వాషింగ్టన్: టెస్లా సీఈఓ ఎలన్ మస్క్‌లో చాలా సంతోషంగా ఉన్నారు. గత కొద్ది రోజులుగా మందగించిన ఆయన ఆస్తుల విలువ తాజాగా రికార్డు స్థాయిలో పెరిగింది. దాంతో ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో నాల్గవ స్థానానికి చేరుకున్నారు. సోమవారం టెస్లా ఇంక్ షేర్ వాల్యూ 11 శాతం పెరిగింది. ఫలితంగా ఆయన ఆస్తుల విలువ 7.8 బిలయన్లు పెరిగింది. ప్రస్తుత పెరుగుదలతో ఎలన్ మస్క్ ఫ్రెంచ్ లగ్జరీ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్డ్‌ను అధిగమించారు.
ప్రస్తుతం ఎలన్ మస్క్ 84.8 బిలయన్ల సంపదతో మార్క్ జుకర్ బర్గ్ తర్వాతి స్థానంలో నిలిచారు. ప్రపంచంలోని 500 మంది ధనవంతుల జాబితాలో జుకర్ బర్గ్ మూడవ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది టెస్లా షేర్లు 339శాతం పెరిగాయి. దాంతో ఈ సంస్థ ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్‌లో చేరుతుందనే అంచనాలు భారీగా పెరిగాయి. (ఎలన్ మస్క్.. ఈ పేరుకు అర్థం ఏంటి?)
Comments
Please login to add a commentAdd a comment