెక్టార్ల పంట భూముల పొగ.. ఢిల్లీ నగరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పరస్పరాధారితమైన జీవవైవిధ్యమే ప్రకృతి మనుగడకు మూల సూత్రం. ఏక పంటల రసాయనిక వ్యవసాయ నమూనా ఫలితం నేలతల్లి పొదుగు కోసి పాలుతాగడం తప్ప మరొకటి కాదు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈ విషవలయంలో చిక్కుకున్న అన్నదాతల ఆక్రందనలు, ఆత్మబలిదానాలు పాలకులను కదిలించలేక΄ోతున్నాయి. కానీ, వరి పొలాల పొగ.. ఢిల్లీ పొలకులకు, ప్రజానీకానికి పంట భూముల్లో రగులుతున్న సంక్షోభాన్ని రుచి చూపిస్తున్నదంటే అతిశయోక్తి కాదు. పొలాల్లో పంటల జీవవైవిధ్యాన్ని, నేలతల్లి కడుపులో సూక్ష్మజీవరాశి వైవిధ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటేనే.. గ్రామీణులకైనా, దేశ రాజధానివాసులకైనా మనుగడ సాగుతుందని ఇప్పటికైనా గ్రహించడం మేలు.వాయుకాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారానికి ఇటు నగర వాసులు, అటు రైతులందరూ సమష్టిగా కృషి చేయాలి. పంట వ్యర్థాలను తగులబెట్టకుండా చూడటంతోపాటు వాహన, పారిశ్రామిక, నిర్మాణ రంగాల కాలుష్యాన్ని కూడా భారీగా తగ్గించుకునే మార్గాలు అత్యవసరంగా వెతకాలి. కేంద్ర మంత్రివర్గం గత సోమవారం నేషనల్ మిషన్ ఫర్ నాచురల్ ఫార్మింగ్‌ను రూ. 2,481 కోట్ల బడ్జెట్‌తో ఆమోదించింది. ఇది మంచి ప్రారంభం. 60 ఏళ్ల క్రితం హరిత విప్లవం ప్రారంభంలో మాదిరిగానే పంజాబ్, హర్యానాలలో అధిక దృష్టిని కేంద్రీకరించి ఇప్పుడు ప్రకృతి సేద్యాన్ని, బహుళ పంటల సాగు పద్ధతులను దీక్షగా ప్రోత్సహించాలి. ఈ పరివర్తన మట్టితోపాటు గాలిని, మనుషులను ఆరోగ్యవంతులుగా మారుస్తుంది.– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ (చదవండి: తాటి తేగలతోనూ వంటకాలు!) -
కాలుష్య భూతం: ముందు నోటీసులు.. ఆ తర్వాత చర్యలు!
దాదర్: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో వాయు నాణ్యత క్షీణిస్తుండడంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిపాలన విభాగం అప్రమత్తమైంది. పరిస్ధితులు మరింత చేయి దాటకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించింది. అందులో భాగంగా భవన నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్లు, బిల్డర్లకు, వాయు కాలుష్యాన్ని సృష్టిస్తున్న పరిశ్రమలకు నోటీసులు జారీ చేయనుంది. అంతేగాకుండా భవన నిర్మాణాలు జరిగేచోట కూలీలు సామూహికంగా వంట చేసుకోవడం, రాత్రుళ్లు చలి కాచుకునేందకు మంటలు వేసుకోవడాన్ని కూడా నిషేధించనుంది. పరిస్థితి చేయి దాటకముందే... దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంవల్ల ఏస్థాయిలో ఉందో తెలియంది కాదు. అయితే గత కొద్దిరోజులుగా ముంబైలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కారణాలేవైనా రోజురోజుకూ వాయు కాలుష్యం పెరిగిపోతుండటంతో వాయు నాణ్యత క్షీణిస్తోంది. ముంబై సహా తూర్పు, పశ్చిమ ఉప నగరాల్లో అనేక చోట్ల నూతన భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటిలో కొన్ని నివాస భవనాలు కాగా మిగతావి షాపింగ్ మాల్స్, మల్టీఫ్లెక్స్‌లు వంటి నిర్మాణాలున్నాయి. ఈ నిర్మాణాల వద్ద వాయు కాలుష్య నివారణకు సంబంధించిన నియమాలు పాటించడం లేదని బీఎంసీ దృష్టికి వచ్చింది. దీంతో నియమాలు పాటించనివారికి మొదటి హెచ్చరికగా ముందుగా నోటీసులు జారీ చేయనున్నారు. ఇచ్చిన గడువులోపు తగిన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో సైట్‌కు సీలువేసి పనులు నిలిపివేస్తారు. అనంతరం సంబంధిత కాంట్రాక్టర్లు, బిల్డర్లపై తగిన చర్యలు తీసుకుంటారు. పలుకారణాలతో వాయుకాలుష్యం.. భవన నిర్మాణాలు జరుగుతున్న చోట వేలాది మంది కూలీలు, కార్మికులు పనులు చేస్తారు. వీరంతా గ్రూపులుగా ఏర్పడి ఉదయం, రాత్రుళ్లలో అక్కడే వంట చేసుకుంటారు. ఇందుకోసం వీరు కిరోసిన్ స్టౌ లేదా వంట గ్యాస్ సిలిండర్లను వాడరు. సైటువద్ద వృథాగా పడి ఉన్న కలపను వినియోగిస్తారు. ఈ కలప నుంచి భారీగా వెలువడే పొగ కాలుష్యాన్ని సృష్టిస్తోంది. అదేవిధంగా ప్రస్తుతం చలికాలం కావడంతో ఉదయం, రాత్రి వేళల్లో వాతావరణం చల్లగా ఉంటుంది. చలి బారి నుంచి తట్టుకునేందుకు నగరంలోని మురికివాడల్లో, ఫుట్‌పాత్‌లు, రోడ్లపక్కన నివసించే పేదలు చలిమంట కాచుకుంటారు. చెత్త కాగితాలు, నిరుపయోగంగా పడి ఉన్న వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ చెత్త, కట్టెలు, గడ్డి తదితర సామాగ్రిని ఈ మంటలో వేస్తారు. వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల కాకుండా వాయునాణ్యత క్షీణించేందుకు ఇవి కూడా కారణాలవుతున్నాయి. అదేవిధంగా నగరంలో దాదాపు 50 వేలకుపైగా పాత కాలం నాటి బేకరీలున్నాయి. అందులో 24 గంటలు బ్రెడ్లు, పావ్‌లు, కేక్‌లు తయారవుతూనే ఉంటాయి. వీటి తయారీకి బేకరీ నిర్వాహకులు కలపనే వినియోగిస్తారు. వీటినుంచి వెలువడే దట్టమైన పొగ గాలి స్వచ్చతను దెబ్బతీస్తోంది. ప్రతీ వార్డులో వాటర్ స్ప్రింక్లర్... ఈ నేపథ్యంలో బీఎంసీ నూతన నిర్మాణాలు జరుగుతున్న చోట దుమ్ము, ధూళీ వెలువడకుండా చూసుకునే బాధ్యత సంబంధిత కాంట్రాక్టర్లు, బిల్డర్లేదనని హెచ్చరించింది. ఇందుకోసం ప్రతీ వార్డులో 5 నుంచి 9 వేల లీటర్ల నీరు వెదజల్లే వాటర్ స్ప్రింక్ర్లను అందుబాటులో ఉంచింది. ఈ స్ప్రింక్లర్లు రోడ్లపై గాలిలో ఎగురుతున్న దుమ్ము, ధూళిని నియంత్రిస్తాయి. ఫలితంగా కొంత శాతం కాలుష్యం నియంత్రణలోకి వస్తుందని బీఎంసీ భావిస్తోంది. అంతేకాకుండా రెడీ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్లను మూసివేసే యోచనలో కూడా ఉంది. వాయు కాలుష్య నివారణ కోసం కొత్తగా అమలు చేయనున్న నియమాలు నిర్మాణ పనులు జరుగుతున్న భవనం చుట్టూ 35 అడుగుల ఎత్తున్న ఇనుప రేకులతో ప్రహరీ గోడను నిర్మించాలి.భవనానికి ఏర్పాటు చేసిన వెదురు బొంగుల కంచెకు జూట్ వస్త్రం లేదా ఆకుపచ్చ బట్ట చుట్టాలి. నిర్మాణాలు జరుగుతున్న సైట్ల వద్ద వాటర్ స్ప్రింక్లర్లను కచ్చితంగా అందుబాటులో ఉంచాలి. రోజుకు 4 లేదా5 సార్లు నీటిని స్ర్పింకిల్ చేయాలి.కూలీలు, కార్మికులు కచ్చితంగా ముఖానికి మాస్క్, కళ్లద్దాలు ధరించాలి. భవన నిర్మాణాలు జరుగుతున్న చోట కాపలగా ఉండే సెక్యూరిటీ గార్డులు చలికాచుకునేందుకు ఎలక్ట్రిక్ గ్యాస్ పొయ్యి కొనివ్వాలి. -
పొల్యూషన్ ఎఫెక్ట్: రోడ్డుపై ఆ కార్లు తిరిగితే భారీ ఫైన్..
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమవుతున్న తరుణంలో సుప్రీంకోర్టు బీఎస్3 పెట్రోల్ కార్లను, బీఎస్4 డీజిల్ కార్లను నడపడం నిషేదించింది. ఈ నిషేధం గురువారం (డిసెంబర్ 5) వరకు కొనసాగుతుంది. రెండు రోజులుగా సాధారణ స్థాయికంటే.. ఎక్కువ కాలుష్యం ఏర్పడింది. కాబట్టి పొల్యూషన్ అదుపులోకి వచ్చే వరకు నిర్దేశించిన కార్లను ఉపయోగించకూడదది సుప్రీంకోర్టు ఆదేశించింది.ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (CAQM) నవంబర్ 8 నుంచి పరిమితులను అమలు చేసింది. కాలుష్యాన్ని తగ్గించడానికి కొన్ని వాహనాలను నియంత్రించింది. ఈ చర్యలు తీసుకోకపోతే.. కాలుష్యం మరింత తీవ్రతరం అవుతుంది. నిషేధిత వాహనాల జాబితాలో కార్లు మాత్రమే కాకుండా కమర్షియల్ ట్రక్కులు, డీజిల్‌తో నడిచే పబ్లిక్ బస్సులు.. కాలం చెల్లిన ప్రైవేట్ వెహికల్స్ ఉన్నాయి.డిసెంబర్ 5 తరువాత బీఎస్3 పెట్రోల్ కార్లను, బీఎస్4 డీజిల్ కార్లను అనుమతించే ముందు ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలకు చెందిన అధికారులను సుప్రీంకోర్టులో హాజరు కావాలని ధర్మాసనం కోరింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులు సమర్థవంతంగా పనిచేయలేదని సుప్రీంకోర్టు పేర్కొంది.గత వారం.. బీఎస్ 3 పెట్రోల్, బీఎస్ 4 డీజిల్ వాహనాలపై నిషేధాన్ని పాక్షికంగా సడలించింది. అయితే ప్రస్తుతం ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ.. మళ్ళీ కఠినమైన ఆంక్షలు విధించింది. కాబట్టి నియమాలను ఉల్లంఘిస్తే.. రూ. 20,000 జరిమానా చెల్లించాల్సి వస్తుంది. పీయూసీ సర్టిఫికేట్ లేకుండా తిరిగే వాహనాలకు రూ. 10,000 జరిమానా విధించారు. ఇవి కాకుండా 15 ఏళ్ల పైబడిన పెట్రోల్ కార్లు లేదా 10 ఏళ్లు పైబడిన డీజిల్ కార్లు రోడ్డుపై తిరిగితే.. వాటిని పూర్తిగా స్వాధీనం చేసుకుంటారు. కాబట్టి వీటిని గుర్తుంచుకుని వ్యవహరించాలి. లేకుంటే భారీ జరిమానాలు చెల్లించక తప్పదు. -
మృత్యుకుహరంగా మహానగరం
‘కాలుష్యం రేపటి తరాలకు శాపం’ అన్నది ఒకప్పటి మాట. నేటి పరిణామాలు గమనిస్తే రేపు కాదు, నేడే ప్రాణాంతకంగా మారింది. అందుకు ఉదాహ రణ దేశ రాజధాని న్యూఢిల్లీ. ఒకప్పుడు ప్రపంచంలోనే అందమైన, ఆహ్లాదకర నగరాలలో ఒకటి. దశాబ్ద కాలం పైబడి మానవ తప్పిదాలు, ప్రభుత్వాల ఉదాసీనత కారణంగా కాలుష్య కాసారంలో పడి మానవ మనుగడ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నిజానికి దేశంలోని అన్ని పెద్ద నగరాలూ ఈ సమస్యతో సతమతమవుతున్నాయి. వాయుకాలుష్యాన్ని పర్యావరణ సమస్యగానే పరిగణించకుండా, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశంగా చూసి, దాన్నుంచి బయటపడిన కొన్ని దేశాల అనుభవాలు మనకు ఆచరణీయం. కావాల్సిందల్లా తక్షణ నివారణ చర్యల్ని అమలు చేయగలిగే చిత్తశుద్ధి.ఎక్కడైనా గాలి నాణ్యత స్థాయి (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్– ఏక్యూఐ) 50 నుంచి 100 వరకు ఉంటేనే ఆరోగ్యకరంగా ఉన్నట్టు! దేశంలోని అనేక పట్టణాలు, నగరాలలో ఇది 150 దాటుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముంబై, చెన్నై, కలకత్తా, బెంగళూరులలో ఏక్యూఐ ప్రమాద ఘంటిక లను మోగిస్తోంది. హైదరాబాద్‌లో ప్రస్తుత ఏక్యూఐ సగుటన 130గా నమోదవుతోంది. ఊపిరాడేనా?ఢిల్లీలో నవంబర్ రెండో వారం నాటికి ఏక్యూఐ 467 పాయింట్లకు చేరింది. అక్కడి జహంగీర్‌పూర్‌లో అయితే ఏకంగా 567 పాయింట్లు నమోదైంది. ఊపిరాడని కాలుష్య తీవ్రతకు తోడుగా శీతకాలంలో వచ్చే పొగమంచు ఢిల్లీ ప్రజానీకానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఢిల్లీ రన్‌వేపై 400 మీటర్ల తర్వాత ఏముందో కనిపించనంతగా దృశ్య గోచరత (విజిబిలిటీ) తగ్గిపోవడంతో, పలు విమానాల సర్వీసుల్ని రద్దు చేశారు. ఢిల్లీకి వెళ్లే, ఢిల్లీ నుంచే బయలుదేరే రైళ్ల రాక పోకలకు సైతం అంతరాయం ఏర్పడింది. చిన్న పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీలోని అన్ని స్కూళ్ల ప్రైమరీ క్లాసుల్ని ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. రోడ్ల మీద పెట్రోల్, డీజిల్ వాహనాల రాకపోకలను నిలిపివేసి, కేవలం విద్యుత్, సీఎన్‌జీలతో నడిచే వాహనాలనే అనుమ తిస్తున్నారు. ప్రజారవాణా తప్ప సొంత వాహనాలలో బయటకు వెళ్లే అవకాశం లేని దయనీయ దుఃస్థితి ఏర్పడింది. ఒక్క సమస్య పలు ఇతర సమస్యలకు పుట్లిల్లు అవుతుందని ఓ సామెత. దశాబ్దకాలంగా ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాలను వేధిస్తూ వస్తున్న వాయు, నీటి కాలుష్యాలు అనేక అనర్థాలకు దారితీశాయి. వాటిని పరిష్కరించక పోవడం వల్లనే నేడు కోట్లాది మంది ప్రజల ఆరోగ్యం, భవితవ్యం ప్రశ్నార్థకంగా మారాయి. ఇప్పటికే వాయు కాలుష్యం వల్ల ఢిల్లీలో స్థిర నివాసం ఉంటున్న ప్రజలలో చాలామందికి శ్వాసకోశ సమస్యలు మొదలుకొని క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్నారు. నిజానికి, ఢిల్లీ వాయుకాలుష్యంపై అనేక సందర్భాలలో సర్వోన్నత న్యాయస్ధానం జోక్యం చేసుకోవడంతోనే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చర్యలనైనా చేపట్టాయి. ఈ అరకొర చర్యలు ప్రజానీకాన్ని రక్షించగలవా?విదేశాల అనుభవాలుప్రపంచంలోని అనేక నగరాలు ఏదో ఒక సమయంలో కాలుష్యం బారిన పడినవే. పరిశ్రమల ఏర్పాటు, భవన నిర్మాణాలు ముమ్మరం కావడం, పట్టణీకరణ పెరగడం తదితర అంశాల వల్ల వాయు, నీటి కాలుష్యాలు అన్నిచోట్లా తీవ్రస్థాయికి చేరాయి. 1952లో లండన్ నగరాన్ని కాలుష్య భూతం కాటేసింది. ‘గ్రేట్ స్మాగ్’ అని పిలిచే ఆ ఉత్పా తానికి 1,200 మంది బలయ్యారు. దాంతో, 1956లో బ్రిటిష్ ప్రభుత్వం ‘క్లీన్ ఎయిర్ యాక్ట్ 1956’ తెచ్చి కఠినంగా అమలు చేసింది. లండన్ నగరంలోని అన్ని పరిశ్రమలనూ సుదూర ప్రాంతా లకు తరలించింది. నగరంలోని ఖాళీ స్థలాలను పార్కులుగా అభివృద్ధి పరిచి పచ్చదనం పెంచింది. అలాగే, 2008లో ‘బీజింగ్ ఒలింపిక్స్’ నిర్వహించిన చైనా ప్రభు త్వానికి కూడా వాయుకాలుష్యం సవాలు విసిరింది. భారీ నిర్మాణాలు చేపట్టిన ఆ సందర్భంలో, గాలి నాణ్యత తగ్గకుండా చైనా ప్రభుత్వం అన్ని రకాల పరిశ్రమలనూ దూర ప్రాంతాలకు తరలించింది. వాహ నాలను క్రమబద్ధీకరించడమేకాక, ప్రజా రవాణాను ఉపయోగించుకొనేలా ప్రజలను సమాయత్తం చేసింది. బీజింగ్‌లో వాయు కాలుష్యం తగ్గాక, అక్కడి ప్రజల ఆయుర్దాయం సగటున నాలుగేళ్లు పెరిగిందని చైనా ప్రభుత్వం వెల్లడించింది. పారిశ్రామికంగా ఎంతో ముందంజ వేసిన అమెరికా, మెక్సికో, జపాన్‌లు ఒకప్పుడు వాయుకాలుష్యాన్ని ఎదుర్కొన్నప్పటికీ, వేగంగా ఆ సమస్య నుండి బయటపడ్డాయి. ప్రభుత్వం, ప్రజలు ఉమ్మడిగా ఆ సమస్యను ఎదుర్కొన్న తీరు అనన్య సామాన్యం. వాయు కాలుష్యాన్ని ఆ ప్రభుత్వాలు కేవలం పర్యావరణ సమస్యగానే పరిగ ణించలేదు, ప్రజారోగ్యానికి సబంధించిన అంశంగా చూశాయి. ప్రభు త్వంలోని అన్ని శాఖలు సమీకృతంగా సమస్యను ఎదుర్కోవడానికి కృషి చేశాయి. అటువంటి రోడ్ మ్యాప్ మన దేశంలో లేకపోవడంతోనే ‘ఇంతింతై వటుడింతౖయె...’ అన్నట్లు కాలుష్య సమస్య పెనుభూతంగా మారింది. పారిశ్రామిక వ్యర్థాలు, వాహనాలు వెలజల్లే కార్బన్ డయాక్సైడ్, భవన నిర్మాణాల కారణంగా గాలిలో కలిసే ధూళి;ఎండిన చెట్లు, చెత్తా, చెదారాలన్నింటినీ తగల బెట్టడం ద్వారా వచ్చే పొగ... ఇవన్నీ వాయు కాలుష్యానికి కారణం అవుతున్నాయి. ఢిల్లీకి పక్కనే ఉన్న యమునా నదిలో పారిశ్రామిక వ్యర్థాలను విచ్చలవిడిగా వదలడంతో ఆ ప్రాంతం పూర్తిగా కలుషితమైంది. ఢిల్లీకి సమీపంలో ఉన్న హరియాణా, పంజాబ్ రాష్ట్రాలలో ప్రతి వ్యవసాయ సీజన్ ముగి శాక పంట వ్యర్థాలను కాల్చడంతో... దట్టమైన పొగలు కమ్మేస్తు న్నాయి. వీటికితోడు దీపావళి, కొన్ని వివాహ వేడుకల సందర్భంగా వినోదం కోసం టపాసుల్ని పేల్చడం ఆనవాయితీగా వస్తోంది. ఇవి కూడా సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి.ప్రభుత్వాల ముందున్న కర్తవ్యంఢిల్లీని పీడిస్తున్న వాయుకాలుష్యం చాలావరకు స్వయం కృతమే. ఢిల్లీ పరిధిలో 9,000 హోటళ్లు ఇప్పటికీ పెద్ద ఎత్తున బొగ్గు ఉపయో గిస్తున్నట్లు తేలింది. తందూరీ వంటకాలు చేసే హోటళ్లు బొగ్గును వాడుతున్నాయి. వంటకు గ్యాస్ బదులు కట్టెలు, వ్యవసాయ వ్యర్థాలు, పిడకలు వాడుతున్నవారి సంఖ్య ఢిల్లీలో దాదాపు 20 లక్షలు ఉన్నట్లు చెబుతున్నారు. ఢిల్లీలో రోజుకు సగటున 500 టన్నుల మునిసిపల్ సాలిడ్ వేస్ట్ (ఇళ్ల నుంచి సేకరించే వ్యర్థాల)ను కాలు స్తున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. భవన నిర్మాణాలు జరిగేటప్పుడు, నిర్మాణ స్థలాల్ని పూర్తిగా కవర్ చేయడం; సిమెంట్, ఫ్లయ్ యాష్వంటి నిర్మాణరంగ మెటీరియల్స్‌ను కప్పి ఉంచడం తప్పనిసరిగా చేయాల్సి ఉన్నప్పటికీ... ఆ నిబంధనల్ని చాలావరకు పాటించడం లేదు. చమురు శుద్ధి ప్లాంట్ల నుంచి ప్రాణాంతకమైన సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వెలువడుతుంటాయి. వీటిని నిరోధించే టెక్నాలజీని అమెరికా, చైనా ఉపయోగిస్తుండగా మనకు అందుబాటులోకి రాలేదు. కాలుష్యాన్ని ఎక్కువ వెదజల్లే పెట్రోల్, డీజిల్ వాహనాల సంఖ్యను అభివృద్ధి చెందిన దేశాలు 30 శాతానికి తగ్గించాయి. అధునాతన ఫిల్టర్లను ఉపయోగిస్తూ వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించాయి. చాలా దేశాలలో పంట వ్యర్థాలను తగులబెట్టకుండా వాటిని బయోగ్యాస్ ఉత్పత్తికి, పశువుల దాణాకు వాడుతున్నారు. పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ నింపేటప్పుడూ(అన్లోడింగ్), వాహనాల్లో ఇంధనం పోసేటప్పుడూ గాలిలో ప్రమాదకర ఆర్గానిక్ వ్యర్థాలు కలుస్తాయి. చాలా దేశాలలో ఇంధనం లోడింగ్, అన్లోడింగ్ సమ యాలలో ‘వేపర్ రికవరీ సిస్టవ్‌ు’ టెక్నాలజీని ఉపయోగిస్తూ దీన్ని నివారించగలుగుతున్నారు.ఢిల్లీని వణికిస్తున్న వాయు కాలుష్య భూతం మాటేసిన మృత్యు వులా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజల భాగస్వామ్యంతో యుద్ధ ప్రాతిపదికన తక్షణ నివారణ చర్యల్ని చిత్తశుద్ధితో అమలు చేయాలి. లేకుంటే, దేశ రాజధాని ఆరోగ్య భద్రతను కాపాడు కోలేకపోతోందనే అపప్ర«థ ప్రభుత్వంపై పడుతుంది. అంతర్జాతీయ సమాజంలో తలదించుకోవాల్సి వస్తుంది. డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, శాసనమండలి సభ్యులు -
Delhi Pollution: ఊపిరి సలపనివ్వని కాలుష్యం .. 300కు తగ్గని వైనం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ఎన్సీఆర్లో కాలుష్య స్థాయి ఒకరోజు పెరుగుతూ, మరోరోజు తగ్గుతూ వస్తోంది. ఈరోజు (గురువారం) ఉదయం మరోసారి ఢిల్లీలో కాలుష్య స్థాయి 300కి చేరుకుంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత చాలా తక్కువ కేటగిరీలో ఉంది. ఇండియా గేట్ వద్ద భారీగా పొగమంచు కమ్ముకుంది. కాళింది కుంజ్‌లోని యమునా నదిలో విషపు నురుగు తేలియాడుతోంది.వాయు కాలుష్యం కారణంగా కంటి నొప్పులు, గొంతు సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు బాధితులు చెబుతున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో కురుస్తున్న పొగమంచు.. ప్రజలపై సూర్యుని వేడి పడకుండా చేస్తోంది. ఫలితంగా శరీరంలోని ఎముకలు బలహీనంగా మారుతున్నాయి. ఎయిమ్స్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. సూర్యకాంతి నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలు శరీరంలో 90 శాతం విటమిన్ డి3 ఉత్పత్తికి మూలకారణంగా నిలుస్తున్నాయి. భారీగా కురుస్తున్న పొగమంచు శీతాకాలంలో సూర్యరశ్మి నేరుగా భూమిని చేరుకోకుండా అడ్డుకుంటోంది.ఎయిమ్స్ నిపుణులు ఢిల్లీ, గురుగ్రామ్‌లలో పలువురిపై నిర్వహించిన అధ్యయనంలో పలు విషయాలు వెల్లడయ్యాయి. ఢిల్లీలో పొగమంచు కారణంగా ప్రజలపై సూర్యరశ్మి తక్కువగా పడిందని, దీంతో చాలామంది విటమిన్ డి లోపానికి గురైనట్లు అధ్యయనంలో తేలింది. ఢిల్లీలో అంతకంతకూ కాలుష్య స్థాయి పెరుగుతోంది. పొగమంచు సమస్య తీవ్రతరమయ్యింది. ఈరోజు రాజధానిలో దట్టమైన పొగమంచు కురిసే అవకాశాలున్నాయని చెబుతూ వాతావారణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ఇది కూడా చదవండి; నేటి పార్లమెంట్లో.. ముచ్చటగా ముగ్గురు ‘గాంధీ’ ఎంపీలు -
దేశ రాజధాని మార్పు అవసరమేనా?
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికిచేరింది. తాజాగా అక్కడ గాలి నాణ్యతా సూచి 500 మార్క్ చేరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ప్రజలు కళ్ల మంటలు, దురద, గొంతు నొప్పితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరాన్ని దట్టమైన పొగ మంచు కమ్మేసింది. ఈ నేపథ్యంలో కాలుష్య మయమైన ఢిల్లీని భారతదేశ రాజధానిగా కొన సాగించడం అవసరమా అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ లేవనెత్తిన అంశం చర్చకు దారి తీస్తోంది.మొఘల్ చక్రవర్తుల రాజధానిగా ఒక వెలుగు వెలిగిన ఢిల్లీ... బ్రిటిష్ రాణి పాలనా కాలంలోనూ, స్వాతంత్య్రం తరువాత కూడా రాజధాని హోదాతోనే ఉంది. పార్లమెంట్, రాష్ట్రపతి భవన్, సుప్రీం కోర్ట్, ప్రధాన మంత్రి కార్యా లయం వంటి అత్యున్నత సంస్థలు ఢిల్లీలో ఉన్నాయి. ఇతర నగరాలతో పోటీ పడుతూ వాణిజ్య కేంద్రంగానూ అభివృద్ధి చెందింది. అంతర్జాతీయసంబంధాల రీత్యానూ ఢిల్లీ కీలకమైన స్థానం. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో రాజధాని మార్పుఅంశం తెర మీదకు వచ్చింది.ప్రపంచంలో కొన్ని దేశాలు తమ తమ రాజధానులను అవసరం మేరకు మార్చుకున్న ఉదాహరణలు చాలానే ఉన్నాయి. నైజీరియా పాత రాజధాని లాగోస్ నుంచి 1991లో ‘అబుజా’కు మార్చుకుంది. లాగోస్‌లో అధిక జనసాంద్రత సమస్య, ట్రాఫిక్ సమస్యలు ఉండేవి. అందుకే దేశానికి భౌగోళికంగా మధ్యలో ఉన్న అబుజాను కొత్త రాజ ధానిగా ఎంచుకున్నారు. ఇక 2006లో యాంగోన్ (రంగూన్) నుంచి నైపిటావ్కు మయన్మార్ తన రాజధానిని మార్చుకుంది. భద్రత, పరిపాలన సామర్థ్యం పెంపొందించుకోవడం వంటి కార ణాలుఇందుకు కారణాలు. 1918లో రష్యా కూడా సెయింట్ పీటర్స్ బర్గ్ నుంచి మాస్కోకు రాజధానిని మార్చింది.వ్యూహాత్మకంగా మాస్కో మరింత ప్రాముఖ్యం ఉన్న ప్రాంతమని రష్యా భావించింది. ఇక పొరుగు దేశం పాకిస్తాన్ 1963లో కరాచీ నుంచి ఇస్లామాబాద్‌కు రాజధానిని మార్చుకుంది. కరాచీ నగరానికి భద్రతా సమస్యలు ఉండటం, అక్కడ అధిక జనాభా ఉండడం వంటి కారణాలతో దేశానికి కేంద్ర స్థానంలో ఉన్న ఇస్లామాబాద్‌కు రాజధానిని తరలించు కున్నారు. బ్రెజిల్,, కజకిస్తాన్, టాంజానియా వంటివీ రాజధానులను మార్చుకున్నాయి. ఇక ప్రస్తుతం మన విషయానికి వస్తే... పుణే, హైదరాబాద్, నాగపూర్ వంటి నగరాలు దేశానికి మధ్యలో ఉండటం వల్ల వీటిలో ఏదో ఒక నగరాన్ని రాజధానిగా ఎంచుకోవాలని కొందరు సూచిస్తు న్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీలో కొన్ని తక్షణ చర్యలు చేపట్టాలి. గ్రీన్ బెల్ట్స్ అభివృద్ధి చేయాలి. పునఃవిని యోగ ఇంధన వనరులన వాడకాన్ని అధికం చేయాలి. పరిపాలనా కార్యా లయాలను ఇతర నగరాలకు విస్తరించాలి. ఈ క్రమంలో హైదరాబాద్‌ను రెండో రాజధాని చేసే అంశం మరో సారి తెరపైకి వస్తోంది. ఇక్కడి మౌలిక వసతుల నేపథ్యంలో హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయా లని రాజ్యాంగ నిర్మాత డా‘‘ బాబా సాహెబ్ అంబేడ్కర్ అప్పట్లోనే అన్నారని, ఆ అర్హత హైదరాబాద్‌కు ఉందని కొందరు గుర్తు చేస్తు న్నారు. హైదరాబాద్‌లో కూడా కాలుష్యం పెరిగే అవకాశం ఉంటుందని, భాగ్యనగరంతో పాటు తెలంగాణలో వివిధ ప్రదేశాల్లో పరిపా లనా కేంద్రాలను నిర్మిస్తే బాగుంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.శశిథరూర్ లేవనెత్తిన అంశంపై మరింత చర్చ జరగాలి. ఢిల్లీవంటి నగరంలో పెరుగుతున్న కాలుష్యం, జనాభా, మౌలిక సదు పాయాల సమస్యలను పరిగణనలోకి తీసుకుంటూ దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయాలు తీసుకోవాలి. రాజధానిని మార్చడం అనేది తక్షణావసరం కాకపోయినా, భవిష్యత్తులో పరిశీల నార్హమైన అంశం. అదే సమయంలో ఢిల్లీని కాలుష్యం బారి నుంచి రక్షించడం తక్షణ అవసరం.– ఎక్కులూరి నాగార్జున్ రెడ్డిఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ‘ 90320 42014 -
పిల్లలకు వె'డర్'!
సాక్షి, అమరావతి: వాతావరణంలో తీవ్రంగా పెరుగుతున్న గాలి కాలుష్యంతోపాటు ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు పిల్లల జనాభాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్(యునిసెఫ్) వెల్లడించింది. మన దేశంలో 2050 నాటికి పిల్లల సంఖ్య 10.60 కోట్ల మేర తగ్గుతుందని హెచ్చరించింది. వాతావరణంలో మార్పుల వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలతోపాటు తక్కువ ఆదాయ వర్గాల జీవనోపాధులపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపింది. అదేవిధంగా వరదలు వంటి ప్రకృతి విపత్తుల ముప్పు కూడా పెరుగుతుందని పేర్కొంది. వీటివల్ల పిల్లల సంఖ్య తగ్గుతుందని, 2050 నాటికి దేశ జనాభాలో సుమారు 45.6 కోట్లు ఉండాల్సిన బాలలు... కేవలం 35 కోట్లు మాత్రమే ఉంటారని వివరించింది. అయినా 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఉండే మొత్తం పిల్లల జనాభాలో భారతదేశ వాటా 15శాతం ఉంటుందని అంచనా వేసింది. యునిసెఫ్ ఫ్లాగ్షిప్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ చిల్డ్రన్–2024 నివేదిక ప్రకారం 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల మంది పిల్లలు ఉంటారని, వారిలో మూడో వంతు భారత్, చైనా, నైజీరియా, పాకిస్తాన్ దేశాల్లోనే ఉంటారని ప్రకటించింది. కొన్ని దేశాల్లో ప్రతి పది మందిలో ఒక్కరు కూడా పిల్లలు ఉండని ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 2050–59 మధ్య పర్యావరణ సంక్షోభాలు మరింత ఎక్కువగా తలెత్తే అవకాశం ఉందని, ఇవి పిల్లల జనాభాపై అత్యంత తీవ్రంగా ప్రభావం చూపుతాయని యునిసెఫ్ ఆందోళన వ్యక్తంచేసింది.యునిసెఫ్ నివేదికలోని ముఖ్యాంశాలు..» ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఆదాయం కలిగిన 28 దేశాల్లో కుటుంబ ఆదాయాల పరంగా పిల్లల జనాభాలో మార్పులను అంచనా వేశారు. 2000 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం పిల్లల జనాభాలో 11 శాతం మంది తక్కువ ఆదాయం కలిగిన 28 దేశాల్లోనే ఉండగా... 2024 నాటికి 23 శాతానికి పెరిగింది. అదే సమయంలో ఉన్నత, మధ్యస్థ ఆదాయాలు కలిగిన దేశాల్లో పిల్లల జనాభా తగ్గింది.» ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాల్లో 2000వ సంవత్సరంలో 24 కోట్ల మంది పిల్లలు ఉండగా, ఆ సంఖ్య 2050 నాటికి 54.40 కోట్లకు పెరుగుతుందని అంచనా. దిగువ మధ్య తరగతి ఆదాయ కుటుంబాల్లో 100.09 కోట్ల మంది ఉండగా, 2050 నాటికి స్పల్పంగా పెరిగి 118.70 కోట్లకు చేరుతుంది. » ఉన్నత, మధ్య ఆదాయ కుటుంబాల్లో 2000లో 65 కోట్ల మంది పిల్లల జనాభా ఉండగా, 2050 నాటికి ఆ సంఖ్య బాగా తగ్గి 38.70 కోట్లకు పరిమితమవుతుంది. ధనిక కుటుంబాల్లో 2000 నాటికి 24.40 కోట్ల మంది పిల్లల జనాభా ఉండగా, ఆ సంఖ్య 2050 నాటికి 21.60 కోట్లకు పరిమితమవుతుంది. » అదేవిధంగా పర్యావరణ సమస్యలను అధిగమించేందుకు 57 అంశాల అమలుపై 163 దేశాల్లో యునిసెఫ్ అధ్యయనం చేసి ప్రకటించిన చిల్డ్రన్ క్లెయిమెట్ రిస్క్ ఇండెక్స్‌లో భారత్ 26వ స్థానంలో ఉంది. -
ప్రాపర్టీస్ ధరలు తగ్గుతాయి!.. కారణం ఇదే
భారతదేశాన్ని వాయు కాలుష్యం మహమ్మారిలా పట్టి పీడిస్తోంది. ఈ సమయంలో జెరోధా కో-ఫౌండర్ 'నితిన్ కామత్' రియల్ ఎస్టేట్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.నితిన్ కామత్ తన ఎక్స్ ఖాతాలో ఒక ఫోటోను షేర్ చేస్తూ.. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాము. కింద కనిపిస్తున్నది 2019 వరకు డేటా. అయితే గత ఐదేళ్లలో పరిస్థితులు ఎంత దిగజారాయనిధి స్పష్టంగా కనిపిస్తోంది. వాయు కాలుష్యం కారణంగా భారతదేశంలో ప్రతి ఏటా లెక్కకు మించిన జనం ప్రాణాలు కోల్పోతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గాలి కాలుష్యం కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య అధికం.భూమిని కొనుగోలు చేసే ఎవరైనా గాలి, నీటి నాణ్యతను ఆస్తిగా భావించరు. కానీ గాలి, నీటి నాణ్యత అనేది ఆస్తి రేటును నిర్ణయిస్తుంది. నేను బెంగళూరులోని జేపీ నగర్లో ఆస్తిని కలిగి ఉన్నాను. ఇది ఇతర లేఅవుట్ల కంటే మంచి వాతావరణంలో ఉందని నితిన్ కామత్ పేర్కొన్నారు.దేశ రాజధాని అందరినీ ఆకర్శిస్తున్నప్పటీ.. అక్కడి వాతావరణం చాలా దుర్భర స్థితిలో ఉంది. ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 412 కంటే ఎక్కువ ఉంది. దీన్ని బట్టి చూస్తే.. ఢిల్లీలో వాయు కాలుష్యం ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమైపోతోంది. అయితే నోయిడా, ఘజియాబాద్ వంటి ప్రాంతాల్లో గాలి నాణ్యత కొంత మెరుగ్గానే ఉంది.ఇదీ చదవండి: జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు?.. ఇవి తెలుసుకోండిఢిల్లీ మాత్రమే కాకుండా.. ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరులో కూడా కాలుష్యం కొంత తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వాయు కాలుష్యం అనేది కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. కాబట్టి దీనికోసం సమిష్టి పరిష్కారాలు అవసరం. లేకుంటే.. రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందిన నగరాల్లో కూడా భూములు కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపరు. కాబట్టి రియల్ ఎస్టేట్ ధరలను కాలుష్యం నిర్ణయిస్తుందని నితిన్ కామత్ అన్నారు.You have to wonder what it will take for us to take air pollution more seriously. By the way, this data only covers until 2019, and things have only gotten worse in the last five years. Maybe a property price discount for the quality of air and water is the solution. If… pic.twitter.com/QtyzkqoG43— Nithin Kamath (@Nithin0dha) November 24, 2024 -
ఢిల్లీ కాలుష్యం.. జాతీయ అత్యవసర పరిస్థితే: రాహుల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంపై కాంగ్రెస్ ఎంపీ. లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. వాయు కాలుష్యం పెరగడంపై అటు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్న వేళ.. ఈ సంక్షోభాన్నిపరిష్కరించడానికి అందరూ ఐక్యంగా స్పందించాలని రాహుల్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో కాలుష్య పరిస్థితులను జాతీయ అత్యవసర స్థితిగా అభివర్ణించారు.ఈ మేరకు ఇండియా గేట్ వద్ద పర్యావరణవేత్త ఝాతో కలిసి మాట్లాడారు. ఉత్తర భారతదేశంలో నమోదవుతున్న గాలి కాలుష్యంపై రాజకీయ విమర్శలు, నిందలు వేసుకోవడానికి ఇది సమయం కాదని అన్నారు. కాలుష్య నివారణకు తక్షణ, సామూహిక చర్యలు అవసరమని పేర్కొన్నారు. కాలుష్యం కారణంగా తన కళ్ళు కూడా మండుతున్నాయంటూ వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. వాయు కాలుష్యానికి సామాన్య ప్రజలే ఎక్కువగా ప్రభావితులవుతున్నారని తెలిపారు.‘సమాజంలోని అత్యంత బలహీన వర్గాలు, పేదలు వాయు కాలుష్యం వినాశకరమైన ప్రభావాన్ని చూపుతోంది. ఈ విషపూరితమైన గాలిని తప్పించుకోలేక అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. వృద్ధులు బాధలు పడుతున్నారు. చాలా మంది చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఉత్తరభారతంలో నెలకొన్న తాజా పరిస్థితుల వల్ల పర్యాటకం బాగా పడిపోయింది. ప్రపంచంలో దేశ ఖ్యాతి పడిపోతుంది. కాలుష్య మేఘాలు వందలాది కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి. వాటిని తొలగించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వాలు, కంపెనీలు, నిపుణులు, పౌరుల నుంచి జాతీయ స్థాయిలో సమిష్టి ప్రతిస్పందన అవసరం. రాజకీయ నిందలు కాదు. విషపూరితంగా మారుతున్న వాతావరణాన్ని శుభ్రం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని తెలిపారు.మరికొద్ది రోజుల్లో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై కూలంకషంగా చర్చించి పరిష్కార మార్గాలను కనుగొనాలని సహచర ఎంపీలకు పిలుపునిచ్చారు. వాయు కాలుష్య రూపంలో ముంచుకొస్తన్ను ముప్పును అరికట్టడానికి కలిసి కట్టుగా చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మన అందరి బాధ్యత అని తెలిపారు.Air pollution in North India is a national emergency—a public health crisis that is stealing our children’s future and suffocating the elderly, and an environmental and economic disaster that is ruining countless lives. The poorest among us suffer the most, unable to escape the… pic.twitter.com/s5qx79E2xc— Rahul Gandhi (@RahulGandhi) November 22, 2024 -
ఢిల్లీ ఎంట్రీ పాయింట్లను పర్యవేక్షించండి: సుప్రీంకోర్టు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యం తీవ్ర స్థాయిలో కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకూ వాయు నాణ్యత క్షీణిస్తోంది. వాయుకాలుష్యం విపరీతంగా పెరగడంతో కట్టడి చర్యల్లో భాగంగా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రాప్)–3 నియమనిబంధనలను కాలుష్య నియంత్రణ మండలి అమలు చేస్తోంది. తాజాగా ఢీల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కాలుష్య నిరోధక నాలుగో దశ చర్యలు మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది.నిత్యావసరేతర వస్తువులు తీసుకొచ్చే ట్రక్కులు నగరంలోకి ప్రవేశించకుండా పోలీసు బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిషేధం ఉన్నప్పటికీ కాలుష్య కారక డీజిల్ ట్రకులు, బస్సులు రోడ్లపై తిరుగుతుండటంపై ప్రముఖ మీడియాలో వార్త కథనాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. వాయు కాలుష్యాన్ని కట్టడి చేయాలంటే 113 ప్రవేశ మార్గాల వద్ద చెక్‌పోస్టులను తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. జీఆర్ఏపీ-IV ఆంక్షలు సడలించాలా? వద్దా? అన్న విషయంపై వచ్చే వారం సమీక్షిస్తామని తెలిపింది.ఇక జీఆర్ఏపీ 4 నిబంధనల ప్రకారం విద్యుత్, సీఎన్జీ, భారత్–6 ప్రమాణాల డీజిల్ బస్సులు మినహా ఇతర అంతర్రాష్ట బస్సులను ఎన్సీఆర్ రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి అనుమతించబోరు. నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై నిషేధం అమల్లో ఉంటుంది. గనుల తవ్వకాన్నీ ఆపేస్తారు. ఢిల్లీ సహా గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్‌బుద్ధ్ నగర్ జిల్లాల్లో భారత్–3, భారత్–4 ప్రమాణాల డీజిల్ వాహనాల రాకపోకలను నిషేధించారు. అత్యధిక రద్దీ సమయాల్లో రోడ్లపై నీటిని చిలకరించనున్నారు. ఎవరికి వారు బైకులు, సొంత కార్లలో కాకుండా ప్రజారవాణా వ్యవస్థను వాడుకోవాలని సీఏక్యూఎం సూచించింది. ఐదోతరగతి వరకు ప్రైమరీ పాఠశాల క్లాసులను ఆన్లైన్లో చేపట్టాల్సి ఉంటుంది. -
సరైన సమయానికి.. అనువైన ఫీచర్: ఎయిర్ క్వాలిటీ ఇట్టే చెప్పేస్తుంది
ఇప్పటి వరకు గూగుల్ మ్యాప్స్‌లో ఏదైనా ప్రదేశాలను సెర్చ్ చేయడానికి, కొత్త ప్రాంతాలను సందర్శించడానికి.. ఇతరత్రా వంటి వాటికోసం ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు సంస్థ తాజాగా ఎయిర్ క్వాలిటీని చెక్ చేయడానికి 'ఎయిర్ వ్యూ ప్లస్' (Air View+) అనే తీసుకువచ్చింది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..ఈ వారం ప్రారంభంలో ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 491 గరిష్ట స్థాయికి చేరుకోవడంతో.. సంస్థ గాలిలోని ఎయిర్ క్వాలిటీ తెలుసుకోవడం ముఖ్యమని భావించింది. ఈ కారణంగానే ఎయిర్ వ్యూ ప్లస్ ఫీచర్ తీసుకువచ్చింది. ఇది ఏఐ ద్వారా పనిచేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వాతావరణంలోని గాలి నాణ్యతను గురించి తెలుసుకోవచ్చు.గూగుల్ ఎయిర్ వ్యూ ప్లస్ ఫీచర్ ఇండియాలోని వంద నగరాల్లోని గాలి నాణ్యతకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తుంది. సాధారణంగా.. గాలిలోని ఎయిర్ క్వాలిటీని సంబంధిత శాఖ అధికారులు వెల్లడిస్తేనే తెలిసేది. కానీ ఇప్పుడు గూగుల్ పరిచయం చేసిన కొత్త ఫీచర్ సాయంతో ఎప్పుడైనా తెలుసుకోవచ్చు.ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండా ట్రాన్సక్షన్స్: వచ్చేస్తోంది 'యూపీఐ 123 పే'గూగుల్ ఎయిర్ వ్యూ ప్లస్ ఫీచర్ కోసం.. క్లైమేట్ టెక్ సంస్థలు, ఆరస్సూర్, రెస్పిరర్ లివింగ్ సైన్సెస్ వంటివి కీలక పాత్ర పోషించాయి. అంతే కాకుండా ఈ ఫీచర్‌ను ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ హైదరాబాద్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సీఎస్‌టీఈపీ వంటివి టెస్ట్ చేసి ధ్రువీకరించినట్లు సమాచారం.'ఎయిర్ వ్యూ ప్లస్'లో ఎయిర్ క్వాలిటీ కనుక్కోవడం ఎలా?•మొబైల్ ఫోన్లో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయాలి.•సెర్చ్ బార్లో ఏదైనా లొకేషన్‌పై ట్యాప్ చేయాలి.•ఆలా చేసిన తరువాత లొకేషన్ పక్కనే నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (NAQI) కనిపిస్తుంది.•దానిపైన క్లిక్ చేసిన తరువాత టెంపరేషన్ కనిపిస్తుంది, దాని కిందనే ఎయిర్ క్వాలిటీ కూడా కనిపిస్తుంది. -
సగం మంది ఇంటి నుంచే పనిచేయండి
సాక్షి, న్యూఢిల్లీ: ఈ సీజన్లోనే అత్యంత చలిరాత్రిని చవిచూసిన ఢిల్లీవాసులు బుధవారం సైతం పొగచూరిన సూర్యోదయాన్నే ఆస్వాదించాల్సిన దుస్థితి దాపురించింది. హస్తినవాసుల చలి, వాయుకాలుష్య కష్టాలు మరింత పెరిగాయి. మంగళవారం రాత్రి 11.1 డిగ్రీ సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ శాఖ బుధవారం ప్రకటించింది. బుధవారం ఉదయం 9 గంటలకు ఢిల్లీలో వాయు నాణ్యతా సూచీ(ఏక్యూఐ) 426గా నమోదైందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించింది. దీంతో కాలుష్య నియంత్రణ మండలి ఇంకా ‘తీవ్రం’ కేటగిరీనే కొనసాగిస్తోంది. కాలుష్యం కోరల్లో చిక్కిన ఢిల్లీలో ఇంకా జనం సొంత, ప్రజారవాణా వాహనాల్లో తిరిగితే కాలుష్యం మరింత పెరగొచ్చన్న ఆందోళనలు ఎక్కువయ్యాయి. రోడ్లపై జనం రద్దీని తగ్గించే ఉద్దేశ్యంతో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో సగం మంది ఇంటి నుంచే పని(వర్క్ ఫ్రమ్ హోం)చేయాలని ఆమ్ ఆద్మీ సర్కార్ సూచించింది. అయితే అత్యయక సేవల విభాగాలైన ఆరోగ్యం, పారిశుద్ధ్యం, నీటిపారుదల, అగ్నిమాపకదళం, పోలీసులు, విద్యుత్, విపత్తు స్పందన దళం వంటి విభాగాల సిబ్బందికి ఈ వర్క్ ఫ్రమ్ హోం నిబంధన వర్తించదు.ప్రస్తుతం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపు 80 శాఖలు, విభాగాల్లో మొత్తంగా 1.4 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. ‘‘ ప్రభుత్వ సిబ్బందితోపాటు పరిశ్రమలు, ప్రైవేట్ సంస్థలు సైతం 50 శాతం మందిని ఇంటి నుంచే పనిచేయిస్తే మంచిది. మీ వంతుగా నగరంలో వాయుకాలుష్యాన్ని తగ్గించినవారవతారు. ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల మధ్య పనివేళలను కొద్దిగా మార్చండి. దీంతో ఆఫీస్వేళల్లో రోడ్లపై వాహనాల రద్దీ తగ్గి కాలుష్యం కాస్తయినా మటుమాయం కావొచ్చు’’ అని ఢిల్లీ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ‘ఎక్స్’ వేదికగా కోరారు. ‘‘ ఎక్కువ మంది సిబ్బంది రాకపోకల కోసం ప్రైవేట్ సంస్థలు షటిల్ బస్సు సేవలను వినియోగించుకోవాలి. ఢిల్లీ ప్రభుత్వం సైతం గవర్నమెంట్ ఉద్యోగుల కోసం ఇదే నియమాన్ని అమలుచేస్తోంది’’ అని రాయ్ సూచించారు. ఈ సందర్భంగా పొరుగురాష్ట్రాలను పాలిస్తున్న బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘‘ ఢిల్లీ చుట్టూతా బీజేపీపాలిత రాష్ట్రాలే ఉన్నాయి. ఢిల్లీ పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్, హరియాణా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతుగా కాలుష్యాన్ని తగ్గించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. మా సర్కార్ అనుసరిస్తున్న కాలుష్య నివారణ విధానాలనే మీరూ ఆచరించండి’ అని రాయ్ హితవుపలికారు.కొనసాగుతున్న గ్రేప్–4 నిబంధనకాలుష్యం ఏమాత్రం తగ్గకపోవడంతో సోమవారం అమలుచేసిన నాల్గవ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రేప్)ను ఢిల్లీ ప్రభుత్వం ఇంకా కొనసాగిస్తోంది. గ్రేప్–4 నియమాల్లో భాగంగా ఢిల్లీ పరిధిలో నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతోంది. స్కూళ్లను మూసేశారు. డీజిల్‌తో నడిచే మధ్యస్థాయి, భారీ రవాణా వాహనాలను ఢిల్లీలోనికి అనుమతించట్లేరు. పాఠశాల ఢిల్లీలో ఉదయం చాలా ప్రాంతాల్లో అరకిలోమీటర్లోపు ఉన్నవి కూడా కనిపించనంతగా మంచు దుప్పటి కప్పేసింది. రన్‌వే సరిగా కనిపించని కారణంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్, టేకాఫ్ కష్టంగా మారింది. పలు విమానాలు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. రైళ్ల ఆలస్యం సరేసరి. చలి, తీవ్ర కాలుష్యం కారణంగా చిన్నారులు, వృద్ధులు కళ్ల మంటలు, శ్వాస సంబంధ ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. వాయు నాణ్యతా సూచీని గణించే ఢిల్లీలోని 38 మానిటరింగ్ స్టేషన్లలోనూ పరిస్థితి ఇంకా రెడ్‌జోన్‌లోనే కొనసాగుతోంది. ఆదివారం ఢిల్లీలో వాయునాణ్యత మరీ దారుణంగా పడిపోయి ‘సివియర్ ప్లస్’గా రికార్డవడం తెల్సిందే. దీంతో సోమవారం నుంచి గ్రేప్–4ను అమల్లోకి తెచ్చారు. ప్రతి ఏటా చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గి కాలుష్యవాయు గాఢత అలాగే కొనసాగుతుండటంతో ఢిల్లీ వాసుల వాయుకష్టాలు పెరుగుతుండటంతో 2017 ఏడాది నుంచి ఈ గ్రేప్ నిబంధనలను అమలుచేస్తున్నారు. -
కాలుష్యానికి కళ్లెం.. బీజింగ్ చెప్పిన పాఠం
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రజల ప్రాణాలు తోడేస్తోంది. విషపూరితమైన గాలి పీలుస్తున్న జనం ఆసుపత్రులపాలవుతున్నారు. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వాయు కాలుష్యం కాటుకు ప్రాణాలు కోల్పోతున్నారు. లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్ నివేదిక ప్రకారం.. కాలుష్యం కారణంగా ఢిల్లీలో ప్రతిఏటా దాదాపు 12,000 మంది మరణిస్తున్నారు. లక్షలాది మంది అనారోగ్యానికి గురవుతున్నారు. నగరంలో ప్రతిఏటా నమోదవుతున్న మొత్తం మరణాల్లో 11.5 శాతం మరణాలకు కాలుష్యమే కారణం కావడం గమనార్హం. ఢిల్లీ ఒక గ్యాస్ చాంబర్‌గా మారిందనడంలో అతిశయోక్తి లేదు. ఢిల్లీలో ఇప్పుడున్న పరిస్థితులే 2013 దాకా చైనా రాజధాని బీజింగ్‌లోనూ కనిపించేవి. కానీ, ప్రస్తుతం బీజింగ్ సిటీ కాలుష్యం ముప్పు నుంచి చాలావరకు బయటపడింది. ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైందన్నది ఆసక్తికరం. వాయు కాలుష్యంపై పోరాటం విషయంలో చైనా అనుభవాలు, సాధించిన విజయాల నుంచి ప్రపంచ దేశాలు నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో ఉన్నాయి. వాయునాణ్యత సూచీ (ఏక్యూఐ) మంగళవారం బీజింగ్‌లో 137 కాగా, ఢిల్లీలో 750గా నమోదైంది. ఢిల్లీలో కాలుష్యం ఏ స్థాయిలో ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. కాలుష్యం ఉత్పత్తి అయ్యే విషయంలో ఢిల్లీ, బీజింగ్‌లో ఒకేలాంటి పరిస్థితులు ఉన్నాయి. శిలాజ ఇంధనాల వాడకం, వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు, బొగ్గుతో నడిచే థర్మల్ విద్యుత్ కేంద్రాలు, కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు రెండు నగరాల్లోనూ ఉన్నాయి. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం ఢిల్లీకి ఉన్న అదనపు ముప్పు. గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాల్లో చైనాది ప్రపంచంలోనే మొదటి స్థానం. మొత్తం ప్రపంచ ఉద్గారాల్లో డ్రాగన్ దేశం వాటా 30 శాతం. అయినప్పటికీ బీజింగ్ ప్రజలకు స్వచ్ఛమైన గాలి ఎలా అందుతోంది? ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి? బీజింగ్‌లో కాలుష్యం నానాటికీ పెరిగిపోతుండడాన్ని చైనా రియల్ ఎస్టేట్ కంపెనీ ‘సోహో’ అధినేత, బిలియనీర్ పాన్ షియీ 2011లో తొలిసారిగా సోషల్ మీడియా పోస్టు ద్వారా బాహ్య ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు.2013లో కాలుష్య వ్యతిరేక పోరాటం ప్రారంభించారు. ఈ పోరాటంలో తొలుత యువత పాలుపంచుకున్నారు. క్రమంగా ఇదొక ప్రజా పోరాటంగా మారింది. వాయు కాలుష్యం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజింగ్ ప్రజలు రోడ్లపైకి వచ్చారు. తమ ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రెండు వారాలపాటు అవిశ్రాంతంగా ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వం దిగివచ్చింది. కాలుష్యంపై యుద్ధం ప్రకటిస్తున్నట్లు అప్పటి చైనా అత్యున్నత నాయకుడు లీ కెఖియాంగ్ స్పష్టంచేశారు. పేదరికంపై జరుగుతున్న యుద్ధం తరహాలో కాలుష్యంపైనా యుద్ధం సాగిస్తామని తేల్చిచెప్పారు. అంతేకాదు కాలుష్య నియంత్రణ చర్యలను ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షించారు. అధికారులను పరుగులు పెట్టించారు. నేషనల్ ఎయిర్ యాక్షన్ ప్లాన్ → కాలుష్యాన్ని కట్టడి చేయడానికి చైనా సర్కారు ‘నేషనల్ ఎయిర్ యాక్షన్ ప్లాన్’ విడుదల చేసింది. ఇందుకోసం 100 బిలియన్ డాలర్లు కేటా యించింది. → బీజింగ్‌లో మొట్టమొదటిసారిగా 2013లో వా యు నాణ్యత గణాంకాలను ప్రచురించారు. అప్పటిదాకా ఈ సమాచారం కోసం అమెరికా రాయబార కార్యాలయంపై ఆధారపడాల్సి వచ్చేది. → 2013 నుంచి సొంతంగానే సమాచారం సేకరించి, ప్రజలకు చేరవేయడం ప్రారంభించారు. → జాతీయ వాయు కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కాలుష్యాన్ని 25 శాతం తగ్గించాలని ప్రభుత్వ అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. సీరియస్‌గానే రంగంలోకి దిగారు. → తీవ్ర కాలుష్యానికి కారణమవుతున్న 100 ఫ్యాక్టరీలను మూసివేశారు. మరికొన్నింటిని ఆధునీకరించారు. → కాలుష్య ఉద్గారాల విషయంలో కఠినమైన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చారు. కాలం చెల్లిన 2 కోట్ల పాత వాహనాలను రోడ్డెక్కనివ్వలేదు. వాటిని స్క్రాప్‌గా మార్చేశారు. → 2 లక్షల పారిశ్రామిక బాయిలర్లను ఉన్నతీకరించారు. పాత వాటి స్థానంలో ఆధునిక బాయిలర్లు అమర్చారు. → బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు మంగళం పాడేశారు. సహజ వాయువుతో కరెంటును ఉత్పత్తి చేసి, 60 లక్షల ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. → విద్యుత్‌తో నడిచే వాహనాలు బీజింగ్ రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలు అతి తక్కువగా కనిపిస్తుంటాయి. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోంది. వాటికి పలు రాయితీలు అందిస్తోంది. → 2013లో చైనా ప్రభుత్వం ప్రారంభించిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. రాజధానిలో వాయు కాలుష్యం తగ్గడం మొదలైంది. గాలి నాణ్యత క్రమంగా మెరుగుపడింది. ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజలు కూడా పూర్తిస్థాయిలో సహకరించడంతో బీజింగ్ సిటీ ఇప్పుడు కాలుష్య రహిత నగరంగా మారింది. ఇండియా చేయాల్సిందేమిటి? ఇండియాలో కేవలం ఢిల్లీ మాత్రమే కాదు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతా, ముంబై, పుణే, వారణాసి, పట్నా తదితర పెద్ద నగరాలతోపాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు కూడా కాలుష్యం ఊబిలో చిక్కుకున్నాయి. ప్రపంచంలోని అత్యంత కాలుష్యభరిత నగరాల జాబితాలో ఇండియా సిటీల స్థానం భద్రంగా ఉంటోంది. కాలుష్యాన్ని తరిమికొట్టి స్వచ్ఛంగా మార్చడానికి బీజింగ్ మోడల్‌ను ఆదర్శంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాలుష్యం నుంచి జనానికి విముక్తి కల్పించడానికి బలమైన రాజకీయ సంకల్పం కావాలని చెబుతున్నారు. నిపుణుల సూచనలు ఏమిటంటే..→ వాయు నాణ్యతను మెరుగుపర్చడానికి అందుబాటులో ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకోవాలి. → శిలాజ ఇంధనాల వాడకానికి కళ్లెం వేయాల్సిందే. → పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు పెరగాలి. అస్తవ్యస్తమైన పట్టణ ప్రణాళిక కాలుష్యానికి కారణమవు తోంది. ఈ పరిస్థితి మారాలి. → కాలుష్య నియంత్రణ చర్యల్లో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. → వ్యాపారం, వాణిజ్యం, ఎగుమతులతోపాటు రాజకీయ పలుకుబడి సాధించే విషయంలో చైనాతో పోటీ పడుతున్న భారత్ కాలుష్య నియంత్రణ విషయంలో ఎందుకు పోటీపడడం లేదన్నదే నిపుణుల ప్రశ్న. → కాలుష్య నియంత్రణను కేవలం స్థానిక ప్రభుత్వాలకే వదిలివేయకూడదు. ఇందుకోసం జాతీయ స్థాయిలో పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక అవసరం. → చక్కటి ప్రణాళికాబద్ధమైన ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలి. ప్రైవేట్ వాహనాల వినియోగం తగ్గిపోవాలి. ప్రజలు సొంత వాహనాలు కాకుండా ప్రజా రవాణా సాధనాలను ఉపయోగించుకుంటే కాలుష్యం చాలావరకు తగ్గిపోతుంంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
విషతుల్య రాజధాని
భారత రాజధాని ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రతి శీతకాలంలానే ఈ ఏడాదీ పాత కథ పునరావృత్తం అయింది. ఒకపక్క పెరిగిన చలికి తోడు ధూళి నిండిన పొగ లాంటి గాలి, కాలుష్య ఉద్గారాలు, పొరుగున ఉన్న పంజాబ్ – హర్యానా లాంటి వ్యవసాయాధారిత రాష్ట్రాల్లో అక్రమంగా సాగుతున్న కొయ్యకాళ్ళ దహనం... అన్నీ కలిసి అతి తీవ్ర వాయు కాలుష్యంగా పరిణమించాయి. వారంగా అదే పరిస్థితి కొనసాగుతూ ఉండడం, వాయునాణ్యతా సూచిక (ఏక్యూఐ) సోమవారం గరిష్ఠంగా దాదాపు 500 మార్కును చేరడంతో సుప్రీమ్ కోర్ట్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. స్కూల్ పిల్లలకు భౌతికంగా తరగతులు నిర్వహించవద్దని ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. చివరకు బాకూలో జరుగుతున్న ఐరాస వాతావరణ సదస్సు సైతం ఈ కాలుష్యాన్ని ఆందోళనకరంగా పరిగణించడం, నిపుణులు దీన్ని ‘ఆరోగ్య అత్యవసర పరిస్థితి’గా ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు తార్కాణం. ఢిల్లీలో సోమవారంæ కాలుష్య స్థాయి దీపావళి నాటి రాత్రి కన్నా దాదాపు 40 శాతం ఎక్కువంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో సగటు పీఎం 2.5 స్థాయి... భారతీయ ప్రమాణాల కన్నా 14 రెట్లు ఎక్కువ, అదే ఐరాస పర్యావరణ పరిరక్షక సంస్థ (యూఎస్‌ఈపీఏ) నిర్దేశించిన ప్రమాణాల లెక్కలో అయితే 55 రెట్లు ఎక్కువ నమోదైంది. వాయు నాణ్యత ఇంతలా క్షీణించడం పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులున్న వారికి ప్రమాదంగా పరిణమిస్తోంది. పీఎం 10 స్థాయిని బట్టి అంచనా వేసే ధూళి కాలుష్యమూ హెచ్చింది. ఆగ్రాలో కళ్ళు పొడుచుకున్నా కనిపించని దట్టమైన పొగ. తాజ్‌మహల్ కట్టడం విషవాయు కౌగిలిలో చేరి, దూరం నుంచి చూపరులకు కనిపించడం మానేసి వారమవుతోంది. మాస్కులు లేకుండా వీధుల్లోకి రాలేని పరిస్థితి. వెరసి, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరమనే దుష్కీర్తి ఢిల్లీకి దక్కింది. స్విస్ గ్రూప్ ఐక్యూ ఎయిర్ తేల్చిన ఈ నిష్ఠురసత్యం ఇన్నేళ్ళ మన బాధ్యతా రాహిత్యానికీ, పాలకుల నిష్క్రియాపరత్వానికీ నిదర్శనం. ఆ మాటకొస్తే, 2018లో కానీ, గడచిన 2023లో కానీ ఏడాదిలో ఏ ఒక్కరోజూ ఢిల్లీలో స్వచ్ఛమైన గాలి లేదని రికార్డులు చెబుతున్నాయంటే ఏమనాలి? కాలుష్యం దేశవ్యాప్తంగా ఉందనీ, నివారణ బాధ్యత రాష్ట్రానిదే కాదు కేంద్రానిది కూడా అని ఢిల్లీ ‘ఆప్’ సర్కార్ వాదన. కానీ, ఏటేటా శీతకాలంలో రాజధానిలో పెరుగుతూ పోతున్న ఈ కష్టానికి చెక్ పెట్టడంలో పాలకులు ఎందుకు విఫలమయ్యారంటే జవాబు దొరకదు. విమర్శలు వెల్లువెత్తడంతో ఢిల్లీ సర్కార్ కాలుష్య నిరోధానికి యంత్రాల ద్వారా నీటి తుంపర్లు జల్లడం లాంటి చర్యలు చేపడుతోంది. ఇవేవీ చాలక చివరకు ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లలో కృత్రిమ వర్షాలకు అనుమతి ఇవ్వాలని మరోసారి కేంద్రాన్ని అభ్యర్థిస్తోంది. మేఘమథనం జరిపేందుకు ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని అనుమతి కోరినా, జవాబు లేదన్నది ‘ఆప్’ ఆరోపణ. ఇలాంటి ప్రయోగాల వల్ల ప్రయోజనమెంత అనేది చర్చనీయాంశమే. అయితే, ప్రజలకు తాత్కాలికంగానైనా ఉపశమనం కలిగించే ఇలాంటి ప్రయత్నాలకు కేంద్రం మొదటే మోకాలడ్డడం సరికాదు. వాయు కాలుష్యం ‘అతి తీవ్ర’ స్థాయులకు చేరిన నేపథ్యంలో ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ (గ్రాప్) నాలుగోదశ చర్యలను కఠినంగా అమలు చేయాలన్నది సుప్రీమ్ తాజా ఆదేశం. పాఠశాలల్ని మూసివేయడం, ఆఫీసుకు రాకుండా ఇంటి వద్ద నుంచే పనిచేయడం, పరిశ్రమల మూసివేత లాంటి చర్యలన్నీ నాలుగో దశ కిందకు వస్తాయి. ముప్పు ముంచుకొస్తున్నా మూడో దశ, నాలుగో దశ చర్యల్లో అధికారులు ఆలస్యం చేశారంటూ సర్వోన్నత న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు షరతులు అమలు చేయాల్సిందేనని కోర్ట్ చెప్పాల్సి వచ్చిందంటే అధికార యంత్రాంగం అలసత్వం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. నిద్ర లేచిన ప్రభుత్వం ఇప్పుడిక ‘గాప్’ నాలుగో దశ కింద వాహనాల రాకపోకలు, భవన నిర్మాణ కార్యకలాపాలపై షరతులు విధించింది. అయితే, దీంతో ఢిల్లీ, పంజాబ్, హర్యానాల్లో దాదాపు 34 లక్షల చిన్న, మధ్యశ్రేణి సంస్థల్లో ఉత్పత్తి దెబ్బతిననుంది. అంటే కాలుష్య పాపం ఆరోగ్యాన్నే కాక ఆర్థికంగానూ కుంగదీస్తుందన్న మాట. ఢిల్లీలో వాహనాల వల్ల అత్యధిక కాలుష్యం సంభవిస్తుంటే, ఎన్సీఆర్లో పరిశ్రమలు ప్రధాన కాలుష్య కారకాలని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (తెరి) 2021లోనే తేల్చింది. అనేకచోట్ల ఇప్పటికీ కట్టెల వాడకం కొనసాగుతోంది. ఇక, పొలాల్లో కొయ్య కాళ్ళ దహనం తాజా దురవస్థకు 40 శాతం కారణమట. అన్నీ కలిసి పీల్చే గాలే విషమయ్యేసరికి, ఢిల్లీ వాసుల ఆయుఃప్రమాణం సగటున ఏడేళ్ళు తగ్గుతోంది. రాజధాని, ఆ పరిసరాల్లోని 3 కోట్ల పైచిలుకు మంది వ్యధ ఇది. నిజానికి, స్వచ్ఛమైన గాలి ప్రాథమిక మానవహక్కని గత నెలతో సహా గత అయిదేళ్ళలో సుప్రీమ్ అనేకసార్లు స్పష్టం చేసింది. వాయునాణ్యతకు చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్ర, రాష్ట్రస్థాయి యంత్రాంగాలను ఆదేశించింది. అయినా జరిగింది తక్కువ. సరైన ప్రాణ వాయువు కూడా అందని ఈ పరిస్థితికి ప్రజల నుంచి పాలకుల దాకా అందరూ బాధ్యులే. కాలుష్య నివారణ, నియంత్రణలకు సృజనాత్మక ఆలోచనలు చేయలేకపోవడం ఘోరం. దాహమేసినప్పుడు బావి తవ్వకుండా ఏడాది పొడుగూతా వ్యూహాత్మకంగా చర్యలు చేపట్టడం అవసరం. ఆధునిక సాంకేతికత, ప్రజారవాణా, ప్రజల అలవాట్లలో మార్పులు సహా అనేక అంశాల్లో రాజకీయ కృత నిశ్చయంతో విధాన నిర్ణేతలు పనిచేయాలి. లేదంటే, సాక్షాత్తూ దేశ రాజధానే నివాసయోగ్యం కాక జనం తరలిపోతుండడం చూసి వికసిత భారత్, లక్షల కోట్ల ఆర్థికవ్యవస్థ లాంటివన్నీ వట్టి గాలి మాటలే అనుకోవాల్సి వస్తుంది. -
ఢిల్లీలో కాలుష్య కట్టడికి అదొక్కటే మార్గం: కేంద్రానికి మంత్రి లేఖ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో.. పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ కేంద్రానికి ఓ లేఖ రాశారు. వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు కృత్రిమ వర్షం కురిపించడం ఒక్కటే ఏకైక పరిష్కారమని ఆయన పేర్కొన్నారు.రాజధానిలో కృత్రిమ వర్షం కురిపించేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోది జోక్యం చేసుకోవాలని కోరారు.కేంద్రానికి రాసిన లేఖను చూపుతూ విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ‘ఉత్తర భారతాన్ని పొగ పొరలు కమ్మేశాయి. దీని నుంచి విముక్తికి కృత్రిమ వర్షమే ఏకైక పరిష్కారం. ఇది మెడికల్ ఎమర్జెన్సీ. ఈ విషయమై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు అనేక సార్లు లేఖలు రాశాను. అయినా వారు పట్టించుకోలేదు. కాలుష్య నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో ప్రధాన మంత్రి మోదీ జోక్యం చేసుకోవాలి. వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ఓ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలి. ఇది ఆయన నైతిక బాధ్యత.ఢిల్లీలో కృత్రిమ వర్షంపై కృత్రిమ వర్షంపై గత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లోనూ లేఖలు రాశాం. ఈ రోజు వరకు నాలుగు లేఖలు పంపినప్పటికీ కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ఒక్క సమాశం కూడా ఏర్పాటు చేయలేదు. ఈ సమస్యకు స్పష్టమైన పరిష్కారం చూపాలి. లేనిపక్షంలో మంత్రి పదవికి రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు.కాగా దేశ రాజధాని ఢిల్లీ తీవ్రమైన వాయుకాలుష్యం, పొగమంచుతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 494కు పడిపోయింది. చాలా ప్రాంతాల్లో ఇది ఏకంగా 500 మార్క్‌ను దాటిపోయింది. ఆరేళ్లలో కాలుష్యం ఈస్థాయికి చేరడం ఇది రెండోసారి మాత్రమే. తీవ్రమైన వాయుకాలుష్యంతో కళ్లలో మంటలు, గొంతులో గరగర, శ్వాస ఆడకపోవడం తదితర సమస్యలతో ఢిల్లీ వాసులు అవస్థలు పన్నారు. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కన్పించని పరిస్థితి నెలకొంది.కృత్రిమ వర్షం అంటే..?కృత్రిమ వర్షాన్ని క్లౌడ్ సీడింగ్ అని కూడా అంటారు. ఈ విధానంతో వాతావరణంలో మార్పును తీసుకువస్తారు. గాలిలో నీటి బిందువులు ఏర్పడేలా ఈ ప్రక్రియను కొనసాగిస్తారు. సిల్వర్ ఐయోడైడ్, పొటాషియం ఐయోడైడ్ లాంటి పదార్థాలను గాలిలోకి వదులుతారు. దీని కోసం విమానాన్ని కానీ హెలికాప్టర్‌ను కానీ వాడే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ సక్సెస్ కావాలంటే, ఆ పరీక్ష సమయంలో వాతావరణంలో తేమ చాలా అవసరం అవుతుంది. గాలి కూడా అనుకూలంగా ఉంటేనే ఈ ప్రయోగం సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కృత్రిమ వర్షం వల్ల గాలిలో ఉన్న దుమ్ము, ధూళి సెటిల్ అవుతుంది. నీటితో ఆ డస్ట్ కొట్టుకుపోయి.. పర్యావరణం క్లీన్ అవుతుంది. -
దేశ రాజధానిగా ఢిల్లీ ఇంకా కొనసాగాలా?: శశి థరూర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ తీవ్రమైన వాయుకాలుష్యం, పొగమంచుతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 494కు పడిపోయింది. చాలా ప్రాంతాల్లో ఇది ఏకంగా 500 మార్క్‌ను దాటిపోయింది. ఆరేళ్లలో కాలుష్యం ఈస్థాయికి చేరడం ఇది రెండోసారి మాత్రమే. దేశ రాజధానిలో వాయు కాలుష్యంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు ఇలాంటి పరిస్థితుల్లో దేశ రాజధానిగా ఢిల్లీ ఇంకా కొనసాగాల్సి ఉందా అని సందేహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన స్పందిస్తూ.. ‘ప్రపంచంలో రెండవ అత్యంత కలుషితమైన నగరమైన ఢాకా కంటే ఢిల్లీలో పరిస్థితి దాదాపు ఐదు రెట్లు అధ్వాన్నంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారింది. ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు నాలుగు రెట్లు పెరిగాయి. ఈ పరిస్థితిని ఏళ్ల తరబడి చూస్తున్నా. కేంద్ర ప్రభుత్వం మాత్రం సమస్యను పరిష్కరించడంలో విఫలమవ్వడం విడ్డూరం. దేశ రాజధానిని ఎవరూ పట్టించుకోవడం లేదు. నవంబరు నుంచి జనవరి మధ్య ఈ నగరం నివాసయోగ్యంగానే ఉండట్లేదు. మిగతా సమయాల్లోనూ అంతంతమాత్రంగానే జీవనం సాగించగలం. ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీని ఇంకా దేశ రాజధానిగా కొనసాగించాలా?’ అని పేర్కొన్నారు.Delhi is officially the most polluted city in the world, 4x Hazardous levels and nearly five times as bad as the second most polluted city, Dhaka. It is unconscionable that our government has been witnessing this nightmare for years and does nothing about it. I have run an Air… pic.twitter.com/sLZhfeo722— Shashi Tharoor (@ShashiTharoor) November 18, 2024తీవ్రమైన వాయుకాలుష్యంతో కళ్లలో మంటలు, గొంతులో గరగర, శ్వాస ఆడకపోవడం తదితర సమస్యలతో ఢిల్లీ వాసులు అవస్థలు పన్నారు. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కన్పించని పరిస్థితి నెలకొంది. తీవ్ర వాయు కాలుష్యంతో ఢిల్లీ ఇప్పటికే పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో వాయు కాలుష్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వంపై మండిపడింది. రోజురోజుకు వాయు నాణ్యత క్షీణిస్తున్నా అధికారులు అలసత్వం ప్రదర్శించడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తంచేసింది. పరిస్థితి విషమించినా గ్రాప్–4 నిబంధనల అమలులో అధికారులు జాప్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వెలిబుచ్చింది. ఏక్యూఐ 450 దిగువకు వచ్చినా గ్రాప్–4 నిబంధనలనే కొనసాగించాలని ఆదేశించింది. వాయు కాలుష్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని 10, 12వ తరగతులకు కూడా ఆన్లైన్లోనే క్లాసులు నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం నుంచి 10, 12 తరగతులకు కూడా ఆన్లైన్ కాస్టులనే నిర్వహిస్తామని ఢిల్లీ సీఎం ఆతిశి ‘ఎక్స్’లో వెల్లడించారు. వీరితో పాటు మిగతా కాస్లులకు ఇదివరకే అమలవుతున్నట్లుగా ఆన్లైన్ క్లాసులు ఉంటాయని తెలిపారు. -
కఠిన చర్యలపై ఆలస్యమెందుకు?: ఢిల్లీ సర్కార్‌పై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతూ, గాలి నాణ్యత అధ్వానంగా మారడంపై సుప్రీంకోర్టు తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో కాలుష్యాన్ని నివారించేందుకు కఠిన చర్యలు అమలు చేయడంతో ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ ఆప్ ప్రభుత్వంపై మండిపడింది. గాలి నాణ్యత సూచీ (AQI) 300 కంటే ఎక్కువ పెరిగిపోతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. అంత దాటే వరకు ఎందుకు వేచి చూశారని ప్రశ్నించింది. అలాగే.. స్టేజ్-4 ఆంక్షల అమలులో ఆలస్యంపై నిలదీసింది. మూడు రోజులు ఆలస్యం ఎందుకు అయిందని అడిగింది. గాలి నాణ్యత 'సీవియర్ ప్లస్' కేటగిరీకి చేరిన దేశ రాజధానిలో.. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) అమలులో జాప్యం చేయడంపై ఢిల్లీ ప్రభుత్వంతోపాటు కేంద్ర కమిషన్‌ను (ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్)పై సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. కోర్టు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు స్టేజ్-4 ఆంక్షలు అమలులో ఉంటాయని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 400 దాటిందని.. 400 దిగువన ఉన్నా ఆంక్షలు అమలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది.కాగా ఢిల్లీలో వాయు నాణ్యత ప్రమాదకర స్థాయికి దిగజారింది. ఈ సీజన్లో తొలిసారి 'సీవియర్ ప్లస్'కి పడిపోయింది. దీంతో ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి నాలుగో దశ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌ను (జీఆర్‌పీఏ) అమలు చేస్తోంది. ఈ కాలుష్య నివారణ ప్రణాళిక సోమవారం ఉదయం 8 గంటల నుంచి అమలులోకి వచ్చింది.దీని ప్రకారం నగరం పరిధిలో ట్రక్కుల ప్రవేశంపై నిషేధాన్ని విధిస్తారు. అలాగే ప్రభుత్వ నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఉద్యోగుల్లో సగం మంది మాత్రమే విధులకు హాజరవ్వాలని, మిగిలిన వారు వర్క్ ఫ్రం హోం చేయాలని అధికారులు ఆదేశించారు. 10, 12 తరగతులు మినహా మిగిలిన తరగతులకు ఆన్లైన్లో తరగతులు నిర్వహించాలని స్పష్టంచేశారు.సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ డేటా ప్రకారం.. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సోమవారం ఉదయం 481గా ఉంది. దేశ రాజధానిలోని 35 మానిటరింగ్ స్టేషన్లలో అత్యధికంగా 400 ఏక్యూఐ నమోదైంది, ద్వారకలో అత్యధికంగా 499గా నమోరైంది. -
మీ ఆరోగ్యం బాగుపడాలంటే ముందు సిగరేట్లను తాగడం పూర్తిగా మానేయ్యాలి!!
-
ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు..
-
ఢిల్లీ గాలి యమ డేంజర్
ఢిల్లీలో వాయు కాలుష్యం నానాటికీ కట్టలు తెంచుకుంటోంది. నెల రోజులకు పైగా కాలుష్య మేఘాలు వాతావరణం నిండా దట్టంగా పరుచుకున్నాయి. దాంతో జనానికి ఊపిరి కూడా ఆడని పరిస్థితి! ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజధానిలో గాలి పీల్చడమంటే రోజుకు ఏకంగా 25 నుంచి 30 సిగరెట్లు తాగడంతో సమానమని షికాగో యూనివర్సిటీ జరిపిన తాజా అధ్యయనం ఒకటి తేల్చింది! అంతేగాక కాలుష్యం దెబ్బకు ఢిల్లీ ప్రజల ఆయు ప్రమాణం కూడా ఏకంగా 7.8 ఏళ్ల దాకా తగ్గుతోందని వెల్లడించింది. దీర్ఘకాలం పాటు ఢిల్లీ గాలి పీల్చడం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారి తీసే ఆస్కారం కూడా చాలా ఎక్కువని తెలిపింది. ముఖ్యంగా విషతుల్యమైన పీఎం2.5 స్థాయిలు ఢిల్లీలో ఏకంగా 247 గ్రా/ఎం3గా నమోదవుతుండటం గుబులు పుట్టిస్తోంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన 15గ్రా/ఎం3 ప్రమాణాల కంటే ఏకంగా 20 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఇక ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ కూడా ఎప్పుడో 400 దాటేసింది. శుక్రవారం కూడా ఇది 411గా నమోదైంది. కాలుష్యం ధాటికి ఢిల్లీవాసులు ఇప్పటికే దగ్గు తదితర శ్వాస సంబంధ సమస్యలతో పాటు కళ్ల మంటలు, జర్వం తదిరాలతో అల్లాడుతున్నారు. వాయు కాలుష్య భూతం బారిన పడకుండా ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్లు బిగించుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. బయటికి వెళ్లినప్పుడు విధిగా ఎన్95, ఎన్99 మాస్కులు ధరించాలని చెబుతున్నారు.భారత్‌లో 30 నుంచి 50 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులకు వాయు కాలుష్యమే కారణమని అమెరికాకు చెందిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల వెల్లడించిన నివేదిక పేర్కొంది. అయితే ఆ కాలుష్యం మెడ, తల భాగాల క్యాన్సర్‌కు కూడా దారి తీయవచ్చని షికాగో వర్సిటీ అధ్యయనం పేర్కొంది. పొగ తాగేవారిలో ఈ తరహా క్యాన్సర్లు పరిపాటి అని అధ్యయన బృందం సారథి జాన్ క్రామర్ గుర్తు చేశారు. భారత్‌లో ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితుల్లో అత్యధికులు జీవితంలో ఎన్నడూ పొగ తాగనివారేనని ముంబైలోని టాటా స్మారక ఆస్పత్రి గత జూలైలో ప్రచురించిన ఒక అధ్యయనం వెల్లడించడం గమనార్హం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆర్టీసీకి బీఎస్–6 బస్సులు
సాక్షి, హైదరాబాద్: భారత్ స్టేజ్–6 బస్సుల వాడకంపై ఆర్టీసీ దృష్టి సారించింది. వాయు కాలుష్య కారకాల ఉత్పత్తిని నియంత్రించేందుకు ఉద్దేశించిన ఉద్గారాల ప్రమాణాల జాబితాలోని బీఎస్–6 బస్సుల వాడకానికి ఎట్టకేలకు శ్రీకారం చుట్టింది. ఇంతకాలం బీఎస్–4 ప్రమాణాల బస్సుల వాడకానికి పరిమితమైన ఆర్టీసీకి ఇప్పుడు బీఎస్–6కు చెందిన 1,500 బస్సులు కొత్తగా సమకూరాయి. 2020 నుంచి మన దేశంలో ఈ ప్రమాణ బస్సులను అందుబాటులోకి తెచ్చినా..ఆర్టీసీ కొత్త బస్సులు కొనకపోవటంతో ఆ శ్రేణి బస్సులు ఇప్పటివరకు సమకూరలేదు.గతేడాది ఆర్టీసీ కొత్త బస్సులకు ఆర్డర్ ఇవ్వగా, దశలవారీగా అవి సమకూరుతున్నాయి. కొత్త బస్సులన్నీ బీఎస్–6 శ్రేణి బస్సులే. తాజా యూరో ప్రమాణాల మేరకు ఇవి రూపొందాయి. కర్బన ఉద్గారాలు తక్కువ పరిమితిలో విడుదల చేయటంతోపాటు ఎక్కువ ఎల్రక్టానిక్ డిజైన్‌తో ఇవి రూపొందాయి. దీంతో వీటి వినియోగంపై అవగాహన కల్పించేందుకు బీఎస్–6 బస్సులున్న డిపోలను పర్యవేక్షిస్తున్న అధికారులకు చెన్నైలోని అశోక్ లేలాండ్ కంపెనీలో వాటి తయారీ ఇంజినీర్ల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ బస్సుల ప్రత్యేకత ఏంటంటే... మన దేశంలో 2000 సంవత్సరం నుంచి భారత్ స్టేజ్ ఎమిషన్ స్టాండర్డ్స్ అమలులోకి వచ్చింది. తొలుత భారత్ స్టేజ్–1 ప్రారంభమైంది. అలా 2020 నుంచి బీఎస్–6 ప్రమాణాలు మొదలయ్యాయి. అంతకుముందు శ్రేణి వాహనాలతో పోలిస్తే వీటిల్లో కాలుష్య కారకాల ఉత్పత్తి చాలా తక్కువగా ఉండేలా ఇంజిన్లను ఆధునికీకరించారు. అంతకు ముందున్న బీఎస్–4 (బీఎస్–5 స్కిప్) డీజిల్ బస్సుల్లో నైట్రోజన్ ఆక్సైడ్ పరిమితి 250 మి.గ్రా.గా ఉండేది. దానిని బీఎస్–6 బస్సుల్లో 80 మి.గ్రా.కు కట్టడి చేశారు. పరి్టక్యులేట్ మ్యాటర్ పరిమితిని 25 మి.గ్రా.ల నుంచి 4.5 మి.గ్రా/కి.మీ.కు తగ్గించారు. దీనివల్ల కొత్తతరం బస్సుల్లో కాలుష్య కారకాల విడుదల చాలా తక్కువగా ఉంటుంది. డాష్ బోర్డులో పలు రకాల సూచనలు ఈ బస్సుల్లో డాష్‌బోర్డుపై పలు రకాల సూచనలు బ్లింక్ అవుతుంటాయి. ఆ మేరకు డ్రైవర్లు బస్సులను నడపాలి. ఈ బస్సుల్లోని చాలా భాగాలు సెన్సార్ల ఆధారంగా పనిచేస్తాయి. వీటిల్లో దాదాపు 31 సెన్సార్లు ఏర్పాటు చేశారు. పాత బస్సుల్లో డాష్ బోర్డుకు ప్రాధాన్యమే ఉండేదికాదు. డిస్ప్లే బోర్డులో రీడింగ్ మీటర్లు పగిలిపోయి రంధ్రాలే కనిపిస్తుండేవి. కానీ, కొత్తతరం బస్సుల్లో 31 సెన్సార్లు అలర్ట్‌లను చూపుతుంటాయి.ఏదైనా బ్లింక్ కనిపిస్తే, సంబంధిత ఇంజిన్ భాగంపై దృష్టి సారించాలి. దీనికి సంబంధించి ఆయా బస్సులను నిర్వహిస్తున్న డిపోల అధికారులకు ముందు అవగాహన కలిగితే, వారు డ్రైవర్లను ప్రశ్నిస్తూ బస్సులు మెరుగ్గా నడిచేలా చూస్తారని సంస్థ భావిస్తోంది. ఈమేకు ఆయా డిపోల అధికారులను చెన్నైలోని అశోక్‌లేలాండ్ ప్లాంట్‌కు పంపింది. మొదటి బ్యాచ్ అధికారుల బృందం ప్రస్తుతం చెన్నై ప్లాంట్‌లో ఉంది. త్వరలో రెండో బృందం వెళ్లనుంది. కాలుష్య కణాలు వెలువడవుబస్సు వదిలే పొగలో లక్షల సంఖ్యలో కాలుష్య కణాలుంటాయి. అవి మన శరీరంలోకి చేరితే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పొగగొట్టం నుంచి వెలువడే పొగతో అవి వాతావరణంలోకి చేరతాయి. కానీ, బీఎస్–6 బస్సుల్లో ప్రత్యేక వ్యవస్థ ఉంది. డీజిల్ మండిన తర్వాత వెలువడే ఈ సూక్ష కణాలు ఒకచోట జమవుతాయి. నిర్ధారిత సమయంలో అవి మరోసారి మండి బూడిదగా మారి నేల మీద పడిపోతాయి. పొగ రూపంలో అవి వాతావరణంలో కలిసే ప్రమాదం బాగా తగ్గిపోతుంది. అందుకే ఈ బస్సుల్లో, పాతతరం బస్సుల తరహాలో పొగగొట్టం ఉండదు. డ్రైవర్ పక్కనున్న ఇంజిన్ కిందే ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. ఇలాంటి ప్రత్యేకతలు ఈ బస్సుల్లో ఎన్నో ఉన్నాయి. -
మహారాష్ట్ర అధికార కూటమిలో చీలిక..
-
ఊపిరాడని రాజధాని
సాక్షి, న్యూఢిల్లీ: అత్యల్ప ఉష్ణోగ్రతలకు దట్టంగా కమ్ముకున్న వాయుకాలుష్యం తోడవడంతో న్యూఢిల్లీలో గాలి గరళంగా మారుతోంది. రోజు రోజుకూ వాయు నాణ్యత క్షీణిస్తోంది. కేంద్ర వాతావరణ కాలుష్యనియంత్రణ మండలి గణాంకాల ప్రకారం విపరీతమైన వాయుకాలుష్యాన్ని సూచించే వాయునాణ్యతా సూచీ(ఏక్యూఐ) ఢిల్లీలో ఏకంగా 500 దాటింది. గురువారం ఢిల్లీలో 32 ప్రాంతాల్లో వాయుకాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. గురువారం ఢిల్లీవ్యాప్తంగా సగటున ఏక్యూఐ 428 కాగా జహంగీర్‌పురీలో 567, ఆనంద్‌విహార్, పంజాబీ బాగ్‌ల్లో 465గా నమోదైంది. ఢిల్లీలో గురువారం ఉష్ణోగ్రత కేవలం 16.1 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. శీతాకాలం కావడంతో జనాలకు రోడ్లపై వెళ్తుంటే ముందు ఏముందో కనిపించనంతగా దట్టంగా పొగమంచు కమ్ముకుంది. దట్టమైన పొగ కారణంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 300లకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 10 విమానాలను దారిమళ్లించారు. రన్‌వేపై 400 మీటర్ల తర్వాత ఏముందో కనిపించనంతగా దృశ్యగోచరత(విజిబిలిటీ) తగ్గిపోయింది. దీనికారణంగా విమానాల టేకాఫ్, ల్యాండింగ్ చాలా కష్టంగా మారింది. దీంతో మీరు ప్రయాణించబోయే విమానాల రాకపోకలకు సంబంధించిన తాజా సమాచారాన్ని సంబంధిత ఎయిర్‌లైన్స్ నుంచి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం గురువారం తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా ప్రయాణికులకు సూచించింది. పలు రైళ్ల రాకపోకలపైనా పొగమంచు, వాయుకాలుష్యం ప్రభావం పడింది. వాయునాణ్యత దారుణంగా పడిపోవడంతో ఢిల్లీవ్యాప్తంగా ఏక్యూఐను ఇంకా మూడో ‘తీవ్రం’ కేటగిరీలోనూ కొనసాగిస్తున్నారు. గ్రాప్–3 నిబంధనలు అమల్లోకి వాయుకాలుష్యం విపరీతంగా పెరగడంతో కట్టడి చర్యల్లో భాగంగా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రాప్)–3 నియమనిబంధనలను కాలుష్య నియంత్రణ మండలి అమల్లోకి తెచి్చంది. శుక్రవారం నుంచి ఢిల్లీ–ఎన్సీఆర్ పరిధిలో వీటిని కఠినంగా అమలుచేస్తామని వాయునాణ్యతా నిర్వహణ కమిషన్(సీఏక్యూఎం) గురువారం తెలిపింది. విద్యుత్, సీఎన్జీ, భారత్–6 ప్రమాణాల డీజిల్ బస్సులు మినహా ఇతర అంతర్రాష్ట బస్సులను ఎన్సీఆర్ రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి అనుమతించబోరు.చదవండి: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 300 విమానాల రాకపోకలపై ప్రభావం నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై నిషేధం అమల్లో ఉంటుంది. గనుల తవ్వకాన్నీ ఆపేస్తారు. ఢిల్లీసహా గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్‌బుద్ధ్ నగర్ జిల్లాల్లో భారత్–3, భారత్–4 ప్రమాణాల డీజిల్ వాహనాల రాకపోకలను నిషేధించారు. అత్యధిక రద్దీ సమయాల్లో రోడ్లపై నీటిని చిలకరించనున్నారు. ఎవరికి వారు బైకులు, సొంత కార్లలో కాకుండా ప్రజారవాణా వ్యవస్థను వాడుకోవాలని సీఏక్యూఎం సూచించింది. ప్రైమరీ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యంతోపాటు తరగతులను కోల్పోకూడదనే ఉద్దేశంతో ఐదోతరగతి వరకు ప్రైమరీ పాఠశాల క్లాసులను ఆన్లైన్లో చేపట్టాల్సి ఉంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి చెప్పారు. -
ఢిల్లీలో తీవ్ర స్థాయికి చేరిన వాయు కాలుష్యం
-
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 300 విమానాల రాకపోకలపై ప్రభావం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. గ్యాస్ ఛాంబర్లా మారిపోయింది. ఓ వైపు వాయు కాలుష్యం.. మరోవైపు యమన నదిలో విషపునురగతో దేశ రాజధాని సతమతమవుతోంది. రెండు రోజులుగా తీవ్రమైన కేటగిరిలో గాలి నాణ్యత కొనసాగుతోంది. గురువారం ఉదయం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగ ఆవరించింది.సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 500 స్థాయికి దగ్గరవుతుంది. ఆనంద్ విహార్ ప్రాంతంలో ఏక్యూఐ 473గా నమోదైంది. ఫలితంగా విజిబిలిటీ సున్నాకి పడిపోయింది. దాంతో రోడ్లపై వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించకపోవడంతో ఇబ్బందులుపడ్డారు.దేశ రాజధానిలో కాలుష్యం పెరిగి, దట్టమైన పొగ కమ్ముకోవడంతో విజిబిలిటీ తగ్గింది. ఇది విమానాలు, రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్‌కు రాకపోకలు సాగించే సుమారు 300కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఫ్లైట్ రాడార్ 24 సంస్థ తెలిపింది. వీటిలో 115 విమానాలు ఢిల్లీకి వచ్చేవి ఉండగా.. రాజధాని నుంచి బయలు దేరాల్సిన 226 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు పేర్కొంది. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు పేర్కొంది. సగటున 17 నుంచి 54 నిమిషాలు ఆలస్యంగా విమానాలు నడుస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఈ పొగమంచు రైళ్ల రాకపోలకపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. -
కాలుష్య కోరల్లో ఢిల్లీ.. ‘తీవ్రమైన’ కేటగిరిలో గాలి నాణ్యత సూచీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో గాలి నాణ్యత సూచీ తీవ్రంగా పడిపోయింది. ఈ ఏడాది తొలిసారి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 మార్క్‌ను అధిగమించి ‘తీవ్రమైన కేటగిరి’లోకి చేరింది. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాస తీసుకోవడం వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం.. బుధవారం ఢిల్లీలో గాలి నాణ్యత 429గా నమోదైంది. అయితే మంగళవారం సాయంత్రం AQI 334 వద్ద ఉండగా కేవలం 24 గంటల్లోనే కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరిగింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) ప్రకారం ఢిల్లీలోని 36 మానిటరింగ్ స్టేషన్లలో బుధవారం 30 'తీవ్రమైన' కేటగిరీలో ఉన్నాయి.మంగళవారం సాయంత్రం వరకు వరుసగా 14 రోజుల పాటు నగరం యొక్క గాలి నాణ్యత 'చాలా పేలవంగా' ఉంది. వాహనాల నుంచి వెలువడే పొగ కాలుష్యానికి అతిపెద్ద కారణంగా( 15.4 శాతం) మారింది. దీనికితోడు పంజాబ్, హర్యానా వంటి చుట్టుపక్కల రాష్ట్రాలలో పంట వ్యర్థాలను తగలబెట్టడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది, నగరాన్నికాలుష్యపు పొగమంచులో కప్పేసింది.కాగా గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మధ్యస్థం, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 450 వరకు ఉంటే తీవ్రమైనదని.. ఇక 450 కంటే ఎక్కువఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు. -
Delhi: ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న వాయు కాలుష్యం
-
కాలుష్య కోరల్లో దేశ రాజధాని ఢిల్లీ (ఫొటోలు)
-
ఢిల్లీలో దీపావళి కాలుష్యం.. తీవ్రంగా మండిపడ్డ సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దీపావేళ వేళ బాణాసంచా నిషేధం అమలు విషయంలో ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ రాజధానిలో బాణాసంచా కాల్చడంపై ఉన్న నిషేధం అమలుకావడం లేదని తెలిపింది. బాణాసంచా కాల్చడం వల్ల దీపావేళ తర్వాత ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించిందని తెలిపింది. ఈ ఏడాది బాణాసంచా వినియోగంపై పూర్తి నిషేధం అమలుకు తీసుకున్న చర్యలను తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆప్ ప్రభుత్వాన్ని, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే వచ్చే ఏడాది నిషేధానికి సంబంధించి కూడా ప్రతిపాదిత చర్యలను తెలపాలని జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీతో కూడిన ధర్మాసనం పేర్కొంది.కాగా దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చడం వల్ల ఢిల్లీ వాసులు తీవ్ర కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ(గాలి నాణ్యత సూచీ) 400 తీవ్రమైన మార్కును దాటడంతో సోమవారం గాలి నాణ్యత అధ్వాన్నంగా మారైంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నగరంగా మారింది. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఢిల్లీలో కాలుష్య స్థాయి గరిష్ఠ స్థాయికి చేరుకుందని తెలిపింది. గత రెండేళ్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది. అంతేగాక దీపావళి నాటికి పంట వ్యర్థాల కాల్చివేతలు కూడా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. గత పది రోజులలో పంట వ్యర్థాల దగ్దం కేసుల నమోదును తెలుపుతూ అఫిడవిట్లను దాఖలు చేయాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఢిల్లీ పరిధిలో పొలాల దహనం కేసుల నమోదును తెలపాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. తదుపరి విచారణను నవంబర్ 14కు వాయిదా వేసింది. -
కాలుష్యంతో నురగలు కక్కుతున్న యమున
-
హరిత దీపావళి జరుపుకొందాం!
భూమిపై సమస్త జీవరాశి బ్రతకడానికి కీలక పాత్ర పోషిస్తున్న గాలి నేడు కలుషితమై జీవ జాతి మనుగడకు పెను శాపంగా మారుతోంది. మన ఆర్థిక, సామాజిక జీవితంపై వాయు కాలుష్యం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా పరిశ్ర మలు, మోటార్ వాహనాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, అగ్నిపర్వతాలు పేలడం, గనుల తవ్వకం, పంట అవశేషాలు కాల్చడం, అడవులు నరకడం, పండగలు–శుభకార్యాల్లో బాణా సంచా కాల్చడం లాంటి కారణాల వలన వాయు కాలుష్యం పెరిగిపోతోంది. కలుషిత గాలిలోని సూక్ష్మాతి సూక్ష్మ రేణువులు మానవ,జంతు ఊపిరితిత్తుల వడపోత కేంద్రాలను దాటుకొని నేరుగా రక్తంలో చేరి రకరకాల వ్యాధులకు కారణమవు తున్నాయి. గాలి కాలుష్యం వల్ల ఉబ్బసం, ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాస కోశ సంబంధమైన వ్యాధులు, గుండె జబ్బులు సంభవిస్తాయి. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు, గర్భస్థ శిశువులపై ప్రభావం చూపిస్తూ ‘నిశ్శబ్ద హంతకుడి‘గా వాయు కాలుష్యం వ్యవహరిస్తోంది.భారత్‌లోని చిన్నారుల మరణాల విషయంలో పోషకాహార లోపం తర్వాత వాయు కాలుష్య ప్రభావం అధికంగా ఉందని ‘లాన్సర్’ జర్నల్ పేర్కొంది. ప్రపంచ వాయు నాణ్యత నివే దిక–2023 ప్రకారం వాయు కాలుష్యంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ తర్వాత మూడో స్థానంలో భారత్ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికీ ఢిల్లీ కాలుష్య రాజధానుల్లో మొదటి స్థానంలో ఉంది. గడిచిన దశాబ్ద కాలం నుంచి మనదేశంలో పంట అవశేషాలు, బాణసంచా లాంటి కాలుష్య కారకాలు వాయు కాలుష్యంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ‘గాలి నాణ్యత, వాతావరణ సూచన మరియు పరిశోధన వ్యవస్థ’ (ఎస్ఏ ఎఫ్ఏఆర్) అధ్య యనం ప్రకారం... శీతాకాలంలో ముఖ్యంగా దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాల్చడం వలన దీపావళి మరుసటి నాడు ఢిల్లీలో గాలి నాణ్యత సూచి ప్రమాదకర స్థితిలోకి వెళుతోంది. గాలి నాణ్యత సూచీ 0 నుండి 100 వరకు ఉంటేనే అది ఆరోగ్యకరమైన గాలిగా పరిగణిస్తారు. కానీ శీతాకాలంలో ఢిల్లీలో గాలి నాణ్యత సూచి రోజురోజుకూ దిగజారుతుంది. దీపావళి తర్వాత సాధారణ పరిస్థితి రావడా నికి ఢిల్లీలో 25 రోజులు, హైదరాబా దులో 16 రోజుల సమయం పడుతుందని సర్వేలు చెబుతున్నాయి. దీనికి కారణం విపరీతమైన టపా సులు పేల్చ డమే. పండగలు, ఉత్సవాల్లో పర్యావరణ హిత బాణా సంచాను మాత్రమే వాడాలి. రసాయనాలతో తయారు చేసిన టపాసుల స్థానంలో పర్యావరణహిత బాణసంచాను వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. దీపావళి పండుగ రోజున సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలనే నిబంధన ప్రతి ఒక్కరూ పాటించాలి. హరిత దీపావళి అందరి జీవితాల్లో వెలుగు నింపాలి.– సంపతి రమేష్ మహారాజ్ ‘ ఉపాధ్యాయుడు -
దీపావళికి ముందే గ్యాస్ ఛాంబర్లా రాజధాని
న్యూఢిల్లీ: దీపావళికి ముందే దేశరాజధాని ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లా మారింది. ఢిల్లీ-ఎన్సీఆర్లో పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా స్థానికులు పలు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు.విపరీతమైన వాయు కాలుష్యం కారణంగా వృద్ధులు, చిన్నారులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు(శనివారం) ఉదయం నుండే ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌తో సహా పలు చోట్ల పొగమంచు కమ్ముకుంది.ఢిల్లీ వాతావరణంలో గతంలో కన్నా స్వల్ప మెరుగుదల కనిపించింది. టాప్-10 కాలుష్య నగరాల్లో ఢిల్లీ ఏక్యూఐ240తో మొదటి, రెండవ స్థానాల నుండి 7వ స్థానానికి చేరుకుంది. దేశంలోని కాలుష్య నగరాల జాబితా ప్రకారం చూస్తే ఢిల్లీ ఆరో స్థానంలో ఉంది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతం ఏక్యూఐ 364తో వాయు నాణ్యత విషయంలో దారుణంగా ఉంది. ఏక్యూఐ ఉదయం 6 గంటలకు 364 వద్ద నమోదైంది.ఢిల్లీ-ఎన్సీఆర్లో గాలి నాణ్యత తక్కువగా ఉండడానికి పంజాబ్-హర్యానాతో సహా పొరుగు రాష్ట్రాలలో గడ్డి తగులబెట్టడమే ప్రధాన కారణం. ప్రతి ఏటా ఈ సీజన్లో ఢిల్లీలోని గాలి విషపూరితంగా మారుతుంటుంది. దీపావళికి ముందే గాలిలో విషవాయువులు పెరుగుతున్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) డేటాను పరిశీలిస్తే 2021 సంవత్సరం నుండి ఇప్పటివరకు ప్రతీ అక్టోబర్‌లో కాలుష్య స్థాయి పెరిగింది.ఇది కూడా చదవండి: ఒడిశాకు తప్పిన తుఫాను ముప్పు: సీఎం మోహన్ -
ఢిల్లీలో పెరిగిన కాలుష్యం
న్యూఢిల్లీ:నైరుతి రుతుపవనాలు వెళ్లిపోవడంతో దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.గురువారం(అక్టోబర్3)ఢిల్లీలో కాలుష్యం పెరిగినట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) సూచించింది.ఢిల్లీ-గజియాబాద్ బోర్డర్లోని ఆనంద్ విహార్‌లో ఏక్యూఏ ఏకంగా 389గా నమోదైంది.దీంతో ఢిల్లీలో అత్యంత కాలుష్య ప్రాంతంగా ఆనంద్‌విహార్ రికార్డులకెక్కింది.ఆనంద్ విహార్ తర్వాత ముండ్కా,ద్వారకా, వాజీపూర్‌లలోనూ కాలుష్యం ఏక్యూఐపై 200 పాయింట్లుగా నమోదైంది.అయితే గురుగ్రామ్,ఫరీదాబాద్‌లలో మాత్రం కాలుష్యం ఏక్యూఐపై అత్యంత తక్కువగా 58,85గా రికార్డయింది.ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గించడానికి పంజాబ్,హర్యానా ప్రభుత్వాలు కేవలం సమావేశాలు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గురువారమే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఇదీ చదవండి: ఢిల్లీ కాలుష్యంపై చర్యలేవి: సుప్రీంకోర్టు ఆగ్రహం -
వాయు కాలుష్యంపై మొద్దునిద్ర
దేశ రాజధానిలో 60 శాతం అధికంగా కుంభవృష్టి కురిపించి, వారంరోజులు ఆలస్యంగా నైరుతీ రుతుపవనాలు నిష్క్రమించాయో లేదో అక్కడి వాయు కాలుష్యంపై యథాప్రకారం చర్చ మొదలైంది. వాయు నాణ్యత మెరుగుదలకు తీసుకున్న చర్యలేమిటని గురువారం సర్వోన్నత న్యాయస్థానం హరియాణా, పంజాబ్ ప్రభుత్వాలను నిలదీసింది. వాయు కాలుష్యం ఉగ్రరూపం దాలుస్తోందని, రైతులు పంట వ్యర్థాలు తగులబెట్టకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. గోధుమ పంట చేతికొచ్చాక వ్యర్థాలను తొలగించటం ఖర్చుతో కూడుకున్నదన్న కారణంతో రైతులు అక్కడే తగలబెడతారు. ఆ మంటలకు పంటభూమిలోని పోషకాలు, పంటలు ఏపుగా పెరగడానికి తోడ్పడే సూక్ష్మజీవులు నశిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ వ్యర్థాలను సేకరించి ఇతరేతర పదార్థాలతో మిశ్రమం చేసి సేంద్రియ ఎరువుగా మార్చవచ్చని సూచిస్తున్నారు. కానీ దీన్ని రైతులకు చేరేయ టంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. రైతులకయ్యే వ్యయాన్ని భరిస్తే ఈ సమస్య చాలావరకూ తగ్గుతుందని గతంలో సుప్రీంకోర్టు ఢిల్లీ, పంజాబ్, హరియాణాలకు సలహా ఇచ్చింది. కానీ పట్టించుకున్నవారేరి? దానిసంగతలావుంచి సుప్రీం సూచనతో ఏర్పాటైన కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సీఏక్యూఎం) సమావేశాలే సక్రమంగా జరగటం లేదు. ఆగస్టు నెలాఖరున జరిగిన కమిషన్ సమావేశానికి 11 మంది సభ్యుల్లో అయిదుగురే హాజరయ్యారంటే...అందులో పంట వ్యర్థాల విషయంపై చర్చించనేలేదంటే కమిషన్ తీరుతెన్నులెలా వున్నాయో అర్థం చేసుకోవచ్చు.ఢిల్లీలో సాధారణంగా అక్టోబర్ మధ్యనుంచి వాయు కాలుష్యం పెరగటం మొదలై నవంబర్ నాటికి ఉగ్రరూపం దాలుస్తుంది. పర్యవసానంగా నగర జీవితం అస్తవ్యస్తమవుతుంది. పాఠశాలల పనివేళలు మార్చటం, ప్రభాతవేళ ఆరుబయట వ్యాయామాలు చేయొద్దని పౌరులకు సూచించటం వంటివి మొదలవుతాయి. వాయు కాలుష్యానికి మూలం ఎక్కడుందో గుర్తించటానికే దీర్ఘకాలం పట్టగా, అనంతర చర్యలైనా చురుగ్గా ముందుకు కదలటం లేదు. కాలుష్యంలో 70 శాతం వాటా వాహనాలదేనని ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) తేల్చి కూడా చాన్నాళ్లయింది. ఆ తర్వాతి స్థానం పరిశ్రమలదేనని కూడా ఆ నివేదిక చెప్పింది. కానీ ఆ దిశగా పెద్దగా అడుగులు పడలేదు. మన దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ శక్తిమంతమైనది. దాదాపు అయిదు లక్షల కోట్ల టర్నోవర్ గల ఆ పరిశ్రమ రెండున్నర కోట్లమందికి ఉపాధి కల్పిస్తోంది.అందువల్ల వాటి జోలికి పోయేందుకు ప్రభుత్వాలు సిద్ధపడవు సరికదా... వాహనాల అమ్మకాలు పెరగటానికి, ఆ పరిశ్రమల లాభార్జనకూ భిన్నరూపాల్లో తోడ్పాటునందిస్తాయి. మార్కెట్లోకొచ్చే వాహనాలు కాలుష్య కారకాలుగా ఉంటున్నాయని తేలినా నిర్లిప్తంగా ఉండిపోయిన సందర్భాలు గతంలో కోకొల్లలు. 2005 నుంచి అందుబాటులోకొచ్చిన బీఎస్ 3 (భారత్ స్టేజ్ 3) ప్రమాణాలున్న వాహనాలు అధికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని ఆరోపణలొచ్చినా చర్య తీసుకునేందుకు ఏ వ్యవస్థా సిద్ధపడలేదు. ఆ ప్రమాణాలతో విడుదలైన ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతోపాటు కార్లు, భారీ కమర్షియల్ వాహనాలపై చర్యలు తీసుకోలేదు. చివరకు సుప్రీంకోర్టే బీఎస్ 3 ప్రమాణాలున్న వాహనాల విక్రయాన్ని 2017లో నిషేధించింది. వీటి సంగతలావుంచి ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచటానికి అవసరమైన పథకాల రూపకల్పన సక్రమంగా ఉండదు. త్వరితగతిన పనులు పూర్తిచేసుకోవాలంటే సొంత వాహనాలే దిక్కన్న అభిప్రాయం పౌరుల్లో స్థిరపడిపోయింది. దీనికి తోడు ప్రజా రవాణా కోసం ఇప్పటికీ చాలా రాష్ట్రాలు డీజిల్ బస్సులే వాడుతున్నాయి. విద్యుత్, సీఎన్జీ వాహనాల వినియోగం మొదలైనా వాటి సంఖ్య స్వల్పం. ఢిల్లీ మెట్రో నిడివి ప్రస్తుతం దాదాపు 400 కిలోమీటర్ల మేర ఉంది. దాన్నింకా పెంచటానికి కృషిచేస్తున్నారు. ఈ సర్వీసును బస్సులతో అనుసంధానించి మారుమూల ప్రాంతాలకు కూడా సులభంగా వెళ్లగలిగే సదుపాయం కల్పిస్తే సొంత వాహనాల వినియోగం తగ్గుతుంది. ఇక ఏదైనా అనుకోనిది జరిగితే తప్ప పరిశ్రమలపై సాధారణంగా ప్రభుత్వాలు చర్యలకు సిద్ధపడవు. నిర్దిష్ట కాల వ్యవధిలో నిర్వహించే తనిఖీలు చాలా సందర్భాల్లో లాంఛనప్రాయమవుతాయి. జరిమానాల వంటివి విధించినా అవి నామ మాత్రంగానే ఉంటున్నాయి. ఉపాధి కల్పనకూ, సంపద వృద్ధి కావటానికీ పరిశ్రమలు అవసరమే. కానీ ప్రజారోగ్యంతో ఆటలాడుకునేవారినీ, చట్టాలను ఉల్లంఘించేవారినీ దండించాల్సిందే. వాయు కాలుష్యంపై విచారణ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్య గమనించదగ్గది. రుతుపవనాలు నిష్క్రమించి శీతాకాలం ఇంకా ప్రవేశించని అక్టోబర్ నెల ఒకప్పుడు ఢిల్లీలో ఎంతో ఆహ్లాదకరంగా ఉండేదని న్యాయమూర్తులు అన్న మాటల్లో వాస్తవం ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకూ ఉండే ఆ వాతావరణం ఇప్పుడు ఎందుకు మాయమైంది? కారకులెవరు? చిత్తశుద్ధితో ఆలోచించాలి. కాలుష్యంలో తమ బాధ్యత లేదని, పొరుగు రాష్ట్రమే ఈ సమస్యకు కారణమని పంజాబ్, హరియాణా, రాజస్తాన్‌లు పరస్పరారోపణలు చేసుకోవటం రివాజుగా మారింది. అటు కేంద్రం సైతం మొత్తం భారాన్ని రాష్ట్రాలపై వేసి తప్పుకుంటోంది. ఏతావాతా సమస్య యథాత థంగా మిగిలిపోతున్నది. ఈ వైఖరి సరికాదు. ఇటీవల వెలువడిన లాన్సెట్ నివేదిక వాయు కాలుష్యం వల్ల ఢిల్లీలో ఏటా 12,000మంది మరణిస్తున్నారని తేల్చింది. అందుకే అందరూ మేల్కొ నాల్సిన సమయమిది. ప్రభుత్వాలన్నీ కలిసికట్టుగా కార్యాచరణకు దిగి తమవంతు బాధ్యత నెరవేర్చటంతోపాటు కాలుష్యంపై ప్రజల్లో చైతన్యం కలిగించాలి. -
ఢిల్లీ కాలుష్యం: చర్యలు తీసుకోకపోవటంపై సుప్రీం ఆగ్రహం
ఢిల్లీ: ఢిల్లీ కాలుష్యంపై సరైన చర్యలు తీసుకోకపోవటంలో విఫలమైనందుకు సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వంతో పాటు హర్యానా, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించటంపై సమావేశాలు జరపటం తప్ప క్షేత్రస్థాయిలో ఎటువంటి చర్యలు తీసుకోవలేదని అసహనం వ్యక్తం చేసింది.పంట వ్యర్థాలను కాల్చుతూ.. కాలుష్యానికి కారణమవుతున్న రైతులపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని సూటిగా ప్రశ్నించింది. ఈ క్రమంలో తమ ఆదేశాలను పాటించటం లేదని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సీఎక్యూఎం)పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు పంట వ్యర్థాలు కాల్చిన వారి నుంచి నామమాత్రపు జరిమానాలు మాత్రమే వసూలు చేస్తోందని తెలిపింది.‘‘కాలుష్య నియంత్రణ మండలి చివరి సమావేశం ఆగస్టు 29న జరిగింది. అందులో పంట వ్యర్థాల దహనంపై ఎలాంటి చర్చా జరగలేదు. సెప్టెంబర్ నెలలో ఒక్క సమావేశం కూడా జరగలేదు. సమావేశాలకు చాలా మంది కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు హాజరు కాలేదు. కాలుష్య నియంత్రణపై నిర్లక్ష్యంగా ఉన్నారు. కాలుష్యాన్ని తగ్గించడానికి నామమాత్రపు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోవటం లేదు’’ అని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఇక.. ఈ విషయంపై కేంద్రం ప్రభుత్వం, ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అనంతరం సుప్రీంకోర్టు తదుపరి విచారణ అక్టోబర్ 16కు వాయిదా వేసింది.చదవండి: సుప్రీం కోర్టులో ఈశా ఫౌండేషన్‌కు ఊరట -
నవంబర్‌లో ఢిల్లీలో కృత్రిమ వర్షాలు.. ఎందుకంటే?
న్యూఢిల్లీ: దేశ రాజధానిని ప్రతిఏటా ఇబ్బంది పెట్టే విషయం వాయు కాలుష్టం. అక్టోబర్ చివరి నుంచే వాయు కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా రైతులు పంటల వ్యర్థాలు తగలబెట్టడానికి తోడు, చలికాలం కావడంతో దట్టమైన పొగ మంచు కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తుంది. దీన్ని కట్టడి చేసేందుకు ఆప్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈసారి కూడా వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది.నవంబర్‌లో వాయు కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉండటంతో నగరంలో కృత్రిమ వర్షం కురిపించేందుకు సిద్ధమైంది.నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు రాజధాని ప్రాంతంలో కృత్రిమ వర్షం కురిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ బుధవారం పేర్కొన్నారు. ఈ మేరకు కృత్రిమ వర్షాలు కురిపించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర పర్యావరణ మంత్రికి లేఖ రాసినట్లు చెప్పారు. కేంద్ర సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.చలికాలంలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోడానికి 21 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను మంత్రి విడుదల చేశారు. 2016 – 2023 మధ్య రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యం 34.6 శాతం తగ్గిందని మంత్రి తెలిపారు. గడిచిన నాలుగేళ్లలో నగరంలో రెండు కోట్ల చెట్లను నాటామని, దీని ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించగలిగామని చెప్పారు. డ్రోన్ల ద్వారా కాలుష్య హాట్‌స్పాట్ ప్రాంతాలను రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తామన్నారు. రాజధాని ప్రాంతంలో కాలుష్యాన్ని పర్యవేక్షించేందుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ, రవాణా మంత్రిత్వ శాఖ, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ దిల్లీ, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సిబ్బందితో సహా 86 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. -
దంచికొట్టిన వానలు.. ఢిల్లీ మెరుగుపడిన గాలి నాణ్యత
న్యూఢిల్లీ: ఢిల్లీని శుక్రవారం భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. దేశ రాజధానితోపాటు పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. అయితే రికార్డు స్థాయిలో నమోదైన వర్షపాతం కారణంగా దేశ రాజధాని, పరిసరి ప్రాంతాల్లో గాలి నాణ్యత మెరుగుపడింది.ఇప్పుడిప్పుడే ఢిల్లీలోవాతావరణ పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. పొల్యూషన్‌తో గత కొన్నేళ్లుగా హడలెత్తిపోతున్న ఢిల్లీ వాసులు.. ప్రస్తుతం మంచి గాలిని పీల్చుకుంటున్నారు. తాజాగా ఢిల్లీ నగరం గాలి నాణ్యత సూచికలో 52గా నమోదైంది. ఫరీదాబాద్‌లో ఏక్యూఐ 24, ఘజియాబాద్‌లో 34, నోయిడాలో46గా నమోదైంది. గురుగ్రామ్ 69, బులంద్‌షహర్ 21, మీరట్ 28, ముజఫర్‌నగర్ 29గా ఉంది.అయితే ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగవ్వడం వెనక చురుకుగా కదులుతున్న రుతుపవనాల ద్రోణి కారణమని అధికారాన్ని భావిస్తున్నారు. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో కుండపోత వర్షం పడిన సంగతి తెలిసిందే. దీంతో గాలిలోని కాలుష్యం వర్షానికి కొట్టుకుపోయినట్లు, అదే విధంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలి కూడా సహయపడినట్లు పేర్కొన్నారు.కాగా ఈనెలలో ఇప్పటి వరకు కురిసిన వర్షం వార్షిక, నెలసరి సగటు వర్షపాతం కంటే ఎక్కువ నమోదైంది. ఇది 1000 మి. మీ మార్కును దాటింది. సెప్టెంబర్‌లో సాధారణం కంటే 55% ఎక్కువ వర్షపాతం నమోదైంది. శుక్రవారం మూడు గంటల్లో మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు 30.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని సఫ్దర్‌జంగ్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ దేశ రాజధానిలో కాలుష్యం తగ్గుముఖం పట్టిందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వెల్లడించింది. గత 9 సంవత్సరాల్లో లేని గాలి నాణ్యత 2024 ఫిబ్రవరిలో నమోదైంది. గాలి నాణ్యత సూచిక 200 కంటే తక్కువగా నమోదు కాగా.. గతంలో అయితే AQI 400 నమోదు అయింది. -
సంతాన లేమి : అవే కొంప ముంచుతున్నాయి!
వంధ్యత్వం లేదా ఇన్ఫెర్టిలిటీ అనేది ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్య. గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఏడు జంటలలో ఒకరిని ప్రభావితం చేస్తోంది దక్షిణ , మధ్య ఆసియా, సబ్-సహారా ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలో అత్యధిక ఈ సమస్య కనిపిస్తోంది. పురుషుల్లో వాయు కాలుష్యం, మహిళల్లో రోడ్డు ట్రాఫిక్ శబ్దం కారణంగా వంధ్యత్యం వేధిస్తోందని తాజా అధ్యయనంలో తేలింది. నార్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ అధ్యయన వివరాలు బీఎంజే జర్నల్‌లో పబ్లిష్ అయ్యాయి.డెన్మార్క్‌లోని నోర్డ్ అధ్యయనం ప్రకారం దీర్ఘకాలం పాటు ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్ (PM 2.5) వాయు కాలుష్యాన్ని గురైన పురుషుల్లో సంతాన లేమి ఏర్పడే ముప్పు అధికంగా ఉందని పేర్కొంది. పీఎం 2.5 పురుషులపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. దీనికి ఎక్కువ ఎక్స్పోజ్ కావడంతో పురుషులలో వంధ్యత్వానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. అదేవిధంగా, శబ్ద కాలుష్యం మహిళల్లో అధిక వంధ్యత్వానికి దారితీస్తోంది. సగటు కంటే 10.2 డెసిబుల్స్ ఎక్కువగా ఉండే రోడ్డు ట్రాఫిక్ శబ్దం 35 ఏళ్లు పైబడిన మహిళల్లో వంధ్యత్వానికి గురయ్యే ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనం కనుగొంది. 2000-2017 మధ్య డెన్మార్క్‌లో 30-45 ఏళ్ల వయసున్న 5,26,056 మందిపై నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. పీఎం 2.5కి ఐదేళ్లకు పైన గురైన 30-45 ఏళ్ల వయసున్న వారిలో వంధ్యత్య ముప్పు 24 శాతం పెరుగుతున్నట్టు అధ్యయనం వివరించింది. -
స్వచ్ఛ గాలి కేరాఫ్ ఏపీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 13 పట్టణాల్లో వాతావరణ కాలుష్యం తగ్గించడంపై నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్సీఏపీ) కింద చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 131 పట్టణాలు, 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వాయుకాలుష్యం తగ్గించే విధంగా 2019లో ఈ కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది. 2025–26 నాటికి వాతావరణ కాలుష్యాన్ని ఆయా ప్రాంతాల్లో తగ్గించడం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 2023–24లో నమోదైన వాతావరణ కాలుష్యం డేటా ప్రకారం..దేశవ్యాప్తంగా 131 పట్ణణాల్లో అత్యధిక కాలుష్యం నమోదవుతుండగా... అందులో ఏపీ నుంచి 13 ప్రాంతాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే అత్యధికంగా ఢిల్లీ 208 పీఎం10తో తొలి స్థానంలో నిలిచింది. దేశస్థాయిలో విశాఖ 30వ స్థానంలో, కడప 128వ స్థానంలో నిలిచాయి. కాలుష్యం పెరుగుదలలో పీఎం10 (వాతావరణంలో పీల్చుకునే స్థాయిలో ఉండే 10 మైక్రోమీటర్ల వ్యాసం కలిగిన ముతక కణాలు) స్థాయి 120 పాయింట్లతో ఏపీలో విశాఖ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో రాజమహేంద్రవరం, విజయనగరం, ఏలూరు నిలిచాయి. 42 పీఎం10 స్థాయితో ఏపీలో కడప చివరి స్థానంలో నిలిచింది. విజయవాడలో తగ్గుముఖంఈ పథకం అమలు తర్వాత రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో కాలుష్యం తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎన్సీఏపీ చర్యలతో విజయవాడ, కడప, కర్నూలు, నెల్లూరు వంటి పట్టణాల్లో కాలుష్యం తగ్గుముఖం పట్టింది. 2022–23లో విజయవాడలో పీఎం10 స్థాయి 90 పాయింట్లుగా ఉంటే అది 2023–24కు 61 పాయింట్లకు చేరింది. ఇదే సమయంలో కడపలో 57 నుంచి 42కు, నెల్లూరులో 56 నుంచి 52కు, కర్నూలులో 64 నుంచి 56కు తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే విశాఖలో వాతావరణ కాలుష్యం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ 2022–23లో పీఎం10 స్థాయి 116 పాయింట్లుగా ఉండగా అది 2023–24 నాటికి 120 పాయింట్లకు పెరిగింది. రాజమహేంద్రవరంలో 68 నుంచి 76, గుంటూరులో 60 నుంచి 61 పాయింట్లకు పెరిగింది. జనాభా పెరుగుదల, పారిశ్రామిక పురోగతి ఎక్కువ అవడం, స్థానికంగా వాతావరణ మార్పులు చోటుచేసుకోవడం తదితర కారణాల వల్ల ఈ ప్రాంతాల్లో కాలుష్యం పెరుగుతున్నట్లు తెలిపింది. ఏపీలో ఇప్పటివరకు రూ.109.78 కోట్ల వినియోగంవాతావరణంలో పీఎం10, పీఎం 2.5 స్థాయిలను ప్రస్తుతమున్న స్థాయి నుంచి 2025–26కి కనీసం 40% తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 131 పట్టణాలకు రూ.19,614 కోట్లను కేటాయించింది. 10 లక్షల కంటే అధిక జనాభా కలిగిన నగరాల్లో ఈ మొత్తాన్ని 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు విడుదల చేస్తుండగా.. మిగిలిన పట్టణాలకు స్థానిక సంస్థల ద్వారా విడుదల చేస్తోంది. ఈ మొత్తంలో ఇప్పటివరకు రూ.11,211.13 కోట్లను ఖర్చు చేసింది. ఎన్సీఏపీ కింద ఏపీ నుంచి ఎంపికైన 13 పట్టణాలకు ఇప్పటివరకు రూ.361.09 కోట్లు విడుదల చేయగా అందులో రూ.109.78 కోట్లను ఖర్చు పెట్టారు. వాతావారణ కాలుష్యానికి కారణమైన రహదారులపై దుమ్ము, వ్యర్థాలను తగలపెట్టడం, వాహన, పారిశ్రామిక కాలుష్యం, నిర్మాణ రంగ వ్యర్థాలు వంటి వాటిని గుర్తించి వాటిని నియంత్రించడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి. -
ఊపిరి తీస్తున్న వాయు కాలుష్యం!
మనిషి బ్రతకడానికి ఊపిరి తీసుకుంటాడు. అలాంటిది ఈ మధ్య కాలంలో ఊపిరి తీసుకోవడమే ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమించింది. వాతావరణంలో కర్బన ఉద్గారాలు విపరీతంగా పెరిగి పోవడం వలన స్వచ్ఛమైన ప్రాణవాయువు శాతం తగ్గిపోతోంది. దీనివలన చిన్నారుల నుంచి సీని యర్ సిటిజన్స్ వరకు అనేక ఆరోగ్య సమస్యలు అనుభవించాల్సి వస్తోంది.మనం పీల్చే గాలిలో ప్రాణాంతకమైన కాలుష్య కారకాలు కలుస్తున్నాయి. ఊపిరి తీసుకున్న తరువాత శరీరంలోకి చేరిపోయి అవయవాలను నిర్వీర్యం చేస్తున్నాయి. మనదేశంలో అతిపెద్ద నగ రాలలో సంభవిస్తున్న మరణాల్లో సగటున 7.2 శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణమని తాజా అధ్యయనంలో తెలిసింది. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాలలోని గాలిలో అత్యంత సూక్ష్మమైన ‘పి.ఎం 2.5’ ధూళి కణాలు అధికంగా ఉన్నట్లు ఒక నివేదిక తెలిపింది. మనదేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో చాలా మరణాలకు వాయు కాలుష్యమే కారణమవుతున్నట్లు తెలిపింది. పి.ఎం అంటే పార్టిక్యులేట్ మ్యాటర్. 2.5 అంటే... గాలిలో ఉండే సూక్ష్మ కణాల వ్యాసం 2.5 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ ఉన్నవని అర్థం. ఈ కణాలు ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. ఇవి ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులు, శ్వాసనాళాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఈ గాలిలోకి చేరే సల్ఫేట్లు, బొగ్గు సంబంధమైన కలుషితాల వంటివి ఊపిరితిత్తులకు పట్టేస్తున్నాయి. గుండెకు వెళ్లే రక్తపునాళాల్లో పేరుకుపోతున్నాయి.మనదేశంలోని పెద్ద పెద్ద నగరాలలో నిత్యం వెలువడుతున్న పి.ఎం 2.5 ధూళికణాల వలన మరణాలు రేటు నానాటికీ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఒక క్యూబిక్ మీటర్ గాలిలో 2.5 ధూళి కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే రోజువారీ మరణాల సంఖ్య 1.4 శాతం పెరుగు తున్నట్లు ఒక పరిశోధనలో గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాల ప్రకారం ఒక రోజు అనగా 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో పి.ఎం 2.5 కణాలు 15 మైక్రోగ్రాముల లోపు ఉంటే ప్రమాదం వుండదు, అంతకంటే పెరిగితే ముప్పు తప్పదు.భారతదేశ వాయు నాణ్యతా ప్రమాణాల ప్రకారం 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో పి.ఎం 2.5 కణాలు 60 మైక్రోగ్రాముల లోపు ఉంటే ప్రమాదం అంతగా ఉండదు. కానీ మనదేశంలో ప్రస్తుతం 75 మైక్రోగ్రాముల కంటే అధికంగానే ఉంటున్నట్లు తెలిసింది. క్యూబిక్ మీటర్ గాలిలో పి.ఎం 2.5 కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే మరణాల రేటు సగటున 3 శాతం దాకా పెరుగుతున్నట్లు గుర్తించారు. వాయు కాలుష్యం వలన బ్రెయిన్ స్ట్రోక్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మొనరీ వ్యాధులు, న్యూమోనియా, శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది.కళ్లు, ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో చీకాకుతో పాటు దగ్గు, తుమ్ములు పెరుగుతాయి. దీనితో పాటు ఆస్తమా లాంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరి స్తున్నారు. ఈ వాయుకాలుష్యం ఇలానే పెరిగితే భూమికి రక్షణ కవచం అయిన ఓజోన్ పొర క్షీణించడం ఎక్కువవుతుంది. ఓజోన్ పొర దెబ్బతింటే యూవీ కిరణాలు నేరుగా భూమిపైన పడడం వలన చర్మ, నేత్ర సమస్యలు వస్తాయి. వ్యవసాయంపైన కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి వాయుకాలుష్యం తగ్గించడానికి ప్రభుత్వాలు సాధ్యమైనంత సత్వర చర్యలు తీసుకోవాలి. – మోతె రవికాంత్, సేఫ్ ఎర్త్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, హైదరాబాద్ -
The Lancet Planetary Health journal: ఊపిరి తీస్తున్న వాయు కాలుష్యం
న్యూఢిల్లీ: ఆయువు పోయాల్సిన వాయువు ప్రాణాలు తోడేస్తోంది. వాయువులో ప్రాణాంతకమైన కాలుష్య కారకాలు కలుస్తున్నాయి. ఊపిరి పీలిస్తే శరీరంలోకి చేరిపోయి, అవయవాలను నిర్వీర్యం చేస్తున్నాయి. ఇండియాలోని పది అతిపెద్ద నగరాల్లో సంభవిస్తున్న రోజువారీ మరణాల్లో సగటున 7.2 శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణమని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన పరిమితి కంటే హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లోని గాలిలో అత్యంత సూక్ష్మమైన ‘పీఎం 2.5’ ధూళి కణాలు అధికంగా ఉన్నట్లు లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ పత్రిక స్పష్టం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో చాలా మరణాలకు వాయు కాలుష్యమే కారణమవుతున్నట్లు తెలియజేసింది. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న ఉద్గారాలు గాలిని విపరీతంగా కలుషితం చేస్తున్నాయని పేర్కొంది. అధ్యయనం వివరాలను పత్రికలో ప్రచురించారు. 2.5 మైక్రోమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న ధూళి కణాలను ‘పీఎం 2.5 కణాలు’ అంటారు. → భారతదేశంలోని పెద్ద నగరాల్లో నిత్యం వెలువడుతున్న పీఎం 2.5 ధూళి కణాలతో మరణాల ముప్పు నానాటికీ పెరుగుతోందని పరిశోధకులు వెల్లడించారు. → ఇండియాలో వాయు కాలుష్యంపై వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీలోని సెంటర్ ఫర్ క్రానిక్ డిసీజ్ కంట్రోల్‌తోపాటు పలువురు అంతర్జాతీయ పరిశోధకులు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా, పుణే, సిమ్లా, వారణాసి నగరాల్లో 2008 నుంచి 2019 దాకా ఈ అధ్యయనం నిర్వహించారు. → క్యూబిక్ మీటర్ గాలిలో పీఎం 2.5 ధూళి కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే రోజువారీ మరణాల సంఖ్య 1.4 శాతం పెరుగుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా మరణాల మప్పు 2.7 శాతం పెరుగుతున్నట్లు తేల్చారు. → ప్రపంచ ఆరోగ్య సంస్థ విధివిధానాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో పీఎం 2.5 కణాలు 15 మైక్రోగ్రాముల లోపు ఉంటే ప్రమాదం లేదు. అంతకంటే మించితే ముప్పు తప్పదు. → భారత వాయు నాణ్యత ప్రమాణాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో పీఎం 2.5 ధూళి కణాలు 60 మైక్రోగ్రాముల లోపు ఉండే ప్రమాదం అంతగా ఉండదు. కానీ, ప్రస్తుతం 75 మైక్రోగ్రాముల కంటే అధికంగానే ఉంటున్నట్లు తేలింది. → క్యూబిక్ మీటర్ గాలిలో పీఎం 2.5 కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే మరణాల రేటు సగటున 3 శాతం దాకా పెరుగుతున్నట్లు గుర్తించారు. → స్థానికంగా వెలువడే ఉద్గారాలు, కాలుష్యంతో పీఎం 2.5 కణాల ఉత్పత్తి పెద్ద ఎత్తున జరుగుతోంది. అందుకే స్థానికంగా కాలుష్యాన్ని సమర్థవంతంగా కట్టడి చేస్తే మరణాల ముప్పు చాలావరకు తగ్గుతుందని సైంటిస్టులు సూచిస్తున్నారు. -
ఈ నేల ఈ గాలి... పర్యావరణ గీతం
ఏయిర్ ఫోర్స్ అధికారి కూతురు అయిన బవ్రీన్ దేశంలోని వివిధప్రాంతాలలో చదువుకుంది. అలా ఎన్నో సంస్కృతులు, కళలు, ప్రకృతి అందాలతో పరిచయం అయింది. లండన్‌లోని వాయు కాలుష్యం గురించి వ్యాసం ఒకటి చదివింది బవ్రీన్. ‘దిల్లీలో కూడా ఇలాంటి పరిస్థితే కదా’ అని నిట్టూర్చింది. ‘ఇది లోకల్ ప్రాబ్లం కాదు. గ్లోబల్ ప్రాబ్లమ్’ అనుకుంది. వర్తమానం సంగతి ఎలా ఉన్నా పొగచూరిన భవిష్యత్ మసక మసకగా కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాపీరైటర్ ఉద్యోగాన్ని వదులుకొని ‘వారియర్ మామ్స్’కు శ్రీకారం చుట్టింది బవ్రీన్. ‘ వాయుకాలుష్యం అనేది చర్మం, జుట్టు, ఊపిరితిత్తులు, గుండెపై ప్రభావం చూపుతుంది. ఆహార ఉత్పత్తులలోని పోషక విలువలను నాశనం చేస్తుంది. అన్నిరకాలుగా హాని కలిగిస్తుంది’ అంటున్న బవ్రీన్ ‘వారియర్ మామ్స్’ ద్వారా పల్లె నుంచి పట్టణం వరకు ఎన్నోప్రాంతాలు తిరిగింది.క్షేత్రస్థాయిలో వాయుకాలుష్యం గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తనలాగే ఆలోచించే మహిళలు తోడు కావడంతో ‘వారియర్ మామ్స్’కు బలం పెరిగింది. మొదట్లో వాయుకాలుష్యం ప్రమాదాల గురించి ప్రచారం మొదలుపెట్టినప్పుడు ‘ఈ విషయాలు మాకు ఎందుకు’ అన్నట్లుగా ముఖం పెట్టేవారు. ప్రమాద తీవ్రత గురించి తెలుసుకున్న తరువాత మాత్రం వారిలో మార్పు రావడం మొదలైంది.‘మీ పిల్లల భవిష్యత్ గురించి కూడా ఆలోచించండి’ అనే మాట వారిని కదిలించి కార్యక్షేత్రంలోకి తీసుకువచ్చింది. ప్రపంచం ఎలా మారాల్సి వచ్చిందో చెప్పడానికి కోవిడ్ మహమ్మారి పెద్ద ఉదాహరణ. ఈ నేపథ్యంలోనే... ‘మరొక మహమ్మారిని నివారించడానికి మనం ఎందుకు మారకూడదు?’ అని ప్రశ్నిస్తోంది. ‘అభివృద్ధి’ గురించి మాట్లాడినప్పుడు ‘పర్యావరణ హితం’ గురించి కూడా మాట్లాడాలి అంటుంది బవ్రీన్.‘కొన్నిసార్లు దూకుడుగా ముందుకు వెళ్లాలి’ అనేది కొన్ని సందర్భాలలో బవ్రీన్ నోటినుంచే వినిపించే మాట. సమస్య గురించి అధికారుల దృష్టికి తెచ్చినప్పుడు, వారి స్పందనలో అలసత్వం కనిపించినప్పుడు, ‘నా కంపెనీకి మేలు జరిగితే చాలు పర్యావరణం ఏమైపోతే నాకెందుకు!’ అనుకునేవాళ్లను చూసినప్పుడు బవ్రీన్ దూకుడుగా ముందుకు వెళుతుంది, తాను ఆశించిన ఫలితం వచ్చే వరకు మడమ తిప్పకుండా పోరాడుతుంది. ‘మార్పు మన ఇంటి నుంచే మొదలు కావాలి’ అంటున్న బవ్రీన్ మాటలు ఎంతోమందిలో మార్పు తీసుకువచ్చాయి. ‘పదిమందిలో ఏడుగురు వాతావరణ మార్పుల గురించి ఆందోళన చెందుతున్నారు. పదిమందిలో తొమ్మిదిమంది వాతావరణ మార్పులపై తగిన కార్యాచరణ అవసరం అంటున్నారు. కానీ పదిమందిలో నలుగురు మాత్రమే కార్యాచరణలో భాగం అవుతున్నారు’ అంటున్న బవ్రీన్ ఆశ మాత్రం కోల్పోలేదు. ‘వారియర్ మామ్స్’ ద్వారా అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉంది. ‘ఏమీ చేయలేమా?’ అనే ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు వినిపించే జవాబులు రెండు... ‘మనం మాత్రం ఏం చేయగలం!’ ‘కచ్చితంగా మనమే చేయగలం’‘మనం మాత్రమే చేయగలం’ అని దిల్లీకి చెందిన బవ్రీన్ కాంధరీ అనుకోవడం వల్లే‘వారియర్ మామ్స్’ పుట్టుక సాధ్యం అయింది. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా పదమూడు రాష్ట్రాలలో క్షేత్రస్థాయిలో పర్యావరణ హిత ప్రచారాన్ని నిర్వహిస్తోంది బవ్రీన్. కాపీరైటర్ నుంచి ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్‌గా ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకం... -
పొగచూరుతున్న బాల్యం!
సాక్షి, హైదరాబాద్: వాయు కాలుష్యంతో పసి మొగ్గలు రాలిపోతున్నాయి. ఐదేళ్లలోపు పిల్లల ఊపిరితిత్తులు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఫలితంగా దేశంలో రోజూ సగటున 464 మంది మృత్యువాత పడుతున్నారు. అమెరికాకు చెందిన లాభాపేక్షలేని పరిశోధనా సంస్థ ‘హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్’తొలిసారిగా ‘స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ ఎయిర్–2024’ నివేదికను విడుదల చేసింది. అందులోని ముఖ్యాంశాలివీ..పిల్లలకు న్యుమోనియా, పెద్దలకు ఆస్తమామానవ ఆరోగ్యంపై పీఎం (పర్టిక్యులేట్ మ్యాటర్)–2.5, నైట్రోజన్ డయాక్సైడ్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. గాలి కాలుష్యంతో పిల్లలు న్యుమోనియా బారిన, పెద్దలు ఆస్తమా బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది కాలంలో వాయు కాలుష్యం సంబంధమైన వ్యాధుల కారణంగా 81 లక్షల మంది మరణించగా.. ఇందులో 7 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారులే. ఇందులో సుమారు 5 లక్షల మంది పిల్లలు గృహాల నుంచి విడుదలయ్యే కాలుష్యం కారణంగానే మృత్యువాతపడ్డారు. ఇక, మన దేశంలో 21 లక్షల మంది చనిపోగా.. అత్యధికంగా చైనాలో 23 లక్షల మంది కన్నుమూశారు.శ్వాస, నాడీ వ్యవస్థలపై ప్రభావం అడ్డూఅదుపు లేని మానవ చర్యల కారణంగా వాయు కాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది. స్వచ్ఛమైన గాలి కరువైపోతోంది. ఫలితంగా అనునిత్యం భారీగా కాలుష్యకారకాలు ఊపిరితిత్తుల్లోకి చేరిపోతున్నాయి. ప్రధానంగా ఇది చిన్నారులపై తీవ్ర దుష్ర్పభావాన్ని చూపిస్తోంది. ఎదుగుతున్న దశలో ఉన్న వారి శ్వాస, నాడీ వ్యవస్థలను దెబ్బతీసి, ప్రాణసంకటంగా మారుతోంది. ఐదేళ్ల లోపు చిన్నారుల మరణాలకు ప్రధాన కారణం పోషకాహార లోపం కాగా.. రెండో అత్యంత ప్రమాదకారి వాయు కాలుష్యమే. ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నారులు నెలలు నిండకముందే పుట్టడం, తక్కువ బరువుతో జని్మంచడం, ఉబ్బసం, ఊపిరితిత్తుల వ్యాధులు వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.ప్రమాద ఘంటికలిలా.. ⇒ బాల్యంలో అధిక మోతాదులో వాయు కాలుష్యం బారినపడితే పెద్దయ్యాక గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. ⇒ వాయు కాలుష్యం ఎక్కువైతే చిన్నారుల్లో మెదడు, నాడీ వ్యవస్థలో వృద్ధి మందగిస్తుంది. విషయ పరిజ్ఞాన సామర్థ్యం తగ్గుతుంది. ⇒ఉబ్బసం ముప్పు పెరుగుతుంది. చిన్నతనంలోనే కేన్సర్ వచ్చే ప్రమాదం లేకపోలేదు. ⇒నవజాత శిశువులకు ఇళ్లల్లోని వాయు కాలుష్యం ముప్పు ఎక్కువ. ⇒ గర్భిణీలు కలుíÙతమైన గాలికి గురైతే.. వారికి నెలలు నిండకుండానే కాన్పు అయి తక్కువ బరువుతో శిశువులు జన్మించే ప్రమాదం ఉంది.ఏం చేయాలంటే.. ⇒ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన వాయు నాణ్యత ప్రమాణాలను చేరుకోవడానికి ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలి. ⇒ శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాలి. ఇంధన సమర్థతను పెంచడంపై పెట్టుబడులు పెంచాలి. ⇒ పునరి్వనియోగ వనరులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ⇒ బహిరంగంగా వ్యర్థాలను కాల్చడం తగ్గించాలి. వ్యర్థాల నిర్వహణ మెరుగుపడాలి. ⇒ రద్దీగా ఉండే రోడ్లు, కర్మాగారాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు వాయు కాలుష్యానికి ప్రధాన కారణం. కాబట్టి విద్యా సంస్థలు, క్రీడా మైదానాలు వీటికి దూరంగా ఏర్పాటు చేస్తే చిన్నారులను ఈ విషతుల్య వాయువుల నుంచి కాపాడొచ్చు. ⇒ రహదారుల వెంబడి ఆక్సిజన్ జనరేటర్లు, బూస్టర్లను ఏర్పాటు చేయాలి. ⇒ఎలక్ట్రిక్ వాహనాలను లేదా సాధ్యమైనంత వరకు ప్రజా రవాణా వ్యవస్థలను వినియోగించాలి. -
రోజుకు 2 వేల మంది చిన్నారులను మింగేస్తున్న ‘కాలుష్యభూతం’
దేశ రాజధాని నగరం ఢిల్లీ వాయు కాలుష్యం కారణంగా అనేక సమస్యల్ని ఎదుర్కొంటోంది. గాలిలో నాణ్యత అత్యంత ప్రమాదకరస్థాయిలకు పడిపోవడం ఇటీవలి కాలంలో చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. తాజాగా వాయు కాలుష్యానికి సంబంధించిన ఆందోళకరమైన అధ్యయనం ఒకటి మరింత ఆందోళన రేపుతోంది. వాయుకాలుష్యం కారణంగా తలెత్తే అనారోగ్యాలతో ప్రతి రోజూ ప్రపంచవ్యాప్తంగా 2 వేల మంది ఐదేళ్లలోపు చిన్నారులు మృత్యు ఒడికి చేరుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా అకాల మరణాలకు రెండో అతిపెద్ద ప్రమాద కారకంగా వాయు కాలుష్యం నిలుస్తోందని కూడా ఈ నివేదిక తేల్చింది.అమెరికాలోని హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ నిర్వహించిన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అధ్యయనం ప్రకారం, 2021లో ఏకంగా 81 లక్షలమంది చిన్నారు వాయు కాలుష్య భూతానికి బలైనారు. మొత్తం మరణాలలో దాదాపు 12 శాతం. అత్యధిక మరణాలకు కారణమవుతున్న అంశాల్లో బీపీ తరువాత స్థానంలో వాయు కాలుష్యం ఉంది. పొగాకు, పోషకాహార లోపం కంటే ఎక్కువగా వాయుకాలుష్యమే ప్రజలను బలితీసుకుంటోందని ఈ అధ్యయనం తేల్చింది. మన నిర్లక్ష్యమే తదుపరి తరంపై తీవ్ర ప్రభావం చూపుతోందని యునిసెఫ్‌కు చెందిన కిట్టి వాన్ డెర్ హీజ్డెన్ తెలిపారు.వాయు కాలుష్యంకారణంగా ఐదేళ్ల లోపు ఉన్న 7 లక్షల మంది పిల్లల మరణించారు. ఇందులో 5 లక్షల మరణాలకు ప్రధాన కారణం ఎక్కువగా ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఇళ్లల్లో నాలుగు గోడల మధ్య బొగ్గు, చెక్కలు, పేడ వంటి వాటిని వంటచెరకుగా వాడటం వలన సంభవించాయి.తరువాతి తరంపై తీవ్ర ప్రభావంయూనీసెఫ్తో కలిసి హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన వార్షిక అధ్యయనం ప్రకారం వాయు కాలుష్యం ప్రభావం చిన్నారులపై అధిక ప్రభావం చూపుతోందని అధ్యయనం హెడ్ పల్లవి పంత్ వెల్లడించారు. ఇవి మనం పరిష్కరించగల సమస్యలేనని కూడా ఆమె పేర్కొన్నారు. ప్రపంచంలోని దాదాపు ప్రతీ ఒక్కరూ ఆనారోగ్యకర స్థాయిలో వాయుకాలుష్యం బారిన పడుతున్నారు. వాయు కాలుష్య సంబంధిత మరణాల్లో 90 శాతానిపైగా పీఎమ్ 2.5 అనే సూక్ష్మ ధూళి కణాలే కారణం. పీఎమ్ 2.5 సూక్ష్మధూళి కణాల కారణంగా ఊపిరితిత్తుల కేన్సర్, గుండె జబ్బులు, గుండెపోటు, డయాబెటిస్ తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే, వాస్తవ పరిస్థితి తీవ్రత ఇంతకంటే ఎక్కువగా ఉందని ఈ నివేదిక తెలిపింది. వాతావరణ మార్పుల కారణంగా తలెత్తుతున్న ఓజోన్ కాలుష్యంతో 2021లో 5 లక్షల మంది ప్రాణాలు గాల్లోకి కలిసి పోయాయి. వాతావరణ మార్పులు, వాయుకాలుష్యానికి చాలా సారూప్యమైన పరిష్కార మార్గాలు ఉన్నాయని పల్లవి వ్యాఖ్యానించారు. గ్రీన్ హౌస్ వాయువు విడుదల తగ్గించాలని ఆమె సూచించారు. ముఖ్యంగా ఇళ్లల్లో వంటకు బొగ్గు, చెక్క వంటి అనారోగ్య కారక ఇంధనాల వినియోగం తగ్గించాలి. ఈ అంశంలో చైనా మంచి పురోగతి సాధించింది. ఓజోన్ స్థాయిలను పెంచే అడవి మంటలు, దుమ్ము తుఫానులు లేదా విపరీతమైన వేడి వంటి సంఘటనల కాలుష్య స్థాయిలు పెరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 బిలియన్ల మంది బేసిక్ స్టవ్‌లు లేదా మంటలపై ఆహారం వండుకుంటూ ప్రమాదకరమైన వాయువులను పీలుస్తున్నారు. అయితే మెరుగైన స్టవ్‌లు, ఇంధనాలు అందుబాటులోకి రావడంతో 2020 నుంచి చిన్నారుల మరణాలు సగానికి పైగా తగ్గాయి. 200 పైగా దేశాల్లోని పరిస్థితుల అధ్యయనం ఆధారంగా హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ ఈ నివేదిక రూపొందించింది. -
గరళ కంఠ భారతం
ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి అంటూ రొమ్ము విరుచుకుంటున్న మనకు ఇప్పుడు పెద్ద అపకీర్తి కిరీటమూ దక్కింది. ప్రపంచంలోకెల్లా అత్యంత కలుషిత దేశాల్లో భారతదేశం ఒకటని తాజాగా తేలింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ సంస్థ ‘ఐక్యూ ఎయిర్’ మొత్తం 134 దేశాలు, ప్రాంతాల్లోని 7,812 నగరాలలో 30 వేలకు పైగా వాయు నాణ్యతా పర్యవేక్షక కేంద్రాల నుంచి డేటా సేకరించి ఈ నివేదికను అందించింది. వారి ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక ప్రకారం అత్యంత కాలుష్యదేశాల్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ల తర్వాత మూడో స్థానం భారత్‌దే. 2022లో ఎనిమిదో స్థానంలో ఉన్న భారత్ ఒక్క ఏడాది కాలంలో కాలుష్యంలో మూడో ర్యాంకుకు చేరడం ఆందోళన రేపుతోంది. పైగా, ప్రపంచంలోకెల్లా అత్యంత కలుషిత రాజధాని అనే దుష్కీర్తి వరుసగా రెండో ఏడాది కూడా మన ఢిల్లీకే దక్కింది. అవి చాలదన్నట్టు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా బెగూసరాయ్ నిలవడం దిమ్మ తిరిగేలా చేస్తోంది. ప్రపంచంలో గత ఏడాది ఎదురైన ఆరోగ్య విపత్తు వాయు కాలుష్యమని నిపుణుల మాట. మన దేశంలో శిలాజ ఇంధనాల వినియోగం ప్రధాన కాలుష్యకారకం కాగా, ఉత్తరాదిన ఖరీఫ్ సీజన్లో పంట వ్యర్థాల్ని కాల్చే అలవాటుకు సరైన ప్రత్యామ్నాయం చూపడంలో పాలకుల వైఫల్యాలు సైతం ఢిల్లీ దుఃస్థితికి కారణమై వెక్కిరిస్తున్నాయి. అయితే, మెట్రోలు, గౌహతి – పాట్నా లాంటి ద్వితీయ శ్రేణి నగరాలే కాదు... బిహార్‌లోని బెగూసరాయ్, హర్యానాలోని రోహ్తక్, యూపీలోని మీరట్ లాంటి చిన్న పట్నాలు సైతం వాయు గరళంతో నిండిపోతున్నాయని నివేదిక తేల్చింది. ఐక్యూ ఎయిర్ జాబితాలోని 83 భారతీయ నగరాల్లో చాలావాటిలో కాలుష్య కారకాలు ఏమిటనే సమాచారం లేదు. అలాగే, బెగూసరాయ్ లాంటి చోట ఏడాది తిరగక ముందే కాలుష్యం 6 రెట్లు ఎలా పెరిగిందనేది కనిపెట్టాల్సి ఉంది. కారణాల్ని అంచనా వేస్తూనే, ముంచుకొచ్చిన ఈ ముప్పును విధానపరమైన పరిష్కారాలతో సమర్థంగా ఎదుర్కోవడం పాలకుల ముందున్న సవాలు. గాలిలో ధూళికణాల (పీఎం) సాంద్రత ఏ మేరకున్నదనే దాన్ని బట్టి వాయుకాలుష్య ర్యాంకులు నిర్ణయిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మార్గదర్శకాల ప్రకారం క్యూబిక్ మీటర్‌కు 5 మైక్రోగ్రాములు ఫరవాలేదు. అలాకాక, ధూళికణాలు 2.5 మైక్రాన్లు లేదా అంతకన్నా తక్కువ వ్యాసం (పీఎం 2.5) ఉన్నప్పుడు ఊపిరితిత్తుల, గుండె జబ్బులు, క్యాన్సర్, చిన్న వయసులోనే మర ణాలు సంభవిస్తాయి. కాబట్టి అది ప్రమాదఘంటికకు కొలమానం. 2023లో భారత్‌లో వార్షిక సగటు పీఎం2.5 సాంద్రత క్యూబిక్ మీటర్‌కు 54.4 మైక్రోగ్రాములుగా రికార్డయింది. అలా భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఇక, క్యూబిక్ మీటర్‌కు 79.9 మైక్రోగ్రాములతో బంగ్లాదేశ్ మొదటి స్థానంలో, క్యూబిక్ మీటర్‌కు 73.3 మైక్రోగ్రాములతో పాకిస్తాన్ రెండోస్థానంలో ఉన్నాయి. నిజానికి, మిగతా రెండు దేశాలతో పోలిస్తే, భారత్ పీఎం2.5 సాంద్రత 2021 నాటి నుంచి తగ్గింది. అప్పట్లో భారత్‌లో క్యూబిక్ మీటర్‌కు 58.1 మైక్రోగ్రాములు ఉండేది. ఇప్పుడది 54.4కు తగ్గిందన్న మాటే కానీ ఇవాళ్టికీ ప్రపంచ టాప్ 50 కాలుష్య నగరాల్లో 42 మన దేశంలోవే కావడం కలతపరిచే అంశం. దేశ జనాభాలో కొద్ది మంది మినహా దాదాపు 136 కోట్లమంది నిత్యం డబ్ల్యూహెచ్ఓ మార్గ దర్శకాలను మించి పీఎం2.5 ధూళికణ సాంద్రతకు లోనవుతున్నవారే! మరీ ముఖ్యంగా, మన దేశంలోని పట్టణప్రాంతాల్లో అధిక శాతం మంది ఇలా నిత్యం కాలుష్యం కోరల బారిన పడుతూ, శ్వాస కోశ సమస్యలతో డాక్టర్ల చుట్టూ తిరుగుతుండడం తరచూ కంటి ముందు కనిపిస్తున్న కథే. మిగిలి నవి అటుంచితే, భారత్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుచ్ఛక్తిలో 70 శాతం థర్మల్ విద్యుత్తే అన్నది గమనార్హం. ఇప్పటికీ మనం పునరుత్పాదక శక్తి వనరుల మార్గం పట్టలేదు. పైపెచ్చు, దేశ ఆర్థిక వృద్ధి మరింత వేగవంతమయ్యేకొద్దీ ఇది పెను సవాలు కానుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఇంటి పైకప్పులపై సౌరవిద్యుత్ ఫలకాల ఏర్పాటు లాంటి భారీ ప్రణాళికలు ప్రకటించింది. అయితే, ఇవన్నీ ఆచరణ లోకొచ్చి, ప్రభావం చూపడానికి మరికొంత సమయం పడుతుంది. ఇలాంటి ప్రయత్నాలు గణనీ యంగా ప్రభావం చూపాలంటే, మన విద్యుత్ విధానాలను సమూలంగా మార్చడం ముఖ్యం. అసలు ‘స్వచ్ఛమైన గాలి’ కూడా ప్రాథమిక జీవనహక్కే. కోర్టులు ఆ సంగతి పదేపదే చెప్పాయి. బరిలోకి దిగక తప్పని పరిస్థితిని ప్రభుత్వాలకు కల్పించాయి. అయితే, పౌర రవాణాలో సీఎన్జీ, మెట్రో వ్యవస్థ, ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ లాంటివి తీసుకొచ్చినా ఢిల్లీ లాంటి చోట్ల కాలుష్యం కోరలు చాస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు సమస్య అవగాహన, పరిష్కారానికై శాస్త్ర విజ్ఞానాన్ని ఆశ్రయించాలి. అలాగే, కాలుష్య నియంత్రణకు అవసరమైన రీతిలో జనజీవితంలో అలవాట్లు మారేలా ప్రోత్సాహకాలు, అతిక్రమిస్తే జరిమానాల పద్ధతి తేవాలి. సర్వజన శ్రేయస్సు కోసం పార్టీలన్నీ కాలుష్యంపై పోరును రాజకీయ అంశంగా తీసుకొని, ఎన్నికల మేనిఫెస్టోల్లో చోటివ్వాలి. నిజానికి, జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమాన్ని పటిష్ఠం చేస్తామంటూ 2019లో కాంగ్రెస్, బీజేపీలు తమ ఎన్నికల వాగ్దానపత్రంలో పేర్కొన్నాయి. ఇది కేవలం కేంద్రం పనే కాదని గుర్తించి, రాష్ట్రాల నుంచి మునిసిపాలిటీల దాకా అన్నీ తమ వంతుగా కాలుష్యంపై పోరులో చేతులు కలపాలి. వాయు కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యమే కాక, దరిమిలా సంక్లిష్టమైన పర్యావరణ ప్రక్రియలతో పుడమి వాతావరణమే దెబ్బతింటుందని శాస్త్రవేత్తల మాట. అందుకని ఈ విషానికి విరుగుడు కనిపెట్టడం అన్ని విధాలా అత్యవసరం. ఈ క్రమంలో తాజా ఐక్యూ ఎయిర్ నివేదిక మనకు మరో మేలుకొలుపు. -
కాలుష్య రాజధానిగా ఢిల్లీ
న్యూఢిల్లీ: ‘అత్యంత కాలుష్య దేశ రాజధాని’ అప్రతిష్ట కిరీటాన్ని ఢిల్లీ మరోసారి తన నెత్తిన పెట్టుకుంది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూఎయిర్ సంస్థ ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక–2023లో పలు అంశాలను ప్రస్తావించింది. నివేదికలో వెల్లడైన వివరాల ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యంతో నిండిన మెట్రోపాలిటన్ ప్రాంతంగా బిహార్‌లోని బెగుసరాయ్ నిలిచింది. ఘనపు మీటర్‌కు 54.4 మైక్రోగ్రామ్‌ల చొప్పున వార్షిక సూక్ష్మధూళికణాల(పీఎం 2.5) గాఢత ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. 79.9 మైక్రోగ్రామ్‌లతో బంగ్లాదేశ్ తొలిస్థానంలో, 73.7 మైక్రోగ్రామ్‌లతో పాకిస్థాన్ రెండోస్తానంలో నిలిచింది. గత ఏడాది ఘనపు మీటర్‌కు కేవలం 53.4 మైక్రోగ్రామ్‌ల వార్షిక సూక్ష్మధూళి కణాల(పీఎం 2.5)గాఢతతో భారత్ ఎనిమిదో స్థానంలో ఉండగా ఇటీవలికాలంలో దేశంలో కాలుష్యం విపరీతంగా కమ్ముకుని భారత స్థానం దారుణంగా మూడో స్థానానికి ఎగబాకడం ఆందోళనకరం. ఇక బిహార్‌లోని బెగుసరాయ్ గత ఏడాది కాలుష్యప్రాంతాల జాబితాలోనే లేదు. కానీ ఈ ఏడాది ఘనపు మీటర్‌కు 118.9 మైక్రోగ్రామ్‌ల పీఎం2.5 గాఢతతో ప్రపంచంలోనే అతి కాలుష్య మెట్రోపాలిటన్ పట్టణంగా అప్రతిష్టను మూటగట్టుకుంది. ఆ తర్వాతి స్థానాలో గువాహటి, ఢిల్లీ, పంజాబ్‌లోని ముల్లాన్‌పూర్ నిలిచాయి. నాలుగుసార్లు టాప్ ర్యాంక్ ఢిల్లీ పీఎం2.5 గాఢత గత ఏడాది 89.1 మైక్రోగ్రాములు ఉంటే ఈసారి మరికాస్త పెరిగి 92.7 మైక్రోగ్రాములకు చేరుకుంది. దీంతో విపరీతమై కాలుష్యం కారణంగా 2018 ఏడాది నుంచి చూస్తే నాలుగుసార్లు మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ కిరీటాన్ని ఢిల్లీకే కట్టబెట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఒక ఘనపు మీటర్‌కు 5 మైక్రోగ్రాములకు మించి సూక్ష్మధూళి కణాలు ఉండకూడదు. కానీ భారత్‌లోని 136 కోట్ల ప్రజలు అధిక వాయుకాలుష్యం బారిన పడ్డారని తాజా నివేదిక ఘోషిస్తోంది. దేశ జనాభాలో 96 శాతం మంది అంటే 133 కోట్ల మంది డబ్ల్యూహెచ్‌వో పరిమితికి ఏడు రెట్లు మించి కాలుష్యమయ వాతావరణంలో జీవిస్తున్నారు. భారత్‌లోని 66 శాతం నగరాలు సగటున ఘనపు మీటర్‌కు 35 మైక్రోగ్రామ్‌ల ధూళికణాలున్న వాయుకాలుష్యం బారిన పడ్డాయి. విభిన్న మార్గాల్లో, విస్తృతస్థాయి డేటా ప్రపంచవ్యాప్తంగా 134 దేశాల్లో ఏర్పాటుచేసిన 30,000 వాయునాణ్యతా ప్రమాణాల స్టేషన్లు, సెన్సార్లు సేకరించిన డేటాను క్రోడీకరించి ఈ నివేదికను తయారుచేసినట్లు ఐక్యూఎయిర్ తెలిపింది. అధ్యయన సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వేతర లాభాపేక్షలేని సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, పౌర శాస్త్రవేత్తల నుంచి తీసుకున్న డేటాను ఈ నివేదిక కోసం వినియోగించినట్లు సంస్థ పేర్కొంది. ఆసియా ‘100’లో 83 భారత్‌లోనే ప్రపంచవ్యాప్తంగా కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా భారత్ పేరుమోస్తోంది. ఆసియాలో అత్యంత కాలుష్యమయ 100 నగరాల జాబితా ప్రకటించగా అందులో 83 నగరాలు భారత్‌లో ఉండటం దారుణ పరిస్థితికి దర్పణం పడుతోంది. కొన్ని నగరాల్లో కాలుష్యం డబ్ల్యూహెచ్‌వో పరిమితిని పది రెట్లు దాటేయడం గమ నార్హం. కాలుష్యానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 7,800 నగరాలను పరిశీలిస్తే అందులో డబ్ల్యూహెచ్‌వో పరిమితికి లోబడి కేవలం 9 శాతం నగరాలు ఉండటం చూస్తే పరిస్థితి చేయిదాటిపోయిందని అర్ధమవుతోంది. ‘ ఫిన్లాండ్, ఎస్తోనియా, ప్యూర్టోరీకో, ఆస్ట్రేలి యా, న్యూజిలాండ్, బెర్ముడా, గ్రెనెడా, ఐస్‌ల్యాండ్, మారిషస్, ప్రెంచ్ పాలినేసియా దేశాల్లో మాత్రం వాయు నాణ్యత బాగుంది. -
ఏక్యూఐ ఉమెన్ అంబాసిడర్
సరోజ్ బెన్, జరీనా, ముంతాజ్‌లాంటి సామాన్య మహిళలు తమలాంటి సామాన్యుల కోసం వాయు కాలుష్యంపై దిల్లీ గల్లీలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోర్టబుల్ ఏక్యూఐ(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) మానిటర్లతో ‘వాయు కాలుష్య నివారణకు మన వంతుగా చేయాల్సింది’ అనే అంశంపై ప్రచారం చేస్తున్నారు... దిల్లీలోని నందనగిరి ప్రాంతం. చేతిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) మానిటర్‌తో 39 సంవత్సరాల సరోజ్ బెన్ ఇద్దరు ముగ్గురు మహిళలతో మాట్లాడుతున్నప్పుడు ‘విషయం ఏమిటీ?’ అని అడుగుతూ మరో ఇద్దరు మహిళలు, ఆ తరువాత మరో ముగ్గురు మహిళలు వచ్చారు. అడిగిన వారికల్లా ఓపిగ్గా చెబుతోంది సరోజ్. ‘మీ ఏరియాలో వాయుకాలుష్యం ప్రమాదకరమైన స్థాయిలో ఉంది...’ అంటూ ప్రారంభించి ఆ సమస్య తలెత్తడానికి కారణాలు, దీని ప్రభావం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, నివారణ చర్యలు... మొదలైన వాటి గురించి చెబుతూ పోయింది. ‘మీరు గవర్నమెంట్ ఆఫీసరా?’ అని ఎవరో అడిగారు. ‘కాదమ్మా, నేనూ నీలాగే గృహిణిని. పెరుగుతున్న వాయుకాలుష్యం గురించి బాధపడి, కాలుష్య నివారణకు నా వంతుగా ఏదైనా చేయాలని ఇలా వీధులు తిరుగుతున్నాను’ అని చెప్పింది సరోజ్. సరోజ్ బెన్ మాత్రమే కాదు గ్రాస్‌రూట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ‘మహిళా హౌజింగ్ ట్రస్ట్’ కమ్యూనిటీ మూమెంట్ ‘హెల్ప్ దిల్లీ బ్రీత్’ ప్రభావంతో ఎంతోమంది సామాన్య మహిళలు వాయు కాలుష్యంపై అవగాహన చేసుకున్నారు. తమలాంటి వారికి అవగాహన కలిగించడానికి వాడ వాడా తిరుగుతున్నారు. కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, సాధారణ పౌరుల్లో వాయు కాలుష్యంపై అవగాహన కలిగించడానికి మహిళా హౌజింగ్ ట్రస్ట్, హెల్ప్ దిల్లీ బ్రీత్ సంస్థలు సామాన్య మహిళలకు శిక్షణ ఇస్తున్నాయి. పోర్టబుల్ ఏక్యూఐ మానిటర్లతో దిల్లీలోని గల్లీలు తిరుగుతూ వాయుకాలుష్య నివారణపై ప్రచారం నిర్వహిస్తున్న ఈ మహిళలు ‘ఏక్యూఐ ఉమెన్ అంబాసిడర్’లుగా గుర్తింపు పొందారు. ఏక్యూఐ అంబాసిడర్లు హెల్ప్ దిల్లీ బ్రీత్, మహిళా హౌజింగ్ ట్రస్ట్ నిర్వహించే సమావేశాలకు హాజరు కావడమే కాదు ప్రచార వ్యూహాల గురించి కూడా ఒకరితో ఒకరు చర్చించుకుంటారు. ‘కమ్యూనిటీ యాక్షన్ గ్రూప్’గా ఏర్పడి సమాచారాన్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటారు. ‘వాయు కాలుష్యం గురించి కొద్దిసేపు మీతో మాట్లాడాలనుకుంటున్నాను అని ఒక గృహిణితో అన్నప్పుడు నా ముఖం మీద తలుపు వేసినంత పనిచేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్నాను. ఈసారి అలా కాదు ఇలా చేయాలనుకున్నాను. దిల్లీలోని నెహ్రూ నగర్‌కు వెళ్లినప్పుడు నా బ్యాగులో ఉన్న కొన్ని పోస్టర్లను ఆమెకు చూపాను. అవి చూసి అయ్యో ఏమిటి ఇది అన్నట్లుగా అడిగింది. అలా మెల్లగా టాపిక్‌ను మొదలుపెట్టాను. ఆమె చాలా శ్రద్ధగా విన్నది. పరిస్థితులను బట్టి ఏ రూట్లో వెళ్లాలో అప్పటికప్పుడు నిర్ణయించుకుంటే సమస్య ఉండదు’ అంటుంది సీమ అనే ఏక్యూఐ అంబాసిడర్. ‘ఉపన్యాసం ఇచ్చినట్లు కాకుండా మన ఇంటి పరిసరాల్లో ప్రమాదం పొంచి ఉంటే ఎలా చెబుతామో అలా వాయు కాలుష్యం గురించి చెబుతాను. ఉదాహరణలతో అర్థమయ్యేలా చెబుతాను. పెద్దవాళ్లకే సాధ్యం కాని పెద్ద సమస్య ఇది. మన వల్ల ఏమవుతుంది... అని కొందరు అంటారు. మీలా అందరూ అనుకోవడం వల్లే అది పెద్ద సమస్యగా మారింది అని నేను అంటాను. మొదటగా మీరు చేయాల్సింది మీ పెరట్లో ఒక మొక్క నాటడం అని సలహా ఇస్తాను. నేను చెప్పింది వారికి నచ్చినట్లు వారి హావభావాలను బట్టి గ్రహిస్తాను’ అంటుంది ఏక్యూఐ అంబాసిడర్ ముంతాజ్. ఏక్యూఐ అంబాసిడర్ల కృషి వృథా పోవడం లేదు. ఇప్పుడు ఎంతో మంది కాలుష్యాన్ని నియంత్రించే చర్యల గురించి నిర్మాణాత్మకంగా మాట్లాడుతున్నారు. వారు పెద్ద చదువులు చదుకున్నవారేమీ కాదు. సామాన్య మహిళలు. ఏక్యూఐ అంబాసిడర్ల విజయానికి ఇది ఒక ఉదాహరణ. మార్పు మొదలైంది... జరీనా ప్రతిరోజూ ఏక్యూఐ మానిటర్‌తో ఉదయం, సాయంత్రం వివిధ ప్రాంతాలలో పొల్యూషన్ లెవెల్స్‌ను చెక్ చేస్తుంది. ‘కొన్నిసార్లు కాలుష్యం తక్కువగా, మరికొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంది. కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు ఏక్యూఐ మానిటర్‌పై ఎరుపు రంగు కనిపిస్తుంది. కొత్త సంఖ్యలు కనిపిస్తాయి. ఒకప్పుడు వాయుకాలుష్యం గురించి పెద్దగా ఆలోచించేవారు కాదు. అయితే ఇప్పుడు చాలామందిలో మార్పు రావడాన్ని గమనించాను’ అంటుంది జరీనా.ఏక్యూఐ అంబాసిడర్ అయిన జరీనా వాయునాణ్యత, వెంటిలేషన్, బొగ్గు పొయ్యిలకు దూరంగా ఉండడం... మొదలైన అంశాలపై దిల్లీ గల్లీలలో విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. ఇలా కూడా... వాడ వాడలా తిరుగుతూ వాయుకాలుష్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాదు లేబర్ కార్డు, ఆయుష్మాన్ భారత్ కార్డు, పీఎం సురక్షిత్ మాతృత్వ అభియాన్, సుమన్ యోజనలాంటి ప్రభుత్వ సామాజిక, సంక్షేమ పథకాల గురించి భనన నిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు తెలియజేస్తున్నారు ఏక్యూఐ అంబాసిడర్లు. స్కీమ్‌కు సంబంధించిన పత్రాలు నింపడం నుంచి ఐడీ కార్డ్‌లు వారికి అందేలా చేయడం వరకు ఎన్నో రకాలుగా సహాయం అందిస్తున్నారు. -
నిబద్ధతతోనే కాలుష్య నియంత్రణ
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అరుదుగా మాత్రమే నీలి ఆకాశం కనబడుతోంది. గాలి నాణ్యత తీవ్రతకు ఇదొక సంకేతం. వాయు కాలుష్యం ఇప్పుడు జాతీయ సమస్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, గాల్లోని నలుసు పదార్థాల (పీఎం) సాంద్రత 2.5 పీఎం అయితే, ఒక క్యూబిక్ మీటరుకు 5 మైక్రో గ్రాములు మించకూడదు. ఇది ఢిల్లీ లాంటి నగరంలో 102. ఈ గాలిని పీల్చడం ప్రాణాంతకం. వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి తెచ్చిన ‘జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం’ కొంతమేరకు ఫలితమిస్తున్నా అది సరిపోదు. మానవ కణజాలంలోకి చొచ్చుకుపోయే కాలుష్య కారకాలతో మనం వ్యవహ రిస్తున్నాం. ప్రజారోగ్య దృక్కోణం నుండి చూస్తే ఎంత ప్రగతి అయినా తక్కువే. నిరంతర రాజకీయ నిబద్ధత మాత్రమే మెరుగైన ఫలితాలను ఇస్తుంది. శీతకాలపు నెలల్లో భారీ పొగమంచుతో కప్పబడి ఉండే ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో నీలి ఆకాశం, ప్రకాశవంతమైన సూర్యబింబం అరుదుగా గోచరిస్తుంటాయి. అయితే పేలవమైన గాలి నాణ్యత అనేది ఇప్పుడు జాతీయ సమస్య అయింది. కాకపోతే గత ఐదేళ్లలో, వాయు కాలుష్యం ఒక విధానపరమైన సమస్యగా కూడా గుర్తింపు పొందింది. అయిన ప్పటికీ ‘జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమ’ (ఎన్సీఏపీ) అయిదేళ్ల అంచనాను పరిశీలిస్తే, అర్థవంతమైన, శాశ్వతమైన ప్రయోజనాలను అందించడానికి గట్టి ప్రయత్నాలు అవసరమని తెలుస్తుంది. అపఖ్యాతి పాలైన భారతదేశ గాలి నాణ్యతను పరిష్కరించడానికి తెచ్చిన మొదటి విధానం – 2019లో ప్రారంభించిన ఎన్సీఏపీ. కాలుష్య స్థాయులను, గాలిలోని నలుసు పదార్థాల గాఢతలను ప్రధాన నగరాల్లో 30 నుంచి 20 శాతం తగ్గించాలనే స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించింది. దీనికి కేంద్రం నుండి రూ. 443 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నుండి రూ. 4,400 కోట్ల ప్రారంభ కేటాయింపులు జరిపారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)కి చెందిన నిరంతర పరిసర వాయు నాణ్యతా పర్యవేక్షణ కేంద్రాల విశ్లేషణ (భారత దేశ వాయు నాణ్యతా మానిటర్ల నెట్వర్క్) పురోగతి స్థిరంగా ఉన్నప్ప టికీ, ఎన్‌సీఏపీని అమలు చేయడంలో వ్యూహాత్మకమైన, సైన్స్ ఆధారిత మార్పుల అవసరం ఉంది. ఉదాహరణకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ గాల్లోని నలుసు పదార్థాల (పర్టిక్యులేట్ మ్యాటర్) సాంద్రతకు పరిమితులు నిర్దేశించింది. 2.5 పీఎం అయితే, ఒక క్యూబిక్ మీటరుకు 5 మైక్రోగ్రాములు, 10 పీఎం అయితే ఒక క్యూబిక్ మీటరుకు 15 మైక్రోగ్రాములు మించకూడదు. ఎన్సీఏపీ అమలయ్యాక, ప్రత్యేకించి 2.5 పీఎం వారణాసిలో 96 నుంచి 26.9 మైక్రోగ్రాములకు తగ్గింది. ఆగ్రాలో 73 నుంచి 33కు, జో«ద్‌పూర్‌లో 81.8 నుంచి 40.6కు మెరుగ్గా తగ్గింది. కానీ ఢిల్లీలో మాత్రం 108 నుంచి 102కు మాత్రమే తగ్గింది. పీఎం 2.5 స్థాయుల డేటా 2019–2023 మధ్య 46 నగరాలకు మాత్రమే అందుబాటులో ఉంది. కేవలం 27 నగరాల్లో మాత్రమే తగ్గుదల మెరుగ్గా ఉంది. 10 పీఎం విషయంలో ఐదేళ్ల డేటా కేవలం 46 నగరాలకు అందుబాటులో ఉండగా, అందులో కేవలం 24 నగరాల్లో మాత్రమే మెరుగుదల కనబడింది. 50 శాతం నగరాలు గణనీయమైన అభివృద్ధిని చూపుతున్నా యనీ, ఇది ఎన్సీఏపీ విజయవంతమైన ప్రగతిని సూచిస్తోందనీ ఎవరైనా వాదించవచ్చు. కానీ మనం మానవ కణజాలంలోకి చొచ్చుకుపోయే కాలుష్య కారకాలతో వ్యవహరిస్తున్నాము. పైగా రక్తపోటు, మధుమేహం వంటివాటిని ఇవి మరింత తీవ్రతరం చేయవచ్చు. 2.5 పీఎం రక్త–మెదడు అవరోధాన్ని కూడా దాటవచ్చు. దీర్ఘకాలం అలాంటి గాలిలో మసలితే ప్రాణాంతకం అవుతుంది. కాబట్టి, ప్రజారోగ్య దృక్పథం నుండి చూస్తే మరింత కఠినమైన ప్రగతి అత్యవశ్యం. మరో సమస్య ఏమిటంటే, ఎన్సీఏపీలో సమన్వయం కొరవడింది. ఢిల్లీ లాంటి నగరంలో సరి–బేసి ట్రాఫిక్‌ను అమలు చేయడం, ‘జాతీయ రాజధాని ప్రాంతం’ నుండి నిబంధనలు పాటించని వాహనాలను తొలగించడం, వ్యర్థాలను బహిరంగంగా కాల్చడాన్ని నిరోధించడం, దుమ్మును తగ్గించడానికి రోడ్లపై నీటిని చల్లడం వంటి చర్యలు అన్నీ అమలవుతున్నాయి. అయినప్పటికీ, కాలుష్యానికి సంబంధించిన ఇవే కారణాలు ఉన్న మిగిలిన ప్రాంతాలకు విస్తరించకుంటే ఈ చర్యలు సరిపోవు. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లలో పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల దట్టమైన పొగమంచుతో చలి కాలం ప్రారంభం కావడం దీనికి స్పష్టమైన ఉదాహరణ. ఢిల్లీ నగరంలో నమోదైన సుమారు 80 లక్షల వాహనాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఉష్ణోగ్రతలో తగ్గుదల గాలిలో నిలిచివుండే అణువుల స్థాయులను ప్రమాదకరంగా పెంచుతుంది. ఈ కాక్టెయిల్ను ఢిల్లీ నివాసులు ప్రతి సంవత్సరం కొన్ని వారాల పాటు పీల్చుకుంటున్నారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్) ప్రతి శీతాకాలంలో ఢిల్లీ–జాతీయ రాజధాని ప్రాంతంలో ఊహించిన ప్రతిస్పందనగా అమలులోకి వస్తుంటుంది. అయితే దాని ఆధారాన్ని తగ్గించడమే లక్ష్యం కావాలి. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సజావుగా సమన్వయం లేకపోతే ఈ సమస్య ఇలాగే కొనసాగుతుంది. జాతీయ రాజధాని వెలుపల, సీపీసీబీ పర్యవేక్షణ నెట్వర్క్ అసమానంగా ఉందని మా విశ్లేషణ చూపుతోంది. ఇది మూల్యాంకనానికి వ్యత్యాసాల పొరను జోడిస్తుంది. ముజఫర్‌పూర్, బిహార్ లాంటి రద్దీ ప్రదేశాలలో కేవలం మూడు మానిటర్లు ఉన్నాయి. అదే ఢిల్లీ అంతటా 37 స్టేషన్లు,ముంబై అంతటా 22, హైదరాబాద్‌లో 14 స్టేషన్లు ఉన్నప్పుడు మనం తప్పుడు నిర్ధారణలకు వచ్చే ప్రమాదం ఉంది. ప్రామాణిక పర్యవేక్షణ విధానంలో, పోల్చదగిన జనాభా ఉన్న నగరాలు ఒకే విధమైన లేదా కనీసం సారూప్య సంఖ్యలో గాలి నాణ్యత మానిటర్లను కలిగి ఉంటాయి. స్థానిక కాలుష్య మూలాల శాస్త్రీయ అవగాహన ఆధారంగా ఆ స్థానాలు ఉంటాయి. నగరాల కాలుష్య సాంద్రతలు ఒకే పారామి తుల సెట్లో ట్రాక్ చేయబడతాయి. ఇది వాటి గాలి నాణ్యత ధోర ణులపై ‘గ్రాన్యులర్’(కణికీయ) అవగాహనను పెంపొందించడంలో సహాయపడుతుంది. వాయు కాలుష్య ప్రయత్నాలకు సంబంధించిన నిధుల కేటాయింపుల్లో కూడా సమస్యలున్నాయి. తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్న ఢిల్లీకి కేవలం రూ.38 కోట్లు మాత్రమే అందాయి. అందులో అది 10 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. గాలి నాణ్యత చర్యల కోసం వర్తించే నిధులను క్రమబద్ధీకరించడంలో ఇదొక ప్రశ్నగానే ఉండిపోతుంది. గ్రేటర్ ముంబైకి రూ.938 కోట్లు అందగా, దానిలో రూ.660 కోట్లు వినియోగించుకుంది. అయినప్పటికీ, జాతీయ స్వచ్ఛ వాయు పథకం(ఎన్సీఏపీ)లో సానుకూల అంశాలున్నాయి. వీటిలో మొదటిది 2026 నాటికి 10 పీఎం గాలి సాంద్రతలను 40 శాతానికి తగ్గించడం. ఇది ప్రతిష్ఠా త్మకమైన లక్ష్యాన్ని నిర్దేశిస్తోంది. అందుకే దీన్ని ఎన్సీఏపీ అమలు కాని నగరాలకు కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రేటర్ నోయిడా (ఉత్తర ప్రదేశ్), భివాడీ (రాజస్థాన్) వంటివి తీవ్ర కాలుష్య స్థాయులను నివేదించాయి. ఇంకా, రంగాల వారీగా వివరణాత్మక చర్యలు ఉండాలి. ఇటుక బట్టీలు, నిర్మాణాలు, కూల్చివేత ప్రాజెక్టుల వంటి అత్యంత కాలుష్య కారకాలకూ... సిమెంట్, ఉక్కు కర్మాగారాలకూ భిన్నమైన విధానం అవసరం. అదేవిధంగా, ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం మాత్రమే నిర్దిష్ట వయస్సు దాటిన పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధించింది. కానీ దేశవ్యాప్తంగా కఠినమైన, కాలుష్య నియంత్రణ వ్యవస్థ లేక పోతే... ప్రమాణాలను అందుకోని వాహనాలను ఇతర నగరాలకు తరలించే ప్రమాదం ఉంది. అప్పుడు కాలుష్య భారం మారదు. మరీ ముఖ్యంగా, ఎన్సీఏపీ ప్రధాన అంశంగా ప్రజారోగ్యం ఉండాలి. ప్రతి కొలమానాన్ని తప్పనిసరిగా ప్రతిపాదించాలి, చర్చించాలి. అంతే గాకుండా వాయు కాలుష్య కారకాలను తగ్గించడం పట్ల నిర్మాణా త్మకంగా ఉండాలి. మనం ఎన్సీఏపీ రెండవ దశలోకి ప్రవేశించినప్పుడు చాలా ఆశించవచ్చు. ప్రభుత్వం అత్యున్నత స్థాయిలలో సమస్యను అంగీకరించడం అనేది మాత్రం ఇప్పటికి సానుకూలాంశం. కానీ నిరంతర రాజ కీయ నిబద్ధత మాత్రమే బలమైన ఫలితాలను ఇస్తుంది. ఆరతీ ఖోస్లా వ్యాసకర్త న్యూఢిల్లీలోని క్లైమేట్ ట్రెండ్స్ డైరెక్టర్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
కాలుష్య కోరల్లో ఢిల్లీ.. నియంత్రణకు అధికారుల ఆంక్షలు
ఢిల్లీ: ఢిల్లీలో గాలి కాలుష్యం మళ్లీ తీవ్ర స్థాయిలో పెరిగింది. పొగమంచుకు గాలి కాలుష్యం తోడవడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో కాలుష్యాన్ని నియంత్రించడానికి అధికారులు ఆంక్షలు విధించారు. ఆదివారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 మార్క్‌ను దాటింది. గాలి నాణ్యతా ప్రమాణాలు తీవ్రమైన ప్రమాదానికి చేరాయి. దేశ రాజధానిలో కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరగడంతో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (CAQM) నియంత్రణ చర్యలకు పూనుకుంది. దేశ రాజధాని ప్రాంతంలో అనవసరమైన నిర్మాణ పనులను నిలిపివేశారు. BS-III, BS-IV డీజిల్ వాహనాల వాడకాన్ని నిషేధించింది. కాలుష్యం నేపథ్యంలో 5వ తరగతి వరకు తరగతులను నిలిపివేయడంపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర కమిషన్ సూచించింది. "శనివారం సాయంత్రం నుండి దేశ రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ కార్యాచరణ కమిటీ ఈ రోజు ఉదయం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కాలుష్య నియంత్రణకు ప్రణాళికను అమలు చేయాలని కమిటీ నిర్ణయించింది. ఢిల్లీ పరిసర ప్రాంతంలో తక్షణమే ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి.” అని కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. రోడ్లు, కాలుష్యం తీవ్రంగా ఉండే ప్రదేశాల్లో నీటిని చిలకరించేలా చూడండి ప్రజా రావాణా సేవలను ఎక్కువగా ఉపయోగించుకోండి. వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించండి అత్యవసరమైన ప్రాజెక్టులు మినహా.. నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలను తగ్గించండి. స్టోన్ క్రషర్స్ ఆపరేషన్‌ను మూసివేయండి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గనుల తవ్వకాన్ని నిలిపివేయండి BS-III పెట్రోల్, BS-IV డీజిల్ LMVలపై కఠినమైన పరిమితులను విధించండి. నాల్గవ తరగతి వరకు పిల్లలకు భౌతిక తరగతులను నిర్వహించకండి. ఆన్లైన్లో బోధించండి. ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు సీనియర్ నేత గుడ్ బై.. 55 ఏళ్ల పాటు పార్టీకి సేవలు.. చివరకు.. -
ఢిల్లీలో 25 స్వైన్ కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: వాయు కాలుష్యంతో తల్లడిల్లుతున్న దేశ రాజధాని ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఢిల్లీలో శనివారం ఒక్క రోజే 25 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వెల్లడించింది. వీటితో కలుపుకుని ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నమోదైన కేసులు 153కు చేరాయని పేర్కొంది. స్వైన్ ఫ్లూతో పాటు ఇన్‌ఫ్లూయెంజా (హెచ్3ఎన్2) కేసులు కూడా పెరగడంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రోగుల్లో న్యుమోనియా ఇన్ఫెక్షన్ కూడా కనిపిస్తోందని చెబుతున్నారు. -
పాక్‌నూ కాటేస్తున్న వాయుకాలుష్యం.. లాహోర్ ప్రజలు విలవిల!
