world richest man
-
Forbes richest list 2024: టాప్–10లో ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు సాధించారు. 2024 ఏడాదికి ఫోర్బ్స్ టాప్–10 బిలియనీర్లలో 9వ ర్యాంకును పొందారు. 116 బిలియన్ డాలర్ల సంపదతో 66 ఏళ్ల ముకేశ్ టాప్–9గా నిలిచారు. 2023లో ముకేశ్ సంపద 83.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. కాగా.. దేశీయంగా సంపదలో టాప్–2గా నిలుస్తున్న గౌతమ్ అదానీ 84 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో 17వ ర్యాంకును అందుకున్నారు. యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల కారణంగా 2023లో అదానీ సంపద 47.2 బిలియన్ డాలర్లకు క్షీణించిన సంగతి తెలిసిందే. హిండెన్‌బర్గ్ ఆరోపణలను తోసిపుచ్చిన నేపథ్యంలో అదానీ గ్రూప్ తిరిగి బలపడింది. ఇక 2022లో అదానీ 90 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌ను సాధించడం ప్రస్తావించదగ్గ అంశం! జాబితా ఇలా ఫోర్బ్స్ 2024 బిలియనీర్ల జాబితాలో 2,781 మంది వ్యక్తులు చోటు సాధించారు. గతేడాది జాబితాతో పోలిస్తే 141 మందికి అదనంగా చోటు లభించింది. 2023తో పోలిస్తే కుబేరుల ఉమ్మడి సంపద 2 లక్షల కోట్ల డాలర్లు పెరిగి 14.2 ట్రిలియన్ డాలర్లను తాకింది. సరికొత్త రికార్డ్ నమోదైన 2021తో పోలిస్తే 1.1 లక్షల కోట్ల డాలర్లు జత కలసింది. ఫ్యాషన్స్, కాస్మెటిక్స్ దిగ్గజం ఎల్వీఎంహెచ్కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ 233 బిలియన్ డాలర్లతో టాప్ ర్యాంకును, 195 బిలియన్ డాలర్లతో ఎలన్ మస్క్ రెండో ర్యాంకునూ కొల్లగొట్టారు. 177 బిలియన్ డాలర్లతో ఫేస్బుక్ జుకర్‌బర్గ్ టాప్–3గా నిలిచారు. -
అపరకుబేరుడు ఎలోన్ మస్క్‌కి భారీ షాక్
ప్రపంచంలోనే అపరకుబేరుడిగా ఉన్న ఎలోన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. 9 నెలల కాలంలో తొలిసారి బ్లూమ్‌బెర్గ్ వరల్డ్ రిచెస్ట్ బిలియనీర్ జాబితాలో స్థానాన్ని కోల్పోయారు. టెస్లా కంపెనీ షేర్లు 7.2 శాతం కుప్పకూలిపోవడంతో బిలియనీర్ల స్థానంలో తొలిస్థానంలో ఉన్న మస్క్ రెండో స్థానానికి పడిపోయారు. యథావిధిగా అమెజాన్ అధినేత జెఫ్‌బెజోస్ 200 బిలియన్ డాలర్ల సంపదతో తొలిస్థానాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం మస్క్ నెట్‌వర్త్ 198 బిలియన్లుగా ఉంది. అంత వేతనం వదులు కోవాల్సిందే టెస్లా సంస్థ సీఈఓగా ఉన్న ఎలోన్ మస్క్ 2018లో అన్నీ రకాల ప్రయోజనాల్ని కలుపుకుని 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5లక్షల కోట్లు) వేతనాన్ని తీసుకుంటున్నారు. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా నిలిచారు. అయితే, మస్క్‌కు అంత వేతనం అందుకోవడంపై టెస్లా పెట్టుబడిదారుల్లో ఒకరైన రిచర్డ్ టోర్నెట్టా.. డెలావర్ కోర్టును ఆశ్రయించారు. పలు మార్లు ఈ అంశంపై డెలావర్ కోర్టు విచారణ చేపట్టింది. తాజాగా మస్క్ 55 బిలియన్ డాలర్ల వేతనాన్ని వదులుకోవాలని ఆదేశించింది. ఆ తీర్పుతో టెస్లా షేర్లు పడిపోవడం, ఆ సంస్థలో అత్యధిక షేర్లున్న మస్క్ సంపదపై ప్రతికూల ప్రభావం పడింది. ఫలితంగా బ్లూమ్‌బెర్గ్ ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయారు. పడిపోయిన టెస్లా కార్ల ఎగుమతులు దానికి తోడు చైనాలోని షాంఘైలోని టెస్లా ఫ్యాక్టరీ నుండి కార్ల ఎగుమతులు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కనిష్ట స్థాయికి పడిపోయాంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో టెస్లా షేర్లు పడిపోయాయి. అదే సమయంలో అమెజాన్‌లో అమ్మకాలో జోరందుకోవడం ఆ సంస్థ అధినేత జెఫ్‌బెజోస్‌కి కలిసి వచ్చింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానం దక్కించుకునేందుకు దోహదం చేసింది. -
ప్రపంచంలోనే ధనిక కుటుంబం.. ఆస్తులు తెలిస్తే నోరెళ్లబెడతారు!
రాజ కుటుంబాలకు విలాసవంతమైన భవనాలు, తరిగినపోని ఆస్తులు, వ్యాపారాలు ఉంటాయి. కోటానుకోట్ల రూపాయాలు కూడా వాళ్ల సొంతం! అయితే ప్రపంచంలో కోట్ల ఆస్తులు ఉన్న రాజ కుటుంబాలు ఉన్నప్పటీకి యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ రాజ కుటుంబం చాలా ప్రత్యేకమైంది. చాలా తక్కువ మంది మాత్రమే తమ ఆస్తుల వివరాలు బయటి ప్రపంచానికి వెల్లడిస్తారు! ఇటువంటి రాజ కుటుంబాల ఆస్తులు, సౌకర్యాలు, వ్యాపార విలువ తెలిస్తే.. మనమంతా నోరెళ్లబెట్టక తప్పదు! యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు సుమారు 4,078 కోట్ల అధ్యక్ష భవనం(మూడు అమెరికా పెంటాగన్ భవనాలతో సమానం), 8 ప్రైవేట్ జెట్స్, అత్యంత విలువైన ఫుట్‌బాల్ క్లబ్ కలిగి ఉన్నారు. ఈ రాజ కుటుంబం ప్రపంచ చమురు నిల్వల్లో సుమారు 6శాతం కలిగి ఉంది. అదే విధంగా మాంచెస్టర్ నగరంలోని ఫుట్ క్లబ్, ప్రముఖ కంపెనీల్లో వందల షేర్లు కూడా ఉన్నాయ. అందులో హాలీవుడ్ గాయాని బ్యూటీ బ్రాండ్ నుంచి ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ సంస్థ వరకు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ షేర్లు ఉండటం గమనార్హం. యూఏఈ రాజకుటుంబానికి చెందిన మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ చిన్న తమ్ముడు షేక్ హమద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ వద్ద సుమారు 700 ఖరీదైన కార్లు ఉన్నారు. అందులో ప్రపంచంలోనే అతిపెద్ద SUV వాహనంతో పాటు ఐదు బుగట్టి వేరాన్‌లు, ఒక లంబోర్గిని వరెన్టన్, ఒక మెర్సిడెస్ బెంజ్ CLK GTR, ఒక ఫెరారీ 599XX, ఒక Mc12 ఆర్ఎన్ వాహనాలు ఉన్నాయి. ఇక.. ఈ రాజకుటుంబం నివాసం ఉండే కస్ర్ అల్-వతన్ ( యూఏఈ అధ్యక్ష భవనం) ఆ దేశంలోనే అత్యంత పెద్ద రాజభవనంగా గుర్తింపు పొందింది. ఈ ప్యాలెస్ సుమారు 94 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 3,50,000 ప్రత్యేకమైన క్రిస్టల్స్‌లో తయారు చేయబడిన షాన్డీలియర్, విలువైన చారిత్రక కళాఖండాతో పాలెస్ అబ్బుర పరిచేలా ఉంటుంది. في كلّ ركنٍ قصة من وحي تاريخ دولة الإمارات العربية المتحدة! اكتشفوا قصص تراث الأمة الغني والعظيم وخططوا لزيارتكم إلى #قصر_الوطن اليوم. #في_أبوظبي pic.twitter.com/Uv4zQH6bXb — Qasr Al Watan (@QasrAlWatanTour) November 1, 2022 మరోవైపు అధ్యక్షుడి సోదరుడు తహ్నౌన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. రాజకుటుంబంలోనే ప్రధానమైన పెట్టుబడి కంపెనీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీని విలువ ఐదేళ్ల కాలంలో 28,000 శాతం పెరిగింది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ 235 బిలియన్ డాలర్లు. ఈ కంపెనీ వ్యవసాయం, చమురు, వినోదం, సముద్ర వ్యాపారాలను కలిగి ఉంది. అదీకాక కంపెనీ పదివేల మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. యూఏఈ కాకుండా ఈ రాజ కుటుంబానికి లండన్, పారిస్ వంటి ప్రపంచశ్రేణి నగరాల్లో విలువైన ఆస్తులు ఉండటం గమనార్హం. ఇక రాజ కుటుంబంలోని మాజీ కుటుంబ పెద్దకు ‘లండన్ భూస్వామి’ అనే పేరు ఉండటం విశేషం. 2015లో వెలువడిన ఓ నివేదిక ప్రకారం బ్రిటన్ రాజ కుటుంబంతో పోటీపడే ఆస్తులు యూఏఈ రాజ కుటుబానికి ఉన్నాయని పేర్కొన్నారంటే.. వీరి ఆస్తుల విలువ ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! 2008లో మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. యూకే ఫుట్‌బాల్ టీం(మాంచెస్టర్ సీటీ)ను సుమారు 2,122 కోట్ల భారీ ధరకు కోనుగోలు చేసి సంచలనం సృష్టించారు. యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ది 18 మంది సోదరులు, 11 మంది సోదరీమణులు గల పెద్ద రాజ కుటుంబం. ఆయనకు 9 మంది పిల్లలు, 18 మంది మనవలు, మనవరాళ్లు ఉండటం గమనార్హం. చదవండి: ఇరాన్‌పై ప్రతీకారదాడి.. పాక్ అమెరికాను సంప్రదించిందా? -
ప్రపంచ కుబేరుల జాబితాలో 'రతన్ టాటా' ఎందుకు లేరు - కారణం ఇదే!
ప్రపంచం కుబేరుల జాబితాలోనే కాదు, భారతదేశంలోని టాప్ 10 ధనవంతుల లిస్ట్‌లో కూడా దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'రతన్ టాటా' (Ratan Tata) పేరు ఎందుకు లేదనే సందేహం ఇప్పటికే చాలామంది మనసులో ఒక ప్రశ్నగా మిగిలి ఉంటుంది. ఈ కథనంలో ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ఉప్పు నుంచి కార్లు, విమానం, బంగారం, ఐటీ వంటి అన్ని రంగాల్లోనూ తమదైన రీతిలో దూసుకెళ్తున్న టాటా సన్స్ కంపెనీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఈయన సంపద వేల కోట్లలో ఉంటుంది. అయినప్పటికీ ధనవంతుల జాబితాలో ఈయన పేరు లేదు. దీనికి ప్రధాన కారణం ఎక్కువ డబ్బుని దాతృత్వానికి వినియోగించడమే. అపారమైన వ్యాపార సామ్రాజ్యం, అంతకు మించిన పేరు ప్రతిష్టతలు కలిగిన రతన్ టాటా 2022లో భారతదేశంలోని ధనవంతుల జాబితాలో 421వ స్థానంలోనూ.. 2021లో 433వ స్థానంలో నిలిచారు. కంపెనీ నుంచి వచ్చే ఆదాయంలో దాదాపు 66 శాతం టాటా ట్రస్టుల ద్వారా సేవా కార్యక్రమాలకు విరాళంగా అందిస్తున్నారు. ఈ కారణంగానే టాప్ 10 ధనవంతుల జాబితాలో కూడా ఉండలేకపోతున్నారు. ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాపై కేసు నమోదు.. కారణం ఇదే! 2021 - 22లో టాటా కంపెనీల మొత్తం ఆదాయం 128 బిలియన్ డాలర్లు అని నివేదికలు చెబుతున్నాయి. టాటా సంస్థల్లో ఏకంగా 9,35,000 కంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. కాగా రతన్ టాటా 2012లో టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. -
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు.. లక్షల కోట్లకు..
ఆధునిక ప్రపంచంలో సంపన్నులెవరు? అంటే వెంటనే గుర్తొచ్చేది ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్. భారతదేశం విషయానికి వస్తే ముఖేష్ అంబానీ పేరు చెబుతారు. వీరందరికంటే ముందు ఒకప్పుడు ఈ భూమిపైన అత్యంత సంపన్నుడెవరు? అనగానే 'మన్స ముస' (Mansa Musa) పేరే వినిపించేది. ఇంతకీ ఆయనెవరు? ఈయన సంపద విలువ ఎంత ఉండొచ్చు? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, 14వ శతాబ్దంలో ఆఫ్రికన్ చక్రవర్తి అయిన మన్స ముస ఈ భూమిపై నివసించిన అత్యంత ధనవంతుడని నమ్ముతారు. చరిత్ర పుటల్లో కలిసిపోయిన ఈ సంపన్నుడు 1280 ADలో జన్మించినట్లు, పశ్చిమ ఆఫ్రికాలోని విస్తారమైన మాలి సామ్రాజ్యానికి 1312 ADలో రాజై పరిపాలించినట్లు తెలుస్తోంది. ఈయన సంపద విలువ సుమారు 400 బిలియన్ డాలర్లని అంచనా.. అంటే ఇప్పటి భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 30 లక్షల కోట్లు కంటే ఎక్కువ. మాన్సా మూసా సంపద.. ప్రస్తుతం ఎలాన్ మస్క్ సంపద 235 బిలియన్ డాలర్లు, జెఫ్ బెజోస్ నికర విలువ 150 బిలియన్ డాలర్లు. ఇప్పటి ప్రపంచ కుబేరులకంటే మన్స ముస సంపద రెట్టింపు అనే చెప్పాలి. అప్పట్లో ఆ దేశపు వనరులు ఉప్పు, బంగారం. (ఇదీ చదవండి: ఆత్మీయుల మరణంతో సన్యాసం - ఓ కొత్త ఆలోచనతో వేల కోట్లు!) చరిత్రకారుల ప్రకారం.. హజ్ తీర్థయాత్ర కోసం మాలి నుంచి మక్కాకు ఆఫ్రికాలోని సహారా ఎడారిలో ప్రయాణం సాగించిన అతి తక్కువ మందిలో మన్స ముస ఒకరని, అప్పట్లోనే ఈ మార్గంలో వంద ఒంటెలు, భారీ మొత్తంలో బంగారం, 12000 మంది సేవకులు, 8000 మంది అనుచరులను తన వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. (ఇదీ చదవండి: ప్రపంచ దేశాల్లో వణుకుపుట్టిస్తున్న భారత్ నిర్ణయం - బియ్యం ధరల్లో పెనుమార్పులు!) మన్స ముస ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన రాజు మాత్రమే కాదు, దాతృత్వానికి ప్రసిద్ధి చెందాడు. ఈ కారణంగానే ఇతన్ని 'కింగ్ ఆఫ్ కింగ్స్' అని పిలిచేవారు. తన ప్రజలకు బంగారాన్ని విరివిగా దానం చేసేవాడని, మాలి సామ్రాజ్యం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారాన్ని ఉత్పత్తి చేసిన ఘనత పొందిందని చెబుతున్నారు. -
పారిస్‌లో ప్రపంచ కుబేరుల లంచ్ మీట్: ఫోటోలు వైరల్
ప్రపంచ కుబేరులు ఒకేవేదికపై దర్శనమివ్వడం విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచంలోనే ఇద్దరు అత్యంత ధనవంతులు, ఎలోన్ మస్క్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ వారి కుటుంబ సభ్యులతో కలిసి పారిస్‌లో కలిశారు. జూన్ 14 నుండి జూన్ 17 వరకు ఫ్రాన్స్‌లోని పెయిర్స్‌లో జరిగిన వివా టెక్నాలజీ సదస్సు 7వ ఎడిషన్‌కు వీరు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు శుక్రవారం లంచ్ కోసం కలుసుకున్నారు. తల్లి మేయే మస్క్‌తో కలిసి టెస్లా సీఈవో మస్క్ హాజరు కాగా, ఎల్ఎఈఎంహెచ్ ఛైర్మన్, సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ అతని ఇద్దరు కుమారులు - ఆంటోయిన్ , అలెగ్జాండ్రే ఆర్నాల్ట్‌తో వచ్చారు. ఆంటోయిన్ ఆర్నాల్ట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేశారు. మరోవైపు "కలిసి పని చేద్దాం! అంటూ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మస్క్‌తో కలిసి ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు. NEW: Elon Musk expresses his support for free speech at the Viva Technology event in Paris, France. It's crazy that this is a controversial take in 2023. "We should have free speech as much as possible... We want to allow the people to express themselves." "Free speech matters… pic.twitter.com/PGZrdmNSML — Collin Rugg (@CollinRugg) June 16, 2023 కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో యూరోప్ అతిపెద్ద స్టార్టప్ అండ్ టెక్ ఈవెంట్ జరుగుతోంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా టెక్ లీడర్లు, స్టార్టప్‌లు, ప్రధాన కార్పొరేషన్లు, పెట్టుబడిదారులను కనెక్ట్ చేయాలనేది ప్లాన్. ఈ ఈవెంట్లో ట్విటర్ బాస్ మస్క్, అతిపెద్ద ఫ్యాషన్ ప్రపంచం అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రధాన వక్తలుగా ఉన్నాయి. వీరితోపాటు ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, సేల్స్‌ఫోర్స్ కో-ఫౌండర్ మార్క్ బెనియోఫ్, మెటా యాన్ లెకున్లోని వైస్‌ప్రెసిడెంట్, ఏఏ చీఫ్ ఏసైంటిస్ట్ కూడా ప్రసంగించారు. (హైదరాబాద్‌లో 38 శాతం ఇళ్లు అమ్ముడు పోవడం లేదట!ఎందుకో తెలుసా?) కాగా ఫోర్బ్స్ ప్రకారం, మస్క్ నికర విలువ 236.9 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తి కాగా, బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబం 233.4 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు) -
ఇప్పుడు ప్రపంచ కుబేరుడు ఇతడే..
World Richest Person Elon Musk: ప్రపంచ కుబేరుల జాబితాలో రెండవ స్థానంలో ఉన్న టెస్లా సీఈఓ 'ఎలాన్ మస్క్' (Elon Musk) ఎట్టకేలకు మొదటి స్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించాడు. ప్రపంచంలోని 500 మంది ధనవంతుల జాబితాలో ఆయన అగ్రస్థానంలో నిలిచాడు. ద్రవ్యోల్బణం నేపథ్యంలో టెక్ పరిశ్రమ కష్టాల కారణంగా ఆర్నాల్ట్ డిసెంబర్లో మస్క్‌ను అధిగమించారు. అయితే ఎట్టకేలకు మళ్ళీ ఆ స్థానాన్ని మస్క్ సొంతం చేసుకున్నారు. (ఇదీ చదవండి: భారతీయ వంటకాలపై మనసులో మాట చెప్పిన ఎలాన్ మస్క్) బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ అందించిన సమాచారం ప్రకారం.. ఎలాన్ మస్క్ సంపద సుమారు 192.3 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా ఇప్పుడు రెండవ స్థానానికి చేరిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ సంపద 186.6 బిలియన్ డాలర్లు. ఏప్రిల్ నుంచి LVMH షేర్లు క్రమంగా తగ్గుముఖం పట్టి 10 శాతం పడిపోయాయి. ఈ కారణంగా ఆర్నాల్డ్ నికర విలువ ఒక్క రోజులోనే 11 బిలియన్ డాలర్లు తగ్గిపోయాయి. దీంతో ఎలాన్ మస్క్ మళ్ళీ మొదటి స్థానం సొంతం చేసుకున్నాడు. -
ప్రపంచ బిలియనీర్ వారసుడి కోసం కసరత్తు: అదృష్టం ఎవరికి దక్కేనో?
న్యూఢిల్లీ: ఫ్రెంచ్ ప్రముఖ వ్యాపారవేత్త పంచంలోని అత్యంత ధనవంతుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్ (74) తన వారసుడి కోసం వేట మొదలుపెట్టారు. వాల్ స్ట్రీట్ జర్నల్స్ నివేదిక ప్రకారం, లూయిస్ విట్టన్ సీఈవో తర్వాత వ్యాపారాన్ని ఎవరు స్వాధీనం చేసుకోవాలో అనేది ఆర్నాల్ట్ నిర్ణయించాలని తన ఐదుగురు పిల్లలను నెలకోసారి కలుసుకుని మరీ చర్చిస్తున్నారు. విలాసవంతమైన సామ్రాజ్యానికి వారసులుగా ఆర్నాల్ట్ తన పిల్లల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారని భావిస్తున్నారు. ప్రపంచ లగ్జరీ ప్రాడక్ట్స్ లూయిస్ విట్టన్ మోయెట్ హెన్నెస్సీ చైర్మన్ ,సీఈవో ఆర్నాల్ట్ ప్రస్తుతం వారసుడికోసం వెతుకున్నారు. ఈ కసరత్తులో భాగంగానే తన ఐదుగురి పిల్లలతో విట్టన్ ప్రధాన కార్యాలయంలో ప్రైవేట్ డైనింగ్ రూమ్‌లో లంచ్ సమయంలో కలిసారట. ఈసందర్భంగా కంపెనీకి సంబంధించిన అంశాలు, వ్యూహాలను చర్చించినట్టు వాల్ స్ట్రీట్ నివేదించింది. దాదాపు 90 నిమిషాలపాటు ఈ భేటీ కొనసాగింది. ఆర్నాల్ట్ వారసుడి కోసం పిల్లలతో విస్తృత చర్చలు జరుపుతున్నప్పటికీ ఎవర్ని ఆ అదృష్టం వరించనుందనే దాన ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు. కుమార్తె డెల్ఫిన్ ఇప్పటికే పలు కీలక బాధ్యతల్లో సంతానం ఆర్నాల్ట్ పిల్లలు కంపెనీలో ముఖ్యమైన స్థానాల్లో ఉన్నారు. ముఖ్యంగా కుమార్తె డెల్ఫిన్ రెండవ అతిపెద్ద బ్రాండ్ క్రిస్టియన్ డియోర్‌కు హెడ్‌గా ఉండగా, కుమారుడు ఆంటోయిన్ లూయిస్ విట్టన్ హోల్డింగ్ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఫ్రెడెరిక్ ఆర్నాల్ట్ TAG హ్యూయర్ సీఈవోగా ఉన్నాడు. అలెగ్జాండ్రే ఆర్నాల్ట్ టిఫనీలో ఎగ్జిక్యూటివ్, ఆర్నాల్ట్ తోబుట్టువులలో చిన్నవాడు, జీన్, లూయిస్ విట్టన్ వాచ్ డిపార్ట్మెంట్ కోసం మార్కెటింగ్ , ప్రొడక్ట్ డెవలప్మెంట్ బాధ్యతల్లో ఉన్నాడు. బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రస్థానం మార్చి 5, 1949న ఫ్రాన్స్‌లోని రౌబైక్స్లో వ్యాపార కుటుంబంలో జన్మించిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఇంజనీర్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. ఎకోల్ పాలిటెక్నిక్‌లో చదివిన తరువాత అతను ఫెర్రేట్ సవినెల్ నిర్మాణ సంస్థలో ఇంజనీర్‌గా కరియర్‌ను మొదలుప ఎట్టి, 1978లో సంస్థ ఛైర్మన్ పదవికి ప్రమోట్ అయ్యాడు. ఆ తర్వాత ఫ్యాషన్ ప్రపంచంపై అతని ఆసక్తితొ ఒక లగ్జరీ బ్రాండ్‌ను లాభదాయక కంపెనీగా అభివృద్ధి చేశాడు. 1989 నుండి లూయిస్ విట్టన్ మె కంపెనీకి చైర్మన్, సీఈవోగా ఉన్నారు. రెండు వివాహాల ద్వారా బెర్నార్డ్ ఆర్నాల్ట్‌కు ఐదుగురు పిల్లలు ఉన్నారు. కాగా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ని అధిగమించి ఆర్నాల్ట్ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఏప్రిల్ 19 నాటికి అతని సంపద 208 బిలియన్ డాలర్లు. -
World's Richest Man: ఇప్పుడు ఎలాన్ మస్క్ కాదు, మరెవరో తెలుసా?
ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానాన్ని ఎలాన్ మస్క్ మళ్ళీ కోల్పోయాడు. మొదటి స్థానంలో చేరిన కేవలం 48 గంటల్లోనే కిందికి వచ్చేసారు. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్ బిలినియర్స్ ఇండెక్స్ వెల్లడించింది. అమెరికా స్టాక్ మార్కెట్లలో టెస్లా షేర్ ధర రెండు ట్రేడింగ్ సెషన్లలో 7శాతానికిపైగా పడిపోయింది. దీనితో మస్క్ సంపద 176 మిలియన్లకు చేరింది. ఇటీవల ప్రపంచ కుబేరుల జాబితాలో 187.1 బిలియన్ డాలర్ల సంపదతో మొదటి స్థానాన్ని పొందిన ఎలాన్ మస్క్ ఇప్పుడు రెండవ స్థానంలో ఉన్నారు. అయితే ప్రస్తుతం వరల్డ్ రిచెస్ట్ పర్సన్‌గా లూయిస్ విటన్ సంస్థ సీఈవో 'బెర్నార్డ్ అర్నాల్ట్' చేరాడు. ప్రస్తుతం అర్నాల్ట్ సంపద 187 బిలియన్ డాలర్లు. (ఇదీ చదవండి: Mahindra Thar RWD: మొన్న విడుదలైంది.. అప్పుడే కొత్త ధరలు) ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో భారతదేశానికి చెందిన ముఖేష్ అంబానీ 79.9 బిలియన్ డాలర్ల సంపాదనతో 11 స్థానంలో, గౌతమ్ అదానీ 44.7 బిలియన్ డాలర్ల సంపాదనతో 28వ స్థానంలో నిలిచారు. చైనాలో కరోనా మహమ్మారి ప్రభావం వల్ల, అదే సమయంలో ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ సొంతం చేసుకోవడం వల్ల టెస్లా కంపెనీపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దీనితో చైనాలో టెస్లా కార్ల అమ్మకాలు చాలా తగ్గిపోయాయి. -
టెస్లా జోష్: మస్త్..మస్త్..అంటూ దూసుకొచ్చిన ఎలాన్ మస్క్
న్యూఢిల్లీ: టెస్లా సీఈవో, ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ అపరకుబేరుడిగా నిలిచాడు. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో నెంబర్ వన్ స్థానానికి ఎగబాగాడు. ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. 2023లో టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మస్క్ నికర విలువ 28 ఫిబ్రవరి నాటికి 187 బిలియన్ డాలర్లు. 2023లో మస్క్ సంపద దాదాపు 50 బిలియన్ డాలర్లు లేదా 36 శాతం పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మస్క్ మొత్తం నికర విలువ 187 బిలియన్ డాలర్లకు చేరుకోగా, రెండవ స్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్ నికర విలువ 185 బిలియన్ డాలర్లు. గత ఏడాది అధిక నష్టాల కారణంగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రెండవ స్థానానికి పడిపోయిన సంగతి తెలిసిందే. తాగా టెస్లా షేర్లు భారీగా పుంజుకోవడంతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించాడు.ఈ ఏడాదిలో టెస్లా స్టాక్ 100 శాతం ఎగిసింది. గత ఏడాది డిసెంబరులో మస్క్ సంపద 200 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోగా, ఆర్నాల్డ్ సంపదపెరగడంతో మస్క్‌ను బెర్నార్డ్ ఆర్నాల్ట్ అధిగమించిన సంగతి తెలిసిందే. అటు ప్రపంచంలోని బిలియనీర్ల జాబితాలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 84.3 బిలియన్ డాలర్ల ఆస్తులతో ఫోర్బ్స్ జాబితాలో 8వ స్థానంలో ఉన్నారు. మరోవైపు ఒకప్పుడు ప్రపంచంలోని రెండవ అత్యంత సంపన్న స్థానంలో అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ 37.7 బిలియన్ డాలర్ల సంపదతో ఈ సూచీలో 32వ స్థానానికి పడిపోయాడు. అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపణలతో అదానీ గ్రూపు షేర్లన్నీ భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. -
బిలియనీర్ గౌతం అదానీకి ఝలక్, 24 గంటల్లో..
న్యూఢిల్లీ: ప్రపంచ సంపన్నుల జాబితా నుంచి బిలియనీర్, అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, గౌతం అదానీ నాలుగో స్థానానికి పడిపోయారు. తాజా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో అదానీ ఈ జబితాలో మూడో స్థానం నుంచి ప్రస్తుతం నాల్గవ స్థానంలో ఉన్నారు. గత 24 గంటల్లో అదానీ నికర విలువ 872 మిలియన్ డాలర్లకు పడిపోయింది. గత ఏడాది (జనవరి 24, 2022) నుంచి అదానీ 683 మిలియన్ల డాలర్ల సంపదను కోల్పోయారు. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం, ఫ్రెంచ్ విలాసవంతమైన బ్రాండ్ లూయిస్ విట్టన్ వ్యవస్థాపకుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొత్తం నికర విలువ 188 బిలియన్ డాలర్లు టాప్‌లో ఉన్నారు. టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ 45 బిలియన్ డాలర్లతో నికర విలువతో రెండో స్థానంలో ఉండగా, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 121 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలోకి దూసుకొచ్చారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 84.7 బిలియన్ డాలర్లనికర విలువతో ప్రపంచంలోని పన్నెండవ సంపన్న వ్యక్తిగా నిలిచారు. అంతకుముందు ముఖేష్ అంబానీ తొమ్మిదో స్థానంలో ఉన్నారు. మరోవైపు చైనాలో మాంద్యం దెబ్బ చైనాకు చెందిన బిలియనీర్ హుయ్ కా యాన్‌ను గట్టిగా తాకింది. అతిపెద్ద రియల్ ఎస్టేట్ ఎవర్‌గ్రాండే గ్రూప్‌కు చైర్మన్ యాన్ సంపద ఏకంగా 93 శాతం కుప్పకూలింది. 42 బిలియన్ల డాలర్ల సంపద కాస్తా 3 బిలియన్ డాలర్లకు కరిగిపోవడం గమనార్హం. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల రోజువారీ జాబితాలో టాప్ టెన్‌లో నిలిచిన బిగ్ షాట్స్ బిల్ గేట్స్ (నికర విలువ 111 బిలియన్ డాలర్లు), వారెన్ బఫెట్ (108 బిలియన్ డాలర్లు), లారీ ఎలిసన్ (99.5 బిలియన్ డాలర్లు), లారీ పేజ్ (92.3 బిలియన్ డాలర్లు), సెర్గీ బ్రిన్ (88.7 బిలియన్ డాలర్లు), స్టీవ్ బాల్మెర్ (86.9 బిలియన్ డాలర్లు). -
రిటైర్మెంట్ దిశగా ప్రపంచ అపరకుబేరుడు!
ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు?.. కొన్నిరోజుల కిందటి దాకా టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ఉండేవాడు. కానీ, ట్విటర్ కొనుగోలు వ్యవహారం.. దానికి తోడు టెస్లా నష్టాలతో రికార్డు స్థాయి పతనం చెంది రెండో స్థానానికి దిగజారాడు. అప్పటి నుంచి ఫ్రాన్స్ వ్యాపార దిగ్గజం బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రపంచ అపరకుబేరుడిగా తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే.. ఈ పెద్దాయన ఇప్పుడు రిటైర్మెంట్ ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తన విలాసవంతమైన వ్యాపార సామ్రాజ్యానికి వారసులను ఒక్కొక్కరిగా ప్రకటించుకుంటూ వెళ్తున్నారు బెర్నార్డ్ ఆర్నాల్ట్(73). తాజాగా కూతురు డెల్‌ఫైన్‌కు ఎల్వీఎంహెచ్ తరపున రెండో అతిపెద్ద బ్రాండ్ డియోర్ బాధ్యతలు అప్పజెప్తున్నట్లు ప్రకటించారాయన. నెల కిందట.. పెద్ద కొడుకు ఆంటోనీ ఆర్నాల్ట్‌కు వ్యాపారంలో విస్తృత బాధ్యతలు అప్పజెప్తున్నట్లు ప్రకటించారాయన. అలాగే.. బెర్నాల్ట్ ఆర్నాల్ట్‌కు ఇద్దరు భార్యల(ఒకరు మాజీ) ద్వారా మొత్తం ఐదుగురు పిల్లలు. ఆ ఐదుగురికి తన వ్యాపారాన్ని అప్పజెప్పే ప్రణాళికను ఒక్కోక్కటిగా అమలు చేస్తూ ముందుకెళ్తున్నారు. తద్వారా వ్యాపార రంగం నుంచి తప్పుకుని విశ్రాంతి తీసుకోవాలనే యోచనలో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ► మరేయితర కంపెనీలు, ఫ్రాంఛైజీలతో సంబంధం లేకుండా.. కేవలం ఎల్వీఎంహెచ్ వ్యాపార సామ్రాజ్యం ద్వారానే బెర్నార్డ్ ఆర్నాల్ట్.. ఆదాయం అర్జిస్తున్నారు. ప్రస్తుతం ఫోర్బ్స్ ప్రకారం ఆ విలువ 196 బిలియన్ డాలర్లు. ► యూరప్‌లోనే లగ్జరీ బ్రాండ్‌గా పేరున్న LVMH Moët Hennessy – Louis Vuitton SEకు సహ వ్యవస్థాపకుడు, చైర్మన్, సీఈవో బాధ్యతలు కూడా ప్రస్తుతం బెర్నాల్డ్ ఆర్నాల్ట్ నిర్వహిస్తున్నాడు. ► 1949 మార్చి 5వ తేదీన రౌబయిక్స్లో జన్మించాడు బెర్నార్డ్ జీన్ ఎటిన్నె ఆర్నాల్ట్. బార్న్ విత్ గోల్డెన్‌గా ఆర్నాల్ట్‌కు పేరుంది. తల్లిదండ్రులిద్దరూ వ్యాపార దిగ్గజాలే. అయితే.. ఇంజినీరింగ్ చదువు పూర్తి చేసుకుని.. సొంతంగా రియల్ ఎస్టేట్ కంపెనీతో ఎదగడం ప్రారంభించాడు ఆర్నాల్ట్. ► ఆపై తండ్రి వ్యాపారాలను గమినిస్తూ, ఆయన నుంచి ఏసాయం ఆశించకుండా.. సొంత బిజినెస్‌లతో ఎదిగాడు. 80వ దశకం వచ్చేనాటికి.. సొంతంగా ఓ లగ్జరీ ఉత్పత్తుల కంపెనీ ఉండాలనే ఆలోచనలతో.. LVMH ను 1987లో నెలకొల్పాడు. ► ఏడాది తిరిగే సరికి అది బిలియన్‌న్నర డాలర్ల విలువ గల కంపెనీగా ఎదిగింది. అటుపై కంపెనీలో మేజర్ షేర్లు కొనుగోలు చేసి.. ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ బోర్డుకు చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. ► 2001 నుంచి ఎల్వీఎంహెచ్ విపరీతమైన లాభాలు ఆర్జించడం మొదలుపెట్టింది. తద్వారా ఫ్రాన్స్.. యూరప్ నుంచి కాస్ట్లీ బ్రాండ్ కంపెనీగా ఎదిగింది. ► 2013లో ఫ్రాన్స్ ఎన్నో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంది. ఆ సమయంలో పన్నుల ఎగవేత కోసం ఆయన బెల్జియం పౌరసత్వం కోసం దరఖాస్తు చేశాడనే ప్రచారం తెర మీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. దరఖాస్తును వెనక్కి తీసుకున్నారాయన. ► ప్రముఖుల విమానాల కదలికలపై ట్విటర్ నిఘా వేయడంతో.. 2022లో ఆయన ప్రైవేట్ జెట్‌ను అమ్మేసినట్లు ప్రకటించారు. అప్పటి నుంచి ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను అద్దెకు తెచ్చుకుని, లేదంటే బిజినెస్ ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నాడాయన. ► తన బిడ్డలకు పాఠాలు చెప్పిన మాస్టార్‌కు కృతజ్ఞతగా.. అతని కొడుకుకు అధ్యక్ష ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు ఆర్నాల్ట్. 2017లో ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో ఈ అపర కుబేరుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్‌ను మద్దతు ప్రకటించారు. ఆయన తండ్రి బ్రిగిట్టే మాక్రోన్.. ఆర్నాల్ట్ పిల్లలకు పాఠాలు చెప్పేవారట. ► డెల్ఫైన్(47) ఆర్నాల్ట్ వారసుల్లో పెద్దది. పదేళ్లుగా తండ్రి వెంట ఉంటూ ఆయన వ్యాపారాలను దగ్గరగా గమనిస్తోంది. దీంతో తదుపరి బాధ్యతలు ఆమెకే అప్పగిస్తారనే చర్చ ఇప్పటి నుంచే జోరందుకుంది. అయితే.. ► గత పదేళ్లలో ఆమె తీసుకున్న స్వతంత్ర నిర్ణయాలు బెడిసి కొట్టింది లేదు. సమర్థవంతమైన నిర్ణయాలకు కేరాఫ్ అనే పేరుంది ఆమెకు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి డియోర్ బాధ్యతలు స్వీకరిస్తారామె. లూయిస్ విట్టన్ వ్యాపారాన్ని సమర్థవంతంగా నడిపిస్తుండడంతో.. ఎల్‌వీఎంహెచ్‌ను కూడా ఆమె ముందకు తీసుకెళ్లగలరనే ధీమాతో బోర్డు మెంబర్స్ ఉండడం కూడా ఆమెకు కలిసొచ్చే అంశం. ► అత్యంత లగ్జరీ బ్రాండ్‌గా పేరున్న ఎల్వీఎంహెచ్(LVMH) కంపెనీ సీఈవో బాధ్యతల నుంచి ఆర్నాల్ట్ అంత సులువుగా తప్పుకోకపోవచ్చనే వాదనా ఒకటి వినిపిస్తోంది. అందుకు కారణం కిందటి ఏడాది సీఈవో వయసు పరిమితిని ఎల్వీఎంహెచ్ ఎత్తేయడం. తద్వారా ఆర్నాల్ట్ 80 ఏళ్లు వచ్చేదాకా కూడా తన బాధ్యతల్లో కొనసాగవచ్చు. కానీ, ► అనారోగ్య కారణాల దృష్ట్యానే ఆయన బాధ్యతల నుంచి విరమణ తీసుకోవాలని భావిస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెప్తుండడం గమనార్హం. -
గౌతమ్ అదానీ దూకుడు.. ఏకంగా బెజోస్‌కే ఎసరు
సాక్షి,ముంబై: భారతీయ బిలియనీర్, పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో మరో పెట్టు పైకి ఎక్కారు. అదానీ గ్రూప్ స్టాక్స్‌లో ఇటీవలి ర్యాలీతో ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్న వ్యక్తిగా అవతరించారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం, సెప్టెంబర్ 16, 2022 నాటికి అదానీ నికర విలువ 155.7 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే అదానీ సంపద 5.5 బిలియన్లు లేదా దాదాపు 4శాతం పెరిగింది. (బెజోస్ మస్క్ సరే! అదానీ,అంబానీ సంపద మాట ఏంటి?) అమెజాన్ జెఫ్ బెజోస్‌ను అధిగమించి రెండో అత్యంత సంపన్న వ్యక్తి స్థానాన్ని సాధించారు. ఫోర్బ్స్ రియల్ టైం డేటా ప్రకారం 273.5 బిలియన్ డాలర్లతో నికర విలువతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న టెస్లా సీఈవోన్ ఎలాన్ మాస్క్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. ఇదీ చదవండి: బెజోస్ నుంచి మస్క్ దాకా,ప్రపంచ బిలియనీర్లకు భారీ షాక్ కాగా 2022ఏడాదిలో ఇప్పటివరకు అదానీ సంపద 70 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. ఈ సంవత్సరం తన నికర విలువ పెరిగిన ప్రపంచంలోని టాప్-10 సంపన్న వ్యక్తులలో ఒకరు మాత్రమే. ఈ ఏడది ఫిబ్రవరిలో ఆసియా ధనికుడిగా ముఖేశ్ అంబానీని అధిగమించారు. ఏప్రిల్‌లో సెంటి బిలియనీర్ అయ్యారు. మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ బిల్ గేట్స్‌ను గత నెలలో ప్రపంచంలోని నాలుగో సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఆ తరువాత ఆసియాలోనే గ్లోబల్ రిచెస్ట్ పర్సన్స్ జాబితాలో మూడో వ్యక్తిగా రికార్డు సృష్టించారు. తాజాగా తన రికార్డును తానే అధిగమించి రెండో స్థానాన్ని సాధించిన తొలి ఆసియా కుబేరుడిగా నిలిచారు గౌతమ్ అదానీ. అంతేకాదు ఈ దూకుడు ఇలాగే కొనసాగితే ఫస్ట్ ప్లేస్చేరుకోవడం కూడా పెద్దకష్టమేమీ కాదని బిజినెస్ వర్గాలు భావిస్తున్నాయి. -
ప్రపంచంలోనే అత్యంత బాల కుబేరుడు ఎవరో తెలుసా?
