
జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ పెరుగుతున్న వాయుకాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని బాణాసంచాను నిషేదిస్తూ గురువారం ఉత్తర్వులను జారీచేశారు. అక్టోబరు 1 నుంచి 2022 జనవరి31 వరకు రాజస్థాన్‌లో బాణాసంచా అమ్మడం, కాల్చడం,నిల్వచేయడాన్ని పూర్తిగా నిషేదిస్తున్నట్లు తెలిపారు. బాణా నుంచి వెలువడే కాలుష్యం వలన ఊపిరితిత్తుల పనితీరు తీవ్ర ప్రభావానికి గురౌతుందని తెలిపారు.
కరోనాతో ఇప్పటికే ప్రజల రోగనిరోధక శక్తి తగ్గిందని అన్నారు. అందుకే, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలోపెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అశోక్ గెహ్లత్ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 2022 జవవరి 1 వరకు ఢిల్లీలో బాణాసంచాను నిషేధిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే.
చదవండి: బాణాసంచాలో విషపూరిత రసాయనాలు!