భారత్ మాత్రమే కాదు.. పాకిస్తాన్‌లోనూ గాలి అత్యంత విషపూరితంగా మారింది. పాక్‌లోని రెండో అతిపెద్ద నగరమైన లాహార్ పొగమంచు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నగరంలోని లక్షలాది మంది ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. పలువురి జీవనోపాధి దెబ్బతింటోంది. స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం లాహోర్‌లో గాలి నాణ్యత ప్రపంచంలోనే అధ్వాన్నంగా ఉంది. ఇక్కడి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ‘ప్రమాదకర’ స్థాయిని సూచిస్తూ 470 వద్ద ఉంది. పాక్ మీడియా డాన్ పేర్కొన్న వివరాల ప్రకారం వాహన ఉద్గారాలు, పారిశ్రామిక కాలుష్యం, పంటలను కాల్చడం కారణంగానే కాలుష్యం కమ్ముకుంది. పొగమంచు కారణంగా లాహోర్ నగరంలో దృశ్యమానత(విజిబులిటీ) తగ్గింది. వైమానిక కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. లాహోర్‌కు చెందిన పలువురు విషపూరితమైన గాలి కారణంగా శ్వాసకోశ సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధుల బారిన పడ్డారని తెలుస్తోంది. పొగమంచు నుండి తప్పించుకునేందుకు కొందరు నగరాన్ని విడిచిపెట్టారు. పాక్‌లోని లాహోర్, పంజాబ్‌లలో పొగమంచు సంక్షోభం కొత్త విషయం కాదు. ప్రతి సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో ఇటువంటి పరిస్థితులే కనిపిస్తుంటాయి. ఇది కూడా చదవండి: దక్షిణాసియాలోనే అధిక కాలుష్యం ఎందుకు? కట్టడి ఎలా? -
ఆదేశాలేనా? ఆచరణ లేదా?
ఆదేశాలిచ్చినా ఆచరణలో పెట్టకపోతే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. వాయు కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాజధాని ఢిల్లీలోనే కాక, దేశవ్యాప్తంగా నిర్ణీత నిషేధిత రసాయనాలున్న టపాసులను నిషేధిస్తున్నట్టు సుప్రీమ్ కోర్టు గతవారం ఆదేశాలిచ్చింది. కానీ, జరిగింది మాత్రం వేరు. ఇష్టా రాజ్యంగా టపాసులు కాల్చడం కొనసాగింది. ఎప్పటిలానే దట్టమైన పొగలో ఢిల్లీ కూరుకుపోయింది. దీపావళి వేళ ఒక్క ఢిల్లీలోనే కాక దేశవ్యాప్తంగా వాయు, శబ్ద కాలుష్యాలు నియంత్రణ కాకపోగా మరింత పెరిగాయి. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా సహా 7 నగరాల్లో కాలుష్యస్థాయి ఘనపు మీటర్‌కు 500 మైక్రోగ్రాముల స్థాయిని దాటేసినట్టు గంటల వారీగా చేసిన విశ్లేషణలో వెల్లడైంది. హానికారకమైన నిర్ణీత టపాసులు కాల్చడంపై నిషేధం అమలులో ప్రభుత్వాల వైఫల్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఢిల్లీ, గురుగ్రామ్, చండీగఢ్, కోల్‌కతా, ముంబయ్, తదితర నగరాల్లో నిషేధిత టపాసులు సైతం నిల్వచేశారు, అమ్మారు, బాహాటంగా వాటిని కాల్చారు. కోర్టు ఆదేశాలు సైతం గాలికి పోవడం విషాదమే. అయితే, ప్రజల్లో చైతన్యం తీసుకురాకుండా, వారిని మానసికంగా సంసిద్ధం చేయకుండా, ప్రభుత్వాల ఆచరణలో చిత్తశుద్ధి లేకుండా... ఎవరెన్ని ఆదేశాలు జారీ చేసినా ప్రయోజనం ఉండదని మరోసారి రుజువైంది. దీపావళి ముగిసి మూణ్ణాళ్ళయినా ఢిల్లీలో వాయు నాణ్యత ఇప్పటికీ ప్రమాదకర స్థాయిలోనే ఉందని వార్త. నిజానికి, దేశ రాజధానిలో టపాసులపై నిషేధం పెట్టడం ఇదేమీ తొలిసారి కాదు. వాటి అమ్మకాన్ని దేశ రాజధానిలో నిషేధించాల్సిందిగా 2018 అక్టోబర్‌లో సైతం సుప్రీమ్ కోర్ట్ అప్పటి ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ‘పర్యావరణ హిత’ (గ్రీన్) టపాసులు, తక్కువ ఉద్గారాలు వెలువరించే ‘మెరుగైన’ టపాసులకు మినహాయింపు నిచ్చింది. అప్పుడూ ఆ మాట ఆదేశాలకే పరిమితమైంది తప్ప ఆచరణకు నోచుకోలేదు. అప్పట్లో కొద్దిరోజులకే... తక్కువ కాలుష్యం కలిగించే టపాసులను అభివృద్ధి చేసినట్టు ‘కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్’ ప్రకటించింది. సాంప్రదాయిక టపాసుల కన్నా ఇవి చౌక అనీ చెప్పింది. వాటి అతీగతీ తెలీదు. అంతకన్నా ఘోరమేంటంటే, చైనా నుంచి దిగుమతి చేసుకున్న టపాసులు ‘మేడిన్ ఇండియా’ అంటూ నకిలీ ముద్రతో మార్కెట్లో యథేచ్ఛగా తిరుగుతున్నాయి. వాటిని ఆపే ప్రయత్నాలు సమర్థంగా జరగడం లేదు. అలాగే, ఇటీవల రెండు గంటలే టపాసులు కాల్చడానికి అనుమతిస్తున్నట్టు ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. ఆ ఆదేశాలూ ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. వెరసి, కాలుష్య నియంత్రణపై మాటలే తప్ప చేతలు కనిపించని వైనం సహజంగానే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెర తీస్తోంది. టపాసుల నిషేధంపై ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ విమర్శిస్తోంది. బీజేపీ నేతాగణం, బీజేపీ పాలిత రాష్ట్రాలే ఆచారాల పేరు చెప్పి టపాసులు కాల్చేలా ప్రజల్ని కావాలని రెచ్చగొడుతున్నాయని ‘ఆప్’ ఆరోపిస్తోంది. పరస్పర నిందారోపణలు పక్కనపెడితే, కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు. దేశ రాజధానిలో కాలుష్య నియంత్రణ చర్యలు ఫలితమివ్వకపోవడానికి... ఢిల్లీకీ, పొరుగు రాష్ట్రాలకూ మధ్య సమన్వయ లోపం ఓ ప్రధాన కారణం. ఇక, ఢిల్లీలోని ‘ఆప్’ ప్రభుత్వ వైఫల్యాలు సరేసరి. పండుగ వచ్చే ముందు ప్రతిసారీ ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేయడం, మార్గదర్శకాలు జారీ చేయడం షరా మామూలే. అవన్నీ వట్టి కంటి తుడుపు చర్యలే అవుతున్నాయి. ఏటా ఈ సీజన్లో ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పంట వ్యర్థాల దహనంలోనూ ఇదే జరుగుతోంది. చట్టాలు చేసినా సరే పంజాబ్, హర్యానా సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం ఆగింది లేదు. ఒక్క పంజాబ్‌లోనే సెప్టెంబర్ 15 నుంచి ఇప్పటికి 28 వేలకు పైగా దహనాల ఘటనలు జరిగినట్టు లెక్క. ఫలితంగా హర్యానా లాంటి చోట్ల వాయు నాణ్యతా సూచి ‘అల్ప’, ‘అత్యల్ప’ స్థాయుల్లోనే కొనసాగుతోంది. అనారోగ్యాన్ని మరింత పెంచే ఈ కాలుష్య విషాన్ని తట్టుకోలేక కాంగ్రెస్ నేత సోనియా లాంటి వారు నిరుడు గోవా, ఈసారి జైపూర్‌లకు తరలిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ పర్యావరణ పరిరక్షణ పట్ల మన చిత్తశుద్ధి లేమికి ప్రతీకలు. పంట వ్యర్థాలు, దీపావళి టపాసుల విషయంలోనే కాదు... వినాయక చవితి, విజయదశమి వేళ దేవతా విగ్రహాల నిమజ్జనంలోనూ ఇదే తంతు. హైదరాబాద్ లాంటి చోట్ల హుస్సేన్‌సాగర్‌లో మట్టి విగ్రహాలే నిమజ్జనం చేయాలని ఏటేటా కోర్టు ఆదేశాలిస్తున్నాయి. ప్రభుత్వాలు సరేనని తలూపుతున్నాయి. క్షేత్రస్థాయిలో జరు గుతున్నది మాత్రం వేరు. కాలుష్యకారక విగ్రహాలతో ఒకటికి మూడు రోజులు సచివాలయం సాక్షిగా నిమజ్జనాలు నడుస్తుంటాయి. సంప్రదాయాల్ని పాటించాల్సిందే. కానీ, పెరిగిన కాలుష్య ప్రమాదం దృష్ట్యా వాటిని పర్యావరణ అనుకూలంగా మార్చుకోవడం ముఖ్యం. తాగే నీరు, పీల్చే గాలిని ప్రాణాంతకంగా మార్చుకొమ్మని ఏ ధర్మమూ బోధించదు. అది గ్రహించి, మారాల్సింది మనమే! సమాజంలో మార్పు రాత్రికి రాత్రి వస్తుందనుకోలేం. టపాసుల సంరంభాన్నీ, విగ్రహాల ఆర్భా టాన్నీ తగ్గించుకొమ్మని ప్రజలను కోరే ముందు ప్రభుత్వాలు చిత్తశుద్ధి కనబరచాలి. ఆదేశాలన్నీ అప్పటికప్పుడు తీసుకుంటున్న అత్యవసర చర్యలుగా కనిపిస్తే లాభం లేదు. పాఠాల్లో భాగంగా టీచర్ల ద్వారా పిల్లలకు అవగాహన పెంచాలి. నివాసగృహాల అసోసియేషన్లను పర్యావరణహిత చర్యల్లో భాగం చేయాలి. పర్యావరణం, ప్రజారోగ్యం అందరి బాధ్యత గనక కేంద్రం, రాష్ట్రాలు ఒక దానిపై మరొకటి నెపం మోపడం సరికాదు. ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షాలూ సహకరించడమే దీనికి సరైన పరిష్కార మార్గం. మునిసిపాలిటీ, అసెంబ్లీ నుంచి పార్లమెంట్ వరకు అందరూ కలసికట్టుగా నడవాలి. ఊపిరాడని దేశ రాజధానిలో ముందుగా ఆ అడుగులు పడాలి. -
దేశరాజధానిలో తీవ్ర వాయు కాలుష్యం
-
ఢిల్లీలో అత్యంత దారుణ పరిస్థితులు- అనధికార ఎమర్జెన్సీ
-
ఢిల్లీపై దీపావళి ఎఫెక్ట్..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగర ప్రాంతంలో వర్షాలతో కాస్తంత తగ్గుముఖం పట్టిన వాయు కాలుష్యం..దీపావళి పండుగతో మళ్లీ విజృంభించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పక్కన పెట్టి మరీ ఢిల్లీ ప్రజలు టపాసులు కాల్చడంతో సోమవారం తెల్లవారుజాముకు వాయు నాణత్య సూచీ(ఏక్యూఐ)500 పాయింట్లకు చేరుకుంది. టపాసుల పొగకు మంచు తోడవ్వడంతో ఢిల్లీలోని రోడ్లన్నీ కాలుష్యంతో చీకట్లు కమ్ముకున్నాయి. ఎదురుగా వస్తున్న సైతం వాహనాలు కనిపించని స్థాయికి వాయు కాలుష్యం చేరడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల హరియాణా, రాజస్థాన్, యూపీ, పంజాబ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాలి్చవేతల కారణంగా ఢిల్లీ నగరం కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. పంట వ్యర్థాల దహనాన్ని ఆపేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదా కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆయా ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలిచి్చంది. ఢిల్లీలో ఎటువంటి బాణసంచా కాల్చొద్దంటూ సూచనలు చేసింది. అయితే, ప్రజలు ఈ సూచనలను లెక్కచేయకుండా దీపావళి రోజు బాణసంచాను యథా ప్రకారంగా కాల్చేశారు. ఫలితంగా నగరంలోని చాలా చోట్ల వాయు నాణ్యత (ఏక్యూఐ) 500పైగా నమోదయింది. అక్కడక్కడా 900 వరకూ చేరడం గమనార్హం. సోమవారం ఉదయం 6 గంటలకు అత్యధికంగా లజ్‌పత్ నగర్లో 959, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ప్రాంతంలో 910, కరోల్ బాగ్ ప్రాంతంలో 779 వరకు నమోదైంది. వాహనదారులపై 1, 93, 585 చలాన్ల జారీ రాజధానిలో వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఈనెల 7న ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతిరోజూ 3వేలకు పైగా వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 385 ఎన్ఫోర్స్మెంట్ బృందాలు నగర వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నట్లు వివరించింది. అక్టోబర్ 31వ తేదీ వరకు కాలుష్య ఉల్లంఘనలపై 1, 93, 585 చలాన్లు జారీ చేయగా..10 నుంచి 15ఏళ్ల నాటి 32 డీజిల్, పెట్రోల్ వాహనాలతోపాటు 15 ఏళ్ల కంటే పాతవైన మరో 14, 885 వాహనాలను సైతం సీజ్ చేసినట్లు న్యాయస్థానానికి సమరి్పంచిన నివేదికలో తాజాగా ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. -
Delhi Air pollution: ఉదయం నడక మానండి.. టపాసులు కాల్చకండి..
న్యూఢిల్లీ: ఉదయం నడక మానండి..టపాసులు కాల్చకండి..ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోండి.. వాయు కాలుష్యం కొనసాగుతున్న వేళ దేశ రాజధాని వాసులకు ఢిల్లీ ఆరోగ్య శాఖ జారీ చేసిన సూచనలివి. శనివారం అన్ని ప్రధాన వార్తాపత్రికల్లో ఈ మేరకు సూచనలు ప్రచురించింది. ఇక కాలుష్యంతో రెండు వారాలుగా ఇబ్బంది పడుతున్న జనానికి వర్షం ఊరట ఇచ్చింది. దేశ రాజధాని ప్రాంతంలో గురువారం వాయు నాణ్యత ఇండెక్స్(ఏక్యూఐ) 437 కాగా, శనివారం ఉదయం ఏక్యూఐ 219కి పడిపోయింది. -
వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి.. ఢిల్లీ వాసులకు స్వల్ప ఊరట
న్యూఢిల్లీ: రోజురోజుకీ పెరిగిపోతున్న వాయు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ వాసులకు తాజాగా స్వల్ప ఊరట కలిగింది. ఢిల్లీతో సహ నోయిడా, గురుగ్రామ్, ఎన్సీఆర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి ఓ మోస్తారు వాన పడింది. ఇది రాజధానానిలో వాతావరణంలో అకస్మాత్తుగా మార్పుకు దారితీసింది. గాలిలో ఉన్న విషపూరిత వాయులు కొంత వరకు క్లీన్ అయ్యాయి. గాలి నాణ్యత సూచి కూడా స్పల్పంగా మెరుగుపడింది. శుక్రవారం ఉదయంనాటికి దిల్లీలో సగటు గాలి నాణ్యత సూచీ (AQI) 408కి తగ్గింది. నిన్న సాయంత్రం ఇది 437గా నమోదైంది. శుక్రవారం కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించడంతో ఢీల్లి కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. కర్తవ్య పాత్, ఐటీఓ, ఢిల్లీ-నోయిడా సరిహద్దు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా పడిన వర్షపు జల్లులకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. ఢిల్లీ వ్యాప్యంగా చాలా చోట్ల గురువారం రాత్రి వరకు 400+ ఉన్న గాలి నాణ్యత సూచీ ఆ తరువాత 100 కంటే తక్కువ నమోదైంది. The much needed... Such a fresh breath!! It's windy, rains all the way in various parts of #Delhi #Gurgaon #Rohtak #Faridabad #Noida #Ghaziabad,#AQI going down naturally. Thank you western disturbance! #DelhiRains pic.twitter.com/Zc2Egbtn4m — Weatherman Navdeep Dahiya (@navdeepdahiya55) November 9, 2023 కాగా ఢిల్లీ–ఎన్సీఆర్ (దేశ రాజధాని ప్రాంతం)లో గత వారం రోజులుగా కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. వాయు కాలుష్యం పెరగడం, నాణ్యత సూచీ పడిపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏడేళ్ళ తర్వాత కాలుష్యం దెబ్బతో స్కూళ్ళు మూతబడ్డాయి. ఇప్పటికే ఆఫీసులకు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టారు. దట్టమైన పొగ నిండిన రోడ్లతో, గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ, ముక్కులకు మాస్కులు తగిలించుకొని సాహసించి జనం బయటకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. చదవండి: కశ్మీర్లో విపరీతమైన మంచు.. రహదారుల మూసివేత పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతోపాటు, వాహనాల నుంచి వెలవడే పొగ ఢిల్లీలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అటు కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఉన్నంతలో వాహన కాలుష్యాన్ని తగ్గించాలని ఈ నెల 13 నుంచి సరి – బేసి విధానం పాటిస్తామని కేజ్రీవాల్ సర్కార్ ప్రకటించింది. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు, గాలి నాణ్యతను పెంచేందుకు దేశ రాజధానిలో కృత్రిమ వర్షం కురిపించాలని ఆలోచన చేసింది. నవంబర్ 20 నుంచి 21 వరకు రెండు రోజుల పాటు ఢిల్లీలో కృత్రిమ వర్షం కురిపించాలని నిర్ణయించింది. ఈలోగానే వర్షాలు కురుస్తుండటం ప్రజలు, ప్రభుత్వానికి కాస్త ఉపశమనం లభించినట్లైంది. -
ఢిల్లీలో ముందుగానే చలికాలం సెలవుల ప్రకటన
దేశ రాజధాని నగరంలో వాయు కాలుష్యం తీవ్రత పెరుగుతుండంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరడంతో ఢిల్లీలోని విద్యాసంస్థలకు సెలవుల్ని పొడిగించింది. నవంబర్ 09 నుంచి 18 దాకా సెలవులు ఉంటాయని ప్రకటిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలో గత ఆరురోజులుగా విషపూరిత వాయువులు వాతావరణాన్ని కమ్మేశాయి. రాబోయే కొద్ది రోజుల్లోనూ ఈ పరిస్థితిలో మార్పు ఉండకపోవచ్చని.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి నగరానికి ఉపశమనం లభించకపోవచ్చని ఢిల్లీ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ బుధవారం ఒక ప్రకటనలో అభిప్రాయపడింది. సాధారణంగా డిసెంబర్-జనవరిలో చలి తీవ్రత దృష్ట్యా సెలవులు ఇస్తుంది అక్కడి ప్రభుత్వం. అయితే ఈసారి ఆ సెలవుల్ని కాలుష్యం నేపథ్యంలో ముందుకు జరిపినట్లు ఢిల్లీ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ స్పష్టం చేసింది. బుధవారం పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విద్యాశాఖ మంత్రి అతిషి, రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోట్, ఢిల్లీ ప్రభుత్వ సీనియర్ అధికారులు హాజరై .. స్కూళ్ల సెలవులపై నిర్ణయం తీసుకున్నారు. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. 10, 12వ తరగతులకు మినహా మిగతా అక్కడి తరగతుల విద్యార్థులు ఈ శుక్రవారం(నవంబర్ 10) తేదీ వరకు స్కూళ్లకు హాజరు కానక్కర్లేదని(ఫిజికల్ క్లాస్‌లకు మాత్రమే) ఆదేశించింది. అయితే పరిస్థితి తీవ్రతరం అవుతుండడంతో తాజాగా సెలవుల్ని పొడిగించింది. దేశ రాజధానిలో కాలుష్యం స్థాయిలు ఈ సీజన్లో తొలిసారి తీవ్రమైన జోన్లోకి ప్రవేశించాయి. వచ్చే రెండు వారాల్లో మరింత పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలోని 37 మానిటరింగ్ స్టేషన్లలో కనీసం 18 కేంద్రాల్లో వాయు నాణ్యత సూచీ (AQI) ‘తీవ్రమైన’ విభాగంలో నమోదు కావడం గమనార్హం. నగర వాసుల మెడపై వేలాడుతున్న కాలుష్య కత్తిని తప్పించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది, కానీ ఆ ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు 395 ఉన్న AQI.. బుధవారం ఉదయానికి 421కి చేరింది. దేశ రాజధాని ప్రాంతంలోని నోయిడా 409 వద్ద వాయు నాణ్యత సూచీ నమోదు అయ్యింది. ఇదీ చదవండి: ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించడానికి ఆనంద్ మహీంద్రా చక్కని ఉపాయం -
ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్
-
ఈ నగరానికి ఏమైంది?
ప్రభుత్వాల మధ్య ఆరోపణల పర్వం వింత కాకపోవచ్చు. కానీ, పర్యావరణ అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిందారోపణలు సాగడం విచిత్రమే. దేశ రాజధానిలోని వాయు కాలుష్యం వ్యవహారంలో ఇప్పుడు కేంద్రానికీ, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికీ నడుమ చోటుచేసుకుంటున్నది అదే. ఢిల్లీ – ఎన్సీఆర్ (దేశ రాజధాని ప్రాంతం)లో మంగళవారం సైతం వాయునాణ్యత ‘తీవ్ర ఆందోళన దశ’లో ఉన్న వేళ... చివరకు సర్వోన్నత న్యాయస్థానం సైతం జోక్యం చేసుకుంది. వాయు కాలుష్యాన్ని ఓ రాజకీయ పోరుగా మార్చరాదనీ, గాలి నాణ్యత ప్రజారోగ్యాన్ని హత్య చేస్తోందనీ న్యాయస్థానం చెప్పాల్సి వచ్చింది. పొరుగున పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లలో పంట వ్యర్థాలను తగలబెట్టడమే ఏటా చలికాలంలో ఢిల్లీ వాయు కాలుష్యానికి ప్రధాన కారణమని కోర్ట్ అభిప్రాయపడింది. రాష్ట్రాలన్నీ ఈ కొయ్యకాళ్ళ దహనాన్ని ఆపాలని ఆదేశించింది. ఢిల్లీలో కాలుష్యం తగ్గించడానికి సరి – బేసి వాహనాల ట్రాఫిక్ నియంత్రణ విధానాన్ని మళ్ళీ తేవాలన్న ఢిల్లీ ఆప్ సర్కార్ నిర్ణయం కంటితుడుపేనని కోర్ట్ కుండబద్దలు కొట్టడం పరాకాష్ఠ. ఢిల్లీ పరిసరాల్లో వాయునాణ్యత తృప్తికరమైన దాని కన్నా నాలుగు రెట్లు క్షీణించి, మంగళవారం సైతం వాయు నాణ్యత సూచి దాదాపు 400 మార్కుకు దగ్గరగా నిలిచిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డ్ మాట. ఏడేళ్ళ తర్వాత కాలుష్యం దెబ్బతో స్కూళ్ళు మూతబడ్డాయి. ఇప్పటికే ఆఫీసులకు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టారు. దట్టమైన పొగ నిండిన రోడ్లతో, గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ, ముక్కులకు మాస్కులు తగిలించుకొని సాహసించి జనం బయటకు రావాల్సిన పరిస్థితి. ఈ కాలుష్య బాధ నుంచి తప్పించుకోవడానికి ఇప్పటికే పెద్ద సంఖ్యలో పర్యాటకులు హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకు తరలిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో తిరిగాయి. మనుషులే కాదు మూగజీవాలైన పక్షులూ పెద్దయెత్తున అనారోగ్యం పాలవుతున్న పరిస్థితి. ఉన్నంతలో వాహన కాలుష్యాన్ని తగ్గించాలని ఈ నెల 13 నుంచి సరి – బేసి విధానం పాటిస్తామని ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. 2019 తర్వాత ఢిల్లీలో మళ్ళీ ఈ పద్ధతిని తేవడం ఇదే తొలిసారి. పరిస్థితి తీవ్రతకు ఇది ప్రతీక. ఢిల్లీలో వాయు కాలుష్యం స్థాయి ఒక్కసారిగా పెరిగిపోవడం, పరిసర రాష్ట్రాల్లో కొయ్యకాళ్ళను కాల్చడం లాంటివి కనీసం పదేళ్ళుగా చూస్తున్నాం. కొన్నేళ్ళుగా ఇది రాజకీయ అంశమూ అయింది. పంట వ్యర్థాలను తగలబెడుతున్నవారిపై చర్యలు తీసుకోవడంలో పొరుగున ప్రత్యర్థి పార్టీలు అధికా రంలో ఉన్న పంజాబ్, హర్యానాలు విఫలమవుతున్నాయని ఢిల్లీ ఆప్ సర్కార్ గతంలో ఆరోపిస్తూ వచ్చింది. ఇప్పుడు పంజాబ్‌లో సొంత సర్కారే ఉన్నా, పరిస్థితిలో మార్పు లేదు. విడ్డూరమేంటంటే, పర్యావరణ అంశాలకు వచ్చేసరికి సుప్రీమ్ కోర్టే ప్రతిసారీ జోక్యం చేసుకోవాల్సి రావడం! ‘పర్యావ రణ పరిరక్షణ కోర్టు బాధ్యత అనుకోవడం తప్పు. వాయు, శబ్ద కాలుష్య నియంత్రణ బాధ్యత ప్రతి ఒక్కరిదీ’ అని సుప్రీమ్ మరో కేసులోనూ హితవు పలకాల్సొ చ్చింది. టపాసుల్లో నిర్ణీత రసాయనాల వాడకంపై నిషేధం ఢిల్లీకే కాక, అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుందని కుండబద్దలు కొట్టాల్సి వచ్చింది. రాజధానిలో ఇంత రచ్చ జరుగుతున్నా, పంజాబ్ లాంటి చోట్ల ఇప్పటికీ యథేచ్ఛగా మోళ్ళ కాల్చివేత కొనసాగుతూనే ఉంది. ఇటీవల పంజాబ్‌లో ఈ దహనాలు 740 శాతం మేర హెచ్చాయి. ఒకే రోజు వెయ్యి నుంచి 3 వేల పైగా అలాంటి ఘటనలు రికార్డవుతున్నాయి. ఫలితంగా ఏటా నవంబర్, జనవరి మధ్యన ఢిల్లీ వాయునాణ్యత దారుణంగా పడిపోవడం రివాజైంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు తప్పును పక్కవారి మీదకు నెట్టివేస్తే లాభం లేదు. ఢిల్లీలోని ఈ వాయు కాలుష్యాన్ని జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలి. స్థానిక అవసరాలు, దీర్ఘకాలిక సంప్రదాయా లను దృష్టిలో పెట్టుకొంటూనే మోళ్ళను కాల్చడాన్ని నిషేధిస్తూ, కేంద్ర స్థాయిలో చట్టం తీసుకు రావచ్చు. దశాబ్దాల క్రితమే అమెరికా లాంటి చోట్ల తెచ్చిన కఠినమైన చట్టాలు ఫలితాన్నిచ్చాయి. అయితే, పంజాబ్ లాంటి చోట్ల మోళ్ళ కాల్చివేతను నిషేధిస్తూ, చట్టమున్నా అమలు శూన్యం. అందుకే, వట్టి చట్టం చేయడం కన్నా అందరూ పాటించే ఆచరణాత్మక మార్గం చూడడం ఉత్తమం. నిజానికి, ఖరీఫ్‌లోని పంట కోత తర్వాత, రబీ సీజన్‌కు 10 నుంచి 14 రోజుల్లో రైతులు త్వరితగతిన పొలాల్ని సిద్ధం చేయాలి. అందుకు వరి మోళ్ళను తగులబెట్టడమే మార్గమని వారి భావన. ఈ పరిస్థితుల్లో హానికారక కాలుష్యంపై చైతన్యం పెంచాలి. పంట వ్యర్థాలను వదిలించుకొనేందుకు ఆధునిక ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలి. దాదాపు 3.3 కోట్ల జనాభాకు నివాసమైన దేశ రాజధాని ఇవాళ ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరిత నగరం. ఈ గాలి పీల్చడం వల్ల ఢిల్లీ వాసులకు శ్వాసకోశ వ్యాధులు రావడమే కాదు, సగటు ఆయుర్దాయం దాదాపు 11.9 ఏళ్ళు తగ్గుతోందని చికాగో విశ్వవిద్యాలయ అధ్యయనం. గతంలో బీజింగ్, లండన్ లాంటివీ ఈ సమస్యను ఎదుర్కొని బయటపడ్డవే. వారి అనుభవాల నుంచి పాఠాలు నేర్వాలి. ఢిల్లీలో స్మోక్ టవర్ల ఏర్పాటును పెంచాలి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగేలా సబ్సిడీలతో ప్రోత్సహించాలి. కేంద్రం సైతం వాయుకాలుష్య పరిష్కారం తన బాధ్యత కాదని చేతులు దులుపు కోలేదు. ముందుకొచ్చి, నిర్ణీత బడ్జెట్ కేటాయింపుతో సమస్య తీవ్రత ఉన్న ఢిల్లీ లాంటి రాష్ట్రాలకు అండగా నిలవాలి. ఢిల్లీ లాంటి చోట్ల బయో డీకంపోజర్లను తెస్తామంటూ భారీ వాగ్దానాలు, ప్రచారం చేసి ఇప్పుడా ఊసే ఎత్తని పాలకపక్షాలు సమన్వయంతో సమగ్ర కార్యాచరణకు దిగితేనే సత్ఫలితాలు వస్తాయి. లేదంటే, ప్రతి ఏటా ఇదే వాయు కాలుష్యం మాట వినాల్సి వస్తుంది. -
కాలుష్యంపై మీకు ఏం పట్టింపు లేదా..?
ఢిల్లీ: పంట వ్యర్థాల దహనాలపై ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ప్రతిఏటా దేశ రాజధానిని కాలుష్య కాసారంగా తయారుచేయడం సరికాదని తెలిపింది. పీల్చే గాలిని కలుషితం చేయడం ప్రజలను హత్య చేయడమేనని సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమస్యకు పరిష్కారమే లేదా? ఇది మీకు ఏం పట్టదా..? అని ప్రశ్నించింది. ఈ సమస్యపై చర్చించడానికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలు సమావేశం నిర్వహించాలని కోరింది. శుక్రవారం నాటికి ఏదో ఒక పరిష్కారం ఇవ్వాలని గడువు విధించింది. "పంజాబ్, హర్యానా సహా పొరుగురాష్ట్రాల్లో పంట అవశేషాలను తగులబెట్టడం వల్ల ప్రతి శీతాకాలంలో ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరగడానికి ప్రధాన కారణం. పంట వ్యర్థాలు కాల్చడం ఆపేందుకు చర్యలు తీసుకోవాలి. దీన్ని ఎలా నిలిపివేస్తారో మాకు తెలియదు. అది మీ పని. ఢిల్లీ కాలుష్యం తగ్గేందుకు వెంటనే ఏదో ఒకటి చేయండి" అని కోర్టు ఆదేశించింది. ఢిల్లీ వాయు కాలుష్యం రాజకీయ చర్చ కారాదని జస్టిస్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. కాలుష్యంతో పిల్లల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 20-50 రోజులు మాత్రమే తమ రాష్ట్రంలో పంట వ్యర్థాల కాల్చివేతలు ఉంటాయని పంజాబ్ అటార్ని జనరల్ తెలిపిన క్రమంలో ఇది అదే సమయమని తెలిపిన జస్టిస్ కౌల్.. కాలుష్యంపై అలసత్వం వహిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. బలవంతంగానైనా, ప్రోత్సాహకాల ద్వారానైనా పంట వ్యర్థాల కాల్చివేతలను తక్షణం నిలిపివేయాలని ఆదేశించారు. కాలుష్యానికి వాహనాలు కూడా ప్రధాన కారణం అవుతున్నందున.. ఢిల్లీలోకి వెహికిల్స్ రాకుండా చర్యలు తీసుకోవాలని జస్టిస్ కౌల్ ధర్మాసనం కోరింది. పంట వ్యర్థాల కాల్చివేతలపై స్పందిస్తూ.. పంట మార్పిడి విధానాలను అనుసరించాలని సూచించింది. ఏదేమైనా ఈ అంశంపై ఓర్పు వహించే అవకాశమే లేదని న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: Delhi Air Pollution Updates: ఢిల్లీలో మళ్లీ సరి–బేసి విధానం -
ప్రమాదస్థాయిలో వాయు కాలుష్యం.. ఢిల్లీలో మళ్లీ సరి-బేసి విధానం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. రోజురోజుకీ వాయు నాణ్యత దారుణంగా పడిపోతుంది. మితిమీరిన కాలుష్యంతో నగర వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నగరాన్ని పొగ మంచు కమ్మేసింది. గత నాలుగు రోజులు కాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతోంది. కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో వాయు నాణ్యత సూచీలు క్రమేపీ క్షీణిస్తున్నాయి. సోమవారం వాయు నాణ్యత సూచి(ఏక్యూఐ) 437కు చేరిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది. ఈ క్రమంలో కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో మరోసారి సరి- బేసి విధానాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. నవంబర్ 13 నుంచి 20 వరకు ఈ విధానం అమల్లో ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఈ విధానం ప్రకారం.. వాహన రిజిస్ట్రేషన్ నంబరు చివర సరి సంఖ్య ఉన్న వాహనాలు ఒక రోజు, బేసి సంఖ్య ఉన్న వాహనాలు మరో రోజు రోడ్లపైకి రావాల్సి ఉంటుంది. ఈ మేరకు దేశ రాజధానిలో కాలుష్య సంక్షోభంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో పర్యావరణవాఖ మంత్రి గోపాల్ రాయ్ సోమవారం సంబంధిత అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే సరి-బేసిపై నిర్ణయం తీసుకున్నారు. అంతకముందు వెల్లడించిన దాని ప్రకారం BS3 పెట్రోల్, BS4 డీసిల్ కార్లను నిషేధం సైతం కొనసాగుతుందని మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఇక ఢిల్లీలో ప్రస్తుతం ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని మంత్రి ఆదేశించారు. పాఠశాలలను కూడా మూసివేయాలని నిర్ణయించారు. 10, 12వ తరగతులు మినహాయించి మిగతా అన్ని పాఠశాలలు నవంబర్ 10 వరకు ఉంటాయని తెలిపారు. ఇప్పటివరకు ప్రాథమిక పాఠశాలలకు మాత్రమే సెలవులు ప్రకటించగా.. ఇప్పుడు ఉన్నత పాఠశాలలను కూడా మూసివేస్తున్నట్లు వెల్లడించారు. అయితే 6 నుంచి 12 తరగతుల విద్యార్థులకు పాఠశాలలు తమ అనుకూలతను బట్టి ఆన్లైన్ క్లాస్‌లు నిర్వహించుకోవచ్చని సూచించారు. చదవండి: వాయు కాలుష్యంతో క్యాన్సర్? ‘ఎయిమ్స్’ నిపుణులు ఏమంటున్నారు? -
వాయు కాలుష్యంతో క్యాన్సర్? ‘ఎయిమ్స్’ నిపుణులు ఏమంటున్నారు?
దేశరాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్లో వాయు నాణ్యత సూచిక ‘తీవ్రమైన’ విభాగంలోనే కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ నిలిచింది. ఇక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకునేందుకు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపధ్యంలో వైద్య నిపుణులు ఆరోగ్యంపై వాయు కాలుష్యానికి సంబంధించిన ప్రమాదకరమైన ప్రభావాల గురించి తెలియజేశారు. డాక్టర్ పీయూష్ రంజన్ (అడిషనల్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్, ఎయిమ్స్) మీడియాతో మాట్లాడుతూ వాయు కాలుష్యం- వివిధ రకాల క్యాన్సర్ల మధ్యగల సంబంధానికి సంబంధించి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని అన్నారు. శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతినడం, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి కరోనరీ ఆర్టరీ వ్యాధులతో వాయు కాలుష్యానికి ప్రత్యక్ష సంబంధం ఉందని ఆయన తెలిపారు. వాయు కాలుష్యం విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే మెదడు, గుండె దెబ్బతినే అవకాశాలున్నాయని, ఇది అన్ని వయసులవారిలో సంభవించవచ్చన్నారు. ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక ఆదివారం వరుసగా నాల్గవ రోజు కూడా ‘తీవ్రమైన’ విభాగంలోనే ఉంది. ఈ పరిస్థితి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాణాంతకంగా పరిణమించే అవకాశాలున్నాయని, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: మహావినాశనం ముందుంది? ఖచ్చితమైన అంచనాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు! -
ఢిల్లీలో జనం ఉక్కిరిబిక్కిరి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం బెంబేలెత్తిస్తోంది. వాయు నాణ్యత పడిపోతోంది. వరుసగా ఆరో రోజు ఆదివారం సైతం పొగ మంచు దట్టంగా కమ్మేసింది. నగరంలో కాలుష్యం మరోసారి ‘అత్యంత తీవ్రం’ కేటగిరీలోకి చేరింది. ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) శనివారం సాయంత్రం 4 గంటలకు 415 ఉండగా, ఆదివారం ఉదయం 7 గంటలకు 460గా దిగజారింది. కలుíÙత గాలితో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఢిల్లీలో ప్రాథమిక పాఠశాలలకు సెలవులను ప్రభుత్వం మరో ఐదు రోజులపాటు పొడిగించింది. ఈ నెల 10వ తేదీ వరకు సెలవులను పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. 6 నుంచి 12వ తరగతి వరకు స్కూళ్లు తెరిచే ఉంటాయని పేర్కొంది. విద్యార్థులు ఆన్లైన్ తరగతులు కూడా వినవచ్చని ఢిల్లీ విద్యా శాఖ మంత్రి సూచించారు. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండడం, పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాలో పంట వ్యర్థాలను దహనం చేస్తుండడంతో ఢిల్లీలో వాయు నాణ్యత పడిపోతోంది. ప్రపంచంలోని వివిధ దేశాల రాజధానుల కంటే ఢిల్లీలో వాయు నాణ్యత అత్యంత దారుణంగా ఉన్నట్లు ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది. వాణిజ్య వాహనాలకు నో ఎంట్రీ ఢిల్లీలో వాయు నాణ్యత నానాటికీ పడిపోతుండడం, కాలుష్యం పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని నిర్మాణ పనులపై నిషేధం విధిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కాలుష్యానికి కారణమయ్యే రవాణా వాహనాలు, వాణిజ్య వాహనాల ప్రవేశాన్ని నిషేధించింది. -
ఢిల్లీ: వాయు కాలుష్యం ఎఫెక్ట్.. స్కూల్స్ బంద్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది. వరుసగా మూడోరోజు వాయు కాలుష్యం అతి తీవ్రస్థాయిలోనే ఉంది. ఆదివారం ఉదయం వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 401కి చేరింది. మరోవైపు.. శనివారం జహంగీర్‌పురి ప్రాంతంలో ఈ సూచీ 702, సోనియా విహార్‌లో 618కి పడిపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. దీంతో, అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. వాయు కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీలోని అన్ని ప్రైమరీ స్కూల్స్‌ను నవంబర్ 10వ తేదీ మూసివేస్తున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ నేత, విద్యాశాఖ మంత్రి అతిషి తెలిపారు. అలాగే, 6-12వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాస్‌లు నిర్వహించనున్నట్టు ఆమె స్పష్టం చేశారు. "As pollution levels continue to remain high, primary schools in Delhi will stay closed till 10th November. For grade 6-12, schools are being given the option of shifting to online classes," tweets Delhi Education Minister Atishi pic.twitter.com/fNw8DeKgbP — ANI (@ANI) November 5, 2023 మరోవైపు.. ఢిల్లీలో గాలిలో విషవాయువుల గాఢత (పీఎం) 2.5 స్థాయిలో ఉండటం.. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) జారీ చేసిన ప్రమాణాల కంటే 80 రెట్లు అధికం. ఈ గాలిని పీల్చడంతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పాటు కంటి దురద, శ్వాసకోశ సంబంధిత రోగాల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాన్ని అతి తీవ్ర కాలుష్య జోన్‌గా గుర్తించారు. రెండు వారాలపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం, అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఈ కాలుష్యానికి కారణమయ్యాయి. #WATCH | Delhi: ANI drone camera footage from the Kalindi Kunj area shows a thick layer of haze in the air. Visuals shot at 9:15 am today. The air quality in Delhi continues to be in the 'Severe' category as per CPCB (Central Pollution Control Board). pic.twitter.com/6yfIjGq0kV — ANI (@ANI) November 5, 2023 #WATCH | The air quality in Delhi continues to be in the 'Severe' category as per CPCB (Central Pollution Control Board). (Visuals from Chanakyapuri area, shot at 8:40 am) pic.twitter.com/aWTVUauThG — ANI (@ANI) November 5, 2023 -
డేంజర్ బెల్స్ : టెక్ కంపెనీల కీలక చర్యలు
ఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీ కాలుష్య కాసారంలో చిక్కి విలవిల్లాడుతోంది. మితిమీరిన కాలుష్యంతో గాలి నాణ్యత రోజు రోజుకు క్షీణిస్తోంది. శుక్రవారం సాయంత్రానికి మరింత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. వాయు నాణ్యత సూచి(ఏక్యూఐ) 151కి చేరింది. ఇది చాలా అనారోగ్యకరమైందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన పరిమితి కంటే 6.3 రెట్లు ఎక్కువ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే నగరాన్ని పొగమంచు కప్పేయడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ సందర్బంగా పలు టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని కోరినట్టు తెలుస్తోంది. దట్టమైన విషపూరిత పొగమంచు కప్పివేయడంతో శ్వాసకోశ , హృదయ సంబంధిత సమస్యలకు కారణమ వుతుందన్న ఆందోళన నేపథ్యంలో ఇంటి నుండి పని చేయడం, ప్రాంగణంలో ఎయిర్ ప్యూరిఫైయర్లు, ఆన్లైన్లో వైద్య సలహాలు లాంటి అనేక చర్యలు చేపట్టినట్టు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. డెలాయిట్, కేపీఎంజీ, పానసోనిక్, బిగ్ బాస్కెట్, బ్లూ స్మార్ట్, Zepto , CIEL HR సర్వీసెస్‌తో సహా డజనుకు పైగా కంపెనీలు ఈ మేరకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఉద్యోగులు ఇంటి నుండి పని చేయవచ్చని డెలాయిట్ తెలిపింది. అనారోగ్యంగా ఉన్న ఉద్యోగులు వెల్ బీయింగ్ డే ఆఫ్ ఆఫర్ చేసినట్టు పేర్కొంది. రైడ్-షేరింగ్ కంపెనీ బ్లూస్మార్ట్ పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించేలా ఉద్యోగులకు సబ్సిడీ అందిస్తోంది. అలాగే ఉద్యోగులు ఎవరికైనా అనారోగ్యంగా అనిపిస్తే రిమోట్‌గా పని చేయవచ్చని పానసోనిక్ తన సిబ్బందికి తెలిపింది. దీంతోపాటు మాస్క్‌లు ధరించడం, హైడ్రేటెడ్‌గా ఉండటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సేల్స్ టీమ్‌కు సూచించినట్లు నివేదిక తెలిపింది. క్విక్ కామర్స్ స్టార్టప్ Zepto తన రైడర్లకు N95 మాస్క్‌లను అందించింది. ఆన్-కాల్ మెడికల్ సపోర్టును అందిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితికి సంస్థ నిర్దిష్ట చర్యలను అమలు చేయలేదని, అవసరమైతే ఉద్యోగులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్టు మేక్మైట్రిప్ చీఫ్ హెచ్ఆర్ శివరాజ్ శ్రీవాస్తవ తెలిపారు. కాగా జాతీయ రాజధాని ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఢిల్లీలో పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రధానంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 500 మార్కును అధిగమించడంతో ప్రాథమిక పాఠశాలలను మూసివేశారు. నిర్మాణ పనులపై ఆంక్షలు విధించారు. లైట్ కమర్షియల్ వాహనాలు, డీజిల్ ట్రక్కుల రాకపోకలను నిషేధించారు. భవన నిర్మాణ పనులను, కూల్చివేతలను నిషేధిస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు. దీనిపై ఇప్పటికే అత్యసరం సమావేశాన్ని నిర్వహించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పలు కీలక చర్యల్ని చేపట్టిన సంగతి తెలిసిందే. -
రోజు రోజుకు దిగజారుతోంది..పట్టించుకోరా: బాంబే హైకోర్టు సీరియస్
ముంబై: నగరంలోని గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) క్షీణించడంపై బాంబే హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి డికె ఉపాధ్యాయ, జస్టిస్ ఆరిఫ్ డాక్టర్లతో కూడిన డివిజన్ బెంచ్ కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలు, బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్, మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఎంపీసీబీ), సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ)ల వివరణ కోరింది. ముంబైలో వాయు కాలుష్యం పెరిపోవడంపై నగరవాసులు ముగ్గురు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె.ఉపాధ్యాయ, జస్టిర్ ఆరిఫ్ డాక్టర్లతో కూడిన బెంచ్ ఈ అంశంపై విచారించింది. ‘‘నగరంలో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకున్నారో సంబంధిత అధికారులందరూ తెలియ జేయాలి’’ అని కోర్టు ఆదేశించింది తదుపరి విచారణను నవంబర్ ఆరవ తేదీకి వాయిదా వేసింది. నగరంలో కాలుష్యాన్ని అరికట్టడానికి, గాలి నాణ్యతను పెంచడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, బృహన్ముంబై పాలక సంఘాన్ని ఆదేశించాలని పిటిషనర్లు – అమర్ బాబాన్ టికే, ఆనంద్ ఝా మరియు సంజయ్ సర్వే – తమ వాజ్యంలో కోరారు. ముంబైలో విచ్చలవిడిగా నిర్మాణ కార్యకలాపాలు, తగినంత పచ్చదనం లేకపోవడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతోందని, ఇది నివాసితులపై, పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని వారు పిటిషన్లో ఆందోళన వ్యక్తం చేశారు. -
తగ్గిన గాలి నాణ్యత.. కాలుష్యంలో దేశ రాజధానిని దాటేసిన ముంబై
ముంబై: మళ్లీ ముంబై, ఢిల్లీ పోటీ పడ్డాయి. కానీ ఈసారి పోటీ పడింది వాయు కాలుష్యంలో. ఎప్పుడైనా వాయు కాలుష్యంలో ఢిల్లీ ముందుంటుంది. కానీ.. ఈసారి ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత 300 కంటే ఎక్కువగా నమోదు అయ్యింది. దేశ రాజధానిని ముంబై ఓడించినట్లు కనిపిస్తోంది. సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ డేటా ప్రకారం, బుధవారం ఉదయం 9 గంటలకు ముంబైలోని గాలి నాణ్యత 113 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)తో ‘మోడరేట్’ కేటగిరీలో నమోదు అయింది. అందుకు భిన్నంగా ఈ రోజు దేశ రాజధానిలో గాలి నాణ్యత మొత్తం 83తో ‘సంతృప్తికరమైన’ కేటగిరీలో ఉంది. ప్రమాదకర ప్రాంతాలు.. ముంబై గాలి నాణ్యత ఇండెక్స్ సఫర్ ప్రకారం, బాంద్రా కుర్లా ప్రాంతంలోని కాలానగర్‌లో గాలి నాణ్యత 178కి చేరుకుంది. వర్లీ, భాండూప్, బోరివలి వంటి ప్రాంతాల్లో వరుసగా 139, 131, 135 వద్ద నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) డేటా ప్రకారం, డియోనార్ వంటి ప్రాంతాల్లో గాలి నాణ్యత ఇండెక్స్ 216, చెంబూర్ 213 నమోదైంది. ముంబైలో మొత్తం గాలి నాణ్యత ‘మధ్యస్థంగా’ ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకరంగా నమోదైంది. అంధేరీ–346, నవీ ముంబై –311, మజ్గావ్–307 నమోదయ్యాయి. విలే పార్లే వెస్ట్ 331, అంధేరి ఈస్ట్ 343 నమోదైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నగర ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. గాలి నాణ్యత తక్కువగా ఉండటంతో ప్రజలు ఎక్కువగా బయట తిరగవద్దని, వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కృషి చేయాలని కోరింది. కాగా, పశ్చిమ కనుమల నుండి వీస్తున్న చల్లని గాలులు తీరం వెంబడి వెచ్చని గాలిని తాకడం వల్ల ఈ పొల్యూషన్ ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. గాలి నాణ్యత ప్రమాణాలు గాలి నాణ్యత ఇండెక్స్ 0 నుంచి 50 వరకు నమోదైతే సంతృప్తికరంగా ఉన్నట్టు. వాయు కాలుష్యం తక్కువగా ఉండి, ఎటువంటి ప్రమాదం ఉండదు. 51 నుంచి 100 కూడా కొంతమేరకు ఆమోదయోగ్యమైనది. 101 నుంచి 150 నమోదైతే ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రమాదం. 151 నుంచి 200 నమోదైతే ఆరోగ్య సమస్యలున్నవారితోపాటు సాధారణ ప్రజానీకం కూడా కొందరు ప్రభావితమవుతారు. 201 నుంచి 300 నమోదైతే మాత్రం ప్రమాదకర పరిస్థతి ఉన్నట్టు. ఇది సాధారణ ప్రజల మీద ఆరోగ్యం మీదా ప్రభావం చూపుతుంది. 301, ఆపైన నమోదైతే అత్యవసర పరిస్థితులు ఉన్నట్టు. గాలి కాలుష్యం ఈ మేరకు ఉంటే ప్రతి ఒక్కరూ అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. చదవండి: ‘గాజాలోని భారతీయుల తరలింపు.. ప్రస్తుతం కష్టమే’ -
కలవరపెడుతున్న కాంతి
సాక్షి, అమరావతి: ప్రపంచంలో ఇప్పుడు హాట్ టాపిక్.. వాయు కాలుష్యం. అలాగే శబ్ద కాలుష్యం గురించి కూడా మనకు తెలుసు. వీటితో తలెత్తే అనర్థాలపైన కూడా అవగాహన ఉంది. అయితే కాంతి కాలుష్యం (లైట్ పొల్యూషన్) గురించి మాత్రం అంతగా తెలియదు. అయితే దీనితో కూడా ప్రమాదమేనని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కాంతి కాలుష్యంపై తమ దేశంలో నిర్వహించిన పరిశోధనను చైనా తాజాగా వెల్లడించింది. కొన్ని లక్షల మందిపై పరిశోధన చేసి అధ్యయన ఫలితాలను విడుదల చేసింది. ఇందులో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. కాంతి కాలుష్యం కారణంగా చైనాలో 90 లక్షల మంది మధుమేహ బాధితులుగా మారారని ఆ అధ్యయనం బాంబుపేల్చింది. వీరంతా చైనాలోని 162 నగరాల్లో నివసిస్తున్నారు. కాంతి కాలుష్యంతో ఏం జరుగుతుంది? అధిక కాంతి వల్ల కాంతి కాలుష్యం ఏర్పడుతుంది. ఉదాహరణకు పండుగల సమయంలో రంగు రంగుల్లో మెరిసే దీపాలు మిరుమిట్లు గొలిపే కాంతులు విరజిమ్ముతుంటాయి. ఇవి కాంతి కాలుష్యానికి కారణమవుతున్నాయి. అలాగే అన్ని రకాల కృత్రిమ కాంతి, మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, ఎల్ఈడీ, కారు హెడ్‌లైట్, హోర్డింగ్‌ల నుంచి వచ్చే ప్రకాశవంతమైన కాంతి కూడా కాలుష్యాన్ని వెదజల్లుతోంది. ముఖ్యంగా ఈ కాంతి కాలుష్యం వ్యక్తి శరీరాన్ని క్రమంగా ప్రభావితం చేస్తోందని అధ్యయనం తెలిపింది. అంతేకాకుండా మధుమేహ బాధితులుగా మారుస్తోందని పరిశోధకులు వెల్లడించారు. వీధి దీపాలు, స్మార్ట్ ఫోన్లు వంటి అన్ని కృత్రిమ లైట్లు మధుమేహం వచ్చే ప్రమాదాన్ని 25 శాతం పెంచుతాయని స్పష్టమైంది. రాత్రిపూట కూడా మనకు పగటి అనుభూతిని కలిగించే ఈ లైట్లు మానవుల శరీర చక్రాన్ని మారుస్తాయని.. అంతేకాకుండా క్రమంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే మన శరీర సామర్థ్యం తగ్గుతుందని చెబుతున్నారు. ప్రపంచ జనాభాలో 80% మంది రాత్రిపూట చీకటిలో కాంతి కాలుష్యం బారిన పడుతున్నారని కూడా తెలిపారు. పరిశోధన ప్రకారం.. చీకటిలో కన్నా ఎక్కువసేపు కృత్రిమ కాంతిలో ఉండేవారిలో 28 శాతం మందికి అజీర్తి సమస్యలు ఉన్నాయని తేలింది. శరీరంలో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గడమే దీనికి కారణం. వాస్తవానికి ఈ హార్మోన్ మన జీవక్రియ వ్యవస్థను చక్కగా ఉంచుతుంది. ఎక్కువసేపు వెలుతురులో ఉండడం వల్ల ఏమీ తినకుండానే శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతోందని పరిశోధకులు వెల్లడించారు. మన దేశంలో తలసరి ఉద్గారాలు తక్కువే.. ప్రపంచంలో చైనా, అమెరికా, ఈయూల తర్వాత అధిక కర్బన ఉద్గారాలు వెదజల్లుతున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది. అయితే మనదేశంలో అధిక జనాభా ఉండడం వల్ల తలసరి ఉద్గారాలు మిగతా ప్రధాన దేశాలతో పోలిస్తే తక్కువ. 2030 నాటికల్లా దేశ ఇంధన శక్తిలో 50 శాతాన్ని పునరుత్పాదక వనరుల నుంచే పొందాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే అదే సంవత్సరానికి కర్బన ఉద్గారాలను వంద కోట్ల టన్నులు తగ్గించాలని నిర్దేశించుకుంది. దీనికి అనుగుణంగా మన రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి సౌర విద్యుత్‌పై దృష్టి సారిస్తోంది. దాదాపు 43,250 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో కాంతి కాలుష్యంపైనా భవిష్యత్తులో దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. -
‘గ్రీన్’ ప్రాజెక్టులకు రెడ్ కార్పెట్
సాక్షి, అమరావతి: వాతావరణ కాలుష్య రహిత, నాణ్యమైన విద్యుత్తు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న చర్యలతో రాష్ట్రం గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం (హబ్)గా అవతరిస్తోంది. తరిగిపోతున్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా, పెరుగుతున్న వాతావరణ కాలుష్యానికి విరుగుడుగా స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తేవడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో ఏపీ భాగం అవుతోంది. ఈ ప్రాజెక్టు కోసం గతేడాది కేంద్రం ఎంపిక చేసిన ఐదు రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఉంది. దీనికి అనుగుణంగా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా పాలసీ 2023ని రాష్ట్రం రూపొందించింది. తాజాగా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) తయారు చేసిన నివేదిక శ్వేత పత్రాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. అందులోని వివరాలను ‘ఎన్ఆర్ఈడీసీఏపీ’ వీసీ, ఎండీ ఎస్.రమణారెడ్డి ‘సాక్షి’ ప్రతినిధికి వెల్లడించారు. సమగ్రంగా శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం సౌర, పవన విద్యుత్ వంటి స్వచ్ఛ ఇంధనాన్ని ప్రోత్సహిస్తోంది. హైబ్రిడ్ వ్యవస్థగా చెబుతున్న పంప్డ్ హైడ్రో స్టోరేజి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపడుతోంది. ప్రస్తుతం రాష్ట్రానికి 9 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి స్థాపిత సామర్థ్యం ఉంది. అనేక ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో సౌర, పవన, పంప్డ్ హైడ్రో సిస్టం ప్రాజెక్టులు 24 గంటలూ విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. కొత్త టెక్నాలజీల ఆవిర్భావం, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ వంటి వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకుంటోంది. తద్వారా రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ రంగంలో 10 బిలియన్ డాలర్ల నుంచి 15 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులకు అవకాశాలున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు మౌలిక సదుపాయాలు ఉన్నాయి. రాష్ట్ర అవసరాలతోపాటు ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ను ఎగుమతి చేయడానికి అవసరమైన గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్రం అనుకూలంగా ఉంది. రాష్ట్రంలో ఏటా 400 కిలో టన్నుల దేశీయ హైడ్రోజన్ డిమాండ్ ఉంది. దేశ పారిశ్రామిక హైడ్రోజన్ డిమాండ్‌లో ఇది దాదాపు 8 శాతం. ప్రతి ఏటా పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా పాలసీ 2023 ప్రకారం 2030 నాటికి కనీసం 500 కిలో టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది.దీని సాయంతో శిలాజ ఇంధన వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని(డీకార్బనైజ్) భావిస్తోంది. ఇందుకోసం యాక్సిలరేటింగ్ స్మార్ట్ పవర్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ ఇండియా (ఆస్పైర్) ప్రోగ్రామ్ కింద ఫారిన్, కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ సాయంతో ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ హైడ్రోజన్ ఇన్వెస్ట్మెంట్ అవకాశాల నివేదిక సిద్ధం చేసింది. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం వ్యాపారాలకు, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం, పర్యావరణ వ్యవస్థలపై ‘వైట్‌పేపర్’లో వివరించారు. ఇది పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించడానికి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర సంసిద్ధంగా ఉందని శ్వేతపత్రంలో పొందుపరిచారు. కేంద్రం ఎంచుకున్న ఐదు రాష్ట్రాల్లో ఏపీ ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో ఐదు జాతీయ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లు ఏర్పాటు చేయాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. వీటిని 25 గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ క్లస్టర్లుగా విభజించి, వివిధ రంగాలకు ఉపయోగించుకునేలా ప్రణాళికలు రూపొందించింది. మొదటి తరం జాతీయ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులుగా పిలుస్తున్న వీటిలో పన్నెండు రసాయనాలు, రిఫైనరీ, ఉక్కు పరిశ్రమలలోని పారిశ్రామిక డీ–కార్బనైజేషన్ ప్రాజెక్టులు కాగా మూడు భారీ రవాణా ప్రాజెక్టులు, మరో మూడు సిటీ గ్యాస్ డ్రిస్టిబ్యూషన్ (సీజీడీ) ప్రాజెక్టుల్లో హైడ్రోజన్–బ్లెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. మిగిలిన ఏడు ప్రాజెక్టులు మునిసిపాలిటీల్లో వ్యర్థాల నుండి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసేవి. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో వీటి ద్వారా 2025 నాటికి 150 మెగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యానికి గ్రీన్ హైడ్రోజన్ పాలసీతో ఏపీ జీవం పోసింది. -
యాంటీబయోటిక్స్ కూడా పనిచేయవా?
గుండెల నిండా హాయిగా గాలి పీల్చుకోవాలంటే భయం. మాస్కు లేకుండా ఇల్లు కదలాలంటే భయం, భయం శరీరాన్ని, మెదడుని ఆక్రమించిన కలుషిత గాలి ఇప్పుడు వ్యాధుల నుంచి బయటపడేసే సంజీవిని లాంటి యాంటీబయోటిక్స్ రెసిస్టెన్స్‌పై ప్రభావం చూపిస్తోంది. వాయు కాలుష్యంతో యాంటీబయోటిక్స్ పని చేయడం లేదని, ప్రపంచవ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య పెరిగిపోతోందని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఢిల్లీకి చెందిన సమత వయసు 40 సంవత్సరాలు. ఒకరోజు హఠాత్తుగా శ్వాస తీసుకోవడం కష్టమైంది. ఆస్తమా అటాక్ అయింది. ఇంట్లో ఎవరికీ లేని ఆస్తమా ఎందుకొచ్చిందా అని ఆందోళనతో ఉంటే మందులు పని చెయ్యకపోవడంతో కుటుంబ సభ్యులు బెంబేలెత్తిపోయారు. చివరికి ఆస్పత్రిలో చేరితే వైద్యులు అతి కష్టమ్మీద ఆమె ప్రాణాలు కాపాడగలిగారు. దీనికంతటికీ కారణం వాయు కాలుష్యం. వాహనాలు, పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం గాల్లో కలిసిపోయి మనుషుల ఊపిరితిత్తులు, గుండె, మెదడుకి పాకుతోంది. వాయు కాలుష్యంతో శ్వాసకోశ సమస్యలు, గుండె వ్యాధులు, కేన్సర్, చివరికి ఆయుఃప్రమాణాలు క్షీణిస్తాయనే మనకి తెలుసు. ఇలాంటి ప్రాణాంతక వ్యాధులకు సంజీవనిలా ఉపయోగపడే యాంటీబయోటిక్స్ పని చేయకుండా వాయుకాలుష్యం చేస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇది పెరిగిపోతే భవిష్యత్‌లో మనుషుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయన్న ఆందోళనలున్నాయి. కలుషిత గాలితో వచ్చే అనర్థాల్లో తాజాగా యాంటీబయోటిక్ నిరోధకత పెరిగిపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోందని లాన్సెట్ హెల్త్ జర్నల్ అధ్యయనాన్ని ప్రచురించింది. చైనా, యూకేకు చెందిన శాస్త్రవేత్తలు వాయు కాలుష్యం ప్రభావాలపై వివిధ సంస్థలు సేకరించిన గణాంకాల ఆధారంగా యాంటీబయోటిక్స్ పనిచేయకపోవడం అతి పెద్ద పెనుముప్పుగా మారనుందని హెచ్చరించారు. 2000 నుంచి 2018 మధ్య కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ ఎని్వరాన్‌మెంట్ ఏజెన్సీ, వరల్డ్ బ్యాంక్ సహా 116 దేశాల డేటాను సేకరించి అధ్యయనం చేశారు. ► గాల్లోని సూక్ష్మాతి సూక్ష్మ ధూళి కణాలు పీఎం 2.5 వల్ల యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ పెరిగిపోతోంది. గాలిలో కాలుష్యం 10శాతం పెరిగితే యాంటీబయోటిక్‌ను నిరోధించే సామర్థ్యం 1.1% పెరుగుతోంది ► ప్రపంచవ్యాప్తంగా 703 కోట్ల మంది ప్రజలు పీఎం 2.5 దు్రష్పభావాలను ఎదుర్కొంటున్నారు. ► గాల్లో పీఎం 2.5 ధూళి కణాలు మనుషుల వెంట్రుక కంటే 30 రెట్లు చిన్న కణాలతో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా యాంటీబయోటిక్ నిరోధకతను ఇవి ఎంత ప్రభావితం చూపిస్తున్నాయన్నది అర్థం చేసుకోవడం దుర్లభంగా మారింది. ► యాంటీబయోటిక్స్ పనిచెయ్యకపోవడానికి ప్రధాన కారణం వాటిని మితి మీరి వాడడం అయినప్పటికీ వాయు కాలుష్యమూ మనుషుల శరీరంలో యాంటీబయోటిక్ నిరోధక బ్యాక్టీరియాను పెంచుతోంది. ► ఆస్పత్రులు, వ్యవసాయ క్షేత్రాలు, వ్యర్థాల శుద్ధి ప్లాంట్లు వంటి వాటి నుంచి యాంటీబయోటిక్‌లు పని చెయ్యకుండా చేసే కలుషిత గాలి ఎక్కువగా వెలువడుతున్నట్టు అధ్యయనం వివరించింది. ప్రాణం పోసే యాంటీబయోటిక్ ప్రాణమెలా తీస్తుంది? యాంటీబయోటిక్స్‌ని మితి మీరి వాడకం వల్ల శరీరంలో సహజసిద్ధమైన రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటోంది. దీనివల్ల సూపర్ బగ్స్ ఏర్పడి మంచి బ్యాక్టీరియాను తినేస్తున్నాయి. ఫలితంగా వ్యాధులు సోకినప్పుడు మందులు వేసుకున్నా పని చేయకుండా పోతున్నాయి. యాంటీబయోటిక్స్ పని చెయ్యకపోవడం వల్ల ప్రస్తుతం ఏడాదికి లక్ష మంది మరణిస్తున్నారు. 2050 నాటికి ఈ కారణంతో ప్రపంచ దేశాల్లో అత్యధికమరణాలు సంభవించే ముప్పు ఉంది. -
వింత బస్సు..చుట్టున్న వాహనాలను కప్పేసింది..
-
కాలుష్యంతో ఊళ్లన్నీ ఉక్కిరిబిక్కిరి!
సాక్షి, కామారెడ్డి / భిక్కనూరు : కాలుష్యం కోరలు చాస్తోంది. పీల్చే గాలి, తాగేనీరు కలుషితమవుతోంది. జనం రోగాల బారిన పడుతున్నారు. విషవాయువులు పల్లెల్ని కమ్మేస్తుండడంతో భరించలేకపోతున్నారు. తమ ప్రాంతానికి పరిశ్రమలు వస్తే ఉపాధి దొరుకుతుందని ఆశించిన ప్రజలకు ఉపాధి ఏమోగాని రోగాలు వెన్నాడుతున్నాయి. కాలుష్యకారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలంటూ పలు చోట్ల ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు. 44వ నంబరు జాతీయ రహదారిపై ఉన్న భిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డి, కాచాపూర్, భిక్కనూరు, జంగంపల్లి, తలమడ్ల, తదితర గ్రామాల పరిసరాల్లో ఫార్మా, కెమికల్ ఇండస్ట్రీస్‌తో పాటు ఇతర పరిశ్రమలు, కోళ్ల ఫారాలు ఏర్పాటయ్యాయి. అయితే పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాల మూలంగా దుర్వాసనతో ముక్కుపుటాలు అదిరిపోతున్నాయని వివిధ గ్రామాల ప్రజలు పేర్కొంటు న్నారు. పరిశ్రమల నుంచి వదిలే వ్యర్థాలతో చెరువుల్లోని నీరు కలుషితమవుతోందని, ఆఖరుకు భూ గర్భజలాలు కూడా దెబ్బతిని ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భిక్కనూరు మండల కేంద్రం పరిధిలో నెలకొల్పిన ఓ ఫార్మా కంపెనీతో తాము అనేక కష్టాలు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ కాచాపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గడిచిన 57 రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనలకు పొరుగున ఉన్న పెద్దమల్లారెడ్డి, అయ్యవారిపల్లి, సంగమేశ్వర్, మాందాపూర్, అంతంపల్లి తదితర గ్రామాల ప్రజలు కూడా సంఘీభావం తెలిపారు. వ్యర్థాలతో తామూ ఇబ్బంది పడుతున్నామని పే ర్కొంటూ వారితో జతకలిశారు. అలాగే ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే వ్యర్థాలతో భూగర్భజలాలు కూడా కలుషితమై, ఆ నీళ్లు తాగిన వారంతా ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటున్నారు. కొన్నిచోట్ల వ్యర్థాలన్నీ పంట చేలగుండా కాలువలు, వాగుల్లోకి చేరి నీరు కలుషితమవుతోంది. గతంలో చెరువులోకి వ్యర్థాలు వెళ్లడంతో చేపలు మృత్యువాత పడ్డాయి. మొక్కుబడి తనిఖీలు.. పరిశ్రమలను ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (పీసీబీ) అధికారులు మొక్కుబడి తనిఖీలతో చేతులు దులుపుకుంటున్నారని వివిధ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫార్మా కంపెనీ మూలంగా తాము పడుతు న్న ఇబ్బందులపై 57 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా పీసీబీ అధికారులు ఇటువైపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 44వ నంబరు జాతీయ రహదారిపై భిక్కనూరు మండలంలో అడుగుపెట్టగానే ఆయా పరిశ్రమల నుంచి వెలుబడుతున్న వాసనలతో వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. కార్లు, ఇతర వాహనాల అద్దాలన్నీ మూ సి ఉంచినా దుర్గంధంతో ముక్కుపుటాలు అదిరిపోతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. -
కాటేస్తున్న కాలుష్యం
సాక్షి, అమరావతి : ప్రపంచవ్యాప్తంగా 99 శాతం మంది ప్రజలు కలుషితమైన గాలిని పీలుస్తున్నారు. ఒక్క ఏడాదిలో 66.67 లక్షల మంది శ్వాసకోశ వ్యాధుల బారిన పడి మృత్యువాత పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గాలి కాలుష్యం అత్యధికంగా ఉన్న 20 నగరాల్లో మన దేశానికి చెందిన 14 నగరాలు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నివేదిక వెల్లడించింది. అవన్నీ ఉత్తర భారత దేశ నగరాలే కావడం గమనార్హం. గాలి కాలుష్యంపై డబ్ల్యూహెచ్‌వో 2022లో నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం క్యూబిక్ మీటర్ గాలిలో కలుషిత పదార్థాలు 2.5 మైక్రో గ్రాములకు మించకూడదు. అయితే అన్ని దేశాల్లో గాలిలో కలుషిత పదార్థాల తీవ్రత నిర్దేశించిన ప్రమాణాల కంటే నాలుగైదు రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. కలుషితమైన గాలిని పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధుల బారిన పడి తీవ్రమైన రక్తపోటుతో 2019లో ఏకంగా 66.67 లక్షల మంది మరణించినట్లు వెల్లడైంది. పట్టణాల్లో ప్రమాదకర స్థాయిలో.. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణాలు, నగరాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉంది. ప్రపంచంలో గాలి కాలుష్య తీవ్రత అధికంగా ఉన్న నగరాల్లో పాకిస్తాన్‌లోని లాహోర్ మొదటి స్థానంలో నిలవగా చైనాలోని హటన్ రెండో స్థానంలో ఉంది. రాజస్థాన్ ఆళ్వార్ జిల్లాలోని బివాడీ కాలుష్య తీవ్రత అత్యధికంగా ఉన్న నగరాల్లో మూడో స్థానంలో నిలిచింది. కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయిలో ఉన్న నగరాల్లో ఢిల్లీ నాలుగో స్థానంలో ఉండగా న్యూఢిల్లీ తొమ్మిదో స్థానంలో ఉంది. పరిశ్రమలు, వాహనాల పొగ.. గడ్డి కాల్చివేతతో వాహనాల రద్దీ అధికంగా ఉండటం వల్ల వాటి నుంచి వెలువడే పొగ... ప్రమాణాలు పాటించని పరిశ్రమలు... వ్యర్థాలను అడ్డగోలుగా కాల్చేయడం... నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేయడం.. పంట కోతల తర్వాత గడ్డిని పొలాల్లోనే కాల్చేయడం వల్ల ఓజోన్ పొరకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాౖMð్సడ్, నైట్రోజన్ డయాక్సైడ్ లాంటి విష వాయువుల విడుదలతో గాలి కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకుంటున్నట్లు డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. -
అలర్ట్: ప్రపంచంలో టాప్-20 వాయు కాలుష్య పట్టణాల్లో 14 భారత్‌లోనే..
ఊపిరాడని పరిస్థితి. శ్వాసకోశ సమస్యలు పట్టిపీడిస్తున్న దుస్థితి. ఎక్కడో ఒక చోటే అని కాదు.. ప్రపంచవ్యాప్తంగా 99 శాతం ప్రజానీకం పీలుస్తున్న గాలి స్వచ్ఛమైనది కాదు. వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 67 లక్షల మందికిపైగానే బలవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించిన నివేదికలోని అంశాలే ఇవి. స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ చేసిన అధ్యయనం ఆధారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. అందులో మన దేశానికి సంబంధించిన కొన్ని దారుణమైన వాస్తవాలనూ వెల్లడించింది. ప్రపంచంలో వాయు కాలుష్యం అత్యధికంగా ఉన్న టాప్–20 నగరాల జాబితాలో ఏకంగా 14 నగరాలు భారతదేశం నుంచే ఉండటం ఆందోళనకరం. ఇందులో దక్షిణాది రాష్ట్రాలేవీ లేకపోవడం కాస్త ఉపశమనం. వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో దానిని తగ్గించే చర్యలు చేపడుతుంటే.. వాటి స్థానంలో కొత్త నగరాలు వచ్చి చేరుతున్నాయి. –సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ ఆరు వేల నగరాల్లో పరిశీలించి.. 2022 సంవత్సరానికి సంబంధించి మొత్తం 117 దేశాల్లోని ఆరు వేల నగరాల్లో వాయు నాణ్యతను పరీక్షించామని.. మరికొన్ని దేశాల్లో వాయు నాణ్యతను పరీక్షించేందుకు సరైన పరికరాలు లేని కారణంగా పరీక్షించలేకపోయామని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. అలాంటి వాటిలో చాలా వాయు కాలుష్యం ఉన్న నగరాలూ ఉండి ఉంటాయని తెలిపింది. తగిన జాగ్రత్తలు తీసుకోలేక.. కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సూక్ష్మ ధూళి కణాలు వంటి వాయు కలుషితాలు తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయి. వేగంగా అభివృద్ధి చెందే క్రమంలో అటవీ సంపదను నాశనం చేస్తుండటం, పరిశ్రమల ఏర్పాటుతో కాలుష్యం పెరుగుతోంది. పరిశ్రమలు విడుదల చేసే వాయు, జల, భూకాలుష్యాలను అరికట్టే చర్యలపై ప్రభుత్వం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చూపుతున్నాయి. ఏదో భోపాల్ దుర్ఘటన వంటివి జరిగినప్పుడు హడావుడి చేయడం, ఆ తర్వాత మిన్నకుండిపోవడం సాధారణమైపోయింది. భద్రతా ప్రమాణాలను ‘గాలి’కి వదిలేయడం వల్ల వాయు కాలుష్యం ప్రజల ప్రాణాలకు అపాయకరంగా మారుతోంది. వంటింటి పొగ ప్రాణాలు తీస్తోంది వాయు కాలుష్యం కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారిలో మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 32 లక్షల మందికిపైగా వంటింటి పొగకు బలవుతున్నట్టు డబ్ల్యూహెచ్‌వో నివేదికలో పేర్కొంది. ప్రపంచ జనాభాలో మూడో వంతు కుటుంబాలు వంట కోసం కలప, బొగ్గు, పేడ, పంటల వ్యర్థాలను వాడుతున్నాయని.. తద్వారా వెలువడే వాయు కాలుష్యంతో ఊపిరితిత్తులు దెబ్బతిని శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నట్టు వెల్లడించింది. పరిశ్రమలు, వాహన, వంటింటి వాయు కాలుష్యం వల్ల మొత్తంగా ఏటా 67 లక్షల మంది శ్వాసకోశ వ్యాధులతో మృత్యువాత పడుతున్నట్లు తెలిపింది. ఏయే సమస్యలు వస్తున్నాయి? కలుషిత గాలిలోని సూక్ష్మ ధూళి కణాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి శ్వాస సంబంధిత వ్యాధులు తలెత్తుతున్నాయి. వాయు కాలుష్యంతో మరణిస్తున్న వారిలో 32శాతం మంది ఇస్కామిక్ హర్ట్ డిసీజ్‌తో, 23 శాతం మంది గుండెపోటుతో, 21 శాతం లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, 19 శాతం క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్‌తో, ఆరు శాతం మంది ఊపిరితిత్తుల కేన్సర్‌తో మరణిస్తున్నట్టు డబ్ల్యూహెచ్‌వో నివేదికలో పేర్కొంది. వాయు కాలుష్యం నివారణకు ఏం చేయాలి? ► వాయు కాలుష్యాన్ని నివారించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు సూచనలు కూడా చేసింది. తగిన వాయు నాణ్యతా ప్రమాణాలను అనుసరించాలని స్పష్టం చేసింది. ► వాయు కాలుష్య కారక అంశాలను గుర్తించాలి. వాటి నియంత్రణ చర్యలను ప్రభుత్వ యంత్రాంగం నిత్యం పర్యవేక్షించాలి. ► వంటకు అవసరమైన కాలుష్య రహితమైన, నాణ్యమైన ఇంధనాన్ని సమకూర్చాలి. సురక్షితమైన, సామాన్యులకు అందుబాటులో ఉండే రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలి. పాదచారులకు, సైక్లింగ్ ఫ్రెండ్లీ నెట్వర్క్ కల్పించాలి. ► వాహన కాలుష్యాన్ని అరికట్టేలా కఠిన చట్టాలు తీసుకుని రావాలి. వాటి అమలును నిత్యం పర్యవేక్షించేలా అధికార యంత్రాంగం పనిచేయాలి. ► పరిశ్రమల వ్యర్థాలు, మున్సిపల్ వ్యర్థాల యాజమాన్య నిర్వహణను మరింత పెంచాలి. ► పంట వ్యర్థాలను తగలబెట్టడం ఆపేయాలి. అటవీ అగ్నిప్రమాదాలను అరికట్టాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో సమస్య తీవ్రం సూక్ష్మరూపాల్లోని కాలుష్యాలు మనుషుల ఆరోగ్యంపైనే కాకుండా పర్యావరణం, జీవవైవిధ్యం, పశుపక్ష్యాదులు, జంతు జాలం, పొలాలు, వ్యవసాయ ఉత్పత్తులపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కానీ దక్షిణాది రాష్ట్రాలు కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విష వాయువులతోపాటు పీఎం 2.5, పీఎం 10 సూక్ష్మరూపాల్లోని కాలుష్య వ్యాప్తి మనుషుల ఆరోగ్యాన్ని కుంగదీస్తోంది. వాయు కాలుష్యాన్ని తగ్గించే దిశలో ఎవరికి వారు వ్యక్తిగత స్థాయిలో, ప్రభుత్వం, స్వచ్ఛందసంస్థల పరంగా పరిష్కారమార్గాలు ఆలోచించాలి. – ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్త హైదరాబాద్‌లోనూ పెరుగుతున్న కాలుష్యం ఇటీవల సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు డేటాను విశ్లేషిస్తూ గ్రీన్‌పీస్ ఇండియా విడుదల చేసిన నివేదికలో.. హైదరాబాద్‌లో పీఎం 10 స్థాయిలు నిర్దేశిత ప్రమాణాల కంటే ఆరేడుశాతం అధికంగా ఉన్నాయి. పరిశ్రమల విస్తరణ, రవాణా పెరగడం, చెత్త తగలబెట్టడం, భారీగా నిర్మాణ కార్యకలాపాల వల్ల వాయు కాలుష్యం పెరుగుతోంది. పర్టిక్యులేట్ మేటర్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, పీఎం 2.5, పీఎం 10 వంటివి ఎక్కువ అవుతున్నాయి. ఇవి ఊపిరితిత్తులపై ప్రభావం చూపి.. శ్వాసకోశ సమస్యలకు కారణమవుతున్నాయి. – హరికిషన్ గోనుగుంట్ల, చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, యశోద ఆస్పత్రి గాలి నాణ్యతను ఎలా నిర్ధారిస్తారు? గాలి నాణ్యతను ‘ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ)’తో కొలుస్తారు. వాతావరణంలో ఒక క్యూబిక్ మీటర్ గాలిలో కెమికల్స్ రియాక్షన్స్‌తో ఏర్పడిన, లేదా దుమ్ము, ధూళి కణాలు, నిర్మాణ ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో వెలువడే కాలుష్యాల (పర్టిక్యులేట్ మేటర్)ను లెక్కించి కొలుస్తారు. గంటకోసారి లేదా 8 గంటలకోసారి కొలవడం ద్వారా సగటు ఏక్యూఐని గుర్తిస్తారు. టాప్–20 వాయు కాలుష్య నగరాలు లాహోర్ (పాకిస్తాన్), హోటన్ (చైనా),భివండి, ఢిల్లీ (భారత్), పెషావర్ (పాకిస్తాన్) ఎన్ డీజమేనా (చాద్), దర్భంగా, అసోపూర్, పట్నా, ఘజియాబాద్, ధరెహారా (భారత్), బాగ్దాద్ (ఇరాక్), ఛాప్రా, ముజఫర్‌నగర్ (భారత్), ఫైసలాబాద్ (పాకిస్తాన్),గ్రేటర్ నోయిడా, బహదూర్‌ఘర్,ముజఫర్‌పూర్, ఫరీదాబాద్(భారత్) -
కాలుష్యానికి కళ్లెం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యాన్ని 30% మేర తగ్గించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. విశాఖ, విజయవాడ నగరాల్లో గాలిలో ఉన్న కాలుష్యం అంతకంతకు పెరుగుతోన్న నేపథ్యంలో దాన్ని తగ్గించేందుకు రెండేళ్లుగా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే విశాఖ మునిసిపల్ కార్పొరేషన్.. ఏయూ, ఐఐటీ (కాన్పూర్), అమెరికాకు చెందిన డ్యూక్ వర్సిటీలతో కలిసి కాలుష్య నియంత్రణకు ప్రణాళిక తయారు చేసింది. విజయవాడ కార్పొరేషన్ కూడా ఐఐటీ (తిరుపతి) భాగస్వామ్యంతో ప్రణాళిక సిద్ధం చేస్తోంది. శ్రీకాకుళం,విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు నగరాల్లో ఈ తరహా ప్రణాళికలను రూపొందించారు. ఇందుకోసం ఆ నగరాలకు ప్రభుత్వం ఏటా రూ.2 కోట్ల చొప్పున మూడేళ్లు కేటాయిస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు నగరపాలక సంస్థలు ఏయూ ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణ ప్రణాళికలు రూపొందించాయి. గుంటూరు, ఒంగోలు, నెల్లూరు నగరాలకు ఐఐటీ (తిరుపతి) సహకారంతో, చిత్తూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు నగరాలకు నేషనల్ సెంటర్ ఫర్ అట్మోస్ఫియరిక్ రీసెర్చ్ (తిరుపతి) ద్వారా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆ ప్రణాళికలను బట్టి గాలి కాలుష్యాన్ని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వాయు కాలుష్య పర్యవేక్షణ వాయు కాలుష్య నియంత్రణ కోసం ఈ నగరాల్లో రూ.35 కోట్లతో కంటిన్యూస్ యాంబియెంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ, విజయవాడ నగరాల్లో 5 చొప్పున, 11 మునిసి పాల్టీల్లో ఒక్కొక్కటి ఏర్పాటు చేస్తున్నారు. వీటిద్వారా గాలి కాలుష్యాన్ని ఆన్లైన్లో పర్యవేక్షించడం, ప్రజలకు దానిపై డిజిటల్‌గా చూపించడంపై అవగాహన కల్పించనున్నారు. కొత్తగా ఏర్పాటైన ప్రతి జిల్లా కేంద్రంలోను ఒక స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 35 స్టేషన్లలో గాలి కాలుష్యాన్ని పర్యవేక్షించనున్నారు. వ్యర్థాల నుంచి ఇంధనం తయారీకి చర్యలు కార్పొరేషన్లు, మునిసిపాల్టీల నుంచి వచ్చే వ్యర్థాల నుంచి ఇంధనాన్ని తయారు చేసేందుకు కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకుంటోంది. అక్కడి నుంచి వచ్చే మురుగునీటిని ప్రస్తుతం 89 సివేజి ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేస్తుండగా మరికొన్ని ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్లాస్టిక్, ఈ–పరిశ్రమల వ్యర్థాల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. చదవండి: ఒడిశా రైలు దుర్ఘటన: ‘నువ్వు నా హృదయానికి దగ్గరయ్యావు’.. -
భారతదేశంలోని టాప్ 10 అత్యంత కాలుష్య నగరాలు
-
ప్రపంచంలోని టాప్ 10 కాలుష్య నగరాలు
-
ఇకనైనా కళ్ళు తెరుస్తారా?
ప్రపంచానికి మరోసారి ప్రమాద హెచ్చరిక. పారిశ్రామికీకరణ మునుపటి స్థాయితో పోలిస్తే పుడమి తాపం ఇప్పటికే 1.1 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగింది. ఈ లెక్కన గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గించాలనీ, ఈ శతాబ్ది చివరకు భూతాపోన్నతి 1.5 డిగ్రీల లోపలే ఉండేలా చూసు కోవాలనీ చెప్పుకున్న ఊసులు, చేసుకున్న బాసలు తీరా రానున్న పదేళ్ళలోనే పూర్తిగా భగ్నం కానున్నాయి. ‘ఆఖరి అవకాశంగా తెరిచి ఉన్న తలుపు సైతం మూసుకుపోతోంద’ని ప్రపంచ అగ్రశ్రేణి శాస్త్రవేత్తల బృందం ‘ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్’(ఐపీసీసీ) చేసిన హెచ్చరిక మానవాళికి మేలుకొలుపు. ఇప్పటికైనా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను నియంత్రించడానికి ప్రభుత్వాలు తక్షణం బరిలోకి దిగితే, ఎంతో కొంత ప్రయోజనమని సోమవారం నాటి తాజా నివేదిక కర్తవ్యాన్ని బోధిస్తోంది. వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణమైన సంపన్న దేశాలు దీన్ని చెవి కెక్కించుకోకుండా, వర్ధమాన, నిరుపేద దేశాలదే బాధ్యత అన్నట్టు ప్రవర్తిస్తుండడమే ఇప్పుడున్న చిక్కు. విషాదం ఏమిటంటే– పాపం ఎవరిదైనా, ఫలితం ప్రపంచమంతా అనుభవించాల్సిందే! ఐపీసీసీ 1988లో ఏర్పాటైన నాటి నుంచి ఇది ఆరో నివేదిక. ఈ ఆరో అంచనా నివేదిక (ఏఆర్6) కు సంబంధించిన నాలుగో విడత వివరాలివి. ఇదే ఆఖరి విడత కూడా! మునుపటి మూడు ప్రధాన విభాగాల నివేదికలోని కీలక సమాచారాన్ని ఒకచోట గుదిగుచ్చి అందిస్తున్నారు గనకనే ఈ చివరి దాన్ని ఐపీసీసీ ఏఆర్6 ‘సంకలన నివేదిక’ అన్నారు. 2021 ఆగస్ట్, 2022 ఫిబ్రవరి, ఏప్రిల్‌లలో వచ్చిన మొదటి మూడూ వాతావరణ సంక్షోభం, దాని పర్యవసానాలు, గ్రీన్హౌస్ వాయువులను తగ్గించే మార్గాల గురించి చెప్పాయి. తాజా ‘సంకలన నివేదిక’ ప్రధానంగా మునుపటి ప్రచురణ ల్లోని కీలక ఫలితాల పునశ్చరణ. భూతాపం ‘మళ్ళీ తగ్గించలేని స్థాయికి’ చేరుతోందనీ, మానవాళికి దుష్పరిణామాలు తప్పవనీ, కఠిన చర్యలతోనే ప్రమాదాన్ని నివారించగలమనీ ఇది హెచ్చరిస్తోంది. అపార ధనబలం, సాంకేతిక సామర్థ్యం తమ సొంతమైన ధనిక దేశాలు కేవలం అప్పులు, ప్రైవేట్ రంగ పెట్టుబడులిచ్చి వాతావరణ పరిరక్షణ చర్యకు సహకరించామని చేతులు దులుపుకొంటే సరిపోదు. ఈ 2020 –30 మధ్య ఇప్పుడు చేస్తున్న దానికి కనీసం 6 రెట్లయినా వాతావరణంపై పెట్టుబడి పెడితే తప్ప, తాపోన్నతిని 1.5 డిగ్రీల లోపు నియంత్రించే లక్ష్యం సాధ్యం కాదట. అలాగే, 2020 నాటి స్థాయిలోనే మన వాతావరణ విధానాలు బలహీనంగా ఉంటే, ఈ శతాబ్ది చివరకు భూతాపం 3.2 డిగ్రీలు పెరుగుతుంది. ఒకసారి 1.5 డిగ్రీలు దాటి ఎంత పెరిగినా, ఆ వాతావరణ నష్టం పూడ్చలేనిది. మానవాళికి మహా విపత్తు తప్పదు. పెను ప్రభావం పడే దేశాల్లో భారత్ ఒకటని నివేదిక తేల్చింది. వడగాడ్పులు, కార్చిచ్చులు, ఆకస్మిక వరదలు, సముద్రమట్టాల పెరుగుదల,పంటల ఉత్పత్తి తగ్గుదల, 2050 నాటికి 40 శాతం జనాభాకు నీటి కొరత – ఇలా పలు ప్రమాదాలు భారత్‌కు పొంచివున్నాయి. అయితే, వాతావరణ మార్పుల నివారణ భారాన్ని అందరూ పంచు కోవాలనే ‘వాతావరణ న్యాయ’ సూత్రానికి ఈ నివేదిక జై కొట్టడం మన లాంటి దేశాలకు ఊరట. మునుపు మూడు విడతల్లో ప్రచురించిన వేలకొద్దీ శాస్త్రీయ సమాచారాన్ని సంక్షిప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విధాన నిర్ణేతలకు వారు చేపట్టాల్సిన చర్యలను సారాంశరూపంలో అందించడం తాజా సంకలన నివేదిక ప్రత్యేకత. నవంబర్ 20న దుబాయ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిథ్య మివ్వనున్న ఐరాస తదుపరి వాతావరణ సదస్సు ‘కాప్ 28’కు ఈ నివేదిక ఒక దిక్సూచి. 2015లో ప్యారిస్ వాతావరణ ఒప్పందం నాటి నుంచి నేటి వరకు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడంలో వివిధ దేశాల పురోగతిని ఆ ‘కాప్ 28’లో మదింపు చేస్తారు. ఇప్పటి దాకా చేస్తున్నవేవీ చాలట్లేదని తాజా నివేదిక సాక్షిగా తెలుస్తూనే ఉంది. వెరసి, వాయు ఉద్గారాలను తగ్గించే లక్ష్యంలో ప్రభుత్వా లన్నీ విఫలమయ్యాయి. నిజానికి, ఐపీసీసీ ఓ సమగ్ర నివేదిక ఇచ్చేందుకు 6 నుంచి 8 ఏళ్ళు పడుతోంది. అయినా గ్రీన్హౌస్ గ్యాస్‌లు పెరుగుతూనే ఉన్నాయి. నివేదికల పరిమాణం, సంక్షోభంపై చర్యల అత్యవసరం కూడా పెరుగుతూనే వచ్చాయి. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు కఠిన చర్యలు చేపట్టకుంటే, ఆ తర్వాత ఏం చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టే! ఉద్గారాలను గణనీయంగా తగ్గించడం, పునరుత్పాదక ఇంధనంపైనా – ఇతర తక్కువ కర్బన సాంకేతికతల పైనా దృష్టి సారించి శిలాజ ఇంధనాల వినియోగం మానేయడం, అటవీ పెంపకం లాంటివి ప్రభుత్వాలు చేయాల్సిన పని. అలాగే, ‘వాతావరణాన్ని బాగు చేసే’ మార్గాల్ని అన్వేషించాలి. గాలిలో నుంచి కార్బన్ డయాక్సైడ్ను పీల్చేసే ‘డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్’ టెక్నాలజీలను అభివృద్ధి చేయాలి. ఐరాస ప్రధాన కార్యదర్శి మాట విని, ధనిక దేశాలు 2040 నాటికి ‘నెట్ జీరో’ను అందుకొనేలా తమ లక్ష్యాన్ని ముందుకు జరుపుకొంటే మంచిది. ఈ దేశాలు తమ వాతావణ బాధ్యతను నిర్వర్తించేలా చూడడం ఇప్పుడు సవాలు. ధనిక ప్రపంచపు బాధ్యతారహిత, మొండి వైఖరికి మిగతా అందరూ మూల్యం చెల్లించాల్సి రావడం మహా దారుణం. ఐపీసీసీ తదుపరి నివేదిక 2030లో కానీ రాదు. కాబట్టి భూతాపోన్నతిని 1.5 డిగ్రీల లోపలే నియంత్రించేలా చర్యలు చేపట్టడా నికి ఈ ఏఆర్6 తుది ప్రమాద హెచ్చరిక. మేల్కొందామా? లేక కళ్ళు తెరిచి నిద్ర నటిద్దామా? ప్రస్తుతం ఛాయిస్ ప్రపంచ దేశాలదే! ఒకసారి పరిస్థితి చేయి దాటేశాక మాత్రం ఏం చేసినా ఫలితం శూన్యం. -
గాలిలోనూ గరళమేనా?
సంవత్సరాలు మారుతున్నా దేశంలో కాలుష్య పరిస్థితులు మాత్రం మెరుగుపడుతున్నట్టు లేదు. ప్రభుత్వాలు చర్యలు చేపట్టామంటున్నా, వాయు కాలుష్య స్థాయి ఆందోళనకరంగానే కొనసాగుతోంది. భారతదేశ వాయు నాణ్యతా సూచి ప్రమాదకర స్థాయికి పడిపోయింది. ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. ప్రపంచంలోని వివిధ రాజధానుల్లోకెల్లా రెండో అత్యంత కలుషిత రాజధానిగా, మొత్తం నగరాల లెక్కలో నాలుగో స్థానంలో నిలిచి ఢిల్లీ అప్రతిష్ఠ మూటగట్టుకుంది. ప్రపంచంలోని 50 అగ్రశ్రేణి కాలుష్య నగరాల్లో 39 భారత్‌లోవే. స్విట్జర్లాండ్‌కు చెందిన వాయు నాణ్యతా టెక్నాలజీ సంస్థ ‘ఐక్యూ ఎయిర్’ మార్చి 14న విడుదల చేసిన అయిదో వార్షిక ‘ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక–2022’లోని సంగతులివి. ఇవన్నీ మనల్ని అప్రమత్తం చేస్తున్నాయి. పౌరులు స్వచ్ఛమైన గాలి పీల్చి, ఆరోగ్యంగా జీవించాలంటే కాలుష్య నివారణకు తక్షణ చర్యలే శరణ్యమని పాలకులకు గుర్తు చేస్తున్నాయి. ప్రపంచంలోని 131 దేశాల్లో 7,327 ప్రాంతాల్లో 30 వేలకు పైగా వాయునాణ్యతా పరిశీలక కేంద్రాలు పెట్టి, డేటా సేకరించి, ఈ నివేదికను సిద్ధం చేశారు. దీన్నిబట్టి గడచిన 2022లో అత్యధిక కాలుష్య దేశాల్లో అగ్రభాగాన నిలిచినవి... ఉత్తర – మధ్య ఆఫ్రికాలోని ఛాడ్, ఇరాక్, బహ్రెయిన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్. భారత్ 8వ స్థానంలో నిలిచింది. వాయుకాలుష్యం దారుణంగా ఉన్న ప్రపంచంలోని 10 నగరాల్లో ఏకంగా 8 మధ్య, దక్షిణాసియా ప్రాంతాల్లోవే! మన దేశంలో దాదాపు 60 శాతం నగరాల్లో ఈ సర్వే సాగింది. మనం పీల్చే గాలి నాణ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కన్నా ఏడు రెట్లు అధమంగా ఉందని ఇందులో తేలింది. పైకి చూస్తే, నిరుటి సర్వేలో కాలుష్యంలో ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్న మనం ఈసారి 8వ స్థానానికి రావడం శుభవార్తే. కానీ, నిరుడు ప్రపంచంలోని 100 కాలుష్యనగరాల్లో 61 మనవైతే, ఈసారి ఆ సంఖ్య 65కు పెరగడం గమనార్హం. చిత్రం ఏమిటంటే, ప్రపంచ నగరాల్లో ఢిల్లీ నాలుగో స్థానంలో ఉన్నా, మన దేశంలో అత్యంత కలుషిత నగరం మాత్రం ఢిల్లీ శివార్లలో రాజస్థాన్ పరిధిలోకి వచ్చే భివాడీ! ఆ తరువాతే ఢిల్లీ. వాయుకాలుష్యం ఎక్కువైన దేశ రాజధానిలో సహజమైన నేలను సైతం కాంక్రీట్ కాలిబాటలతో మార్చేసరికి, చెట్ల నరికివేత పెరిగి, జీవం పోతోంది. సహజమైన స్థానిక మొక్కలను కాక, వేరెక్క డివో నాటడం లాంటి సమస్యలూ ఉన్నాయి. అలాగే, వాహన ఉద్గారాలు కాలుష్యానికి మరో ప్రధాన కారణం. ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు అధిక స్థాయిలో ఉద్గారాలను వెలువరిస్తూ, మరింత వాయు కాలుష్యానికి దారి తీస్తున్నాయి. ఇవన్నీ ఆరుబయట పనిచేసే భవన నిర్మాణ కార్మికులు, వీధి వర్తకులు సహా పలువురిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. శరవేగపు పట్టణీకరణతో, 2020 నుంచి 2030 మధ్య మన పట్టణ ప్రాంత జనాభా 48.3 కోట్ల నుంచి 67.5 కోట్లకు, అంటే 40 శాతం పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని స్థాయుల్లో గట్టి చర్యలు చేపట్టక తప్పదు. అనూహ్యంగా ఇటీవల గ్రామీణ భారతావనిలోనూ వాయు నాణ్యతలో తేడాలొస్తున్నాయి. గ్రామాల్లో నైట్రోజన్ డయాక్సైడ్ (ఎన్ఓ2) స్థాయులు, దరిమిలా వాయు కాలుష్యం పెరుగుతున్నట్టు ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన పరిశోధకుల అధ్యయనం గత నెలలో వెల్లడించింది. భారత్‌లో మొత్తం ఎన్ఓ2 కాలుష్యంలో 41 శాతం గ్రామీణ ప్రాంతాల్లో అదీ అధికంగా రవాణా తదితర రంగాల ద్వారా జరుగుతోంది. పెరుగుతున్న పట్టణీకరణ, శివార్లకు పరిశ్రమలు మారడం, జనాభా పెరుగుదల లాంటి అనేక కారణాల వల్ల ప్రబలుతున్న ఈ ధోరణి ఆందోళనకరం. నిజానికి, గాలిలో పార్టిక్యు లేట్ మేటర్ 2.5 (పీఎం 2.5) సాంద్రతల్ని వచ్చే 2026 కల్లా 40 శాతం మేర తగ్గించడం లక్ష్యమని భారత్ 2022లో ప్రకటించింది. అందుకు తగ్గట్టు 2019లో పర్యావరణ శాఖ ఆరంభించిన ‘జాతీయ స్వచ్ఛ వాయు పథకా’న్ని (ఎన్సీఏపీ) పునర్నిర్వచిస్తామనీ హామీ ఇచ్చింది. కానీ, లక్ష్యసాధనలో వెనుకడుగు వేసింది. బొగ్గు గనులకు పర్యావరణ నిబంధనల్లో సడలింపులు ఇవ్వడం, గాలిలో ధూళి కణాలకు కారణమయ్యే ఉత్పత్తుల పెంపునకు అనుమతులివ్వడం లాంటి అనేక ప్రభుత్వ నిర్ణయాలు సమస్యను పెంచిపోషించాయి. భారత లక్ష్యానికి అవన్నీ ప్రతిబంధకాలయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కాలుష్య నివారణకు సత్వర కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలి. పరిశ్ర మలు, వాహనాలపై కఠిన నిబంధనలు విధించాలి. రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గేలా అసలు సిసలు ప్రజా రవాణా వ్యవస్థలపై దృష్టి పెట్టాలి. పునరుత్పాదక శక్తిపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. అలాగే, పర్యావరణ, కాలుష్య సంక్షోభాల నుంచి బయటపడాలంటే, ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్ని మెరుగుపరుచుకొనే కృషి చేయాలి. కేవలం వ్యక్తిగత కృషి సరిపోదు. వ్యక్తివాదం నుంచి సమష్టి వాదం వైపు మళ్ళాలి. అందరూ కలసికట్టుగా సుస్థిర విధానాలను అనుసరించడం కీలకమని గుర్తించాలి. సాముదాయక కృషి సత్ఫలితాలిస్తుంది. కోవిడ్ కాలంలో దేశంలో కాలుష్యం కట్టడి అయినట్టు కనిపించినా, తిరిగి మళ్ళీ కోవిడ్ ముందు స్థాయికి చేరిపోయిందని గత ఏడాది ఇదే ‘ఐక్యూ ఎయిర్’ నివేదిక తేల్చింది. అనారోగ్యానికి రెండో అతి పెద్ద కారణంగా దేశ ప్రజానీకంపై పెను ప్రభావం చూపుతున్న గాలి కాలుష్యంతో ఏటా 15 వేల కోట్ల డాలర్ల పైగా ఆర్థికంగా నష్టపోతున్నట్టు లెక్క. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఒకరు ఆరోగ్యాన్ని దెబ్బతీసే వాయుకాలుష్య ప్రాంతంలో నివసిస్తున్న వేళ భావితరాల బాగు కోసమైనా దేశాలు నిద్ర లేవాలి. పీల్చే గాలిలోనూ ధనిక, పేద దేశాల మధ్య తేడాలు దుర్భరం. -
సుందర దేశంలో విషపుగాలి! బయటకు రావాలంటే జంకుతున్న జనం!
ప్రకృతి రమణీయత ఉట్టిపడే అందమైన దేశం, ప్రపంచ పర్యాటకులకు స్వర్గధామమైన థాయ్‌లాండ్‌ను వాయు కాలుష్యం ముంచెత్తుతోంది. గాలి నాణ్యత దారుణంగా పడిపోతుండడంతో జనం ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు తెలియజేసే యాప్‌లను జనం ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. యాప్ ఇచ్చే సూచనల ప్రకారం నడుచుకుంటున్నారు. ఎర్ర మార్క్ కనిపిస్తే ఇంట్లో ఉండిపోవాల్సిందే. ఉదయం పూట వ్యాయామం చేయాలన్నా బయటకు వెళ్లలేని పరిస్థితి. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో కాలుష్యం బెడద మరింత తీవ్రంగా ఉండడం కలవరం సృష్టిస్తోంది ఎయిర్ పొల్యూషన్ దెబ్బకు టూరిస్టుల సంఖ్య తగ్గిపోతోంది. ప్రధాన పర్యాటక ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. ఎందుకీ తీవ్ర కాలుష్యం? థాయ్‌లాండ్‌లో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా ప్రభుత్వం తరచుగా కాలుష్య హెచ్చరికలు జారీ చేయడం సాధారణమే. అయితే, ఈసారి మాత్రం కాలుష్య తీవ్రత మరింత పెరిగింది. ఉత్తర థాయ్‌లాండ్‌లో రైతులు పంట వ్యర్థాలను దహనం చేస్తుంటారు. మూడు నెలల పాటు ఈ సీజన్ కొనసాగుతుంది. ఈ సమయంలో తీవ్ర కాలుష్యం ఉత్పన్నమవుతుంది. ప్రమాదకరమైన సూక్ష్మ ధూళి రేణువులు వెలువడుతాయి. విషపూరిత కార్బన్ మోనాక్సైడ్ వాయువు విడుదలవుతుంది. పంట వ్యర్థాల దహనం కారణంగా రైతులు శ్వాస సంబంధిత వ్యాధుల బారినపడుతున్నట్లు, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించామని థాయ్‌లాండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ సెంటర్ సీనియర్ పరిశోధకుడు కనికా థాంపానిష్వోంగ్ చెప్పారు. దేశంలో 2021లో వాయు కాలుష్యం వల్ల 29,000 మంది మరణించారని అంచనా. ఇక రాజధాని బ్యాంకాక్‌లో తీవ్రరూపం దాలుస్తున్న ట్రాఫిక్ సమస్య వల్ల కాలుష్యం పెరిగిపోతోంది. చలికాలం కావడంతో పరిస్థితి భీతావహంగా మారుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సూచించిన దానికంటే థాయ్‌లాండ్ ప్రజలు సగటున నాలుగు రెట్లు అధికంగా సూక్ష్మ ధూళి కణాలను(పీఎం 2.5) పీలుస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. కాలుష్యం వల్ల దేశంలో ప్రజల జీవిత కాలం సగటున రెండేళ్లు తగ్గినట్లు థాయ్‌లాండ్ ‘ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్’అంచనా వేసింది. వేధిస్తున్న నిధుల కొరత మరోవైపు కాలుష్యాన్ని తగ్గించడంపై థాయ్‌లాండ్ సర్కారు దృష్టిపెట్టింది. ఈ దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడానికి అంతర్జాతీయ సంస్థలు, పరిశోధనా కేంద్రాలతో కలిపి పనిచేస్తోంది. కాలుష్య నియంత్రణ కోసం కొత్త కొత్త విధానాలు రూపొందిస్తున్నప్పటికీ నిధుల కొరత వల్ల అవి ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎయిర్ క్వాలిటీ పాలసీల అమలుకు బడ్జెట్లో ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించకపోవడం పెద్ద అవాంతరంగా మారింది. స్వచ్ఛమైన గాలిని పీల్చడం ప్రజల హక్కు, ఆ హక్కును కాపాడడంలో థాయ్‌లాండ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ గ్రీన్‌పీస్ థాయ్‌లాండ్, ఎన్విరాన్మెంటల్ లా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థలు గత ఏడాది మార్చి నెలలో కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ‘క్లీన్ ఎయిర్ బిల్లు’ను ఆమోదించాలంటూ థాయ్‌లాండ్ క్లీన్ ఎయిర్ నెట్వర్క్ అనే మరో సంస్థ పోరాడుతోంది. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే.. కాలుష్యానికి కారణమయ్యే వారికి పెద్ద మొత్తంలో జరిమానాలు విధించవచ్చు. మరోవైపు పంట వ్యర్థాలను దహనం చేయకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థలు రైతుల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. 14.49 లక్షల మంది బాధితులు థాయ్‌లాండ్ ప్రజారోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. కాలుష్యం వల్ల దేశంలో ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటిదాకా 14,49,716 మంది అస్వస్థతకు గురయ్యారు. రాజధాని బ్యాంకాక్‌లో 31,695 మంది అనారోగ్యం బారినపడ్డారు. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులకు గురయ్యారు. బాధితుల్లో క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, నిమోనియా, బ్రాంకైటీస్, ఆస్తమా, ఇన్‌ఫ్లూయెంజా, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి లక్షణాలు కనిపించాయి. బ్యాంకాక్‌లో తాజాగా 50కిపైగా ప్రాంతాల్లో పీఎం 2.5 స్థాయిలు క్యూబిక్ మీటర్‌కు 51 నుంచి 78 మైక్రోగ్రాములు ఉన్నట్లు తేలిందని కాలుష్య నియంత్రణ విభాగం డైరెక్టర్ జనరల్ పిన్సాక్ సురాస్వాడీ చెప్పారు. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు కాలుష్యం నుంచి ఉపశమనం కోసం ప్రజలు ముఖానికి మాస్కు తప్పనిసరిగా ధరించాలని థాయ్ ఎయిర్ క్వాలిటీ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రఫాన్ సూచించారు. కాలుష్యం తీవ్రత తగ్గుముఖం పట్టకపోతే ఇళ్ల నుంచే పనిచేయాలని ఉద్యోగులకు సూచిస్తామని థాయ్‌లాండ్ మంత్రి అనుపోంగ్ పావోజిండా చెప్పారు. బ్యాంకాక్‌లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక వైద్యశాలలు ► కాలుష్యం, తద్వారా అనారోగ్య సమస్యలు పెరిగిపోతుండడంతో థాయ్‌లాండ్ ప్రజారోగ్య శాఖ ప్రత్యేక వైద్యశాలలు ఏర్పాటు చేసింది ► కాలుష్యం బారినపడిన వారిలో శ్వాస ఆడకపోవడం, చర్మంపై దద్దుర్లు, గుండె సంబంధిత వ్యాధులు తలెత్తున్నాయి. ► బాధితులకు చికిత్స అందించడానికి దేశవ్యాప్తంగా 66 ప్రత్యేక క్లినిక్‌లు ఏర్పాటు చేశారు. ► వాయు కాలుష్యంతో ముడిపడి ఉన్న వ్యాధులు, నివారణ చర్యలపై సమగ్ర అధ్యయనం చేయా లని బ్యాంకాక్‌లోని 22 ప్రధాన ఆసుపత్రులకు వ్యాధుల నియంత్రణ విభాగం సూచించింది. –సాక్షి, నేషనల్ డెస్క్ -
మితిమీరిన వాయు కాలుష్యం.. 2 లక్షల మంది ఆస్పత్రి పాలు!
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో వాయు కాలుష్యం మితిమీరిపోయింది. కలుషిత గాలిని పీల్చి సుమారు 13 లక్షల మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో సుమారు 2 లక్షల మంది గతవారం ఆస్పత్రుల్లో చేరారు. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న పొగ, వ్యవసాయ వ్యర్థాల దహనం వంటి కారణాలతో దేశంలో గాలి నాణ్యత స్థాయిలు గణనీయంగా పడిపోయాయి. బ్యాంకాక్‌లోని 50 వరకు జిల్లాల్లో గాలి నాణ్యత సురక్షితం కాని 2.5 పీఎం స్థాయికి పడిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్న గాలి కాలుష్య స్థాయిని మించి పోయింది. ఈ స్థాయిలో గాలి కణాలు రక్తంలో కలిసిపోయి అవయవాలను దెబ్బతీస్తాయి. -
ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఉబర్ ఆగ్రహం?
ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై క్యాబ్స్ అగ్రిగేటర్ ఉబర్ టెక్నాలజీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పొల్యూషన్‌ను తగ్గించేలా ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగంపై ఢిల్లీ ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఢిల్లీ నగర పరిధిలో ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే ట్యాక్సీలుగా అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ నిర్ణయాన్ని క్యాబ్ సర్వీస్ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వ నిర్ణయంపై క్యాబ్స్ అగ్రిగేటర్ ఉబర్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవలం ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను మాత్రమే ట్యాక్సీలుగా వాడాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయిస్తే లక్ష మందికి పైగా డ్రైవర్ల జీవనోపాధి దెబ్బ తింటుందని పేర్కొంది. అంతేకాదు లక్షలాది మంది రవాణా అవసరాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈవీను మాత్రమే ట్యాక్సీలు వాడాలన్న ఢిల్లీ సర్కార్ అమలు చేయడం అసాధ్యమని, కావాలంటే దీనిపై సంబంధిత పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు జరపాలని ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్‌ను కోరింది. మరోవైపు ఉబర్ సంస్థ 2040 నాటికి క్యాబ్ ట్యాక్సీలుగా వాడే వాహనాలన్నీ కర్భన రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నది. వచ్చే మూడేండ్లలో 25 వేల ఈవీలను క్యాబ్ సర్వీసులుగా వాడనున్నట్లు ఉబర్ ప్రకటించింది. -
గ్యాస్ ధర 2012లో రూ.410.. ఇప్పుడేమో 1100.. కట్టెలపొయ్యివైపే జనం మొగ్గు!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా విచ్చలవిడిగా కర్బన ఉద్గారాల విడుదల కారణంగా రోజురోజుకూ భూతాపం పెరిగి అధిక ఉష్ణోగ్రతలకు దారితీస్తోంది. వాతావరణ మార్పుల వల్ల ఎన్నో కష్టనష్టాలు ఎదురవుతున్నప్పటికీ ప్రజల ఆలోచనా తీరు మాత్రం మారడంలేదు. అధిక కర్బన ఉద్గారాల విడుదల కారకాల్లో ఒకటైన వంట చెరకు వినియోగం నేటికీ యథేచ్ఛగా కొనసాగుతోంది. ఎల్పీజీ, సోలార్, విద్యుత్ వాడకం ఆశించిన స్థాయిలో పెరగకపోగా పాతకాలం తరహాలో కట్టెలు, పంట వ్యర్థాలు, పిడకల వినియోగం ఇంకా కొనసాగుతోంది. తద్వారా అడవుల నరికివేత కూడా ఎక్కువవుతోంది. దేశంలో ఇంకా దాదాపు 44 శాతం మంది అడవుల నుంచి కలప, పంటల వ్యర్థాలు, పిడకలను వినియోగించి ఆహారం తయారు చేసుకుంటున్నారు. ఇటుకల తయారీకి కూడా కలప, పంటల వ్యర్థాలు వినియోగిస్తున్నారు. చిన్నచిన్న పరిశ్రమలు సైతం కట్టెలనే వాడుతున్నాయి. చివరకు బయోమాస్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు సైతం పంట వ్యర్థాలు కాకుండా ఏకంగా అటవీ కలపను వినియోగిస్తున్నాయి. మరోవైపు కలపతో బొగ్గు తయారీ కూడా చేస్తున్నారు. ఫలితంగా వెలువడుతున్న వాయు కాలుష్యంతో ఏటా లక్షలాది మంది మరణిస్తున్నారు. ప్రపంచంలో ఈ తరహా మరణాలు చైనా తరువాత భారత్‌లోనే ఎక్కువని అంతర్జాతీయ సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఎల్పీజీ వినియోగం పెరిగినా.. దేశంలో దశాబ్దకాలంగా ఇళ్లలో ఎల్పీజీ వినియోగం పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 30.5 కోట్ల ఎల్పీజీ గృహ వినియోగదారులున్నట్లు ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. 2012లో రూ. 410 ఉన్న 14.5 కేజీల సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 1,100కు చేరుకోవడంతో వినియోగదారుల సంఖ్య పడిపోతోందని డీలర్లు చెబుతున్నారు. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద ఉచితంగా దాదాపు 8 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినా సిలిండర్ ధరలు మోయలేని భారంగా మారిన నేపథ్యంలో చాలావరకు రీఫిల్లింగ్‌కు రావడం లేదని పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ సంఖ్య అధికంగా ఉన్నట్లు సమాచారం. మండల కేంద్రాల్లోనూ సిలిండర్ల పంపిణీ కేంద్రాలు తగిన స్థాయి లో అందుబాటులో లేకపోవడం, దూర ప్రాంతాల నుంచి సిలిండర్లను తెచ్చుకోవాల్సి రావడం వల్ల సిలిండర్ ధరతోపాటు రవాణా చార్జీలు కూడా తడిసిమోపెడవుతున్నాయి. సిలిండర్ అయిపోయిన వెంటనే రీఫిల్ దొరుకుతుందన్న గ్యారంటీ గ్రామీణ ప్రాంతాల్లో లేకపోవడం వల్ల కలపతో ఆహార తయారీకి మొగ్గుతున్నా రు. స్నానాలకు అవసరమైన వేడినీటి కోసం కలపనే వినియోగిస్తున్నారు. పట్టణాల్లో ఎల్పీజీ వినియోగం దాదాపు 88.6 శాతం ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో అది 42 శాతం మాత్రమే ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే గ్రామీణ ప్రాంతాల్లోని గృహిణులు ఇంకా అడవుల నుంచి తెచ్చిన కలప, పంట పొలాల్లోని వ్యర్థాలు, పిడకలను వాడుతున్నారు. కలప కాలడం వల్ల వచ్చే.. కలప, పంట వ్యర్థాలను కాల్చడం వల్ల వెలువడుతున్న వాయు కాలుష్యం వల్ల దేశంలో ఏటా 3.3 లక్షల మంది మరణిస్తున్నారని ‘లాన్సెట్ కౌంట్‌డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్’అధ్యయనం వెల్లడించింది. అదే చైనాలో 3.8 లక్షల మంది, యూరప్‌లో 1.17 లక్షల మంది, యూఎస్‌లో 32 వేల మంది మరణిస్తున్నారని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు దాదాపు 28 కోట్ల మంది ఇంకా కలప, పంట వ్యర్థాలను వినియోగించి ఆహారాన్ని తయారు చేసుకుంటున్నారని సమాచారం. వంట చెరకు కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది మరణిస్తున్నారని పలు అంతర్జాతీయ సంస్థలు తమ సర్వేల్లో పేర్కొంటున్నాయి. ఎల్పీజీ వినియోగిస్తున్న వారిలోనూ 12 శాతం మంది రెండో ఇంధనంగా ఈ కలపను వినియోగిస్తున్నారని గణాంకాలు పేర్కొంటున్నాయి. బొగ్గు డిమాండ్‌ను తగ్గించాలి... చెట్లను కొట్టేయడం వల్ల కర్బన ఉద్గారాలు పెరుగుతాయి. కొట్టేసిన చెట్టును బొగ్గుగా మార్చడానికి విద్యుత్ లేదా ఇతర రూపాల్లో ఇంధనం అవసరమవుతుంది. మళ్లీ బొగ్గును కాల్చినా అది కూడా కాలుష్యమే. ఈ రకంగా మూడు దశల్లోనూ కాలుష్యం ఉంటుంది. నల్లగొండ జిల్లాలో ఈ తరహా కలప కాల్చివేత ఎక్కువగా జరుగుతోంది. ఇదొక పాత విధానమైనా ఇంకా ఎందుకు అనుసరిస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ బొగ్గును అధికంగా చిన్నతరహా పరిశ్రమలు, ఇటుక బట్టీలు, హోటల్స్, దాబాల వంటి వాటిలో వాడుతున్నారు. వీటికి బొగ్గు సరఫరా పెంచితే ఇలాంటి బొగ్గు ఉపయోగించరు. అసలు బొగ్గే వద్దనుకుంటే సబ్సిడీపై విద్యుత్ ఇవ్వాలి. బాయిలర్ వంటివి ఎలక్ట్రిక్‌పై నడిచేవి అందుబాటులోకి తేవాలి. ముందుగా ఈ రకమైన బొగ్గుకు ఉన్న డిమాండ్‌ను తగ్గించాలి. చెట్లు కొట్టేయకుండా చట్టాన్ని తీసుకురావాలి.పచ్చదనానికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి సంబంధించిన డిమాండ్, సప్లయ్‌ను తగ్గించడం ద్వారా అనుకున్న ప్రయోజనాలు పొందొచ్చు. ప్రస్తుతానికైతే చెట్లకు, పర్యావరణానికి నష్టం కలగజేసే వాటిపై ప్రభుత్వపరంగా ఎలాంటి నియంత్రణలు, పర్యవేక్షణలు లేవు. – డాక్టర్ దొంతి నర్సింహారెడ్డి, పర్యావరణవేత్త, పాలసీ అనలిస్ట్ -
పరిస్థితి చేయి దాటకముందే మేల్కొనక తప్పదు! ముందుంది పెను ముప్పు?
దేవభూమి ఉత్తరాఖండ్‌లోని జోషి మఠ్‌లో కాళ్లకింది నేల ఉన్నపళంగా కుంగిపోతున్న తీరు పర్యావరణపరంగా మానవాళి ముందున్న పెను ముప్పును కళ్లకు కట్టింది. పరిస్థితి చేయి దాటకముందే మేల్కొనాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది. జోషి మఠ్ సమస్యకు కారణమైన అడవుల విచ్చలవిడి నరికివేత, పెచ్చరిల్లిన వాతావరణ కాలుష్యం వంటివి ప్రపంచమంతటినీ వేధిస్తున్న సమస్యలే. వాటి పర్యవసానాలను గ్లోబల్ వార్మింగ్, ఆకస్మిక వరదలు, తీవ్ర కరువుల రూపంలో అన్ని దేశాలూ చవిచూస్తూనే ఉన్నాయి. ఈ ప్రాకృతిక విపత్తుల తీవ్రత కొన్నేళ్లుగా బాగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఇవన్నీ మనిషి అత్యాశకు ప్రకృతి ప్రతిస్పందన తాలూకు సంకేతాలే. వాటిని ఇప్పటికైనా అర్థం చేసుకుని తక్షణం నష్ట నివారణ చర్యలు చేపట్టాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. ‘‘లేదంటే అతి త్వరలో పరిస్థితి పూర్తిగా చేయి దాటడం ఖాయం. ఇప్పుడు జోషి మఠ్‌లో జరుగుతున్నది రేపు అన్నిచోట్లా జరుగుతుంది. ప్రకృతితో ఇష్టారాజ్యపు చెలగాటం అంతిమంగా వినాశనానికే దారి తీస్తుంది’’ అంటూ హెచ్చరిస్తున్నారు. ఏం జరుగుతుంది? గ్లోబల్ వార్మింగ్ తదితరాల వల్ల సముద్ర మట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ ధోరణి కొన్నేళ్లుగా వేగవంతమవుతోంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాలు క్రమంగా నీట మునుగుతాయి. మానవాళిపై పెను ప్రభావం చూపగల పరిణామమిది. ఎందుకంటే ప్రపంచ జనాభాలో పదో వంతుకు పైగా సముద్ర తీర ప్రాంతాల్లోనే వ్యాపించి ఉంది. మహా నగరాల్లో కూడా అధిక శాతం అక్కడే ఉన్నాయి. అవన్నీ మునగడమో, పూర్తిగా నివాసయోగ్యం కాకుండా పోవడమో జరుగుతుంది. ఫలితంగా కోట్లాది మంది పొట్ట చేత పట్టుకుని వలస బాట పడతారు. వారందరికీ పునరావాసం, ఉపాధి తదితరాలన్నీ అతి పెద్ద సవాళ్లుగా నిలుస్తాయి. మానవాళి చరిత్రలో ఇది పెను విపత్తుగా మారినా ఆశ్చర్యం లేదు. అంతేగాక మితిమీరిన కాలుష్యం ఇప్పటికే ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తోంది. సురక్షితమైన తాగునీటికి చాలా దేశాల్లో ఇప్పటికే తీవ్ర కొరత ఏర్పడింది. మున్ముందు ఇది మరింత తీవ్రతరం కానుంది. ప్రజలు సరైన తిండికి, తాగునీటికే కాదు, పీల్చేందుకు స్వచ్ఛమైన గాలికి కూడా నోచుకోని పరిస్థితి తలెత్తనుంది! మాటలకే పరిమితం పర్యావరణ నష్టాలకు అడ్డుకట్టే వేసేందుకు చారిత్రక పారిస్ ఒప్పందం మొదలుకుని పలు కాప్ శిఖరాగ్రాల దాకా పేరుకు ప్రయత్నాలెన్నో జరుగుతున్నాయి. కానీ చిత్తశుద్ధితో కూడిన చర్యలు మాత్రం కన్పించడం లేదు. కర్బన ఉద్గారాల తగ్గింపు తదితరాలకు సంబంధించి గొప్ప లక్ష్యాలు నిర్ణయించుకోవడం, తర్వాత మర్చిపోవడం ఆనవాయితీగా సాగుతోంది. ఎవరికి వారు పొరుగు దేశమే ప్రధానంగా బాధ్యత తీసుకోవాలన్నట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కళ్లు మూసుకుని పాలు తాగుతున్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఎటు చూసినా విపత్తులే... ► మంచు ఖండమైన అంటార్కిటికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాలు శరవేగంగా కరుగుతున్నాయి. దీని దుష్ప్రభావం పర్యావరణంపై చాలా రకాలుగా ఉండబోతోంది. ► ఆర్కిటిక్ బ్లాస్ట్ కారణంగా ముందుగా ఇంగ్లండ్ తదితర యూరప్ దేశాలు అతి శీతల వాతావరణంతో అల్లాడాయి. తర్వాత అమెరికా దాని దెబ్బకు 10 రోజులకు పైగా దాదాపుగా స్తంభించిపోయింది. దేశ చరిత్రలో ఎన్నడూ ఎరగనంతటి చలి గాలులు, మంచు తుఫాన్లతో అల్లాడింది. వేల కోట్ల డాలర్ల ఆస్తి నష్టం చవిచూసింది. ► అమెరికాలో ఇటీవలి దాకా కార్చిచ్చులతో అల్లాడిన కాలిఫోర్నియా ఇప్పుడేమో కనీవినీ ఎరగని వరద బీభత్సంతో తల్లడిల్లుతోంది. ► ఉత్తర భారతం కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతటి చలితో వణుకుతోంది. ► పొరుగు దేశం పాకిస్తాన్ గతేడాది దేశ చరిత్రలో ఎన్నడూ చూడనంతటి వరదలతో అతలాకుతలమైంది. మూడొంతుల ప్రాంతాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ఆ ప్రభావం నుంచి పాక్ ఇప్పటికీ కోలుకోలేదు. ఏటా 10 సెం.మీ. కుంగిన జోషీ మఠ్! జోషి మఠ్‌లో నేల 2018 నుంచి ఏటా 10 సెంటీమీటర్ల చొప్పున కుంగుతూ వస్తోందట! అధునాతన శాటిలైట్ ఇమేజ్ విశ్లేషణ ఆధారంగా జరిగిన ఒక తాజా అధ్యయనంలో ఈ మేరకు తేలింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Hyderabad: గుండెకు పొగ పెడుతున్న కాలుష్యం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో కాలుష్యం కోరలు చాస్తోంది. రోజురోజుకు పరిస్థితి తీవ్రంగా మారుతోంది. ముఖ్యంగా డీజిల్ వాహనాల కారణంగా సిటీ పొగచూరుతోందని, గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని పీసీబీ తాజా అధ్యయనంలో తేలింది. గ్రేటర్లో వాహనాల సంఖ్య సుమారు 80 లక్షలకు చేరువైంది. ఇందులో పదిహేనేళ్లకు పైబడిన కాలంచెల్లిన వాహనాలు 20 లక్షలకు పైమాటే. వీటిలో డొక్కు బస్సు లు, ట్రక్కులు, కార్లు తదితర డీజిల్ వాహనాలు విడుదల చేస్తున్న పొగతో ప్రధాన నగరంతోపాటు శివారు ప్రాంతాలు పొగచూరుతున్నాయి. ప్రధానంగా మోటారు వాహనాలు, పరిశ్రమలు విడుదల చేస్తున్న పొగలో సూక్ష్మ ధూళి కణాల(పిఎం2.5) మోతాదు అనూహ్యంగా పెరగడంతో సిటీజన్లలో గుండె కండరాలు, దమనులు దెబ్బ తింటున్నట్లు పీసీబీ తాజా అధ్యయనంలో వెల్లడైంది. నగ రంలో 28 ప్రాంతాల్లో సూక్ష్మ ధూళికణాల మోతాదును ఈ సంస్థ నిపుణులు నమోదు చేశారు. వీరి లెక్కల ప్రకారం ఘనపుమీటర్ గాల్లో సూక్ష్మ ధూళికణాల మోతాదు 32 మైక్రో గ్రాములకు మించరాదు. కానీ ఆయా ప్రాంతాల్లో వీటి మోతాదు 60 మైక్రో గ్రాములకు పైగా నమోదవడం ఆందోళన కల్గిస్తోంది. గుండెకూ చేటు.. ఈ సూక్ష్మ ధూళికణాలు గుండెలోని సూక్ష్మ దమనులు, కెరోటిడ్ ఇంటిమా మీడియాపై పేరుకు పోవడంతో వాటి మందం పెరిగి గుండెకు రక్తసరఫరా తగ్గుతున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. ఈ పరిణామంతో గుండెదడ, గుండెపోటు తదితర హృదయ సంబంధిత సమస్యలు సిటీజన్లలో క్రమంగా పెరుగుతున్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. సూక్ష్మధూళి కణాల కాలుష్యంతో పురుషుల్లో 1.79 శాతం గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని, మహిళల్లో 2.98 శాతం మందికి గుండె సంబందిత సమస్యలు పెరుగుతున్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది. ధూళి కణాల కాలుష్యం మెదడుకు రక్తం సరఫరా చేసే రక్త నాళాలకు కూడా చేటు చేస్తుందని ఈ అధ్యయనం స్పష్టంచేయడం గమనార్హం. చదవండి: Hyderabad: పెంపుడు పిల్లిని ఎత్తుకెళ్లాడు.. సీసీటీవీలో రికార్డు.. కేసు నమోదు కాలుష్యానికి కారణాలివే.. ►పలు కూడళ్లలో వాయు కాలుష్యం అవధులు దాటుతోంది. గ్రేటర్ పరిధిలో సుమారు 80 లక్షలకు పైగా ఉన్న వాహనాలు వెదజల్లుతున్న పొగ, ట్రాఫిక్ రద్దీలో రహదారులపై రేగుతున్న దుమ్ముతో సిటీజన్ల ముక్కుపుటాలు, శ్వాసకోశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ►పలుప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లోచెత్తను తగులబెట్టడంతో కాలుష్య తీవ్రత పెరుగుతోంది. పరిశ్రమలు వెదజల్లుతోన్న కాలుష్యంతో సమీప ప్రాంతాలు పొగచూరుతున్నాయి. ►శివారుప్రాంతాల్లో నిర్మాణ సంబంధ కార్యకలాపాలు పెరగడంతో సూక్ష్మధూళికణాలు పీల్చే గాలిలో చేరి సమీప ప్రాంతాల్లోని సిటీజన్ల ఊపిరితిత్తులోకి చేరుతున్నాయి. ఘణపు మీటరు గాలిలో సూక్ష్మధూళికణాలు(పీఎం2.5) మోతాదు 32 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ పలు కూడళ్లలో పలుమార్లు అంతకు రెట్టింపు స్థాయిలో ధూళికాలుష్యం నమోదవుతోంది. ►గ్రేటర్ పరిధిలో రాకపోకలు సాగించే 80 లక్షలవాహనాల్లో ఏటా సుమారు 109.5 కోట్ల లీటర్ల పెట్రోలు,120.45 కోట్ల లీటర్ల డీజిలును వినియోగిస్తుండడంతో పొగ తీవ్రత ఏటేటా పెరుగుతూనే ఉంది. ►గ్రేటర్ పరిధిలో పదిహేనేళ్లకు పైబడిన కాలం చెల్లిన వాహనాలు 20 లక్షల వరకు ఉన్నాయి. ఇవన్ని రోడ్లపైకి ముంచెత్తుతుండడంతో పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాహనాల నుంచి వెలువడుతున్న పొగ నుంచి కార్భన్‌మోనాక్సైడ్,నైట్రోజన్ డయాక్సైడ్,సల్ఫర్‌డయాక్సైడ్,అమ్మోనియా,బెంజీన్,టోలిన్,ఆర్‌ఎస్‌పీఎం(ధూళిరేణువులు) వంటి కాలుష్య ఉద్గారాలు వాతావరణంలో చేరి నగర పర్యావరణం పొగచూరుతోంది. జాగ్రత్తలు తప్పనిసరి.. ►సూక్ష్మ ధూళి కణాల కాలుష్యం బారిన పడకుండా ముక్కుకు మాస్‌్కలు ధరించాలి. ►కాలం చెల్లిన వాహనాలను రోడ్డెక్కకుండా నియంత్రించాలి. ►ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఎక్కువ సేపు గడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ►కల్తీ ఇంధనాల వినియోగాన్ని కట్టడి చేయాలి. ప్రతీపెట్రోలు బంకులో తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో ఇంధన నాణ్యత తనిఖీలు నిర్వహించాలి. కాలుష్య నియంత్రణ మండలి తాజా లెక్కల ప్రకారం నగరంలో బాలానగర్, ప్యారడైజ్, చార్మినార్, జీడిమెట్ల, లంగర్‌హౌజ్, కూకట్పల్లి, సైనిక్‌పురి, నాచారం, జూపార్క్, పంజగుట్ట తదితర ప్రాంతాల్లో ధూళికాలుష్యం వంద మైక్రోగ్రాములు మించడం ఆందోళన కలిగిస్తోంది. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న స్థానికులు, పాదచారులు, వాహనదారులు ఈ ధూళికాలుష్యంతో అస్తమా, సైనస్, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులతో సతమతమౌతున్నారు. -
ఢిల్లీలో మళ్లీ తీవ్రస్థాయికి వాయు కాలుష్యం
-
కాలుష్య కాసారంగా బెంగళూరు.. ఢిల్లీ తరహా పరిస్థితులు!
నానాటికీ పెరిగిపోతున్న మితిమీరిన వాహనాల సంఖ్య.. తద్వారా వెలువడుతున్న ట్రాఫిక్ ఉద్గారాల కారణంగా సిలికాన్ సిటీ బెంగళూరు నగరం కాలుష్య కాసారంగా మారిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ తరహాలో బెంగళూరులోనూ వాయు కాలుష్య పరిమాణం గణనీయంగా పెరుగుతున్నది. దీంతో రానురాను ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉపయోగించాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. బయటకు రావాల్సిన పరిస్థితుల్లో మాస్కులు ధరించాలని చెబుతున్నారు. కాగా, గతేడాదితో పోలిస్తే నగరంలో గాలి నాణ్యత సూచి (ఏక్యూఐ) సమారు 40 శాతం పెరిగింది. దీంతో గతేడాది నవంబర్‌లో 66 ఏక్యూఐ ఉండగా ఈ ఏడాది అదే సమయానికి 93కు చేరుకుంది. కాగా, శీతాకాల సహజ వాతావరణ పరిస్థితులకు తోడు నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ ఉద్గారాల కారణంగా కూడా ఏక్యూఐ పెరుగుతున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే నగరంలో వాయు కాలుష్య ప్రమాణాన్ని కొలిచేందుకు ఏడు వేర్వేరు చోట్ల కేంద్రాలను ప్రారంభించారు. ఢిల్లీ తరహా పరిస్థితులు బెంగళూరులో క్రమక్రమంగా ఏర్పడుతున్నాయి. ఏక్యూఐ వెబ్సైట్లో క్రమంగా బెంగళూరులో గాలి నాణ్యత సూచీ పెరుగుతుండడం భయాందోళనకు గురిచేస్తోంది. బుధవారం ఏక్యూఐ 150కి చేరుకుంటుందని ఆ వెబ్సైట్ అంచనా వేసింది. -
Delhi air pollution: ఢిల్లీలో డేంజర్ బెల్స్!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రజలను కలవరపెడుతోంది. గత వారం రోజులుగా వాయు నాణ్యత వేగంగా క్షీణిస్తోంది. మరోవైపు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మంగళవారం నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 7.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. సాధారణం కంటే ఇది 3 డిగ్రీలు తక్కువ అని వాతావరణ శాఖ వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. ఇక వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం.. ఢిల్లీలో మంగళవారం ఉదయం 9 గంటలకు 358గా రికార్డయ్యింది. అంటే గాలి నాణ్యత చాలా అధ్వాన్నంగా ఉన్నట్లు తేలింది. ఢిల్లీ ప్రభుత్వ సమాచారం ప్రకారం.. నగరంలో ఏక్యూఐ గరిష్టంగా 2018లో 390, 2019లో 368, 2020లో 435, 2021లో 462గా నమోదయ్యింది. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. సగం మంది పిల్లల్లో శ్వాస సమస్యలు ప్రపంచంలో వాయు నాణ్యత అత్యంత అధ్వాన్నంగా ఉన్న నగరాల జాబితాలో ఢిల్లీ సైతం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) గతంలోనే వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 1,650 నగరాల్లో సర్వే చేసి ఈ చేదు నిజాన్ని బహిర్గతం చేసింది. భారత్‌లో మనుషుల మరణాలకు కారణమవుతున్న వాటిలో వాయు కాలుష్యం ఐదో స్థానంలో ఉంది. దేశంలో ప్రతిఏటా 20 లక్షల మంది వాయు కాలుష్యం కాటుకు బలవుతున్నారు. ఢిల్లీలో నివసించే పిల్లల్లో సగం మంది పిల్లలు (దాదాపు 20.2 లక్షల మంది) శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు అధ్యయనంలో వెల్లడయ్యింది. నగర పరిసర ప్రాంతాల్లో పంట వ్యర్థాల దహనం, రోడ్డుపై దుమ్మూ ధూళి, శిలాజ ఇంధనాల వినియోగం మితిమీరడం, తీవ్రమైన చలి.. వంటివి వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో కాలుష్య కల్లోలం దేశ రాజధాని ఢిల్లీలోనే కాదు, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనూ వాయు కాలుష్యం బెంబేలెత్తిస్తోంది. శీతాకాలంలో సమస్య మరింత ముదురుతోంది. ఏక్యూఐ 201 నుంచి 300 దాకా ఉంటే పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నట్లు అర్థం. ఈ ఏడాది నవంబర్ 27న హైదరాబాద్‌లో ఏక్యూఐ 272గా నమోదయ్యింది. 2019లో ఇదే ప్రాంతంలో ఇదే సమయంలో ఏక్యూఐ 150గా రికార్డయ్యింది. నగరంలో మూడేళ్లలోనే కాలుష్య తీవ్రత భారీగా పెరగడం గమనార్హం. కరోనా ముందు కాలంతో పోలిస్తే హైదరాబాద్‌లో కాలుష్యం 55 శాతానికి పైగానే పెరిగినట్లు స్పష్టమవుతోంది. గాలిలో కంటికి కనిపించని దూళి కణాల సంఖ్యను సూచించే ‘పీఎం 2.5’ కౌంట్ కూడా నగరంలో ‘అనారోగ్యకర’ స్థాయిలో ఉన్నట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వివరాలను బట్టి తెలుస్తోంది. పీఎం 2.5 ఎక్కువగా ఉంటే మనుషుల్లో శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. పీఎం 2.5 స్థాయి 12 యూజీ–ఎం3 కంటే తక్కువగా ఉంటే ‘ఆరోగ్యకరం’గా గుర్తిస్తారు. కానీ, హైదరాబాద్‌లో ఇటీవల ఇది ఏకంగా 93.69 యూజీ–ఎం3గా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. -
కాలుష్య వ్యాధుల కోరల్లో ఢిల్లీ
న్యూఢిల్లీ: కాలుష్యకాసారంగా మారిన ఢిల్లీ–రాజధాని ప్రాంత పరిసరాల (ఎన్సీఆర్) ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొద్ది వారాలుగా ప్రతి ఐదింట నాలుగు కుటుంబాలు కాలుష్య సంబంధ వ్యాధులపాలవుతున్నాయని లోకల్ సర్కిల్స్ అనే సంస్థ సర్వేలో తేలింది. అందులో పాల్గొన్న వారిలో 18 శాతం ఇప్పటికే గాలి కాలుష్యంతో అస్వస్థులై ఆస్పత్రికి వెళ్లొచ్చారు. 80 శాతం కుటుంబాల్లో కనీసం ఇంటికొకరు ఒకరు శ్వాససంబంధ సమస్యను ఎదుర్కొంటున్నారు. వాయు కాలుష్యంతో బెంబేలెత్తిపోయిన ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంత ప్రజలు కొందరు స్వస్థలాలు వదిలి వేరే ప్రాంతాలకు తాత్కాలికంగా తరలిపోయారు. ఇటీవల దీపావళి పర్వదినం సందర్భంగా బాణసంచా వినియోగంతో వెలువడిన దుమ్ము ధూళీతో పొగచూరిన ఢిల్లీలో ఐదు రోజుల తర్వాత ప్రజాభిప్రాయం తీసుకున్నారు. అప్పుడు సైతం ఇదే తరహా కాలుష్య సంబంధ ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయని 70 శాతం మంది పౌరులు ఆవేదన వ్యక్తంచేయడం గమనార్హం. ప్రభుత్వ పాలన, ప్రజాసంబంధాలు, పౌరుల, వినియోగదారుల ప్రయోజనాలు, ఎదుర్కొంటున్న కష్టాలపై సామాజిక మాధ్యమ వేదికగా లోకల్‌సర్కిల్స్ సంస్థ సర్వేలు చేస్తుంటుంది. -
డీజిల్ కారు ఉందా? ఆ రోడ్లపైకి వెళ్లారో రూ.20వేల ఫైన్!
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న వాయు కాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీ సతమతమవుతోంది. గాలి నాణ్యత మెరుగు పడేందుకు ఢిల్లీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. దేశ రాజధానిలో డీజిల్ కార్లను నిషేధిస్తూ రవాణా విభాగం ఆదేశాలు జారీ చేసింది. బీఎస్-6 మినహా డీజిల్‌తో నడిచే పాత వర్షన్ లైట్ మోటార్ వాహనాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గాలి నాణ్యత నిర్వహణ కమిషన్(సీఏక్యూఎం) సిఫార్సు చేసిన నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.20,000 జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేసింది. ఢిల్లీ ట్రాన్స్‌ఫోర్ట్ విభాగం విడుదల చేసిన ఆదేశాల ప్రకారం.. బీఎస్6 వాహనాలు, నిత్యావసర, ఎమర్జెన్సీ సర్వీసుల్లోని వాహనాలకు మాత్రమే అనుమతిస్తారు. ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయి. బ్యాన్ కేటగిరీలోకి వచ్చే వాహనాలు ఉన్న యజమానులకు ఢిల్లీ ట్రాన్స్‌ఫోర్ట్ విభాగం సందేశాలు సైతం పంపించింది. ‘మీ వాహనం నిషేధిత కేటగిరిలో ఉన్నందున ఢిల్లీ రోడ్లపైకి తీసుకురాకూడదు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిస్తే.. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 194 ప్రకారం.. మీకు రూ.20,000 జరిమానా విధించబడుతుంది.’ అనే మెసేజ్‌ను వాహన యజమానులకు పంపించారు. మరోవైపు.. నిషేధం అమలులో ఉన్నప్పటికీ ఢిల్లీ రోడ్లపై అలాంటి వాహనాలు భారీగా తిరగటం గమనార్హం. ఢిల్లీ గాలి నాణ్యత తీవ్ర స్థాయికి చేరుకుంది. ఏఐక్యూ 408కు చేరుకున్న క్రమంలో నగరం మొత్తం నల్లటి పొగ ఆక్రమించేసింది. ఏఐక్యూ 400 దాటితే దానిని తీవ్రమైన కాలుష్యంగా భావిస్తారు. అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. డీజిల్ వాహనాలు మినహాయిస్తే.. సీఎన్జీ, ఎలక్ట్రిక్ ట్రక్కులకు అనుమతులు ఉన్నాయి. ఎమర్జెన్సీ సర్వీసు సేవల్లో ఉన్న డీజిల్ వాహనాలకు మినహాయింపునిచ్చారు. ఇదీ చదవండి: Delhi-NCR Pollution: ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత.. కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయాలు -
ఢిల్లీలో తీవ్రస్థాయిలో వాయు కాలుష్యం ..
-
సాక్షి కార్టూన్ 05-011-2022
సాక్షి కార్టూన్ 05-011-2022 -
ఢిల్లీలో తీవ్ర స్థాయికి చేరిన వాయు కాలుష్యం
-
Delhi air pollution: స్కూళ్లలో ఔట్‌డోర్ బంద్
న్యూఢిల్లీ: ఢిల్లీలో గాలి కాలుష్యం పెరగడంతో విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై పాఠశాలల యాజమాన్యాలు దృష్టిసారించాయి. ‘పాఠశాలల ప్రాంగణాల్లో చిన్నారుల ఆటపాటలు, ఇతరత్రా కార్యక్రమాలు ఉండబోవు. గదుల్లో శ్వాస సంబంధ, యోగా తరగతులు నిర్వహిస్తాం. విద్యాసంవత్సం దెబ్బతినకుండా ఉండేందుకు బోధనను కొనసాగిస్తాం. స్కూళ్ల మూసివేత ఉండదు’ అంటూ కొన్ని పాఠశాలలు నిర్ణయం తీసుకున్నాయి. స్కూళ్లో ఎయిర్ ప్యూరిఫయర్లు, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నాయి. గాలి కాలుష్యం రోజురోజుకూ పెరుగుతుండటంతో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఢిల్లీలో స్కూళ్లు మూసేయాలన్న చిన్నారుల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్(ఎన్సీపీసీఆర్) సూచనపై విద్యార్థుల తల్లిదండ్రులు స్పందించారు. ‘పాఠశాల టైమింగ్స్ పెంచడంతో పెద్దగా ఉపయోగం లేదు. స్కూళ్లు మూసేయాలి. వాయు కాలుష్యంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు’ అని ఢిల్లీ స్కూల్ విద్యార్థుల సంఘం అధ్యక్షులు అపరాజితా గౌతమ్ డిమాండ్‌చేశారు. అయితే, ‘ స్కూళ్లు కొనసాగాల్సిందే. లాక్డౌన్లతో ఇప్పటికే చదువులు దెబ్బతిన్నాయి. పదో తరగతి పరీక్షలు దగ్గరపడుతున్నాయి. ఇంకొంత సేపు స్కూల్ టైమింగ్స్ పెంచాలి’ అని కొందరు తల్లిదండ్రులు వాదిస్తున్నారు. కాగా, ఈనెల 8వ తేదీ వరకు 8వ తరగతిదాకా పిల్లలకు ఆన్లైన్లోనే క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
రాజధాని నిండా రాకాసి గాలి
రాజకీయాలు కలుషితమయ్యాయనే ఆవేదన వింటుంటాం. కానీ, కాలుష్యం మీదా రాజకీయాలు సాగుతున్న పరిస్థితి దేశ రాజధానిలో చూస్తున్నాం. ఢిల్లీలోని వాయు కాలుష్యం ఇప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితికి వచ్చింది. రాగల మూడు రోజులు దారుణంగా ఉంటాయని వార్త. అదే సమ యంలో ఈ అంశంపై కేంద్రంలోని బీజేపీ, ఢిల్లీని ఏలుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ల మధ్య రాజకీయ మాటల యుద్ధం ఏవగింపు కలిగిస్తోంది. పాలన గాలికొదిలేసి, పీల్చేగాలి కూడా సవ్యంగా లేకుండా చేస్తున్న ప్రబుద్ధులు ఆరోపణల పర్వంలో మాత్రం పైచేయి కోసం ప్రయత్నించడం విచారకరం. జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో కాలుష్యానికి వాహనాలు, పంట వ్యర్థాల దహనం, దీపావళి టపాసులు, పరిశ్రమలు, గాలి వేగం లాంటి భౌగోళిక పరిస్థితులు – ఇలా ఎన్నో కారణాలు. ప్రతి ఏటా శీతకాలం మొదలయ్యేసరికి హాయిగా శ్వాస పీల్చుకోలేని పరిస్థితి ఏళ్ళ తరబడిగా వేధిస్తున్నా తగు చర్యలు తీసుకోకపోవడం స్థానిక, కేంద్ర ప్రభుత్వాల సమష్టి వైఫల్యం. ఇవాళ ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల్లో ఢిల్లీ ఒకటి. కళ్ళెదుట ఉన్నది కనిపించనివ్వని దట్టమైన పొగమంచు, దుమ్మూధూళి, పొగ, మసి. ప్రతి శీతకాలంలో లానే ఈసారీ నగరం ఓ విషవాయు గృహంగా మారింది. ఉత్తరాదిలో రోజూ వేలల్లో సాగుతున్న పంట వ్యర్థాల దహనం, ఇతర కాలుష్యాలు మహానగర వాయునాణ్యతను గురువారం సైతం ‘అత్యంత ప్రమాదకర స్థాయి’లో నిలిపాయి. ఒంట్లోని రక్తంలోకీ ప్రవేశించేటంత సూక్ష్మమైన, ప్రమాదభరిత ధూళికణాలు పిఎం2.5 సగటున ప్రతి ఘనపు మీటర్లో 588 ఉన్నాయని తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన దానికన్నా ఇది 40 రెట్లు ఎక్కువ. ఢిల్లీలోనే కాదు, దేశంలో అనేక నగరాల్లో పీల్చేగాలి విషతుల్యమైందన్న కాలుష్య నివారణ మండలి మాట దిగ్భ్రాంతికరం. పొరుగున పంజాబ్‌లోని పొలాల్లో వరి పంట వగైరా కోయగా మిగిలిన దుబ్బులను తగలబెట్టడంతో ఢిల్లీ విషవాయు నగరిగా మారుతోందంటూ, ఢిల్లీ, పంజాబ్‌లను రెంటినీ పాలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని కేంద్ర పర్యావరణ మంత్రి దుమ్మెత్తిపోశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు కాలుష్య నియంత్రణకు స్మోక్ టవర్ల ఏర్పాటు, చెట్ల పెంపకం, నీటి జల్లులు సహా చేయగలిగినదంతా చేస్తున్నామంటున్నారు. రాజకీయాలు అటుంచితే, ఢిల్లీలో ఏటా ఈ సమస్య తలెత్తుతుండడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఎవరు కాదన్నా మహానగరిలోని ఈ కాలుష్యానికి వరి మోళ్ళ దహనం దోహదం చేస్తోంది. పంజాబ్‌లో అధికారంలోకి రాక ముందు అంతా అక్కడి రైతుల పాపమే అన్న ఆప్ ఇప్పుడక్కడ అధికారంలో ఉండీ, నివారించలేకపోతోంది. పంజాబ్ తదితర రాష్ట్రాల్లోని రైతులు ఇతర మార్గాలను అనుసరించేలా చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. గత నెల రోజుల్లో ఈ దుబ్బులు కాల్చడం ఎక్కువైంది. దీనికి కారణాలు చాలానే. నీటి అవసరం ఎక్కువైన వరిసాగు వల్ల భూగర్భ జలాలు క్షీణిస్తా యంటూ పంజాబ్ లాంటి చోట్ల మేలో పంట వేయడంపై నిషేధం పెట్టారు. వర్షాలొచ్చాక జూన్ మధ్యలో ఆలస్యంగా నాట్లు వేయడంతో, అక్టోబర్ ఆఖరులో కానీ పంట చేతికి రాదు. ఆ వెంటనే రబీ సీజన్‌కు వారమే వ్యవధి. దాంతో, త్వరితగతిన పొలాల్ని సిద్ధం చేసేందుకు మోళ్ళను కాల్చడమే రైతుకు మార్గమవుతోంది. అప్పుడే ఉత్తరాదిలో చలికాలం. ఉష్ణోగ్రతలు పడిపోతాయి. వాయువేగం తగ్గుతుంది. వెరసి, కాలుష్యం పెరుగుతోంది. అదే గనక మేలోనే పంట వేయనిస్తే, సెప్టెంబర్‌కే చేతికొస్తుంది. అప్పటికి ఉష్ణోగ్రతలు, గాలి ఎక్కువగానే ఉంటాయి కాబట్టి సమస్య తీవ్రంగా ఉండక పోవచ్చు. అలాగే, పంజాబ్‌లో అధిక శాతం రైతులు నిరుపేదలు కావడంతో కాల్చడానికి బదులు కొయ్యకాళ్ళను తొలగించే యంత్రాలను వాడే స్థోమత లేదు. పైపెచ్చు, ఇతర ప్రత్యామ్నాయాలన్నీ శ్రమతో కూడినవి. అందుకే వ్యర్థాలను కాల్చడాన్నే ఆశ్రయిస్తున్నారు. ఇది గ్రహించి, ఈ పద్ధతిని మార్చడంపై అత్యవసరంగా పాలకులు, వ్యవసాయ నిపుణులు దృష్టి పెట్టాలి. ఒక్క శీతకాలంలోనే కాదు... ఏడాది పొడుగూతా ఎన్సీఆర్లో సగటున పిఎం2.5 గరిష్ఠ పరిమితి కన్నా 20 రెట్లు ఎక్కువ ఉంటోంది. ఇది ఆందోళనకరం. ఇటీవల ఢిల్లీలో వాయు నాణ్యత సూచి (ఏక్యూఐ) 400 మార్కును దాటేయడంతో ఆరోగ్యవంతులకూ ప్రమాద ఘంటిక. 2021 నుంచి ఎన్సీఆర్లో కొన్ని చర్యలు చేపట్టకపోలేదు. వాయునాణ్యత నిర్వహణకు కమిషన్ పెట్టారు. రోజూ ఏక్యూఐ నమోదు, ఎప్పటికప్పుడు వచ్చే కాలుష్యప్రమాదంపై గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్‌ప్లాన్ (గ్రాప్) లాంటివి చేపట్టారు. వీటిని కట్టుదిట్టంగా అమలు చేస్తూ, సంస్థలు సమన్వయంతో సాగితేనే ఫలితం. అలాగే, గాలిలో నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయిని పెంచుతున్న వాహన కాలుష్యానికి పరిష్కారం – వీలైనంతగా ప్రజారవాణా వ్యవస్థను ఆశ్రయించడమే. ప్రభుత్వాలు స్థానికంగా బస్ సర్వీసులు పెంచాలి. మెట్రో స్టేషన్లు సహా ఇతర రవాణా వసతులకు బస్ సర్వీసులను అనుసంధానించాలి. నడక– సైకిల్ వినియోగానికి ప్రాథమిక వసతులను పెంచాలి. పౌరులు సైతం ఢిల్లీ సర్కార్ అభ్యర్థిం చినట్టు పదుగురు కలసి ఒకే కారులో (కార్ పూలింగ్)లో పనికి వెళ్ళడం, వాహన రద్దీని నివారించేలా వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఆశ్రయించడం, అనధికారిక నిర్మాణాలు – వ్యర్థాల దహనాన్ని నిరోధించడం లాంటివి అనుసరించాలి. స్థానిక సర్కార్లపైనే నెట్టేయడం కాక కేంద్ర ప్రభుత్వమూ తన బాధ్యత నిర్వర్తించాలి. సమష్టిగా చర్యలు చేపడితేనే ఫలితం. ఆ దిశగా ప్రతి అడుగూ అమూల్యమైనదే! -
పెట్రోల్, డీజిల్ కార్ల తయారీపై... 2035 నుంచి ఈయూ నిషేధం
బ్రస్సెల్స్: 2035 నుంచి పెట్రోల్, డీజిల్ కార్లు, వ్యాన్ల తయారీపై యూరోపియన్ యూనియన్ దేశాలు నిషేధం విధించనున్నాయి. ఇందుకు సంబంధించిన మొట్టమొదటి ‘ఫిట్ ఫర్ 55’ప్యాకేజీపై ఈయూ ప్రతినిధులు గురువారం అంగీకారానికి వచ్చారు. ఈ దశాబ్దం చివరికల్లా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను 55% మేర తగ్గించడమే ఈ ప్యాకేజీ ఉద్దేశం. దీని ప్రకారం.. కార్లు, వ్యాన్ల నుంచి వెలువడే ఉద్గారాలను 2030 నాటికి 55 శాతానికి తగ్గించి, 2035 కల్లా వందశాతం లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంది. ఒప్పందం అమల్లోకి రావాలంటే ముందుగా ఈయూ పార్లమెంట్, సభ్యదేశాలు ఆమోదం తెలిపాల్సి ఉంటుంది. 2050 నాటికి వాయు ఉద్గారాలను పూర్తిగా తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహమివ్వాలని ఈయూ యోచిస్తోంది. -
కాలుష్యానికి చెక్.. ఇక హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులే..!
సాక్షి, హైదరాబాద్: సాధారణ బస్సులకు బదులుగా వీలైనన్ని ఎలక్ట్రిక్ బస్సులనే స మకూర్చుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. 360 బస్సులు కొనేందుకు ఇప్పటికే టెండర్లు పిలిచింది. మలి దఫాలో మరో 100 బస్సులు తీసుకునే యోచనలో ఉంది. నగరంలో వాహన కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఏకంగా 300 బస్సులను సిటీ సర్వీసులుగా తిప్పాలని నిర్ణయించింది. 50 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ఇంటర్ స్టేట్ సర్వీసులుగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలతో అనుసంధానించాలనుకుంటోంది. కొన్ని నాన్ ఏసీ, ఏసీ బస్సులను కొని, హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలకు తిప్పబోతోంది. ఇవన్నీ అద్దె ప్రాతిపదికన సమకూర్చుకోనుంది. ముంబై తరహాలో పది ఏసీ డబుల్ డెక్కర్ బస్సులనూ హైదరాబాద్‌లో తిప్పబోతోంది. అద్దెతో భారం తక్కువ.. కాలుష్యానికి చెక్.. దేశవ్యాప్తంగా వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఫేమ్ పథకం కింద పలు రాష్ట్రాల ప్రజా రవాణా సంస్థలకు ఎలక్ట్రిక్ బస్సులను అందించింది. ఆ పథకం తొలి దశలో 40 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకున్న తెలంగాణ ఆర్టీసీ, రెండో విడతలో 324 బస్సులకు టెండర్లు పిలిచింది. ఏసీ బస్సులకు డిమాండ్ అంతగా ఉండటం లేదన్న ఉద్దేశంతో తర్వాత రద్దు చేసుకుంది. ఇప్పు డు ఆ పథకం కింద కాకపోయినా, దాదాపు అదే సంఖ్యలో నాన్ ఏసీ బస్సులు తీసుకుంటోంది. ఇటీవలే వాటికి టెండర్లు పిలిచింది. వాటిని సిటీ బస్సులుగా హైదరాబాద్‌లో తిప్పుతారు. బ్యాటరీ బస్సులు కావటంతో వాతావరణ కాలుష్యం ఉండదు. అద్దె ప్రాతిపదికన తీసుకున్నందున నిర్వహణ, డ్రైవర్ ఖర్చు కూడా ఆర్టీసీపై పడదు. విజయవాడ, గుంటూరులకు ఏసీ బ్యాటరీ బస్సులు.. హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూ రు ఏసీ బస్సులకు బాగా డిమాండ్ ఉంటోంది. సిటీ నుంచి తిరిగే ప్రైవేటు బస్సుల్లో మూడొంతులు ఈ మార్గాల్లోనే తిరుగుతా యి. కానీ ప్రైవేటు ఆపరేటర్లు బ్యాటరీ బ స్సులను వాడటం లేదు. దాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు తొలిసారి ఆ మార్గంలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. మల్టీ యాక్సిల్ తరహాలో 13.5 మీటర్ల పొడవుండే భారీ బస్సులను కొనబోతోంది. కుదుపులు లేకపోవడం, శబ్దం ఉండకపోవటంతో రాత్రి వేళ వీటిలో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపుతారని భావిస్తోంది. ఇందుకోసం 50 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్లు పిలిచింది. నగరంలో తిప్పేందుకు ఇప్పటికే 10 ఏసీ ఎలక్ట్రిక్ డబుల్ డెక్క ర్ బస్సులకూ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే మార్చి నాటికి దశలవారీగా ఈ బస్సులన్నీ రోడ్డెక్కనున్నాయి. హైదరాబాద్ నుంచి జిల్లాలకూ... హైదరాబాద్ నుంచి వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్‌లాంటి పట్టణాలకు తిప్పేందుకు కొన్ని ఏసీ, కొన్ని నాన్ఏసీ ఎలక్ట్రిక్ బస్సులూ కొనే యోచనలో ఉంది. ప్రస్తుతం బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులో లేక వాటిని తిప్పటం కష్టంగా ఉంది. దీంతో టెండర్లు దక్కించుకునే సంస్థలే ఆ బ్యాటరీ చార్జింగ్ సెంటర్లు కూడా నిర్వహించాలన్న కండీషన్‌తో త్వరలో టెండర్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 670 సాధారణ బస్సులను సొంతంగా కొంటున్న విషయం తెలిసిందే. క్రమంగా సాధారణ బస్సుల సంఖ్యను తగ్గించుకుంటూ బ్యాటరీ బస్సుల సంఖ్యను పెంచాలన్నది ఆర్టీసీ ఆలోచన. చదవండి: తెలంగాణ రాష్ట్రానికి గ్రీన్ చాంపియన్ అవార్డు -
Air Quality Index: ఆసియాలోని కాలుష్య నగరాల్లో 8 భారత్‌వే
న్యూఢిల్లీ: ఆసియాలోని అత్యంత కాలుష్యమైన టాప్–10 నగరాల్లో ఎనిమిది భారత్‌లోనే ఉన్నాయి. చలికాలం వస్తూ ఉండడంతో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గణాంకాల ప్రకారం హరియాణాలోని గురుగ్రామ్ మొదటి స్థానంలో ఉంటే బీహార్‌లోని ధారుహెరా రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో రాజధాని ఢిల్లీ లేదు. ఇక గాలిలో నాణ్యతా ప్రమాణాలు అత్యుత్తమంగా ఉన్న నగరాల్లో ఆసియా మొత్తంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం ఒక్కటే నిలవడం విశేషం. గురుగ్రామ్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) ఆదివారం ఉదయం 679 ఉంటే ధరుహెరలో 543గా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో లక్నో (298), ఆనందపూర్ బెగుసరాయ్ (269) భోపాల్ (266) ఖడక్‌పడ (256), దర్శన్ నగర్, చాప్రా (239) ఉన్నాయి. -
99 శాతం మందికి కలుషిత గాలే గతి
న్యూఢిల్లీ: దేశ జనాభాలో అక్షరాలా 99 శాతం మంది కలుషిత గాలి పీలుస్తున్నారు. పీఎం 2.5 విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన ప్రమాణాలను మీరిన గాలే దిక్కవుతోంది. గ్రీన్‌పీస్ ఇండియా సంస్థ ‘డిఫరెంట్ ఎయిర్ అండర్ వన్ స్కై’ పేరిట శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. నివేదికలోని ముఖ్యాంశాలు.. ► భారత్‌లో ప్రజలు పీలుస్తున్న గాలి డబ్ల్యూహెచ్ఓ వార్షిక సగటు గైడ్లైన్ కంటే ఐదు రెట్లు అధిక పీఎం 2.5 కణాలు కలిగి ఉంటున్నదే. ► దేశంలో 62 శాతం మంది గర్భిణులు అత్యంత కాలుష్య ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మొత్తం జనాభాలో 56 శాతం మంది ఇలాంటి ప్రాంతాల్లోనే ఉంటున్నారు. ► ఇండియాలో అత్యధిక కాలుష్య ప్రాంతం దేశ రాజధాని ప్రాంతం–ఢిల్లీ. ► కలుషిత గాలి వల్ల వయోవృద్ధులు, శిశువులు, గర్భిణులు అధికంగా ప్రభావితమవుతున్నారు. ► గాలి కాలుష్యానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్‌ను ప్రభుత్వాలు తప్పనిసరిగా ప్రారంభించాలి. ► గాలి కాలుష్యం ఎక్కువగా ఉండేందుకు ఆస్కారం ఉన్న రోజుల్లో రెడ్ అలర్ట్ ప్రకటించాలి. ప్రజలకు ఆరోగ్య సూచనలు జారీ చేయాలి. దీనివల్ల వారు అప్రమత్తంగా వ్యవహరించేందుకు వీలుంటుంది. ► ఇప్పుడున్న జాతీయ గాలి నాణ్యత ప్రమాణాల్లో వెంటనే మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ► నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్(ఎన్సీఏపీ)ను మరింత పారదర్శకంగా, శక్తివంతంగా, సమగ్రంగా రూపొందించాలి. -
ఆవిష్కరణ..: పవర్ బుల్స్ సృష్టించారు!
గాలి మార్పు కోసం సొంత గ్రామానికి వెళ్లారు ఈ దంపతులు. గాలిలో మార్పు సంగతి ఏమిటో గానీ... పేదరైతు జీవితంలో మార్పుకు శ్రీకారం చుట్టే యంత్రాన్ని ఆవిష్కరించారు. ‘ఎలక్ట్రిక్ బుల్’ ఇచ్చిన ఉత్సాహంతో సామాన్య రైతుకు ఉపయోగపడే మరిన్ని యంత్రాల రూపకల్పనకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు... కోవిడ్ కరకు మేఘాలు దట్టంగా అలుముకున్న రోజులవి. ఎటు చూసినా వర్క్ ఫ్రమ్ హోమ్లే! ‘ఊరెళదామా... కాస్త మార్పుగా ఉంటుంది’ భర్త తుకారామ్‌ను అడిగింది సోనాలి వెల్జలి. ‘ఇది సరిౖయెన టైమ్. కచ్చితంగా వెళ్లాల్సిందే’ అన్నాడు తుకారామ్. మార్పు సంగతి ఏమిటోగానీ, ఊరికెళ్లాలి అనే వారి నిర్ణయం పేదరైతు వ్యవసాయంలో కొత్త మార్పునకు శ్రీకారం చుట్టింది. వృత్తిరీత్యా పుణె(మహారాష్ట్ర)లో నివసించే సోనాలి–తుకారామ్ దంపతులు తమ స్వగ్రామం అందేర్సల్కు వెళ్లారు. పండగలకో, పబ్బాలకో ఊరికి వెళ్లినా... ఇలా వెళ్లి అలా వచ్చేవారు. ఈసారి మాత్రం చాలా తీరిక దొరికింది. ఆ తీరిక ఎన్నో విషయాలు తెలుసుకునేలా చేసింది. సోనాలి ఏ రైతుకుటుంబాన్ని పలకరించినా ఒకేలాంటి కష్టాలు. పెద్దరైతులు తప్ప రెండెకరాలు, మూడెకరాలు ఉన్న పేదరైతులు యంత్రాలను ఉపయోగించే పరిస్థితి లేదు. అలా అని పశువులు అందుబాటులో లేవు. కూలీల కొరత మరో సమస్య. కూలీలు అందుబాటులో ఉన్నా డబ్బు మరో సమస్య. ఒకరోజు చిన్నరైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల గురించి భర్తతో మాట్లాడింది సోనాలి. దంపతులు ఇద్దరూ ఇంజనీర్లే. ఆ మాటా ఈ మాటా మాట్లాడుకున్న తరువాత వారికి ‘ఎలక్ట్రిక్ బుల్’ అనే ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో రాత్రనకా, పగలనకా ఆ కాన్సెప్ట్‌పై పనిచేయడం మొదలు పెట్టారు. విషయం తెలిసి ఊళ్లో వాళ్లు గుంపులు గుంపులుగా వీరి ఇంటికి వచ్చేవాళ్లు. వారందరూ పేదరైతులే. పనిలో పనిగా తమ సమస్యలను ఏకరువు పెట్టేవాళ్లు. ‘నా పొలంలో ట్రాక్టర్‌లాంటి పెద్ద యంత్రాలను ఉపయోగించడం వీలు కాదు. ఎద్దుల ద్వారా మాత్రమే సాధ్యం అయ్యే వ్యసాయం మాది. కానీ అవి మా దగ్గర లేవు’ అన్నాడు ఒక రైతు. నిజానికి ఇది ఈ రైతు సమస్య మాత్రమే కాదు ఎందరో రైతుల సమస్య. తయారు కాబోతున్న ‘ఎలక్ట్రిక్ బుల్’ గురించి పేదరైతుల ఆసక్తి గమనించిన తరువాత సోనాలి– తుకారామ్లలో పట్టుదల మరింతగా పెరిగింది. వారి కృషి ఫలించి ఎట్టకేలకు ‘ఎలక్ట్రిక్ బుల్’ తయారైంది. సాంకేతిక నిపుణుల బృందం ఈ యంత్రాన్ని పరీక్షించి ఓకే చెప్పింది. పేదరైతులకు అందుబాటు ధరలలో ఉండే ఈ బుల్‌తో విత్తనాలు చల్లడం నుంచి పిచికారి చేయడం వరకు ఎన్నో పనులు చేయవచ్చు. రైతుకు ఖర్చు బాగా తగ్గు తుంది. ఒక్కసారి ఫుల్‌గా రీఛార్జి చేస్తే నాలుగు గంటల పాటు పనిచేస్తుంది. ‘ఆరు, ఏడు మంది కూలీలతో మూడు రోజులలో చేసే పొలం పనిని ఈ యంత్రం ద్వారా గంటల వ్యవధిలోనే పూర్తి చేయగలిగాను. ట్రాక్టర్ కొనలేని, అద్దెకు తెచ్చుకోలేని చిన్న రైతులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది’ అంటున్నాడు సుభాష్ చవాన్ అనే రైతు. పరీక్షదశలో భాగంగా అతడు ఎలక్ట్రిక్ బుల్‌ను ఉపయోగించి ‘శభాష్’ అంటూ కితాబు ఇచ్చాడు. తమ స్టార్టప్ ‘కృషిగటి’ ద్వారా ఎలక్ట్రిక్ బుల్ల అమ్మకానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు సోనాలి–తుకారామ్ దంపతులు. ‘నాలోని ఇంజనీరింగ్ స్కిల్స్ పేదరైతులకు మేలు చేయడానికి ఉపయోగపడినందుకు సంతోషంగా ఉంది. ఎలక్ట్రిక్ బుల్ దగ్గరే ఆగిపోవాలనుకోవడం లేదు. రైతులకు రకరకాలుగా ఉపయోగపడే ఆరు రకాల యంత్రాలను రూపొందించనున్నాం. మన దేశంలోనే కాదు, ఎన్నోదేశాల్లో ఉన్న రైతులకు ఉపకరించే యంత్రాలు రూపొందించాలనేది మా భవిష్యత్ లక్ష్యం’ అంటుంది సోనాలి. -
హైదరాబాద్ ప్రజలకు ఊపిరి ఆడట్లే.. కారణాలివే!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో ట్రాఫిక్ రద్దీలో వాహనాలు వదులుతోన్న కాలుష్యంతో గ్రేటర్లో ‘భూస్థాయి ఓజోన్ (పొగ కారణంగా విడుదలయ్యే వాయువు)’ మోతాదు ఈ ఏడాది మార్చి–మే మధ్యకాలంలో అనూహ్యంగా పెరిగింది. మూడు నెలల్లో సుమారు 43 రోజులపాటు భూస్థాయి ఓజోన్ మోతాదు పరిమితులు దాటింది. దీంతో ఆస్తమా, బ్రాంకైటిస్ తదితర శ్వాసకోశ వ్యాధులతో సతమతమయ్యే వారి సంఖ్య పెరిగినట్లు తాజా నివేదికలో వెల్లడించింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ గత మూడేళ్లుగా వేసవిలో భూస్థాయి ఓజోన్ మోతాదుపై ఆరు నగరాల డేటాను పరిశీలించింది. ఇందులో ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా మెట్రో నగరాలు మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో గ్రేటర్ సిటీ నాలుగోస్థానంలో నిలవడం గమనార్హం. వాహనాల నుంచి వెలువడుతోన్న కాలుష్య ఉద్గారాలతోపాటు ఓజోన్ వాయువులు సిటీజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ఈ నివేదిక తెలిపింది. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలు ప్రధాన రహదారులపై ఓజోన్ వాయువు గాలిలోని నైట్రోజన్ ఆక్సైడ్స్, ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్లతో కలియడంతోపాటు సూర్యరశ్మి ప్రభావంతో భూ ఉపరితల వాతావరణాన్ని ఓజోన్ దట్టంగా ఆవహించిందని పేర్కొంది. దీంతో ట్రాఫిక్ రద్దీలో చిక్కుకొన్న ప్రయాణికులు, వాహనదారులు, చిన్నారులు, వృద్ధులు, రోగులు, పాదచారులు ఊపిరాడని పరిస్థితిని ఎదుర్కొన్నట్లు స్పష్టంచేసింది. సాధారణంగా ఘనపు మీటరుగాలిలో భూస్థాయి ఓజోన్ మోతాదు వంద మైక్రోగ్రాములకు మించరాదు.. కానీ నగరంలోని ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే సుమారు వంద కూడళ్లలో ఘనపు మీటరు గాలిలో 120 మైక్రోగ్రాములుగా నమోదయినట్లు ఈ నివేదిక వెల్లడించింది. చదవండి: బంజారాహిల్స్: ఖరీదైన కార్లే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు భూస్థాయి ఓజోన్‌తో తలెత్తే అనర్థాలివే... ►అస్తమా, బ్రాంకైటిస్‌తో సతమతమవడంతోపాటు ఊపిరాడని పరిస్థితి ►గొంతు నొప్పి, ముక్కుపుటాలు దెబ్బతినడం, కళ్లు మండడం. ►ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినడం, ఛాతిలో అసౌకర్యం. కట్టడి ఇలా.. ►ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో విధిగా ముక్కు, ముఖానికి మాస్క్‌లు, హెల్మెట్లు ధరించాలి. ►కళ్ల రక్షణకు అద్దాలు ఉపయోగించడం ద్వారా వాయుకాలుష్యం, భూస్థాయి ఓజోన్ వల్ల కలి గే దుష్ప్రభావాలను కొంతమేర నివారించే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. ►కాలంచెల్లిన వాహనాలను రోడ్డెక్కకుండా చూడాలి. ►గ్రేటర్ పరిధిలో ప్రజా రవాణా వ్యవస్థను సిటీజన్లు వినియోగించుకోవాలి. ►పతీ వాహనాని కి ఏటా పొల్యూషన్ చెక్ పరీక్ష లను తప్పనిసరి చేయాలి. ఉల్లంఘించే వారికి భారీగా జరిమానాలు వేయాలి. ►ఇరుకు రహదారులు, బాటిల్‌నెక్స్‌ను తక్షణం విస్తరించాలి. -
ఆరోగ్యానికి పెను ముప్పు.. ఆయుష్షులో ఐదేళ్లు ఫట్!
న్యూఢిల్లీ: వాయు కాలుష్యం దేశ ప్రజల ఆరోగ్యానికి పెను ముప్పుగా మారింది. కాలుష్యం కట్టడికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలు పాటించకపోతే సగటు భారతీయుడి ఆయుర్దాయం ఏకంగా ఐదేళ్లు తగ్గుతుందని తాజా సర్వే ఒకటి హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆయుర్దాయం 2.2 ఏళ్లు తగ్గుతుందని తేల్చింది. ప్రపంచ దేశాల్లో వాయు కాలుష్యంపై అమెరికాలోని షికాగో యూనివర్సిటీకి చెందిన ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ (ఈపీఐసీ) ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (ఏక్యూఎల్‌ఐ)ను విడుదల చేసింది. ప్రపంచంలోనే అత్యంత కలుషిత మహా నగరాల్లో ఢిల్లీ తొలి స్థానంలో ఉంది. గాలిలో అత్యంత కాలుష్య కారకాలైన సూక్ష్మ ధూళికణాలైన పీఎం–2.5 ప్రతి క్యూబిక్ మీటర్లో సగటున 107 మైక్రోగ్రాములకు మించి ఉన్నాయని నివేదిక వెల్లడించింది. ఇది డబ్ల్యూహెచ్ఓ నిర్దేశిత ప్రమాణాల కంటే ఏకంగా 21 రెట్లు ఎక్కువ! ఢిల్లీలో వాయు కాలుష్యం ఇలాగే కొనసాగితే ప్రజల సగటు ఆయుష్షు ఏకంగా పదేళ్లు తగ్గుతుందని వివరించింది. గాలిలో పీఎం–2.5 క్యూబిక్ మీటర్‌కు 5 మైక్రో గ్రాములకు మించొద్దని డబ్ల్యూహెచ్ఓ గతేడాది స్పష్టం చేసింది. 2013 నుంచి ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న వాయు కాలుష్యంలో 44 శాతం వాటా భారత్‌దేనని తెలిపింది. ‘‘దేశంలో 40 శాతం అత్యంత కాలుష్యభరిత ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కాలుష్యం ఇలాగే కొనసాగితే ఉత్తర భారతంలో 50 కోట్ల ప్రజల ఆయుర్దాయం 7.6 ఏళ్లు తగ్గుతుంది’’ అని చెప్పింది. చదవండి: ఏడాదిన్నరలోనే 10 లక్షల ఉద్యోగాలు: ప్రధాని మోదీ -
భారత్‌లో కాలుష్యకాటుకు 24 లక్షలమంది బలి
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో కాలుష్యం కారణంగా 2019లో 23.5 లక్షలకు పైగా అకాల మరణాలు సంభవించాయని లాన్సెట్ జర్నల్ పేర్కొంది. ప్రపంచ దేశాలన్నింటిలో 2019లో సంభవించిన కాలుష్య మరణాలు భారత్‌లోనే అత్యధికమని తెలిపింది. కాలుష్య మరణాల్లో అత్యధికం (16.7 లక్షలు) వాయుకాలుష్యం వల్ల జరిగాయని, వాయుకాలుష్య మరణాల్లో అత్యధిక మరణాలు(9.8 లక్షలు) పీఎం2.5 కాలుష్యకాల వల్ల సంభవించాయని వివరించింది. గాలిలో 2.5 మైక్రాన్లు, అంతకన్నా తక్కువ సైజుండే కణాలను పీఎం 2.5 కాలుష్యకాలంటారు. మిగిలిన వాయు కాలుష్య మరణాలు గృహసంబంధిత వాయు కాలుష్యకాల వల్ల సంభవించినట్లు తెలిపింది. భారత్‌లో 2019లో నీటి కాలుష్యంతో 5 లక్షలు, పారిశ్రామిక కాలుష్యంతో 1.6 లక్షల మంది మరణించారని తెలిపింది. ప్రపంచం మొత్తం మీద 2019లో అన్ని రకాల కాలుష్యాలతో 90 లక్షల మంది మరణించినట్లు నివేదిక తెలిపింది. వీటిలో అత్యధికంగా (66.7 లక్షలు) వాయుకాలుష్యం వల్లనే సంభవించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉందని నివేదిక రూపకర్త రిచర్డ్ చెప్పారు. 2015 నుంచి మాత్రమే దేశాలు కాలుష్య నివారణ బడ్జెట్‌ను స్వల్పంగా పెంచుతున్నాయన్నారు. గంగా మైదానంలో అధికం భారత్‌లో వాయు కాలుష్యం గంగా– సింధు మైదాన ప్రాంతం (ఉత్తర భారతం)లో అధికమని నివేదిక తెలిపింది. ఇళ్లలో బయోమాస్ తగలబెట్టడం వల్ల వాయుకాలుష్య మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. దేశ వాతావరణంలో కాలుష్య కారకాలు 2014లో గరిష్ఠంగా ఉన్నాయని, ఆ తర్వాత కాస్త తగ్గినట్లు కనిపించినా తిరిగి వీటి సరాసరి పెరుగుతోందని తెలిపింది. భారత్‌లో జాతీయ వాయు శుభ్రతా కార్యక్రమం సహా పలు కార్యక్రమాలను ప్రభుత్వం కాలుష్య నివారణకు చేపట్టిందని, కానీ భారత్‌లో వాయుకాలుష్య నివారణకు బలమైన కేంద్రీయ వ్యవస్థ లేదని నివేదిక తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధేశించిన ప్రమాణాల కన్నా భారత వాతావరణంలో కాలుష్యకాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. అయితే సాంప్రదాయక కాలుష్యకాల వల్ల మరణాలు 2000 సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం 50 శాతం వరకు తగ్గినట్లు తెలిపింది. ఇదే సమయంలో కాలుష్యం వల్ల ఆర్థిక నష్టం జీడీపీలో ఒక్క శాతానికి పెరిగిందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం వల్ల జరిగిన ఆర్థిక నష్టం 46లక్షల కోట్ల డాలర్లుగా అంచనా వేసింది. అంతర్జాతీయంగా కాలుష్యాల వల్ల మరణాలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా 7వ స్థానంలో ఉంది. 2015లో చైనాలో 18 లక్షల మంది కాలుష్యంతో మరణించగా, ఈ సంఖ్య 2019లో 21.7 లక్షలకు పెరిగిందని నివేదిక తెలిపింది. -
అంతటా పొల్యూషన్.. ఏదీ సొల్యూషన్!
పొద్దున, సాయంత్రం చల్లగాలి.. వారానికోసారి పార్కులోని చెట్ల గాలి.. ఆఫీసులు, ఇళ్లలో ఏసీ గాలి.. ఇలా ఏ గాలి అయినా ఒకటేనట. ఊరుదాటి వెళితే స్వచ్ఛమైన గాలి దొరుకుతుందన్నదీ ఉత్త మాటేనట. ఇక్కడా, అక్కడా అని కాదు.. భూమ్మీద ఉన్న 700 కోట్ల మంది జనాభాలో 99 శాతం కలుషిత గాలే పీల్చుకుంటున్నారట. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. కరోనా మహమ్మారిని చూసి భయపడుతున్నాంగానీ.. అంతకంటే వేగంగా కాలుష్యం లక్షల మంది ప్రాణాలు తీస్తోందని పేర్కొంది. మరి డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు, సూచనలేమిటో చూద్దామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ నాలుగేళ్లలో మరింత పెరిగి.. గాలిలో ఏయే కలుషితాలు గరిష్టంగా ఎంతవరకు ఉండవచ్చనే దానిపై డబ్ల్యూహెచ్‌వో నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించింది. కానీ ప్రపంచంలో చాలా దేశాల్లో గాలి ఈ ప్రమాణాల మేరకు లేదని డబ్ల్యూహెచ్‌వో తాజా నివేదికలో హెచ్చరించింది. అధిక ఆదాయ దేశాల్లోని నగరాల్లో ఐదో వంతు మాత్రమే కాలుష్య పరిమితుల్లో ఉంటే.. పేద దేశాల్లో ఒక శాతం మాత్రమే తక్కువ కాలుష్యంతో ఉన్నాయని తెలిపింది. ఈ కలుషిత గాలి పీల్చడం వల్ల కోట్ల మందికి గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. భూమ్మీద నాలుగేళ్ల కింద 90శాతంగా ఉన్న ఉన్న కాలుష్య ప్రభావ ప్రాంతం.. ఇప్పుడు 99 శాతానికి చేరిందని తెలిపింది. తూర్పు మధ్యధరా, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో గాలి నాణ్యత మరింత తక్కువగా ఉందని స్పష్టం చేసింది. ఈ కాలుష్యం వల్ల ఏటా లక్షల మంది చనిపోతున్నారని, మరెంతో మంది అనారోగ్యాలతో బాధపడుతున్నారని డబ్ల్యూహెచ్‌వో పర్యావరణ డైరెక్టర్ డాక్టర్ మరియా నీరా వెల్లడించారు. పెట్టుబడులు వాతావరణంలో కాలుష్యాన్ని పెంచుతున్నాయే తప్ప.. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన గాలిని అందించడం లేదని పేర్కొన్నారు. వేగంగా పెరుగుతున్న కలుషితాలు మనుషులు ఏడాదిపాటు పీల్చేగాలిలో 2.5 పీఎం రేణువులు 5 గ్రాములకంటే ఎక్కువ ఉండొద్దు, 10 పీఎం రేణువులు 15 గ్రాములు దాటకూడదు. నైట్రోజన్ ఆక్సైడ్ సాంద్రత ఏడాదికి పదిగ్రాముల కంటే ఎక్కువగా ఉండకూడదు. కానీ చాలా వరకు అధికాదాయ దేశాల్లోని నగరాలు ఈ స్థాయిలను ఎప్పుడో దాటి ప్రమాదకర స్థితికి వెళ్లిపోయాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. తక్కువ ఆదాయ దేశాల్లోని నగరాల్లో ఈ పరిస్థితి కొంత తక్కువగా ఉందని వెల్లడించింది. నైట్రోజన్ ఆక్సైడ్ స్థాయి విషయంలో పేద, ధనిక తేడా లేదని.. అన్ని దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని తెలిపింది. మొత్తంగా 4 వేల నగరాల్లోని 77 శాతం ప్రజలు నైట్రోజన్ ఆక్సైడ్ స్థాయి ఎక్కువున్న గాలినే పీలుస్తున్నారని వెల్లడించింది. తక్కువ స్థాయి వాయు కాలుష్య కారకాలు కూడా గణనీయమైన హానిని కలిగిస్తున్నాయని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో కర్బన ఉద్గారాలను, శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటే తప్ప గాలి కాలుష్య స్థాయిని తగ్గించలేమని స్పష్టం చేసింది. ►పీఎం అంటే పర్టిక్యులేట్ మేటర్ (అత్యంత సూక్ష్మమైన దుమ్ము, ధూళి కణాలు). 2.5 మైక్రోమీటర్లకన్నా చిన్నవాటిని పీఎం 2.5, 10 మైక్రోమీటర్ల పరిమాణం ఉన్నవి పీఎం 10గా పేర్కొంటారు. నిర్మాణాలు జరుగుతున్న చోట, కచ్చారోడ్లు, వ్యవసాయ క్షేత్రాలు, మంటలు, వివిధ రకాల పొగల నుంచి ఇవి ఏర్పడుతాయి. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజైన్ ఆక్సైడ్ వంటి ప్రమాదకర వాయువులు పవర్ ప్లాంట్లు, పరిశ్రమలు, వాహనాల నుంచి ఎక్కువగా వెలువడతాయి. శిలాజ ఇంధనాలపై ఆధారపడొద్దు ‘ఒక మహమ్మారి నుండి బయటపడ్డామనుకుంటే... కాలుష్యాన్ని పెంచుకుంటూ, మనం నివారించగల మరణాలను కూడా కొని తచ్చుకుంటున్నాం. వాయు కాలుష్యం కారణంగా మంచి ఆరోగ్యాన్ని కోల్పోవడం ఆమోదయోగ్యం కాదు. వాతావరణ మార్పులు, కాలుష్యం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను పరిష్కరించాల్సిన అవశ్యకత ఇప్పుడు మన ముందుంది. శిలాజ ఇంధనాలపై తక్కువ ఆధారపడే ప్రపంచం అవసరం’ అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ వ్యాఖ్యానించారు. 117 దేశాల్లో పరిశీలన చేసి.. డబ్ల్యూహెచ్‌వో 117 దేశాల్లోని 6 వేల నగరాల్లో కాలుష్య డేటాను పరిశీలించింది. వాహనాలు, రోడ్ ట్రాఫిక్ వల్ల ప్రమాదకరమైన నైట్రోజన్ ఆక్సైడ్ పెరిగిపోతోందంది. ప్రమాదకర దుమ్ము, ధూళి రేణువుల శాతం పెరిగిందని తెలిపింది. ఇవి గాలి ద్వారా ఊపిరితిత్తుల్లోకి, తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థలోకి చేరుతున్నాయని.. రక్తపోటు, శ్వాస సంబంధిత సమస్యలు, కేన్సర్లకు కారణమవుతున్నాయని తేల్చి చెప్పింది. దుమ్ము, ధూళికి తోడు నైట్రోజన్ ఆక్సైడ్ పెరగడంతో.. ఆస్తమా, దగ్గు, శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నట్లు హెచ్చరించింది. రవాణా, విద్యుత్, సాగు కోసం అధికంగా ఇంధనాన్ని కాల్చడమే కాలుష్యానికి ప్రధాన కారణమని తెలిపింది. ఇబ్బంది పడేవాళ్లెవరు..? కాలుష్యం వల్ల ఎక్కువగా ఊపిరితిత్తులు, గుండె సంబంధిత, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ఇబ్బంది పడతారు. వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు అధికంగా ప్రభావితమవుతారు. ►కాలుష్యంతో తాత్కాలికంగా.. తలనొప్పి, ముక్కు, గొంతు, కళ్లు మంటలు, దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, న్యుమోనియా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు వస్తాయి. ►దీర్ఘకాలికంగా.. కేంద్రనాడీ వ్యవస్థపై ప్రభావంతో తలనొప్పి, యాంగ్జైటీ , గుండె సంబంధిత జబ్బుల పెరుగుదల, ఆస్తమా, కేన్సర్, శ్వాసకోశ ఇబ్బందులు, కాలేయం, ప్లీహం, రక్త ప్రసరణపై ప్రభావం వంటివి తలెత్తుతాయి. మనమేం చేయొచ్చు ►వాహనాల వాడకాన్ని వీలైనంతగా తగ్గించడం. ►కరోనాతో సంబంధం లేకుండా మాస్క్ ధరించే అలవాటు కొనసాగించడం. ►దుమ్ము, ధూళి ఇంట్లోకి రాకుండా చూసుకోవడం. ►రద్దీగా ఉన్న ప్రదేశాలకు వెళ్లినప్పుడు కలుషి తాల నుంచి రక్షణ పొందేలా ఏర్పాట్లు చేసుకోవడం. -
కబళించనున్న వాయుకాలుష్యం
మన దేశంలో ఇటీవలి కాలంలో పెరిగిన వాయు కాలుష్యంతో మరణించిన వారి సంఖ్య గత రెండు దశాబ్దాలలో రెండున్నర రెట్లు పెరిగింది. ఏటా ఈ వాయు కాలుష్యానికి 70 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా లెక్కలు చెబుతున్నాయి. కచ్చితంగా చెప్పాలంటే 2019లో ప్రపంచ వ్యాప్తంగా సంభ వించిన వాయుకాలుష్య మరణాలలో మన దేశంలోనే 25 శాతానికి పైగా నమోదయ్యాయని ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్’ తాజా నివేదిక చెబుతోంది. ఈ నివేదిక ప్రకారం ఒక్క 2019 లోనే ప్రపంచ వ్యాప్తంగా వాయుకాలుష్యం కాటుకు 66.7 లక్షల మంది బలయ్యారని తెలుస్తోంది. ఇందులో 16 లక్షల మరణాలు భారత్‌లోనే నమోదయ్యాయట. వాయు కాలుష్యం కారణంగా 2019లో ప్రపంచంలో పుట్టిన నెలలోపే ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల సంఖ్య 4.76 లక్షలు కాగా, మన దేశంలో అది 1.16 లక్షలుగా నమోదయింది. ప్రపంచంలో 99 శాతం మంది ప్రజలు పీలుస్తోంది కలుషిత గాలేనని డబ్లు్యహెచ్‌ఓ కుండ బద్దలు కొడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొనసాగుతున్న కర్బన ఉద్గారాల విడుదల రానున్న కాలంలో మరింత పెరిగితే ప్రపంచ దేశాలన్నీ వాతావరణ మార్పుల ముప్పు బారిన పడతాయని ‘ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఫర్ క్లైమేట్ ఛేంజ్’ (ఐపీసీసీ) తన తాజా అధ్యయనంలో హెచ్చరించింది. మానవ కల్పిత వాతావరణ మార్పులు ప్రపంచ దేశాలన్నింటిపైనా తీవ్ర విపరిణామాలు చూపుతున్నాయని ఐపీసీసీ కమిటీ ఛైర్మన్ హో సెంగ్ లీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ వాతావరణ మార్పులకు బడుగు బలహీన వర్గాల ప్రజలు, వారికి సంబంధించిన మౌలిక వసతుల వ్యవస్థలు దెబ్బ తింటున్నాయని ఆయన వ్యాఖ్యా నించారు. ఈ మానవకల్పిత వాతావరణ మార్పులకు మన దేశంలో లక్నో, పట్నా నగరాలు ప్రధానంగా గురవు తున్నా... అనేక ఇతర నగరాలూ ప్రమాదపుటంచుల్లో ఉన్నాయి. దీనికి తోడు గత రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి కారణంగా ఒకసారి వాడి పడేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వినియోగం పెరిగి కాలుష్యం మరింత పెరిగిపోయింది. కర్బన ఉద్గారాలు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగితే ఈ శతాబ్ది చివరి నాటికి వాతావరణ ఉష్ణోగ్రతలు ప్రపంచ వ్యాప్తంగా 30 డిగ్రీలకు పైగా పెరిగే ప్రమాదం వుందని ఐపీసీసీ ఛైర్మన్ హెచ్చరిస్తున్నారు. రానున్న కాలంలో వాతావరణ మార్పుల బాధితులను ఆదుకునేందుకు భారత్ సిద్ధమవుతోందని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. వాతావరణ మార్పుల బాధితు లను ఆదుకునేందుకు ఇప్పటికే జాతీయ స్థాయి నిధినీ, ‘విపత్తు నివారణ మౌలిక వసతుల వ్యవస్థ’నూ ఏర్పాటు చేశామనీ, 2030 నాటికి మన విద్యుత్ ఉత్పత్తి అవసరాలకు దేశం శిలాజ ఇంధనాల వినియోగాన్ని 30 శాతానికి తగ్గించుకునేందుకు 2015 నాటి పారిస్ ఒప్పందంలో అంగీకరించిందనీ ప్రభుత్వం గుర్తు చేసింది. ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న వాతావరణ మార్పుల సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ దేశాలన్నీ ఒక్కతాటి మీదకు రావల్సిన అవసరం వుంది. మన దేశంలో పర్యావరణ మండలి వంటి వ్యవస్థ ఏర్పాటు చేయవలసి ఉంది. దీన్ని ఏర్పాటు చేస్తే 2070 నాటికి పర్యావరణ పరిరక్షణకు అవసరమైన కర్బన ఉద్గారాలకు అడ్డుకట్ట వేయా లన్న లక్ష్యసాధనకు చేరుకోవచ్చు. (చదవండి: ఎరువుల వెతలకు శాశ్వత పరిష్కారం!) నవీన నాగరికతకు అనుగుణంగా పెరుగుతున్న మన ఇంధన అవసరాలను తీర్చుకునే క్రమంలోనే వాతావరణ మార్పులు పెరుగుతున్నాయి. బొగ్గు, చమురు, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాల వినియోగంతో వెలువ డుతున్న ఉద్గారాలు ప్రపంచాన్ని ప్రమాదపుటంచుకు చేరుస్తున్నాయి. ఈ ఉద్గారాలతో కేవలం ధరిత్రి మాత్రమే, కాదు ఇంధన విపణి కూడా ఉడికిపోతోంది. ఈ ధరల పెరుగుదలతో అయినా హరిత, స్వచ్ఛ ఇంధన భవిష్యత్తు దిశగా మనం ప్రయాణిస్తామా అన్న సందేహం తలెత్తు తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం చమురు సరఫరాలకు విఘాతం కలిగిస్తోందని చెప్పక తప్పదు. దీనితోనయినా మనం స్వచ్ఛ ఇంధన భవిష్యత్తు దిశగా అడుగులు వేయాలన్న ఆకాంక్ష అందరిలోనూ వ్యక్తమవుతోంది. (చదవండి: వ్యవసాయరంగంలో నిశ్శబ్ద విప్లవం) - కేవీ రమణమూర్తి సీనియర్ పాత్రికేయులు -
99 శాతం ప్రజలు పీల్చేది కలుషిత గాలే!
జెనీవా: ప్రపంచంలోని 99 శాతం జనాభా కలుషిత గాలి పీలుస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దాదాపు జనాభా మొత్తం ప్రమాణాలకు తగినట్లుగా లేని గాలినే పీలుస్తున్నారని, దీన్ని నివారించాలంటే వెంటనే శిలాజ ఇంధన వాడకాన్ని తగ్గించాలని సూచించింది. ఈ ఇంధన వాడకాలతో వాయుకాలుష్యం ఏర్పడుతోందని, దీనివల్ల రక్త సంబంధ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు ప్రబలి ఏటా 70 లక్షల మరణాలు జరుగుతున్నాయని తెలిపింది. గాల్లో పీఎం 2.5, పీఎం10 అనే పర్టిక్యులేట్ మేటర్‌ను ఆధారంగా చేసుకొని వాయునాణ్యతను సంస్థ నిర్ధారిస్తుంది. భారత్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాలు తక్షణమే కర్బన ఉద్గారాల స్థాయిల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని, పర్యావరణహిత ఇంధన వాడకాన్ని ప్రోత్సహించాలంది. -
గాలి నిండా గరళమేనా?!
మనం పీలుస్తున్న గాలి ఎంత నాణ్యమైనది? ఎంత సురక్షితమైనది? పైకి మామూలుగా అనిపించినా, ఇవి ఎంతో కీలకమైన ప్రశ్నలని తాజా ‘ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక –2022’తో మరోసారి తెలిసొస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యభరిత రాజధానిగా ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచిందన్న మాట ఆందోళన రేపుతోంది. వరుసగా నాలుగో ఏడాది ఢిల్లీకి ఈ అపకీర్తి కిరీటం దక్కడం పరిస్థితి తీవ్రతకు దర్పణం. ప్రపంచ వ్యాప్తంగా 117 దేశాల్లోని 6475 ప్రాంతాల్లో కాలుష్యగణన చేసి, స్విట్జర్లాండ్ సంస్థ ‘ఐక్యూ ఎయిర్’ మంగళవారం విడుదల చేసిన ఈ నివేదిక ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. గడచిన 2020 నాటి కాలుష్య ర్యాంకులను కొట్టిపారేసిన పాలకులు తిరుగులేని సాక్ష్యంతో వచ్చిన తాజా 2021 నివేదికకు ఏం జవాబిస్తారు? కాలుష్యంలో ‘టాప్–100’ నగరాల జాబితా తీస్తే, అందులో 63 నగరాలు మన దేశంలోవే! వాటిలో సగానికన్నా ఎక్కువ ఢిల్లీ చుట్టుపక్కలి హరియాణా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లోవే. ఈ కఠిన వాస్తవం దేశంలో తక్షణ చర్యల అవసరాన్ని మళ్ళీ గుర్తు చేస్తోంది. గాలిలో కాలుష్యకారక కణాల (పీఎం) వార్షిక సగటు 2.5 స్థాయి అంటే, ఘనపుమీటరుకు 5 మైక్రో గ్రాములకు మించి కాలుష్య కణాలు ఉండకూడదు. కానీ, మన దేశంలో ఏ నగరంలో పరిస్థితీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ఓ) నిర్దేశిత ప్రమాణాలకు తగ్గట్టు లేదు. ఉత్తరాదిన మరీ దారుణం. కాలుష్యంలో అగ్రభాగాన నిలిచిన తొలి 15 ప్రపంచ స్థలాల చిట్టాలోనూ ఏకంగా 10 భారతీయ నగరాలే! రాజస్థాన్‌లోని భివాడీ, ఉత్తర ప్రదేశ్‌లోని ఘాజియాబాద్, చైనాలోని హోటన్ తర్వాత వాయు కాలుష్యంలో నాలుగో ర్యాంక్ ఢిల్లీదే. రాజధానిలో కాలుష్యం గత ఏడాది కన్నా దాదాపు 15 శాతం ఎక్కువైంది. అక్కడ డబ్ల్యూహెచ్ఓ పరిమితుల కన్నా దాదాపు 20 రెట్లు ఎక్కువ వాయు కాలుష్యం నెలకొంది. విశాఖపట్నం, హైదరాబాద్ లాంటి తెలుగు ప్రాంతాలూ ఈ వాయు కాలుష్య జాబితాలో ఉన్నాయి. ప్రకృతి, పర్యావరణం, జలాశయాల పరిరక్షణ ధ్యేయంగా దశాబ్దాల క్రితం చేసిన జీవో 111ను సైతం తెలంగాణ సర్కార్ ఎత్తివేస్తామంటున్న వేళ... హైదరాబాద్ 232వ స్థానంలో నిలవడం మరింత ఆందోళనకరం. మన దేశంలో ఇప్పుడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న రెండో అతి పెద్ద కారణం – వాయు కాలుష్యమే. దీనివల్ల ఏటా దాదాపు 15 వేల కోట్ల అమెరికన్ డాలర్ల పైగా ఆర్థిక నష్టం కలుగుతోందని అంచనా. కరోనా కాలంలో లాక్డౌన్ల పుణ్యమా అని దేశంలో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గిందని వార్తలు వచ్చాయి. కానీ చిత్రం ఏమిటంటే – ఇప్పుడు మన దేశంలో పీఎం స్థాయి మళ్ళీ లాక్డౌన్ల పూర్వం ఉన్న 2.5కి చేరుకోవడం! వాహన ఉద్గారాలు, ఇంధన ఉత్పత్తి, పారిశ్రామిక వ్యర్థాలు, వంట కోసం బయోమాస్ దహనం, నిర్మాణ రంగం, పంటల కాల్చివేత లాంటివన్నీ ఈ వాయు కాలుష్యానికి మూలాలు. పట్టణ భారతావనిలో అయితే ఈ పీఎం 2.5 స్థాయిలో 20 నుంచి 35 శాతం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మోటారు వాహనాల ఇంజన్ల వల్లేనని నిపుణుల మాట. ఏటా వాహనాల అమ్మకాలు పెరిగిపోతున్న భారత్‌లో వచ్చే 2030 నాటి కల్లా వాహనాల సంఖ్య 1.05 కోట్లకు చేరుతుందన్న అంచనా మరింత భయపెడుతోంది. నిజానికి, దేశంలో వాయు కాలుష్యాన్ని పర్యవేక్షించడం కోసం 2015 ఏప్రిల్ 7న మోదీ సర్కార్ ఆర్భాటంగా ‘జాతీయ వాయు నాణ్యతా సూచి’ పథకాన్ని ప్రకటించింది. కానీ, వాక్శూరత్వమే తప్ప ఒరిగిందేమీ లేదని తాజా లెక్కలు తేల్చేస్తున్నాయి. 2024 నాటి కల్లా గుర్తించిన నగరాలలో పీఎం స్థాయి 20 నుంచి 30 శాతం మేర తగ్గేలా చూస్తామనీ పాలకులు సంకల్పం చెప్పుకున్నారు. అందు కోసం 2019లో ‘జాతీయ స్వచ్ఛ వాయు పథకం’ (ఎన్సీఏపీ)ని కేంద్ర పర్యావరణ శాఖ చేపట్టింది. అది ఏ మేరకు సఫలమైందన్నదీ స్పష్టం కాలేదు. మూడేళ్ళుగా లాక్డౌన్ సహా రకరకాల కారణా లతో గాలి నాణ్యత పెరుగుతోందని ఆశిస్తుంటే, వాస్తవం తద్విరుద్ధంగా ఉందని తాజా నివేదిక తేల్చేసింది. గత 2020 నాటి నివేదిక వాయు కాలుష్యంలో ప్రపంచంలో భారత్‌ది మూడో స్థానమని పేర్కొంది. అది ఉపగ్రహ డేటాయే తప్ప క్షేత్రస్థాయి వాస్తవం కాదంటూ అప్పట్లో కేంద్రం కొట్టిపారే సింది. ఇప్పుడీ 2021 నివేదిక క్షేత్రస్థాయి సెన్సర్ల నుంచి సేకరించినదే. ఆ సెన్సర్లలో సగం సాక్షాత్తూ ప్రభుత్వ సంస్థలు నడుపుతున్నవే. పాలకులు బుకాయించడం, మాటలతో మభ్యపెట్టడం కష్టమే. ప్రజల ఆరోగ్యానికే ప్రమాదం గనక సర్కారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ప్రధానంగా నగరాల మీదే దృష్టి పెట్టడమూ ఎన్సీఏపీ లాంటి పథకాలలోని లోపమని గుర్తించాలి. కాలుష్య నియంత్రణలో వర్తమాన విధానం విఫలమైనందున సరికొత్త వ్యూహరచన చేయాలి. తాజా నివేదికలో సిఫార్సు చేసినట్టుగా వ్యక్తిగత వినియోగానికి కాలుష్యరహిత స్వచ్ఛ వాయు వాహనాలను వాడేవారికి ప్రోత్సాహకాలు ఇచ్చేలా చట్టాలు చేయడం లాంటివి ఆలోచించాలి. రాష్ట్ర పాలకులు సైతం సీజన్లో మళ్ళీ కొయ్యకాళ్ళను కాల్చడం లాంటివి మొదలు కాకముందే బయో డీకంపోజర్ లాంటివి విస్తృతంగా రైతులకు అందుబాటులోకి తేవాలి. అటు ఢిల్లీ, పంజాబ్‌ల్లో అధికారంలో ఉన్న ‘ఆప్’, ఇటు హరియాణా, యూపీల్లో గద్దె మీదున్న బీజేపీ సమన్వయంతో జాతీయ రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యతను కాపాడాలి. అటవీ పెంపకం లాంటి ఆలోచనలు ఎన్ని చేసినా, చివరకు వాటి అమలులో చిత్తశుద్ధి అవసరం. అది లోపించి, ఆరావళి సహా అనేక అంశాలపై తప్పుదోవలో కొనసాగితే పరిస్థితి ఏటేటా దిగజారుతుంది. మాటల కన్నా చేతలు ముఖ్యమంటున్నది అందుకే! -
పీల్చే గాలిని సైతం విషంగా మార్చిన ఉక్రెయిన్ యుద్ధం!
Lot of smoke in Kyiv, people can't breathe properly: రష్యా ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తూనే ఉంది. ప్రధాన నగరాలే లక్ష్యంగా పెద్ద ఎత్తున క్షిపణి దాడులు నిర్వహిస్తోంది. దీంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ మొత్తం దట్టమైన పొగ మేఘంతో కప్పబడి ఉంది. దీంతో ఉక్రెయిన్ అధికారులు గాలి నాణ్యత.. అనారోగ్యకరమైన స్థాయిలో ఉందని నివాసితులు తమ కిటికీలు తెరవవద్దని, అనవసరంగా తమ ఇళ్లను విడిచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక వాయు నాణ్యత మార్గదర్శక విలువ కంటే ప్రస్తుతం కీవ్‌లోని గాలిలో కాలుష్య కారకాల సాంద్రత 27.8 రెట్లు ఎక్కువగా ఉందని ఓ నివేదిక తెలిపింది. మార్చి19 నుంచి వాయు నాణ్యత ప్రమాదకరంగా ఉందని నివేదిక పేర్కొంది. అంతేకాదు కీవ్‌లో పొగ ఎక్కువగా ఉందని, ప్రజలు సరిగా ఊపిరి పీల్చుకోలేకపోతున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. అతేకాదు గాలిలో పొగలు కమ్ముకుంటున్నందున ప్రజలు తమ కిటికీలు తెరవవద్దని, అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని నగర పాలక సంస్థ కూడా ప్రజలను కోరింది. ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి కీవ్‌లో అనేక పేలుళ్లు, వైమానిక దాడులు జరుగుతున్నాయి. దీంతో దాదాపు అన్ని జిల్లాల్లో గాలి నాణ్యత గణనీయంగా పడిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. ఉక్రెయిన్- రష్యా వార్ ముఖ్యాంశాలు ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధం ప్రకటించి 24 రోజులైంది. ఐక్యరాజ్యసమిది నివేదిక ప్రకారం, 3.2 మిలియన్ల మంది ప్రజలు దేశం నుంచి పారిపోగా, మరో 6.5 మిలియన్ల మంది ఉక్రెయిన్‌లోని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఈ యుద్ధంలో వందలాది మంది పౌరులతో పాటు, 112 మంది పిల్లలు మరణించారని దాదాపు 13 వేల మంది రష్యా సైనికులు మృతి చెందారని ఉక్రెయిన్ పేర్కొంది. యుద్ధాన్ని ఆపడానికి, అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించాయి. అయితే, అధ్యక్షుడు జెలెన్స్కీ పదేపదే అభ్యర్థనలు చేసినప్పటికీ, నాటో నేరుగా పాల్గొనడానికి లేదా ఉక్రెయిన్‌పై నో-ఫ్లై జోన్‌ను ఏర్పాటు చేయడానికి నిరాకరించింది. ఉక్రెయిన్, రష్యాలు శాంతి చర్చలు జరుపుతున్నాయి. ఉక్రేనియన్ అధికారులతో చర్చలు జరుపుతున్న రష్యా ప్రతినిధి బృందం శుక్రవారం ఒక ఒప్పందానికి దగ్గరగా వచ్చాయని చెప్పారు. (చదవండి: పాపం మూగజీవాలు..యుద్ధం వల్ల మనుషులకే కాదు పశువులకు ఇబ్బందులే!) -
హైదరాబాద్: ఊపిరి ఉక్కిరిబిక్కిరి!.. ఏడాదికి 98 రోజులు అంతే
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ సిటీజన్లు ఏడాదికి 98 రోజులపాటు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఊపిరితిత్తులకు పొగబెట్టే సూక్ష్మ ధూళికణాల మోతాదు 2020 కంటే.. 2021 చివరి నాటికి గణనీయంగా పెరిగినట్లు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. ఘనపు మీటరు గాలిలో సూక్ష్మ ధూళికణాల మోతాదు (పీఎం– 2.5) సరాసరిన 41 మైక్రోగ్రాములుగా నమోదైనట్లు లెక్కతేల్చింది. కాలుష్యం కారణంగా నగరవాసులు శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు స్పష్టం చేసింది. 2020లో కాలుష్య మోతాదు లాక్డౌన్ కారణంగా తగ్గుముఖం పట్టినట్లు అంచనా వేయడం విశేషం. దక్షిణాదిలో ఇక్కడే అత్యధికం.. ► దక్షిణాది రాష్ట్రాల్లో వాయు కాలుష్యంలో గ్రేటర్ నగరం మూడోస్థానంలో నిలిచినట్లు ఈ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. రెండోస్థానంలో పొరుగునే ఉన్న ఏపీలోని విశాఖపట్టణం నిలవడం గమనార్హం. 2020లో నగరంలో 60 రోజులు మాత్రమే కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేయగా.. 2021 సంవత్సరంలో గ్రేటర్ సిటీలో 98 రోజుల పాటు భరించలేని కాలుష్యంతో సతమతమైందని ఈ నివేదిక తెలిపింది. విశాఖపట్టణం 86 రోజులపాటు కాలుష్యంతో అవస్థలు పడుతోందని నివేదిక వెల్లడించింది. ప్రధానంగా దక్షిణాదిలో డిసెంబరు– మార్చి మధ్యకాలంలో వాయు కాలుష్యం పెరుగుతోందని పేర్కొంది. చదవండి: ముచ్చింతల్‌లో సీఎం కేసీఆర్.. సమతామూర్తి స్పూర్తి కేంద్ర సందర్శన ► శీతాకాలంలో కాలుష్య తీవ్రత అధికంగా ఉంటున్న కారణంగా సిటీజన్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నట్లు తేల్చింది. ఏడాదిలో గ్రేటర్ సిటీలో 98 రోజుల పాటు భరించలేని కాలుష్యం.. మరో 96 రోజులపాటు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలకు లోపలే వాయు కాలుష్యం నమోదవుతుండడంతో వాయు నాణ్యత సంతృప్తికరంగానే ఉన్నట్లు వెల్లడించింది. శీతాకాలంలో సూక్ష్మ ధూళికణాల మోతాదు డిసెంబరు 26, జనవరి 3, 2021 తేదీల్లో అత్యధికంగా నమోదైందని తెలిపింది. ► ఈ రెండు తేదీల్లో ఘనపు మీటరు గాలిలో అత్యధికంగా 81 మైక్రోగ్రాములుగా నమోదవడం గమనార్హం. పారిశ్రామిక అడ్డాగా ఉన్న సనత్‌నగర్ ప్రాంతంలో సరాసరిన 83 మైక్రోగ్రాముల మేర సూక్ష్మ ధూళికణాలు నమోదయినట్లు సీఎస్ఈ నివేదిక వెల్లడించింది. గచ్చిబౌలిలోని సెంట్రల్ వర్సిటీ వద్ద కూడా సరాసరిన ఘనపు మీటరు గాలిలో 57 మైక్రోగ్రాములుగా ధూళి కాలుష్యం నమోదవడం గమనార్హం. చదవండి: భద్రతా వలయంలో శ్రీరామనగరం.. అడుగడుగునా పోలీసు నిఘా -
Pudami Sakshiga:అడవి సృష్టికర్త "దుశర్ల సత్యనారాయణ"
-
వాయుకాలుష్య చక్రబంధంలో ట్రాఫిక్ పోలీస్..
హైదరాబాద్ మహా నగరంలో అర గంట ప్రయాణం చేస్తే చాలు... ‘అబ్బో! ఎంత వాయు కాలుష్యం’ అంటూ గాభరా పడని వాళ్ళుంటారా? ఇంటి నుంచి బయటకొస్తే చెవులు చిల్లులు పడుతున్నాయని ‘ధ్వని కాలుష్యం’ గురించి చెప్పని వాళ్ళుంటారా? కానీ, సిటీ ఈ చివర్నుంచి.. ఆ చివరి వరకూ అడుగుడుగునా కనిపించే ట్రాఫిక్ పోలీసుల పరిస్థితేమిటి? తెల్లటి షర్ట్‌తో బయటకెళ్ళిన ఆ వ్యక్తి గంటలో నల్లగా మసిబారిపోవడం రోజూ మనం చూస్తున్నదే. కంటికి కన్పించే ఈ నిజం వెనుక కొన్ని కఠోర సత్యాలున్నాయి. వాయు కాలుష్యం వల్ల ట్రాఫిక్ పోలీసుల్లో 32 శాతం మంది ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నారట. ధ్వని కాలుష్యం వల్ల 25 శాతం మంది వినికిడి సమస్యలు ఎదుర్కొంటున్నారట. మరో 7 శాతం మంది సర్వీసులో ఉండగానే తీవ్రమైన దృష్టి లోపానికి గురవుతున్నారట. హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్, ఒకప్పటి నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ సీవీ ఆనంద్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఇచ్చిన నివేదికలోని పరిశీలనలివి. హైదరాబాద్ లో 3,236 ట్రాఫిక్ పోలీసులు అనుదినం విధుల్లో ఉంటారు. ఇందులో 19 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 77 మంది ఇన్స్పెక్టర్లు, 13 మంది ఏఎస్ఐలు, 172 మంది హెడ్ కానిస్టేబుళ్ళు, 846 మంది కానిస్టేబుళ్ళు, 1276 మంది హోం గార్డులూ ఉన్నారు. సీవీ ఆనంద్ నివేదిక ప్రకారం.. హైదరాబాద్ నగర పరిధిలో 585 ట్రాఫిక్ జంక్షన్లుంటే, ఇందులో చాదర్‌ఘాట్, దిల్సుఖ్నగర్, మదీనా, మొజాంజాహి మార్కెట్, లక్డీకాపూల్, సంజీవరెడ్డి నగర్ జంక్షన్లలో అత్యధికంగా వాయు, ధ్వని కాలుష్యం ఉంది. మరో 200 ట్రాఫిక్ జంక్షన్లలో కాలుష్యం మధ్యస్తంగా ఉన్నట్టు గుర్తించారు. రంగారెడ్డి సహా హైదరాబాద్ సిటీ 625 కిలో మీటర్లు విస్తరించి ఉంది. ఇక్కడ 70 లక్షల మంది నివసిస్తుంటే.. వచ్చిపోయే జనాభాను కలుపుకుంటే నగర జన సంచారం కోటి వరకూ ఉంటుంది. ఒకప్పుడు పరిమితంగా ఉన్న పారిశ్రామిక ప్రాంతం ఇప్పుడు అన్ని వైపులా విస్తరించింది. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు జనావాసాలకు దగ్గరగా ఉంటున్నాయి. హిమాయత్ సాగర్ మొదలు కొని మాదాపూర్, అమీర్‌పేట వరకూ ఐటీ హబ్ ఊహించని విధంగా విస్తరించింది. రవాణాశాఖ లెక్కల ప్రకారం నగరంలో 50 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. ప్రజలు ప్రతిరోజూ వెయ్యి వాహనాలు కొంటున్నారు. నగరంలో తిరిగే వాటిల్లో 70 శాతం ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. నగరంలో వాహనాలు రోజూ 2.4 మెగా లీటర్ల ఇంధనాన్ని వినియోగిస్తున్నాయి. 50 శాతానికిపైగా వాహనాలు కాలుష్యం వెదజల్లుతున్నాయని తేలింది. పీఎం 10 మైక్రో గ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్లో కాలుష్యాన్ని కొలుస్తారు. ఇది 60 వరకూ ఉంటే సాధారణంగా భావిస్తారు. కానీ నగరంలో 2008లోనే ఇది 85.684 ఉంటే, 2018 నాటికి 108.75కు చేరింది. 2021 నాటికి ఇది 200కు చేరువలో ఉన్నట్టు నిపుణులు అంటున్నారు. ఇవన్నీ ట్రాఫిక్ పోలీసులను శ్వాసకోశ, ఊపిరితిత్తులు, క్యాన్సర్ బారిన పడేస్తున్నాయని పోలీసు వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. – వనం దుర్గాప్రసాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో కాలుష్యం (మైక్రో గ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్) ప్రాంతం 2008 2016 2018 బాలానగర్ 107 131 165 జూబ్లిహిల్స్ 50 108 143 శామీర్‌పేట్ 51 73 63 కూకట్పల్లి 85 89 160 సైనిక్‌పురి 59 81 93 రాజేంద్రనగర్ 38 68 61 నాచారం 87 112 124 కేబీఆర్ఎన్ పార్క్ 49 58 104 జూపార్క్ 111 117 182 చదవండి: మరో రెండ్రోజులు చలి! -
కాలుష్యంతో కిరికిరి.. నిత్యం ఉక్కిరిబిక్కిరి
పచ్చని పంట పొలాల్లో కాలుష్యం చిచ్చు పెట్టే పరిశ్రమలు ఓ వైపు.. అర్ధరాత్రి అయితే చాలు భగభగ మండే లెడ్డు బట్టీల కాలుష్యం మరో వైపు .. వెరసి మండల ప్రజలు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. ఎలాంటి అనుమతులు లేకుండా పుట్ట గొడుగుల్లా వెలుస్తున్న లెడ్డు బట్టీలు.. నిబంధనలను తుంగల్లో తొక్కి యథేచ్ఛగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమల ఆగడాలను అడ్డుకోవాల్సిన అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. – నందిగామ మండల కేంద్రమైన నందిగామతో పాటు జంగోనిగూడ, నర్సప్పగూడ, చేగూరు, వీర్లపల్లి, మోత్కులగూడ, అప్పారెడ్డిగూడ, మేకగూడ, రంగాపూర్ తదితర గ్రామాలలో సుమారు 100 పరిశ్రమల వరకు ఉన్నాయి. ఇందులో స్పాంజ్ ఐరన్, ఐరన్, టెక్స్టైల్స్, ఫార్మ, ప్లైఉడ్, అల్యూమినీయం, నూనె డబ్బల తయారీ, ప్యాకింగ్ కవర్స్ తదితర పరిశ్రమలు ఉన్నాయి. విచ్చలవిడిగా లెడ్డు బట్టీలు.. ►జంగోనిగూడ అక్రమ లెడ్డు బట్టీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ►జంగోనిగూడ నుంచి తీగాపూర్ కు వెళ్లే రహదారిలో అక్రమంగా మూడు లెడ్డు బట్టీలను ఏర్పాటు చేశారు. అవి రాత్రయితే చాలు బట్టీలు వెలుగుతూనే ఉంటాయి. ►అయ్యప్ప స్వామీ దేవాలయం సమీపంలోని పారిశ్రామిక వాడలో పదుల సంఖ్యలో అక్రమ లెడ్డు బట్టీలు నడిపిస్తున్నారు. చదవండి: Nalgonda: నిశీధిలో ఏం జరిగింది..? లెడ్డు బట్టీలతో ఘాటైన వాసనలు.. లెడ్డు బట్టీలలో పాడైపోయిన బ్యాటరీలను పగులగొట్టి అందులోని మెటీరియల్ సేకరిస్తారు. వీటిని బోగ్గుతో కాల్చి కరగబెట్టి లెడ్డును వెలికి తీస్తారు. ఈ ప్రక్రియలో బ్యాటరీలను బొగ్గుతో కాలుస్తున్న క్రమంలో విపరీతమైన నల్లటి పొగ, దుర్వాసన వెదజల్లుతోంది. ఈ పొగ సమీపంలోని గ్రామాలు, వ్యవసాయ పంటపొలాలలో పడి ఆ ప్రాంతమంతా కాలుష్యంతో మునిగిపోతోంది. చేగూరులో ఓ పరిశ్రమ నుంచి వెలువడుతున్న పొగ రాత్రి వేళల్లోనే.. అక్రమ లెడ్డు బట్టీలు రాత్రి తొమ్మిది గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు నిర్వహిస్తుంటారు. జంగోనిగూడ శివారులోని ఓ లెడ్డు బట్టిలో గతంలో జరిగిన ప్రమాదంలో గ్రామానికి చెందిన ఓ యువకుడు దుర్మరణం చెందాడు. అంతేకాకుండా రాత్రి వేళ్లలో మాత్రమే కొనసాగుతున్న లెడ్డు బట్టిలలో ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటితో పాటు వీర్లపల్లి, నందిగామ, నర్సప్పగూడ తదితర గ్రామాల శివార్లలో ఉన్న ఐరన్ పరిశ్రమల వల్ల వీపరీతమైన పొగ, దుమ్ము ధూళీ రావడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చేగూరుకు రాత్రి వేళల్లో వెళ్లాలంటే విపరీతమైన పొగతో రోడ్డు సైతం కనపడని దుíస్థితి నెలకొంటోంది. చదవండి: చెరువులో ఈతకొడుతూ.. టీఆర్ఎస్ నాయకుడి కన్నుమూత మృతి చెందుతున్న మూగజీవాలు స్పాంజ్ ఐరన్ పరిశ్రమ వెదజల్లే కాలుష్యం కారణంగా పచ్చని గ్రాసంపై నల్లటి బూడిద కణాలు పడి వాటిని తిన్న పశువులు మృత్యువాత పడుతున్నాయి. ఫిర్యాదు చేసినా పట్టించుకోరు నర్సప్పగూడ, వీర్లపల్లి గ్రామాల మధ్య వెలసిన స్పాంజ్ ఐరన్ పరిశ్రమల ద్వారా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళలో ఆయా పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం వల్ల పంట పొలాలతో పాటు గ్రామంలోని ఇళ్లపై నల్లటి బూడిద పడుతోంది. ఈ విషయమై సంబంధిత కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. – గోవిందు అశోక్ కుమార్, సర్పంచ్, నర్సప్పగూడ చర్యలు చేపడతాం స్పాంజ్ ఐరన్ పరిశ్రమలు వీపరితమైన కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని ఇటీవల ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవమే. ఈ విషయాన్ని హెడ్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్లాను. రెండు మూడు రోజులలో ల్యాబ్ టెక్నిషియన్స్‌ను తీసుకొని పరిశీలిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై చర్యలు తీసుకుంటాం. – దయానంద్, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారి -
ప్రభుత్వాలు సొంతంగా పనిచేస్తే పిటిషన్ల అవసరం ఉండదు
న్యూఢిల్లీ: ప్రభుత్వాలు సొంతంగా పనిచేస్తే న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేయాల్సిన అవసరం ఎవరికీ ఉండదని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్), ఢిల్లీలో వాయు కాలుష్యం నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ విషయంలో ‘ఎన్సీఆర్, పరిసర ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్’ కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయాలని పేర్కొంది. రాజధానిలో గాలి నాణ్యతను పెంచేలా ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ప్రత్యేక న్యాయస్థానం వరుసగా రెండోరోజు శుక్రవారం కూడా విచారణ జరిపింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని, భద్రతను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీలో పాఠశాలలను మూసివేయాలని ఆదేశించినందుకు ఓ వర్గం మీడియా, కొందరు వ్యక్తులు తమను(న్యాయమూర్తులు) విలన్‌గా చిత్రీకరిస్తున్నారని ఆక్షేపించింది. ఢిల్లీలో వాయు కాలుష్యం కేసును మూసివేయబోమని స్పష్టం చేసింది. కాలుష్యం కట్టడికి ప్రభుత్వాలు చేపట్టే చర్యలను పర్యవేక్షిస్తూనే ఉంటామని తేల్చిచెప్పింది. కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు గాను ఆసుపత్రులను సిద్ధం చేయడానికి వీలుగా నిర్మాణాలను పునఃప్రారంభించేందుకు ఢిల్లీ ప్రభుత్వానికి ధర్మాసనం అనుమతి మంజూరు చేసింది. ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఐదుగురు సభ్యులతో ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలియజేసింది. తాము సూచించిన చర్యల అమలు తీరును పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాలను సిద్ధం చేసినట్లు పేర్కొంది. -
ఢిల్లీలో మూతపడనున్న పాఠశాలలు
Schools To Remain Shut From Tomorrow Till Further Orders: రేపటి నుంచి ఢిల్లీలో పాఠశాలలు మూతపడనున్నాయి. వాయు కాలుష్య తీవ్రత అధికంగా ఉండటంతో స్కూళ్లను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పాఠశాలలను మూసివేయనున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖామంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. కాగా, ఆన్లైన్ క్లాసులు జరుగుతాయని స్పష్టం చేశారు. (భారత్‌లో ఒమిక్రాన్ కలకలం) ఇక పరీక్షలు సైతం యథావిథిగా కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. వాయు కాలుష్య తీవ్రత అధికంగా ఉన్న తరుణంలో పాఠశాలలను ఏ విధంగా తెరుస్తారని ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలలను మూసివేసి, ఆన్లైన్ క్లాస్‌లను నిర్వహించడానికి ఢిల్లీ ప్రభుత్వం మొగ్గుచూపింది. -
ఫార్మా సిటీతో కాలుష్యం? చిరుతలు, అరుదైన పక్షుల ఉనికి కనుమరుగు!
సాక్షి,హైదరాబాద్: మహా నగరానికి ఆనుకొని ముచ్చర్లలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఫార్మాసిటీతో సమీప భవిష్యత్‌లో కాలుష్యం పంజా విసరడం ఖాయమని తాజా అధ్యయనంలో తేలింది. ఈ ప్రాంతంలో అరుదైన వృక్ష, జంతు జాలం మనుగడకు ఫార్మాసిటీ ప్రశ్నార్థకంగా మార్చేస్తుందని వెల్లడైంది. ప్రధానంగా ఈ ప్రాంతంలోని చిరుతలు, అరుదైన పక్షుల ఉనికి కనుమరుగవుతుందని తేలింది. ► ప్రభుత్వం సుమారు 19 వేల ఎకరాల్లో నిర్మించతలపెట్టిన ఫార్మాసిటీ పరిధిలో వృక్ష, జంతుజాలం ఉనికి, మనుగడ అన్న అంశంపై ఇటీవల ర్యాప్టర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసింది. ► ఈ సిటీ ఏర్పాటుపై ప్రభుత్వం సిద్ధం చేసిన పర్యావరణ ప్రభావ నివేదిక సైతం లోపభూయిష్టంగా ఉందని ఈ సంస్థ ఆక్షేపించడం గమనార్హం. తమ అధ్యయన వివరాలను సర్కారు ఏర్పాటు చేసిన పర్యావరణ మదింపు సంఘం (ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీ)కి సైతం సమర్పించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ► ప్రధానంగా మద్దివెన్ను, కడ్తాల్, తిప్పారెడ్డిపల్లి రిజర్వు ఫారెస్టుల ఉనికిని ఫార్మాసిటీ ప్రశ్నార్థకంగా మార్చేస్తుందని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ అభయారణ్యాలలో అరుదైన వృక్ష జాతులు, క్షీరదాలు, పక్షులున్నాయి. ఇందులో ప్రధానంగా అంతరించిపోయే ప్రమాదం ఉన్న పక్షి ఎల్లో ధ్రోటెడ్ బుల్బుల్ అనే పక్షి మనుగడం కష్టతరమవుతుందని ఈ అధ్యయనం ఆందోళన వ్యక్తంచేసింది. ► ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ సంస్థ విడుదల చేసిన రెడ్‌లిస్ట్‌లో ఈ పక్షి ఉందని తెలిపింది. ఇక ఈ ప్రాంతంలో విస్తరించిన కొండల్లో చిరుత పులులకు ఆవాసాలున్నాయని, వీటికి ఆహారం,తాగునీటి వసతి కూడా ఇక్కడ ఉందని, ఫార్మాసిటీ ఏర్పాటుతో వీటి మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొంది. పంటలకూ గడ్డుకాలమే.. ఫార్మాసిటీ ఏర్పాటుతో సుమారు 11 వేల ఎకరాల్లో విస్తరించిన విభిన్న పంటలు, అడవులు, వృక్ష, జంతుజాలం మనుగడ ప్రశ్నార్థకం కానుందని ఈ అధ్యయనం ఆందోళన వ్యక్తంచేసింది. వైట్ రంప్డ్ వల్చర్స్, స్నేక్ ఈగల్, సర్కేటస్ గాలికస్, వైట్ ఐ బజార్డ్, బుటాస్టర్ టేసా, షిక్రా, బ్లాక్షోల్డర్డ్ కైట్, ప్యాలిడ్ హ్యారియర్ వంటి పక్షులు అంతర్థానమవుతాయని ఈ అధ్యయనం తెలిపింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణ ప్రభావ నివేదిక లోపభూయిస్టంగా ఉందని సంస్థ ప్రతినిధి ప్రణయ్ జువ్వాది తెలిపారు. -
నిషేధం ఉన్నా పనులు సాగుతున్నాయా ?