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న పిల్లాడు ఆషామాషీ బుడ్డోడేమీ కాదు, ఇతగాడు బాలకుబేరుడు. పట్టుమని పదేళ్ల వయసైనా లేదు గాని, వయసుకు మించినన్ని లగ్జరీ కార్లు, రాజప్రాసాదాన్ని తలపించే భవంతి, ఒక ప్రైవేటు విమానం ఇతడి సొంతం. ఈ నైజరీయన్ బాలకుబేరుడి పేరు మహమ్మద్ అవల్ ముస్తఫా. నైజీరియాలో ఇతడు ‘మోంఫా జూనియర్’గా ఫేమస్. ఈ బాలకుబేరుడి కథా కమామిషూ ఏమిటంటే, ఇతడి తండ్రి ఇస్మాయిలా ముస్తఫా నైజీరియాలో ఇంటర్నెట్ సెలిబ్రిటీ. ‘మోంఫా’ పేరుతో బాగా ఫేమస్. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఇతగాడి ఫాలోవర్ల సంఖ్య 12 లక్షల మందికి పైమాటే! ‘మోంఫా’ ప్రధాన ఆదాయ వనరు ఇంటర్నెట్ అయితే, దీనితో వచ్చిన ఆదాయంతో వేర్వేరు వ్యాపారాలూ సాగిస్తూ ఇబ్బడిముబ్బడిగా డబ్బు గడిస్తున్నాడు. తన కొడుకు ‘మోంఫా జూనియర్’కు మూడేళ్ల కిందట– 2019లో అతడి ఆరో పుట్టినరోజు సందర్భంగా లాగోస్ నగరంలో రాజప్రాసాదాన్ని తలపించే ప్యాలెస్‌ను కానుకగా ఇచ్చాడు. ‘మోంఫా జూనియర్’ కూడా ఇప్పుడు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో బాగా ఫేమస్ అయ్యాడు. బ్రాండెడ్ దుస్తులతో, లగ్జరీ కార్లతో పోజులిస్తూ ఫొటోలు పెడుతుండటంతో ఈ బాలకుబేరుడికి ఫాలోవర్లు బాగానే పెరుగుతున్నారు. ఇదిలా ఉంటే, బాలకుబేరుడి తండ్రి సీనియర్ ‘మోంఫా’ మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటుండటం గమనార్హం. -
బిల్‌గేట్స్, ఎలాన్ మస్క్ మాటల యుద్ధం
ఇద్దరు ప్రపంచ కుబేరుల మధ్య భేదాభిప్రాయాలు భగ్గుమంటున్నాయి. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ మధ్య మాటల పోరు ముదిరింది. టీ కప్పులో తుఫాన్‌లా మొదలైన వీరి కొట్లాట వ్యక్తిగత నిందారోపణల వరకు వచ్చింది. పర్యావరణ పరిరక్షణకు కోట్లాది డాలర్లు కుమ్మరిస్తున్న వీరి మధ్య గొడవ చివరకు ఆ ఫండింగ్పై ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది... ప్రపంచ కుబేరుల్లో అగ్ర స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్, మాజీ నంబర్‌వన్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీని దెబ్బతీయడానికి గేట్స్ లక్షలాది డాలర్లు వెచ్చిస్తున్నారన్న వార్తలు వీరి మధ్య విభేదాలకు నాంది పలికాయి. ట్విటర్ కొనుగోలు యత్నాల్లో ఉన్న మస్క్‌ను అడ్డుకునేందుకు గేట్స్ ఫౌండేషన్ యత్నిస్తోందన్న ఒక వెబ్సైట్ కథనం మస్క్‌కు మరింత కోపం తెప్పించింది. దీంతో గేట్స్‌పై, ఆయన ప్రోత్సహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంపై తీవ్ర విమర్శలకు దిగారు. గేట్స్‌ను అపహాస్యం చేసేలా కామిక్ ఫొటో కూడా ట్వీట్ చేయడంతో వారి మధ్య దూరం మరింత పెరిగింది. మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేస్తే తప్పుడు సమాచార వ్యాప్తి మరింత పెరుగుతుందంటూ గేట్స్ కూడా పరోక్ష విమర్శలు చేశారు. గతంలో నూ వీరిద్దరూ చిన్న చిన్న విసుర్లు విసురుకున్నా తాజాగా మాటల యుద్ధం బాగా ముదిరింది. విభేదాలు పెంచిన కథనం ట్విటర్‌ను మస్క్ 4,400 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసే యత్నాల్లో ఉన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ట్విటర్ అడ్వర్టైజర్లకు పలు సంస్థలు బహిరంగ లేఖ రాశాయి. వీటిలో 11 సంస్థలకు గేట్స్ ఫౌండేషన్ నిధులందించిందంటూ బ్రిట్‌బార్ట్ అనే వెబ్సైట్ తాజాగా కథనం వెలువరించింది. దీనిపై మస్క్‌ను కొందరు ట్విటర్లో ప్రశ్నించగా అదో ఒక పనికిమాలిన చర్య అంటూ తిట్టిపోశారు. అంతేగాక టెస్లాలో షార్ట్ పొజిషన్లు (షేర్ మార్కెట్లో ఒక కంపెనీ ధర పడిపోతుందనే అంచనాతో తీసుకునే పొజిషన్లు) అధికంగా తీసుకున్నారంటూ గేట్స్‌ను దుయ్యబట్టారు. గేట్స్‌ను గర్భిణితో పోలుస్తూ ఎమోజీ షేర్ చేశారు. ‘‘షార్ట్ పొజిషన్లపై గేట్స్‌ను నిలదీశా. శీతోష్ణస్థితి మార్పులపై మా కంపెనీ ఎంతో పోరాటం చేస్తోంది. అలాంటి కంపెనీలో షార్ట్ పొజిషన్లు తీసుకున్న గేట్స్ దాతృత్వాన్ని, పర్యావరణంపై పోరును నేనైతే సీరియస్‌గా తీసుకోలేను’’ అంటూ దులిపేశారు. పర్యావరణంపై పోరు పేరిట టెస్లా పెద్దగా చేస్తున్నదేమీ లేదంటూ గేట్స్ గతంలో ఎద్దేవా చేశారు. కొన్ని ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసినంత మాత్రాన పర్యావరణ మార్పును అడ్డుకున్నట్టు కాదన్నారు. ట్విటర్‌పై రగడ ట్విటర్‌ను మస్క్ కొనుగోలు చేయడంపై గేట్స్ గతంలోనూ నెగెటివ్‌గా స్పందించారు. మస్క్ నేతృత్వంలో ట్విటర్లో అసత్య సమాచారం మరింత పెరగొచ్చంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘పారదర్శకత కూడా లోపిస్తుంది. నేను ప్రోత్సహించే టీకాలు మనుషుల ప్రాణాలు తీస్తాయని, వాళ్లను నేను ట్రాక్ చేస్తున్నానని వ్యాఖ్యలు చేసే మస్క్ ఆధ్వర్యంలో ట్విటర్లో ఎలాంటి వార్తలు వ్యాపిస్తాయో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు. అప్పట్నుంచీ గేట్స్‌పై మస్క్ గుర్రుగా ఉన్నారు. తాజా కథనం నేపథ్యంలో తన కసినంతా విమర్శల రూపంలో వెళ్లగక్కారు. అయితే మస్క్ ట్వీట్లను పట్టించుకోనని గేట్స్ సమాధానమిచ్చారు. గతంలో మస్క్ బిట్‌కాయిన్‌లో వాటా కొన్నప్పుడూ గేట్స్ పరోక్ష విమర్శలు చేశారు. అయితే వీరి మధ్య విభేదాలు ఇంతలా ఎందుకు పెరిగాయన్నది అంతుబట్టని విషయం. ఈ కొట్లాట మరింత ముదిరితే దాని ప్రభావం వారు పర్యావరణ పరిరక్షణకు ఇచ్చే నిధులపై పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ,అదానీ స్థానమేంటో తెలుసా ??
-
ఆ వ్యక్తి ఏడు నిమిషాలకే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడయ్యాడు!.. ఎలాగో తెలుసా?
Man Became worlds Richest For 7 Minutes: నిజానికి అపర కుభేరుడుగా మారాలంటే వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ దాగి ఉంటుంది. ఎన్నో కష్టాలు, త్యాగాలు, సవాళ్లును చవిచూసిన తర్వాత గానీ సాథ్యం కాదు. కానీ ఇక్కడొక వ్యక్తి కేవలం బిజినెస్ పెట్టిన కొద్ది వ్యవధిలోనే టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్‌ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మారిపోయాడు. అయితే ఆ తర్వాత అతను కంపెనీని మూసేశాడు ఎందుకో తెలుసా! అసలు విషయంలోకెళ్తే...యూకేకి చెందిన యూట్యూబర్ మాక్స్ ఫోష్ ఒకం కంపెనీని ఏర్పాటు చేశాడు. అయితే యూకేలో కంపెనీ సెటప్ చేయడం చాలా సులభం. అంతేకాదు కంపెనీ హౌస్ అని ఒకటి ఉంది. ఫోష్ కంపెనీ పెట్టే నిమిత్తం ఆ కంపెనీ హౌస్‌కి సంబంధించిన ఫారంని పూర్తి చేశాడు. అంతేకాదు కంపెనీ పేరుకు చివర కచ్చితంగా లిమిటెడ్‌తో ముగియాలి అందుకని ఫోష్ తన కంపెనీ వెంచర్‌కి 'అన్ లిమిటెడ్ మనీ లిమిటెడ్' అని పేరు పెట్టాడు. పైగా తన కంపెనీ షేర్లను 10 బిలినియన్లగా నిర్ణయించి రిజిస్టర్ చేయించాడు. ఆ షేర్లలో ఒకదానిని 50 పౌండ్లకు విక్రయించినట్లయితే, అది అతని కంపెనీకి చట్టబద్ధంగా 500 బిలియన్ పౌండ్లు విలువ ఇస్తుంది. ఈ మేరకు యూట్యూబర్ లండన్ వీధిలో రెండు కుర్చీలు, టేబుల్‌తో తన దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. అయితే మొదట్లో పెట్టుబడి దారుల కోసం కొంత ఇబ్బంది పడవలసి వచ్చింది. ఆ తర్వాత ఒక మహిళ అతని కంపెనీలో 50 పౌండ్లకు ఒక షేర్ని కొనుగోలు చేసింది. దీంతో అతను ఏడు నిమిషాల పాటు ఎలెన్ మాస్క్‌ని అధిగమించి మరీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అయిపోయాడు. అయితే ఆ తర్వాత అతను అధికారుల నుంచి ఒక లేఖను అందుకున్నాడు. అందులో ఇలా ఉంది. "మాకు అందిన సమాచారం ప్రకారం మనీ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ 500 బిలియన్ పౌండ్లుగా అంచనా వేయబడింది. ఆదాయ కార్యకలాపాలు లేకపోవడం వల్ల, మీరు మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొవలసి వస్తుంది. అందువల్ల అన్లిమిటెడ్ మనీ లిమిటెడ్‌ను అత్యవసరంగా రద్దు చేయాలని సిఫార్సు చేస్తున్నాం" అని ఉంది. ఆ తర్వాత ఫోష్ ఆ పనే చేశాడు. మార్కెట్ క్యాపిటల్ లోసుగులు వినయోగించి ఇలాంటి పనులకు పాల్పడితే ఇలానే దొరికిపోతారు. అయితే ఈఘటనకు సంబంధించిన వీడియోని ఫోష్ సోషల్ మీడియాలోని నెటిజన్లుతో పంచుకున్నాడు. -
కంపెనీలో ఫుడ్ సర్వ్ చేసేవాడు..! ఇప్పుడు ఆ ఒక్కటే అంబానీనే దాటేలా చేసింది...!
ఒకప్పుడు మెక్‌డోనాల్డ్స్ ఔట్లెట్లో కస్టమర్లకు బర్గర్స్‌ను, కూల్ డ్రింక్స్ సర్వ్ చేసేవాడు. కట్ చేస్తే..ఇప్పుడెమో ముఖేశ్ అంబానీ సంపదనే దాటేసి ప్రపంచ కుబేర్ల జాబితాలో 11 వస్థానాన్ని కైవసం చేసుకున్నాడు చైనీస్ కెనాడియన్ చాంగ్‌పెంగ్ జావో. ఆ ఒక్క దానితో దశ తిరిగింది..! టెక్ బిలియనీర్లు ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ , మార్క్ జుకర్‌బర్గ్ వంటి ప్రపంచ కుబేర్ల జాబితాలో చాంగ్‌పెంగ్ జావో నిలిచేందుకు ఆ ఒక్కటి ఎంతగానో ఉపయోగపడింది. అదే క్రిప్టోకరెన్సీ..! ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫాం బినాన్స్‌ను స్థాపించి ఒక్కసారిగా ప్రపంచ కుబేరులకే సవాలును విసిరాడు జావో. బ్లూమ్‌బర్గ్ విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం...జావో నికర విలువ 96 బిలియన్ డాలర్లకు చేరుకుందని పేర్కొంది. దీంతో ఇండియన్ టైకూన్ ముఖేష్ అంబానీ స్థానాన్ని కూడా దాటేశాడు. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రిప్టో బిలియనీర్ జావో అలియాస్ సీజెడ్ అవతారమెత్తాడు. సాఫ్ట్వేర్ డెవలపర్..! జావో సాఫ్ట్వేర్ డెవలపింగ్‌లో సిద్ధ హస్తుడు. అంతేకాకుండా బ్లాక్ చైయిన్ టెక్నాలజీను వేగంగా అలవర్చుకున్నాడు. 2008లో వచ్చిన క్రిప్టోకరెన్సీ భవిష్యత్తులో వాడే డిజిటల్ కరెన్సీగా చెలామణీ అవుతుందనే నమ్మకం అతన్ని ఒమ్ము చేయలేదు. బినాన్స్‌ను 2017లో స్థాపించి క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌కు అద్బుతమైన ప్లాట్‌ఫాంను క్రియేట్ చేశాడు ఈ సీజెడ్. ఈ ప్లాట్‌ఫాం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫాంగా నిలుస్తోంది. కలిసొచ్చిన ఆదరణ..! తొలినాళ్లలో క్రిప్టోకరెన్సీపై ఉన్న ఆదరణ గణనీయంగా పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలపై పెట్టుబడి పెట్టేందుకు సిద్దమయ్యారు. ఇప్పుడే అదే ఆదరణ జావోను ప్రపంచ కుబేర్ల జాబితాలో ఉంచేలా చేసింది. బినాన్స్ రెగ్యులేటరీ ఫైలింగ్‌ల సమీక్ష ప్రకారం... ఒక్క 2021లో 20 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇక కంపెనీలో జావో సుమారు 90 శాతం మేర షేర్లను కల్గి ఉన్నాడు. అంతకుమించే...! ఇక జావో బహిరంగంగా తన వ్యక్తిగత క్రిప్టో హోల్డింగ్స్ గురించి ఎక్కడా వ్యాఖ్యానించలేదు. అదే విధంగా, ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజ్ అయిన బినాన్స్ ఆర్థిక విషయాల గురించి పెద్దగా బహిర్గతం చేయదు. ఎందుకంటే ఇది ఒక ప్రైవేట్ క్రిప్టో ఎక్స్ఛేంజ్. బినాన్స్‌లో రోజుకు 170 బిలియన్ డాలర్ల క్రిప్టో ట్రేడ్లను ప్రాసెస్ చేస్తుంది. జావో పూర్తి సంపద ఎంతో తెలిస్తే అందరు షాక్ అవ్వడం కాయం. పూర్తిగా స్వచ్చంద సంస్ధకే..! జావో తన సంపదలో ఎక్కువ భాగాన్ని స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తానని ఒక ఇంటర్య్వూలో చెప్పాడు. అంతేకాకుండా.. ‘వ్యక్తిగతంగా, నేను ఆర్థికంగా స్వేచ్ఛగా ఉన్నాను. నాకు డబ్బు అవసరం అంతగా లేదు.రాక్ఫెల్లర్ లాగే నా సంపదలో మెజార్టీ భాగాన్ని స్వచ్చంద సంస్థలకే అంకింతమని అన్నాడు. జావో తన సంపదలో 95 శాతం లేదా 99 శాతం స్వచ్చంద సంస్థలకే ఇవ్వాలనుకుంటున్నాడు. చదవండి: స్కార్పియో కావాలన్న కెన్యా పోలీసులు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్ -
జస్ట్ ఆ పది మంది సంపాదనే 400 బిలియన్ డాలర్లు!
