డెట్ మార్కెట్ నుంచి రూ. 50 వేల కోట్లు ఔట్ | Lack of taxation clarity costs Indian debt market Rs 50000 cr | Sakshi
Sakshi News home page

డెట్ మార్కెట్ నుంచి రూ. 50 వేల కోట్లు ఔట్

Published Mon, Aug 12 2013 2:31 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

డెట్ మార్కెట్ నుంచి రూ. 50 వేల కోట్లు ఔట్ - Sakshi

డెట్ మార్కెట్ నుంచి రూ. 50 వేల కోట్లు ఔట్

న్యూఢిల్లీ: గత రెండు నెలల్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) 850 కోట్ల డాలర్ల(రూ. 50,600 కోట్లు) విలువైన రుణ సెక్యూరిటీల(డిబెంచర్లు తదితరాలు)ను విక్రయించారు. ఇవి సెబీ వెల్లడించిన తాజా గణాంకాలు. డెట్ మార్కెట్లలో పెట్టుబడుల ద్వారా ఆర్జించే లాభాలపై చెల్లించాల్సిన పన్నుకు సంబంధించి నిబంధనల్లో స్పష్టత కొరవడటంతో ఎఫ్‌ఐఐలు డెట్ మార్కెట్ల నుంచి వైదొలగుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. రూపాయి విలువ పతనంకూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. హెచ్చుతగ్గులకు లోనవుతున్న రూపాయి విలువ నేపథ్యంలో ఎఫ్‌ఐఐల హెడ్జింగ్ వ్యయాలు పెరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో ఎఫ్‌ఐఐలు నికరంగా రూ.25,000 కోట్లు ఇన్వెస్ట్‌చేయడం గమనార్హం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement