Bernard Arnault
-
Forbes: డబ్బున్నోళ్ల లిస్ట్.. అందరికంటే రిచ్ ఈ పెద్దాయనే..
అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ తన 2024 సంపన్నుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ సంస్థ ఎల్వీఎంహెచ్ (LVMH) బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఆయన కుటుంబం 233 బిలియన్ డాలర్లు (రూ. 19.43 లక్షల కోట్లు) సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. 2024లో రికార్డు స్థాయిలో 2,781 మంది బిలియనీర్లు ఉన్నారని ఫోర్బ్స్ తెలిపింది. గత సంవత్సరం కంటే ఈ సంఖ్య 141 ఎక్కువ. 2021లో నమోదైన రికార్డు కంటే 26 ఎక్కువ. ఈ లిస్ట్‌లోని బిలియనీర్ల మొత్తం సంపద 14.2 ట్రిలియన్ డాలర్లు (11.8 కోట్ల కోట్లు) అని పేర్కొంది. ఆర్నాల్ట్, ఆయన కుటుంబం తర్వాత టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 195 బిలియన్ డాలర్ల (రూ. 16.26 లక్షల కోట్లు) నికర సంపదతో రెండవ స్థానంలో ఉన్నారు. ఈయన తర్వాత అమెజాన్ యజమాని జెఫ్ బెజోస్ 194 బిలియన్ డాలర్ల (రూ. 16.17 లక్షల కోట్లు) నెట్‌వర్త్‌తో మూడవ స్థానంలో ఉన్నారు. ఇక భారత్‌కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 116 బిలియన్ డాలర్ల (రూ. 9.67 లక్షల కోట్లు) సంపదతో టాప్ టెన్‌లో 9వ స్థానంలో నిలిచారు. ఈకాగా ఈసారి ఫోర్బ్స్ లిస్ట్‌లో కొత్తగా పలువురు సెలబ్రిటీలు చేరారు. పాప్ సంచనం టేలర్ స్విఫ్ట్ ఫోర్బ్స్ 2024 బిలియనీర్ల జాబితాలో అడుగు పెట్టింది. అక్టోబర్‌లో బిలియనీర్ హోదాకు చేరుకున్న ఈ పాప్ సూపర్ స్టార్, ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రిహన్న, కిమ్ కర్దాషియాన్, ఓప్రా విన్ఫ్రే, స్టార్ వార్స్ సృష్టికర్త జార్జ్ లూకాస్లతో కలిసి చేరారు. 1.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,169 కోట్లు) భారీ నెట్‌వర్త్‌తో స్విఫ్ట్ 14వ స్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ టాప్ టెన్ లిస్ట్ ఇదే.. -
Forbes Billionaires 2023: నూతన కుబేరుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్
పారిస్: ఫ్రాన్సుకు చెందిన ప్రముఖ లగ్జరీ వస్తువుల కంపెనీ ఎల్వీఎంహెచ్ సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్(74) అత్యంత సంపన్నుడిగా స్థానం సంపాదించారు. ఎలాన్ మస్క్ స్థానంలో ఆర్నాల్ట్‌ను చేరుస్తూ తాజాగా ఫోర్బ్స్ కంపెనీ రియల్ టైం బిలియనీర్ల జాబితాను ప్రకటించింది. ప్రపంచ కుబేరుడి స్థానంలో ఎలాన్ మస్క్ ఆస్తుల విలువ శుక్రవారం 204.5 బిలియన్ డాలర్లకు తగ్గిపోగా, బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఆస్తుల విలువ ఏకంగా 23.6 బిలియన్ డాలర్లు పెరిగి 207.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ఫోర్బ్స్ వివరించింది. ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ షేర్ల విలువ గురువారం ఒక్కసారిగా 13 శాతం తగ్గడంతో ఆ మేరకు మస్క్ ఆస్తిలో 18 మిలియన్ డాలర్ల మేర కోతపడింది. అదే సమయంలో, ఎల్వీఎంహెచ్ షేర్ల విలువ శుక్రవారం 13 శాతం పెరుగుదల నమోదు చేసుకోగా ఆ కంపెనీ మార్కెట్ విలువ 388.8 మిలియన్ డాలర్లకు ఎగబాకిందని ఫోర్బ్స్ తెలిపింది. బెర్నార్డ్‌కు ఎల్వీఎంహెచ్తోపాటు లూయిస్ విట్టన్, ట్యాగ్ హ్యుయెర్, డామ్ ప్రిగ్నోన్, టిఫ్ఫనీ అండ్ కో వంటి ప్రముఖ బ్రాండ్లు కూడా ఉన్నాయి. 500 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన ఏకైక యూరప్ కంపెనీగా గత ఏడాది ఏప్రిల్‌లో ఎల్వీఎంహెచ్ గుర్తింపు పొందింది. -
సంపదలో మస్క్‌ను మించిన పెద్దాయన.. ప్రపంచ కుబేరుడిగా..
ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న 'ఇలాన్ మస్క్' (Elon Musk) ఇప్పుడు రెండవ స్థానానికి చేరుకున్నారు. మొదటి స్థానంలో గ్లోబల్ లగ్జరీ గూడ్స్ బ్రాండ్ కంపెనీ ఎల్వీఎంహెచ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ అండ్ సీఈఓ 'బెర్నార్డ్ ఆర్నాల్ట్' (Bernard Arnault) నిలిచారు. ఫోర్బ్స్ ప్రకారం.. బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబం నికర విలువ శుక్రవారం నాడు 23.6 బిలియన్ డాలర్లు పెరిగి, మొత్తం సంపద 207.8 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఆర్నాల్డ్ అత్యంత సంపన్నమైన వ్యక్తిగా మస్క్‌ను మించిపోయాడు. మరోవైపు మస్క్ సంపద 204.5 బిలియన్ డాలర్లుగా ఉంది. బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఇలాన్ మస్క్ మొదటి రెండు స్థానాల్లో నిలువగా.. జెఫ్ బెజోస్, లారీ ఎల్లిసన్, మార్క్ జుకర్‌బర్గ్‌లు వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఇలాన్ మస్క్ టెస్లా షేర్లు గత గురువారం ఏకంగా 13 శాతం పతనమవ్వడంతో.. 18 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైపోయింది. ఇదే సమయంలో ఆర్నాల్ట్ షేర్స్ బాగా పెరిగాయి. దీంతో మస్క్ ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి స్థానం కోల్పోవాల్సి వచ్చింది. ఇదీ చదవండి: ఆ వ్యాఖ్యలే కొంప ముంచాయా! ఒకేరోజు రూ.6.64 లక్షల కోట్లు లాస్.. ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ ముఖేష్ అంబానీ 104.4 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో 11 వ స్థానం, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 75.7 బిలియన్ డాలర్ల సంపదతో 16వ స్థానం పొందినట్లు తెలుస్తోంది. -
నెలకు రూ. 40.50 లక్షలు రెంట్ ఇవ్వడానికి రెడీ.. అట్లుంటది కుబేరుడంటే?
ప్రపంచ కుబేరుల జాబితాలో రెండవ స్థానంలో నిలిచిన 'బెర్నార్డ్ ఆర్నాల్డ్' (Bernard Arnault)కి చెందిన లూయిస్ విట్టన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మధ్య ఒప్పందం జరిగింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గ్లోబల్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ లూయిస్ విట్టన్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లోని ఉబెర్ లగ్జరీ మాల్ అయిన జియో వరల్డ్ ప్లాజాలో తన కొత్త స్టోర్ కోసం మొత్తం 7,365 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు యూనిట్లను లీజుకు తీసుకుంది. దీనికి నెలకు అద్దె రూ. 40.50 లక్షలు కావడం గమనార్హం. సంస్థ 60 నెలల లాక్-ఇన్ పీరియడ్‌తో 114 నెలలకు (9.5 సంవత్సరాలు) రూ. 2.43 కోట్ల లైసెన్స్ ఫీజు సెక్యూరిటీ డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో కూడా ప్రతి 36 నెలల తరువాత రెంట్ 15 శాతం పెరుగుతుంది. ఈ డీల్ 2023 ఫిబ్రవరి నుంచి 2032 డిసెంబర్ వరకు ఉండనుంది. ఇదీ చదవండి: మొదటి కుమార్తె మరణం కంటే అది చాలా బాధాకరం - ఎలాన్ మస్క్ 1854లో పారిస్‌లో లూయిస్ విట్టన్ స్థాపించిన ఈ కంపెనీ 2003లో న్యూఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో భారతదేశంలో తన మొదటి షాప్ ప్రారంభించింది. అయితే ఈ రోజు బెంగళూరులోని UB సిటీ, న్యూఢిల్లీలోని DLF ఎంపోరియో, దక్షిణ ముంబైలోని హోటల్ తాజ్ మహల్ ప్యాలెస్‌తో సహా దేశవ్యాప్తంగా మూడు స్టోర్లను కలిగి ఉంది. -
ఆర్నాల్ట్, అంబానీ డీల్: అద్దె ఎంతో తెలిస్తే షాకవుతారు!
