Ashok Gehlot
-
‘రక్తపు కన్నీరు కారుస్తారు’.. పోలీసులకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వార్నింగ్
జైపూర్: మాజీ మంత్రి, హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే బుండీ అశోక్ చందనా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత ‘మీరు రక్తపు కన్నీరు కారుస్తారు’ అంటూ హెచ్చరించారు. రాజస్థాన్‌లోని కోటాలో బుండి నియోజకవర్గంలో బుధవారం కోటాలో జరిగిన రైతుల ట్రాక్టర్ ర్యాలీలో ప్రసంగింస్తూ పోలీసులపై బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్నదని ఆరోపించారు. ‘ఈ ప్రభుత్వం త్వరలో మారుతుంది. కాబట్టి ఎవరి ఆదేశాల మేరకు కాంగ్రెస్ కార్యకర్తలను వారు (పోలీసులు) ఇబ్బంది పెట్టకూడదు. వారు ఎంతగా హింసిస్తారో.. అంతగా రక్తంతో కన్నీళ్లు పెట్టుకుంటారు’ అని పోలీసులను హెచ్చరించారు.తాజా వ్యాఖ్యలపై రాజస్థాన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి మోతీ లాల్ మీనా తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోలీసు, రెవెన్యూ అధికారులను పిలిపించి వారి పార్టీ పని కోసం వినియోగించారని విమర్శించారు. అయితే ఇప్పుడు పరిపాలన కోసం, ప్రజల మేలు కోసం అధికార యంత్రాంగం పని చేస్తోందని తెలిపారు. బీజేపీ సుపరిపాలనకు ఇది ఒక ఉదాహరణ అని అన్నారు. ‘ఇది స్పష్టంగా కాంగ్రెస్‌కు బాగా నచ్చదు. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఆదేశం లేకపోతే ఆ పార్టీ ఏమి చెబుతుంది. అప్పుడు స్థానిక నాయకుల నుంచి మీరు ఏమి ఆశిస్తారు?’ అని మండిపడ్డారు.కాగా, అశోక్ గహ్లోత్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అశోక్ చందనా.. ఈ విధంగా వ్యాఖ్యానించడం తొలిసారి కాదు. గతేడాది చంద్రయాన్ మిషన్ ప్రయోగించిన సమయంలో వ్యోమగాములకు అభినందనలు అంటూ పేర్కొన్నారు. వాస్తవానికి అది మానవ రహిత మిషన్ అని అతనికి తెలీదు. -
కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్ఠాత్మక లోక్‌సభ నియోజకవర్గాలైన రాయ్‌బరేలీ, అమేథీ నుంచి రాహుల్ గాంధీ, కిశోరీ లాల్ శర్మ ఎన్నికల బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పరిశీలకులుగా కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రులను నియమించింది.రాయ్‌బరేలీ, అమేథీ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఏఐసీసీ సీనియర్ పరిశీలకులుగా భూపేశ్ బాఘెల్, అశోక్ గెహ్లాట్లను నియమించే ప్రతిపాదనకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదం తెలిపినట్లు ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.ప్రియాంక గాంధీ ఇప్పటికే ప్రచారానికి నాయకత్వం వహించారు. సోమవారం నుంచి ఎన్నికలు ముగిసే వరకు రాయ్‌బరేలీ, అమేథీలలో క్యాంపెయిన్ చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రచారంలో భాగంగా ప్రియాంక ఇంటింటికీ ప్రచార కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఉందిని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు, గాంధీ కుటుంబంతో దశాబ్దాలుగా కుటుంబ సంబంధాలు ఉన్న వారితో ఇప్పటికే ఔట్ రీచ్ ప్రారంభమైందని ఆ వర్గాలు తెలిపాయి. రెండు నియోజకవర్గాల్లో డిజిటల్, సోషల్ మీడియా ప్రచారాన్ని కూడా ప్రియాంక గాంధీ పర్యవేక్షిస్తారని సమాచారం.కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వంటి అగ్రనేతల ప్రచార ప్రణాళికలను, షెడ్యూల్‌ను కూడా ప్రియాంక గాంధీ చూసుకుంటారు. ఈమె ఎన్నికల ప్రచారంలో భాగంగా 200 నుంచి 300 గ్రామాలను కవర్ చేస్తూ.. రెండు నియోజక వర్గాలకు సమయాన్ని కేటాయిస్తుందని సమాచారం.ఫిరోజ్ గాంధీ రాయ్‌బరేలీలో వేసిన బలమైన పునాదుల కారణంగా అయన భార్య, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1967, 1971, 1980లలో గెలుపొందారు. తరువాత గాంధీ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. అమేథీలో ప్రస్తుత బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ చేతిలో ఉంది. దీన్ని మళ్ళీ హస్తం హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది.#LokSabhaElections2024 | Congress appoints Bhupesh Baghel as AICC Senior Observer to Raebareli and Ashok Gehlot to Amethi. pic.twitter.com/GSJ0EQvwBv— ANI (@ANI) May 6, 2024 -
రాజస్థాన్ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. గెహ్లాట్‌కు ఎదురుదెబ్బ!
జైపూర్: లోక్‌సభ ఎన్నికల వేళ రాజస్థాన్ రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌పై అతని మాజీ ఓఎస్డీ లోకేష్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో, పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్, రీట్ (రాజస్థాన్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్ష పేపర్ లీక్ వ్యవహారాల్లో గెహ్లాట్‌పై మాజీ లోకేశ్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క రోజు తనకు సీఎం పీఎస్ఓ రాం నివాస్ నుంచి ఫోన్ వచ్చిందన్నారు. సీఎం గెహ్లాట్ నివాసానికి రావాలని చెప్పారు. దీంతో, అక్కడికి వెళ్లాను. ఈ సందర్భంగా కొన్ని ఆడియో క్లిప్‌లతో కూడిన పెన్ డ్రైవ్‌ను గెహ్లాట్ తనకు అందజేశారని, ఆ తర్వాత అవి మీడియాకు లీక్ అయ్యాయని అన్నారు. అవి ఫోన్ సంభాషణలు అని తనకు చెప్పారని, అయితే అవి చట్టబద్ధమైనవో కాదో తనకు తెలియదని పేర్కొన్నారు. తనను ఒక హోటల్‌కు పిలిపించి వీటి గురించి మాట్లాడినట్టు చెప్పుకొచ్చారు. రీట్ పేపర్ లీక్ వ్యవహారంలో తన సన్నిహితులకు అశోక్ గెహ్లాట్ రక్షణ కల్పించారని శర్మ ఆరోపించారు. అనంతరం, ఆడియో సంభాషణను లోకేష్ శర్మ లీక్ చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. ఇదివరకే లోకేశ్ శర్మను విచారణకు పిలిచి ప్రశ్నించారు. లోకేశ్ శర్మ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. అయితే, ఈ విషయంపై గెహ్లాట్‌పై లోకేశ్ శర్మ పరువు నష్టం దావా వేశారు. ఇక, ఈ ఆరోపణలపై అశోక్ గెహ్లాట్ ఇప్పటివరకు స్పందించలేదు. Gehlot, in order to save his Govt, tapped Sachin Pilot and other’s phone, and made it appear as if Gajendra Singh Sekhawat and the BJP tried to topple his Govt.- Lokesh Sharma, Ashok Gehlot’s former OSD pic.twitter.com/PuxYilQkZn— Rishi Bagree (@rishibagree) April 25, 2024 అయితే, 2020 జూలైలో కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ మొత్తం 19 మంది ఎమ్మెల్యేలతో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యేలుగా ఉన్న విశ్వేంద్ర సింగ్, భన్వర్ లాల్ శర్మ వంటి తిరుగుబాటు ఎమ్మెల్యేల ఫోన్ సంభాషణ లీక్ అయ్యింది. తిరుగుబాటు ఎమ్మెల్యే భన్వర్ లాల్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మధ్య జరిగిన సంభాషణ ఆడియో క్లిప్ కూడా వీటిలో ఉంది. ఈ క్రమంలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ రాజకీయంగా పెను దుమారం రేగింది. ఇదిలా ఉండగా.. లోకేష్ శర్మ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. తాజాగా శర్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్వర్ణిమ్ చతుర్వేదీ స్పందిస్తూ.. లోకేష్ శర్మ ప్రభుత్వ అధికారి కాదు. పైగా అతను బీజేపీ నాయకులతో టచ్‌లో ఉన్నాడు. వారి సూచనలు మేరకు మాత్రమే అతను ఇలాంటి కామెంట్స్ చేశాడని చెప్పుకొచ్చారు. అయితే, రాజస్థాన్‌లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శర్మ వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు నష్టం కలిగిస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
కూరగాయలు విక్రయిస్తున్న మాజీ సీఎం కోడలు!
లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఏడు దశల్లో జరిగే ఓటింగ్‌కు ముందు అనేక వింతలు, విశేషాలు కనిపిస్తున్నాయి. ఇవి ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. జలోర్‌లో మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కోడలు కూరగాయలు అమ్ముతూ కనిపిస్తున్నారు. జలోర్ సిరోహి సీటుపై పోటీకి దిగిన భర్త వైభవ్ గెహ్లాట్‌కు మద్దతుగా అతని భార్య, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కుమార్తె హిమాన్షి గెహ్లాట్ ప్రచారం సాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హిమాన్షి గెహ్లాట్ జలోర్‌లో కూరగాయలు అమ్ముతూ కనిపించారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్‌లో అనుభవజ్ఞుడైన నేతగా గుర్తింపు పొందారు. ఇప్పుడు అతని కుమారుడు వైభవ్ గెహ్లాట్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కోడలు హిమాన్షి గెహ్లాట్ జలోర్-జైసల్మేర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న తన భర్త వైభవ్ గెహ్లాట్ కోసం ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఆమె గతంలో సిడ్నీలో చదువును పూర్తి చేశారు. ప్రస్తుతం క్యాన్సర్ రోగుల కోసం స్వ్ఛంద సంస్థను నడుపుతున్నారు. వైభవ్, హిమాన్షి దంపతులకు కాశ్వని అనే కుమార్తె ఉంది. హిమాన్షి లాగే కాశ్వనికి కూడా పెయింటింగ్ అంటే ఎంతో ఇష్టమట. -
Lok sabha elections 2024: ‘రాజ’సం ఎవరిదో...!
రాజస్థాన్‌లో రాజకీయ పోరు దశాబ్దాలుగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే కొనసాగుతోంది. రాష్ట్రంలో అధికారమూ ఈ రెండు పార్టీల మధ్యే మారుతూ వస్తోంది. కమలనాథులు హిందుత్వ, ఆర్థికాభివృద్ధిపైనే ఫోకస్ చేస్తుండగా సంక్షేమ హామీలు, మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకతను కాంగ్రెస్ నమ్ముకుంటోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో కాంగ్రెస్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ రెట్టింపు ఉత్సాహంతో లోక్‌సభ బరిలోకి దిగుతోంది. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రంలో క్లీన్‌స్వీప్ చేసి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలగా ఉంది. ఎంపీ ఎన్నికల్లో పుంజుకుని ఎలాగైనా సత్తా చాటే ప్రయత్నాల్లో కాంగ్రెస్ తలమునకలుగా ఉంది... పటిష్టమైన సంస్థాగత నిర్మాణం, హిందుత్వ సిద్ధాంత దన్నుతో రాజస్థాన్ బీజేపీ బలమైన పునాదులు వేసుకుంది. తొలుత భైరాన్‌సింగ్ షెకావత్, అనంతరం వసుంధరా రాజె సింధియా వంటివారి నాయకత్వమూ పారీ్టకి కలిసొచి్చంది. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి బాగా పట్టుంది. కాంగ్రెస్ కూడా రాష్ట్రంలో బలమైన శక్తిగా కొనసాగుతోంది. అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ వంటి నాయకుల సారథ్యానికి తోడు గ్రామీణ ఓటర్ల మద్దతు పారీ్టకి పుష్కలంగా ఉంది. ఈ ఎడారి రాష్ట్రంలో 25 లోక్‌సభ సీట్లున్నాయి. 4 ఎస్సీలకు, 3 ఎస్టీలకు కేటాయించారు. బీజేపీకి బేనీవాల్ బెంగ! 2014 లోక్‌సభ ఎన్ని కల్లో మొత్తం 25 సీట్లనూ ఎగరేసుకుపోయిన బీజేపీ 2019లో సైతం క్లీన్‌స్వీప్ చేసింది. 24 సీట్లను బీజేపీ, మిగతా ఒక్క స్థానాన్ని ఎన్డీఏ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) గెలుచుకున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ చతికిలపడింది. గత డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మట్టికరిపించి తిరిగి అధికారాన్ని దక్కించుకుంది. అదే ఊపులో లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి క్లీన్‌స్వీప్ చేయాలని తహతహలాడుతోంది. అందుకు తగ్గట్టే ప్రచారాన్ని మోదీ పీక్స్‌కు తీసుకెళ్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సభలతో హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ అంటేనే వారసత్వ రాజకీయాలు, అవినీతికి పెట్టింది పేరంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణం బీజేపీకి ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. మోదీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదాలనూ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అయితే గత ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉన్న హనుమాన్ బేనీవాల్ సారథ్యంలోని ఆర్ఎల్పీ ఈసారి కాంగ్రెస్‌తో జతకట్టడం కమలం పార్టీకి కాస్త ప్రతికూలాంశమే. జాట్ నేత అయిన బేనీవాల్‌కు ఉన్న ఆదరణ షెకావతీ, మార్వార్ ప్రాంతాల్లో బీజేపీ అవకాశాలను ప్రభావితం చేయవచ్చంటున్నారు. పార్టీ తరఫున కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ (జోధ్‌పూర్), అర్జున్ రామ్ మేఘ్వాల్ (బికనేర్), లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (కోట) వంటి హేమాహేమీలు పోటీ చేస్తున్నారు. నలుగురు సిట్టింగులకు బీజేపీ మొండిచేయి చూపడంతో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. దీనికి తోడు కాంగ్రెస్ నుంచి జంప్ చేసిన ఇద్దరు నేతలకు తొలి జాబితాలోనే చోటు దక్కింది. వీరిలో బలమైన గిరిజన నేతగా పేరున్న మహేంద్రజీత్‌సింగ్ మాలవీయ ఉన్నారు. పారాలింపిక్స్‌లో పసిడి సాధించిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత దేవేంద్ర ఝజారియాకు బీజేపీ అనూహ్యంగా చురు టికెటిచ్చింది. వసుంధరా రాజె కుమారుడు దుష్యంత్ సింగ్ ఝలావర్–బరన్ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌లో అదే వర్గ పోరు ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌కు సార్వత్రిక సమరంలో నెగ్గుకురావడం సవాలే. మాజీ సీఎం అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మధ్య వర్గ పోరు మళ్లీ రాజుకుంటుండటం తలనొప్పిగా మారుతోంది. ఎన్నికల్లో గహ్లోత్ ఓటమి నేపథ్యంలో రాష్ట్ర పారీ్టపై పూర్తిగా పట్టు బిగించే వ్యూహాల్లో పైలట్ వర్గం ఉంది. జాలోర్ నుంచి గహ్లోత్ కుమారుడు వైభవ్ బరిలో ఉన్నారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఆరు న్యాయాలు, 25 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. కుల గణన, రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చట్టబద్ధత హామీల ద్వారా పేదలు, మధ్య తరగతి వర్గాలు, కారి్మకులు, రైతుల పక్షాన పోరాటం చేస్తున్నామని రాహుల్ చెబుతున్నారు. ఆర్ఎల్పీ ఈసారి ఇండియా కూటమిలోకి రావడం కాంగ్రెస్‌కు ఊరటనిచ్చే అంశం. జాట్లలో బాగా ఆదరణ ఉన్న బెనీవాల్ ప్రభావం షెకావతీ, మార్వార్ ప్రాంతాల్లో... ముఖ్యంగా నాగౌర్, సికర్, ఛురు, జుంఝును వంటి లోక్‌సభ స్థానాల్లో కలిసొస్తుందని పార్టీ ఆశలు పెట్టుకుంది. కుల సమీకరణాలు కీలకం రాజస్థాన్ రాజకీయాల్లో కులాలది కీలక పాత్ర. ప్రధానంగా జాట్లు, రాజ్‌పుత్‌లు, మీనాలు, గుజ్జర్లు అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపుతున్నారు. 10% జనాభా ఉన్న జాట్ వర్గానికి మార్వార్, షెకావతీ ప్రాంతాల్లో గట్టి పట్టుంది. రాష్ట్ర జనాభాలో రాజ్‌పుత్‌ల వాటా 6–8%. రాజ కుటుంబీకులైన వసుంధరా రాజె, భైరాన్ సింగ్ షెకావత్ సీఎం పదవి చేపట్టినవారే. జాట్లు అప్పుడప్పుడూ ఊగిసలాడినా రాజ్‌పుత్‌ల మద్దతు కమలనాథులకు దండిగా ఉంటుందని గత ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. 5 శాతమున్న గుజ్జర్లు గతంలో కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. వారిప్పుడు బీజేపీ వైపు మళ్లవచ్చంటున్నారు. రాష్ట్రంలో బ్రాహ్మణ సామాజికవర్గం 8% దాకా ఉంది. అగ్రవర్ణ పార్టీగా పేరొందిన బీజీపీ అనూహ్యంగా బ్రాహ్మణుడైన భజన్‌లాల్ శర్మను సీఎం చేసింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సీపీ జోషిదీ ఇదే సామాజికవర్గం. ఇక ఎస్టీ సామాజిక వర్గమైన మీనాలు జనాభాలో 5% ఉన్నారు. వీరికి తూర్పు రాజస్థాన్‌లో పట్టుంది. 18% ఉన్న ఎస్టీ సామాజిక వర్గంలోని ఉప కులాలు పరిస్థితులను బట్టి ఇరు పారీ్టలకూ మద్దతిస్తున్నారు. కాంగ్రెస్ కుల గణన హామీ ప్రభావం చూపవచ్చంటున్నారు. సర్వేలు ఏమంటున్నాయి... ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హిందీ బెల్ట్‌లో కీలకమైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఘన విజయం సాధించడం ఆ పార్టీలో ఫుల్ జోష్ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ క్వీన్‌స్వీప్ చేస్తుందని, కాంగ్రెస్‌కు వైట్‌వాష్ తప్పదని తాజా సర్వేలు చెబుతున్నాయి. రాజస్థాన్‌లో 25 సీట్లనూ తన ఖాతాలో వేసుకోవడం ద్వారా బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందనేది మెజారిటీ ఒపీనియన్ పోల్స్ అభిప్రాయం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కరోనా బారిన మాజీ సీఎం... స్వైన్ ఫ్లూ కూడా నిర్ధారణ!
రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కరోనా బారినపడ్డారు. ఆయనకు స్వైన్ ఫ్లూ కూడా సోకినట్లు మెడికల్ రిపోర్టులో వెల్లడయ్యింది. గెహ్లాట్ ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’లో తన ఆరోగ్యం గురించి అశోక్ గెహ్లాట్ తెలియజేస్తూ ‘గత కొన్ని రోజులుగా జ్వరం వస్తున్న కారణంగా, వైద్యుల సలహా మేరకు మెడికల్ టెస్టులు చేయించాను. కోవిడ్, స్వైన్ ఫ్లూ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. అందుకే వచ్చే ఏడు రోజుల పాటు నేను ఎవరినీ కలవలేను. మారుతున్న ఈ సీజన్లో అందరూ ఆరోగ్యం విషయంలో తగిన శ్రద్ధ వహించాలి. ప్రస్తుతం వాతావరణం మారుతోంది. ఇటువంటి వాతావరణంలో చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారని’ దానిలో పేర్కొన్నారు. -
అశోక్ గహ్లోత్ కుమారుని ఆస్తులపై ఈడీ సోదాలు
జైపూర్: ఫారెక్స్ ఉల్లంఘన కేసులో కాంగ్రెస్ నేత అశోక్ గహ్లోత్ కుమారుడు వైభవ్ గహ్లోత్ ఆస్తులపై ఈడీ నేడు సోదాలు నిర్వహిస్తోంది. రాజస్థాన్‌కు చెందిన హాస్పిటాలిటీ గ్రూప్ ట్రిటాన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, వర్ధ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం శివ శంకర్ శర్మ, రతన్ కాంత్ శర్మలపై నమోదైన కేసు విచారణలో భాగంగా వైభవ్‌పై కూడా ఈడీ చర్య తీసుకుంది. రతన్ కాంత్ శర్మ కార్ రెంటల్ సర్వీస్‌లో వైభవ్ గెహ్లాట్ వ్యాపార భాగస్వామిగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. వైభవ్ గెహ్లాట్ మారిషస్‌కు చెందిన 'శివ్నార్ హోల్డింగ్స్' అనే షెల్ కంపెనీ నుంచి అక్రమ నిధులను ముంబయికి చెందిన ట్రిటాన్ హోటల్స్‌కు మళ్లించారని రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. హోటల్‌కు చెందిన 2,500 షేర్లను కొనుగోలు చేసి నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. ఒక్కో షేరు అసలు ధర రూ. 100 ఉండగా, రూ.39,900కు కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి గత ఏడాది అక్టోబర్‌లో ఈడీ ముందు వైభవ్ హాజరయ్యారు. జైపూర్, ఉదయ్‌పూర్, ముంబయి, ఢిల్లీలోని ప్రదేశాలలో గతేడాది ఆగస్టులో మూడు రోజుల పాటు ట్రైటన్ హోటల్స్ దాని ప్రమోటర్లపై ఈడీ సోదాలు జరిపింది. ఈ సోదాల తర్వాత లెక్కల్లో చూపని రూ.1.2 కోట్ల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదీ చదవండి: మూడోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా -
బీజేపీ సీఎంల ఎంపికపై గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు
జైపూర్:రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వారం తర్వాత కూడా ముఖ్యమంత్రిని నిర్ణయించుకోలేకపోతున్నారని రాజస్థాన్ కేర్‌టేకర్ సీఎం అశోక్ గెహ్లాట్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై సమీక్ష సందర్భంగా గెహ్లాట్ మీడియాతో మాట్లాడారు. ఒక వేళ కాంగ్రెస్ పార్టీ గెలిచి సీఎంను డిసైడ్ చేయడంలో ఇంత ఆలస్యం చేసి ఉంటే బీజేపీ నేతలు తమపై అరుపులు, కేకలు పెట్టేవాళ్లని గెహ్లాట్ ఎద్దేవా చేశారు. కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గొగామెడి కేసులో విచారణ జరిపేందుకుగాను ఎన్ఐకు ఎన్ఓసీ ఇచ్చే ఫైల్‌పై తాను సంతకం చేయలేదని చెప్పారు. ‘ఎన్నికల్లో గెలిచి వారం దాటినా ఇప్పటికీ కొత్త ముఖ్యమంత్రి రాలేదు. కొత్త సీఎం ఎన్ఐఏ ఫైల్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. త్వరగా సీఎం ఎంపికపై నిర్ణయం తీసుకోండి’అని గెహ్లాట్ కోరారు. ‘బీజేపీలో క్రమశిక్షణ లేదు. వారం రోజులు గడుస్తున్నా మూడు రాష్ట్రాల్లో ఇంత వరకు సీఎంను ఎంపిక చేయలేదు. ఇదే పని మేం చేసి ఉంటే ఎన్ని మాపై వారు ఎన్ని విమర్శలు చేసి ఉండే వాళ్లో తెలియదు. ఎన్నికల్లో వారు ఓట్లు పోలరైజ్ చేసి గెలిచారు. అయినా కొత్త ప్రభుత్వానికి మా సహకారం ఉంటుంది’ అని గెహ్లాట్ తెలిపారు. #WATCH | Congress leader and Rajasthan caretaker CM Ashok Gehlot arrives in Delhi to take part in a meeting to review the party's performance in recently held assembly polls in the state "...For around seven days now, they (BJP) have not been able to announce CM faces in the… pic.twitter.com/BIv6B8kd0J — ANI (@ANI) December 9, 2023 ఇదీచదవండి..అమెరికన్ కన్సల్టెన్సీ సర్వే: ప్రధాని మోదీపై కీలక విషయం వెల్లడి..! -
సచిన్ పైలట్‌పై గెహ్లాట్ ‘స్పై’..? బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
జైపూర్: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత రాజస్థాన్ కేర్‌టేకర్ సీఎం అశోక్ గెహ్లాట్‌ను ఒక్కొక్కటిగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఓ వైపు కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ హత్య కేసులో గెహ్లాట్‌పై బీజేపీ ఆరోపణలు చేస్తోంది.మరోవైపు గెహ్లాట్ దగ్గర ఐదేళ్లు ఓఎస్డీగా పనిచేసిన శర్మ కొత్త బాంబు పేల్చాడు. రాజస్థాన్ ప్రభుత్వం 2020లో సంక్షోభంలో పడినప్పుడు రాష్ట్రంలో మరో సీనియర్ నేత సచిన్‌పైలట్ ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు ఆయన కదలికలపై గెహ్లాట్ నిఘా ఉంచారని చెప్పారు. తాజాగా ఓఎస్డీ శర్మ చేసిన ఈ ఆరోపణలపై బీజేపీ విచారణకు డిమాండ్ చేస్తోంది. ఇదే విషయమై ప్రస్తుతం రాజస్థాన్ సీఎం రేసులో ఉన్న దియాకుమారి స్పందించారు. ‘సచిన్ పైలట్‌పై నిఘా పెట్టడం, ఆయన ఫోన్ ట్యాప్ చేయడం వంటి ఆరోపణలు చాలా తీవ్రమైనవి.స్వయంగా సీఎం ఓఎస్డీ చెప్పాడంటే ఇందులో ఎంతో కొంత నిజం ఉంటుంది. ఇలా గూఢచర్యం చేయడం చట్ట విరుద్ధం’ అని దియాకుమారి వ్యాఖ్యానించారు. దియాకుమారి ఆరోపణలపై ఓఎస్డీ శర్మ స్పందించారు. సాధారణంగా రాజకీయ సంక్షోభాలు ఏర్పడినపుడు అందుకు కారణమైన వారిని ఫాలో చేస్తాం. వారు ఎవరెవరితో ఫోన్లు మాట్లాడుతున్నారో తెలుసుకుంటాం. సంక్షోభాన్ని నివారించేందుకు ఇలాంటివి సహజమే’అని శర్మ వ్యాఖ్యానించారు. ఇదీచదవండి..బీజేపీ సీఎంలు ఎవరో..? -
Rajasthan Election Result 2023: గహ్లోత్ మేజిక్కు తెర!
రాజస్తాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఈసారి ‘మేజిక్’ చేయలేకపోయారు. మెజీíÙయన్ల కుటుంబం నుంచి వచి్చన ఆయన, ఈసారి కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపించేందుకు శాయశక్తులా ప్రయతి్నంచారు. ఆ క్రమంలో సంక్షేమ, ప్రజాకర్షక పథకాలతో సహా అందుబాటులో ఉన్న ట్రిక్కులన్నీ ప్రయోగించినా లాభం లేకపోయింది. అధికార పార్టీని ప్రజ లు ఇంటికి సాగనంపే 30 ఏళ్ల ఆనవాయితీ అప్రతిహతంగా కొనసాగింది. దాంతో కాంగ్రెస్ పరా జయం చవిచూసింది. ‘‘సీఎం పదవిని వదిలేయా లని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. కానీ సీఎం పదవే నన్ను వదలడం లేదు’’ అని పదేపదే గొప్ప గా చెప్పుకున్న 72 ఏళ్ల గహ్లోత్ చివరికి ఓటమిని అంగీకరించి ఆ పదవిని వీడాల్సి వచ్చింది. ఏ పథకమూ ఆదుకోలేదు... గతేడాది కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలు గహ్లోత్ రాజకీయ జీవితానికి పెద్ద అగి్నపరీక్షగా మారాయి. సీఎంగిరీని విడిచి పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరించాలన్న అధిష్టానం ఆదేశాలను ధిక్కరించడం ద్వారా పెను సాహసమే చేశారాయన. ఆ క్రమంలో సోనియా, రాహుల్‌గాంధీ ఆగ్రహానికి గురైనా వెనకాడలేదు. చివరికి అధిష్టానమే వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి కలి్పంచారు. ఈ దృష్ట్యా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎలాగైనా గెలిపించకపోతే తన రాజకీయ జీవితమే ప్రమాదంలో పడుతుందని గ్రహించి దూకుడు ప్రదర్శించారు. అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ వాడుకున్నారు. ఎన్నికలకు ఏడాది ముందునుంచే పుంఖానుపుంఖాలుగా పలు సంక్షేమ, ప్రజాకర్షక పథకాలకు తెర తీశారు. పేదలకు కారుచౌకగా వంట గ్యాస్ మొదలుకుని ప్రజలకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా దాకా ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నింటికీ మంచి పేరే వచి్చంది. ఏం చేసినా చివరికి ప్రజల మనసును మార్చలేక, అధికార పార్టీని ఓడించే ‘ఆనవాయితీ’ని తప్పించలేక చతికిలపడ్డారు. దెబ్బ తీసిన విభేదాలు...? యువ నేత సచిన్ పైలట్‌తో విభేదాలు కూడా రాజస్థాన్‌లో కాంగ్రెస్ అవకాశాలను దెబ్బ తీశాయనే చెప్పాలి. ముఖ్యంగా 30కి పైగా అసెంబ్లీ స్థానాల్లో నిర్ణాయక శక్తిగా ఉన్న గుజ్జర్లు తమ వర్గానికి చెందిన పైలట్‌కు కాంగ్రెస్‌లో అన్యాయం జరుగుతోందన్న భావనకు వచ్చారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా కూడా పార్టీని దెబ్బ తీసిన అంశాల్లో ఒకటని పరిశీలకులు చెబుతున్నారు. ఎన్నికల వేళ గహ్లోత్‌కు పైలట్ నిజానికి పెద్దగా సహాయ నిరాకరణ చేయలేదు. పైపెచ్చు స్నేహ హస్తమే సాచారు. కానీ గహ్లోత్ మాత్రం తానేంటో అధిష్టానానికి నిరూపించుకోవాలన్న ప్రయత్నంలో పైలట్‌కు ప్రాధాన్యం దక్కకుండా చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించి కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చిన పైలట్‌ను అలా పక్కన పెట్టడం కూడా పార్టీకి చేటు చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Rajasthan Results 2023: రాజస్థాన్‌లో బీజేపీ ఘన విజయం
Live Updates.. బీజేపీకి 115 సీట్లు రాజస్థాన్‌లో మొత్తం 115 స్థానాల్లో బీజేపీ విజయం 68 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు. ఒక చోట ఆధిక్యం భారత్ ఆదివాసీ పార్టీకి 3 సీట్లు 2 స్థానాల్లో బీఎస్పీ గెలుపు ఆర్ఎల్డీ, ఆర్‌ఎల్‌టీడీ పార్టీలకు చెరొక సీటు. తాజా సమాచారం: బీజేపీ 103 గెలుపొందగా, 12 లీడ్‌లోఉంది. కాంగ్రెస్‌లో 58 స్థానాల్లో గెలుపొంది, 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది ఉదయ్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి తారాచంద్ జైన్ కాంగ్రెస్‌కు చెందిన గౌరవ్ వల్లభ్‌పై 32,771 ఓట్లతేడాతో విజయం. ఆప్ అభ్యర్థి మనోజ్ లబానా 348 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. కాంగ్రెస్ అభ్యర్థి, రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి నాథ్ ఓటమి. ఈ స్థానంలో బీజేపీకి చెందిన విశ్వరాజ్ సింగ్ మేవార్ 7,504 ఓట్ల మెజారిటీతో గెలుపు. ఈ ఫలితాలు షాక్ ఇచ్చాయి. ప్రజల తీర్పును అంగీకరిస్తున్నాం. భవిష్యత్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పని చేస్తారని ఆశిస్తున్నాను- రాజస్థాన్‌లో బీజేపీ ఆధిక్యంపై సీఎం అశోక్ గెహ్లోత్ #WATCH | Delhi: On BJP's lead in Rajasthan, CM Ashok Gehlot says "I have always said that I will accept the mandate of the people and I extend my best wishes to the future government. I hope they work for the welfare of the people of the state...The results are shocking..." pic.twitter.com/r7uxhOUk2P — ANI (@ANI) December 3, 2023 కాంగ్రెస్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ 29,475 ఓట్ల తేడాతో విజయం బీజేపీ 79 స్థానాల్లో విజయం 36చోట్ల ఆధిక్యం, కాంగ్రెస్ 43 స్థానాల్లో విజయం, 26 చోట్ల ఆధిక్యం భారత ఆదివాసీ పార్టీ 2 స్థానాల్లో గెలుపొందగా, 3 చోట్ల ఆధిక్యంలో ఉంది. బీఎస్పీ ఒక చోట విజయం సాధించగా, మరో స్థానంలో లీడింగ్‌లో ఉంది. తిజారా అసెంబ్లీ స్థానం నుంచి మహంత్ బాబా బాలక్‌నాథ్ విజయం అశోక్ గెహ్లోత్ ఈ సాయంత్రం గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను కలిసి ఓటమిని అంగీకరించి సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశం. #WATCH | Rajasthan BJP MLA candidate Diya Kumari, in Jaipur says, "The credit for this win goes to PM Modi, Amit Shah ji, JP Nadda ji, state leaders and party workers. Modi ji's magic worked in Rajasthan and also MP & Chhattisgarh...We will ensure good governance and development… pic.twitter.com/3stn8l8Vj1 — ANI (@ANI) December 3, 2023 ఈ ఘనత ప్రధానిమోదీ, అమిత్‌షా, రాష్ట్ర బీజేపీ శ్రేణులకే దక్కుతుంది. సీఎం ఎవనేది అధిష్టానం నిర్ణయిస్తుంది-దియా కుమారి బీజేపీ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఎంపీ దియా కుమారి విజయం. మాజీ కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ జోత్వారా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మూడు స్థానాల్లో వెలువడిన ఫలితం రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాలకు ఫలితాల వెల్లడి. రెండు చోట్ల బీజేపీ, ఒక స్థానంలో భారత్ ఆదివాసీ పార్టీ గెలుపు. పిండ్వారా అబు, మనోహర్ తానా నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల విజయం. చోరాసి నియోజకవర్గంలో భారత్ ఆదివాసీ పార్టీ అభ్యర్థి రాజ్‌కుమార్ రౌత్ 69,166 మెజార్టీతో భారీ విజయం. గెలుపు దిశగా బీజేపీ.. రాజస్థాన్‌లో బీజేపీ గెలుపు దిశగా సీట్లును సాధిస్తోంది. ఈసీ ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ ఇప్పటికే 100 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. కాంగ్రెస్.. 78 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. దీంతో, బీజేపీ కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. #WATCH | #RajasthanElection2023 | The beating of drums and dancing by BJP workers continue outside the party office in Jaipur as official EC trends show the party leading on 98 of the 199 seats so far. pic.twitter.com/WYYaU8cATQ — ANI (@ANI) December 3, 2023 #WATCH | Rajasthan BJP cadre celebrate party's lead in state elections, in Jaipur pic.twitter.com/WzqB4lVrZe — ANI (@ANI) December 3, 2023 విజయం మాదే: బీజేపీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత గజేంద్రసింగ్ షెకావత్ మాట్లాడుతూ.. రాజస్థాన్‌లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుంది. 2/3 మెజార్టీతో బీజేపీ గెలుస్తుంది. ఛత్తీస్‌గఢ్‌లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. #WATCH | Union minister and BJP leader Gajendra Singh Shekhawat says, "BJP will win with a huge majority in Rajasthan. Jadugar ka jadoo khatam ho gaya hai. In MP, the BJP will form govt with a 2/3 majority. In Chhattisgarh, the party will form the govt." pic.twitter.com/G2kO36kHlu — ANI (@ANI) December 3, 2023 రాజస్థాన్‌లో లీడ్‌లో బీజేపీ బీజేపీ.. 86 స్థానాల్లో లీడింగ్ కాంగ్రెస్.. 64 స్థానాలు సీపీఎం.. 2 స్థానాలు ఇతరులు.. 11 In initial trends, BJP leading on 73 seats, Congress on 28 seats in Madhya Pradesh pic.twitter.com/ESwsSQqkwy — ANI (@ANI) December 3, 2023 రాజస్థాన్ బీజేపీ చీఫ్ సీపీ జోషి మాట్లాడుతూ.. మా పార్లీ లీడింగ్‌లో ఉంది. దాదాపు 135 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందన్నారు. #WATCH | As early trends show BJP leading in Rajasthan, state BJP president CP Joshi says, "This lead will keep growing. We will win over 135 seats." pic.twitter.com/YHJjvr4D97 — ANI (@ANI) December 3, 2023 రాజస్థాన్‌లో లీడింగ్‌లో బీజేపీ.. బీజేపీ.. 34 కాంగ్రెస్.. 28 Rajasthan elections 2023 | BJP-34, Congress-28, as per official ECI trends https://t.co/dLB9iDlVqH pic.twitter.com/Yo2foMCzaT — ANI (@ANI) December 3, 2023 రాజస్థాన్‌లో కాంగ్రెస్ లీడ్.. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్.. 8 బీజేపీ.. 6 బీఎస్పీ.. 1 ఇతరులు..2 Rajasthan elections 2023 | Congress-8, BJP-6, BSP-1, RLD-1 and RLTP-1, as per official ECI trends pic.twitter.com/HgN7vvpPLF — ANI (@ANI) December 3, 2023 బీజేపీ లీడ్.. Rajasthan elections 2023 | BJP-17, Congress-13, BSP-1, RLD-1, as per official ECI trends pic.twitter.com/5iYiEZTXEU — ANI (@ANI) December 3, 2023 కృష్ణపోలే నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజ రాజస్థాన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అజిన్ కాగ్జి ముందంజ Rajasthan Congress MLA candidate Amin Kagzi from Kishan Pole constituency leading in early trends, as per ECI. pic.twitter.com/zeNbmOSwWV — ANI (@ANI) December 3, 2023 మూడు రాష్ట్రాల పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ ముందంజ రాజస్థాన్‌లో.. బీజేపీ..42, కాంగ్రెస్.. 49 మధ్యప్రదేశ్‌లో.. బీజేపీ.. 42, కాంగ్రెస్.. 40 ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ.. 28 కాంగ్రెస్.. 34 న్యాయం గెలుస్తుంది.. గెలుపు మాదే: బీజేపీ రాజస్థాన్ బీజేపీ చీఫ్ సీపీ జోషి మాట్లాడుతూ.. భారీ మెజార్టీతో బీజేపీ గెలుస్తుంది. రాజస్థాన్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు బీజేపీని పూర్తి మెజారిటీతో ఆశీర్వదించారు. దుష్పరిపాలన మరియు అన్యాయం కోల్పోతాయి. సుపరిపాలన మరియు న్యాయం గెలుస్తుంది. #WATCH | On poll results day, Rajasthan BJP chief CP Joshi says, "The public has blessed BJP with complete majority. Misgovernance and injustice will lose; Good governance and justice will prevail." pic.twitter.com/KiLVJ4pXtf — ANI (@ANI) December 3, 2023 ముందంజలో బీజేపీ.. ►పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో రాజస్థాన్‌లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. కాంగ్రెస్..35, బీజేపీ.. 54 కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు.. ►కేంద్రమంత్రి, బీజేపీ నేత గజేంద్ర సింగ్ షకావత్ ప్రత్యేక పూజలు.. బీజేపీ గెలుపును ఆకాంక్షిస్తూ జైపూర్‌లోని గోవింద్ దేవ్‌జీ టెంపుల్లో పూజలు.. Rajasthan | Union minister & BJP leader Gajendra Singh Shekhawat offered prayers at Jaipur's Govind Dev Ji temple on counting day pic.twitter.com/KAdg4MPyVw — ANI (@ANI) December 3, 2023 ►జైపూర్‌లో కౌంటింగ్ ప్రక్రియకు రెడీ.. #WATCH | Rajasthan | EVMs all set to be opened at University Commerce College counting centre in Jaipur, for the counting of votes. pic.twitter.com/nF6PSvlpkg — ANI (@ANI) December 3, 2023 ►రాజస్థాన్‌లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. Counting of votes for Chhattisgarh, Madhya Pradesh, Rajasthan and Telangana Assembly elections begins. pic.twitter.com/Raj87zBuaI — ANI (@ANI) December 3, 2023 ►రాజస్థాన్‌లో విజయం తమదంటే తమదేనని కాంగ్రెస్, బీజేపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. #WATCH | Ahead of poll verdict, Rajasthan minister & Congress leader BD Kalla says, "I can say that I will get mandate of people of Bikaner and enter the Legislative Assembly...Congress will repeat government in the state." pic.twitter.com/2IwJCPSozs — ANI (@ANI) December 3, 2023 #WATCH Churu, Rajasthan: On the counting of votes, Leader of Opposition in the Assembly Rajendra Rathore says, "...After some time, a new government will be formed...BJP will win with a huge majority & form government..." pic.twitter.com/BUWI84spIZ — ANI (@ANI) December 3, 2023 ►ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్త ఒకరు హనుమాన్ వేశధారణలో ఢిల్లీలో కనిపించారు. ►కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ వద్ద జైహనుమాన్ నినాదాలు చేశారు. #WATCH | Ahead of the counting of 4-state elections, a Congress worker - dressed as Lord Hanuman - stands outside the party HQ in Delhi. He says, "Truth will triumph. Jai Sri Ram!" pic.twitter.com/L61e28tBln — ANI (@ANI) December 3, 2023 ►రాజస్థాన్.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వాన్ని మార్చేయడం రాజస్థాన్ ప్రజల అలవాటు. ఈ ఆనవాయితీ ఈసారీ కొనసాగుతుందని, మోదీ మేనియా తోడై తమకు అధికారం కట్టబెడుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ►సీఎం గెహ్లోత్ మాత్రం ఈసారి ఆనవాయితీ మారుతుందని నమ్మకం పెట్టుకున్నారు. తన సంక్షేమ పథకాలు ఖచ్చితంగా గట్టెక్కిస్తాయని చెబుతున్నారు. 2018 ఎన్నికల్లో అధికారంలోకి వచి్చన నాటినుంచీ గెహ్లోత్‌పై కారాలూ మిరియాలూ నూరుతూ వస్తున్న కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలట్ ప్రచార పర్వంలో మాత్రం సంయమనం పాటించారు. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు: 200 మెజారిటీ మార్కు: 101 -
Rajastan: ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నా మళ్లీ కాంగ్రెస్‌దే అధికారం.. సీఎం గెహ్లాట్
న్యూఢిల్లీ : ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలవబోదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గురువారం జోస్యం చెప్పారు. ఎగ్జిట్ పోల్స్‌కు కొన్ని గంటల ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో మిజోరం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఇదివరకే పోలింగ్ పూర్తవగా తెలంగాణలో ఈరోజు పోలింగ్ జరిగింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నా రాజస్థాన్‌లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని సీఎం గెహ్లాట్ అన్నారు. పార్టీ ఎన్నికల అవకాశాల గురించి సీఎం గెహ్లాట్ విలేకరులతో మాట్లాడుతూ, "ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలవలేదు" అన్నారు. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం మధ్యప్రదేశ్. 2018లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 73 సీట్లు సాధించింది. బీఎస్పీ ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతుతో గెహ్లాట్ సీఎం పీఠాన్ని అధిష్టించారు. కాగా ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. -
'విజయానికి ముచ్చటగా మూడు కారణాలు..!'
జైపూర్: ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినప్పటికీ రాజస్థాన్‌లో కాంగ్రెస్ విజయం ఖాయమని సీఎం అశోక్ గహ్లోత్ ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు ఆయన మూడు కారణాలను ప్రధానంగా ప్రస్తావించారు. ఒక్క రాజస్థాన్‌లోనే గాక ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీ విజయం సాధించబోదని గహ్లోత్ తెలిపారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు వ్యతిరేకత లేదని తెలిపిన గహ్లోత్.. అలాంటి గాలులు వీయడం లేదని తెలిపారు. బీజేపీకి మతం అవకాశాలు ఉంటే విజయం సాధించేవారు కానీ అలాంటిదేమీ లేదని ఆయన చెప్పారు. "రెండోది ముఖ్యమంత్రి.. అభివృద్ధి పనులు చేయడంలో నాకు (ముఖ్యమంత్రి) తిరుగులేదని బీజేపీ ఓటర్లు సైతం చెబుతారు. మూడోది ప్రధాని, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు ఉపయోగించే భాష. ప్రచార సమయంలో వారు ఉపయోగించిన భాష ఎవరికీ నచ్చలేదు" అని గెహ్లోత్ తెలిపారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రతి చోట ఓడిపోతుందని ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గహ్లోత్ నేతృత్వంలోని ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇస్తున్న హామీల్లో అశోక్ గహ్లోత్‌కు ఎలాంటి అధికారం లేదని కూడా అమిత్ షా అన్నారు. సీఎం అశోక్ గహ్లోత్‌ను ప్రధాని మోదీ మెజీషియన్‌గా పేర్కొన్నారు. ఈ మాంత్రికునికి ఎవరూ ఓటు వేయబోరని ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. రాజస్థాన్‌లో నవంబర్ 25న పోలింగ్ జరిగింది. నేడు తెలంగాణలో పోలింగ్ జరుగుతోంది. డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాలు రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరం, మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు వెల్లడవనున్నాయి. ఇదీ చదవండి: రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. ఏడుగురు కూలీలు మృతి -
‘అది 440 వోల్ట్ల కరెంట్.. కాంగ్రెస్‌కే షాకిస్తుంది’
జైపూర్: రాజస్థాన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 135 సీట్లు గెలుచుకుంటుందని, రాష్ట్రంలో ఇది అతిపెద్ద విజయాలలో ఒకటిగా ఉంటుందని బీజేపీ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రాజేంద్ర సింగ్ రాథోడ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా "అండర్ కరెంట్" (లోలోపల అనుకూలత) ఉందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపై రాజేంద్ర సింగ్ రాథోడ్ వ్యంగ్యంగా స్పందించారు. "అండర్ కరెంట్ ఉందని గెహ్లాట్ సాబ్ చెప్పింది నిజమే. అది 440 వోల్ట్లు. ఆయన చెబుతున్న అండర్ కరెంట్ కాంగ్రెస్‌కే షాక్ ఇస్తుంది" అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రజలను ఆకట్టుకోలేదని, రాష్ట్రంలో ఆ పార్టీని గద్దె దించేందుకే ప్రజలు ఓట్లు వేశారని అన్నారు. ‘కాంగ్రెస్ అవమానకరమైన పరాజయం దిశగా అడుగులు వేస్తోంది. గ్రౌండ్ రిపోర్ట్‌ల ప్రకారం.. ఈ ఎన్నికల్లో బీజేపీ 135 సీట్లకు పైగా సాధిస్తుంది. ఇది అతిపెద్ద ఎన్నికల విజయాలలో ఒకటి’ అని రాథోడ్ పేర్కొన్నారు. నవంబర్ 25న రాజస్థాన్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 74 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని 200 స్థానాలకు గాను 199 స్థానాల్లో పోలింగ్ జరిగింది. మరో నాలుగు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్ ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. -
వారిని ప్రజలు పట్టించుకోలేదు.. సీఎం గెహ్లాట్ ధీమా!
జైపూర్: రాజస్థాన్‌లో శనివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విశ్వాసం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు తమ ప్రచారంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, మతం కార్డు వాడేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. అయితే రాష్ట్ర ప్రజలు వాటిని పట్టించుకోలేదని పేర్కొన్నారు. ‘ప్రచారంలో వారు ఎలాంటి రెచ్చగొట్టే భాష ఉపయోగించారో అందరూ చూశారు. మతం కార్డు వాడేందుకు ప్రయత్నించారు. కానీ ప్రజలు వారిని తిరస్కరించారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీని పొందబోతోంది’ అని గెహ్లాట్ అన్నారు. ‘ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కానీ రాజస్థాన్ ప్రజలు వాటిని పట్టించుకోలేదు’ అన్నారాయన. రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నారని, తమపై ఎటువంటి వ్యతిరేకత లేదని అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని 200 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 199 స్థానాలకు శనివారం పోలింగ్ జరిగింది. ప్రజలు తమ తీర్పును ఓట్ల రూపంలో ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు అనంతరం పార్టీ భవితవ్యం తేలనుంది. -
రాజస్థాన్ ఎన్నికలు: ఫతేఫూర్‌లో రాళ్ల రాడి, భారీగా మోహరించిన పోలీసులు
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య హారా హోరీగా సాగుతున్న ఈ పోరులో గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజా మధ్యాహ్నం 1 గంటల వరకు 40శాతానికి పైగా ఓటింగ్ నమోదుగా తాజా సమాచారం ప్రకారం 55.63శాతం ఓటింగ్ నమోదైంది. మరోవైపు సికార్‌లోని బోచివాల్ భవన్, ఫతేపూర్ షెఖావతి సమీపంలో కొంతమంది రాళ్ల దాడికి దిగారు.దీంతో వారిని చెదరగొట్టేందుకు భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రాష్ట్రంలో అన్ని చోట్లా ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతోంది. అయితే ఫతేపూర్ షెకావతి నుంచి హింసాత్మక సంఘటన చోటు చేసుకుంది.. రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ కారణంగా ఉద్రిక్తత నెలకొంది. ఉద్రిక్తత సమయంలో జనం అదుపు తప్పి భారీగా రాళ్లు రువ్వారు. హింసాకాండతో కొంత సేపు ఓటింగ్ నిలిచిపోయింది. అయితే భద్రతా బలగాలు అప్రమత్తమై జనాన్ని అదుపు చేశారు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత మళ్లీ ఓటింగ్ ప్రారంభమైంది. ఇది ఇలా ఉంటే ఈసారి ట్రెండ్ రివర్స్ అవుతుందని, అధికారం తమదేనని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని వ్యాఖ్యానించారు. భాజపా అఖండ మెజారిటీతో అధికారంలోకి రానుంది. రాజస్థాన్ ప్రజలు గత ఐదేళ్ల దుష్పరిపాలనకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఓట్లు వేస్తున్నట్లు కనిపిస్తోంది. నేరాలు, అవినీతి పాలన అంతంకోసం జనం ఓటు వేస్తున్నారుని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వ్యాఖ్యానిచారు. ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ నేత, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే రాజకీయాల్లో ఉన్న వ్యక్తులెవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైందికాదనీ కొత్త ఓటర్లు ఈ పరిణామాల్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు. కాగా రాజస్థాన్‌లోని 200 నియోజకవర్గాల అసెంబ్లీలలో 199 అసెంబ్లీలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఈ సాయంత్రం 6 గంటలక పోలింగ్‌కు కొనసాగుతుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. పోలింగ్‌కు సంబంధించి గట్టి భద్రత ఏర్పాటు చేశామని డీజీపీ పుమేష్‌మిశ్రా తెలిపారు. ఇదిబ ప్రజాస్వామ్యానికి పండుగ లాంటి, స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు డీజీపి పిలుపునిచ్చారు. #WATCH | Rajasthan Assembly elections: Stone pelting reported near Bochiwal Bhawan, Fatehpur Shekhawati in Sikar. Heavy Police deployed. pic.twitter.com/AAXLlkp5pn — ANI (@ANI) November 25, 2023 -
సీఎం అశోక్ గహ్లోత్ గొప్ప మనసు
జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ గొప్ప మనసు చాటుకున్నారు. తెల్లవారితే పోలింగ్ ఉన్నప్పటికీ.. అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ ఎమ్మెల్యేను అర్ధరాత్రి పరామర్శించారు. ఎన్నికల వేళ నిత్యం బిజీగా ఉన్నప్పటికీ రాత్రి 1 గంటల సమయంలో ఆస్పత్రికి వెళ్లి బీజేపీ ఎమ్మెల్యే బాగోగులు అడిగి తెలుసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే జిజి వ్యాస్ అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం ఆమెకు ఎయిమ్స్‌లో చికిత్స కొనసాగుతోంది. నేడు రాష్ట్రంలో పోలింగ్ జరగనున్నప్పటికీ అర్ధరాత్రి సమయంలో సీఎం అశోక్ గహ్లోత్ అనారోగ్యం పాలైన జిజి వ్యాస్‌ను పరామర్శించారు. అర్ధరాత్రి 1 గంటలకు ఎయిమ్స్‌కు వెళ్లి జిజి వ్యాస్‌ను పలకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. గహ్లోత్‌ను రాజస్థాన్ వజ్రంగా పేర్కొన్నారు నెటిజన్లు. మూడోసారి రాష్ట్రంలో అపూర్వ విజయం సాధించాలని ఆకాంక్షించారు. It's almost 1 AM, tomorrow is polling in Rajasthan and Ashok Gehlot is meeting the BJP MLA in AIIMS. BJP MLA Jiji Vyas is admitted with health conditions and Pope has reached her to meet & check on her.♥️ Pictures are going viral in Marwad region, what a leader what a gem… pic.twitter.com/hiGahaiZxi — Amock (@Politics_2022_) November 24, 2023 రాజస్తాన్ శాసనసభ ఎన్నికలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ జరుగనుంది. 200 నియోజకవర్గాలకు గాను 199 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. శ్రీగంగానగర్ జిల్లాలోని కరణ్‌పూర్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే గురీత్‌సింగ్ కూనార్ మరణించడంతో ఇక్కడ పోలింగ్‌ను వాయిదా వేశారు. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 1,862 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇదీ చదవండి: మరోసారి గెలుపు మాదే: సచిన్ పైలెట్ -
రాజస్థాన్ ఎన్నికలు: సంచలన లోక్ పాల్ సర్వే
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్య హోరా హోరీ పోరు తప్పదని ఇప్పటికే పలు సర్వేలు తేల్చాయి. దీనికి తోడు ప్రతీ ఎన్నికల్లో అప్పటికి అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోతున్న పరిస్థతి గత ముప్పయేళ్లుగా కొనసాగుతోంది. ఈనేపథ్యంలో ఈ సారి బీజేపీకి పట్టం తప్పదనే అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలో లోక్‌పాల్ తాజాగా కీలక సర్వేను ప్రకటించింది. సవరించిన తుది సర్వే ఫలితాలు అంటూ ట్విటర్ ద్వారా కీలక నంబర్లను ప్రకటించింది. అయితే కీలకమైన కరణపూర్ నియోజకవర్గాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని వెల్లడించింది. సర్వేలో బీజేపీ వైపే మొగ్గు ఉన్నట్టు ఈ సర్వలే తేల్చింది. బీజేపీ 92-98 సీట్లు వస్తాయని తెలిపింది. అలాగే అధికార పార్టీ కాంగ్రస్కు 87-93 మధ్య సీట్లను గెల్చుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇతరులు 12 నుంచి 18 సీట్లను దక్కించుకుంటారని తేల్చింది. అయితే దీనిపై స్పందించిన కొంతమంది నెటిజన్లు కాంగ్రెస్ 100 సీట్లు దక్కించుకోవడం ఖాయం అంటూ కమెంట్ చేశారు. (రాజస్థాన్ ఎన్నికలు: కీలక నియోజకవర్గాలు, ఆసక్తికర విషయాలు) బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు? బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రతిపాదించకపోవడంతో 'జైపూర్ కీ బేటీ' పై చర్చ జోరందుకుంది. జైపూర్ రాజకుటుంబంలో జన్మించి, ప్రస్తుతం పార్లమెంటు సభ్యురాలిగా ఉన్న దియా కుమారిపై భారీ అంచనాలే ఉన్నాయి. రాజ్‌సమంద్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కుమారి ప్రస్తుతం ఎన్నికల్లో జైపూర్ నగరంలోని విద్యాధర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. Presenting you our revised final numbers for the upcoming #Rajasthan elections: ▪️INC 87 - 93 ▪️BJP 92 - 98 ▪️OTH 12 - 18 Sample size: 62,500. Note: We are not considering the Karanpur seat factor, since the survey was taken before that.… pic.twitter.com/zr8Ub6TLhu — Lok Poll (@LokPoll) November 23, 2023 కాగా రాజస్థాన్‌లో 200 నియోజక వర్గాల, నవంబరు 25న పోలింగ్ జరగనుంది.డిసెంబరు 3న ఫలితాలు తేలనున్నాయి. రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారానికి గురువారం సాయంత్రంతోతెరపడింది. కాంగ్రెస్ , బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా తమ స్టార్ క్యాంపెయినర్లతో ర్యాలీలు, సభలు నిర్వహించాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ లాంటి ప్రముఖులను రంగంలోకి దించగా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా వంటి దిగ్గజాలు బీజేపీ ప్రచార పర్వాన్నిముందుండి నడిపించారు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం తన సంక్షేమ పథకాలు, విధానాలు హామీలను ప్రచారంలో హైలైట్ చేయగా, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు, నిరుద్యోగం, మహిళలపై హింస లాంటి ఆరోపణలతో ముందుకు సాగింది బీజేపీ. హోరా హోరీగా సాగుతున్న ఈఎన్నికల పోరులో రాజస్థాన్ ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేది తేలాలంటే డిసెంబరు 3 వరకు వెయిట్ చేయక తప్పదు. -
Rajasthan Assembly polls: రాజస్థాన్ ఎవరిదో!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగింపునకు వస్తోంది. మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పోలింగ్ ఇప్పటికే ముగియగా కీలకమైన రాజస్థాన్ లో ప్రచార పర్వానికి గురువారం సాయంత్రంతో తెర పడింది. శనివారం పోలింగ్ జరగనుంది. అధికార కాంగ్రెస్, బీజేపీ రెండూ గెలుపుపై ధీమాగా ఉన్నా యి. ఏడు హామీలకు తోడు ప్రజాకర్షక పథకాలు కచ్చితంగా గట్టెక్కిస్తాయని ముఖ్య మంత్రి అశోక్ గెహ్లోత్ నమ్ముతున్నారు. దారుణంగా క్షీణించిన శాంతిభద్రతలు కచ్చితంగా సర్కారు పుట్టి ముంచుతాయని, మోదీ మేనియాకు హిందూత్వ కార్డు తోడై ఘనవిజయం సాధించి పెడుతుందని బీజేపీ అంటోంది. నవంబర్ 30న తెలంగాణలో పోలింగ్ ముగిశాక డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జరిగి ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌లో గత మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఓసారి చూస్తే... 2008పరిశీలకులతో పాటు అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ అధికార బీజేపీ అనూహ్యంగా ఓటమి చవిచూసింది! కాంగ్రెస్ మరోసారి విజయబావుటా ఎగరేసింది. గెహ్లోత్ మళ్లీ సీఎం అయ్యారు. ప్రజల ఆదరణ బీజేపీకే ఉన్నట్టు దాదాపుగా అన్ని సర్వేల్లోనూ తేలినా ఆ పార్టీ ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యమంత్రిగా వసుంధరా రాజె సింధియా అనుసరించిన లోప భూయిష్టమైన ఎన్నికల వ్యూహమే ఇందుకు ప్రధాన కారణమని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ఆమె అహంకారపూరిత ప్రవర్తన, సీనియర్లకు ప్రా ధాన్యం ఇవ్వకపోవడం, అభ్యర్థుల ఎంపికలో ఒంటెత్తు పోకడలు పార్టీని ముంచాయంటూ విమర్శలు వెల్లు వెత్తాయి. మొత్తం 200 స్థానా లకుగాను కాంగ్రెస్ 96 చోట్ల నెగ్గగా బీజేపీ 78 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్‌కు 36.8 శాతం ఓట్లు పోలవగా బీజేపీకి 34.3 శాతం పడ్డాయి. ఇతరులకు 21 శాతం ఓట్లు పోలవడం బీజేపీ విజయావ కాశాలను గట్టిగా దెబ్బకొట్టింది. ఎందుకంటే 2003 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌కు ఓట్లు కేవలం ఒక్క శాతం మాత్రమే పెరిగాయి. బీజేపీ ఏకంగా 5 శాతానికిపైగా ఓట్లను నష్టపోయింది! ఇక బీఎస్పీ 7.6 శాతం ఓట్లతో 6 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. 2013 ఆనవాయితీని కొనసాగిస్తూ బీజేపీ ఘనవిజయం సాధించింది. వసుంధరా రాజె మళ్లీ ముఖ్యమంత్రి పీఠమెక్కారు. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో బీజేపీ 163 సీట్లలో నెగ్గింది. కాంగ్రెస్ కేవలం 21 స్థానాలకు పరిమితమై ఘోర పరాభవం మూటగట్టుకుంది. రాష్ట్ర చరిత్రలో ఒక ప్రధాన పార్టీకి లభించిన అత్యల్ప స్థానాలు ఇవే! 1998 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 33 సీట్లొచ్చాయి. బీజేపీ 45.2 శాతం ఓట్లు సాధించగా కాంగ్రెస్‌కు 33.1 శాతం దక్కాయి. గుజ్జర్ నేత కిరోరీసింగ్ బైన్స్లా దన్ను కాంగ్రెస్‌కు పెద్దగా కలిసిరాలేదు. ఎప్పుడూ ఆదరించే మేవార్ ప్రాంతం ఈసారి బీజేపీకే జై కొట్టడంతో ఆ పార్టీ తేరుకోలేకపోయింది. 34 ఎస్సీ స్థానాల్లో కాంగ్రెస్ ఒక్కటి కూడా నెగ్గలేకపోవడం విశేషం. 25 ఎస్టీ సీట్లలో నాలుగే గెలిచింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ప్రధానంగా తెరపైకి వచ్చిన నరేంద్ర మోదీ మేనియానే బీజేపీ ఘన విజయానికి కారణమని సీఎం అశోక్ గెహ్లోత్ అంగీకరించడం విశేషం! బీఎస్పీ సగం అసెంబ్లీ సీట్లు కోల్పోయి మూడింటికే పరిమితమైంది. 2018 ప్రభుత్వాలను పడగొట్టే ధోరణి మరోసారి కాంగ్రెస్‌కు గెలుపు కట్టబెట్టింది. పీసీసీ చీఫ్‌గా యువ నేత సచిన్ పైలట్ అంతా తానై ఎన్నికల బాధ్యతలను చూసుకున్నారు. పార్టీ విజయంలో ఒకరకంగా కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ నెగ్గితే ఆయనే ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం పార్టీకి బాగా లాభించింది. 100 సీట్లతో పార్టీ ఘనవిజయం సాధించింది. 2013లో 59 ఎస్సీ, ఎస్టీ స్థానాలు నెగ్గిన బీజేపీ ఈసారి కేవలం 21 స్థానాలకు పరిమితమైంది. ఆళ్వార్, దౌసా, సవాయ్ మధోపూర్, టోంక్, ధోల్పూర్, కరౌలీ జిల్లాల్లోనైతే ఒక్క ఎస్సీ, ఎస్టీ స్థానం కూడా నెగ్గలేకపోయింది. ఫలితాల అనంతరం పైలట్ సీఎం అవుతారని అంతా భావించారు. కాంగ్రెస్ అధిష్టానం అనూహ్యంగా పాత కాపు మరోసారి గెహ్లోత్‌కే చాన్స్ ఇచ్చింది. రెండేళ్ల అనంతరం అవకాశమిస్తామంటూ పైలట్‌ను అనునయించి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది. మాట నిలుపుకోకపోవడంతో 2020లో ఆయన తిరుగుబాటు చేసినా రాహుల్‌గాంధీ జోక్యంతో రాజీ పడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాజస్థాన్ ఎన్నికలు: కీలక నియోజకవర్గాలు, ఆసక్తికర విషయాలు
Rajasthan Assembly polls 2023: పశ్చిమ రాష్ట్రం రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 25న 200 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. డిసెంబరు 3న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈక్రమంలో ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం గురువారం సాయంత్రంతో ముగియనుంది. ఇక్కడ అటు బీజేపీగానీ, ఇటు కాంగ్రెస్ గానీ వరుసగా అధికారాన్ని దక్కించు కోలేదు. పైగా ఒకదాని తరువాత ఒకటి ఆల్టర్ నేటివ్‌గా గద్దెనెక్కుతున్నాయి. ప్రతీ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుంది. అందుకే ఈ సారి రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తారని బీజేపీ ధీమాగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు కాకుండా, ఈసారి బీజేపీకి రాజస్థాన్ ప్రజలు పట్టం కడతారని సర్వేల అంచనా. అధికార వ్యతిరేకత కూడా బీజేపీకి కలిసి వచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఈసారి ట్రెండ్ రివర్స్ అవుతుందనీ, విజయం తమదే ననే ధీమాను వ్యక్తం చేస్తోంది. అసలు ఇక్కడ కీలక నియోజకవర్గాలు,విశేషాలు ఒకసారి చూద్దాం. సర్దార్‌పురా: ఇది 1998 నుండి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ 1998 నుండి ఈ సీటును గెలుచుకున్నారు. నాలుగోసారి సీఎం రేసులో ఉన్న ఈ సీనియర్ కాంగ్రెస్ నేత 2018 ఎన్నికల్లో 63శాతం ఓట్లతో బీజేపీకి చెందిన శంభు సింగ్‌ను ఓడించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సర్దార్‌పురా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెహ్లాట్ నామినేషన్ దాఖలు చేశారు. టోంక్: టోంక్ స్థానం నుంచి అద్భుత విజయం సాధించిన కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ బీజేపీ అభ్యర్థి అజిత్ సింగ్ మెహతాపై పోటీ చేయనున్నారు. టోంక్ నియోజకవర్గంలో గుజ్జర్ జనాభాతో పాటు మీనాలు,ముస్లింలు కూడా ఉన్నారు. 2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పైలట్ 54,179 ఓట్ల తేడాతో బీజేపీకి చెందిన యూనుస్ ఖాన్‌పై విజయం సాధించారు. ఝల్రాపటాన్: రాజస్థాన్‌లోని బీజేపీ కంచుకోటలో మాజీ సీఎం వసుంధర రాజే 2003 నుంచి ఇక్కడ నుంచి గెలుస్తూ వస్తున్నారు. 2018లో కాంగ్రెస్ మాన్వేంద్ర సింగ్‌ను ఓడించారు. ఉదయ్‌పూర్: ఇక్కడ కూడా బీజేపీకి కూడా గట్టి పట్టుంది. 2003 నుంచి బీజపీ ఉదయపూర్‌లో తన సత్తాను చాటుతోంది. ఇక్కడ తారాచంద్ జైన్ బీజేపీ బరిలోకి దించింది అయితే ఉదయపూర్ మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పరాస్ సింఘ్వి దీన్ని వ్యతిరేకించారు. పార్టీ పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. కాగా కాంగ్రెస్ గౌరవ్ వల్లభ్‌ను రంగంలోకి దించింది. నాథ్‌ద్వారా: ఇక్కడి నుంచి మహారాణా ప్రతాప్ సింగ్ వారసుడు విశ్వరాజ్ సింగ్ మేవార్ను బీజేపీ పోటీకి దింపింది. రాజస్థాన్ అసెంబ్లీ ప్రస్తుత స్పీకర్, కాంగ్రెస్ కురువృద్ధుడు సీపీ జోషిపై మేవార్ పోటీ చేయనున్నారు. 2018లో జోషి 16,940 సీట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి మహేశ్ ప్రతాప్ సింగ్‌పై విజయం సాధించారు. ఝుంజును: ఈ నియోజకవర్గంలో చిరకాల ప్రత్యర్థులు కాంగ్రెస్ నుంచి బ్రిజేంద్ర ఓలా, బీజేపీ నుంచి నిషిత్ కుమార్ పోటీ పడుతున్నారు. ఓలా జుంజును (2008, 2013 , 2018లో) నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. జోత్వారా: ఒలింపియన్‌గా మారిన రాజకీయ నాయకుడు రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్‌ను తిరిగి కైవసం చేసుకునేందుకు బీజేపీ రంగంలోకి దిగింది. 2018లో ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి లాల్‌చంద్ కటారియా రాథోడ్‌పై విజయం సాధించారు. చురు: ఇది బీజేపీకి మరో కంచుకోట. రాజస్థాన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రాజేంద్ర రాథోడ్ ఆరు వేర్వేరు సందర్భాలలో గెలుపొందారు. అయితే 2008 ఎన్నికల్లో తారానగర్ నుండి కాంగ్రెస్‌కు చెందిన మక్బూల్ మండెలియా బీజేపీ అభ్యర్థి హర్లాల్ సహారన్ను ఓడించారు. స్కాంలు, లీక్‌లు, మహిళల భద్రత అధికార వ్యతిరేకత, పేపర్ లీక్ స్కామ్‌లు. పేపర్ లీకేజీల కారణంగా 2019, 2022 మధ్య రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (RPSC) నిర్వహించిన ఎనిమిది పరీక్షలు రద్దయ్యాయి.ప్రభుత్వ రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్ లీక్‌లకు పాల్పడిన వారికి శిక్షను 10 ఏళ్ల జైలు శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చే బిల్లును రాజస్థాన్ అసెంబ్లీ ఈ ఏడాది జూలైలో ఆమోదించింది. రాష్ట్రంలో మహిళల భద్రత మరో సమస్య. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు మహిళల గౌరవ పోరాటమని కేంద్ర కేబినెట్ మంత్రి స్మృతి ఇరానీ పేర్కొనడం గమనార్హం. ఓటర్లు రాజస్థాన్‌లో సాధారణ ఓటర్లు 5,25,38,655 మంది ఉండగా, సర్వీస్ ఓటర్లు 1,41,890 మంది ఉన్నారు. ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 5,26,80,545. భారత ఎన్నికల సంఘం ప్రకారం, 2023 జనవరి అక్టోబర్ మధ్య 18 సంవత్సరాలు నిండిన యువ ఓటర్ల సంఖ్య మొత్తం 22,04,514. 11,78,285 మంది ఓటర్లు సీనియర్ సిటిజన్లు (80+) కాగా, రాజస్థాన్‌లో 606 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. రాబోయే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల 2023 కోసం రాష్ట్రంలో 51,756 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. -
Rajasthan Election 2023: హామీలా, హిందుత్వా?
ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. ఇక్కడ పాలక కాంగ్రెస్, విపక్ష బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. నెల రోజులకు పైగా రాష్ట్రవ్యాప్తంగా పోటాపోటీ ప్రచారంతో ఇరు పార్టీలూ హోరెత్తించాయి. బీజేపీ ప్రచారానికి స్వయంగా ప్రధాని మోదీయే సారథ్యం వహించి కాలికి బలపం కట్టుకుని సుడిగాలి పర్యటనలు చేశారు. కాంగ్రెస్ తరఫున ప్రచార భారాన్ని ప్రధానంగా సీఎం అశోక్ గెహ్లోతే మోశారు. మోదీ మేనియాకు ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితీ తోడై తాము అందలమెక్కుతామని బీజేపీ నమ్మకం పెట్టుకుంది. గెహ్లోత్ వరుసబెట్టి ప్రకటిస్తూ వచి్చన జనాకర్షక పథకాలు ఆ ఆనవాయితీకి ఈసారి అడ్డుకట్ట వేసి తమను మరోసారి గెలిపిస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే పోలింగ్ తేదీ సమీపించినా ఓటరు నాడి మాత్రం ఎవరికీ అందడం లేదు. ఏ పార్టికీ అనుకూలంగా స్పష్టమైన ‘వేవ్’ కనిపించడం లేదు. దాంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరు పార్టిలూ సర్వశక్తులూ ఒడ్డాయి. కాంగ్రెస్ ప్రధానంగా ఎన్నికల హామీలపై ఆధారపడగా బీజేపీ ఎప్పట్లాగే హిందుత్వ కార్డును వీలైనంతగా ప్రచారంలో పెట్టింది... పథకాలకు థమ్సప్... గెహ్లోత్ ప్రభుత్వ పనితీరుపై క్షేత్రస్థాయిలో పెద్దగా వ్యతిరేకత కన్పించకపోవడం విశేషం. సంక్షేమ పథకాలపై ప్రజల్లో బాగా సంతృప్తి ఉంది. సంక్షేమ పథకాలు పేదలను ఎంతగానో ఆదుకున్నాయని బీజేపీ మద్దతుదారులు కూడా అంగీకరిస్తుండటం విశేషం! చిరంజీవి బీమా యోజన లక్షల మంది పేద, మధ్య తరగతి కుటుంబీకులకు ఎంతో ఆదుకుందని సవాయ్ మధోపూర్‌లో పవన్ మీనా అనే పాన్ షాప్ యజమాని చెప్పుకొచ్చారు. ‘‘నేను బీజేపీ మద్దతుదారును. కానీ ఈసారి కాంగ్రెస్ పాలనలో ప్రజలకు జరిగిన మంచి కొట్టొచ్చినట్టు కని్పస్తూనే ఉంది’’ అన్నారాయన. కాకపోతే ఇదంతా ఓట్ల రూపంలో బదిలీ అవుతుందా అన్నది చూడాలంటూ ముక్తాయించారు. 10 లక్షల ఉద్యోగాలతో పాటు తక్షణం కులగణన చేపట్టి, మైనారిటీలకు జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కలి్పస్తామని కూడా కాంగ్రెస్ తాజా మేనిఫెస్టోలో చెప్పింది. ఇవన్నీ ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో చూడాల్సిందే. శాంతిభద్రతలపై పెదవి విరుపు... పథకాల సానుకూలతకు శాంతిభద్రతల విషయంలో జనంలో నెలకొన్న తీవ్ర అసంతృప్తి బాగా గండి కొట్టేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మాత్రం దారుణంగా దిగజారిందని మెజారిటీ ప్రజలు వాపోతుండటం ప్రమాద ఘంటికేనంటున్నారు. ముఖ్యంగా ఇస్లాంను కించపరిచాడంటూ గతేడాది ఉదయ్‌పూర్‌లో ఓ టైలర్ షాప్ యజమానిని పట్టపగలే తల నరికి చంపిన తీరును ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. దానికి తోడు మహిళలపై అకృత్యాలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిన తీరుపైనా జనం గగ్గోలు పెడుతున్నారు. పథకాల ఫలాలు అందరికీ అందుతున్నా ప్రాణాలకే భద్రత లేకపోతే ఏం లాభమని కోటాలో బట్టల షాపు నడుపుతున్న వినోద్ చేసిన వ్యాఖ్యలు జనాభిప్రాయానికి అద్దం పట్టేవే. ‘‘గెహ్లోత్ ప్రభుత్వం బాగానే పని చేసింది. కానీ మార్పు అవసరం. బీజేపీ వస్తే బాగుంటుంది’’ అన్నారాయన. బీజేపీకి ఓటేయడం చాలా అవసరమని కోటాకు చెందిన అమృత్ చౌహాన్ అనే ఆటోడ్రైవర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ధోరణినే ప్రతిఫలించాయి. ‘‘శాంతిభద్రతలను చక్కదిద్దాలంటే యూపీ తరహా పాలన కావాల్సిందే. అప్పుడే ప్రధాని మోదీ చెబుతున్న హిందూ రాష్ట్ర స్థాపన సాధ్యం. కాంగ్రెస్ కేవలం ఒక్క సామాజిక వర్గానికే కొమ్ము కాస్తూ వస్తోంది’’ అని చౌహాన్ చెప్పుకొచ్చారు. ఈసారీ 199 సీట్లలోనే పోలింగ్! రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి గురువారం సాయంత్రంతో తెర పడనుంది. పోలింగ్ శనివారం జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు మరో నాలుగు రాష్ట్రాలతో కలిపి డిసెంబర్ 3న వెల్లడవుతాయి. అయితే రాష్ట్రంలో 200 అసెంబ్లీస్థానాలకు గాను 199 స్థానాల్లో మాత్రమే పోలింగ్ జరగనుంది! కరణ్‌పూర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్‌సింగ్ కున్నర్ మృతితో అక్కడ పోలింగ్ వాయిదా పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా 199 స్థానాల్లోనే పోలింగ్ జరుగుతుండటం రాష్ట్ర చరిత్రలో ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం! బీఎస్పీ అభ్యర్థుల మృతి కారణంగా 2018లో, 2013 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాగే ఒక అసెంబ్లీ స్థానంలో పోలింగ్ నిలిచిపోయింది. -
Rajasthan Elections 2023: ‘కాంగ్రెస్ మళ్లీ గెలుస్తుంది.. నా భవిష్యత్తు మాత్రం..’
జైపూర్: మరో మూడు రోజుల్లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లాట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికల తర్వాత తన రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది మాత్రం పార్టీ హైకమాండ్‌కే వదిలేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం తన పాత్ర ఎలా ఉండోబోతోందన్న దానిపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ "నా పాత్రను పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. ఎలాంటి పాత్ర ఇచ్చినా దానికి కట్టుబడి ఉంటాను" అని అన్నారు. ఆ సంప్రదాయం మారుతుంది రాజస్థాన్‌లో అధికార వ్యతిరేకతను అధిగమించి మరోసారి ప్రజామోదం పొందుతామని అశోక్ గెహ్లాట్ విశ్వాసం వ్యక్తం చేశారు. 2ఈసారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పునరావృతం చేసేలా ప్రజలు తమ మూడ్‌ని ఏర్పరచుకున్నారు. మేము 156 సీట్ల దిశగా పయనిస్తున్నామని నమ్ముతున్నాను. ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయానికి ఈసారి బ్రేక్ పడబోతోంది’ అని గెహ్లాట్ అన్నారు. ‘కేరళలో 76 ఏళ్ల ఇలాంటి రికార్డును ఆ రాష్ట్ర ప్రజలు బద్దలు కొట్టారు. కోవిడ్ సమయంలో మెరుగైన సేవలు అందించిన ప్రభుత్వాన్ని మరోసారి కొనసాగించారు. ఇక్కడ రాజస్థాన్‌లో మేం కూడా కోవిడ్ సమయంలో ప్రజలకు విశేష సేవలు అందించాం. కేరళ ప్రజల లాగే రాజస్థాన్ ప్రజలు కూడా తెలివైనవారు ప్రభుత్వాన్ని పునరావృతం చేస్తారు’ అని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలను పడగొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి ఏజెన్సీలను ఉపయోగిస్తోందని అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. తాము అమలు చేసిన వివిధ సామాజిక పథకాలే తమను మరోసారి గెలిపిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఉపయోగిస్తున్న భాషపైనా ఆయన అభ్యంతరం వెలిబుచ్చారు. -
నో డౌట్ గహ్లోత్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదు! మోదీ జోస్యం
రాజస్తాన్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీలు రసవత్తరంగా ప్రచార దూకుడిని పెంచేశాయి. ఎవరికీ వారు తమ పార్టీ గెలుస్తుందని ప్రగాల్బాలు పలుకుతూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం దుంగార్పూర్లోని సగ్వారాలో జరుగుతున్న ప్రచార ర్యాలీలో కాంగ్రెస్‌పై తారా స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను రాజస్తాన్‌లో ప్రసిద్ధ "మావ్జీ మహారాజ్ జీ!" ఆశీస్సులతో చెబుతున్నా.. కచ్చితంగా మళ్లీ గహ్లోత్ ప్రభుత్వం రానే రాదని జోస్యం చెప్పారు. ఈ పుణ్యభూమిలో ఉన్న గొప్పశక్తే తనను ఇలా అనేలా డేర్ చేయించిందని అన్నారు. తాను చెప్పిన జోస్యం ఫలించేలా రాజస్థాన్ ప్రజలే తిరగ రాయాలని అన్నారు. ఈ మేరకు మోదీ ఆ బహిరంగ ర్యాలీలో గహ్లోత్ ప్రభుత్వంలో జరిగిన పేపర్ లీక్‌లను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. విద్యా విషయంలో అనుసరిస్తున్న దారుణమైన విధానల వల్లే యువత కలలు కల్లలయ్యాయని అన్నారు. ప్రభుత్వ నియామకాలన్నింటిలోనూ రాష్ట్ర ప్రభుత్వం స్కామ్‌లకు పాల్పడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ దుష్టపాలన కారణంగానే మీ పిల్లలకు అన్యాయం జరిగిందన్నారు. ప్రజలు కాంగ్రెస్ గ్యారంటీ హామీల మాయలో పడకుండా ఉన్న తరుణంలోనే మోదీ హామీలన్నీ వేగంగా చేరువవ్వడమే గాకుండా రాజస్తాన్ కూడా వేగంగా అభివృద్ధి పథంలోకి దూసుకుపోగలదన్నారు. అందుకోసం అయినా కాంగ్రెస్‌ని తరిమికొట్టలాని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనను మార్చే శక్తి ప్రజాస్వామ్యానికి ఉంది. ఈ టైంలో మీరు చేసే ఒక్క చిన్నపాటు ఐదేళ్ల పాటు మీకు కష్టాన్ని తెచ్చి పెడుతుందనే విషయాన్ని గుర్తించుకోండి. అంతేగాదు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ అందేలా కాంగ్రెస్‌ని దూరం పెట్టడం అనేది అత్యంత ముఖ్యం అని చెప్పారు. రాజస్తాన్‌లో తమ పథకాలన్నీ అత్యంత వేగంగా అమలు చేస్తాం అని హామీ ఇచ్చారు. నిజానికి కాంగ్రెస్ నాయకులు ఎక్కడకు వెళ్లి ఓటు వేయమని అడుగుతున్నా..ప్రజల నుంచి..ఓట్లు పడవన్నా!.. ఒకే ఒక్క సమాధానం వస్తుందని విమర్శించారు మోదీ. కాగా మూడు రోజుల్లో రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ద్విముఖ హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కానీ వివిధ ప్రాంతీయ చిన్న చిన్న పార్టీల కూడా ఏదోరకంగా తమ ఆధిక్యతను చాటుకోవాలనే యత్నం చేస్తుండటం విశేషం . (చదవండి: "పనౌటీ" దుమారం! మోదీని 'దురదృష్టం'తో పోలుస్తూ వ్యాఖ్యలు!) -
రాజస్థాన్ ఎన్నికలు: కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కీలక వ్యాఖ్యలు
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సీనియర్ నేత మాజీ డిప్యూటీ స్పీకర్ సచిన్ పైలట్ మధ్య నెలకొన్న టెన్షన్ నేపథ్యంలో పైలట్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లో గత 30 ఏళ్లుగా ఎన్నికల్లో వరుసగా ఎందుకు గెలవ లేకపోతున్నామో కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పైలట్ మాట్లాడుతూ రాజస్థాన్‌లో 30 ఏళ్లుగా వరుసగా ఎన్నికల్లో గెలుపొందలేదు. దీనికి కారణం ఏంటి అనే దానిపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. అయితే ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ దీన్ని బ్రేక్ చేస్తుందని పేర్కొనడం గమనార్హం. రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం చేశారు. సామాజిక సంక్షేమం , పెట్టుబడులు, సంపద సృష్టిపై దృష్టిపెట్టాం. అసమాతనలు లేని రాజస్థాన్ కావాలి. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. అలాగే బీజేపీ "డబుల్ ఇంజిన్" ప్రభుత్వంపై కూడా మండిపడ్డారు. రాష్ట్ర అగ్ర నాయకత్వం మధ్య విభేదాలపై స్పందిస్తూ తాము సమిష్టిగా ఎన్నికల్లో పోరాడతామని, ఇక పదవులు ఎంపిక హైకమాండ్ చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. అలాగే పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సలహా మేరకు తాను ‘క్షమించండి, మరచిపోయి ముందుకు సాగండి’ ఈ మంత్రాన్ని అనుసరిస్తున్నట్లు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పైలట్ తెలిపారు. అశోక్ గెహ్లాట్‌ని ఉద్దేశించి గతంలో చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ గతంలో తానేం మాట్లాడినా దానికి బాధ్యత వహిస్తాననీ, రాజకీయ చర్చల్లో గౌరవాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు. కాగా గత కొన్ని ఎన్నికల్లో రాజస్థాన్ అధికార పీఠం బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య హోరీ హోరీ పోరు ఉంటుంది. ఒకసారి బీజేపీ పైచేయి సాధిస్తే, తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంటోంది. ఇపుడు రాజకీయ విశ్లేషకులు ఈ లెక్కల్ని నిశితంగా గమనిస్తున్నారు. రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 25న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు, అధికారం చేపట్టిన పార్టీలు 1993 - బీజీపీ 1998 - కాంగ్రెస్ 2003 - బీజేపీ 2008 - కాంగ్రెస్ 2013 - బీజేపీ 2018 - కాంగ్రెస్ -
ఆ సీఎం "మాయగాడు"! అతని 'రెడ్ డైరీ'లో ప్రతీ పేజీ..
ప్రధాని నరేంద్ర మోదీ రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గెహ్లోత్ ఓ మాయాగాడు అంటూ ఫైర్ అయ్యారు. అతను రాష్ట్రంలో తుపాకులకే ఎక్కువ పనిచెప్పాడని విమర్శించారు. అతని రెడ్‌డైరి తన దగ్గరుందని అందులోని ప్రతి పేజీ గురించి చెబితే.. దెబ్బకు గెహ్లోత్ ముఖం మాడిపోవడం ఖాయం అని ఆరోపణలు చేశారు. ఈ మేరకు రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో నేపథ్యంలో బరాసన్ అంటాలో జరిగిన ప్రచారా ర్యాలీలో మోదీ ముఖ్యమంత్రి గెహ్లోత్‌పై ఈవిధమైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ రెడ్ డైరీలో..ఐదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాజస్తాన్‌లోని ప్రతి భూమి, నీరు, అడవి ఎలా అమ్ముపోయాయో అనే వివరాలు ఉన్నాయని, అందుకు సంబంధించిన పూర్తి డాక్యుమెంటేషన్ తన దగ్గర ఉందన్నారు. ముఖ్యంగా గెహ్లోత్ పాలనలో జరిగిన నేరారోపణలకు సంబంధించిన సమాచారం అంతా ఉందన్నారు . అందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవ్వడం గమనార్హం. ఈ సందర్భంగా మోదీ జూలైలో జరిగిన అసెంబ్లీ సమావేశం గురించి గుర్తుకు తెచ్చుకున్నారు. ఆ సమావేశంలో అప్పటి రాష్ట్ర మంత్రి రాజేంద్ర సింగ్ మహిళల భద్రతా అంశాన్ని లెవనెత్తారు. మణిపూర్‌లో మహిళలపై జరిగిన నేరాల విషయమై ఆత్మపరిశీలన చేసకోవాలని చురకలంటించారు. అంతే ఆ తర్వాత కొన్ని గంటల్లోనే గెహ్లోత్ ప్రభుత్వం ఆయన్ను తొలగించిందంటూ చెప్పుకొచ్చారు. అంతేగాదు ఆయన హాయాంలో జరిగిన అవినీతి గురించి కూడా ప్రస్తావించారు మోదీ. కాంగ్రెస్ అంటే అవినీతి, రాజవంశం, బుజ్జగింపులకు చిహ్నం అంటూ ఎద్దేవా చేశారు. నిజానికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయ్యింది. ప్రస్తుతం మన ముందు అభివృద్ధి చెందిన భారత్‌గా తీర్చిదిద్దడమేనదే లక్ష్యం, కానీ రాజస్తాన్ అభివృద్ధి చెందకుండా అభివృద్ధి చెందిన భారత్‌గా మార్చడమనే లక్ష్యం ఎలా సంపూర్ణమవుతుందన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కి చిహ్నం అయినా ఆ మూడే.. దేశానికి అతిపెద్ద శత్రువులని, అవి మన మధ్య ఉన్నంతవరకు అభివృద్ధి చెందిన భారత్‌గా ఎలా మార్చగలం అని నిలదీశారు. ఇంకా మోదీ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీలోని ప్రతిఒక్కరూ సంయమనం లేనివారనని తిట్టిపోశారు. అది మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఒకేలా ప్రవర్తిస్తారని, ఈ విషయంలో ప్రజలు సైతం చిరాకుపడుతున్నారంటూ చివాట్లు పెట్టారు. కాగా, కరణ్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కునార్ అకాల మరణంతో ఆ నియోజక వర్గంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అందువల్ల 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్తాన్‌లో ప్రస్తుతం 199 స్థానాలకే అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 200 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ 99 సీటులు దక్కించుకోగా, బీజేపీ 73 సీట్లు గెలుపొందింది. దీంతో కాంగ్రెస్ పార్టీ చివరికి బీఎస్పీ ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతు కూడగట్టుకుని గెహ్లోత్‌ని సీఎంగా ప్రమాణం స్వీకారం చేయించింది . (చదవండి: అసెంబ్లీ ఎన్నికల కోసం ఒకే ఎత్తుగడతో ఇరు పార్టీలు! ఏది హిట్ అవుతుందో?)