
టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్ (ట్విటర్) వంటి సంస్థలను విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న ఎలాన్ మస్క్ సంపద భారీగా ఆవిరవుతోంది. ఇటీవల తన నికర విలువలో 120 బిలియన్ డాలర్లు (రూ. 10లక్షల కోట్ల కంటే ఎక్కువ) తగ్గింది. అయితే.. 330 బిలియన్ డాలర్ల సంపదతో, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నప్పటికీ.. 2025 ప్రారంభం నుంచి సంపదలో 25 శాతం క్షీణతను పొందారు. ఇది ఇలాగే కొనసాగితే.. నెం.1 స్థానానికే ముప్పు ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
మస్క్ తరువాత స్థానంలో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ (Jeff Bezos), ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) ఉన్నారు. మస్క్ సంపద ఇలాగే తగ్గుతూ పోతే.. ప్రపంచ కుబేరుడి స్థానాన్ని మరొకరు స్వాధీనం చేసుకుంటారు.
మస్క్ సంపద తగ్గడానికి కారణం
మస్క్ సంపద తగ్గడానికి ప్రధాన కారణం టెస్లా (Tesla) అని తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండటం వల్ల.. టెస్లా అమ్మకాలు 2024 డిసెంబర్ నుంచి 2025 జనవరి వరకు 16 శాతం తగ్గాయి. అంతే కాకుండా గత రెండు నెలల్లో, టెస్లా షేర్ ధర దాదాపు 35% తగ్గింది. దీంతో మస్క్ సంపద గణనీయంగా తగ్గింది.
ఇదీ చదవండి: ఎక్స్‌పై సైబర్ ఎటాక్ ఆ దేశం పనే!
మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే సంస్థలు కూడా పెరిగాయి. దీంతో చాలామంది కొత్త కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. దెబ్బకు టెస్లా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు పడిపోయాయి. అమ్మకాల్లో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాల్సి వచ్చింది. కాగా టెస్లా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.
రాజకీయ ప్రమేయం
ప్రపంచ కుబేరుడు, దిగ్గజ వ్యాపారవేత్త మస్క్ సంపద తగ్గడానికి మరో కారణం.. పెరుగుతున్న రాజకీయ ప్రమేయం అని తెలుస్తోంది. ట్రంప్ ఎన్నికల ప్రచారానికి మస్క్ భారీగా ఖర్చు చేశారు. దీంతో అమెరికా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (DOGE) అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత కొంతమంది పెట్టుబడిదారులతో భయం మొదలైంది. ఇది కూడా మస్క్ కంపెనీ షేర్స్ తగ్గడానికి కారణమైంది.
Comments
Please login to add a commentAdd a comment