prestigious award
-
మేజర్గారి ప్రసంగం మెగా హిట్
ప్రతిష్ఠాత్మక ‘మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డ్’ అందుకోవడంతో వార్తల్లోకి వచ్చిన మేజర్ రాధికాసేన్ తన ‘వైరల్ స్పీచ్’ ద్వారా మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ‘జెండర్–సెన్సిటివ్ పీస్‌కీపింగ్ ప్రాముఖ్యత గురించి తన ప్రసంగంలో నొక్కి చెప్పింది సేన్. ‘జెండర్–సెన్సిటివ్ పీస్‌కీపింగ్ అనేది కేవలం మహిళల బాధ్యత మాత్రమే కాదు. అది అందరి బాధ్యత. మహిళల ఆరోగ్యం, విద్య, శిశుసంరక్షణ. లింగసమానత్వం, లైంగిక హింసను ఎదుర్కోవడం లాంటి అంశాలపై కమ్యూనిటీలతో మమేకమయ్యే అవకాశం లభించింది’ అంటుంది సేన్. ప్రసంగం అనంతరం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ రాధికసేన్ను నిజమైన నాయకురాలిగా, మోడల్‌గా అభివర్ణించారు. -
భారతీయ యువతికి లండన్ ప్రతిష్టాత్మక అవార్డు! కింగ్ చార్లెస్‌ని..
ఓ టీనేజ్ అమ్మాయి లండన్ ప్రిన్స్ చార్లెస్‌ని కలిసే అరుదైన అవకాశాన్ని కొట్టేసింది. ఆయన చేతుల మీదుగా లండన్ ప్రతిష్టాత్మక అవార్డుని అందుకుంది. ఎవరా యువతి, ఏం సాధించిందంటే..ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెచ్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందని ఆర్తీ అనే 18 ఏళ్ల రిక్షా డ్రైవర్ లండన్‌లోని ప్రతిష్టాత్మకమైన అమల్ కూన్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డుని అందుకుంది. ఈ అవార్డు బ్రిటిష్ స్వచ్ఛంద సంస్థ ప్రిన్స్ ట్రస్ట్చే స్పాన్సర్ చేయబడుతుంది. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుకి ఇంగ్లీష్ బారిస్టర్ అమల్ క్లూనీ పేరు పెట్టారు. ఆర్తీ ప్రభుత్వ ఈ రిక్షా చొరవతో డ్రైవర్‌గా పనిచేసి ఇతర యువతులను ప్రేరేపించినందుకుగానూ ఆమెకు ఈ లండన్ ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించింది. పింక్ రిక్షా ఇనిషియేటివ్ అంటే..ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2020లో మిషన్ శక్తి పథకాన్ని ప్రారంభించింది. ఇది రక్షణ, శిక్షణ, స్వావలంబన ద్వారా మహిళలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద పింక్ ఈ రిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది మహళలకు ఈ రిక్షాలు నడపడంలో శిక్షణ, ట్రాపిక్ నిబంధలన గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. ఇది ముఖ్యంగా వితంతువుల, ఒంటరి తల్లులకు ఉపాధి అవకాశాలను పెంచడమే ఈ పథకం ముఖ్యోద్దేశం. ఆర్తి గతేడాది జూలైలో భారత ప్రభుత్వం పింక్ ఈ రిక్షా పథకాన్ని పరిచయం చేసేందుకు ముందుకొచ్చారు. చెప్పాలంటే యూపీలో ఆమె తొలి పింక్ ఈ రిక్షా డ్రైవర్ కూడా. చాలా చిన్న వయసులో ఆమె అందించిన గొప్ప సహకారానికిగానూ ఈ ప్రిన్స్ ట్రస్ట్ అవార్డుని తెచ్చిపెట్టాయి. " అసమానతలకు వ్యతిరేకంగా తన చుట్టూ ఉన్నవారిలో శాశ్వతమైన మార్పు తీపుకొచ్చేలా ప్రపంచ పనిలో విజయం సాధించిన యువతులను ఈ అవార్డుతో సత్కరిస్తుంది" ప్రిన్స్ ట్రస్ట్. ఆర్తీ తొలి పింక్ ఈ రిక్షా డ్రైవర్‌గా ఎలా మారిందంటే..ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న ఆర్తీ మీడియాతో మాట్లాడుతూ..ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేలా ఇతర అమ్మాయిలకు స్ఫూర్తినివ్వగలిగినందుకు గర్విస్తున్నా. ఈ కొత్త స్వాతంత్ర్యం ప్రపంచాన్ని వేరే కోణంలో చూసేందుకు నన్ను అనుమతించింది. ఇప్పుడ నేను నా కలలన మాత్రమే కాకుండా నా కుమార్తె కలలన కూడా నెరవేర్చగలుగుతున్నాను. ఈ చోరవే నాకు బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ చార్లెస్‌ని కలిసే అవకాశం లభించేలా చేసింది.ఇది ఒక అద్భుతమైన అనుభవంగా పేర్కొంది ఆర్తీ . అంతేగాదు చార్లెస్ తనకు ఈ రిక్షా డ్రైవింగ్ పట్ల ఉన్న ఆసక్తిని శ్రద్ధగా విన్నారని తెలిపింది. ఆయనతో ఆర్తి తన ఆటో రిక్షా కాలుష్యం కలిగించని వాహానం అని గర్వంగా చెప్పుకొచ్చింది కూడా. ఐదేళ్ల కుమార్తె ఉన్న ఆర్తీ ఇలాంటి సవాళ్లను ఎన్నింటినో ఎదుర్కొని ఇతర బాలికలకు స్ఫూర్తిగా ఉండాలనుకుంటున్నట్లు పేర్కొంది. (చదవండి: 'ప్రపంచ ఆకలి దినోత్సవం': ఎంతమంది బాధపడుతున్నారంటే..?) -
భారత సంతతి శాస్త్రవేత్తకు ‘షా’ అవార్డ్
హాంకాంగ్: విద్యుదయస్కాంత కిరణాలను వెదజల్లే న్యూట్రాన్ నక్షత్రాలు, నక్షత్రాల పేలుడు, గామాకిరణాల వెల్లువ వంటి ఖగోళ అంశాలపై విశేష పరిశోధనలకు గుర్తింపుగా భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త శ్రీనివాస్ రామచంద్ర కులకర్ణి.. ప్రఖ్యాత ‘షా’ అవార్డ్‌కు ఎంపికయ్యారు. శ్రీనివాస్ ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోరి్నయా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆ్రస్టానమీ, ప్లానెటరీ సైన్స్, డివిజన్ ఆఫ్ ఫిజిక్స్, మేథమేటిక్స్, ఆ్రస్టానమీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అమెరికాలోని పలోమర్ ట్రాన్సియెంట్ ఫ్యాక్టరీలో ఆ తర్వాత జ్వికీ ట్రాన్సియెంట్ ఫ్యాక్టరీల్లో టెలిస్కోప్‌ల సాయంతో రోదసీలో నిర్దిష్ట ప్రాంతంలోని ఖగోళ అంశాలను పరిశీలించి వాటిపై విశేష పరిశోధనలు చేసినందుకుగాను ఈ అవార్డ్‌ను శ్రీనివాస్‌కు ప్రదానం చేయనున్నారు. 2024 సంవత్సరానికి ఆస్ట్రానమీ విభాగంలో శ్రీనివాస్‌కు అవార్డ్ ఇస్తున్నట్లు షా ప్రైజ్ ఫౌండేషన్ మంగళవారం ప్రకటించింది. -
ఏపీ విద్యుత్ సంస్థలకు ప్రతిష్టాత్మక అవార్డులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్ సంస్థలు మరోసారి ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన విద్యుత్ సంస్థలకు అందించే ‘ఫాల్కన్ మీడియా–ఎనర్షియా ఫౌండేషన్’ జాతీయ అవార్డులను ఏకంగా మూడింటిని ఏపీ విద్యుత్ సంస్థలు పొందాయి. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఏపీ ట్రాన్స్‌కో)కు ‘టాప్ స్టేట్ యుటిలిటీ ఫర్ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ అవార్డు లభించింది. పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్ట్‌ల ప్రచారానికి సంబంధించి దేశంలోనే బెస్ట్ స్టేట్ టాప్ రెన్యూవబుల్ ఎనర్జీ నోడల్ ఏజెన్సీగా న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) అవార్డును కైవసం చేసుకుంది. రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్స్ (పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు బాధ్యత) లక్ష్యాన్ని చేరుకోవడంలోనూ ముందంజలో ఉన్న ఉత్తమ రాష్ట్రంగా ఏపీ విద్యుత్ సంస్థలను అవార్డు వరించింది. డిసెంబర్ 29వ తేదీన ముంబైలో జరిగిన ‘16వ ఎనర్షియా అవార్డ్స్–2023’ ప్రదానోత్సవంలో ఏపీ విద్యుత్ సంస్థలకు ఈ అవార్డులను అందించారు. ఈ నేపథ్యంలో ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి రాష్ట్రానికి లభించిన అవార్డుల గురించి వివరించారు. ప్రతిష్టాత్మకమైన అవార్డును గెలుచుకోవడంలో కృషి చేసిన విద్యుత్ సంస్థలు, ఇంధన శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా అభినందించారు. దేశంలోనే అత్యుత్తమ విద్యుత్ వ్యవస్థ ఏపీ ట్రాన్స్‌కో సాధించిన విజయాలను ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. ట్రాన్స్మిషన్ సిస్టం లభ్యత 99.7 శాతం (హై రెగ్యులేటరీ బెంచ్ మార్క్ 99.5 శాతం) ఉందని, ట్రాన్స్మిషన్ నష్టాలు 2.74 శాతానికి పరిమితమయ్యాయని తెలిపారు. దేశంలోనే అత్యంత విశ్వసనీయ స్టేట్ ట్రాన్స్‌కో, గ్రిడ్ ఆపరేటర్‌గా కూడా ఏపీ ట్రాన్స్‌కో గుర్తింపు పొందిందని, ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేయడానికి, పునరుత్పాదక శక్తిని పెద్ద మొత్తంలో సాధించడానికి వీలు కల్పిస్తుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీ–2020, ఏపీ పంప్డ్ స్టోరేజీ ప్రమోషన్ పాలసీ–2022, ఏపీ గ్రీన్ ఎనర్జీ అండ్ గ్రీన్ అమ్మోనియా ప్రమోషన్ పాలసీ–2023 వంటి ప్రమోషన్ పాలసీలను ఎన్ఆర్ఈడీసీఏపీ నిర్వహణలో నోటిఫై చేసిందని చెప్పారు. పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు స్థలాలను గుర్తించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందన్నారు. 37 ప్రాజెక్టులకు టెక్నో–కమర్షియల్ ఫీజిబిలిటీ రిపోర్ట్స్ (టీసీఎఫ్‌ఆర్) తయారయ్యాయని, వేరియబుల్ రెన్యూవబుల్ ఎనర్జీ జనరేషన్‌ని బ్యాలెన్స్ చేయడానికి, గరిష్ట విద్యుత్ డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరాను అందించడానికి ఇవి ఉపయోగపడతాయని వివరించారు. మొత్తం 41,020 మెగావాట్ల సామర్థ్యంతో దశలవారీగా పీఎస్పీ ప్రాజెక్టుల స్థాపనకు నివేదికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఏపీ పవర్ సెక్టార్‌ను దేశంలోనే నంబర్–1గా నిలిపేందుకు నిరంతరం కృషిచేయాలని విద్యుత్ సంస్థలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. సీఎంను కలిసిన వారిలో ఏపీ జెన్కో ఎండీ, ట్రాన్స్‌కో జేఎండీ కేవీన్ చక్రధర్‌బాబు, నెడ్‌క్యాప్ వీసీ అండ్ ఎండీ ఎస్.రమణారెడ్డి, ట్రాన్స్‌కో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ జేఎండీ బి.మల్లారెడ్డి, ఇంధన శాఖ జాయింట్ సెక్రటరీ, ఏపీఎస్ఈసీఎం సీఈవో కుమారరెడ్డి, గ్రిడ్ డైరెక్టర్ ఏకేవీ భాస్కర్ ఉన్నారు. -
జీఆర్టీ జ్యువెలర్స్‌కి ప్రతిష్టాత్మక అవార్డు
హైదరాబాద్: జీఆర్టీ జ్యువెలర్స్ ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకుంది. ఎఫ్‌యూఆర్‌ఏ(ఫురా) రిటైల్ జ్యువెలర్ ఇండియా అవార్డ్స్ 2023 కార్యక్రమంలో ‘‘బ్రైడల్ స్టేట్మెంట్ జ్యువెలరీ ఆఫ్ ది ఇయర్’’ అవార్డు సొంతం చేసుకుంది. ఇటీవల వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, సాలిటైర్ జెమోలాజికల్ లేబరేటరీస్ సహకారంతో 18 ఎడిషన్ అవార్డుల వేడుకలు ఘనంగా జరిగాయి. అద్భుతమైన డిజైన్లు మాత్రమే కాకుండా భావోద్వేగాలు ప్రతిఫలించేలా ఆభరణాలను రూపొందించడంలో నిబద్ధతను ఈ అవార్డు ప్రనరుద్ఘటిస్తోందని సంస్థ ఎండీ శ్రీ ఆనంద్ అనంత పద్మనాభన్ తెలిపారు. భారతీ సంస్కృతిలో వివాహాల వైభవం, ప్రాముఖ్యతను తెలియజేసే కళాఖండాలను తీర్చిదిద్దడంలో జీఆర్టీ పూర్తి అంకితభావాన్ని ప్రదర్శిస్తుందని మరో ఎండీ జీఆర్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. -
నీతా అంబానీకి మరో అరుదైన గౌరవం
రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్ నీతా అంబానీ మరో అరుదైన ఘనతను సొంతంచేసుకున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ బాంబే నుంచి ప్రతిష్టాత్మక సిటిజన్ ఆఫ్ ముంబై అవార్డు (2023-24)ను అందుకున్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, క్రీడలు, కళలు మరియు సంస్కృతికి అందించిన సేవలకు గాను రోటరీ క్లబ్ ఆఫ్ బొంబే ఈ అవార్డును ప్రదానం చేసింది. ఒక వ్యాపారవేత్తగా పరోపకారిగా నీతా అంబానీ సాధించిన మరో కీలక విజయం అంటూ అందరూ ఆమెకు అభినందనలు తెలిపారు. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ బోర్డు గౌరవ ట్రస్టీగా ఎన్నికైన తొలి భారతీయురాలిగా నీతా అంబానీ చరిత్ర సృష్టించారు. అలాగే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళగా రికార్డు క్రియేట్ చేసిన నీతా అంబానీ, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భార్యగా మాత్రమే కాదు, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో సేవలందిస్తూ తనదైన ప్రత్యేకతను సాధించారు. ఇటీవల ముంబైలో ఆవిష్కరించిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ కళలకు సంబంధించి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన, కళాకారులకు ఇదొక అద్భుతమైన వేదికగా నిలుస్తోంది.అలాగే ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ ద్వారా భారతీయులందరికీ అందుబాటు ధరలో ప్రపంచ స్థాయి వైద్య సేవల్ని అందిస్తోంది అలాగే రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 5,000 స్కాలర్షిప్లను అందిస్తుంది. Nita Ambani receives the prestigious citizen of Mumbai Award 2023-24 from the Rotary Club of Bombay – a recognition of her enduring contributions to creating transformative institutions in healthcare, education, sports, arts, and culture. pic.twitter.com/SQ7d4CxPAL — ANI (@ANI) September 27, 2023 అంతే కాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన క్రికెట్ జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్‌కు అంబానీ యజమానిగా కూడా రాణిస్తున్నారు. అంబానీ ఇండియన్ సూపర్ లీగ్‌ను ప్రారంభించిన ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ ఫౌండర్ చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు. పిల్లల అభివృద్ధికి తోడ్పడే 'అందరికీ విద్య మరియు క్రీడలు' కార్యక్రమానికి కూడా ఆమె సారథ్యం వహిస్తున్నారు. ఇంకా, ఎంఐ న్యూయార్క్ ఫౌండర్‌గా ప్రొఫెషనల్ అమెరికన్ T20 లీగ్ మేజర్ లీగ్ క్రికెట్ (MLC) ప్రారంభ ఎడిషన్‌ను గెలుచుకున్న ఘనత కూడా నీతా అంబానీకే దక్కింది. -
దేశీ వరి పరిరక్షకుడు డా.దేబల్ దేవ్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం!
ప్రముఖ దేశీ వరి వంగడాల పరిరక్షకులు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ దేబల్ దేవ్‌కు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ‘ఐఫోమ్ ఆసియా ఆర్గానిక్ మెడల్ ఆఫ్ ఆనర్’ లభించింది. వంద దేశాల్లో సేంద్రియ వ్యవసాయదారుల సంఘాల సమాఖ్య (ఐఫోమ్) ఆర్గానిక్స్ ఆసియా విభాగం, చైనాలోని క్సిచాంగ్ కౌంటీ సంయుక్తంగా 2023వ సంవత్సరపు ఆర్గానిక్ మెడల్ ఆఫ్ ఆనర్ పురస్కారానికి డా. దేబల్ దేవ్‌ను ఎంపిక చేశాయి. వైవిధ్యభరితమైన 1,440కు పైగా అపురూపమైన భారతీయ వరి వంగడాలను సేకరించడంతో పాటు.. ఒడిషాలోని తన చిన్న పరిశోధనా క్షేత్రంలో ప్రతి ఏటా సాగు చేస్తూ పరిరక్షిస్తున్న డా. దేబల్ దేవ్ దశాబ్దాలుగా నిస్వార్థ సేవ చేస్తున్నారు. 5 వేల డాలర్ల నగదు పురస్కారంతో పాటు ప్రశంసాపత్రం ప్రదానం చేస్తారు. డా. దేబల్ దేవ్ పరిరక్షిస్తున్న దేశీ వరి వంగడాల్లో వాతావరణ మార్పుల్ని తట్టుకొని నిలిచే వరి రకాలతో పాటు అత్యంత అరుదైన పౌష్టిక విలువలు కలిగిన రకాలు కూడా ఉండటం విశేషం. జీన్ బ్యాంకుల్లో ఉండే పురాతన వంగడాలు శాస్త్రవేత్తల పరిశోధనలకు మాత్రమే ఉపయోగపడతాయి. అయితే, రైతుల పొలాల్లో ఏటేటా సాగవుతూ దేశీ వరి వంగడాలు వాతావరణ మార్పులకు, సరికొత్త చీడపీడలకు దీటుగా తట్టుకుంటూ రాటుదేలుతూ రైతులకు అందుబాటులో ఉంటాయి. అందువల్లనే, ఆధునిక వంగడాలెన్ని వచ్చినా ఈ అపురూపమైన పురాతన వంగడాలను సాగు చేస్తూ పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రకృతి సేద్యానికి అనువైన ఈ వంగడాల ద్వారానే మన ఆహార సార్వభౌమత్వం నిలుస్తుందని డా. దేబల్ దేవ్ ‘సాక్షి సాగుబడి’తో అన్నారు. - సాక్షి సాగుబడి డెస్క్ -
సిగ్నిటీకి మెడ్‌టెక్ అవార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ ఇంజినీరింగ్ సేవల సంస్థ సిగ్నిటీ టెక్నాలజీస్ 7వ వార్షిక మెడ్‌టెక్ బ్రేక్‌థ్రూ అవార్డ్స్ కార్యక్రమంలో ప్రతిష్టాత్మక పురస్కారం దక్కించుకుంది. తమ ఇంటర్నెట్ ఆఫ్ మెడికల్ థింగ్స్ (ఐవోఎంటీ) డిజిటల్ క్వాలిటీ ఇంజినీరింగ్ ఆటోమేషన్ ఫ్రేమ్‌వర్క్‌కు ’ఉత్తమ ఐవోటీ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫాం’ అవార్డు దక్కినట్లు సంస్థ తెలిపింది. వైద్య పరికరాల రంగంలో ఐవోఎంటీ, కనెక్టెడ్ డివైజ్‌ల ప్రాధాన్యం పెరుగుతోందని, ఇవి వ్యయాలను తగ్గించడంతో పాటు హెల్త్‌కేర్ పరిశ్రమ ఎదుర్కొనే సవాళ్ళనూ పరిష్కరించగలవని ఈ సందర్భంగా సిగ్నిటీ సీఈవో శ్రీకాంత్ చకిలం తెలిపారు. మెడికల్ పరికరాల టెస్టింగ్‌కు అవసరమైన అన్ని సామర్థ్యాలు ఐవోఎంటీ ప్లాట్‌ఫామ్‌కు ఉన్నాయని మెడ్‌టెక్ బ్రేక్‌థ్రూ ఎండీ జేమ్స్ జాన్సన్ పేర్కొన్నారు. -
పుడమి సాక్షిగా క్యాంపెయిన్‌కు ప్రతిష్టాత్మక AAFA అవార్డు
ముంబై/హైదరాబాద్: పుడమి సంరక్షణ కోసం సాక్షి మీడియా గ్రూప్ చేస్తోన్న పుడమి సాక్షిగా క్యాంపెయిన్‌కు అంతర్జాతీయ గౌరవం దక్కింది. IAA ఆధ్వర్యంలో ఏషియన్ ఫెడరేషన్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ AAFA.. పుడమి సాక్షిగా కార్యక్రమాన్ని ఎంపిక చేసి కార్పోరేట్ సోషల్ క్రూసేడర్ ఆఫ్ ది ఇయర్ సిల్వర్ అవార్డుతో సత్కరించింది. ముంబై వేదికగా జరిగిన ఈ అవార్డుల సమర్పణ కార్యక్రమంలో సాక్షి మీడియా తరుపున సాక్షి కార్పోరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణి రెడ్డికి AAFA చైర్మన్ శ్రీనివాసన్ స్వామి, IAA ప్రెసిడెంట్ అవినాష్ పాండే, ఆలివ్ క్రౌన్ చైర్మన్ జనక్ సర్థా ఈ అవార్డును అందజేశారు. ► ప్రతీ ఏటా జనవరి 26న మెగా టాకథాన్‌గా వస్తోన్న పుడమి సాక్షిగా కార్యక్రమం 2020-21లో ప్రారంభమై ఇప్పటికి మూడు ఎడిషన్లు పూర్తి చేసుకుంది. పర్యావరణాన్ని కాపాడడం, కాలుష్యం తగ్గించడం, స్వచ్ఛమైన పుడమిని భవిష్యత్తు తరాలకు అందించడం.. పుడమి సాక్షిగా లక్ష్యాలు. ప్రాణకోటికి జీవనాధారమైన ధరిత్రి ప్రమాదంలో పడడానికి ప్రధాన కారణం మనుష్యులే. ఈ భూమి మళ్లీ పునర్వైభవాన్ని దక్కించుకోవాలంటే .. ప్రతీ ఒక్కరు నిరంతరం చేయాల్సిన కృషిని పుడమి సాక్షిగా గుర్తు చేస్తోంది. ► ఏడాది పాటు ప్రతీ నెలా ఏదో ఒక రూపంలో పుడమి కార్యక్రమాలు చేపడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయిలో పర్యావరణంపై అవగాహన కల్పించడంతో పాటు అందరిని ఇందులో భాగస్వామ్యులను చేస్తోంది. దీంతో పాటు గణతంత్ర దినోత్సవం రోజున సాక్షి టీవీలో దాదాపు 10 గంటల పాటు మెగా టాకథాన్ రూపంలో ప్రసారం చేస్తోంది. ► పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడుతున్న పెద్దలు, సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు, తమ అనుభవాలను పంచుకుంటూ సమాజానికి స్పూర్తి కలిగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సమస్త సమాచారం, స్టోరీలు, వీడియోలు https://www.pudamisakshiga.com/ వెబ్ సైట్లో చూడవచ్చు. సాక్షి టీవీ ఔట్ పుట్ ఎడిటర్ నాగరాజు, మేనేజింగ్ ఎడిటర్ నేమాని భాస్కర్, ఇన్ పుట్ ఎడిటర్ ఇస్మాయిల్, సినీ నటుడు అలీ, CEO అనురాగ్ అగ్రవాల్, డైరెక్టర్ KRP రెడ్డి, బిజినెస్ కంట్రోల్ డైరెక్టర్ ALN రెడ్డి, కార్పోరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణీ రెడ్డి, ఫైనాన్స్ డైరెక్టర్ YEPరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ డిజిటల్ శ్రీనాథ్ ఇక AAFA అవార్డు సందర్భాన్ని పురస్కరించుకుని సాక్షి మీడియా హౌస్‌లో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా సినీనటుడు అలీ పాల్గొన్నారు. సాక్షి మీడియా గ్రూపు సంకల్పాన్ని అలీ ప్రత్యేకంగా ప్రశంసించారు. పుడమి సాక్షికి గౌరవం.. సెలబ్రేషన్స్ ఫొటోల కోసం క్లిక్ చేయండి -
పుంగనూరు ఆవులకు ప్రతిష్టాత్మక అవార్డు
సాక్షి, అమరావతి: అంతరించిపోతున్న పుంగనూరు జాతి ఆవుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగా పలమనేరులోని పుంగనూరు పరిశోధనా కేంద్రానికి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు–2022 లభించింది. జాతీయ స్థాయిలో అరుదైన, అంతరించిపోతున్న జాతుల పరిరక్షణకు కృషి చేసే సంస్థలకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఏటా ఈ అవార్డులను ప్రదానం చేస్తుంది. ఈ నెల 23న కిసాన్ దివస్ సందర్భంగా న్యూఢిల్లీలో జరుగనున్న కార్యక్రమంలో ఈ అవార్డు కింద ప్రత్యేక ప్రశంసాపత్రంతో పాటు నగదు బహుమతిని ప్రదానం చేయనున్నారు. ఏపీకి ప్రత్యేకం ప్రపంచంలోనే అత్యంత పొట్టివైన పుంగనూరు జాతి పశువులు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకం. కేవలం 3 అడుగుల పొడవు మాత్రమే పెరిగే ఈ జాతి పశువులు రెడ్, బ్రౌన్, బ్లాక్, తెల్లటి రంగుల్లో తోక నేల భాగాన్ని తాకే విధంగా ఉంటాయి. ఏడాదికి సగటున 5 నుంచి 8 శాతం కొవ్వుతో 500 కేజీల వరకు పాల దిగుబడి ఇస్తాయి. ‘మిషన్ పుంగనూర్’ కింద ఈ జాతి పశువుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.60 కోట్లతో కార్యాచరణ రూపొందించింది. ప్రభుత్వ కృషి ఫలితంగా గడచిన మూడేళ్లలో 176 పుంగనూరు దూడలు జన్మించాయి. ప్రస్తుతం రీసెర్చ్ స్టేషన్లో 268 పుంగనూరు జాతి పశువులు ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఈ ఏడాది నాలుగు కేటగిరీలలో బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డులను ఐసీఎఆర్ ప్రకటించగా, కేటిల్ కేటగిరీలో పుంగనూరు జాతికి ఈ అవార్డు లభించింది. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుతో పుంగనూరు జాతి పరిరక్షణకు ఐసీఏఆర్ కూడా అవసరమైన చేయూత ఇచ్చేందుకు మార్గం సుగమమైందని రీసెర్చ్ స్టేషన్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ వేణు ‘సాక్షి’కి తెలిపారు. -
Ballon D'Or: 1998లో జిదానే.. ఇప్పుడు కరీమ్ బెంజెమా
ఫుట్‌బాల్ స్టార్ కరీమ్ బెంజెమా పురుషుల విభాగంలో ప్రతిష్టాత్మక బాలన్ డీ ఓర్ అవార్డును గెలుచుకున్నాడు. భారత కాలమాన ప్రకారం సోమవారం అర్థరాత్రి పారిస్ వేదికగా జరిగిన వేడుకలో బెంజెమా ఈ అవార్డు అందున్నాడు. 1998లో ఫ్రాన్స్ ఫుట్‌బాల్ దిగ్గజం జినదిన్ జిదానే బాలన్ డీ ఓర్ అవార్డును అందుకోగా.. ఆ తర్వాత ఈ అవార్డు అందుకున్న రెండో ఫ్రాన్స్ ఫుట్‌బాలర్‌గా కరీమ్ బెంజెమా రికార్డులకెక్కాడు. ఈ ఏడాది రియల్ మాడ్రిడ్ తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన బెంజెమాకు అవార్డు రావడం అతని అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. ఈ ఏడాది మాడ్రిడ్ తరపున 46 మ్యాచ్‌ల్లో 44 గోల్స్ స్కోర్ చేశాడు. ఇందులో 15 గోల్స్ చాంపియన్స్ లీగ్‌లో చేయడం విశేషం. అంతేకాదు రియల్ మాడ్రిడ్ చాంపియన్స్ లీగ్, లాలిగా టైటిల్స్ గెలవడంలో బెంజెమా కీలకపాత్ర పోషించాడు. ఇక చాంపియన్స్ లీగ్‌లో భాగంగా రౌండ్ ఆఫ్ 16లో పారిస్ సెయింట్ జర్మన్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 నిమిషాల వ్యవధిలో హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిశాడు. అవార్డు అందుకోవడంపై బెంజెమా స్పందించాడు. ''బాలన్ డీ ఓర్ అవార్డు రావడం గర్వకారణం. అవార్డు అందుకోవడానికి అన్ని విధాలుగా కష్టపడ్డాను.. ఎప్పుడు ఓడిపోవడానికి సిద్ధపడలేదు. నా జీవితంలో ఇద్దరు రోల్ మోడల్స్ ఉన్నారు. ఒకరు జినదిన్ జిదానే.. మరొకరు రొనాల్డో. వారి ప్రభావం నాపై స్పష్టంగా ఉంది. ఫ్రాన్స్ జట్టుకు లేని సందర్భాల్లో చాలా కష్టపడాల్సి వచ్చింది. ఫుట్‌బాల్‌ను మాత్రం ఎంజాయ్ చేస్తూనే ఉంటాను. ఈ అవార్డు రావడం వెనుకు ఎంతో కష్టం ఉంది. అందుకు గర్వంగా ఉంది.'' అంటూ ముగించాడు. ఇక మహిళల విభాగంలో బార్సిలోనాకు ఆడుతున్న అలెక్సియా పుటెల్లాస్ వరుసగా రెండోసారి అవార్డును నిలబెట్టుకుంది. ఇక కోపా అవార్డును బార్సిలోనాకు చెందిన బార్సిలోనాకు చెందిన గవి సొంతం చేసుకున్నాడు. గెర్డ్ ముల్లర్ అవార్డును బార్సిలోనాకు ఆడుతున్న రాబర్ట్ లెవాన్‌డోస్కీ కైవసం చేసుకోగా.. రియల్ మాడ్రిడ్‌కు చెందిన తిబుట్ కోర్టొయిస్ను యషిన్ ట్రోఫీ.. సోక్రెట్స్ అవార్డును సాడియో మానీ(లివర్‌పూల్) సొంతం చేసుకున్నారు. ఇక క్లబ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మాంచెస్టర్ సిటీ గెలుచుకుంది. 🏅 ¡ENHORABUENA, @Benzema! 🏅#ballondor pic.twitter.com/2RuoJE3ZN5 — Real Madrid C.F. (@realmadrid) October 17, 2022 -
మెగావేలంలో అవమానం.. అక్కడ మాత్రం ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక
ఐపీఎల్ మెగావేలంలో సురేశ్ రైనాకు అవమానం జరిగిన సంగతి తెలిసిందే. లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బ్యాటర్‌గా పేరున్న రైనాను వేలంలో ఎవరు కొనడానికి ఆసక్తి చూపలేదు. దీంతో రైనా అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. అయితే ఇదే రైనాను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. మాల్దీవులు ప్రభుత్వం ఇచ్చే 'స్పోర్ట్స్ ఐకాన్' అవార్డుకు రైనా ఎంపికయ్యాడు. మొత్తంగా వివిధ దేశాలకు చెందిన 16 మంది క్రీడాకారులు నామినేట్ అయ్యారు. రైనాతోపాటు మాజీ రియల్ మాడ్రిడ్ ఫుట్‌బాల్ ఆటగాడు రాబర్ట్ కార్లోస్, జమైకన్ స్ప్రింటర్ అసఫా పావెల్, శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య, నెదర్లాండ్స్ ఫుట్‌బాల్ దిగ్గజం ఎడ్గర్ డేవిడ్స్ తదితరులు ఉన్నారు. తన క్రికెట్ కెరీర్లో అతను చేసిన సేవకు గాను ఈ అవార్డు ఇచ్చినట్లు మాల్దీవ్స్ ప్రభుత్వం తెలిపింది. కాగా మార్చి 17న మాల్దీవ్స్‌లోని సింథటిక్ రన్నింగ్ ట్రాక్ మైదానంలో ఈ అవార్డుల వేడుక జరిగింది. ఈ అవార్డును బంగ్లాదేశ్ క్రీడామంత్రి జహీర్ హసన్ రసెల్.. రైనాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియా, మాల్దీవుల క్రీడా మంత్రులు పాల్గొన్నారు. ఇక రైనా టీ20ల్లో 8వేల పరుగులు సాధించిన తొలి భారతీయుడిగా.. ఐపీఎల్లో 5వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో చెన్నై జట్టు తరపున 176 మ్యాచ్‌లు ఆడిన సురేశ్ రైనా.. 32.32 సగటుతో 4687 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, 33 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో మొత్తం 205 మ్యాచ్‌లు ఆడిన రైనా 5528 పరుగులు చేశాడు. -
శ్రీసిటీకి మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు
వరదయ్యపాళెం (చిత్తూరు జిల్లా): మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు శ్రీసిటీని వరించాయి. నీటి వనరుల సంరక్షణ, నిర్వహణలో అత్యుత్తమ విధానాలు పాటిస్తున్నందుకు సీఐఐ (భారత పారిశ్రామిక సమాఖ్య) రెండు ప్రతిష్టాత్మక అవార్డులకు శ్రీసిటీని ఎంపిక చేసింది. శ్రీసిటీ చేపడుతున్న నీటి సుస్థిరత, అభివృద్ధి చర్యలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. ఆగస్టు 28న సీఐఐ నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను శ్రీసిటీ యాజమాన్యం అందుకోనుంది. దీనిపై సంతోషాన్ని వ్యక్తం చేసిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఇది నిజంగా తాము గర్వించదగ్గ గుర్తింపుగా వ్యాఖ్యానించారు. బాధ్యతాయుతమైన కార్పొరేట్‌గా నీటి వనరులను సంరక్షించడానికి, నీటి నిల్వలు పెంచడానికి శ్రీసిటీ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ అవార్డులు తమ సిబ్బందికి మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో పాటు వారి భవిష్యత్ ప్రయత్నాలకు మంచి ప్రేరణ ఇస్తాయన్నారు. -
తిరుపతి నగరానికి 5 ప్రతిష్టాత్మక అవార్డులు
సాక్షి, తిరుపతి: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే స్మార్ట్ సిటీ అవార్డుల కాంటెస్ట్‌లో తిరుపతి నగరానికి ఏకంగా ఐదు అవార్డులు లభించాయి. దేశంలో ఇండోర్, సూరత్ నగరాల తర్వాత ఐదు అవార్డులు దక్కించుకున్న ఏకైక నగరం తిరుపతి కావడం విశేషం. పారిశుద్ధ్యం, ఈ-హెల్త్ విభాగాల్లో ఈ నగరానికి దేశంలోనే మొదటి స్థానం లభించగా.. బెస్ట్ సిటీ, ఎకానమీ విభాగాల్లో రెండో స్థానం.. అర్బన్ ఎన్విరాన్మెంట్ విభాగంలో మూడో స్థానం దక్కింది. మొత్తంగా తిరుపతి నగరానికి ఐదు స్మార్ట్ సిటీ అవార్డులు లభించాయి. చదవండి: 6 జిల్లాల్లో 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు: సీఎం జగన్ -
హెడ్‌కానిస్టేబుల్ కూతురుకు అరుదైన గౌరవం
సాక్షి, రాయదుర్గం: కొండాపూర్‌లోని టీఎస్ఎస్పీ 8వ బెటాలియన్ హెడ్‌కానిస్టేబుల్ లింగంగారి జనార్దన్ కూతురు లింగంగారి త్రిషకు అరుదైన గౌరవం లభించింది. దేశ రాజధానిలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న 17 రాష్ట్రాల ఎన్సీసీ కాడెట్స్ నుంచి బ్యానర్ ఆఫ్ ఆలిండియా బెస్ట్ డైరెక్టర్‌గా ఎంపికైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్‌కు దేశ ప్రధాని నరేంద్రమోడీ చేతులమీదుగా ఆర్డీ బ్యానర్, బెస్ట్ పీఎం ర్యాలీ ట్రోఫీని డీడీజీ ఎయిర్ కమెడోర్ కృష్ణణ్, సీనియర్ వింగ్ ఆర్మీ సీనియర్ అండర్ ఆఫీసర్ లింగంగారి త్రిష అందుకున్నారు. ఆమె ఎన్సీసీ బెటాలియన్ 7(టి) బాలిక విభాగం సెయింట్ మార్టిన్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పాల్గొన్నారు. 12 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాలు ఈ అవార్డుకు ఎంపిక కావడం విశేషం. అద్భుత ప్రతిభ చాటిన విద్యార్థి మియాపూర్‌లోని సెయింట్ మార్టిన్స్ కళాశాల చైర్మన్ జైకిషన్, ఉపాధ్యాయులు అభినందించారు. అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జాతీయ స్థాయిలో ట్రోఫీని ప్రధాని చేతులమీదుగా పొందడం గర్వంగా ఉందన్నారు. -
లఘు చిత్ర దర్శకుడికి జాతీయ స్థాయి అవార్డ్
గత కొన్ని సంవత్సరాలుగా బంజారా మహిళా యన్ జీ వో ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తునందుకు గాను తెలుగు వైద్యుడు, సినీ దర్శకులు డాక్టర్ ఆనంద్‌కు సేవా రంగంలో జాతీయ స్థాయి అవార్డ్ లభించింది. నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ మరియు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు సంయుక్తంగా దేశ రాజధాని న్యూ ఢిల్లీలో, దేశ వ్యాప్తంగా వివిధ రంగాలలో అత్యుత్తమ ప్రదర్షణ కన పరచిన వారికి జాతీయ స్థాయి అవార్డులను అందజేశారు. ఢిల్లీ లోని ఆంధ్ర మరియు తెలంగాణా భవన్ లోని ఆడిటోరియంలో ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణా భవన్ కమీషనర్ శ్రీ వేణు గోపాలా చారి (ఐఏయస్), జస్టిస్ పి.యస్.నారాయణ, డా. వరికుప్పల శ్రీనివాస్ (వాటర్ ట్రిబ్యునల్ మెంబర్), డా.బింగి నరేందర్ గౌడ్ వంటి ప్రముఖుల చేతుల మీదుగా ఈ అవార్డ్‌ల ప్రధానం జరిగింది. ఈ సందర్భంగా డా.ఆనంద్ మాట్లాడుతూ, తను ఎన్నో ఆరోగ్య శిబిరాలను నిర్వహించడానికి సహాయ సహ కారాలను అందిస్తున్న మిత్రులందరికీ, సంస్థలకు ప్రత్యేక ధన్య వాదాలు తెలియ చేసారు. ఈ అవార్డ్ ను మాజీ కేంద్ర మంత్రి వర్యులు దివంగత అరుణ్ జైట్లీ గారికి అంకిత మిస్తునట్లుగా ఆయన తెలిపారు. -
ఆ గౌరవం వద్దు
‘మీటూ’ ఉద్యమంలో భాగంగా చాలామంది హీరోయిన్లలానే తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి నటాలీ పోర్టమన్ చెప్పిన ‘నేను చెప్తే అలాంటివి వంద కథలుంటాయి.’ అన్న మాటలు అందరినీ కలిచివేశాయి. ‘మీటూ’ తర్వాత ఆమె, తను తీసుకునే నిర్ణయాల్లో సామాజిక బాధ్యతను మర్చిపోకూడదనుకుంటున్నారు. తాజాగా ఈ క్రమంలో ఇజ్రాయిల్ ప్రభుత్వం అందించే ప్రెస్టీజియస్ అవార్డును కూడా కాదనుకుంది నటాలీ. ఇజ్రాయిల్ పౌరసత్వాన్ని కలిగిఉన్న నటాలీని అక్కడి ప్రభుత్వం జెనెసిస్ ప్రైజ్ అవార్డుకు ఎంపిక చేసింది. అయితే తాజాగా ఆమె ఆ అవార్డును అందుకునేందుకు నిరాకరించింది. దీనిపై సోషల్ మీడియాలో బాగా విమర్శలు, వాదనలు వినిపించడంతో స్వయంగా నటాలీ ఎందుకు తాను ఈ అవార్డు తీసుకోలేదో తెలియజేసింది. ప్రస్తుతం ఇజ్రాయిలీ పాలస్తీనియన్ సంక్షోభం తారాస్థాయికి చేరిపోయింది. ఇజ్రాయిల్ ప్రభుత్వం కాల్పుల్లో పాలస్తీనియన్లను కాల్చి చంపినట్టు వచ్చిన వార్తలతో ప్రభుత్వంపై విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాను ఈ అవార్డు తీసుకుంటే అది ఇజ్రాయిల్ ప్రభుత్వాన్ని, దాని చర్యలను సమర్థించినట్టు అవుతుందన్న కారణంతో నటాలీ ఈ అవార్డు అందుకోవడానికి దూరం జరిగింది. ఆమె తీసుకున్న డిసిషన్‌పై ఎప్పట్లానే రెండు రకాల వాదనలూ వినిపిస్తున్నాయి! ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ స్టార్ అయిన నటాలీ, ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ వెళుతోంది. -
పెషావర్ బాధిత బాలలకు ప్రతిష్టాత్మక అవార్డు
పెషావర్: నగరంలోని ఆర్మీ స్కూల్ లో తాలిబన్ల దాడిలో మరణించిన బాలలకు ప్రతిష్టాత్మక అవార్డు ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది. గతేడాది డిసెంబర్ 16వ తేదీన పెషావర్ లోని ఆర్మీ స్కూల్ లో ఉగ్రవాదులు మారణకాండ సృష్టించి 145 మందిని బలితీసుకున్న సంగతి తెలిసిందే. వీరిలో అధికశాతం మంది బాలలే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆర్మీ స్కూల్ మరణించిన వారందరికీ తమ్ ఘా-ఇ-షూజాత్ అనే అవార్డు ను ఇవ్వాలని ఆ దేశ అధ్యక్షుడు మమ్ నూన్ హుస్సేన్ తీర్మానించారు. ఈ ఘటనలో పాకిస్థాన్ పౌరుడు కూడా మరణించడంతో అతనికి కూడా ఆ అవార్డును ప్రకటించాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా గాయపడిన వారికి మరో అవార్డును ఇచ్చేందుకు పాక్ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.