Toxic chemicals
-
కన్నీరు మున్నేరు
-
ఆ కెమికల్ వల్లే అమెరికాలో ఏటా లక్ష మంది మృతి
న్యూయార్క్: మనం రోజు పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు వాడే ప్లాస్టిక్స్ పరికరాలన్నింటిలో థాలెట్ ఆనే కెమికల్ ఉన్నట్లు న్యూయార్క్ పరిశోధకులు గుర్తించారు. ఆఖరికి పిల్లలు ఆడుకునే బొమ్మలు దగ్గర్నించి మనం నిత్యం వాడే దుస్తులు, షాంపు నుంచి మేకప్ వరకు అన్ని ప్లాస్టిక్‌తోనే రూపోందించినవే కావడంతో అత్యధికంగా థాలెట్ అనే కెమికల్ ఉత్పన్నవతోందని వెల్లడించారు. (చదవండి: ఆ గాయని వస్తువులు మిలియన్ డాలర్లు!) ఇది హర్మోన్ల వ్యవస్థను నాశనం చేసే కారకాలుగా ప్రసిద్ధిమైనవే కాక మొత్తం మానవ వినాళికా గ్రంథి వ్యవస్థనే ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు. ఆ ప్లాస్టిక్ వస్తువులు మన నిత్య జీవితంలో ఒక భాగమైపోయాయని అందువల్లే ఈ విషపూరిత రసాయనాలు మన శరీరంలోకి సులభంగా ప్రవేశిస్తున్నాయి అని అన్నారు. దీంతో మధుమేహం, ఊబకాయం, గుండే జబ్బులు అధికమవుతున్నట్లు తాజా అద్యయనాల్లో తెలపారు. న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన గ్రాస్మన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన పరిశోధనలో 55 నుంచి 64 సంవత్సరాల వయస్సు గల ఐదు వేల మంది మూత్రంలో థాలెట్ల సాంద్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. అంతేకాదు వారు గుండె జబ్బులతో చనిపోయే అవకాశం ఉందని వెల్లడించారు. గుండెజబ్బులకు ప్రధానం కారణం రసాయాలేనని తెలిపారు. అలాగే పురుషులలో టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గిపోవడానికి కారణం ఈ థాలెట్ రసాయనమే కారణం అని చెప్పారు. ఈ థాలెట్ రసాయనం వల్ల అమెరికన్లు రకరకాల వ్యాధుల భారినపడి ఏటా 1,00,000 మంది అమెరికన్లు మరణిస్తున్నారని.. ఫలితంగా ఆర్థికంగా 40 నుంచి 47 బిలియన్ల డాలర్ల వరకు నష్టపోతున్నట్లు న్యూయార్క్ పరిశోధకులు అధ్యయనాల్లో పేర్కొన్నారు. (చదవండి: కూతురు ఆనందం: హే.. నాన్న కూడా నాతో పాటే..!) -
Rajasthan: బాణాసంచాపై సీఎం అశోక్ గెహ్లాత్ కీలక నిర్ణయం
జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ పెరుగుతున్న వాయుకాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని బాణాసంచాను నిషేదిస్తూ గురువారం ఉత్తర్వులను జారీచేశారు. అక్టోబరు 1 నుంచి 2022 జనవరి31 వరకు రాజస్థాన్‌లో బాణాసంచా అమ్మడం, కాల్చడం,నిల్వచేయడాన్ని పూర్తిగా నిషేదిస్తున్నట్లు తెలిపారు. బాణా నుంచి వెలువడే కాలుష్యం వలన ఊపిరితిత్తుల పనితీరు తీవ్ర ప్రభావానికి గురౌతుందని తెలిపారు. కరోనాతో ఇప్పటికే ప్రజల రోగనిరోధక శక్తి తగ్గిందని అన్నారు. అందుకే, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలోపెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అశోక్ గెహ్లత్ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 2022 జవవరి 1 వరకు ఢిల్లీలో బాణాసంచాను నిషేధిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. చదవండి: బాణాసంచాలో విషపూరిత రసాయనాలు! -
బాణాసంచాలో విషపూరిత రసాయనాలు!
న్యూఢిల్లీ: బాణాసంచా తయారీలో విషపూరిత రసాయన పదార్ధాలు వాడడం చాలా ప్రమాదకరమని సీబీఐ నివేదిక వెల్లడించిందని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. బాణాసంచా తయారీలో బేరియం వాడకం, బాణాసంచాపై జరిపే ముద్రణ(లేబిలింగ్)లో కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరిగినట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. హిందుస్తాన్ ఫైర్వర్క్స్, స్టాండర్డ్ ఫైర్వర్క్స్ సంస్థలు పెద్ద స్థాయిలో బేరియంను కొనుగోలు చేసినట్లు తెలిసిందని జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. అయితే ఉత్పత్తిదారులకు మరో అవకాశం ఇవ్వదలిచామని, సీబీఐ నివేదికను వారికి అందించాలని కోర్టు సూచించింది. మనదేశంలో ఎక్కడోఒకచోట ప్రతిరోజూ ఏదో ఒక ఉత్సవం జరుగుతుంటుందని, ఈ కారణంతో బాణాసంచాపై విచారణ నిలిపివేయలేమని, ప్రజలకు కలిగే ఇబ్బందులను పరిశీలించాలని కోర్టు వ్యాఖ్యానించింది. -
కేన్సర్ పంట!
అన్నదాతలు కోటి ఆశలతో పంట పెడతారు. ఆరుగాలం అష్టకష్టాలూ పడి పంట పండిస్తారు. చీడపీడల నుంచి రక్షణకు పురుగు విషాలు పిచికారీ చేస్తారు. కాలంతోపాటు పురుగుల్లోనూ మార్పొచ్చింది..వాటిని మట్టుబెట్టడానికి ఒకటికి పదిసార్లు ‘సిస్టమిక్’ విషాలు చల్లుతున్నారు. కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక పోతోంది. పురుగు విషాలు పచ్చని పల్లెల గాలిని, నీటిని, భూమిని విష కాసారాల్లా మార్చేస్తున్నాయి. రైతులు పంటల మీద చల్లుతున్న విషరసాయనాలు కేన్సరై వారినే కాటేస్తున్నాయి.. చిత్తూరు జిల్లా ఈడిగపల్లె పంచాయతీ గ్రామాల్లో కేన్సర్ మహమ్మారి కరాళనృత్యం చేస్తున్నది. గత ఏడాదిలోనే 15 మంది చనిపోయారు. చెన్నై, బెంగళూరు ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో కేన్సర్ రోగులు చికిత్స పొందుతున్నారు. ఈ భయానక పరిస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. ఈడిగపల్లె పంచాయతీ చిత్తూరు–మదనపల్లె హైవేలో ఉంది. అక్కడి భూములు సారవంతమైనవే. గత ముప్పయ్యేళ్లుగా టమాటా, కాలీఫ్లవర్, క్యాబేజి, వరి తదితర పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఈడిగపల్లె పంచాయతీలోని చిలకావారిపల్లె, ఆవులోళ్లపల్లె, నేతిగుట్లపల్లె, యర్రగుంట్లపల్లె తదితర గ్రామాల్లో కేన్సర్ మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. గత ఏడాది కాలంలోనే రైతు కుటుంబాలకు చెందిన సుమారు 15 మంది మహిళలు, పురుషులు కేన్సర్ కారణంగా చనిపోయారు. పదుల సంఖ్యలో బెంగళూరు, మద్రాసు, హైదరాబాదు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. 