ఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కుమారుడు వైభవ్ గహ్లోత్ నేడు ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. విదేశీ మారకద్రవ్య ఉల్లంఘన కేసులో ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ వైభవ్ గెహ్లోత్‌కు ఈడీ ఇటీవల సమన్లు జారీ చేసింది.
ఆగస్టులో జైపూర్, ఉదయ్‌పూర్, ముంబయి, ఢిల్లీలోని పలు ప్రదేశాలలో మూడు రోజుల పాటు ఈడీ దాడులు చేసింది. రాజస్థాన్ ఆధారిత హాస్పిటాలిటీ గ్రూప్ ట్రిటన్ హోటల్స్ & రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సహా వర్ధ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల డైరెక్టర్లు, ప్రమోటర్లు శివ శంకర్ శర్మ, రతన్ కాంత్ శర్మ తదితరులపై ఈడీ ఇటీవల దాడులు జరిపింది. వైభవ్ గెహ్లాట్‌తో వ్యాపారవేత్త రతన్ కాంత్ శర్మకు సంబంధాలు ఉన్నాయని గుర్తించినట్లు ఈడీ ఆరోపించింది. ఈ పరిణామాల అనంతరం వైభవ్ గహ్లోత్‌కు కూడా సమన్లు జారీ చేసింది. కాగా.. గతంలో రతన్ కాంత్ శర్మ కార్ రెంటల్ కంపెనీలో వైభవ్ గెహ్లోత్ వ్యాపార భాగస్వామిగా ఉన్నారు.
రాజస్థాన్‌లో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైభవ్ గహ్లోత్‌పై ఈడీ దాడులు చేయడంతో కాంగ్రెస్ విమర్శలకు దిగింది. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమే ఈడీ దాడులు అని ఆరోపిస్తోంది.
ఇదీ చదవండి: శివసేన, ఎన్సీపీ అనర్హత పటిషన్‌లపై స్పీకర్‌కు సుప్రీంకోర్టు తుది గడువు
Comments
Please login to add a commentAdd a comment