మన పరిసరాల్లో గాలి స్వచ్ఛంగా ఉంటేనే మనం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలుగుతాం. వీధుల్లోకి వెళితే వాహనాల నుంచి వెలువడే పొగ, దుమ్ము ధూళితో నిండే గాలి ఉక్కిరిబిక్కిరి కావడం ఎటూ తప్పదు. కనీసం ఇంట్లోనైనా స్వచ్ఛమైన గాలిలో ఊపిరి పీల్చుకుందామనుకుంటే ఇలాంటి ఎయిర్ ప్యూరిఫైయర్ ఇంట్లో ఉండాల్సిందే! ఇది ఫ్యాను మాదిరిగా చక్కని గాలి అందిస్తూనే, గాలిలోని ప్రమాదకరమైన సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది.
ఇది వెయ్యి చదరపు గజాల పరిధిలోని గాలిని క్షణాల్లో స్వచ్ఛంగా మార్చేస్తుంది. యూరోపియన్ ఎలక్ట్రిక్ పరికరాల తయారీ సంస్థ ‘ఏస్పెన్’ డిజైనర్లు ‘హెచ్13 హెపా యూవీసీ జెర్మిసైడల్ ఎయిర్ ప్యూరిఫైయర్’ పేరిట దీనిని రూపొందించారు. దీనిని ఆన్ చేయగానే, గాలి వీచడంతో పాటు, ఇందులోని అల్ట్రావయొలెట్ లైట్ కూడా వెలుగుతుంది. దీని నుంచి వెలువడే అల్ట్రావయొలెట్ కిరణాలు గాలిలోని సూక్ష్మక్రిములను క్షణాల్లో నాశనం చేస్తుంది.
చదవండి: చనిపోయి మళ్లీ అదే తల్లి కడుపున పుట్టారు..సైన్స్‌కే అందని అద్భుతం
Comments
Please login to add a commentAdd a comment