న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కట్టడాల నిర్మాణం, కూల్చివేతలపై నిషేధం అమల్లో ఉన్నా సరే మోదీ సర్కార్ సెంట్రల్ విస్టా పనులను నిరాటంకంగా కొనసాగిస్తోందని సుప్రీంకోర్టులో దాఖలుచేసిన పిటిషన్లో న్యాయవాది వికాస్ సింగ్ ఆరోపించారు. దీంతో సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘ నిషేధం ఉన్నా సరే ప్రభుత్వం సెంట్రల్ విస్టా పనులను కొనసాగిస్తోందా? అని ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోర్టు సూటిగా ప్రశ్నించింది. ‘ ఈరోజు ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ దారుణంగా 419కు పెరిగిపోయింది. ఇక్కడ కాలుష్యం రోజురోజుకూ ఎక్కువవుతోంది. కాలుష్య నియంత్రణపై రాష్ట్రాలకు ఆదేశాలిచ్చామంటారు. కాగితాలపై అంతా బాగానే ఉంటుంది. వాస్తవానికొచ్చేసరికి మార్పు శూన్యం’ అని సీజే జస్టిస్ రమణ ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం ఉన్నా రోజూ కాలుష్యం పెరుగుతుండటంపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించారు. -
ఢిల్లీలో కాలుష్యాన్ని కట్టడి చేస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం నానాటికీ పెరిగిపోతుండడం పట్ల కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. నగరంలో కాలుష్యాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా పలు కీలకమైన చర్యలు చేపట్టబోతున్నట్లు బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. నగరంలోకి నిత్యావసర సరుకు రవాణాల వాహనాలు తప్ప ఇతర భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించనున్నట్లు తెలిపింది. విద్యా సంస్థలను మూసివేయడంతోపాటు కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరును 50 శాతానికి పరిమితం చేయనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ నుంచి 300 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 11 థర్మల్ పవర్ ప్లాంట్లలో కేవలం ఐదు ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తికి అనుమతిస్తామని, మిగిలినవి ఈ నెలాఖరు వరకూ మూసివేయనున్నట్లు పేర్కొంది. ఎన్టీపీసీ ఝాజ్జర్, మహాత్మాగాంధీ టీపీఎస్, సీఎల్పీ ఝాజ్జర్, పానిపట్ టీపీఎస్, హెచ్పీజీఎల్సీ, నభాపవర్ లిమిటెడ్ టీపీఎస్ రాజ్‌పురా, తల్వాండి సాబో టీపీఎస్ మాన్సాలను అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఒక అఫిడవిట్‌ను సమర్పించారు. ఈ అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించడానికి వీలుగా పరిసర రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తొలగించడానికి రైతులకు ఉచితంగా యంత్రాలను అందజేయాలని కోరుతూ పర్యావరణ కార్యకర్త ఆదిత్య దూబే, న్యాయ విద్యార్థి అమన్ బాంకా దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ‘గాలి నాణ్యత నిర్వహణ కమిషన్’ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని ఢిల్లీతోపాటు పరిసర రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు నవంబర్ 15న ఇచ్చిన ఆదేశాల ప్రకారం నవంబర్ 16న గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ అత్యవసర సమావేశం ఏర్పాట చేసినట్లు కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొంది. నిర్వహణ కమిషన్ నిర్ణయాలు/ఆదేశాలు ► ఢిల్లీ, పరిసర రాష్ట్రాలు గ్యాస్‌తో అనుసంధానమైన పరిశ్రమలను గ్యాస్‌తోనే నడిపేలా చూడాలి. అనుమతి లేని ఇంధనాలతో నడిచే పరిశ్రమలను వెంటనే మూసివేయాలి. ► నిత్యావసర సరకులను తరలించే ట్రక్కులు మినహా మిగతా ట్రక్కులకు ఈ నెల 21 వరకు ఢిల్లీలోకి ప్రవేశం నిషేధించాలి. పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలు రహదారులపై తిరగకుండా చూడాలి. ఢిల్లీ ప్రభుత్వం మరిన్ని సీఎన్జీ బస్సులను అందుబాటులో తీసుకురావాలి. ► నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలను నిలిపివేయాలి, స్మాగ్ టవర్లు ఉపయోగించాలి. కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో (హాట్స్పాట్లు) రోజుకి కనీసం మూడుసార్లు స్ప్రింకర్లు, డస్ట్ సప్రెసెంట్లు ఉపయోగించాలి. ► అత్యసవర సేవలకు మినహా డీజిల్ జనరేటర్లు వినియోగాన్ని కచ్చితంగా నిషేధించాలి. ► దేశ రాజధాని ప్రాంత రాష్ట్రాలు నవంబరు 21 వరకూ కనీసం 50 శాతం ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించాలి. ప్రైవేట్ సంస్థలను ఆ దిశగా ప్రోత్సహించాలి. ► తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలను మూసివేయాలి. ఆన్లైన్లో తరగతులు నిర్వహించాలి. నిర్ణయాలన్నీ కోర్టులే తీసుకోవాలా?: సుప్రీం ఢిల్లీలో కాలుష్యానికి కారణం పంట వ్యర్థాల దహనమేనని అనడం సమంజసం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కొందరు వ్యక్తులు స్టార్ హోటళ్లలో కూర్చొని, నాలుగైదు శాతం కాలుష్యానికి కారణమయ్యే రైతులపై నిందలు వేస్తున్నారని ఆక్షేపించింది. పంట వ్యర్థాల దహనం కారణంగా రైతులపై చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసింది. ‘వారం రోజులపాటు పంట వ్యర్థాలు దహనం చేయొద్దని రైతుల్ని కోరాలని ఇప్పటికే కేంద్రానికి సూచించాం. టీవీల్లో చర్చా కార్యక్రమాల్లో ఎవరి అజెండా ప్రకారం వారు మాట్లాడుతున్నారు. ఇదే ఎక్కువ కాలుష్యాన్ని సృష్టిస్తోంది’ అని కోర్టు పేర్కొంది. నిర్మాణాలు, పరిశ్రమల కార్యకలాపాలు ఏడాది పొడవునా సాగుతూనే ఉంటాయని, వాటిపై చర్యలు తీసుకోకుండా పంట వ్యర్థాల దహనం గురించే ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీసింది. ప్రభుత్వ అధికార యంత్రాంగంలో ఒక రకమైన ఉదాసీనత పెరిగిందని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. నిర్ణయాలు తీసుకోవాలని అధికారులు కోరుకోవడం లేదని తప్పుపట్టారు. అన్ని నిర్ణయాలు కోర్టులే తీసుకోవాలని వారు ఆశిస్తున్నారని వ్యాఖ్యానించారు. నిష్క్రియాపరత్వం ఎందుకని ప్రశ్నించారు. పిటిషనర్ తరపున అడ్వొకేట్ వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. వాయు కాలుష్యంపై అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారే గానీ ఏదీ జరగడం లేదని తెలిపారు. పంట వ్యర్థాల దహనాన్ని కూడా తీవ్రంగా పరిగణించాలని కోరారు. పంట వ్యర్థాల దహనం 36 శాతం కాలుష్యానికి కారణమవుతున్నట్లు ‘సఫర్’ అధ్యయనం చెబుతోందని ఢిల్లీ ప్రభుత్వం తరఫు లాయర్ అభిషేక్ మనుసింఘ్వీ పేర్కొన్నారు. గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ సూచనలను పాటించాలని ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హరియాణా, పంజాబ్ రాష్ట్రాలను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఏడాదికి రూ.లక్ష కోట్ల నష్టం కరోనా ధాటికి ఢిల్లీ విలవిలలాడిపోయింది. కోవిడ్‌తో గత 18 నెలల్లో 25 వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ఏడాదిన్నరలో ఎన్నోసార్లు కఠినమైన లాక్డౌన్లు విధించి కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కానీ కరోనా కంటే ప్రతీ ఏడాది కాలుష్యం అనే భూతం ఢిల్లీని భయపెడుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టైనా ఎందుకు లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాలుష్యం కారణంగా వచ్చిన అనారోగ్య సమస్యలతో గత ఏడాది ఢిల్లీలో 54 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఢిల్లీలో కాలుష్యంతో నిండిన ఒక రహదారి కరోనా తరహాలో కాలుష్యం ఆరోగ్యంతో పాటు ఆర్థిక రంగాన్ని కుదేలు చేస్తోంది. ప్రతీ ఏడాది దేశ రాజధానికి లక్ష కోట్ల రూపాయల నష్టం వస్తోంది. అయినప్పటికీ కోర్టులు జోక్యం చేసుకుంటే తప్ప ప్రభుత్వాల్లో కదలిక రావడం లేదు. ప్రఖ్యాత లాన్సెట్ మ్యాగజైన్ ప్రకారం 2019లో భారత్‌లో కాలుష్యం బారిన పడి 16.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు ఏడాది శిలాజ ఇంధనాల కాలుష్యంతో దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని హార్వార్డ్ అధ్యయనం తేటతెల్లం చేస్తోంది. కాలుష్య నష్టాన్ని ఎలా లెక్కిస్తారు ? కాలుష్యం వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని రెండు పద్ధతుల్లో లెక్కిస్తారు. ఉత్పత్తి సామర్థ్యమున్న ప్రజలు ముందుగానే మరణించడం, కాలుష్యంతో అనారోగ్యం పాలైన వారికి చికిత్స చెయ్యడానికైన ఖర్చు, పని చేసే ప్రాంతాల్లో దగ్గు, జలుబుతో బాధపడడం వల్ల పడిపోయిన ఉత్పాదకత వంటి వాటినన్నింటినీ పరిగణనలోకి తీసుకొని కాలుష్యంతో ఏర్పడిన నష్టాన్ని లెక్కిస్తారు. ఆ విధంగా చూసుకుంటే కాలుష్యంతో దేశ జీడీపీలో 4.5 శాతం నష్టం ప్రతీ ఏడాది వాటిల్లుతోంది. గ్రీన్‌పీస్ సంస్థ వేసిన అంచనాల ప్రకారం గత ఏడాది కాలుష్యంతో ఢిల్లీ రాష్ట్ర జీడీపీలో 13 శాతం అంటే దాదాపు రూ.60 వేల కోట్ల నష్టం వాటిల్లింది. విల్లింగ్ టు పే (డబ్ల్యూటీపీ) అనే విధానంలోనూ కాలుష్య నష్టాన్ని లెక్కిస్తారు. దీని ప్రకారం కాలుష్య నివారణకు ప్రజలు ఎంత ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్న లెక్కల ఆధారంగా చూస్తే ఢిల్లీకి ఏడాదికి లక్ష కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లుతోంది. కాలుష్య సమస్య నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలేవీ శాశ్వత చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టీవీ చర్చలతోనే ఎక్కువ కాలుష్యం
న్యూఢిల్లీ: అసలు కాలుష్యం కంటే టీవీలో చర్చలే ఎక్కువ కాలుష్యాన్ని కలిగిస్తున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. న్యాయస్థానాల చిన్న చిన్న పరిశీలనలు కూడా వివాదాస్పద అంశాలుగా మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజధానికి పెనుముప్పుగా మారిన వాయు కాలుష్యంపై ఓ విద్యార్థి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ సందర్భంగా జస్టిస్ రమణ ఈవిధంగా వ్యాఖ్యానించారు. ‘మీరు ఏదో ఒక సమస్యను లేవనెత్తి.. మమ్మల్ని గమనించేలా చేసి, ఆపై దానిని వివాదాస్పదం చేస్తారు. తర్వాత బ్లేమ్ గేమ్ మాత్రమే మిగిలి ఉంటుంది. టీవీల్లో చర్చలు అందరికంటే ఎక్కువ కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయి’ అని జస్టిస్ రమణ అన్నారు. పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్లే ఢిల్లీ వాయుకాలుష్యం విపరీతంగా పెరుగుతోందని సుప్రీంకోర్టును తాను తప్పుదారి పట్టించినట్టు టీవీ చర్చల్లో ఆరోపించారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ.. తమను తప్పుదోవ పట్టించడం లేదన్నారు. (చదవండి: అత్యాచారం చేసి.. పెళ్లి చేసుకుంటే కేసు కొట్టేయాలా?) ఢిల్లీ కాలుష్యానికి రైతులను నిందిస్తూ, దీపావళి సందర్భంగా పటాకులు పేల్చేందుకు మద్దతు పలుకుతూ కొంతమంది ప్రముఖులు గళం వినిపించిన నేపథ్యంలో జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. కాలుష్యానికి కారణమంటూ రైతులను నిందించడం సరికాదని అన్నారు. ‘ఫైవ్ స్టార్, 7 స్టార్ హోటళ్లలో కూర్చుని రైతులను ఆడిపోసుకుంటున్నారు. అసలు రైతుల దగ్గర ఎన్ని భూములు ఉన్నాయి. ప్రత్యామ్నాయ విధానాల ద్వారా పంట వ్యర్థాలను తొలగించగల స్తోమత వారికి ఉందా? మీకు ఏదైనా శాస్త్రీయ విధానం తెలిస్తే.. వెళ్లి రైతులకు చెప్పండి’ అని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. న్యాయమూర్తి వ్యాఖ్యలతో ఢిల్లీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఏకీభవించారు. (చదవండి: ఆకలిచావులు ఉండొద్దు: సుప్రీంకోర్టు) -
వర్క్ ఫ్రం హోం.. పరిశ్రమల మూసివేత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో వాయు కాలుష్యం కట్టడికి వర్క్ ఫ్రం హోం, పరిశ్రమల మూసివేత వంటి ప్రతిపాదనలను ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీలు చేశాయని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ శనివారం కొన్ని అత్యవసర చర్యలను ప్రకటించారు. ఇందులో..వారం పాటు బడుల మూసివేత, నిర్మాణరంగ కార్యకలాపాల నిలిపివేత, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విధానం అమలు వంటివి ఉన్నాయి. ఈ ప్రతిపాదనలపై సోమవారం ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీలు సమావేశమై చర్చించాయని మంత్రి రాయ్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పంజాబ్, రాజస్తాన్, యూపీ, హరియాణా యంత్రాంగాలు కూడా ఈ భేటీలో పాల్గొన్నాయన్నారు. త్వరలోనే ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయనుందని రాయ్ తెలిపారు. ఢిల్లీ కాలుష్యంపై రైతులను నిందించొద్దు ఢిల్లీలో వాయు కాలుష్యానికి రైతులను నిందించవద్దని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ పేర్కొన్నారు. పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్లే వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చలేదనే విషయాన్ని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మొత్తం వాయుకాలుష్యంలో పంట వ్యర్థాల దహనం 10% మాత్రమే కారణమని సుప్రీంకోర్టు తెలిపిందన్నారు. -
మ్యాగజైన్ స్టోరీ 16 November 2021
-
కుంటి సాకులు చెప్పొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధానిలో వాయు కాలుష్య సంక్షోభాన్ని పరిష్కరించడంలో అత్యవసర చర్యలు తీసుకోనందుకు, మున్సిపల్ కార్పొరేషన్లపై నెపం వేసేందుకు యత్నించినందుకు ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కుంటి సాకులు చెబితే ఆదాయం, పాపులారిటీ స్లోగన్ల ఖర్చులపై ఆడిట్‌కు ఆదేశిస్తామని ఢిల్లీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణం రైతులు పంట వ్యర్థాలు దహనం చేయడం వల్ల కాదని నిర్ధారణకు వచ్చింది. ప్రతివాదుల అఫిడవిట్ల పరిశీలన తర్వాత వాయుకాలుష్యానికి నిర్మాణ కార్యకలాపాలు, పరిశ్రమలు, రవాణా, వాహనాల రాకపోకలతోపాటు అక్కడక్కడ పంట వ్యర్థాలు కాల్చడమనే నిర్ధారణకు వచ్చామని పేర్కొంది. ఎయిర్‌క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ నియంత్రణ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కారకాల నియంత్రణకు ఏయే చర్యలు తీసుకోబోతున్నారో కచ్చితంగా సూచించలేదని పేర్కొంది. రాజధాని ప్రాంతంలో కొంతకాలం వర్క్‌ఫ్రమ్ హోం అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పంజాబ్, యూపీ, హరియాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు మంగళవారం సమావేశం కావాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఢిల్లీకి చెందిన విద్యార్థి ఆదిత్య దూబే దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ల ధర్మాసనం సోమవారం అత్యవసర విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపిస్తూ.. పంట వ్యర్థాలు కాల్చడానికి సంబంధించి పంజాబ్‌లో ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎవరిపైనా కేసులు పెట్టడం లేదని పేర్కొన్నారు. భవన నిర్మాణాలను నిలుపుదల చేయలేదని తెలిపారు. సొలిసిటర్ జనరల్ అందజేసిన నివేదిక కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కొన్ని చర్యలు చేపడుతోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. పార్కింగ్ రుసుము 4 రెట్లు పెంచాలని, బహిరంగంగా వ్యర్థాలు తగులబెట్టకుండా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ మేరకు ఓ ప్రణాళిక రూపొందించి కోర్టుకు అందజేశారు. పంట వ్యర్థాల వల్ల వచ్చే కాలుష్యం ప్రధాన సమస్య కాదని అంగీకరిస్తున్నారా... ఢిల్లీకి రాకపోకలు మొత్తంగా నిషేధిస్తారా అని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. పరిశ్రమలు, రవాణా, దుమ్ము కారణంగానే 75 శాతం వాయు కాలుష్యం వస్తోందని అఫిడవిట్లో పేర్కొన్నారని ఆ దిశగా నియంత్రణ ఆలోచించాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. బుధవారానికల్లా ఏయే చర్యలు తీసుకున్నారో తెలపాలని సూచించారు. -
ఆ గాలిలోనే... గరళం
ప్రాణవాయువే... ప్రాణాంతకంగా మారితే అంతకన్నా ఘోరం ఉంటుందా? కాలుష్యం దెబ్బకు గాలి నాణ్యత గణనీయంగా పడిపోయిందనే కారణంతో ఏకంగా దేశరాజధానిలో కొద్ది రోజులు లాక్డౌన్ పెట్టే ఆలోచన చేస్తున్నారంటే ఇంకేమనాలి? దట్టంగా కమ్మేసిన వాయు కాలుష్యం... యమునా నదిని నింపేసిన విషపు నురగలతో జల కాలుష్యం... గత పది రోజుల్లో రెండున్నర వేలకు పైగా కొత్త డెంగ్యూ కేసులు... ఉన్నట్టుండి పెరుగుతున్న కోవిడ్ కేసులు – ఇలా ఢిల్లీలో పరిస్థితులు దయనీయం అనిపిస్తున్నాయి. సోమవారం సుప్రీమ్ కోర్టు వేసిన మొట్టికాయలను బట్టి చూస్తే, ఏయేటికాయేడు పెరుగుతున్న కాలుష్య సమస్యపై దృష్టి పెట్టని పాలకుల నిర్లక్ష్యం వెక్కిరిస్తోంది. చలి పెరిగేవేళ, ప్రధానంగా కొయ్యకాళ్ళు కాల్చే అక్టోబర్ చివర నుంచి నవంబర్ వరకు ఒక పక్క వాతావరణం, మరోపక్క ఇతర కాలుష్యాలు కలగలిసి ఢిల్లీలో ఆరోగ్య సమస్యలు సృష్టిస్తున్నాయి. ఏడెనిమిదేళ్ళుగా ఇది చర్చనీయాంశమే. ఈ ఏడాది పంటకోతలు ఆలస్యమై, అక్టోబర్‌లో పరిస్థితి మెరుగ్గా ఉంటుందని ఆశలు రేపింది. కానీ, నవంబర్ మొదట్లో దీపావళి టపాసులు, పక్క రాష్ట్రాలలో పెరిగిన పంట వ్యర్థాల మంటలు తోడై, ఈ నెలలో తొలి పది రోజులూ ఢిల్లీలో వాయుకాలుష్యం తారస్థాయికి చేరింది. గాలి గరళంలా మారడంతో నవంబర్ 13న సుప్రీమ్ కోర్టు కొరడా జుళిపించింది. ఢిల్లీ సర్కారు అత్యవసరంగా సమావేశమై, కరోనా తర్వాత మొన్నామధ్యే తెరిచిన స్కూళ్ళను సైతం మూసేసి, నిర్మాణ కార్యకలాపాలకు బ్రేక్ ప్రకటించింది. లాక్‌డౌన్‌కు కూడా సిద్ధమైంది. ప్రపంచ కాలుష్య నగరాల్లో ముందు వరుసలో ఉన్న ఢిల్లీలో ఏడాది పొడుగూతా ‘వాయు నాణ్యత సూచి’ (ఏక్యూఐ) ఆందోళనకరమే. సగటున గంటకో చెట్టు నరికివేతకు గురవుతోందని లెక్కిస్తున్న ఢిల్లీలో దుమ్ము ధూళి, పరిశ్రమలు, వాహనాల లాంటి అనేక కాలుష్య కారణాలున్నాయి. కేవలం 3 వేల చిల్లర ప్రభుత్వ బస్సులే నడుస్తున్నాయనీ, ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో గత ఏడేళ్ళలో కొత్త బస్సుల ఊసే లేదనీ ప్రతిపక్ష ఆరోపణ. ఏమైనా, ఢిల్లీలో ప్రైవేట్ వాహనాల సంఖ్య యథేచ్ఛగా పెరుగుతోంది. ఇక, పంటపొలాల మంటలు చుట్టుపక్కలి హర్యానా, పంజాబ్ మీదుగా రాజధాని దాకా వ్యాపిస్తున్న సమస్య. ఢిల్లీ హైకోర్టు, సుప్రీమ్ కోర్టు కొన్నేళ్ళుగా పంజాబ్ సహా అనేక ఉత్తరాది రాష్ట్రాలను కాలుష్యంపై హెచ్చరిస్తూనే వస్తున్నాయి. ఫలితం లేదు. యమునా నది శుద్ధీకరణకు రూ. 4 వేల పైగా కోట్లు పాలకులు ఖర్చు పెట్టారంటున్నా, జరిగిందేమిటో నురగ రూపంలో కనిపిస్తోంది. మంగళవారం సాయంత్రానికల్లా నిర్దిష్టమైన ప్రణాళికతో రావాలని సుప్రీమ్ కోర్టు చెప్పడం పరిస్థితి తీవ్రతను చెబుతోంది. ఆ మాటకొస్తే – ప్రచార ప్రకటనల కోసం ఢిల్లీ ప్రభుత్వం పెడుతున్న వందల కోట్ల ఖర్చులో కాలుష్య నివారణకు పెడుతున్నది ఎంత అని సర్వోన్నత న్యాయస్థానమే నిలదీసిందంటే, పాలకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరోపక్క ఢిల్లీ కాలుష్యానికి ఏది, ఎంత కారణమనే విషయంలో కేంద్రం సైతం తడవకో మాట మాట్లాడడం విచిత్రం. పంట కోసిన తరువాత మిగిలిన కొయ్యకాళ్ళను కాల్చడం ద్వారా రాజధానిలో తలెత్తుతున్న కాలుష్యం వంతు 10 శాతం లోపేనని కేంద్రం సోమవారం పేర్కొంది. కానీ, వరి మోళ్ళు 35 నుంచి 40 శాతం మేర కాలుష్యానికి కారణమన్న కమిటీ మాటలను కేంద్రమే తన అఫిడవిట్లో మరోచోట పేర్కొనడం విచిత్రం. ఏమైనా, ఢిల్లీలో గాలి నాణ్యత సూచి 500 దాటేయడం ఆందోళనకరం. పంట పొలాల పొగేæ కాదు... పరిశ్రమలు, రవాణా సహా ఇంకా అనేకం ఈ దుఃస్థితికి కారణం. ప్రభుత్వాలు మాత్రం సమస్యను వదిలేసి, రైతుల తప్పును ప్రస్తావిస్తూ రాజకీయాలు చేస్తుండడమే విచారకరం. నిజానికి, పంట కోసేశాక, మిగిలిన వరి దుబ్బులనే ఇలా కాలుస్తున్నారనుకోవడం తప్పు. పత్తి, చెరకు, కాయధాన్యాలు, గోదుమలు – ఇలా అనేక పంటలకు పంజాబ్, హర్యానాల్లో ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు. అందుకే, ఉత్తర భారతంలో కాలుష్య సమస్య మరింత తీవ్రంగా ఉంది. రైతుల వైపు నుంచి చూస్తే, కొయ్యకాళ్ళను వెంటనే తొలగిస్తే కానీ, తరువాతి పంట వేసుకోలేరు. అందుకు తగిన యంత్ర సామగ్రి అందుబాటులో లేకపోవడంతో, కాలుష్యమని తెలిసినా సరే కాల్చడమే మార్గమవుతోంది. ప్రభుత్వాలు ఈ సమస్య పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలి. వాయు ఉద్గారాలు లేకుండా, పంట వ్యర్థాలను ఇంధనంగా, ఎరువుగా మార్చే చౌకైన, పోర్టబుల్ యంత్రాన్ని రూపొందించి, అవార్డందుకున్న ‘తకచర్’ సంస్థ లాంటి వాటి అనుభవాన్ని ఉపయోగించుకోవాలి. తాజా పర్యావరణ సదస్సు ‘కాప్–26’లో ప్రపంచ పరిరక్షణకు వాగ్దానాలు చేసిన మన ప్రభుత్వం, అంతకన్నా ముందుగా మన ‘జాతీయ రాజధాని ప్రాంతం’ (ఎన్సీఆర్)పై దృష్టి పెట్టడం అవసరం. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటికి రెండు మన నగరాలే కాబట్టి, నివారణ చర్యల్లో చైనా లాంటి దేశాల అనుభవాలను ఆదర్శంగా తీసుకోవాలి. విద్య మొదలు ఆర్థిక వ్యవస్థ దాకా అన్నీ స్తంభించే లాక్డౌన్ లాంటివి తాత్కాలిక ఉపశమనమే తప్ప, దీర్ఘకాలిక పరిష్కారాలు కాలేవు. అందుకే, ఇప్పటికైనా ఉత్తరాది రాష్ట్రాల పాలకులను ఒకచోట చేర్చి, కాలుష్యంపై ప్రణాళిక రూపకల్పనకు కేంద్రం చొరవ తీసుకోవాలి. కాలుష్యానికి కారణం వ్యవసాయ వ్యర్థాలా, వాహనాలా, పారిశ్రామిక ఉద్గారాలా అనే రాజకీయ చర్చ, పరస్పర రాజకీయ నిందారోపణలు మాని, పనిలోకి దిగడం మంచిది. ఎందుకంటే, ఈ అసాధారణ వాతావరణ ఎమర్జెన్సీ వేళ అసాధారణ రీతిలో స్పందించడమే అత్యవసరం. మీనమేషాలు లెక్కిస్తే... మొదటికే మోసం! -
ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ
-
వారం రోజులు వర్క్ ఫ్రం హోం ఇవ్వండి: సుప్రీంకోర్టు
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు తక్షణ చర్యలు అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రేపటిలోగా ఎయిర్ ఎమర్జెన్సీ సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై ఈరోజు విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు.. ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యాన, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. తక్షణం కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించింది. అదే విధంగా.. పంట వ్యర్థాలను కాల్చడాన్ని వారంపాటు ఆపేయాలని రైతులను కోరింది. అలానే ఢిల్లీలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారం రోజుల పాటు వర్క్‌ఫ్రం హోం అవకాశం కల్పించాలని ఆదేశించింది. ఇప్పటికే మరోసారి లాక్డౌన్ విధింపునకు తాము సిద్ధమే అని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంలో ప్రత్యేక అఫిడవిట్లను దాఖలు చేశాయి. కాగా, ఢిల్లీలో ప్రజలు జీవించడానికి భయపడుతున్నారని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, గతం వారం నుంచి ఢిల్లీలో వాయుకాలుష్యం పెరిగిన సంగతి తెలిసిందే. (చదవండి: ఢిల్లీలో ఊపిరి ఆడట్లేదు) -
ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ
-
లాక్ డౌన్ దిశగా ఢిల్లీ
-
కేసీఆర్ చెప్పినట్టే జరగబోతుందా? ఆ విషయంలో జట్టు కట్టిన యమహా, కవాసాకి
భవిష్యత్తులో పెట్రోలు, డీజిల్ వాహనాలు ఉండబోవంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇటీవల ప్రెస్మీట్లో వ్యాఖ్యానించారు. ఆయన చెప్పినట్టే ఫ్యూచర్ ఉండబోతుందా ? అంటే అవును అన్నట్టుగానే వెహికల్ ఇండస్ట్రీలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల వరి ధాన్యం కొనుగోలు అంశంపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడుతూ.. టెక్నాలజీ వేగంగా మారుతుందని, త్వరలో రోడ్ల మీద పెట్రోలు , డీజిల్ వాహనాలు కనపించవన్నారు. రోడ్లపై కాలుష్యం వెదజల్లని ఎలక్ట్రిక్ వెహకిల్స్ మాత్రమే తిరుగుతాయన్నారు. తాను అటువంటి కారు ఒకటి కొన్నట్టు చెప్పారు. ఆయన మాటలకు నిజం కావడానికి ఎంతో కాలం పట్టేట్టుగా లేదు. ఇంతకాలం పెట్రోలు, డీజిల్‌లను ఉపయోగించే ఇంటర్నల్ కంబస్టన్ (ఐసీ) ఇంజన్లతో కార్లు, బైకులు, స్కూటర్లు తయారు చేస్తూ వచ్చిన సంస్థలన్నీ త్వరలో వాటికి ఫుల్స్టాప్ పెట్టబోతున్నట్టు సంకేతాలు ఇచ్చాయి. అంతేకాదు కాలుష్య రహిత ఇంజన్లను తయారు చేసేందుకు వీలుగా దశబ్ధాల తరబడి ఉన్న వైరాన్ని మరిచి జట్టు కట్టేందుకు సైతం రెడీ అయ్యాయి. కలిసికట్టుగా జపాన్‌లోని ఓకహాలో నవంబరు 13,14 తేదీల్లో ఇంటర్నల్ కంబస్టన్ (ఐసీ) ఇంజన్ల తయారీ సంస్థ సదస్సులో కీలక ప్రకటన వెలువడింది. ఐసీ ఇంజన్ల తయారీలో మార్కెట్ దిగ్గజ కంపెనీలైన కవాసాకి, యమహా, టయోటా, మజ్దా, సబరు కార్పొరేషన్లు కలిసి పని చేయాలని నిర్ణయించాయి. పరస్పరం సాంకేతిక సహకారం అందించుకుంటూ ఐసీ ఇంజన్ల స్థానంలో హైడ్రోజన్ ఇంజన్లు రెడీ చేస్తామంటూ సంయుక్త ప్రకటన జారీ చేశాయి. హైడ్రోజన్ ఇంజన్ డీజిల్, పెట్రోల్‌లకు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్‌ను ఉపయోగించే టెక్నాలజీ 2018లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. అంతకు ముందు 2010 నుంచే హైడ్రోజన్‌తో వాహనాలు నడిచే ఇంజన్లను తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానంపై కవాసాకి ప్రయోగాలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి హైడ్రోజన్ ఫ్యూయల్ ఇంజన్ అందుబాటులోకి తేనుంది. అనంతరం ఆ టెక్నాలజీనికి మిగిలిన కంపెనీలతో మరింత సమర్థంగా మార్చి కమర్షియల్ వెహికల్స్ మార్కెట్లోకి తేవాలని నిర్ణయించారు. ఒక్కసారి ఇంజన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత హోండా, సుజుకిలను కూడా ఇందులో భాగస్వాములను చేస్తామంటున్నారు. ఈవీ హవా ఇండియాలో ఉన్న బైకుల్లో నూటికి తొంభై శాతం జపాన్ కంపెనీలు తయారు చేసిన ఐసీ ఇంజన్లతోనే తయారవుతున్నాయి. కాగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ పుంజుకుంటోంది. రోజుకో కొత్త స్టార్టప్ కంపెనీ ఈవీ బైకులు, స్కూటర్లతో మార్కెట్‌ని ముంచెత్తుతున్నాయి. దీంతో ఐసీ ఇంజన్ల వాహనాల మార్కెట్‌కి కోత పడుతోంది. రిలయన్స్ సైతం ఇక రియలన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఏకంగా హైడ్రోజన్ ఫ్యూయల్ ఉత్పత్తి చేసే రెండు గిగా ఫ్యాక్టరీలు నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. ముఖేశ్‌తో పాటు అదానీ సైతం ఈ రంగంలో పోటీ పడుతున్నారు. ఫలితంగా రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్, హైడ్రోజన్ ఫ్యూయల్ ఇంజన్ల హవా నడవనుంది. ఒకప్పటి స్టీమ్ ఇంజన్ల తరహాలోనే పెట్రోలు, డీజిల్ ఇంజన్లు మూలన పడే పరిస్థితి ఎదురుకానుంది. చదవండి:ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. టెస్ట్ రైడ్‌కి మీరు సిద్ధమా? -
ఢిల్లీ కాలుష్యంపై సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం: వారం రోజులపాటు..
న్యూఢిల్లీ: ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయిని దాటడంతో ఆప్ ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి దేశ రాజధానిలో వారం రోజులపాటు పాఠశాలలు మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. పిల్లలు కలుషితమైన గాలిని పీల్చకుండా ఉండేందదుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సచివాలయంలో ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం అనంతరం కేజ్రీవాల్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కాగా ప్రభుత్వ అధికారులందరూ వారం రోజులు వర్క్ ఫ్రం హోం పనులు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే విలైనంత వరకు ప్రైవేటు సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పించాలని సూచించారు. నవంబర్ 14 నుంచి 17 వరకు నిర్మాణ రంగ పనులు అన్నింటిపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ఢిల్లీలో లాక్ డౌన్ విధించాలన్న సుప్రీంకోర్టు సూచనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, తమ ప్రణాళికను సుప్రీంకోర్టుకు అందజేస్తామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. -
ప్రపంచవ్యాప్తంగా మన నగరమే మొదటి స్థానం.. కానీ అదో చెత్త రికార్డ్
న్యూఢిల్లీ: మన దేశంలో వాయు కాలుష్యం గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చేది దేశ రాజధాని ఢిల్లీ. అభివృద్ధి పరంగా ఎంత ముందుందో కాలుష్యం కూడా అంతే ముందుంది. రోజురోజుకీ ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం పెరిగి అది కాస్త తీవ్ర స్థాయికి చేరుకుంది. శీతాకాలం మంచుతో పాటు కాలుష్యం తోడవడం ఢిల్లీ కాలుష్య పరిస్థితిని మరింత దిగజార్చిoది. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం ఉన్న పది నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో దేశం నుంచి ముంబై, కోల్‌కతా కూడా చేరాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన క్లైమేట్ గ్రూప్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తాజా జాబితాను విడుదల చేసింది. ఈ గ్రూప్ గాలి నాణ్యత, కాలుష్యాన్ని ప్రమానికాలుగా తీసుకుంటారు. ఆ టాప్-10 జాబితా ఓ సారి చూస్తే.. పాకిస్థాన్‌లోని లాహోర్, చైనాలోని చెంగు నగరాలున్నాయి. దేశ రాజధానిలో నెలకొన్న ఈ దుస్థితికి వాహనాల నుంచి వెలువడే కాలుష్యంతో పాటు పాటు పంజాబ్, హర్యానాల్లో వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం ప్రధాన కారణాలని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వ్యర్థాల విషయంలో రాష్ట్రాల మధ్య వాగ్వాదాలు జరుగుతునే ఉన్న పరిష్కారం మాత్రం దొరకడం లేదు. శనివారం దేశ రాజధానిలో గాలి నాణ్యత పడిపోయింది. ఏక్యూఐ 476గా నమోదైంది. వచ్చే 48 గంటల పాటు వాయు కాలుష్యం తీవ్రంగా ఉంటుందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరించింది. రాష్ట్రాలు, స్థానిక సంస్థలు పాఠశాలలను మూసివేడంతో పాటు వాహనాలను ‘బేసి-సరి’ విధానం అమలు చేయడంతో పాటు నిర్మాణాలను నిలిపివేయడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే యూపీలోని బులంద్‌షహర్, హాపూర్, నోయిడా, మీరట్, ఘజియాబాద్‌లోనూ ఏక్యూఐ 400కు పెరిగింది. ఇదిలా కొనసాగితే భవిష్యత్తు లో ఇంట్లో కూడా మాస్కులు వేసుకోవాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. -
అవసరమైతే ఢిల్లీలో 2రోజులు లాక్డౌన్ విధించాలన్న సీజేఐ
-
ఢిల్లీలో ఊపిరి ఆడట్లేదు
న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుందని, అత్యవసర పరిస్థితి కింద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయో చెప్పాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. రెండు రోజుల పాటు లాక్డౌన్ విధిస్తే మంచిదని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ల ధర్మాసనం సూచించింది. ఇళ్లల్లో కూడా మాస్కులు పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితులు వచ్చాయని జస్టిస్ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల్ని తీయడంతో పిల్లలు ఎక్కువగా కాలుష్యం బారిన పడుతున్నారని ప్రధాన న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. వాయు కాలుష్యం పెరిగిపోవడానికి పంట వ్యర్థాలను కాల్చడమే కారణమని కేవలం రైతుల్ని మాత్రమే నిందించడం తగదన్నారు. వాహనాల నుంచి కాలుష్యం, బాణాసంచా కాల్చడం, పారిశ్రామిక వ్యర్థాలు వంటివన్నీ కూడా వాయుకాలుష్యాన్ని తీవ్రతరం చేస్తున్నాయని అన్నారు. ఏక్యూఐని 500 పాయింట్ల నుంచి 200కి తగ్గించడానికి ఏం చెయ్యాలో ఆలోచించాలి.. రెండు రోజుల లాక్డౌన్ సహా అత్యవసరంగా చర్యలేమైనా తీసుకోండి..అని ధర్మాసనం పేర్కొంది. గాలిలో కాలుష్యాన్ని తగ్గించి శుద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన స్మాగ్ టవర్లు చేస్తున్నాయా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు. ఢిల్లీ ప్రభుత్వం తరఫున కోర్టుకు హాజరైన అడ్వకేట్ రాహుల్ మెహ్రా.. సెప్టెంబర్ 30న ఏక్యూఐ 84 ఉంటే ప్రస్తుతం 474కి పెరిగిపోయిందని చెప్పారు. ప్రస్తుతం కాలుష్యం రోజుకి 20 సిగరెట్లు కాల్చిన దానితో సమానమని అన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సమాచారం ప్రకారం శనివారం సాయంత్రం 6.30కి ఏక్యూఐ 427గా ఉంది. (చదవండి: 89 ఏళ్ల వయసు.. ఫిజిక్స్‌లో పీహెచ్డీ!) వారం రోజులు పాఠశాలలు బంద్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలో బడుల్ని సోమవారం నుంచి వారం రోజులు మూసివేయనున్నట్లు్ల సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఈ సమయంలో స్కూళ్లు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తాయని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తారని చెప్పారు. ప్రైవేటు కార్యాలయాలు కూడా ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని సూచించారు. నిర్మాణ రంగం పనుల్ని నవంబర్ 14 నుంచి 17వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్టు తెలిపారు. (చదవండి: వావ్ ఏంటీ అద్భుతం... ఆకాశంలో హ్యారీపాటర్ సినిమాలో మాదిరి ఎగురుతోంది!!) -
కాలుష్య కోరల్లో యమునా నది
-
సినిమా సెట్టింగో.. స్పెషల్ ఎఫెక్టో అనుకుంటున్నారా..!
న్యూఢిల్లీ: దేశ రాజధాని కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుంది. వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ వాసులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వీటికి తోడు జల కాలుష్యం కూడా తీవ్ర స్థాయికి చేరింది. పరిశ్రమల నుంచి విడుదలయిన వ్యర్థాలు యమునా నదిలో కలిసి.. దాన్ని గరళంగా మార్చేశాయి. నది పైన తెల్లని నురగ ఏర్పడింది. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో జనాలు నదీ స్నానాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలో పలువురు ఢిల్లీ మహిళలు కాలుష్య కాసారంగా మారిన యమునా నదిలో స్నానాలు ఆచరించారు. రసాయనాలతో కలుషితమై నురగలు కక్కుతున్నప్పటికి జనాలు.. దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా స్నానాలు చేశారు. సడెన్‌గా చూస్తే.. ఇదేదో సినిమా సెట్టింగో లేక స్పెషల్ ఎఫెక్ట్లానే అనిపిస్తుంది. (చదవండి: ప్రమాదకర స్థాయికి ఢిల్లీలో వాయు కాలుష్యం) ఇక ప్రతి ఏటా శీతాకాలంలో ఢిల్లీలో వాతావరణం చాలా దారుణంగా ఉంటుంది. పొగ ఆవరించి.. ఎదురుగా వచ్చే వారిని గుర్తించడం కష్టం అవుతుంది. దానికి తోడు వాయు కాలుష్యం కూడా చేరి.. పరిస్థితి మరింత దిగజారిపోతుంది. ఇక గత మూడు రోజులుగా ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. మరో 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతోందని అధికారులు తెలిపారు. తీవ్రమైన వాయు కాలుష్యంగా కారణంగా జనాలు గొంతులో మంట, కళ్ల నుంచి నీరు కారడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. చదవండి: ఊపిరి.. ఉక్కిరిబిక్కిరి.. -
చైనాను వెంటాడుతున్న సమస్యలు.. రహదారులు మూసివేత!
చైనాను ఒక సమస్య పోతే మరొక సమస్య వెంటాడుతుంది. చైనాలో తిరిగి కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. వీటిని అరికట్టడం కోసం అక్కడ చైనా ఆంక్షలు కూడా విధిస్తుంది. ఈ సమస్య సమసిపోక ముందే ఆ దేశంలో భారీ కాలుష్యం కారణంగా బీజింగ్‌లోని రహదారులు, పాఠశాల ఆట స్థలాలను మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే, చైనా ఇటీవల విద్యుత్ తయారీ కోసం బొగ్గు ఉత్పత్తి, వినియోగాన్ని పెంచడమే. ఇటీవల తీవ్ర బొగ్గు కొరత కారణంగా.. ఆ దేశంలో భారీగా విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఈ సంక్షోభాన్ని అరికట్టడం కోసం బొగ్గు ఉత్పత్తి, వినియోగాన్ని ఒక్కసారిగా పెంచింది. దీంతో ఉత్తర చైనాలో దట్టమైన పొగమంచు కప్పబడి ఉంది. కొన్ని ప్రాంతాల్లో 200 మీటర్ల వరకు రహదారుల మీద ఎవరు నడిచేది కూడా కనిపించడం లేదు. దీంతో ఆ దేశ వాతావరణ శాఖ.. ఫిబ్రవరిలో జరగబోయే వింటర్ ఒలింపిక్స్ 2022కు ఆతిథ్యం ఇచ్చే రాజధానిలో పాఠశాలలు, శారీరక విద్యా తరగతులు, బహిరంగ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించింది. షాంఘై, టియాన్జిన్, హార్బిన్ తో సహా ప్రధాన నగరాలకు వెళ్లే హైవేలను మూసివేశారు. బీజింగ్‌లోని యుఎస్ రాయబార కార్యాలయం వద్ద ఒక మానిటరింగ్ స్టేషన్ ద్వారా వాయు నాణ్యతను పరిశీలించగా అక్కడ వాయు కాలుష్యం సాధారణ జనాభాకు హానికలిగించే విధంగా ఉన్నట్లు తేలింది. (చదవండి: గంగిరెద్దులకు క్యూఆర్ కోడ్.. నిర్మలా సీతారామన్ ఆసక్తికర వీడియో!) డబ్ల్యూహెచ్ఓ నిర్దేశించిన స్థాయి కంటే 15పాయింట్లు అధికంగా అక్కడ వాయు కాలుష్యం ఉంది. శనివారం సాయంత్రం వరకు పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని బీజింగ్ అధికారులు తెలిపారు. గ్రీన్ హౌస్ వాయువులను ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశం చైనా. ఆ దేశం విద్యుత్ తయారీ కోసం 60 శాతం వరకు బొగ్గు ఉత్పత్తి మీద ఆధారపడుతుంది. అక్టోబర్ మధ్యలో సగటు రోజువారీ బొగ్గు ఉత్పత్తి సెప్టెంబర్ చివరి కంటే 1.1 మిలియన్ టన్నులు ఎక్కువగా ఉందని దేశంలోని ఉన్నత ఆర్థిక ప్రణాళిక సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ బొగ్గు కేంద్రాలు ఈ వారం ప్రారంభంలో 112 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేశాయి అని ప్రభుత్వ ఏజెన్సీ తెలిపింది. కాలుష్యాన్ని అరికట్టడం కోసం సీఓపీ 26 సదస్సులో ప్రపంచ దేశాలు తీర్మానం చేస్తుంటే.. చైనా వారి నిర్ణయాలను పెడచెవిన పెడుతుంది. -
ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం
-
ప్రమాదకర స్థాయికి ఢిల్లీలో వాయు కాలుష్యం
సాక్షి, న్యూఢిల్లీ: దీపావళి బాణాసంచా ఎఫెక్ట్ దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)పై స్పష్టంగా కనిపించింది. పండుగ ముందు రోజులతో పోలిస్తే పండుగ తర్వాత నమోదైన వాయు నాణ్యత ఐదేళ్లలోనే అత్యల్పం కావడం గమనార్హం. దీనికి చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాలుష్యం తోడయింది. దీంతో, ఎన్సీఆర్ పరిధిలోని ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, నోయిడా, ఘజియాబాద్‌ల్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. నిషేధం అమలులో ఉన్నప్పటికీ దీపావళి రోజున ప్రజలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం కారణంగా శుక్రవారం తెల్లవారుజామున వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ప్రజలు కళ్లు, గొంతు మంట వంటి సమస్యలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆదివారం వరకు పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని నిపుణులు అంటున్నారు. చదవండి: (పశ్చిమబెంగాల్ మంత్రి సుబ్రతా ముఖర్జీ కన్నుమూత) తక్కువ ఉష్ణోగ్రతలు, కాలుష్య కారకాలు పేరుకుపోవడం, ఆకాశం మేఘావృతమైన కారణంగా శుక్రవారం ఉదయం ఢిల్లీలోని జన్‌పథ్‌లో వాయు నాణ్యత ప్రమాదకర పీఎం 2.5 స్థాయి 655.07కి చేరుకుంది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం సమీపంలో పీఎం 2.5 స్థాయి 999గా నమోదైంది. ప్రమాణాల ప్రకారం, పీఎం 2.5 స్థాయి 380 కంటే ఎక్కువగా ఉంటే దానిని తీవ్రమైందిగా పరిగణిస్తారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో సగటున వాయు నాణ్యత ఢిల్లీలో 462, ఫరీదాబాద్‌లో 469, ఘజియాబాద్‌లో 470, గురుగ్రామ్‌లో 472, నోయిడాలో 475, గ్రేటర్ నోయిడాలో 464కి చేరుకుంది. కోవిడ్ బాధితులపై తీవ్ర ప్రభావం దీపావళి తర్వాత రోజున 2016లో 445, 2017లో 403, 2018లో 390, 2019లో 368, 2020లో 435, 2021లో 462 వాయుకాలుష్య తీవ్రత నమోదైంది. కరోనా నుంచి కోలుకున్న వారిపై కాలుష్యం ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీరు మార్నింగ్ వాక్ మానేయాలని, శ్వాస సంబంధ, హృద్రోగ సమస్యలున్న వారు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. చదవండి: (కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ) -
పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల వల్లే కాలుష్యం ఎక్కువ?
కాప్-26 స్కాట్లాండ్లోని గ్లాస్గోలో నవంబర్ 1 నుంచి 12 వరకు జరుగుతోంది. ఈ వాతావరణ సదస్సులో పర్యావరణ సమస్యలపై ప్రపంచం దృష్టి సారించడంతో రాబోయే కాలంలో కాలుష్యం తగ్గించాలని అన్నీ దేశాలు భావిస్తున్నాయి. ఎక్కువగా పరిశ్రమలు, వాహనాల చేత వాయు కాలుష్యం ఏర్పడుతుంది. పెట్రోల్ వాహనాల వల్ల వెలువడే కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని ఎక్కువ శాతం దేశాలు అభిప్రాయపడుతున్నాయి. ఇంధనాన్ని మండించడం వల్ల ప్రత్యక్ష కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాల్లో దాదాపు పావు వంతు రవాణా రంగం బాధ్యత వహిస్తుంది. అందులో ప్యాసింజర్ కార్లు 45% ఉన్నాయి. ఈ సవాలు నుంచి బయటపడేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు ఒక సమాధానంగా కనిపిస్తున్నాయి. అయితే, ఇక్కడే మనం ఒక చిన్న విషయం తెలుసుకోవాల్సి ఉంది. ఒక వాహనం తయారు కావాలంటే 20,000 నుంచి 30,000 విడిభాగలు అవసరం. ఈ విడిభాగల తయారీ కోసం కొన్ని వేల టన్నుల అల్యూమినియం, ఉక్కు ఇతర పదార్థాలు అవసరం. ఈ ముడి పదార్ధాల తయారీ సమయంలో పరిశ్రమల ద్వారా ఎక్కువ వాయు కాలుష్యం ఏర్పడుతుంది. ఐసీఈతో పోలిస్తే సంప్రదాయ అంతర్గత కంబస్టివ్ ఇంజిన్(ఐసీఈ)తో పోలిస్తే బ్యాటరీ-ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేటప్పుడు విడుదల చేసే గ్రీన్ హౌస్ వాయువులు అధిక భాగాన్ని కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఈవీ ఉత్పత్తి ఊపందుకోవడంతో బ్యాటరీ ఉత్పత్తి, పరిశోధనలు, అమ్మకాలు పెరుగుతున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల వల్ల గ్రీన్ హౌస్ ఉద్గారాలు 2040 నాటికి 60% కంటే ఎక్కువకు పెరగబోతున్నాయని కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే కంపెనీ తెలిపింది. ఈ సంస్థ "సరఫరా గొలుసులో డీకార్బనైజేషన్ ప్రాముఖ్యతను విస్మరించలేము" అని గ్రీన్ పీస్ ఈ వారం ప్రచురించిన నివేదికలో పేర్కొంది. (చదవండి: ఇది ట్రక్కు కాదు నడిచే ఇళ్లు.. అచ్చంగా హీరోల తరహాలో) ఈ నివేదికలో పేర్కొన్నట్టు మనం ఒకదాని గురుంచి తెలుసుకోవాలి.. మెరుగైన ఈవీ బ్యాటరీలను తయారు చేయడానికి, రేంజ్ ఎక్కువగా రావడానికి సాంకేతిక నిపుణులు భారీ పరిమాణంలో బ్యాటరీలను తయారు చేయాల్సి ఉంటుంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల బరువు పెరుగుతుంది. ఇతర భాగాల బరువు + బ్యాటరీ బరువు కలిపితే వాహనం బరువు పెరుగుతుంది. దీంతో మొత్తంగా వాహనం బరువు పెరగడం చేత మళ్లీ రేంజ్ సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ సమస్యను అరికట్టడం కోసం కార్ల కంపెనీలు తేలికపాటి బరువు ఉండే అల్యూమినియం వినియోగం వైపు దృష్టి పెడుతున్నారు. సాంప్రదాయ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల్లో 45% లోహాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు నివేదికలో పేర్కొంది. అల్యూమినియం డిమాండ్ పెరగడం చేత లోహ కంపెనీలు ఉత్పత్తిని పెంచాయి. ఉత్పత్తి పెరగడంతో వాయు కాలుష్యం అదే స్థాయిలో పెరుగుతుంది. ఈ రకంగా చూస్తే పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల వల్లే ఎక్కువ వాయు కాలుష్యం మరింత తీవ్రమవుతోంది. (చదవండి: ఐఓసీఎల్ బాటలోనే బీపీసీఎల్.. బంకుల్లో ఛార్జింగ్ స్టేషన్లు!) ఇంకా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం పవర్ అవసరం అనే విషయం అందరికీ తెలిసిందే. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ వల్ల విద్యుత్ కి డిమాండ్ పెరుగుతుంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రభుత్వాలు, కంపెనీలు థర్మల్ కర్మాగారాల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇక్కడ సౌర విద్యుత్ ఆప్షన్ ఉన్న ప్రస్తుతం మన దేశంతో సహ ఇతర దేశాలలో ఇంకా అంత ఎక్కువగా అందుబాటులోక రాలేదు. అందుకని ఎలక్ట్రిక్ వాహన సంస్థలు, ప్రభుత్వాలు ఈ సమస్యల మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం వచ్చింది. -
ఊపిరి.. ఉక్కిరిబిక్కిరి..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో టపాకాయలు కాల్చాక వివిధ రూపాల్లో వెలువడే కాలుష్యాలు కనీసం మూడురోజుల పాటు ప్రభావం చూపే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో వాహనాలు, పరిశ్రమల ద్వారా, పంటలు కాల్చాక, ఇతర రూపాల్లో వెలువడే కాలుష్యాలు వివిధ అనారోగ్య సమస్యలున్న వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న విషయం తెలిసిందే. చలికాలంలో పొగ, ఇతర కాలుష్యాలు కలగలిసి స్మాగ్ (పొగ, మంచు కలగలిసినది )గా మారడంతో ప్రపంచ వ్యాప్తంగా ముఖ్య పట్టణాల్లోని ప్రజలకు శ్వాసకోశ, ఇతర తీవ్ర సమస్యలు ఎదురౌతున్నాయి. ఇక దీపావళి పండుగ సందర్భంగా కాల్చే టపాసులతో విపరీతంగా వెలువడే కాలుష్యం మూడురోజుల పాటు వాతావరణంలోనే అది కూడా భూ ఉపరితలానికి కొంత ఎత్తులోనే ఉంటుంది. అప్పటికే ఉన్న కాలుష్యానికి ఇది తోడవడంతో తీవ్రత మరింత పెరగడంతో పాటు మరింత ఎక్కువ మందిపై ప్రభావం చూపేందుకు అవకాశం ఏర్పడుతోంది. మంచు వాతావరణంలో గాలి నెమ్మదించడం, టపాకాయలు పేల్చాక వెలువడే పొగలతోనూ గాలి స్తంభించడం, కాలుష్యకారక ధూళి కణాలు గాల్లోనే ఉండిపోవడం ఇందుకు కారణం అవుతున్నాయి. కాలుష్యంతో ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శ్వాసకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ వీవీ రమణ ప్రసాద్ (కిమ్స్ ఆస్పత్రి), డాక్టర్ హరికిషన్ గోనుగుంట్ల (యశోద ఆస్పత్రి) సాక్షితో మాట్లాడారు. వివరాలు వారి మాటల్లోనే... ఇళ్లకే పరిమితం కావాలి దీపావళి టపాసులతో పెరిగే వాయుకాలుష్య తీవ్రత అనేక సమస్యలకు కారణమౌతుంది. దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు, జబ్బులున్నవారు ఇళ్లకే పరిమితం కావాలి. ఆస్తమా, ఐఎల్‌డీ, బ్రాంకైటిస్ రోగులు టపాకాయలు పేల్చొద్దు. చేతులను తరచుగా శానిటైజ్ చేయడం కంటే సబ్బు నీటితో కడగాలి. శానిటైజర్లలో అల్కహాలు ఉంటుంది కాబట్టి టపాకాయలకు దగ్గరగా ఉంచకండి. షేక్‌హ్యాండ్ అలవాటుకు దూరంగా ఉంటే మంచిది. నైలాన్, సింథటిక్ దుస్తులు వేసుకోవద్దు. సాధారణ టపాసులు కాకుండా గ్రీన్ క్రాకర్లు కాల్చాలి. ఈ కాలుష్య ప్రభావంతో దగ్గు, ఆయాసం, ఛాతీ బరువెక్కడం ఇతర ఊపిరితిత్తుల సమస్యలు ఉత్పన్నమౌతాయి. న్యూమోనియా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే. – డాక్టర్ హరికిషన్ -
ఎయిర్ ప్యూరిఫైయర్.. ప్రతీ ఇంట్లో ఉండాల్సిందే
మన పరిసరాల్లో గాలి స్వచ్ఛంగా ఉంటేనే మనం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలుగుతాం. వీధుల్లోకి వెళితే వాహనాల నుంచి వెలువడే పొగ, దుమ్ము ధూళితో నిండే గాలి ఉక్కిరిబిక్కిరి కావడం ఎటూ తప్పదు. కనీసం ఇంట్లోనైనా స్వచ్ఛమైన గాలిలో ఊపిరి పీల్చుకుందామనుకుంటే ఇలాంటి ఎయిర్ ప్యూరిఫైయర్ ఇంట్లో ఉండాల్సిందే! ఇది ఫ్యాను మాదిరిగా చక్కని గాలి అందిస్తూనే, గాలిలోని ప్రమాదకరమైన సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. ఇది వెయ్యి చదరపు గజాల పరిధిలోని గాలిని క్షణాల్లో స్వచ్ఛంగా మార్చేస్తుంది. యూరోపియన్ ఎలక్ట్రిక్ పరికరాల తయారీ సంస్థ ‘ఏస్పెన్’ డిజైనర్లు ‘హెచ్13 హెపా యూవీసీ జెర్మిసైడల్ ఎయిర్ ప్యూరిఫైయర్’ పేరిట దీనిని రూపొందించారు. దీనిని ఆన్ చేయగానే, గాలి వీచడంతో పాటు, ఇందులోని అల్ట్రావయొలెట్ లైట్ కూడా వెలుగుతుంది. దీని నుంచి వెలువడే అల్ట్రావయొలెట్ కిరణాలు గాలిలోని సూక్ష్మక్రిములను క్షణాల్లో నాశనం చేస్తుంది. చదవండి: చనిపోయి మళ్లీ అదే తల్లి కడుపున పుట్టారు..సైన్స్‌కే అందని అద్భుతం -
Air Pollution: ఢిల్లీలో హఠాత్తుగా పెరిగిన వాయుకాలుష్యం.. కారణం అదే!
ఢిల్లీ వాయు నాణ్యత రోజురోజుకీ మరింత క్షీణించిపోతుంది. తేలికపాటి వానజల్లులు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ గురువారం నుంచి గాలి నాణ్యత మళ్లీ క్షీణించడం ప్రారంభమయ్యిందని యిర్ క్వాలిటీ ఇండెక్స్ వెల్లడించింది. తాజాగా ఆదివారం వాయు కాలుష్యం అధిక స్థాయిలో నమోదయ్యినట్లు నివేదికలో తెల్పింది. పంట వ్యర్ధాలను తగులబెట్టడం వల్ల వెలువడిన పొగ కారణంగానే ఆదివారం హఠాత్తుగా 14 శాతం కాలుష్య రేటు నమోదయ్యింది. నిజానికి ఆరోజున వర్షం పడవల్సి ఉంది. అలాపడివుండే గాలి నాణ్యత కూడా కొంత మెరుగుపడి ఉండేది. చదవండి: ఎడమచేతివాటం వారు ఈ విషయాల్లో నిష్ణాతులట.. మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు..! ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డేటా ప్రకారం పంజాబ్‌లోనే గత రెండు రోజుల్లో 1089 పంటల వ్యర్థాలను తగులబెట్టిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. అలాగే యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానాలలో మొత్తంగా 1789 తేలాయి. ఇలా పొరుగు రాష్ట్రాల ప్రభావం పరోక్షంగా ఢిల్లీలో వాయుకాలుష్యానికి కారణమౌతున్నాయి. గత 10 రోజుల్లో జరిగిన సంఘటనల కంటే రెండు రోజుల్లో నమోదైన పంట వ్యర్థాల తాలుకు పొగ మరింత పెరిగినట్లు డేటా వెల్లడించింది. సాధారణంగా అక్టోబర్, నవంబర్ మాసాల్లో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వరి కోతలు ఉంటాయి. అనంతరం గోధుమ, బంగాళాదుంపలను సాగు చేయడం ప్రారంభిస్తారు. అందుకు పంట అవశేషాలను త్వరగా తొలగించాలని రైతులు తమ పొలాల్లోని వ్యర్థాలకు నిప్పు పెడతారు. ఢిల్లీ - ఎన్‌సిఆర్‌లో కాలుష్యం ఆందోళనకరంగా పెరగడానికి ఇది ఒక ప్రధాన కారణమని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. చదవండి: Health Tips: ఎసిడిటీ బాధలు వేధిస్తున్నాయా? వాము, ధనియాలు, తేనె.. ఇంకా.. -
Rajasthan: బాణాసంచాపై సీఎం అశోక్ గెహ్లాత్ కీలక నిర్ణయం
జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ పెరుగుతున్న వాయుకాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని బాణాసంచాను నిషేదిస్తూ గురువారం ఉత్తర్వులను జారీచేశారు. అక్టోబరు 1 నుంచి 2022 జనవరి31 వరకు రాజస్థాన్‌లో బాణాసంచా అమ్మడం, కాల్చడం,నిల్వచేయడాన్ని పూర్తిగా నిషేదిస్తున్నట్లు తెలిపారు. బాణా నుంచి వెలువడే కాలుష్యం వలన ఊపిరితిత్తుల పనితీరు తీవ్ర ప్రభావానికి గురౌతుందని తెలిపారు. కరోనాతో ఇప్పటికే ప్రజల రోగనిరోధక శక్తి తగ్గిందని అన్నారు. అందుకే, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలోపెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అశోక్ గెహ్లత్ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 2022 జవవరి 1 వరకు ఢిల్లీలో బాణాసంచాను నిషేధిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. చదవండి: బాణాసంచాలో విషపూరిత రసాయనాలు! -
ఢిల్లీలో బాణాసంచాకు నో ఛాన్స్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం బాణాసంచాను నిషేధించాలని నిర్ణయించింది. బుధవారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని బాణాసంచా వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో గత మూడు సంవత్సరాల మాదిరిగానే, ఈ ఏడాది సైతం దీపావళి సందర్భంగా బాణాసంచా అమ్మకం, నిల్వ చేయడం, కాల్చడంపై నిషేధం కొనసాగనుంది. ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఢిల్లీలో వాయు కాలుష్య పరిస్థితుల దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. గత సంవత్సరం వ్యాపారులు బాణాసంచాను నిల్వ చేసిన తర్వాత కాలుష్యం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, పూర్తి నిషేధం ఆలస్యంగా విధించామని, ఇది వ్యాపారులకు నష్టాన్ని కలిగించిందని కేజ్రీవాల్ తన ట్వీట్లో వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. ఈసారి ముందుగానే ప్రకటించినందున వ్యాపారులందరూ ఎలాంటి బాణాసంచాను నిల్వ చేయరాదని ఆయన కోరారు. రూ.1,500 కోట్ల బాణాసంచా వ్యాపారం మరోవైపు దీపావళి రోజున దేశ రాజధానిలో సుమారు రూ.1,500 కోట్లకు పైగా బాణాసంచా వ్యాపారానికి ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దెబ్బ తగిలినటైంది. ఢిల్లీలో 150 కి పైగా హోల్‌సేల్ బాణాసంచా విక్రేతలు ఉన్నారు. వీరేగాక దీపావళికి ఒకటి రెండు రోజుల ముందు నుంచి ఢిల్లీలో బాణాసంచా విక్రేతలు తాత్కాలిక ప్రాతిపదికన వ్యాపారం చేస్తారు. -
వారి ఆయుః ప్రమాణం క్షీణిస్తోంది.. జాగ్రత్త!
సాక్షి, న్యూఢిల్లీ: వాయు కాలుష్యం కారణంగా మానవుడి ఆయుఃప్రమాణం తొమ్మిదేళ్లకు పైగా తగ్గుతోందని అమెరికా రీసెర్చ్ గ్రూప్ తన నివేదికలో తెలిపింది. భారత రాజధాని ఢిల్లీతో సహా దేశంలోని తూర్పు, ఉత్తర, మధ్య రాష్ట్రాల్లో దాదాపు 480 మిలియన్లకు పైగా ప్రజలు వాయు కాలుష్యం బారిన పడుతున్నట్లు చికాగో యూనివర్సిటీలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ (ఈపిక్) బుధవారం వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యధిక వాయుకాలుష్యం ఢిల్లీలోనే ఉందని, అక్కడ ప్రజలు ఎక్కువగా శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నట్లు నివేదికలో పేర్కొంది. అత్యధిక స్థాయిలో వాయు కాలుష్యం భౌగోళికంగా విస్తరిస్తోందంటూ ఈపిక్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, వాయు కాలుష్యాన్ని నియంత్రించటం కోసం భారత్ 2019లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి.. ప్రజల ఆయుః ప్రమాణం పెంచేలా తగు చర్యలు తీసుకుందంటూ ప్రశంసలు కురిపించింది. అదే విధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) సూచనల మేరకు పొరుగు దేశమైన బంగ్లాదేశ్ సైతం వాయు కాలుష్య నియంత్రణకు తగు చర్యలు తీసుకుందని ఈపిక్ నివేదికలో ప్రశంసించింది. చదవండి: ఆటోమేకర్స్‌కి సర్కార్ షాక్ ! మంత్రి నితిన్ గడ్కారీ కీలక ప్రకటన