Debt market
-
CDMDF: కార్పొరేట్ డెట్ మార్కెట్ అభివృద్ధి నిధి
న్యూఢిల్లీ: కార్పొరేట్ డెట్ మార్కెట్ అభివృద్ధి నిధి (సీడీఎండీఎఫ్)కి సంబంధించి సెబీ కార్యాచరణను ప్రకటించింది. ఈ తరహా ఫండ్‌లో పెట్టుబడులు పెట్టే విషయమై మ్యూచువల్ ఫండ్స్‌కు మార్గదర్శకాలను సెబీ విడుదల చేసింది. సీడీఎండీఎఫ్ ఏర్పాటుకు సంబంధించి సెబీ ఈ ఏడాది జూన్‌లోనే నిబంధనలను నోటిఫై చేయడం గమనార్హం. ఇది ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఏఐఎఫ్) విభాగం కిందకు వస్తుంది. ఆర్థిక మాంద్యం, సంక్షోభాల సమయంలో కార్పొరేట్ డెట్ సెక్యూరిటీలను కొనుగోలు చేసేందుకు ఉద్దేశించిన సన్నద్ధత సదుపాయం ఇది. కార్పొరేట్ బాండ్ మార్కెట్లో విశ్వాసాన్ని పెంచడం, లిక్విడిటీని పెంచడమే దీని ఏర్పాటు ఉద్దేశ్యం. సీడీఎండీఎఫ్ యూనిట్లకు సంబంధించి సెబీ రెండు వేర్వేరు సర్క్యులర్లను జారీ చేసింది. సీడీఎండీఎఫ్ యూనిట్లను డెట్ మ్యూచువల్ ఫండ్స్, ఓపెన్ ఎండెడ్ డెట్ ఫండ్స్, ఓవర్‌నైట్, గిల్ట్ ఫండ్స్, కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ కొనుగోలు చేసుకోవచ్చు. ఈ తరహా డెట్ ఫండ్స్ తమ నిర్వహణలోని ఆస్తుల్లో 0.25 శాతాన్ని సీడీఎండీఎఫ్ యూనిట్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చని సెబీ స్పష్టం చేసింది. నిర్వహణ ఆస్తులు పెరిగే కొద్దీ, ప్రతీ ఆరు నెలలకోసారి 0.25 శాతం గరిష్ట పరిమితి మేరకు పెట్టుబడులు పెంచుకోవచ్చని పేర్కొంది. సంక్షోభాల్లో ఆపత్కాల నిధి మార్కెట్లు తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే సమయంలో డెట్ సెక్యూరిటీల పరంగా లిక్విడిటీ సమస్య ఏర్పడుతుంది. దీనికి పరిష్కారంగా సెబీ సీడీఎండీఎఫ్ను తీసుకొచి్చంది. ఆ సమయంలో కార్పొరేట్ డెట్ సెక్యూరిటీలను సీడీఎండీఎఫ్ ముందుకు వచ్చి కొనుగోలు చేస్తుంది. సాధారణ సమయంలో లో డ్యురేషన్ జీ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లుల్లో ఇన్వెస్ట్ చేస్తుందని సెబీ తెలిపింది. -
ఐఐఎఫ్ఎల్ నిధుల సమీకరణ
ముంబై: బ్యాంకింగేతర సంస్థ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ రుణ మార్కెట్ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధపడుతోంది. మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా రూ. 1,500 కోట్లు సమకూర్చుకోవాలని చూస్తున్నట్లు కంపెనీ తాజాగా పేర్కొంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 300 కోట్ల విలువైన సెక్యూర్డ్ రీడీమబుల్ ఎన్సీడీలను విక్రయించనున్నట్లు తెలియజేసింది. వీటికి 9 శాతంవరకూ రిటర్నులను ఆఫర్ చేస్తోంది. ఈ నెల 9న వీటిని జారీ చేయనున్నట్లు వెల్లడించింది. నిధులను వ్యాపారాభివృద్ధి, మూలధన పటిష్టతకు వినియోగించనున్నట్లు పేర్కొంది. ఇష్యూకి అధిక సబ్స్క్రిప్షన్ లభిస్తే మరో రూ. 1,200 కోట్ల విలువైన ఎన్సీడీలను సైతం కేటాయించేందుకు గ్రీన్ షూ అప్షన్‌ను ఎంచుకున్నట్లు తెలియజేసింది. వెరసి రూ. 1,500 కోట్లను సమీకరించే వీలున్నట్లు తెలియజేసింది. 60 నెలల కాలానికిగాను ఇన్వెస్టర్లకు 9 శాతం వరకూ రిటర్నులను ఆఫర్ చేస్తున్నట్లు వెల్లడించింది. 24 నెలలు, 36 నెలల కాలావాధితోనూ బాండ్లను కేటాయించనున్నట్లు పేర్కొంది. వడ్డీని వార్షికంగా లేదా నెలవారీ చెల్లించనున్నట్లు తెలియజేసింది. కంపెనీ ఏప్రిల్‌లో 40 కోట్ల డాలర్ల విలువైన డాలర్ బాండ్లను తిరిగి చెల్లించిన సంగతి తెలిసిందే. వీటిని 2020 ఫిబ్రవరిలో జారీ చేసింది. -
ఈక్విటీ మార్కెట్ల మద్దతు ఒక్కటే చాలదు
ముంబై: సుస్థిరమైన ఆర్థిక వృద్ధికి ఒక్కఈక్విటీ మార్కెట్ల మద్దతే చాలదని.. బ్యాంకు రుణాల మాదిరి డెట్ మార్కెట్లు సైతం బలంగా ఉండాలన్న అభిప్రాయాన్ని ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ వ్యక్తం చేశారు. బ్యాంకులు బ్యాలన్స్ షీట్లను శుద్ధి చేసుకున్నాయని.. అవి ఇప్పుడిక ఆర్థిక వృద్ధికి మద్దతుగా రుణ వితరణను వేగవంతం చేయాలని సూచించారు. బ్యాంకింగేతర రుణ సంస్థల లాబీ గ్రూపు ఎఫ్ఐడీసీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో సంజీవ్ సన్యాల్ మాట్లాడారు. ‘‘ఆర్థిక చరిత్రను పరిశీలించినట్టయితే.. దీర్ఘకాలంలో వేగవంతమైన ఆర్థిక వృద్ధి స్థిరంగా కొనసాగడం అన్నది ఒక్క ఈక్విటీ మార్కెట్ల నిధుల చేదోడుతోనే సాధ్యం కాలేదు. డెట్ క్యాపిటల్ (రుణాలు) మద్దతుతో ఇది సాధ్యమైంది. ఎక్కువ మొత్తం బ్యాంకుల నుంచి నిధుల సాయం అందుతోంది’’ అని సన్యాల్ పేర్కొన్నారు. ఈక్విటీ మార్కెట్ల ద్వారా నిధుల సమీకరణ మార్గం మెరుగ్గానే ఉందన్న ఆయన.. అదే సమయంలో డెట్ మా ర్కెట్ చెడ్డగా ఏమీ లేదన్నారు. పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ అవసరం ‘‘భారత్ ఆర్థిక వృద్ధి కొన్ని దశాబ్దాల పాటు సుస్థిరంగా కొనసాగాలంటే అందుకు.. ప్రస్తుతమున్న దానితో పోలిస్తే అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ కావాలి. బ్యాంకులు తమ రుణ వితరణ కార్యకలాపాలను విస్తరించాలి’’ అని సంజీవ్ సన్యాల్ పేర్కొన్నారు. బ్యాంకులు ఎన్నో ఏళ్ల పాటు బ్యాలన్స్‌షీట్లను ప్రక్షాళన చేసుకున్నందున అవి తమ రుణ పుస్తకాన్ని మరింత విస్తరించుకోవడానికి అనుకూలతలు ఉన్నాయని చెప్పారు. చైనా జీడీపీ సైతం బ్యాంకు బ్యాలన్స్ షీట్ల విస్తరణ మద్దతుతో మూడు దశాబ్దాల కాలలో బలమైన వృద్ధిని చూసినట్లు పేర్కొన్నారు. చదవండి: ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టం -
బంగారంపై రుణం అందరికీ ఆమోదమే!
భారతీయులకు బంగారంతో అనుబంధం ఎంతో ప్రత్యేకం. ఆభరణాలు, బంగారంతో చేసిన వస్తువులు.. ఇలా ఏదో ఒక రూపంలో బంగారం కలిగి ఉండడాన్ని హోదాగానూ చూస్తారు. బంగారాన్ని సంపదగా భావిస్తుంటారు. అందుకే సామాన్యుడి కుటుంబంలోనూ ఎంతో కొంత బంగారం ఉంటుంది. ఇదే బంగారం ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలకు మరో రూపంలో ఆదుకుంటోంది. ఆదాయాలు పడిపోయి, ఉపాధి కరువైన వేళ బంగారంపై సులభంగా రుణాలు పొందే పరిస్థితి వారికి కొంత ఊరటనిస్తోంది. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్బీఎఫ్సీలు) సైతం బంగారం రుణాలు ఆమోదనీయంగా ఉంటున్నాయి. రుణ గ్రహీతలు చెల్లింపులు చేయలేని పరిస్థితుల్లో వారు తనఖాగా ఉంచిన బంగారాన్ని వేలం వేసుకునే సౌలభ్యం వాటికి ఉంటుంది. కనుక రిస్క్ తక్కువ. రుణ గ్రహీతలకూ తక్కువ రేటుపైనే రుణాలు లభించే పరిస్థితి. వెరసి ఇరువురికీ ఆమోదనీయమైన బంగారం రుణాల మార్కెట్ భారీగా విస్తరిస్తోంది. కరోనా మహమ్మారి రాకతో బంగారం రుణ మార్కెట్ 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారీ వృద్ధిని చూసిందని చెప్పుకోవాలి. ఆర్బీఐ గణాంకాలను పరిశీలించినట్టయితే.. బ్యాంకుల రుణ పుస్తకంలో 2020 మార్చి నాటికి రూ.33,303 కోట్లుగా ఉన్న బంగారం రుణాలు.. 2021 మార్చి నాటికి ఏకంగా 86 శాతం పెరిగి రూ.60,464 కోట్లకు విస్తరించాయి. 2019 మార్చి నుంచి 2020 మార్చి మధ్యన చూసినా కానీ బ్యాంకుల బంగారం రుణాలు 33.9 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి. ఇవి కేవలం ఆర్బీఐ వద్దనున్న బ్యాంకుల రుణ పుస్తకాల్లోని గణాంకాలే. ప్రత్యేకంగా బంగారం రుణాలను మంజూరు చేసే ముత్తూట్, మణప్పురం ఇతర ఎన్‌బీఎఫ్‌సీల పరిధిలోని గణాంకాలనూ కలిపి చూస్తే ఈ వృద్ధి మరింత ఎక్కవగానే ఉంటుంది. కరోనా కష్టాల్లో ఆసరా.. బంగారం రుణాల మార్కెట్ ఏటేటా భారీ వృద్ధినే నమోదు చేస్తోంది. ఇందుకు పెరిగిన బంగారం ధరలు రూపంలో అనుకూలత ఏర్పడింది. ఇక 2020 మార్చిలో కరోనా నియంత్రణకు లాక్డౌన్లు విధించడంతో చాలా వ్యాపారాలు కుదేలయ్యాయి. దీంతో కొంత మంది ఉపాధిని కోల్పోగా.. కొంత మంది వేతన కోతలను ఎదుర్కొన్నారు. చిన్న వ్యాపారస్తులు, చిన్న పరిశ్రమలు కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో బంగారం తనఖా పెట్టి తీసుకున్న రుణాలతో ప్రతికూల పరిస్థితులను అధిగమించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తీసుకున్న రుణాలపై ఆరు నెలల మారటోరియంను బ్యాంకులు కల్పించాయి. గతేడాది ఆగస్ట్‌లో మారటోరియం ముగిసిన తర్వాత వ్యాపార కార్యకలాపాల కోసం ఈ బంగారం రుణాలే చాలా పరిశ్రమలను, వ్యాపారులను ఆదుకున్నాయి. అదే సమయంలో ఆర్బీఐ సైతం బంగారం రుణాల విషయంలో నిబంధనలను సడలించి ఆశలు కలి్పంచింది. లోన్ టు వ్యాల్యూ (అంటే బంగారం విలువలో మంజూరు చేసే రుణం పరిమాణం/ఎల్టీవీ)ను పెంచుతూ 2020 ఆగస్ట్‌లో ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయేతర అవసరాల కోసం మంజూరు చేసే బంగారం రుణాలకు ఎల్టీవీని 75 శాతం నుంచి 90 శాతానికి పెంచింది. ప్రభుత్వ బ్యాంకుల పాత్ర బంగారం ఆభరణాలు, వస్తువుల తాకట్టుపై ఎస్బీఐ మంజూరు చేసిన రుణాలు (సాధారణ అవసరాల కోసం ఇచ్చినవి) మార్చి 31 నాటికి ఏడాది కాలంలో ఏకంగా 465 శాతం పెరిగి రూ.20,987 కోట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి వి రూ.3,715 కోట్లుగానే ఉండడం గమనార్హం. బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర రిటైల్ బంగారం రుణాలు 2021 మార్చి నాటికి రూ.1,370 కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవతత్సరంలో 11 రెట్ల వృద్ధి నమోదైంది. బ్యాంకు ఆఫ్ బరోడా రిటైల్ బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో కూడా 2020 మార్చి నాటికి ఉన్న రూ.436 కోట్ల నుంచి.. 2021 మార్చి నాటికి రూ.1,101 కోట్లకు వృద్ధి చెందింది. ప్రైవేటురంగంలోని ఫెడరల్ బ్యాం కు 70 శాతం, సీఎస్బీ బ్యాంకు 61 శాతం మేర బంగారం రుణాల్లో ప్రగతిని చూపించాయి. లిక్విడిటీ ఎక్కువ.. బంగారం రుణాలకు సంబంధించి పూర్తి సామర్థ్యాలను గతంలో తమ బ్యాంకు చూడలేదని బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర ఎండీ, సీఈవో రాజీవ్ ఎండీ పేర్కొన్నారు. దీంతో బంగారం రుణాల్లో మార్కెట్‌ను పెంచుకునేందుకు సౌకర్యవంతమైన, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో, కస్టమర్లకు అనుకూలమైన పథకాన్ని రూపొందించినట్టు చెప్పారు. ‘‘క్లిష్ట సమయాల్లో చాలా మంది వ్యక్తులు, చిన్న వ్యాపారస్థులు నగదు కొరతను ఎదుర్కొంటున్నారు. తక్షణ నిధుల అవసరాలను బంగారం రుణాలు తీరుస్తున్నాయి. మా బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో 2021 మార్చి నాటికి రూ.1,939 కోట్లకు పెరిగింది. అంటే 2020–21 ఆర్థిక సంవత్సరంలోనే ఏడు రెట్ల వృద్ధి నమోదైంది. ఇప్పటికైతే బంగారం రుణ పుస్తకం రూ.2,100 కోట్లుగా ఉంటుంది’’ అని రాజీవ్ బంగారం రుణాల విస్తృతి గురించి వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో రూ.5,000 కోట్లకు విస్తరిస్తుందని అంచనా వ్యక్తం చేశారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో పెరిగిన తమ రుణ పుస్తకంలో ఎక్కువ వృద్ధి బంగారం రుణాల విభాగం నుంచే ఉన్నట్టు సీఎస్బీ బ్యాంకు ఎండీ, సీఈవో రాజేంద్రన్ సైతం ఇటీవలే పేర్కొనడం గమనార్హం. 76 శాతం వృద్ధి బంగారం రుణాల నుంచే వచ్చినట్టు చెప్పారు. ‘‘బంగారం రుణాల్లో వృద్ధి ఎంతో బాగుంది. ఎందుకంటే ఎన్బీఎఫ్సీలు ఈ విభాగంలో అంత చురుగ్గా లేవు. ఒక్క సారి కస్టమర్ ఎన్బీఎఫ్సీ నుంచి బ్యాంకుకు బంగారం రుణం కోసం వస్తే.. ఇక తిరిగి ఎప్పటికీ ఎన్బీఎఫ్సీ సంస్థల వద్దకు వెళ్లరు. ఎందుకంటే చాలా ఆకర్షణీయమైన వడ్డీ రేటుకే బ్యాంకులో బంగారంపై రుణాలు లభిస్తాయి’’ అంటూ బంగారం రుణాలకు సంబంధించి బ్యాంకులు మంచి ఎంపిక అవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బంగారం రుణాలు సురక్షితమైనవి (సెక్యూర్డ్ లోన్స్). డిఫాల్ట్ (రుణ ఎగవేతలు) రిస్క్ చాలా తక్కువ. దీంతో బ్యాంకులకు బంగారం రుణాలు ఆకర్షణీయంగా మారాయి. పెరిగిన ధరలతో అధిక రుణం ఒకవైపు అధిక ఎల్టీవీ, మరోవైపు పెరిగిన బంగారం మార్కెట్ ధరలు.. తనఖా బంగారంపై ఎక్కువ మొత్తంలో రుణాలు పొందే పరిస్థితికి దారితీశాయి. మరోవైపు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు సైతం ఎక్కువ మందికి బంగారంపై రుణాలు అనుకూల మార్గంగా తోచాయి. ప్రభుత్వరంగంలోని బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర అయితే 7.35 శాతం, ఎస్బీఐ 7.50 వార్షిక వడ్డీ రేటుపై బంగారం రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. సాధారణంగా బంగారం రుణాల మార్కెట్‌ను అధిక శాతం ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ సంస్థలే శాసిస్తుంటాయి. కానీ, ఆకర్షణీయమైన రుణ రేట్లతో ప్రభుత్వరంగ బ్యాంకులు సైతం ఈ మార్కెట్లోకి బలంగా చొచ్చుకుపోతున్నాయి. దీంతో వినియోగదారులు కష్ట సమయాల్లో తక్కువ రేటుపైనే రుణాలు పొందే సౌలభ్యం ఏర్పడింది. నిజానికి ఎన్బీఎఫ్సీ సంస్థలైన ముత్తూట్, మణప్పురం సంస్థలు బంగారం రుణాలపై అధిక రేట్లను వసూలు చేస్తుంటాయి. ప్రకటనల్లోనే 12 శాతం వడ్డీ రేటు అని చెబుతాయి కానీ.. ఒక్కో కస్టమర్‌కు గరిష్టంగా రూ.30వేలకు మించి ఈ రేటుపై రుణాలను ఇవ్వవు. పెద్ద మొత్తంలో రుణం కోరుకుంటే 18, 24 శాతం వడ్డీ రేటును చెల్లించేందుకు సిద్ధపడాల్సిందే. కానీ, బ్యాంకుల్లో 60 పైసల వడ్డీ రేటుకే బంగారంపై రుణాలు లభిస్తున్నాయి. ఇక్కడ కాల వ్యవధిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఎన్బీఎఫ్సీలు మూడు నెలలు, ఆరు నెలలకే రుణాలు ఇస్తుంటాయి. వడ్డీని ప్రతీ నెలకోసారి చెల్లించుకోవాలి. లేదంటే దానిపై మరింత చార్జీలను బాదుతాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అలా కాదు. ఏడాది, రెండేళ్లకూ రుణాలను ఇవ్వడమే కాకుండా.. వడ్డీని ఏడాదికోసారి చెల్లించే విధంగా పథకాలను రూపొందిస్తున్నాయి. కాకపోతే కాలవ్యవధి తీరిన తర్వాత వడ్డీ మాత్రమే చెల్లించి రుణాలను రెన్యువల్ చేసుకోవాలంటే ప్రక్రియను మొదటి నుంచి బ్యాంకులు అనుసరిస్తున్నాయి. దీంతో తిరిగి బంగారం అప్రైజర్ (విలువ మదింపుదారు) చార్జీలు, స్టాంప్ డ్యూటీ, జీఎస్టీ చార్జీల రూపంలో భారాన్ని భరించాల్సి ఉంటుంది. -
ఎఫ్‌పీఐ పెట్టుబడులు.. భళా
ముంబై: కొద్ది నెలలుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు)ను దేశీ క్యాపిటల్ మార్కెట్లు విశేషంగా ఆకర్షిస్తూ వస్తున్నాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం(2020–21) విదేశీ పెట్టుబడుల రీత్యా మార్కెట్లు రికార్డులు సాధించే వీలుంది. ఏప్రిల్ నుంచి ఈ నెల 15వరకూ చూస్తే ఎఫ్‌పీఐలు అటు ఈక్విటీలు, ఇటు రుణ సాధనాలలో కలిపి ఏకంగా 33.8 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. డాలరుతో మారకంలో ప్రస్తుత రూపాయి విలువ(72.65) ప్రకారం వీటి విలువ రూ. 2.45 లక్షల కోట్లకుపైమాటే. ఇంతక్రితం 2014–15లో మాత్రమే ఎఫ్‌పీఐలు ఇంతకంటే అధికంగా అంటే 46 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. వెరసి దేశీ క్యాపిటల్ మార్కెట్లో ఎఫ్‌పీఐల మొత్తం పెట్టుబడుల విలువ 592.5 బిలియన్ డాలర్లను తాకింది. వీటిలో ఈక్విటీ పెట్టుబడుల విలువ 537.4 బిలియన్ డాలర్లుకాగా.. రుణ సాధనాలలో 51.38 బిలియన్ డాలర్లను పంప్ చేశారు. దేశీ దిగ్గజం కేర్ రేటింగ్స్ రూపొందించిన గణాంకాలివి. ఫైనాన్షియల్ జోరు: ఎఫ్‌పీఐల పెట్టుబడులు(హోల్డింగ్స్) అత్యధికంగా ఫైనాన్షియల్ సర్వీసుల రంగంలో (191.3 బిలియన్ డాలర్లు) నమోదుకాగా.. సాఫ్ట్వేర్ 76 బిలియన్ డాలర్లను ఆకట్టుకుంది. ఆయిల్, గ్యాస్‌లో 50 బిలియన్ డాలర్లు, ఆటోమొబైల్స్, కాంపోనెంట్స్‌లో 27 బిలియన్ డాలర్లు, బయోటెక్నాలజీలో దాదాపు 23 బిలియన్ డాలర్లు, సావరిన్ డెట్‌లో 21.7 బిలియన్ డాలర్లు చొప్పున ఎఫ్‌పీఐలు ఇన్వెస్ట్ చేశారు. వ్యక్తిగత ఉత్పత్తులు, క్యాపిటల్ గూడ్స్, ఆహారం, పానీయాలు, బీమా రంగాలు సైతం 20–13 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పొందాయి. 10 ప్రధాన రంగాలు ఎఫ్‌పీఐల పెట్టుబడుల్లో 78% వాటాను ఆక్రమిస్తున్నాయి. డిసెంబర్లో..: ఈ ఏడాది లభించిన దాదాపు 34 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడుల్లో 8.4 బిలియన్ డాలర్లు ఒక్క డిసెంబర్లోనే లభించడం విశేషం! అయితే కేర్ గణాంకాల ప్రకారం గత రెండేళ్లలో దేశీ క్యాపిటల్ మార్కెట్లలో ఎఫ్‌పీఐల పెట్టుబడులు ప్రతికూలంగా నమోదయ్యాయి. 2019–20లో ఎఫ్‌పీఐలు నికరంగా 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. కాగా.. దేశీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్న విదేశాలలో యూఎస్ వాటా 34 శాతంకాగా.. మారిషస్ 11 శాతం, సింగపూర్ 8.8 శాతం, లగ్జెమ్‌బర్గ్ 8.6 శాతం, బ్రిటన్ 5.3 శాతం, ఐర్లాండ్ 4%, కెనడా 3.4 శాతం, జపాన్ 2.8 శాతం చొప్పున వాటాను ఆక్రమిస్తున్నాయి. నెదర్లాండ్స్, నార్వే సైతం 2.4% వాటాను కలిగి ఉన్నాయి. -
ఫండ్ ఇన్వెస్టర్లకు షాక్!
ముంబై: కరోనా వైరస్ మహమ్మారి .. మాంద్యానికి దారితీస్తుందనే భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడుతుండటంతో ఈక్విటీ, డెట్ మార్కెట్లు కకావికలం అవుతున్నాయి. తాజాగా దీని ధాటికి మ్యూచువల్ ఫండ్ సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా ఆరు డెట్ ఫండ్స్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించి.. ఇన్వెస్టర్లకు షాకిచ్చింది. వీటి నిర్వహణలో ఉన్న ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 25,000 కోట్ల దాకా ఉంటుంది. కరోనా మహమ్మారి ధాటికి ఒక ఫండ్ హౌస్ తమ స్కీములను ఈ విధంగా మూసివేయడం ఇదే ప్రథమం. ఇన్వెస్టర్ల నుంచి రిడెంప్షన్ (యూనిట్లను విక్రయించి, పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం) ఒత్తిళ్లు పెరిగిపోవడం, బాండ్ మార్కెట్లలో తగినంత లిక్విడిటీ లేకపోవడం వంటి అంశాల కారణంగా.. ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తెలిపింది. కనిష్ట స్థాయిలకు పడిపోయిన రేట్లకు హోల్డింగ్స్ అమ్మేయడం లేదా పెట్టుబడులపై మరిన్ని రుణాలు తెచ్చి తీర్చడం తప్ప మరో మార్గం లేకుండా పోయిందని సంస్థ భారత విభాగం ఎండీ సంజయ్ సాప్రే చెప్పారు. ఏదీ కుదిరే పరిస్థితి లేకపోవడంతో ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తప్పనిసరై ఆయా స్కీములను మూసివేయాల్సి వచ్చిందని వివరించారు. మూసివేతతో ఇన్వెస్టర్లపరమైన లావాదేవీలేమీ జరగకపోయినప్పటికీ .. యాజమాన్యం దృష్టికోణంలో ఇవి కొనసాగుతాయని సాప్రే చెప్పారు. మెరుగైన రేట్లకు విక్రయించి, ఇన్వెస్టర్లకు చెల్లింపులు జరుపుతామన్నారు. ‘ఇటు మార్కెట్లు, అటు ఎకానమీ ఏ దిశ తీసుకుంటాయన్నదానిపై స్పష్టత కొరవడటంతో ఇన్వెస్టర్లకు మరిం త హాని జరిగే అవకాశముందని భావించాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం‘ అని ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగం చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సంతోష్ కామత్ తెలిపారు. సుమారు 26 ఏళ్ల రీసెర్చ్ అనుభవం, 19ఏళ్లకు పైగా పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మె ంట్ అనుభవం కామత్‌కి ఉంది. ట్రిపుల్ ఎ కన్నా తక్కువ రేటింగ్ ఉండే బాండ్ల పెట్టుబడుల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. సెబీతో సంప్రదించాకే: ‘ఆరు ఫండ్ల మూసివేత నిర్ణయం ఆదరాబాదరాగా తీసుకున్నది కాదు. దీనిపై నియంత్రణ సంస్థ సెబీతో విస్తృతంగా చర్చలు జరిపాం. ప్రస్తుత పరిస్థితుల్లో మేం తీసుకున్న నిర్ణయం వెనుక సహేతుక కారణాలే ఉన్నాయని సెబీ కూడా భావించింది‘‡అని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గ్రూప్ ఎండీ వివేక్ కుద్వా తెలిపారు. తమకు నిధులు అందే తీరును బట్టి ఇన్వెస్టర్లకు క్రమానుగతంగా, ’అందరికీ సమానంగా’ చెల్లింపులు జరుపుతామన్నారు. వచ్చే కొద్ది నెలల్లో పెట్టుబడులకు వీలైనంత ఎక్కువ విలువ సాధించడం, ఇన్వెస్టర్ల ప్రయోజనాలను సాధ్యమైనంతగా పరిరక్షించడమే తమ లక్ష్యమని కుద్వా వివరించారు. ఇది టెంపుల్టన్కి మాత్రమే పరిమితం: యాంఫి 6 స్కీమ్‌ల మూసివేత అంశం కేవలం ఆయా స్కీమ్లకే పరిమితమైన దని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫి పేర్కొంది. ఇతర మ్యూచువల్ ఫండ్స్‌పై దీని ప్రభావమేమీ ఉండబోదని కాన్ఫరెన్స్ కాల్లో యాంఫి చైర్మన్ నీలేశ్ షా చెప్పారు. డెట్ స్కీముల్లో ఇన్వెస్టర్ల పెట్టుబడులు సురక్షితంగానే ఉన్నాయని భరోసానిచ్చారు. రూ.22.26 లక్షల కోట్లు ఈ మార్చి 31నాటికి మ్యూచువల్ ఫండ్స్ వద్ద సగటు నిర్వహణ నిధులు రూ.2.13 లక్షల కోట్లు మార్చి నెలలో ఫండ్స్(ఈక్విటీ, డెట్) నుంచి ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్న పెట్టుబడుల విలువ సెబీ, కేంద్రం జోక్యం చేసుకోవాలి: బ్రోకింగ్ సంస్థలు టెంపుల్టన్ ఆరు డెట్ స్కీముల మూసివేతతో ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన నెలకొందని బ్రోకింగ్ సంస్థల సమాఖ్య ఏఎన్ఎంఐ పేర్కొంది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను, కష్టార్జితాన్ని పరిరక్షించేందు కు ఆర్థిక శాఖ, సెబీ తక్ష ణం జోక్యం చేసుకుని.. పరిస్థితి చక్కదిద్దాలని కోరింది. స మస్య మూలాల గుర్తింపునకు నిపుణుల కమిటీ వేయాలని పేర్కొంది. ఏం జరిగిందంటే.... కరోనా వైరస్ ధాటికి భారత్ సహా పలు ప్రపంచ దేశాల ఈక్విటీ, బాండ్ మార్కెట్లు కుప్పకూలాయి. పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడ్డారు. అయితే, కొనేవాళ్లు కరువవడంతో .. రేట్లు గణనీయంగా పడిపోయాయి. పైపెచ్చు తక్కువ స్థాయి రేటింగ్ ఉన్న స్క్రిప్స్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. బలహీన క్రెడిట్ రేటింగ్స్ ఉన్న కంపెనీలకు బ్యాంకులు రుణాలివ్వడం దాదాపు నిలిపివేశాయి. దీంతో తక్కువ రేటింగ్ ఉన్న కంపెనీల డెట్ స్క్రిప్‌లకు డిమాండ్ భారీగా పడిపోయింది. రిస్కులు ఎక్కువున్న మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం కన్నా మిగులు నిధులను తక్కువ రాబడులు వచ్చినా రిజర్వ్ బ్యాంక్ దగ్గర సురక్షితంగా ఉంచుకునేందుకే బ్యాంకులు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లపై నమ్మకం సన్నగిల్లి ఈక్విటీలతో పాటు డెట్ మార్కెట్లకు దూరంగా ఉంటుండటంతో కొనుగోళ్లు తగ్గిపోయాయి. కరోనా వైరస్‌పరమైన మాంద్యం భయాలతో టెంపుల్టన్ మూసివేసిన ఆరు స్కీముల్లో ఇన్వెస్ట్ చేసిన వారు అయినకాడికి అమ్ముకునేందుకు మొగ్గుచూపారు. అయితే, మార్కెట్లో అమ్ముదామన్నా కొనేవారు కరువవడంతో మరో దారి లేక ఈ స్కీములను టెంపుల్టన్ మూసివేయాల్సి వచ్చింది. మిగతా డెట్ ఫండ్స్ మాటేంటి .. ఆరు స్కీమ్‌లు మూసివేసినంత మాత్రాన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ పూర్తిగా మూతబడినట్లు కాదు. దాదాపు పాతికేళ్లకుపైగా భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న టెంపుల్టన్ మరో ఏడు డెట్ ఫండ్స్‌ను కూడా నిర్వహిస్తోంది. ఏప్రిల్ 22 నాటికి వీటి నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ సుమారు రూ. 17,800 కోట్లుగా ఉంది. ఇవి కాకుండా టెంపుల్టన్ దాదాపు రూ. 36,663 కోట్ల విలువ చేసే 15 ఈక్విటీ ఫండ్స్‌ను, సుమారు రూ. 3,143 కోట్ల విలువ చేసే 11 హైబ్రిడ్ కేటగిరీ స్కీమ్‌లను (ఈక్విటీలు, డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్) నిర్వహిస్తోంది (విలువలు మార్చి 31 నాటికి). ఈ ఫండ్సన్నీ యథాప్రకారం కొనసాగుతాయని, ఇన్వెస్టర్లు ఆందోళన చెందరాదని సంస్థ పేర్కొంది. ఇప్పుడేంటి పరిస్థితి... స్కీములను మూసివేసినా ఇన్వెస్టర్లు ఇప్పటికిప్పుడు డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి కుదరదు. స్కీము వాస్తవ గడువు పూర్తయ్యేదాకా వేచి ఉండాల్సిందే. ఉదాహరణకు ఫ్రాంక్లిన్ ఇండియా లో డ్యూరేషన్ ఫండ్ సంగతి తీసుకుంటే.. సగటు గడువు బట్టి చూసినప్పుడు.. ఇన్వెస్టర్ల సొమ్ము వెనక్కి రావడానికి ఏడాది పైన 73 రోజులు పట్టొచ్చని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అలాగే ఫ్రాంక్లిన్ ఇండియా ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఫండ్ సగటు కాలావధి బట్టి చూస్తే ఇన్వెస్టర్లు మూడేళ్ల పైన 80 రోజులు దాకా వేచి చూడాల్సి రానుంది. ఈ స్కీములు మూతబడ్డాయి కాబట్టి వీటిల్లోకి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్) పద్ధతిలో పెట్టుబడులు పెడుతున్న వారి వాయిదాలు ఆటోమేటిక్‌గా ఆగిపోతాయి. కానీ సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్స్ (ఎస్టీపీ) కింద వీటిల్లో డబ్బు పెట్టిన వారికి మాత్రం చిక్కులు తప్పవు. సాధారణంగా చేతిలో భారీ మొత్తం సొమ్ము ఉన్నప్పుడు ఈక్విటీ ఇన్వెస్టర్లు ఏకమొత్తంగా పెట్టుబడి పెట్టకుండా.. ఇలాంటి డెట్ సాధనాల్లో ఉంచుతారు. బ్యాంకులు సేవింగ్స్ ఖాతాపై ఇచ్చే వడ్డీ రేటు కన్నా వీటిలో కాస్త ఎక్కువ రాబడి వస్తుందనే ఆలోచన ఇందుకు కారణం. ఇక, ఈ డెట్ సాధనాల నుంచి కొంత మొత్తాన్ని విడతలవారీగా (నెలకోసారి, వారాని కోసారి లాగా) ఈక్విటీల్లోకి ఇన్వెస్టర్లు మళ్లిస్తుంటారు. ప్రస్తుతం మూతబడిన టెంపుల్టన్ స్కీముల్లో ఇలా ఎస్టీపీ కింద భారీ మొత్తాలను ఇన్వెస్ట్ చేసినవారికి కాస్త ఇబ్బంది తప్పదనేది విశ్లేషకుల మాట. -
తగ్గే వడ్డీ రేటుతో లాభం పొందేదిలా
రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లు తగ్గనున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం దిగి వస్తుండటం నేపథ్యంలో ఆర్థిక వృద్ధికి తోడ్పాటునిచ్చేందుకు ఆర్బీఐ ఈ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని ఇప్పటికే సూచనప్రాయంగా చెప్పింది కూడా. ఇలాంటి పరిస్థితుల్లో డెట్ మార్కెట్లో ప్రయోజనాలు ఎలా పొందవచ్చన్నది తెలిపేదే ఈ కథనం. ప్రధానంగా ధరల కట్టడి కోసమే ఆర్బీఐ కఠిన పరపతి విధానాన్ని అమలు చేస్తోంది. తాజాగా వెలువడుతున్న ద్రవ్యోల్బణ గణాంకాలు కాస్త ఉపశమనం కలిగించే విధంగానే ఉన్నాయి. రాబోయే 4-6 నెలల్లో వినియోగదారుల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ 5.5 శాతం - 6.5 శాతం మధ్య స్థిరపడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది ఆర్బీఐ రెపో రేటును సుమారు 50 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చు. ద్రవ్యోల్బణం ఇదే స్థాయిలో కొనసాగి, అటు ప్రభుత్వమూ ద్రవ్య లోటు లక్ష్యాలను సాధించగలిగితే రేట్ల తగ్గింపు బహుశా బడ్జెట్ తర్వాత చేపట్టవచ్చు. ఇటువంటి పరిణామాల నడుమ రాబోయే 4-6 నెలల్లో 10 సంవత్సరాల ప్రభుత్వ బాండ్లపై ఈల్డ్ త గ్గవచ్చు. 7.55% -7.70% మధ్య ట్రేడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటప్పుడు ఇప్పటికీ కాస్త అధిక రాబడులే అందిస్తున్న షార్ట్ టర్మ్ ఇన్కమ్ ఫండ్స్, ఇన్కమ్ ఆపర్చ్యూనిటీ ఫండ్స్ వైపు ఇన్వెస్టర్లు దృష్టి పెట్టవచ్చు. ఈ తరహా ఫండ్స్ స్వల్పకాలికమైనవే కాబట్టి హెచ్చుతగ్గుల ప్రభావం తీవ్రంగా ఉండదు. అలాగే, 1-2 సంవత్సరాల కాలానికి ఇన్కమ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు కూడా పరిశీలించవచ్చు. ఎందుకంటే ఒక్కసారి ఆర్బీఐ నిర్దేశించుకున్న స్థాయిలో ద్రవ్యోల్బణం స్థిరపడిన పక్షంలో దీర్ఘకాలిక బాండ్ల ఈల్డ్ మళ్లీ క్రమంగా పెరగవచ్చు. తగ్గుతున్న వడ్డీ రేట్లతో ప్రయోజనం పొందాలనుకునే వారికోసం మరికొన్ని సాధనాలు కూడా ఉన్నాయి. డైనమిక్ బాండ్ ఫండ్స్ ఆ కోవకి చెందినవే. ఈ తరహా ఫండ్స్ నిర్వహించే సంస్థలు మార్కెట్‌ను బట్టి గరిష్ట లాభాలను దక్కించుకునేందుకు ఎప్పటికప్పుడు చురుగ్గా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇలా వడ్డీ రేట్లు పెరిగే క్రమంలోనే కాదు.. తగ్గుతున్న తరుణంలో కూడా ఈ తరహా సాధనాల ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు. -
డెట్ మార్కెట్ నుంచి రూ. 50 వేల కోట్లు ఔట్
న్యూఢిల్లీ: గత రెండు నెలల్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) 850 కోట్ల డాలర్ల(రూ. 50,600 కోట్లు) విలువైన రుణ సెక్యూరిటీల(డిబెంచర్లు తదితరాలు)ను విక్రయించారు. ఇవి సెబీ వెల్లడించిన తాజా గణాంకాలు. డెట్ మార్కెట్లలో పెట్టుబడుల ద్వారా ఆర్జించే లాభాలపై చెల్లించాల్సిన పన్నుకు సంబంధించి నిబంధనల్లో స్పష్టత కొరవడటంతో ఎఫ్ఐఐలు డెట్ మార్కెట్ల నుంచి వైదొలగుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. రూపాయి విలువ పతనంకూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. హెచ్చుతగ్గులకు లోనవుతున్న రూపాయి విలువ నేపథ్యంలో ఎఫ్ఐఐల హెడ్జింగ్ వ్యయాలు పెరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో ఎఫ్ఐఐలు నికరంగా రూ.25,000 కోట్లు ఇన్వెస్ట్చేయడం గమనార్హం.