CBI report
-
కోల్ కతా డాక్టర్ కేసులో సీబీఐ సంచలన నిజాలు
-
బాణాసంచాలో విషపూరిత రసాయనాలు!
న్యూఢిల్లీ: బాణాసంచా తయారీలో విషపూరిత రసాయన పదార్ధాలు వాడడం చాలా ప్రమాదకరమని సీబీఐ నివేదిక వెల్లడించిందని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. బాణాసంచా తయారీలో బేరియం వాడకం, బాణాసంచాపై జరిపే ముద్రణ(లేబిలింగ్)లో కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరిగినట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. హిందుస్తాన్ ఫైర్వర్క్స్, స్టాండర్డ్ ఫైర్వర్క్స్ సంస్థలు పెద్ద స్థాయిలో బేరియంను కొనుగోలు చేసినట్లు తెలిసిందని జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. అయితే ఉత్పత్తిదారులకు మరో అవకాశం ఇవ్వదలిచామని, సీబీఐ నివేదికను వారికి అందించాలని కోర్టు సూచించింది. మనదేశంలో ఎక్కడోఒకచోట ప్రతిరోజూ ఏదో ఒక ఉత్సవం జరుగుతుంటుందని, ఈ కారణంతో బాణాసంచాపై విచారణ నిలిపివేయలేమని, ప్రజలకు కలిగే ఇబ్బందులను పరిశీలించాలని కోర్టు వ్యాఖ్యానించింది. -
తీవ్ర రూపం దాల్చిన రవి అభిమానుల ఆందోళన
కేంద్ర మంత్రుల ఇళ్ల ముట్టడి బెంగళూరు(బనశంకరి) : దివంగత ఐఏఎస్ అధికారి డీకే.రవి మృతికి సంబంధించి సీబీఐ నివేదిక బయటపెట్టడంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిసూ ఆమె తల్లి గౌరమ్మ, రవి అభిమానులు చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆదివారం నగరంలోని కేంద్ర మంత్రుల ఇళ్లను ముట్టడించారు. వివరాలు.. రవిది ఆత్మహత్య, లేక హత్య అనే విషయంపై తేల్చాలని డిమాండ్ చేస్తూ రవి తల్లి తల్లి గౌరమ్మ తండ్రి కరియప్పలు ఆనంద్రావ్ సర్కిల్లో అహోరాత్రి ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రహోంశాఖమంత్రి పరమేశ్వర్, ఇంధన శాఖ మంత్రి డికే.శివకుమార్ ఆందోళనకారుల వద్దకు చేరుకొని రవి మృతికేసును సీబీఐ కి అప్పగించామని, నివేదిక ను త్వరగా విడుదల చేయాలని మనవి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆమేరకు ఎలాంటి నివేదిక విడుదల కాలేదు. దీంతో కోపోద్రిక్తులైన రవి అభిమానులు ఆదివారం కేంద్రమంత్రులైన డీవీ.సదానందగౌడ, అనంతకుమార్, మాజీ ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప ఇళ్లను ముట్టడించారు. సీబీఐ నివేదికను ప్రకటించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అయినప్పటికీ ఆ దిశగా స్పందించడం లేదని గొడవకుదిగారు. తాము నడి వీధిలో కూర్చుని పోరాటం చేస్తుండగా సదానందగౌడ అభిమానులతో కలిసి పుట్టినరోజు నిర్వహించుకున్నారని, ఒక్కసారి కూడా రవి తల్లిని పరామర్శించడానికి రాలేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంవడగా ధర్నాలో పాల్గొన్న డికే.రవి తండ్రి కరియప్ప అస్వస్థతకు గురవ్వడంతో ఎంఎస్.రామయ్య ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. -
ఆ ఐఏఎస్ అధికారిది ఆత్మహత్యే!
కర్ణాటక వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తూ అనుమానాస్పద పరిస్థితిలో మరణించిన ఐఏఎస్ అధికారి డీకే రవిది ఆత్మహత్యేనని సీబీఐ తేల్చింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రవి బాగా నష్టపోయారని సీబీఐ తన నివేదికలో తెలిపింది. చిక్బళ్లాపూర్ ప్రాంతంలో 50 ఎకరాలు కొనుగోలు చేసేందుకు డబ్బులు కూడబెట్టారని, అందులో తీవ్రంగా నష్టం రావడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్పింది. అత్యంత అనుమానాస్పద పరిస్థితుల్లో ఈ ఏడాది మార్చిలో ఐఏఎస్ అధికారి డీకే రవి మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంలో ఎలాంటి కుట్రకోణం లేదని సీబీఐ తేల్చిచెప్పింది. రవి చిట్టచివరిసారిగా పనిచేసిన వాణిజ్య పన్నుల శాఖ నుంచి సర్వీసు ఫైళ్లు సేకరించిన సీబీఐ.. ఈ వ్యవహారంపై ఎట్టకేలకు తన తుది నివేదికను వెలువరించింది. -
కమల్ స్పాంజ్ కేసు పై వివరణ ఇవ్వండి
బొగ్గుకేసులో సీబీఐకి ప్రత్యేక కోర్టు ఆదేశం న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణంలో కమల్ స్పాంజ్ స్టీల్, పవర్ లిమిటెడ్ సంస్థపై కేసు ముగిసిందన్న సీబీఐ నివేదికపై ఢిల్లీ ప్రత్యేక కోర్టు మంగళవారం సునిశితమైన ప్రశ్నలు సంధించింది. కమల్ స్పాంజ్ సంస్థపైన, సంస్థ డెరైక్టర్లపై కేసుకు తగిన ఆధారాలు లేవంటూ సీబీఐ ఇచ్చిన నివేదికపై వాదనల నేపథ్యంలో కోర్టు ఈ ప్రశ్నలు వేసింది. ఆ సంస్థపై నమోదైన ఎఫ్ఐఆర్లోని ఏ అంశానికి ఆధారాలు దొరకలేదో వివరణ ఇవ్వాలని, ప్రాథమిక విచారణ దశనుంచి, ఎఫ్ఐఆర్ స్థాయివరకూ దర్యాప్తునకు అసలు ప్రాతిపదిక ఏమిటో వివరించాలని అదనపు సెషన్స్ న్యాయమూర్తి భరత్ పరాశర్ ఆదేశించారు. ప్రాథమిక విచారణలో రికార్డుచేసిన అంశాలపై మీరు సేకరించలేకపోయిన ఆధారాలేమిటి?, కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదిక మినహా సమీకరించిన ఆధారాలేమిటి? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రాథమిక స్థాయినుంచి దర్యాప్తును సాగించేందుకు మీకున్న ప్రాతిపదిక ఏమిటి? ప్రాథమిక విచారణ దశలోనే ఎందుకు ఆగలేకపోయారని ప్రశ్నించారు. కేసుకు సంబంధించిన పత్రాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. -
‘బొగ్గు’ మార్గదర్శకాలను మా ముందుంచండి
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న బొగ్గు గనుల స్కాంలో సర్కారుకు మరో ఎదురుదెబ్బ. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి సీబీఐ నివేదికపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు గనుల కేటాయింపుపై ప్రశ్న ల వర్షం కురిపించింది. బొగ్గుగనుల కేటాయింపునకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీ అనుసరించిన విధివిధానాలను తమ ముందుంచాలని న్యాయమూర్తులు ఆర్.ఎం.లోధా, మదన్ బి.లోకూర్, కురియన్ జోసెఫ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రాన్ని బుధవారం ఆదేశించింది. కేటాయింపులపై స్క్రీనింగ్ కమి టీ అనుసరించిన విధానాలు ఏమిటని ప్రశ్నించిన న్యాయమూర్తులు సదరు విధివిధానాలను దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఇచ్చిన ప్రకటనల్లో పేర్కొన్నారా అని ప్రశ్నించారు. అదేవిధంగా బొగ్గు గనుల శాఖలోని స్క్రీనింగ్ కమిటీ జరిపిన ఈ కేటాయింపుల నిర్ణయం సహేతుకంగా జరిగిందో లేదో కూడా తాము పరిశీలిస్తామని అటార్నీ జనరల్ జీఈ వాహనవతికి తెలిపారు. కాగా, ఇప్పటి వరకు జరిగిన 41 కేటాయింపులు రద్దు చేయనున్నట్టు కేంద్రం తెలిపింది. న్యాయమూర్తుల వ్యాఖ్యలు వారి మాటల్లోనే.. స్క్రీనింగ్ కమిటీ 36వ భేటీలో తీసుకున్న నిర్ణయాల తాలూకు పూర్తి వివరాలు సమర్పించండి. కేటాయింపులు నిబంధనల మేరకే జరిగాయో లేదో మేం పరిశీలిస్తాం. దరఖాస్తులను ఏవిధంగా అనుమతించారో, ఏవిధంగా తిప్పికొట్టారో కూడా దృష్టి సారిస్తాం. కేటాంపులో కేంద్ర విద్యుత్ అథారిటీ (సీఈఏ) సిఫార్సులు ఆశ్చర్యకరం. స్క్రీనింగ్ కమిటీ వాటిని ఆమోదించి ఉండాల్సింది కాదు. మొత్తం 28 దరఖాస్తులను సీఈఏ సిఫార్సు చేస్తే 20 ఎలా ఆమోదించారు? మరో 11 కంపెనీల దరఖాస్తులను స్క్రీనింగ్ కమిటీ ఏవిధంగా జోడించింది? వీటిని కూడా సీఈఏ సిఫార్సు చేసిందా?