forex
-
క్షీణిస్తున్న ఫారెక్స్ నిల్వలు.. కారణాలు
భారత విదేశీ మారక నిల్వలు(ఫారెక్స్ రిజర్వ్‌లు) భారీగా క్షీణిస్తున్నాయి. నవంబరు 15తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 17.76 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.44 లక్షల కోట్లు) తగ్గి 657.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.55.31 లక్షల కోట్ల)కు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేర్కొంది. అంతకుముందు ఇవి 6.477 బిలియన్ డాలర్లు క్షీణించి 675.6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అందుకు అంతర్జాతీయంగా కొన్ని కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.యూఎస్ డాలర్ పెరుగుదల: అమెరికా ఎన్నికల ప్రచార సమయం వరకు స్థిరంగా కదలాడిన డాలర్, ఫలితాల తర్వాత ఊపందుకుంది. దాంతో రూపాయి విలువ పడిపోయింది. ఫలితంగా దేశీయ పారెక్స్ నిల్వలు తగ్గిపోతున్నాయి.పెరుగుతున్న దిగుమతులు: దేశీయ దిగుమతులు అధికమవుతున్నాయి. విదేశీ వస్తువులను దిగుమతి చేసుకునేందుకు ఆయా ఉత్పత్తులకు డాలర్లలోనే చెల్లించాలి.ఆర్బీఐ: మార్కెట్ ఒత్తిళ్ల మధ్య రూపాయికి మద్దతుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వద్ద ఉన్న ఫారెక్స్ నిల్వలను విక్రయిస్తోంది. రూపాయి మరింత పడిపోకుండా చర్యలు తీసుకుంటోంది. డాలర్-రూపీ మార్కెట్ అస్థిరతను తగ్గించడానికి ఇది దోహదపడుతోంది.ఇదీ చదవండి: అదానీ కంపెనీల రేటింగ్ తగ్గింపువిదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) అమ్మకాలు: విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్స్, బాండ్లను విక్రయించడంతో స్థానిక ఈక్విటీ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. నవంబర్‌లో ఇప్పటి వరకు దాదాపు 4 బిలియన్ డాలర్ల(రూ.33 వేలకోట్లు)కు పైగా అమ్మకాలు చేపట్టారు.ఫెడరల్ రిజర్వ్ విధానాలు: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ఇటీవల కాలంలో కీలక వడ్డీరేట్లను 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దాంతో భారత ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన విదేశీ పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలను ఉపసంహరిస్తున్నారు. -
గరిష్ఠాలను చేరిన ఫారెక్స్ నిల్వలు
భారత విదేశీ మారక నిల్వలు జీవితకాల గరిష్ఠాలను చేరాయి. ఆగస్టు 30 నాటికి దేశ ఫారెక్స్ నిల్వలు 689.24 బిలియన్ డాలర్ల(సుమారు రూ.57 లక్షల కోట్లు)కు చేరుకున్నాయి. ఈ నిల్వలు లెక్కించే ముందు వారంలో ఏకంగా 5.2 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.40 వేలకోట్లు) ఎగసి ఆల్ టైం హైను తాకాయి. ఈమేరకు తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాలు వెల్లడించింది.ఇదీ చదవండి: డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమతో భారీగా ఉద్యోగాలుఆర్బీఐ విడుదల చేసిన ‘వీక్లీ స్టాటిస్టికల్ సప్లిమెంట్’ ప్రకారం..విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్సీఏ) 5.10 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.40 వేలకోట్లు) పెరిగి 604.1 బిలియన్ డాలర్ల(రూ.48 లక్షల కోట్లు)కు చేరుకున్నాయి. బంగారం నిల్వలు 129 మిలియన్ డాలర్లు(రూ.వెయ్యి కోట్లు) పెరిగి 61.98 బిలియన్ డాలర్ల(రూ.4.9 లక్షల కోట్లు)కు చేరుకున్నాయి. ఐఎంఎఫ్‌లో నమోదైన దేశాలతో వర్తకం చేసుకునేందుకు వీలుగా ఉంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ విలువ వారంలో 4 మిలియన్ డాలర్లు(రూ.33 కోట్లు) పెరిగి 18.47 బిలియన్ డాలర్లు(రూ.1.4 లక్షల కోట్లు)కు చేరుకున్నాయి. ఐఎంఎఫ్‌లో రిజర్వ్ స్థానం 9 మిలియన్ డాలర్లు(రూ.75 కోట్లు) పెరిగి 4.63 బిలియన్ డాలర్ల(రూ.37 వేలకోట్లు)కు చేరుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ప్లాట్‌ఫాంలపై నిఘా పెంచాలి..
న్యూఢిల్లీ: అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల విషయంలో అప్రమత్తత వహించాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. కొందరు వ్యక్తులు, సంస్థలు వీటిలో లావాదేవీలు నిర్వహించేందుకు నిధుల కోసం బ్యాంకింగ్ మాధ్యమాన్ని ఉపయోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ తరహా ప్లాట్‌ఫామ్‌లలో జరుగుతున్న మోసాలపై ఫిర్యాదులు వస్తుండటంతో వాటిల్లో ట్రేడింగ్ చేయరాదంటూ ఆర్బీఐ ఇప్పటికే సూచన జారీ చేసినట్లు దాస్ చెప్పారు. బార్సెలోనాలో జరిగిన ఎఫ్‌ఐఎంఎండీఏ–పీడీఏఐ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ అంశాలు వివరించారు. మరోవైపు, రూపీ డెరివేటివ్స్‌లో భారతీయ బ్యాంకుల పాత్ర మరింతగా పెరగాలని దాస్ సూచించారు. -
‘డాలర్’కు భారత్ అంటేనే ఇష్టం..!
నిరంతర వాణిజ్యం, కరెంట్ ఖాతా లోటు సమర్థంగా నిర్వహించడానికి ఐటీ రంగం కీలకంగా మారనుందని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ ఐటీ ఎగుమతులు మందగిస్తే దేశ ఫారెక్స్ నిల్వలు తరిగి అది రూపాయి విలువపై ప్రభావం చూపనుంది. ఐటీ రంగం పెద్ద మొత్తంలో ఫారెక్స్ ఆదాయాన్ని తీసుకురావడమే కాదు.. ఇతర ఎగుమతి ఆధారిత రంగాలతో పోలిస్తే ఇందులో ఫారెక్స్ వ్యయాలు కూడా తక్కువ. ఐటీ కంపెనీల ఫారెక్స్ ఖర్చులు వాటి ఎగుమతి ఆదాయంలో సగం కంటే తక్కువ ఉంటుందని అంచనా. మరోవైపు కార్పొరేట్ రంగంలో అతిపెద్ద ఎగుమతిదారులుగా ఉన్న ఆయిల్ అండ్ గ్యాస్, మైనింగ్ కంపెనీల ఫారెక్స్ ఖర్చులు వాటి ఫారెక్స్ ఆదాయాలను మించిపోతాయి. ఇటీవల స్టాక్‌మార్కెట్లు బాగా పుంజుకోవడంతో విదేశీ సంస్థాగత పెట్టుబడులు భారీగా భారత్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా మార్కెట్ సూచీలు జీవితకాల గరిష్ఠాలను చేరుతున్నాయి. ప్రధానంగా అమెరికాకు చెందిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఛైర్మన్ జెరొమ్‌పావెల్ కీలక వడ్డీరేట్లపై ఇటీవల చేసిన ప్రకటన మార్కెట్లకు దన్నుగా నిలుస్తోంది. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో ఎప్పటినుంచో అనిశ్చితి కొనసాగుతున్న ఐటీ స్టాక్‌లు భారీగా ర్యాలీ అవుతున్నాయి. ఐటీ కంపెనీలు అధికంగా డాలర్లలోనే వ్యాపారం సాగిస్తాయి. దాంతో భారత్‌లోని టాప్ కంపెనీల్లో ఎఫ్ఐఐలు అధికంగా పెట్టుబడి పెట్టడంతో దేశంలోని ఫారెక్స్ నిలువలు పెరిగినట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు. దేశంలోని విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు పెరిగాయి. ఈ నెల 15వ తేదీ కంటే ముందు వారానికి 9.11 బిలియన్ డాలర్లు(రూ.75 వేలకోట్లు) పెరుగుదలతో 615.97 బిలియన్ డాలర్లకు(రూ.51.2 లక్షల కోట్లు) ఫారెక్స్ నిల్వలు పెరిగాయని ఆర్బీఐ శుక్రవారం వెల్లడించింది. ఈ నెల 8వ తేదీ కంటే ముందు వారానికి ఫారెక్స్ నిల్వలు 2.82 బిలియన్ డాలర్లు(రూ.23 వేలకోట్లు) పుంజుకుని 606.86 బిలియన్ డాలర్లకు(రూ.50.5 లక్షల కోట్లు) చేరుకున్నాయి. విదేశీ కరెన్సీ నిల్వలు 8.35 బిలియన్ డాలర్లు(రూ.68 వేలకోట్లు) పెరిగి 545.05 బిలియన్ డాలర్ల(రూ.45 లక్షల కోట్లు) వద్దకు చేరాయి. బంగారం నిల్వలు 446 మిలియన్ డాలర్ల(రూ.3700 కోట్లు) పెరుగుదలతో 47.58 బిలియన్ డాలర్లు(రూ.4 లక్షల కోట్లు), స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 135 మిలియన్ డాలర్ల(రూ.1100 కోట్లు) నుంచి 18.32 బిలియన్ డాలర్లకు(రూ.1.5 లక్షల కోట్లు) పుంజుకున్నాయి. ఇదీ చదవండి: రాష్ట్రాలకు రూ.72,961 కోట్లు విడుదల.. ఎందుకంటే.. ఐఎంఎఫ్‌లో ఫారెక్స్ నిల్వలు 181 మిలియన్ డాలర్లు పెరిగి 5.02 బిలియన్ డాలర్లకు(రూ.41 వేల కోట్లు) చేరాయి. 2021 అక్టోబర్‌లో భారత ఫారెక్స్ నిల్వలు 645 బిలియన్ల డాలర్ల(రూ.53 లక్షల కోట్లు) ఆల్ టైం రికార్డు నెలకొల్పాయి. అంతర్జాతీయ పరిణామాల కారణంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోతున్నపుడు ఆర్బీఐ బహిరంగ మార్కెట్లో డాలర్లను విక్రయిస్తూ రూపాయి విలువ మరింత పడిపోకుండా ఆదుకుంటుంది. -
ఈడీ ముందుకు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ కుమారుడు
ఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కుమారుడు వైభవ్ గహ్లోత్ నేడు ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. విదేశీ మారకద్రవ్య ఉల్లంఘన కేసులో ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ వైభవ్ గెహ్లోత్‌కు ఈడీ ఇటీవల సమన్లు జారీ చేసింది. ఆగస్టులో జైపూర్, ఉదయ్‌పూర్, ముంబయి, ఢిల్లీలోని పలు ప్రదేశాలలో మూడు రోజుల పాటు ఈడీ దాడులు చేసింది. రాజస్థాన్ ఆధారిత హాస్పిటాలిటీ గ్రూప్ ట్రిటన్ హోటల్స్ & రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సహా వర్ధ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల డైరెక్టర్లు, ప్రమోటర్లు శివ శంకర్ శర్మ, రతన్ కాంత్ శర్మ తదితరులపై ఈడీ ఇటీవల దాడులు జరిపింది. వైభవ్ గెహ్లాట్‌తో వ్యాపారవేత్త రతన్ కాంత్ శర్మకు సంబంధాలు ఉన్నాయని గుర్తించినట్లు ఈడీ ఆరోపించింది. ఈ పరిణామాల అనంతరం వైభవ్ గహ్లోత్‌కు కూడా సమన్లు జారీ చేసింది. కాగా.. గతంలో రతన్ కాంత్ శర్మ కార్ రెంటల్ కంపెనీలో వైభవ్ గెహ్లోత్ వ్యాపార భాగస్వామిగా ఉన్నారు. రాజస్థాన్‌లో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైభవ్ గహ్లోత్‌పై ఈడీ దాడులు చేయడంతో కాంగ్రెస్ విమర్శలకు దిగింది. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమే ఈడీ దాడులు అని ఆరోపిస్తోంది. ఇదీ చదవండి: శివసేన, ఎన్సీపీ అనర్హత పటిషన్లపై స్పీకర్‌కు సుప్రీంకోర్టు తుది గడువు -
కష్టకాలంలో శ్రీలంకకు మరోసారి అండగా నిలిచిన భారత్..!
శ్రీలంక త్రీవ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో భారత ప్రభుత్వం మరోసారి తన ఆపన్న హస్తం అందించింది. పెట్రోలియం ఉత్పత్తులు కొనుక్కోవడం కోసం ఆ దేశానికి 500 మిలియన్ డాలర్లను అప్పుగా ఆఫర్ చేసినట్లు కొలంబోలోని భారత హైకమిషన్ వెల్లడించింది. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, శ్రీలంక ఆర్థిక శాఖ మంత్రి బసిల్ రాజపక్స మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఈ నిర్ణయం వెలువడినట్లు పేర్కొంది. డిసెంబర్ చివరిలో 3.1 బిలియన్ డాలర్లకు కరెన్సీ నిల్వలు పడిపోవడంతో ఆ దేశం మీద రోజు రోజుకి ఒత్తిడి పెరిగిపోతుంది. నిల్వలను పెంచుకోవడానికి, రుణాన్ని తిరిగి చెల్లించడానికి శ్రీలంకకు 400 మిలియన్ డాలర్ల స్వాప్ ఆర్రేజ్ మెంట్ ను గత వారం భారతదేశం మంజూరు చేసింది. ఇప్పటికే భారత్ ఈ నెల మొదట్లో శ్రీలంకకు 900 మిలియన్ డాలర్ల ఫారెక్స్ సపోర్ట్ ను అందించిందని హైకమిషన్ తెలిపింది. శ్రీలంకలో విదేశీ మారక ద్రవ్యం కొరత కారణంగా ఆహారం, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫారెక్స్ సంక్షోభం కారణంగా ఇంధన రంగం దెబ్బతినడంతో నౌకాశ్రయంలో షిప్ మెంట్లు నిలిపివేయడంతో పాటు ఆ విద్యుత్ కోతలు విధించాల్సి వస్తుంది. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరగడం, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటడం, ప్రభుత్వ ఖజానా ఎండిపోవడంతో 2022 దివాళా సంవత్సరంగా మారబోతోందన్న భయాందోళనలు అక్కడ కొనసాగుతున్నాయి. ఆ దేశంలో ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే.. త్రీవ ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ఉద్యోగాలు పొగొట్టుకుని, ఉపాధి దొరక్క అక్కడి ప్రజలు తిరుగుతున్నారు. ఉద్యోగాలు పోగొట్టుకున్న వారు తమ అవసరాల కోసం బాకీలు చేయక తప్పడం లేదు. బాకీలు తీర్చే క్రమంలో కొన్ని కుటుంబాలు తిండి తినడం తగ్గించేస్తున్నాయి. ఒక్కరోజుకి సరిపడే సరుకుల్ని వారానికి సరిపెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన దుకాణాలు సైతం యాభై, వంద గ్రాముల స్థాయి ప్యాకింగ్‌లు సైతం సిద్ధమవుతున్నాయి అంటే మనం అర్ధం చేసుకోవచ్చు అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అనేది. (చదవండి: అనుకోకుండా అదృష్టం.. సెల్ఫీలతో కోటీశ్వరుడు అయ్యాడు) -
రూపాయికి ‘చమురు’ ఇంధనం!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా ఆరవరోజూ రికవరీ అయ్యింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ సోమవారం ముగింపుతో పోల్చితే 21 పైసలు బలపడింది. 71.46 వద్ద ముగిసింది. సోమవారం ముగింపు 71.67. మొత్తం ఆరు ట్రేడింగ్ సెషన్లలో 143 పైసలు బలపడింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరల భారీ పతనం, విదేశీ నిధుల ప్రవాహం కొనసాగుతుండడం వంటి అంశాలు రూపాయి బలోపేతానికి తక్షణ కారణాలు. అంతర్జాతీయ వృద్ధి మందగమనానికి అవకాశం ఉందని అమెరికా ఫెడ్ తాజా వ్యాఖ్యలు, దీనితో రెండు వారాల గరిష్ట స్థాయి నుంచి కిందకు జారిన డాలర్ ఇండెక్స్ రూపాయి సెంటిమెంట్‌ను బలపరుస్తున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ వ్యూహకర్త ఆనంద్ జేమ్స్ అభిప్రాయపడ్డారు. ఎగుమతిదారులు, బ్యాంకర్ల డాలర్ అమ్మకాలు, ట్రేడింగ్ ప్రారంభంతోనే రూపాయి పటిస్టంగా 71.39 వద్ద ప్రారంభమైంది. అటు తర్వాత 71.27కూ బలపడింది. అక్టోబర్ 9న రూపాయి చరిత్రాత్మక కనిష్టం 74.39కి పడింది. అటు తర్వాత క్రమంగా ప్రస్తుత స్థాయికి రికవరీ అయ్యింది. క్రూడ్ భారీ పతనం... తాజా గణాంకాలు చూస్తే, అంతర్జాతీయ మార్కెట్– నైమెక్స్‌లో లైట్ స్వీట్క్రూడ్ బ్యారల్ ధర ఈ వార్త రాసే సమయానికి కీలక మద్దతు 55.40 స్థాయిని కోల్పోయింది. (ఈ స్థాయిని అధిగమించడానికి దాదాపు ఏడాదిన్నర పట్టింది). ఐదు శాతానికి పైగా పతనంతో 53.66కు పతనం అయ్యింది. ఈ ఏడాది డబ్ల్యూటీఐ క్రూడ్ ఫ్యూచర్స్ గరిష్టస్థాయి 76.90. ఇక భారత్ ప్రధానంగా దిగుమతి చేసుకునే బ్రెంట్ క్రూడ్ ఈ ఏడాది గరిష్టస్థాయి 86.74. అయితే నెమ్మదిగా కిందకు దిగుతూ, మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఐదుశాతానికి పైగా పతనమై 63.12ను తాకింది. ఇక ఈ వార్త రాసే రాత్రి 10 గంటలకు ఆరు దేశాల కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ 96.51 వద్ద ట్రేడవుతుండగా, డాలర్ మారకంలో రూపాయి విలువ 71.45 వద్ద ట్రేడవుతోంది. -
రూపాయికి ఫుల్ జోష్
ముంబై: ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ దూసుకెళ్లింది. శుక్రవారం ఒకే రోజు డాలర్‌తో 100 పైసలు బలపడి 72.45కు వచ్చేసింది. గడిచిన ఐదేళ్లలో (2013 సెప్టెంబర్ తర్వాత) రూపాయి ఒకే రోజు ఇంతగా లాభపడిన సందర్భం ఇదే. చమురు ధరలు శాంతించడం, ఇరాన్ నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్‌కు అమెరికా మినహాయింపునిచ్చే అవకాశాలు, ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల రాక రూపాయిని బలపడేలా చేశాయి. గురువారం కూడా రూపాయి 50 పైసలు పెరగడంతో రెండు రోజుల్లోనే మొత్తం 150 పైసల మేర లాభపడినట్టయింది. తొలుత ఫారెక్స్ మార్కెట్లో 73.14 వద్ద రూపాయి ట్రేడింగ్ ఆరంభం కాగా, ఇంట్రాడేలో 72.43 వరకు రికవరీ అయింది. చమురు ధరలు దిగిరావడంతో కరెంటు ఖాతా లోటుపై ఆందోళనలు చల్లబడడం రూపాయికి జోష్‌నిచ్చాయి. బ్రెంట్ క్రూడ్ గత నెలలో 86.74 డాలర్ల స్థాయి వరకు వెళ్లగా, తాజాగా 73 డాలర్ల దిగువకు రావడం గమనార్హం. ‘‘చమురు ధరలు ఏడు నెలల కనిష్ట స్థాయికి వచ్చేశాయి. గరిష్ట ధర నుంచి 17 శాతం తగ్గాయి. ప్రధాన చమురు దేశాల నుంచి ఉత్పత్తి అధికం కావడం ఇందుకు తోడ్పడింది’’ అని ఓ విశ్లేషకుడు తెలిపారు. -
తగ్గిన ‘చమురు’ సెగ పెరిగిన రూపాయి విలువ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో గరిష్ట స్థాయిల నుంచి తగ్గిన క్రూడ్ ధర రూపాయి విలువకు కలిసివస్తోంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ శుక్రవారం 29 పైసలు బలపడింది. 73.32 వద్ద ముగిసింది. శుక్రవారం రూపాయి ట్రేడింగ్ 73.62 వద్ద ప్రారంభమైంది. అటు తర్వాత ఒకదశలో 73.31కి కూడా చేరింది.ఈ నెల 9వ తేదీన చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. ఈ కనిష్ట స్థాయిలను చూసిన తర్వాత రెండు రోజుల మినహా (సోమవారం, బుధవారం) మిగిలిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి (100 పైసలకు పైగా) రికవరీ అవుతూ వస్తున్న విషయం గమనార్హం. కారణాలు... ♦ అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో నాలుగున్నరేళ్ల గరిష్ట స్థాయి– 86.74ను తాకిన బేరల్ బ్రెంట్ క్రూడ్ ధర ప్రస్తుతం 80 స్థాయిలో ట్రేడవుతోంది. ♦ ఆరు దేశాల కరెన్సీలపై ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ 96పైన నిలబడలేకపోవడం రూపాయి సెంటిమెంట్‌ను కొంత బలపరుస్తోంది. ♦ శుక్రవారం ఈక్విటీ మార్కెట్ పతనమైనప్పటికీ, ఫారిన్ ఫండ్స్ రూ.140 కోట్ల విలువైన షేర్లు కొన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. -
రూపాయి... మూడు రోజుల ముచ్చట!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం మళ్లీ తిరోగమనం బాట పట్టింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో ఒకేరోజు 26 పైసలు పతనమయ్యింది. 73.83 వద్ద ముగిసింది. వరుసగా ఆరు రోజులు ఏ రోజుకారోజు కొత్త రికార్డులతో పతనం బాట పట్టిన రూపాయి, ఈ నెల 9వ తేదీన చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే అటు తర్వాత 10,11,12 తేదీల్లో వరుసగా 18, 09, 55 పైసలు చొప్పున మొత్తం 82 పైసలు బలపడింది. అయితే సోమవారం (15వ తేదీ) ట్రేడింగ్‌లో మళ్లీ 26 పైసలు పడిపోయింది. కారణాలు ఇవీ... క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా తీవ్ర స్థాయిలోనే కొనసాగుతుండటం, వాల్‌స్ట్రీట్ విలేకరి అదృశ్యానికి సంబంధించి అమెరికా – సౌదీ అరేబియాల మధ్య హఠాత్తుగా ఏర్పడిన ఉద్రిక్తతలు దీనికి నేపథ్యం. సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే రూపాయి కనిష్ట స్థాయిలో 73.80 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 74.07 వద్దకూ జారింది. దిగుమతిదారుల నుంచి డాలర్‌కు పెద్ద ఎత్తున వచ్చిన డిమాండ్ దీనికి కారణం. దీనికితోడు దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ కూడా రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. -
రూపాయికి ‘రుచించని’ కేంద్రం చర్యలు
ముంబై: రూపాయి పతనాన్ని నిరోధించడానికి కేంద్రం శుక్రవారం తీసుకున్న పలు చర్యలు దేశీయ కరెన్సీపై సోమవారం సానుకూల ప్రభావాన్ని చూపించలేకపోయాయి. దేశీయంగా ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ ఒకేరోజు 67 పైసలు పతనమై 72.51 వద్ద ముగిసింది. శుక్రవారం ముగింపు 71.84. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల పెంపునకు ఐదు సూత్రాల ప్రణాళిక, దిగుమతుల తగ్గింపు సహా ఫారెక్స్ మార్కెట్ సెంటిమెంట్ మెరుగుదలకు శుక్రవారం కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంది. కానీ అవి ఫారెక్స్ మార్కెట్‌పై కానీ, ఈక్విటీ మార్కెట్‌పై కానీ సానుకూల ప్రభావాన్ని చూపించలేకపోయాయి. మార్కెట్ ప్రారంభంతోటే, 66 పైసలు నష్టంతో 72.50 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 72.70 – 72.30 స్థాయిలో తిరిగింది. రెండు రోజుల తర్వాత మళ్లీ నీరసం... ♦ రూపాయి గత మంగళవారం (11న) ఆల్‌టైమ్ కనిష్టం 72.92 స్థాయిని చూసింది. తర్వాత కోలుకుని చివరకు 72.69 వద్ద ముగిసింది. ♦ బుధవారం (12వ తేదీ) ట్రేడింగ్‌లో 51 పైసలు లాభపడి 72.18కి రికవరీ అయ్యింది. ♦ బుధవారం ముగింపుతో పోలిస్తే (గురువారం ఫారెక్స్ మార్కెట్ సెలవు) శుక్రవారం 34 పైసలు బలపడి 71.84 వద్ద ముగిసింది. ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు బాగుండడం, రూపాయి పటిష్టతకు కేంద్రం చర్యలు తీసుకోనుందన్న వార్తలు దీనికి నేపథ్యం. ♦ అయితే రెండు రోజుల పురోగమనానికి సోమవారం మళ్లీ బ్రేక్ పడింది. ♦ క్రూడ్ ధరల తీవ్రత, వాణిజ్య యుద్ధం వంటి అంశాలు దేశీయ కరెన్సీపై ప్రభావం చూపుతున్నాయి. గడచిన పక్షం రోజుల్లో దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు దాదాపు రూ.9,400 కోట్లు (1.3 బిలియన్ డాలర్లు) వెనక్కు తీసుకోవడం కూడా ప్రస్తావనాంశం. రూపీ బాండ్లకు పన్ను మినహాయింపు రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్థిక మంత్రి జైట్లీ సోమవారం మరో కీలక ప్రకటన చేశారు. భారత కంపెనీలు నిధుల సమీకరణలో భాగంగా ఇతర దేశాలలో జారీ చేసే రూపీ–డినామినేటెడ్ బాండ్ల వడ్డీపై పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. తద్వారా దేశీ కంపెనీల బాండ్ల కొనుగోలు పెరిగి విదేశీ నిధుల ప్రవాహం జోరందుకుంటుందని, రూపాయి బలపడేందుకు ఆస్కారం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈనెల 17 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 మధ్యలో జారీ అయ్యే బాండ్లపై మినహాయింపు వర్తిస్తుందన్నారు. ‘దేశీ కంపెనీలు, బిజినెస్ ట్రస్ట్‌లు నాన్‌రెసిడెంట్స్‌కు జారీ చేసే రూపీ–డినామినేటెడ్ బాండ్లపై చెల్లించే వడ్డీపై పూర్తి మినహాయింపును ప్రకటిస్తున్నాం. ఈ నిర్ణయం నేపథ్యంలో కంపెనీలు ఆదాయపన్ను చట్టం 194ఎల్సీ ప్రకారం ఈ తరహా బాండ్ల వడ్డీ చెల్లింపుపై డిడెక్షన్ చేయాల్సిన అవసరం ఉండదు.’ అని వ్యాఖ్యానించారు. -
రూపాయి మద్దతు.. మార్కెట్‌కు ఊతం!
