న్యూఢిల్లీ: కార్పొరేట్ డెట్ మార్కెట్ అభివృద్ధి నిధి (సీడీఎండీఎఫ్)కి సంబంధించి సెబీ కార్యాచరణను ప్రకటించింది. ఈ తరహా ఫండ్‌లో పెట్టుబడులు పెట్టే విషయమై మ్యూచువల్ ఫండ్స్‌కు మార్గదర్శకాలను సెబీ విడుదల చేసింది. సీడీఎండీఎఫ్ ఏర్పాటుకు సంబంధించి సెబీ ఈ ఏడాది జూన్‌లోనే నిబంధనలను నోటిఫై చేయడం గమనార్హం. ఇది ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఏఐఎఫ్) విభాగం కిందకు వస్తుంది. ఆర్థిక మాంద్యం, సంక్షోభాల సమయంలో కార్పొరేట్ డెట్ సెక్యూరిటీలను కొనుగోలు చేసేందుకు ఉద్దేశించిన సన్నద్ధత సదుపాయం ఇది.
కార్పొరేట్ బాండ్ మార్కెట్లో విశ్వాసాన్ని పెంచడం, లిక్విడిటీని పెంచడమే దీని ఏర్పాటు ఉద్దేశ్యం. సీడీఎండీఎఫ్ యూనిట్లకు సంబంధించి సెబీ రెండు వేర్వేరు సర్క్యులర్‌లను జారీ చేసింది. సీడీఎండీఎఫ్ యూనిట్లను డెట్ మ్యూచువల్ ఫండ్స్, ఓపెన్ ఎండెడ్ డెట్ ఫండ్స్, ఓవర్‌నైట్, గిల్ట్ ఫండ్స్, కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ కొనుగోలు చేసుకోవచ్చు. ఈ తరహా డెట్ ఫండ్స్ తమ నిర్వహణలోని ఆస్తుల్లో 0.25 శాతాన్ని సీడీఎండీఎఫ్ యూనిట్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చని సెబీ స్పష్టం చేసింది. నిర్వహణ ఆస్తులు పెరిగే కొద్దీ, ప్రతీ ఆరు నెలలకోసారి 0.25 శాతం గరిష్ట పరిమితి మేరకు పెట్టుబడులు పెంచుకోవచ్చని పేర్కొంది.
సంక్షోభాల్లో ఆపత్కాల నిధి
మార్కెట్లు తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే సమయంలో డెట్ సెక్యూరిటీల పరంగా లిక్విడిటీ సమస్య ఏర్పడుతుంది. దీనికి పరిష్కారంగా సెబీ సీడీఎండీఎఫ్‌ను తీసుకొచి్చంది. ఆ సమయంలో కార్పొరేట్ డెట్ సెక్యూరిటీలను సీడీఎండీఎఫ్ ముందుకు వచ్చి కొనుగోలు చేస్తుంది. సాధారణ సమయంలో లో డ్యురేషన్ జీ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లుల్లో ఇన్వెస్ట్ చేస్తుందని
సెబీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment