ఆర్నాల్ట్, అంబానీ డీల్‌: అద్దె ఎంతో తెలిస్తే షాకవుతారు! | Louis Vuitton Lease Four Units At Mukesh Ambani Jio World Plaza; Check Here Rent Per Month - Sakshi
Sakshi News home page

ఆర్నాల్ట్, అంబానీ మెగా డీల్‌: అద్దె ఎంతో తెలిస్తే షాకవుతారు!

Published Sat, Sep 2 2023 1:33 PM | Last Updated on Sat, Sep 2 2023 1:56 PM

Louis Vuitton leases four units at Mukesh Ambani Jio World Plaza - Sakshi

ప్రపంచ రెండో కుబేరుడు గ్లోబల్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ లూయిస్ విట్టన్‌ సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ , ఆసియాకుబేరుడురిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్‌ అంబానీకి చెందిన లగ్జరీ మాల్‌లో  ఒక​ స్టోర్‌ను లీజుకు తీసుకున్నారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లోని జియో వరల్డ్ ప్లాజాలో తన కొత్త స్టోర్‌ను అద్దెకు తీసుకున్నారు.  మొత్తం 7,365 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు యూనిట్లకు గాను నెలకు చెల్లిస్తున్న అద్దె  ఏకంగా  40.50 లక్షలుగా ఉంది. (కేంద్రం మరో కీలక నిర్ణయం: విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ కట్‌)

ఫ్రెంచ్ ఫ్యాషన్  దిగ్గజం లూయిస్ విట్టన్ ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో ముఖేష్ అంబానీకి చెందిన  నుండి రిటైల్ స్థలాన్ని దీర్ఘకాలిక లీజుకు ఒప్పందం కుదుర్చు కుంది. అంతేకాదుప్రపంచ లగ్జరీ బ్రాండ్ అతిపెద్ద షోరూంగా ఇది  నిలవడం విశేషం. కంపెనీ తొమ్మిదిరన్న ఏళ్ల పాటు లీజుకు తీసుకుంది. ఇరు సంస్థలు ఆగస్టు 21న  కుదర్చుకున్న  ఒప్పందం ప్రకారం లూయిస్ విట్టన్ ఇండియా రిటైల్ రిలయన్స్‌కు నెలకు రూ.40.5 లక్షలు , లేదా మొత్తం లేదా నికర రాబడి వాటాలో 6 శాతం, ఏది ఎక్కువ అయితే అది చెల్లిస్తుంది. 36 నెలల తర్వాత అద్దె 15 శాతం పెరుగుతుంది. ఇందుకోసం కంపెనీ కంపెనీ రూ.2.43 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించింది. కామన్ ఏరియాకు రూ.24.30 లక్షలు, ఫిట్‌అవుట్‌లకు రూ.29.46 లక్షలు కూడా చెల్లించారు.(డయానాతో ప్రమాదంలో మరణించిన డోడి తండ్రి, బిజినెస్‌ టైకూన్‌ కన్నుమూత)

కాగా 1854లో పారిస్‌లో లూయిస్ విట్టన్‌చే  దీన్ని స్థాపించారు. ప్రస్తుతం ఆర్నాల్ట్‌ దీనికి చైర్మన్‌ అండ్‌ సీఈవోగా  ఉన్నారు. 2003లో న్యూఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో ఇండియాలో తొలి  దుకాణాన్ని ప్రారంభించింది.  ప్రస్తుతం బెంగళూరు,ఢిల్లీ, ముంబైసహా దేశవ్యాప్తంగా మూడు స్టోర్‌లను కలిగి ఉంది. బెర్నార్డ్ ఆర్నాల్ట్  అతని నికర విలువ 208 బిలియన్ డాలర్లు. ముఖేష్ అంబానీ 94 బిలియన్ డాలర్ల నికర విలువతో ఆసియాలోనే అత్యంత సంపన్నుడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement