development Fund
-
CDMDF: కార్పొరేట్ డెట్ మార్కెట్ అభివృద్ధి నిధి
న్యూఢిల్లీ: కార్పొరేట్ డెట్ మార్కెట్ అభివృద్ధి నిధి (సీడీఎండీఎఫ్)కి సంబంధించి సెబీ కార్యాచరణను ప్రకటించింది. ఈ తరహా ఫండ్‌లో పెట్టుబడులు పెట్టే విషయమై మ్యూచువల్ ఫండ్స్‌కు మార్గదర్శకాలను సెబీ విడుదల చేసింది. సీడీఎండీఎఫ్ ఏర్పాటుకు సంబంధించి సెబీ ఈ ఏడాది జూన్‌లోనే నిబంధనలను నోటిఫై చేయడం గమనార్హం. ఇది ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఏఐఎఫ్) విభాగం కిందకు వస్తుంది. ఆర్థిక మాంద్యం, సంక్షోభాల సమయంలో కార్పొరేట్ డెట్ సెక్యూరిటీలను కొనుగోలు చేసేందుకు ఉద్దేశించిన సన్నద్ధత సదుపాయం ఇది. కార్పొరేట్ బాండ్ మార్కెట్లో విశ్వాసాన్ని పెంచడం, లిక్విడిటీని పెంచడమే దీని ఏర్పాటు ఉద్దేశ్యం. సీడీఎండీఎఫ్ యూనిట్లకు సంబంధించి సెబీ రెండు వేర్వేరు సర్క్యులర్లను జారీ చేసింది. సీడీఎండీఎఫ్ యూనిట్లను డెట్ మ్యూచువల్ ఫండ్స్, ఓపెన్ ఎండెడ్ డెట్ ఫండ్స్, ఓవర్‌నైట్, గిల్ట్ ఫండ్స్, కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ కొనుగోలు చేసుకోవచ్చు. ఈ తరహా డెట్ ఫండ్స్ తమ నిర్వహణలోని ఆస్తుల్లో 0.25 శాతాన్ని సీడీఎండీఎఫ్ యూనిట్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చని సెబీ స్పష్టం చేసింది. నిర్వహణ ఆస్తులు పెరిగే కొద్దీ, ప్రతీ ఆరు నెలలకోసారి 0.25 శాతం గరిష్ట పరిమితి మేరకు పెట్టుబడులు పెంచుకోవచ్చని పేర్కొంది. సంక్షోభాల్లో ఆపత్కాల నిధి మార్కెట్లు తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే సమయంలో డెట్ సెక్యూరిటీల పరంగా లిక్విడిటీ సమస్య ఏర్పడుతుంది. దీనికి పరిష్కారంగా సెబీ సీడీఎండీఎఫ్ను తీసుకొచి్చంది. ఆ సమయంలో కార్పొరేట్ డెట్ సెక్యూరిటీలను సీడీఎండీఎఫ్ ముందుకు వచ్చి కొనుగోలు చేస్తుంది. సాధారణ సమయంలో లో డ్యురేషన్ జీ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లుల్లో ఇన్వెస్ట్ చేస్తుందని సెబీ తెలిపింది. -
కుప్పంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి.. మునిసిపాలిటీకి రూ.66 కోట్లు మంజూరు
కుప్పం(చిత్తూరు): కుప్పం మునిసిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.66 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది. 25 వార్డుల్లో అభివృద్ధి పనుల కోసం రూ.67 కోట్లకు గతంలో ప్రతిపాదనలు పంపారు. గత వారం కుప్పం నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశంలో కుప్పం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. కుప్పం కూడా తన సొంత నియోజకవర్గం పులివెందులతో సమానమని ప్రకటించారు. ఈ క్రమంలో నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వడం విశేషం. ప్రధానంగా మురుగునీటి కాలువలు, తాగునీటి కోసం నూతనంగా బోర్లు, పైప్ లైన్లు, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, అంగన్వాడీ, కమ్యూనిటీ భవనాల నిర్మాణం, దళవాయి, కొత్తపల్లె చెరువు కట్ట వద్ద పార్కు అభివృద్ధి, చెరువు నుంచి పట్టణానికి నీటి సరఫరా కోసం పైప్లైన్ల ఏర్పాటుకు ఈ నిధులను వినియోగించనున్నారు. (చదవండి: పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు.. చివరికి ట్విస్ట్) -
AP: చీఫ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఫండ్ కింద రూ.350 కోట్లు విడుదల
సాక్షి, అమరావతి: చీఫ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఫండ్ కింద రూ.350 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కో నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.2 కోట్ల చొప్పున నిధులు కేటాయించింది. నియోజకవర్గంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు నిధులు వెచ్చించనున్నారు. చదవండి: 48 గంటల్లోపు ప్రతీ ఒక్కరికీ సాయం అందించాలి: సీఎం జగన్ -
లోను బదులు గ్రాంట్ ఇవ్వండి: మోపిదేవి
-
లోను బదులు గ్రాంట్ ఇవ్వండి: మోపిదేవి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఫిషింగ్ హార్బర్లకు ఫిషరీస్, ఆక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్(ఎఫ్ఐడీఎఫ్)లోను బదులుగా తగిన గ్రాంట్ ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ కేంద్రాన్ని కోరారు. శనివారం ఆయన రాజ్యసభ జీరోఅవర్‌లో మాట్లాడారు. అనుమతులు జారీ చేసిన మూడు ఫిషింగ్ హార్బర్లకు లోను బదులు గ్రాంట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత, మిగిలినటువంటి విభజిత ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ లోటు ఎక్కువగా ఉండటం, కోవిడ్-19 ప్రభావముంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని తెలిపారు. అయినప్పటికీ భారతదేశంలోనే ఆక్వా రంగంలో ముందుండి, విదేశీ మారక ద్రవ్యాన్ని సమపార్జించడంలో ఏపీ మొదటి స్థానంలో ఉందని వివరించారు. (రాజ్యసభలో విశాఖ వాణి) ఏపీకి సంబంధించి ఇప్పటికే అనుమతులు మంజూరు చేసినటువంటి మూడు ఫిషింగ్ హార్బర్లు నిజాంపట్నం(ఫేస్-2) అంచనా వ్యయం రూ. 379.17 కోట్లు, మచిలీపట్నం(ఫేస్-2) అంచనా వ్యయం రూ.285.609 కోట్లు, ఉప్పాడ అంచనా వ్యయం రూ. 350.44కోట్లకు భారత ప్రభుత్వ వాటా క్రింద ఒక్కొక్కదానికి రూ.150 కోట్లు మంజూరు చేసింది. అంటే రూ.450కోట్లు ఎఫ్ఐడీఎఫ్ రుణంగా కాకుండా, మొత్తం గ్రాంటు రూపంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సిదిగా ఎంపీ రాజ్యసభలో కేంద్రాన్ని కోరారు. (ఐదేళ్లలో సాగునీటి కోసం రూ. లక్ష కోట్లు) -
ఊహించిందే జరిగింది!
నిజామాబాద్: వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్జీఎ ఫ్) విడుదలలో అంతా అనుకున్నట్టే జరిగింది. వచ్చే ఏడా ది నుంచి కేంద్రం ఈ పథకాన్ని ఎత్తివేయనున్నట్లు ప్రచా రం జరిగినా, 2014-15 ప్రతిపాదనలకు సైతం మోక్షం కలగలేదు. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఇటీవలే బీఆర్జీ నిధులు విడుదల కాగా, ఆ జాబితాలో ఉన్న జిల్లాకు మొండిచెయ్యే ఎదురైంది. ఈ నెలాఖరు వరకైనా జిల్లా నుంచి ప్రతిపాదించిన రూ.25.34 కోట్ల విలువ చేసే 1,934 పనులకు నిధులు వస్తాయని అందరూ భావించారు. ఆ నిధులు విడుదల కాకపోగా, వచ్చే సంవత్సరం నుంచి బీఆర్జీఎఫ్ ఉండబోదని ఇదివరకే సంకేతం ఇచ్చిన కేంద్రం ఈ బడ్జెట్లో కేటా యింపులు కూడ ఇవ్వలేదు. దీంతో వచ్చే ఏడాది మాట పక్కనబెడితే, ఈ ఏడాది నిధులూ నిలిచిపోవడంపై నిరాశ వ్యక్తం అవుతోంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదనలు ముందే పంపినట్లరుుతే ఈ సమస్య ఉండేది కాదు. జిల్లా పరిషత్ అధికారులు గ్రామాలు, మండలాలవారీగా ప్రతిపాదనలు తెప్పించి ప్ర భుత్వామోదంతో హైపవర్ కమిటీకి పంపే ప్రయత్నం చేసినా, అదే సమయంలో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు మార్పులు, చేర్పులకు పట్టుబట్టడం, జడ్పీ, డీపీ సీలలో ఆమోదించి పంపడంలో ఆలస్యం జరిగింది. ఫలితంగా ‘కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన’ చందంగా మారింది. ఆలస్యమే అసలు కారణం జిల్లాలోని 36 మండలాలు నిజామాబాద్ కార్పొరేషన్, కామారెడ్డి, ఆర్మూరు, బోధన్ మున్సిపాలిటీల నుంచి 1934 పనుల కోసం రూ.25.34 కోట్లకు ప్రతిపాదనలు 2014 జూన్ వరకు ఢిల్లీ హైపవర్ కమిటీకి చేరివుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్న చర్చ ఉంది. అధికారులు ఇదే ఉద్దేశ్యంతో పనులకు మే మాసంలోనే ప్రతిపాదనలు కో రారు. అప్పుడున్న ప్రత్యేకాధికారులు వాటిని సిద్ధం చేసి పంపించారు. అప్పుడున్న కలెక్టర్ సిఫారసుతో ప్రభుత్వం ద్వారా కేంద్ర హైపవర్ కమిటీకి పంపిచేందుకు స న్నాహాలు చేస్తున్న క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మ్రోగింది. ఎన్నికల ప్రక్రియలో మునిగిపోయిన అధికారులు బీఆర్జీఎఫ్ ప్రతిపాదనలను పక్కబెట్టారు. ఆ తర్వాతైన పంపేందుకు కొత్త పాలకవర్గంతో జడ్పీ సర్వసభ్యసమావేశం, డీపీసీ ఆమోదం కోసం ప్రయత్నాలు చేశారు. ఇదే సమయంలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యు లు, జడ్పీటీసీ సభ్యులు ప్రతిపాదనలలో తేడా వచ్చిందంటూ మార్పులు, చేర్పులకు దిగారు. దీంతో కొంతకాలం వేచి చూసిన అధికారులు బీఆర్జీఎఫ్ మార్గదర్శకాల ప్రకారం పనుల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అరుుతే, వాటిని ఢిల్లీ హైపవర్ కమిటీకి చేరవేయడంలో జరిగిన జాప్యం కారణంగానే నిధుల విడుదలకు అంతరాయం కలిగినట్లు చెబుతున్నారు. కమిషనర్ కాన్ఫరెన్స్‌తో స్పష్టత పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనిత రాంచంద్రన్ బీఆర్జీ నిధులపై స్పష్టత ఇవ్వడంతో ఆ నిధుల విడుదలపై భ్రమలు తొలగాయి. మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె భవిష్యత్‌లో బీఆర్జీఎఫ్ నిధులుండవని పేర్కొంటూ చివరగా వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కే టాయించినట్లు స్పష్టం చేశారు. ఒకవేళ బీఆర్జీఎఫ్ విడుదలైతే గ్రామ పంచాయతీలలో 1,255 పనులకు రూ.1012.40 లక్షలు, మండల పరిషత్‌లకు 346 పనులకు రూ . 607.30లక్షలు, జిల్లా పరిషత్ 174 పనులకు రూ.405 లక్షలు, మున్సిపాల్టీలు 135 పనులకు గాను రూ.509.30 లక్షలు ఖర్చు చేసే అవకాశం ఉండేది. పాత ప్రతిపాదనలు తిరస్కరణకు గురి కాగా, 2015-16 కోసం సిద్ధం చేసిన ప్రతిపాదనలు కూడా ఇక ఉత్తవే కానున్నాయి.