80–90 ఏళ్లు వరకు ఆరోగ్యవంతులుగా జీవించిన పల్లెవాసులు నేడు 50–60 ఏళ్లలోపే క్యాన్సర్ బారిన పడి నేలరాలుతున్నారని కొందరు గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ప్రమాదకరంగా పురుగుమందుల పిచికారీ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలకు నాలుగైదు రెట్లు ఎక్కువగా పురుగుమందులు పిచికారీ చేయడం వరకూ వెళ్లింది. అంతకన్నా ప్రమాదకరమైన సంగతేమిటంటే.. పురుగుమందులు పిచికారీ చేసే టప్పుడు ఒక్కరు కూడా ముఖానికి గుడ్డ కూడా అడ్డం కట్టుకున్నట్లు కనపడలేదు. ఈ గ్రామాల్లో రైతులు సాధారణంగా 4–7 రోజుల వ్యవధిలో ఒక సారి పురుగుమందు పిచికారీ చేయిస్తుంటారు. మొత్తం పంట కాలంలో 15–20 సార్లు పిచికారీ చేస్తున్నట్లు అంచనా. టమాటాలు ఎర్రగా నిగనిగలాడుతూ కనిపించడానికి కూడా ప్రత్యేక మందులు పిచికారీ చేస్తున్నట్లు ఒక రైతు చెప్పారు. టమాటా ధర బాగా తక్కువగా ఉన్నప్పుడు రసాయనిక పురుగుమందుల పిచికారీ కూడా బాగా తక్కువగా కొడతారని ఒక రైతు తెలిపారు. కొందరు రైతులు స్ప్రింక్లర్ల ద్వారా కూడా పురుగుమందులు పిచికారీ చేస్తున్నారు. పిచికారీ చేసినప్పుడు ఒంటిపై పడకుండా జాగ్రత్తపడే పరిస్థితి కూడా లేదు. చీడపీడలను సహజ పద్ధతుల్లో అదుపులో ఉంచడానికి దోహదపడే అంతర పంటలు, ఎర పంటలు, సరిహద్దు పంటలు వేయడం, ఎర అట్టలు ఏర్పాటు చేయడం వంటి పద్ధతులు అక్కడ అసలు కనపడలేదు. ఇలా.. పురుగుమందులను ప్రమాదకరంగా వాడటంతోపాటు.. అధిక రసాయనిక అవశేషాలతో కూడిన కూరగాయలనే వారూ తింటున్నారు. ఎకరానికి 20 బస్తాలకు పైగా ఎరువులు.. కర్ర ఊతం లేకుండా టమాటా సాగు చేసే రైతులు కూడా ఎకరానికి రూ. 60 వేలు ఖర్చు పెట్టి.. 10 వేల నుంచి 15 వేల కిలోల వరకు దిగుబడి తీస్తున్నారు. స్టేకింగ్(కర్ర ఊతం) పద్ధతిలో ఏకపంటగా, మల్చింగ్ షీట్ వేసి, డ్రిప్‌తో టమాటా సాగు చేస్తున్నారు. అధికోత్పత్తి సాధించే లక్ష్యంతో ఎకరానికి 20 నుంచి 50 బస్తాల(బస్తా 50 కిలోలు) వరకు రసాయనిక ఎరువులు వేస్తున్నట్లు తెలిసింది. ఎకరానికి 25 వేల కిలోల నుంచి 30 వేల కిలోల వరకు దిగుబడి సాధిస్తున్నారు. ఎరువులు, పురుగుమందులతో కలుపుకొని ఎకరానికి రూ. 2 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. పిచికారీ చేసే రసాయనాలలో కేవలం 8 శాతం మాత్రమే పంటకు ఉపయోగపడుతుందని అంచనా. మిగిలిన 92 శాతం పురుగుమందు గాలిలో, నీటిలో, భూమిలో కలిసి మనం తినే ఆహారం, పీల్చే గాలిలో ప్రకృతిలో కలిసిపోయి.. ముఖ్యంగా స్థానిక గ్రామీణ ప్రజల వినాశనానికే దారి తీస్తున్నది. ఈ ప్రాంతంలో 30 ఏళ్ల క్రితం రెండు, మూడు పంటలు కలిపి మిశ్రమ సేద్యం చేసేవారు. 15 ఏళ్ల నుంచి అయితే టమాటా లేదా కాళీఫ్లవర్ వంటి ఏదో ఒకే పంటను మాత్రమే సాగు చేస్తున్నారు. అప్పటి నుంచి ‘సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్’ విచ్చలవిడిగా చల్లుతున్నారని మదనపల్లెకు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు ఎం.సి.వి. ప్రసాద్ ‘సాక్షి’తో చెప్పారు. బూడిద, పుల్లటి మజ్జిగ, గోమూత్రంతో కషాయాలు వాడుతుంటే చీడపీడల సమస్య ఉండటం లేదన్నారు. తాము సూచించిన దానికన్నా ఐదు రెట్లు ఎక్కువగా పురుగుమందులు పిచికారీ చేస్తున్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.నీటిని, గాలిని, భూమిని విషపూరితం చేసి, మనుషులు, పశువుల ఆరోగ్యానికి ముప్పు తెచ్చే రసాయనిక వ్యవసాయానికి స్వస్తి చెప్పి.. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేపట్టడమే ఈ సమస్యకు పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. రైతులు మొదట తాము తినే పంటలనైనా సేంద్రియ పద్ధతుల్లో పండించుకోవడంపై దృష్టిపెట్టడం అత్యవసరమని సూచిస్తున్నారు. మా ఇంట్లో ముగ్గురికి కేన్సర్ వచ్చింది.. మా ఇంటిలో అమ్మ, చిన్నాన్న, పెద్దనాన్న ముగ్గురూ కేన్సర్ వ్యాధికి గురయ్యారు. అమ్మ 7 నెలల క్రితం చనిపోయింది. చిన్నాన్న, పెద్దనాన్న చికిత్స తర్వాత కోలుకున్నారు. మా చుట్టుపక్కల గ్రామాలలో చాలా మంది క్యాన్సర్ వ్యాధితో మరణించారు. టమాటా, కాళీఫ్లవర్, వరి తదితర పంటలు పదెకరాల్లో సాగు చేస్తున్నాను. రసాయనిక ఎరువులు ఎకరానికి 10–15 బస్తాల వరకు వేస్తాం. పురుగుమందులు దండిగానే చల్లుతున్నాం. ఈ పంటలనే మేము కూడా తింటున్నాం. పంటలు పండించడం మాత్రమే మాకు తెలుసు. దీని వల్ల ప్రాణాలు తీసే వ్యాధులు వస్తాయన్న విషయం తెలియదు. రామకృష్ణారెడ్డి (కిట్టు), చిలకావారిపల్లె, చిత్తూరు జిల్లా పురుగుమందులు తప్పనిసరి.. మా పంచాయతీలో ఏ పంటకైనా తప్పక రసాయనిక పురుగుమందులు స్ప్రే చేయాల్సిందే. టమాటా, కాళీఫ్లవర్ పంటకు 15 రోజులకు ఒకసారి, వర్షాకాలంలో పది రోజులకోసారి తప్పకుండా చేస్తుంటాం. చీడపీడలు నివారించేందుకు ఇంతకంటే వేరే మార్గం లేదని ఇక్కడి రైతుల అభిప్రాయం. సేంద్రియ వ్యవసాయం గురించి ఇక్కడెవరికీ తెలియదు. బాలకృష్ణారెడ్డి, ఈడిగపల్లె, చిత్తూరు జిల్లా 5 రెట్లు ఎక్కువగా పురుగుమందులు.. వ్యవసాయంలో పరిమితి కన్నా ఎక్కువగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడటంతో దుష్పరిణామాలు తప్పవు. ఒకవేళ ఎరువులు మోతాదుకు మించితే భూమిలో కరిగిపోతాయి. పురుగు మందులు అలా కాదు. గాలిలో, నీటిలో కలవడం, కూరగాయలపై వాటి అవశేషాలు అలాగే ఉంటాయి. అందువల్ల హానికలుగుతుంది. రైతులు రేపు, ఎల్లుండి మార్కెట్‌కు తరలించే కూరగాయలపై సైతం పురుగుల మందులు పిచికారీ చేయడం మంచిది కాదు. కేవలం పురుగులు, చీడపీడీలు ఆశించినపుడు తప్ప అదేపనిగా ఐదు రెట్లు ఎక్కువగా పంటలకు క్రిమిసంహారక మందులు వాడుతున్నారు. పంట తెగుళ్లు, చీడపీడలు ఆశిస్తుందేమోనని ముందుజాగ్రత్తగా పురుగుల మందులను విపరీతంగా స్ప్రే చేయడంతోనే అనర్థాలు సంభవిస్తున్నాయి. – సుధాకర్, వ్యవసాయ విస్తరణాధికారి, పుంగనూరు పురుగుమందుల వల్ల కేన్సర్లు.. ఈడిగపల్లె పరిసర ప్రాంతాల్లో మోతాదుకు మించి క్రిమిసంహారక మందులు, ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా, అవగాహన రాహిత్యంతో పురుగుల మందులు స్ప్రే చేస్తున్నారు. దీనివల్ల స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. గాలి ద్వారా పీల్చడం వల్ల గొంతు కేన్సర్ రావచ్చు. ఆడవారికి బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రైతులు, పొలం పనులపై వెళ్లే రైతు కూలీలు వక్కలతో పాటుగా దుగ్గు, గుట్కా వాడటం క్యాన్సర్‌కు కారకం కావచ్చు. – డా. పవన్‌కుమార్, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, ముడిపాపనపల్లె – సురమాల వంశీధర్, సాక్షి, మదనపల్లి -
ఢిల్లీలో విషవాయువు కలకలం
-
ఢిల్లీలో విషవాయువు కలకలం
460 మంది విద్యార్థినులకు అస్వస్థత ► విష రసాయనం తీసుకెళ్తున్న కంటైనర్ లీకవడంతో ప్రమాదం ► అప్రమత్తమైన అధికారులు.. తప్పిన పెను ప్రమాదం న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని తుగ్లకాబాద్ ప్రాంతం శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓ కంటెయినర్ నుంచి విష రసాయనం లీకవడంతో సమీపంలోని పాఠశాలలకు చెందిన 460 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో పెను ప్రమాదం తప్పింది. చైనా నుంచి దిగుమతైన క్లోరోమిథైల్ పైరిడిన్ రసాయనాన్ని హరియాణాలోని సోనేపట్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో అకస్మాత్తుగా లీకై విషవాయువులు వ్యాపించాయి. దీంతో అక్కడికి సమీపంలో ఉన్న రాణి ఝాన్సీ స్కూలు, ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థినులు కళ్ల మంటలు, కడుపునొప్పితో పాటు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. విషయం తెలియగానే ఘటనా స్థలానికి అంబులెన్సులతో పాటు పోలీసులు చేరుకుని.. విద్యార్థినులను సమీపంలో ఉన్న నాలుగు వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. కొన్ని గంటల చికిత్స తర్వాత అధికశాతం విద్యార్థినుల్ని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి చేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ముగ్గురిని మాత్రం రెండు ఆస్పత్రుల్లోని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాత్రా ఆస్పత్రిలో దాదాపు 55 మంది విద్యార్థినులకు వైద్య సేవలందించామని, వారంతా సురక్షితంగానే ఉన్నారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. అలాగే మజీతియా ఆస్పత్రిలో 107 మందికి చికిత్సనందించారు. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశం విషయం తెలిసిన వెంటనే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ.. బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ఆసుపత్రులన్నీ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైతే వైద్య సేవలందించేందుకు ఎయిమ్స్ డాక్టర్ల బృందం సిద్ధంగా ఉండా లని ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ప్రతిపక్ష నేత విజేందర్ గుప్తా బాధితులను పరామర్శించారు. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణ చట్టంలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. 80 క్యాన్ల క్లోరోమిథైల్ పైరిడిన్(పురుగుమందుల తయారీలో వాడతారు)తో కూడిన కంటైనర్ తుగ్లకాబాద్ డిపో నుంచి తెల్లవారుజామున 3.30 గంటలకు హరియాణాలోని సోనేపట్‌కు బయల్దేరింది. డిపో నుంచి బయటకు వచ్చాక టీ తాగేందుకు కంటైనర్‌ను సమీపంలోని రైల్వే కాలనీ వద్ద డ్రైవర్ ఆపాడు. ఈ సమయంలో కొంత రసాయనం లీకై రోడ్డుపై పడింది. అది గమనించని డ్రైవర్ సోనేపట్‌కు వెళ్లిపోయాడు. అయితే తుగ్లకాబాద్ ప్రాంతంలోని కస్టమ్స్ ఏరియాలో రసాయనం లీకై విషవాయువులు వ్యాపించాయంటూ ఉదయం 7.35 గంటలకు పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. సమీపంలో పలు స్కూళ్లు ఉండడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. అలాగే జాతీయ విపత్తు నివారణ బృందాలు(ఎన్డీఆర్ఎఫ్), సెంట్రలైజ్డ్ యాక్సిడెంట్ అండ్ ట్రామా సర్వీసెస్(క్యాట్స్)కు చెందిన అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని ప్రారంభించాయి. గ్యాస్ లీకైన సమయానికి ఎక్కడా మంటలు లేకపోవడం, అలాగే వెంటనే అప్రమత్తమై విద్యార్థుల్ని తరలించడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. -
మిత్ర పురుగులే రైతు సైన్యం
విష రసాయనాలు వాడకుండా పంటలు పండించాలంటే? ప్రకృతిలోని జీవరాసుల్లో మిత్ర, శత్రు బలగాల గుట్టుమట్లను కూలంకషంగా తెలుసుకోవాలి. జీవ నియంత్రణ వ్యవసాయ పద్ధతులను అనుసరించాలి. అప్పుడే.. రైతు జేబును, నేల సారాన్ని కొల్లగొడుతున్న రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం నుంచి బయటపడగలం. ఇందుకోసం లోతైన పరిశోధనలు చేయాలి. రైతులకు, వ్యవసాయ అధికారులకు, విద్యార్థులక్కూడా శిక్షణ ఇవ్వాలి. అంతేనా? ప్రభుత్వాలను ఒప్పించి క్షేత్రస్థాయిలో ఈ జీవ వ్యవసాయ పద్ధతులను అమల్లోకి తేవడం అన్నిటికన్నా ముఖ్యం. ఈ పనులన్నిటినీ చేస్తున్న ప్రభుత్వ సంస్థ ఏదైనా ఉందా? ఉంది! దానిపేరే ‘జాతీయ వృక్షారోగ్య యాజమాన్య సంస్థ’. కేంద్ర వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న ఈ సంస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. నేల ఆరోగ్యంతో పాటు రైతు ఆరోగ్యం, సమాజ ఆరోగ్యానికి బలమైన పునాదులు వేస్తోంది... సుస్థిర వృక్షారోగ్య యాజమాన్యానికి చిరునామా.. జాతీయ వృక్షారోగ్య యాజమాన్య సంస్థ (ఎన్ఐపీహెచ్ఎం) కేంద్ర వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ. హైదరాబాద్‌లోని రాజేందర్‌నగర్‌లో పశువైద్య కళాశాలకు ఎదురుగా దీని కార్యాలయం ఉంది. 1966లో సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్ (సీఐపీపీ) పేరుతో ఏర్పడిన ఈ సంస్థ పేరు కాలక్రమంలో ఎన్ఐపీహెచ్ఎంగా మారింది. 2008 జూలై 25 నుంచి స్వయం ప్రతిపత్తిగల సంస్థగా ఏర్పడింది. వ్యవసాయ పర్యావరణంలో అనూహ్యంగా చోటుచేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో వృక్షారోగ్య యాజమాన్యంలో సుస్థిరతను సాధించే లక్ష్యంతో పనిచేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ రంగంలో బోధన, శిక్షణ, పరిశోధనా, ధ్రువీకరణ, గుర్తింపు ఇచ్చే సాధికార సంస్థగా అవతరించింది. వ్యవసాయ రంగంలో జీవరక్షణ సంబంధమైన పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోంది. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో పాటు ఒప్పందాలు కుదుర్చుకొంది. వివిధ రాష్ట్రాల వ్యవసాయ విస్తరణ విభాగాల అధికారులకు సుస్థిర వృక్షారోగ్య పద్ధతుల్లో శిక్షణ అందిస్తోంది. పలు అంతర్జాతీయ సంస్థల విద్యార్థులు కూడా ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వచ్చే వ్యవసాయ పరికరాల ఆవిష్కరణలకు ప్రాచుర్యం కల్పించడంతో పాటు ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తల మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరిస్తోంది. జీవరక్షణ విధానంలో విశేష అనుభవం, వ్యవసాయం పట్ల అమితాసక్తి కలిగిన ఐఎఎస్ అధికారి డాక్టర్ కె సత్యగోపాల్ ఈ సంస్థకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు. వ్యవసాయ పర్యావరణ పరిరక్షణ విధానాల్లో రైతు బృందాలకు నేరుగా శిక్షణ ఇవ్వడమే కాకుండా.. జీవ, వృక్ష, వ్యవసాయ శాస్త్ర పట్టభద్రులకు ఈ విధానాల్లో పీజీ డిప్లొమా కోర్సులు నిర్వహిస్తోంది. మిత్ర పురుగుల అభివృద్ధిపై రైతులకు శిక్షణ ఇస్తాం రైతులను మార్చడం సులభం కాదు అనేది ఒక దురాభిప్రాయం. తాను ఆశించిన ప్రయోజనాన్ని అందించే మార్గాలను చూపిస్తే తప్పక మారుతాడు. క్రిమిసంహారకాలంటే కేవలం రసాయనిక పురుగుమందులు మాత్రమే కాదు. వృక్ష సంబంధమైన కషాయాలు, కానుగ నూనె, వేప నూనె, సీతాఫలం నూనె కూడా ఈ కోవలోకే వస్తాయి. వీటితోనూ పంటలను ఆశించే చీడపీడల నివారణ, నియంత్రణ పూర్తిస్థాయిలో సాధ్యమే. చీడపీడలను నివారించడానికి ఉపయోగపడే మిత్ర కీటకాలను పెంచి పోషించే పద్ధతులను, ట్రైకో డెర్మావిరిడి, సుడోమోనాస్, మైకోరైజా వంటి ముఖ్యమైన జీవ రసాయనాలను రైతు స్థాయిలో ఉత్పత్తి చేసుకునే విధానం ఎన్ఐహెచ్పీఎంలో శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ పూర్తి చేసుకున్న రైతు బయట రూ. వందలు పెట్టి కొనే ట్రైకో డెర్మావిరిడి, సూడోమోనాస్, మైకోరైజాలను రైతు కేవలం కొద్ది రూపాయల ఖర్చుతో తయారు చేసుకో గలుగుతాడు. వివిధ రకాల మిత్ర పురుగులను రైతు తన పొలంలోనే అభివృద్ధి చేసుకొనే పద్ధతులు కూడా ఈ శిక్షణలో భాగంగా నేర్పిస్తాం. కనీసం 30 మంది రైతులు బృందంగా ఏర్పడి సంప్రదిస్తే శిక్షణ రుసుం ఏమీ తీసుకోకుండా శిక్షణ ఇస్తాం. - డాక్టర్ కే సత్యగోపాల్, డెరైక్టర్ జనరల్, జాతీయ వృక్షారోగ్య యాజమాన్య సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్ -
కుండీల్లో కమ్మని ఆకుకూరలకు హాయ్.. చెబుదామా?
విషపు రసాయనాలు, రసాయనిక ఎరువులు, కలుషిత నీరు వాడకుండా ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచీ!.. కానీ ఇప్పుడలా పండిస్తున్నదెవరు? అయినా.. నగరాలు, పట్టణాలే కాదు.. గ్రామాల్లో అయినా ప్రకృతిసిద్ధంగా పెంచిన ఆహారం ఎక్కడ దొరుకుతాయిలెద్దూ.. అని నిరుత్సాహపడుతున్నారా? ఎక్కడి దాకో ఎందుకు చెప్పండి? ఆసక్తి ఉంటే మీరే.. మీ ఇంటిపట్టునే నిక్షేపంగా పండించుకోవచ్చు. ఇంటిపట్టున కాస్త ఖాళీ స్థలం ఉంటే సరేసరి. లేదంటే కుండీలు, మడుల్లో సులువుగానే ఇంటిపంటలు సాగు చేసుకోవచ్చు. ఉదయపు నీరెండలో ఇంటిపంటల పనులు చేస్తుంటే.. అలసిన మనసుకు ఎంత గొప్ప రిలీఫో కదండీ..? దీన్నే ‘హార్టీకల్చర్ థెరపీ’ అని నిపుణులు అభివర్ణిస్తున్నారు. కమ్మని ఆకుకూరలు, కూరగాయలకు ఇది బోనస్ అన్నమాట. కంపోస్టు+కొబ్బరిపొట్టు+మట్టి,, ఒకటి లేదా రెండు కుండీలతో ఆకుకూరల సాగు సరదాగా మొదలు పెట్టొచ్చు. ఆకుకూరలకు ఆరు అంగుళాల కన్నా లోతు మట్టి అవసరం లేదు. కుండీలు/ ట్రేలు/ మడుల్లో ఆకుకూరలను ఎంచక్కా పెంచుకోవచ్చు. కంపోస్టు (చివికిన పశువుల ఎరువు / వర్మీకంపోస్టు/ ఎండిన పేడ/ ఏదైనా ఇతర కంపోస్టు)+ కొబ్బరిపొట్టు సమపాళ్లలో కలిపి.. దానికి కొద్దిమొత్తంలో ఎర్రమట్టిని కలిపితే చాలు. కుండీలు, మడుల్లో ఆకుకూరలు, కూరగాయల సాగుకు మట్టి మిశ్రమం సిద్ధమైనట్లే. వేపపిండి ఉంటే కొంచెం కలిపితే ఇంకా మంచిది. కంపోస్టు టీ, వర్మీవాష్, జీవామృతం.. వంటివి వాడుకోవడం అవసరం. కుండీ అడుగున బెజ్జం మీద కుండ పెంకులు లేదా రాళ్లతో కప్పండి(ఈ బెజ్జం పూడిపోకుండా ఉంటేనే.. అదనపు నీరు బయటకుపోతుంది. కుండీలో నీరు నిలబడితే మొక్కకు నష్టం). ఆ తర్వాత కుండీ అడుగున అంగుళం మందాన ఎండు ఆకులు వేసి.. పైన మట్టి మిశ్రమం పోయండి. మట్టి నింపిన రోజే విత్తనాలు చల్లకండి. నీరు పోస్తూ ఒకటి, రెండు రోజులు కుండీ సాగుకు సిద్ధమయ్యాక.. విత్తనాలు చల్లండి లేదా మొక్కలు నాటండి. పది రోజుల్లో ముచ్చటైన బేబీ మెంతి కూర! విత్తనాలు లేవా? పర్లేదు. పోపు డబ్బాలో మెంతులు ఉన్నాయి కదా? మెంతి కూర ఎంత ఆరోగ్యమో మీకు తెలుసు కదా! గుప్పెడు మెంతులు తీసుకొని కుండీలో చల్లండి. వాటిపైన పల్చగా మట్టి వేసి.. నెమ్మదిగా నీటిని చిలకరించండి. మొక్కలు మొలిచే వరకూ తడి ఆరకుండా చూడండి. మొలకలొచ్చే వరకు పైన ఎండు ఆకులు కప్పితే మరీ మంచిది. గుర్తుపెట్టుకోండి. కుండీలో/ట్రేలో మట్టి ఏకాలంలోనైనా తడీపొడిగా ఉండాలి. నీరు నిలవ కూడదు.. అంతే! పది రోజుల్లో ముచ్చటైన బేబీ మెంతి కూర పచ్చగా పలకరిస్తుంది! అప్పటికప్పుడు కత్తిరించి తాజాగా పప్పులో వేయండి. ఆహా.. ఈ మెంతి కూర పప్పు రుచే వేరండోయ్.. అని మీరే అంటారు! మెంతికూర ఒక్కటేనా? పాలకూర, చుక్కకూర.. ఒకటేమిటి ఆకుకూరలేవైనా.. ఏ కాలంలోనైనా సాగు చేయొచ్చు. వంగ, టమాటా, బీర, బెండ, దొండ, ఆనప, దోస, కాకర.. ఇలాంటి కూరగాయలను సైతం ఇప్పుడు పెంచవచ్చు. డ్రిప్ సదుపాయం పెట్టుకుంటే నీటి వృథాతోపాటు శ్రమ కూడా తగ్గుతుంది. - ‘ఇంటిపంట’ డెస్క్ , intipanta@sakshi.com