ఆ ఐఏఎస్ అధికారిది ఆత్మహత్యే! | dk ravi committed suicide, says cbi in it's report | Sakshi
Sakshi News home page

ఆ ఐఏఎస్ అధికారిది ఆత్మహత్యే!

Published Wed, May 20 2015 1:00 PM | Last Updated on Sun, Sep 3 2017 2:23 AM

ఆ ఐఏఎస్ అధికారిది ఆత్మహత్యే!

ఆ ఐఏఎస్ అధికారిది ఆత్మహత్యే!

కర్ణాటక వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తూ అనుమానాస్పద పరిస్థితిలో మరణించిన ఐఏఎస్ అధికారి డీకే రవిది ఆత్మహత్యేనని సీబీఐ తేల్చింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రవి బాగా నష్టపోయారని సీబీఐ తన నివేదికలో తెలిపింది. చిక్బళ్లాపూర్ ప్రాంతంలో 50 ఎకరాలు కొనుగోలు చేసేందుకు డబ్బులు కూడబెట్టారని, అందులో తీవ్రంగా నష్టం రావడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్పింది.

అత్యంత అనుమానాస్పద పరిస్థితుల్లో ఈ ఏడాది మార్చిలో ఐఏఎస్ అధికారి డీకే రవి మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంలో ఎలాంటి కుట్రకోణం లేదని సీబీఐ తేల్చిచెప్పింది. రవి చిట్టచివరిసారిగా పనిచేసిన వాణిజ్య పన్నుల శాఖ నుంచి సర్వీసు ఫైళ్లు సేకరించిన సీబీఐ.. ఈ వ్యవహారంపై ఎట్టకేలకు తన తుది నివేదికను వెలువరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement