న్యూఢిల్లీ: ఫ్రెంచ్ ప్రముఖ వ్యాపారవేత్త పంచంలోని అత్యంత ధనవంతుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్ (74) తన వారసుడి కోసం వేట మొదలుపెట్టారు. వాల్ స్ట్రీట్ జర్నల్స్ నివేదిక ప్రకారం, లూయిస్ విట్టన్ సీఈవో తర్వాత వ్యాపారాన్ని ఎవరు స్వాధీనం చేసుకోవాలో అనేది ఆర్నాల్ట్ నిర్ణయించాలని తన ఐదుగురు పిల్లలను నెలకోసారి కలుసుకుని మరీ చర్చిస్తున్నారు. విలాసవంతమైన సామ్రాజ్యానికి వారసులుగా ఆర్నాల్ట్ తన పిల్లల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారని భావిస్తున్నారు.
ప్రపంచ లగ్జరీ ప్రాడక్ట్స్ లూయిస్ విట్టన్ మోయెట్ హెన్నెస్సీ చైర్మన్ ,సీఈవో ఆర్నాల్ట్ ప్రస్తుతం వారసుడికోసం వెతుకున్నారు. ఈ కసరత్తులో భాగంగానే తన ఐదుగురి పిల్లలతో విట్టన్ ప్రధాన కార్యాలయంలో ప్రైవేట్ డైనింగ్ రూమ్‌లో లంచ్ సమయంలో కలిసారట. ఈసందర్భంగా కంపెనీకి సంబంధించిన అంశాలు, వ్యూహాలను చర్చించినట్టు వాల్ స్ట్రీట్ నివేదించింది. దాదాపు 90 నిమిషాలపాటు ఈ భేటీ కొనసాగింది. ఆర్నాల్ట్ వారసుడి కోసం పిల్లలతో విస్తృత చర్చలు జరుపుతున్నప్పటికీ ఎవర్ని ఆ అదృష్టం వరించనుందనే దాన ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు.
కుమార్తె డెల్ఫిన్
ఇప్పటికే పలు కీలక బాధ్యతల్లో సంతానం
ఆర్నాల్ట్ పిల్లలు కంపెనీలో ముఖ్యమైన స్థానాల్లో ఉన్నారు. ముఖ్యంగా కుమార్తె డెల్ఫిన్ రెండవ అతిపెద్ద బ్రాండ్ క్రిస్టియన్ డియోర్‌కు హెడ్‌గా ఉండగా, కుమారుడు ఆంటోయిన్ లూయిస్ విట్టన్ హోల్డింగ్ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఫ్రెడెరిక్ ఆర్నాల్ట్ TAG హ్యూయర్ సీఈవోగా ఉన్నాడు. అలెగ్జాండ్రే ఆర్నాల్ట్ టిఫనీలో ఎగ్జిక్యూటివ్, ఆర్నాల్ట్ తోబుట్టువులలో చిన్నవాడు, జీన్, లూయిస్ విట్టన్ వాచ్ డిపార్ట్‌మెంట్ కోసం మార్కెటింగ్ , ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ బాధ్యతల్లో ఉన్నాడు.
బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రస్థానం
మార్చి 5, 1949న ఫ్రాన్స్‌లోని రౌబైక్స్‌లో వ్యాపార కుటుంబంలో జన్మించిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఇంజనీర్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. ఎకోల్ పాలిటెక్నిక్‌లో చదివిన తరువాత అతను ఫెర్రేట్ సవినెల్ నిర్మాణ సంస్థలో ఇంజనీర్‌గా కరియర్‌ను మొదలుప ఎట్టి, 1978లో సంస్థ ఛైర్మన్ పదవికి ప్రమోట్ అయ్యాడు. ఆ తర్వాత ఫ్యాషన్ ప్రపంచంపై అతని ఆసక్తితొ ఒక లగ్జరీ బ్రాండ్‌ను లాభదాయక కంపెనీగా అభివృద్ధి చేశాడు. 1989 నుండి లూయిస్ విట్టన్ మె కంపెనీకి చైర్మన్, సీఈవోగా ఉన్నారు. రెండు వివాహాల ద్వారా బెర్నార్డ్ ఆర్నాల్ట్‌కు ఐదుగురు పిల్లలు ఉన్నారు.
కాగా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ని అధిగమించి ఆర్నాల్ట్ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఏప్రిల్ 19 నాటికి అతని సంపద 208 బిలియన్ డాలర్లు.
Comments
Please login to add a commentAdd a comment