జారుడు బల్లపై ప్రయాణం చేస్తున్న రూపాయి దిశను మార్చే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గత శుక్రవారం ప్రకటించిన పలు అంశాల ప్రభావం సోమవారం మార్కెట్ కదలికలలో స్పష్టంగా కనిపించనుందని మార్కెట్ పండితులు భావిస్తున్నారు. కరెంట్ ఖాతా లోటు అదుపులో ఉంచడం, విదేశీ నిధుల ప్రవాహం గణనీయంగా పెరిగేలా చూడటంలో భాగంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన అంశాలు ఈవారంలో మార్కెట్‌ను నడిపించనున్నాయని డెల్టా గ్లోబల్ పాట్నర్స్ ప్రిన్సిపల్ పాట్నర్ దేవేంద్ర నెవ్గి అన్నారు. మసాలా బాండ్లపై విత్‌హోల్డింగ్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం, అత్యవసరం కాని దిగుమతుల కట్టడి, ఎగుమతుల ప్రోత్సాహం వంటి ప్రభుత్వ ప్రకటనలు ఈవారంలో మార్కెట్‌కు సానుకూలంగా ఉండనున్నాయని భావిస్తున్నారు. సూచీలకు నూతన ఉత్తేజం ఇవ్వనుందని అంచనావేశారు. నిఫ్టీ 11,760 పాయింట్లను అధిగమించితే అప్‌ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని విశ్లేషించారు. దిగువస్థాయిలో 11,431–11,250 శ్రేణి మద్దతుగా వెల్లడించారు. ఇక గురువారం (సెప్టెంబరు 20న) మొహర్రం సందర్భంగా మార్కెట్లకు సెలవు. ఈ వారంలో ట్రేడింగ్ 4 రోజులకే పరిమితంకానుంది. పెరిగిన వాణిజ్య యుద్ధ భయాలు కొత్తగా మరో 200 బిలియన్ డాలర్ల చైనా దిగుమతులపై సుంకాలను విధించాలనే నిర్ణయానికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొగ్గు చూపుతున్న నేపథ్యంలో అమెరికా–చైనా మధ్య సయోధ్య కుదిరి వాణిజ్య యుద్ధ భయాలు తొలగిపోతాయనే అశావాహ పరిస్థితి ఇక లేనట్లే అని మార్కెట్ వర్గాల్లో తేటతెల్లమైపోయింది. సోమవారం నుంచే నూతన టారిఫ్‌లు అమలయ్యే అవకాశం ఉండడంతో మార్కెట్ ట్రెండ్‌పై ప్రతికూల అంచనాలు వెలువడుతున్నాయి. ‘ప్రభుత్వం ప్రకటించిన రూపాయి స్థిరీకరణ చర్యలు స్వల్పకాలంలో సానుకూల ఫలితాలనే ఇస్తాయని భావిస్తున్నాం. అయితే, దేశంలోకి వచ్చే నిధుల ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోతుందని మాత్రం అనుకోవడం లేదు. ఇక ఈవారం మార్కెట్ ట్రెండ్ విషయానికి వస్తే.. మరింత ముదిరిన వాణిజ్య యుద్ధ భయాలు, పెరిగిన ముడిచమురు ధరలు, బలహీనపడిన రూపాయి విలువ వంటి ప్రతికూల అంశాలు కలవరపెడుతున్నాయి.’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. మరిన్ని చర్యలు అవసరం... రూపాయి పతనాన్ని అడ్డుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పలు చర్యలు తాత్కాలికంగానే ఉండనున్నాయని ఫారెక్స్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ‘గతవారంలో 72.91 వద్దకు పతనమైపోయిన రూపాయి విలువను నిలబెట్టడంలో మాత్రమే ప్రభుత్వ నిర్ణయాలు సహకరిస్తాయి. విదేశీ నిధుల ప్రవాహం కేవలం స్థిరీకరణ చేస్తుందే తప్పించి విలువను బలపరచలేదు. అమెరికా డాలరుతో అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీ విలువల కదలికలు, ముడిచమురు ధరల దిశ, ఆర్బీఐ జోక్యం ఇకమీదట రూపాయి విలువను నిర్ణయించనున్నాయి. రూపాయి విలువ బలపడాలి అంటే ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలి. ఈవారంలో 71.50–73 శ్రేణిలో కదలికలు ఉండవచ్చని అంచనావేస్తున్నాం.’ అని కొటక్ సెక్యూరిటీస్ కరెన్సీ విభాగం డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ అనింద్య బెనర్జీ వెల్లడించారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ముడిచమురు ధరల పెరుగుదల, రూపాయి విలువ క్షీణత కారణంగా గడిచిన తొమ్మిది ట్రేడింగ్ సెషన్లలో విదేశీ పెట్టుబడిదారులు క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.9,400 కోట్లను వెనక్కు తీసుకున్నారు. డిపాజిటరీ డేటా ప్రకారం సెప్టెంబరు 3–14 మధ్యకాలంలో పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.4,318 కోట్లు.. డెట్ మార్కెట్ నుంచి రూ.5,088 కోట్లు ఎఫ్‌పీఐలు వెనక్కు తీసుకున్నారు. -
వారం గరిష్టానికి రూపాయి
ముంబై: డాలర్ మారకంలో పడుతూ వస్తున్న రూపాయి శుక్రవారం కొంత రికవరీ అయ్యింది. బుధవారం ముగింపుతో పోల్చితే (గురువారం ఫారెక్స్ మార్కెట్ సెలవు) 34 పైసలు బలపడి 71.84 వద్ద ముగిసింది. దేశీయంగా ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం రూపాయి ఒక దశలో 71.53 స్థాయిని కూడా తాకింది. రూపాయి మంగళవారం ట్రేడింగ్‌లో ఆల్‌టైమ్ కనిష్టం 72.92 స్థాయిని చూసింది. అటు తర్వాత కొంత కోలుకుని చివరకు 72.69 వద్ద ముగిసింది. అయితే బుధవారం ట్రేడింగ్‌లో 51 పైసలు లాభపడి 72.18కి రికవరీ అయ్యింది. శుక్రవారమూ రికవరీ ధోరణినే కొనసాగించి, మరో 34 పైసలు లాభపడింది. కారణాలు ఇవీ... దేశంలో అటు టోకు, ఇక రిటైల్ ద్రవ్యోల్బణం (ఆగస్టులో వరుసగా 3.69%, 4.53 శాతం) పరిస్థితి మెరుగ్గా ఉండడం, పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (జూలైలో 6.6 శాతం వృద్ధి) మెరుగ్గా ఉండడం దీనికి ప్రధాన కారణాలు. ఆరు దేశాల కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ సైతం కీలక స్థాయి 95 దిగువకు పడిపోవడం కూడా రూపాయి సెంటిమెంట్‌ను బలపరిచింది. ఆయా అంశాలు డాలర్ అమ్మకాలకూ దారితీసింది. రూపాయి స్థిరీకరణకు కేంద్రం, ఆర్భీఐ నుంచి చొరవ ప్రారంభమయినట్లు సమాచారం. ఈ వార్త రాసే రాత్రి 9 గంటల సమయానికి అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ 94.80 వద్ద ట్రేడవుతుండగా, డాలర్ మారకంలో రూపాయి విలువ 71.80 వద్ద ట్రేడవుతోంది. రూపాయిపై మరింతగా దృష్టి పెట్టాలి: రతిన్ రాయ్ రూపాయి మారకం విలువ తీవ్ర స్థాయిలో పతనమైన నేపథ్యంలో దీనిపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) సభ్యుడు రతిన్ రాయ్ అభిప్రాయపడ్డారు. సాధారణంగా డాలర్‌తో పోలిస్తే వార్షికంగా రూపాయి 4–6 శాతం క్షీణించడం కొంత మేర సమంజసమైన స్థాయిగానే భావించవచ్చని.. కానీ ప్రస్తుత పతనం ఈ పరిమితిని అసాధారణంగా దాటేసిందని ఆయన ఒక బ్లాగ్‌లో పేర్కొన్నారు. అయితే, ఇప్పటిదాకా రూపాయి మారకం విలువ నిర్వహణ సరిగ్గానే కొనసాగిందన్నారు. రూపాయి ఈ ఏడాది ఇప్పటిదాకా ఏకంగా 13% క్షీణించింది, ప్రధాని మోదీ ఆర్థిక సమీక్ష నేపథ్యంలో రాయ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
రూపాయి మరింత డౌన్...
ముంబై: అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధభయాలు, పెరుగుతున్న ముడిచమురు రేట్లు, తరలిపోతున్న విదేశీ పెట్టుబడుల మధ్య రూపాయి రోజురోజుకీ కొత్త కనిష్ట స్థాయులకు పడిపోతోంది. డాలర్‌తో పోలిస్తే మంగళవారం మరో 24 పైసలు క్షీణించి ఇంకో రికార్డు కనిష్ట స్థాయి 72.69 వద్ద క్లోజయ్యింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ ఉదయం సెషన్లో కాస్త ఆశావహంగా మొదలై 72.25 గరిష్ట స్థాయిని తాకినప్పటికీ .. ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది. ఇంట్రాడేలో 72.74 స్థాయికి పడిపోయింది. అయితే, రిజర్వ్ బ్యాంక్ జోక్యంతో కొంత కోలుకుని చివరికి 0.33 శాతం నష్టంతో 72.69 వద్ద ముగిసింది. కీలకమైన వర్ధమాన దేశాల్లో అమ్మకాల ఒత్తిడి, అది మిగతా దేశాలకు వ్యాప్తి చెందే అవకాశాల తీవ్రతపైనే ప్రభుత్వం విధానపరంగా ఏదైనా నిర్ణయం తీసుకోవడమన్నది. ఆధారపడి ఉంటుందని డీలర్లు అభిప్రాయపడ్డారు. అర్జెంటీనా పెసో, టర్కిష్ లీరా సంక్షోభ ప్రభావం ఆసియా దేశాల కరెన్సీలపై గణనీయంగా ఉంటోందని తెలిపారు. ఇక విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు జరుపుతుండటం, 2019 సార్వత్రిక ఎన్నికలపై రాజకీయంగా కొంత అనిశ్చితి నెలకొనడం సైతం ఫారెక్స్ మార్కెట్ సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం చూపుతోందని వివరించారు. -
జారుడు బల్లపై రూపాయి!
ముంబై/న్యూఢిల్లీ: డాలర్ బలం ముందు రూపాయి చిన్నబోతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య ఘర్షణలు, దేశ స్థూల ఆర్థిక పరిస్థితులపై ఆందోళనలతో రూపాయి వరుసగా ఐదో రోజూ క్షీణించింది. మంగళవారం ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 37 పైసలు తగ్గి 71.58 వద్ద స్థిరపడింది. రూపాయికి ఇది నూతన జీవితకాల కనిష్ట స్థాయి ముగింపు. క్రితం ముగింపు 71.21తో పోలిస్తే ఇంట్రాడేలో రూపాయి కాస్త నిలదొక్కుకుని 71.09 వరకు చేరుకున్నప్పటికీ, ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో నష్టపోయింది. మంగళవారం ప్రారంభంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 79 డాలర్లు దాటిపోయింది. దీంతో దేశ చమురు దిగుమతుల భారం పెరిగి కరెంటు ఖాతా లోటు, ద్రవ్యలోటు మరింత పెరుగుతాయన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఇది రూపాయిపై ఒత్తిళ్లను పెంచుతోంది. రూపాయి దానికదే స్థిరపడాలి రూపాయి దానికదే స్థిరపడాల్సి ఉందని, కరెన్సీ క్షీణతకు దేశీయ అంశాలు కారణం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదల, వాణిజ్య యుద్ధ భయాలే రూపాయి క్షీణతకు ప్రధాన కారణాలని, వీటిపై ప్రభుత్వ నియంత్రణ ఉండదని కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. రూపాయి క్షీణతతో దేశ కరెంటు అకౌంటు లోటు కట్టుతప్పే ప్రమాదం ఉంటుంది. చమురు అవసరాల్లో 81 శాతం దిగుమతులే కావడం ప్రధానంగా ఈ లోటునకు కారణం. మరింత పడుతుంది: ఎస్బీఐ రూపాయి డాలర్ మారకంతో ఇంకొంత పడిపోవచ్చని ఎస్బీఐ ఎకోరాప్ నివేదిక పేర్కొంది. దీంతో రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు చర్యను అనుసరించాల్సి రావచ్చని అభిప్రాయపడింది. రూపాయి మంగళవారం 37 పైసలు నష్టపోయి నూతన గరిష్ట స్థాయి 71.58కి చేరిన నేపథ్యంలో ఎస్బీఐ నివేదిక పేర్కొన్న అంశాలకు ప్రాధాన్యం నెలకొంది. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ ఇంత వరకు చేసిన ప్రయత్నాలు ఫలితం ఇవ్వకపోవడంతో, ఫారెక్స్ మార్కెట్ విషయంలో ఆర్బీఐ ప్రస్తుతానికి జోక్యం చేసుకోకుండా ఉండే విధానాన్ని అనుసరించొచ్చని ఎస్బీఐ ఎకోరాప్ అంచనా వేసింది. ‘‘జూన్‌లో ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచిన దగ్గర్నుంచి రూపాయి 6.2 శాతం మేర పడిపోయింది. డాలర్ బలోపేతం కారణంగానే రూపాయి క్షీణిస్తున్నప్పటికీ, ఇది ఇక ముందూ కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం’’ అని ఎస్బీఐ నివేదిక తెలియజేసింది. -
71.21కి జారిపోయిన రూపాయి
ముంబై: దేశీ కరెన్సీ రూపాయి మరింత బక్కచిక్కిపోతోంది. తాజాగా సోమవారం ఫారెక్స్ మార్కెట్లో నూతన జీవితకాల కనిష్టానికి పడిపోయింది. డాలర్ మారకంలో 21 పైసలు నష్టపోయి 71.21 వద్ద నిలిచింది. పెరుగుతున్న ముడి చమురు ధరలు, వాణిజ్య యుద్ధ భయాలు మరోసారి ఫారెక్స్ మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపించాయి. జీడీపీ గణాంకాలకు తోడు సాంకేతిక దన్నుతో రూపాయి ఆరంభం గట్టిగానే ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా ఫారెక్స్ మార్కెట్లో పరిస్థితి మారిపోయింది. ఇన్వెస్టర్లలో భయం నెలకొనడంతో రూపాయి తన విలువను కోల్పోయింది. ప్రభుత్వం ఇన్వెస్టర్ల ఆందోళనలను తగ్గించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం ఇవ్వలేదు. ముఖ్యంగా బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్ 78 డాలర్లకు చేరడం ట్రేడింగ్ వాతావరణాన్ని మార్చేసింది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు నవంబర్ నుంచి అమల్లోకి వస్తే ఆ దేశం నుంచి చమురు ఉత్పత్తి తగ్గిపోయి, అది ధరలపై ప్రతిఫలిస్తుందన్న ఆందోళన పెరగడం చమురు ధరలకు ఆజ్యం పోయవచ్చని భావిస్తున్నారు. అమెరికా, ఒపెక్ నుంచి ఉత్పత్తి పెరిగినా అది పరిమితంగానే ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. దేశ జీడీపీ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 8.2 శాతానికి పెరిగిన విషయం గమనార్హం. నోట్ల రద్దు తర్వాత జీడీపీ వృద్ధి ఈ స్థాయిలో నమోదు కావడం సానుకూలమనే చెప్పుకోవాలి. అయినా రూపాయి పతనాన్ని ఇది నిలువరించలేకపోయింది. రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ ఇటీవలి కాలంలో వడ్డీ రేట్లు పెంపు, విదేశీ కరెన్సీ నిల్వలు పెంచుకోవడం తదితర చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అయినా గానీ, ఈ ఏడాది ఇప్పటి వరకు రూపాయి 11 శాతం మేర తన విలువను కోల్పోయింది. సోమవారం ఆసియాలో అత్యంత దారుణ పనితీరు రూపాయిదే. అస్థిర కరెన్సీ ఎగుమతులకు మంచిది కాదు: ఈఈపీసీ రూపాయి విలువ పతనం భారత ఎగుమతుల వృద్ధికి దోహదపడుతుందన్న అంచనాలకు విరుద్ధంగా ఇంజనీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈఈపీసీ) స్పందించింది. కరెన్సీ అస్థిరత అన్ని వేళలా ప్రయోజనాలు చేకూర్చలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ‘‘కరెన్సీ స్థిరంగా ఉంటేనే ఎగుమతులకు సానుకూలం. అంచనాల ఆధారంగా కొనుగోలు దారులతో వ్యవహారాలు నిర్వహించేందుకు వీలవుతుంది. అస్థిరతలు, ఆటుపోట్లన్నవి ఏ వైపు ఉన్నా కానీ దాంతో ఉపయోగం ఉండదు’’ అని ఈఈపీసీ ఇండియా చైర్మన్ రవి సెహగల్ తెలిపారు. దేశ ఇంజనీరింగ్ ఎగుమతుల వృద్ధి జూలైలో ఒక అంకె స్థాయి 9.4 శాతానికి తగ్గిపోయిందని ఈఈపీసీ తెలిపింది. అంతకుముందు నెలల్లో ఉన్న పెరుగుదల నుంచి పడిపోయినట్టు వివరించింది. -
బాబోయ్.. రూపాయ్
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం భారీగా కుదేలయ్యింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సే్ఛంజ్ (ఫారెక్స్) మార్కెట్లో రూపాయి విలువ ఎన్నడూ లేనంత కనిష్టానికి పడిపోయి 69.93 వద్ద ముగిసింది. శుక్రవారం ముగిసిన ధరతో పోల్చితే ఇది 110 పైసలు తక్కువ. గత శుక్రవారం రూపాయి ముగింపు ధర 68.83. అయితే సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో 41 పైసలు లాభంతో ప్రారంభమైంది. కానీ అక్కడ నిలదొక్కుకోలేక నష్టాల్లోకి జారిపోయింది. చివరకు 110 పైసలు (1.60 శాతం) నష్టంతో ముగిసింది. ఒకేరోజు రూపాయి ఈ స్థాయిలో పతనం కావడం ఐదేళ్లలో ఇదే తొలిసారి. 2013 ఆగస్టులో ఒకసారి ఒకేరోజు రూపాయి 148 పైసలు (2.4 శాతం) పడిపోయింది. రూపాయి పతనానికి సంబంధించి మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే... ♦ అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో ఆరు దేశాల కరెన్సీలతో (యూరో, జపాన్ యెన్, పౌండ్ స్టెర్లింగ్, కెనెడియన్ డాలర్, స్వీడిష్ క్రోనా, స్విస్ ఫ్రాంక్) ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ 88 స్థాయిని చూసిన తర్వాత క్రమంగా కోలుకుంటూ గత నాలుగు నెలలుగా 95 వద్ద తీవ్ర నిరోధాన్ని ఎదుర్కొంటూ వస్తోంది. అయితే అమెరికా 4 శాతంపైబడి జీడీపీ వృద్ధి నమోదు చేయటంతో గడచిన రెండు ట్రేడింగ్ సెషన్లలో 96 స్థాయి పైకి చేరింది. ఇది రూపాయి బలహీనతకు ఒక కారణంగా నిలిచింది. ♦ టర్కీ ఆర్థిక సంక్షోభ పరిస్థితులు భారత కరెన్సీ సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. ♦ ఆయా పరిస్థితుల్లో కరెన్సీ ట్రేడర్లలో కొంత ఆందోళన నెలకొంది. దేశీయ కరెన్సీని నిలబెట్టడానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి ఎటువంటి సంకేతాలూ అందకపోవడంతో రూపాయి పతనం వేగంగా జరిగింది. బ్యాంకర్లు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ♦ ఇక విదేశీ వ్యవస్థాగత పెట్టుబడులు (ఎఫ్ఐఐ) తగ్గడం, చమురు ధరలు పెరుగుతుండటం కూడా రూపాయి సానుకూల సెంటిమెంట్‌పై ఇప్పటికే తీవ్ర ప్రభావం చూపుతోంది. ♦ భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు ఏడు వారాల నుంచి క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఆగస్టు 3వ తేదీతో ముగిసిన వారంలో ఏడు నెలల కనిష్ట స్థాయి 402. 7 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. జూలై 27వ తేదీతో ముగిసిన వారంలో భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు 404.19 బిలియన్ డాలర్లు. ♦ బ్రిటన్ పౌండ్, యూరో, జపాన్ యెన్‌పై కూడా రూపాయి బలహీనపడింది. పౌండ్ స్టెర్లింగ్ 87.86 నుంచి 89.13కు పడిపోయింది. యూరో 78.83 నుంచి 79.52 స్థాయికి దిగింది. ఇక జపాన్ యెన్ 62.03 స్థాయి నుంచి 63.37కు పడింది. టర్కీ కరెన్సీ సంక్షోభం నేపథ్యంలో జపాన్ యెన్ పెట్టుబడులకు సురక్షిత అసెట్ హోదా పొందుతోంది. ♦ డాలర్ మారకంలో రూపాయి విలువ 71 వద్ద ఉండటమే భారత్ ఆర్థిక వ్యవస్థకు ప్రస్తుతం మంచిదని మాజీ చీఫ్ ఎకనమిక్ ఎడ్వైజర్ కౌశిక్ బసుసహా కొందరు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఎగుమతులకు ఇది మంచి పరిణామం అవుతుందని వారి అభిప్రాయం. ♦ అమెరికా డాలర్ మారకంలో రూపాయి విలువ ఈ ఏడాది దాదాపు 10 శాతం పతనమైంది. రెండేళ్ల క్రితం దాదాపు 68.90 స్థాయికి రూపాయి దిగినప్పుడు... 72కు చేరుతుందని ఊహాగానాలు వెలువడ్డాయి. దీనికి భిన్నంగా రూపాయి 63 స్థాయికి బలపడింది. ఇప్పుడు దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక ప్రతికూలతలు, అనిశ్చితుల నేపథ్యంలో తిరిగి భారీ పతన స్థాయిలను చూస్తోంది. -
రూపాయి బే‘జారు’!
ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థకు తాజాగా కరెన్సీ సెగ తగులుతున్నట్లు కనిపిస్తోంది. వరుసగా నాలుగవ రోజూ రూపాయి పతనం కొనసాగింది. సాయంత్రం ఐదు గంటలతో ముగిసే ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సే్ఛంజ్ (ఫారెక్స్) మార్కెట్ ట్రేడింగ్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 68.79 వద్ద ముగిసింది. రోజూవారీగా చూస్తే రూపాయి 18 పైసలు బలహీనపడింది. అంటే బుధవారం 68.61 వద్ద ముగిసిన రూపాయి 18 పైసలు బలహీనపడి 68.79 వద్ద ముగిసింది. 2016 నవంబర్ 24న రూపాయి ఆల్‌టైమ్ కనిష్టస్థాయి 68.73 వద్ద ముగిసింది. తర్వాత రూపాయి ఆ స్థాయికి చేరటం ఇదే. ఇప్పుడు అంతకన్నా తక్కువ స్థాయికి చేరటం గమనార్హం. ఇందంతా ఒకవైపయితే, ఇంట్రాడేలో రూపాయి ఏకంగా 69.10కి పడిపోవడం మరో ఆందోళనకరమైన అంశం. డాలర్లకోసం ఒత్తిడి... దిగుమతిదారుల నుంచి డాలర్లకోసం గణనీయమైన డిమాండ్ ఏర్పడటం రూపాయి మారకపు విలువపై తీవ్ర ప్రభావం చూపింది. ఒక దశలో ఆర్బీఐ మార్కెట్లోకి భారీగా డాలర్లను పంపి రూపాయి పతనాన్ని అడ్డుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంట్రాబ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 68.10– 68.72 శ్రేణిలో తిరిగింది. బుధవారం ముగింపుతో పోలిస్తే నష్టంతో 68.89 వద్ద ట్రేడింగ్ మొదలైంది. గతేడాది ఏకంగా 6 శాతం బలపడిన రూపాయి... ఈ ఏప్రిల్ నుంచీ బలహీనపడుతోంది. 2018లో రూపాయి విలువ 7 శాతం పతనమైంది. ఈ వార్త రాస్తున్న సమయం రాత్రి 9 గంటలకు అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ 95 వద్ద ఉంటే, రూపాయి 68.82 వద్ద ట్రేడవుతోంది. ఇక నైమెక్స్‌లో క్రూడ్ ధర గురువారం 74 డాలర్ల స్థాయిని తాకింది. బలహీనమంటే... క్లుప్తంగా చెప్పాలంటే, అంతర్జాతీయ వాణిజ్యం డాలర్ ద్వారానే జరుగుతుంది. ఒక వస్తువు విలువ అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ అనుకుంటే... దాన్ని మనం బుధవారం రూ. 68.61 రూపాయిలిచ్చి కొనుగోలు చేయగలిగితే, గురువారం అదే వస్తువుకోసం రూ.68.79 పెట్టాలి. దీంతో దేశంలోనూ ఈ వస్తువు ధరను పెంచి అమ్ముకోవాలి. ఇది దేశీయంగా ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. ద్రవ్యోల్బణం తీవ్రతరమవుతుంటే, దీని కట్టడికి ఆర్బీఐ దేశంలో వడ్డీరేట్లను పెంచాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవస్థకు దీనిని భరించే శక్తి లేకపోతే, దేశంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. క్రూడ్‌ను ప్రధానంగా చూస్తే... మనం చమురు కోసం దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. దీన్ని డాలర్లలో కొనుగోలు చేయాలి కాబట్టి, మన చమురు కంపెనీలు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. అవి ఈ భారాన్నీ జనంపై వేస్తే, ద్రవ్యోల్బణం వంటి ప్రతికూల ప్రభావాలు తప్పవు. అంటే స్థూలంగా దిగుమతులకు సంబంధించి మనకు రూపాయి బలహీనత నష్టమయితే, మనం ఏదైనా వస్తువు ఎగుమతిచేస్తే, లాభదాయక పరిస్థితి ఉంటుంది. పై ఉదాహరణ తీసుకుంటే, ఒక ఐటీ పరిశ్రమ తన ‘సేవలకు’ బుధవారం రూ. 68.61 ఆదాయం పొదగలిగితే, గురువారం 68.79 ఆదాయం పొందగలుగుతుంది. దేశీయ చర్యలు అవసరం వాణిజ్య యుద్ధ భయాలు, డాలర్ ఇండెక్స్ 11 నెలల గరిష్టానికి చేరడం, చమురు ధరల తీవ్రత, ఈక్విటీ, డెట్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ... ఇవన్నీ దేశీయంగా రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. దేశీయంగా చూస్తే, ద్రవ్యోల్బణం కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) భయాలున్నాయి. రూపాయిలో ఒడిదుడుకులను తగ్గించడానికి ఆర్బీఐ తీసుకునే చర్యలు, తగిన వర్షపాతం దేశీయ మార్కెట్‌కు సమీప భవిష్యత్‌లో కొంత ఊరటనివ్వవచ్చు. – వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ ఎగుమతిదారులకు ఏమీ ఒరగదు రూపాయి పతనం ఒక రకంగా ఎగుమతిదారులకు కలిసిరావాలి. అయితే ఇప్పుడు చైనా సహా ఇతర దేశాల కరెన్సీలూ పడిపోతున్నాయి. క్రాస్ కరెన్సీల పతనం వల్ల మన ఎగుమతులకు సంబంధించి అంతర్జాతీయ సమ అవకాశాల స్థితి (లెవెల్ ప్లేయింట్ ఫీల్డ్) ఏర్పడుతుంది తప్ప, పెద్దగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చు. – అజయ్ సాహి, ఎఫ్ఐఈఓ డైరెక్టర్ -
తగ్గిన టాటా మోటార్స్ ఆదాయం, లాభం
ఫారెక్స్ ప్రతికూల ఎఫెక్ట్ ముంబై: ఫారెక్స్ మార్పిడి నష్టాల కారణంగా 2017 మార్చితో ముగిసిన త్రైమాసికంలో టాటా మోటార్స్ లాభం, ఆదాయం...రెండూ తగ్గాయి. కంపెనీ కన్సాలిడేటెడ్ నికరలాభం రూ. 5,211 కోట్ల నుంచి రూ. 4,336 కోట్లకు తగ్గగా, కన్సాలిడేటెడ్ ఆదాయం రూ. 79,549 కోట్ల నుంచి రూ.77,272 కోట్లకు క్షీణించింది. బ్రిటన్ పౌండు బాగా క్షీణించడం, అదే సమయంలో రూపాయి బలపడటంతో బ్రిటన్ కరెన్సీ నుంచి భారత్ కరెన్సీలోకి జరిగిన మార్పిడి ఫలితంగా ముగిసిన త్రైమాసికంలో రూ. 9,032 కోట్ల ఆదాయం తగ్గినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ. 2.73,111 కోట్ల నుంచి రూ. 2,69,850 కోట్లకు తగ్గగా, నికరలాభం రూ. 11,678 కోట్ల నుంచి రూ. 7,557 కోట్లకు క్షీణించింది. తమ సబ్సిడరీ జాగ్వర్ లాండ్రోవర్(జేఎల్ఆర్) రిటైల్ అమ్మకాలు 13% వృద్ధిచెందినట్లు కంపెనీ ప్రకటించింది. మార్చి క్వార్టర్లో జేఎల్ఆర్ 55.7 కోట్ల డాలర్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఇక స్టాండెలోన్ ప్రాతిపదికన టాటా మోటార్స్ ముగిసిన త్రైమాసికంలో రూ. 13,621 కోట్ల ఆదాయంపై రూ. 818 కోట్ల నికరనష్టాన్ని చవిచూసింది. ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు ఫ్లాట్‌గా రూ. 450 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెల్లడికాగా, మంగళవారం రాత్రి అమెరికా మార్కెట్లో కంపెనీ ఏడీఆర్ కడపటి సమాచారం అందేసరికి 5%పైగా ఎగిసి 36.73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
మరింత దూకుడు కొనసాగిస్తున్న రూపాయి
ముంబై : అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం రూపాయికి భలే కిక్కిచ్చింది. డాలర్ తో పోలిస్తే తగ్గుతూ వచ్చిన రూపాయి మారకం విలువ నిన్నటి ట్రేడింగ్ లో ఒక్కసారిగా ఏడాదిన్నర గరిష్టానికి ఎగిసింది. నేటి ట్రేడింగ్ లోనూ ఈ రూపాయి విలువ మరింత పెరిగింది. విదేశీ క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్ తో రూపాయి మరో 38 పైసలు బలపడి 65.44 వద్ద ట్రేడైంది. ఎంతో కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఫైనాన్సియల్ మార్కెట్లలో సెంటిమెంట్ భారీగా బలపడింది. అంతేకాక సుస్థిర ప్రభుత్వం రూపాయికి బూస్ట్ ఇచ్చింది. డాలర్ పై దూకుడు కొనసాగిస్తూ రూపాయి మంగళవారం ఇంట్రాడేలో గరిష్ట స్థాయి 65.76ని తాకింది. చివరికి 78 పైసలు బలపడి 1.17 శాతం పెరుగుదలతో 65.82 వద్ద ముగిసింది. నిన్నటి ముగింపుకు మరింత బలపడుతూ మార్నింగ్ ట్రేడ్ లో రూపాయి 65.41, 65.44 స్థాయిలో ట్రేడైంది. ప్రస్తుతం 32 పైసల లాభంతో 65.49 వద్ద ట్రేడవుతోంది.. ఇదే సమయంలో డాలర్ ఇండెక్స్ 0.06 శాతం కిందకి దిగజారింది. ఆరు కరెన్సీల బాస్కెట్ లో డాలర్ విలువ మార్నింగ్ ట్రేడ్ లో 101.68 వద్ద కొనసాగింది. మరోవైపు నేడు ఫెడరల్ రిజర్వు మీటింగ్ నిర్ణయం వెలువడనుంది. ఈ నేపథ్యంలో మార్కెట్లు మాత్రం ఫ్లాట్ గా ట్రేడవుతున్నాయి. -
రూపాయి... విలవిల!
• డాలర్ మారకంలోఒకేరోజు 62పైసలు డౌన్ • 67.25 వద్ద ముగింపుమూడు నెలల కనిష్ట స్థారుు ముంబై: ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో శుక్రవారం డాలర్‌తో పోల్చితే రూపారుు విలువ 62 పైసలు బలహీనపడింది. 67.25 పైసల వద్ద ముగిసింది. ఇది మూడు నెలల కనిష్ట స్థారుు. ఈ ఏడాది ఒకేరోజు ఈ స్థారుులో రూపారుు బలహీనపడ్డం ఈ ఏడాది ఇది రెండవసారి. జూలై 26న రూపారుు 67.27 వద్ద ముగిసింది. రూపారుుని తగిన స్థారుులో నిలబెట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అటు స్పాట్ ఇటు ఫార్వార్డ్ మార్కెట్లో జోక్యం చేసుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఒక ఫారెక్స్ ట్రేడర్ పేర్కొన్నారు. ట్రంప్ ఎఫెక్ట్... అమెరికా వృద్ధే లక్ష్యమని ఆయన చేసిన ప్రకటన... అంతర్జాతీయ కరెన్సీ బాస్కెట్లో డాలర్ బలోపేతం... ఫెడ్ రేటు పెంచవచ్చని భయాలు... విదేశీ నిధులు పెద్ద ఎత్తున బయటకు వెళ్లిపోవచ్చన్న ఆందోళనలు... స్టాక్ మార్కెట్‌కు భారీ నష్టాలు... ఈ పరిణామాలు శుక్రవారం రూపారుుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపారుు. కదలికలు ఇలా... దిగుమతిదారులు, కార్పొరేట్ల నుంచి డాలర్‌కు తీవ్రమైన డిమాండ్ వచ్చింది. దీనితో క్రితం ముగింపు 66.63తో పోల్చిచూస్తే- ప్రారంభంలోనే గ్యాప్ డౌన్ (క్రితం కన్నా బలహీనత)తో 67.20 వద్ద రూపారుు ట్రేడింగ్ ప్రారంభమైంది. తీవ్ర ఒడిదుడుకులతో చివరకూ బలహీనతలోనే ముగిసింది. -
ఆల్ టైం గరిష్టానికి ఫారెక్స్ నిల్వలు
ముంబై: దేశంలో విదేశీ మారక నిల్వలు ఆల్‌టైం గరిష్ట స్థాయికి పెరిగాయి. ఈ నెల 18తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 2.53 బిలియన్ డాలర్లమేర పెరిగి 355.94 బిలియన్ డాలర్లకు ఎగశాయి. విదేశీ కరెన్సీ ఎసెట్స్ (ఎఫ్సీఏ) పెరుగుదల ఫారెక్స్ నిల్వల వృద్ధే ప్రధాన కారణమని ఆర్బీఐ తెలిపింది. ఈ నెల 18తో ముగిసిన వారపు కడపటి వారంలో ఫారెక్స్ నిల్వలు 353.40 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఎఫ్‌సీఏలు 2.5 బిలియన్ డాలర్ల వృద్ధితో 332.50 బిలియన్ డాలర్లకు పెరిగాయి. గోల్డ్ నిల్వలు స్వల్పంగా పెరిగి (0.6 మిలియన్ డాలర్లు) 19.32 బిలియన్ డాలర్లకు చేరాయి. -
థామస్ కుక్ నుంచి తొలి ఫారెక్స్ యాప్
ముంబై: విదేశీ మారక లావాదేవీలన్నీ ఒకే చోట నిర్వహించుకునే వెసులుబాటు కల్పిస్తూ భారత్‌లో తొలిసారిగా ‘ఫారిన్ ఎక్స్చేంజ్ యాప్’ను ప్రవేశపెట్టినట్లు థామస్ కుక్ (ఇండియా) తెలిపింది. ఇందులో డాలర్, యూరో, ఫ్రాంక్ తదితర ప్రధాన కరెన్సీల మారక విలువలు ఎప్పటికప్పుడు పొందుపర్చడం జరుగుతుందని వివరించింది. రేట్లలో హెచ్చుతగ్గుల వల్ల నష్టపోకుండా ఉండేందుకు ‘బ్లాక్ మై రేట్’ ఆప్షన్ కూడా ఈ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్‌లో ఉంటుందని థామస్ కుక్ (ఇండియా) సీవోవో అమిత్ మదన్ తెలిపారు. అలాగే, నిర్దిష్ట కరెన్సీల మారకం విలువలకు సంబంధించి ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా రేట్ అలర్టులు కూడా పొందవచ్చని వివరించారు. -
మళ్లీ రూపాయి విలవిల..
65 పైసలు డౌన్..62.94 వద్ద ముగింపు ⇒11 నెలల కనిష్ట స్థాయి... ⇒నాలుగు నెలల్లో అతిపెద్ద పతనం ⇒ఆయిల్ కంపెనీల నుంచి భారీ డాలర్ డిమాండ్ ప్రభావం... ముంబై: దేశీ కరెన్సీ మళ్లీ బక్కచిక్కుతోంది. సోమవారం డాలరుతో రూపాయి మారకం విలువ 65 పైసలు దిగజారి 62.94 వద్ద ముగిసింది. ఇది 11 నెలల కనిష్టస్థాయి(2014 జనవరి 27న విలువ 63.10) కావడం గమనార్హం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల పాలసీ సమీక్ష నేడు(మంగళవారం) ప్రారంభం కానుండటంతో గ్లోబల్ మార్కెట్ల ప్రధాన కరెన్సీలతో డాలరు విలువ భారీగా పుంజుకుంది. వడ్డీరేట్ల పెంపుదిశగా ఫెడ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఉత్కంఠే దీనికి కారణం. దీనికితోడు అంతర్జాతీయంగా ముడి చమురు ధరల భారీ పతనం కారణంగా దేశీయ క్రూడ్ దిగుమతిదారులు కొనుగోళ్లు పెంచడం.. దీంతో డాలర్లకు డిమాండ్ పోటెత్తడం రూపాయి విలువ పడిపోయేందుకు దారితీసినట్లు ఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ధర బ్యారెల్‌కు ఐదేళ్లకుపైగా కనిష్టానికి(నెమైక్స్ క్రూడ్ 60 డాలర్ల దిగువకు) పడిపోయిన సంగతి తెలిసిందే. కాగా, గతేడాది ఆగస్టు 28న డాలరుతో రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్టమైన 68.80ని తాకింది. 4 నెలల్లో అతిపెద్ద పతనం... సోమవారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో రూపాయి విలువ గత ముగింపు 62.29తో పోలిస్తే బలహీనంగా 62.50 వద్ద ప్రారంభమైంది. ఒకానొక దశలో 62.95కి కూడా జారింది. చివరకు 1.04% నష్టపోయి 62.94వద్ద స్థిరపడింది. గడిచిన 4 నెలల్లో రూపాయి అతిపెద్ద పతనం ఇదే. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఇటీవలి కాలంలో అమ్మకాల బాట పడుతుండటంతో దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుతున్నాయి. ఇది కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. కాగా, నవంబర్ నెలకు టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆదారిత ద్రవ్యోల్బణం రేటు సున్నా స్థాయికి పడిపోవడంతో ఆర్బీఐ వడ్డీరేట్ల కోతకు త్వరలోనే ఆస్కారం ఉందన్న అంచనాలు బలపడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం... రూపాయి క్షీణతతో.. ప్రధానంగా దిగుమతులపై ఆధారపడుతున్న మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది. ముఖ్యంగా బంగారం, క్రూడ్ దిగుమతుల భారం పెరిగి... కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) ఎగబాకుతుంది. దిగుమతి ఉత్పత్తులైన బంగారం, వెండి, చమురు, వంటనూనెల ధరలు పెరిగే ఆస్కారం వుంది. కార్పొరేట్ కంపెనీల విదేశీ రుణాల చెల్లింపుల భారం పెరగడంతో వాటి లాభాలు హరించుకుపోతాయి. ఇది దేశీయంగా వాటి విస్తరణ, కార్యకలాపాలపై ప్రభావం చూపుతుంది. వెరసి అసలే మందగమనంలో ఉన్న స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)కి శరాఘాతంగా మారుతుంది. విదేశీ విద్య, ప్రయాణాలు కూడా భారమవుతాయి. అయితే, అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా తగ్గడం భారత్‌కు సానుకూలాంశం. -
4 నెలల కనిష్టానికి రూపాయి
మరో 63 పైసలు డౌన్; 61.18 వద్ద క్లోజ్ ముంబై: అంతర్జాతీయంగా, ఇటు దేశీయంగానూ స్టాక్ మార్కెట్ల పతనం రూపాయినీ కుదిపేసింది. డాలరుతో రూపాయి మారకం విలువ శుక్రవారం మరో 63 పైసలు దిగజారి 61.18 వద్ద స్థిరపడింది. ఇది నాలుగు నెలల కనిష్టస్థాయి కావడం గమనార్హం. మార్చి 20న రూపాయి ముగింపు 61.34 కాగా, మళ్లీ ఈస్థాయికి క్షీణించడం ఇదే తొలిసారి. అంతేకాకుండా జనవరి 24 తర్వాత ఒక వారంలో ఇంత ఘోరంగా రూపాయి క్షీణించడం గమనార్హం. గురువారం దేశీ కరెన్సీ విలువ 49 పైసలు పడిపోయిన సంగతి తెలిసిందే. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీలో మరో 10 బిలియన్ డాలర్ల కోత విధించడం.. అక్కడి ఆర్థిక వ్యవస్థ పుంజు కుంటోందన్న సంకేతాలతో డాలరు విలువ అంతర్జాతీయంగా పుంజుకుంటోంది. దీంతో కరెన్సీ డెరివేటివ్స్‌లో షార్ట్ సెల్లర్లు తమ పొజిషన్లను కవర్ చేసుకునేందుకు పురిగొల్పిందని.. వెరసి రూపాయిపై ప్రభావం చూపినట్లు ఫారెక్స్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. దీనికితోడు దిగుమతిదారులు, బ్యాంకులు డాలర్ల కొనుగోలు కూడా దేశీ కరెన్సీ క్షీణతకు కారణంగా నిలిచినట్లు చెప్పారు. శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 414 పాయింట్లు పతనమైన విషయం విదితమే.