ప్రపంచ రెండో కుబేరుడు గ్లోబల్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ లూయిస్ విట్టన్ సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ , ఆసియాకుబేరుడురిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన లగ్జరీ మాల్లో ఒక స్టోర్‌ను లీజుకు తీసుకున్నారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లోని జియో వరల్డ్ ప్లాజాలో తన కొత్త స్టోర్‌ను అద్దెకు తీసుకున్నారు. మొత్తం 7,365 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు యూనిట్లకు గాను నెలకు చెల్లిస్తున్న అద్దె ఏకంగా 40.50 లక్షలుగా ఉంది. (కేంద్రం మరో కీలక నిర్ణయం: విండ్‌ఫాల్ ట్యాక్స్ కట్) ఫ్రెంచ్ ఫ్యాషన్ దిగ్గజం లూయిస్ విట్టన్ ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో ముఖేష్ అంబానీకి చెందిన నుండి రిటైల్ స్థలాన్ని దీర్ఘకాలిక లీజుకు ఒప్పందం కుదుర్చు కుంది. అంతేకాదుప్రపంచ లగ్జరీ బ్రాండ్ అతిపెద్ద షోరూంగా ఇది నిలవడం విశేషం. కంపెనీ తొమ్మిదిరన్న ఏళ్ల పాటు లీజుకు తీసుకుంది. ఇరు సంస్థలు ఆగస్టు 21న కుదర్చుకున్న ఒప్పందం ప్రకారం లూయిస్ విట్టన్ ఇండియా రిటైల్ రిలయన్స్‌కు నెలకు రూ.40.5 లక్షలు , లేదా మొత్తం లేదా నికర రాబడి వాటాలో 6 శాతం, ఏది ఎక్కువ అయితే అది చెల్లిస్తుంది. 36 నెలల తర్వాత అద్దె 15 శాతం పెరుగుతుంది. ఇందుకోసం కంపెనీ కంపెనీ రూ.2.43 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించింది. కామన్ ఏరియాకు రూ.24.30 లక్షలు, ఫిట్అవుట్లకు రూ.29.46 లక్షలు కూడా చెల్లించారు.(డయానాతో ప్రమాదంలో మరణించిన డోడి తండ్రి, బిజినెస్ టైకూన్ కన్నుమూత) కాగా 1854లో పారిస్‌లో లూయిస్ విట్టన్చే దీన్ని స్థాపించారు. ప్రస్తుతం ఆర్నాల్ట్ దీనికి చైర్మన్ అండ్ సీఈవోగా ఉన్నారు. 2003లో న్యూఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో ఇండియాలో తొలి దుకాణాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం బెంగళూరు,ఢిల్లీ, ముంబైసహా దేశవ్యాప్తంగా మూడు స్టోర్లను కలిగి ఉంది. బెర్నార్డ్ ఆర్నాల్ట్ అతని నికర విలువ 208 బిలియన్ డాలర్లు. ముఖేష్ అంబానీ 94 బిలియన్ డాలర్ల నికర విలువతో ఆసియాలోనే అత్యంత సంపన్నుడు. -
ఆర్నాల్ట్‌తో మస్క్ లంచ్.. ఆనంద్ మహీంద్ర ఫన్నీ ట్వీట్
సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్‌గా ఉండే బిజినెస్‌మన్ ఆనంద్ మహీంద్ర. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పలు సంఘటనలు, సందర్భాలపై నిత్యం ట్విటర్లో పోస్టులు పెడుతూ ఉంటారు. ఆయన ఫాలోవర్లు సైతం ఆనంద్ మహీంద్ర పెట్టే పోస్టలకు అంతే యాక్టివ్‌గా స్పందిస్తుంటారు. తాజాగా ఇద్దరు బిలియనీర్లు లంచ్ కోసం కలిస్తే దానిపై ఆనంద్ మహీంద్ర ఫన్నీగా ట్వీట్ చేశారు. ఆ ఇద్దరు బిలియనీర్లు ఎవరో కాదు.. ఒకరు టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్. మరొకరు పారిస్‌కు చెందిన లగ్జరీ గూడ్స్ కంపెనీ ఎల్వీఎంహెచ్ ఛైర్మన్, సీఈవో అయిన బెర్నార్డ్ ఆర్నాల్ట్. బిల్ ఎవరు కట్టారో.. ఆర్నాల్ట్, మస్క్ ఇద్దరూ లంచ్ కోసం శుక్రవారం(జూన్ 16) పారిస్‌లో కలిశారు. వీరి మీట్‌కు సంబంధించిన ఫొటోలను ఆర్నాల్ట్ కుమారుడు ఆంటోనీ ఆర్నాల్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇదే ఫొటోను డెక్సెర్టో అనే సంస్థ ట్విటర్లో షేర్ చేయగా దానికి ఆనంద్ మహీంద్ర స్పందించారు. వీరిద్దరిలో బిల్లు ఎవరు కట్టారోనని తన భార్య ఉత్సుకతతో ఆలోచిస్తోందంటూ చమత్కరించారు. దీనిపై పలువురు పలు విధాలుగా ప్రతిస్పందించారు. ఇంకెవరు రెస్టారెంట్ వాళ్లే కట్టి ఉంటారని, వారికి ఫ్రీ మార్కెటింగ్ దొరికిందని ఓ యూజర్ కామెంట్ చేశారు. కాతా వివా టెక్నాలజీ ఈవెంట్లో పాల్గొనేందుకు ఎలాన్ మస్క్ పారిస్‌లో ఉన్నారు. టెస్లా ఫాక్టరీలకు అనుకూలంగా ఉన్న దేశంగా ఫ్రాన్స్‌ను ప్రోత్సహించడం, సాంకేతిక నియంత్రణ గురించి చర్చించడంలో భాగంగా ఆయన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను కూడా కలవనున్నారు. My wife was wondering who paid for the lunch…@elonmusk https://t.co/NIsPR4o9Oj — anand mahindra (@anandmahindra) June 18, 2023 -
పారిస్‌లో ప్రపంచ కుబేరుల లంచ్ మీట్: ఫోటోలు వైరల్
ప్రపంచ కుబేరులు ఒకేవేదికపై దర్శనమివ్వడం విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచంలోనే ఇద్దరు అత్యంత ధనవంతులు, ఎలోన్ మస్క్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ వారి కుటుంబ సభ్యులతో కలిసి పారిస్‌లో కలిశారు. జూన్ 14 నుండి జూన్ 17 వరకు ఫ్రాన్స్‌లోని పెయిర్స్‌లో జరిగిన వివా టెక్నాలజీ సదస్సు 7వ ఎడిషన్‌కు వీరు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు శుక్రవారం లంచ్ కోసం కలుసుకున్నారు. తల్లి మేయే మస్క్‌తో కలిసి టెస్లా సీఈవో మస్క్ హాజరు కాగా, ఎల్ఎఈఎంహెచ్ ఛైర్మన్, సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ అతని ఇద్దరు కుమారులు - ఆంటోయిన్ , అలెగ్జాండ్రే ఆర్నాల్ట్‌తో వచ్చారు. ఆంటోయిన్ ఆర్నాల్ట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేశారు. మరోవైపు "కలిసి పని చేద్దాం! అంటూ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మస్క్‌తో కలిసి ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు. NEW: Elon Musk expresses his support for free speech at the Viva Technology event in Paris, France. It's crazy that this is a controversial take in 2023. "We should have free speech as much as possible... We want to allow the people to express themselves." "Free speech matters… pic.twitter.com/PGZrdmNSML — Collin Rugg (@CollinRugg) June 16, 2023 కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో యూరోప్ అతిపెద్ద స్టార్టప్ అండ్ టెక్ ఈవెంట్ జరుగుతోంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా టెక్ లీడర్లు, స్టార్టప్‌లు, ప్రధాన కార్పొరేషన్లు, పెట్టుబడిదారులను కనెక్ట్ చేయాలనేది ప్లాన్. ఈ ఈవెంట్లో ట్విటర్ బాస్ మస్క్, అతిపెద్ద ఫ్యాషన్ ప్రపంచం అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రధాన వక్తలుగా ఉన్నాయి. వీరితోపాటు ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, సేల్స్‌ఫోర్స్ కో-ఫౌండర్ మార్క్ బెనియోఫ్, మెటా యాన్ లెకున్లోని వైస్‌ప్రెసిడెంట్, ఏఏ చీఫ్ ఏసైంటిస్ట్ కూడా ప్రసంగించారు. (హైదరాబాద్‌లో 38 శాతం ఇళ్లు అమ్ముడు పోవడం లేదట!ఎందుకో తెలుసా?) కాగా ఫోర్బ్స్ ప్రకారం, మస్క్ నికర విలువ 236.9 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తి కాగా, బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబం 233.4 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు) -
ప్రపంచ బిలియనీర్ వారసుడి కోసం కసరత్తు: అదృష్టం ఎవరికి దక్కేనో?
న్యూఢిల్లీ: ఫ్రెంచ్ ప్రముఖ వ్యాపారవేత్త పంచంలోని అత్యంత ధనవంతుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్ (74) తన వారసుడి కోసం వేట మొదలుపెట్టారు. వాల్ స్ట్రీట్ జర్నల్స్ నివేదిక ప్రకారం, లూయిస్ విట్టన్ సీఈవో తర్వాత వ్యాపారాన్ని ఎవరు స్వాధీనం చేసుకోవాలో అనేది ఆర్నాల్ట్ నిర్ణయించాలని తన ఐదుగురు పిల్లలను నెలకోసారి కలుసుకుని మరీ చర్చిస్తున్నారు. విలాసవంతమైన సామ్రాజ్యానికి వారసులుగా ఆర్నాల్ట్ తన పిల్లల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారని భావిస్తున్నారు. ప్రపంచ లగ్జరీ ప్రాడక్ట్స్ లూయిస్ విట్టన్ మోయెట్ హెన్నెస్సీ చైర్మన్ ,సీఈవో ఆర్నాల్ట్ ప్రస్తుతం వారసుడికోసం వెతుకున్నారు. ఈ కసరత్తులో భాగంగానే తన ఐదుగురి పిల్లలతో విట్టన్ ప్రధాన కార్యాలయంలో ప్రైవేట్ డైనింగ్ రూమ్‌లో లంచ్ సమయంలో కలిసారట. ఈసందర్భంగా కంపెనీకి సంబంధించిన అంశాలు, వ్యూహాలను చర్చించినట్టు వాల్ స్ట్రీట్ నివేదించింది. దాదాపు 90 నిమిషాలపాటు ఈ భేటీ కొనసాగింది. ఆర్నాల్ట్ వారసుడి కోసం పిల్లలతో విస్తృత చర్చలు జరుపుతున్నప్పటికీ ఎవర్ని ఆ అదృష్టం వరించనుందనే దాన ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు. కుమార్తె డెల్ఫిన్ ఇప్పటికే పలు కీలక బాధ్యతల్లో సంతానం ఆర్నాల్ట్ పిల్లలు కంపెనీలో ముఖ్యమైన స్థానాల్లో ఉన్నారు. ముఖ్యంగా కుమార్తె డెల్ఫిన్ రెండవ అతిపెద్ద బ్రాండ్ క్రిస్టియన్ డియోర్‌కు హెడ్‌గా ఉండగా, కుమారుడు ఆంటోయిన్ లూయిస్ విట్టన్ హోల్డింగ్ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఫ్రెడెరిక్ ఆర్నాల్ట్ TAG హ్యూయర్ సీఈవోగా ఉన్నాడు. అలెగ్జాండ్రే ఆర్నాల్ట్ టిఫనీలో ఎగ్జిక్యూటివ్, ఆర్నాల్ట్ తోబుట్టువులలో చిన్నవాడు, జీన్, లూయిస్ విట్టన్ వాచ్ డిపార్ట్మెంట్ కోసం మార్కెటింగ్ , ప్రొడక్ట్ డెవలప్మెంట్ బాధ్యతల్లో ఉన్నాడు. బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రస్థానం మార్చి 5, 1949న ఫ్రాన్స్‌లోని రౌబైక్స్లో వ్యాపార కుటుంబంలో జన్మించిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఇంజనీర్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. ఎకోల్ పాలిటెక్నిక్‌లో చదివిన తరువాత అతను ఫెర్రేట్ సవినెల్ నిర్మాణ సంస్థలో ఇంజనీర్‌గా కరియర్‌ను మొదలుప ఎట్టి, 1978లో సంస్థ ఛైర్మన్ పదవికి ప్రమోట్ అయ్యాడు. ఆ తర్వాత ఫ్యాషన్ ప్రపంచంపై అతని ఆసక్తితొ ఒక లగ్జరీ బ్రాండ్‌ను లాభదాయక కంపెనీగా అభివృద్ధి చేశాడు. 1989 నుండి లూయిస్ విట్టన్ మె కంపెనీకి చైర్మన్, సీఈవోగా ఉన్నారు. రెండు వివాహాల ద్వారా బెర్నార్డ్ ఆర్నాల్ట్‌కు ఐదుగురు పిల్లలు ఉన్నారు. కాగా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ని అధిగమించి ఆర్నాల్ట్ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఏప్రిల్ 19 నాటికి అతని సంపద 208 బిలియన్ డాలర్లు. -
World's Richest Man: ఇప్పుడు ఎలాన్ మస్క్ కాదు, మరెవరో తెలుసా?
ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానాన్ని ఎలాన్ మస్క్ మళ్ళీ కోల్పోయాడు. మొదటి స్థానంలో చేరిన కేవలం 48 గంటల్లోనే కిందికి వచ్చేసారు. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్ బిలినియర్స్ ఇండెక్స్ వెల్లడించింది. అమెరికా స్టాక్ మార్కెట్లలో టెస్లా షేర్ ధర రెండు ట్రేడింగ్ సెషన్లలో 7శాతానికిపైగా పడిపోయింది. దీనితో మస్క్ సంపద 176 మిలియన్లకు చేరింది. ఇటీవల ప్రపంచ కుబేరుల జాబితాలో 187.1 బిలియన్ డాలర్ల సంపదతో మొదటి స్థానాన్ని పొందిన ఎలాన్ మస్క్ ఇప్పుడు రెండవ స్థానంలో ఉన్నారు. అయితే ప్రస్తుతం వరల్డ్ రిచెస్ట్ పర్సన్‌గా లూయిస్ విటన్ సంస్థ సీఈవో 'బెర్నార్డ్ అర్నాల్ట్' చేరాడు. ప్రస్తుతం అర్నాల్ట్ సంపద 187 బిలియన్ డాలర్లు. (ఇదీ చదవండి: Mahindra Thar RWD: మొన్న విడుదలైంది.. అప్పుడే కొత్త ధరలు) ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో భారతదేశానికి చెందిన ముఖేష్ అంబానీ 79.9 బిలియన్ డాలర్ల సంపాదనతో 11 స్థానంలో, గౌతమ్ అదానీ 44.7 బిలియన్ డాలర్ల సంపాదనతో 28వ స్థానంలో నిలిచారు. చైనాలో కరోనా మహమ్మారి ప్రభావం వల్ల, అదే సమయంలో ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ సొంతం చేసుకోవడం వల్ల టెస్లా కంపెనీపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దీనితో చైనాలో టెస్లా కార్ల అమ్మకాలు చాలా తగ్గిపోయాయి. -
టెస్లా జోష్: మస్త్..మస్త్..అంటూ దూసుకొచ్చిన ఎలాన్ మస్క్
న్యూఢిల్లీ: టెస్లా సీఈవో, ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ అపరకుబేరుడిగా నిలిచాడు. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో నెంబర్ వన్ స్థానానికి ఎగబాగాడు. ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. 2023లో టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మస్క్ నికర విలువ 28 ఫిబ్రవరి నాటికి 187 బిలియన్ డాలర్లు. 2023లో మస్క్ సంపద దాదాపు 50 బిలియన్ డాలర్లు లేదా 36 శాతం పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మస్క్ మొత్తం నికర విలువ 187 బిలియన్ డాలర్లకు చేరుకోగా, రెండవ స్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్ నికర విలువ 185 బిలియన్ డాలర్లు. గత ఏడాది అధిక నష్టాల కారణంగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రెండవ స్థానానికి పడిపోయిన సంగతి తెలిసిందే. తాగా టెస్లా షేర్లు భారీగా పుంజుకోవడంతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించాడు.ఈ ఏడాదిలో టెస్లా స్టాక్ 100 శాతం ఎగిసింది. గత ఏడాది డిసెంబరులో మస్క్ సంపద 200 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోగా, ఆర్నాల్డ్ సంపదపెరగడంతో మస్క్‌ను బెర్నార్డ్ ఆర్నాల్ట్ అధిగమించిన సంగతి తెలిసిందే. అటు ప్రపంచంలోని బిలియనీర్ల జాబితాలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 84.3 బిలియన్ డాలర్ల ఆస్తులతో ఫోర్బ్స్ జాబితాలో 8వ స్థానంలో ఉన్నారు. మరోవైపు ఒకప్పుడు ప్రపంచంలోని రెండవ అత్యంత సంపన్న స్థానంలో అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ 37.7 బిలియన్ డాలర్ల సంపదతో ఈ సూచీలో 32వ స్థానానికి పడిపోయాడు. అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపణలతో అదానీ గ్రూపు షేర్లన్నీ భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. -
రిటైర్మెంట్ దిశగా ప్రపంచ అపరకుబేరుడు!
ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు?.. కొన్నిరోజుల కిందటి దాకా టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ఉండేవాడు. కానీ, ట్విటర్ కొనుగోలు వ్యవహారం.. దానికి తోడు టెస్లా నష్టాలతో రికార్డు స్థాయి పతనం చెంది రెండో స్థానానికి దిగజారాడు. అప్పటి నుంచి ఫ్రాన్స్ వ్యాపార దిగ్గజం బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రపంచ అపరకుబేరుడిగా తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే.. ఈ పెద్దాయన ఇప్పుడు రిటైర్మెంట్ ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తన విలాసవంతమైన వ్యాపార సామ్రాజ్యానికి వారసులను ఒక్కొక్కరిగా ప్రకటించుకుంటూ వెళ్తున్నారు బెర్నార్డ్ ఆర్నాల్ట్(73). తాజాగా కూతురు డెల్‌ఫైన్‌కు ఎల్వీఎంహెచ్ తరపున రెండో అతిపెద్ద బ్రాండ్ డియోర్ బాధ్యతలు అప్పజెప్తున్నట్లు ప్రకటించారాయన. నెల కిందట.. పెద్ద కొడుకు ఆంటోనీ ఆర్నాల్ట్‌కు వ్యాపారంలో విస్తృత బాధ్యతలు అప్పజెప్తున్నట్లు ప్రకటించారాయన. అలాగే.. బెర్నాల్ట్ ఆర్నాల్ట్‌కు ఇద్దరు భార్యల(ఒకరు మాజీ) ద్వారా మొత్తం ఐదుగురు పిల్లలు. ఆ ఐదుగురికి తన వ్యాపారాన్ని అప్పజెప్పే ప్రణాళికను ఒక్కోక్కటిగా అమలు చేస్తూ ముందుకెళ్తున్నారు. తద్వారా వ్యాపార రంగం నుంచి తప్పుకుని విశ్రాంతి తీసుకోవాలనే యోచనలో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ► మరేయితర కంపెనీలు, ఫ్రాంఛైజీలతో సంబంధం లేకుండా.. కేవలం ఎల్వీఎంహెచ్ వ్యాపార సామ్రాజ్యం ద్వారానే బెర్నార్డ్ ఆర్నాల్ట్.. ఆదాయం అర్జిస్తున్నారు. ప్రస్తుతం ఫోర్బ్స్ ప్రకారం ఆ విలువ 196 బిలియన్ డాలర్లు. ► యూరప్‌లోనే లగ్జరీ బ్రాండ్‌గా పేరున్న LVMH Moët Hennessy – Louis Vuitton SEకు సహ వ్యవస్థాపకుడు, చైర్మన్, సీఈవో బాధ్యతలు కూడా ప్రస్తుతం బెర్నాల్డ్ ఆర్నాల్ట్ నిర్వహిస్తున్నాడు. ► 1949 మార్చి 5వ తేదీన రౌబయిక్స్లో జన్మించాడు బెర్నార్డ్ జీన్ ఎటిన్నె ఆర్నాల్ట్. బార్న్ విత్ గోల్డెన్‌గా ఆర్నాల్ట్‌కు పేరుంది. తల్లిదండ్రులిద్దరూ వ్యాపార దిగ్గజాలే. అయితే.. ఇంజినీరింగ్ చదువు పూర్తి చేసుకుని.. సొంతంగా రియల్ ఎస్టేట్ కంపెనీతో ఎదగడం ప్రారంభించాడు ఆర్నాల్ట్. ► ఆపై తండ్రి వ్యాపారాలను గమినిస్తూ, ఆయన నుంచి ఏసాయం ఆశించకుండా.. సొంత బిజినెస్‌లతో ఎదిగాడు. 80వ దశకం వచ్చేనాటికి.. సొంతంగా ఓ లగ్జరీ ఉత్పత్తుల కంపెనీ ఉండాలనే ఆలోచనలతో.. LVMH ను 1987లో నెలకొల్పాడు. ► ఏడాది తిరిగే సరికి అది బిలియన్‌న్నర డాలర్ల విలువ గల కంపెనీగా ఎదిగింది. అటుపై కంపెనీలో మేజర్ షేర్లు కొనుగోలు చేసి.. ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ బోర్డుకు చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. ► 2001 నుంచి ఎల్వీఎంహెచ్ విపరీతమైన లాభాలు ఆర్జించడం మొదలుపెట్టింది. తద్వారా ఫ్రాన్స్.. యూరప్ నుంచి కాస్ట్లీ బ్రాండ్ కంపెనీగా ఎదిగింది. ► 2013లో ఫ్రాన్స్ ఎన్నో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంది. ఆ సమయంలో పన్నుల ఎగవేత కోసం ఆయన బెల్జియం పౌరసత్వం కోసం దరఖాస్తు చేశాడనే ప్రచారం తెర మీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. దరఖాస్తును వెనక్కి తీసుకున్నారాయన. ► ప్రముఖుల విమానాల కదలికలపై ట్విటర్ నిఘా వేయడంతో.. 2022లో ఆయన ప్రైవేట్ జెట్‌ను అమ్మేసినట్లు ప్రకటించారు. అప్పటి నుంచి ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను అద్దెకు తెచ్చుకుని, లేదంటే బిజినెస్ ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నాడాయన. ► తన బిడ్డలకు పాఠాలు చెప్పిన మాస్టార్‌కు కృతజ్ఞతగా.. అతని కొడుకుకు అధ్యక్ష ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు ఆర్నాల్ట్. 2017లో ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో ఈ అపర కుబేరుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్‌ను మద్దతు ప్రకటించారు. ఆయన తండ్రి బ్రిగిట్టే మాక్రోన్.. ఆర్నాల్ట్ పిల్లలకు పాఠాలు చెప్పేవారట. ► డెల్ఫైన్(47) ఆర్నాల్ట్ వారసుల్లో పెద్దది. పదేళ్లుగా తండ్రి వెంట ఉంటూ ఆయన వ్యాపారాలను దగ్గరగా గమనిస్తోంది. దీంతో తదుపరి బాధ్యతలు ఆమెకే అప్పగిస్తారనే చర్చ ఇప్పటి నుంచే జోరందుకుంది. అయితే.. ► గత పదేళ్లలో ఆమె తీసుకున్న స్వతంత్ర నిర్ణయాలు బెడిసి కొట్టింది లేదు. సమర్థవంతమైన నిర్ణయాలకు కేరాఫ్ అనే పేరుంది ఆమెకు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి డియోర్ బాధ్యతలు స్వీకరిస్తారామె. లూయిస్ విట్టన్ వ్యాపారాన్ని సమర్థవంతంగా నడిపిస్తుండడంతో.. ఎల్‌వీఎంహెచ్‌ను కూడా ఆమె ముందకు తీసుకెళ్లగలరనే ధీమాతో బోర్డు మెంబర్స్ ఉండడం కూడా ఆమెకు కలిసొచ్చే అంశం. ► అత్యంత లగ్జరీ బ్రాండ్‌గా పేరున్న ఎల్వీఎంహెచ్(LVMH) కంపెనీ సీఈవో బాధ్యతల నుంచి ఆర్నాల్ట్ అంత సులువుగా తప్పుకోకపోవచ్చనే వాదనా ఒకటి వినిపిస్తోంది. అందుకు కారణం కిందటి ఏడాది సీఈవో వయసు పరిమితిని ఎల్వీఎంహెచ్ ఎత్తేయడం. తద్వారా ఆర్నాల్ట్ 80 ఏళ్లు వచ్చేదాకా కూడా తన బాధ్యతల్లో కొనసాగవచ్చు. కానీ, ► అనారోగ్య కారణాల దృష్ట్యానే ఆయన బాధ్యతల నుంచి విరమణ తీసుకోవాలని భావిస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెప్తుండడం గమనార్హం.