
న్యూఢిల్లీ: బాణాసంచా తయారీలో విషపూరిత రసాయన పదార్ధాలు వాడడం చాలా ప్రమాదకరమని సీబీఐ నివేదిక వెల్లడించిందని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. బాణాసంచా తయారీలో బేరియం వాడకం, బాణాసంచాపై జరిపే ముద్రణ(లేబిలింగ్)లో కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరిగినట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. హిందుస్తాన్ ఫైర్‌వర్క్స్, స్టాండర్డ్ ఫైర్‌వర్క్స్ సంస్థలు పెద్ద స్థాయిలో బేరియంను కొనుగోలు చేసినట్లు తెలిసిందని జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. అయితే ఉత్పత్తిదారులకు మరో అవకాశం ఇవ్వదలిచామని, సీబీఐ నివేదికను వారికి అందించాలని కోర్టు సూచించింది. మనదేశంలో ఎక్కడోఒకచోట ప్రతిరోజూ ఏదో ఒక ఉత్సవం జరుగుతుంటుందని, ఈ కారణంతో బాణాసంచాపై విచారణ నిలిపివేయలేమని, ప్రజలకు కలిగే ఇబ్బందులను పరిశీలించాలని కోర్టు వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment