రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్ నీతా అంబానీ మరో అరుదైన ఘనతను సొంతంచేసుకున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ బాంబే నుంచి ప్రతిష్టాత్మక సిటిజన్ ఆఫ్ ముంబై అవార్డు (2023-24)ను అందుకున్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, క్రీడలు, కళలు మరియు సంస్కృతికి అందించిన సేవలకు గాను రోటరీ క్లబ్ ఆఫ్ బొంబే ఈ అవార్డును ప్రదానం చేసింది. ఒక వ్యాపారవేత్తగా పరోపకారిగా నీతా అంబానీ సాధించిన మరో కీలక విజయం అంటూ అందరూ ఆమెకు అభినందనలు తెలిపారు.
న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ బోర్డు గౌరవ ట్రస్టీగా ఎన్నికైన తొలి భారతీయురాలిగా నీతా అంబానీ చరిత్ర సృష్టించారు. అలాగే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళగా రికార్డు క్రియేట్ చేసిన నీతా అంబానీ, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భార్యగా మాత్రమే కాదు, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో సేవలందిస్తూ తనదైన ప్రత్యేకతను సాధించారు.
ఇటీవల ముంబైలో ఆవిష్కరించిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ కళలకు సంబంధించి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన, కళాకారులకు ఇదొక అద్భుతమైన వేదికగా నిలుస్తోంది.అలాగే ముంబైలోని సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ ద్వారా భారతీయులందరికీ అందుబాటు ధరలో ప్రపంచ స్థాయి వైద్య సేవల్ని అందిస్తోంది అలాగే రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 5,000 స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది.
Nita Ambani receives the prestigious citizen of Mumbai Award 2023-24 from the Rotary Club of Bombay – a recognition of her enduring contributions to creating transformative institutions in healthcare, education, sports, arts, and culture. pic.twitter.com/SQ7d4CxPAL
— ANI (@ANI) September 27, 2023
అంతే కాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన క్రికెట్ జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్‌కు అంబానీ యజమానిగా కూడా రాణిస్తున్నారు. అంబానీ ఇండియన్ సూపర్ లీగ్‌ను ప్రారంభించిన ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ ఫౌండర్ చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు. పిల్లల అభివృద్ధికి తోడ్పడే 'అందరికీ విద్య మరియు క్రీడలు' కార్యక్రమానికి కూడా ఆమె సారథ్యం వహిస్తున్నారు. ఇంకా, ఎంఐ న్యూయార్క్ ఫౌండర్‌గా ప్రొఫెషనల్ అమెరికన్ T20 లీగ్ మేజర్ లీగ్ క్రికెట్ (MLC) ప్రారంభ ఎడిషన్‌ను గెలుచుకున్న ఘనత కూడా నీతా అంబానీకే దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment