హాంకాంగ్: విద్యుదయస్కాంత కిరణాలను వెదజల్లే న్యూట్రాన్ నక్షత్రాలు, నక్షత్రాల పేలుడు, గామాకిరణాల వెల్లువ వంటి ఖగోళ అంశాలపై విశేష పరిశోధనలకు గుర్తింపుగా భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త శ్రీనివాస్ రామచంద్ర కులకర్ణి.. ప్రఖ్యాత ‘షా’ అవార్డ్‌కు ఎంపికయ్యారు.
శ్రీనివాస్ ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోరి్నయా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆ్రస్టానమీ, ప్లానెటరీ సైన్స్, డివిజన్ ఆఫ్ ఫిజిక్స్, మేథమేటిక్స్, ఆ్రస్టానమీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
అమెరికాలోని పలోమర్ ట్రాన్సియెంట్ ఫ్యాక్టరీలో ఆ తర్వాత జ్వికీ ట్రాన్సియెంట్ ఫ్యాక్టరీల్లో టెలిస్కోప్‌ల సాయంతో రోదసీలో నిర్దిష్ట ప్రాంతంలోని ఖగోళ అంశాలను పరిశీలించి వాటిపై విశేష పరిశోధనలు చేసినందుకుగాను ఈ అవార్డ్‌ను శ్రీనివాస్‌కు ప్రదానం చేయనున్నారు. 2024 సంవత్సరానికి ఆస్ట్రానమీ విభాగంలో శ్రీనివాస్‌కు అవార్డ్ ఇస్తున్నట్లు షా ప్రైజ్ ఫౌండేషన్ మంగళవారం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment