కూరగాయలు విక్రయిస్తున్న మాజీ సీఎం కోడలు! | Ex-CM Ashok Gehlot's Daughter-In-Law Sell Vegetables | Sakshi
Sakshi News home page

Rajasthan: కూరగాయలు విక్రయిస్తున్న మాజీ సీఎం కోడలు!

Published Sun, Apr 14 2024 11:33 AM | Last Updated on Sun, Apr 14 2024 11:39 AM

EX CM Ashok Gehlot Daughter in Law Sell Vegetables - Sakshi

లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఏడు దశల్లో జరిగే ఓటింగ్‌కు ముందు  అనేక వింతలు, విశేషాలు కనిపిస్తున్నాయి. ఇవి ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. జలోర్‌లో మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కోడలు కూరగాయలు అమ్ముతూ కనిపిస్తున్నారు. జలోర్ సిరోహి సీటుపై పోటీకి దిగిన భర్త వైభవ్ గెహ్లాట్‌కు మద్దతుగా అతని భార్య, మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ కుమార్తె హిమాన్షి గెహ్లాట్ ప్రచారం సాగిస్తున్నారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా హిమాన్షి గెహ్లాట్ జలోర్‌లో కూరగాయలు అమ్ముతూ కనిపించారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్‌లో అనుభవజ్ఞుడైన నేతగా గుర్తింపు పొందారు. ఇప్పుడు అతని కుమారుడు వైభవ్ గెహ్లాట్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కోడలు హిమాన్షి గెహ్లాట్ జలోర్-జైసల్మేర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న తన భర్త వైభవ్ గెహ్లాట్ కోసం ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఆమె గతంలో సిడ్నీలో చదువును పూర్తి చేశారు. ప్రస్తుతం క్యాన్సర్ రోగుల కోసం  స్వ్ఛంద సంస్థను నడుపుతున్నారు. వైభవ్, హిమాన్షి దంపతులకు కాశ్వని అనే కుమార్తె ఉంది. హిమాన్షి లాగే కాశ్వనికి కూడా పెయింటింగ్ అంటే ఎంతో ఇష్టమట. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement