labelling norms
-
బాణాసంచాలో విషపూరిత రసాయనాలు!
న్యూఢిల్లీ: బాణాసంచా తయారీలో విషపూరిత రసాయన పదార్ధాలు వాడడం చాలా ప్రమాదకరమని సీబీఐ నివేదిక వెల్లడించిందని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. బాణాసంచా తయారీలో బేరియం వాడకం, బాణాసంచాపై జరిపే ముద్రణ(లేబిలింగ్)లో కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరిగినట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. హిందుస్తాన్ ఫైర్వర్క్స్, స్టాండర్డ్ ఫైర్వర్క్స్ సంస్థలు పెద్ద స్థాయిలో బేరియంను కొనుగోలు చేసినట్లు తెలిసిందని జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. అయితే ఉత్పత్తిదారులకు మరో అవకాశం ఇవ్వదలిచామని, సీబీఐ నివేదికను వారికి అందించాలని కోర్టు సూచించింది. మనదేశంలో ఎక్కడోఒకచోట ప్రతిరోజూ ఏదో ఒక ఉత్సవం జరుగుతుంటుందని, ఈ కారణంతో బాణాసంచాపై విచారణ నిలిపివేయలేమని, ప్రజలకు కలిగే ఇబ్బందులను పరిశీలించాలని కోర్టు వ్యాఖ్యానించింది. -
తప్పుడు వార్తలకు ట్విటర్ చెక్
న్యూఢిల్లీ: తప్పుదోవ పట్టించే వార్తల వ్యాప్తిని అరికట్టేందుకు ట్విటర్ గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇలాంటి ట్వీట్లకు ప్రత్యేక ముద్ర వేయనుంది. ప్రజలకు హానిచేసే విధంగా ఉన్నాయని భావించిన పక్షంలో సదరు ట్వీట్లను పూర్తిగా తొలగించేందుకు ట్విటర్ చర్యలు తీసుకుంటుంది. తెలిసో తెలియకో తప్పుదోవ పట్టించేలా రూపొందించిన మీడియా, ట్వీట్లను షేర్ చేయదల్చుకునే యూజర్లను ముందస్తుగా హెచ్చరించేలా సాంకేతికతను ఉపయోగించనుంది. విషయం గురించి యూజర్లకు మరింత వివరంగా తెలిసేందుకు సదరు పోస్ట్లపై వివరణ పొందుపర్చనుంది. మార్చి 5 నుంచి తప్పుడు ట్వీట్లను లేబులింగ్ చేసే ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ట్విటర్ వెల్లడించింది. (చదవండి: యూట్యూబ్ కీలక నిర్ణయం)