సంపాదించడం ఎంత కష్టమో.. ఖర్చు పెట్టడం అంత సులువు. ఈ సూత్రం అందిరికీ వర్తించదు. అలాగే క్షణాల్లో కోట్లు సంపాదించి.. అంతే వేగంగా కోటాను కోట్లు పొగొట్టుకున్న వ్యాపార దిగ్గజాలను మన కళ్ల ముందే చూస్తున్నాం. 2021 ముగింపు సందర్భంగా ఈ ఏడాది అత్యధికంగా సంపాదించిన అపర కుబేరుల జాబితాను ఓసారి పరిశీలిద్దాం. ర్యాంకింగ్‌లను పక్కనపెట్టి.. కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే వాళ్ల సంపాదనను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. ఇక ఈ సంపాదనలో సింహభాగం ఒక్కడిదే కావడం.. ఆ ఒక్కడు ఎలన్ మస్క్ కావడం మరో విశేషం. ఎలన్ మస్క్.. ఆయన సంపాదన 277 బిలియన్ డాలర్లు. ఇందులో ఈ ఏడాది సంపాదించింది అక్షరాల 121 బిలియన్ డాలర్లు. 60 శాతం పెరిగిన టెస్లా షేర్లు, సొంత కంపెనీ స్పేస్ఎక్స్ ఒప్పందాలతో ఈ ఏడాది విపరీతంగా సంపాదించాడీయన. తద్వారా కుబేరుల జాబితాలో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. బెర్నార్డ్ ఆర్నాల్ట్.. ఫ్రెంచ్ వ్యాపార దిగ్గజం బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొత్తం సంపద 176 బిలియన్ డాలర్లు. ఇందులో ఈ ఏడాది సంపాదన 61 బిలియన్ డాలర్లు. యూరప్ దేశాల అత్యంత ధనికుడిగా పేరున్న ఈ 72 ఏళ్ల వ్యాపార దిగ్గజం.. ప్రపంచంలోనే లగ్జరీ గూడ్స్ కంపెనీ పేరున్న ఎల్వీఎంహెచ్కు చైర్మన్‌గా, సీఈవోగా కొనసాగుతున్నారు. లారీ పేజ్.. ఈయన కంప్యూటర్ సైంటిస్ట్, గూగుల్ కో-ఫౌండర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆల్ఫాబెట్ కంపెనీ(గూగుల్ మాతృక సంస్థ)ను ఈ ఏడాది కూడా విజయవంతంగా నడిపించడంలో కీలక పాత్ర పోషించాడు లారీ పేజ్. ఈ గూగుల్ మాజీ సీఈవో మొత్తం సంపద 130 బిలియన్ డాలర్లు కాగా, కేవలం ఈ ఏడాదిలో 47 బిలియన్ డాలర్ల ఆదాయం(షేర్ల రూపేనా) వెనకేసుకున్నాడు. సెర్గె బ్రిన్.. గూగుల్ మరో సహ వ్యవస్థాపకుడు. ఈ ఏడాది 45 బిలియన్ డాలర్ల సంపాదనతో ఏకంగా 100 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేశాడు. సెర్గె బ్రిన్(48) మొత్తం సంపాదన 125 బిలియన్ డాలర్లు. ఈయనకు ఆల్ఫాబెట్ కంపెనీలో 38 మిలియన్ షేర్లు ఉన్నాయి. స్టీవ్ బాల్మర్ మైక్రోసాఫ్ట్ కంపెనీ మాజీ సీఈవో. ఎన్బీఏ లాస్ ఏంజెల్స్ క్లిపర్స్ టీం యాజమాని కూడా. తన వ్యాపారంతో పాటు మైక్రో సాప్ట్ కంపెనీ(కంపెనీ లాభాల వల్ల)లో ఉన్న షేర్ల ద్వారా ఈ ఏడాది 41 బిలియన్ డాలర్లు సంపాదించాడు స్టీవ్ బాల్మర్(65). ల్యారీ ఎల్లిసన్ ఒరాకిల్ చైర్మన్, వ్యవస్థాపకుడు ఈయన. సుమారు ఇరవై ఏళ్ల తర్వాత ఈ నెలలో భారీ ఆదాయం వెనకేసుకుంది ఒరాకిల్ కంపెనీ. దీంతో ఈ 77 ఏళ్ల వ్యాపార దిగ్గజం 29 బిలియన్ డాలర్లు సంపాదించడంతో పాటు 109 బిలియన్ డాలర్ల మొత్తం సంపదతో సెంచరీ బిలియన్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మార్క్ జుకర్‌బర్గ్ మెటా కంపెనీ(ఫేస్బుక్) సీఈవోగా ఈ ఏడాది 24 బిలియన్ డాలర్ల సంపాదన వెనకేసుకున్నాడు మార్క్ జుకర్‌బర్గ్. కంపెనీ పేరు మారినా, వివాదాలు వెంటాడినా.. లాభాల పంట మాత్రం ఆగలేదు. మెటాలో ఇతనికి 13 శాతం వాటా ఉంది. ఈ ఏడాది 20 శాతం పెరిగింది జుకర్‌బర్గ్ సంపద. ఇదిలా ఉంటే ఈ టాప్ 10 లిస్ట్‌లో అత్యంత చిన్నవయస్కుడిగా నిలిచాడు మార్క్ జుకర్‌బర్గ్(37). వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హాత్వే సీఈవో. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా తన సంపదలో సగం సేవా కార్యక్రమాలకు ఇస్తానని ప్రకటించాడు. కానీ, ఈసారి ఈ ప్రకటన వర్కవుట్ కాలేదు. కంపెనీ షేర్ల తీరు ఆశాజనకంగా సాగలేదు. దీంతో కేవలం 21 బిలియన్ డాలర్ల ఆదాయం మాత్రమే వెనకేసుకున్నాడు. 91 ఏళ్ల ఈ వ్యాపార దిగ్గజం మొత్తం సంపద విలువ 109 బిలియన్ డాలర్లుగా ఉంది. బిల్‌గేట్స్ దానాలు చేసుకుంటూ పోతున్నా.. బిల్‌గేట్స్ ఆదాయంపై ఎలాంటి ప్రభావం పడడం లేదు. ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ షేర్ల రూపంలో బాగానే గిట్టుబాటు అయ్యింది. ఏడు బిలియన్ల డాలర్లు సంపాదనతో.. సంపదను 139 బిలియన్ డాలర్లకు పెంచుకున్నాడు 66 ఏళ్ల గేట్స్. జెఫ్ బెజోస్ అమెజాన్ ఫౌండర్. ఎలన్ మస్క్‌తో పోటాపోటీగా వార్తల్లో నిలిచిన పర్సనాలిటీ. ప్రపంచంలోనే రెండో అత్యంత ధనికుడిగా కొనసాగుతున్నాడు. అయితే ఈ ఏడాది ఆయన మొత్తం వెనకేసుకుంది కేవలం 5 బిలియన్ డాలర్లు మాత్రమే. 57 ఏళ్ల బెజోస్.. ఈ ఏడాది అమెజాన్ సీఈవో పగ్గాల నుంచి దిగిపోవడంతో పాటు స్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తూ గడిపాడు. ఈ ఏడాది అపర కుబేరుల్లో గట్టి దెబ్బ పడింది ఎవరికంటే.. ఈయనకే!. -సాక్షి, వెబ్ స్పెషల్ -
ఆ దమ్ము ఒక్క ఎలన్‌మస్క్‌కే ఉంది, కానీ..
అపర కుబేరుడు ఎలన్ మస్క్‌కి ఫ్యాన్ పాలోయింగ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ధనవంతుల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్న తర్వాత ఆయన మీద ఫోకస్ విపరీతంగా పెరుగుతోంది. అంతెందుకు భారత్ నుంచి ఆనంద్ మహీంద్రా, హార్ష్ గోయెంకా లాంటి బిజినెస్ టైకూన్లు సైతం మస్క్ సక్సెస్‌ను సమీక్షిస్తుండడం విశేషం. తాజాగా ఆయన ఖాతాలో మరో ‘ఊహించని’ పొగడ్త పడింది. అమెరికా బ్యాకింగ్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లే, ఎలన్ మస్క్ సంపాదన మీద తాజాగా ఓ ఆసక్తికర కథనం విడుదల చేసింది. టెస్లాతో కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న మస్క్.. ఈవీ కంపెనీ టెస్లా కంటే సొంత సంస్థ స్పేస్ఎక్స్తోనే ఖ్యాతిని, సంపదను మరింత పెంచుకునే ఆస్కారం ఉందని మోర్గాన్ స్టాన్లేకు చెందిన ఓ అనలిస్ట్ అభిప్రాయం వ్యక్తం చేశారు. "SpaceX Escape Velocity ... Who Can Catch Them?" పేరుతో మంగళవారం మోర్గాన్ స్టాన్లేకు చెందిన ఆడమ్ జోన్స్ ఒక కథనం రాశారు. బ్లూమరాంగ్ ఇండెక్స్ ప్రకారం.. మస్క్ మొత్తం 241.4 బిలియన్ డాలర్ల సంపాదనలో స్పేస్ ఏజెన్సీ స్పేస్ఎక్స్ 17 శాతం వాటా కలిగి ఉంది. ఒకవేళ మస్క్ గనుక స్పేస్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ మీద ఫుల్ ఫోకస్ పెడితే మాత్రం కేవలం స్పేస్ఎక్స్ ద్వారానే 200 బిలియన్ డాలర్లు సంపాదించవచ్చని అభిప్రాయపడ్డారు. తద్వారా ఈ భూమ్మీద తొలి ట్రిలియనీర్‌గా ఎలన్ మస్క్ ఎదిగే అవకాశం ఉందని, దరిదాపుల్లో ఎవరూ నిలిచే అవకాశమే లేదని జోన్స్ ఆ కథనంలో అభిప్రాయపడ్డారు. కొసమెరుపు ఏంటంటే.. ఎలన్ మస్క్‌కు, మోర్గాన్ స్టాన్లేకు మధ్య మంచి సంబంధాలు లేకపోవడం. చదవండి: బాప్రే చంద్రుడిపై రొమాన్స్.. రూ.158 కోట్లు నష్టం! -
వారెవ్వా..! జెఫ్ బెజోస్, ఎలన్‌మస్క్ సరసన ముఖేష్ అంబానీ...!
రిలయన్ అధినేత ముఖేష్ అంబానీ మరో సరికొత్త రికార్డును నమోదు చేశారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం... ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ, జెఫ్ బెజోస్, ఎలోన్ మస్క్‌తో కలిసి ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన సంపద క్లబ్లో చేరాడు. బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం...3.22 బిలియన్ డాలర్ల సంపదతో ముఖేష్ అంబానీ సంపద 101 బిలియన్ డాలర్లకు చేరుకుంది. చదవండి: భారత్‌లో అత్యంత ఖరీదైన స్కూటర్ ఇదే, ధర ఎంతంటే? 100 బిలియన్ డాలర్ల ఏలైట్ క్లబ్లో జాయినైనా తొలి ఆసియా వ్యక్తిగా ముఖేశ్ అంబానీ రికార్డు సృష్టించారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ 11 వ స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీ 73.3 బిలియన్ డాలర్ల సంపదతో 14 వ స్థానంలో కొనసాగుతున్నారు. తండ్రి నుంచి పగ్గాలు... రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన తండ్రి మరణాంతరం కంపెనీ పగ్గాలను చేపట్టాడు. చమురు శుద్ధి ,పెట్రోకెమికల్స్ వ్యాపారాలను వారసత్వంగా పొందినప్పటి నుంచి రిలయన్స్ పలు రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించింది.అంతేకాకుండా ఫేస్బుక్, గూగుల్, ఆరామ్ కో వంటి కంపెనీలతో కలిసి పనిచేస్తున్నారు. ఈ ఏడాది జరిగిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో గ్రీన్ ఎనర్జీకి ప్రతిష్టాత్మకమైన ప్రోత్సాహాన్ని ఆవిష్కరించారు. వచ్చే మూడు సంవత్సరాలలో సుమారు 10 బిలియన్ల డాలర్లను పెట్టుబడిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రణాళికాబద్ధమైన పెట్టుబడితో వాతావరణ మార్పులను ఎదుర్కోవటానికి, శక్తి దిగుమతులను తగ్గించడానికి భారత్ పరిశుభ్రమైన ఇంధన గ్లోబల్ తయారీ కేంద్రంగా మార్చాలని ముఖేశ్ అంబానీ ప్రణాళికలు చేస్తున్నారు. చదవండి: Amazon: అమెజాన్ ప్రైమ్ యూజర్లకు గుడ్‌న్యూస్...! -
ప్రపంచ కుబేరులలో డీమార్ట్ బాస్
ముంబై: కరోనా టైంలో అన్నివర్గాలను ఆకర్షించి.. విపరీతంగా లాభాలు ఆర్జించింది డీమార్ట్ బ్రాండ్ సూపర్ మార్కెట్. తాజాగా ఈ స్టోర్ల ప్రమోటర్ రాధాకృష్ణన్ ఎస్.దమానీ తాజాగా ప్రపంచ సంపన్నుల జాబితాలో చేరారు. 19.2 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1.42 లక్షల కోట్లు) నెట్‌వర్త్‌ను సాధించడం ద్వారా బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో 98వ ర్యాంకులో నిలిచారు. వెరసి టాప్–100 గ్లోబల్ కుబేరుల్లో ఒకరిగా తొలిసారి ఆవిర్భవించారు. ప్రపంచ సంపన్నులపై రోజువారీ ర్యాంకింగ్‌లను ఈ ఇండెక్స్ ప్రకటిస్తుంటుంది. డీమార్ట్ రిటైల్ చైన్ నిర్వాహక సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌కు ప్రమోటర్ అయిన దమానీ.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ కూడా. దేశీ కుబేరులు: టాప్–100 గ్లోబల్ జాబితాలో దమానీ కంటే ముందు వరుసలో దేశీ దిగ్గజాలు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, విప్రో వ్యవస్థాపకులు అజీమ్ ప్రేమ్‌జీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గౌరవ చైర్మన్ శివ నాడార్, స్టీల్ టైకూన్ లక్ష్మీ మిట్టల్ సైతం నిలిచారు. కాగా.. డీమార్ట్ రిటైల్ స్టోర్ల విస్తరణ నేపథ్యంలో దమానీ సంపద వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. ముఖ్యంగా దాదాపు ప్రతీ ప్రొడక్టులు.. వాటిపై రీజనబుల్ డిస్కౌంట్ల ప్రకటన, ఎక్కువ ప్రొడక్టులతో వినియోగదారుల్ని ఆకర్షించడం, టౌన్లకు సైతం విస్తరించిన మార్ట్లు, ముఖ్యంగా కరోనా టైం నుంచి అన్ని వర్గాలను మార్ట్‌లకు రప్పించుకోవడం ద్వారా డీమార్ట్ వాల్యూను విపరీతంగా పెంచుకోగలిగారాయన. తద్వారా స్టాక్ మార్కెట్లలో మధ్య, చిన్నతరహా కంపెనీలలో అత్యధికంగా ఇన్వెస్ట్ చేసే దమానీ.. వేల్యూ ఇన్వెస్టర్‌గా గుర్తింపు పొందారు. పెట్టుబడులను దీర్ఘకాలంపాటు కొనసాగిస్తుంటారు. అయితే సంపద వృద్ధికి ప్రధానంగా ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ దోహదం చేసింది. దమానీకి అధిక వాటాలున్న లిస్టెడ్ కంపెనీలలో వీఎస్టీ ఇండస్ట్రీస్, ఇండియా సిమెంట్స్, సుందరం ఫైనాన్స్, ట్రెంట్‌లను పేర్కొనవచ్చు. డీమార్ట్ దూకుడు ఐపీవో ద్వారా 2017 మార్చిలో స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ షేరు రేసుగుర్రంలా పరుగు తీసింది. దీంతో రూ. 39,813 కోట్ల నుంచి ప్రారంభమైన కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (విలువ) తాజాగా రూ. 2.36 లక్షల కోట్లకు దూసుకెళ్లింది. ఇది ఆరు రెట్ల వృద్ధికాగా.. దమానీ, ఆయన కుటుంబ వాటా విలువ రూ. 32,870 కోట్ల నుంచి రూ. 1.77 లక్షల కోట్లకు జంప్ చేసింది. గత ఏడాది కాలంలోనే డీమార్ట్ షేరు 62 శాతం పురోగమించడం గమనించదగ్గ అంశం!. -
వెనుకబడ్డ జెఫ్‌బెజోస్.. ప్రపంచానికి కొత్త కుబేరుడు..!
ప్రపంచ కుబేరుల జాబితాలో తాజాగా మొదటి స్థానం నుంచి జెఫ్‌బెజోస్ వైదొలిగాడు. కొత్తగా ప్రపంచ నెంబర్ వన్ సంపన్నుడిగా ప్రముఖ లగ్జరీ గూడ్స్ లూయిస్ విట్టన్ మోయెట్ హెన్నెస్సీ(ఎల్వీఎమ్హెచ్) కంపెనీ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్డ్ అవతరించాడు. ఫోర్బ్స్ విడుదల చేసిన రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం ఆర్నాల్ట్ మొత్తం నికర ఆస్తుల విలువ 198.9 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా రెండో స్థానంలో జెఫ్ బెజోస్ 194.9 బిలియన్ డాలర్లతో కొనసాగుతున్నాడు. స్పెస్ ఎక్స్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ 185. 5 బిలియన్ల డాలర్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఆర్నాల్ట్ అంతకు ముందు డిసెంబర్ 2019, జనవరి 2020, మే 2021 లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. తాజాగా మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించాడు. ఎల్వీఎమ్హెచ్ కంపెనీ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 14 బిలియన్ యూరోలను ఆర్జించాడు. ఆ సమయంలో ఆర్నాల్డ్ ఎలన్ మస్క్ స్థానాన్ని దాటాడు. గత ఏడాది పోలిస్తే 38 శాతం మేర ఆర్నాల్డ్ అధికంగా ఆర్జించాడు. ఎల్వీఎమ్హెచ్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 70 బ్రాండ్లను కలిగింది. లూయిస్ విట్టన్, సెఫోరా, టిఫనీ అండ్ కో, స్టెల్లా, మాక్కార్ట్నీ, గూచీ, క్రిస్టియన్ డియోర్, గివెన్చీ బ్రాండ్లను కలిగి ఉంది. -
ప్రపంచ ధనవంతుల జాబితా.. 4వ స్థానంలో ఎలన్
వాషింగ్టన్: టెస్లా సీఈఓ ఎలన్ మస్క్లో చాలా సంతోషంగా ఉన్నారు. గత కొద్ది రోజులుగా మందగించిన ఆయన ఆస్తుల విలువ తాజాగా రికార్డు స్థాయిలో పెరిగింది. దాంతో ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో నాల్గవ స్థానానికి చేరుకున్నారు. సోమవారం టెస్లా ఇంక్ షేర్ వాల్యూ 11 శాతం పెరిగింది. ఫలితంగా ఆయన ఆస్తుల విలువ 7.8 బిలయన్లు పెరిగింది. ప్రస్తుత పెరుగుదలతో ఎలన్ మస్క్ ఫ్రెంచ్ లగ్జరీ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్డ్‌ను అధిగమించారు. ప్రస్తుతం ఎలన్ మస్క్ 84.8 బిలయన్ల సంపదతో మార్క్ జుకర్ బర్గ్ తర్వాతి స్థానంలో నిలిచారు. ప్రపంచంలోని 500 మంది ధనవంతుల జాబితాలో జుకర్ బర్గ్ మూడవ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది టెస్లా షేర్లు 339శాతం పెరిగాయి. దాంతో ఈ సంస్థ ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్‌లో చేరుతుందనే అంచనాలు భారీగా పెరిగాయి. (ఎలన్ మస్క్.. ఈ పేరుకు అర్థం ఏంటి?) -
ముకేష్ అంబానీ ఖాతాలో మరో రికార్డు
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధినేత, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ మరో రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో తాజాగా ఆయన నాలుగో స్థానంలో నిలిచారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ముకేష్ అంబానీ.. అమెజాన్ అధినేత జేఫ్ బెజోస్, బిల్ గేట్స్, ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ తర్వాత స్థానంలో ఉన్నారు. ఈ ఇండెక్స్‌లో ముకేష్ అంబానీ 80.2 బిలియన్ డాలర్ల(సుమారు 6 లక్షల కోట్ల రూపాయలు) సంపదతో ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్డ్‌ను దాటేసి నాలుగో స్థానంలో నిలిచారు. కొన్నేళ్లుగా ఈ ఇండెక్స్‌లో అమెరికన్స్ మాత్రమే టాప్ 5లో ఉంటూ వచ్చారు. బెజోస్, బిల్ గేట్స్, గూగుల్ అధినేతలు సెర్గీ, లారీ పేజ్, ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ వంటివాళ్లు టాప్ పొజిషన్లో ఉండేవారు. తాజాగా వారి జాబితాలో ముకేష్ అంబానీ చేరారు. ఫ్యాషన్ టైకూన్ ఆర్నాల్ట్, వారెన్ బఫెట్, స్టీవ్ బాల్మర్, లారీ పేజ్, సెర్గీ బ్రెయిన్ ఎలన్ మాస్క్ సహా అందరినీ వెనక్కు నెట్టారు అంబానీ. బ్లూమ్‌బర్గ్ వెల్లడించిన నివేదికలో 10 మంది ప్రపంచ కుబేరుల్లో 8 మంది అమెరికాకు చెందిన వారే కావడం గమనార్హం. వీరి సరసన చేరిన ముకేష్ అంబానీ భారత్ నుంచే కాక ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. (రిలయన్స్ ఇండస్ట్రీస్.. గ్లోబల్ టాప్–2) ఇక ఈ ఇండెక్స్‌లో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఆస్తి 187 బిలియన్ డాలర్ల సంపదతో ప్రథమ స్థానంలో ఉండగా.. 121 బిలియన్ల సంపదతో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ రెండో స్థానంలో నిలిచారు. ఇక ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ ఆస్తి 102 బిలియన్ డాలర్లు. రిలయన్స్ ముకేష్ అంబానీ ఆస్తి 80.2బిలియన్ డాలర్ల సంపదతో నాలుగో స్థానంలో నిలిచారు. ఫ్యాషన్ టైకూన్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ 80.2 బిలియన్ డాలర్ల సంపదతో ముకేష్ అంబానీ తర్వాత స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది రిలయన్స్ టెలికాం విభాగం జియో ప్లాట్ ఫాంలోకి ప్రపంచ దిగ్గజ సంస్థలైన గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాప్ట్ పెట్టుబడులు పెట్టడంతో ఆయన కంపెనీల షేర్ విలువ భారీగా పెరిగింది. దాంతో ఆస్తులు కూడా పెరిగాయి.